అచ్చులు : ఒ
ఒంటియడుగుఁగత్తెర
ద్వ.వి.=మల్లబంధవిశేషము.
ఒడిసియ
దే.వి.= ఒడిసెగడ్డ.
ఒడిసె
దే. వి. = ఒడిసియ యొక్క రూపాంతరము.
ఒడిసెల
ద్వ.వి.=ఱాలు విసరివేయుటకై యేర్పఱపఁబడిన యొకవిధపుత్రాడు, క్షేపణి.
ప్రయోగము :
ఒనరుదంచనముల నొడిసెలలను జాలంగనెందును సవరించుట. హరి. ఉ. 2,ఆ.
ఒత్తియాడు
దే. స. క్రి. (ఒత్తి ఆడు) = ఒత్తు (చూ. లంగగొను, ఊంగాడు.)
ఒత్తిల్లు
దే.అ. క్రి. = ప్రక్కకొఱగు ,ఒత్తగిల్లు. (రూ. ఒత్తిలు. ఒత్తిలిరిత్తపైకొనుచు.)
ఒత్తుడు
దే. వి. = అదుముడు, పీడనము, కాకితములోనగునది వ్రాయునపుడు మెత్తనకై దాని క్రిందనుంచుకొనఁబడు కాకితములోనగునది.
ప్రయోగము :
ఉ. ఎవ్వతెం ,
బెట్టినవాఁడవోహృదయ పీఠికదానికినొత్తుడౌఁజుమీ. తవిత, 4. ఆ.
ఒత్తువడు
ద్వ.అ.క్రి.=(ఒత్తు+పడు)అదుముడుపడు,
ప్రయోగము :
ఎ, గీ. ఒత్తువడి కాంచనాది ధాతూచ్ఛయముల, రసముజొబ్బిల. హరి. పూ. 8,ఆ.
ఒత్తొరవు
దే. వి.= (ఒత్తు+ఒఱవు.) మిక్కిలి యదుముడు, సంపీడనము.
ప్రయోగము :
సీ. ప్రడఁదల్లిదండ్రులపగిదిఁబావులింపుదేపరులొత్తరువులేక బ్రదుకునట్లు. విక్ర.4, ఆ.
ఒదలు
దే. అ. క్రి. = వర్ధిల్లు.
ప్రయోగము :
గీ. అనిననాచంద్రమౌళివాక్యములభంగి,
భూరినియమములతో నభిచారహోమ,
మొదలఁగావింపనగ్ని యథోచితముగఁ,
జెలఁగిదక్షిణవలమానశిఖల వెలిఁగె. భాగ,10, స్కం. ఉ.
(పొదలు యొక్క రూపాంతరము.)
ఒదవుబడి
ద్వ.వి.=ఉపయోగము, విణ. ఉపయుక్తము.
ఒదికిలు
దే. అ. క్రి. = ప్రక్కకొఱగు, ఒత్తగిల్లు.
ప్రయోగము :
చ. ఒదికిలిపాన్పుపైఁబతికి నొయ్యనఁగేలు తలాఁపుచేసి ఉ, హరి.5,ఆ.
ఒదిగిళ్ళు
దే. వి. బ. = ఒదికిలుటలు.
ఒదుఁగఁబాఱు
దే. అ. క్రి. (ఒదుఁగన్ పాఱు.) = ఒదుఁగు.
ప్రయోగము :
బ్రాహ్మణుండొదుఁగఁబాఱకనిల్చి. భార. ఆను. 3,ఆ.
ఒదుఁగువాటు
ద్వ.వి.=ఒదుఁగువడుట, తొలఁగుట.
ఒమ్మచ్చు
ద్వ.వి.=(ఒమ్ము+ అచ్చు) మణులను పొదుగుటకు బంగారుతే చేసెడు పీఠస్థానము.
ఒరగట్టు
దే.వి. (ఒర కట్టు) = చుట్టగాఁజుట్టికట్టిన వస్త్రపుకట్టు.
ప్రయోగము :
సీ. ఒరగట్టు పంచెలుబెరసుపచేచడములు కార్కొన్న లోవంకకఱియొడళ్లు. నీలా.3,ఆ.
ఒరుదల
దే.వి. (ఒరు తల.) = కొండెకానితనము, పైశున్యము.
ప్రయోగము :
ఉ. ఒరుండొరుదలన్ వినిపించినమాట దెదమున్,
జెంద ముదంబుదక్కి చెడఁజేయఁడొరున్. ఆము.2,ఆ.
ఒరుదలకాఁడు
దే.విణ. = కొండెకాఁడు, పుశునుఁడు.
ప్రయోగము :
క. మొదలనెయొరుదలకానిన్
, జెదరంగా నాడకాత్మఁజింతించిపదిం,
బదిగమృషయేనిమఱివిడు,
ముదస్తుగాఁగాక యుండనొ యుండనొక్కమతమునన్. ఆ.ము. 4, ఆ.
ఒరుము
దే. అ. క్రి. = కలయు.
ప్రయోగము :
క. శరనిధిమునుగ్రోలినవి,
ర్భరజలములుగురిసి మేఖభావంబఱియా,
కరములుకరములెకాజిగి,
నొరిమెననన్ రవియు మెఱసె నుడిగెన్ మెయిలున్. ఆము. 4, ఆ.
ఒ
దే.అవ్య.=ఒకయక్షరము,సందేహమునుదెలుపును.
ప్రయోగము :
పద్మహితుఁడొహిమకరుఁడొశచీ,
గృహమేధియొ. భార. ఉద్యో. 1,ఆ.
ఒఁడమి
దే.వి. = ధనము.
ప్రయోగము :
వ. మాఠరుండు కఠోరవచనంబులాడినఁ బింగళుడంగులార్చన దండుండు దండించినంజక్కంబడమిఁదనయొడమిఁ దానడిమి కడిమి నిజంబుగారవి గారవించి. ఉ. హరి. 6, ఆ.
( దీనిని ఎదంతముగా వాడెదరుగాని ప్రతులయందిది యికారాంతముగానే కానఁబడియెడి. ప్రయోగశైలిని జూడనిట్లుండుటే యుక్తమని తోఁచుచున్నది. చూ. ఒడగోలుకొను.)
ఒంజిలి
దే. వి. = దుఃఖము, విణ. దుఃఖము కలవాఁడు, (లేక) దుఃఖము కలది. ( చూ. ఒందిలి.)
ఒంటరము
దే. వి. = విరోధము.
ప్రయోగము :
క. ఒంటములేనివి యొంటర,
మింటరములుపలుకుటుచితమే. భార. ఉద్యో.4, ఆ.
ఒంటరి
ద్వ.వి.=(ఒంటి+అరి) అసహాయుఁడాన బంటు, ఏకాకి.
ప్రయోగము :
మ. పూవుదీఁ, గగుదెదావలరాచయొంటరికడుంగేరిచుచుంజిమ్మినన్. య.5,ఆ. విణ.
ఒంటరికాఁడు
ద్వ.వి.=పంది, ఏకచరము,అసహాయుండైనబంటు, ఏకాకి.
ప్రయోగము :
సీ. క్రమ్మియొంటరికాని దొమ్మినొంచుయశంబుబయటి పల్లెలుగూల్చుబల్మికల్మి. చంద్రా. 1,ఆ. ఒంటరికాఁడ్రనేకనూ, కరములగుప్పుదెప్పుమనఁగాఁబడఁగ్రుమ్మిరి. ఉ.రా. 7,ఆ. విణ.
(స్వార్థమున కాఁడు)
ఒంటరిపాటు
ద్వ.వి.=ఒంటరి, ఏకాకిత్వము.
ఒంటరీఁడు
ద్వ.వి.=(ఒంటరి ఈఁడు) అసహాయుఁడైనబంటు.
ప్రయోగము :
సీ. ఒంటరియెక్క టీఁడొంటరీఁడ్రొంటింపు నానేకభటునికి నామములగు. ఆం. భా. ద్వి. క్ష.
(స్వార్థమున ఈఁడు.)
ఒంటింపు
దే.వి. = ఆనుకూల్యము.
ప్రయోగము :
వీఁడువీఁడీపననజేయవలయునని యేర్పఱచునేర్పాటు. (చూ. ఆరగింపు.)
ఒంటింపు
దే.వి.=అనుకూల్యము, వీఁడువీఁడీపనినిజేయవలయునని యేర్పఱచునేర్పాటు.(చూ. ఆరగింపు.)
ఒంటికంటిగాము
ద్వ.వి.=చుక్క, శుక్రుడు.
ఒంటికాండు
ద్వ.వి.=పంది, ఏకచరము, వియోగి, ఏకాకి. విణ. బ్రియురాలినెడఁబాసినాఁడు.
ప్రయోగము :
సీ. అనురక్తి రేఁడు నూతనసారసాటోపమొంటికాఁడ్రకుఁబంపులొసంగునెచట.(హరిశ్చంద్రకథయ దు పందులకనియు, నలకథయందు వియోగులకనియు అర్థము. హన. 2,ఆ.)
ఒంటికొమ్మువేలుపు
ద్వ.వి.=వినాయకుడు, ఏకదంతుడు.
ఒంటిపోఁగు
ద్వ.వి.= బలరాముఁడు, ఏకకుఁడలుడు(చూ. వితావిత.)
ఒంటు
దే. వి. క్రి. = ఇముడు, అనుకూలించు, చేరు, గ్రామసమూహము, బ.పురుషుల కర్ణభూషణము.
ప్రయోగము :
రగడ కమపములంటుచుఁగలువలువలనొంటుచు. శశాం. 2. ఆ. వి.
ఒంటుకొను
దే. స. క్రి. = చేరు, ఎ, గీ. ఒంటిపాటు.
ప్రయోగము :
ననవ్వాలుఁగంటినంటి,
యొంటుకొనఁజూచియో హోయయుక్తమనుచు. శశాం. ఆ.
ఒంటెపులి
ద్వ.వి.=మృగవిశేషము. (అ ప్ర)
ఒంట్రింపు
ద్వ.వి.బ.=(ఒంటు+ లు)పురుషులకర్ణభూషణము, వై. అంకెలు.
ఒంట్లు
యు. దే. వి. బ. = (ఒంటు+లు.)పురుషులకర్ణభూషణము. వై. అంకెలు.
ఒండె
దే. ద్ర. = అటుకానిపక్షమున, కాని.
ప్రయోగము :
చ. అప్పురుషసింహులుబూరితపోధనుల్ మనం,
బునఁగలుషించిరేనియుఁదపోమహిమన్ మిము నిర్దహింతురొం,
డెనతులితాస్త్రశక్తిని వడిందునుమాడుదురాజి నిందఱన్. భార. ఆర. 5, ఆ.
(మీఁద ఏని శబ్దముకదిసియు ప్రయోగింపఁబడును.) గీ. అష్టమీ వాసరంబునయందునొండె,
నొండెనేని చతుర్దశినిండుభక్తిఁ,
బూజగావించియెవ్వఁడుభూమినున్న,
దుర్గసేవింప దురితంబు తొలఁగునండ్రు . భీ.6. , ఆ.
సీ. సమకట్టిసైన్యంబు సైన్యంబుతో నొందె ,
నిద్దఱతోనొండె నెక్కటియొక్కనితో నొండెఁబొడిచెదదోర్బలమున. భార. సభా. 1, ఆ.
ఒండేని
దే. అవ్య. (ఒండెన్+ఏని.)= ఒండె.
ప్రయోగము :
మ. అనుషంగంబుననొండె నొండెను విహారాపేక్ష నొండేనిఘ,
ర్మనరాసంబుననొండెఁదీవ్రభయ సంత్రాసార్ధమొండేనియ,
న్యనియోగంబుననెవ్వఁడేమునుఁగుగంగాంభఃప్రవాహంబునన్,
జనుఁడాతండునుబుండరీకనయనాశాసించుపాపౌఘముల్. కాశా.5, ఆ.
ఒండొండ
దే. అవ్య. (ఒండు+ఒండు+ అ.)= క్రమక్రమముగా.
ప్రయోగము :
ఇప్పుడొండొండపొంగి కలయఁబాఱుఁయబయోధులుగ్రముగ.భార. ఆర. 4, ఆ.
ఒందిక
దే. వి. = ఒద్దిక.
ప్రయోగము :
సీ. కలశపాథోరాశికన్యకారత్నంబునొందికతోఁగూడియున్నవాని. వి,పు.5, ఆ.
(ఒద్దిక యొక్క రూపాంతరము.)
ఒందిలి
దే. వి. = దుఖము, విణ. దుఖముకలవాఁడు(లేక)దుఖముకలది.
ప్రయోగము :
వాఁడుధనహీనుఁడగుచు సంతాపమొంద విడుతురుబంధులవ్వధముననొందియైచేయునదిలేక. భాగ.10, స్కం. ఉ.
ఒందు
దే. అ. క్రి. = కలుగు, సం. క్రి. పొందు.
ప్రయోగము :
పౌరచిత్తములకత్యానందమొందంగ. బార. 8, ఆ.
ఒకొ
దే.అవ్య. = సందేహమును దెలుపును, (రూ.) ఒకొ.
ప్రయోగము :
క. ఈ మేలుప్రజలకొనర్చిన,
యామహిమకునెలవు గొంతియగ్రతనయుఁడో,
భీముఁడొకొతముఁగుఱ్ఱలో,
కోమఱియెవ్వరొకొతలఁపుకొలదికిమీఱెన్. భార. ద్రో. 2, ఆ.
ఒక్కొ
దే.అవ్య. = ఒకొ. (రూ.ఒక్కో.)
ఒగి
దే. ద్ర. క్రి. విణ. = క్రమముగా, ఉభయపక్షములవారి.
ప్రయోగము :
నుద్ధరింతురందయొగిఁబిండమిడినవారు. (ఇక్కడ ఒగిన్ అనఁగా విధిక్రమముగా ననియర్ధము.) భార. ఆర. 2, ఆ.
(ఇట్లక్కడక్కడ సందర్భానుసారముగా అర్ధమునెఱుఁగునది.)
ఒగిదిగ
దే. వి. = జడబిల్ల.
ప్రయోగము :
సీ. కన్నె గేదఁగిఱేకుసున్నగిలఁగఁజీఱియొగిదిగకాఁబెట్టెనొక్కచెలికి. చమ. 1, ఆ.
(దీనికి ప్రయోగాంతరము మృగ్యము)
ఒగుడు
దే. వి. = జొన్నలోనగువానియెండినయాకు.
ఒగుడుకఱచు
దే. అ. క్రి. = కృశించు.
ఒగ్గము
దే. వి. = అవపాతము.
ప్రయోగము :
క. ఒగ్గములు త్రవ్వి పడుమని,
యొగ్గెడుపెనుఁదెరల వలల నుగ్రమృగములన్,
దగ్గఱినఁజంపువేడుక,
వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్. భాగ. 1, స్కం.
ఒగ్గు
దే. అ. క్రి. = మొనయు, (వల)పఱచు,ఒడ్డు, (చూ.ఒగ్గము) చాఁచు.
ప్రయోగము :
ఉ. ఏయుక్కును లేక యిట్టి పని కొగ్గునెయంచొక కొందఱాడఁగన్, పాంచ.2, ఆ.స.క్రి.
ఎ. గీ. ఆనెలంత మెడకునడ్డంబుగామెడ,
యొగ్గెవృద్ధసతియనూనకృపను. కళా. 3, ఆ.
ఒగ్గుబల్ల
దే. వి. = తరిమెనపట్టెడు కొయ్యకాధారమైనబల్ల.
ఒచ్చెము
దే, వి. = కొఱఁత న్యూనత.
ప్రయోగము :
గీ. అధ్వరాంభమింతొప్పనయ్యదక్ష,
శివునిఁదోడ్తేనియొక్క యొచ్చెంబకాని. కాశీ.7, ఆ.
చ. మానిని కిందనుఁదానకాచినకో,
లొదవినదానఁజేసి సభనొచ్చెముదక్కినఁబాండునందనుల్,
బ్రతిగిరిగాక. భార. ఉద్యో. 1,ఆ.
ఒచ్చెల
దే. అవ్య. = ఒ చెల్ల యొక్క రూపాంతరము.
ప్రయోగము :
ఒచ్చెలనిన్నుఁజూచి వగనొందెడుఁజిత్తము. భో. 5,
ఆ. (రూ. ఒచ్చెల్ల క. అచ్చుగఁబ్రయాగలోపల,
విచ్చలవిడిఁ జనజుమేనువిడిటినమనుడుం,
డొచ్చెల్లయేమి చెప్పదుఁ,
జెచ్చెరఁగను నిష్టకామ్యసిద్ధిధరిత్రిన్ . భో. 1, ఆ.
ఒట్టు
దే.ఆ. త్కి. = కలుగు, ఉంచు, రగుల్చు.
ప్రయోగము :
ఉ. అట్టినృపాలకీటములనాజినెదుర్పఁగలేనివానియ,
ట్లొట్టినభీతిమైనిటుపయోధిశరణ్యుఁడనైతివి. భాగ. 10, స్కం.
ఉ. ఇట్టిదిక్రూరకృత్యమని యించుకకొంకక లక్కయింటఁజి,
చ్చొట్టితి. భార. శల్య. 2,
ఆ. ఒట్టినమంటవోలెఁగడునుగ్రచఁబేర్చిన . నిర్వ. 4,ఆ.
క. పట్టుదురుకొఱవులనువడిఁ,
బెట్టు దురసిపుత్రకలను బెనుమంటలయం,
దొట్టుదు రొడళ్ళునలియన్,
మట్టుదు రప్పావచిత్తు మత్తుం బెలుచన్. (ఇక్కడ ఒట్టుటయనఁగా కాల్చుట యని యర్ధము.) భాగ, 3, స్కం.-వి. శపథము.
ఒడఁగూడు
దే. అ. క్రి,= సిద్ధించు, చేరు.
ప్రయోగము :
క. అమవసగావుననేఁడ,
క్కమలజుఁగొలువఁగమహర్షి గణములుఁభితృసం,
ఘములునుబోదురుబ్రహ్మం,
డమునంగలవారలందొడంగూడంగాన్. భార. ఆది. 5, ఆ.
ప్రయోగము :
(ప్రే. ఒడఁ గూర్చు.)
ఒడఁబడిక
ద్వ.వి.= సమ్మతి, సమ్మతించి వ్రాసి యిచ్చిన వ్రాఁత.
ప్రయోగము :
ఎ,గీ. ఒడఁబడికగానఁ బడనీక యొడలునులియు, నెపముమైఁగౌఁగిటికెదుర్చునీరజాక్షి, యుపమయును భూమివల్ల భునుల్లమునకుఁ, గ్రొత్తచవిగొల్పెమఱివేఱకొన్నినాళ్ళు. కవిక,3,ఆ.
ఒడఁబడు
ద్వ.అ.క్రి.= సమ్మతించు, అనుకూలించు, సంతోషించు.
ప్రయోగము :
చ. కడుఁజనువాఁడునైపురుష కారియు దక్షుఁడునైనమంత్రిపెం, పడరఁగరాజపుత్రుల మహాధనవంతులఁ జేసివారితో, నొడఁబడిపక్ష మేర్పడఁగనుండఁడుగా. భార. సభా.1,ఆ. సమున్నతపీఠమ్ముననుంచి యథావిధిపూజలొడంబడఁజేసి. భార. ఆది. 8,ఆ.
(ప్రే. ఒడఁబఱచు.)
ఒడఁబాటు
ద్వ.వి.=సమ్మతి, విణ.సమ్మతము,
ప్రయోగము :
క. అప్సరయముఁడిప్పులుకుల, కొప్పితిమీప్రతిమలోననొక చిటికెనవ్రేల్, తప్పకయుండఁగ నిప్పుడ, యొప్పించెద నొప్పఁజెప్పు మొడఁబటనియెన్.(ఇక్కడ ఒడఁబాటనగా ఒడఁబడ్డ ద్రవ్యమని తెలియవలెను.) పర. 5,ఆ.
ఒడగోలుగొను
దే. స. క్రి. = అడగోలుకొను, యొక్కరూపాంతరము.
ప్రయోగము :
వ. మనుష్యుండు పుట్టిన కోలెనిడులంబడి గడించినయొడమి పుడమి ఱేఁ డలిగి గడియ తడవులోన నొడగోలుగొనశక్తుండగునట్ల గృహ గతుండగున తిధి తిరస్కృతుండై యతని పూర్వార్జత సుకృతంబులన్నియు నపహరింపంజాలు.భో. 3. ,ఆ.
ప్రయోగము :
(ఇక్కడ అడగేలుకొనననియే యుండవచ్చును.అయిననూ ప్రతులయందిట్టు ఒకారాదిగాఁ గానబడుచున్నది.)
ఒడపి
దే.వి. = గండి రంధ్రము.
ప్రయోగము :
క. జుఱుజుఱుకని నెత్తురువెలి,
కుఱుకుచు రొదసేయ నఱితియొడపినెయూర్పుల్,
పఱవమిడిగ్రుడ్లవడఁకుచుఁగొఱప్రాణము తోడఁదన్నుకొను నమ్మొదవున్ . ఆము.2,ఆ.
ఒడయడు
దే. వి. = మగఁడు.
ప్రయోగము :
అడిగియాతండొడయడగుమానృపాత్మజకని. భో. 3, ఆ.విణ.స్వామి.
ఒడయుఁడు
దే. వి. = మగడు.
ప్రయోగము :
గీ. యువతి మండలములకొండయుఁడవుగమ్ము.జై. 5, ఆ.విణ. స్వామి.
ఒడయురాలు
దే. విణ. = (ఒడయుఁడు+ఆలు.) స్వామిని.
ఒడలిచూపొడయఁడు
దే. వి. = ఇంద్రుఁడు, అచ్చ, కిష్కిం, కాం.
ఒడలు
దే.వి.= మేను, దేహము.
ఒడి
దే. వి. = తొడపైభాగము, ఉత్సంగము, ఒడుపు, పశుయోని.
ప్రయోగము :
ఒప్పిదప్పినపాముఁబోలెనుండఁగ ఉ. హరి. 3, ఆ.
ఒడిఁబ్రాలు
దే.వి. బ. = గర్భాధానాది కాలములయందు స్త్రీలకు ఒడియందుఁబోసెడు బియ్యము.
ఒడికట్టు
దే.అ.క్రి. = కడఁగు, యత్నించు, ఒడ్డాణము,
ప్రయోగము :
లోకనిందకొడిగట్టితివి. రామా. 5, ఆ.వి.
ఒడికము
దే.వి. = ఉపాయము, మనోఙ్ఞము, యుక్తము.
ప్రయోగము :
చ. ఒడికముతోఁ బ్రయత్నమున నొక్కమహోశిలఁ గొండమీఁదికిన్,
గడపఁగ బారమచ్చటిది గ్రక్కున భూమికిడిగ్గఁ ద్రోవఁగాఁ,
గడుసుకరంబ. రంట. నా. 1, ఆ.-విణ.
కుడిచినపిమ్మటం గుసుమకోమలి వస్తృతసంస్తరంబుగా,
నొడికపుశయ్యచేసి. భార. ఆర. 5, ఆ.
తంత్రులో క్కవరుసదీటిమెట్టు లొడికంబుగనొత్తి. ఉ, రా. 6,ఆ.
ఒడికారము
దే. వి. = ఉద్రేకము, రగడ.
ప్రయోగము :
కారనకే యొడికారపుఁగింకను. య. 4, ఆ.
(ఇది ఇంకను విచార్యము.)
ఒడిత్రాడు
దే. వి. = వేఁటాడుటకు తగిన సాధన విశేషము. కాళ. 3, ఆ. (చూ. తీపుఁద్రాడు.)
ఒడిదామర
ద్వ.వి.= (ఒడి+తామర)వృక్షవిశేషము.
ఒడిదారము
దే. వి. = స్త్రీలమొలనూలు. ద్వి.
ప్రయోగము :
మొనసిసొన్నాంటంకములయొడిదార,
మునకుఁగాఁదగదెయమ్ముద్దియఁజీర. భాగ, 10, స్కం.
ఒడిపిలి
దే. వి. = ఆహార విశేషము. (అప్ర.)
ఒడియు
దే. అ. క్రి. = కొంచెముపైకెగురు, తిగియు, ఆకర్షించు.
ప్రయోగము :
ఎ. గీ. ఒడిసితలపట్టితిగిచి మహాగ్రవృత్తిఁ,
గొంకుకొసరించుకయు లేక కూలఁదాఁచె. భార. విరా. 2,
ఎ. గీ. పడకతఁడు వాని యుఁదలయొడిసితిగిచి,
పుడమిఁబడఁద్రోచిబలిమినుక్కడఁగబట్టి. జై.-3, అ- స, క్రి.
సీ. అపవర్గఫలహిద్ధిహదనైనఁదేపట్టుకైవడి బహుఫలోత్కరములొడిసి. పాండు.2,ఆ.
ఒడిసెలకాఁడు
ద్వ.వి.=ఒడిసెలవేయువాఁడు,
ప్రయోగము :
ఒడిసెలకాఁడ్రను నొడ్డుఁడెందు. హరి. ఉ.1,ఆ.
ఒడుచు
దే. ప్రే. = ఒడించు.
ప్రయోగము :
పారిజాతంబుఁగొనునెడఁదొడరివృత భేదినొడిచితి. హరి. ఉ. 8, ఆ.
ఒడుదొడుకు
దే. వి.= సమముకామి, వైషమ్యము, సంకటము, సమముకానిది, విషమము.
ప్రయోగము :
క. తరుణీమణిజఘనమునకు,
దొరగాక తృణంబుఁబూని తుదితేకవసుం,
ధరయొడుదొడుకులఁబడుమహి,
ధరములు చుట్టువడితావుతరలకయుండున్. రసి. 2, రసి 2, ఆ.
వ. అడవికడకొత్తికొనినడచియొడుదొడుకగుడు. స్వా.4, ఆ.-విణ.
ఒడుపు
దే. వి. = లక్ష్యము పెట్టిదాఁటినదాఁటు, పూనిక, లాభము.
ప్రయోగము :
ద్వి. ఒడుపుదప్పినయట్టియురంగంబుబోలె, హరిశ్చ.1, ఆ.
వ. పెద్దయుం బ్రొద్దునకు నతండు దైవాధీన్యంబునం జైతన్యంబనొందికక్రమ్మఱ నాతో బరిచర్యసేయందలంచిన నప్పుడయ్యొడుపుదప్పింప నొందువెరవుదొరకమిఁదానట్లొడంబడి యెడపల్కిన విధంబునుంజెప్పి. భో. 3.
ఒడ్డగ
దే.వి. = రెండిఱ్ఱికొమ్ములు జతచేసియేర్పరచిన ఆయుధవిశేషము.
ఒడ్డగిల్లు
దే. అ. క్రి. = ఒఱగు, అతిశయించు, చిప్పిల్లు.
ప్రయోగము :
క. నావుడు విభీషణండో,
హోవీరాలాపములనె యోడించితిరే ,
పై వచ్చిన బల వంతుల,
వావనధియునొడ్డగిల్లినట్లనెయుండెన్.
క. మీరేలవంచవలయును. రామా. 7, ఆ.
క. అపుడ,
ప్పలభుక్కులకన్యవన్యఫలభుక్కులకున్,
గలనయ్యెనందుఁబైకొని,
గెలుపునఁగపివీరులొడ్డగిలదొరకొనినన్ రామా. 8,
క. బిడ్డఁడు మ్రొక్కినఁదల్లులు, జడ్డనంకములనునిచిచన్నులతుదిఁబా,
లొడ్డగిలఁబ్రేమ భరమున,
జడ్డువడందడిపిరక్షిజలములననఘా.భాగ. 1, స్కం. ఆ.
ఒడ్డగెడవు
దే. వి. = ఒక ప్రక్క క్రింది కొఱగిమఱియొక ప్రక్క పైకిలేచుట, వాటుపడుట.
ప్రయోగము :
గీ. కెడసెహయములొడ్డ గెడవయ్యెరథములు భార. భీష్మ. 2, ఆ.
క. మును హర గౌరీపరిణయ,
మునకఖిలామరులు సంయములుగూడినవ్రే,
గుననుత్తరభూస్థలింగ్రుం,
గెను దక్షిణభూమియొడ్డగెడవైయుండన్. పర. ఆ.
ఒడ్డనము
యు. దే. వి. = పందెము, వ్యూహము, బెత్తములోనగువానిచేతఁజేయఁబడిన కేడెము, కేడెము.
ప్రయోగము :
గీ. వాహనంబలు సారెలువాఁడిశరము,
లూర్జితాక్షము లసువులు నొడ్డనములు,
గాఁగఁబోరెడునీద్యూతకర్మమందు,
నెసఁగజయమునునపజయమెవ్వఁడెఱుఁగు. భాగ. 6, స్కం.
క. అపురూపములగుమాఱొ,
డ్డనములు ప్రస్ఫురితములు దృఢంబులుఁగాఁదీ
, ర్చనఁగాక తెఱంగగునే,
యని మొనలేర్పఱచె. భార. భీష్మ. 2, ఆ.
చ. పలకలునొడ్డనంబులును బారణ సేయఁగఁగత్తికొంతముల్,
బలుసబళంబులున్ వెనుకఁ బన్నఁగ, హరి. 6, ఆ.
చ. అనువుననద్భుతంబులగు నాక్రమణంబుల వాని నెల్లనొ,
డ్డనమున నాఁగియాఁగిసుదృఢంబగు ఖడ్గముచేతఁ గొన్నితు,
త్తునియలు సేయుచున్ గినిసి దుర్దమతీవ్రచపోటమైకడం,
గినహరిలీలఁగూల్పఁదొడఁగెన్ గరిసన్నిభదైతేయపఙ్త్కులన్ హరి. ఉ. 7, ఆ.
ఒడ్డారము
దే. వి. = ద్వేషము, మాఱొడ్డుట, ప్రతిఘటించుట.
ప్రయోగము :
వ. మనకునక్కచెలియలిబిడ్డలకు నొడ్డారంబులేమిటికినేకకార్యపర్వతంబుననడ్డంబులేకబ్రతుకుదము.
తొల్లియన్యోన్యవిరోధంబులనలంగితిమి. భాగ. 8,
వ. చుఱుకుమినుకుఱేని కొడుకు కడకుంజని భయరసంబులొలుకంబలుకలు పలికినం గనలివినకరాకయొడ్డారంబులొడ్డెనేని. రామా. 6, ఆ.
ఒడ్డారించు
దే. అ. క్రి. = ద్వేషించు, మాఱొడ్డు.
ప్రయోగము :
ద్వి. ఎదిరియొడ్డారింపనెవ్వరివశము . హరిశ్చ 1, ఆ.
క. ఒడ్డారించు విషంబున,
కడ్డము చనుదెంచి కావనధిపులు లేమిన్. భాగ. 8, స్కం.
ఒడ్డిమి
దే. వి. = ఒడ్డు, పందెము.
ప్రయోగము :
వ. ఆశకునియాడియుధిష్ఠిరుండొడ్డిన యొడ్డిమియెల్లగెలుచుచు వచ్చె. భార. ఉద్యో. 1, ఆ.
ఒడ్డు
యు. దే. స. = పందెమిడు, (వల)పఱచు, చాఁచు, ఒగ్గు, మొనయించు, అడ్డగించు, దాఁటు, తీరము, పందెము, వ్యూహము, పూనికి, అడ్డపాటు, స్ధూలము, పెద్ద, అధికము, విశాలము, ఏకకుడు, అన్యుడు.
ప్రయోగము :
వివిధవస్తువాహననివహంబులొడ్డి భార. ఆర. 2, ఆ.
గీ. దాయలొడ్డినమాయజూదంపుటురులఁబడి భార. విరా. 2,
గీ. అనిన నాతఁడు భయమందియాత్మలోన,
నొరులయీగికినకటచేయొడ్డకుండు,
నట్టివానికివలసెనే యనుచుఁగరము,
సాఁచెనవ్విప్రుదెసకునిశ్చయముతోడ. భార. శాం. 4.
గీ.ఇత్తెఱంగు, పాడిగాఁగఁబూనిపలుకంగఁజెవియొడ్డి,
యాదరించు వారినందుఁగాక. భార. ఉద్యో. 1,
దుర్మదక్రీడఁజరించురాడుహర కేశవులొడ్డినఁగావ. భాగ. 1,స్కం.
వేగవఱ్ఱొడ్డియల్లన వెడలి. భార. శాం. 3, ఆ.
వ. తన కొడుకు విరోచనుండు నంగిర సుండనువిప్రు కొడుకుసుధన్వుండు నుద మతమ ప్రాఁబులొడ్డుగానొడ్డి. భార. ఉద్యో.6, ఆ.
పోరికేకమఁగ్రోంచచందమగు నొడ్డుగలంగఁగఁజెసి. భైర. భీష్మ. 6,
ఒక్కయొడ్డున బాష్పాంబుఝరంబులుప్పతిలే బోటుంబాటుగా నెంతయున్. స్వా 3, ర.
క. బిడ్డనిఁగరములఱొమ్మున,
నడ్డంబుగఁ బడ్డిపదములల్లననిడుచున్,
జడ్డనఁగావలివారల,
యొడ్డుగడచి పురిటి సాలయొయ్యన వెడలెన్. భాగ. 10, స్కం. పూ.విణ.
(వాఁడొడ్డు పొడుగుగాణ బెరిగినాఁడు.) ఒడ్డుగా నిట్టూర్పులొలయఁబొగులు, స్వా. 3.
వ. పయోధికన్నబడ్డలుంబోని యొడ్డు చెఱువులచేతను. భీ. ఆ. వై. స.
ఏ. మొసఁగినట్టువృత్తులు చెల్లునే,
ఒత్తరవొడ్డులఁబుట్టదుగదా. భార. ఉద్యో. 1, ఆ.
ఒడ్డొఱకము
దే.విణ. (ఒడ్డు+ఒఱకము) = ఎగుడుదిగుడైనది. (భూమి.)
ఒత్తగిల్లు
దే.అ. క్రి. = ప్రక్కకొఱగు,ఒఱగు, అంటుకొను.
ప్రయోగము :
గీ. ఒత్తగిలియీఁద. కవిక.4, ఆ.
చ. చెలిభుజపీఠినొత్తగిలిచిల్కనుదువ్వుచువాలుఁగన్నుఁగ్రే,
వలకుదధార చేరనొక వారవిలాసినిసూచెరాసుతున్. స్వా 5, ఆ.
సీ. ఘ్రాణంబునీచమైకన్నులు వెల్లనై యుదరంబువీఁపుతో నొత్తగిల్ల. కాశీ. 6, ఆ.
ఒత్తడము
దే.వి.= ఒత్తుట, విణ, తఱచు.
ఒత్తడి
దే.వి. = రాపు, సమ్మర్దము, తఱఁచుఁదనము,బాధ.
ప్రయోగము :
ఒండొరులయొత్తడింబొడిపొడియై. స్వా.5,
సీ. ఒడికంపుసరిగయొత్తడిసరంబు నమించుమిసిమికళ్ళెపుఁగెఁపుమేలివాగె. చంద్రా.2, ఆ.
(అని కొందరు.)
ఒత్తరము
దే.వి. = ముమ్మరము, ఉద్రేకము. (చూ.అత్తరము.)
ఒత్తిలి
దే.అవ్య. = గట్టిగా, పట్టుగా.
ప్రయోగము :
ఉ. చిత్తజరాజ్యసంపదయశేశముగైకొని సౌఖ్యమందఁగా,
నుత్తులు దారనాఁబురవనోపవనంబులుచొచ్చియిచ్చఁబూ,
గుత్తుల వ్రాలి తేనియలు కుత్తుకబంటిగఁ గ్రోలిలీనమై,
నొత్తిలిమ్రోయుచిమపుదళుకొత్తుచునుండుమదాళిదంపతుల్. విక్ర.1, ఆ.
క. ఏనిదియంతయు నెఱుఁగుదుఁ,
గానవృధాశోకవహ్నిఁగాలమికిని నీ,
మానసమునఁ గృపకలిమికిఁ,
గానొత్తిలిదేవగుహ్య గతియుఁ దెలిపితిన్. భార. స్త్రీ.1,ఆ.
ఒత్తు
దే.అ. క్రి. = పొడుచుకొను. ఒఱగు, ఘనమగు, అదుము, విణ. తఱుచు, (కాళ్లు) పిసుకు (శంఖమును) ఊదు, బలాత్కరించు, (పంట) నొక్కు, తుడుచు, త్రోయు, చేర్చు, తీర్చు, ఆక్రమించు, (అంట్లు) త్రొక్కు, అదుముడు, తఱచుఁదనము, మెత్త, ఆక్రమణము.
ప్రయోగము :
బిడ్డలయేతియొక దినుసు బంగారుసొమ్ము, –విణ, ఎ.
గీ. కటికినేలఁగండ్లులొత్తనిద్రపోయెడునయ్యొ. బా.ర. ఆది.6,ఆ.
చ. గరువునకొత్తఁజెంగలువ కచ్చుఘటించినమౌళిఁజుట్టెఁజెం,
దిరికతెఱంగునం బసిడిఁతీఁగలు నించినజిల్గుపాగ. ,వా. 5,
ఉ. ఉల్లమువ్రక్కలైకలఁగ నొత్తినమూర్ఛ వహించిధారణిం, ద్రెల్లిన. జై. 7, ఆ.
(చిగురొత్తు ఇత్యాదులయందలి ఒత్తు ఇంచుక్కు వంటిదని తెలియునది.) స.క్రి. రధ ముద్దండా గ్గతుండంబునం బట్టుం గ్రిందికినొత్తునెత్తు. రా.ఆర. 2, ఆ.
గీ. కుడుపునిద్రయు వర్జించి యడుగులొత్తు,
చుండిరి. భార. ఆను. 2, ఆ.
చ. పిడుగులపిండు బిట్టులియు పెల్లునఁ బార్ధుడు శంఖమొత్తినన్. భార. విరా.4, ఆ.
ఇమ్మెయినన్ను నొత్తియడిగిన .భార. ఉద్యో. 2,ఆ.
మోవిదంతశిఖనొత్తె. కళా.1, ఆ.
క. అశ్రులుమఱి,
యునుగ్రమ్మంగరతలమున నొత్తుచుఁజూచున్. భార. మౌ. 1, ఆ.
చ. ఒదివెడి జవ్వనంబు వెలికొత్తఁగఁబయ్యెద సిగ్గుఁగూడిబు,
ట్టదుమఁగ .ఆము.5, ఆ.
క. అత్తఱిగంధర్వవిభుం,
డత్తామరసాక్షివదనమక్కునమక్కునఁగృపతో, నొత్తి. స్వా3, ఆ.
వ. తమ్మెఱుఁగనిదుష్టాత్మలనడుమం గూర్చుండుటయు నవ్వెంబర విత్తులఱచువీఱిఁడియఱపులకు వంకలొత్తిమాఱు సెప్పటయునొప్పక యుండు. భార. ఉద్యో. 3,ఆ.
క. అనదతనంబును బెజిదపుఁదనమును లేకుండఁ బరఁగిదరియొత్తెడునే. ఱునుబోలె నొత్తవలయును,
మనుజేంద్రుఁడుమార్తురం గ్రమంబ ననధిపా . భార. శాం. 3, ఆ.
సీ. అంట్లొత్తువేళలనంట్లొత్తునెలమిగా న్పించులేఁగొమ్మల వంచివంచి. కళా. 4, ఆ.
సీ. చేదోయియొత్తునఁజేసి మెత్తురులైన యవయవంబులునోరసవరతేయు. నై.2, ఆ.
వ. మట్టలెత్తకొనియొత్తుగల పొదరుటడవులు చొరంబాఱు పిడికడితి కదుపును రవడికి. స్వా 4,ఆ.
సీ. పసిఁడికుంది యనలోపలఁబట్టుపొత్తులయొత్తున నొఱఁగికూర్చుండ మేర్చె.వి. పు7, ఆ.
వ.పరులయొత్తులేని రాజ్యంబుపూజ్యమహిమంబరఁగు. భార. ఉద్యో. 2, ఆ,
బ. బిడ్డలచేతియొక దినుసు బంగారుసొమ్ము.
ఉ. ఒత్తుగ మాంసమున్ మడుఁగుచోగిరమున్ ఘృత శర్కరాదులున్ గుత్తుకంటిమేసి. హరిశ్చ.1,ఆ.
ఒత్తుకమ్మి
ద్వ.వి.=బొద్దులకు ప్రక్కలకమ్మివలె నేర్పఱచెడు తదవయవ విశేషము.
ఒత్తుకాఁడు
దే. వి. = సుతిపోయువాఁడు.
ప్రయోగము :
వ. అతండుసుగుణధ్వనితంత్రీనాదంబుగా నావండ్లవారొత్తుకాఱుగా గాండీవంబు వీణగావినోదంబు సలిపే. భార. విరా. 5,ఆ.
ఒత్తుకొను
దే. అ. క్రి. = పొడుచుకొను, స. క్రి. ఆక్రమించుకొను.
ప్రయోగము :
క. వారుదెసలొత్తుకొనియుధ,
రారాజ్యంబచ్చిపోయిరాపోరో. భార. ఉద్యో. 2, ఆ.
ఒదరు
దే. అ. క్రి. = విజృంభించు, సంభ్రమించు, నిందించు.
ప్రయోగము :
సీ. వలఁతులై నిగిడెడువలుదతొండములచే నొదరితేసాఁచు మృత్యువులుఁబోలె . లక్ష్మీ. 4, ఆ.
ద్వి. అనవుడురోషతామ్రాక్షుఁడైచూచి,
కనలుచుఁగటములుత్కటములైయదర,
నొడలెల్లఁగంపింపనొదరుచుఁబలికె. రా. బాల, కాం.
దుర్యోధనుండువిదురుందూలనొదరి. సం. ధగస్తుక్షత్తారమితిబ్రువాణః. భార. సభా. 2, ఆ.
ఒదరుచు
దే. స. క్రి.= ఊడఁదీయు. (రూ. ఒదర్చు.)( చూ. అంట.)
ఒదికిలు
దే.అ.క్రి.=ప్రక్కకొఱగు, ఒత్తగిల్లు,
ప్రయోగము :
చ. ఒదికిలిపాన్పుపైఁబతికి నొయ్యనఁగేలుతలాఁపుచేసి ఉ. హరి. 5,ఆ.
ఒదిగిళ్ళు
దే.వి.బ.=ఒదికిలుటలు.
ఒదివిరిప్రాలు
దే.వి. బ. = ధాన్యవిశేషము.
ప్రయోగము :
సీ. క్రొత్తగోనియల బియ్యమువడ్లు నెమిలివడ్లు,
నొదివిరి ప్రాలును నొనరంగఁబోసిచాఁపలు మంచములుమీఁద బలియఁగట్టు. హరి. పూ.6, ఆ.
ఒదివిరిప్రాలు
దే.వి.బ.=ధాన్యవిశేషము.
ప్రయోగము :
సీ. క్రొత్తగోనియల బియ్యమువడ్లు నెమిలివడ్లు,
నొదివిరి ప్రాలును నోనరంగఁబోసిచాఁపలి మంచములుమీఁద బలియఁగట్టు. హరి. పూ. 6,ఆ.
ఒదుఁగంబాఱు
దే.అ.క్రి.=(ఒదుంగన్+ పాఱు)ఒదుఁగు.
ప్రయోగము :
బ్రాహ్మణుండొదుఁగఁబాఱకనిల్చి. భార. అను. 3,ఆ.
ఒదుఁగు
దే.అ.క్రి.=తొలఁగు.
ప్రయోగము :
గొరిజలత్రొక్కునంబిరిదిలికుండలిభర్తయొందుగ. లక్ష్మీ.3,ఆ.
ఒదుఁగు
దే.అ.క్రి.=తొలఁగు.
ప్రయోగము :
గొరిజలత్రొక్కునంబ్రిదిలికుండలికుండలిభర్తయొదుంగ. లక్ష్మీ. 3,ఆ.
ఒదుఁగువడు
ద్వ.అ.క్రి.=(ఒదుఁగు+ పడు.)తొలఁగు, క. ఒదుఁగు వడయోజనత్రయ, ముదలంబగువిమతసైన్యములనీరీతిన్, మడమడఁచి.జై.5,ఆ.
ఒదుఁగువడు
ద్వ.అ.క్రి.=(ఒదుఁగు+ పడు.)తొలఁగు.
ప్రయోగము :
క. ఒదుఁగువడ యోజనత్రయ, ముదలంబగువిమతసైన్యములనీరీతిన్, మదమడఁచి.జై. 5,ఆ.
ఒదుఁగువాటు
ద్వ.వి.=ఒదుఁగుపడుట, తొలఁగుట.
ఒదుగు
దే. అ. క్రి. = సమృద్ధమగు,( చూ. ఒదువు.) లు. సమృద్ధి. విణ. సమృద్ధము.
ప్రయోగము :
క. ముల్లుదలకొనని నవకపుఁబల్లవముతోడముక్తిభామచెవులకుం,
బల్లేరుపూవుల గుపువు,
లుల్లసిలునలర్కశాక మొదు గుగఁగొనుచున్. ఆము. 4,ఆ.
ఒదుగుబడి
దే.వి. = సమృద్ధి.
ఒదువు
దే.అ.క్రి. = క్రమ్ము, సమృద్ధమగు, సమృద్ధము, సమృద్ధి. (ఒదుగు యొక్క రూపాంతరము.)
ప్రయోగము :
గీ. అతనిముందఱఁబార్శ్వంబులందుఁబిఱుఁద,
నొక్కయమ్మడిఁబెక్కండ్రురుక్కుమిగిలి,
యురవడించినదేవిపైనుగ్ర దివిజు,
లొదువఁపేరల్కఁబెదవులొండయదర. మార్క.6, ఆ.
(పొదుపుయొక్కరూపాంతరము.) ధనమొగువంగఁబుచ్చుకొని. మార్క,2. ఆ.వి.
ఒద్ద
దే. వి. = దాపు, సమీపము.
ప్రయోగము :
క. వచ్చంనుభృగునం,
దనుఁడు నిజనందనకుంబ్రియ,
మొనరింపఁగఁదలఁచిదానియొద్దకుఁబ్రీతిన్. భార. ఆది. 3, ఆ.
ఒద్ది
దే.వి. = ఒకానొకచెట్టు.
ఒద్దిక
దే. వి. = అనుకూల్యము, ఒకవస్తువుకు సరియెత్తుగానుంచి తూఁచెడు ఱాయిలోనగునది, ప్రతిమానము.
ప్రయోగము :
సీ. తొలునాఁడుశోధ్యునిఁదులఁదూఁచియాతని యెత్తగు నొద్దికలెల్లదాఁచి విఙ్ఞా.వ్య.కాం.
ఒద్దియ
దే.వి. = సమృద్ధి. (అ. ప్ర)
ఒద్దె
దే.వి. = సమృద్ధి. (అ. ప్ర)
ఒనగూడు
దే. అ. క్రి. = సిద్ధించు. (ఒనఁగూడు యొక్క రూపాంతరము.) (ప్రే. ఒనగూర్పు.)
ఒనరించు
దే. ప్రే. = ఒనర్చు, చేయు.
ఒనరిక
దే.వి. = పొందిక, పొంకము.
ఒనరు
దే. అ. క్రి. = కలుగు, పొసఁగు, సరిపడు, ఒప్పు, పొందిక, ఇంపు.
ప్రయోగము :
సీ. భూతగణంబులచేత నీ,
హరిసత్తమునకు నెగ్గనరనీననిశివుండు. నిర్వ.7, ఆ.
ఇదియునదియునొనరుటెట్లోకొ. కళా. 4, ఆ.
సమాప్తినొనరెన్ ధరణీ ధరయీమఖంబు. (సమాప్తిన్ సమాప్తిచేతననియర్ధము.)భార. సభా.2, వి.
సీ. రామభద్రుండుగరంబుదూరంబుగానరనరిగి యంతటను దామరలుదృష్టి, కొనరుగైకొని. రాఘ. 3, ఆ.
ఒనరుచు
దే. ప్రే. = ఒనరించు, చేయు.
ఒనరుపడు
ద్వ.అ.క్రి.=పొందుపడు.
ఒనవెట్టుకొను
దే, అ. క్రి. = ( ఒనరు పట్టుకొను.) పొంచువేయు.
ప్రయోగము :
సీ. ఓగిరంబు హరింపనొనవెట్టుకొని యైన వేగునంతకుఁజేసెజాగరంబు. కాశీ. 4, ఆ.
ఒప్పందము
దే.వి. = అమ్మెడువాఁడును కొనెడువాఁడును ఈ వెలకు ఈ సరకు నింతమాత్రము ఇచ్చెదననిగాని తీసికొనియెదననికాని చేసికొనెడు ఏర్పాటు.
ఒప్పమి
దే.వి. = కీడు, తప్పు.
ప్రయోగము :
క. మున్నుగలగోపవర్గము,
నిన్నుంగనికొలిచిభక్తినీపనిచేయన్,
మన్ననమానిసివైనీ,
పున్నంగడుమేలకాకయొప్పమిగలదే. భార. విరా. 1, ఆ.
నా యొప్పమియేమిసంఘటిలెనొక్కొయటంచు. కళా.4,ఆ.
ఒప్పరము
దే. వి. = జలధారి.
ప్రయోగము :
సీ. తూపరాణపులమ్ముతూమొప్పరముజలదారియంచనఁ గనుగనరునుజనుల, నిర్గమము. ఆం, భా. ప్ర. వారి.
ఒప్పారు
దే.అ.క్రి. = (ఒప్పు+ఆరు)ఒప్పు.
ప్రయోగము :
శా.ఆరూఢస్ధితినెల్ల దేశములు నొప్పారున్ బ్రకాశంబుగన్. భార. ఆర. 4,ఆ.
ఒప్పిదము
దే.వి.= (ఒప్పు+ఇదము) అందము, అలంకారము, విధము, మనోఙ్ఞము.
ప్రయోగము :
కాళ్లయొప్పిదమాఁడుకటటనుజ్వలము సేయంగ. భార. విరా.1, ఆ.
చ. ఒప్పిదము లొనర్పఁబరచిగభీరవిభూతి యెలర్పవీటికిన్. హరి. ఉ.3,ఆ.
క. మంత్రంబునబె,
ట్టిదముగఁబడవైచినయొ,
పిపదముననస్త్రమునఁగూల్చె భీష్మునిసూతున్. భార. భీష్మ. 2, ఆ.-విణ.
ఒప్పు
దే. అ. క్రి. = ఒప్పిదమగు, తగు సమ్మతించు, అందము,తప్పుకామి, సమ్మతి.
ప్రయోగము :
ఆకామినియొప్పనఁ జూడ్కితగులుమీఱిన .భార. ఆర. 6, ఆ.
క. ఒప్పుగునోతప్పగునో,
యిప్పటికిందోఁచుకార్యమిది. ఉ,హరి. 4, ఆ.
క. గంధమాల్యాదివాసనల్ గ్రమ్ముదేరఁ,
దోడుకొనివచ్చిరప్పడాతోయజాక్షి,
సరసుఁడున్నట్టికేళి కాసదనమునకు,
బనిమిచేనొప్పచేతనుబద్మముఖములు, అని 1,ఆ.
ఒప్పుకొను
దే. స. క్రి. = సమ్మతించు, అంగీకరించు.
ఒప్పుకోలు
దే.వి. = ఒప్పుకొనుట.
ఒప్పులాఁడి
దే.వి.(ఒప్పులు+ఆఁడి.)= చక్కదనము గల ఆఁడుది.
ఒబ్బట్లు
దే. వి. బ. (ఒమ్ము+ అట్లు) = భక్ష్యవిశేషము, పోళీ.
ఒబ్బిడి
దే.వి. = పంటనుఱిపిడి, నాశము. (ఇంటనున్న వడ్లగింజలన్నియు నొబ్బిడియైనవి.)
ఒమ్మిక
దే.వి. = ఇమిడిక, పొందిక.
ప్రయోగము :
ద్వి. సమ్మదంబునఁబర్ణశాలగావించి,
యొమ్మికగురులనందునిచినవాఁడ. రా.అ. కాం.
ఒమ్ము
దే. అ. క్రి. = ఒవ్వు, సరిపడ, (ఈ నీళ్లు నాకు ఒమ్మలేదు.) వి. బలుపు, స్ధౌల్యము, విణ. పెద్ద, స్థూలము.
ఒయారము
దే. వి. = విలాసము,సౌందర్యము.
ప్రయోగము :
చ. పుట్టుగ్రుంకుగ,
ట్లనుదనరెడుతేతులనొయారము మీఱఁగ నేల కొమ్మదాల్చిన . య. 5, ఆ.
ఎ. గీ. రతివిథంబనఁగడునొయారమునఁబొందలి. చంద్ర.
(ఒయ్యారముయొక్కరూపాంతరము.)
ఒయారి
దే.వి. = విలాసముగల స్త్రీ, సౌందర్యముగల స్త్రీ, విణ. సౌందర్యము గలది.
ప్రయోగము :
ఉ. ప్రేలునొయారిక్రొమ్ముడులువెన్ను కెలంకులచోముహుర్ముహుం,
ర్లీల నటింప. రామా.1, ఆ.
(ఒయ్యారియొక్క రూపాంతరము.)
ఒయ్య
దే. క్రి. విణ. = తిన్నఁగా, మెల్లఁగా.
ప్రయోగము :
సీ. అంతఁబులోముఁడన్వింతరక్కసుఁడగ్ని హోత్రగృహంబునకొయ్యవచ్చి. భార. ఆది. 1, ఆ.
మ. నిజం, బడుగంజూచెదనంతయుందెలియనొయ్యంజెప్పురానావుడున్. రామా. 6.ఆ.
(ఆమ్రేడితమందు ఒయ్యొద్దు.)
ఒయ్యన
దే. వి. = తిన్నన, మెల్లన.
ప్రయోగము :
ఒకనాఁడు నారదుఁడొయ్యనఁ గంసునియింటికిఁజనుదెంచి. భాగ.10, స్కం. పూ.
(చూ. ఒయ్య)
ఒయ్యారము
దే.వి. = విలాసము, అందము.
ప్రయోగము :
సీ. హారముల్ మెఱయ నొయ్యారంబులుగగ్రుచ్చియందందవింతగానలవరింతు. భార. విరా.1, ఆ.
ఒయ్యారి
దే. వి. (చూ.) = ఒయారి.
ఒర
దే. వి. = ఒరపెట్టుట, సామ్యము.
ప్రయోగము :
మ. చరమాశానికశోపలాంచలమునన్ సంధ్యాప్రకాశోదయం,
బొరగావించివిరించి చేకొనిన సూర్యుండన్ప దార్వన్నెబం,
గరపుం బూదియకై. నై, 8.
క. అప్పుడుమధ్యందినమున,
నొప్పారిన భానుతోడరనొర వచ్చిగురుం,
డప్పాండవ బలములపైఁ దెప్పదెరలఁ గురిసెశర తతిందీవ్రముగాన్. భార. భీష్మ. 2, ఆ.
ఒరగడుగు
దే.వి. (ఒరకడుగు.)= రెండవసారి బియ్యముకడిగిన నీరు.
ఒరగల్లు
దే. వి. (ఒర కల్లు) = బంగారులోనగువాని నొరపెట్టెడు ఱాయి, నికషము.
ఒరగాలు
దే. వి. (ఒరగు కాలు.)= ఒరగిలకాలు, మఱియొకకాలుమీదనొఱగఁబెట్టినకాలు, కప్పకునొరగాలైనను.
ప్రయోగము :
చ. కమలవనంబులో ననొరగాలనె నిల్చుచునిద్రవోవఁగా,
విమలమరాళముంగని నవీన సితాంబుజ మంచువేడ్కతో,
రమణియొకర్తుముట్టినఁ గరంబదిపద్మమటంచునంటఁగాఁ,
గమలముఖుల్ కికాకికనగన్ భయమందుచువ్రాలెవెన్కకున్. భాను. 2, ఆ.
ఒరగు
దే.అ. క్రి. = వంగు, వ్రాలు, ఒరగుదిండు, (చూ. ఒఱగు.) వంపు, వంపైనది.
ప్రయోగము :
చ. ధరణిజనాత్మలోఁదలఁచితద్దయుశోకముఁబొందిబాష్పముల్,
తొరఁగఁగవచ్చనూర్చుచునుదుఃఖపరంపర నిద్రలేకతా,
నొరగుచులోచుచున్ .రా కిష్కిం. కాం. - వి.
ఒరగొను
దే. స. క్రి. ( ఒర కొను.) = ఒకపెట్టు.
ఒరచాలుదుక్కి
దే. వి. = చాలుతేలికగాఁబాఱిన దుక్కి.
ఒరచుబద్ద
ద్వ.వి.=పలకలోనగు నవి నునుపు పఱచెడు వడ్లవాని కొఱముట్టు.(అప్ర.)
ఒరపదను
దే.వి. = కొంచెపుతడి.
ఒరపిడి
దే.వి. = రాయిడి,
ప్రయోగము :
క. అన్నలుఁదమ్ములుఁగలుగుట.
యున్నతుఁజేయునృపునెంతయొరపిళ్లయినన్,
మన్ననయునీగియునుసం,
పన్నంబులుగాఁగవారిఁబాటించుటగున్. భార. శాం. 2,
ఒరపెట్టు
దే. స. క్రి. = బంగారులోనగువానిని ఒరయు.
ఒరయిక
దే. వి. = రాపిడి, ఘర్షణము.
ఒరయు
దే. స. క్రి. = ఒరపెట్టు, రాచు, పరీక్షించు, విచారించు, వెదకు.
ప్రయోగము :
సీ. అనుడుమహాత్మమిమ్మంతనేనొరయం గనర్హమేమీపల్కులందుఁగలదె,
యనుమానమనుటయు. కళా. 2, ఆ.
క. నరపతిభృత్యులఁడొడవులనొరసితగిన నెలవులందు నునుపకయున్నన్,
జరణంబునఁజూడామణి,
శిరముననందియముఁబెట్టు చెలువముగాదె. పంచ. నా. 1, ఆ.
సీ. గవులలో మౌనిపుంగవులలోఁబరికించిహ్రదనదజనపద పదవులొరసి. రామా. 5.ఆ.
ఒరవడి
దే. వి. = విద్యార్ధులు అక్షరములు కుదురటకైమేలుబంతిఁజూచి వ్రాసెడువ్రాఁత.
ఒరసికొనిపోవు
దే.అ. = విద్యార్ధులు అక్షరములు కుదురటకై మేలుబంతిఁజూచి వ్రాసెడువ్రాఁత.
ఒరిగ
దే.వి. = మ్రొక్కు, నమస్కృతి,
ప్రయోగము :
ఒరిగ బ్రహ్మాండభండోదరునకు. రుక్మాం 1, ఆ.
ఒరిజ
దే.వి. = ఏనుఁగుమెడగొలుసు, కలాపము.
ప్రయోగము :
సీ. గళలిప్తకస్తూరికారేఖలొరింజలు నునుఁజెక్కులజవాదిమొనపుమదము. చంద్రా.1, ఆ.
ఒరిమిక
దే.వి. = ఒరిమ.
ఒఱ
దే. వి. = గవుసెన నిచోళము ఖడ్గాదికోశము, ప్రత్యాకారము, బావియొఱ.
ప్రయోగము :
క. ఒఱలందునాయుధంబులు,
విఱిగిపడందొడఁగె. జై.6, ఆ.
ఒఱకటము
ద్వ.వి.=(ఒరగడ్డము యొక్క రూపాంతరము.) సంకటము, విణ. విషమము.
ప్రయోగము :
ద్వి. మెఱయునీతఁడువోవ మీఁదటఁజాల, నొఱకటంబుననొత్తురొగిఁబ్రజలెల్ల. భాగ. 1,స్కం.
ఒఱకము
దే.వి. = పల్లము, సంకటము.
ప్రయోగము :
క. నెఱవైదట్టంబైకన్,
దెఱచినఁగనుమూసికొనిన తెఱఁగై తిమిరం,
బొఱకంబిదిమెఱకిదియని,
యెఱుఁగన్ రాకుండఁజేసెనెల్లధరిత్రిన్, సురా.
గీ. అతిథిబంతికిరాకున్న నారగింపఁ,
డొంటినొకనాడుఁబతియెట్టియొరకమైన. కాశీ.7, ఆ.
ఒఱకాటము
ద్వ.విణ.= ఒఱకటము యొక్క రూపాంతరము,
ఒఱగఁబడు
ద్వ.అ.= (క్రి. ఒఱగన్+పడు)(స్వార్థమునపడు.) ఒఱగు.(రూ. ఒరగఁబడు)
ఒఱగడ్డము
ద్వ.వి.=(ఒఱవ+గడ్డ), సంకటము, విణ. విషమము.
ఒఱగు
దే.అ. క్రి. = వంగు, వ్రాలు, ఒఱగుదిండు, వంపు, వంపైనది.
ప్రయోగము :
క. అఱకటనిడిప్రాఙ్ఞ్ముఖుఁడై,
పఱచిజలధిలోనఁబాఱునెడంజె,
య్యఱిదప్పినిలువఁజాలక,
యొరిగినగాలనుని డించెనొకగిరిమీఁదన్. భార. ఉద్యో.3,
ఒఱుగుమీఁదటంజేరి. కళా. 7,ఆ.
ఒఱగుబిల్ల
దే.వి. = ఒఱగుదిండు, ప్రగ్రీవము. (రూ. ఒరగుబిల్ల.)
ఒఱగువోవు
దే.అ. క్రి. (ఒఱగు+పోవు.) = ఒఱగఁబడు.
ప్రయోగము :
సీ. కొంగమెడయునిడుగూనివీఁపునొఱగువోయినరొండియుబొక్కిఱొమ్ము. హరిశ్చ.4, ఆ.
(రూ. ఒరగువొవు.)
ఒఱగొడ్డెము
ద్వ.వి.=(ఒఱగొడ్డము యొక్క రూపాంతరము.) మనసు నొప్పించెడు వంకరమాట.
ప్రయోగము :
క. బిడ్డలకు బుద్ధిసెప్పిని, గ్రుడ్డికిఁబిండంబువండికొని పొండిదెపైఁ, బడ్డాఁడని భీముండొఱ, గొడ్డెములాడఁగఁ గూడు కుడిచెదవధిపా. భాగ. 1, స్కం.
ఒఱటు
దే.విణ. = దుశ్శీలుఁడు.
ప్రయోగము :
గీ. ఉసుఱుసిరియునునొల్లకిల్లొఱటుచాకి,
యాదిదేవుని దెసవినయంబుదక్కి,
యహపరంబులులేకయిట్లేగెభగ్న,
కంఠుఁడైనేలపైఁగూలికాలుఁగూడ.హరి.పూ.6, ఆ.
ఒఱపరి
దే. విణ. (ఒఱపు+అరి.) = సౌందర్యవంతుఁడు.
ప్రయోగము :
ఒఱపరిఁగన్నఁగూడఁజను. జై. 3, ఆ.
ఒఱపిఁడి
దే. విణ. (ఒఱపు+ఇఁడి.) = అయోగ్యుఁడు.
ప్రయోగము :
క. వెఱవకు నెమ్మదినుండుము,
పెఱవారలబుద్ధినాత్మఁబెట్టునెయనఘుం,
డొఱపిఁడిచాడ్పుననామది,
నఱమరలేదొండునమ్ముమనియెనరేంద్రా.విక్ర. 3,ఆ.
ఒఱపు
దే.వి. = సౌందర్యము, ఉపాయము, తాపము, ప్రతాపము, యోగ్యత, స్థైర్యము, దృఢము, యోగ్యము.
ప్రయోగము :
గీ. శక్రుతేరైననడపంగఁజాలువాఁడ,
నొఱపుచెప్పుదురథికునేమఱఁగనీను. భార. కర్ణ. 1, ఆ.
గీ. బాలతను కాంతితోసాటిఁబోలఁగోరి,
పృథివిననల ప్రవేశంబుఁ బెక్కుమార్లు,
చేసియొఱపులఁబడెంగానివీసమైనఁ,
బోలఁగాఁజాలదయ్యోజాంబూనదంబు. రసి. 2, ఆ.
ఎ. గీ. మదురుగోడలమెఱపువాల్ మెఱపువాల్ మగలయొఱపు. రసి.1, ఆ.
సీ. ఒఱపు చేఁదోలుకారుమెఱపుచేవనదల్చుఁగలకంఠికలికి చూపులబెడంగు. పర.1. ఆ.
చ. ఒఱపు చేఁదొలుకారుమెఱుపుచేవనదల్చుఁగలకంఠికలికిచూపులబెడంగు. పర.3,ఆ.
చ. ఎఱుఁగరుగాక లోకమున నెవ్వరికైనను మేలుసేయఁగా,
నొఱపగునాశ్రమంబున సమున్నతమైన గృహస్థధర్మమున్,
బరగడవైచి వెఱ్ఱిగొని పాఱెడి పొల్లకు ముక్తికల్గునే,
పఱిగరియేఱినం గొలుచు ప్రాఁచటికింగల దే తంపఁగన్. ఉ,హరి. 5,ఆ.
ఒఱపులాఁడి
దే.వి. (ఒఱపులు+ఆఁడి.)= సౌందర్యవతియైన స్త్రీ.
ఒఱపెంకు
దే. వి. = బావియొఱ.
ఒఱలు
దే.వి.క్రి. = ఱోలు, విలపించు, మ్రోఁగు.
ప్రయోగము :
ఎ. గీ. అతిప్రబలపవన,
భూరిరయమునఁ గులు మహీరుహంబు,
తెఱుఁగుదేఁప సుదక్షిణుఁదొఱలి కెడసె. భార. ద్రో. 3,ఆ.
చ. తఱిగొని యంత లేన మధుదైత్యహరుండు మహేంద్రుసింజినిం,
గొఱనెలతూపునం దునిమిక్రూరతరంబగుభల్ల మొక్కటన్,
నఱకినఁగూలెఁదద్ఘనఘనాఘనకల్పితమైన టెక్కియం,
బొఱలుచు నోరుగాలి మొదలూడఁగఁగూలెడుమ్రానుగైవడిన్. పా.5. ఆ.
ఒఱవ
దే. విణ. = వక్రము, వ్యత్యస్తము, వికృతము.
ప్రయోగము :
క. అఱపొఱడుకుఱుచచేతులు,
నొరవశరీరంబు. భార. ఆర.3,ఆ.
క. తెప్పించితొడుగుమీవని,
యొప్పించిననిట్టునట్టునొఱవలుగామైఁ,
గప్పికొనియాబృహన్నల,
యప్పుడునగిపంచెనచటియబలాజనమున్. భార.విరా. 4, ఆ.
ఒఱవఁబడు
ద్వ.అ.క్రి.=ఒఱగఁబడు,
ప్రయోగము :
చ. ప్రాణమర్మముల్, వదలిశతాంగయష్టినొఱవంబడ. జై. 6,ఆ.
ఒఱవు
దే. అ. క్రి. = ఒఱగు యొక్క రూపాంతరము. (చూ. ఒఱవఁబడు.)
ఒఱ్ఱ
దే. విణ. = కారమైనది, కటువు.
ప్రయోగము :
సీ. ఒక కొన్నిద్రబ్బెడలొకకొన్ని తాలింపులొక కొన్ని విధముల యొఱ్ఱ చేరులు. పాండు4,ఆ.
ఒఱ్ఱకసింద
ద్వ.వి.=కచ్ఛుర.
ఒఱ్ఱన
దే.వి. = ఒఱ్ఱదనము, కారము.
ఒఱ్ఱియ
దే.వి.= సాధువుకానియావు.
ఒఱ్ఱు
దే. విణ. = గొప్పది, పెద్దది.
ఒఱ్ఱె
దే.వి. = ఒఱ్ఱియ యొక్క రూపాంతరము.
ఒలయు
దే. అ. క్రి. = వ్యాపించు, ప్రవేశించు, కలుగు, కలయు, చేరు, చుట్టుకొను, కదియు.
ప్రయోగము :
శుభానిలము లొలసె. జై.6, ఆ.
సలిలకేలికి నొలసియునొలయక. నిర్వ. 7,ఆ.
గీ. పౌర్ణమాసిఁబూర్వపక్షాష్టమినిజతు,
ర్దశినినుభయపక్షవశతవచ్చు,
షష్ఠిఁబంచమినిసునిష్ఠమైనుపవాస,
మున్న వివిధశుభములొలయునండ్రు. భార. అను. 4,ఆ.
ఆ. ఒలసీనీపుత్రులెల్లనొండొరు లతొడ ,
నెట్లొడంబడియండుదురట్లచేయ,
వలయు. భార. సభా. 2, ఆ.
గీ. సురసిద్ధ, సాధ్యకన్యలట్టిసఖులునూర్వు,
రొలసితన్నుఁగొలుచుచుండగ. భార. ఆర. 2,
చ. తప్పిదారివె, న్నొలసినమాఱు వెన్నఱుఁగ కుండుట యొచ్చెముసాదికోటికంచు. ఆము. 2, ఆ.
ఒలి
దే.వి. = ఒలుపు, దోఁపుడు, అపహరణము.
ప్రయోగము :
క. మొలకలు రాజకుమారులు,
తల్లిదండ్రులులేని,
వారు దయకర్హులుభూ,
తలములఁగల ప్రజలందఱు,
నొలిచిన నొలివాడెదరు సుయోధనుబాధన్. జై. 1,ఆ.
ఒలికి
దే. వి. = సొదపేర్చెడుచోటు.
ప్రయోగము :
ఎ. గీ. ఊరనుండనొల్లఁడొలుకులలోఁగాని. వీర. 2,ఆ.
ప్రయోగము :
ఒలిదామర
ద్వ.వి.=(ఒలి+తామర.)ఒకానొకచెట్టు.
ఒలియు
దే. అ. క్రి. = తోలుదోఁగు.
ప్రయోగము :
క. వదలకపెనఁగి పదుండ్రన్,
బదయేవురనొక్క పెట్టఁబట్టిధరిత్రిన్,
జెదరఁబడవైచిపవనజుఁ,
దయయుండై వీఁపులొలియనందఱనీడ్చున్. భార. ఆది. 5, ఆ.
ఒలివడు
ద్వ.అ.క్రి.= (ఒలి+పడు) దోఁపుడు పోవు. సీ. ఒలివడ్డనెవమునఁగల లేని సిరి చెప్పి చుట్టలపై దాడి పెట్టువారు. ఆము. 6,ఆ.
ఒలుకు
దే. అ. క్రి. = చిందు, కాఱు, చల్లు, పోయు.
ప్రయోగము :
చ. కలశతనూజయచ్చెరునుగాశియందొకశంబులింగమున్,
దిలలనుక్షతంబులనుధీనిధియొక్కఁడు పూజచేసిపో,
నొలికిన వానియేయుటకు నోలిఁబ్రదక్షిణమాచరించిచి,
ట్టెలుకశరీరముందొఱఁగకెక్కెనుబోరజతాద్రికూటమున్. కాశీ. 6,ఆ.
(చూ. మొక్కలను మూడవయర్ధము నుదాహరణము.) గీ. చానుజనివిప్రులును వనితా జనంబు,
సేసలొలుకసింహాసననాసీనుఁడయ్యె. భార. విరా.5,ఆ.
సీ. నెయ్యురఁబన్నీట నింపలా వఱునొక్కనెలఁతతీవల కెల్లనీరమొలుకు. కవిక. 6,ఆ.
ఒలుకులమిట్ట
దే. వి. (ఒలుకులు+మిట్ట.)= కాడు, శ్మశానము.
ఒలుచు
దే. ప్రే. = ఒలియఁజేయు, తోలూడ్చు, అపహరించు.
ఒలుపు
దే. వి. = ఒలుచుట. (ఒలుపుఁబప్ప. మొ.)
ఒలె
దే.వి. ( చూ) = ఒల్లియ.
ప్రయోగము :
సీ. పైఁడిబాసముచెట్లఁబడవైచిద్రుడ్డు పెట్లకుఁబాఱుచునెయొలెల్ వైచువారు. ఆము. 6, ఆ.
(ఒల్లె యొక్కరూపాంతరము.)
ఒల్లఁబాటు
ద్వ.వి.=(ఒల్లమి+పాటు) అపేక్షలేమి, ఒల్లమి, విణ. అపేక్షింపఁబడనిది.
ప్రయోగము :
గీ. ప్రాణములునర్థములు నొల్లఁబాటుసేసి. భార. భీష్మ. 1,ఆ.
ఒల్లఁబోక
దే. వి. (ఒల్లమి+పోక) = అనాదరము.
ప్రయోగము :
ద్వి. మెల్లనఁదావచ్చిమెచ్చినాకీక,
యొల్లఁబోకలు సేనె నొల్లఁబోనిన్ను. రా. ఆర. కాం.
ఒల్లఁబోవు
దే.అ. క్రి. (ఒల్లమి+పోవు.) = మూర్ఛిల్లు, వాడు, ఆదరింపఁబడనిదగు.
ప్రయోగము :
గీ. అడ్డపడి గురుందుదొడ్డ నారసమువ,
క్షంబుదూఱనేయసవ్యసాచి,
యొల్లఁబోయి తెలిసి లెల్లేసెనక్కుంభ,
జన్ముమీఁదనిశితసాయకములు. భార. ద్రో. 3, ఆ.
గీ. మెండుమీఱినపగటిబీఱెడదాఁకి,
యొల్లఁబోయినలేబొండుమల్లెపొదల,
తుదలఁజప్పటలైకడు దొడ్డలగుచుఁ,
బొడమె మొగ్గలగములగ్గిబొబ్బలట్లు. ఆము. 2, ఆ.
(చూ. ఒల్లఁబోక.)
ఒల్లగిల్లు
దే. అ. క్రి. = ఆదరింపఁబడనిదగు.
ప్రయోగము :
మ. పతిచూపున్ సతిచూడ్కయున్ సమగతిన్ బ్రస్ఫీతరాకంబులై,
ధృతివాయంబుయిలోటయొల్లగిల నుద్వెగెబఱన్ హ్రీపరి,
చ్యుతివాటిల్లఁబరస్పరాంగములబై నొండొండప్రాఁకంగఁద,
చ్చతురావస్థకృతార్థ దెపతులయోజన్ బొల్చెనిర్వ్యాజతన్. హరి. ఉ, 3, ఆ.
ఒల్లమి
దే.వి. = వలవమి.(వలచుధాతువు యొక్క వ్యతిరేకబావార్ధకరూపము.)
ఒల్లియ
దే. వి. = వస్త్రము, ఉత్తరీయము.
ప్రయోగము :
వెల్లతలయొల్లియమౌళిదృఢంబుగా సమర్చెన్. భార. కర్ణ. 3,ఆ.
సీ. శంపాలతికలోడిజలదంబుకైవడి మెఱుఁగుటొల్లియతోడి మేనివాని. భాగ.10, స్కం. పూ.
ఒల్లె
దే.వి. = ఒల్లియయొక్క రూపాంతరము.
ప్రయోగము :
ఒక్కపరిశుద్ధపులైకపుటొల్లెఁగట్టి. ప్రభా. 4,ఆ.
ఒల్లెంక
దే. వి.= మత్స్యవిశేషము.
ఒల్లెవాటు
దే. వి. =అంగవస్త్రము కుచ్చెపెట్టిమెడచుట్టిరాబుడములమీఁద వైచుకొనుట.
ఒళవరి
దే. విణ. (ఒళవు+అరి.) = మర్మఙ్ఞఁడు. (చూ. ఒళవు.)
ఒళవు
దే.వి. = మర్మము, లోఁకువ, వీణాదండము, ప్రవాళము.
ప్రయోగము :
ఎ. గీ. చారుమౌర్విలేనిచాపదండమునోజ,
లలితతంత్రిలేనియొళవుఁబోలె. రా. ఆర. కాం. 2. ఆ.
ఒళ్ళు
దే.వి. = ఒడలు యొక్క రూపాంతరము.
ప్రయోగము :
ఉ. ఒళ్లారకమున్న వచ్చి యొకయంగన చూచె నరేంద్ర చంద్రునిన్. కవిక. 3,ఆ.
(ఇది వెళ్ళుసళ్లుల వంటిది.)
ఒళ్ళుపెట్టు
దే. అ. క్రి. = బలియు.
ఒవ్వు
దే.అ. క్రి. = గిట్టు, సరిపడు.
ప్రయోగము :
క. ఒవ్వనివారలయెదురను,
నివ్విధమున భంగపడితినేను. భార. ఆర. 6,ఆ.
ఒసఁగు
దే.స. క్రి. = ఇచ్చు, వి. ఈవి, త్యాగము, బహుమానము.
ప్రయోగము :
మొసఁగుఁదప్పింపన్. ఆము. 6, ఆ.
ఎ.గీ. చూచి సామాజికులు తమసొమ్ములెల్ల,
నొసఁగులుగవైవ. ప్రభా. 4, ఆ.
ఒసవరి
దే. విణ.= సుందరుఁడు, ఉత్కృష్టము, ఒసపరిఁగన్న, ఒసపరిఁబాగులాఁడి.
ఒసవు
దే. స. క్రి. = ఒసంగు, యొక్క రూపాంతరము. (ఇచ్చుటకు.
ప్రయోగము :
-స పిన్నబిడ్డలన్ వెన్నడుమెచ్చి యెన్నఁడొసవెన్ వరముల్ . వి. పు. 2. ఆ.
)
ఒహో
దే.అవ్య. = సంబోధనమునందు వచ్చును.
ప్రయోగము :
ఒహోకుమారయనుచున్ వ్యాసుండుచీరంగ. భాగ. 1, స్కం.