అచ్చులు : ఔ
ఔ
సం., నా. వా., తత్స.,= ఒక యక్షరము, అంగీకారమును దెలపును, ప్రశంసను దెలుపును( ఆమ్రేడితమునందు ఔనౌ).
వ్యుత్పత్త్యర్థము :
ఔకారః స్వరవర్ణభేదః కంఠౌష్ఠస్థానయోరుచ్చార్యః దీర్ఘః. ఔకారము ఒక స్వరవర్ణభేదము, కంఠోష్ఠములతో ఉచ్చరించు దీర్ఘమాత్ర అక్షరము.
1. ఆహ్వానార్థమునందు, 2. సంబోధనార్థమునందు 3. విరోధార్థమునందు, 4. నిర్ణయార్థమునందు 5. అనంతార్థమునందు, 6. శబ్దమునందు, పృథివీ అక్షరమునందు.
ఔక్థ
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = ఉక్థుని సంతానము, ఓక్థుని శిష్యుడు.
ఔక్షకము
సం., వి., అ., న., తత్స., = ఉక్షముల(ఎద్దుల) సమూహము, ఎద్దులకు సంబంధించినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్ష్ణాం సమూహః ఔక్షకం. ఎద్దుల యొక్క సమూహము.
ఔక్షము
సం., నా. వా., అ., న., తత్స., = ఎద్దుల గుంపు, ఎద్దుల కదుపు పేరు, ఉక్షముల సమూహము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్ష్ణాం సమూహః ఔక్షకం. ఎద్దుల యొక్క సమూహము.
ఔక్‌థికుడు
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= ఉక్థసామము తెలిసినవాడు, ఔక్థికులధర్మము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థమనే సామమును నేర్చిన/నేర్చుకుంటున్నవాడు.
ఔఖీయుడు
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= ఉఖుడను గురువు చేత బోధింపబడిన బ్రాహ్మణమును నేర్చుకొనుచున్నవాడు.
ఔఖ్యము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = గిన్నెయందు వండబడినది, ఒక నగరము, ఆనగరమున పుట్టిన వ్యక్తి.
వ్యుత్పత్త్యర్థము :
ఉఖమునందు వండబడినది ఔఖ్యము.
ఔగ్ర్యము
సం., విణ., అ., న., తత్స.,= ఉగ్రస్వభావము, ఉగ్రత్వము, భయంకరత్వము, క్రూరత్వము.
ఔఘము
సం., విణ., అ., పుం., తత్స., = జలసమూహము, వరద.
ఔచథ్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= దీర్ఘతమసుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉతథ్యస్యాపత్యమ్ .ఉతథ్యుని సంతానము
ఔచితి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఉచితత్వము, యోగ్యత, ఉచితము, తెలుసుకొనినది.
వ్యుత్పత్త్యర్థము :
ఔచిత్యం ఔచితీ. ఉచితమైనది ఔచితి.
ఔచిత్యము
సం., వి., అ., న., తత్స.,= ఔచితి, సత్యము, తెలుసుకొనినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉచితస్య భావః. ఉచితముయొక్క భావము. ఔచిత్యం ఔచితీ. ఉచితమైనది.
ఔజసికుడు
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= బలముకలవాడు, ఓజస్సు కలవాడు, శూరుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఓజస్సుతో ప్రవర్తిల్లువాడు ఔజసికుడు.
ఔజస్యము
సం., విణ., అ., న., తత్స.,= ఓజస్సు, బలము.
ఔజ్జయనకుడు
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉజ్జయినీ నగరవాసి.
వ్యుత్పత్త్యర్థము :
ఉజ్జయిన్యాం జాతాది. ఉజ్జయినీ నగరమున జన్మించినవాడు.
ఔజ్జిహాని
సం., నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స., = ఉజ్జహనుని స్త్రీ సంతానము.
ఔజ్జ్వల్యము
సం., వి., అ., న., తత్స., = ఉజ్జ్వలత్వము, ప్రకాశగుణము, తళతళమనుజిగి.
ఔడ
సం.,నా.వా.,(అ. ఆ. అ).,తత్స= (1)ఆర్ద్రేతతః నడ?ాఫక్. ఔడాయన (2)ఆర్ద్రస్య యువాపత్యేతస్య విషయోదేశః ఐషుకాయ్యామక్తల్. ఔడాయనభక్త (3)తదీయే విషయే దేశే
ఔడపము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = తెప్పకు సంబంధించినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉడుపేన నిర్వృతాది. ఉడుప సంబంధమైనది.
ఔడవము
సం., వి., అ., పుం., తత్స.,= అయిదు స్వరములతో కూడిన రాగము, నక్షత్రముతో కూడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉడువులకు (నక్షత్రములకు) సంబంధించినది ఔడవము.
ఔడవి
సం., నా. వా., (ఇ. ఈ. ఇ)., తత్స., = రాగవిశేషమును అనుశీలయించునది.
ఔడుంబరము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= ఔదుంబరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉడుంబరస్య వికారః ఉడుంబరము యొక్క వికారము.
నానార్థాలు :
రాగిలోహము, మేడి చెట్టు, ఒక ముని, యమునికి ఒక పేరు.
ఔడుపము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తెప్పకు సంబంధించినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉడుపేన నిర్వృత్తాది. ఉడుపసంబంధమైనది. చంద్ర నిర్వృత్తే ,ప్లవనిర్వృత్తే , తత్సన్నికృష్టదేశే చ
ఔడులోమి
సం., నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స., = ఉడులోముని పుత్రిక, ఉడులోముని పుత్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉడులోమ్నోఽపత్యమ్. ఉడులోముని సంతానము.
ఔడ్రుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఓఢ్రదేశమునకు చెందినవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఓడ్రదేశానాం రాజా. ఓడ్రదేశపురాజు.
ఔతథ్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = దీర్ఘతమసుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉతథ్యుని పురుషసంతానమైన దీర్ఘతమసుడు.
ఔత్కంఠ్యము
సం., వి., అ., న., తత్స.,= ఉత్కంఠమైనది, తహతహ.
ఔత్కట్యము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉత్కటమైనది, తహతహ.
ఔత్కృష్ట్యము
సం., వి., అ., న., తత్స., = ఉత్కర్షము, మేలు, ఉత్కృష్టమైనది, గొప్పతనము.
ఔత్తమి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఉత్తముని పుత్రుడు, ఒక మనువు పేరు, ఉత్తముని భార్య, ఉత్తముని పురుష సంతానము.
ఔత్తరపథికుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ఉత్తరమార్గమున వెళ్ళువాడు.
ఔత్తరపదికము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = ఉత్తరపదమును అనగా తరువాత పదమును గ్రహించునది.
ఔత్తరము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ఉత్తర దిక్కున ఉన్నది, తర్వాతది, తరింపచేయునది.
ఔత్తరవేదిక
సం., నా.వా., (అ. ఆ. అ)., తత్స., = తరువాత వేదిలో జరుపు కర్మ.
ఔత్తరాధర్యము
సం., నా. వా., అ., న., తత్స., = పైన, క్రింది స్థితులలో ఉన్నది.
ఔత్తరాహుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉత్తరదేశమునకు చెందినవాడు.
ఔత్తరేయుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= పరీక్షిత్తు, ఉత్తరాభిమన్యుల కుమారుడు.
ఔత్తానపాది
సం., వి.,ఇ., పుం., తత్స.,= ధ్రువుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తానపాదస్య అపత్యం ఔత్తానపాదిః. ఉత్తానపాదుని కొడుకు ఔత్తానపాది.
ఔత్పత్తికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= స్వభావము వలన కలిగినది, నిత్యము శబ్దార్థ సంబంధము మొదలుగునవి.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పత్త్యాభావేన. ఉత్పత్తి చేతకలిగినది.
ఔత్పాతికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఉత్పాతమును కలిగించునది, అశుభమును సూచించునది.
ఔత్పాదము
సం., విణ., (అ. ఆ. అ).,తత్స.,= పుట్టుకను గూర్చి చెప్పునది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పాదం తదావేదగ్రంథం. ఉత్పాదం గూర్చి తెలియజేయునది.
ఔత్పుటము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = హస్తముద్రలకు దగ్గరగానున్నది, చేతులను జోడించి ముద్రను రచించి నిర్వర్తించుట.
ఔత్పుటికము
సం., నా. వా (అ. ఆ. అ)., తత్స., = ఉత్పుటముద్ర ద్వారా గ్రహించుట.
ఔత్సంగికము
సం., విణ., (అ. ఈ. అ).,తత్స., = ఒడిలో ఉన్నది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సంగేన హరణి. ఒడిలోపెట్టుకుని తీసుకునిపోబడునది.
ఔత్సము
సం., విణ., (అ. ఈ. అ).,తత్స.,= సెలయేటిలో పుట్టినది. (ఉత్సేభవః)
ఔత్సర్గికము
సం., విణ., (అ. ఈ. అ).,తత్స.,= స్వాభావికము, సహజము, విడుచునది, త్యజించునది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సర్గం సామాన్య విధిమర్హతి. సామాన్యవిధికి సంబంధించినది. ఉత్సుకస్య భావః - ఉత్సుకత యొక్క భావము.
ఔత్సుక్యము
సం., వి., అ., న., తత్స.,= ఉత్సుకత్వము, ప్రియస్మరణాదుల చేత గాల విలంబము నోర్వలేమి, ఉత్కంఠ, తీవ్రమైన కోరిక, వేడుక, వ్యభిచారిభావ భేదము. ఇచ్ఛ.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సుకస్యభావః. ఉత్సుకత యొక్క భావము.
ఔత్‌క్షేపుడు
సం., నా. వా., అ., పుం.,ఈ., స్త్రీ., తత్స., = ఉత్ క్షేపుని పుత్రుడు, ఉత్ క్షేపుని పుత్రిక (స్త్రీ).
వ్యుత్పత్త్యర్థము :
ఉత్‌క్షేపకస్యాపత్యం. ఉత్ క్షేపుని సంతానము.
ఔదకము
సం., విణ., (అ. ఈ. అ).,తత్స., = నీటికి సంబంధించినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకేన పూర్ణం గృహ్ణాతి ఉదకస్యేదం వా. నీటికి సంబంధించినది, నీటి యందు పుట్టునది.
ఔదజ్ఞాయని
సం., నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స., = ఉదజ్ఞ ఋషి సంతానము.
ఔదనికుఁడు
సం., విణ.,(అ. ఈ. అ.).,తత్స.,= వంటవాడు, ఆరాళికుడు, ఆంధసికుడు, పాకమైన దానిని తిరగబోసి వండువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఓదనం ప్రయోజనమేషాం తేజౌదనికాః. అన్నము ప్రయోజనముగా కలవారు.
ఔదభృజ్జి
సం., నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స., = ఉదభృజ్జుని సంతానము, ఉదభృజ్జుని యువ సంతానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదభృజ్జస్యాపత్యమ్. ఉదభృజ్జ సంతానము.
ఔదమేధీయము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = నీటి మేఘమునకు సంబంధించినది.
ఔదమేయి
సం., నా. వా., ఇ., పుం., ఈ., స్త్రీ., తత్స., = ఉదమేయుని సంతానము (పుత్రుడు/పుత్రిక).
ఔదయికము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అభివృద్ధి ప్రయోజనముగా కలది, అభివృద్ధికి కారణమైనది.
వ్యుత్పత్త్యర్థము :
ఉదయేలగ్నకాలేభవః. ఉదయలగ్నకాలమున ఉన్నది.
ఔదరము
సం., విణ.,(అ. ఈ. అ)., తత్స., = పుల్లగంజి.
ఔదరికుఁడు
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స.,= ఐహికాముష్మికసాధనమైన ఉద్యోగము లేక పొట్టపోసికొనువాడు, తిండియందే ఆసక్తికలవాడు, జయించవలెనను కోరిక లేనివాడు. ; పుం. కుక్షింబరుడు, ఆద్యూనుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉదరేప్రసితః. ఉదరే ఆసక్తః ఔదరికః. పొట్టనింపుకొనువాడు.
ఔదర్యము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = జఠరాగ్ని.
వ్యుత్పత్త్యర్థము :
ఉదరే భవః, ఉదరమున పుట్టినది.
ఔదలుడు
సం., నా.వా.,(అ. ఆ. అ)., తత్స., = ఒక ఋషి, ఔదల, ఔదలము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదలగోత్రములో పుట్టినవాడు.
నానార్థాలు :
శిరసావహించి, నడితల, ఒక సామమునకు పేరు.
ఔదవాపి
సం., నా. వా., ఇ., పుం.,ఈ., స్త్రీ., తత్స.,= ఉదవాపముని సంతానము.
ఔదవాహి
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= వంశవర్ణనము, ఋగ్వేదులు తర్పణములనిచ్చు 12 మంది ఋషులలో ఒకరు.
ఔదశ్విత్కము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= మజ్జిగతో చేయబడినది.
ఔదస్యము
సం., నా. వా., అ., న., తత్స., = పొదుగున పుట్టినది
ఔదార్యము
సం., వి., అ., న., తత్స., = ఉదారత్వము, ఒక శబ్దగుణము. ; పుం. ఉదారస్వభావము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదారస్య భావః. ఉదారము యొక్క భావము ఔదార్యము.
ఔదాసీన్యము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉపేక్ష, , అలవాటు పడినది, స్పందన లేక ఊరుకుండుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉదాసీనస్యభావః. ఉదాసీనత యొక్క భావము. శుభాశుభయోరుపేక్షాయామ్ తాటస్థ్యే. తాటస్థ్యము. రాహిత్యే. వైరాగ్యం. రాగనివృత్తౌ చ రాగనివృత్తి.
ఔదాస్యము
సం., విణ., అ., న., తత్స., = వైరాగ్యభావన, మనస్సు నిలుపని తటస్థభావము.
వ్యుత్పత్త్యర్థము :
వైరాగ్యే రాగశూన్యతాయామ్. వైరాగ్యం నందు రాగవిరహమందు, మనోయోగవిరహే. మనోయోగవిరహమందు.
ఔదుంబరము
సం., వి., అ., న., తత్స.,= ఒక లోహము, రాగి, కృష్ఠభేదము, వానప్రస్థుడు.
ఔదుంబరాయణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = గృహస్థుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉదుంబరస్య గోత్రాపత్యమ్. ఉదుంబరుని కుమారుడు.
ఔద్గాత్రము
సం., నా. వా., అ., న., తత్స.,= యజ్ఞమునందు సామవేదమును పఠించు ఋత్విక్కు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ గాతుర్థర్మ్యామ్. ఉద్గాత, అతడు యజ్ఞమునందు చేయవలసిన విధి ఔద్గాత్రము.
ఔద్గాహమాని
సం., నా. వా., ఇ., పుం.,ఈ., స్త్రీ., తత్స.,= ఉదగాహమానుడను ఋషి యొక్క స్త్రీ/పురుషసంతానము.
ఔద్దత్యము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స.,= ఉద్ధతుని భావము, అవినీతుని భావము.
ఔద్దాలకము
సం., వి., అ., న., తత్స.,= పుట్టలో పెట్టిన తేనె, పుట్టతేనె.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్దాలేన ఉద్దలనేన నిర్వృత్తః. ఉద్దాలము ద్వారా చేయబడినది. ప్రాయో వల్మీకమవ్యస్థాః కపిలాః స్వల్పకీటకాః. కుర్వంతి కపిలం స్వల్పం తత్ స్యాదౌద్దాలకం
ఔద్దాలకి
సం., నా. వా., ఇ., పుం.,ఈ., స్త్రీ., తత్స., = ఉద్దాలకుని స్త్రీ/పురుషసంతానము.
ఔద్ధతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = ఔద్ధత్వము.
ఔద్ధత్యము
సం., వి., అ., న., తత్స., = ఉద్ధతత్వము, ఉద్ధతగుణము, ఏపు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధతస్వభావః. ఉద్ధత స్వభావము.
ఔద్ధత్వము
సం., వి., అ., న., తత్స., = ఉద్ధతగుణము, ఏపు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధతస్వభావః. ఉద్ధత స్వభావము.
ఔద్ధారికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = వివాదసమయంలో పిత్రార్జితము నుండి పెద్దకుమారునకు ముట్టిన అధిక ధనభాగము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధారాయ ఉదృత్వదానాయ ప్రభవతి. వివాదసమయంలో పెద్దకుమారుని ఉద్ధరించుటకు ఉపయోగపడునది.
ఔద్భారి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఉద్భారుడనే ఋషి యొక్క సంతానము.
ఔద్భిజ్జము
సం., విణ., అ., న., తత్స.,= చవిటి ఉప్పు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్బిద్యజాయతే. భూమిని చీల్చుకుని పుట్టినది.
ఔద్భిదము
సం., విణ., అ., న., తత్స.,= మొలక, పాంశులవణము, ఊటనీరు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్బినత్తి. భూమిని భేదించుకుని పుట్టినది.
ఔద్భిద్యము
సం., విణ., అ., న., తత్స., = వృక్షములనుండి పుట్టినది.
ఔద్వాహికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = వివాహసమయమున లభించినది లేక ఈయబడినది.
ఔధసము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = పొదుగులోనిది.
వ్యుత్పత్త్యర్థము :
ఉథస ఇదమ్. ఉధసమునకు చెందినది. ఊధః సంభంధిని .
ఔన్నతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= గొప్పతనము, ఎత్తు.
ఔన్నత్యము
సం., నా. వా., అ., న., తత్స., = గొప్పతనము, ఎత్తు, ఉన్నతము.
ఔపకర్ణికము
సం., విణ., (అ. ఆ. అ).,తత్స.,= చెవులకు దగ్గరగా ఉన్నది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపకర్ణం ప్రాయభవః. చెవులకు సమీపంగా ఉన్నది.
ఔపకాయనుడు
స., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స.,= ఉపకుడను ఋషి గోత్రమున పుట్టిన స్త్రీ లేక పురుషుడు.
ఔపకార్యము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = గుడారము, డేరా, రాజగృహము.
ఔపగవకము
సం., వి., అ., న., తత్స., = ఔపగవముల సమూహము (ఔపగవములు-ఉపగువునపత్యములు).
వ్యుత్పత్త్యర్థము :
ఔపగవానాం సమూహః ఔపగవకం. ఉపగుల యొక్క అపత్యములు ఔపగవములు, వారి సమూహము ఔపగవకము.
ఔపగవము
స., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స.,= ఉపరగతోగౌరస్య ఉపగుర్గోపః తస్యాపత్యమ్ అణ్. (1)గోపాలకపుత్రే (2)తద్యాజిపుత్రే చలక్షణయా ఉపగుశబ్దస్తధాజివిప్రోఽపి ఉపగుశబ్దేనోచ్యతే (3)తత్సమ్బన్ధిని లక్షణే (4)అఙ్కే (5)సంఘే చతస్యాపత్యే తు స్త్రియాం ఙీష్. ఔపగవస్యేదమ్. ఔపగవక=ఔపగవసమ్బన్ధిని. ఔపగవక తత ఆగతేఽర్థే. తేషాం సమూహః గోత్రోక్షోష్ట్రేత్యాదినా వుఞ్=ఔపగవక=తత్సమూహే నఔపగవోభక్తిరస్య.
ఔపగ్రస్తికుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= గ్రహణకాల సూర్యుడు లేక చంద్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగ్రస్తం గ్రాసకాలం భూతః. ఉపగ్రస్తకాలం పొందినవాడు.
ఔపచం(జ)ధని
సం., నా. వా., ఇ., పుం., తత్స., = శుక్లయజుబ్రాహ్మణ వంశమునందు ఒక ఋషి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపచంధుని సంతానము ఔపచంధని.
ఔపచారము
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స.,= ప్రయోజనముగా కలిగినది, ఉపచారమువలన కలిగినది(ఒకదాని ధర్మమును మరొకదానియందు ఆరోపించగా కలిగినది.)
ఔపచారికము
సం., విణ.,(అ. ఈ. అ.)., తత్స., = అప్రధానము, ఉపచారము, ప్రయోజనముగా కలిగినది, ఉపచారము వలన కలిగినది, ఒక దాని ధర్మమును మరొకదానియందు ఆరోపించగా కలిగినది.
ఔపచ్ఛందసికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ఒకానొక మాత్రావృత్తము.
ఔపజానుకము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = మోకాళ్ళ వరకు ఉన్నది.
వ్యుత్పత్త్యర్థము :
మోకాళ్ళసమీపమున ఉన్నది లేక అంతవరకూ వ్యాపించినది.
ఔపతస్విని
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఉపతస్వికుమారుడు, రాముడను పేరుగలవాడు.
ఔపదేశికము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= ద్రవ్యాదులు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపచ్ఛందసా నిర్వృత్తం. ఉపదేశముచేత పొందబడినది. ఉపదేశోపజీవిని.ఉపదేశేన ప్రాప్తః
ఔపద్రవికము
సం., నా.వా., (అ. ఆ. అ)., తత్స., = ఉపద్రవమును గురించిన సుశ్రుతగ్రంథంలో ఒక భాగము.
ఔపద్రష్ట్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉపద్రష్ట్రుని భావము.
ఔపద్రష్ట్ర
సం., నా. వా., ఆ., పుం., తత్స., = ఉపద్రష్టృ భావము కలవాడు.
ఔపధికుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = మోసకాడు, కపటముకలవాడు.
ఔపధేనవుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = సుశ్రుతమున ధన్వంతరిని ప్రశ్నలడుగు ఋషులలో నొకడు, ధేనువుచే అనుగ్రహింపబడిన వాని కుమారుడు.
ఔపధేయము
సం., విణ., అ., న., తత్స.,= రథ చక్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపధి (బ్రండికన్ను)గా ఉపయోగింపబడినది.
ఔపనాయనికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ఉపనయనమునకు యుక్తమైనది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపనయనం ప్రయోజనమస్య. ఉపనయనమునకు ఉపయోగముగాకలది.
ఔపనాసిక
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ముక్కుకు దగ్గరలో పుట్టినది.
ఔపనిధికము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఇల్లడ, న్యసము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపానథిరేవ. ఉపనిధి ప్రయోజనము కలది.
ఔపనిషత్కుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఉపనిషత్తుల మార్గముననుసరించువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపనిషదా తదుక్తోపదేశేన జీవతి. ఉపనిషత్తులలో చెప్పబడిన మార్గంలో జీవించువాడు.
ఔపనిషదకము
సం., విణ.,(అ. ఈ. అ)., తత్స.,= ఉపనిషత్తులకు చెందినది, ఏశాస్త్రములనందైనా సారభూతమైన విషయం, ఉపనిషత్తులు తెలిసినవాడు, ఉపనిషధర్మము ఉపదేశించి జీవించువాడు.
ఔపనిషదము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స.,= ఉపనిషత్తును తెలిసినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపనిషత్వ్సేవా భేవ్యజ్యతే. ఉపనిషత్తు అందలిది (బ్రహ్మము). ఉపనిషత్తుల వలన కలిగినది. ఉపనిషద్వ్యాఖ్యానమగునది (గ్రంథము).
ఔపనిషదుఁడు
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స.,= ఉపనిషత్తు తెలిసినవాడు.
ఔపపక్ష్యము
సం., విణ., (అ. ఆ. అ).,తత్స., = బహుమూలమునకు చెందినది.
ఔపపత్తికము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉపపత్తి కలది, యుక్తియుక్తము, తగినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపపత్యాకల్పితమ్, ఉపపత్తిచే కల్పింపబడినది
ఔపపాతికుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉపపాతకము చేసినవాడు,
వ్యుత్పత్త్యర్థము :
ఉపపాతకేన గోవధాదినా సంసృష్ఠః. గోవధ మొదలైన పాతకములు కలవాడు.
ఔపబాహవి
సం, నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స.,= ఉపబాహుని సంతానము.
ఔపభృతము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఉపభృత సంబంధమైనది.
ఔపమన్యవుడు
సం., నా. వా., అ., పుం.,ఈ., స్త్రీ., తత్స.,= ఉపమన్యునికి పుట్టినవాడు.
ఔపమికము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స.,= ఉపమాచేత నిర్ధిష్టింపబడినది.
ఔపమ్యము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉపమ, పోలిక, ఉపమానమునందు, సదృశార్థమునందు.
ఔపయికము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స. = న్యాయముతో కూడినది, యుక్తము, అభిముఖముగా బొందింపబడును.
వ్యుత్పత్త్యర్థము :
ఉపాయమే ఔపయికము. ఉపాయేన సంజాతః. ఉపాయము చేత పుట్టినది.
పర్యాయపదాలు :
న్యాయము, పొందుటకు యోగ్యమైనది, ఉపయుక్తము, న్యాయము వలన బాయనిది, న్యాయమును బొందునది, ఉచితము.
ఔపయౌగికము
సం., విణ.,(అ. ఈ. అ)., తత్స.,= ఉపయోగనిమిత్తమైనది.
ఔపరిష్టము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = మీద ఉన్నది, పైన.
ఔపలము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = రాతిది, రాళ్లనుండి వచ్చునది. (పన్ను మొదలుగునవి)
ఔపవస్త్రము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఉపవస్త్రసంబంధమైనది.
ఔపవాసికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఉపవాసమందు తగినది, ఉపవాస సమర్థమైనది.
ఔపవాస్యము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉపవాసము.
ఔపవాహ్యము
సం., వి., అ., పుం., తత్స.,= రాజు ఏక్కెడి ఏనుగు, స్వారిచేయుటకు తగినది(బండి, గుఱ్ఱము,లోనగునవి), రథము, పట్టపుటేనుగు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపవాహ్య ఏవ. రాజవాహ్యః. రాజుగారి ఏనుగు.
ఔపవిందవి
సం., నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స., = ఉపవిందునికి పుట్టినవాడు లేదా పుట్టినది.
ఔపవిభక్తికము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉపవిభక్తి, (ఆంధ్రవ్యాక) ఉపవిభక్తి, ద్వితీయాద్యేక వచనములు పరమైనపుడు వచ్చెడు ఆగమాదేశరూపమైన ఇ, టి, టీ, మొదలుగు 2 ఉపవిభక్తులు చేర్చబడు ప్రాతిపదికము. (కాలు, నీరు, సేయి మొదలుగునవి)
ఔపవేశికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ఉపవేశనముచేత జీవించునది.
ఔపశ్లేషికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ఏకదేశ సంబంధము కలది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపశ్లేషేణ నిర్వృత్తః. కౌగిలింతచే కలిగినది.
ఔపసంక్రమణము
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స.,= ఉపసంక్రమణమున ఇవ్వబడినది.
ఔపసర్గికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఉపసర్గమునకు సంబంధించినది, పాతరోగ విశేషము, అరిష్టసూచకమైనది (గ్రహదోషది).
వ్యుత్పత్త్యర్థము :
ఉపసర్గాయ ప్రభవతి. ఉపసర్గము వలన వచ్చినది.
ఔపస్థానికుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= సేవకుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపస్థానేన సేవనేన జీవతి. సేవచేసి జీవించువాడు.
ఔపస్థానుడు
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స., = ఉపస్థాన శీలుడు, ఉపాసకుడు, సేవకుడు.
ఔపస్థికి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = వేశ్య, వ్యభిచారవృత్తిచే జీవించు స్త్రీ.
ఔపస్థ్యము
సం., నా. వా., అ., న., తత్స., = సురతము, సురతసుఖము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపస్థస్యభావః. ఉపస్థము యొక్క భావము. ఉపస్థవ్యాపారము.
ఔపహారికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ద్రవ్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపహారాయసాధు. ఉపహారార్థమైనది.
ఔపాదికము
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స.,= ఉపాధికృతమైనది.
వ్యుత్పత్త్యర్థము :
తేన నిర్వృత్తః. ఉపాధివలన కలిగినది.
ఔపావి
సం., నా. వా., ఇ., పుం., స్త్రీ., తత్స.,= ఉపావస్యుని సంతానము. (ఉపావస్యాపత్యమ్)
ఔపాసనము
సం., వి., అ., న., తత్స., = గృహస్థుడగు బ్రాహ్మణుడు ప్రాతఃకాలమునందు చేయు అగ్ని ఉపాసన, గృహ్యగ్నికి సంబంధించినది, ఉపాసనకు సంబంధించినది. ; విణ. ఉపాసనావిషయమయినది.
ఔపాసహ్యము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = తోలు, చెప్పులు కుట్టుటకు వాడునది.
ఔపోదితి
సం., నా. వా., ఇ., పుం., ఈ., స్త్రీ., తత్స., = ఉపోదితునికి పుట్టినవాడు, పుట్టినది.
ఔప్తిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = నాటకములోని అక్క.
ఔబలము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స.,= మల్లయుద్ధము.
ఔమకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= నార మొదలగునవి, అగిసెచెట్టు వలన కలిగినది.
ఔమము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఔమకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉమయావికారః. ఉమకు సంబంధించినది.
ఔమాకము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఉమ వికారము.
ఔమీనము
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స., = ఉమలు పండెడునది, ఉభ్యము, ఉమాక్షేత్రము, భూమి, పొలము.
వ్యుత్పత్త్యర్థము :
ఉమనాం భవనం క్షేత్రం. ఉమలు(అగిసెలు) పండెడి భూమి.
ఔర
దే., అవ్య., = ఆశ్చర్యమును తెలుపునది( ఆమ్రేడితమునందు ఔరౌర)(ఔర యొక్క రూపాంతరము), అగుర.
ఔరగము
సం., విణ.,(అ. ఈ. అ)., తత్స.,= పాము, ఉరగదేవతాకము, ఆశ్లేషా నక్షత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరమోదేవతాస్య.ఉరగసంబంధమైనది.
ఔరభ్రకము
సం., వి., అ., న., తత్స.,= ఉరభ్రముల సమూహము (ఉరభ్రము-గొఱ్రె), ఉన్ని కంబళి, మేకల యొక్క సమూహము, లొటిపిటల యొక్క సమూహము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరభ్రాణాం సముహః ఔరభ్రకం. గొఱ్రెల యొక్క సమూహము., ఉరభ్రస్య (మేషస్య) ఇదమ్. గొఱ్ఱెలకు సంబంధించినది.
నానార్థాలు :
ఉర్ణాయువు, ఆవికము, రల్లకము, మేషమాంసము.
ఔరభ్రము
సం., విణ., అ., పుం., న., తత్స., = గొఱ్ఱెమాంసము, ఉన్నివస్త్రము, కంబలము, ఊర్ణాయువు, ఊర్ణయువు, ఆవికము, రల్లకము, మేషక్షీరము, ధన్వంతరిని ప్రశ్నలడుగు ఒక ఋషి.
వ్యుత్పత్త్యర్థము :
ఉరభ్రసంబంధమైనది (గొఱ్ఱెది).
ఔరభ్రికుడు
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స.,= గొఱ్ఱెలకాపరి.
వ్యుత్పత్త్యర్థము :
ఉరభ్రములవలన (గొఱ్ఱెల వలన) బ్రతుకువాడు.
ఔరసము
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స.,= ఉరస్సంబంధమైనది, ఆత్మజుడు, తనకు ధర్మపత్నియందు పుట్టినకొడుకు, సవర్ణస్త్రీయందు తనవలన బుట్టిన కొడుకు.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసానిర్మితః ఔరసః. ఉరస్సునందు పుట్టినది. తనఉరస్సు చేత పుట్టినవాడు.
ఔరసికము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ముఖ్యము, ఉరస్సువంటిది.
ఔరసుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= తనకు ధర్మపత్నియందు పుట్టినకొడుకు.
ఔరస్యుఁడు
సం., వి., అ., పుం., తత్స., = తనకు ధర్మపత్నియందు పుట్టినకొడుకు, ఉరస్సునందు పుట్టినది, ఆత్మజుడు, సవర్ణస్త్రీయందు తనవలన బుట్టిన కొడుకు.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసి భవః శరీరావయవత్వాత్ యత్ తతః. ఉరసా నిర్మితః ఔరసః. తనఉరస్సుచేత పుట్టినవాడు.
ఔర్జిత్యము
సం., నా. వా., అ., న., తత్స., = ఊర్జితత్వము.
ఔర్ణ(క)ము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స., = కంబళి, ఉన్ని కంబళి, మొదలయినవి.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ణాయాః వికారః. మేషలోమవికారే కంబలాదౌ. ఉన్నియొక్క వికారము. గొఱ్ఱెవెంట్రుకలతో చేయు కంబళి మొదలయినవి.
ఔర్ధ్వకాలికము
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స., = తరువాతి కాలముది, ఊర్ధ్వ కాలమందలిది.
ఔర్ధ్వదేహము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= పై దేహమునకు సంబంధించినది, ఊర్ధ్వదేహమునకు సంబంధించినది (కర్ణమము).
ఔర్ధ్వదేహికము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ఉత్తరక్రియ.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వదేహ ప్రాపకమైనది, మరణాంతరము చేయబడునది (కర్మము).
ఔర్ధ్వదైహికము
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స.,= అహర్దానము, దేహముకంటే మీద కలుగునది, ఊర్ధ్వదేహమునందు కలుగునది, యాచన.
వ్యుత్పత్త్యర్థము :
మృతార్ధం తదహర్దానం మృతాహేపిండాదిదానం ఔర్ధ్వదైహిక మిత్యుచ్యతే. మృతులైనవారి కొరకు మృతాహస్సులయందు చేయుపిండదానములు.
ఔర్ధ్వరథ్యకము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = యాచన.
ఔర్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= భృగువంశీయుడగు ఒకానొక మహర్షి (ఇతని క్రోధమునుండి పుట్టిన అగ్నియే బడబాగ్ని), వాడవానలుడు, బడబానలము, బడబాగ్ని, వార్వపుటగ్గి.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉర్వస్యబుషేరపత్యం ఔర్యః. ఉర్వుడనుమునికి కొడుకు. 2.ఔర్వాత్ భృగువంశీయాద్ ఋషేర్జాతః ఇతి ఔర్యః., భృగువంశములోని ఋషి నుండి పుట్టినవాడు.
ఔర్వము
సం., వి., అ., పుం., తత్స.,= బడబానలము, బడబాగ్ని, వార్వపుటగ్గి, హింసించునది, బడబ యనగా ఆడుగుఱ్ఱము దాని ముఖమునందుండునది బాడబము, (నపుంసకమందు ఊర్వశి సంతానము, పాంశవలవణము.)
వ్యుత్పత్త్యర్థము :
ఉర్వస్యబుషేరపత్యం ఔర్వః. ఉర్వుడనుమునికి కొడుకు.ఔర్వాత్ భృగువంశీయాద్ ఋషేర్జాతః ఇతి ఔర్యః. భృగువంశములోని ఋషి నుండి పుట్టినవాడు.
ఔర్వరము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= భూమికి సంబంధించినది, బడబాగ్ని, పాంశులవణము, వాడవానలము.
వ్యుత్పత్త్యర్థము :
ఔర్వికి సంబంధించినది, ఉర్వికి సంబంధించినది.ఔర్వాత్ భృగువంశీయాద్ ఋషేర్జాతః. భృగువంశమున పుట్టిన ముని.
ఔర్వవ్రతి
సం., వి., న్., పుం., తత్స.,= జలాహారనియమము గలవాఁడు, జలముతో జీవించువాడు.
ఔర్వశము
సం., విణ., (అ. ఈ. అ).,తత్స., = స్వాధ్యాయమునందు, అనువాచకమునందు, ఊర్వశీసంబంధమైనది.
ఔర్వశేయుఁడు
సం., వి., అ., పుం., తత్స., = అగస్త్యముని, ఆయువు (పురూరవునికొడుకు), ఊర్వశి పుత్రుడు.
ఔలూకము
సం. విణ. (అ. ఈ. అ). తత్స.= ఉల్లుక సంబంధమైనది, కుంపటికాచుకొనువాడు, గుడ్లగూబలగుంపు.
ఔలూక్యుడు
సం., విణ., అ., పుం., తత్స., = కణాదుడు(వైశేషికధర్మ స్థాపకుడు), ఉలూఖుని కొడుకు.
ఔల్బణ్యము
సం., నా. వా., అ., న., తత్స., = ఉల్బణత్వము.
ఔశనసము
సం., నా. వా.,(అ. ఈ. అ)., తత్స.,= శుక్రుని వల్లకలిగినది, ఉశవసుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉశనసా శుక్రేణ ప్రోక్తమ్., శుక్రునికి సంబంధించినది.
పర్యాయపదాలు :
శుక్రునిచే రచించబడినది, శుక్రునిచే రచించబడిన రాజనీతి శాస్త్రము, శుక్రునిచే రచితమగు ఒక ఉపపురాణము, శుక్రునిచే దృష్టమగు సామము.
ఔశలము
సం., నా. వా., అ., న., తత్స., = ఉశలసునిచే దృష్టమగుసామము.
ఔశిజము
సం., నా. వా., అ., పుం., తత్స., = కోరికయందు, ప్రవర ఋషిభేదము.
ఔశీనరుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = శిబి చక్రవర్తి, ఉశీనరుని కొడుకు.
ఔశీరము
సం., వి., అ., న., తత్స., = చామరదండము, శయనము, ఆసనము, చామగము. ; విణ. వట్టివేరువలన పుట్టినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉశ్యతే కామ్యత ఇత్యుశీరం. కోరబడునది. ఉశీరస్య ఇదమ్. ఉశీరమునకు (వట్టివేరు) సంబంధించినది. ఉశీరమువలన పుట్టినది, ఉశీరముతోచేయబడినది. (ఉశీరము – వట్టివేరు)
నానార్థాలు :
శయ్య, పీఠము, లేపనద్రవ్యము, కర్ర, సవరము, స్వాపము, ఉశీరజము.
ఔషణము
సం., నా. వా., అ., న., తత్స.,= కారము, ఊషణము, కటురసము.
ఔషణశాండి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = శొంఠి, ఔషణశీండి.
ఔషణశీండి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = శొంఠి, కటురసము గలది, ఔషణశాండి.
ఔషధము
సం., వి., అ., న., తత్స.,= అగదము, మందు, రోగనాశకము.
వ్యుత్పత్త్యర్థము :
లతాది జాతయః ఓషధ్యః. రోగహరములైన వాని అందెల్ల వర్తించును. ఓషధ్యాః భవ ఔషధః. ఓషధివలన పుట్టినది, ఓషధేరిదమితి ఔషధమ్.
మాట - మంతి :
ఓషధిశబ్దము అకారభేదము చేత ప్రత్యేకముగా దెలియబడుచున్న లతాదిజాతులయందు వర్తించును, త్రిఫలాదులయందు వర్తింపదు, ఔషధశబ్దము జాతివ్యతిరిక్తమై రోగహరములైనవానియందెల్ల వర్తించును.
పర్యాయపదాలు :
మూలిక, వ్యాధినిపోగొట్టునట్టిపండు, వేరు, ఆకు మొదలైననవి, పెక్కుసరుకులతో చేసిన మందు. భేషజము, భైషజ్యము, జాయువు, జైత్రము, ఆయుర్యోగము, గదారాతము, అమృతము, ఆయుర్ద్రవ్యము, శోధనము, శమనము.
ఔషధి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఔషధీయము, ఔషధసంబంధమైనది.
ఔషధీయము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఔషధసంబంధమైనది.
ఔషరకము
సం., నా. వా., అ., న., తత్స.,= చౌటుప్పు, చౌటినేలకు సంబంధించినది.
ఔషరము
సం., నా. వా., అ., న., తత్స.,= అయస్కాంతభేదము, ఒకజాతి.
వ్యుత్పత్త్యర్థము :
ఉషరే భవః, ఉషరమునందు పుట్టినది. పాంశులవణే రాజని.పాంశులవణమందు.
ఔషసము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = వేకువ, ప్రభాతము, ఉషస్సునందలిది, ఉషస్సునకు సంబంధించినది.
ఔషసికుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ప్రభాతమున తిరుగువాడు.
ఔషస్త(స్త్య)ము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స., = ఉషస్తికి సంభందించినది.
ఔషికము
సం., విణ.,(అ. ఈ. అ).,తత్స., = ఉషస్సునందు పుట్టినది, (విల్యమ్సు).
ఔష్టిహ
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స.,= వేదచ్ఛందస్సు.
ఔష్ట్రకము
సం., వి., అ., న., తత్స., = ఉష్ట్రముల సమూహము(ఉష్ట్రము-ఒంటె), లొట్టిపిట్టల యొక్క సమూహము.
వ్యుత్పత్త్యర్థము :
ఉష్ట్రాణాం సమూహః ఔష్ట్రకం. ఒంటెల గుంపు.
ఔష్ట్రము
సం., విణ., అ., న., తత్స., = ఒంటెలు ఎక్కువగా కలదేశము, ఒంటిపాలు.
వ్యుత్పత్త్యర్థము :
ఉష్ట్రమునకు సంబంధించినది .
ఔష్ట్రరథము
సం., విణ., అ., న., తత్స.,= ఒంటెల రథమునకు సంబంధించినది.
ఔష్ఠ్యము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ఓష్ఠమునుండి పుట్టినది.
ఔష్ణము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = వేడి.
వ్యుత్పత్త్యర్థము :
ఉష్ణసంబంధమయినది.
ఔష్ణ్యము
సం., నా. వా., అ., న., తత్స.,= వేడి, ఉష్ణత.
ఔష్మము
సం., నా. వా., అ., న., తత్స., = తాపము, వేడి.
ఔసు
దే., వి.,= సొగసు, ఒయ్యారము
ఔసుకాడు
దే., వి.,= సొగసుకాడు, విలాసవంతుడు, సొగసైనవాడు.