అచ్చులు : ఋ
ఋ
సం., నా.వా., తత్స., = స్వర్గము, అదితి, సత్యము, సంభోధనమందు, పరిహాసమునందు.
ఋంజసానము
సం., విణ., అ., పుం., తత్స., = ఉజ్వల మేఘము.
ఋక్కు
సం., వి., చ్ ., స్త్రీ., తత్స., = ఒక వేదము, వేదభాగవిశేషము, ఋగ్వేదము, వేదమంత్రం, స్తుతి, పూజ.
వ్యుత్పత్త్యర్థము :
ఋచ్యంతే దేవాః అనయేతి ఋక్. దేవతలు దీనిచేత స్తోత్రము చేయబడుదురు.
ఋక్కుపెట్టు
క్రి. = కంఠస్థం చేయు.
ఋక్థము
సం., వి., అ., న., తత్స., = ధనము, విడిముడి, దాయభాగము, పితృధనము, బంగారు.
వ్యుత్పత్త్యర్థము :
ఋచ్యతే స్తూయత ఇతి ఋక్థం. స్తోత్రము చేయబడునది.
పర్యాయపదాలు :
ద్రవ్యము, విత్తము, హిరణ్యము, ద్రవిణము, ద్యుమ్నము, వసు, స్వాపతేయము, రిక్థము, అర్థము, విభవము, రై.
ఋక్షగంధ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = బొద్దికూర, క్షీరవిదారి, పాలగుమ్ముడు, ఛగలాండీ, ఆవేగి, వృద్ధదారకము, జుంగము.
వ్యుత్పత్త్యర్థము :
ఋక్షవత్ర్కిమీన్ గంధయతి అర్ధయతి ఋక్షగంధా. ఎలుగు వలె క్రిములను పీడించునది.
ఋక్షగంధిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నల్లనేలగుమ్ముడు, పాలగుమ్ముడు, క్షీరవిదారి, మహాశ్వేత.
వ్యుత్పత్త్యర్థము :
ఋక్షదృశాన్ హిస్రాన్ పిత్తాదిరోగాన్ గంధయతి నాశయతీతి ఋక్షగంధికా. ఎలుగు గొడ్డువలె క్రూరములైన పైత్యాది రోగములను చెఱుచునది.
ఋక్షగిరి
సం., వి., ఇ., పుం., తత్స., = కులాచలము, ఋక్షనామక పర్వతము.
ఋక్షము
సం., వి., అ., న., తత్స., = నక్షత్రము ; పుం. ఎలుగు బంటి, ఒకానొకకొండ, దుండిగము, పర్వతవిశేషము, రాశి. ; విణ. గ్రువ్వఁబడినది ; చిత్తవృత్తి.
వ్యుత్పత్త్యర్థము :
1.ఋక్షతి తమోనాశయతీతి ఋక్షం. 2.ఋష్యతే అనేన గహనమితి ఋక్షః. చీకటిని పోగొట్టునది.
పర్యాయపదాలు :
భం, తార, తారక, తారకాప్యుడు, చుక్క.
నానార్థాలు :
విదురుని కొడుకు, భాలుకము, అచ్ఛభల్లము, స్వర్ణము, దాయాది భాగము, ఒక చెట్టు, పది తులములు, బోడి, రైవతకపర్వము ; పుం. భల్లకమను వృక్షము, అజమీడ పుత్రుడు, అరిహ పుత్రుడు, శ్యోనాక ప్రభేదము, శోనాక వృక్షము ; మండూకపర్ణ, పత్రోర్ణ, నటము, కట్వంగము, డుండుకము, శుకనాసము, దీర్ఘవృంతము, కుటన్నటము, అరళువు, పెద్దమాను, నక్షత్రమునందు, మేషాది రాశులయందు, నృపభేదమునందు.
ఋక్షరాజు
సం., నా. వా., అ., పుం., తత్స., = చంద్రుడు, జాంబవంతుడు.
ఋక్షరుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = యజ్ఞకర్త చేత ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు, వారిధార, కంటకము, ముల్లు, పురోహితుడు, జలస్థానము.
ఋక్షవంతము
సం., నా. వా., అ., పుం., తత్స., = శంబరాసుర పురము, నగర భేదము.
ఋక్షవతము
సం., నా. వా., త్., పుం., తత్స., = నర్మదా తీరము, పర్వత భేదము.
ఋక్షి
సం., నా. వా., ఈ ., స్త్రీ., తత్స.,= ఆడ ఎలుగుబంటి.
ఋక్షేశుడు
సం., వి., అ., పుం., తత్స.,= చంద్రుడు, జాంబవంతుడు.
ఋక్షేష్టి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = నక్షత్ర విశేష విహితము, ఇష్టిభేదము.
ఋక్షోదము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక పర్వతము.
ఋక్సంహిత
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఋగ్వేదమున మంత్రాత్మకమగు భాగము.
ఋక్సామము
సం., నా. వా., అ., న., తత్స., = సామభేదము.
ఋగ్గాథ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = వేదమందు లౌకిక గీతి .
వ్యుత్పత్త్యర్థము :
ఋచామివ గాథా. వేదము వలెనె లౌకిక గీతి.
ఋగ్మంతుడు
సం., విణ.,(త్. ఈ. త్)., తత్స., = స్తుతింపబడుటకు ఋక్ కలిగినవాడు, కలిగినది, లౌకిక గీత వేదము, స్తోత్రమునందు ,అర్చనయందు.
వ్యుత్పత్త్యర్థము :
ఋక్ స్తుతిః పూజా వా అస్త్యస్య. వేదస్తోత్రము పూజ దీనియందు కలదు.
ఋగ్మి
సం., నా. వా.,(న్. ఈ. న్).,తత్స., = స్తోత్రము, అర్చనము, పూజనము.
ఋగ్వేదము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒకానొక వేదము.
ఋఘము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = హింసయందు.
ఋచసము
సం., నా. వా., (స్. ఈ. స్).,తత్స., = స్తోత్రము.
ఋచీకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = జమదగ్ని తండ్రి, దుష్యంత పౌత్రుడు, భుమన్యుపుత్రుడు.
ఋచీషము
సం., నా. వా., అ., న., తత్స.,= నరకభేదము, పిండివంట చేసెడు పాత్రము, కాగు.
ఋచేయువు
సం., నా. వా.,ఉ., పుం., తత్స., = పురువంశానికి చెందిన ఒకరాజు.
ఋజిఖనుడు
సం., నా. వా., న్., పుం., తత్స., = ఒక రాజు.
ఋజినము
సం., నా. వా., న్., పుం., తత్స., = ఋజువగుట, ఋజుత్వము.
ఋజిమ
సం., విణ., ఆ., స్త్రీ., తత్స.,= సరళమైనది.
ఋజిష్ఠము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = మిక్కిలి ఋజువైనది, ఋజుతమము.
ఋజీకము
సం.,నా.వా.,(అ. ఆ. అ).,తత్స., = సాధనయందు, ఇంద్రుడు.
ఋజీకయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఋజువు.
ఋజీయము
సం., విణ., అ., పుం., తత్స., = ఋజువు, ఋజుతరము, ఎక్కువ సరళమైనది.
ఋజీయసము
సం., విణ.,(స్. ఈ. స్)., తత్స., = ఋజుతరము, ఎక్కువ సరళమైనది.
ఋజీషము
సం., వి., అ., న., తత్స., = పిండివంట చేసెడుపాత్ర, బూరెల మూకుడు, కాగు, నరకభేదము, పిష్టపచనము, సారము తీసివేసిన సోమలత యొక్క చూర్ణము.
వ్యుత్పత్త్యర్థము :
ఆర్జయత్యపూపాదికమితి ఋజీషం. అపూపములు చేయునది ఋజీషము.
ఋజుకాయుడు
సం., విణ., అ., పుం., తత్స., = కశ్యపముని.
వ్యుత్పత్త్యర్థము :
ఋజుః కాయోఽస్య . ఋజువైన శరీరము కలవాడు.
ఋజుగము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = బాణము,తిన్నగా పోవునది, నిష్కపటముగా వ్యవహరించునది.
ఋజుత
వి. =సరళత, వక్రత లేకుండా ఉండటం, నిష్కపటంగా వ్యవహరించడం.
ఋజుత్వము
వి. = నిజాయితీ, తిన్నదనము.
ఋజురేఖ
వి. = సరళరేఖ, తిన్ననిరేఖ.
ఋజువర్తనము
వి. = సత్ప్రవర్తన.
ఋజువు
సం., విణ.,(ఉ. ఈ. ఉ)., తత్స., = అనుకూలము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఋజ్యతే ఆదరేణ సంపాద్యత ఇతి ఋజః. ఆదరముచేత సంపాదింపబడునది. 2.అర్జయతి గుణానితి ఋజుః. గుణములు సంపాదించునది.
పర్యాయపదాలు :
ప్రగుణము, చక్కనైనది, అవక్రము, ప్రగుణము, సరళము, శోభనము, తిన్ననిది.
నానార్థాలు :
అనాది, అజిహ్మము, నిష్కపటము, ఉత్పత్తి రహితము, ప్రాంజలము, పుట్టుకలేనిది, మంగళము, వసుదేవపుత్రుని భేదము.
ఋజుసర్పము
సం., నా. వా., అ., పుం., తత్స., = సర్పభేదము.
ఋజూకము
సం., నా. వా., అ., పుం., తత్స., = సరళము, వంకరలేనిది, నిష్కపటము, ఉత్పత్తిరహితము, పుట్టుక లేనిది, ప్రగుణము, చక్కనైనది, అవక్రము, ప్రాగుణము, ప్రాంజలము.
వ్యుత్పత్త్యర్థము :
దేశభేదే విపాశానదీ జన్మభూమౌ. విపాశానది జన్మ పొందిన దేశవిశేషము.ఋజూకే భవా. ఋజూకమందు పుట్టినది.
ఋజూకరణము
సం., నా. వా., అ., న., తత్స., = ఋజువైనదానినిగా చేయుట.
ఋజూకృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఋజువుగా చేయబడినది.
ఋజ్రుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= నాయకుడు.
ఋణంచయుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= రాజు, నృపభేదము.
ఋణకర్త
సం., విణ.,(ఋ. ఈ. ఋ)., తత్స., = అప్పు చేసినవాడు.
ఋణగ్రస్తుడు
వి. = అప్పుచేసినవ్యక్తి.
ఋణగ్రస్తుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అప్పు పడ్డవాడు.
ఋణగ్రహుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అప్పు పుచ్చుకొనువాడు.
ఋణగ్రాహి
సం., విణ., పుం., స్త్రీ.,(న్. ఈ. న్).,తత్స., = అప్పు పుచ్చుకొనువాడు.
ఋణదాత
వి. = అప్పు ఇచ్చేవ్యక్తి.
ఋణదాయి
సం., విణ., (న్. ఈ. న్).,తత్స., = అప్పు పుచ్చుకొనువాడు.
ఋణదాసుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = తన అప్పు తీర్చినవానికి దాసుడైనవాడు.
ఋణపడు
క్రి. = అప్పుపడు, బాకీపడు, చేసిన సహాయం మరచి పోకపోవు.
ఋణమత్కుణుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ప్రతిభూవు, జామీనుదారుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఋణం పరకృతర్ణం మమైవేతి.ఇతరుల రుణమునకు హామీగా ఉండువాడు.
ఋణమార్గణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రతిభువు, జామీనుదారుడు.
ఋణము
సం., వి., అ., న ., తత్స., = అప్పు, పర్యుదంచనము. ; పుం. ధారము, ఉద్ధారము. ; గతుడు, శీఘ్రగతుడు, దేవాది ఋణము (ఇది దేవఋణము, పితృఋణము, ఋషి ఋణము ) అని మూఁడు తెఱఁగులు.
వ్యుత్పత్త్యర్థము :
అర్యతే కాలాంతరే ప్రాప్యత ఇతి ఋణం. ఇచ్చుట కాలాంతరమున తిరిగి పొందుట ఋణము.
నానార్థాలు :
దుర్గభూమి, గమనశీలము, జలము, (బీజగ) తీసివేయు సంఖ్య, తీసివేఁతగుర్తు, భూమియందు జలము.
ఋణముక్తుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అప్పుతీర్చుకొనినవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఋణము నుండి విముక్తుడు అయినవాడు.
ఋణమోచనము
సం., విణ., అ., న., తత్స., = కాశీ తీర్థభేదము, ప్రసిద్ధకాశీఖండము.
వ్యుత్పత్త్యర్థము :
ఋణాత్ మోచయతి. ఋణము నుండి ముక్తిని ప్రసాదించునది.
ఋణలేఖ్యము
సం., నా. వా., అ., న., తత్స.,= అప్పుపత్రము.
ఋణవంతుడు
సం., విణ.,(త్. ఈ. త్).,తత్స., = అప్పుపడ్డవాడు, ఋణముకలవాడు.( అప్పుపడ్డది, ఋణము కలది.)
ఋణస్తుడు
వి. = అప్పులో ఉన్న వ్యక్తి.
ఋణాంతకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = అంగారకుడు.
ఋణాదానము
సం., నా. వా., అ., న., తత్స., = స్మృతులలో చెప్పబడిన అష్ఠాదశ వివాదాలలో చెప్పబడిన వ్యవహార భేదమునందు.
ఋణానుబంధము
వి. = ఋణసంబంధము, బంధము, సంబంధము.
ఋణాపనయనము
సం., నా. వా., అ., న., తత్స., = ఋణముతీర్చుట.
ఋణార్ణము
సం., వి., అ., న., తత్స., = అప్పు తీర్చుటకై చేసిన మరొక అప్పు.
ఋణి
సం., విణ.,(న్. ఈ. న్.).,తత్స., = అప్పుపడినవాడు, ఋణగ్రస్తుడు, ఋణవతి, అధమర్ణుఁడు, అప్పులకాఁపు.
ఋణికుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స., = అధమర్ణుఁడు, అప్పులకాఁపు.
ఋణిధనిచక్రము
సం., నా. వా., అ., న., తత్స.,= అర్వణము చూచెడు ఒకానొక చక్రము.
ఋణీకుడు
సం., వి., అ., పుం., తత్స., = అధమర్ణుడు, అప్పుల పాత్ర.
ఋతంభరుడు
సం,, నా. వా.,అ., పుం., తత్స., = సత్యపాలకుడు, పరమేశ్వరుడు, ప్లక్షద్వీపము, నదీభేదము.
ఋతజిత్
సం,, నా. వా.,త్., పుం., తత్స., = యక్షుడు, యజ్ఞజయిని.
ఋతధామనుడు
సం., నా. వా., న్., పుం., తత్స.,= విష్ణువు.
ఋతధాముడు
సం., విణ., న్., పుం., తత్స., = విష్ణువు.
ఋతధ్వజుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = శివుడు, ఒక బ్రహ్మర్షి.
ఋతపర్ణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = సూర్యవంశపురాజు.
ఋతపేయము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఏకాహము, యాగము.
ఋతపేశసుడు
సం., నా. వా.,స్., పుం., తత్స., = జలాత్మకుడు, వరుణుడు.
ఋతము
సం., వి., అ., న., తత్స., = శిలోంఛవృత్తి, నీళ్ళు, కర్మఫలము ; విణ. సత్యమైనది, సత్యాచారము, పూజింపబడినది, ప్రకాశమొందినది, తథ్యము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఇయర్తి హృదయమితి ఋతం. హృదయమును పొందునది. 2.అర్యతే కాలాంతరే ప్రాప్యత ఇతి ఋతం. కాలాంతరమున పొందబడునది.
నానార్థాలు :
సమ్యక్, చేను కుప్పవేయుట, సూర్యుడు, దేవభేదము, పూజితము, దీప్తము, ప్రాప్తము, జలము, ఉంఛశిలవృత్తులు, మోక్షము, సత్యము, విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు, పరబ్రహ్మము, ప్రాప్తి, యజ్ఞము,
ఋతవ్యుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఋతువు నందలిది, ఋతు దేవతాకమైనది.
వ్యుత్పత్త్యర్థము :
ఋతుస్తదభిమానీ దేవో దేవతాఽస్య యత్. ఇష్టకాదౌ. ఋతువు నందలి అభిమానము కల దేవతాకమైనది, యాగమునందలిది.
ఋతవ్రతము
సం., నా. వా., అ., పుం., తత్స.,= శాకద్వీపమునందు, భగవదుపాసక భేదమందు.
ఋతస్పతి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = యజ్ఞపతి.
వ్యుత్పత్త్యర్థము :
ఋతస్య పతిః. యజ్ఞము యొక్క అధిపతి.
ఋతావంతుడు
సం., నా. వా.,(న్. ఈ. న్)., తత్స., = ఋతమునుకలిగినవాడు.
ఋతాషాహము
సం., నా. వా.,( హ్. ఈ. హ్).,తత్స., = సత్యసహనము, అసత్యము.
ఋతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = త్రోవ, వర్త్మ, నింద, స్పర్ధ, పోటి, శత్రువు, గతి, పోక, జుగుప్స, రోఁత, మంగళము, కళ్యాణము, గమనము, పురుషమేధయజ్ఞీయదేవభేదము, అశుభము. ; పుం. రాత్రి.
ఋతింకరుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఋతిని చేయువాడు, పీడచేయువాడు.
ఋతీయ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= రోయుట, జుగుప్స, రోత, నింద, కృప, ఆర్తనము, హృణీయ, ఘృణము.
ఋతీషహము
సం., నా. వా.,( హ్. ఈ. హ్).,తత్స., = శత్రుసహనము, పీడ.
ఋతుకాలము
సం., వి., అ., పుం., తత్స., = వసంతాది ఋతుకాలము, గర్భధారణకు యోగ్యమగు కాలము, ఆరు ఋతువులలో ఏదైనా ఒక కాలము.
ఋతుగామి
సం., విణ., (న్. ఈ. న్)., పుం., తత్స., = ఋతుకాలమందే భార్యను పొందువాడు, వసంత ఋతువు.
ఋతుడు
సం., నా. వా., అ., న., తత్స., =సూర్యుడు.
ఋతుథ
సం., అవ్య., తత్స., = కాలమునందు.
ఋతుప
సం., నా. వా., ఆ., పుం., తత్స., = ఇంద్రుడు, ఋతుయాజదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఋతూన్ పాతి నిర్వాహకతయా. ఋతువులను పాలించువాడు.
ఋతుపతి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = వసంత ఋతువు.
ఋతుపర్ణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = అయోధ్యాపురరాజులలో ఒకడు (నలునకు అక్షహృదయమును ఉపదేశించి అశ్వహృదయమును అతని వలన బడసినవాడు).
ఋతుపవనము
వి. = ఆరునెలలకొకసారి వచ్చేగాలి.
ఋతుప్రాప్తము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = అవంధ్యము, గొడ్డుదికానిది (వృక్షము).
ఋతుమతి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= పుష్పవతి, ఆత్రేయి, ముట్టుది.
వ్యుత్పత్త్యర్థము :
ఋతురస్యా అస్తీతి ఋతుమతీ. ఋతువు ఈమెకు కలదు.
పర్యాయపదాలు :
రజస్వల, స్త్రీధర్మిణి, అవి, మలినీ, ఉదక్య, బహిష్ఠయినది.
ఋతురాజు
సం., నా. వా., అ., పుం., తత్స., = వసంత ఋతువు.
వ్యుత్పత్త్యర్థము :
ఋతూనాం రాజా. ఋతువులకు రాజు.
ఋతువు
సం., వి., ఉ., పుం., తత్స., = వసంతములోనగునది, రెండు నెలలు, రెండు మాసములు.
వ్యుత్పత్త్యర్థము :
ఇయర్తీతి ఋతుః , పోవునది ఋతువు. ద్వౌద్వౌమాఘాదిమాసౌ ఋతురిత్యుచ్యతే. మాఘము మొదలైన రెండేసిమాసములు ఋతువనంబడును.
పర్యాయపదాలు :
ఆరు విధములు- వసంత ఋతువు(చైత్ర వైశాఖములు), గ్రీష్మఋతువు(జ్యేష్ఠ ఆషాఢములు), వర్షఋతువు(శ్రావణ భాద్రపదములు), శరదృతువు(ఆశ్వయుజ కార్తీకములు), హేమంత ఋతువు(మార్గశీర్ష పుష్యములు), శిశిర ఋతువు(మాఘ ఫల్గుణములు), కాలవిశేషము.
నానార్థాలు :
వెలుగు, విష్ణువు, శివుడు, రజోదర్శనము, రెండు మాసముల కాలము, గర్భధారణ యోగ్యమగు కాలము, స్త్రీ కుసుమము, ఆర్తవము, రజస్సు, పుష్పము, దీప్తి, సువీరము.
ఋతువృత్తి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = సంవత్సరము.
ఋతుశః
సం., అవ్య., తత్స., = ఋతౌ అర్థమందు,నిర్దిష్టఋతువునందు, ఆయా ఋతువులందు.
ఋతుసంహారము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కాలిదాస ప్రణీత కావ్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఋతూనాం సంహారః సమూహో వర్ణ్యత్వేన యత్ర. ఋతుసముదాయము యొక్క వర్ణన కలది.
ఋతుసాత్మ్యము
సం., నా. వా., అ., న., తత్స., = ఋతువునకు తగిన పథ్యాదికము.
ఋతుసేవ్యము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= ఋతు భేదమందు, సేవయందు, పథ్యమందు, వస్తుభేదమందు.
వ్యుత్పత్త్యర్థము :
ఋతుభేదే సేవ్యం వైద్యకోక్తిగుణయుతమాహారాది. ఋతుమార్పుకాలమందు వైద్యుడు సూచించిన గుణయుక్త ఆహారసేవనము.
ఋతుస్తీమ
సం., నా. వా., అ., పుం., తత్స., = ఏకాహము, యాగము.
ఋతుస్థల
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఒక అప్సర.
ఋతుస్నాత
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ఋతుస్నానము చేసిన స్త్రీ.
ఋతుస్నానము
సం., నా. వా., అ., న., తత్స., = ఋతుమతి నాల్గవ దినమున శుద్ధికొరకు చేయు స్నానము.
ఋతుస్రావము
వి. = ముట్టు, బహిష్ఠు.
ఋతే
సం., అవ్య., తత్స., = లేక, లేకుండా, వర్జనము.
పర్యాయపదాలు :
పృథక్, వినా, నానా, అంతరేణ, హిరుక్, పాయుట.
ఋతేజ
సం., విణ., ఆ., త్రి., తత్స., = యజ్ఞ నిమిత్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఋతే యజ్ఞనిమిత్తం జాయతే.యజ్ఞ నిమిత్తము చేయునది.
ఋతేయుడు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = ఋషి, పౌరవుడు, రాజు.
వ్యుత్పత్త్యర్థము :
వరుణస్య ఋత్విజి.వరుణ సంబంధ ఋషి
ఋత్విజుఁడు
సం., వి., జ్., పుం., తత్స., = యజ్ఞకర్త చేత ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు, ఒజ్జ, యాజకుడు, ఋత్విక్కు.
వ్యుత్పత్త్యర్థము :
ఋతౌ వసంతాదౌ యాజయంతి ఋత్విజః. వసంతాది ఋతువులందు యాగము చేయించువాడు.
పర్యాయపదాలు :
ఆగ్నీధ్రాదులు( వీరు పదియాఱుగురు. - బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు, బ్రహ్మణాచ్ఛంసి, ప్రస్తోత, మైత్రావరుణుడు, ప్రతిప్రస్థాత, పోత, ప్రతిహర్త, అచ్ఛావాహుడు, నేష్ఠ, అగ్నీధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, గ్రావస్తుతుడు, ఉన్నేత.)
ఋద్ధము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = నూఱిచినది, పెరిగినది, సమృద్ధము, వృద్ధి, పెనుపు, సిద్ధాంతము, విష్ణువు, అవసితధాన్యము, నురిచినధాన్యము.
వ్యుత్పత్త్యర్థము :
అవైగుణ్యేన సంపన్నం ఫలం ఋద్ధం. తృణాదులు లేక చక్కబెట్ట బడినది.
ఋద్ధి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = సమృద్ధి, వృద్ధి, పెంపు, గంధద్రవ్య విశేషము, సిద్ధి, యోగ్యము, పార్వతీ, లక్ష్మీ, కుబేరుని భార్య.
వ్యుత్పత్త్యర్థము :
ఋధ్నోత్యనయేతి ఋద్ధిః. దీనిచేత వృద్ధిబొందును. ఆరోగ్యం దీనిచేత సిద్ధించును.
ఋధత్
సం., నా. వా.,(త్. ఈ. త్).,తత్స., = వర్థమానము.
ఋధ్ధము
సం., అవ్య., తత్స.,= సమృద్ధి, వర్థకము.
నానార్థాలు :
సత్యము, వియోగము, శైథ్యము, సామీప్యము, లాఘవము.
ఋఫ
సం., నా. వా., అ., తత్స., = దానము, హింస, నింద.
ఋబీసము
సం., నా. వా., అ., న., తత్స.,= పృథ్వియందు, అగ్నియందు.
ఋభుక్షము
సం., నా. వా., అ., పుం., తత్స., = దేవతలు, నివసించునది, స్వర్గము, వజ్రము.
ఋభుక్షుఁడు
సం., వి., న్., పుం., తత్స., = ఇంద్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
స్వర్గే దేవమాతుర దేవతే భవతి యః. ఋభూన్ దేవాన్ క్షిపతి కర్మసు ప్రేరయతీతి ఋభుక్షాః. దేవతలను పనులయందు ప్రేరేపించువాడు.
పర్యాయపదాలు :
మఘవుడు, మఖుడు, బిడౌజుడు, పాకశాసనుడు, వృద్ధశ్రవుడు, శునాసీరుడు, పురుహూతుడు, సునాసీరుడు, పురందరుడు, జిష్ణువు, లేఖర్షభుడు, శక్రుడు, శతమన్యువు, దివస్పతి, సుత్రామ, గోత్రభితుడు, వజ్రి, వాసవుడు, వృత్రహా, వృషా, వాస్తోష్పతి, సురపతి, బలారాతి, శచీపతి, జంభభేది, హరిహయుడు, స్వరాట్టు, నముచిసూదనుడు, సంక్రందనుడు, దుశ్చ్యవనుడు, తురాషాట్టు, మేఘవాహనుడు, ఆఖండలుడు, సహస్రాక్షుడు.
ఋభువు
సం., వి., ఉ., పుం., తత్స., = దేవతలకు దేవుడు, వేల్పు, దేవత, రథకారుడు, సత్యముతో బుట్టినవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఋతేన సత్యేన భవంతీతి ఋభవః.ఋతముచేత సత్యముచేత ఉండువారు ఋబులు. ఋ స్వర్గే దేవమాతురదితేర్వా భవతి యః ఋభుః. ఋ=స్వర్గము నందు లేక దేవమాత యగు అదితి కి పుట్టినవాడు ఋబువు.
పర్యాయపదాలు :
అమరులు, నిర్జరులు, దేవులు, త్రిదశులు, విబుధులు, సురలు, సుపర్వాణులు, సుమనస్సులు, త్రిదివేశులు, దివౌకసులు, ఆదితేయులు, దివిషదులు, లేఖులు, అదితినందనులు, ఆదిత్యులు, అస్వప్నులు, అమర్త్యులు, అమృతాంధసులు, బర్హిర్ముఖులు, క్రతుభుజులు, గీర్వాణులు, దానవారులు, బృందారకులు, దైవతులు.
ఋశ్య(ష్య)కేతనుడు
సం., వి., అ., పుం., తత్స., = అనిరుద్ధుడు
ఋశ్య(ష్య)కేతువు
సం., వి., ఉ., పుం., తత్స., = అనిరుద్ధుడు, మన్మథుడు, మరుఁడు.
ఋశ్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఒక జింక, ఒకజాతి మృగి.
ఋశ్యదము
సం., నా. వా., అ., పుం., తత్స., = గొయ్యి, ఓదము, మనుబోతులను పట్టుటకై త్రవ్విన గొయ్యి.<ఋష్యదము>
ఋశ్యప్రోక్త
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= దూలగొండి, పిల్ల పీఁచర, ఒక ఓషధి, అతిబల, శతావరి, బుద్ధి అను గంధద్రవ్యము, ముత్తవపులగము (వృ.వి), శతమూలి, బహుసుత, అభీరువు, ఇందీవరి, వరీ, అభీరుపత్రి, నారాయణి.
వ్యుత్పత్త్యర్థము :
ఋశ్యెః మృగైః ప్రోక్తాదర్శితా ఋశ్యప్రోక్తా. మృగములచేత చూపబడునది.
పర్యాయపదాలు :
ఆత్మగుప్త, జహము(విడువబడునది), అవ్యండము, కండూరము, ప్రావృషాయణి, శూకశింబి, కపికచ్ఛువు, మర్కటి.
ఋశ్యము
సం., వి., అ., పుం., తత్స., = మనుఁబోతు(రూ.), ఋష్యము, ఒక జింక.
వ్యుత్పత్త్యర్థము :
మృగవిశేషః. మృగ విశేషము.ఇయర్తి వనం ఋశ్యః. వనమును పొందునది.
పర్యాయపదాలు :
కృష్ణసారము, రురువు, న్యంకువు, శంబరము, రౌహిషము, గోకర్ణము, పృషతము, ఏణము, రోహితము, చమరీమృగము.
ఋషణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= ఒకమొక్క
ఋషద్గు
సం. నా. వా.,ఉ., పుం., తత్స., = యదువంశమందు రాజభేదము.
ఋషభ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మగచూపులకన్య.
ఋషభకము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఓషధి విశేషము.
ఋషభతరము
సం., నా. వా., అ., పుం., తత్స., = చిన్నగిత్త, బరువు మోయుటకు తగిన ప్రాయమురాని ఎద్దు.<
ఋషభద్వజుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= శివుడు.
ఋషభద్వీపము
సం., నా. వా., అ., పుం., న., తత్స., = శ్వేతద్వీపము.
ఋషభము
సం., వి., అ., పుం., తత్స.,= ఎద్దు, ఓషధి విశేషము, భద్రము, బలీవర్దము, వృషభము, వృషము, సౌరభేయము, కుంభీరపుచ్ఛము, పర్వతవిశేషము, ఆది జినుడు, భగవదవతారవిశేషము, గోవు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఋషతి హృదయం ప్రవిశతీతి ఋషభః. హృదయమును ప్రవేశించునది. 2.ఋషతి గాం ప్రతి గచ్ఛతీతి ఋషభః. ఆవును గూర్చి పోవునది.
నానార్థాలు :
తిరుమల, కర్ణరంధ్రము, ఒక స్వరము(వృషభస్వరమువంటి స్వరము పలుకునది), ఉత్తరప్రదమైనచో శ్రేష్ఠుఁడు, ఏనుగు, చెలికన్నము, శ్రేష్ఠము, వరాహపుచ్ఛము, ఋషభకము, వారము, అష్టవర్గాంతర్గతమైన ఔషధివిశేషము, గోపతి, ధీరము, విషాణి, దుర్ధురము, కకుద్మంతము, పుంగవము, వోఢ, శృంగి, ధూర్యము, భూపతి, కామి, ఉక్ష, లామదూలి, బంధురము, గోరక్షకుడు, వనవాసి, ద్రాక్ష, బకము, మొసలితోక, చెడ్డగుర్రము, ఒక ముని, విష్ణువు అవతారభేదము, మగచూపులకన్య.
ఋషభి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = విధవ, దూలగొండి, గోరింట, మాచకమ్మ, ముండ, మీసములు మొదలగు పురుష లక్షణములుగల స్త్రీ.
ఋషి
సం., వి., ఇ., పుం., తత్స., = జ్ఞానసంసారముల పారము తెలిసినవాడు, వసిష్ఠాది సప్తర్షులు- (మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, వసిష్ఠుఁడు, మఱియొక మన్వంతరమున కశ్యపుఁడు, అత్రి, భరద్వాజుఁడు, విశ్వామిత్త్రుఁడు.) (గౌతముడు, జమదగ్ని, వశిష్టుడు). వీరు దేవర్షులు, రాజర్షులు- బ్రహ్మర్షులు అని మూఁడు తెగలు, మఱి యొక క్రమమున మహర్షి, పరమర్షి, శ్రుతర్షి, కాండర్షి అని నాలుగు తెగలు) , శాస్త్రకారుఁడగు ఆచార్యుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
1.జ్ఞానస్వ పారగమాత ఋషిః. జ్ఞానం యొక్క పారమును పొందినవాడు. 2.ఋషతి ప్రాప్నోతి సర్వాన్ మంత్రాన్ జ్ఞానేన. అన్ని మంత్రములను జ్ఞానముచేత పొందువాడు. పశ్యతి సంసారపారం వా ఇతి ఋషిః, జ్ఞానముచే సంసార పారమును పొందినవాఁడు. 3. మంత్రద్రష్ట . మంత్రములు కనిపెట్టినవాఁడు.
నానార్థాలు :
వేదము, అగ్ని, భృగువు మొదలైన మహర్షిసంతానము, కిరణము, చక్షురాది జ్ఞానేంద్రియము, వెలుగు, నరనారాయణుడు, దిగంబరుడు.
ఋషికుల్య
సం., నా. వా.,ఆ., స్త్రీ., తత్స., = నదియందు, ఋషినిర్మిత సరోవరమందు, తీర్థభేదము, ఋషికులహితము, ఋషికుల యోగ్యుడు.
ఋషికృతుడు
సం., నా. వా.,(త్. ఈ. త్)., తత్స., = సర్వమునుచూడదగినవారు.
వ్యుత్పత్త్యర్థము :
సర్వద్రష్టరి. అన్నింటిని చూడగలిగినవాడు.
ఋషిగిరి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = పర్వతభేదము.
ఋషిజాంగలము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఋక్షగంథ, బొద్దికూర (వృ.విశేష)
ఋషిజాంగలికి
సం., నా. వా., ఈ., స్త్రీ.,తత్స., = ఋక్షగంథ, బొద్దికూర (వృ.విశేష).
ఋషితర్పణము
సం., నా. వా., అ., న., తత్స., = ఋషులను గూర్చి చేయు జల తర్పణము.
ఋషిపంచమి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = భాద్రపద శుక్ల పంచమి (ఇందు సప్తఋషులను ఉద్దేశించి వ్రతమును ఆచరింతురు).
ఋషిప్రోక్త
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = మాషపర్ణి, కారుమినుము (వృ. వి).
ఋషిబంధువు
సం., నా. వా., ఉ., పుం., తత్స.,= శరభనామక ఋషి,
వ్యుత్పత్త్యర్థము :
ఋషిబంధుః ఉత్పాదకోఽస్య. ఋషి మిత్ర భేదమందు. ఋషి వంశమున జన్మించినవారు.
ఋషిష్టుత
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = ఋషులచేత స్తుతింపబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఋషిభిః స్తుతః వేదే షత్వమ్. ఋషులచేత స్తుతింపబడినది.వేదములలో షత్వము కలదు.
ఋషిస్తోమము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఏకాహము, యాగభేదము.
ఋషిస్వరము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఋషులచేతస్తుతింపబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఋషిభిః సూర్యతే శబ్ద్యతే స్తూయతే. ఋషులచేతస్తుతింపబడినది.
ఋషీ
సం, నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఋషిపత్ని.
వ్యుత్పత్త్యర్థము :
ఋషిపత్న్యామ్. ఋషిపత్నియందు.
ఋషీకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఋషి పుత్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఋష్యాం భవః క వా హ్రస్వః. ఋషిపత్ని గర్భమందు జనించినవాడు.
ఋషీయజ్ఞము
సం., నా. వా., అ., పుం., తత్స., = వేదాధ్యయనరూపమగు బ్రహ్మయజ్ఞము.
ఋషీవత్
సం., నా. వా., (త్. ఈ. త్)., తత్స., = ఋషిస్తోత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఋషిః స్తోతృత్వేనాస్త్యస్య మృగ విశేషః., ఋషిస్తుతియందు.
ఋష్టి
సం., వి., ఇ ., స్త్రీ., తత్స., = రెండుప్రక్కలా వాదరగల కత్తి, ఆయుధము.
ఋష్యగంధ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= వృద్దదారక వృక్షము, మహాశ్వేతయందు,బొద్దికూర, క్షీరవిదారి, పాలగుమ్ముడు.
వ్యుత్పత్త్యర్థము :
ఋష్యస్య గంధ ఇవ గంధో యస్యాః. ఋష్యము యొక్క వాసన దేనికి కలదో అది.
ఋష్యజిహ్వము
సం., నా. వా., అ., న., తత్స., = మహాకుష్ఠరోగ భేదము.
ఋష్యప్రోక్త
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= పిల్ల పీచర, శతావరి, అతిబల, ఒక దినుసు చిట్టాముదపు చెట్టు, ముత్తవపులగము, శూకశింబి, దూలగొండి, మాషపర్ణి, కారుమినుము (వృ. వి), ఆముదపుచెట్టు.
ఋష్యము
సం., వి., అ., పుం., స్త్రీ., తత్స., = మృగవిశేషము, మృగభేదము, కురువంశీయుడు దేవాతిథిపుత్రుడు.
ఋష్యమూకము
సం., నా. వా., అ., పుం., తత్స., = పంపాసరస్సునకు దగ్గరనున్న పర్వతము.
ఋష్యశృంగుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒకముని.
వ్యుత్పత్త్యర్థము :
ఋష్యమృగము కొమ్మువంటి కొమ్ము కలవాడు.