అచ్చులు : ఐ
ఐ
సం., అవ్య., తత్స., = ఒక యక్షరము, ఆపద, కోపము, సన్నిధి, సామీప్యములను తెలుపునది.
వ్యుత్పత్త్యర్థము :
(1)ఆహ్వానే (2)స్మరణే (3)ఆమంత్రణే చ . ఆహ్వానమునందు, స్మరణమునందు, ఆమంత్రణమునందు వచ్చును.
మాట - మంతి :
తత్సమేతర పదములలోని ‘ఐ’ కారమునకు “అయి” యును, అయికి “ఐ” కారము వికల్పముగా వచ్చును.
ప్రయోగము :
ఉదా- ఐదు, అయిదు, కైయిదువు మొదలగునవి.
ఐంగుదము
సం., వి., అ., న., తత్స., = గారపండు, ఇంగుదీ వృక్ష సంబంధమైనది, గారచెట్టు, గారపువ్వు.
నానార్థాలు :
ఆశ్వత్థము(రావిపండు), వైణవం(వెదురు బియ్యము), ప్లాక్షము(జువ్విపండు), నైయగ్రోధం(మఱ్ఱిపండు), బార్హతము(ములకపండు).
ఐందలి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= సోమరాజీలత, కారుగచ్చ (వృక్ష విశేషము).
ఐందవము
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స.,= ఇందుసంబంధమైనది(ఇందుడు = చంద్రుఁడు), మృగశిర నక్షత్రము, చాంద్రాయణవ్రతము, చంద్రునకు సంబంధించినది, చాంద్రమాసము.
ఐందవి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = సోమరాజీలత, కారుగచ్చ (వృక్ష విశేషము).
ఐంద్రజాలికుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= ఇంద్రజాలకుడు, ఇంద్రజాలవిద్య నేర్చినవాఁడు, మోసకాడు, మాయావి.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రజాలముచేయువాడు ఐంద్రజాలికుడు.
ఐంద్రద్యుమ్నము
సం., నా. వా., అ., న., తత్స., = ఇంద్రద్యుమ్ననృప ఆఖ్యానమునందు.
ఐంద్రమహికము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఇంద్రయాగము యొక్క ప్రయోజనము లేదా కారణము.
ఐంద్రము
సం., వి.,. అ., పుం., తత్స., = ఇంద్రునకు సంబంధించినది, ఒకయాగము, మాలకాకి, ఒక గ్రహయోగము.
నానార్థాలు :
జేష్ఠానక్షత్రము, అడవి అల్లము, 27 యోగములలో ఒకటి, విష్కంభముమొదలగునవి.
ఐంద్రలుప్తికుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = బట్టతలవాడు, ఖల్లీటుడు(ఖల్వాటుడు), ఖలతి, గంజ అనే భాష, (కేశఘ్నరోగ విశేషః.) రోగము వలన బట్టతల అయినవాడు.
ఐంద్రవాయవము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఇంద్రవాయువులు దేవతలుగా కలది (హవిరాది).
ఐంద్రశర్మి
సం., నా. వా.,(ఇ. ఈ)., పుం., స్త్రీ., తత్స., = ఇంద్రకర్మణుడు అనే పేరుగలరాజు యొక్క సంతానము.
ఐంద్రహవుడు
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స., = ఇంద్రహవ్యుని యొక్క శిష్యుడు.
ఐంద్రాగ్నము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= ఇంద్రుడు, అగ్నియును దేవతలుగా కలది.
ఐంద్రాపౌష్ణము
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స.,= ఇంద్రపూషణులకు సంబంధించిన యాగము యొక్క హవిస్సు.
ఐంద్రాయణుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఇంద్రుని యొక్క సంతానము.
ఐంద్రి
సం., నా. వా., విణ., ఇ., పుం., తత్స., = ఇంద్రశక్తిరూపమగు దేవీ మూర్తి, శచీదేవీ, దుర్గ, ఇంద్రవారుణి.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్యశుక్రస్య ఇయమ్. ఇంద్రుని యొక్క లేదా శుక్రుని యొక్క స్త్రీ.
నానార్థాలు :
తూర్పు, పెద్దబావి, ఋక్వశేషము, మార్గశీర్ష పుష్యమాసముల కృష్ణ పక్షాష్ఠమి, ఒకజాతిదోస, చిన్న ఏలకి(వృ.వి), అలక్ష్మి(దౌర్భాగ్యదేవత), పెద్దపాపర, జయంతుడు, అర్జునుడు, వాలి, మాలకాకి, ఒక మాతృక, పెద్దచీర, జ్యేష్ఠానక్షత్రము, యోగధారణ భేదము.
ఐంద్రి
సం., నా.వా., ఈ., స్త్రీ., తత్స.,= తూర్పు దిక్కు.
నానార్థాలు :
జయంతుడు, వావి, అర్జునుడు, ఇంద్రశక్తిరూపమగు దేవీ మూర్తి, ఒకమాతృక, మాలకాకి, పెద్దబావి, ఋగ్విశేషము, జ్యేష్ఠానక్షత్రము, మార్గశీర్ష పుష్యమాసముల కృష్ణ పక్షాష్ఠమి, యోగధారణ, భేదము, ఒకజాతిదోస, చిన్న ఏలకి, శచీదేవీ, అలక్ష్మి, (జ్యేష్టాదేవత) ఇంద్రవారుణి, పెద్దపాపర, దుర్గ, ఇలాయచి, పెద్దబీర.
ఐంద్రియకము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ప్రత్యక్షము, ఒకానొక రోగము, చక్షురాదీంద్రియగోచరమైనది, నేత్రాది పంచేంద్రియములచేత నెఱుఁగబడు రూపరసాదులు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియాదాగతమైంద్రియకం- ఇంద్రియము వలన గ్రహింపబడునది.
ఐంద్రియము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ప్రత్యక్షము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియములకు సంబంధించినది ఐంద్రియము.
ఐంధము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = సూర్యుని అందు ఉండునది, స్వామియందు ఉండునది.
ఐంధాయనుడు
సం., నా. వా.,(అ. ఆ)., పుం., స్త్రీ., తత్స., = ఇంధ అను పేరు గల గోత్రము నందు పుట్టినవాడు, పుట్టినది.
ఐంధాయనుడు
సం., విణ., (అ. ఆ)., పుం., స్త్రీ., తత్స., = ఇంధుడు అనే ఋషి యొక్క గోత్రమున పుట్టిన సంతానము.
ఐకకంఠ్యము
సం., వి., అ., న., తత్స., = ఏకకంఠత్వము, ఒద్దిక, పదిమందిమాట ఒకటి అగుట.
ఐకధ్యము
సం.,విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఒక్క విధముగా అను అర్థము కలిగినది.
ఐకపత్యము
సం., వి., అ., న., తత్స., = సార్వభౌమత్వము.
ఐకపదికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఒకే పదము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకస్మిన్ పదే స్థానే విభక్త్యంతే వా భవః. ఒకే పదంలో,స్థానంలో, విభక్తి అంతములో పుట్టినది.
ఐకపద్యము
సం., వి., అ., న., తత్స.,= ఏక పదము యొక్క ఏకార్థ విభక్తి భావము, ఒకేదాని యొక్క భాగములు అను అర్థమునందు, చాలా పాదములు యొక్క ఒకే అర్థమును బోధించ గలిగిన సామర్థ్యము.
ఐకభావ్యము
సం., విణ., అ., న., తత్స.,= ఒకే స్వభావము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకో భావో యస్య తస్య భావః , సమానభావము దేనికి కలదో ది యొక్క భావము.
ఐకమత్యము
సం., వి., అ., న., తత్స.,= ఏకమతిత్వము, ఒద్దిక.
వ్యుత్పత్త్యర్థము :
ఏకం మతం యేషాం తేషాం భావః. తుల్యసమ్మతౌ, ఐకమత్యయుక్తే. ఒకటే అభిప్రాయము కలిగి ఉండుట ఐకమత్యము.
ఐకము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,=ఒక్కటి అనే అర్థము కలిగినది, ఒకటి నుండి పుట్టినది.
ఐకరాజ్యము
సం., వి., అ., పుం.,న., తత్స., = చక్రవర్తిత్వము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకరాజో భావః. ఒకే రాజు అధీనమున ఉండుట.
ఐకలవ్యుడు
సం., నా. వా., (అ. ఈ)., పుం., స్త్రీ., తత్స.,= ఏకలవ్వుని పుత్రుడు(పుత్రిక).
వ్యుత్పత్త్యర్థము :
ఏకలవ్యస్య అపత్యం. ఏకలవ్వునికి పుట్టినవాడు, పుట్టినది.
ఐకశతికుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., =101 నూట ఒకటి, (పదార్థములు) కలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకశతపరిమితద్రవ్యస్వామిని, ఏకశతమస్యాస్తి. 101 నూట ఒకటి, (పదార్థములు) కలవాడు.
ఐకశ్రుత్యము
సం., వి., అ., న., తత్స., = ఉదాత్త అనుదాత్త స్వరితముల యొక్క సన్నికర్షత్వము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకా శ్రుతిర్యత్ర తస్య భావః. ఒక శృతి ఎక్కడ ఉంటుందో దాని భావము. ("ఉదాత్తానుదాత్త స్వరితానాం పరః సన్నికర్ష ఐకశ్రుత్యమ్")
ఐకసహస్రికుడు
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., =1001 వేయ్యిన్నొక్క (పదార్థములు) కలవాడు.
ఐకాంతికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = తప్పక కలుగునది.
వ్యుత్పత్త్యర్థము :
ఏకాంతమవశ్యం భావీ. తప్పక ఒకటి అగునది.
ఐకాగారికుఁడు
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స.,= చోరుడు, దొంగ, స్తేనుడు(మ్రుచ్చిలించువాడు).
వ్యుత్పత్త్యర్థము :
ఏకమసంబాధం గృహం ప్రయోజన మస్యేతి ఐకాగారికః. దొంగిలించుట కొఱకు జనసమ్మర్థములేని యిల్లు ప్రయోజనముగా కలవాడు. ఏకమసహాయమగారం ప్రయోజనమస్యేతి ఐకాగారికః. ఏకాగారవాసి.
పర్యాయపదాలు :
దస్యుడు, తస్కరుడు, మోషకుడు, ప్రతిరోధి, పరాస్కందుడు, పాటచ్చరుడు, మలిమ్లుచుడు.
ఐకాగ్రుఁడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఏకతానుఁడు, ఏకాగ్రచిత్తము, అనన్యవృత్తి, ఏకాగ్రుడు, ఏకాయనుడు, ఏకసర్గుడు, ఏకాయనగతుడు.
ఐకాగ్ర్యము
సం., వి., అ., న., తత్స., = ఏకాగ్రత్వము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకాగ్రస్య భావః. అనన్యాసక్తచిత్తత్వే ఏకమాత్రాలంబిచిత్తత్వేఏకాగ్రతా. వేరొక విషయమున మనసు మరలకుండుట ఐకాగ్ర్యము.
ఐకాత్మ్యము
సం., నా. వా., అ., న., తత్స., = అభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఏక ఆత్మా స్వరూపం యస్య తస్య భావః, 1)ఐక్యే . ఐక్యము నందు.(2)ఏకస్వరూపత్వే. ఒక స్వరూపము నందు. (3)అభేదే చ అభేదమునందు. (4)ఆత్మన ఏకత్వేఐకాత్మ్యవాదః ఒకటే స్వరూపము కలిగి ఉండుట ఐకాత్మ్యము.
ఐకాదశినము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఏకాదశకి సంబంధించినది.
ఐకాధికరణ్యము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= సమానాధికరణము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకాధికరణస్య భావః. ఒకే అధికరణము యొక్క భావము. ఏకాధికరణవృత్తిత్వే. ఒకే ఆధారము కలిగి ఉండుట అనే అర్థము నందు. సామానాధికరణ్యే. ఒకే అధికరణము కలిగి ఉండుట. తుల్యవిభక్తికపదయోః స్వోపస్థాప్యార్థయోరభేదబోధకత్వే చ. సమాన విభక్తి కలిగిన పదముల యొక్క ఆ పదముల చేత చెప్పబడేటటువంటి అర్థముల యొక్క భేదము లేకుండా అర్థము తెలియుట.
ఐకాన్మియకుడు
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = అధ్యయమను పరీక్షించుకాలమున విపరీతచ్చోరణ రూపమగు ఒకతప్పు కలిగిన పాఠకుడు (శిష్యుడు)
ఐకాన్యికుడు
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = అధ్యయనమును పరీక్షించుకాలమున విపరీతోచ్ఛారణ రూపమగు ఒకతప్పు కలిగిన పాఠకుడు (శిష్యుడు).
ఐకాయనుడు
సం., విణ.,అ.,పుం., స్త్రీ., తత్స., = ఏక అను పేరు గల ఋషి గోత్రమున పుట్టిన సంతానము.
ఐకార్థ్యము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఒక్కటే అర్థము కలిగి ఉండుట, ఏక ప్రయోజనము.
ఐకాహికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= (యాగాది) ఏకదిన వ్యాపకమైనది, ఒకదినము ఉండునది (జ్వరము, ఉత్సవము), ఒక రోజు (దిన) సాధ్యమైనది.
ఐకాహికుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= దినముకూలి, రోజుకూలి చేయువాడు, సత్కృతుడై ఒక్కనాటికి అధ్యయనము చేయించు అధ్యాపకుడు.
ఐక్యపత్యము
సం., వి., అ., న., తత్స., = సార్యభౌమత్వము.
ఐక్యమత్యము
సం., వి., అ., న., తత్స., = ఏకమతిత్వము, ఒద్దిక.
వ్యుత్పత్త్యర్థము :
ఒకటే అభిప్రాయము కలిగి ఉండుట.
ఐక్యము
సం., వి., అ., న., తత్స., = ఏకత్వము, ఒకటి అడుగుట, ఐకమత్యము, ఒరిమ, ఏకీభావము.
ఐక్యరాజ్యము
సం., వి., అ., న., తత్స., = చక్రవర్తిత్వము.
ఐక్యరాజ్యసమితి
వి. = అంతర్జాతీయ సహకారం శాంతిభద్రతల పరిరక్షణకోసం సభ్యదేశాలతో ఏర్పడిన సంస్థ.
ఐక్షవము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= చెరకునుండి తీసిన మద్యము, పంచదార, చెరుకు సంబంధమైనది.
ఐక్షుకము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = చెరకు పండునది (పొలము), చెరకుమోపు మోసుకొని పోవునది.
ఐక్షుబారికుడు
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = చెరుకులమోపు మోసుకొని పోవువాడు.
ఐక్ష్వాకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = సూర్యవంశరాజు, ఇక్ష్వాకు దేశమందున్నది.
ఐచ్ఛికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = కోరికగా చేయునది, ఇష్టప్రకారం చేసే.
ఐడకము
సం., నా. వా.,అ., ఆ., పుం., స్త్రీ., తత్స., = మేషము, పశుభేదము.
ఐడము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = గొఱ్ఱెది.
వ్యుత్పత్త్యర్థము :
ఇడాశబ్దయుక్తే అధ్యాయే ఇడాపత్యే పురురవసి మేషసమ్బన్ధిని ఐడా శబ్దయుక్తమైన అధ్యాయము నందు, మేష సంబంధమైనది.
ఐడవిడుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = కుబేరుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇల విలామా అపత్యం పుమాన్. ఇలవిల యొక్క కుమారుడు.
ఐడివిడము
సం., నా. వా., అ., పుం., తత్స., = సూర్యవంశము, క్షత్రియ భేధము, సూర్యవంశ వర్ణనము.
ఐణము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఏణము యొక్క చర్మము మొదలైనది (ఏణము-ఇఱ్ఱి), ఆడులేడియొక్కయు మొగదుప్పియొక్కయు తోలుమాంసము మొదలైనవి.
వ్యుత్పత్త్యర్థము :
ఏణ్యస్య ఇదం ఐణం. మొగదుప్పికిసంబంధమైనది.
ఐణికుడు
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = లేళ్లను వేటాడువాడు.
ఐణీపచనము
సం., నా.వా., అ., న., తత్స= లేడి మాంసమునకు చెందిన వంట.
ఐణేయము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= ఆడులేడి సంబంధమైనది, ఏణి యొక్క చర్మము మొదలైనది(ఏణి-లేడి), ఆడులేడియొక్కయు మొగదుప్పియొక్కయు తోలుమాంసము మొదలైనవి.
వ్యుత్పత్త్యర్థము :
కృష్ణమృగచర్మాదౌ, ఏణ్యా ఇదమ్, రతిబంధభేదే, ఏణాం ఇదం ఐణేయం. కృష్ణమృగచర్మమునందు, రతిబంధబేధమునందు, ఆడులేడి సంబంధమైనది.
ఐతదాత్మ్యము
సం., వి., అ., న., తత్స., = ఈస, రూపము కలిగి ఉండుట.
ఐతరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఇతరముకంటే భిన్నమైనది, దగ్గరగా ఉన్నది.
ఐతరేయము
సం., వి., అ., న., తత్స.,= ఒకానొక ఉపనిషత్తు, ఒకానొక ఆరణ్యకము, ఒకానొక బ్రాహ్మణము.
వ్యుత్పత్త్యర్థము :
ఇతరస్య తన్నామ్న ఋషేరపత్యమ్. ఇతరుడు అను ముని సంతానము. ఇతరుడు అను ముని వలన వచ్చినది ఐతరేయము.
ఐతికాయనుడు
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = ఇతిక ఋషి గోత్రమున పుట్టినవాడు, పుట్టినది.
ఐతిశాయనుడు
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = ఇతిశ ఋషి గోత్రమున పుట్టినవాడు, పుట్టినది.
ఐతిహాసికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఇతిహాసగ్రంథము వలన లభించినది, ఇతిహాసమునకు సంబంధించినది.
ఐతిహాసికుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= చరిత్రకారుడు, ఇతిహాసము తెలిసినవాడు, ఇతిహాససంబంధము గలవాఁడు.
ఐతిహ్యము
సం., వి., అ., న., అవ్య., తత్స., = పూర్వగాథ, ఇతిహము, వేదము మొదలైనవాటి ఆప్తోపదేశము, పెద్దకాలముగా ఉండు జనవాదము,పారంపరిక ఉపదేశము, పరంపరాగతముగా వచ్చిన కథా విశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఇతిహ ఉపదేశపారంపర్యమ్. ఇతిహైవ ఐతిహ్యం. పారంపర్యము చేతనైన ఉపదేశము.
ఐదంపర్యము
సం., వి., అ., న., తత్స., = సారము, ముఖ్యతాత్పర్యము.
ఐదంయుగీనము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఈ యుగమున మంచిది.
ఐదవతాడు
వి. = మంగళసూత్రము.
ఐదార
వి. = కర్రలోని నిప్పు.
ఐదిహసికుడు
సం., వి., అ., పుం., తత్స., = ఐతిహసము తెలిసినవాడు, చరిత్రకారుడు.
ఐదుపదిగావించు
స. క్రి. = ముక్కలు చేయు, ఖండించు.
ఐనము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = శివునికి సంబంధించినది, ఏలికకుసంబంధించి
ఐనసము
సం., వి., అ., న., తత్స., = ఏనస్సు, పాపము.
ఐభము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= ఏనుగునకు సంబంధించినది.
ఐభావతి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఇభావతుని యొక్క సంతానము, ఋషి భేదము.
ఐభావతుడు
సం., వి., అ., పుం., తత్స., = ఇభావతుని సంతానము, ఒక ఋషి.
ఐభీ
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = గుమ్మడి, కూష్మాండము, ఏనుగు సంబంధమైనది.
ఐయత్యము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఇంత అను పరిమితి.
ఐరక్యము
సం., విణ., (అ.ఆ.అ)., తత్స., = ఏరకము అను గడ్డిజాతి మొక్క నుండి పుట్టినది.
ఐరము
సం., విణ.,( అ. ఆ. అ)., తత్స., = భూమి వలన పుట్టినది, జలము వలన పుట్టినది.
ఐరాము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= భూమివలన పుట్టినది, జలము వలన పుట్టినది
ఐరావణము
సం., వి., అ., పుం., తత్స., = అభ్రమువల్లభము, ఇంద్రునిఏనుగు, ఐరావతము.
పర్యాయపదాలు :
శ్వేతకుంజరము, గజాగ్రణి, తెల్లఏనుగు, అభ్రమాతంగము.
వ్యుత్పత్త్యర్థము :
ఇరా,హాలా తత్ర్పధానం వనమిరావణం.ఇర అనగా జలము,దాని నుండి పుట్టినది. ఇరయా జలేన వణతి శబ్దాయతే ఇతి ఐరావణః. జలముతో శబ్దము చేయునది.
నానార్థాలు :
సర్పభేదము, ఐరామము, అమృతము, కలువలవనము, ఆరంజిచెట్టు.
ఐరావతము
సం., వి ., అ., న., పుం., తత్స., = వంపులేని నిడుపాటి ఇంద్రధనుస్సు, ఇంద్రకుంజరము, అభ్రమువల్లభము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రహస్తి. ఇంద్రుని ఏనుగు. ఇరా జలాని విద్యంతే అస్మిన్నితి ఐరావతః, సముద్రము నందు పుట్టినది.
పర్యాయపదాలు :
శ్వేతకుంజరము, గజాగ్రణి, తెల్లఏనుగు, అభ్రమాతంగము, ఐరావణము, హస్తిమల్లము.
నానార్థాలు :
సుదామ, నారదబ్బ, నిమ్మ, తూర్పు దిగ్గజము, దేవయానము, స్థితి, ఎఱ్ఱచందనం, ఒకానొక పాము, మబ్బుమీద వచ్చెడిమబ్బు (దీనిని రాజమేఘమందురు), నాలుగు దంతములు కలిగినది, మల్లనాగము, సదాదానము, ఇరావతి అనగా మెఱుపు, ఇరావతి నది సమీపదేశము, ఇంద్రుని యొక్క ధనుస్సు.
ఐరావతి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = మేఘము నందు పుట్టినది, మెఱుపు వలె ఎఱ్ఱనైనది, విద్యుద్విశేషము, సిందూరము వలె ఎఱ్ఱనైనది, మెఱుపు, కోలమెఱుపు, విద్యుత్తు, ఐరావతుని భార్య.
వ్యుత్పత్త్యర్థము :
ఐరాజతాని విద్యంతేస్వ ఇరావాన్ మేఘః అస్య ఇయమ్. ఇరానీ జలములు దీనియందు ఉన్నవి. ఇరానీ మేఘమునకు సంబంధించినది. ఇరా జలాని విద్యంతే అస్యేతి ఐరావతీ. ఐరావతము యొక్క భార్య.
నానార్థాలు :
నారింజచెట్టు, పంజాబునందలి రావి అనునది, ఐరావతీనది, వటపత్త్రి వృక్షము, దేవయానమునందలి మూడవవీథి, విద్యుద్విశేషము, పాంచాలదేశీయనదీ విశేషము, ఇప్పుడు రావీ అని పిలువబడుచున్నది, ఉత్తరమార్గమందు ఒక నక్షత్రవీధి.
ఐరిణము
సం., వి., అ., న., తత్స., = చౌటుప్పు(రాళ్ళ ఉప్పు), పాంశులవణము, చౌటినేల యందు పుట్టునది, కందకం, ముండ్లకంచె- రాతి ప్రాకారాలతో ప్రవేశయోగ్యం కాకుండా చేసిన దుర్గము.
ఐరుండకము
సం., వి., అ., న., తత్స., = గుమ్మము.
ఐరుక
సం., విణ., అ., పుం., స్త్రీ., తత్స., = పురోడాశము తయారు చేయుట.
ఐరేయము
సం., నా. వా., అ., న., తత్స., = ఇరా భూమియందు పుట్టినది, అన్నము ముద్ద నుండి పుట్టిన మద్యము, కుజుడు, అన్నము మొదలైనవి.
ఐర్మ్యము
సం., వి., అ., న., తత్స., = వ్రణమును మాన్చు ఒక లేపన ద్రవ్యము.
ఐలబిలుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= కుబేరుడు, పైఁడిఱేఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఐల బిలాయాః స్త్రియా అపత్యం ఐలబిలః. ఇలబిలాయా అపత్యం పుమాన్ ఇతి ఐలబిలః. ఇలబిల అను స్త్రీ యొక్క కుమారుడు, ఇలా విలా పుత్రుడు.
పర్యాయపదాలు :
శివుని సఖుడు, యక్షరాజు, గుహ్యకేశ్వరుడు, మనుష్యధర్ముడు, ధనదుడు, రాజరాజు, ధనాధిపుడు, కిన్నరేశుడు, వైశ్రవణుడు, పౌలస్త్యుడు, నరవాహనుడు, యక్షుడు, ఏకపింగుడు, శ్రీదుడు, పుణ్యజనేశ్వరుడు, ఐడవిడుడు, ఐడవిలుడు, ఐలవలుడు, ఏలవిలుడు.
ఐలము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= భూసంబంధమైనది, అన్నరాశి.
ఐలవాలుకము
సం., వి., అ., న., తత్స., = సుగంథి ద్రవ్యము.
ఐలవిలుడు
సం., వి., అ., పుం., తత్స.,= కుబేరుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇడ(ల) విడా(లా) యా అపత్యమ్. ఇలబిల అను స్త్రీ యొక్క కుమారుడు .
ఐలాకుడు
సం., విణ., (అ. ఆ. అ).,తత్స., = ఐలాక్యుని యొక్క శిష్యుడు.
ఐలారము
సం., నా. వా., అ., పుం., తత్స., = మూలికా విశేషము(అయిలారము యొక్క రూపాంతరము).
ఐలికుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఇళిని అను బ్రహ్మవాదిని యందు పుట్టినటువంటి వాడు, దుష్మంతశుష్యంతాదులు.
ఐలుడు
సం., వి., అ., పుం., తత్స., = బుధ పుత్రుడైన పురూరవుడు, కుజుడు, అన్నసమూహము, భూమి నుండి పుట్టిన అన్నము, బుధ పుత్రుడు, భూసంబంధమైనది.
ఐలేయము
సం., వి., అ., పుం., న., తత్స., = నూఁగుదోసచెట్టు, ఏలావాలుకము, ఏలివాలుకం, సుగంధి, హరివాలుకము, కూతురు బుడమ, వాలుకము(చలించునది), తోకమిరియము, ఏలవాలువు.
వ్యుత్పత్త్యర్థము :
ఇలాయాః అపత్యమ్, ఇలసంతానము. భౌమే మంగలే ఇలాయాం భవః. భూమియందు బుట్టినది.
ఐశము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = శివునికి సంబంధించినది, ఏలికకు సంబంధించినది, దుర్గ, ప్రబ్భ్యి.
వ్యుత్పత్త్యర్థము :
ఈశసంబంధిని, ఈశ్వరసంబంధిని, దుర్గాయాం. ఈశునకు సంబంధించినది, ఈశ్వర సంబంధమైనది, దుర్గాదేవి యందు.
ఐశాని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఈశానునకు సంబంధించినది, పూర్వోత్తర దిక్కు, ఈశాన్యమూల.
ఐశ్వరము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = 96 అంగుళములు, జంత్రముతోడిపాట,ఈశ్వరునికి సంబంధించినది, 4 మూరల ప్రమాణము, ఒకశివగుణము, అణిమాదులు.
ఐశ్వర్యము
సం., వి., అ., న., తత్స., = సంపద, భూతి, విభూతి, అణిమాది(ఇది 8 విధములు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము).
వ్యుత్పత్త్యర్థము :
ఈశ్వర స్వభావ ఐశ్వర్యం, ఈశ్వరభావము ఐశ్వర్యము. ఈశ్వరునికి సంబంధించినది.
నానార్థాలు :
96 అంగుళములు, జంత్రముతోడిపాట, 4 మూరల ప్రమాణము, ప్రభుత్వము, నియంతృత్వము, పాలకత్వము.
ఐషమః
సం., అవ్య., తత్స.,= ఈ సంవత్సరము.
వ్యుత్పత్త్యర్థము :
అస్మిన్ వత్సరే, వర్తమానవత్సరే, నడచునట్టి యేటియందు వర్తించును.
ఐషమస్తనము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఈ సంవత్సరపుది.
ఐషమస్త్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఈ సంవత్సరముది.
ఐషీకము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఇషికకు సంబంధించినది
ఐషుకారి
సం., వి., ఇ., పుం., తత్స., = ఇషుకారుని యొక్క సంతానము, దానికి సంబంధించిన దేశము.
ఐషుకార్యాది
సం., వి., ఇ., పుం., తత్స.,= భక్తర ప్రత్యయమత్తమునందు, శబ్దగణ భేదమునందు.
వ్యుత్పత్త్యర్థము :
పాణిన్యుక్తే విషయే దేశేఽర్థే భక్తల్‌ప్రత్యయనిమిత్తే శబ్దగణ భేదే.స చ గణః. పాణిని చెప్పిన విషయము నందు దేశార్థమునందు.
ఐష్టికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= గ్రంథము.
వ్యుత్పత్త్యర్థము :
ఇష్టిని గూర్చిచెప్పునది, ఇష్టికి సంబంధించినది.
ఐహము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= దోస.
ఐహలౌకికము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = ఇచ్చటిది, ఇహలోక సంబంధమైనది, ఇహలోక వ్యాపారమందు దృష్టికలవాడు.
ఐహికము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స., = ఇహలోక వృత్తి సంబంధమైనది, ఇచ్చటిది.