అచ్చులు : ఆ




సం., అవ్య., తత్స., = ఒక అక్షరము, స్మృతిని తెల్పునది, స్మరణమందును, మునుపు చెప్పిన వాక్యార్థమును సూచించుటయందును, లేక వాక్యపూరణమందుగానీ వర్తించును.సం., నా. వా., తత్స., = ఒక అక్షరము, కొంచెము, అంతట, వరకు, నుండి, అనువానిని తెల్పునది, స్మృతిని తెల్పునది.

ఆం
సం., అవ్య., తత్స., = అలాగే, ఏవం, ఒకడు చెప్పినదానిని అంగీకరించుటయందు వర్తించును.

ఆంక్ష
వి.,= వెలివేయుట, బహిష్కారము, అడ్డగింత, బలవంతము, నిషేధము.

ఆంగలౌకికము
సం., విణ., అ., పుం., తత్స., = త్రిదోషమువల్ల కల్గిన స్వప్నము.

ఆంగారము
సం., వి., అ., న., తత్స., = అంగారముల సమూహము(అంగారము = బొగ్గు)

ఆంగికము
సం. విణ.(అ. ఆ. అ.). తత్స., = ఒక అభినయము, శారీరకము, అంగము చేతఁగలిగినది.(కనుబొమలెగుర వేయుట లోనుగాఁగలది)
వ్యుత్పత్త్యర్థము :
అంగేన నిర్వృత్తమాంగికం. అంగము చేతఁచేయఁపడినది.


ఆంగిరసుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= బృహస్పతి, వేల్పుటొజ్జ.
వ్యుత్పత్త్యర్థము :
అంగిరసః అపత్యం ఆంగిరసః. అంగిరస్సు కొడుకు ఆంగిరసుడు.

పర్యాయపదాలు :
సురాచార్యుడు, గీష్పతి, ధిషణుడు, గురువు, జీవుడు, వాచస్పతి, చిత్రశిఖండిజుడు.


ఆంగీరస
సం., వి., అ., పుం., తత్స.,= ఒక సంవత్సరము( ఇవి యఱువది. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్తు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నళ, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.), ఏఁడాది, పుష్యమీ నక్షత్రము. ; డు. బృహస్పతి.
వ్యుత్పత్త్యర్థము :
అంగిరసః అపత్యం ఆంగిరసః. అంగీరస్సు కొడుకు ఆంగీరసుడు.


ఆంతరాలికము
సం., విణ., (అ.ఆ.అ.). తత్స., = ఒక సంకరజాతి.

ఆంతరిక్షము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = అంతరిక్షము వలనఁగలిగినది. (అంతరిక్షము=ఆకాశము)

ఆంతర్యము
సం., వి., అ., న., తత్స., = అభిప్రాయము, తలపు.

ఆంత్రము
సం., వి., అ., న., తత్స., = అంత్రము, ప్రేగు.

ఆందోల
సం., తత్స., = ఊయెల.

ఆందోలనము
సం., వి., అ., న., తత్స., = ఊయెల.

ఆందోళనము
సం., వి., అ., పుం., తత్స., = అందలము.

ఆందోళము
సం., వి., అ., న., తత్స., = ఊగుట, ఉరియాట.

ఆందోళించు
సం., అ., క్రి., తత్స., = ఊఁగు, ఉరియాడు.

ఆందోళిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఆందోళము.

ఆందోళితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఊఁచఁబడినది.

ఆంధసికుఁడు
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స., = వంటవాఁడు, తండులమును పక్వము చేయువారు, పాకమైన దానిని తిరుగఁపోసి వండువాడు, బానిసీఁడు.
వ్యుత్పత్త్యర్థము :
అంధః అన్నతత్సాధనం శిల్పమేషాంతే ఆంధసికాః. అన్నము చేయు నేర్పుకలవాడు.

పర్యాయపదాలు :
సూపకారుడు, వల్లవుడు, ఆరాళికుడు, ఔదనికుడు, సూదుడు.


ఆంధ్యము
సం., వి., అ., న., తత్స., = అంధత్వము, గ్రుడ్డితనము.

ఆంధ్రము
సం., వి., అ., పుం., తత్స., = తెలుఁగు దేశము.

ఆంధ్రుడు
సం., వి., అ., పుం., తత్స., = ఆంధ్రదేశము వాఁడు, తెనుఁగువాఁడు.

ఆః
సం., అవ్య., తత్స., = విచారమును తెల్పునది, కోపమందును, పీడయందును వర్తించును .

ఆకంపించు
సం., అ., క్రి., తత్స., = మిక్కిలికంపించు, వణఁకు.

ఆకంపితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = చక్కఁగాఁగదలింపబడినది, కదల్పబడినది, వణకెత్తినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆకంప్యతేస్మ ఆకంపితః. కదలింపపడినది ఆకంపితము.

పర్యాయపదాలు :
వేల్లితము, ప్రేంఖితము, ఆధూతము, చలితము, ధుతము.


ఆకట్టుకొను
స., క్రి., = ఆకర్షించుకొను, తనదనిపించుకొను.

ఆకరము
సం., వి., అ., పుం., తత్స.,= రత్నములు లోనగునవి పుట్టునట్టిచోటు, ఖని, గని, సమూహము.
వ్యుత్పత్త్యర్థము :
1.అకీర్యంతే లోహాదయో అత్ర ఆకరః. లోహాదులు దీనియందు చల్లపడును. 2.ఆకీర్యంతే ధాతవో అత్ర ఇతి ఆకరః. ధాతురత్నాదుల ఉత్పత్తిస్థానము.


ఆకర్ణకము
సం., నా.వా., అ., పుం., తత్స., = కత్తియొర.

ఆకర్ణకర్షణము
సం., విణ., అ., న., తత్స., = చెవివరకు లాగుట, వింటి నారిని లాగే ఒక పద్ధతి.

ఆకర్ణనము
సం., వి., అ., న., తత్స., = శ్రవణము, వినికి.

ఆకర్ణించు
సం., స., క్రి.,= ఆకర్ణనముచేయు, విను.

ఆకర్ణితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఆకర్ణింపఁబడినది.

ఆకర్షము
సం., వి., అ., పుం., తత్స.,= ఆకర్షించుట, పాశకము, అయస్కాంతము. ; స్త్రీ. అక్షక్రీడ. ; నపుం. ఆకర్షణము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆకర్షతి ఆకర్షణం చ ఆకర్షః. ఆకర్షించునది ఆకర్షము. 2.ఆకృష్యతే ఇతి ఆకర్షః. అక్షక్రీడ.

నానార్థాలు :
సారిఫలకము, ఇరువదిరూకలయొత్తు తూనికగలదానికి, బండికంటికిని, వ్యవహారమునకు తాండ్రచెట్టునకు పేరైనప్పుడు, జూదము, జూదమాడెడు పలక, పాచిక, వింటినభ్యసించెడు వస్తువు, ఏనుగు తొండములోని ఒకభాగము, లాగుట, నికషోఫలము. ; నపుం. ఇంద్రియము, ధనురభ్యాసవస్తువు.


ఆకర్షించు
సం., స., క్రి.,= ఆకర్షణము చేయు, తిగుచు.

ఆకర్షితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఆకర్షింపబడినది, తిగువఁబడినది.

ఆకలనము
సం., వి., అ., న., తత్స., = అవగాహనము, ఎన్నిక, కోరిక, బంధనము, సమూహము, జ్ఞానము, లెక్కించుట.

ఆకల్పము
సం., వి., అ., పుం., తత్స., = దుస్తులు, పన్నుగడ, రోగము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ కల్ప్యతే ఇతి ఆకల్పః. అంతట కల్పింపబడునది.

పర్యాయపదాలు :
వస్త్రాద్యలంకరణము, మండనము, ప్రతికర్మ, వేషము, నైపథ్యము, ప్రతికర్మ, ప్రసాధనము, కల్పనము, వేశము.


ఆకల్యము
సం., వి., అ., న., తత్స., = మాంద్యము. ; పుం. గద, రోగము.

ఆకస్మికము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = అకస్మాత్తుగా గలిగినది, హఠాత్తుగా జరిగినది.

ఆకాంక్ష
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కోరిక, అన్వయము కొఱకు ఒక పదము, మరియొక పదమును కోరుట. క్రియాపదమును బట్టి కర్తృకర్మాదులకును వాని విశేషములకును చేసెడు ప్రశ్నము.(అని వాడుక యందు.)

ఆకాంక్షించు
సం., స., క్రి., = వాంఛించు, కోరు.

ఆకాండికము
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స., = అకాలము నందుఁగలిగినది.

ఆకారగుప్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = హృదయమునందున్న భావనను గోపనముగా ఉంచుట, అవహిత్థము.

ఆకారగోపన
సం., విణ., ఆ., స్త్రీ., తత్స., = భావమును కప్పిపుచ్చుట.

ఆకారణ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= పిలుచుట, ఆహ్వానము, పిలుపు, హూతి.

ఆకారణము
సం., వి., అ., న., తత్స.,= పిలుచుట, ఆహ్వానము.
వ్యుత్పత్త్యర్థము :
ఆకారయంత్యనేనేత్యాకారణం. దీని చేత పిలుతురు.


ఆకారము
సం., వి., అ., పుం., తత్స., = రూపము, చిహ్నము, మనః పరిణామము, బొమముడిపాటులోనగు వికారము, సంకేతము, అభిప్రాయానికి తగిన విధంగా చేష్టలను ప్రకటించుట, ఆకృతి, మూర్తి, ఇంగము, ఇంగితము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆక్రియతే ఆవిష్క్రియతే అభిప్రాయో నేనేత్యాకారః. దీనిచేత అభిప్రాయము ప్రకటముగా చేయబడును. 2.అనురాగాది జనిత మోహాత్ చక్షురాది వికార ఆకారః. అనురాగాదులవలన పుట్టిన గగ్గురుపాటు మొదలైన అవయవ వికారము ఆకారము.


ఆకారితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = పిలువఁబడినది.

ఆకాలికి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = మెఱుపు.

ఆకాశము
సం., వి., అ., న., తత్స., = నభము, వ్యాకులము, వ్యస్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్కాశంతే సూర్యాదయః అత్రేత్యాకాశమ్. దీని అంతటను సూర్యాదులు ప్రకాశింతురు.

ప్రకృతి - వికృతి :
ఆకసము.

పర్యాయపదాలు :
ద్యౌ, దివి, అభ్రము, వ్యోమము, పుష్కరము, అంబరము, గగనము, అనంతము, సురవర్త్మ, ఖం, వియత్తు, విష్ణుపదము, విహాయము.


ఆకీర్ణము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= సంకీర్ణము, ఒకటితో ఒకటి కలసినది, సంకులము.
వ్యుత్పత్త్యర్థము :
ఆకీర్యతే ఇత్యాకీర్ణమ్. ఒకటికొకటి ఎడము లేకుండునట్లు కలపఁబడునది.


ఆకుంచనము
సం., వి., అ., న., తత్స., = ముడుఁచుట.

ఆకుంచితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ముడువఁబడినది.

ఆకులకము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = వ్యాకులము, వ్యస్తము, చెదరినది, అప్రగుణము, ఆకులము.

ఆకులపడు
మి., అ., క్రి., =(ఆకులము+పడు.)ఆకులతనొందు, చెదరు.

ఆకులపాటు
మి., వి., = ఆకులపడుట.

ఆకులము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = వ్యాకులము, వ్యస్తము, చెదరినది, అప్రగుణము.
వ్యుత్పత్త్యర్థము :
ఆకోలతి ఈషత్సంస్త్వానో భవతీత్యాకులః. ఇంచుకంత కూడి ఉండునది.


ఆకుల్యము
సం., వి., అ., న., తత్స., = నేలతంగేడు, వ్యాధి.

ఆకూతము
సం., వి., అ., న., తత్స., = అభిప్రాయము, తలంపు, ఉద్దేశము, ఆశయము, తాత్పర్యము, ఇచ్ఛ.

ఆకూతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఉద్దేశము, తలంపు, అభిప్రాయము.

ఆకృతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= రూపము, ఆకారము, ఇంగితము.
వ్యుత్పత్త్యర్థము :
వైవర్ణ్యాది శరీర వికారో ఆకృతిః. వైవర్ణ్యాదులతో కూడిన శరీరవికారము ఆకృతి.

నానార్థాలు :
దేహము, ఒక ఛందస్సు(పద్యలక్షణము చెప్పెడు శాస్రము. ఛందస్సులు ఇరువదియాఱు. – ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అభికృతి, ఉత్కృతి.), వేదము, యథేచ్ఛమైన నడవడిక, ఇచ్ఛ, భావము నెరిఁగించెడి సంజ్ఞ, సామాన్యము, శరీరము.


ఆకృష్టి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఆకర్షణము, తెగ.

ఆకేకర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = దృష్టివిశేషము.

ఆక్రందము
సం., వి., అ., పుం., తత్స., = రోదనము, మొఱపెట్టుట, ఏడ్పు.
వ్యుత్పత్త్యర్థము :
ఆక్రంద్యతే అస్మై, అస్మిన్నితి చ ఆక్రందః. ఆర్తధ్వనితో కూడిన రోదనము.

నానార్థాలు :
భయంకరమైన యుద్ధము, పిలుపు, ఆహ్వానము, మిత్రుడు, సహోదరుడు, ధ్వని, యజమాని, దారుణ యుద్ధము, భ్రాత.


ఆక్రందించు
సం., అ., క్రి., = ఏడ్చు.

ఆక్రందితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = పిలువఁబడినది.

ఆక్రందుడు
సం., వి., అ., పుం., తత్స., = చెలికాఁడు, తోడఁబుట్టినవాఁడు.

ఆక్రమణము
సం., వి., అ., న., తత్స., = ఆక్రమించుట.

ఆక్రమము
సం., వి., అ., పుం., తత్స., = ముట్టడి.

ఆక్రమించు
సం., స., క్రి.,= అఱుము.

ఆక్రాంతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఆక్రమింపబడినది, అఱుమఁబడినది, ఆక్రమణవిశిష్టమైనది, అధిక్రాంతమైనది, అభిభూతమైనది, పరాభూతమైనది, వశీభూతమైనది.

ఆక్రాంతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఆక్రమణము.

ఆక్రీడము
సం., వి., అ., పుం., తత్స.,= ఉద్యానవనము, ఎల్లరు విహరింపతగిన క్రీడోద్యానము, ఉద్యానము, అందరూ విహరింపదగినది, రాజు క్రీడోద్యానవనము.
వ్యుత్పత్త్యర్థము :
ఆక్రీడంతి జనాః అస్మిన్నితి ఆక్రీడః. దీనియందు సర్వజనులును క్రీడింతురు.


ఆక్రోశనము
సం., వి., అ., న., తత్స., = శపించుట, ఆక్రోశము, అభిషంగము, తిట్టుట, ఆక్షేపము, నింద, శాపము (రూ. ఆక్రోశనము)
వ్యుత్పత్త్యర్థము :
ఆక్రోశః ఆక్రోశనం. ఆక్రోశించుట ఆక్రోశనము.


ఆక్రోశము
సం., వి., అ., పుం., తత్స., = క్రోధము ప్రకటించుటయందు నిశ్చయము, నింద. (రూ. ఆక్రోశనము)
వ్యుత్పత్త్యర్థము :
ఆక్రోశః ఆక్రోశనం. ఆక్రోశించుట ఆక్రోశము.

పర్యాయపదాలు :
శపించుట, అభిషంగము, తిట్టు.(రూ. ఆక్రోశనము) ఆక్షేపము, శాపము.


ఆక్రోశించు
సం., స., క్రి., = తిట్టు.

ఆక్షారణ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= అమ్మకు నాలికిఁదిట్టుట, మైథునమును గూర్చి ఘోషించుట, ప్రతివాది, అంతట వ్యాపించుట.
వ్యుత్పత్త్యర్థము :
ఆక్షరతి పరితః వ్యాప్నోతీత్యాక్షారణా. అన్నివైపులా వ్యాపించుట.


ఆక్షారికుడు
సం., నా.వా., అ., పుం., తత్స., = ప్రతివాది.

ఆక్షారితుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = క్షారితుడు, అభిశస్తుడు, తీక్ష్ణవాక్యాలచే పీడింపబడినవాడు, బ్రహ్మహత్యాదిదోషములచే దూష్యుడైనవాడు, పరస్త్రీగమనాది దోషములచే దూరఁబడినవాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
అక్షార్యతే స్వరూపాచ్చాల్యత ఇత్యాక్షారితః. స్వరూపము నుండి చలింప పడినవాఁడు ఆక్షారితుండు.


ఆక్షిప్తుడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఆక్షేపింపబడినవాడు, నిందితుడు.

ఆక్షీబము
సం., వి., అ., పుం., తత్స., = మునగ చెట్టు.

ఆక్షేపకము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = వాయురోగము.

ఆక్షేపకుఁడు
సం., వి., అ., పుం., తత్స., = నత్తిగలవాడు, బోయవాడు. ; విణ. ఆక్షేపించువాడు.

ఆక్షేపము
సం., వి., అ., పుం., తత్స.,= అపవాదము, లాగుట.
వ్యుత్పత్త్యర్థము :
ఆక్షిప్యతా ఇత్యాక్షేపః ,ఆక్షేపించుట ఆక్షేపము

నానార్థాలు :
అడ్డంకి, ఒక అర్థాలంకారము, కావ్యాలంకారము, ఆకర్షణము, దూరు, విన్యాసము, స్థాపనము.

పర్యాయపదాలు :
ఆక్రోశనము, అపహరణము, అభిశాపము, అభిషంగము, అవర్ణము, నిర్వాదము, పరీవాదము, అపవాదము, ఉపక్రోశము, జుగుప్స, కుత్స, నింద, గర్హణము, భర్త్సనము.


ఆక్షేపించు
సం., స., క్రి.,= అడ్డగించు, దూఱు, ఆకర్షించు.

ఆక్షోటము
సం., వి., అ., పుం., తత్స.,= కొండగొనుఁగు.

ఆఖండలుడు
సం., వి., అ., పుం., తత్స.,= ఇంద్రుడు, వేల్పుఱేఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆఖండయతి అరీన్ భినత్తీతి అఖండలః. శత్రువులను ఖండించువాడు.

పర్యాయపదాలు :
మరుత్వాన్, మఘవుడు, బిడౌజుడు, పాకశాసనుడు, వృద్ధశ్రవుడు, సునాసీరుడు, పురుహూతుడు, పురందరుడు, జిష్ణువు, లేఖర్షభుడు, శక్రుడు, శతమన్యువు, దివస్పతి, సుత్రాముడు, గోత్రభిత్, వజ్రి, వాసవుడు, వృత్రహా, వృషుడు, వాస్తోష్పతి, సురపతి, బలారాతి, శచీపతి, జంభభేది, హరిహయుడు, స్వరాట్టు, నముచిసూదనుడు, సంక్రందనుడు, దుశ్చ్యవనుడు, తుషారాట్టు, మేఘవాహనుడు, సహస్రాక్షుడు, ఋభుక్షుడు.


ఆఖనికము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఎలుగుబంటి.

ఆఖాతము
సం., వి., అ., పుం., న., తత్స., = అఖాతము, దేవఖాతము.

ఆఖుభుక్కు
సం., వి., జ్., పుం., తత్స.,= పిల్లి.
వ్యుత్పత్త్యర్థము :
ఆఖూన్ భుంక్తే ఆఖుభుక్. ఎలుకలను భక్షించునది.

పర్యాయపదాలు :
మార్జారము, బిడాలము, మార్జాలము, ఓతువు, వృషదంశకము.


ఆఖుయానుడు
సం., నా.వా., అ., పుం., న., తత్స., = వినాయకుడు.

ఆఖురథుడు
సం., వి., అ., పుం., తత్స., = ఎలుకను రథముగా గలవాడు, గణేశుడు.
పర్యాయపదాలు :
వినాయకుడు, పార్వతీనందనుడు, విఘ్నరాజు, గజాననుడు, ఏకదంతుడు.


ఆఖువు
సం., వి., ఉ., పుం., తత్స., = ఎలుక, పందికొక్కు, మూషికము, ఖనకము, మార్జాలము, శూకరము, ఉందురువు, చోరుడు, దేవతాడవృక్షము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ అనతీత్యాఖుః . అంతటా త్రవ్వునది ఆఖువు.


ఆఖేటకము
సం., వి., అ., పుం., న., తత్స.,= మృగయ, ఆఖేటము, వేట.

ఆఖేటకుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= మృగయుఁడు, వేటగాడు.

ఆఖేటము
సం., వి., అ., పుం., తత్స.,= మృగములను వెదకుట, ఆచ్ఛోదనము, మృగవ్యము, మృగయ, వేట.
వ్యుత్పత్త్యర్థము :
ఆఖ్యేట్యంతే మృగా అత్రేతి ఆఖేటః. దీనియందు మృగములు వెఱపింపఁబడును.


ఆఖోరము
సం., నా.వా., అ., పుం., తత్స.,= గ్రీష్మర్తువు.

ఆఖ్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= నామము, పేరు, నామధేయము, ఆహ్వయము, ఆహ్వానము, సంజ్ఞ.
వ్యుత్పత్త్యర్థము :
ఆఖ్యాయతే అనయేత్యాఖ్యా. దీనిచేత పిలువఁబడును.


ఆఖ్యాత
సం., విణ.,(ఋ. ఈ. ఋ.)., తత్స.,= చెప్పెడువాఁడు.

ఆఖ్యాతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= చెప్పబడినది.(వ్యాకరణమునందు ధాతువుల మీఁద విధింపఁబడిన తిఙ్ఙ.)పలుకఁబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆఖ్యాయతే స్మ ఆఖ్యాతం. చెప్పబడినది ఆఖ్యాతము.

పర్యాయపదాలు :
ఉక్తము, భాషితము, ముదితము, జల్పితము, అభిహితము, లపితము.


ఆఖ్యానము
సం., వి., అ., న., తత్స.,= చెప్పుట, పురాణము, కథ, కథనము.

ఆఖ్యాయకుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఏదేనొక విషయమును వివరించి చెప్పెడువాడు.

ఆఖ్యాయని
సం., నా.వా., ఈ., స్త్రీ., తత్స.,= వార్త.

ఆఖ్యాయిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఉపలబ్ధార్థమైన కథ, గద్య కావ్య బేధము, వేథ, వాస్తవార్థముగల హర్షచరితాది గ్రంథము, ఏ ఉపాయము చేతనైన ఎఱుగబడిన అర్థము కలది, ఇతిహాసము, ఉపన్యాసము.
వ్యుత్పత్త్యర్థము :
ఆఖ్యాయతే నాయకి చరితమనయా ఆఖ్యాయికా. నాయకి చరితము దీనిచేతఁ చెప్పఁపడును


ఆఖ్యేయము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= చెప్పఁదగినది.

ఆగంతుకము
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స., = కాలనియమము లేక వచ్చునది.

ఆగంతువు
సం., విణ., ఉ., త్రి., తత్స., = అతిథి, ఆవేశికుడు, ఇంటికి వచ్చినవాడు, విందు.
వ్యుత్పత్త్యర్థము :
ఆగచ్ఛతీత్యాగంతుః. వచ్చినవాఁడు.


ఆగతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = వచ్చినది, పొందఁబడినది.

ఆగమనము
సం., వి., అ., న., తత్స.,= వచ్చుట, రాక.

ఆగమము
సం., వి., అ., పుం., తత్స.,= రాక, దేవపూజావిధానమును తత్సంబంధిత విషయములను తెలిపునట్టి శాస్త్రము, (వ్యాకరణమున)అధికముగా వచ్చెడు వర్ణము, ప్రాప్తి, సాక్షిపాత్రాదికము, శృతవత్త. ; నపుం. శాస్త్రము, ఆగమనము, అర్థాదీనామాగమనము, ఉపార్జనము, ప్రకృతిప్రత్యయాదికార్యము, శాస్త్రజ్ఞానము.

ఆగమము
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= మాదిగవాని సూది, ఆరె.

ఆగము
సం., వి., స్., న., తత్స., = పాపము, అపరాధము, తప్పు,మంతువు, కష్టమని తలంపబడునది, పాపము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆగతి కుటిలం గచ్ఛతీత్యాగః. కుటిలముగాఁ పొందునది. 2.ఆగంత్యనేనేత్యాగః. దీనిచేత కుటిలముగా చరింతురు.


ఆగామి
సం., విణ.,(న్. ఈ. న్.)., తత్స., = రాఁగలది.

ఆగువు
సం., వి., ర్., ఊ., స్త్రీ., తత్స.,= అంగీకారము, ఇయ్యకోలు, ప్రతిజ్ఞ.
పర్యాయపదాలు :
సంవిత్తు, ప్రతిజ్ఞానము, నియమము, ఆశ్రవము, సంస్రవము, అభ్యుపగమము, ప్రతిశ్రవము, సమాధి.


ఆగ్నిధ్రుడు
సం., వి., అ., న., తత్స., = ద్విజుడు. యజ్ఞకర్తచేత ధనములచే వరింపదగిన పదియాఱు ఋత్విజులు(బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యువు, బ్రహ్మణాచ్ఛంసి, ప్రస్తోత, మైత్రావరుణుడు, ప్రతిప్రస్థాత, పోత, ప్రతిహర్త, అచ్ఛావాకుడు, నేష్ట, అగ్నీధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, గ్రావస్తుతుడు, ఉన్నేత.)
వ్యుత్పత్త్యర్థము :
అగ్నీనింధే అగ్నిధ్రః. అగ్నిని ప్రకాశింపఁచేయువాఁడు.


ఆగ్నిమారుతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= హవిరాదులు, అగస్త్యుడు.

ఆగ్నేంధ్రి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= హోమము.

ఆగ్నేంధ్రుడు
సం., వి., అ., పుం., తత్స. = అగ్నిని ప్రకాశింపఁచేయవాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
అగ్ననింధే అగ్నిధ్రః. అగ్నిని ప్రజ్వలింపజేయువాడు.


ఆగ్నేయము
సం., వి., అ., న., తత్స.,= దశాహశ్ర్శాద్ధము, ఉత్తరాయణము, సంవత్సరము, ద్వాపరయుగము, అగస్త్యుడు, రక్తము. ; విణ. అగ్నిదేవతాకము, అగ్నిసంబంధమైనది.

ఆగ్నేయి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= అగ్నేయమూల, త్రేతాయుగము, స్వాహా, అగ్నిపత్ని, అగ్నికోణము.

ఆగ్రహము
సం., వి., అ., పుం., తత్స. = కోపము, అనుగ్రహము, ఆక్రమము, ఆసక్తి, గ్రహణము, పట్టుదల, గ్రహించుట.

ఆగ్రహాయణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= మృగశీర్షము, మృగశిర నక్షత్రము, మార్గశిర పౌర్ణమి.
వ్యుత్పత్త్యర్థము :
1.అగ్రేహాయంగోస్యాః ఆగ్రహాయణీ. 2.ఆగ్రహాయనాః నవవ్రీహయః అస్యాం సంతి ఇతి ఆగ్రహాయణీ. నూతన ధాన్యములు ఇందుఁకలవు కనుక ఆగ్రహాయణీ.


ఆగ్రహాయణికము
సం., వి., అ., పుం., తత్స., = మార్గశిరము, మార్గశీర్షమాసము, మార్గశిర పౌర్ణమి.
వ్యుత్పత్త్యర్థము :
మృగశిరా ఏవ ఆగ్రహాయణీ, అత్యుక్తా పూర్ణిమా అస్మిన్ ఇతి ఆగ్రహాయణికః. మృగశిరమే ఆగ్రహాయణీ, దానితోఁకూడిన పూర్ణిమ ఆగ్రహాయణికము.


ఆగ్రహించు
సం., స., క్రి., = కోపించు, చలపట్టు.

ఆఘట్టలిక
సం., నా.వా., ఆ., స్త్రీ., తత్స.,= ఊదుకొమ్ము.

ఆఘాటము
సం., వి., అ., పుం., తత్స., = సీమ, అపమార్గము, కొలది, మేర.

ఆఘాతము
సం., వి., అ., పుం., తత్స., = చంపుట, హద్దు, వధస్థానము, చంపుడు గట్టు.

ఆఘాతించు
సం., స., క్రి., = చంపు, వధించు.

ఆఘారణము
సం., నా.వా., అ., పుం., తత్స.,= హోమ సాధనము.

ఆఘారము
సం., వి., అ., పుం., తత్స., = ఘృతము.

ఆఘార్ణనము
సం., వి., అ., న., తత్స., = తిరుగుడు.

ఆఘార్ణితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = తిరుగుడు పడినది.

ఆఘోషించు
సం., అ., క్రి., = అఱచు, మ్రోయు.

ఆఘ్రాణము
సం., వి., అ., పుం., తత్స., = మూచూచుట, మూర్కొనుట.

ఆఘ్రాణించు
సం., స., క్రి., = మూచూచు, మూర్కొను.

ఆఘ్రాతము
సం., వి., అ., న., తత్స., = భూషణధ్వని. విణ. మూర్కొనఁబడినది.

ఆఙ్
సం., అవ్య., తత్స = హద్దు, ఇంచుక అని అర్థమునందు, అభివ్యాప్తియందును, సీమార్థమందును, క్రియాయోగమందుఁబుట్టిన క్రియార్థద్యోతకత్వమందును వర్తించును.

ఆచమనము
సం., వి., అ., న., తత్స.,= శుచిప్రణి, ఉపస్పర్శము, వార్పు, జనకక్రియ, ఉపస్పర్శనము, ఆచమము,
వ్యుత్పత్త్యర్థము :
ఆచమ్యతే ఉదకమత్రేతి ఆచమనం. ఉదకము దీని యందు పానము చేయబడును.


ఆచమించు
సం., స., క్రి.,= చూపుడు వ్రేలు పొడవుగా నిలిపిన పుడిసిట జలము గ్రహించి మూడుసార్లు పుచ్చుకొను, వార్పు.

ఆచరణము
సం., వి., అ., న., తత్స.,= ఆచారము, నడత.

ఆచరణీయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= నడపఁదగినది.

ఆచరించు
సం., స., క్రి.,= నడవు.

ఆచరితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= నడపఁబడినది.

ఆచాంతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఆచమింపబడినది.

ఆచాంతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఆచమనము.

ఆచామము
సం., వి., అ., పుం., తత్స.,= మాసరము, గంజి, అన్నపుగంజి, పానము చేయబడునది, వార్చిన గంజి, నిస్రావము.

ఆచార
సం., నా.వా., ఆ., స్త్రీ., తత్స.,= ఒకవిష్ణుశక్తి.

ఆచారము
సం., వి., అ., పుం., తత్స.,= వ్యవహారము, చరితము, చరిత్రము, చరణము, వృత్తము, శీలము, విచారము, ఆచరణము, నడత, మంచిప్రవర్తన.

ఆచారాతిక్రమము
సం., వి., అ., పుం., తత్స.,= అశిష్టాచారము, అసత్ వ్యవహారము, అయోగ్యక్రియ.

ఆచార్య
సం., వి., అ., పుం., తత్స.,= ఒకసంకరజాతి, వేదము చెప్పుగురువు.

ఆచార్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఉపాధ్యాయిని, వేద వ్యాఖ్యానము చేసెడి స్త్రీ.
వ్యుత్పత్త్యర్థము :
స్వత ఏవ మంత్రోపదేశమాచరతి ఆచార్యా. తనంతట మంత్రవ్యాఖ్యానము చేయు స్త్రీ.


ఆచార్యకము
సం., వి., అ., న., తత్స.,= ఉపాధ్యాయత్వము, ఒజ్జఁదనము.

ఆచార్యాని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = గురుపత్ని, ఆచార్యుని పెండ్లాము.
వ్యుత్పత్త్యర్థము :
ఆచార్యస్య పత్నీ ఆచార్యానీ. ఆచార్యుని భార్య.


ఆచార్యుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= వేదము చెప్పుగురువు, వేద వ్యాఖ్యానము చేయువాఁడు. మంత్రవ్యాఖ్యాత, కల్పసూత్రాది సహితమైన వేదమును అధ్యయనము చేసి అర్థమును తెలియజెప్పువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆచారం గ్రాహయతీతి ఆచార్యః. సంప్రదాయమును గ్రహింపచేయువాడు.


ఆచితము
సం., వి., అ., న., తత్స., = పది బారువులు కొలఁది, రాశిగా కూర్చబడినది, పదిఋక్షములు, ప్రోగుచేయబడ్డది. ; పుం. సంగృహీతము, బండిబరువు. ; విణ. కప్పబడినది, పఱపఁబడినది, గ్రహింపపడినది.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆచీయతే రాశీక్రియత ఇతి ఆచితః. రాశిగాఁ కూర్చబడునది ఆచితమనంబడును.

నానార్థాలు :
పుం. వ్యాప్తము, గ్రథితము, ఆకీర్ణము, చల్లబడినది, గుంఫితము, ఛన్నము.


ఆచ్ఛాదనము
సం., వి., అ., న., తత్స.,= కప్పునది, సంపిధానము, అపవృత్తిమాత్రము, ముసురుకొనుట, వస్త్రము, మృగయా, కప్పుట, దోషమునుగప్పుట, ఏర్పాటు, వలభి.
వ్యుత్పత్త్యర్థము :
ఛాదయతీతి ఆచ్ఛాదనం. సంపిధానము చేయునది ఆచ్ఛాదనము.

పర్యాయపదాలు :
అంతర్థ, వ్యవధ, అంతర్ధి, అపవారణము, అపిధానము, తిరోధానము, పిధానము.


ఆచ్ఛాదము
సం., వి., అ., పుం., తత్స.,= వస్త్రము, ఆచ్ఛాదనము.

ఆచ్ఛురితకము
సం., వి., అ., న., తత్స., = ఆఖేటము, వేట, వికటహాసము, ఇతరులకు రోషము కలిగించు నవ్వుపేరు, ఆచ్ఛురితము, ఉత్ప్రాసము, నఖక్షత విశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాచ్ఛురతీత్యాచ్ఛురితకం. అంతటఁకోయునది ఆచ్ఛురితకము .


ఆచ్ఛురితము
సం., వి., అ., న., తత్స.,= ఆచ్ఛురితకము, తైలాభ్యంజనము.

ఆచ్ఛోటనము
సం., వి., అ., న., తత్స., = వేట.

ఆచ్ఛోదనము
సం., వి., అ., న., తత్స., = వికటహాసము, ఆఖేటము, మృగవ్యము, మృగయ, వేట.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాచ్చోద్యంతే మృగా అత్రేతి ఆచ్ఛోదనం, మృగము దీనియందు తరుమబడును.


ఆజకము
సం., వి., అ., న., తత్స.,= మేకలగుంపు, అజ సమూహము. (అజము=మేఁకపోతు.)
వ్యుత్పత్త్యర్థము :
అజానాం సమూహః ఆజకం. మేఁకల యొక్క సమూహము .


ఆజగవము
సం., వి., అ., న., తత్స.,= అజగవము యొక్క రూపాంతరము.

ఆజవంజవము
సం., వి., అ., పుం., తత్స.,= సంసారము.

ఆజానజుడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = దేవాంశ సంభూతడు.

ఆజానము
సం., అవ్య., తత్స.,= స్వభావము.

ఆజానేయము
సం., వి., అ., పుం., స్త్రీ., తత్స.,= మంచి జాతి గుర్రము, మేలు జాతి గుఱ్ఱము, కులీనాశ్వము, శ్రేష్ఠఘోటకము.
వ్యుత్పత్త్యర్థము :
అజేనకవేగేన ఆనేయాః ఆజానేయాః. వేగము చేత తేదగినవి.


ఆజి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = సమతలము, సమభూమి, యుద్ధము, క్షణకాలము, రణము, సంగ్రామము, సమరము, ఆక్షేపము.
వ్యుత్పత్త్యర్థము :
అంజతి బాణాన్యత్రేత్యాజిః. బాణములను దీనియందు వేయుదురు.

పర్యాయపదాలు :
ఆయోధనము, జన్యము, ప్రధనం, ప్రవిదారణం, మృథం, ఆస్కందనము, సంఖ్యం, సమీకం, సాంపరాయకం, అనీకము, కలహము, విగ్రహము, సంప్రహారము, అభిసంపాతము, కలి, సంస్ఫోటము, సంయుగము, అభ్యామర్దము, సమాఘాతము, అభ్యాగమము, ఆహవము, సముదాయము, సంయత్తు, సమితి.


ఆజీవము
సం., వి., అ., పుం., తత్స.,= జీవిక, జైనభిక్షుకుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆజీవంతి ప్రాణినో అనేనేతి ఆజీవః. జనులు దీనిచేత బ్రతుకుదురు.

పర్యాయపదాలు :
వార్త, వర్తనము, బ్రతుకు దోవ, వృత్తి, జీవనము.


ఆజువు
సం., వి., ఊ., స్త్రీ., తత్స.,= అమిజి, వెట్టి, విష్టి.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాద్దుఃఖం జనయతీత్యాజూః. అంతట దుఃఖమును పుట్టించునది


ఆజ్ఞ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఉత్తరువు, రాజాంతః పురచేటి శాసనము.
వ్యుత్పత్త్యర్థము :
ఆజ్ఞాపనం ఆజ్ఞా. ఆజ్ఞాపించుట ఆజ్ఞ.

పర్యాయపదాలు :
అపవాదము, నిర్దేశము, నిదేశము, శాశనము, ఆజ్ఞాపించుట, ఇది ఇట్లు చేయవలసినదనెడి ఉత్తరువు, శిష్టి.


ఆజ్ఞప్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఆజ్ఞ, ఉత్తరువు.

ఆజ్ఞాగణిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= రాజాంతః పురచేటి.

ఆజ్ఞాతుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఆజ్ఞాపింపఁబడినవాడు.

ఆజ్ఞాపనము
సం., వి., అ., న., తత్స.,= ఆజ్ఞాపించుట, ఆనతి.

ఆజ్ఞాపించు
సం., స., క్రి.,= ఆజ్ఞాపనము చేయు, ఆనతిచ్చు.

ఆజ్ఞాపితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఆజ్ఞాపింపఁబడినది.

ఆజ్యము
సం., వి., అ., న., తత్స.,= ఘృతము, నెయ్యి, శ్రీవాసము, యాగక్రియాది సాధనము(తైలము, దుగ్ధము మొదలైనవి), నేయి, పయస్యము, రెండుశతమానములు, కర్పూర తైలము.
వ్యుత్పత్త్యర్థము :
అంజనీయ మోదనాదౌ సేచనీయమిత్యాజ్యం. అన్నాదులయందు పోయఁతగినది.


ఆజ్యాధివాసనము
సం., నా.వా., అ., న., తత్స.,= నేతిని పరిశుభ్రపరచుట.

ఆజ్యాధిశ్రయణము
సం., నా.వా., అ., న., తత్స.,= హోమమున నేతిని కరగించుట.

ఆజ్యావేక్షణము
సం., నా.వా., అ., న., తత్స.,= నేతిలో (నీడ) చూచుట.

ఆటకము
సం., నా.వా., అ., పుం., తత్స.,= పిచ్చుక.

ఆటరూపము
సం., నా.వా., అ., పుం., తత్స.,= అడ్డసరము.

ఆటి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = నీటిపక్షి, శరారి, ఆతి, ఒక దినుసుబాతు, ఆడేలు. ; పుం. పక్షివిశేషము .
వ్యుత్పత్త్యర్థము :
అటతీత్యాటిః. చరించునది ఆటి.


ఆటోపము
సం., వి., అ., పుం., తత్స.,= సంభ్రమము, వేగిరపాటు, తొందర, దర్పము, గర్వము, సంరభము.

ఆటోపించు
సం., అ., క్రి.,= సంభ్రమించు, వేగిరపడు, తొందరపడు.

ఆడంబరము
సం., వి., అ., పుం., తత్స.,= హర్షము, యుద్ధవాద్యధ్వని, తూర్యరవము.
వ్యుత్పత్త్యర్థము :
ఆడంబయతి శతృహృదయ మిత్యాడంబరః. శత్రుహృదయమును ఎత్తివేయునది ఆడంబరము.

నానార్థాలు :
వేగిరపాటు, గజేంద్రగర్జనము, సంరంభము, ఆయోజనము, ఏకత్ర సన్నివేశనము, ఏనుఁగు యొక్క గీఁక, ఆరంభము, క్రోధము, దర్పము, పటహరవము, ప్రపంచం, పటహము, పక్ష్మము, డోలు, ఘీంకారము.


ఆడిండికము
సం., నా.వా., అ., పుం., తత్స.,= సర్వాంగక్షౌరము.

ఆఢ
సం., నా.వా., ఆ., స్త్రీ., తత్స.,= రోకలిబండ(శతవదము).

ఆఢకము
సం., వి., అ., పుం., న., తత్స.,= తూము, దూలము, నాలుగు ప్రస్థములు.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ ఢౌకతే గచ్ఛతీత్యాఢకః. తిర్యగూర్థ్వాకారముగా అంతట వ్యాపించిఉండునది.

పర్యాయపదాలు :
ద్రోణి, ఖారి, వాహము, నికుంచకము, కుడవము.


ఆఢకి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = కంది, అడవి కంది తీఁగ, సువాసనగల భూమి, అవిసె, శమీధాన్యవిశేషము, కాక్షి, ప్రశస్తమైన మృత్తిక, మృతాలకము, సురాష్ట్రజం, తువరి.
వ్యుత్పత్త్యర్థము :
తువరీవాచకత్వాదఢకీ. ధాన్యవాచకమైన తువరి అను పేరుకలది.

నానార్థాలు :
ఒక దినుసుమన్ను, తూము, కరవీరభుజము, వృత్తబీజము, పీతపుష్పము.


ఆఢకికము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స.,= ఆఢకము, ద్రౌణికము, నేల, విత్తులు చల్లుభూమి.
వ్యుత్పత్త్యర్థము :
ఆఢకస్య వాపః ఆఢకికం. తూమెఁడు విత్తులు విత్తతగిన పొలము.


ఆఢికము
సం., నా.వా., అ., న., తత్స.,= ఎముక.

ఆఢ్యుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= సంపన్నుఁడు, ధనవంతుడు, యుక్తము, విశిష్టము, అన్వితము, ధనాఢ్యుడు, ఇభ్యుడు, ధని, గుణాఢ్యుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాద్ధ్యాయంత్యేనమిత్యాఢ్యః. అంతట ఇతనిని తలచుదురు.


ఆణము
సం., నా.వా., అ., పుం., తత్స.,= అమ్ములపొది.

ఆణవీన
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= అణువులుగల భూమి.

ఆతంకము
సం., వి., అ., పుం., తత్స., = వ్యాధి, జ్వరము, తెలుపు రోగము, తాపము, భయము, రోగము.
వ్యుత్పత్త్యర్థము :
ఆతంకంతి అనేనేత్యాతంకః. దీని చేత ప్రయాసమున బ్రతుకుదురు.

నానార్థాలు :
ఆరాటము, చేమిరి, వెఱపు, మద్దెలమ్రోత, సంతాపము, శంక, మురజధ్వని.


ఆతంచనము
సం., వి., అ., న., తత్స.,= చేమిరి, నిక్షేపము(అని కొందరు), తోడువేయుట, తనుపుట, వడి, ప్రార్థన, ప్రతీవాపము, వేగము, తృప్తిచేయుట, సంతుష్టి.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమమతాత్తంచనం ఆతంచనం. అంతట వ్యాపించుట ఆతంచనము.


ఆతతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = విరివియైనది.

ఆతతాయి
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = ఘాతుకుడు, చంపనుద్యుక్తుఁడైనవాఁడు. (వీరాఱుగురు – ఇంట నిప్పిడువాఁడు, విషము పెట్టువాఁడు, కత్తిగొని నఱకువాఁడు, ధనము దోచుకొనువాఁడు, నేలనపహరించువాఁడు, ఒకని భార్యను జెఱపట్టువాఁడు.)
వ్యుత్పత్త్యర్థము :
ఆతతమధికం పాపమేతీత్యాతతాయీ. అధికమైన పాపమును పొందినవాఁడు.


ఆతతి
సం., నా.వా., ఇ., పుం., తత్స.,= చీకటి.

ఆతపత్రము
సం., వి., అ., న., తత్స.,= ఛత్రము, గొడుగు, గుడ్డి కామంచి చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆతపాత్ త్రాయతీతి ఆతపత్రమ్. ఎండ నుంచి రక్షించునది.


ఆతపము
సం., వి., అ., పుం., తత్స., = ఎండ.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్తపతీత్యాతపః. అంతట తపించునది.

పర్యాయపదాలు :
ప్రకాశము, సూర్యలోకము, రవిప్రకాశము, వెలుగు, రౌద్రము, ద్యోతము, దినజ్యోతి, దినప్రభ, ప్రద్యోతము, తాపనము, తమారి, ద్యుతి.


ఆతపవారణము
సం., వి., అ., న., తత్స., = ఆతపత్రము, ఛత్రము, గొడుగు.

ఆతరము
సం., వి., అ., పుం., తత్స., = రుసుము, కేవు, ఓడకిచ్చెడి కూలి, తరపణ్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఆతరంత్యనేనేతి ఆతరః. దీని చేత దాఁటుదురు.


ఆతర్పణము
సం., వి., అ., న., తత్స., = తనివి, మంగళార్థమైన పూఁత, రుసుము, కేవు, ఓడకిచ్చెడి కూలి.
వ్యుత్పత్త్యర్థము :
ఆతరంత్యనేనేతి ఆతరః. దీని చేత దాఁటుదురు.


ఆతానము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= దొంత మల్లె.

ఆతాపి
సం., వి., న్., పుం., తత్స.,= చీపరపిట్ట, గాలిపటము, చెమరుఁగాకి, పక్షిభేదము, ఆతాయి, చిల్ల, అసురభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఆతాపయతి పరజాతిమిత్యాతాపీ. ఇతర జాతిని తపింపచేయునది.


ఆతాయి
సం., వి., న్., పుం., తత్స.,= చిల్ల, ఆతాపి.

ఆతాలము
,సం., నా.వా., అ., న., తత్స.,= కాలిబందము.

ఆతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = పక్షివిశేషము, ఆడేలు, నీటిపక్షి. ; పుం. ప్లవజాతి పక్షి, శరారి, ఆటి, ఆడి, చిల్లము.

ఆతిథేయము
సం., వి., అ., న., తత్స.,= అతిథి సత్కారము, అతిథి సేవ, ఆతిథ్యము, అతిథి సేవాకారకము, అతిథి భక్షణాదిద్రవ్యము. ; విణ. అతిథికి యోగ్యమైనది.
వ్యుత్పత్త్యర్థము :
అతిథిషు సాదు ఆతిథేయం. అతిథుల యందుఁ తగినది.


ఆతిథేయి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= ఆతిథ్యము, అతిథ్యర్థవస్తువు.

ఆతిథ్యము
సం., వి., అ., న., తత్స., = అతిథి సత్కారము, అతిథులు తినదగిన ద్రవ్యము, ఆతిథేయము, అతిథ్యర్థవస్తువు, అతిథి సేవ. ; విణ. అతిథి కొఱకైనది. ; పుం. ఆతిథ్యము, అతిథి.
వ్యుత్పత్త్యర్థము :
అతిథిభ్యః పరికల్పితమాతిథ్యం. అతిథుల కొరకు చేయబడినది.


ఆతిథ్యుఁడు
సం., వి., అ., పుం., తత్స., = అతిథి , విందు.

ఆతివాహిక
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= నరకవాసి.

ఆతురపడు
మి., అ., క్రి.,= (ఆతురము + పడు)బాధపడు.

ఆతురుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= రోగి, తెవులుగొంటు, వ్యాధిగ్రస్తుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆతుర సంభ్రమోస్యాస్తీత్యాతురః. అంతట వేగిరము కలవాఁడు.

పర్యాయపదాలు :
గ్లాని నొందినవాడు, ఆమయావి, వికృతుడు, వ్యాధితుడు, అపటువు, అభ్యమితుడు, అభ్యాంతుడు.


ఆతోద్యము
సం., వి., అ., న., తత్స., = వాద్యములు, తతము ఆనద్దము సుషిరము ఘనము అనెడు వాద్యచతుష్టయము, వీణ మొదలైన వాద్యము తతము, మురజాది వాద్యము ఆనద్దము, వంశాది వాద్యము సుషిరము, కాంస్యతాలాది వాద్యము ఘనము, వాదిత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ త్యోదత ఇత్యాతోద్యం. అంతట వాదింపఁపడునది.


ఆత్తగంధము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తిరస్కరింపఁబడినది, అభిభూతుడు, లొంగతీయబడినవాడు.(పాఠాంతరము ఆత్తగర్వము.)
వ్యుత్పత్త్యర్థము :
ఆత్తః స్వీకృతః గంధః . గర్వోయేన సః ఆత్తగంధః. పొందఁపడిన గర్వం కలవాడు.


ఆత్తము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పొందఁబడినది, అపహరింపఁబడినది.

ఆత్మ
సం., వి., న్., పుం., తత్స., = జీవాత్మ, క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జీవుడు.
వ్యుత్పత్త్యర్థము :
అత్తి స్వకర్మ ఫలమితివా ఆత్మా. స్వకర్మ ఫలమును భుజించువాడు.

నానార్థాలు :
బుద్ధి, శరీరము, మనస్సు, స్వభావము, బ్రహ్మము, దేహము, పుత్రుడు, వాయువు, ధైర్యము, యత్నము, ధృతి, పరవ్యావర్తనము, అర్కుడు, హుతాశనుడు, ప్రయత్నము.


ఆత్మంభరి
సం., విణ.,ఇ., తత్స.,= కుక్షింభరుడు, కుక్షింభరి, పొట్టపోసికొనువాఁడు.

ఆత్మగుప్త
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = గోరింట, దూలగొండి చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆత్మా గుప్యతేస్యా ఇతి ఆత్మగుప్తా. దీని వలన శరీరము దాచఁబడును.

పర్యాయపదాలు :
జహము, అవ్యండము, కండూరము, ప్రావృషాయణి, ఋశ్యప్రోక్త, శూకశింబి, కపికచ్ఛు, మర్కటి.


ఆత్మఘోషము
సం., వి., అ., పుం., తత్స., = కరటము, కాకి.
వ్యుత్పత్త్యర్థము :
ఆత్మానమేవఘోషతి కాకేతి ఆత్మఘోషః. కాకా అని తన పేరును పలుకునది.

పర్యాయపదాలు :
అరిష్టము, బలిపుష్టము, సకృత్ప్రజము, ధ్వాక్షి, పరభృత్తు, బలిభుక్కు, వాయసము.


ఆత్మజ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పుత్రిక, కూఁతురు.

ఆత్మజుఁడు
సం., వి., అ., పుం., తత్స., = పుత్రుఁడు, కొడుకు, తనయుడు, సూనుడు, సుతుడు, ఆత్మజన్ముడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆత్మనః జాయతే ఆత్మజః. తనవలన పుట్టినవాడు.


ఆత్మదర్శము
సం., వి., అ., పుం., తత్స., = దర్పణము, అద్దము.

ఆత్మనీనుడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= కొడుకు, బావమరది, మోసగాడు, పోషించువాడు.

ఆత్మనేపదము
సం., వి., అ., న., తత్స., = క్రియాపదము యొక్క భేదము.

ఆత్మభువు
సం., వి., ఊ., పుం., తత్స., = బ్రహ్మ, విష్ణువు, కామదేవుడు, శివుడు, మన్మథుడు, మదనుడు, మారుడు, ప్రద్యుమ్నుడు, మీనకేతనుడు, కందర్పుడు, దర్పుడు, అనంగుడు, కాముడు, పంచశరుడు, స్మరుడు, శంబరారి, మనసిజుడు, కుసుమేషుడు, అనన్యజుడు, పుష్పధన్వుడు, రతిపతి, మకరధ్వజుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆత్మనాభవతీత్యాత్మభూః. తనంతట పుట్టినవాడు.

పర్యాయపదాలు :
సురజ్యేష్ఠుడు, పరమేష్ఠి, పితామహుడు, హిరణ్యగర్భుడు, లోకేశుడు, స్వయంభువు, చతురాననుడు, ధాత, అబ్జయోని, ద్రుహిణుడు, విరించి, కమలాసనుడు, స్రష్ట, ప్రజాపతి, వేధా, విధాత, విశ్వసృట్, విధి.


ఆత్మయోని
సం., వి., ఇ., పుం., తత్స., = మన్మథుడు, బ్రహ్మ, గాలి.

ఆత్మసంబంధము
సం., నా.వా., అ., పుం., తత్స., = శివుని గుణములలో నొకటి.

ఆత్మాశి
సం., వి., న్., పుం., తత్స., = మత్స్యము, చేప.

ఆత్మీయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= తనది, మిత్రుడు, స్వకీయము, అంతరంగము.

ఆత్రేయి
సం., వి., ఇ., పుం., తత్స., = అన్నరసము.

ఆత్రేయి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ముట్టుది, అత్రి కూఁతురు, ఒకానొక నది, ముట్టుత, ఋతుమతి, స్త్రీధర్మిణి, మలిని, అవి, పుష్పవతి, రజస్వల.
వ్యుత్పత్త్యర్థము :
అత్రేరపత్యమివ ఆత్రేయీ. అత్రి కూఁతురు ఆత్రేయి.


ఆత్రేయిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఋతుమతి, పుష్పవతి, ఆత్రేయి, రజస్వల.

ఆత్రేయుఁడు
సం., వి., అ., పుం., తత్స., = చంద్రుడు. ; విణ. అత్రివంశమునఁ బుట్టినవాఁడు.

ఆథర్వణము
సం., వి., అ., పుం., తత్స., = అధర్వవేదము, యజ్ఞసమాప్తిని యజమానుడు విను ప్రత్యేకశాల.
వ్యుత్పత్త్యర్థము :
అథర్వణాం సమూహః ఆథర్వణం. అథర్వ మంత్రముల యొక్క మొత్తము.


ఆదరణీయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఆదరింపఁదగినది.

ఆదరము
సం., వి., అ., పుం., తత్స.,= పాటింపు, మన్నన.

ఆదరించు
సం., స., క్రి.,= పాటింపు, మన్నన.

ఆదర్శనము
సం., వి., అ., న., తత్స.,= చూపుట, అద్దము, దర్పణము.

ఆదర్శము
సం., వి., అ., పుం., తత్స.,= అద్దము, దర్పణము, ముకురము, టీక, ప్రతియైన పుస్తకము.
వ్యుత్పత్త్యర్థము :
అదృశ్యతేస్మిన్నాత్మనః ప్రతిబింబమితి ఆదర్శః. దీనియందు తన నీడ కనబడును.


ఆదర్శితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= చూపఁబడినది.

ఆదానము
సం., వి., అ., న., తత్స.,= పుచ్చుకొనుట, గుఱ్ఱము యొక్క అలంకారము, రోగకారణము.(స్కంధత్రయము- ఆదానము, నిదానము, చికిత్స. ఇవి వైద్యశాస్త్రమునందలివి.)

ఆదాయము
సం., వి., అ., పుం., తత్స.,= లాభము, ధనము.
ప్రయోగము :
గీ. ఇవ్విధంబున నాదాయమెల్లఁజెల్ల,
నిచ్చలును వెలయాండ్రకు నిచ్చి యిచ్చి.

ఆదాలి
సం., నా.వా., ఈ., స్త్రీ., తత్స.,= చిన్నబీర.

ఆదావము
,సం., నా.వా., అ., పుం., తత్స.,= విల్లుపట్టుకొనుట.

ఆది
సం., వి., ఇ., పుం., తత్స,.= మొదలు, పదాంత గణసూచకము, పూర్వ సత్తా, నియతపూర్వవృత్తి కారణము, సామీప్యమునందు, వ్యవస్థయందు, ప్రకారమునందు, అవయవార్థమునందు.
వ్యుత్పత్త్యర్థము :
ఆదీయతే ప్రారంభ సమయ ఏవ వ్యవహ్రీయత ఇతి ఆదిః. ముందుగా వ్యవహరింపబడునది.

పర్యాయపదాలు :
పూర్వము, ఆద్యము, ప్రథమము, ప్రారంభము, ఉత్పత్తిహేతువు, ప్రధానము.


ఆదికారణము
సం., వి., అ., న., తత్స.,= ప్రథమకారణము, నిదానము.
వ్యుత్పత్త్యర్థము :
ఆదావారంభకాలే కారణం ఆదికారణం. ఆరంభకాలమందు కారణమైనది.


ఆదితాళము
సం., వి., అ., పుం., తత్స,.= తాళభేదము.(ఎనిమిది అక్షరముల కాలము)

ఆదితేయుఁడు
సం., వి., అ., పుం., తత్స., = ఆదిత్యుడు, వేల్పు, అదితి కొడుకులు (1.వివస్వాన్, 2.అర్యమా, 3.పూషా, 4.త్వష్టా, 5.సవితా, 6.భగ, 7.ధాతా, 8.విధాతా, 9.వరుణ, 10.మిత్ర, 11.శక్ర, 12. ఉరుక్రమ మొదలైనవారు), దేవత.
వ్యుత్పత్త్యర్థము :
అదితేరపత్యాని ఆదితేయాః. అదితి కొడుకులు

పర్యాయపదాలు :
అమరుడు, నిర్జరుడు, దేవుడు, త్రిదశుడు, విబుధుడు, సురుడు, సుపర్వాణుడు, సుమనసుడు, త్రిదివేశుడు, దివౌకసుడు, లేఖుడు, దివిషదుడు, అదితినందనుడు, ఋభవుడు, అస్వప్నుడు, అమర్త్యుడు, అమృతాంధసుడు, బర్హిర్ముఖుడు, క్రతుభుజుడు, గీర్వాణుడు, దానవారి, బృందారకుడు, దైవతము.


ఆదిత్యవారము
సం., వి., అ., పుం., తత్స.,= ఆదివారము.(ఇట్లు భానువారము. మొదలైనవి.)

ఆదిత్యుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= సూర్యుడు, దేవుడు, అదితిపుత్రుడు, ఆదితేయుడు, శక్రుడు, వేలుపు, విష్ణువు, అర్కవృక్షము, వివస్వంతుడు, పర్జన్యుడు, త్రివిక్రముడు, ద్వాదశాదిత్యులు (1.అర్యముడు, 2.పూషుడు, 3.త్వష్ట, 4.సవిత, 5.భగుడు, 6.ధాత, 7.విధాత, 8.వరుణుడు, 9.మిత్రుడు, 10.ఇంద్రుడు, 11.ఉరుక్రముడు, 12. అంశుమంతుడు).
వ్యుత్పత్త్యర్థము :
అదితే రపత్యాని ఆదిత్యాః. దేవతలు, అదితి కొడుకులు.

పర్యాయపదాలు :
అమరుడు, నిర్జరుడు, త్రిదశుడు, విబుధుడు, సురుడు, సుపర్వాణుడు, సుమనసుడు, త్రిదివేశుడు, దివౌకసుడు, లేఖుడు, దివిషదుడు, అదితినందనుడు, ఋభవుడు, అస్వప్నుడు, అమర్త్యుడు, అమృతాంధసుడు, బర్హిర్ముఖుడు, క్రతుభుజుడు, గీర్వాణుడు, దానవారి, బృందారకుడు, దైవతము, సూరుడు, ద్వాదశాత్మ, దివాకరుడు, భాస్కరుడు, అహస్కరుడు, బ్రధ్నుడు, ప్రభాకరుడు, విభాకరుడు, భాస్వుడు, సప్తాశ్వుడు, హరిదశ్వుడు, ఉష్ణరశ్మి, వికర్తనుడు, అర్కుడు, మార్తాండుడు, మిహిరుడు, అరుణుడు, పూషణుడు, ద్యుమణి, తరణి, మిత్రుడు, చిత్రభాను, విరోచనుడు, విభావసువు, గ్రహపతి, త్విషాంపతి, అహర్పతి, హంసుడు, సహస్రాంశువు, తపనుడు, సవిత, రవి.


ఆదిత్స
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= గ్రహింపనిచ్ఛ.

ఆదిదేవుడు
సం., వి., అ., పుం., తత్స.,= బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.

ఆదిమము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ముందుది, మొదటిది, ముఖ్యము, ఆద్యము, మొదట పుట్టిన వస్తువు.

ఆదివారము
సం., వి., అ., పుం., తత్స., = తొలివారము, ఆదిత్యవారము, రవి వారము.

ఆదివెలమలు
మి., వి., బ.,= వెలమలలో ఒక తెగవారు.

ఆదిష్టము
సం., వి., అ., న., తత్స., = ఎంగిలి. ; విణ. ఆనతియ్యబడినది, ఉపదేశింపఁబడినది, ఏర్పఱపఁబడినది.

ఆదీనవము
సం., వి., అ., పుం., తత్స., = కోపము, క్లేశము, అలసట, దోషము, దురంతము, ఆస్రవము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాద్దీనాన్వాతి గచ్ఛతీతి ఆదీనవః. అంతట దీనులను పొందునది.


ఆదుర్దా
అన్యదే., వి., = భయము, తొందర.

ఆదృతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఆదరింపఁపడినది, ఆదరించేది, పూజితము, మన్నింపబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆద్రియత ఇత్యాదృతః. ఆదరించునది ఆదృతము.


ఆదృతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఆదరము, పాటింపు.

ఆదృతుడు
సం., వి., అ., పుం., తత్స., = పూజితుడు.

ఆదేయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = గ్రహింపఁదగినది.

ఆదేశము
సం., వి., అ., పుం., తత్స., = ఆజ్ఞ, ఉపదేశము, వ్యాకరణమున ఒకటిని బోఁగొట్టి వచ్చు మరియొక వర్ణము లోనగునది.

ఆదేశి
సం., విణ., (న్. ఈ. న్.)., తత్స., = జోస్యుడు, దైవజ్ఞుడు, గణకుడు, ఆదేశకర్త, ఉపదేష్ట.

ఆదేశించు
సం., స., క్రి., = ఆజ్ఞాపించు, ఉపదేశించు.

ఆదేష్ట
సం., వి., ఋ., పుం., తత్స.,= ఆజ్ఞాపించువాడు, యజ్ఞవిషయమై ఉపదేశించువాడు, యష్ట, వ్రతుడు, యజుడు, యాజకుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆదిశత్యృత్విజో యాగేన్వేష్టసంపాదనాయ ప్రేరయతి ఆదేష్టా. తన యాగ కార్యములలో ఋత్విజులను నియమించువాడు.

పర్యాయపదాలు :
అధర్వణ మంత్రమును ఉపదేశించువాడు, అన్వాదేష్ట, యజమాని, ఆదేశకర్త, అధర్వ తంత్రమునుపదేశించువాడు, ఉపదేష్ట.


ఆద్మరుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = భక్షకుడు, తిండిపోతు.

ఆద్యమాషకము
సం., వి., అ., పుం., తత్స., = అయిదు గురిగింజల యెత్తు.
వ్యుత్పత్త్యర్థము :
ఆద్యశ్చాసౌ మాషకర్ష ఆద్యమాషకః. మొదటిది మాషాకారమైనది కనుక ఆద్యమాషకము.


ఆద్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రథమము, ఆది, పూర్వము, పౌరస్త్యము, మొదటిది, భక్ష్యము, బ్రహ్మ.
వ్యుత్పత్త్యర్థము :
ఆదౌ భవ ఇత్యాద్యః. మొదట పుట్టినది ఆద్యము .


ఆద్యూనుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = తిండిపోతు, ఔదరికుడు, ఉద్యోగము లేక క్రీడించువాడు, ఉదరమందే ఆశక్తి కలవాడు, ఆదిహీనుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆదీవ్యతి ఈషత్ క్రీడతి అన్యత్రాసక్తత్వాత్ ఆద్యూనః. ఒకరి చేతి కూటికి కనిపెట్టుకొనియుండువాఁడు.


ఆధర్వణము
సం., వి., అ., న., తత్స., = అధర్వముల సమూహము(అధర్వుఁడను ఋషిచేఁజెప్పఁబడిన వేదము అభేదోపచారము వలన అధర్వమనఁబడును.), అథర్వమంత్రముల యొక్క మొత్తము.

ఆధానము
సం., వి., అ., న., తత్స., = ఉంచుట, కప్పుట, ధరించుట, అగ్న్యాధానము.

ఆధానికము
సం., వి., అ., పుం., తత్స., = పుంసవనము.

ఆధారకుండము
సం., వి., అ., న., తత్స., = కుండలులోనగునవి యుంచెడు కుదురు.

ఆధారము
సం., వి., అ., పుం., తత్స., = అధికరణము, ఆదరువు, చెఱువు, చెట్టు, ఆధారము, పాదు, సరస్సు, తడాగము, ఆశయము, ఆలవాలము, అంబుధారణము, పంటకొరకు చేయు జలబంధనము, కట్టగట్టి నీళ్లు నిలిపియున్న మడుగు పేరు, పొలము తడుపుటకు జలమును ఉంచిన స్థానము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆధ్రియతే జలమత్ర ఆధారః. జలము దీనియందు ధరింపఁబడును, చెరువు. 2.ఆధ్రియంతే అస్మిన్ ఆధారః. దీని ద్వారా ఆదరింపబడును.


ఆధారిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = జెఱ్ఱి.

ఆధి
సం., వి., ఇ., పుం., తత్స.,= మనోవ్యథ, మానసిక వేదన, మానసిక పీడ.
వ్యుత్పత్త్యర్థము :
ఆధియతే దైన్యమనేనేత్యాధిః. దీనిచేత దైన్యము కలుగును.

నానార్థాలు :
శక్తి, తాకట్టు, కుదువ, ప్రత్యాశ, వ్యసనము, బందకం, వ్యసనం, ఆశ్రయించుట, ఉనికి పట్టు.


ఆధికము
సం., నా.వా., అ., పుం., తత్స., = తాకట్టు.

ఆధిక్యము
సం., వి., అ., న., తత్స.,= అధికత్వము, గొప్పతనము.

ఆధిదైవికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= దైవము వలనఁగలిగినది.

ఆధిపత్యము
సం., వి., అ., న., తత్స.,= అధిపతిత్వము, దొరతనము.

ఆధిభౌతికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= భూతము వలనఁగలిగినది. (భూతము = పృథివ్యాది.)

ఆధివేదనికము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= అధివేదన నిమిత్తమైనది.(స్త్రీ ధనము.)

ఆధీన్యము
సం., వి., అ., న., తత్స.,= అధీనత్వము, అగ్గపాటు.

ఆధునికము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స.,= ఇప్పటిది, క్రొత్తది.

ఆధూతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= కదల్పబడినది, కంపితము.
వ్యుత్పత్త్యర్థము :
ఆధూయతేస్మ ఆధూతః. కదలింపఁపడినది ఆధూతము.

పర్యాయపదాలు :
వేల్లితము, ప్రేంఖితము, ఆకంపితము, చలితము, ధుతము.


ఆధేయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఉంచఁదగినది, అగ్న్యాధానము.

ఆధోరణుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= మావటివాఁడు, హహ్తిపకుఁడు, ఏనుగును నడుపువాడు, హస్త్యారోహుడు, నిషాదుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆధోరంతి హస్తిన ఏభిరితి ఆధోరణాః. వీరిచేత ఏనుఁగులు చాతుర్యముగా నడుచును.


ఆధ్యాత్మికము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స.,= ఆత్మవలనఁగలిగినది, ధ్యానము.

ఆధ్యానము
సం., వి., అ., న., తత్స.,= చింతించుట, స్మృతి, తలఁపు.
వ్యుత్పత్త్యర్థము :
ఆధ్యాయతే ఆధ్యానం. తలచుట ఆధ్యానము .


ఆధ్యూనుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఔదరికుడు, ఒకరి చేత కూటికి కనిపెట్టుకొని ఉండువాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆదీవ్యతి ఈషత్ క్రీడతి అన్యత్రాసక్తత్వాత్ ఆద్యూనః. ఉద్యోగము లేక క్రీడించువాడు.


ఆనంద
సం., వి., అ., పుం., తత్స., = ఒక సంవత్సరము( ఇవి యఱువది. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్తు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నళ, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.)

ఆనందధువు
సం., వి., ఉ., పుం., తత్స., = ఆనందము, సంతసము, సంతోషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆనందయతీత్యానందధుః. ఆనందింపఁచేయునది.

పర్యాయపదాలు :
ఆహ్లాదము, సుఖము, ప్రీతి, ప్రమోదము, సంతసము, హర్షము, ప్రమదము, అశుభమును జెఱుచునది, దుఃఖమును బోగొట్టునది, ఆమోదము, శర్మము, శాంతము, ముదము, సంమదము.


ఆనందన
సం., నా.వా., ఆ., స్త్రీ., తత్స.,= వర్షమునిచ్చు సూర్యకిరణములు.

ఆనందనము
సం., వి., అ., న., తత్స.,= సంతోష పెట్టుట, ఆనందము, ఆపృచ్ఛనం.
వ్యుత్పత్త్యర్థము :
ఆనందః ఆనందనం. చుట్టములు మొదలగు వారిని ఆలింగనాదులచేత సంతోషపరచుట.


ఆనందము
సం., వి., అ., పుం., తత్స., = సంతోషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆనందయతీత్యానందః. సుఖము కలుగజేయునది కనుక ఆనందము.

పర్యాయపదాలు :
ఆహ్లాదము, సుఖము, ప్రీతి, ప్రమోదము, సంతసము, హర్షము, ప్రమదము, అశుభమును జెఱుచునది, దుఃఖమును బోగొట్టునది, ఆమోదము, ఆనందథము, శర్మము, శాంతము, ముదము, సంమదము.


ఆనందించు
సం., అ., క్రి., = సంతోషించు, సంతసించు.

ఆనందితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = సంతోషము నొందినది, సంతోషపెట్టఁబడినది.

ఆనకదుందుభి
సం., వి., ఇ., పుం., తత్స., = వసుదేవుఁడు, ధనము చేత ప్రకాశించువాడు, కృష్ణుని తండ్రి.
వ్యుత్పత్త్యర్థము :
అస్య జన్మకాలే దేవతాభిరానకాశ్చ దుందుభయశ్చ వాదితా ఇత్యానకదుందుభిః. ఇతని జన్మకాలమున దేవతలచేత ఆనకములును, దుందుభులును వాయింపఁబడినవి.


ఆనకము
సం., వి., అ., పుం., తత్స., = భేరి, ఉఱిమెడి మబ్బు, శబ్దయుక్తమేఘము.
వ్యుత్పత్త్యర్థము :
1.అనితి చేష్టతే సర్వవిశేషోస్మాదానకః. దీని వలన సర్వవిశేషము ఉజ్జీవితమౌను. 2.ఆసమంతాదనతి శబ్దాయత ఇత్యానకః. అంతట మ్రోయునది.

పర్యాయపదాలు :
తప్పెట, మద్దెల, పటహము, తమ్మట, మృదంగము.


ఆనతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= వంగినది, అవాగ్రము, అవనతము.
వ్యుత్పత్త్యర్థము :
అవనతమిత్యానతం. ఆ ఈషన్నతం ఆనతం. వంగినది కనుక అవనతమును.


ఆనద్ధము
సం., వి., అ., న., తత్స.,= ఒకవాద్యము, మద్దెలలోనగు చర్మవాద్యము, మురజము మొదలైనవి. ; విణ. కట్టఁబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆనహ్యతే చర్మణేత్యానద్ధం, చర్మము చేతఁ కట్టబడునది.


ఆననము
సం., వి., అ., న., తత్స., = ముఖము.
వ్యుత్పత్త్యర్థము :
అనితిశ్వసత్యనేన ఆననం. దీని చేత బ్రతుకుదురు.

ప్రకృతి - వికృతి :
మొగము.

పర్యాయపదాలు :
నోరు, వదనము, తుండము, ఆస్యము, లపనము, వక్త్రము.


ఆనమితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = వంపఁబడినది.

ఆనము
సం., వి., అ., పుం., తత్స.,= ఉచ్ఛ్వాసము, నిశ్శ్వాసము.

ఆనయము
సం., వి., అ., పుం., తత్స.,= పొందించుట, తెచ్చుట.

ఆనయించు
సం., స., క్రి.,= తెచ్చు.

ఆనర్తము
సం., వి., అ., పుం., తత్స.,= నాటక శాల, నాట్యమాడు చోటు, నాట్యశాల.
వ్యుత్పత్త్యర్థము :
ఆనృత్యంత్యత్రేత్యానర్తః. దీనియందు నర్తింతురు.

నానార్థాలు :
నీరు, పోరు, దేశవిశేషము(ఇది పశ్చిమసముద్రతీరమున ద్వారకకు సమీపమున ఉన్నది), ఒకదేశపు ప్రజలు, యుద్ధము.


ఆనాయము
సం., వి., అ., పుం., తత్స.,= జాలము, చేఁపవల, ఉపనయనము.
వ్యుత్పత్త్యర్థము :
ఆనీయంతే మత్స్యా అనేనేత్యానాయః. దీని చేత మత్స్యములు అంతటా లాగఁబడును.


ఆనాయ్యము
సం., వి., అ., పుం., తత్స., = గార్హపత్యము నుండి యెత్తి దక్షిణాగ్నియందు ఉంచఁబడిన అగ్ని.
వ్యుత్పత్త్యర్థము :
1.గార్హపత్యాదానీయ యః దక్షిణాగ్నౌ ప్రణీయతే తస్మిన్ ఆనాయ్యశబ్దో వర్తతే ఇతి ఆనాయ్యః. గార్హపత్యముననుండి దక్షిణాగ్నియందుఁ చెప్పబడిన అగ్నియందు ఆనాయ్య శబ్దము వర్తించును. 2.గార్హపత్యాదగ్నేరానీయత ఇతి ఆనాయ్యః. గార్హపత్యము నుండి తేబడినది.


ఆనాహము
సం., వి., అ., పుం., తత్స., = మలమూత్ర బంధము, నిబంధము, మలరోధనము, మలబద్దకము.
వ్యుత్పత్త్యర్థము :
ఆనహ్యతే నిబద్ధ్యతే విణీమూత్రమనేనేతి ఆనాహః. మలమూత్రములు దీనిచేత కట్టబడును.

నానార్థాలు :
పదివంశకములు, దీర్ఘత్వము, ఆయామము, ఆరోహము, విబంధము, విష్టంభము, వెడల్పు, నిడుపు, దైర్ఘ్యము.


ఆనీతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పొందింపఁబడినది, తేఁబడినది.

ఆనీలము
సం., వి., అ., పుం., తత్స., = నీలవృషణములుగల గుర్రము.

ఆనుకూల్యము
సం., వి., అ., న., తత్స., = అనుకూల భావము, ఒద్దిక.

ఆనుగుణ్యము
సం., వి., అ., న., తత్స., = అనుగుణభావము, ఇమ్ము.

ఆనుపూర్వము
సం., వి., అ., పుం., తత్స., = క్రమము.

ఆనుపూర్వి
సం., వి., ఇ., న., ఈ., స్త్రీ., తత్స., = క్రమము, ఆవృత్తు, పర్యాయము, అనుక్రమము, సొరిది, పారిది, పరిపాటి.
వ్యుత్పత్త్యర్థము :
పూర్వమనుక్రమ్య తిష్ఠత్యనుపూర్వ్యం, తస్యభావః ఆనుపూర్వీ. పూర్వమును తప్పక అనుసరించి ఉండుట అనుపూర్వము, దాని భావము ఆనుపూర్వీ.


ఆనుపూర్వ్యము
సం., వి., అ., న., తత్స., = క్రమము, అనుక్రమము, సొరిది.

ఆనృశంస్యము
సం., వి., అ., న., తత్స., = అక్రూరభావము.

ఆనేత
సం., విణ.,(ఋ. ఈ. ఋ.).,తత్స., = పొందించువాడు, తెచ్చువాఁడు.

ఆనేయము
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స., = పొందింపఁదగినది, తేఁదగినది.

ఆన్వీక్షకి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = తర్కము, వైశేషికాది తర్క విద్య, రాజ విద్యలు నాలుగింటిలో ఒకటి.
వ్యుత్పత్త్యర్థము :
ప్రత్యక్షాగమాభ్యామవగతస్య వస్తునః అనుపశ్చాత్ ఈక్షణమన్విక్షా, సా ప్రయోజనమస్యాతి ఆన్వీక్షకీ. ప్రత్యక్షాగమముల చేత అవగతమైన వస్తువునకు వెనుకకు మరలి విచారించుట అన్వీక్ష, అది ప్రయోజనముగాఁకలది ఆన్వీక్షకీ.


ఆపః
సం., వి., స్., న., తత్స., = జలము, నీళ్లు, వారి.
పర్యాయపదాలు :
సలిలము, కమలము, పయస్సు, కీలాలం, అమృతం, జీవనం, భువనం, వనం, కబంధం, ఉదకము, పాథము, పుష్కరము, సర్వతోముఖం, అంభస్సు, అర్ణము, తోయము, పానీయము, నీరము, క్షీరము, అంబు, శంబరము, మేఘపుష్పం, ఘనరసము.


ఆపక్వము
సం., వి., అ., న., తత్స., = అభ్యూషము, గుగ్గిళ్ళు, పౌళి, అభ్యూషము, ఉడుకబెట్టబడునది.
వ్యుత్పత్త్యర్థము :
ఈషత్పక్వమాపక్వం. ఇంచుకంత పక్వమైనది.


ఆపగ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నది, ఏఱు.
వ్యుత్పత్త్యర్థము :
అపాం సమూహాః ఆపం, తేనగచ్ఛతీత్యాపగా. ఉదక సమూహము ఆపము, దానిచేత పోవునది.

పర్యాయపదాలు :
తరంగిణి, శైవలినీ, తటినీ, హ్రాదిని, ధుని, స్రోతస్వినీ, ద్వీపవతి, స్రవంతి, నిమ్నగ.


ఆపణము
సం., వి., అ., పుం., తత్స.,= అంగడి, విషద్య, నిషద్యము, పణ్యవిక్రయశాల, మళిగ, విపణి, పణ్యవీథిక.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ పణాయంతే వ్యవహరంతి అస్మిన్నితి ఆపణః. దీని యందు వ్యవహరింతురు.


ఆపణికుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= వణిజుఁడు, బేహారి, బేరమాడువాడు, చేహారి.
వ్యుత్పత్త్యర్థము :
ఆపణత ఇత్యాపణికః. ఆపణమునందు ఉండువాడు ఆపణికుఁడు .

పర్యాయపదాలు :
వైదేహకుడు, సార్థవాహుడు, నైగముడు, పణ్యాజీవుడు, క్రయవిక్రయములచేత బ్రతుకువాడు.


ఆపత్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఇడుమ, పొందించుట.

ఆపత్ప్రాప్తుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= ఆపన్నుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆపద్యతేస్మ ఆపన్నః, ఆపదం ప్రాప్తః ఆపత్ప్రాప్తః. ఆపదను పొందినవాఁడు ఆపన్నుఁడు, ఆపత్రాప్తుఁడును.


ఆపద
సం., వి., ద్., స్త్రీ., తత్స., = విపత్తు, ఇడుమ, విపత్తి.
వ్యుత్పత్త్యర్థము :
ఆపద్యతే ఆపత్. అంతటఁ ఇడుమ పొందఁబడునది.


ఆపనము
సం., వి., అ., న., తత్స.,= పొందుట.

ఆపన్నము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = పొందఁబడినది, వచ్చినవాడు, విపన్నుడు, ఆపత్ప్రాప్తుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆపద్యతే స్మ ఆపన్నః. ఇడుమ కలది.


ఆపన్నసత్వ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = గర్భిణి, చూలాలు, గర్భవతి, గుర్విణీ, అంతర్వత్నీ.
వ్యుత్పత్త్యర్థము :
ఆపతన్నం గృహీతం సత్యం గర్భోనయేత్యాపన్నసత్త్వా. గ్రహింపఁబడిన గర్భముకలది.


ఆపమిత్యకము
సం., వి., అ., న., తత్స.,= వినిమయమున వచ్చినది, వినిమయవాచకము.
వ్యుత్పత్త్యర్థము :
అపమిత్య ప్రాప్తమాపమిత్యకం. వినిమయముచేత పొందఁబడినది. ఒక వస్తువును ఇచ్చి మారుగా పుచ్చుకొన్న మరొక వస్తువు.


ఆపవుడు
సం., వి., అ., న., తత్స.,= వశిష్ఠుడు.

ఆపాండుఫలము
సం., నా.వా., అ., న., తత్స.,= పెద్దపొట్ల.

ఆపాతము
సం., వి., అ., పుం., తత్స.,= వెంటనే, పడుట, తేలిక, అప్పుడు.

ఆపాదకము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= కలిగించునది.

ఆపాదనము
సం., వి., అ., న., తత్స.,= ఉత్పాదనము, కలిగించుట.

ఆపాదితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= కలిగింపఁబడినది.

ఆపాదిల్లు
సం., అ., క్రి.,= కలుగు.(ప్రే. ఆపాదించు.)

ఆపానము
సం., వి., అ., న., తత్స.,= పానశాల, అనేకులు కూడి కల్లు త్రాగెడి చోటు, మద్యపానార్థము సభ, పానగోష్ఠిక, మద్యపానము చేయు స్థలము, పానగోష్ఠి.
వ్యుత్పత్త్యర్థము :
అపిలంతి అస్మిన్నిత్యాపానం. దీనియందు మద్యపానము సేయుదురు.


ఆపింగలకము
సం., నా.వా., అ., పుం., తత్స.,= ఒకఎద్దు.

ఆపింజనము
,సం., నా.వా., అ., న., తత్స.,= చిన్నచందనము.

ఆపితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= పొందఁబడినది.

ఆపీడము
సం., వి., అ., పుం., తత్స.,= శిరోమాలిక, సిగనిడిన పూలదండ, నలఁపుట, శేఖరము, గోడ బయటకి వచ్చిన గృహదారు విశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆపీడ్యతే ధృఢం బంధేనేత్యాపీడః. లెస్సగా చుట్టుటచే పీడింపఁబడునది.


ఆపీడితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= నలఁపఁబడినది.

ఆపీతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= త్రాగబడినది.

ఆపీనము
సం., వి., అ., న., తత్స., = పొదుఁగు, ఊధము, స్థూలమైనది, పాలచేత తడుపునది. ; విణ. మిక్కిలి బలిసినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆప్యాయతే క్షీరేణేత్యాపీనం. పాలచేత నిండియుండునది.


ఆపూపికము
సం., వి., అ., న., తత్స.,= రొట్టెలు, శాష్కులికము.
వ్యుత్పత్త్యర్థము :
అపూర్వః ప్రయోజనమస్య ఆపూరికమ్. అపూపములు వండు పెనము. అపూపానాం సమూహః ఆపూపికం. అపూపముల సమూహము.


ఆపూపికుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= పిండివంటవాఁడు, కాందవికుడు, భక్షకారుడు, పిండివంటలు వండువానికి అమ్మువానికి పేర్లు.

ఆపూరికము
సం., వి., అ., న., తత్స., = అపూపములు వండు పెనము.
వ్యుత్పత్త్యర్థము :
అపూర్వః ప్రయోజనమస్య ఆపూరికమ్. అపూపానాం సమూహః ఆపూపికం. అపూపముల సమూహము.


ఆపూర్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = మిక్కిలినింపు.

ఆపృచ్ఛనము
సం., వి., అ., న., తత్స.,= ఆనందము, చుట్టములు లోనగువారిని ఆలింగనాదులచేత సంతోషపఱచుట, ఆమంత్రణము, యాత్రాదులయందు బంధువులు లోనగువారి యనుజ్ఞపడయుట.(అని కొందఱు.)
వ్యుత్పత్త్యర్థము :
ఆపృచ్ఛః ఆపృచ్ఛనం. సంతోష పెట్టుట.


ఆపృచ్ఛము
సం., వి., అ., పుం., తత్స., = ఆనందము .
వ్యుత్పత్త్యర్థము :
ఆపృచ్ఛః ఆపృచ్ఛనం. సంతోష పెట్టుట ఆపృచ్ఛము.


ఆపోశనము
సం., వి., అ., న., తత్స., = భోజనప్పుడు పుడిసిట జలముపోసికొని మంత్ర పూర్వకముగా పుచ్చుకొనుట.

ఆపోశనించు
సం., స., క్రి., = ఆపోశనముచేయు.

ఆప్తము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఆప్తమైనది, విశ్వాస్యుడు, హితము, కుశలము, బహు, అధికము.
వ్యుత్పత్త్యర్థము :
ఆప్నోతి రహస్యమిత్యాప్తః. రహస్యమును పొందుఁవాడు.

పర్యాయపదాలు :
సత్యమైనది, ఆత్మీయుడు, విశ్వస్తుడు, ప్రాప్తము, లబ్ధము, పొందఁబడినది, సన్నికృష్టుడు, ప్రత్యయితుడు, మిత్రుడు.


ఆప్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= కలిమి, పొందు.

ఆప్యము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= జలమయము, అమ్మయం,
వ్యుత్పత్త్యర్థము :
అపాం వికారః ఆప్యం. జలము యొక్క వికారం ఆప్యము .


ఆప్యాయనము
సం., వి., అ., న., తత్స.,= వృద్ధి, ప్రీతి, ఆతంచనము, ప్రతీవాపము, జవము, వేగము.

ఆప్యాయము
సం., వి., అ., పుం., తత్స.,= తృప్తి, తనివి.(రూ. ఆప్యాయనము. అ. న.)

ఆప్యాయిత
సం., విణ.,(ఋ. ఈ. ఋ.)., తత్స.,= తనియువాఁడు.

ఆప్యాయితుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= తనిసినవాఁడు.

ఆప్రపదము
సం., అవ్య., తత్స.,= ఆప్రపదీనము, ఆఁడుదాని పావడ మొదలైనది.

ఆప్రపదీనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= కాలివరకు ఉండు దుస్తులు, మీఁగాళ్లదాఁక జాఱు గలది, అంగీ, ఆఁడుదాని పావడ మొదలైనది.
వ్యుత్పత్త్యర్థము :
యద్వస్త్రం స్త్రీణాం ఆప్రపదం పాదాగ్రపర్యంతం వ్యాప్నోతి తత్ ఆప్రపదీనమిత్యుచ్యతే. స్త్రీలమోఁకాళ్లదాఁక జారుగలవస్త్రము ఆప్రపదీనము.


ఆప్రాసము
సం., నా.వా., అ., పుం., తత్స., = దర్భాసనము

ఆప్లవనము
సం., వి., అ., న., తత్స., = స్నానము, ఆప్లవము, ఆప్లావము.

ఆప్లవము
సం., వి., అ., పుం., తత్స.,= స్నానము, ఆప్లావము, మునుక.
వ్యుత్పత్త్యర్థము :
ఆప్లవతి శరీరమలమనేనేతి ఆప్లావః, ఆప్లవశ్చ. శరీరమలము దీనిచేఁ పోవును.


ఆప్లావము
సం., వి., అ., పుం., తత్స., = స్నానము, ఆప్లవము, మునుక.
వ్యుత్పత్త్యర్థము :
ఆప్లవతి శరీరమలమనేనేతి ఆప్లావః, ఆప్లవశ్చ. శరీరమలము దీనిచేతఁపోవును.


ఆప్లుతుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= వేదముఁజదివినపిమ్మట ఆశ్రమాంతరమును పొందని స్నానశీలుఁడు, స్నాతకుడు, వ్రతి, మునిఁగిన వాఁడు, స్నాతుడు, మిగిఁలినవాడు.
వ్యుత్పత్త్యర్థము :
గంగాది పుణ్యతీర్థేషు ఆప్లవతే ఆప్లుతః. గంగాది పుణ్యతీర్థముల యందు స్నానము చేయువాడు. అవబృధస్నానమొనర్చినవాడు.


ఆబంధనము
సం., వి., అ., న., తత్స.,= ప్రగ్రహము.

ఆబంధము
సం., వి., అ., పుం., తత్స.,= గట్టికట్టు, పలుపు, ప్రేమము, ఆభరణము, యోత్రము, యోక్త్రము, భూషణము, బంధనము.
వ్యుత్పత్త్యర్థము :
ఆబద్ధ్యతే అనేన ఆబంధః. దీనిచేత కట్టఁబడును.


ఆబద్ధము
సం., వి., అ., న., తత్స.,= కట్టబడినది.

ఆబర్హిత
సం., విణ., (న్. ఈ. న్.)., తత్స.,= లాగబడినది.

ఆబాధ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= దుఃఖము, నొగులు, వేదన, అతిపీడ.

ఆబిద్ధము
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స.,= వక్రము, క్షిప్తము, పరాహతము, మూర్ఖము.

ఆబుకుడు
సం., నా.వా., అ., పుం., తత్స.,= నాటకములోని తండ్రి.

ఆబ్దికము
సం., వి., అ., న., తత్స.,= మృతినొందినవారికి సంవత్సరాంతమున చేసెడికర్మము, ఏఁడుడి.

ఆభ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= వలె, కాంతి, ప్రభ, మిక్కిలిదీప్తి.

ఆభరణము
సం., వి., అ., న., తత్స.,= భూషణము, తొడవు, అలంకారము, పరిష్కారము, విభూషణము, నగ.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ భ్రియతే ఆభరణం. అంతట ధరింపఁబడునది.


ఆభాషణము
సం., వి., అ., న., తత్స., = సంభాషణ, ఆలాపము, నిండుమాట.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాద్భాషణమాభాషణం. అంతట సంభాషించుట.


ఆభాసము
సం., వి., అ., పుం., తత్స.,= ప్రకాశము, ప్రతిఫలనము.

ఆభాస్యరులు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= అంతట ప్రకాశించువారు.

ఆభాస్వరులు
సం., వి., అ., పుం., తత్స.,= దేవతలు.
వ్యుత్పత్త్యర్థము :
భాసంత ఇతి భాస్వరాః. అంతట ప్రకాశించువారు.

పర్యాయపదాలు :
ఆదిత్యులు, విశ్వవసవులు, తుషితులు, అనిలురు, మహారాజులనెడి శబ్దము గలవారు, ఆధ్యులు, రుద్రులు, గణదేవతలు.


ఆభిగామికగుణము
సం., నా.వా., అ., పుం., తత్స.,= ఒకరాజగుర్రము.

ఆభిజాత్యము
సం., వి., అ., న., తత్స.,= అభిజాతభావము.

ఆభిముఖ్యము
సం., వి., అ., న., తత్స.,= అభిముఖ భావము.

ఆభీరపల్లి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= గోపపల్లి.

ఆభీరపల్లి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= వ్రేపల్లె, గొల్లపల్లె, రేపల్లె, గోపగ్రామము, గోపగృహము, గోపస్థానము, గోపగృహ సమూహము, ఘోషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆభీరః పల్లీ ఆభీరపల్లి. గోపాలకుల పల్లె.


ఆభీరము
సం., వి., అ., పుం., తత్స., = ఒకానొక దేశము.

ఆభీరి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = గొల్లవాని భార్య, గొల్లజాతి స్త్రీ, మహాశూద్రి, గొల్లది.
వ్యుత్పత్త్యర్థము :
ఆభీరస్య గోపస్య భార్యా తజ్జాతీయా వా ఆభీరీ. గొల్లవాని భార్య, గొల్లజాతి స్త్రీ.


ఆభీరుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= పశుపోషకుడు, గోపకుడు, ఒకసంకరజాతి, గొల్లవాఁడు, గోపుడు, గోపాలుడు, గోసంఖ్యకుడు, గోదోహకుడు, వల్లవుడు, చెంబడివాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆసమంతాత్ భియం రాతీతి ఆభీరః. అంతట భయము కలవాఁడు. 2.గాః అభితః ఈరయతీతి ఆభీరః. అంతట ఆవులను తోలువాడు.


ఆభీలము
సం., వి., అ., న., తత్స., = బాధ, భయానకము, కష్టయుక్తము, కష్టము, కృచ్ఛ్రము, భయావహము, భీతిజనకము. ; విణ. భయంకరము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ భయం లాతీత్యాభీలం. అంతట భయమునిచ్చునది.

పర్యాయపదాలు :
పీడ, వ్యథ, దుఃఖము, ఆమనస్యము, ప్రసూతిజము.


ఆభుక్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = పెనుతిండి, ఆబూతి.

ఆభేరి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = రాగిణీవిశేషము.

ఆభోగము
సం., వి., అ., పుం., తత్స.,= పరిపూర్ణత, ప్రయత్నము, వరుణుని గొడుగు, పూర్ణము, యత్నము, కవినామయుక్తమైన గానసమాపక కవిత, గొడుగు.
వ్యుత్పత్త్యర్థము :
ఆభుజ్యతే అనేన ఆభోగః. దీనిచేత భుజింపఁడును.


ఆభ్యంతరనృత్తము
సం., నా.వా., అ., న., తత్స.,= ఒక నృత్యము.

ఆమండము
సం., వి., అ., పుం., తత్స.,= ఆముదపు చెట్టు.

ఆమంత్రణము
సం., వి., అ., న., తత్స.,= పిలుపు, చుట్టములు లోనగువారిని ఆలింగనాదులచేత సంతోషపఱచుట, యాత్రాదులయందు బంధువులు లోనగువారి యనుజ్ఞపడయుట, సంబోధనము, ఆపృచ్ఛనము, నిమంత్రణము, నిమంత్రణ విశేషము, వీడుకోలు(అని కొందఱు.), పిలుచుట.

ఆమంత్రణికము
సం., నా.వా., అ., న., తత్స.,= నామకరణము.

ఆమంత్రించు
సం., స., క్రి.,= ఆమతించు, పిలుచు.

ఆమంత్రితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= పిలువఁబడినది.

ఆమగంధి
సం., వి., ఇ., న., తత్స.,= ఆమగంధికము, విస్రము, విశ్రము, అపక్వమాంసాదిగంధవిశిష్టము, చితాధూమాదిగంధయుక్తము.

ఆమగంధికము
సం., వి., అ., న., తత్స.,= ఆమగంధి, విస్రము, విశ్రము, అపక్వమాంసాదిగంధవిశిష్టము, చితాధూమాదిగంధయుక్తము.

ఆమనస్యము
సం., వి., అ., న., తత్స.,= బాధ, ప్రవసవేదన, బిడ్డపుట్టుట.
వ్యుత్పత్త్యర్థము :
అమనసో భావః ఆమనస్యమితి. దుష్టమైన మనస్సు యొక్క భావము.

పర్యాయపదాలు :
పీడ, వ్యథ, దుఃఖము, ప్రసూతిజము, కష్టము, కృచ్ఛృము, ఆభీలము.


ఆమపాత్ర
సం., వి., అ., న., తత్స.,= పచ్చికుండ.

ఆమమాంసకము
సం., నా.వా., అ., న., తత్స.,= రక్తగంధము.

ఆమము
సం., వి., అ., పుం., తత్స.,= వ్యాధి, రోగము, రోగమాత్రము, మలవైషమ్యరోగము, రోగవిశేషము. ; విణ. అపక్వము.

ఆమయము
సం., వి., అ., పుం., తత్స.,= రోగము, తెవులు, రుజ, ఉపతాపము, వ్యాధి, గద.

ఆమయావి
సం., విణ.,(న్. ఈ. న్.)., తత్స.,= వ్యాధి కలవాఁడు, గ్లానినొందినవాడు, వికృతుడు, అపటువు, ఆతురుడు, అభ్యమితుడు, అభ్యాంతుడు, రోగి, ఆతురుఁడు, తెవులుగొంటు.
వ్యుత్పత్త్యర్థము :
ఆమయోస్యాస్తీత్యామయావి. వ్యాధి కలవాడు కనుక ఆమయావి.


ఆమలకము
సం., వి., అ., న., తత్స., = ఉసిరిక కాయ. ; పుం. న. ఉసిరిక చెట్టు.

ఆమలకి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= ఉసిరిక, ఫలవృక్షవిశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆమలతే గుణానామలకీ. గుణములను ధరించునది.

పర్యాయపదాలు :
శ్రీఫలము, తిష్యఫలము, అమృత, వయస్థము, కాయస్థము, ధాత్రిక, శివా, శాంత, ధాత్రి, అమృతఫలము, వృష్యము, వృత్తఫలము, రోచని, కర్షపలము, తిష్య.


ఆమిక్ష
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= పాలవిరుగుడు, పెరుగు, కూకు, దధికూర్చిక, పయస్య, క్షీరసంతానిక, తక్రకూర్చిక.
వ్యుత్పత్త్యర్థము :
ఆమాయతే క్షిప్యతే దధ్వత్రేతి ఆమిక్షా. దీనియందు పెరుగు పోయఁబడును.


ఆమిషము
సం., వి., అ., పుం., న., తత్స.,= మాంసము, భోగింపదగినవస్తువు.
వ్యుత్పత్త్యర్థము :
1.అమతి రోగయతి ఆమిషం. రోగమును చేయునది. 2.అమ్యత ఇత్యామిషం. పొందపడునది.

నానార్థాలు :
లంచము, ఉత్కోచము, లాభము, భోగము, భోగ్యవస్తువు, సంభోగము, కామగుణము, సుందరాకారరూపాదికము, లోభసంచయము, భోజనము, రూపము.


ఆమిషాశి
సం., విణ.,(న్. ఈ. న్.)., తత్స.,= మాంసాహారి, శౌష్కలుడు.

ఆమిషి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = జటామాంసి వృక్షము, జాతమాషి.
వ్యుత్పత్త్యర్థము :
ఆమిషమశ్నాతీత్యామిషీ. మాంసమును తినువాఁడు.


ఆమీక్ష
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఆమిక్ష, తక్రకూర్చిక, దీనియందు పెరుగు పోయబడును.

ఆముక్తము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= కట్టఁబడినది(వస్త్రము.), తొడుగఁపడినది(కవచము.), పినద్ధము, అపినద్ధము, ప్రతిముక్తము, ధరింపబడునది.
వ్యుత్పత్త్యర్థము :
ఆముచ్యతే స్మ ఆముక్తః. ఉపసర్గవశమున బంధనార్థకము కట్టఁపడినది కనుక ఆముక్తము.


ఆముత్రికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= పరలోకసంబంధమైనది.

ఆముష్మికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= పరలోకసంబంధమైనది.

ఆముష్యాయణుఁడు
సం., విణ., (అ. అ. అ)., తత్స.,= ఖ్యాతవంశమున పుట్టినవాడు, సత్కులమున జనించినవాడు, ప్రసిద్ధకులుఁడైన తండ్రివలనఁబుట్టినవాఁడు.

ఆమూలము
సం., క్రి., విణ., అవ్య.,= కడవెళ్ల, మూలముట్టుగ.

ఆమోదము
సం., వి., అ., పుం., తత్స., = కస్తూరి పరిమళము, వాసన, సంతోషము, మదము, అతిదూరగామిగంధము, సుమహదమైన గంధము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆసమంతాన్నోదః ఆమోదః. అంతటను దీనిచేత సంతోషింతురు. 2.ఆసమంతాన్మోదతే అనేనేత్యామోదః. దూరముగా వ్యాపించెడు పరిమళము.

పర్యాయపదాలు :
ముదము, ప్రీతి, ప్రమదము, హర్షము, ప్రమోదము, ఆమోదము, సంమదము, ఆనందథువు, శర్మము, శాతము, సుఖము.


ఆమోది
సం., విణ.,(న్. ఈ. న్.)., తత్స., = కర్పూరము, ముఖవాసనము.
వ్యుత్పత్త్యర్థము :
ఆమోదోస్యాస్తీతి ఆమోదీ. ఆమోదము కలిగినది.


ఆమోదించు
సం., అ., క్రి., తత్స., = సంతోషించు, సంతసించు.

ఆమ్
సం., అవ్య., తత్స., = అంగీకార సూచకము.

ఆమ్నాయము
సం., వి., అ., పుం., తత్స., = వేదము, శ్రుతి, త్రయి, ఆగమము, నిగమము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆసమంతాత్ పారంపర్యేణ మ్నానం అభ్యాసః ఆమ్నాయః. పారంపర్యము చేత అభ్యసింపఁబడునది. 2.ఆమ్నాయతే పారంపర్యేణేత్యామ్నాయః.

నానార్థాలు :
ఉపదేశము, సంప్రదాయము, గురుపరంపరాప్రాప్తోపదేశము, కులము, శిక్షాదానము, విద్యాభ్యాసము, తంత్రశాస్త్రము, కులక్రమము, ఆమ్రేడనము, ఆలోచనము, కుటుంబము, అభ్యాసము.


ఆమ్రము
సం., వి., అ., పుం., తత్స.,= మామిడిపండు, మామిడిపూత, మామిడిచెట్టు, మామిడి, రోగమును కలిగించునది.
వ్యుత్పత్త్యర్థము :
అమ్యతే అభిలష్యతే ఆమ్రః. ఆభిలషింపఁబడునది.

పర్యాయపదాలు :
రసాలము, ఫలవృక్షవిశేషము, రసాలము, సహకారము, చూతము, కామశరము, కామాంగము, కోకిలోత్సవము, మన్మథాలయము, వసంతఋతువు, కామవల్లభము, కీరేష్టము, మాధవదృమము, భృంగాభీష్టము, సీధురసము, మధులి, వసంతదూతము, ఆమ్లఫలము, మోదాఖ్యము, మధ్వావాసము, సుమదనము, పికరాగము, నృపప్రియము, ప్రియాంబువు, కోకిలావాసము, మాకందము, షట్పదాతిథి, మధువ్రతము, వసంతదృమము, పికప్రియము, స్త్రీ ప్రియము, గంధబంధువు, అలిప్రియ, మదిరాసఖము.


ఆమ్రాతకము
సం., వి., అ., పుం., తత్స., = మామిడి తోట, పీతనము, కపీతనము, అంబాళము.
వ్యుత్పత్త్యర్థము :
ఆమ్రమీషదతతి అనుగచ్ఛతీతి ఆమ్రాతకః. మామిడిని ఇంచుకంత అనుసరించి ఉండునది.


ఆమ్రాతము
సం., వి., అ., పుం., తత్స.,= మామిడి తోట.

ఆమ్రేడనము
సం., నా.వా., అ., న., తత్స.,= పునరుక్తి.

ఆమ్రేడించు
సం., అ., క్రి., = ద్విరుక్తమగు.
ప్రయోగము :
వ. సంయమీశ్వర తిలకంబుల వికస్వర స్వరంబుల నామ్రేడించు వేదమంత్ర పఠనంబుల వలన. పా. 5. ఆ.


ఆమ్రేడితము
సం., వి., అ., న., తత్స., = రెండు మూడు మారులు చెప్పఁబడిన మాట, ద్విరుక్తము, పునరుక్తి.
వ్యుత్పత్త్యర్థము :
ఆమ్రేడ్యతే అసకృదుచ్చార్యత ఇత్యామ్రేడితం, పలుమారు పలుకఁబడునది, (వ్యాకరణమందు)ద్విరుక్తము యొక్క పరరూపము.


ఆమ్లము
సం., వి., అ., పుం., తత్స., = ఒకరసము, పులుసు.

ఆమ్లలోణిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పులిచింతచెట్టు.

ఆమ్లవేతనము
సం., వి., అ., పుం., తత్స., = పుల్లప్రబ్బ చెట్టు.

ఆమ్లిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చింతచెట్టు.

ఆయకట్టు
మి., గ్రా., వి.,= (ఆయము + కట్టు.) ధనము వచ్చుబడియొక్క నిర్ణయము.

ఆయకాఁడు
మి., గ్రా., వి.,= (ఆయము + కాఁడు.) కరణములోనైన ఊరియుద్యోగస్తుడు.

ఆయతనము
సం., వి., అ., న., తత్స.,= ఇల్లు, గుడి, యజ్ఞస్థానము, బౌద్ధాలయము, యజ్ఞశాల, దేవస్థానము, చైత్యము, ఆశ్రయము, విశ్రామ స్థానము.
వ్యుత్పత్త్యర్థము :
ఆయతన్నేస్మిన్నితి ఆయతనం. దీనియందు యత్నము చేయుదురు.


ఆయతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = పొడవైనది.
వ్యుత్పత్త్యర్థము :
ఆయమ్యతే విస్తీర్యత ఇత్యాయతం. విస్తరింపఁబడునది.

పర్యాయపదాలు :
దీర్ఘము, నిడుపైనది, విస్తృతము, విశాలము, ఆకృష్టము.


ఆయతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = పొడవు, గొప్పది, ఉత్తరకాలము, భవిష్యత్కాలము, నిడుపు, భవిష్యత్తు, ప్రభావము, రాఁగలకాలము, వచ్చుబడి, విరివియైనది.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏష్యతీత్యాయతిః. రాగల కాలము, 2.ఆయచ్ఛతే ఆయమనం చ ఆయతిః., విరివియౌటను కనుక ఆయతి.


ఆయతికాఁడు
మి., విణ., = ధనార్జనము చేయువాఁడు.
ప్రయోగము :
క. వలయు నరనాయకునకు. భార. శాం. ౨, ఆ.


ఆయత్తము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = అధీనము, అగ్గము, దాసుడు, విధేయుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆయత్యతే నియుజ్యతే స్వామినేత్యాయత్తః. ప్రభువుచేత నియోగింపఁబడువాడు.

పర్యాయపదాలు :
పరతంత్రము, పరాధీనము, పరుడు నియామకుడుగా గలవాడు, నిఘ్నము, స్వచ్ఛందము, గృహ్యకము.


ఆయత్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = లోఁకువ, ఎల్ల, చెలిమి, దినము.

ఆయము
సం., వి., అ., పుం., తత్స., = ఆదాయము, ధనాగమము, ప్రాప్తి, లాభము, స్త్ర్యగార రక్షకుడు, జ్యోతిషప్రసిద్ధమైన ఏకాదశభవనము.

ఆయల్లకము
సం., వి., అ., న., తత్స., = విరహము, ఎడఁబాటు, ఉత్కంఠ, ఉత్కలిక, అరతి, కోరిక.

ఆయశ్శూలికుడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = దౌర్జన్యమును చేయువాడు, కార్యసాధకుడు, క్షిప్రకారుడు, తీక్ష్ణకర్ముడు.

ఆయసము
సం., వి., అ., న., తత్స., = ఇనుము. ; విణ. ఇనుపది.

ఆయస్తము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = కొట్టఁబడ్డది, కోపము నొందినది, త్రోయఁబడ్డది, దుఃఖమునొందినది, వాఁడిచేయఁబడినది.

ఆయస్తుడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = కోపి, చల్లబడినది, వాడియైనది, శ్రమపడినవాడు.

ఆయానము
సం., వి., అ., న., తత్స., = అశ్వాలంకారము.

ఆయామము
సం., వి., అ., పుం., తత్స., = పొడవు, దైర్ఘ్యము, ఆరోహము, ఆనాహము, నిడుపు, చెవి వరకు వింటినారిని లాగుట.
వ్యుత్పత్త్యర్థము :
ఆయమ్యతే హస్తాదినా ఆయామః. హస్తాదుల చేత నియమింపఁబడునది.


ఆయాసపడు
మి., అ., క్రి., = (ఆయాసము + పడు.) శ్రమపడు.

ఆయాసపాటు
మి., వి., = ఆయాసపడుట.

ఆయాసపెట్టు
మి., స., క్రి., = (ఆయాసము + పెట్టు.) శ్రమపఱచు.

ఆయాసము
సం., వి., అ., పుం., తత్స., = శ్రమము, ఉత్సాహము.

ఆయు
సం., విణ., (ఉ. ఊ. ఉ.)., తత్స., = యాగాన్ని

ఆయుధము
సం., వి., ధ్., స్త్రీ., అ., న., తత్స., = శస్త్రము, ఇనుము,ఆయుధము, యుద్ధము, పోటుముట్టు, అస్త్రము.( ఆయుధములు మూడు విధములు – ప్రహరణములు, పాణిముక్తములు, యంత్రముక్తములు. ఖడ్గము మొదలైనవి ప్రహరణములు, చక్రాదులు పాణిముక్తాలు, శరాదులు యంత్రముక్తాలు.)
వ్యుత్పత్త్యర్థము :
ఆయుధ్యంతే అనేనేత్యాయుధం. దీని చేత యుద్ధము చేయుదురు.


ఆయుధాయ్యము
సం., నా.వా., అ., న., తత్స., = ఒకరకపువిల్లు.

ఆయుధికుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = భటుడు, కాండపృష్టుడు, ఆయుధీయుడు, శస్త్రాజీవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆయుధేన జీవతీత్యాయుధీయః, ఆయుధికశ్చ. ఆయుధము చేత బ్రతుకువాఁడు.


ఆయుధీయుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= శస్త్రాజీవుడు, ఆయుధికుఁడు, కాండపృష్టుడు, భటుడు.
వ్యుత్పత్త్యర్థము :
అయుధేన జీవతీత్యాయుధీయః, ఆయుధికశ్చ. ఆయుధము చేత బ్రతుకువాఁడు.


ఆయుర్వేదము
సం., వి., అ., పుం., తత్స., = వైద్యశాస్త్రము, ఒక ఉపవేదము.

ఆయుర్వేది
సం., విణ.,(న్. ఈ. న్.)., తత్స., = వైద్యుడు, ఆయుర్వేదజ్ఞుడు, చికిత్సకుడు.

ఆయువు
సం., వి., స్., న., తత్స.,= జీవిత కాలము, ఉగము,(రూ. ఆయుస్సు.) వయస్సు, ధనము, జీవితము.
వ్యుత్పత్త్యర్థము :
ఏతీత్యాయుః. పోవునది.


ఆయుష్
సం., వి., స్., న., తత్స., = ఆయువు, జీవితకాలము.

ఆయుష్కరము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఆయుస్సును వృద్ధిచేయునది.

ఆయుష్కర్మము
సం., వి., న్., న., తత్స., = క్షౌరము.

ఆయుష్మంతము
సం., వి., త్., పుం., తత్స., = ఒక గ్రహయోగము, చిరజీవి, చిరంజీవి, దీర్ఘాయువు, జైవాతృకము. ; విణ. చిరకాలము బ్రతుకునది.
వ్యుత్పత్త్యర్థము :
అధికయాయురస్యాస్తీత్యాయుష్మాన్. అధికమైన ఆయుష్షు కలవాడు.


ఆయుష్యము
సం., వి., అ., న., తత్స., = ఆయువు. ; విణ. ఆయువుగలఁది.

ఆయోగము
సం., వి., అ., పుం., తత్స., = సుగంధమాలిక వేయుట, తెలివి, గంధమాల్యముల కానుక, వ్యాపారము.

ఆయోగవము
సం., వి., అ., పుం., ఆ., స్త్రీ., తత్స., = ఒక సంకరజాతి.

ఆయోధనము
సం., వి., అ., న., తత్స., = పోరుట, వధము, యుద్ధము.
వ్యుత్పత్త్యర్థము :
ఆయుద్ధ్యతేత్యాయోధనం పోరాటము చేయుట ఆయోధనము.

పర్యాయపదాలు :
జన్యము, ప్రధనం, ప్రవిదారణం, మృథము, ఆస్కందనం, సంఖ్యం, సమీకము, సాంపరాయకం, సమరానీకము, రణము, కలహము, విగ్రహము, సంప్రహారము, అభిసంపాతము, కలి, సంస్ఫోటము, సంయుగము, అభ్యామర్దము, సమాఘాతము, సంగ్రామము, అభ్యాగము, ఆహవము, సముదాయము, సంయత్తు, సమితి, అజి, సమిద్యుధము.


ఆరంభము
సం., వి., అ., పుం., తత్స., = ఉద్ఘాతము, ఉపక్రమము, ప్రారంభము, ప్రథమకృతి, ప్రక్రమము, అభ్యాదానము.
వ్యుత్పత్త్యర్థము :
ఆరంభణమారంభః. మొదలుపెట్టుట ఆరంభము.

నానార్థాలు :
ప్రయత్నము, గర్వము, త్వర, వధము, దర్పము, ప్రస్తావన, ఉద్యమము, పాట.


ఆరంభించు
సం., అ., క్రి., = యత్నించు, కడఁగు.

ఆరకూటము
సం., వి., అ., పుం., న., తత్స.,= ఇత్తడి, పితలము, అగ్నిసంయోగమువలనఁ గరఁగునది, రీతి, పీతము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆరస్య సువర్ణస్య కూటః మాయారూపమివ బాసత ఇతి ఆరకూటః. బంగారమునకు మాయారూపము వలె ఉండునది. 2.ఆరం కూటయతి స్తూపీ కరోతీతి ఆరకూటః.


ఆరక్షము
సం., వి., అ., పుం., తత్స., = ఏనుగు కుంభముల క్రింది చోటు, కుంభముల సంధి(అని కొందరు.), రక్షాయుక్తము, రక్షణీయము.

ఆరక్షుడు
సం., వి., అ., పుం., తత్స., = తలారివాఁడు, నగర రక్షకుడు, ఏనుగు కుంభముల క్రింది భాగము.

ఆరగ్వధము
సం., వి., అ., పుం., తత్స.,= ఱేలవృక్షము.(రూ. ఆర్గ్వధము.)
వ్యుత్పత్త్యర్థము :
ఆరంజయంతీతి ఆరజోమూలాంతేషాం వధః ఛేదన మత్రేతి ఆరగ్వధః. మూలాకారములైన ఫలము యొక్క ఛేదనము కలది.

పర్యాయపదాలు :
వృక్షవిశేషము, రాజవృక్షము, హిమపుష్పము, రాజతరువు, జ్వరాంతకము, శమ్యాకము, స్వర్ణపుష్పము, మహారాజద్రుమము, కర్ణికారము, సంపాకము, చతురంగుళము, ఆరేవతము, వ్యాధిఘాతము, కృతమాలము, సువర్ణకము, మంథానము, రోచనము, దీర్ఘఫలము, నృపద్రుమము, కండుఘ్నము, అరుజము, కుష్ఠసూదనము, స్వర్ణద్రుమము, స్వర్ణాంగము, ప్రగ్రహము, కర్ణాభరణకము.


ఆరఘట్టము
సం., వి., అ., పుం., తత్స.,= మహాకూపము, ఏతము, నూతినుండి నీళ్ళు వెలుపలకిఁ తెచ్చుటకు ఏర్పరచిన యంత్ర విశేషము.

ఆరజము
సం., వి., అ., పుం., తత్స., = వాద్యవిశేషము.
ప్రయోగము :
చ. కొలఁదికి మీఱుఁగా నమరుగోముఖ డిండిమ మడ్డుశంఖ కా,
హళమురళీమృదంగ పణవానక దుందుభి ఢక్కకాంస్యము,
ర్దళ మురజారజాది వివిధధ్వనులేపున భూనభోంతరం, బులఁ జెలఁగన్. భాగ. ౧౦. స్కం. ఉ.(ఈ పదప్రయోగమపూర్వము. ఇంకను విచారింపఁదగినది.)


ఆరట్టము
సం., వి., అ., పుం., తత్స., = ఒక దేశము, హిందూదేశము యొక్క పశ్చిమోత్తరముననుండు దేశవిశేషము, భగ్నము, ఒక గుర్రము.

ఆరణ
సం., నా.వా., న్., పుం., తత్స., = కోడి.

ఆరతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = నిలుపుదల, ఉపరతి, విరతి, ఉపరామము.

ఆరనాలము
సం., వి., అ., న., తత్స., = పుల్లగంజి, కాంజికము, ఆరనాళకము.

ఆరనాళకము
సం., వి., అ., న., తత్స., = పులియఁబెట్టిన కడుగునీళ్లు, కలి, పుల్లగంజి.
వ్యుత్పత్త్యర్థము :
అరనాళమన్నం తన్నిస్సృతత్వాత్ ఆరనాళకం. అరనాళమనఁగాఅన్నము, అందులో పుట్టినది.

పర్యాయపదాలు :
సౌవీరము, కుల్మాభిషుతము, అవంతీసోమము, కుల్మాషము, అభిషుతము, కుంజలము, కాంజికము.


ఆరబ్ధము
సం., విణ., (అ. అ. అ)., తత్స.,= ఆరంభింపఁబడినది.

ఆరభటము
సం., వి., అ., పుం., తత్స., = మ్రోఁత, ధీరుడు.

ఆరభటి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఒకశబ్దవృత్తి, మ్రోఁత, ఒకకావ్యవృత్తి, ప్రౌఢిమ.

ఆరలు
సం., నా.వా., ఉ., పుం., తత్స., = ఒక చెట్టు.

ఆరవము
సం., వి., అ., పుం., తత్స., = మృగధ్వని, నినదము, మ్రోఁత.
వ్యుత్పత్త్యర్థము :
రౌతీత్యారవః. శబ్దము చేయునది ఆరవము.

పర్యాయపదాలు :
శబ్దము, నినాదము, ధ్వని, ధ్వానము, రవము, స్వనము, స్వానము, నిర్ఘోషము, నిర్హ్రాదము, నాదము, నిస్వనము, నిస్వానము, ఆరావము, సంరావము, విరావము.


ఆరా
సం., వి.,ఆ., స్త్రీ., తత్స., = చెప్పులుకుట్టువానికత్తి, చర్మమును బొందునది, చర్మమును భేదించునది.

ఆరాగ్రము
సం., వి., అ., న., తత్స., = బాణాగ్రము, అర్థచంద్రాది అస్త్రముఖము.

ఆరాత్
సం., అవ్య., తత్స., = సమీపము, నికటము, దూరము, దగ్గర.

ఆరాత్రికము
సం., వి., అ., న., తత్స., = నీరాజనము, ఆరతి.

ఆరాధకుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆరాధించువాఁడు.

ఆరాధన
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= సాధన, సేవ, భక్తి, పరచర్య, ప్రసాదన, శుశ్రూష, ఉపాస్తి, వరివస్య, పరీష్టి, ఉపచారము.

ఆరాధనము
సం., వి., అ., న., తత్స.,= ఆరాధించుట, పూజ, సంతోషపెట్టుట, ప్రాప్తి, వంట, సిద్ధించుట, సంతోషించుట, పొందుట.
వ్యుత్పత్త్యర్థము :
ఆరాధః ఆరాధనం. ఆరాధించుట ఆరాధనము.


ఆరాధనీయము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆరాధింపఁదగినది.

ఆరాధించు
సం., స., క్రి.,= సంతోషపఱచు.

ఆరాధితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆరాధింపఁబడినది.

ఆరాధ్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆరాధింపఁదగినది.

ఆరామము
సం., వి., అ., పుం., తత్స.,= ఉపవనము, గృహము, కృత్రిమ వనము, తోట.(గృహారామము, నిష్కుటము.)
వ్యుత్పత్త్యర్థము :
ఆరమంత్యత్ర ఆరామః. ఇందుక్రీడింతురు.


ఆరాముఖము
సం., వి., అ., న., తత్స.,= బాణవిశేషము, ఆరెగోల.

ఆరాళికుఁడు
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= వంటవాఁడు, బానిసీఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆరాళం కుటిలం చరంతీతి ఆరాళికాః. కుటిలముగా సంచరించువారు.

పర్యాయపదాలు :
ఆంధసికుడు, సూపకారుడు, పాచకుడు, వల్లవుడు సూదుడు, ఔదనికుడు.


ఆరావము
సం., వి., అ., పుం., తత్స., = మృగధ్వని, ధ్వని, మ్రోఁత.
వ్యుత్పత్త్యర్థము :
రౌతీత్యారావః. శబ్దము చేయునది ఆరావము.

పర్యాయపదాలు :
శబ్దము, నినాదము, నినదము, ధ్వానము, రవము, స్వనము, స్వానము, నిర్ఘోషము, నిర్హ్రాదము, నాదము, నిస్వాదము, నిస్వనము, ఆరవము, సంరావము, విరావము.


ఆరుఁడు
సం., వి., అ., పుం., తత్స., = కుజుడు, కంచు, అంగారకుడు, శని.

ఆరురుక్షువు
సం., విణ., ఉ., తత్స., = ఎక్కనిచ్ఛగలవాఁడు, మోక్షమందిచ్ఛగలవాఁడు.

ఆరువు
సం., వి., ఉ., ఊ., పుం., తత్స., = చక్రవర్తికూర, కృష్ణ కపిలము.

ఆరూఢము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఎక్కినది, యవలు.

ఆరేకము
సం., వి., అ., పుం., తత్స., = శంక.

ఆరేవతము
సం., వి., అ., పుం., తత్స., = ఱేలచెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆరవతే ఉత్ ప్లుత్య గచ్ఛత్యనేన రోగ ఇత్యారేవతః. రోగము దీనిచేత నెగిరి పోవును.

పర్యాయపదాలు :
ఆరగ్వధము, రాజవృక్షము, శమ్యాకము, చతురంగులము, వ్యాధిఘాతము, కృతమాలము, సువర్ణకము.


ఆరోగ్యము
సం., వి., అ., న., తత్స., = ఆరోగభావము, అనామయము.
వ్యుత్పత్త్యర్థము :
అరోగస్య భావః ఆరోగ్యం. రోగము లేనివాని యొక్క భావము.


ఆరోపము
సం., వి., అ., పుం., తత్స., = ఆరోపించుట.(రూ. ఆరోపణము.)

ఆరోపించు
సం., స., క్రి., = లేనిది మోపు.

ఆరోపితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఆరోపింపఁబడినది, ఎక్కింపఁబడినది, మోపబడినవాడు, న్యస్తము, నిహితము, కృతారోపణము, కల్పితము.

ఆరోహకుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఎక్కెడు వాఁడు.

ఆరోహణము
సం., వి., అ., న., తత్స., = ఎక్కుట, నిచ్చెన, మొలక, మెట్లు, ఎదిరించుట, సోపానము, సమారోహము, ప్రరోహణము, దీనియందు ఎక్కినప్పుడు దిగునప్పుడు ఇంచుకంత వంగుదురు, అంకురాది జననము, క్రింది నుండి పైకి ఎక్కుట.
వ్యుత్పత్త్యర్థము :
ఆరోహంత్యనేనేత్యారోహణం. దీనిచేత ఉన్నత స్థానమును ఎక్కుదురు.


ఆరోహము
సం., వి., అ., పుం., తత్స.,= ఆరోహణము, ఉత్తమ స్త్రీ పిరుదు, నితంబము, కటి, సముచ్చయము, ఆయామము.
వ్యుత్పత్త్యర్థము :
ఆరుహ్యత ఇత్యారోహః. పొందఁబడునది.

నానార్థాలు :
ఎక్కుట, చెట్టు మొదట నుండి కొనకు ఎగఁప్రాకెడి తీఁగ, నిడుపు, పొడవు, దైర్ఘ్యము, ఆరోహణము, గజారోహము, పరిమాణవిశేషము, నిషాది, అవరోహణము, మావటీడు, నడుము.


ఆరోహుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= మావటి వాఁడు, గుఱ్ఱపురౌతు.

ఆర్జకుఁడు
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స.,= సంపాదించువాఁడు, గడించువాఁడు.

ఆర్జనము
సం., వి., అ., న., తత్స.,= సంపాదనము, గడన.

ఆర్జవము
సం., వి., అ., న., తత్స.,= ఋజుభావము, చక్కన.

ఆర్జించు
సం., స., క్రి.,= సంపాదించు, గడించు.

ఆర్జిక
సం., నా.వా., అ., పుం.,ఆ.,స్త్రీ., తత్స.,= భర్తృభార్యల సంబోధనము.

ఆర్జితము
సం., విణ.,(అ. అ. అ.)., తత్స.,= సంపాదింపఁబడినది, గడింపఁబడినది.

ఆర్తగళము
సం., వి., అ., పుం., తత్స., = నల్లగోరంట.
వ్యుత్పత్త్యర్థము :
ఆర్తః క్షీణస్సన్ గళతీతి ఆర్తగళః. క్షీణమైనదై జారునది.

పర్యాయపదాలు :
నీలి, గోరింట,ఝంటీ, ఎండినప్పుడు మ్రోయునది, దాసి(కాలవశమున క్షయించునది).


ఆర్తము
సం., విణ.,(అ. అ. అ.)., తత్స.,= దుఃఖమునొందినది.

ఆర్తవము
సం., వి., అ., న., తత్స.,= స్త్రీ ఋతువు, పుష్పము, రజస్సు, ఋతువునందుఁపుట్టినది. ; విణ. ఋతుసంబంధమైనది.

ఆర్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= దుఃఖము, వింటికొప్పు, ధనుష్కోటి.
వ్యుత్పత్త్యర్థము :
అర్తనం అర్ద్యతే అనయా ఆర్తిః. దీనిచేతఁ పీడింపబడును.

పర్యాయపదాలు :
పీడ, వేదన, వ్యథ, రోగము, దురదృష్టము, వింటికొన, బాధ.


ఆర్త్విజ్యము
సం., వి., అ., న., తత్స.,= ఋత్విజుని భావము.

ఆర్థి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= సదృశాదిశబ్దప్రయోగము గల పూర్ణోపమాభేదము.

ఆర్ద్ర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒక నక్షత్రము, తేమగలది, అల్లము. ; విణ. తడిసినది,
వ్యుత్పత్త్యర్థము :
అర్ద్యతే పీడ్యత ఇత్యార్ద్రం. విడువఁపడినది.

పర్యాయపదాలు :
సార్ద్రము, క్లిన్నము, తిమితము, స్తిమితము, సమున్నము, ఉత్తము, తడిచిన వస్తువు.


ఆర్ద్రకము
సం., వి., అ., న., తత్స., = శృంగబేరము, శార్ఘము, రాహుఛత్రము, అల్లము చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆర్ద్రాయం భవం ఆర్ద్రకం. ఆరుద్ర నక్షత్రమునందుపుట్టినది.

పర్యాయపదాలు :
కటుమూల విశేషము, కటుభద్రము, కటూత్కటము, గుల్మమూలము, మూలజము, కందరము, వరము, మహీజము, సైకతేష్టము, అనూపజము, అపాకశాకము, చాంద్రాఖ్యము, సుశాకకము, ఆర్ద్రశాకము, సచ్చాకము.


ఆర్ద్రాలుబ్ధకుడు
సం., వి., అ., పుం., తత్స., = కేతుగ్రహము.

ఆర్భటము
సం., వి., అ., పుం., తత్స., = మ్రోఁత.

ఆర్భటి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = మ్రోఁత.

ఆర్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= శ్రేష్ఠురాలు, పదుహారేండ్ల ప్రాయము కల ఆడుది, పార్వతి, ఛందోవిశేషము.
వ్యుత్పత్త్యర్థము :
శ్రేష్ఠత్వాదార్యా. శ్రేష్ఠత్వము వలన పూజనీయమైనది.

పర్యాయపదాలు :
ఉమ, కాత్యాయని, గౌరి, కాళి, హైమవతి, ఈశ్వరి, శివా, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, దుర్గ, మృడాని, చండిక, అంబిక, దాక్షాయణి, గిరిజ, మేనకాత్మజ.


ఆర్యకము
సం., వి., అ., న., తత్స., = పితృకార్యము, గయాశ్రాద్ధము.

ఆర్యపుత్రుఁడు
సం., వి., అ., పుం., తత్స., = (నాట్యపరిభాషయందు)పెనిమిటి, నాటకములోని భర్త.

ఆర్యావర్తము
సం., వి., అ., పుం., తత్స., = వింధ్యహిమాలయ మధ్య భాగము, వింధ్యమునకును హిమవంతమునకును మధ్యదేశము, పుణ్యభూమి.
వ్యుత్పత్త్యర్థము :
ఆర్యా ధార్మికావర్తంతే అస్మిన్నిత్యార్యావర్తః. ధార్మికులు దీనియందు వర్తింతురు.


ఆర్యుఁడు
సం., వి., అ., పుం., తత్స., = (నాట్యపరిభాషయందు)పెనిమిటి, కంచుకి, వైశ్యుడు, స్వామి, బుద్ధుడు, సుహృతుడు, యజ్ఞకర్త చేత ధనములచే వరింపదగిన ఆగ్నీధ్రుడు మొదలైన పదయర్వురు ఋత్విజులు యాజకులనంబడుదురు, శ్రేష్ఠవర్ణము, మ్లేచ్ఛేతరజాతి, సావర్ణమనువు పుత్రుడు, నాటకములోభర్త. ; విణ. పూజ్యుడు, మంచివాడు, సాధువు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆరాత్ పాపకర్మభ్యోయాతీత్యార్యః. పాపకర్మములకు దూరముగాఁ పోవువాడు. 2.అర్తుం ప్రకృతమాచరితుం యోగ్యః ఆర్యః.

పర్యాయపదాలు :
సౌవిదుడు, సత్కులోద్భవుడు, సంగతుడు, ధార్మికుడు, ధర్మశీలుడు, సౌవిదల్లుఁడు, మారిషుడు, సజ్జనుడు, శ్రేష్ఠుడు, మాన్యుడు, ఉదారచరితుడు, శాంతచిత్తుడు.


ఆర్షభము
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స., = వృషసంబంధమైనది, ఒక దీవి.

ఆర్షభి
సం., వి., ఈ., పుం., స్త్రీ., తత్స., = ఒక నక్షత్ర వీధి.

ఆర్షభ్యము
సం., వి., అ., పుం., తత్స.,= ఆఁబోతుగా విడువఁతగిన కోడె దూడ, ఒకదీవి, షండము, తోటపెద్దు.
వ్యుత్పత్త్యర్థము :
ఋషభస్య ప్రకృతిరార్షభ్యః. ఋషభమునకు కారణమైనది.


ఆర్షము
సం., వి., అ., పుం., తత్స.,= ధర్మార్థము వరుని వలన గోమిథునము పుచ్చుకొని కన్యక నిచ్చి యథాశాస్త్రముగాఁజేయు వివాహము. ; విణ. ఋషిది.

ఆలంబనము
వి.,= తాకడం, ఊత, ప్రాపు, వేలాడటం, ఆక్రమించడం.

ఆలంబము
సం., వి., అ., పుం., తత్స.,= ఊఁత, తాకుట, స్పర్శము, ఆలింగనము, అవలంబము.
వ్యుత్పత్త్యర్థము :
ఆలభనమాలంబః. ఆసరా ఇచ్చుట ఆలంబము

నానార్థాలు :
మరణము, వధము, కర్తనము, ఛేదనము, హింసిచుట,


ఆలంబించు
సం., స., క్రి.,= అవలంబించు, ఊఁదు.

ఆలంభము
సం., వి., అ., పుం., తత్స.,= ఛేదనము.
పర్యాయపదాలు :
కర్తనము, స్పర్శము, ఆలింగనము, కొల, హింసించుట, తాకుట, ప్రమాపణం, నిబర్హణం, నికారణం, నిశారణం, ప్రవాసనం, పరాసనం, నిషూదనం, నిహింసనం, నిర్వాపణం, సంజ్ఞపనం, నిర్గంధనం, అపాసనం, నిస్తర్హణం, నిహననం, క్షణనం, పరివర్జనం, నిర్వాసనం, విశసనం, మారణం, ప్రతిఘాతనము, ఉద్వాసనం, ప్రమథనం, క్రథనం, ఉజ్జాసనం, పింజము, విశరము, ఘాతము, ఉన్మాథము, వధ.


ఆలక్షించు
సం., స., క్రి., = కనుగొను, చూచు.

ఆలగంధిక
సం., నా.వా., ఈ., స్త్రీ., తత్స.,= ఒక ఉత్తమదాసి.

ఆలప్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= రాగాలాపము, ఆలతి.

ఆలము
సం., వి., అ., న., తత్స.,= గంధకపాషాణము, పింజరము, పీతనము, తాలము, హరితాళకము.

ఆలయము
సం., వి., అ., పుం., తత్స.,= గృహము, ఇల్లు.
వ్యుత్పత్త్యర్థము :
1.నిలీయంతే ఆలియతే జనోత్ర నిలయః ఆలయశ్చ. దీని యందు జనులు అణిఁగియుందురు. 2.ఆలీయంతే అస్మిన్ ఇత్యాలయః. దీని యందు జనులు నివసించెదరు.

పర్యాయపదాలు :
గేహము, ఉదవసితము, వేశ్మ, సద్మ, నికేతనం, నిశాంతం, వస్త్యము, సదనం, భవనం, ఆగారము, మందిరము, నికాయ్యము, నిలయము.


ఆలవాలము
సం., వి., అ., న., తత్స.,= ఆవాలము, తరువు మూలమును తడుపుటకు ఏర్పరచిన స్వల్ప జలాధారము, ఆవాపము, పాదు.
వ్యుత్పత్త్యర్థము :
ఆలూయతే ఖన్యత ఇత్యాలవాలం. ఆసరా ఇచ్చుటకు త్రవ్వఁబడునది.


ఆలస్యము
సం., వి., అ., న., తత్స.,= సోమరితనము, అలసము, తంద్ర, కౌసీద్యము, మందత, మాంద్యము, కార్యప్రద్వేషము, తుందపరిమృజము, శీతకము, అలసము, అనుష్ణము, జాగు. ; విణ. సోమరి. ; సం. వి. అ. పుం. నీరుపంది.
వ్యుత్పత్త్యర్థము :
1.నలసతీత్యలసః అలస ఏవాలస్యః. ప్రకాశించువాఁడు కాదు కనుక అలసుఁడు, అలసుఁడే ఆలస్యుడు. 2.అలసస్య భావః ఆలస్యమ్. అలసుని భావము ఆలస్యము.


ఆలస్యుడు
సం., వి., అ., పుం., తత్స.,= మందుడు, తుందపరిమృజుడు, శీతకుడు, అలసుడు, అనుష్ణుడు.

ఆలాజ్యము
సం., వి., అ., న., తత్స.,= ఇంధనము, వంటచెఱకు.

ఆలానము
సం., వి., అ., పుం., న., తత్స.,= త్రాడు, గజబంధనస్తంభము, స్తంభము, ఏనుగును కట్టు కంబము, రజ్జు, బంధనము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆలాలతే గజోస్మిన్నిత్యాలానం. దీనియందు ఏనుఁగును తెచ్చి కట్టఁబడును,. 2.ఆలీయతే అత్ర ఇత్యాలానమ్. దీనియందు బందించబడును.


ఆలానాపాలనా
వి.,= పోషణ-రక్షణ అనే అర్థంలో వాడే జంటపదం, సంరక్షణ.

ఆలాపన
వి.,= ఒకవిషయానికి సంబంధించి ఎడతెగని ఆలోచన, ధ్యాస, జ్వరంలోని పలవరింత, నిండుమాట.

ఆలాపము
సం., వి., అ., పుం., తత్స.,= నిండుమాట, ఆభాషణము, రాగాలాపము, సంభాషణము.
వ్యుత్పత్త్యర్థము :
ఆలాపనమాలాపః. లెస్సగాఁపలుకుట ఆలాపము.


ఆలాపించు
సం., స., క్రి.,= రాగముఁ దిన్నఁగా నీడ్చు.

ఆలాబువు
సం., వి., ఊ., స్త్రీ., తత్స.,= ఆలాబువు, సొరచెట్టు, ఆలాయము. ; వై. విణ. పాత్రము.

ఆలావర్తము
సం., వి., అ., న., తత్స.,= ఆలవట్టము, పంకా.

ఆలాస్యము
సం., వి., అ., పుం., తత్స.,= ఒకమొసలి.

ఆలి
సం., వి., ఇ., పుం., స్త్రీ., తత్స.,= తేలు, భ్రమరము, వరుస, సేతువు, సఖి, వృశ్చికము. ; త్రి. విశదాశయము, నిర్మలాంతఃకరణము, అనర్థము, పంక్తి, చెలికత్తె, వరుస, వయస్యా(వయస్సుచేత సమానమైనది), సఖి, సేతువు, సంతతి, వీథి, శ్రేణి, మడులు కట్టిన పొలము, సఖి, వయస్యా, సేతువు, పాలి, పంక్తి, శ్రేణి. ; పుం. వృశ్చికము.

ఆలింగనము
సం., వి., అ., న., తత్స.,= ఉపగూహనము, కవుఁగిలింత.
పర్యాయపదాలు :
కౌగిలింత, ప్రీతిపూర్వకముగా పరస్పరాశ్లేషము, అంగపాలి, శ్లిష, పరిరంభము, పరీరంభము, పరిష్వంగము, సంశ్లేషము.


ఆలింగితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = కవుఁగిలింపఁబడినది.

ఆలింగ్యము
సం., వి., అ., పుం., తత్స., = ప్రీతిపూర్వక పరస్పర ఆశ్లేషము, ఒకడోలు, ఊర్ధ్వకము, అంక్యము, మద్దెలభేదము, గోపుచ్ఛమువంటి ఆకారముగల మృదంగము. ; విణ. కౌగలింపతగినది.
వ్యుత్పత్త్యర్థము :
వాద్యమాన ఆలింగ్యత ఇత్యాలింగ్యః. వాయించు సమయమున ఆలింగనము చేయఁపడునది.


ఆలిందము
సం., వి., అ., పుం., తత్స.,= ఇంటిముందు డాబా.

ఆలీఢము
సం., వి., అ., న., తత్స.,= విలుకాఁడు కుడికాలు ముందటికి చాపి నిలుచుట, విలుకాని యుద్ధమప్పటి నిలుపు(ఇది పంచవిధము. ప్రత్యాలీఢము, ఆలీఢము, సమపదము, విశాఖము, మండలము.), ధానుఘ్కని భంగిమ. ; విణ. నాకబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ప్రత్యాలేఢి భుమమితి ప్రత్యాలీఢం, ఆలీఢం చ. భూమిని స్పృశించునది.


ఆలు
సం., వి., ఉ., పుం., తత్స.,= కత్తిపీట.

ఆలుక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= గిండిచెంబు.

ఆలుకము
సం., వి., అ., పుం., న., తత్స.,= గెనుసు, చేమ, పులుపుతక్కమిగిలిన రసములు కలది.

ఆలువు
సం., వి., ఉ., స్త్రీ., తత్స.,= గిండి. ; నపుం. గెనుసుగడ్డ, పడవ.

ఆలూ
సం., వి., ఊ., పుం., తత్స.,= ఆలుకము.

ఆలేఖనము
సం., వి., అ., న., తత్స.,= వ్రాయుట, చిత్తరువు వ్రాయుట.

ఆలేఖిని
వి., = కుంచె, కలము.

ఆలేఖ్యము
సం., వి., అ., న., తత్స.,= చిత్తరువు, చిత్రము, వ్రాఁత.

ఆలేఖ్యలేఖ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= చిత్రరచన, లిపి, చిత్రకర్మ, ప్రతిలిపి కరణము, జాబువ్రాయట.

ఆలేపము
సం., వి., అ., పుం., తత్స.,= పైపూత.

ఆలోకనము
సం., వి., అ., న., తత్స., = నిధ్యాసము, ఈక్షణము.
వ్యుత్పత్త్యర్థము :
ఆలోకః ఆలోకనం. చూచుట.

పర్యాయపదాలు :
నిర్వర్ణనము, నిధ్యానము, దర్శనము, ఆలోకము.


ఆలోకము
సం., వి., అ., పుం., తత్స., = వెలుగు, చూచుట, చూపు(రూ. ఆలోకనము.), ఎండ, ద్యోతము, దర్శనము, వంది భాషణము, స్తుతి, బట్టువాఁడు చేయు స్తోత్రము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆలోకనం ఆలోకః. చూచుట. 2.ఆలోక్యతేనేనేతి చ ఆలోకః. చూడఁబడుటయు.


ఆలోకించు
సం., స., క్రి., = వీక్షించు, చూచు.

ఆలోకితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = చూడఁబడినది.

ఆలోచన
సం., వి., ఆ., స్త్రీ., అ., న., తత్స., = యోచన.

ఆలోచించు
సం., స., క్రి., = యోచించు, ఏకతమాడు.

ఆలోడనము
సం., వి., అ., న., తత్స., = కలఁత.

ఆలోడించు
సం., స., క్రి., = కలఁచు.

ఆలోడితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = కలఁచఁబడినది.

ఆళి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= చెలికత్తె, పంక్తి, అడ్డకట్ట, వరుస, సేతువు, సఖి. ; న్. పుం. తేలు. ; విణ. ఇ. నిర్మలమయిన మనసుగలది.
వ్యుత్పత్త్యర్థము :
1.అల్యతే నివార్యతే జలమనయేత్యాళిః. దీనిచేత జలము నిలుపఁబడును, 2.అలతీ భూషయతీత్వాళిః. అలంకరించునది. 3.అలతి అనురూపసంబంధినీవ భూషయతి ఆళిః. అనురూపసంబంధిని వలె భూషించునది.


ఆళిందము
సం., వి., అ., పుం., తత్స., = అళిందము.

ఆవంత్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఒక సంకరజాతి, సైనికాధికారి.

ఆవగించు
స., క్రి., = కూరలకు ఆవపిండిపెట్టు, మాంసం మొదలైనవి చెడిపోకుండా ఉప్పు, పసుపు రుద్ది భద్రపరచు.

ఆవతారికము
సం., నా.వా., అ., పుం., తత్స.,= ఒక చేప.

ఆవపనము
సం., వి., అ., న., తత్స.,= కాఁగుగంప మొదలైన పాత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ ఉపత్యతే న్యస్యతే ధాన్యాదిక మత్రేతి ఆవపనం. ధాన్యాదివస్తువులు దీనియందు పెట్టఁబడును.

పర్యాయపదాలు :
కడవ, గంప, గోనె, పాత్రము, భాండము, ఆమత్రము.


ఆవరణము
సం., వి., అ., న., తత్స.,= ఆచ్ఛాదనము, ఫలకము, మూఁత. (సప్తావరణములు. పృథివ్యప్తేజోవాయ్వాకాశాహంకారమహత్తత్త్వములు. ప్రకృతితోడఁగూడ అష్టావరణములగు.)

ఆవరణశాస్త్రము
వి.,= జీవరాశులకూ వాటి పరిసరాలకూ మధ్య ఉండే పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం.

ఆవరించు
సం., స., క్రి.,= చుట్టుకొను.

ఆవర్జనము
సం., వి., అ., న., తత్స.,= ఆకర్షణము, ద్రవమును పారబోయట.

ఆవర్తనము
సం., వి., అ., న., తత్స.,= దారముచుట్టుట, పాఠము యొక్క వల్లె, కషాయము తీయుట. సుడి, చిలకడం, తిప్పడం.

ఆవర్తనీయము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= మరలఁదగినది, వల్లింపఁదగినది.

ఆవర్తము
సం., వి., అ., పుం., తత్స.,= గుర్రపు సుడి, నీటి సుడి, జలభ్రమణము, చింత, మరలుట, ఆవర్తనము, పాఠము యొక్క వల్లె.
వ్యుత్పత్త్యర్థము :
ఆవర్తతే చక్రవద్భ్రాద్యుతీత్యావర్తః. చక్రము వలె తిరుగునది.


ఆవర్తించు
సం., స., క్రి.,= పాఠమును వల్లించు.

ఆవర్తితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= మరలినది, వల్లింపఁబడినది.

ఆవర్హితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఉన్మూలితము, ఉత్పాటితము.

ఆవళి(లి)
సం., వి., ఇ., ఈ., స్త్రీ., తత్స., = శ్రేణి, ఉపద్రవము, వీథి, ఆళి, వరుస, శ్రేణీ, పంక్తి.
వ్యుత్పత్త్యర్థము :
ఆవలతే సంవృణోతీత్యావలిః. చుట్టుపారియుండునది.


ఆవశ్యకము
సం., వి., అ., న., తత్స.,= అక్కఱ, ; విణ. అక్కఱైనది.

ఆవసథము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఇల్లు, ఆర్యాకోషము, ఆర్యాఛందస్సు గ్రంథభేదము, వ్రతవిశేషము. ; నపుం. విశ్రామస్థానము, అగ్నిగృహము, అగ్నిహోత్రస్థానము, గృహము, వసతిస్థానము.

ఆవసథ్యము
సం., నా. వా., అ., పుం., తత్స.,= తూర్పున ఉండు యాగాగ్ని, మఠము.

ఆవసము
సం., నా.వా., అ., పుం., తత్స.,= జీవాత్మ.

ఆవసితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= నూర్చినది, ఋద్ధము, నిలువచేయబడినది, ధాన్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఆవస్యత ఇతి ఆవసితం. రక్షణార్థమై కప్పఁబడునది.


ఆవహము
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స.,= కలిగించునది, పెద్దమడుగు.

ఆవహించు
క్రి.,= కలిగించు, చేదు, ఆవాహన చేయు, సోకు, ఆవేశించు, రప్పించు, ధరించు.

ఆవహిల్లు
సం., అ., క్రి.,= కలుగు.(ప్రే. ఆవహించు.)

ఆవాపకము
సం., వి., అ., పుం., తత్స.,= ఆఁడుదానిచేతి మట్టిగాజు, సూడిగము, కటకము, వలయము, పారిహార్యము.

ఆవాపము
సం., వి., అ., పుం., తత్స.,= పాదు, విత్తుట, ఆలవాలము, ఆవాలము, ఆవము, పరరాష్ట్రచింతన (స్వరాష్ట్రచింతన తంత్రమనఁబడును.), శత్రుచింతనము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆసమంతాదుప్యతే న్యస్యతే జలమత్ర ఆవాపః. దీనియందు నీళ్ళు అంతట నిలుపఁబడును. 2.ఆవపంతి సలిలమత్ర ఆవాపః. ఇచ్చట నీటిని నిలుపుదురు.

నానార్థాలు :
వలయము, పానభేదము, భాండవపనము, పరిక్షేపము, నిమ్నోన్నతభూమి, ప్రధానహోమము, ఉంచుట.


ఆవాయకము
సం., వి., అ., పుం., తత్స.,= ఆవాపకము.

ఆవాలము
సం., వి., అ., న., తత్స., = ఆలవాలము, బాలకులందరు, బాలకుల పర్యంతము, ఆవాపము, పాదు.
వ్యుత్పత్త్యర్థము :
ఆవలతే జలమత్రేత్యావాలం. ఉదకము దీనియందుఁకొంచెము కదులుచుండును.


ఆవాలి
సం., నా.వా., ఇ., స్త్రీ., తత్స., = అంగడివీధి.

ఆవాసము
సం., వి., అ., పుం., తత్స., = సదనము, ఇల్లు, గృహము.

ఆవాహనము
సం., వి., అ., పుం., తత్స., =ఆహ్వానము, ఇల్లు.

ఆవాహితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ఆహ్వానము, ఇల్లు.

ఆవిః
సం., అవ్య., తత్స.,= సృష్టముగా.

ఆవికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = కంబళి, గొఱ్ఱె వెంట్రుకలతో చేసినది, కంబలము, ఆవిదుగ్ధము.

ఆవిగ్నము
సం., వి., అ., పుం., తత్స.,= కలివి చెట్టు, కృష్ణపాకఫలము, సుషేణకము, కరమర్దకము. ; విణ. ఆవేగము నొందినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆవిజతే అస్మాదితి ఆవిగ్నః . దీనివలన రోగి భయపడును.


ఆవిద్ధము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= వంకరయినది, మూర్ఖము, త్రోయపడినది, వక్రము, క్షిప్తము, పరాహతము, కొట్టఁబడునది.
వ్యుత్పత్త్యర్థము :
ఆవిద్ధ్యత ఇతి ఆవిద్ధం. చక్కఁగా తొలువఁబడినది ఆవిద్ధము.

పర్యాయపదాలు :
ఆరాళము, వృజినము, జిహ్మము, ఊర్మిమతము, కుంచితము, నతము, కుటిలం, భుగ్నము, వేల్లితము.


ఆవిధము
సం., వి., అ., పుం., తత్స.,= తొలిచెడు సాధనము, రత్నములకు బెజ్జము వేయు వజ్రపుపోగరు, పోగారు.
వ్యుత్పత్త్యర్థము :
ఆవిద్యతే అనేనేత్యావిధః. దీనిచేత తొలువఁబడును.


ఆవిర్భవించు
సం., అ., క్రి.,= ప్రభవించు, పుట్టు.

ఆవిర్భావము
సం., వి., అ., పుం., తత్స.,= ప్రభవము, పుట్టుక.

ఆవిర్భూతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ప్రభూతము, పుట్టినది.

ఆవిలము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= కుళ్లునీరు కలఁగినదానిది, కలఁకబారినది, అనచ్ఛము, కలుషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ బిల్యత ఇత్యావిలః. అంతటా చేధింపబడునది.


ఆవిశము
సం., నా.వా., అ., పుం., తత్స.,= జీవాత్మ.

ఆవిష్కరణము
సం., వి., అ., న., తత్స.,= ప్రకటనము, వెల్లడి.

ఆవిష్కరించు
సం., స., క్రి.,= ప్రకటించు, వెలయించు.

ఆవిష్కృతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ప్రకటింపబడినది, వెలయింపబడినది.

ఆవిష్కృతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఆవిష్కరణము.

ఆవిష్క్రియ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఆవిష్కరణము.

ఆవిష్టము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆవేశము కొన్నది, చొచ్చినది.

ఆవిస్
సం., అవ్య., తత్స.,= ప్రకాశము, ప్రకటమవును అను అర్థమునందు వర్తించును.

ఆవుకుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= (నాట్యపరిభాషయందు)తండ్రి, జనకుడు.
వ్యుత్పత్త్యర్థము :
1.అపతీత్యావుతః. రక్షించువాఁడు,. 2.అవతి రక్షతీతి ఆవుకః.


ఆవుత్తుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= (నాట్యపరిభాషయందు)బావ, భగినీపతి, నాటకములో బావ.
వ్యుత్పత్త్యర్థము :
అవతి భగినీమిత్యావుత్తః. తోఁబుట్టువును ఏలువాఁడు. తోడఁపుట్టినదానిమగడు.


ఆవురావురను
అ., క్రి.,= తొందరపడు, ఆశపడు, అదే పనిగా కోరు.

ఆవృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= వలయితము, వేష్టితము, సంవీతము, రుద్ధము, చుట్టుకొనఁబడినది, ఒక సంకరజాతి, గజాధికారి చుట్టు వారు కొనబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఆప్రియతే స్మ ఆవృతమ్. కప్పఁపడినది.
తిరుగుడుపడినది, క్రమము, విధి.

ఆవృత్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= తడవ, తిరుగుడు, వల్లె.

ఆవృత్తు
సం., వి., త్., స్త్రీ., న., తత్స.,= అనుక్రమము.
వ్యుత్పత్త్యర్థము :
ఆవర్తనమావృత్. ఆవర్తనము ఆవృత్తు.

పర్యాయపదాలు :
ఆనుపూర్వి, సొరిది, క్రమము, విధి, పరిపాటి, పర్యాయము.


ఆవేగము
సం., వి., అ., పుం., తత్స., = ఇష్టానిష్టప్రాప్తిచేఁ గలుగు తొట్రుపాటు, తొందర.

ఆవేగి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = బొద్దికూర (ఒక దినుసు కూరాకు), ఋక్షగంధ, ఛగలాండి, వృద్ధదారకము, జుంగము.
వ్యుత్పత్త్యర్థము :
ధాతువృద్ధికరత్వాత్ ఆవేగోస్య ఇతి ఆవేగీ. ధాతువృద్ధికరమై ఆవేగమును చేయునది.


ఆవేదకుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= తెలిపెడువాఁడు.

ఆవేదన
వి.,= బాధ, వ్యథ, విచారం, తెలియజేయడం.

ఆవేదనము
సం., వి., అ., న., తత్స.,= తెలుపుట.

ఆవేదించు
సం., స., క్రి.,= తెలుపుట.

ఆవేదితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= తెలుపఁబడినది.

ఆవేశకావేషాలు
వి., బహు., = కోపోద్రేకాలు.

ఆవేశనము
సం., వి., అ., న., తత్స., = కంసాలి కొట్టము, పట్టడ, స్వర్ణకారాది శిల్పుల యొక్క శాల, ప్రవేశము, ఒళ్లెరుఁగమి, కోపము, పరివేశము, శిల్పిశాల.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆవిశంతి కర్మకారాయతారోత్ర అవేశనం. దీనియందు పనులు చేయించువారు ప్రవేశింతురు. 2.ఆవిశ్యతే అస్మిన్ ఇతి ఆవేశనమ్. దీనియందు ప్రవేశించుటవలన ఆవేశనము.


ఆవేశము
సం., వి., అ., పుం., తత్స., = ఒళ్లెఱుఁగమి, సుమాళము, అహంకారవిశేషము, సంరభము, ఆటోపము, అపస్మార రోగము, భూతాది రోగము, భూతసంచారము, భూతక్రాంతి, గ్రహామయము, ఆసక్తి, అభినివేశము, వేగిరపాటు.

ఆవేశించు
సం., అ., క్రి., = ప్రవేశించు, చొచ్చు.

ఆవేశికుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= అతిథి, విందు, ఆగంతువు, స్వీయుడు, అన్యాసాధారణము, ప్రాతిష్టితము, గృహమునకు వచ్చినవాడు, అసాధారణము.
వ్యుత్పత్త్యర్థము :
1.అవేశాత్ స్వగృహాత్ ఆగతః ఆవేశికః. తన ఇంటి నుండి వచ్చినవాఁడు. 2.ఆవేశం సంరంభం ప్రాప్తః ఆవేశికః. ఆవేశమును వేగిరపాటును పొందినవాడు.


ఆవేష్టకము
సం., వి., అ., పుం., తత్స., = ముండ్లకంచె, ప్రాచీరము మొదలైనవి.

ఆశ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= అత్యాశ, తృష్ణ, దిక్కు, దిశ, కకుభము, ఆకాశము, కాష్ఠము, హరితము, తాః . ; అ. పుం. ము. వ్యాప్తి, అగ్ని.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆసమంతాత్ అశ్నువత ఇత్యాశాః. వ్యాపించియుండునవి. 2.అశ్నుత ఇత్యాశా. వ్యాపించునది.

ప్రకృతి - వికృతి :
ఆస


ఆశంక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= సందేహము, భయము, త్రాసము, సంశయము, వితర్కము.

ఆశంస
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఇచ్ఛ, ఆకాంక్ష.

ఆశంసనము
సం., వి., అ., న., తత్స.,= కోరుట.

ఆశంసా
సం., నా.వా., ఋ., పుం., తత్స.,= కోరువాడు.

ఆశంసిత
సం., విణ.,(ఋ. ఈ. ఋ.)., తత్స.,= కోరువాఁడు, ఆశంసువు.

ఆశంసితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= కోరఁబడినది.

ఆశంసువు
సం., విణ., ఉ., తత్స.,= ఆశంసిత, తనకు లేని వస్తువును కావలయునని కోరువాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆశంసతి తాచ్ఛీల్యేనేతి ఆశంసుః. స్వభావమును ప్రార్థించువాఁడు,.


ఆశపడు
మి., అ., క్రి.,= అపేక్షపడు.

ఆశయము
సం., వి., అ., పుం., తత్స.,= అభిప్రాయము, చేతము, ఉద్దేశము,
వ్యుత్పత్త్యర్థము :
ఆశేరతే అర్థా అస్మిన్నిత్యాశయః. దీనియందు అర్థములుండును.

నానార్థాలు :
ఆధారము, మనస్సు, పనసవృక్షము, ఛందము, విభవము, కింపచానము, ధర్మాధర్మములు, అజీర్ణము, కోష్ఠాగారము, అదృష్టం, వాతాశయము, పిత్తాశయము, శ్లేష్మాశయము, రక్తాశయము, ఆమాశయము, పక్వాశయము, మూత్రాశయము అని ఆశయములు ఏడు విధములు, ఇవి కాక స్త్రీలకు గర్భాశయము అనునది ఎనిమిదవది, లోభి, కోట, చల్లపడినది.


ఆశయిత
సం., విణ.,(ఋ. ఈ. ఋ.)., తత్స.,= తినిపించువాఁడు.

ఆశరుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= అగ్ని, రాక్షసుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
అశృణాతి హింసంతీత్యాశరః. హింసించువాఁడు.

పర్యాయపదాలు :
కౌణపుడు, క్రవ్యాత్తుడు, వ్యాధుడు, అశ్రపుడు, ఆశరుడు, రాత్రించరుడు, రాత్రిచరుడు, కర్బురుడు, నికషాత్మజుడు, యాతుధానుడు, పుణ్యజనుడు, నైరృతుడు, రక్షుడు.


ఆశాజనకము
వి.,= భవిష్యత్తు సంతృప్తికరముగా ఉంటుందని నమ్మకం కలిగించేది.

ఆశాన్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆశీర్వదింపదగినది, ప్రార్థింపదగినది.

ఆశాబంధము
సం., వి., అ., పుం., తత్స.,= ఊఱట, సాలెపట్టు, తృష్ణాబంధము, సాలెపురుగు గూడు.

ఆశాభంగము
వి.,= అనుకొన్నది నెఱవేరకపోవటం.

ఆశాభావము
వి.,= మంచి జరుగుతుందనే తలపు.

ఆశావాది
వి.,= అనుకొన్నది జరుగుతుందనే నమ్మకంతో ఉండే వ్యక్తి.

ఆశాసనము
సం., వి., అ., పుం., తత్స.,= ఆశీర్వాదము, యాచన.

ఆశాసించు
సం., స., క్రి.,= ఆశీర్వదించు.

ఆశాస్తి
వి.,= ఇచ్ఛ, కోరిక.

ఆశి
సం., విణ., (న్. ఈ. న్.)., తత్స., = పాముకోర, దీవన, కోరిక. పాము యొక్క కోర, హితాశంసనము, సర్పవిషము.

ఆశించు
సం., స., క్రి., = ఆపేక్షించు, ఆసించు.

ఆశితంభవము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స., = తృప్తి, ఆహారము.

ఆశితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఆవులు ముందున్న స్థలం, అంతకుముందు ఆవులను మేపినది(పొలము.), గవీనము, తినఁబడినది.
వ్యుత్పత్త్యర్థము :
గావ ఆశితా అస్మిన్నితి ఆశితం. ఆవులు దీనియందు అంతకుముందు మేఁపబడెను.


ఆశిరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పాలతో చేసిన భక్ష్యము, ఆహారము, అగ్ని, సూర్యుడు.

ఆశిష్షు
సం., వి., స్., స్త్రీ., తత్స.,= ఇచ్ఛయించుటయు, హింసించుటయు.

ఆశీర్వచనము
వి.,= దీవన, ఆశీర్వాదము.

ఆశీర్వదించు
సం., స., క్రి.,= దీవించు.

ఆశీర్వాదము
సం., వి., అ., పుం., తత్స.,= దీవన.

ఆశీవిషము
సం., వి., అ., పుం., తత్స.,= పాము, సర్పము, నాగము, ఉరగము, ఆశీషి.
వ్యుత్పత్త్యర్థము :
ఆశీషి దంష్ట్రాయాం విషమస్య అస్తీత్యాశీవిషః. కోరయందు విషము కలది.

పర్యాయపదాలు :
పృదాకువు, భుజగము, భుజంగము, అహి, భుజంగమము, విషధరము, చక్రి, వ్యాళము, సరీసృపము, కుండలి, గూఢపాత్తు, చక్షుశ్రవము, కాకోదరము, ఫణి, దర్వీకరము, దీర్ఘపృష్ఠము, దంతశూకము, బిలేశయము, ఉరగము, పన్నగము, భోగి, జిహ్మగము, పవనాశనము.


ఆశీస్సు
సం., వి., స్., స్త్రీ., తత్స.,= హితము కోరుట, పాము యొక్క కోఱ, ఆశీర్వాదము, సర్పదంతము, వృద్ధి అను పేరు గల ఔషధి, హితప్రార్థనము, ఆభీష్టవృద్ధి ప్రార్థనము, ఇచ్ఛయించుటయు, హింసించుటయు.

ఆశుకవిత్వము
వి.,= అప్పటికప్పుడు చెప్పే కవిత్వం.

ఆశుగము
సం., వి., అ., పుం., తత్స.,= బాణము, సూర్యుడు, గాలి, పృషత్కము, విశిఖ, అజిహ్మగము, ఖగము, కలంబము, మార్గణము, శరము, పత్రీరోపము, ఇషువు.
వ్యుత్పత్త్యర్థము :
ఆశు గచ్ఛతీత్యాశుగః. శీఘ్రముగాఁపోయెడిది.

పర్యాయపదాలు :
శ్వసనము, స్పర్శనము, వాయువు, మాతరిశ్వానము, సదాగతము, పృషదశ్వము, గంధవహము, గంధవాహనము, అనిలము, సమీరము, మారుతము, మరుత్తు, జగత్ప్రాణము, సమీరణము, నభస్వతము, ద్వాతము, పవనము, పవమానము, ప్రభంజనము, ప్రకంపనము, అతిబలము, ఝంఝావాతము, వృష్టికము.


ఆశువు
సం., వి., ఉ., పుం., తత్స.,= తొందర, ఎర్రజిలమవడ్లు, నగలకుఉపయోగించు బంగారము, వ్రీహి, పాటలము, వేగిరముగా వండఁబడునది. ; విణ. న. వేగ, శీఘ్రము, ద్రుతము. ; విణ. వేగముగలది.
వ్యుత్పత్త్యర్థము :
1.అశ్నుతే అనేనేత్యాశుః. దీనిచేత వ్యాపింతురు. 2.ఆశుపచ్యత ఇత్యాశుః. వేగిరముగా పండఁబడునది.

పర్యాయపదాలు :
త్వరితము, లఘువు, క్షిప్రము, అరము, సత్వరము, చపలం, తూర్ణము, అవిలంబితము.


ఆశుశుక్షణి
సం., వి., ఇ., పుం., తత్స.,= అగ్ని, వహ్ని, సూర్యుడు, నిప్పు, వాయువు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆశు శోషయితుమిచ్ఛతీత్యాశుశుక్షణిః. త్వరగా శోషింపఁచేయనిచ్ఛయించువాడు. 2.ఆసమంతాత్ శోష్టుమిచ్ఛతీతి ఆశుశుక్షణిః.

పర్యాయపదాలు :
వైశ్వానరుడు, వీతిహోత్రుడు, ధనంజయుడు, కృపీటయోని, జ్వలనుడు, జాతవేదుడు, తనూనపాత్తు, బర్హిశ్శుష్ముడు, కృష్ణవర్త్మ, శోచిష్కేశుడు, ఉషర్బుధుడు, ఆశ్రయాశుడు, బృహద్భానుడు, కృశానుడు, పావకుడు, అనలుడు, లోహితాశ్వుడు, వాయుసఖి, శిఖావుడు, హిరణ్యరేతుడు, హుతభుక్కు, దహనుడు, హవ్యవాహనుడు, సప్తార్చి, దమునుడు, శుక్రుడు, చిత్రభానుడు, విభావసువు, అప్పిత్తము.


ఆశోచని
సం., నా.వా., ఇ., పుం., తత్స., = అగ్ని, చంద్రుడు(వైజయంతీ నిఘంటువు)

ఆశౌచము
సం., వి., అ., న., తత్స., = ఆశుచిత్వము, అంటు.

ఆశ్చర్యము
సం., వి., అ., న., తత్స., = అపూర్వము, విస్మయము, అద్భుతము, చిత్రము. ; విణ. అచ్చెరువైనది.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాచ్ఛరితుం ఆశ్వాదితుం యోగ్యం ఆశ్చర్యం. ఆస్వాదించుటకు యోగ్యమైనది.

ప్రకృతి - వికృతి :
అచ్చెరువు.


ఆశ్చర్యార్థకము
వి., = ఆశ్చర్యమును కలిగించు మాట, ఆశ్చర్యాన్ని సూచించే గుర్తు(!)

ఆశ్రమపాఠశాల
వి., = విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించి విద్యను బోధించే ఆధునిక పాఠశాల.

ఆశ్రమము
సం., వి., అ., పుం., న., తత్స., = మునుల వాసస్థానము, మునికుటీరము, వనము, శాస్త్రోక్త ధర్మవిశేషము, అడవి.
వ్యుత్పత్త్యర్థము :
ఆశ్రామంత్యస్మిన్నితి ఆశ్రమః దీనియందు తపోయుక్తులగుదురు.

పర్యాయపదాలు :
పర్ణశాల, బ్రహ్మచర్యాదులు నాలుగు ఆశ్రమములు (1.బ్రహ్మచర్యము, 2.గృహస్థం, 3. వానప్రస్థం, 4. సన్న్యాసం), మఠము.


ఆశ్రయము
సం., వి., అ., పుం., తత్స., = అండ, ఇల్లు, విషయము, వ్యపదేశము, సామీప్యము, ఆధారము, సంశ్రయణము, అవలంబనము, రాజు నిర్ణయము, గృహము, బలవంతులనుఆశ్రయించుట(సంధ్యాధి ఇవి యాఱు - సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధము, ఆశ్రయము.), ఒక రాజగుణము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ శ్రయతే ఇత్యాశ్రయః. ఆశ్రయింపఁపడునది.


ఆశ్రయాశుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= అగ్ని, చిత్రకవృక్షము, ఆశ్రయనాశకుడు, ఆశ్రయధ్వంసుడు. ; విణ. ప్రాపుచెరచువాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆశ్రయమశ్నాతీత్యాశ్రయః. ఆశ్రయమునే భక్షించువాడు.

పర్యాయపదాలు :
వైశ్వానరుడు, వహ్ని, వీతిహోత్రుడు, ధనుంజయుడు, కృపీటయోని, జ్వలనుడు, జాతవేదుడు, తనూనపాత్తు, బర్హిశ్శుష్మ, కృష్ణవర్త్మ, శోచిష్కేశుడు, ఉషర్బుధుడు, బృహద్భానుడు, కృశానుడు, పావకుడు, అనలుడు, లోహితాశ్వుడు, వాయుసఖుడు, శిఖావానుడు, ఆశుశుక్షణి, హిరణ్యరేతుడు, హుతభుక్కు, దహనుడు, హవ్యవాహనుడు, సప్తార్చి, దమునుడు, శుక్రుడు, చిత్రభానుడు, విభావసుడు, శుచి, అప్పిత్తము.


ఆశ్రయించు
సం., స., క్రి., = ఆశ్రయము చేయు, అండగొను.

ఆశ్రవము
సం., వి., అ., పుం., తత్స.,= అంగీకారము, కోపము, క్లేశము, పిర్యాదు.
వ్యుత్పత్త్యర్థము :
ఆశ్రవణమాశ్రవః. ఔనని వినుట ఆశ్రవము.

పర్యాయపదాలు :
సంవిత్తు, ఆగువు, ప్రతిజ్ఞానము, నియమము, సంశ్రవము, అభ్యుపగమము, ప్రతిశ్రవము, సమాధి.


ఆశ్రవుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= మాటదాటనివాడు, వినయము గలవాడు.(అని కొందరు.), చెప్పినమాటయందుండువాడు.

ఆశ్రి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= కత్తివాదర.

ఆశ్రితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆశ్రయింపబడినది.

ఆశ్రుతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఆశ్రయింపబడినది, అంగీకృతము, ఆకర్ణితము, సమాహితము.
వ్యుత్పత్త్యర్థము :
ఆశ్రూయతేస్మ ఆశ్రుతం. అంగీకరింపఁపడినది ఆశ్రుతము.

పర్యాయపదాలు :
ఉరీకృతము, ఉరరీకృతము, ప్రతిజ్ఞాతము, సంగీర్ణము, విదితము, సంశ్రుతము, సమాహితము, ఉపశ్రుతము, ఉపగతము.


ఆశ్లిష్టము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఆలింగితము, కవుఁగిలింపఁబడినది.

ఆశ్లేష
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఒకనక్షత్రము, ఆశ్లేషానక్షత్రము.

ఆశ్లేషము
సం., వి., అ., పుం., తత్స.,= ఆలింగనము, ఏకదేశసంబంధము, కౌగిలింత, ఒక నక్షత్రవిశేషము.

ఆశ్లేషించు
సం., స., క్రి.,= కవుఁగిలించు.

ఆశ్వకిని
సం., నా.వా., ఇ., స్త్రీ., తత్స.,= అశ్విని.

ఆశ్వత్థము
సం., వి., అ., న., తత్స.,= రావిపండు.
వ్యుత్పత్త్యర్థము :
అశ్వత్థస్య ఫలం ఆశ్వత్థం. అశ్వత్థవృక్షము యొక్క పండు.


ఆశ్వము
సం., వి., అ., న., తత్స., = గుర్రముల గుంపు, గుర్రపు మూక, ఆశ్వీయము.
వ్యుత్పత్త్యర్థము :
అశ్వానాం సమూహః ఆశ్వీయం, ఆశ్వం చ. అశ్వముల సమూహము.


ఆశ్వయుజము
సం., వి., అ., పుం., తత్స.,= ఒక నెల, ఒకమాసము, ఆశ్వినము, ఇషము.
వ్యుత్పత్త్యర్థము :
అశ్విన్యేవ అశ్వయుక్ తద్యుక్తా పూర్ణిమాస్మిన్నస్తీతి ఆశ్వయుజః. అశ్వినియే అశ్వయుక్కు, దానితోఁకూడిన పున్నమి దీనియందు కలదు.


ఆశ్వసించు
సం., స., క్రి., = ఆశ్వసించు, ఊఱడించు.

ఆశ్వసితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఊఱడింపఁబడినది.

ఆశ్వాసము
సం., వి., అ., పుం., తత్స.,= ఊఱట, ఆఖ్యాయికపరిచ్ఛేదము, పరిచ్ఛేదము.

ఆశ్వాసించు
సం., స., క్రి., = ఆశ్వసించు.

ఆశ్వాసితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఆశ్వసితము.

ఆశ్వికుఁడు
సం., వి., అ., పుం., తత్స., = గుఱ్ఱపురౌతు, ఆశ్వయుజ మాసము, గుర్రపువర్తకుడు.

ఆశ్వినము
సం., వి., అ., పుం., తత్స., = అశ్వినీదేవతలు, ఇషము, ఆశ్వయుజమాసం.
వ్యుత్పత్త్యర్థము :
అశ్వినీ నక్షత్రయుక్త పూర్ణిమాస్మిన్నితి ఆశ్విని. నక్షత్రముతోఁకూడిన పున్నమి దీనియందుఁకలదు.


ఆశ్విని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఆశ్వయుజపౌర్ణమి.

ఆశ్వినేయులు
సం., వి., అ., పుం., ద్వి.,= అశ్వులు, అశ్వినీ దేవతలు.
వ్యుత్పత్త్యర్థము :
అశ్విన్యా అపత్యౌ ఆశ్వినేయౌ. అశ్వినీదేవి కొడుకులు ఆశ్వినేయులు.

పర్యాయపదాలు :
స్వర్గవైద్యులు, అశ్వినీసుతులు, నాసత్యులు, దస్రులు, అశ్విన్యులు.


ఆశ్వీనము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= గుఱ్ఱము ఒక దినము నడవఁదగినది, (త్రోవ)గుర్రపుప్రయాణము, గుర్రముచేత నొకదినంబునఁబోదగిన త్రోవ.

ఆశ్వీయము
సం., వి., అ., న., తత్స., = ఆశ్వము, గుర్రముల గుంపు, గుర్రపు మూక.

ఆషాఢభూతి
వి.,= మోసగాడు, వంచకుడు.

ఆషాఢము
సం., వి., అ., పుం., తత్స.,= ఆషాఢమాసము, ఒక మాసము, రవి మిథునరాశియందు ఉండు కాలము, ఆషాఢకము, ఒకనెల.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆషాఢ నక్షత్రయుక్తా పూర్ణిమాస్మిన్నిత్యాషాఢః. ఆషాఢ నక్షత్రముతోఁకూడిన పున్నమి దీనియందుఁకలదు,. 2.ఆషాఢాసు జాతః ఆషాఢః. పూర్వాషాఢాది నక్షత్రములయందగునట్టిది.

నానార్థాలు :
వ్రతుల దండము, శుచి, పాలాశదండము, బ్రహ్మచర్యాది వ్రతమందుఁపట్టు మోదుగుకోల, మలయ పర్వతము.


ఆషాఢి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఆషాఢ పౌర్ణమి.

ఆషామాషీ
వి.,= సామాన్యమైంది, విశేషం లేనిది, కులాసా కబుర్లు. ; అవ్య. సరదాగా, తేలికగా, నిర్లక్ష్యంగా.

ఆష్ఠీవనము
వి.,= ఉమ్మివేయడం.

ఆస
సం., వి., అ., పుం., తత్స.,= విల్లు, వగరు, తీపికలిపినది.

ఆసంగము
సం., వి., అ., పుం., తత్స.,= ఆశ్రయము, ఆసక్తి, ఒక ద్వీపము, కత్తి.

ఆసంది
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = చిన్నశంఖము, క్షుద్రఖట్వా, వేత్రాసనము, పేమున జేసిన చెక్కకట్టడము.

ఆసక్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = అపేక్ష, ఆస.

ఆసక్తుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఆసగొన్నవాఁడు, చీకటి, తత్పరుడు, ప్రసితుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇష్టవస్తుని ఆసజతీత్యాసక్తః. ఇష్టవస్తువులందు ఆసక్తి కలిగినవాడు.


ఆసన
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= కూర్చుండుట, ఉనికి, ఆస్య, స్థితి. ; అ. న. ము. పీఁట, స్వస్తికాది(స్వస్తికాసనము, గోముఖాసనము, బద్ధాసనము, పద్మాసనము, వీరాసనము, సింహాసనము, భద్రాసనము, ముక్తాసనము(దీనికి సిద్ధాసనమని, వజ్రాసనమని, గుప్తాసనమనియు నామాంతరములు గలవు.)మయూరాసనము మొదలైనవి.), బలాద్యపేక్షచే దండెత్తిపోక నిలుచుట,(ఇది పంచవిధము. – సంధాయాసనము, ప్రసంగాసనము, విగృహ్యాసనము, సంభూయాసనము, ఉపేక్ష్యాసనము. వీనికర్థము యానశబ్దము కడ వ్రాసినట్లైఱుంగునది.), ఏనుఁగుమూఁపు. ; పుం. వేఁగిస చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆసనం ఆస్యా ఆసనా చ. ఆసనం దీనికి కలదు కావున ఆసన.


ఆసనము
సం., నా. వా., అ., న., తత్స.,= పీట, స్కంధదేశము, కూర్చొనుటకు ఆధారము, సంధి, విగ్రహము, యానము, ద్వైధము, అశ్రయము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆస్తేత్రేత్యాసనమ్. దీనియందు కూర్చుందురు, దేశకాలాద్యపేక్షచేత దుర్గాదులను భరించుకొని ప్రయాణపరాముఖుఁడై ఉండుట ఆసనము. 2.ఆస్యతే అస్మిన్నిత్యాసనం. దీనియందుఉండబడును.

నానార్థాలు :
ఏనుగు యొక్క మూఁపు, స్వస్తికాది, సంధ్యాదిగుణములలో ఒకటి, ఒక యోగాంగము, యాత్రానివర్తనము, జీవకవృక్షము, వేట, పోక, చెరకురసము, మద్యము, వడపోత, ఏనుగు భుజము, సారాయి.


ఆసన్నమవు
క్రి., = సమీపించు, దగ్గరచేరు.

ఆసన్నము
సం., వి., అ., న., తత్స., = దాపు, సమీపస్థము, నికటస్థము, అస్తాభిముఖుడైన సూర్యుడు, పొంది ఉండునది, సమీపము. ; విణ. దాపైనది.
వ్యుత్పత్త్యర్థము :
ఆసీదతి ఆసన్నః. దగ్గరగా ఉన్నటువంటిది.

పర్యాయపదాలు :
నికటము, సన్నికృష్టము, సనీడము, సదేశము, అభ్యాసము, సవిధము, సమర్యాదము, సవేశము, ఉపకంఠము, అంతికము, అభ్యర్ణము, అభ్యగ్రము, అభితము.


ఆసవము
సం., వి., అ., పుం., తత్స.,= మద్యము, మద్యవిశేషము, మైరేయము, పక్వముకాని చెఱకురసమునఁ జేసినకల్లు, చెఱకు రసమునఁ జేసినకల్లు.(అని కొందఱు.), కల్లుతేట, శీధు, పూఁదేనె.

ఆసాదనము
సం., వి., అ., న., తత్స.,= ప్రాప్తి, పొందు.

ఆసాదించు
సం., స., క్రి.,= ప్రాప్తించు, పొందు.

ఆసాదితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= లబ్ధము, ప్రాప్తము, విన్నము, భావితము, భూతము, విన్నపము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసాద్యతే స్మ ఆసాదితమ్. పొందఁపడినది ఆసాదితము.


ఆసాద్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ప్రాప్యము, పొందఁదగినది.

ఆసారము
సం., వి., అ., పుం., తత్స., = జడివాన, ధారాసంపాతము, వేగవృష్టి, వడి గలవాన(అని కొందఱు.), మిత్రబలము, అంతట సేన వ్యాపించుట, శత్రువునుచుట్టుముట్టుట, మిత్రసేన, వర్షాధార, ప్రసరణం, ప్రవాహము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్సరతీతి ఆసారః. అంతటఁపడునట్టిది.


ఆసారి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = సమభూమి.

ఆసావికము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక సంకరజాతి.

ఆసికము
సం., నా. వా., అ., పుం., తత్స., = లక్ష్యము.

ఆసికుఁడు
సం., వి., అ., పుం., తత్స., = ఖడ్గాయుధుఁడు.

ఆసితము
సం., వి., అ., న., తత్స., = ఉనికిపట్టు. ; విణ. కూర్చుండినది.

ఆసిద్ధము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = అడ్డగింపఁబడినది, కట్టాయితమయినది.

ఆసీనుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= కూర్చున్నవాఁడు, ఉపవిష్టము, కూర్చున్నది.

ఆసుతీబలుడు
సం., వి., అ., పుం., తత్స., = యజ్వా, శౌండికుడు, కన్యాపాలుడు, కన్యాపాలకుడు, శూద్రజాతి విశేషము.

ఆసుతీవల
సం., నా. వా., అ., పుం., తత్స., = వడకట్టునది, సోమయాజి.

ఆసురము
సం., వి., అ., పుం., తత్స., = ధనమిచ్చిన కన్యకనుదీసి చేసికొనెడి యొక వివాహము (అష్టవిధ వివాహములు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము.),మాలకాకి, ఇనుము, పెట్లుప్పు, రక్తము.

ఆసురి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = కృష్ణిక, రాజిక, క్షవము, క్షుతాభిజననము, రాజసర్పిషములు, నల్లావలు.
వ్యుత్పత్త్యర్థము :
అసురస్య ఇయం ఆసురీ. కటురసేన అసురస్త్రీ పదనిష్ఠా ఆసురీ. కారము చేత అసురస్త్రీ వలె అసహ్యమైనది.


ఆసురీణము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = నల్లావలు పండునది.(పొలము)

ఆసురుఁడు
సం., వి., అ., పుం., తత్స., = నిరృతి, మూలఱేఁడు.

ఆసృతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = వడపోత.

ఆసేకము
సం., వి., అ., పుం., తత్స., = చల్లుట.

ఆసేచనకము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ఎంత చూచినను తనివితీఱనిది, హృద్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసిచ్యతే ఆపూర్వతే దృగాధికమనేనేతి ఆసేచకం. దీనిచేత నేత్రాదింద్రియములు నింపఁబడును.


ఆసేచనము
సం., వి., అ., న., తత్స.,= చల్లుట. ; విణ. కోరఁబడినది.

ఆసేధము
సం., వి., అ., పుం., తత్స.,= నిరోధము, అడ్డగింత.

ఆసేధించు
సం., స., క్రి.,= నిరోధించు, అడ్డగించు.

ఆసేధ్యము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= అడ్డగింపఁదగినది.

ఆస్కందనము
సం., వి., అ., న., తత్స.,= యుద్ధము, ఇంకుట, తిరస్కారము.
వ్యుత్పత్త్యర్థము :
ఆస్వందతే అత్రేత్యాస్కందనం. దీనియందు శోషింపఁచేయఁబడును.

పర్యాయపదాలు :
ఆయోధనము, జన్యము, ప్రధనం, ప్రవిదారణము, మృథము, సంఖ్యం, సమీకము, సాంపరాయకము, సమరానీకము, రణము, కలహము, విగ్రహము, సంప్రహము, అభిసంపాతము, కలి, సంస్ఫోటము, సంయుగము, అభ్యామర్దము, సమాఘాతము, సంగ్రామము, అభ్యాగము, ఆహవము, సముదాయము, సంయత్తు, సమిత్తు, ఆజి, సమిద్యుధము.


ఆస్కందితకము
సం., నా. వా., అ., న., తత్స., = అశ్వగతి విశేషము.

ఆస్కందితము
సం., వి., అ., న., తత్స., = అతివేగమును అతిమందమును కాక వడితరముగాఁపారెడి ఒక అశ్వధార, ధోరితకం, రేచితం, వల్లితం, రవగాలు, అశ్వగతివిశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఆస్కందనం ఆస్కందితం. నిశ్చలమై అతివేగము అతిమందమును కాక సమమైన గతి ఆస్కందితము.


ఆస్కారము
వి.,= వీలు, అవకాశం, ఆధారం, ప్రాపు, బలము, శక్తి, అనుమానం, వైషమ్యం మొదలైనవాటికి ఉన్న అవకాశం, చోటు, తావు.

ఆస్టోటని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = పోగారు.

ఆస్తరణము
సం., వి., అ., న., తత్స.,= ఆసనము, ఎర్రకంబళి, వర్ణము, ఏనుకు మీద పరచెడి ఎర్రకంబళి , చిత్రకంబళి, ప్రవేణి, వర్ణము, పరిస్తోమము, కుథా, కుథ, పరిష్టోమము, శయ్య, కుశాసనము, తివాచి, పరుపు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆస్తీర్యత ఇత్యాస్తరణం. కప్పఁబడునది. 2.ఆస్తీర్యతే యత్ యేన వా ఆస్తరణమ్. దేనితో కానీ దేని ద్వారా కానీ కప్పబడునది ఆస్తరణము.


ఆస్తరము
సం., వి., అ., పుం., తత్స.,= ఆసనము, ఎఱ్ఱకంబళి, పఱపు.

ఆస్తావము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సామగానము చేయు యాగశాల.

ఆస్తికత
వి.,= దేవుడున్నాడని విశ్వసించడం, ఆస్తిక్యం.

ఆస్తికుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= భగవంతుడున్నాడని నమ్మువాఁడు, పరలోకము యందు నమ్మిక కలవాడు. ; విణ. శ్రద్ధగలవాడు.

ఆస్తిక్యము
సం., వి., అ., న., తత్స.,= ఆస్తికుని భావము.

ఆస్తిపాస్తులు
వి., బహు.,= ఆస్తి మొదలైనవి అనే అర్థంలో వాడే జంటపదం.

ఆస్తీర్ణము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= పఱవఁబడినది.

ఆస్థ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఆసక్తి, ప్రతిజ్ఞ, ఆస్థానము, ప్రయత్నము, సభ, యత్నము, శ్రద్ధ, అంగీకారము.
వ్యుత్పత్త్యర్థము :
ఆతిష్ఠస్తస్యామితి ఆస్థా. దీనియందుందురు.


ఆస్థానగృహము
సం., నా. వా., అ., న., తత్స.,= సభాభవనము.

ఆస్థానమవు
అ., క్రి.,= సభచేయు, కొలువుండు.

ఆస్థానము
సం., వి., అ., న., తత్స.,= సభ, రాజసభ, ఆశ్రయము, స్థానము, యత్నము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆసమంతాత్ తిష్ఠంతి అత్ర ఆస్థానీ, ఆస్థానం చ. అంతట దీనియందు ఉందురు. 2.ఆస్థీయతే అస్మిన్నితి ఆస్థానమ్. దీనియందు ఆశ్రితులై ఉందురు.

పర్యాయపదాలు :
సమజ్య, పరిషత్తు, గోష్ఠి, సమితి, సంసదము, ఆస్థాని, సదము.


ఆస్థాని
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= సభ, రాజసభ.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతాత్ తిష్ఠంత్యత్ర ఆస్థానీ. అంతట దీనియందుందురు.

పర్యాయపదాలు :
సమజ్య, ఆస్థానము, ఆశ్రయము, స్థానము, పరిషత్తు, గోష్ఠి, సమితి, సంసదము, సదము.


ఆస్థితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఆక్రాంతము, ధృతము, స్పృష్టము, రుద్ధము.

ఆస్పదము
సం., వి., అ., న., తత్స., = చోటు, పని, చేయదగినది, అంతటపొందబఁడునది, స్థానము.
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతతః పద్యత ఇత్యాస్పదం. అంతట పొందుఁపడినది.


ఆస్ఫాలనము
సం., వి., అ., న., తత్స., = చోటు, పని, స్థానము, చఱపు. (రూ. ఆస్ఫాలము. పుం.)
వ్యుత్పత్త్యర్థము :
ఆసమంతతః పద్యత ఇత్యాస్పదం. అంతట పొందుఁపడినది.


ఆస్ఫాలించు
సం., స., క్రి., = ఆస్ఫోటించు, చఱచు.

ఆస్ఫాలితము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = చఱవఁబడినది.

ఆస్ఫోట
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అడవిమల్లె చెట్టు.; అ. పుం. ము. జిల్లేడు చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆస్ఫోటతి ఈషద్వికసతీతి ఆస్ఫోటా. కొంచెముగా వికసించునది.

పర్యాయపదాలు :
గిరికర్ణి, విష్ణుక్రాంత, అపరాజిత, వనోద్భవము, దింటెనచెట్టు.


ఆస్ఫోటనము
సం., వి., అ., న., తత్స.,= చఱపు, పోటు, చీలిక.

ఆస్ఫోటని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = రత్నములకు బెజ్జము వేసెడిసూది, పిడిసాన, వైధనికము.
వ్యుత్పత్త్యర్థము :
ఆస్ఫోట్యతే రత్నాదికం అనయేత్యాస్ఫోటనీ. దీనిచేత రత్నములు మొదలైనవి భేధింపఁబడును


ఆస్ఫోటము
సం., వి., అ., పుం., తత్స.,= జిల్లేడు చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఆస్ఫుటత్యాస్ఫోటః. వికాసము కలిగినది.

పర్యాయపదాలు :
అర్కాహ్వము, వసుకము, గణరూపము, వికీరణము, మందారము, అర్కపర్ణము.


ఆస్ఫోటించు
సం., స., క్రి., = చఱచు, పొడుచు, చీల్చు.
ప్రయోగము :
క. మాటికి మనపై నుఱుములు,
చాటుచు వేకోటులద్రి చరలు గొలువ నా,
స్ఫోటించి
నేలఁగాలం,
దాటించుచున్నవాఁడు దం భుఁడుకంటే. (రా.యు, కాం.)


ఆస్ఫోటితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= చఱవఁబడినది, పొడువఁబడినది, చీల్పఁబడినది.

ఆస్ఫోత
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = విష్ణుక్రాంతి, ఒకమల్లె.

ఆస్ఫోతము
సం., నా. వా., అ., పుం., తత్స.,= మోదుగు.

ఆస్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఉండుట, ఆసన, స్థితి, కూర్చుండుట, ఉనికి. ; అ. న. ము. ముఖము, నోరు.
వ్యుత్పత్త్యర్థము :
ఆసనం ఆస్యా, ఆసనా చ. కూర్చుండుట ఆస్య.


ఆస్యము
సం., వి., అ., న., తత్స.,= ముఖము, ముఖమధ్యము, నోరు.
వ్యుత్పత్త్యర్థము :
అస్యతే క్షిప్యతే భక్ష్యమత్రేతి ఆస్యం. దీనియందు భక్ష్య వస్తువులు వేయఁపడును.

పర్యాయపదాలు :
వక్త్రము, వదనము, తుండము, ఆననము, లపనం.


ఆస్రము
సం., వి., అ., న., తత్స.,= కన్నీరు, రక్తము, బాధ, నెత్తురు. ; పుం. వెండ్రుక.

ఆస్రవము
సం., వి., అ., పుం., తత్స., = క్లేశము, అలసట, కన్నీరు, ఆదీనవము, రక్తము, బాధ.
వ్యుత్పత్త్యర్థము :
ఆస్రవంతి ఇంద్రియాణ్యనేనేతి ఆస్రవః. దీనిచేత ఇంద్రియములు చెదురును.


ఆస్వదనము
సం., వి., అ., న., తత్స.,= అనుభవించుట, చవిచూచుట.

ఆస్వదించు
సం., స., క్రి.,= అనుభవించు, చవిచూచు.
ప్రయోగము :
ఆ బావితేట నీరాస్వదించిన. (కాశీ. ౬, ఆ.)


ఆస్వాదనము
సం., వి., అ., న., తత్స.,= ఆస్వదనము.

ఆస్వాదించు
సం., స., క్రి.,= ఆస్వదించు.

ఆస్వాదితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= అనుభవింపఁబడినది, చవిచూడఁబడినది.

ఆస్వాద్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= రుచిచూడదగినది.

ఆహతము
సం., వి., అ., పుం., తత్స.,= రూప్యము, గుణితము, తప్పెట. ; ఆబద్ధపుమాట, మృషార్థకము, గుణించబడినది. ; విణ. కలుగనేరనిది(గొడ్రాలి కొడుకు చూచుచున్నాఁడు. లోనగుమాట.), కొట్టఁబడినది, క్రొత్తది(వస్త్రము), ప్రాఁతది(వస్త్రము), రెట్టింపఁబడినది.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆహన్యతే ప్రమాణాంతరేణేత్యాహతం. ప్రమాణాంతరము చేత బాధింపఁపడునది. 2.ఆహతం రూపమస్యేతి రూప్యం. కొట్టఁపడినది. 3.ఆహన్యతే సంఖ్యాంతరేణేత్యాహం. సంఖ్యాంతరము చేతఁ చెరుఁపపడునది.


ఆహతలక్షణుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = గుణముల చేతఁప్రసిద్ధిచెందినవాఁడు, అందరికీ అభ్యస్తమైన పేరు గలవాడు, కృతలక్షణుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆహతం గుణితమసకృదుచ్చరితం లక్షణం యస్యేత్యాహతలక్షణః. పలుమారులుఉచ్చరింపఁబడు పేరుకలవాఁడు.


ఆహతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = ఆఘాతము, స్తుక్కునుంచుట.

ఆహరము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= నిట్టూర్పు, తిండి.

ఆహరించు
సం., స., క్రి.,= అపహరించు, ఆకర్షించు, ఆరగించు.
ప్రయోగము :
నేఁదల్లడమందభూషణవితానము నర్థమునాహరించి. (షో.౪, ఆ. )

విజ్ఞానమునఁజేసి విషయాదివలన నెమ్మన మాహరించి.
(ఇక్కడ ఆహరించి =మరలించి యనుట.) (ఆము. 3, ఆ.)

ఎ. గీ. బ్రహ్మచర్యమునకుఁబర మాయువుపవాస,
ములకుఁజిత్తశుద్ధి పలజలంబు,
లాహరించియునికి కాధి రాజ్యము పత్ర,
భక్షతకు దివంబు ఫలమలధిప. (భార. ఆను.౧,ఆ.)


ఆహర్త
సం., విణ.,(ఋ. ఈ. ఋ.)., తత్స.,= ఆహరించువాఁడు.

ఆహర్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= చందనము, ఒక అభినయము, అన్నము

ఆహవనము
సం., వి., అ., న., తత్స., = యజ్ఞము, వ్రేలిమి.

ఆహవనీయము
సం., వి., అ., పుం., తత్స.,= ఒక శ్రౌతాగ్ని, (దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అను మూడు అగ్నులు)యజ్ఞాగ్నివిశేషము. ; విణ. యజ్ఞమున బలియియ్య యోగ్యమైనది.
వ్యుత్పత్త్యర్థము :
1.కర్మసమాప్తేః హోతవ్యరి ఆహవనీయః. క్రియాపరిసమాప్తి పర్యంతం హోమము చేయతగినది. 2.ఆహూయతే ఆజ్యాదిరస్మిన్ ఇతి ఆహవనీయః.


ఆహవము
సం., వి., అ., పుం., తత్స., = యుద్ధము, పిలుపు, యజ్ఞము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఆహూయంతే పరస్పరమితి ఆహనః. దీనియందుఁపరస్పరము పిలువఁబడుదురు, 2.ఆహూయతే అరిర్యస్మిన్ ఇతి ఆహవః. దీనియందు శత్రువుని పిలుచుదురు.

పర్యాయపదాలు :
ఆయోధనము, జన్యము, ప్రధనము, ప్రవిదారణము, మృతము, ఆస్కందనము, సంఖ్యము, సమీకము, సాంపరాయకము, సమరానీకము, రణము, కలహము, విగ్రహము, సంప్రహము, అభిసంపాతము, కలి, సంస్ఫోటము, సంయుగము, అభ్యామర్దము, సమాఘాతము, సంగ్రామము, అభ్యాగము, సముదాయము, సంయత్తు, సమిత్తు, ఆజి, సమిద్యుధము.


ఆహారము
సం., వి., అ., పుం., తత్స., = భోజనము, వంటకము, అపహరణము, భక్షణము, తిండి, ద్రవ్యగలాధఃకరణము, ఆహరణము.
వ్యుత్పత్త్యర్థము :
ఆహరణమాహారః. భుజించుట ఆహారము.

పర్యాయపదాలు :
జగ్ధి, జేమనము, లేపము, నిఘషము, న్యాదము, జమనము, విఘసము, ప్రత్యవసానము, భక్షణము, అశనము, అభ్యవహారము, స్వదనము, నిగరము.


ఆహారించు
సం., స., క్రి., = ఆరగించు.
ప్రయోగము :
సీ. గ్రహణవేళలయందు రాహువా హారించి తృప్తిమైగఱ్ఱునఁద్రేఁచెనేని. (నై. ౨ , ఆ.)


ఆహార్యము
సం., వి., అ., పుం., తత్స.,= హారాదిభూషణములచేఁ గలిగెడి అభినయ విశేషము. విణ. తెచ్చుకోఁదగినది.

ఆహావము
సం., వి., అ., పుం., తత్స.,= పశువులు నీరు త్రాగుటకై నూతియొద్ద ఏర్పరచిన తొట్టి, యుద్ధము, కుడితిగోలము, నిపానము, ఆహ్వానము, అగ్ని.
వ్యుత్పత్త్యర్థము :
ఆహూయంతే పశవోత్రేత్యాహావః. దీనియందు పశువులు నీరు త్రాగుటకు పిలువఁబడును.


ఆహి
వి., = కురవ, తాకట్టు, తనఖా.

ఆహిందకుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒకసంకరజాతి, చెరసాలకాపరి.

ఆహికము
సం., వి., అ., పుం., తత్స.,= విడిచి విడిచి వంతు ప్రకారమువచ్చెడు జ్వరము, సుషిర వాద్యవిశేషము.

ఆహికుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= కేతువు, పాణిని.

ఆహితము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= ఉంచఁబడినది, చేయఁబడినది, న్యస్తము, స్థాపితము, అర్పితము.

ఆహితాగ్ని
సం., వి., ఇ., పుం., తత్స.,= అగ్న్యాధానము చేసిన బ్రాహ్మణుడు, అగ్నిహోత్రము నుంచుకొనియుండువాఁడు.

ఆహితుండికుడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= పాములవాడు, వ్యాలగ్రాహి.

ఆహుకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= జయంతీపురము.

ఆహుతము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= వేల్వఁబడినది.

ఆహుతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= అగ్నియందు వేల్చుట, హోమము.

ఆహూతుడు
వి.,= ఆహ్వానితుడు, అతిథి.

ఆహేయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= పాముది (ఎముక, విషము మొదలైనవి), అస్థి, చర్మము.
వ్యుత్పత్త్యర్థము :
అహౌ భవం ఆహేయం. అహి యందుఁపుట్టినది.


ఆహేరువు
సం., వి., ఉ., స్త్రీ., తత్స.,= పిల్లపీఁచర చెట్టు.

ఆహో
సం., అవ్య., తత్స.,= ప్రశ్నయందు, వికల్పమందు, విచారమందు, ఉతాహో, కిముత, కిమ్, ఉత.

ఆహోపురుషిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= అహోపురుషిక, అహంభావము కలది, దర్పమును ప్రదర్శించునది, అధిక ప్రేలాపనలతో తన శక్తిని ప్రదర్శించునది, తన పనిని సాధించుటకు శక్తిని ప్రదర్శించునది, అహంభావము కలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఆహో పురుషోహమితి దర్పయుక్తస్వ పురుషస్వభావః ఆహోపురుషికా. నేను వీరపురుషుఁడనని అహంకరించిన వాని యొక్క భావము ఆహోపురుషిక.


ఆహోస్విత్
సం., అవ్య., తత్స.,= లేక, ప్రశ్నయందు, వికల్పమునందు.

ఆహ్నికము
సం., వి., అ., న., తత్స.,= పగలు చేయఁదగిన కర్మము, ఆహారము, ప్రకరణ సమూహము. ; విణ. పగలు చేయఁదగినది.

ఆహ్లాదము
సం., వి., అ., పుం., తత్స.,= సంతోషము, ఎలమి.

ఆహ్వ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= పేరు, పిలుపు, ఆహ్వానకారకము, అభిధానము, ఆఖ్య, నామధేయము, నామము.
వ్యుత్పత్త్యర్థము :
ఆహూయతేనయేత్యాహ్వా. దీని చేత పలుకఁబడును.


ఆహ్వయము
సం., వి., అ., పుం., తత్స.,= అభిధానము, ఆహ్వ, పేరు, ఆఖ్య, నామధేయము, నామము.
వ్యుత్పత్త్యర్థము :
ఆహూయతేనేనేత్యాహ్వయః. దీనిచేత పిలువఁబడును.


ఆహ్వానము
సం., వి., అ., న., తత్స.,= హూతి, పిలుపు, నామము, సంజ్ఞ, ఆఖ్య, ఆవాహనము, ఆకారణము.
వ్యుత్పత్త్యర్థము :
1.హూయతే అనయేతి హూతిః, ఆహ్వానం చ. దీని చేత పిలుతురు, 2.ఆహూయతే అనేన ఇత్యాహ్వానం.


ఆహ్వానించు
క్రి.,= పిలుచు, దగ్గరికి చేర్చు.