అచ్చులు : ఈ
ఈ
సం., అవ్య., తత్స.,= ఒక యక్షరము, ఎదుటనుండు దానిఁదెలుపును, దుఃఖభావనము, క్రోధము, ప్రత్యక్షము, సన్నిధి, విషాదము, అనుకంపము, లక్ష్యము, కాంత, వ్యాప్తము, క్షేపము, వైష్ణవి, కోటరము, పావురము, నాలుగవ స్వరవర్ణము, దీర్ఘేకారము, జిహ్వ, కామకళా, సంబోధనము మొదలగునవి ; పుం. కందర్పుడు ; స్త్రీ. లక్ష్మి
ప్రయోగము :
ఈ తపము.
ఈ
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= నాలుగవ స్వరవర్ణము, దీర్ఘేకారము, లక్ష్మి. నాలుగు స్వరాల వర్ణము, దర్శనము, ఎదుట ఉండుదానిని తెలుపును.
వ్యుత్పత్త్యర్థము :
అస్య విష్ణోః పత్నీ విష్ణువు యొక్క భార్య.
మాట - మంతి :
“ఈ తపము” ఇచ్ఛుధాతువునకు భవిష్యదర్థక వ్యతిరేకార్థక ప్రార్థనాద్యర్థక తుమున్నర్థక ప్రత్యయములు పరమగునపుడు ఆదేశముగా వచ్చునది. సంప్రార్థనంబున మధ్యమపురుషముఁడు వర్ణకంబులకు విభాషను అను ప్రయుక్తమగునది. (ఇది అదాదులలోనిది). ప్రశ్నించునపుడు (కిమర్థమగు) ఏ అను శబ్దమున కనుప్రయుక్తమై అర్థ విశేషమును తెలుపును(ఆము. 6, 55.). ఒకప్పుడు కాక్వర్థమునందుఁ గూడ ప్రయోగింపఁబడును. కొన్ని శబ్దములకు పుంస్త్వమున మతుబర్థమందు వచ్చునది. ఇకారాంత పదములకు సంబుద్ధియందు విభాషను ఆదేశముగా వచ్చునది.
ప్రయోగము :
ఉదా- ఈఁగలడు, ఈఁడు, ఈమి, ఈ, ఈన్, మొదలగునవి.
క. ఓ విప్రులార వినుఁడీ. (దశా. 1,239. 2).
ఉదా- ఏఁడీ (=ఏక్కడున్నాఁడు) ఏరి, వేఁడీ, వేరీ, మొదలగునవి ఇట్లే, ఏఁడి, ఏరి, మొదలగునవి.
శా. కారే రాజులు రాజ్యముల్గలుగవే గర్వోన్నతింబొందరే,
వారేరీ సిరి మూటగట్టుకొని పోవం జాలిరే... (భాగ. 8. 590.). ఉదా- హరీ, మతీ, మొదలుగునవి.
ఈక్షకుడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = చూచువాడు. చూచునది.
ఈక్షణము
సం., వి., అ., న., తత్స.,= కన్ను, చూపు, లోచనము, నిర్వర్ణనము, నిధ్యానము, నిరూపణము.
వ్యుత్పత్త్యర్థము :
ఈక్షతే అనేనేతి ఈక్షణం. దీనిచేత చూడబడును.
పర్యాయపదాలు :
నయనము, నేత్రము, చక్షువు, అక్షిణి, దర్శనము, ఆలోకనము, పర్యవేక్షణము ; స్త్రీ. దృక్కు, దృష్టి, చూచుట.
ఈక్షణిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = విప్రశ్నిక, దైవజ్ఞ, దర్శనము, వేల్పుసాని, నిరూపణము, పర్యవేక్షణము, సోదె చెప్పునది, కళ్ళు.
వ్యుత్పత్త్యర్థము :
ఈక్షణం శుభాశుభ దర్శనం, తదస్యా ఇతి ఈక్షణికా. శుభాశుభములను చూచునది.
ఈక్షణికుడు
సం., వి., అ., పుం., తత్స., = జోస్యుడు, జోతిష్కుడు, సాముద్రికుడు.
వ్యుత్పత్త్యర్థము :
హస్తరేఖలను చూచి శుభాశుభ ఫలములు చెప్పువాడు.
ఈక్షము
సం., నా. వా., అ., పుం., తత్స., = చూచుట, పర్యాలోచనము, దర్శనము.
ఈక్షిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = కన్ను, చూపు.
ఈక్షితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చూడబడినది, ఆలోచించబడినది, చూచువాడు, ఆలోచించువాడు.
ఈక్షేణ్యము
సం., నా.వా.,(అ. ఆ. అ)., తత్స., = చూడబడినది.
ఈగు
క్రి= పోగొట్టు, తీర్చు, తొలగించు, వెనుదీయు, ప్రవేశించు, చొచ్చు, లాగు, దాగు, నశించు
ఈచుకపోవు
క్రి= పశువులు గర్భధారణశక్తిని పోగొట్టుకొను, నెలలు నిండకముందే పశువుల గర్భం చెడిపోవు, చచ్చిన దూడను ఈను, కాళ్లు, చేతులూ కృశించి పీలగా అవు.
ఈజానుడు
సం., నా.వా.,(అ. ఆ. అ)., తత్స., = యజమానుడు, యాగశీలుడు, జ్యేష్ఠ.
ఈడ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పొగడుట, స్తుతించుట, ప్రశంస, స్తుతి.
ఈడనము
సం., వి., అ., న., తత్స., = పొగడుట.
ఈడయిత్రుడు
సం., విణ., (ఋ. ఈ. ఋ)., తత్స.,= స్తుతించువాడు, స్తుతింపచేయువాడు.
ఈడానుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = స్తుతించుచున్నవాడు, ప్రశంస, పొగడుట.
ఈడితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ప్రణుతము, స్తోత్రముచేయబడినది, పొగడఁబడినది, ప్రియము, స్తుతింపబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఈడ్యతే స్మ ఈడితం. స్తోత్రముచేయబడినది ఈడితము.
పర్యాయపదాలు :
నపుం. శస్తము, ఈళితము, పణాయితము, పనాయితము, పణితము, ప్రణుతము, అవగీర్ణము, వర్ణితము, అభిష్టుతము, స్తుతము.
ఈడుజోడూ
ప. బం. = సమఉజ్జీ, సమానం, సరిసమానం, సాటి.
ఈడేన్యుడు
సం., నా.వా., (అ. ఆ. అ).,తత్స., = పూజనీయుడు.
ఈడేర్చు
క్రి. = నెరవేర్చు, కాపాడు, ధన్యునిచేయు.
ఈడ్చు
స. క్రి. = లాగు, గుంజు, పైకెత్తు, పైకి చేర్చు.
ఈడ్యమానుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = స్తుతింపబడుచున్నవాడు.
ఈడ్యము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = పొగడఁదగినది.
ఈతి
సం., వి., ఇ ., స్త్రీ., తత్స., = ఈతిబాధలు, అతివృష్ట్యాది(ఇవి ఆరు- వాన, వఱపు, ఎలుక, చిలుక, మిడుత, చేరువరాజు).
వ్యుత్పత్త్యర్థము :
ప్రత్యాసన్నాశ్చ రాజానః. సమీపమున ఉన్నరాజులు. షడేతా ఈతయః స్మృతాః. ఆరు ఈతి బాధలు. అయనమీతిః. పోవుట కనుక ఈతి.
పర్యాయపదాలు :
క్షేత్రకార్యమందు ఆరుప్రకారముల ఉపద్రవ విశేషములు, అతివృష్టి , ఉపద్రవము, ఊరు విడిచిపోవుట, దూరగమనము ; పుం. డింబము, విప్లవము, ప్రవాసము, కలహభేదము, రాజు లేకుండా చేసే యుద్ధము, కొల్ల మొదలగునవి, దేశోపద్రవము.
నానార్థాలు :
ముషకము, పక్షి, కోరిక, మనోరథము, అభిలాష మొదలయినవి.
ఈతిబాధలు
వి. బహు. = ఉపద్రవము, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాల వల్ల కలిగే కష్టనష్టాలు, పొరుగురాజుల వల్ల వచ్చేకష్టం.
ఈదపోవు
క్రి. = కంకిలో విత్తులు లేకుండా పోవు.
ఈదృశము
సం., నా. వా., (శ్. ఈ. శ్).,తత్స., = ఒకమరుద్గణము.
ఈదృశము
సం., విణ., (అ. ఈ. అ.)., తత్స., = ఇట్టిది, ఇటువంటిది.
ఈదృశ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇట్టిది, ఈవిధముగా.
ఈనుపొట్ట
వి. = ఏపునకు వచ్చిన ఎన్ను.
ఈప్స
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఇచ్చ, కోరిక, మనోరథము, అభిలాష, కామన, ధనేచ్ఛ.
ఈప్సితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరఁబడినది, పొందుటకిష్టమైనది.
ఈప్సువు
సం., విణ., ఉ., పుం., తత్స., = కోరువాడు.
ఈమ్
సం., అవ్య., తత్స., = శబ్దార్థమందు, ఈ అర్థమునందు.
ఈయము
సం., నా.వా., (అ. ఆ. అ)., తత్స.,= వ్యాప్యము.
ఈరకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చెప్పువాడు, ప్రేరేపించువాడు.
ఈరణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రేరకము, ఇరణము, చౌటినేల, గతి, పోక, పురికొల్పునది.
ఈరామా
సం., నా. వా., ఆ ., స్త్రీ., తత్స., = నదీ భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఈర్లక్ష్మీస్తయా రమ్యతేఽత్ర రమ. లక్ష్మితో ఆనందిస్తున్నది.
వ్యుత్పత్త్యర్థము :
ఈరిణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చవిటి భూమి, ఇరిణము యొక్క రూపాంతరము.
ఈరితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = నెట్టఁబడినది, త్రోయఁబడినది, చెప్పబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఈర్యతే ప్రేర్యతే స్మ ఈరితః. పంపబడినది, ప్రేరేపింపబడినది.
పర్యాయపదాలు :
పుం. నుత్తము, నున్నము, అస్తము, నిష్ఠ్యూతము, విద్ధము, క్షిప్తము.
ఈరిన్
సం., విణ.,(న్. ఈ. న్).,తత్స., = రాజభేదము, ప్రేరకము.
ఈరిపేను
వి. = చిన్నపేను.
ఈరేడులోకాలు
వి. బహు. = పధ్నాలుగు లోకాలు, చతుర్దశభువనాలు.
ఈర్క్ష్యకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఈర్ష్యగలవాడు, పరులసంగమము జూచిన కాని సంభోగేచ్చకలుగని ఒకవిధమైన నపుంసకత్వము గలవాడు, ఒక విధమైన అసూయకలవాడు.
ఈర్క్ష్యతము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఒక విధమైన అసూయపడినది.
ఈర్మము
సం., వి., అ., న., తత్స.,= వ్రణము, పుండు, వృద్ధిని బొందునది.
వ్యుత్పత్త్యర్థము :
ఈరయత్యంగం ఈర్మం. అంగమును ప్రేరేపించునది.
ఈర్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ధ్యానమౌనాది వ్రతములయందు చాంచల్యము లేక స్థిరుఁడైయుండుట, నడచుట నిలుచుట కూర్చుండుట పండుకొనుట మొదలైనవానియందు యతులు సమాధానము గలవారైయుండుట, ధ్యానమౌనాది రూపమగు బిక్షుకచర్య, ఈర్ష్య.
ఈర్యమాణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= చెప్పబడుచున్నది, ప్రేరేపించబడుచున్నది.
ఈర్యము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ప్రేరేపింపతగినది.
ఈర్యాపథము
సం., నా. వా., అ., పుం., తత్స., = తప అభ్యాసము.
వ్యుత్పత్త్యర్థము :
ఈర్యారూపః పంథా కర్మాధా. ధ్యానమౌనాది రూపమందు పరివ్రాజుని యొక్క జ్ఞాన సాధనోపాయభేదము.
ఈర్యాపథస్థితి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= తప అభ్యాసము.
ఈర్వారువు
సం., వి., ఉ., పుం., తత్స.,= దోసచెట్టు(వృ.వి), ఉర్వారువు, ఏర్వారువు ; స్త్రీ. కర్కటి.
వ్యుత్పత్త్యర్థము :
ఉరు మూత్రం ఆరయతి నిస్సారయతీతి ఈర్వారుః. (ఉర్వారుః). మిక్కిలి మూత్రమును వెళ్లించునది.
ఈర్ష
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అక్షమ.
ఈర్షాలువు
సం., విణ.,(ఉ., ఊ., ఉ).,తత్స.,= ఈర్షావిశిష్టుడు.
ఈర్ష్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అసూయ.
వ్యుత్పత్త్యర్థము :
ఈర్ష్యతీతి ఈర్ష్యా. ఓర్వలేకుండుట కలుగజేయునది ఈర్ష్య
పర్యాయపదాలు :
ఓర్వలేమి, ఓర్వలేకుండుట, ఈరసము, అక్షాంతి, అసహిష్ణుత, పరోత్కర్ష అసహిష్ణుత, పరులసంపదను సహించలేకుండుట, పైశున్యము, సాహసము, ద్రోహము, అర్థదూషణము, వాక్ దండజము, పారుష్యము, క్రోధజము.
ఈర్ష్యాళువు
సం., విణ., (ఉ., ఊ., ఉ).,తత్స.,= ఈర్ష్యపడువాడు, అక్షాంతియుక్తుడు, ఈర్ష్యావిశిష్టుడు, అశాంతియుక్తుడు, ఈర్ష్యపడు స్వభావము గలవాడు, ఉడుకుఁబోతు, కుహనము.
ఈర్ష్యువు
సం., నా. వా., (ఉ., ఊ., ఉ).,తత్స., =ఈర్ష్యకలవాడు, అసూయ కలవాడు, అసూయపడువాడు.
ఈల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పృథివీ, గోవు.
ఈలకత్తి
వి.= కూరగాయలు కోసే కత్తి, కత్తిపీట.
ఈలిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నాడి,బాకు, తులువకత్తి, స్తుతింపబడునది.
ఈలినుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= చంద్రవంశపు రాజు.
ఈళి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= బాకు, తులువ కత్తి, స్తోత్రము చేయబడునది,
పర్యాయపదాలు :
ఈలి, ఏకధార, కపాలి,ఈలిక, చిన్నగదవంటి చేతికఱ్ఱ, దుడ్డుకఱ్ఱ, చిన్నకటారి, యవనాస్త్రము, చిన్న గదాకారము కలిగిన చేతిదండము, కరవాలిక, కరపాలి, గుప్తిక, చిన్నగదవంటి చేతికఱ్ఱ, కరచ్ఛురీ, ఈళిక, యవనాస్త్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఈర్యతే జనైరితి ఈళీ. జనులచేత ప్రయోగింపబడుతుంది కలుక ఈళి.
ఈళిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చిన్నచేతికర్ర, కత్తిపీట, చురకత్తి.
ఈళితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = స్తోత్రము చేయఁబడినది, పొగడఁబడినది.
పర్యాయపదాలు :
నపుం. శస్తము, ఈడితము, పణాయితము, పనాయితము, పణితము, ప్రణుతము, అవగీర్ణము, వర్ణితము, అభిష్టుతము, స్తుతము.
ఈశ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఈషయొక్క రూపాంతరము, ఐశ్వర్యము, ధనవంతురాలు, దుర్గాదేవి, ఈష.
ఈశత్వము
సం., వి., అ., న., తత్స., = విభూతి, భూతి, సంపద, ఐశ్వర్యము అణిమాది అష్టవిధములు(అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము)
ఈశబలము
సం., వి., అ., న., తత్స., =పాశుపతమత సిద్ధియందు రెండవపాశము.
వ్యుత్పత్త్యర్థము :
ఈశకృతం బలమ్. పాశుపతమతసిద్ధే పాశుపతానాం ద్వితీయే పాశే. పాశుపతమత సిద్ధియందు రెండవపాశము.
ఈశశక్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఈశ్వర శక్తి.
ఈశానము
సం., వి., అ., న., తత్స.,= ప్రకాశము, వెలుతురు, ఐశ్వర్యము ,ఈశ్వరుడు.
పర్యాయపదాలు :
పరమేశ్వరుడు, మహాదేవుడు, ఏకాదశరుద్రుడు, ఈశ్వరుని ఐదు ముఖములతో ఒకటి, శివుడు, ఒక దిక్పాలకుడు.
నానార్థాలు :
ధనవంతురాలు, దుర్గాదేవి, ఆరుద్రనక్షత్రము, కాంతి, అధిపతి, రాజు, ఈష.
ఈశానాదిపంచమూర్తి
సం., నా. వా.,ఇ ., స్త్రీ., తత్స.,= శివుని పంచముఖములలో ఒకటి.
ఈశాని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = దుర్గ, బూరుగు (వృ.వి).
ఈశానుఁడు
సం., వి., అ., పుం., తత్స., = శివుఁడు, ముక్కంటి, ప్రకాశవిశిష్టమైనది, హరి, బ్రహ్మ, అధిపతి, ప్రభువు, శమీవృక్షము, శివుని అష్టమూర్తులలో ఉన్న సూర్యుని మూర్తి, ఒకదిక్పాలకుడు ; నపుం. జ్యోతి.
వ్యుత్పత్త్యర్థము :
ఈష్టే ఈశానః. ఐశ్వర్యముకలవాఁడు.
పర్యాయపదాలు :
శంభు, పశుపతి, శూలి, మహేశ్వరుడు, ఈశ్వరుడు, ఈశుడు, శంకరుడు, శర్వుడు, చంద్రశేఖరుడు, భూతేశుడు, ఖండపరశువు, గిరీశుడు, గిరిశుడు, మృడః, మృత్యుంజయుడు, కృత్తివాసుడు, పినాకి, ప్రమథాధిపుడు, ఉగ్రుడు, కపర్ది, శ్రీకంఠుడు, శితికంఠుడు, కపాలభృతుడు, వామదేవుడు, మహాదేవుడు, విరూపాక్షుడు, త్రిలోచనుడు, కృశానురేతుడు, సర్వజ్ఞుడు, ధూర్జటి, నీలలోహితుడు, హరుడు, స్మరహరుడు, భర్గుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, గంగాధరుడు, అంధకరిపుడు, క్రతుధ్వంసుడు, వృషధ్వజుడు, వ్యోమకేశుడు, భవుడు, భీముడు, స్థాణువు, రుద్రుడు, ఉమాపతి, దూతమూర్తిధరుడు, ధూమ్రజటిలుడు
ఈశి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = పార్వతి.
ఈశిత
సం., విణ., (ఋ. ఈ. ఋ.)., తత్స., = ప్రభువు, ఒడయెడు, స్వామి, ఈశ్వరుడు, పతి, ఆదిభువుడు, నాయకుడు, నేత, పరివృఢుడు, అధిపుడు.
ఈశితవ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఎవరికి ఐశ్వర్యం స్వాధీనము చేయబడవలెనో వాడు.
ఈశితుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ప్రభువు.
ఈశుఁడు
సం., వి., అ., పుం., తత్స., = శివుఁడు, మహాదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఈష్టే ఈశః. ఐశ్వర్యయుక్తుడు.
నానార్థాలు :
రాజు, ప్రభువు, యజమానుడు, మగడు, ఒకానొక దికృతి.
ఈశుడు
సం., వి., అ., పుం., తత్స.,= శివుడు, ప్రభువు, ముక్కంటి, హరి, బ్రహ్మ, అధిపతి, ఒకదిక్పాలకుడు, ఈశానకోణాధిపతి.
పర్యాయపదాలు :
శంభు, పశుపతి, శూలి, మహేశ్వరుడు, ఈశ్వరుడు, ఈశానుడు, శంకరుడు, శర్వుడు, చంద్రశేఖరుడు, భూతేశుడు, ఖండపరశువు, గిరీశుడు, గిరిశుడు, మృడః, మృత్యుంజయుడు, కృత్తివాసుడు, పినాకి, ప్రమథాధిపుడు, ఉగ్రుడు, కపర్ది, శ్రీకంఠుడు, శితికంఠుడు, కపాలభృతుడు, వామదేవుడు, మహాదేవుడు, విరూపాక్షుడు, త్రిలోచనుడు, కృశానురేతుడు, సర్వజ్ఞుడు, ధూర్జటి, నీలలోహితుడు, హరుడు, స్మరహరుడు, భర్గుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, గంగాధరుడు, అంధకరిపుడు, క్రతుధ్వంసుడు, వృషధ్వజుడు, వ్యోమకేశుడు, భవుడు, భీముడు, స్థాణువు, రుద్రుడు, ఉమాపతి.
ఈశ్వర
సం., వి., అ., పుం., తత్స., = ఒక సంవత్సరము, శివుడు, ప్రభువు, ముక్కంటి, హరి, బ్రహ్మ, అధిపతి, ఒకదిక్పాలకుడు.
పర్యాయపదాలు :
శంభు, పశుపతి, శూలి, మహేశ్వరుడు, ఈశ్వరుడు, ఈశానుడు, శంకరుడు, శర్వుడు, చంద్రశేఖరుడు, భూతేశుడు, ఖండపరశువు, గిరీశుడు, గిరిశుడు, మృడః, మృత్యుంజయుడు, కృత్తివాసుడు, పినాకి, ప్రమథాధిపుడు, ఉగ్రుడు, కపర్ది, శ్రీకంఠుడు, శితికంఠుడు, కపాలభృతుడు, వామదేవుడు, మహాదేవుడు, విరూపాక్షుడు, త్రిలోచనుడు, కృశానురేతుడు, సర్వజ్ఞుడు, ధూర్జటి, నీలలోహితుడు, హరుడు, స్మరహరుడు, భర్గుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, గంగాధరుడు, అంధకరిపుడు, క్రతుధ్వంసుడు, వృషధ్వజుడు, వ్యోమకేశుడు, భవుడు, భీముడు, స్థాణువు, రుద్రుడు, ఉమాపతి.
నానార్థాలు :
ఒడయెడు, స్వామి, పతి, ఆదిభువుడు, నాయకుడు, నేత, పరివృఢుడు, అధిపుడు.
ఈశ్వరనభము
సం., నా. వా., స్., న., తత్స., = రాజసభ.
ఈశ్వరప్రియము
సం., వి., అ., పుం., తత్స.,= పాలపిట్ట
ఈశ్వరప్రియములు
సం., వి., అ., పుం., తత్స., = ఒకజాతి వడ్లు, సీసపద్యము, ఏవికరాజనాలీశ్వర ప్రియములు.
ఈశ్వరవిభూతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = లోకమున స్థాన విశేషములందు గల ఈశ్వరాంశము.
ప్రయోగము :
శ్లో. ఆదిత్యానామం విష్ణుర్జ్యోతిషాంరవిరంకుమాన్.
మరీచర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ,
వేదానాం సామవేదోస్మి దేవానామస్మివాసవః.
ఇత్యాదిరీతిని ఆదిత్యాది గణమందు విష్ణురూపాదిగా నుండునది ఈశ్వరవిభూతి. (చూ. గీత. 10. అధ్యా.)
ఈశ్వరసాక్షి
సం., నా. వా., న్., పుం., తత్స., = మాయోపహిత చైతన్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఈశ్వర ఏవ సాక్షీ. ఈశ్వరుడే సాక్షిగా కల.
ఈశ్వరి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= పార్వతి, లక్ష్మి, గట్రాచూలిక, దుర్గ.
వ్యుత్పత్త్యర్థము :
ఈశ్వరస్య పత్నీ ఈశ్వరీ. ఈశ్వరుని భార్య.
పర్యాయపదాలు :
ఉమ, కాత్యాయని, గౌరీ, కాళి, హైమవతి, శివా, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, మృడాని, చండీ, అంబిక, ఆర్య, దాక్షాయణి, గిరిజ, మేనకాత్మజ.
నానార్థాలు :
లింగినీలత, వంథ్యా, కర్కటీ లత, క్షుద్రజటాలత, నాకుని, సరాక్షి (వృ.వి).
ఈశ్వరుఁడు
సం., వి., అ., పుం., తత్స.,= పరమాత్మ, పరమేశ్వరుడు, శివుడు ; విణ. ఒడయఁడు, ధనవంతుడు.
వ్యుత్పత్త్యర్థము :
యద్వా అశ్నుతీ వ్యాప్నోతీతి ఈశ్వరః. వ్యాపించువాడు కనుక ఈశ్వరుడు.
పర్యాయపదాలు :
శంభు, పశుపతి, శూలి, మహేశ్వరుడు, ఈశానుడు, శంకరుడు, శర్వుడు, చంద్రశేఖరుడు, భూతేశుడు, ఖండపరశువు, గిరీశుడు, గిరిశుడు, మృడః, మృత్యుంజయుడు, కృత్తివాసుడు, పినాకి, ప్రమథాధిపుడు, ఉగ్రుడు, కపర్ది, శ్రీకంఠుడు, శితికంఠుడు, కపాలభృతుడు, వామదేవుడు, మహాదేవుడు, విరూపాక్షుడు, త్రిలోచనుడు, కృశానురేతుడు, సర్వజ్ఞుడు, ధూర్జటి, నీలలోహితుడు, హరుడు, స్మరహరుడు, భర్గుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, గంగాధరుడు, అంధకరిపుడు, క్రతుధ్వంసుడు, వృషధ్వజుడు, వ్యోమకేశుడు, భవుడు, భీముడు, స్థాణువు, రుద్రుడు, ఉమాపతి.
నానార్థాలు :
మగడు, ప్రభువు, నియమించువాడు, ఇనుడు, సమర్థుడు, యజమానుడు, మన్మథుడు, రాష్ట్రి, ఐశ్వర్యయుక్తుడు, ప్రభుత్వముకలవాడు, ఒక సంవత్సరము, హరి, కందర్పుడు, స్వామి, అర్యుడు, నియత్వంతుడు, దబ్బ, తోడపెద్దు, ఆవుజబ్బు మొదలయినవి, ఆఢ్యుడు, నియంత, శక్తుడు, రాజు.
ఈష
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నాగటియేఁడి కోల, లాంగలదండము.
వ్యుత్పత్త్యర్థము :
బలీవర్దాదికృష్ణా సతీ ఈషతి గచ్ఛతీతి ఈషా. ఎద్దులచే లాగబడినదై పోవునది.
నానార్థాలు :
మేది, ఏడికోల నూట ఎనభై ఎనిమిది అంగుళముల ప్రమాణము, ఉత్తమమను పుత్రభేదము.
ఈషణము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = లాంగదండము, ఏడికోల, నూట ఎనభై ఎనిమిది అంగుళముల ప్రమాణము 188, మేది, రథ అవయవ భేదము.
ఈషత్
సం., అవ్య., తత్స., = కొంచెము, ఇంచుక, అల్పము, కించిత్, మనాక్.
ఈషత్కరము
సం., విణ., అ., న., తత్స., = కొంచెముగా చేయబడినది, సులభముగా, త్వరపడునది, త్వరపెట్టునది.
ఈషత్పాండుత
సం., నా. వా., ఉ., పుం., తత్స., = ధూసరవర్ణము, కొంచెమురంగుకలది(ఈషదకృతేతి).
ఈషదుష్ణము
సం., నా. వా., అ., పుం., తత్స.,= మంద ఉష్ణము.
ఈషద్రక్తము
సం., నా. వా., అ., పుం., తత్స., = అవ్యక్తరాగము, అల్పరక్త వర్ణము.
ఈషాంతబంధనము
సం., వి., అ., న., తత్స., = కాడి.
ఈషాదంతము
సం., విణ., అ., పుం., తత్స., = సులభముగా చేయతగినది, కొంచముగా చేయునది, పెద్దదంతములుకలది, నిడుపైన దంతములు కల ఏనుగు, పెద్దదంతముల ఏనుగు.
ఈషిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= చిత్తరువు, ఏనుగు కనుగ్రుడ్డు, అక్షికూటకము, అక్షిగోళకము, తూలిక, చిత్తరువు వ్రాయుకణిక, అగ్ని, వ్రాసెడికుంచె, అస్త్రవిశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఈషా లాంగలికేవ ఈషికా. నాగేలువలె నిడివియైనది.
ఈషిరము
సం., నా. వా., అ., పుం., తత్స.,= అగ్ని.
ఈసురోమను
అ. క్రి. = బలహీనంగా ఉండు, కాంతివిహీనంగా ఉండు.
ఈహ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఇచ్చయించుట, కోరిక, కడఁక, ప్రయత్నము.
వ్యుత్పత్త్యర్థము :
ఈహనమీహా. ఇచ్చయించుట ఈహ
పర్యాయపదాలు :
ఇచ్ఛ, కాంక్ష, స్పృహ, ఊహ, తృట్, వాంఛ, లిప్స, మనోరథము, కామము, అభిలాష, తృష, తర్షము.
ఈహకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరువాడు, చేయువాడు.
ఈహనము
సం., నా. వా., అ., న., తత్స., = కోరిక, చేష్ట, పని.
ఈహనుడు
సం., వి., అ., న., తత్స.,= శీఘ్రగమనము.
ఈహమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరుచున్నది, చేయుచున్నది.
ఈహము
వి. = యత్నం ప్రయత్నము, కోరిక.
ఈహామృగము
సం., వి., అ., పుం., తత్స.,= ఒకరూపకము, నాటక విశేషము, వృకము, ఒక విధమైన కుక్క, లేడి, కుక్క వలె ఉండు కపిలవర్ణజంతువు తోడేలు.
వ్యుత్పత్త్యర్థము :
1.మృగానీహతే ఈహామృగః. మృగములనిచ్ఛయించునది. 2.ఈహప్రధానో మృగో వృకః ఈహామృగః. కృత్రిమపులేడి రూపభేదము (కథా నాయకుడు లేడివలెనలభ్యమగు స్త్రీని పొందకోరినట్లు వర్ణింపబడిన కథ గల నాలుగు అంకములు రూపకము)
నానార్థాలు :
అడవి కోడి, శేషము, కోక, ప్రధానమృగము, వనకుక్కురము.
ఈహావృకము
సం., వి., అ., పుం., తత్స.,= ఈహామృగము.
ఈహితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= కోరఁబడినది, వాంఛితము, కోరునది, చేయునది.
ఈహ్యమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరబడుచున్నది, చేయతగినది.