అచ్చులు : ఓ




అవ్య., (క.త.ఓ.)., = ఒక అక్షరము, సంబోధనము దెలుపును.1 (ఇది సంబోధ్యవాచకమునకు ముందే ప్రయోగింపఁబడును).
ప్రయోగము :
ఓసదయాత్మ సంయమి కులోత్తమ... వరాహ. 7. 75.
2(క్రిందికొన్ని యర్థములందు ఓ- ఒ) ప్రార్థనాదులను దెలుపును. (క.). ప్రార్థనము.
ప్రయోగము :
ఉ. ఏ జనకాత్మజన్ దశరథేశ్వరుకోడల యడ్డపరరోసుర లార సురారికంచు ... (భా. రా. యు. 41.)

(చ.) ఆజ్ఞ. క. పాతాళమునకుఁ జనరో,
వాతావను లెచటి కేని వలపినయెడకున్.
భూతము లేఁగరొయని య,
త్యాతతగతిఁజాటి రవని నధిపతి దూతల్. (కాశీ. 5. 274. 3.)
దేనినైనను విక్రయించుటకు చేయు ప్రకటనమును తెలుపును.
ప్రయోగము :
సీ. ఒక సుధాఘటి నెత్తి నుంటి చల్లోచల్ల యంచును వనవీథి కరిగె నొకతె (దశా. 8. 155. విజ. వి. 3. 41.) గీ. ఒక్కదనూజాధముండు మొఱ్ఱో యనంగ. నన్నుఁ జెఱగొనిపోయెడున్నలార భార. (ఆర. 5. 177.) (శ. ర. ప్రాఁత ప్రతిపాఠములు).
5. పిలిచినపుడు మాఱుపలుకుటయందుపయుక్తము.
ప్రయోగము :
క. వినుదఁట జీవులమాటలు,
సనుదఁట చనరాని చోట్ల శరణార్థుల కో,
యనుదఁట పిలిచిన సర్వముఁగనుదఁట
సందేహమయ్యెఁ గరుణావార్థీ. (భాగ. 8. 91.)
గీ. ఒకతె రూపసి గాకున్న నోసి యన్ననో యనెడు మాత్రమమున కైన నుండవలయు. (శుక. 3. 345.)
శా. ఓ నావే... దేవకీనందనా. (ఉ. హరి. 2. 129. )(ఓనావే... ఓయనిపలుకవే).
6. అప్రాచుర్యమును దెలుపును.
ప్రయోగము :
సీ. వృకరంకరుండ మాలిక లెన్నఁడో కాని ధరి యించుఁ గహ్లారదామ మేపుడు, (భీమ. 1. 115.)
7. సందేహమును దెలుపును.
ప్రయోగము :
చ. అవనితలంబు వ్రస్సెనొ హిమాచలశృంగము వ్రయ్యలయ్యెనో,
శ్రవణవిదారణం బయిన శబ్దము దానిదియేమి యొక్కొభై,
రవమయి వించె... (భార. సభా. 1. 212. )

మ.. ఆర్యామహాదేవియున్. నను రక్షింప నెఱంగునో యెఱుఁగదో నాభాగ్యమెట్లున్న (దో. భాగ. 10, పూ. 1725.)
8. ప్రశ్నమును దెలుపును.
ప్రయోగము :
చ. సమరంబె యొనర్చెదవో యిదేలయం,
చిపుడు జితోస్మి యంచు వచియించెదవోయి దియేమి నాపుడున్.( ఉ. రా. 4. 42. దశా. 1.67.)
9. ఏమి (కిమర్థకము)
ప్రయోగము :
సీ. ఓ యన నేమి నా నొప్పుఁగిమర్థఁబు..( ఆం. భా. 3. 70. )
10. క. కాక్వర్థకము.
ప్రయోగము :
మ. గృహసమ్మార్జనమో జలాహరణమో..
నృహరీ వాదము లేల లేరె యితరు ల్నీలీల కుం బాత్రముల్. (ఆము. 2. 91.)
11. ఊహను దెలుపును.
ప్రయోగము :
వ. పరమోపకారరియైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించు చున్నచో భార. (ఆది. 6420) దీనిపండుల తేనెసోనలు గూడియో మాధవ శయ్యాబ్ధి మధుర మయ్యె. (వరాహ. 12. 42.)( ఆము. 4. 144. )
12. ఆక్షేపమును దెలుపును.
ప్రయోగము :
ఉ. ఓ సరిపోయె నిల్వెడలకుండ నయో నమరాణివాసిఁగాఁ, జేసితొ.. (వేం పంచ. 1. 246.)
13. నిరసనమును దెలుపును.
ప్రయోగము :
(వ్యవ) ఎవఁడో ఏమో అన్నాఁడని వీఁడు గడ గడలాడుచున్నాఁడు.
14. పరిమాణాతిశయమును గాని సంఖ్యా బాహుళ్యమును గాని తెలుపును (ఈయర్థమున ఎంత, ఎన్ని అను సర్వనామములతోఁ గూడియే యుండును)
ప్రయోగము :
శా. ప్రారంభించిన వేదపాఠమునకున్ బ్రత్యూహమౌ నంచునో,
యేరాతమ్ముఁడ నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్లనోయుండి చ,
క్షూ రాజీవయుగంబు వాఁచె నినుఁ గన్నో కున్ని (పాండు. 3. 33.)

మ. నిన్నుఁగని యెన్నాళ్లో కదా యంచు వచ్చితివా యన్న కిరీటి కూర్మి కలదా చెల్లెండ్రపైనంచు. (విజ. వి. 2. 126.)
(వ్యవ) వాఁడెంతో దూరమున నున్నాఁడు. వాఁ డెంత దూరముననో యున్నాఁడు. నేనెన్ని తీర్థములనో సేవించితిని. నేనెన్నోతీర్థములను సేవించితిని.
15. తుశబ్దార్థకము.
ప్రయోగము :
శా. ధేను గ్రాసము మాన్స దోస మని సందేహించినన్ సస్యమెం,
తే నష్టం బగు నైన నేమి మఱియున్ విత్తంగ యామంబులో
నౌనన్నన్ మునులెల్ల మిక్కిలియుఁ నేఁ డాఁ కొందు రీ ధేనువుం,
దానో మానము దప్ప మేసినది యింతం దోలెదన్ మెల్పు నన్. (పరాహ. 10. 39.)
(తానో తానన్ననో)
16. ఎట్లు, ఏమి మొదలగుపదములతోఁగూడిన వాక్యములందుపయుక్తము.
ప్రయోగము :
క. ఎమ్మై, వ్రాలెదనోరిపు లెట్టులు,
గూలెదరో చూడు నాకుఁ గురుబల మెదురే. (భార. ద్రో. 2. 350. క.)
వృథా మానుల నెట్లు జయించెదనో నమ్ముము నాబలంబును గలితనంబున్. (భార. శల్య. 1.22. )
(వ్యవ) వాఁడేమి చేసినాఁడో చెప్పుము.
17. ఒక (ఒక శబ్దమున క్రీయాదేశము ఈ క్రింది ప్రయోగమునందే కన్పడుచున్నది).
ప్రయోగము :
శా. ఓ రాత్రిం గనురెప్ప వేయక మహోద్యో గంబునం ధీరతా.
ధౌరంధర్యము పూను మానవునకుం దార్పర్యవృత్తిన్ సదాచారం బెట్లొనరించు వచ్చు.. (కాశీ. 5. 189.)
(ఓ రాత్రిని- ఒక రాత్రి యందైనను అని భావము)
(ఓ.. దే. అవ్య. )1. పిలిచినప్పుడు ఎచ్చరించుకొనుటకు తెలుపును,
ప్రయోగము :
శా. ఓనావేభవ బంధముల్ చెఱపవేయోదేవకీనందనా. (ఉ, హరి. 2,)
ఆ. 2. సందేహమును తెలుపును,
ప్రయోగము :
ఈశ్వరుండను కూలింపఁదలచునోతలఁపఁడో. (భాగ. 10, స్కం. పు.)
3. ఊహను తెలుపును,
ప్రయోగము :
మేలుదొరకొను విధమెట్లో. (భార. శాం 3, ఆ,)
4. ప్రార్థనాదులను దెలుపును.
ప్రయోగము :
ఉ. రండోవనవాసులారవినరోమునులార యనాథవాక్యముల్. (వీర. 2, ఆ.)
కుటుంబసహితంబై చేరుఁడోనాకమున్. (ఇక్కడ విధిని తెలిపెడి). (కాశీ. 5, ఆ.)
5. ఆర్తిని తెలుపును,
ప్రయోగము :
గీ. ఒక్కదను జాధముండు మొఱ్ఱోయనంగ,
నన్నుఁజెఱగొనిపోయెడు నన్నలార. (భార. ఆర. 5, ఆ.)
6. అమ్ముటను తెలుపును, (చల్లోచల్ల) 7. ప్రశ్నమును తెలుపును.
ప్రయోగము :
క. వారు దెసలొత్తుకొనియుధ, రారాజ్యంబిచ్చిపోయి రాపోరో. (భార. ఉద్యో. 2,ఆ.)
ఒక అక్షరము, సందేహమును తెలుపును, ఊహను తెలుపును, ప్రార్థనాదులను తెలుపును, ఆర్తిని తెలుపును, అమ్ముటకు తెలుపును, ప్రశ్నమును తెలుపును.<ఓ>

ఓం
సం., అవ్య., తత్స.,= అంగీకృతిని తెల్పునది, అంగీకృతి, పరబ్రహ్మమును తెలుపునది, అంగీకారమందు వర్తించును.

ఓంకారము
సం., వి., అ., పుం., తత్స., = ప్రణవము, మిక్కిలి స్తోత్రము చేయుట, మిక్కిలి స్తోత్రము చేయబడునది.
వ్యుత్పత్త్యర్థము :
ఓమిత్యక్షరమోంకారః. ఓం అను అక్షరము ఓంకారము.

పర్యాయపదాలు :
సర్వభూతములను రక్షించునది, శివలింగ భేదము నందు, బుద్ధిశక్తి, భేదమునందు అంగీకృతిని తెల్పునది, పరబ్రహ్మమును తెల్పునది.


ఓకణము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఓకోదని.
పర్యాయపదాలు :
ఓకోదరీ, ఆశ్రయమును తినునది, కేశకీటకము, పేను.


ఓకణి
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= ఓకోదని.
పర్యాయపదాలు :
ఓకోదరి, ఆశ్రయమును తినునది, కేశకీటకము ,పేను.


ఓకము
సం., వి., అ., పుం., న., తత్స.,= ఇల్లు, ఆశ్రయము, దీని యందు సరిగా సమృద్ధిని పొందుతాడు, గృహము, పుట్టు, పక్షి, వృషలము.

ఓకస్సు
సం., వి., స్., న., తత్స.,= ఇల్లు, స్థానము(ఈ శబ్దము అకారాంత పుంలింగమగును), ఆశ్రయము, ఆశ్రమము, గృహము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉచ్యత్యస్మిన్నిత్యోకః. దీనియందు కూడిఉందురుకనుక ఓకస్సు, (ఈ శబ్దము అకారాంతపుంలింగమగును), 2.ఉచ్యతే సమవైతి అస్మిన్నితి ఓకః.

పర్యాయపదాలు :
గేహము, ఉదవసితము, వేశ్మము, సద్మము, నికేతనము, నిశాంతము, వస్త్యము, అవస్త్యము, సదనము, భవనము, ఆగారము, మందిరము, నికాయ్యము, నిలయము, ఆలయము.


ఓకు
గ్రా. = దుర్భిణియద్ధము.

ఓకుడు
సం., వి., అ., పుం., తత్స.,= వృషలుడు,శూద్రుడు.

ఓకులము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పేను, కేశకీటకము, సగముకాలిన గోధుమ రొట్టె.

ఓకోదని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= పేను, కేశకీటకము.

ఓక్కణి
సం., నా. వా., ఈ., పుం., తత్స.,= పేను, కేశకీటకము, ఓకోదరి.

ఓఖము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = శోషణమునందు, సామర్థ్యమునందు.

ఓగాత్యము
సం., నా. వా., అ., న., తత్స.,= అమంగళము

ఓగితము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = అర్హము, తగినది, పాత్రము.

ఓగు
దే., విణ., = కౌడైనది, దుష్టుడు.

ఓఘము
సం., వి., అ., పుం., తత్స.,= సమూహము, ప్రవాహము, పరంపర, కూర్చబడునది, నృత్యాదిద్రుతమానము.
వ్యుత్పత్త్యర్థము :
1.కరచరణాదిగతి విశేషసమవాయః ఓఘః. కరచరణాది గతి విశేషముల యొక్క సమవాయము. 2.ఉచ్యతే సంఘీభూయతే ఓఘః. సమవాయముగా ఉన్నదని చెప్పుట.3.వహతి పరంపరారూపేణ గచ్ఛతీతి ఓఘః . పరంపరారూపముగా పోవునది.

నానార్థాలు :
నృత్యాదిద్రుతగీతవాద్యము, ఉపదేశము, ద్రుతలయ, జలవేగము, ఆధ్యాత్మిక తుష్టి భేదము, సన్న్యసించి చిరకాలము సమాధియందుండుటవలన కలుగు సంతుష్టి.


ఓఘరథుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఓఘవతరాజు యొక్క పుత్రుని యందు.

ఓఘవతము
సం., నా. వా.,(త్. ఈ. త్.).,తత్స.,= జలవేగము, రాజు.

ఓజము
సం., వి., అ., పుం., తత్స., = ఓజస్సు, జ్యోతి, విషమము, బేసి (జ్యోతిష శాస్త్రమందు రాశి మొదలుగునవి).

ఓజస్వంతుడు
వి.= బలవంతుడు, దీప్తిమంతుడు.

ఓజస్వంతుడు
సం., విణ.,(త్. ఈ. త్.).,తత్స.,= ఓజస్సు కలవాడు, బలముకలిగినవాడు.

ఓజస్వి
సం., విణ.,(న్. ఈ. న్).,తత్స., = బలశాలి, బలముకలిగినవాడు, ఓజస్సుకలవాడు, ఓజబంతి, ఒజ్జబంతి యొక్క రూపాంతరము.

ఓజస్సు
సం., వి., స్., న., తత్స., = తేజము, బలము, ఉత్సాహము, వీర్యపుష్టి.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉబ్జతి వ్యక్తీ భవతీత్యోజః. ఉబ్జత్యనేనేతి ఓజః. సామర్థ్యమునందు తెలుపబడినది.

నానార్థాలు :
వెలుగు, ఎండ, దీప్తి, అవష్టంభము, ప్రథమ-తృతీయ-పంచమ-సప్తమ-నవమ-ఏకాదశరాశులు, ప్రకాశము, జ్ఞానేంద్రియములపటుత్వము, స్పష్టమై యుండునది, శస్త్రాదికౌశలము,గౌడి రీతి, (అలం) ఒకానొక కావ్యగుణము, రచనలో దీర్ఘసమాసముల సంయుక్తవర్ణాడంబరము ఉండుట.


ఓజిష్ణుడు
సం., విణ., (ఉ.ఈ.ఉ.)., తత్స.,= మిక్కిలి బలము కలవాడు, మిక్కిలి ఓజస్సుకలవాడు.

ఓజీయుడు
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఇద్దరిలో ఎక్కువ బలము కలవాడు, ఇద్దరిలో ఎక్కువ కాంతి కలవాడు, ఓజస్వితరుడు.

ఓజ్మనము
సం., విణ.,(న్. ఈ. న్).,తత్స.,= ప్రేరకము,వేగము.

ఓట్టితము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= అలంకరణము,ముండనము.

ఓడవము
సం., నా. వా., అ., పుం., తత్స., = రిషభ (రి) పంచమములులేని స్వరములతో కూడిన రాగము (ఐదుస్వరములతో ఉన్నరాగము).

ఓడి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = నీవార ధాన్యము.

ఓడికము
సం., నా.వా., ఆ., స్త్రీ., తత్స., =నీ వార ధాన్యము

ఓఢ్యాణము
సం., వి., అ., న., తత్స.,= భూషా విశేషము, ఆసన విశేషము.
ప్రయోగము :
విచిత్రోఢ్యాణబంధేన కటిశోభాం విధాయచ. హాల్యాస్యమాహాత్మ్యము. ౨౬, వ. అధ్యాయము.


ఓఢ్రపుష్పము
సం, వి., అ., పుం., తత్స., = దాసనము (వృ.వి), జపాపుష్పము, జవాపుష్పము, మద్రపుష్పము, హయమారకము, ఓడ్రమనెడి పుష్పము.

ఓఢ్రము
సం., వి., అ., పుం., తత్స., = ఒక దేశము, దాసనము, వృక్ష విశేషము, ఆ దేశరాజుయందు, అక్కడ పుట్టిన మనుష్యునియందు, ఉత్కళదేశము (ఒరిస్సా).

ఓఢ్రుఁడు
సం., వి., అ., పుం., తత్స., = ఓఢ్రదేశస్థుఁడు, ఒడ్డెవాఁడు.

ఓణము
సం., నా. వా.,(అ. ఈ. అ).,తత్స., = అపనయనమునందు, అపసారణమునందు.

ఓతప్రోతము
సం., విణ., (అ. ఆ. అ).,తత్స., = నలుప్రక్కల విస్తరించునది, అడ్డముగాను నిలువుగాను చేయబడినది.

ఓతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= అడ్డముగా చేయబడినది.

ఓతువు
సం., వి., ఉ., పుం., స్త్రీ., తత్స.,= పిల్లి.
వ్యుత్పత్త్యర్థము :
1.అవతి మూషికబాధాయాః ఓతుః. మూషకభాదనుండి రక్షించునది. 2.అవతి గృహమాఖుభ్యః. ఎలుకల నుండి ఇంటిని రక్షించునది.

పర్యాయపదాలు :
ఆఖుభుక్కు, పృషదంశకము, వృషదంశకము, మార్జాలము, బిడాలము.


ఓదనపాకి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఒక ఔషధి, నీలఝింటిక.

ఓదనము
సం., వి., అ., పుం., న., తత్స., = అన్నము, వంటకము, భిస్సా, పాసిన అన్నము, భక్తము, భక్షింపబడునది, దీనిచేత బ్రతుకుదురు, దీదివి(దీని చేత ప్రకాశింతురు), మేఘము.
వ్యుత్పత్త్యర్థము :
ఉందతి క్లిద్యతీత్యోదనః. పాసినప్పుడు నీళ్ళుకారునది.


ఓదనాహ్యము
సం., నా.వా., అ., న., తత్స., = పెద్దముత్త పులగము

ఓదనాహ్వయము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = పెద్దముత్త పులగము. (వృ. వి).

ఓదని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = బల, పెద్దముత్తపులగము (వృ.వి).

ఓదము
సం., నా. వా., అ., పుం., తత్స., = అవపాతము.

ఓద్మనము
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = ఓషధి .

ఓద్మము
సం., నా. వా., అ., పుం., తత్స., = తడుపుట.

ఓమనము
సం., విణ., న్., పుం., తత్స.,= రక్షణము నందు.

ఓరాలము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= నలుపు, పసుపు కలిసినది.

ఓలకము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక ఆకుకూర, తీపితప్ప మిగిన రుచులుకలది, వగరు తప్ప మిగిలిన రుచులుకలది, చేదు తప్ప మిగిలిన రుచులుకలది.

ఓలహంత
సం., నా. వా., న్., పుం., తత్స., = అసంతృప్తమగు సేన, బఠాని.

ఓల్లము
సం., వి., అ., పుం., తత్స., = అల్లము, కంద, తడిసినది, సూరణము(వృక్షవిశేషము).

ఓషకము
సం., నా. వా., అ., పుం., తత్స., = అసంతృప్తమగుసేన

ఓషణము
సం., నా. వా., అ., పుం., తత్స., = కారము, కటురసము.

ఓషణి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = శాఖాభేదము.

ఓషధి
సం., వి., ఇ., ఈ., స్త్రీ., తత్స., = ఒకమూలిక, ఫలించిన తోడనే నశించెడి అరటిలోనగునది, మందుచెట్టు, రోగమును తగ్గించునది, మందునకు ఉపయోగించు తీగ మొదలగునవి.
మాట - మంతి :
ఓషధి శబ్దము అకారభేదము చేత ప్రత్యేకముగా తెలియబడుచున్న లతాదిజాతుల యందు వర్తించును, త్రిఫలాదులందు వర్తించదు.

వ్యుత్పత్త్యర్థము :
ఓషో దాహో దీప్తిర్వా వీయతే అత్రేతి ఓషధిః. దాహమును, రోగమును తగ్గించునది.

నానార్థాలు :
అరటి, ధాన్యములు మొదలగునవి, ఫలపాకాంతవృక్షములు, అనేక పుష్పఫలాదులు కల వృక్షములు, దీపము వలె వెలుగు తృణ జ్యోతి, జ్యోతిష్మతి (వృ.వి).


ఓషధిజము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = ఔషధము, ఓషధినుండి పుట్టినది.

ఓషధిపతి
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= కర్పూరము.

ఓషధీధరుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = వైద్యుడు, మందు మూలికలు అమ్మువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఔషధములు మూలికలు ఉంచువాడు, అమ్మువాడు.


ఓషధీప్రస్థము
సం., నా. వా., అ., పుం., తత్స., = హిమాలయమునందలి ఒకానొక పెద్దపట్టణము.

ఓషధీశుఁడు
సం., వి., అ., పుం., తత్స., = ఓషధీపతి, చంద్రుఁడు, ఒక మూలిక.
వ్యుత్పత్త్యర్థము :
ఓషధీనామీశ ఓషధీశః. వరి మొదలగు ఓషధులకు ప్రభువు.

పర్యాయపదాలు :
హిమాంశువు, చంద్రమా, ఇందుడు, కుముదబాంధవుడు, విధుడు, సుధాంశుడు, శుభ్రాంశువు, నిశాపతి, అబ్జుడు, జైవాతృకుడు, సోముడు, గ్లౌః, మృగాంకుడు, కళానిధి, ద్విజరాజు, శశధరుడు, నక్షత్రేశుడు, క్షపాకరుడు.


ఓషము
సం., వి., అ., పుం., తత్స., = కాలుటయు, క్షిప్తము, దాహము, పాకము.
వ్యుత్పత్త్యర్థము :
ఓషణం ఓషః. కాల్చుట.


ఓష్ఠకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పెదవులను అలంకరించుకొనువాడు.

ఓష్ఠకోపము
సం., నా. వా., అ., పుం., తత్స., = సుశ్రుతుడు చెప్పినముఖ రోగ బేధము నందు.

ఓష్ఠజాహము
సం., నా. వా., అ., న., తత్స., = పెదవి యొక్కమూలము.

ఓష్ఠపుష్పము
సం., నా. వా., అ., పుం., తత్స., = బంధూకము, మంకెన.

ఓష్ఠప్రకోపము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక విధమగు పెదవిరోగము.

ఓష్ఠము
సం., వి., అ., పుం., తత్స.,= అధరము, పెదవి, దంతములను కప్పి ఉంచే అవయవము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉష్ణాహరేణ ఉష్యతే ఓష్ఠః. ఉష్ణాహరము చేత వ్యథ పెట్టబడునది, 2.ఉష్యతే దహ్యతే ఉష్ణాహారేణేతి.

పర్యాయపదాలు :
మీది పెదవి, రదనచ్ఛదము, దంతవాసము, దంతవస్త్రము, దశనవాసము.


ఓష్ఠి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = బింబఫలము, దొండతీగ, చింబిక కుందరు ఇతిభాష.
వ్యుత్పత్త్యర్థము :
ఓష్ఠ ఇవాచరతి పక్వావస్థాయామ్. ఓష్ఠమువలె ఆచరించునది పక్యావస్థయందు ఓష్ఠతుల్యమగు ఫలములను ఇచ్చునది.


ఓష్ఠ్యము
సం., విణ., అ., న., తత్స., = ఓష్ఠ్యాక్షరము.
వ్యుత్పత్త్యర్థము :
పెదవులయందు పుట్టినవి. ప,బ,భ,మ, మొదలుగునవి.


ఓష్ణము
సం., నా. వా., అ., పుం., తత్స., = వేడిది.

ఓసరము
సం., నా. వా., అ., పుం., తత్స., = జీలకఱ్ఱ

ఓహరము
సం., నా. వా., అ., పుం., తత్స., = తాబేలు

ఓహారము
సం., నా. వా., అ., పుం., తత్స., = తాబేలు