అచ్చులు : ఉ



ఉ(ఊ)ర్జము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వృద్ధి, వర్ధనము, ధీర్ఘాదిరయము.

ఉ(ఊ)ర్ద్రము
సం., నా. వా., అ., పుం., తత్స.,= దీర్ఘాదిరయము, జలబిడ (ఉద్విరాల).

ఉ(ఊ)ష్మపము
సం., నా. వా., అ., పుం., తత్స.,= భృగు పుత్రుడు, పితృగణభేదము, తపస్విభావము.
వ్యుత్పత్త్యర్థము :
ఉష్మాణం పిబతి. ఉ(ఊ)ష్మపానము చేయువాడు.


ఉ(ఊ)ష్మము
సం., నా. వా.,(న్. ఈ. న్).,తత్స., = వేడి, శ, ష, స, హ, వర్ణములు, గ్రీష్మ ఋతువు, ఆతపము.

ఉ(ఊ)ష్మాగమము
సం., నా. వా., అ., పుం., తత్స., = నిధాఘకాలము, ఆధారము.

ఉ(ఓ)డ్రము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఓఢ్రదేశము.
వ్యుత్పత్త్యర్థము :
కూర్మవిభాగస్థప్రాచ్యదేశభేదే.


ఉ(ఓ)లడ
సం., నా. వా., అ., పుం., తత్స.,=
వ్యుత్పత్త్యర్థము :
ఉ(ఓ)లండయతి తే ఉ(ఓ)లండయతి ఔలిలండీత్ తద్ ఔలండీత్ అయం లడి ఓదిత్ ఇత్యేకే.


ఉ(టు)డుంబరము
సం., నా. వా., అ., పుం., తత్స., = రాగి, రైతు.

ఉ(దు)డుంబరము
సం., నా. వా., అ., పుం., తత్స., = యజ్ఞాంగము, వృక్షము, రాగి, కృష్టిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉం శంబుం వృణోతి ఖ ఉంబరః ఉత్కృష్టః ఉంబరః ప్రాస పృషోదస్య.


ఉ(ద్ధ్యో)ద్యోతము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ప్రకాశింపజేయునది, కాంతి, కిరణము, వ్యాకరణమునందు ఒక గ్రంథము, అలంకారశాస్త్రమందు ఒక గ్రంథము.


సం., నా. వా., తత్స.,= ఒక అక్షరము
నానార్థాలు :
సంబోధనము,అనుకంపము, అవధారణము, అంగీకారము, శివుడు, పాదపూరణము, ఆపద, కోపవచనము, చంద్రమండలము, బల్లిదురాలు, ధీరురాలు.


ఉంకింపు
వి., = ప్రయత్నము, పూనిక, విజృంభణము, గంతు.

ఉంకుణము
సం., నా. వా., అ., పుం., తత్స., = నల్లి, పేను, ముత్కుణము, శబ్దమాల.

ఉంచణము
సం., నా. వా., అ., న., తత్స., = రాలిన గింజలను ఏరుకొనుట.

ఉంచు
క్రి., = ఒకచోట పెట్టి, కూర్చోబెట్టు, ఏర్పాటు చేయు, నియమించు, స్థాపించు, అలంకరించు, ధరింపచేయు, తాకట్టుపెట్టు, ఆపు, నిలుపు, నివసించేట్లు చేయు, అమర్చు.

ఉంఛము
సం., వి., అ., న., పుం., తత్స.,= ధాన్యమేఱుకొని బ్రతుకుట, లేకి బ్రతుకు, గింజనేరుకొనుట, ఆదానము, చేలలో పడినగింజలను ఏరుకోవడము.
పర్యాయపదాలు :
క్షేత్రాది స్థానములందు రాలినగింజలను జీవనార్థమై ఏరుకొనుట. ఉలూఖల సమీపే పతిత తండులానాం ఆదానేన జీవనం ఉంఛం.


ఉంఛవృత్తి
సం., విణ., (ఇ)., తత్స.,= లేకి బ్రతుకు, రాలిన గింజలను ఏరుకొని బ్రతుకుట.

ఉంఛశిల
సం., నా. వా., అ., న., తత్స., = క్షేత్రస్వామి గ్రహించగా మిగిలి నేలపై పడిన ధాన్యమును ప్రోగుచేసి తెచ్చుకొనుట.

ఉండగట్టు
క్రి., = ముద్దలవు, ఉండలుండలవు.

ఉండుకము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఇతి సుశ్రుతోక్త రుధిరకిట్టజాతే దేహస్థమలాశయే కోష్ఠభేదే తన్మిలవిభాజకత్వం కలాభేదస్య తత్రోక్తం యథా

ఉండేలకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉండ్రము, వరిపిండిని ఉండలుగా చేసి ఆవిరిమీద ఉడికించిన భక్షము.
వ్యుత్పత్త్యర్థము :
వరిపిండిని ఉండలుగా చేసి ఆవిరిమీద ఉడికించిన భక్షము.


ఉండేలు
వి., = పక్షులను గురిపెట్టి కొట్టే సాధనము, ఉండలు వేసే విల్లు.

ఉండేలుదెబ్బ
వి., = గట్టిదెబ్బ, ఉండేలుతో కొట్టిన దెబ్బ.

ఉండ్రాళ్ళతద్దె
వి., = మంచి భర్త లభించాలని ఉండ్రాళ్లు నివేదించి భాద్రపద బహుళ తదియ నాడు పార్వతీదేవికి చేసే వ్రతము.

ఉందనము
సం., నా. వా., అ., న., తత్స., = తడుపుట.

ఉందుకర్ణిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = మూషికపర్ణి, ఎలుకజీవి.

ఉందురము
సం., వి., అ., పుం., తత్స.,= ఎలుక, పందికొక్కు.

ఉందురువు
సం., వి., ఉ., పుం., తత్స.,= ఎలుక, పందికొక్కు, మూషికము, బిలేశయము, ఇందూరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదయతి ముఖ స్పృష్టంవస్త్విత్యుందురుః. తన ముఖము చేత ముట్టఁబడిన వస్తువును ద్రవింపఁచేయునది.


ఉందూరు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = మూషికము.

ఉంపుడుకత్తె
వి.,= ఉంచుకున్న స్త్రీ, భోగార్థము ఉంచుకొనుడు స్త్రీ.

ఉంబరము
సం., నా. వా., అ., పుం., తత్స., = నాస, ద్వారము మీది కమ్మి. ద్వారోర్దకాష్ఠము, గంధర్వభేదము.

ఉంబుర
సం., నా. వా., అ., పుం., తత్స., = గుమ్మము

ఉంబురము
సం., నా. వా., అ., పుం., తత్స., = ద్వారోర్దకాష్ఠము.

ఉంభకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పూరించువాడు, నిండించువాడు.

ఉంభవము
సం., వి., అ., న., తత్స., = నించుట, పూరించుట.

ఉంభితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పూరితము, నింపబడినది, పూరించువాడు, నిండించువాడు.

ఉంభ్యమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = నిండింప దగినది, పడుచున్నది.

ఉకానహము
సం., నా. వా., అ., పుం., తత్స.,= చిత్రవర్ణ గుర్రము.
వ్యుత్పత్త్యర్థము :
పీతరక్తవర్ణే కృష్ణరక్తవర్ణే చ ఘోటకే. ఎరుపు పసుపు వర్ణము కలిసిన గుర్రము.


ఉకారము
సం., నా. వా., అ., పుం., తత్స., = మహేశ్వరుడు, ఉద్దేశము.

ఉక్కడము
వి., = శత్రువుల రాకను కనిపెట్టడానికి ఉంచిన కావలి.

ఉక్కిరిబిక్కిరవు
క్రి., = ఊపిరాడక బాధపడు, కలతపడు, తట్టుకోలేని పరిస్థితికి లోనవు.

ఉక్కుకౌగిలి
వి., = మితిమీరిన అధికారంతో స్వాధీనంలో ఉంచుకొనడం. ధృతరాష్ట్ర కౌగిలి.

ఉక్కుచట్రము
వి., = మార్పునకు అవకాశం లేని వ్యవస్థ, ధృఢవ్యవస్థ.

ఉక్కుపాదము
వి., = నిర్దాక్షిణ్యమైన అణచివేత.

ఉక్కుపిండము
వి., = మిక్కిలి దృఢమైనవాడు.

ఉక్కుపిడికిలి
వి., = స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను హరించే తీవ్రమైన అదుపు.

ఉక్కుమడచు
క్రి., = బలహీనపరచు, చంపు.

ఉక్కుమనిషి
వి., = దృఢకాయుడు, కార్యసాధకుడు, ప్రలోభాలకు లొంగని వ్యక్తి.

ఉక్కుమిగులు
క్రి., = బలం కనబరుచు, పరాక్రమం ప్రదర్శించు, ప్రబలు, అతిశయించు.

ఉక్కెక్కు
క్రి., = బలపడు, గట్టిపడు.

ఉక్త
సం., వి.,(అ. ఆ. అ)., తత్స., = ఒకానొక ఛందస్సు.; విణ. చెప్పబడినది, పలుకబడునది.
వ్యుత్పత్త్యర్థము :
యస్య జ్ఞానాయ కథ్యతే. ఎవరి జ్ఞానం కోసం చెప్పబడుతుందో. తాదృశే జనే. అటువంటి వ్యక్తియందు. కథితే వాక్యాదౌ , వాక్యాయలయందు చెప్పబడినది. శక్త్యా బోధితే, ప్రతిభ ద్వారా చెప్పబడినది. ఏకాక్షరపాదకే ఛందోభేదే స్త్రీ మేది ఒకానొక ఛందస్సు. ఉచ్యతే స్మ ఉక్తం చెప్పబడినది.
సం., వి., ఆ., స్త్రీ.,

ఉక్తం
వి., = మాట, వాక్యము, విణ. అడిగిన, చెప్పిన

ఉక్తలేఖనము
వి., = ఒకరు చెబుతూ ఉండగా చెప్పిన విధంగా రాయడం.

ఉక్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = మాట, సరస్వతి, కథనము, పదము, శబ్దశక్తి.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్యత ఇత్యుక్తిః. పలుకఁబడునది.


ఉక్తుడు
వి., = తగినవాడు, అర్హుడు.

ఉక్థపత్రము
సం., నా. వా., అ., పుం., తత్స., = యజమాని, యజ్ఞము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థాని అప్రగీతమంత్రసాధ్యాని స్తోత్రాణి పత్రం వాహనమివ యస్య.


ఉక్థభృతుడు
సం., నా. వా., త్., పుం., తత్స.,= ఋషి భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థం బిభర్తి సమ్యక్ విభజతే.


ఉక్థము
సం., వి., అ., న., తత్స.,= ఉక్థ్యయాగము, హోత్రము, ఉక్థసాధనము, ప్రాణము, సామ విశేషము, సామవేదము, చతుర్వింశస్తోమభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్యతేఽనేన అప్రగీతమస్త్రసాధ్యే,


ఉక్థవర్ధనుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఇంద్రదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థైః స్తోత్రైర్వంద్యతేఽసౌ. స్తోత్రముల ద్వారా పూజింపదగినవాడు.


ఉక్థవాహసము
సం., నా. వా., స్., పుం., తత్స.,= శస్త్రపాఠము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థాని శస్త్రాణి వహతి. చెప్పినటువంటి శస్త్రాలను వహించువాడు.


ఉక్థశంసినుడు
సం., నా. వా., న్., పుం., తత్స.,= మాధవుడు,శస్త్రస్తావకమందు ఋత్విగ్భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థాని శస్త్రాణి శంసతి. చెప్పినటువంటి శస్త్రాలను


ఉక్థశసము
సం., నా. వా., స్., పుం., తత్స.,= శస్త్రస్తావకమందు ఋత్విగ్భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థం శస్త్రం శంసతి . శస్త్రస్తావకే. ఉక్థశాస్‌శబ్దే


ఉక్థశాసము
సం., నా. వా.,స్., పుం., తత్స.,= చెప్పబడినది, శస్త్రసంసకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థాని శంసతి. చెప్పబడిన శస్త్రసంసకము


ఉక్థశుష్మము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉక్థరూప బలయుక్తమందున్న, మొదలైన వాక్యములు.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థం శస్త్రం బలం యస్య. ఉక్థరూప బలయుక్తము కలిగియున్నవానియొక్క


ఉక్థాది
సం., నా. వా., ఇ., పుం., తత్స., = పాణిని చెప్పిన శబ్దసమూహము.

ఉక్థామదము
సం., నా. వా., అ., న., తత్స., = ఉక్తాసాధసోమభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థా హోత్రయా మాద్యతి.


ఉక్థావి
సం., విణ., త్రి., తత్స., = శస్త్రస్తావకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థాని అవతి.


ఉక్థాశస్త్రము
సం., నా. వా., అ., న., తత్స.,= శస్త్రస్తావకమందు ఋత్విగ్భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థా హోత్రా చ శస్త్రాణి చ ద్వంద్వః హోత్రాయాం ఋచి శస్త్రే చ.


ఉక్థినుడు
సం., నా. వా., న్., పుం., తత్స., = ఇంద్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థం స్తుత్యతయాఽస్త్యస్య. శస్త్రస్త్రావకమందుహోత్రుడు, శస్త్రస్తుతియందు ఇంద్రుడు, శస్త్రసాధ్యసంస్కారమందు సోముడు మొదలైనవారు.


ఉక్థ్యము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = యజ్ఞభేదము, పాత్రభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్థమర్హతి యత్. ఉక్థమునకు అర్హమైనది.


ఉక్రోషము
వి., = కోపము, అసమర్థతవల్లవచ్చే కోపము.

ఉక్షణము
సం., నా. వా., అ., న., తత్స., = చల్లుట, సేచనము, సేవనము.

ఉక్షతరము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆబోతు, మహా ఋక్షము, పెద్ద ఎద్దు.

ఉక్షము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = సేక్తరుడు, సిక్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్ష్యతే ఔక్షి ఉక్ష్యమాణః
భద్రము.
పర్యాయపదాలు :
బలీవర్దము, ఋషభము, వృషభము, వృషము, ఎద్దు.
సామసూక్తము, పడమటి ముఖము ఇల్లు.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్షతి రేతస్సించతీతి ఉక్షా. ఆవులయందు రేతస్సును విడుచునది.


ఉక్షవశుడు
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = యజమాన భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉక్షా వశా వశాస్థానీయో యస్య.


ఉక్షితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చల్లపడినది, చిలుకరింప బడినది, తడపబడినది.

ఉఖ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= వంటకుండ, లోవి, స్థాలి, పొయ్యి, పదార్థము. కంచము.
వ్యుత్పత్త్యర్థము :
ఓఖతి భోజస్థానం గచ్ఛతీత్యుఖా. భోజస్థానమును పొందునది.


ఉఖర్వలము
సం., నా. వా., అ., పుం., తత్స., = భూరీపత్రము, తృణము.

ఉఖ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉఖయందు వండబడినది, పైఠరము, చిన్నపాత్రలోవండినది, అగ్ని.
వ్యుత్పత్త్యర్థము :
ఉఖమనినను పిఠరమనినను కుండ; దానియందుఁపక్వము చేయబడునది కనుక ఉఖ్యము.


ఉగణము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉదాయుధగణోపేతము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గూర్ణ ఉదాయుధః గణో యస్య పృషో.


ఉగ్గ
విణ.,= గట్టిదయిన, బిగువయిన, బలమైన.; అవ్య. బిగువుగా ఉగగట్టు.; క్రి. బిగించు.

ఉగ్గడ(డి)
వి.,=గడువు, హద్దు, అవధి, మర్యాద.

ఉగ్గడన
వి.,= చాటింపు, ప్రకటన.

ఉగ్గబట్టు
క్రి.,= బిగబట్టు, గుక్కబట్టు, ఉక్కబట్టు, నిరోధించు.

ఉగ్గాడు
స., క్రి.,= చంపు, పీచమడచు.

ఉగ్ర
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= వస, వాము, పార్వతి.; విణ. భయంకరురాలు.

ఉగ్రంపశ్యుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= క్రూరుడు, భయంకరుడు. పులి మొదలుగువి.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రం పశ్యతి. క్రూరముగా చూచునది, కౄరదృష్టికలది, భయంకరమైనది (పులి మొదలుగునవి).


ఉగ్రకము
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స.,= నాగభేదము, శూరుడు.

ఉగ్రకర్ముడు
సం., నా. వా.,(న్. ఈ. న్).,తత్స., = ప్రాణిహింస చేయువాడు, క్రూరుడు మొదలగువారు.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రం కర్మాస్య. క్రూరమైన కర్మ చేయువాడు.


ఉగ్రకాండము
సం., నా. వా., అ., పుం., తత్స., = కాకర (వృ.వి)

ఉగ్రగంధ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఒక దినుసు ఓమము, వస, అజమోదము, బూడిదగుమ్మడి, వెల్లుల్లి.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రోగంధోస్యా ఇతి ఉగ్రగంధా, ఉగ్రమైన గంధము కలది.


ఉగ్రగంధము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక దినుసు ఓమము.
నానార్థాలు :
వస, అజమోదము, చంపకము, యవలు, వెల్లులి, నల్లవస.

వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రోగంధోస్యా ఇతి ఉగ్రగంధా. ఉగ్రః గంధః పుష్పాదావస్య. ఉగ్రమైన గంధము కలది, పుష్పాదులలోనిది.


ఉగ్రచండ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = దేవుని భేధము, దుర్గావరణభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రా చండా. ఉగ్రమైన కోపము కలది.


ఉగ్రత
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= కౄరత్వము, అలంకారములయందు చెప్పుబడిన వ్యభిచారి గుణభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రస్య భావః. ఉగ్రము యొక్క భావము, కర్మ.


ఉగ్రతార
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= భక్తులను కాపాడునది.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రాదపి భయాత్ తారయతి భక్తాన్. కోపము కలదైనప్పటికి భక్తులను భయమునుండి కాపాడునది.


ఉగ్రధన్వుడు
సం., విణ., న్., పుం., తత్స., = శివుడు, ఇంద్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
భయంకరమైన విల్లుకలవాడు.


ఉగ్రనాసిక
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= పెద్దముక్కు.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రా దీర్ఘా నాసికా యస్య. ఉగ్రమైన పొడవైన ముక్కు ఎవరికి కలదో వారు.


ఉగ్రపుత్రుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= శూరవంశజుడు, కార్తికేయుడు, గంభీరజలాశయము.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రస్య శూరస్య పుత్రః. ఉగ్రుడైన శూరుని కుమారుడు.


ఉగ్రము
వి.,= రౌద్రరసము, మలయాళదేశము, మునగచెట్టు, వసనాభి.; విణ. క్రూరమైన.
నానార్థాలు :
ఎక్కువైన, తీక్ష్ణమైన, శక్తి ఉన్న, కోపించే, పొడవయిన, భయంకరమైనది, మహదేవుడు, మిక్కుటమైనది, మండిపడునది, దీర్ఘము, నీడుదైనది, వత్సనాభవిషము, వశనాభి, కృరమగు నక్షత్రపంచకము (పూర్వ ఫల్గున, పూర్వషాడా, పూర్వాభాద్ర, మఖ, భరణి) రాజ విశేషము.


ఉగ్రవాది
వి., = లక్ష్యసాధనకోసం హింసామార్గాన్ని అవలంభించే వ్యక్తి తీవ్రవాది.

ఉగ్రవ్యగ్రము
సం., నా. వా., అ., పుం., తత్స.,= అసురభేదము, ఉగ్రశబ్దము.

ఉగ్రశేఖర
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= గంగానది.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రస్య శేఖరం వాసస్థానత్వేనాస్త్యస్యాః. గంగాయామ్ (శబ్దరత్న) సాహితస్య శిరసి స్థితా. ఉగ్రుని శిరమును వాసస్థానముగా కలది.


ఉగ్రశ్రవసువు
సం., నా. వా., స్., పుం., తత్స.,= రోమహర్షణుడు, శసతునికొడుకు, దృతరాష్ట్రపుత్రభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రమ్ ఉత్కృష్టం శ్రుతిధరం శ్రవ కర్ణో యస్య చ.


ఉగ్రసేనజుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= కంసుడు.
వ్యుత్పత్త్యర్థము :
కంసే తస్యోగ్రసేన క్షేత్రేఽసురజాతత్వేన తత్ పుత్రత్వమ్. కంసశబ్దే వివృతిః. ఉగ్రసేనుని పుత్రుడు.


ఉగ్రసేనుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = భయంకరమైన సేనను కలవాడు, దృతరాష్ట్రుని పుత్రులలో ఒకడు, కంసుని తండ్రి (మబ్బురరాజు).

ఉగ్రాక్షుడు
సం., వి., అ., పుం., తత్స., = శివుడు, వేడి కంటివేలుపు, కూలరత.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రమైన కన్నులు కలవాడు.


ఉగ్రాదేవుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,=ఒక రాజర్షి.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రేణాదీవ్యతి.


ఉగ్రాయుధుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒక రాజు, ధృతరాష్ట్రపుత్రభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రాణి ఆయుధాన్యస్య. భయంకరమైన ఆయుధాలు కలిగినవాడు.


ఉగ్రాసేన
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= అక్రూరుని భార్య.

ఉగ్రుడు
సం., వి., అ., పుం., తత్స., = మహాదేవుడు, రుద్రుడు, శివుడు, శూద్రదాని యందు క్షత్రియునికిబుట్టి కోశరక్షణాదులచే బ్రదుకువాడు.; విణ. భయంకరుడు. శివుడు, రుద్రుడు.
నానార్థాలు :
ఒక సంకరజాతి, చోరశిక్షకుడు, మజ్జిగ, వచ, వస (వృ.వి) యవాని, ఓమము, ధాన్యాకము, ధనియాలు, సంకరజాతి స్త్రీ, పరవృత్తిని ఆశ్రయించుట, ఒక ఉప్పు, క్రోధి, పరవృత్తినాశ్రయించినవాడు. శోభాంజనవృక్షము, నృపవిశేషము, రాజ విశేషము,? కేరలదేశము, దానవవిశేషము,? దానవిశేషము, అసురుడు,? విష్ణువు, పార్వతి, వాయువు, వత్సనామాబ్దము, ఉత్కృష్టము, కాళికావర్ణభేదము, చాండీరూప వర్ణసంకరము, ఉత్తరాయోగినీ భేదము, ఉగ్రవాదాయోగినీ భేదము, కౄరమగు, నక్షత్రపంచకము (పూర్వ ఫల్గున, పూర్వషాడ, పూర్వాభాద్ర, మఖ, భరణి), ఉత్కటము.

వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రత్వాదుగ్రః. క్రోధము కలుగుట వలన ఉగ్రుడు.


ఉగ్రేశుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ప్రమథాధిపుడు, శివుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉగ్రాణాముత్కటరూపాణాం ప్రమథానామీశః. ప్రమథులకు అధిపతి.


ఉచథ్యము
సం., నా. వా., (అ. ఆ. అ) ., తత్స.,= స్తుతియందు, రాజభేదమందు.
వ్యుత్పత్త్యర్థము :
ఉచథం స్తోత్రమర్హతి యత్. రాజభేదే. స్తోత్రములు పొందుటకు అర్హమైనది . రాజభేదమందు.

ఉచితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = తగినది.
నానార్థాలు :
ఉంచపడినది, ఎరుగబడినది, కొలదియిడబడినది, అలవాటుపడినది, పరిచితము, మితము, వ్యస్థము, అర్హము, అనుభూతము, న్యాయము, విధితము, పరిమితము, యుక్తము, గ్రాహ్యము.


ఉచ్చండము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఆగ్రహము కలది.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చండతి కోపేనాశు సవతీత్యుచ్చండం. ఆగ్రహము చేత వేగిరపడునది.

పర్యాయపదాలు :
వడికలది, తీవ్రము, అవిలంబితము, త్వరాన్వితము, త్వరము, త్వరముతోకూడినది, అతికోపమునందు, అత్యంతమైన ఉగ్రమునందు.


ఉచ్చంద్రము
సం., వి., అ., పుం., తత్స., = అపరరాత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్ఛిష్టః స్వల్పాఽవశిష్టశ్చంద్రో యత్ర , రాత్రియొక్క చివరిభాగము. రాత్రిశేషే (శబ్దరత్నా) రాత్రి 4వ జాము.


ఉచ్చకైః
సం.,అవ్య., తత్స., = ఉచ్చతాయము, తద్విశిష్టము, గట్టిగా.

ఉచ్చక్షువు
సం., విణ.,(స్. ఈ. స్)., తత్స.,= తెరచిన కనులు కలది(కలవాడు).
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్షిప్తముత్పాటితం వా చక్షుర్యస్య ప్రా వ. (1)ఊర్దోత్ క్షిప్తనేత్రే (2)ఉత్పాటితనేత్రే చ. తతః చ్వి ఇచ్చక్షూకరోతి ఉచ్చక్షూభవతి ఉచ్చక్షూ స్యాత్.


ఉచ్చట
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= వట్రువముస్తె.
నానార్థాలు :
ఒక దినుసు, ధంధము, వెల్లుల్లి, గురివెంద, చూడాలనేల ఉసిరిక, నాగరముస్త, ఛద్రముస్త, ఉప్పునేల, త్వరతో గూడినది.

వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చటతి రోగానిత్యుచ్చటా. రోగములను భేదించునది.


ఉచ్చతాళము
సం., నా. వా., అ., న., తత్స., = గట్టిగాకొట్టు చప్పట్లు, కల్లుపాక, పొడవైనతాటిచెట్టు.

ఉచ్చదేవుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = వాసుదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చః శ్రేష్ఠో దేవః. శ్రేష్ఠుడైన దేవుడు.


ఉచ్చనీచము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= మెరక పల్లములుగా ఉన్నది.

ఉచ్చనీచాలు
వి.,బహు.,= ఎక్కువ తక్కువలు, మంచిచెడ్డలు.

ఉచ్చము
సం., విణ., (అ. ఆ. అ).,అవ్య., తత్స.,= ఉన్నతము, పొడవు.
నానార్థాలు :
రాశిభేదము, అంశము, ఉపరి, తుంగము, ఉత్తుంగము, ఎత్తైనది, ప్రాంశువు, ఉదగ్రము, ఉచ్ఛ్రితము, గొప్పది, మిక్కుటము, గ్రహముగతికి కారణమై గ్రహకక్షా శిఖరమున ఉండు జీవభేదము, రాశిచక్రమందు ఆయాగ్రహములకేర్పడిన స్థానవిశేషము.

వ్యుత్పత్త్యర్థము :
ఉతీక్షయ్య బాహూ చీయతే, ఉపర్యుపరినివిష్టైరవయవైశ్చీయతేఽసౌ. ఉచ్చినోతీత్యుచ్చః. మీదికి పెరుగునది.
గట్టిగా అనే అర్థము.

ఉచ్చయము
సం., వి., అ., పుం., తత్స.,= ఆడుదాని నడుముకట్టు, సమూహము, పోకముడి.
నానార్థాలు :
అతిశయము, పెంపు, ఎత్తు, గొప్పతనము, ఉదయించుట.


ఉచ్చరణము
సం., వి., అ., న., తత్స.,= ఉచ్చారణము, మీదికి పోవుట, బయటికిపోవుట, ఉచ్చరించుట, నోటపలుకులు.

ఉచ్చరించు
సం., స., క్రి., = వాక్రుచ్చు, చెప్పు.

ఉచ్చరితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఉచ్చరింపబడినది, పైకి ఎగిసినది, వెలుపలుకి పోవునది, పురీషము, మలము.

ఉచ్చలనము
సం., నా. వా., అ., న., తత్స.,= కదులుట, వెడలుట, పయనమగుట.

ఉచ్చలము
సం., విణ., అ., న., తత్స., = మనసు, బుద్ధి, ఒక విల్లు.
వ్యుత్పత్త్యర్థము :
చలస్వభావము కలది.


ఉచ్చలలాట
సం., నా. వా., ఆ., స్త్రీ ., తత్స.,= కన్య.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చం లలాటం యస్యాః. విశాలమైన లలాటం కలది.


ఉచ్చలితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = బుద్ధి, ఉచ్చలితము,బయలుదేరునది, పైకి ఎగసినది, చెరగబడినది(ధాన్యము).

ఉచ్చస్వనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పెద్దధ్వని

ఉచ్చాటనము
సం., వి., అ., న., తత్స., = ఒకవిద్య, వేళ్ళతోఁబెరకుట.

ఉచ్చాటము
సం., నా. వా., అ., న., తత్స., = పెళ్లగించుట, ఉత్పాటనము, స్వస్థానమును ఢీ గొట్టుట, పిశాచాదులను విడిపించుట.

ఉచ్చారకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉచ్చరించువాడు.

ఉచ్చారణము
సం., వి., అ., న., తత్స.,= ఉచ్చరించుట, పలుకుట, మీదికి పోవుట, బయటికి పోవుట, నీటితో పలుకుట.

ఉచ్చారము
సం., వి., అ., పుం., తత్స.,= పురీషము, విష్ఠ.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చార్యతే త్యజత ఇతి ఉచ్చారః. విడువబడినది, మలము.
ఉచ్చారణము, కథనము. గ్రహములు, రాశులయందు నక్షత్రాల యందు సంచరించుట, ?

ఉచ్చారితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉచ్చరింపబడినది, పురీషము విడుచునది (జంతువు).

ఉచ్చార్యము
సం., అవ్య., = ఉచ్చరింపతగినది.

ఉచ్చావచము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = బహుప్రకారములు కలది, అనేక భేదములు, ఉత్కృష్ట అప కృష్టాత్మక భేదము, ఉచ్చనీచము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చం చ తత్ అవాక్చ ఉచ్చావచం. మీదను, క్రిందను వ్యాపించునది.


ఉచ్చింగటుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = కోపస్వభావముగల మనుష్యుఁడు.

ఉచ్చిటంగము
సం., నా. వా., అ., పుం., తత్స., = సుశ్రుతియందు, మత్స్యము, కోపవిష్టము గల పురుషుడు, విషకీట భేదము(సుశ్రుతే).

ఉచ్చిష్టభోజనము
సం., నా. వా., అ., పుం., తత్స.,= దేవుని నైవేద్యభోజనము, నిషిద్ధమైన ఉచ్చిష్టభోజనము.

ఉచ్చూడ(ల)
సం., నా. వా., అ., పుం., తత్స., = జెండాచివరి ఆభరణము

ఉచ్చూడము
సం., నా. వా., అ., పుం., తత్స., = ధ్వజపటము, జెండాగుడ్డ, జెండాకు ఊర్థ్వముఖముగా గట్టినకుచ్చు

ఉచ్చూనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉచ్చినది, వాచినది.
పర్యాయపదాలు :
బలిసినది, ఎత్తెనది, బలుపు, పొంగట, వాచుట, ఉన్నతి, ఎత్తు.


ఉచ్చూరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = స్వేచ్ఛగలవాడు.
నానార్థాలు :
శృంఖల రహితము, నిరంకుశము, పగటి మూడవ జాము.

పర్యాయపదాలు :
బాధకానిది, అనియంత్రితము, అనర్గళము.


ఉచ్చూరుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= స్వేచ్ఛగలవాడు, శృంఖల రహితము, భాదకానిది, అనియంత్రితము, అనర్గళము, నిరంకుశము, పగటి మూడవజాము.

ఉచ్చైఃశిరస్
సం., నా. వా., (స్. ఈ. స్.)., తత్స., = ఉన్నతమస్తకము, మహత్తరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చైరున్నత శిరోఽస్య. ఉన్నతమైన శిరస్సు కలది.


ఉచ్చైర్ఘుష్టము
సం., నా. వా., అ., న., తత్స., = పెద్దకలకలము, కోలాహలము, బిగ్గరగా చాటుట.

ఉచ్చైర్ఘోష
సం., నా. వా., అ., పుం., తత్స.,= రుద్రమూర్తిభేదము, అరచుట.

ఉచ్చైశ్శ్రవము
సం., నా. వా., (స్.ఈ.స్.)., పుం., తత్స., సం., వి., అ., పుం., = ఇంద్రుని గుర్రము, నిక్కువీనుల జక్కి, విష్ణువు, అశ్వభేదము, చెవిటివాడు, నిక్కిన చెవులు గలది.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చైః శ్రవసీ యస్య సః ఉచ్చైశ్రవాః. ఉచ్చైరున్నతం శ్రవోస్య. ఉన్నతములైన చెవులుకలది, యద్వా ఉచ్చైః శృణోతీతి ఉచ్చైశ్రవః. నిక్కువీనుల జక్కి గట్టిగమాట్లాడినగాని వినలేనిది.
. 2.ఉచ్చైః శ్రవో యశో యస్య, యద్వా ఉచ్చైః శ్రవసీ కర్ణౌ యస్య, యద్వా ఉచ్చైః శృణోతీతి ఉచ్చైశ్రవః. గట్టిగమాట్లాడిన గాని వినలేనిది చెవిటిది. గుర్రము.

ఉచ్చైస్
సం., అవ్య., తత్స.,= మేరువృక్షము, ఉన్నతి, ఎత్తుగా, నారదుని వీణ.

ఉచ్చైస్తమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= మిక్కిలియెత్తెనది, మిక్కిలి గొప్పది.

ఉచ్చైస్తరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పెద్దకంఠధ్వని గలది, పెద్దకంఠధ్వని, ఎక్కువ యెత్తైనది, ఎక్కువ గొప్పది. పెద్దకంఠద్వని గలది, పెద్దకంఠద్వని, ఎక్కువయెత్తైయినది, ఎక్కువగొప్పది

ఉచ్ఛంద్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = రాత్రి యొక్క చివరి భాగము, అపరాత్రి.

ఉచ్ఛక్షువు
సం., విణ., (న్)., తత్స.,= పైకి చూచునది, గుడ్డిది.

ఉచ్ఛతరువు
సం., నా. వా., ఉ., పుం., తత్స.,= పొడవైన చెట్టు, కొబ్బరిచెట్టు.

ఉచ్ఛన్నము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అచ్ఛన్నము, మఱుగుపడినది.

ఉచ్ఛలము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = పైకి ఎగయునది, మట్టుమీఱిపైని వ్యాపించునది, తేలియాడునది.

ఉచ్ఛాదనము
సం., నా. వా., అ., న., తత్స.,= ఆచ్చాదనము, కప్పుట, గంథ ద్రవ్యములు, దేహమునకు అలదుట.

ఉచ్ఛాసనుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = శాసనమునతిక్రమించినవాడు, అవిధేయుడు.

ఉచ్ఛాసనుడు
సం.,నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= అవిధేయుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్క్రాంతః శాసనమ్. శాశనమునతిక్రమించినవాడు.


ఉచ్ఛాస్త్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = శాస్త్రమునతిక్రమించునది, శాస్త్రవిరుద్దమైనది.

ఉచ్ఛింఘనము
సం., నా. వా., అ., న., తత్స.,= చీదుట.
వ్యుత్పత్త్యర్థము :
నాసికావాయునాంతస్థిత కఫాదినిఃసారణే. నాసికావాయువు ద్వారా లోపలి కఫము బయటకు వచ్చుట.


ఉచ్ఛిఖ
సం.,నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉద్గతా శిఖా యస్య.

ఉచ్ఛిఖము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఎత్తైనశిఖ కలది, ఎత్తైన శిఖరముగలది, పైకి ఎగయు జ్వాలలు కలది, జ్వలించునది. (అగ్ని)

ఉచ్ఛిత్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = త్రుంచుట, వ్రేళ్ళతో పెకలించుట, నిర్మూలముసేయుట, నశింపజేయుట.

ఉచ్ఛిత్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పెరిగినది, పొడవైనది, పుట్టినది, పైన కప్పుకునే వస్త్రము, కండువ.

ఉచ్ఛిన్నము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= చీల్చబడినది, త్రుంపబడినది, సమూలముగా నాశనము చేయబడినది, విదళితము, నిర్మూలింపబడినది.

ఉచ్ఛిరసము
సం., నా. వా.,(స్. ఈ. స్)., తత్స.,= ఉన్నతము, మహిమాన్వితము.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతం శిరోఽస్య. ఉన్నతమైన శిరస్సు కలవాడు.


ఉచ్ఛిరస్కుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉచ్ఛిరుడు, తల ఎత్తుకున్నవాడు.

ఉచ్ఛిరుడు(రసుడు)
సం., విణ., (స్. ఈ. స్)., తత్స.,= పైకెత్తుకొనిన శిరస్సుకలవాడు, పొడుగైన వాడు, మహిమగలవాడు, గొప్పవాడు.

ఉచ్ఛిలౌంధ్రము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఛత్రము, వికసితశిలీంధ్రయుక్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్థితం శిలీంధ్రమ్.


ఉచ్ఛిష్ట భోజిన్
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స.,= బల్యన్నము తినువాడు, బలి అన్నము తినువాడు.

ఉచ్ఛిష్టగణేశుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= తంత్రములలో చెప్పబడిన గణపతి భేదము.

ఉచ్ఛిష్టచాండాలిని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= మాతంగీ దేవి యొక్క మూర్తి భేదము.

ఉచ్ఛిష్టము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = భుజింపగా మిగిలినది, తేనె, మథువు.
పర్యాయపదాలు :
భుక్తావశిష్టము, ఎంగిలి, ఎంగిలిది, పూర్వులుపయోగించినది, ప్రాతబడ్డది, వదిలి పెట్టుబడినది.


ఉచ్ఛిష్టమోదనము
సం., నా. వా., అ., న., తత్స.,= తేనె, మధువు.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్ఛిష్టం భ్రమరోచ్ఛిష్టం మధు తేన మోదతే వర్దతే. సిక్థకే. భ్రమరము ద్వారా విడిచిపెట్టబడిన మధువు.


ఉచ్ఛిష్టుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= అన్నము భుజించినపిదప ప్రక్షాళనాది శుద్ధి చేసుకొనిన వాడు.

ఉచ్ఛిష్యము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,=
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్ఛేష్యమ్ అవశేషణీయేఽన్నాదౌ.


ఉచ్ఛీర్షకము
సం., నా. వా., అ., న., తత్స.,= తలగడ, ఉపధానము, తలపైకెత్తుకొన్నది, తలగడ, శిరః ప్రదేశము.

ఉచ్ఛునము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వైశాఖము

ఉచ్ఛుష్కము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఎండినది, ఇంకినది.

ఉచ్ఛూనము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= దట్టము.
పర్యాయపదాలు :
ఉబ్బినది, వాసినది, బలిసినది, ఎత్తైనది, బలుపు, పొంగుట, వాచుట, ఉన్నతి, ఎత్తు.


ఉచ్ఛృంఖలము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= అడ్డపాటులేనిది.
పర్యాయపదాలు :
బంధన రహితము, కట్టులేనిది, నిరంకుశము, స్వేచ్ఛగా వర్తించునది, పద్దతికాని క్రమముగానీ లేనిది.
స్వేచ్ఛగలవాడు.

ఉచ్ఛేత
సం., విణ., (ఋ. ఈ. ఋ)., తత్స., = తుంచువాడు, చీల్చువాడు, సమూలముగా నాశనము చేయువాడు.

ఉచ్ఛేదనము
సం., నా. వా., అ., న., తత్స., = ఛేదించుట, త్రుంచుట, సమూలముగా నాశనం చేయటం, మొదలంటపెల్లగించుట.

ఉచ్ఛేదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= చీల్చుట, ప్రకాశము, ఊట.
పర్యాయపదాలు :
ఛేదించుట, త్రుంచుట, సమూలముగా నాశనం చేయటం, మొదలంట పెల్లగించుట.


ఉచ్ఛేద్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= త్రుంపదగినది, నశింపచేయదగినది, సమూలముగాపీకబడినది.

ఉచ్ఛేయణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఎత్తు, గొప్పతనము.

ఉచ్ఛేషణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉచ్ఛిష్టపదార్థము, ఎంగిలి, తినగామిగిలినది.

ఉచ్ఛోషణము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= సంతాపము, ఊర్ధ్వశోషము.
వ్యుత్పత్త్యర్థము :
సమ్యక్ శోషణే. బాగా శోషించుటయందు.


ఉచ్ఛోషుకము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= ఊర్ధ్వశోషప్రాప్తము.

ఉచ్ఛ్ర(చ్ఛ్రా)యము
సం., వి., అ., పుం., తత్స.,= ఉత్సేధము.
పర్యాయపదాలు :
పొడవు, ఎత్తు గొప్పతనము, ఉదయించు, అతిశయము, పెంపు, ఉత్సేధము, గొప్పది.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్ శ్రయణముచ్ఛ్రాయః. ఊర్ధ్వముగాఁపొందుట.


ఉచ్ఛ్రయణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఔన్నత్యము, ఉత్కృష్టము.

ఉచ్ఛ్రాయము
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = పొడుగైనది, గొప్పది.

ఉచ్ఛ్రావణము
సం., నా. వా., అ., న., తత్స.,= గట్టిగావినిపించుట, గట్టిగా చెప్పుట.

ఉచ్ఛ్రితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పుట్టినది, ఉత్పన్నము, సంజాతము, ప్రాచీనము, వదిలి పెట్టబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వం శ్రిత ఇత్యుచ్ఛ్రితః. ఊర్ధ్వభాగమును ఆశ్రయించునది.

పర్యాయపదాలు :
పొడవైనది, పెరిగినది, ఎత్తైనది, ఊర్ధ్వదేశముపొందినది.


ఉచ్ఛ్రితాగ్రకము
సం., నా. వా., అ., న., తత్స.,= పై కప్పుకలది.

ఉచ్ఛ్రితి
సం.,విణ., ఇ., స్త్రీ., తత్స., = ఎత్తు.
నానార్థాలు :
ఎత్తు, గొప్పతనము, ఉదయించుట, అతిశయము, పెంపు, ఉత్కర్షము.


ఉచ్ఛ్వసనము
సం., నా. వా., అ., న., తత్స.,= ఊర్చుట, ఊపిరివిడుచుట, ఊపిరిలోపలికి తీసుకొనుట, సడలుట వదులగుట.

ఉచ్ఛ్వసితము
సం., వి., అ., న., తత్స., = ఊపిరివెలికిఁబుచ్చుట,; విణ. ఊపిరి వెలికిఁబుచ్చినది.
నానార్థాలు :
ఊపిరిలోనికి తీసుకొనుట, ఊపిరి ఈడ్చినది, విడిచినది, వికసించినది, విరిసినది, సంతోషించినది, ఆశాయుక్తము, ఊపిరివెలికిపుచ్చుట, ఊఱుకు, కలుజు, అఖ్యాయిక, పరిచ్ఛేదము.


ఉచ్ఛ్వాసము
సం., వి., అ., పుం., తత్స., = ఊపిరివెలికిఁబుచ్చుట.
పర్యాయపదాలు :
ఊరట, కలుజు, ఆఖ్యాయిక పరిచ్ఛేదము. లోపలికి పీల్చుగాలి, అంతర్ముఖశ్వాసము, బహిర్ముఖశ్వాసము, పైకివిడిచిన ఆవిరి.

నానార్థాలు :
నిట్టూర్పు, ప్రాణము, జీవనము, ఊరట, పరిచ్చేదము, గ్రంథభాగము, కావ్యభాగము.


ఉచ్ఛ్వాసి
సం., విణ., (న్. ఈ. న్.)., తత్స., = ఊపిరిలోపలికి తీసుకొనువాడు,
పర్యాయపదాలు :
ఊపిరి పైకివిడుచువాడు, చావునకు సిద్ధముగా నున్నవాడు, ఎగశ్వాసకలవాడు, నిట్టూర్పువిడుచువాడు, వెలికిబోయునది.


ఉఛ
ఉచ్ఛే(కణశఆదానే) తుదా ఇదిత్ పర సక సేట్. ఉఞ్ఛితి ఔఞ్ఛీత్. ఉఞ్ఛామ్-బభూవ ఆస చకార. ఉఞ్ఛితా ఉఞ్ఛ్యాత్ ఉఞ్ఛిష్యతి ఔఞ్ఛిష్యత్. ఉఞ్ఛః ఉఞ్ఛనమ్ ఉఞ్ఛితః. ప్ర+మార్జనే ప్రోఞ్ఛనం (పోఛా)ప్రోఞ్ఛితః.. బన్ధే సమాపనే చ విరామే పా తుదాపర సక సేట్. ఉచ్ఛతి ఔచ్ఛీత్ ఉచ్ఛామ్ బభూవ ఆస-చకార. ఉచ్ఛితా ఉచ్ఛ్యాత్ ఉచ్ఛిష్యతి ఔచ్ఛిష్యత్. ణిచ్ ఉచ్ఛయతి తే ఔతిచ్ఛత్ ఔచిచ్ఛత్. త. సని ఉతిచ్ఛిషతి ఉచిచ్ఛిషతి. ఈదిత్ తేన నిష్ఠాయా నేట్. ఉష్టః.

ఉజ్ఘితవ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= విడువబడవలసినది, వదలబడవలసినది, విడవదగినది.

ఉజ్జనము
సం., వి., అ., న., తత్స., = విడుపు, ఉజ్జనము.

ఉజ్జయంతము
సం., నా. వా., అ., న., తత్స., = రైవత పర్వతమందు.

ఉజ్జయిని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఒకానొక పట్టణము, విశాలనగరము, అవంతి, మాళవదేశము, విక్రమాదిత్యుని రాజధాని.

ఉజ్జానకము
సం, నా. వా., అ., పుం., తత్స., = ఉత్తరదేశము.

ఉజ్జాయింపు
వి., = ఊహ, అంచనా.; అవ్య. దాదాపు, రమారమి.

ఉజ్జాసనము
సం., వి., అ., న., తత్స., = వధము, కొల.
వ్యుత్పత్త్యర్థము :
ఉజ్జాస్యతే ఉజ్జాసనం. చంపుట.


ఉజ్జిఘ్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = వాసన చూచునది.

ఉజ్జితము
సం., విణ., (అ. ఆ. అ).,= విడువబడినది, వదలబడినది, విడిచినది.

ఉజ్జితి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = ఉత్కృష్ఠ ఓయము.

ఉజ్జిహానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పైకి పోవునది.

ఉజ్జీవనము
సం., వి., అ., న., తత్స., = జీవనము, బ్రతుకు, బ్రతికించుట.

ఉజ్జీవి
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., =జీవింప చేయువాడు, జీవించువాడు. వి., =సాటి, సమానం, జంట.; రూ. ఉజ్జి, ఉద్ది.

ఉజ్జీవించు
సం., అ., క్రి., = జీవించు, బ్రతుకు, బ్రతికించుట

ఉజ్జృంభణము
సం., నా. వా., అ., న., తత్స., = ఆవులింత.
నానార్థాలు :
వికసించుట, అతిశయము, వికాశము, బీటలువారుట, బ్రద్దలు అవుట.

వ్యుత్పత్త్యర్థము :
వికాశే ముఖవికాశనభేదే వ్యాపారే (హాఇతోలా).


ఉజ్జృంభము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వికాశము.
పర్యాయపదాలు :
స్ఫుటము, ముఖవికాశన భేదము, ఆవులింత, వికసించుట, అతిశయము, వికాసము, విరియుట.


ఉజ్జృంభితము
సం., వి.,అ., న., తత్స.,= చేష్ట.; విణ. విసిరినది, ఆవులింత, వికసించినది.

ఉజ్జేషము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉత్కర్షప్రాప్తి, ఉత్కృష్టము.

ఉజ్జ్య
సం., నా. వా., అ., న., తత్స., = ఉద్గతా జ్యా యస్య (1)అవతారితమౌర్కీకే ధనుషి.

ఉజ్జ్వలదత్తుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = విద్వత్తుడు.

ఉజ్జ్వలనము
సం., నా. వా., అ., న., తత్స., = ప్రకాశించుట, జ్వలించుట, మండుట.

ఉజ్జ్వలము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ప్రకాశించుట, జ్వలించుట, మండుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉజ్జ్వలతి ప్రకాశత ఇత్యుజ్జ్వలః. ప్రకాశించునది, వెలుఁగునది.

నానార్థాలు :
విరియునది, విశదము, వికశితము, స్వర్ణము, శృంగారరసము, సహితము, కూడినది, దీప్తము, తెల్లనిది.
సింగారము.; విణ. వెలుఁగునది, తెల్లనిది, విరియునది.

ఉజ్జ్వలితము
స., నా. వా., అ., పుం., తత్స., = జ్వలించినది, ప్రకాశించినది.

ఉజ్ఝకుడు
సం., విణ., అ., పుం., తత్స., = విడుచువాడు.

ఉజ్ఝఠము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= విడుపు.

ఉజ్ఝనము
సం., వి.,అ., న., తత్స.,= విడుపు, ఉజ్జనము.

ఉజ్ఝము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= విడుచునది, త్యజించునది.

ఉజ్ఝితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= విడువబడినది, విడుచువాడు, ఉత్సృష్టము, త్యక్తము, వర్జితము.

ఉజ్ఝితుడు
సం., విణ., (ఋ. ఈ. ఋ)., తత్స.,= విడిచిపెట్టబడినవాడు.

ఉజ్ఝ్యమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = విడిచిపెట్టబడుచున్నది, వదలబడుచున్నది, విడవబడుచున్నది.

ఉటంకించు
క్రి., = ఉదాహరించు, ఇతరులు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని మార్పులేకుందా మళ్లీ ప్రస్తావించు, ఎత్తిపొడుచు.

ఉటజము
సం., వి., అ., పుం., న., తత్స., = ఆకుటిల్లు, ఇల్లు, పర్ణశాల, మునుల గృహము, ఆకులచేత నిర్మించిన దానియందు.
వ్యుత్పత్త్యర్థము :
ఉటైస్తృణ పర్ణైర్జాయత ఇత్యుటజః. తృణపర్ణముల చేతఁకలిగినది.


ఉటము
సం., నా. వా., అ., న., తత్స., = గడ్డి(పర్ణే చ), ఆకు, పత్రము.

ఉట్టంకణము
సం., వి., అ., న., తత్స., = స్థాపనము.

ఉట్టంకించు
క్రి., = పొగడు, స్తుతించు.

ఉట్టంకితము
సం., విణ., (అ.ఆ.అ.)., పుం., తత్స., = స్థాపించబడినది.ఆకు, గడ్డి

ఉట్టికట్టుకొనిఊరేగు
క్రి., = ఒంటరిగా బ్రతుకు, స్వార్థంతో బ్రతుకు, అంటి పెట్టుకొని ఉండు, చావకుండా ఉండు.

ఉట్టికెక్కు
అ., క్రి., = మూలబడు, భద్రంగా ఉండు.

ఉట్రవడియంగా
అవ్య., = అనుకోకుండా, అకస్మాత్తుగా, ఊరికే, ఉచితంగా.

ఉట్లపండుగ
వి., = గోకులాష్టమి రోజు ఉట్లను వేలాడదీసి, కిందకీ పైకీ లాగుతూ ఉండగా, వాటిని కొట్టే వినోదము.

ఉడ
సంహతౌ సౌత్ర పరఅక సేట్. ఓడతి ఔడీత్. ఉవోడ ఊడతుః. ఓడితా ఉడ్యాత్ ఓడిష్యతి ఔడిష్యత్. ఉడు

ఉడతాభక్తి
వి., = భక్తితో లేదా ప్రేమతో యథాశక్తి చేసే సహాయము.

ఉడికించు
క్రి.,= ఎత్తిపొడుచు, వెక్కిరించు.

ఉడిగిపోవు
అ., క్రి.,= వ్యర్థమవు, క్షీణించు, చిక్కిపోవు, నిలిచిపోవు, ఆగిపోవు, నశించు.

ఉడు(డూ)పతి
సం., వి., ఇ., పుం.,తత్స.,= చంద్రుడు, చుక్కరేడు, వరుణుడు

ఉడు(డూ)పము
సం., వి., అ., న., పుం.,తత్స.,= ప్లవము, త్రెప్పమాను, తెప్ప, భేలకము, కోలము, ఉడూపము, తరణము, తారణము, తారకము, చంద్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉడవః ఆపః తాభ్యః పాతీత్యుడుపం. ఉదకముల వలన రక్షించునది, పుట్టి గ్రంపవలె ఉండి ఏరు దాటుటకు ఉపయోగించు సాధన విశేషము.


ఉడు
సం., నా. వా., ఉ., స్త్రీ., న., తత్స.,= నక్షత్రము, జలము, ఉత్కము.

ఉడుంబరపర్ణి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= దంతీవృక్షము.
వ్యుత్పత్త్యర్థము :
ఉడుంబరస్య పర్ణమివ పర్ణమస్యాః. ఉడుంబర పర్ణము వంటి పర్ణము దీనికి కలదు.


ఉడుకు
వి., = వేడి, ఉష్ణము, విచారము, బాధ.; విణ. వేడి అయిన.; క్రి. అగు, వేడివల్ల వాడిపోవు, బాధపడు.; అన్నం మొ.వి. పక్వమవు, కోపించు.

ఉడుకుమోతుతనము
వి., = పరిహాసానికి ఏదయినా అన్నా నొచ్చుకునే స్వభావము.

ఉడుక్కొను
అ., క్రి., = ఒకరు ఎత్తి పొడిచి పరిహసిస్తే బాధపడు.

ఉడుచక్రము
సం., నా. వా., అ., న., తత్స.,= నక్షత్రమండలము.
వ్యుత్పత్త్యర్థము :
ఉడూనాం చక్రమివ మండలమ్. నక్షత్రసమూహమునందు.


ఉడుపతి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = చంద్రుడు, చుక్కరేడు, వరుణుడు.

ఉడుపథము
వి., = నక్షత్రమార్గము, ఆకాశము.

ఉడుపుడు
సం., వి., అ., పు., = చంద్రుడు, చుక్కలరేడు

ఉడుపుష్పము
సం., వి., అ., న., తత్స.,= అశోకము, తామర, దాసనము.
వ్యుత్పత్త్యర్థము :
ఉడుదేశే భవం పుష్పం ఉడుపుష్పం. ఉడుదేశమందుపుట్టిన పుష్పము.


ఉడుముపట్టు
వి., = గట్టిపట్టు

ఉడురాజు
సం., నా. వా., జ్., పుం., తత్స.,= చంద్రుడు, చుక్కలరేడు, వరుణుడు.

ఉడులోమనుడు
సం., నా. వా., న్., పుం., తత్స.,= ఒక ఋషి.

ఉడువు
సం., నా. వా., ఉ., న., తత్స.,= నక్షత్రము, సూర్యుడు, నీరు.
వ్యుత్పత్త్యర్థము :
ఉడ్డీయత ఇతి. ఆకాశమందు సంచరించునది.


ఉడూపథము
సం., నా. వా., అ., పుం., తత్స.,= నక్షత్రమార్గము

ఉడ్డబెట్టు
స., క్రి., = కోసిన ఆకులను మొదళ్లు పైకి వచ్చేట్లు నిలబెట్టు.

ఉడ్డయనము
సం., వి., అ., న., తత్స., = పైకి ఎగరడము.

ఉడ్డాడించు
క్రి., = తిప్పు, చుట్టూ కదలించు, కలచు, పీడించు, తక్కువచేయు.

ఉడ్డామరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = భయంకరము, శ్రేష్టము, ఉద్భటము, తంత్రభేదము.

ఉడ్డీనము
సం., వి., అ., న., తత్స., = పైకెగరుట, నెగవు, పక్షి గతి భేదము, ఎగురుట
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం డయనం ఉడ్డీనం. మీదికిపాఱుట, పైకెగురుట.


ఉడ్డీయనము
సం., నా. వా., అ., న., తత్స., = ఎగరటము.
వ్యుత్పత్త్యర్థము :
ఉడ్డః స ఇవాచరతి.


ఉడ్డీశుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = మహాదేవుడు, శివుడు, తంత్రభేదము.

ఉణక
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = అపసరణము.

ఉణాది
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ప్రత్యయసముదాయమునందు.

ఉత
సం., అవ్య., తత్స.,= సముచ్చయము
నానార్థాలు :
వితర్కము, ప్రశ్నము, అత్యర్థము, సంశయము, నేసినది, ప్రశ్నను, వికల్పమును, అంగీకారమును తెల్పునది, పాదపూరణము, కూడా అనే అర్థములో, ఇదే అనే అర్థములో, ఊతము, తంతుసంతానము, సంచి.


ఉతంకమేఘము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉతంకార్థమీశ్వరేణ ప్రవర్తితో మేఘః. కృష్ణని చేత యోజింపబడినటువంటి మేఘము.

ఉతంకుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= వేదముని యొక్క ఆయోదధైమ్యుడు అనే శిష్యుడు.

ఉతక్రీశము
సం., నా. వా., అ., పుం., తత్స., = కురరీ అను పక్షి, ఇది జలమునందు సంచరించు పక్షులలో ఒకటి, ఇది సమూహముగానే తిరుగును, ఇది బిగ్గరగా అరుచునది, ఉత్క్రోశపక్షులు సంచరించే ప్రాంతము.

ఉతథ్యానుజుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = బృహస్పతి అన్న.

ఉతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఊతము, నేసినది, ప్రశ్నను, వికల్పమును, అంగీకారమును తెల్పునది, పాదపూరణము.
వ్యుత్పత్త్యర్థము :
ఊయతే స్మ ఉతం. కూర్చపడినది.


ఉతయ్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= అంగీరసుని కొడుకు, బృహస్పతి అన్న, గురువుయొక్క పెద్ద అన్నయ్య

ఉతాక్షుద్వల
సం., నా. వా., అ., పుం., తత్స.,= కాఠిన్యము, కఠినుడు.

ఉతాహో
సం., అవ్య., తత్స., = వికల్పము, సందేహము, ఉతాహస్వితము, పరిప్రశ్నము, విచారము, లేక.

ఉత్ క్రమ
సం., నా. వా., అ., పుం., తత్స., = మరణము

ఉత్ క్రమణము
సం., వి., అ., న., తత్స.,= మీదికిపోవుట, అపసరణము, తొలగిపోవడము.

ఉత్ క్రమణీయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= అతిక్రమణీయము.

ఉత్ క్రమము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వ్యుత్ క్రమము, విపరీతక్రమము, ఊర్ధ్వగతి, వెలుపలికి పోవుట, మీదికి పోవుట, క్రమము తప్పుట, అతిక్రమించుట, మరణించుట, మరణము.

ఉత్ క్రాంతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అపసరణము, మరణము, మృతము, అపశృతి.

ఉత్ క్రోశ
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆక్రోశము. కురరపక్షి,

ఉత్ క్రోశము
సం., వి., అ., పుం., తత్స.,=లకుముకిపిట్ట, గోరువంక, పెన్నడపులుగు.

ఉత్ క్షిప్తము
సం., వి., (అ. ఆ. అ)., తత్స., = ఉమ్మెత్త.; విణ. ఎగజిమ్మిన, పైకెత్తిన, తొలగించిన.
పర్యాయపదాలు :
ఎగజిమ్మబడినది, పైకెత్తబడినది, తొలగింపబడినది, నిరసింపబడినది, ఆక్రమింపబడినది, ఆవరింపబడినది.


ఉత్ క్షిప్తిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఉమ్మెత్తపూవువంటి ఒకానొక చెవి ఆభరణము.

ఉత్ క్షిప్తికా
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = కర్ణాభరణము.

ఉత్ క్షేపకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = దొంగ, త్రోసిపుచ్చుట, పంపుట, డోకు, కణతలమీది ప్రదేశములు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం ప్రక్షేపకే. ఎగజిమ్మువాడు. ఉత్ క్షేప్యాపహారకే చౌరే చ. వస్త్రాదులను దొంగిలించు దొంగ.


ఉత్ క్షేపణము
సం., నా. వా., అ., న., తత్స.,= డోకుట, ధాన్యమును ఎగురపోయు గంప, పైకెత్తుట, పంపుట, ధాన్యమును రాలగొట్టుబడిత, 16 పణములమానము, వ్యజనము.

ఉత్ క్షేపము
సం., వి., అ., పుం., తత్స., = ఎగజిమ్ముట, ఎగజిమ్మునది, ఎగురవేయుట, త్రోసిపుచ్చుట, పంపుట, డోకు, కణతలమీది ప్రదేశములు.

ఉత్ ప్రేరకము
వి., = తాను మార్పు చెందకుండా పదార్ధాల మధ్య రసాయనచర్యకు ప్రేరేపించే పదార్థము, శారీరకంగా కృత్రిమ ఉత్సాహాన్నీ శక్తినీ ఇచ్చే మందు.

ఉత్
సం., అవ్య., తత్స., = ప్రశ్నయందు, వితర్కముయందు, సంశయమునందు, అత్యర్థమునందు, ఉదయించుటయందు,ఊర్ధ్వమునందు.

ఉత్కంఠ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఇష్టవస్తు ప్రాప్తియందలి వేగిరపాటు.
నానార్థాలు :
తహతహ, ఉద్గతమైన శోకము, వేడుక, ఉత్కలిక, చింత, విరహాదులవలన విచారము, ఒకానొకరతి బంధము, ఉత్కంఠ. ఇష్టలాభము, కాలక్షేపసహిష్ణుత్వము, కోరిక వలన కలిగిన స్మృతి.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్కంఠ్యతే ఉత్కంఠా. ఇష్టవస్తు ప్రాప్తియందలి వేగిరపాటు.


ఉత్కంఠము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒకానొకరతిబంధము, కంఠము పైకెత్తినది.

ఉత్కంఠితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉత్కము, ఉత్సుకము, ఉన్మనము, ఉత్కంఠాయుక్తము, ఉచ్చుకము.

ఉత్కంధరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఎత్తైనకంఠము.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతః కంధరోఽస్య. పెద్ద కంఠము వీనికి కలదు.


ఉత్కంపము
సం., నా. వా., అ., పుం., తత్స., = వణకునది, వణికించునది, వి., వణకు. వణకు.; విణ. వణికే.

ఉత్కంపి
సం., విణ., (న్. ఈ. న్.)., తత్స., = వణుకునది, వణుకించునది.

ఉత్కంపించు
సం., అ., క్రి., = ఆకంపించు, వణకు.

ఉత్కచము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉన్నతమైన కేశములు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతః ఉన్నతో కచోఽస్య. ఉన్నతమైన కేశములు కలది(కలవాడు).


ఉత్కటము
సం., వి., అ., పుం., న., తత్స., = లవంగపు పట్ట.; విణ. అధికమైనది, మదించినది, తీవ్రము, విషమము.
నానార్థాలు :
వాసనగల తృణము, నాగదంతకము, శొంఠి, పిప్పలి, మిరియాలు, గర్వి, త్రాగుబోతు, పెద్దది, ఉగ్రము, బలము కలది, మదపుటేనుగు, ఎర్ర చెరుకు (వృ.వి), శరీరము, రెల్లు (వృ.వి). త్వక్పత్త్రము, ఆకుపత్రి (వృ.వి), మత్తుడు.

వ్యుత్పత్త్యర్థము :
అతితీక్షద్వాదుత్కటం. మిక్కిలి తీక్షణమైనది. ఉద్రిక్తః ఉత్కటః. మదోద్రేకముకలవాడు.


ఉత్కతము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ఉత్సుకత.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కం తనోతి, ఉత్సుకతాయామ్. ఉత్సుకత కలిగియుండుట.


ఉత్కము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కుతూహలము కలది, ఉవ్విళ్లూరునది, ఉత్కంఠ కలది, విమనస్కుడు, అన్యమనస్కుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతం మనో యస్య సః ఉత్కః. ప్రియవస్తువు నందు ఎక్కువ మనస్సు కలవాడు.


ఉత్కరము
సం., వి., అ., పుం., తత్స.,= సమూహము, రాశి.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కీర్యతే ఇతి ఉత్కరః. పొడవగునది.

నానార్థాలు :
చెత్త, చేను, ధాన్యము మొదలైనవి, స్తూపము, గుంపు, ప్రోగు, కసువు ఊడ్చుట, తుడవబడిన ధూళి, ధాన్యరాశి, ప్రసారణము, తూర్పారబట్టుట.


ఉత్కరాది
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= చతుర్థీవిభక్తియందు.

ఉత్కరిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= పాలు, నేయి, బెల్లపుపాకము చేర్చి చేసెడు ఒకానొక తియ్యని భక్ష్యము.

ఉత్కర్ణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., =నిక్కిన చెవులు కలది.

ఉత్కర్తనము
సం., నా. వా., అ., న., తత్స., = తెంపుట, చేదనము, పీకటము, పెల్లగించటము.

ఉత్కర్షకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= గొప్పతనమును కలిగించునది, ఊట చెఱకునది, మీదికి లాగునది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కర్షయతి. అతిశయింపజేయునది.


ఉత్కర్షణము
సం., నా. వా., అ., పుం., తత్స., =దున్నుట.

ఉత్కర్షము
సం., వి., అ., పుం., తత్స., = శ్రైష్ఠ్యము.
పర్యాయపదాలు :
మేలు, ప్రాధాన్యము, సుఖము, ఊడ బెఱుకునది, మీదికిలాగునది, అతిశయయుక్తము, పైకిలాగుట, గొప్పతనము, శ్రేష్ఠత్వము, అతిశయింప చేయునది, గొప్పతనమును కలిగించునది.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్ ఊర్ధ్వం కర్షణముత్కర్షః. ఉన్నతముగాఁపొందించుట.


ఉత్కర్షి
సం., విణ., (న్. ఈ. న్)., తత్స.,= ఊడబెఱుకునది, మీదికిలాగునది, అతిశయింప చేయునది, గొప్పతనమును కలిగించునది.

ఉత్కలము
సం., వి., అ., పుం., తత్స.,= దేశవిశేషము.

ఉత్కలిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఉత్కంఠ.
నానార్థాలు :
పెద్ద అల, హేల, పెద్దకెరటము, తరంగము, ఉత్సుకత, ఔత్సుక్యము, వేడుక, తహతహ, కామాదులవలన కలుగు స్మరణము, కలిక, మొగ్గ, విలాసము.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్కల్యతే ఉత్కలికా. ఉద్గతమైన సంఖ్యకలిగినది.


ఉత్కలికాప్రాయము
సం., నా. వా., అ., న., తత్స., = సమాసములతోను కటువైన అక్షరములతో కూడిన గద్యభేదము.

ఉత్కలితము
సం., నా. వా.,(అ.ఆ.అ.)., తత్స., = ఉద్గ్రథితే

ఉత్కలుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ధురీణుడు, నిర్వాహకుడు, భార వాహకుడు, ఓఢ్రదేశస్థుడు, వ్యాధుడు, బోయవాడు, సుద్యుమ్నపుత్రుడు, ద్రువసత్రభేదము, విప్రుడు.

ఉత్కాకము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ప్రతి సంవత్సరం ఈనేడి ఆవు.

ఉత్కాకుదము
సం., విణ., (ద్. ఈ. ద్)., తత్స., = ఉన్నత తాలుకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతం కాకుదమస్య. పెద్ద దవుడ కల.


ఉత్కాప్తిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = కర్ణాభరణము (చెవిపోగు)

ఉత్కారము
సం., వి., అ., పుం., తత్స.,= ధాన్యము తూర్పెత్తుట, ప్రోగు చేయుట, తూర్పారబట్టుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కరణముత్కారః. మీఁదికిచల్లుట.


ఉత్కారిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = రొట్టె, వాపు మొదలగునవి తగ్గుటకు కట్టెడిపిండి మొదలగునవి.

ఉత్కారుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ధాన్యమును చల్లువాడు.

ఉత్కార్ణము
సం., నా. వా., అ., పుం., తత్స., = త్రవ్విన ఊట.

ఉత్కార్తనము
సం., నా. వా., అ., పుం., తత్స., = గట్టిగాపలుకుట, చాటుట.

ఉత్కార్తితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= గట్టిగా ఉచ్చరింపబడినది, చాటబడినది, పొగడబడినది.

ఉత్కాశనము
సం., నా. వా., అ., న., తత్స., = ఉత్తరువు చేయుట, ఆజ్ఞాపించుట.

ఉత్కాసనము
సం., నా. వా., అ., న., తత్స., = లోపలశ్లేష్మమును బయటకుక్కుట.

ఉత్కాసిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ఒక రోగము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కమూర్దజలమస్యతి. లోపలశ్లేష్మమును బయిటకు కక్కుట.


ఉత్కాసుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక ఋషి.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కమస్యతి. లోపల శ్లేష్మమును బయటకు కక్కుట.


ఉత్కిరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చిమ్మునది, వ్యాపింపచేయునది.

ఉత్కీర్ణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= చిమ్మబడినది, చెక్కబడినది, గీయబడినది, లిఖించబడినది, త్రవ్విన ఊట.

ఉత్కీర్తనము
సం., నా. వా., అ., న., తత్స., = చాటుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చైః కీర్తనమ్. గట్టిగాపలుకుట. గట్టిగా పాడుట.


ఉత్కీర్తితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = గట్టిగా ఉచ్చరింపబడినది, చాటబడినది, పొగడబడినది.

ఉత్కీలితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= మేకులు తీసి తెరవబడునది.

ఉత్కుటము
సం., నా. వా., అ., న., తత్స., = గొడుగు.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతం కుటో యత్ర.


ఉత్కుణము
సం., నా. వా., అ., పుం., తత్స., = నల్లి, పేను.

ఉత్కులుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= కులభ్రష్టుడు, కులమర్యాదను దాటినవాడు.

ఉత్కూజము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కోయిల మొదలుగువాటి కూత.

ఉత్కూటము
సం., నా. వా., అ., పుం., తత్స., = గొడుగు.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతం కూటమస్య ఛత్రే. ఎత్తైన కూటము కలిగినది. (గొడుగు)


ఉత్కూర్దనము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పైకి దూకుట.

ఉత్కూలము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = గట్టుదాటి ప్రవహించునది. (నది మొదలగునవి) కూలమును (గట్టును) పొందినది.

ఉత్కూలితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= గట్టునకు చేర్చబడినది.

ఉత్కృతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = గొప్పపని, ఉద్గ్రంధము, ఛంద విశేషము 26 అక్షరములు.

ఉత్కృత్యము
సం., అవ్య., తత్స.,= ఛేదించటము.
వ్యుత్పత్త్యర్థము :
(1)ఉత్కర్తనం కృత్వేత్యర్థే. (2)ఉత్కర్తనీయే ఛేదనీయే. ఛేదించుట అను అర్థమునందు.


ఉత్కృష్టభూమము
సం., నా. వా., అ., పుం., తత్స.,= గొప్ప భూమి.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కృష్టా భూమిర్యత్ర. ప్రశస్తమైన భూమి యందు.


ఉత్కృష్టము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= శ్రేష్ఠము, మేలయినది, గట్టిగా ఏడవడం, ప్రశస్తము, ఉత్తమము, ఉత్కర్షాన్వితము, కర్షణయుక్తము.

ఉత్కోచకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= లంచము, హారము, గ్రాహ్యము, అయనము, ఉపధానికము, అప్రధానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్కోచే ఉత్కోచద్రవ్యగ్రహణే ప్రసృతః. (1)ఉత్కోచగ్రాహిణి (2)ధౌమ్యాశ్రమాంతికే తీర్థభేదే.


ఉత్కోచకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= లంచగొండి.

ఉత్కోచము
సం., వి., అ., పుం., తత్స., = లంచము.
నానార్థాలు :
హరము, గ్రాహ్యము, అయనము, ఉపదానకము, అప్రధానము. ప్రాభృతము, ఢౌకనము, లంబా, కోశలికము, ఆమిషము, ఉపాచ్చారము, ప్రద, ఆననంద, హారము.


ఉత్క్లేది
సం., విణ., (న్. ఈ. న్)., తత్స.,= తడియునది, తడుపునది, తడియుట.

ఉత్క్లేశకము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = క్లేశమును కలిగించునది, అగ్నిప్రకృతికల కీటభేదము.

ఉత్క్లేశము
సం., నా. వా., అ., పుం., తత్స., = మనస్సునందలి కలత, వ్యథ, ఊర్థ్వగతమగువాయువుచే కలుగురోగభేదము.

ఉత్ఖచితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= రచితము, తాపబడినది, గ్రథితము, గ్రువ్వబడినది. ఖటితము.

ఉత్ఖల
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = మున అనెడి గంథద్రవ్యము (వృ.వి).

ఉత్ఖాతకేళి(లి)
సం., నా. వా., ఇ., పుం., తత్స., = వప్రక్రీడ, ఏనుగులు మొదలగునవి దంతములు మొదలగువానితో కోరాడుట.

ఉత్ఖాతము
సం., వి., అ., న., తత్స., =గజక్రీడ, విషమస్థలము, త్రవ్వబడినది, పెల్లగింపబడినది, తుదముట్టినాశనముసేయ బడినది, ఉన్నూలితము త్రవ్వుట, ప్రాణాయామకాలము.

ఉత్ఖాయము
సం., అవ్య., తత్స.,= విరవబడినది.

ఉత్ఖే(త)దము
సం., నా. వా., అ., పుం., తత్స., = దుఃఖము.

ఉత్త(రో)రౌష్ఠము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పై పెదవి.

ఉత్తంభకుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= నిలుపువాడు, ఆపువాడు.

ఉత్తంభనము
సం., వి., అ., న., తత్స.,= నిలుపుట, పొడిగించుట, ఆధారము, ప్రాపు, ఊత, ఆపుట, వృద్ధి చేయుట.

ఉత్తంభనీయము
సం., నా. వా., అ., న., తత్స.,= ప్రాపుదగినది, ఊతదగినది, ఆపదగినది, వృద్ధిచేయదగినది, నిలుపదగినది.

ఉత్తంభమానము
సం., నా. వా., అ., న., తత్స.,= నిలుచుచున్నది, ఆగుచున్నది.

ఉత్తంభము
సం., నా. వా., అ., న., తత్స.,= ఆధారము, ప్రాపు, ఊత, ఆపుట, వృద్ధి చేయుట.

ఉత్తంభము
సం., నా. వా., అ., పుం., తత్స., = (థామా) ఆధారము, ప్రాపు, ఊత, ఆపుట, వృద్ధిచేయుట.

ఉత్తంభించు
సం., స., క్రి., = నిలుపు, పొడిగించు.

ఉత్తంభితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= నిలుపబడినది, పొడిగింపఁబడినది. వహింపబడినది, వృద్ధిపరుపబడినది, ఆపబడినది, నిలుపువాడు, ఆపువాడు.

ఉత్తంభితవ్యము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = నిలుపబడవలసినది, నిలుపబడదగినది, ఆపబడవలసినది, ఆపబడదగినది.

ఉత్తంభ్యమానము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,=నిలుపబడుచున్నది, ఆపబడుచున్నది.

ఉత్తంస(శ)ము
సం., వి., అ., పుం., న., తత్స.,= సిగబంతి, పూగమ్మ, శిరోమాల్యము, కర్ణభూషణము, చెవులకి ధరించే ఆభరణము, శేఖరడు, శిరోభూషణము, కర్ణపూరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తంస్యతే అవతంస్యతే చానేనేతి ఉత్తంసః. దీనిచేత అలంకరింపఁబడును.


ఉత్తకచ్ఛదము
సం., నా. వా., అ ., న., తత్స., = పెద్దదైన కప్పుకొనువస్త్రము, దుప్పటి.

ఉత్తటము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., =
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రాంతం తటమ్ అత్యా త. తట పర్యంతాప్లావకము.


ఉత్తప్తము
సం., వి., (అ.ఆ.అ.)., న., తత్స. = ఎండిన మాంసము.; విణ. కదలినది, కాచబడినది, సంతప్తము, స్తాతము, ఉత్తాపనము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వం తప్యతే అగ్నినా ఆతపేన వా ఉత్తప్తం. అగ్నిచేతగాని ఎండచేతగాని పొడవునకాల్పబడునది.


ఉత్తబ్ధము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = ఊర్ధ్వస్తబ్ధము, ఊర్ధావస్థితము.

ఉత్తమ
సం., విణ., (అ.ఆ.అ)., తత్స., = ముఖ్యము, కడపటిది, ప్రధానము, ప్రముఖము, శ్రేష్ఠుడు, చివరిది, భద్రము, ఉత్కృష్టము, ప్రవేకము, అనుత్తమము, వర్యము, వరేణ్యము, ప్రవర్హము, పరార్ధ్యము, అగ్రము, ప్రాగ్రహరము, ప్రాగ్ర్యము, అగ్రీయము, ముఖము, అగ్రణి, శ్రేష్ఠమైనది, గొప్పది, అనవరార్ధ్యము, అగ్ర్యము, అగ్రియము, ప్రధానుడు.
వ్యుత్పత్త్యర్థము :
అతి శయేన ఉత్కృష్టః ఉత్తమః. మిక్కిలి ఉత్కష్టమైనవాడు.
ఉత్తమురాలు, చిఱుపాల.; విణ. ముఖ్యము, (వ్యాకరణమునందు)కడపటిది, ఒక విధమైన పొక్కు.
వ్యుత్పత్త్యర్థము :
రూపశీలాదిభిరుత్కృష్టత్వాదుత్తమా. రూపశీలాదుల చేత ఉత్కృష్టయైనది.
పెద్ద పొట్ల.

ఉత్తమపురుషము
సం., నా. వా., అ ., పుం., తత్స., = ప్రథమ మధ్యమోత్తమ పురుషములలో చివరిది, నేను, మేము, మనము కర్తగా కల క్రియారూపము.

ఉత్తమఫలిని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = దుగ్ధిక, చిఱుపాల మొక్క.

ఉత్తమర్ణుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = అప్పిచ్చినవాఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపచయహేతుతయా ఉత్తమం ఋణం యస్య స ఉత్తమర్ణః. ఉత్తమమైన ఋణము కలవాఁడు.


ఉత్తమశాఖ
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉత్తమశాఖీయము. (ఉత్తమా ఉత్కృష్టా శాఖాఽస్య.)

ఉత్తమశ్లోకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= పుణ్యకీర్తికల్గిన శ్లోకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తమః శ్లోకః చరితం యస్య. ఉత్తమమైనకావ్యమందు శ్లోకము.


ఉత్తమసము
సం., నా. వా., (స్. ఈ. స్)., తత్స., = ఉల్లంఘితం తమో యేన. ఉల్లజ్ఞితమస్కము, తమో అతీతము.

ఉత్తమసాహసము
సం., నా. వా., అ., పుం., తత్స.,= అపరాథమునకు విధించు దండగజుల్మాద్రాలలో (1000 పణములని కొందరు, 8000 పణములని కొందరు) శిరచ్ఛేదనము మొదలగు పెద్దదండనము, ఎక్కువ జరిమానా.

ఉత్తమస్త్రీసంగ్రహణము
సం., నా. వా., అ., న., తత్స., = స్మృత్యుక్తే పరస్త్రియాముత్తమే మిథునాభావాయ ప్రవృత్తిరూపవ్యాపారభేదే.

ఉత్తమాంగము
సం., వి., అ., న., తత్స., = ఉత్తమమైన అంగము, శిరము, తల, ముఖము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తమం ప్రశస్తమంగమితి ఉత్తమాంగం. ప్రశస్తమైన అవయవము.

నానార్థాలు :
ఉత్తరపు దిక్కు, మీదిది, అనంతరము, ఎడమది, ముఖ్యము, అధికము, ఎక్కువ, భవిష్యత్కాలము, రాగల కాలము, అనంతర ప్రదేశము, తర్వాతి చోటు, ప్రతివాదము, ఊర్ధ్వభాగము, దాపలి ప్రక్క, దాటుట, ఉల్లంఘనము.


ఉత్తమాంగుడు
వి., = యోగ్యుడు, మంచి ముఖం గలవాడు.

ఉత్తమాంభసము
సం., నా. వా., స్., న., తత్స.,= సాంఖ్య శాస్త్రమందు తొమ్మిది రకములైన తుష్టి భేదములో నొకటి.

ఉత్తమాట
వి., = అసత్యము.

ఉత్తమాయ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉత్తమీకృతము.

ఉత్తమారణి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= ఇందీవరము, పిల్లపీచర (వృ.వి).

ఉత్తమీయము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉత్తమమైన దానికి సంబంధించినది.

ఉత్తము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = తేమకలది, ఉన్నము, ఆర్ద్రము, తడిసినది.

ఉత్తముడు
వి., = శ్రేష్ఠుడు.

ఉత్తమోఖ్కాత
సం., నా. వా., అ., పుం., తత్స., =ప్రాణాయామములోని కాలము.

ఉత్తమోత్ఖాత
ప్రాణాయామములోని కాలము

ఉత్తమోత్తమికము
సం., నా. వా., అ., న., తత్స., = నాటకములోని పద్యసంభాషణము.

ఉత్తమౌజసుడు
సం., నా. వా., (స్. ఈ. స్.)., తత్స., = పదవమనువు పుత్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తమమోజో యస్య. ఉత్తమమైన ఓజస్సు కలవాడు.


ఉత్తర
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉత్తరదిక్కు.
నానార్థాలు :
ఉత్తమము, ప్రధానము, శ్రేష్ఠము, అనంతరము, ఊర్ధ్వము, విరాటరాజపుత్రుడు, పర్వతప్రభేదము, శివుడు, హరి, సమాధానము, జవాబు, ప్రతివాక్యము.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరంత్యనేన చోద్యమిత్యుత్తరం. అడిగిన శంకను దీనిచేత దాఁటుదురు.
నక్షత్ర విశేషము, ఉత్తరపుదిక్కు, విరాటరాజు కూతురు, అభిమన్యుని భార్య, పరీక్షిత్తు తల్లి.; అ.న.ము. ఒక అర్థాలంకారము, మారుమాట.; విణ. ఉత్తరపుదిక్కుది, మీదిది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరతి మేర్వాదిభ్య ఇత్యుత్తరా. మేర్వాదులను దాటి ఉండునది.

నానార్థాలు :
సమాధానము, ప్రతివాదిజవాబు, అగ్నిద్రుపదపుత్రుడు, ధనుర్లక్ష్మి, శ్రేష్ఠము, ఎత్తైనది, కావేరి, దేవి.


ఉత్తరంగము
సం., వి., అ., న., తత్స., = కడపకుసరిమీదికమ్మి, లేచునట్టి అలలు గలది, లేచినట్టి తరంగము కలది, తటాలున ఎగిరి పడునది, చపలము, ద్వారముమీది కమ్మి.

ఉత్తరకాండము
సం., నా. వా., అ., న., తత్స., = వాల్మీకి రామాయణమునందలి ఏడవకాండము.

ఉత్తరకాయము
సం., నా. వా., అ., పుం.,తత్స., = శరీరము యొక్క ఊర్ధ్వభాగము. (శిరస్సు,తల)

ఉత్తరకాలము
సం., నా. వా., అ., పుం., తత్స.,= గౌణకాలము, దినకాలము.

ఉత్తరకుమారప్రజ్ఞలు
వి.,బహు., =వట్టిడంబాలు, ప్రగల్భాలు, కోతలు.

ఉత్తరకురు
సం., నా. వా., ఉ., పుం., తత్స.,= తొమ్మిది వర్షముల భారత దేశము (జంబూద్వీపము) యొక్క వర్షభేదము.

ఉత్తరకోశల
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= అయోధ్య అను నగరమందు.

ఉత్తరక్రియ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పిదపచేయదగినకార్యము, మృతులను ఉద్దేశించి చేయబడు కర్మము, అపరకర్మము, వర్షికముగాచేయు పితృకర్మము.

ఉత్తరగతి
వి., = ఊర్ధ్వలోకము.

ఉత్తరచ్ఛదము
సం., నా. వా., అ., పుం., తత్స., = పెద్దదైన కప్పుకొనువస్త్రము, దుప్పటి.

ఉత్తరజ్యోతిషము
సం., నా. వా., అ., పుం., తత్స., = నకుల ప్రతీచీ విజయము.

ఉత్తరణము
సం., వి., అ., న., తత్స., = దాటునది, కడచునది, దాటుట, ఆవలిగట్టు చేరుట.

ఉత్తరతంత్రము
సం., నా. వా., అ., న., తత్స., = సుశ్రుతాంతర్గత గ్రంథభేదము.

ఉత్తరతసము
సం.,అవ్య., తత్స.,

ఉత్తరదాయకుడు
వి., = జవాబుదారీ, జవాబుచెప్పేవాడు, బదులు చెప్పె వ్యక్తి.

ఉత్తరదాయకుడు
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = జవాబు చెప్పువాడు, ఎదురాడువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరం దదాతి. సమాధానము చెప్పుట.


ఉత్తరదిక్కాలము
సం., నా. వా., అ., పుం., తత్స.,

ఉత్తరదిక్పాశము
సం., నా. వా., అ., పుం., తత్స.,

ఉత్తరదిక్శూల
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉత్తరపల్గునీ నక్షత్రమందు, ఋధవారము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరదిశి శులమివాస్త్యస్య. ఉత్తరదిశియాత్రయందు.


ఉత్తరదిగీశుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= "ఇంద్రోవహ్నిపితృపతిర్నైఋతో వరుణో మరుత్. కుబేర ఈశః పతయః పూర్వాదీనాం దిశాం క్రమాత్" ఇత్యుక్తే (1)కుబేరే ఉత్తరదిక్పాలాదయోఽప్యత్ర. (2)బుధే ఏతచ్చ (3)కర్కటవృశ్చికమీనేషు రాశిషు తేషు లగ్నేషు తత్స్థే చంద్రే చ ఉత్తరదిగ్గమనం శస్తమిత్యపి బోధ్యమ్.

ఉత్తరదిగ్ద్వారము
సం., నా. వా., అ., న., తత్స., = ఉత్తరముఖద్వారము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరదిశి ద్వారం ముఖమస్య. ఉత్తరదిశలో ముఖము కల ద్వారము.


ఉత్తరదిగ్బలినుడు
సం., నా. వా., న్., పుం., తత్స.,= శుక్రుడు, చంద్రుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరస్యాం దిశి బలీ. ఉత్తరదిశయందు బలవంతుడు.


ఉత్తరదోఃకరము
సం., వి., అ., న., తత్స., = ఉత్తరడొక్కరము, మల్లబంధవిశేషము.
ప్రయోగము :
గ్రీవాయాశ్చ భుజాయాశ్చ పాదేనాక్రమణేసతి,
అన్యజా న్వవబంధేన కుర్యాదుత్తరదోఃకర మ్. అని శివతత్త్వరత్నాకరము.


ఉత్తరపక్షము
సం., వి., అ., పుం., తత్స., = సిద్ధాంతము, కృష్ణపక్షము, వాదమందు సిద్ధాంత పక్షము.

ఉత్తరపటము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉత్తరీయము, శయ్యపైన పరచువస్త్రము.

ఉత్తరపథము
సం., నా. వా., అ., పుం., తత్స., = తరువాత మార్గము, అవ్యవహిత మార్గము.

ఉత్తరపథికుడు
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉత్తరదేశము పోవువాడు.

ఉత్తరపదం
వి= తరువాతి మాట, సమాసంలో చివరిమాట.

ఉత్తరపదము
సం., నా. వా., అ., న., తత్స., = ముందు మాట, సమానయోగ్యమైన పదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరముత్తరవర్తి పదమ్. తర్వాతి మాట. సమాసచరమావయవపదే. స్వోత్తరవర్తిపదే చ. సమాసయోగ్యే పదే చ. సమాసమునందు చివరియవయవమగు పదము.


ఉత్తరపశ్చిమ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = వాయువ్యదిక్కు, ప్రతివాది ఉత్తరము, వ్యాజ్యము తెచ్చుట, ప్రతివాది యొక్క సమాధానము, సాక్ష్యము మొదలగునవి వినుట, నిర్ణయము, తీర్పు అని వ్యవహారమునకు నాలుగు పాదములు,
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరాస్యాః పశ్చిమాయా అంతరాలా దిగ్ దిక్స. ఉత్తరపశ్చిమదిక్కు మధ్యనుండు దిక్కు.


ఉత్తరపాటు
వి., = రక్తప్రవాహము, వీరమరణం చెందిన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే భరణము.

ఉత్తరపాదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ప్రతివాది ఉత్తరము, ప్రతివాది యొక్క సమాధానం, సాక్ష్యము మొదలగునవి ఎనుట, నిర్ణయము, తీర్పు అని వ్యవహరమునకు నాలుగు పాదములు, వ్యాజము తెచ్చుట.

ఉత్తరపురస్తాత్
సం., అవ్య., తత్స.,= ఈశాన్యదిశ.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరస్యాః పూర్వస్యా. ఉత్తర పూర్వదిశల మధ్యనున్న దిక్కు.


ఉత్తరపూర్వ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఈశాన్యదిశ.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరస్యాః పూర్వస్యా దిశో. ఉత్తర పూర్వదిశల మధ్యనున్న దిక్కు.


ఉత్తరప్రత్యుత్తరము
సం., నా. వా., అ., న., తత్స., = లేఖప్రతిలేఖములు (జాబు జవాబులు).

ఉత్తరప్రత్యుత్తరాలు
వి., బహు., = జాబులూ జవాబులూ.

ఉత్తరఫల్గుని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = అశ్విని మొదలగు వానిలో 12వ నక్షత్రము.

ఉత్తరభద్రపద
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= అశ్విని మొదలగువానిలో 26వ నక్షత్రము.

ఉత్తరమాడు
అ., క్రి., = బదులుపలుకు.

ఉత్తరమానసము
సం., నా. వా., అ., న., తత్స., = తీర్థభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరముత్తరస్థం మానసమ్. గయలో ఉత్తరదిక్కున తీర్థభేదము.


ఉత్తరమీమాంస
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= శారీరకసూత్రగ్రంథము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరస్య వేదశేషభాగస్య ఉపనిషద్రూపస్య మీమాంసా. వేదోత్తరభాగమైన ఉపనిషత్తుల విచారము.

మాట - మంతి :
ఇది వేదవ్యాసరచితము దీనికి వేదాంతశాస్త్రమనియుపేరు. ఇది వేదాంతమందలి జ్ఞానకాండమునకు సంభంధించినది. కర్మాకాండమునకు సంబంధించినది పూర్వమీమాంస అనియు జ్ఞానకాండమునకు సంభంధించినది ఉత్తరమీమాంస అనియు చెప్పబడును. దీనిని బట్టియె ఇది ఉత్తరమీమాంస అనబడును.


ఉత్తరము
వి.,= జాబు, లేఖ, జవాబు, సమాధానము, ప్రతివాదము, దక్షిణానికి ఎదురుగా ఉన్న దిక్కు.

ఉత్తరరామచరితము
సం., నా. వా., అ., న., తత్స.,= భవభూతియను కవి రచించిన ఒక సంస్కృతనాటకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరం రామస్య చరితం యత్ర. ఇది ఉత్తరరామాయణకథను తెలుపును.


ఉత్తరవయస్కుడు
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= వృద్ధుడు, ముసలివాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరం వయః. వయస్సు పెరిగినవాడు.


ఉత్తరవయస్సు
వి.,= వార్ధకము, ముసలితనము, ముదిమి.

ఉత్తరవస్తి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఒక విధమైన చిన్న చిమ్మన గ్రోవి, మూత్ర, పురీషద్వారముల నుండి నీరు మున్నగు వానిని ఎక్కించుటకు ఉపయోగించు సాధనము.

ఉత్తరవస్త్రము
వి., = ఉత్తరీయము, పై బట్ట.

ఉత్తరవాదం
వి.,= బాధ్యత.

ఉత్తరవాది
సం., నా. వా., (న్. ఈ. న్)., తత్స.,= సమాధానము చెప్పువాడు, ప్రతివాది. వి., సమాధానము చెప్పే వ్యక్తి, ప్రతివాది.

ఉత్తరవాసము
సం., వి., స్., న., తత్స., = ఉత్తరీయము, పై బట్ట.
ప్రయోగము :
సీ. చంద్రాతమపుతోడ సరియైన వెలిపట్టుపుట్టముత్తరవాసముగధరించి. నై.8, ఆ.


ఉత్తరవేది
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = కురుక్షేత్రమునందలి ఒకానొక తీర్థము, యజ్ఞమునందు అగ్ని స్థాపనార్థమై ఉత్తరదిక్కున వేసిన వేది.

ఉత్తరశలంకటుడు
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = ఉత్తరశాల గోత్రమందు పుట్టినవాడు.

ఉత్తరసక్థము
సం., నా. వా., అ., న., తత్స., = ఎడమతొడ.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరః సథ్వః.


ఉత్తరసాక్షి
సం., వి., (న్.ఈ.న్.)., తత్స., = సాక్షులగుటకు సాక్షి, సాక్షులు చెప్పిన విషయమును తాను విన్నదాన్ని బట్టి ధ్రువపరుచు సాక్షి, మోపిన నేరమును పరిహరించుకొనుటకు ముద్దాయి తెచ్చుకొను సాక్షి.

ఉత్తరసాధకము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= సహాయమునందు సహకారిది.

ఉత్తరస్ఫుటితము
సం., నా. వా., అ., న., తత్స., = యోని యందు చేయుచుంబనము.

ఉత్తరాంగము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ద్వారముమీది బల్ల.

ఉత్తరాత్తాత్
సం., అవ్య., తత్స., = ఉత్తరాది అర్థమునందు.

ఉత్తరాత్రయి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అను నక్షత్ర త్రయము.

ఉత్తరాది
వి., = ఉత్తరదిక్కుప్రాంతము.

ఉత్తరాధరము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= పై పెదవి.

ఉత్తరాధికారము
వి., = తరువాతి వారసత్వము.

ఉత్తరాధికారి
సం., నా. వా.,(న్. ఈ. న్)., తత్స., = ఆగామి అధికారి, వారసుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరం పూర్వస్వామిస్వత్వోపరమానంతరమధికరోతి. పూర్వపు యజమాని అనంతరము అధికారము పొందువాడు.


ఉత్తరాపథం
వి.,= భారతదేశంలో ఉత్తరప్రాంతము.

ఉత్తరాపథము
సం., నా. వా., అ., పుం., తత్స.,= దేశభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరస్యాం దిశి స్థితే పథి. ఉత్తరదిశ ఉన్న మార్గము.


ఉత్తరాపరము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= వాయువ్యదిక్కు.

ఉత్తరాభాసము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉత్తర శబ్దము.

ఉత్తరామ్
సం., అవ్వ., తత్స., = పైకి త్రిప్పబడిన గుడ్లుకలది (కన్ను) మిక్కుటమైన ధ్వని కలది. ఉల్లంఘనము, దాటుట, పారనయనము, గట్టెక్కించుట, ఆవలిగట్టునకు తీసుకుపోవుట, ఉద్వమనము, వాంతి.

ఉత్తరాయణము
సం., నా. వా., అ., న., తత్స.,= సూర్యుడు ఉత్తర వైపు పోవు ఆరునెలలకాలము, మకర సంక్రాంతి మొదలు కర్కట సంక్రాంతి వరకు గల కాలము, ఒక అయనము.

ఉత్తరార్కము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కాశీలో ఉత్తరదిక్కున అర్కకుండము సన్నిథి యందు, సూర్యమూర్తిభేదము.

ఉత్తరార్ధము
సం., నా. వా., అ., న., తత్స., = దేహము యొక్క మీది భాగము, (గ్రంధాదులు) దేహము యొక్క రెండవసగము, (ఉత్కృష్టమర్దమ్.) ఉత్తరమువైపునకల భాగము.

ఉత్తరాశ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ఉత్తరదిక్కు.

ఉత్తరాశాపతి
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= కుబేరుడు.

ఉత్తరాశ్మనము
సం., నా. వా., న్., పుం., తత్స.,= (1)ఉత్తరప్రసిద్ధప్రస్తరభేదే తతః ఋశ్యా . ఉత్తరాశ్మక (2)తత్సన్నిహితదేశాదౌ

ఉత్తరాషాఢ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= అశ్వనీ నక్షత్రములలో ఇరువది యొకటవ నక్షత్రము.

ఉత్తరాసంగము
సం., వి., అ., పుం., తత్స.,= ఉత్తరీయము.
నానార్థాలు :
ఉత్తరదిక్కు, ఉత్తరీయవస్త్రము, ప్రావారము, ఉత్తరాసంగము, బృహతికా, సంవ్యానము, కక్ష.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరే ఊర్ధ్వాంగే ఆసజ్యత ఇతి ఉత్తరాసంగః. మీదఅవయవమందు పొందబడునది.


ఉత్తరాసదము
సం., నా. వా., ద్., పుం., తత్స.,=
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరా ఉత్తరస్యాం దిశి సీదతి. సఉత్తరదిశి భాగార్హేషు మిత్రావరుణప్రధానేషు. మరుత్ప్రధానేషు చ దేవేషు.


ఉత్తరాహము
సం., నా. వా., అ., పుం., తత్స., = తరువాత రోజు (ఉత్తరమనంతరమహః, అనంతరదినే).

ఉత్తరాహి
సం., అవ్య., తత్స.,= తరువాత.

ఉత్తరించు
స., క్రి.,= దాటు, కడపు.

ఉత్తరికము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = నదీ భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తర ఉల్లంఘనమస్త్యస్యాః . ముందుకు ఉరుకు స్వభావము కలది.


ఉత్తరీయము
సం., వి., అ., న., తత్స.,= బయిరవాసము, ప్రావారము, ఉత్తరీయం, కక్ష.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరాంగే భవం ఉత్తరీయం. ఊర్ధ్వాంగమున ఉండునది.


ఉత్తరుడు
సం., వి., అ., పుం., తత్స.,= సామంతుని చేరువనున్న రాజు, విష్ణువు, శివుడు, విరాటుని కొడుకు, ఉత్తముడు.

ఉత్తరేణ
సం., అవ్య., తత్స., = ఆసన్నదిగ్దేశకాలానాం ప్రథమాపంచమీసప్తమ్యంతానామర్థేషు.

ఉత్తరేద్యుః
సం., అవ్య., తత్స., =మరునాడు.

ఉత్తరోత్తరము
సం., అవ్య., తత్స.,= క్రమముగా పెరుగునది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తరస్మాదుత్తరః. తరువాతిదాని కంటె తరువాతిది.
సం., క్రి., విణ., అ., న., తత్స.,= పైపై.

ఉత్తరోత్తరా
క్రి., విణ., = ముందు ముందు.

ఉత్తర్జనము
సం., నా. వా., అ., న., తత్స., = తీవ్రముగా అదల్చుట, గట్టిగా బెదరించుట.

ఉత్తలితము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= ఉత్ క్షిప్తము, ఎగజిమ్మబడినది.

ఉత్తసింత
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= సిగబంతి కలది, తలమానికము కలది, శిరోభూషణము కలది, కర్ణాభరణము, చెవిపోగు కలది.

ఉత్తస్థము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ఎండినమాంసము.

ఉత్తానకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉచ్చట వట్రువముపై (వృ.వి).

ఉత్తానపత్రకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఎర్ర ఆముదము చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తానమూర్ధ్వముఖం పత్రమస్య.


ఉత్తానపాదజుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉత్తానపాదుని కుమారుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తానపాదాత్ జాతే. ఉత్తానపాదుని సంతానము.

మాట - మంతి :
దృవునిచరితము భాగవతమందు నాల్గవ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయంలో వర్ణించబడినది.


ఉత్తానపాదుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒకానొక రాజు. (దృవునితండ్రి), పరమేశ్వరుడు, ఉత్తానపాదయుక్తము, శిశువు.

ఉత్తానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= లోతు లేనిది.
నానార్థాలు :
వెలికిలినది, ముఖము మీదుగానున్నది, విస్తృతము, నిష్కపటము, ఊర్థ్వముఖము.

వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం తన్యతే ఉత్తానం. ఊర్ధ్వమందు విస్తరింపచేయఁబడునది.


ఉత్తానశయుఁడు
సం., వి., అ., పుం., తత్స., =వెలికిలి పరుండుబిడ్డ, డింభుడు, శిశువు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తానే శేత ఇతి ఉత్తానశయా. వెలకిల పడుకొనేవాడు.


ఉత్తానితము
సం., నా. వా., అ., న., తత్స., = విస్తృతము చేయబడినది, ఊర్ధ్వముఖముగా చేయబడినది.

ఉత్తాపము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉష్ణత్వము, మిక్కిలి వేడిమి, సంతాపము, సంరంభము, వేగిరపాటు.

ఉత్తాపితము
సం., నా. వా., అ., పుం., తత్స., = కాల్చబడినది, కర్ర, సంతాపితము(మనస్సు-మొదలయినది).

ఉత్తారకుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= దాటించువాడు.
పర్యాయపదాలు :
గట్టెక్కించువాడు, కడవబెట్టువాడు, రక్షకుడు, ఆవలిగట్టున చేర్చునది, రక్షించునది, (ఆపదనుండి) కాపాడునది, దాటుటకు సాధకమైనది.


ఉత్తారణము
సం., నా. వా., అ., న., తత్స., = దాటించునది, విష్ణువు.
పర్యాయపదాలు :
ఆవలిగట్టున చేర్చునది, రక్షించునది, ఆపదనుండి కాపాడునది, దాటుటకు సాధనమైనది.


ఉత్తారము
సం., నా. వా., అ., పుం., తత్స., = పైకి త్రిప్పబడిన గుడ్లుకలది (కన్ను), దాటుట, పారనయనము, గట్టెక్కించుట.
నానార్థాలు :
ఆవలిగట్టునకు తీసుకుపోవుట, మిక్కుటమైన ద్వనికలది, ఉల్లంఘనము, ఉద్వామనము, వాంతి.


ఉత్తారి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = దాటించువాడు, రక్షించువాడు, కడవపెట్టువాడు (ఆపదను), చపలుడు.

ఉత్తార్యము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= దాటదగినది, ఆవలిగట్టును చేర్చదగినది, రక్షింపదగినది, కష్టమునుండి దాటింపదగినది, కక్కదగినది, (విషాది).

ఉత్తాల(ళ)ము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= గొప్పది, మేలైనది, శ్రేష్టమైనది, ఉన్నతము, ఎత్తైనది.
నానార్థాలు :
బలీయమైనది, పొడవైనది, తొట్రుపాటుగలది, విరియైనది, మిక్కిలి ఉరువైనది, త్వరితము, చాలావిరివి కలది, వేగము కలది, భయంకరము, ప్లవంగము, కోతి.


ఉత్తాసము
సం., నా. వా., అ., పుం., తత్స., = యూపములో ఒక భాగము.

ఉత్తిష్ఠద్ధోమము
సం., నా. వా., అ., పుం., తత్స., = హోమ భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తిష్ఠతోఽనుపవిష్టస్య హోమో యత్ర.


ఉత్తిష్ఠమానము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వర్థమానము.

ఉత్తీర్ణత
వి., = విజయం పొందడము, పరీక్షలలో పాస్ కావడము.

ఉత్తీర్ణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = దాటబడినది, పైకి చిమ్మబడినది, ముక్తియందు, చెక్కబడినది.

ఉత్తుంగము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పొడవైనది, ఎత్తైనది.

ఉత్తుండి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = గురుజ్జ, ఒకదినుసు కూరాకు.

ఉత్తుడు
సం., విణ., అ., పుం., తత్స.,= అర్హుడు, తగినవాడు, పాత్రుడు.

ఉత్తుషము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వేయించుట చేత పొట్టుపోయినవి, లాజులు, పేలాలు.

ఉత్తేజకము
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రేరేపించునది, ఉద్దీపకము, వాడిచేయునది. విణ., = ఉద్దీపించేది, ప్రేరేపించేది, ప్రోత్సహించేది, ఉద్రేకము కలిగించేది, ఉత్సాహము పుట్టించేది.

ఉత్తేజనము
సం., వి., ఆ., స్త్రీ., న., తత్స., = ప్రేరేపించునది.
పర్యాయపదాలు :
ఉద్దీపకము, వాడిచేయునది, సాన పెట్టుట, మెరుగు పెట్టుట, ప్రేరణము, ఉద్దీపనము, వాడిచేయుట, ప్రేరేచుట, వాడిచేయుట, నడపుట, పుచ్చుట.


ఉత్తేజము
వి., = ఉత్సాహశక్తి, ప్రేరణ, ఉద్దీపనము.

ఉత్తేజితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ప్రేరితము.
పర్యాయపదాలు :
ఉద్దీపితము, సానబెట్టబడినది, మెరుగు బెట్టబడినది, ఉత్తేజనము, మధ్యవేగముగల అశ్వగతి. ప్రేరేపబడినది, వాడిచేయబడినది, నడపబడినది, పుచ్చబడినది.


ఉత్తేరితము
సం., నా. వా., అ., న., తత్స., = అశ్వధారలో ఒకటి, అస్కంథితము, అట్టిగతితో కూడిన గుఱ్ఱము.

ఉత్తోరణము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = పొడవైనతోరణము.

ఉత్తోలనము
సం., నా. వా., అ., న., తత్స.,= పై కెత్తుట, తూచుట.

ఉత్తోలి(ల్లి)తము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= పైకెత్తబడినది, తూనికవేయబడినది.

ఉత్త్రామము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = మీదికికాని బయటకు కాని పోవుట, మీరుట, అతిక్రమించుట.

ఉత్త్రాసము
సం., నా. వా., అ., పుం., తత్స.,= మిక్కిలి భయముకలది. భయమునతిక్రమించినది, భయములేనిది.

ఉత్త్రిపదము
సం., నా. వా., అ., న., తత్స., = ఎత్తైన ముక్కాలిపీట.

ఉత్థము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = నిలిచినది, పుట్టినది, ఉద్భూతము, ఉద్ఘతము, వెలువడినది, ప్రచురము, మేల్కొన్నది.

ఉత్థాతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉత్థాయి, ఉదయించునది, లేచునది.

ఉత్థానము
సం., వి., అ., న., తత్స., = కూర్చుండి లేచుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతం స్థానం, ఉత్ స్థీయతే అనేనేతి చ ఉత్థానం. ఉద్యోగించుటయు, దీనిచేతనుద్యోగింతురు.

నానార్థాలు :
పురుష ప్రమాణము, ప్రయత్నము, ముంగిలి, మలముజారెడిరోగవిశేషము, యుద్ధము, సంతోషము, సమాప్తి, సైన్యము, ఇల్లు, ప్రారంభము, శ్రమ, కోరిక, ఉద్యమము, ఉత్సాహము, పౌరుషము, హర్షము, రణము, ఊధ్వపతనము.


ఉత్థానైకాదశి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = విష్ణువు నిద్రనుండి లేచెడు ఏకాదశి కార్తిక శుక్ల ఏకాదశి.

ఉత్థాపకము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = లేపునది, లేవ తీయునది, మేలుకొలుపునది, ప్రేరించునది, నిలబెట్టునది, ఉద్దీపము.

ఉత్థాపనము
సం., వి., అ., న., తత్స., = లేపుట, లేవ తీయునది, మేలుకొలుపునది, ప్రేరేపించునది, నిలబెట్టునది, ఉద్ధీపము.

ఉత్థాపితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = లేపబడినది.
పర్యాయపదాలు :
పురికొల్పపడినది పుట్టింపపడినది, మేలుకొలునది, ప్రేరేపించునది, నిలబెట్టునది, ఉద్ధీపము, లేవ తీయునది, మేలుకొలుపునది, ప్రేరించునది, నిలబెట్టునది, ఉద్దీపము.


ఉత్థాప్యమానము
సం., నా. వా., అ., న., తత్స.,= లేవతీయబడుచున్నది, నిలబెట్ట పడుచున్నది, వృద్ధి నొందింపబడుచున్నది.

ఉత్థాప్యము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= లేపతగినది, పైకెత్తతగినది, పురుకొల్పతగినది.

ఉత్థాయకము
సం., నా. వా., అ., న., తత్స., = లేచునది, వెలువడునది, పొడచూపునది, ఉదయించునది.

ఉత్థితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. = లేచినది.
నానార్థాలు :
పుట్టినది, పెరిగినది, యత్నించినది, సాగుభూమి, కుటుంబపోషకుడు, వృద్ధి పొందినది, ఉదయించినది (చంద్రాది) ఎత్తయినది.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్తిష్ఠతి స్మ ఉత్థితః. లేచినవాడు.


ఉత్థితాంగుళి
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= వ్రేళ్లుచాచిన అరచేయి, పైనుండి పండెడు స్వభావము కలది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్థితా ఉద్యుక్తా అంగులయో యత్ర. విస్తృతాంగులికే కరతలే చపేటే శబ్ద చ. వేళ్ళుచాచి వచనముచేయునది, చపేటము.


ఉత్థితి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = పైకిలేచుట, నిలబడుట, పైకివేయుట, నిద్రనుండి లేచుట, ప్రబోధము.
నానార్థాలు :
పురుషప్రమాణము, ఉద్భవము, పుట్టుక, ఉద్యమము, పూనిక, పౌరుషము, పురుషప్రయత్నము, సంతోషము, తంత్రము, స్వరాజ్యచింత, ప్రాంగణము, ముంగిలి, చైతన్యము, పదుగురు చేరెడి యజ్ఞశాల, దేవాలయము, సైన్యము, యుద్ధము, మలస్రావరోగము, సమాప్తి, హర్షము, ఇల్లు, ఇచ్ఛ.


ఉత్థునము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= వగరు, తీపి, ఉప్పు, చేదు కలిసినది.

ఉత్పచనిపచ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,=
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పచ నిపచేత్యుచ్యతే యస్యాం క్రియాయామ్ మయూ.


ఉత్పచిష్ణువు
సం., నా. వా., (ఉ. ఊ. ఉ)., తత్స.,= పచనముచేయునది, పైనుండి పండెడు స్వభావము కలది.

ఉత్పటము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పెకల్పుట, నిర్మూలనముచేయుట.

ఉత్పతనము
సం., వి., అ., న., తత్స.,= ఎగయుట.
పర్యాయపదాలు :
పుట్టుక, ఎగురుట, పైకిదుముకుట, మీదికి పోవుట, ఎక్కుట.


ఉత్పతనిపత
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= పైకి క్రిందకు పడుట.

ఉత్పతము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పిట్ట, పక్షి, మీదికిపోవుట, ఎక్కుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పతతి ఊర్ద్వం గచ్ఛతి. పైకి ఎగురునది.


ఉత్పతాంకము
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స., = పైకి ఎగురు పతాకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్తోలితా పతాకా. ఉత్తోలిత పతాకము.


ఉత్పతిత
సం., విణ., (ఋ. ఈ. ఋ).,తత్స.,=ఎగిరెడు స్వభావము కలవాడు, గెంతుచున్నవాడు.

ఉత్పతితము
సం., విణ., (అ.ఆ.అ.).,తత్స.,=ఎగసినది, పుట్టినది.

ఉత్పతితుడు
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స., = ఎగిరెడువాడు.

ఉత్పతిష్ణువు
సం., విణ., ఉ., తత్స.,= ఎగిరెడు స్వభావము కలవాఁడు, గెంతుచున్నవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వగమనశీలము. ఉత్పతతీత్యుత్పతిష్ణుః. స్వభావముననెగయువాఁడు.


ఉత్పత్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= జననము, పుట్టుక, జన్మ, ఊర్థ్వగమనము, పైకిపోవుట, ఉత్పత్తి స్థానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పాద ఉత్పత్తిః. పుట్టుట.


ఉత్పత్తిక్రమము
సం., నా. వా., అ., పుం., తత్స., = జగత్తు యొక్క ఉత్త్పత్తిక్రమము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పత్తౌ క్రమః. ఉత్పత్తి యందు క్రమము.


ఉత్పత్తితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = పైకిపోయినది, ఊర్ధ్వగతము, ఎగిరెడువాడు.

ఉత్పత్తిదారు
వి.,= వస్తూత్పత్తి చేసే వ్యక్తి.

ఉత్పత్తిమతము
సం., నా. వా., (త్. ఈ. త్).,తత్స.,= ఉత్పత్తి విశేషము.

ఉత్పత్తివిధి
సం., నా. వా., ఇ., పుం., తత్స.,= ఉత్త్పత్తి విధము.

ఉత్పత్తివ్యుత్ క్రమము
సం., నా. వా., అ., పుం., తత్స.,=ఉత్పత్తికి విపరీత క్రమము.

ఉత్పత్యము
సం., అవ్య., తత్స.,= ఊర్ధ్వ పతిత్వేత్యర్థే ఉత్పత్యపాకలా మయూ. (1)జన్మప్రభృత్యున్మత్తే

ఉత్పథము
సం., నా. వా.,అ.,పు., న., తత్స.,= కానిత్రోవ. అవ్య., గమ్యపథాతిక్రాంతము, నాయరీత్యతిక్రాంతము.

ఉత్పన్నభక్షి
సం., నా. వా., న్., పుం., తత్స.,= ఎప్పుడు దొరికినది అప్పుడు తినువాడు, నిలువచేయుటకు ఏమీ లేనివాడు, కష్టజీవనుడు.

ఉత్పన్నము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పుట్టినది, ఉత్థితము, పుట్టిన ఎద్దు, సిద్ధించినది, ఉద్భూతము, ఒనకూడినది.

ఉత్పలగంధిక
సం., నా. వా.,అ., న., తత్స., = గోశీర్షమనెడి చందనము, హరిచందనము, పచ్చగంధము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పలస్య గంధ ఇవ గంధోఽస్య. కుముదపు వాసన వంటి వాసన కలది.


ఉత్పలపత్రకము
సం., నా. వా., అ., న., తత్స.,= కలువరేకులవలె ఉండు ఒక శస్త్రము.

ఉత్పలపత్రము
సం., వి., అ., న., తత్స., = కలువరేకు, పిరుదులమీది నఖక్షతములు, పిరుదులమీది గుంటలు, ఒకవిధమైన బొట్టు, తిలకభేదము.
ప్రయోగము :
ఒనరగ చూడనింపెసగనుత్పలపత్రములొప్పుచున్నవీ,
ఘనతరసైకతంబుపయిగంటిరెకిన్నరకంఠులారయం,
చనుపమలీలనీదునొకయంబుజపాణిక టీనఖాంకముల్,
గనుగొనినర్మగర్భములుగానొకయంగనపల్కెనవ్వుచున్. భాను.2,ఆ.


ఉత్పలభేద్యకము
సం., నా. వా., అ., పుం., తత్స., = కర్ణబంధాకృతము.

ఉత్పలమాల
సం., నా. వా., అ., పుం., తత్స., = కలువలమాల, ఒక ఛందస్సు.

ఉత్పలము
సం., వి., అ., న., తత్స., = నల్లసుగంధపాల (వృ.వి).
పర్యాయపదాలు :
నీల పద్మము, కుముదము, కలువ, కలువల వంటి పువ్వులు కలది, నీలకమలము, పుష్పము, కువలయము, రాత్రిపుష్పము, నిశాపుష్పము, ఎర్రకలువ, నీటిలో పుట్టు పుష్పము, పద్మము మొదలగు పువ్వులు.

నానార్థాలు :
చెంగల్వకోష్టు, కోష్టము, ఒకచేప, అనుష్ణము, జలాహ్వయము, హిమాబ్జము, కండలేనిది, కృశించినది. కుష్ఠౌషధము, మాంసశూన్యము, విశేషము.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్ ఊర్ధ్వం పలతి గచ్ఛతీత్యుత్పలః. ఊర్ధ్వమునుపొందునది.


ఉత్పలశా(సా)రివము
సం., నా. వా., ఆ., త్రి., తత్స.,= శ్యామాలతము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పలం తదాకారపుష్పమస్త్యస్యాః. కలువలవంటి పుష్పములు దీనికి కలవు.


ఉత్పలశారిబ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మామెన.
వ్యుత్పత్త్యర్థము :
శీర్వంతే అనయా దోషా ఇతి శారిబా. దోషములు దీనిచేత సంహరింపఁబడును.


ఉత్పలషట్కము
సం., నా. వా., అ., న., తత్స.,= జ్వర అతిసారి చికిత్సలో చెప్పుబడిన ఒక ఔషధభేదము.

ఉత్పలాక్షి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= కలువరేకులవంటి కన్నులు గల స్త్రీ.

ఉత్పలావతి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఒక అప్సర పేరు.

ఉత్పలావర్తము
సం., నా. వా., అ., పుం., తత్స.,= చోళదేశము.

ఉత్పలితుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = దర్భలతో పవిత్రము చేయువాడు, శుద్ధిచేయువాడు.

ఉత్పలిని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= కలువరేకులసమూహము, కలువతీగ, ఉత్పలయుక్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పలాని సంత్యస్మిన్ దేశే తేషాం సమూహో. కలువలు కలిగిన దేశము వాటి సమూహము.


ఉత్పవనము
సం., నా. వా., అ., న., తత్స.,= ద్రవద్రవ్యములగు దర్భలతో చేయు ఒకానొక సంస్కారము, శుద్ధిచేయుట.

ఉత్పశ్యుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= మీదు చూచువాడు.
పర్యాయపదాలు :
శుద్ధిచేయువాడు, పైకి చూచుట, ఉన్ముఖము, ఊర్ధ్వభాగము చూచుట, పైకి చూచువాడు.


ఉత్పాటకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పెకల్చునది, పెళ్ళగించునది, చెవితమ్మె అందలి రోగ విశేషము.

ఉత్పాటనము
సం., వి., అ., న., తత్స., = పెరుకుట, పెళ్ళగించునది, చెవితమ్మె అందలి రోగ విశేషము.

ఉత్పాటము
సం., నా. వా., అ., పుం., తత్స., = భూమిసరిగా లేకుండుట, పెకల్చుట, నిర్మూలనముచేయుట.

ఉత్పాటి
సం., విణ., (న్.ఈ.న్.)., తత్స.,= పెకలించువాడు.

ఉత్పాటించు
సం., స., క్రి., = పెఱుకు.

ఉత్పాటిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = చెట్టు యొక్క పైపట్ట, బెరడు.

ఉత్పాటితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= పెరకబడినది, బెరడు తీయువాడు.
పర్యాయపదాలు :
చెట్టు యొక్క బెరడు తీయబడునది, కృతోత్పాటనము, ఉన్మీలితము, ఉత్ఖాతము, ఆవర్హితము, ఉద్ధృతము.


ఉత్పాట్యమానము
సం., నా. వా., అ., పుం., తత్స.,= చెట్టు నుంచి తాయబడు బెరడు.

ఉత్పాతకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= పైకెగయునది, ఉపద్రవమును కలిగించునది.

ఉత్పాతము
సం., వి., అ., పుం., తత్స.,= అపశకునము, (అనగా ఆబాలవిద్వజ్జనప్రసిద్ధమైన వస్తురూపమునకంటెభిన్నమైనవస్తురూపము. ఇది త్రివిధము – దివ్యము, ఆంతరిక్షము, భౌమము అని. దివ్యము – అపూర్వగ్రహనక్షత్రములు పుట్టుట. ఆంతరిక్షము – పరివేషము ఇంద్రధనుస్సును కలుగుట, కొరవియుపిడుగునుపడుట. భౌమము – అపూర్వములైన చరాచరవస్తువులు కలుగుట. ఇవి దుఃఖరోగప్రదములు.)
పర్యాయపదాలు :
ఉపద్రవము, భూకంపము మొదలైన, అజన్యము, ఉపసర్గ, ఉల్కాపాతము, ఉత్పతనము,

నానార్థాలు :
ఉన్నతి, వృద్ధి, ఉత్పత్తి, ఎక్కువ ఆకులత, అతిశయవ్యాకులము, సముత్పింజము, పింజలము.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్పతత్యకస్మాదాయాత్యుత్పాతః. అదాటుగా వచ్చునది.


ఉత్పాదకత
వి., = వస్తూత్పత్తి సామర్థ్యము.

ఉత్పాదకము
సం., వి., అ., పుం., తత్స., = శరభము.; విణ. కలిగించునది. చిలుకూర (వృ.వి), పూతిక దేహిక అను కీటకము, కొమ్మన, గొర్రెపిండి చెట్టు దేహిక అను కీటకము, ఎనిమిదికాళ్ళుగల శరభ పశుభేదము.

ఉత్పాదనము
సం., వి., అ., న., తత్స., = ఆపాదనము కలిగించుట.
పర్యాయపదాలు :
పుట్టించునది, కలిగించునది, పుట్టించుట, కలిగించుట, ఉత్పాదనము.

నానార్థాలు :
నశింపజేయుట, నలుగుపెట్టుట, జిడ్డుపోవునట్లుకడుగుట, తొలగించుట, ఔషధము, రాచివ్రణమును శుద్దిచేయుట, దున్నుట, పెల్లగించుట, ఎత్తుట. ఉత్సాదనము, పోగొట్టుట, పై కెత్తుట, దున్నుట, ఎత్తు.


ఉత్పాదనీయము
సం., నా. వా., అ., న., తత్స., = ఉత్పాదనము చేయదగినది, పుండుమాన్పుమందు.

ఉత్పాదము
సం., నా. వా., అ.,పుం., తత్స., = పైకెత్తిన పాదములు కలది, కలుగుట, సంభవము, పుట్టుక, నాశము, శరభము, కలిగించునది.

ఉత్పాదయమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పుట్టించుచున్నది, కల్గించుచున్నది.

ఉత్పాదశయము
సం., నా. వా., అ., పుం., తత్స,. = పక్షి, కాళ్లుపైకి పెట్టుకొని పడుకొనునది, టిట్టిభపక్షి, తీతువు పిట్ట, శిశిశు.

ఉత్పాది
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = పుట్టుక కలది, పుట్టినది, పుట్టించునది, కల్గించునది.

ఉత్పాదించు
క్రి., = పుట్టించు, కను, తయారు చేయు, నెలకొల్పు, స్థాపించు, వెలిగించు. పైకెత్తు, పెల్లకించు, నశింపజేయు

ఉత్పాదితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఆపాదితము, పుట్టింపబడినది, కలిగింపబడినది, పుట్టించునది, కల్గించునది, శరభము (ఇది ఎనిమిది కాళ్ళ మృగము) దీనికి ఇతర మృగములవలె నాలుగు కాళ్ళు అదనంగా వీపుమీద నాలుగు కాళ్ళు ఉండును.

ఉత్పాదిల్లు
సం., అ., క్రి., = కలుగు, (ప్రే. ఉత్పాదించు).

ఉత్పాద్యమానము
సం., నా. వా., అ., పుం., తత్స,. = పుట్టింపబడుచున్నది, కల్గింపబడుచున్నది.

ఉత్పాద్యము
అవ్య., = పుట్టింపదగినది, కలిగింపదగినది.

ఉత్పాలి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= ఆరోగ్యము, స్వస్థత.

ఉత్పావము
సం., నా. వా., అ., పుం., తత్స,. = ఉత్పవనము, యజ్ఞపాత్రలయందు, సంస్కారభేదము.

ఉత్పింజరము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = కులము, పింజలము, అతిశయ వ్యాకులము.

ఉత్పింజలము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., =మిక్కిలి వ్యాకులమైనది, సంభ్రాంతుడు.

ఉత్పిబుడు
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = పాత్రాదులను ఎత్తిత్రాగువాడు.
వ్యుత్పత్త్యర్థము :
(ఉద్ధృత్య పాయిని)పాత్రలను ఎత్తిత్రాగువాడు.


ఉత్పిష్టము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., =
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ద్వతః పిష్టం, ఊర్ద్వతః కృత పేషణే ఉన్మథితే.


ఉత్పీడనము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉన్మథము, కలచుట, రాయిడి, రారావు, పిడుచుట, అతిశయము, సంఘర్షణచేత పీడనము, సంభాధకము, ఉన్మథనము, ఉత్పీడాకారకము. వి.,= కలత, రాపిడి, పంపటము, చిలకడము, పైకినెట్టే శక్తి.

ఉత్పుచ్ఛము
సం., నా. వా., అ., పుం., తత్స.,= తోకపైకెత్తుకున్నది. పశువు.

ఉత్పుటకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వికసించినది, సుశ్రుతిలో చెప్పబడిన పాల్వాముపద్రవభేదము, చెవితమ్మె, కల్లురోగవిశేషము.

ఉత్పుటము
సం., నా. వా.,(అ. ఈ. అ)., తత్స., = వికసించునది.

ఉత్పుతము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., =
వ్యుత్పత్త్యర్థము :
పవిత్రాదినా కృతోత్పవనసంస్కారే పాత్రాదౌ. ఇట్‌పక్షే ఉత్పవితోఽప్యత్ర , తేన హరతి ఉత్సంగౌ. ఔత్పుత తేన హారకే.


ఉత్పేయము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = పైకెత్తి తాగబడినవి, జలము మొదలగునవి.

ఉత్ప్రబంధము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఎడతెగనిది, గొప్పగ్రంథము, పైకివచ్చిన కాంతులుకలది, మిక్కిలి కాంతి కలది.

ఉత్ప్రభము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = పైకివచ్చిన కాంతులు కలది, మిక్కిలి కాంతి కలది.

ఉత్ప్రసవము
సం., నా. వా., అ., పుం., తత్స.,= గర్భస్రావము.

ఉత్ప్రాశనము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉద్ధృత్య ప్రాశనమ్. ఉత్తోల్య భోజనే.

ఉత్ప్రాసము
సం., వి., అ., పుం., తత్స,. = మర్మము దూరిపారనాడెడు పరిహాసము, పరిహాసము, బిగ్గరగా నవ్వుట, ఉత్ క్షేపణము, నింద, ఉపహాసము, ఎత్తి పొడుపుమాట.

ఉత్ప్రేక్ష
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఊహించుట, ఊహ(అలం), ఒక అర్థాలంకారము, అనవథానత, హెచ్చరికలేమి, ఉపేక్ష.

ఉత్ప్రేక్షణము
సం., నా. వా., అ., న., తత్స.,= పైకిచూచుట, ఊహించుట, ఇది ఈపదార్థముగా నుండివచ్చునని తలంచుట, ఉత్ప్రేక్షించి చెప్పట, ఉద్భావనము.

ఉత్ప్రేక్షించు
సం., స., క్రి., = ఉత్ప్రేక్షకలుగజెప్పు.

ఉత్ప్లవనము
సం., నా. వా., అ., న., తత్స.,= దాటుట, పైకిదూకుట, పైనతేలుట. వి., పైకి తేలడము, దాటడము, దూకడము.

ఉత్ప్లవము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= పడవ, దాటు, గంతు.

ఉత్ఫుల్లము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = వికసించినది, పువ్వు, విడిచినది.
వ్యుత్పత్త్యర్థము :
త్ఫుల్ల ముత్పుల్లతి ఉత్ఫుల్లతి, సంఫుల్లతీతి ఉత్ఫుల్లః. వికసించినది.

నానార్థాలు :
తెరచియున్నది (కన్ను), ఉబ్బిలినది, బలిసినది, ఉత్తానము, వెలికిలబడియుండునది, అడుగుఱి, సురతబంధ విశేషము, స్త్రీల గుప్తేంద్రియము.


ఉత్యక్తము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఎగజిమ్మబడినది, విడువబడినది, వైరాగ్యముగలది.

ఉత్యాగము
సం., నా. వా., అ., పుం., తత్స., = విడుపు, విడుచుట, ఎగజిమ్ముట, వైరాగ్యము, పైకి త్రోయుట.

ఉత్ర్కరుణము
సం., నా. వా., అ., పుం., తత్స., = మీదికికాని బయటకు కాని పోవుట, అతిక్రమించుట, మీరుట.

ఉత్ర్కాంతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = మీదికికాని బయటకు కాని పోవుట, మీరుట, అతిక్రమించుట.

ఉత్ర్కోశము
సం., నా. వా., అ., పుం., తత్స.,= లకుముకిపిట్ట, చాటుట, గోరువంక, ఆక్రోశము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చైః క్రోశతి ఉత్ర్కోశః. గట్టిగాఅరచునది. ఉత్ర్కోశతి ప్రహరే ప్రహరే శబ్దం కరోతీతి ఉత్ర్కోశః. మరల మరల మొర పెట్టుట.


ఉత్ల్కేశము
సం., నా. వా., అ., పుం., తత్స.,= మనస్సునందలి కలత, వ్యధ, ఊర్ధ్వగతమగు వాయువుచే కలుగు రోగ భేదము, వ్యాథిని రేపునది (కఫమును).

ఉత్వము
వి., = ఉకారము, ఉవర్ణము.

ఉత్సంగము
సం., వి., అ., పుం., తత్స., = ఒడి, తొడ, అభినయహస్తవిశేషము, (వ్రేళ్ళుచాచిపట్టిన రెండుచేతులను మనికట్లయందుగూర్చి రొమ్మునబట్టినది.)
నానార్థాలు :
పర్వతాగ్రము, పైభాగము, బయటిభాగము, సంగమము, ఆలింగనము, వివాహము, గర్భము, ఏనుగుముందరికాలిలో ఒక భాగము, ఊర్ధ్వతలము, పుండు క్రింది భాగము.


ఉత్సంగాది
సం., నా. వా., అ., పుం., తత్స.,= (1)హరతీత్యర్థే .

ఉత్సంగి
సం., నా. వా., (అ.ఈ.అ.)., తత్స., = కనురెప్పలలోపలి యంచున లేచు మొటిమ.

ఉత్సంగితము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= సంసర్గము కలదిగా చేయబడినది, ఒడియందు పెట్టుకొనబడినది.

ఉత్సంగుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= సంగము వీడినవాడు, సన్యాసి.

ఉత్సంజనము
సం., నా. వా., అ., న., తత్స., = పైకి లేపుట.

ఉత్సక్థము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= ఊర్ధ్వం గతే సక్థినీ అస్య ష సమా 1)ఊర్ధ్వోరుకే

ఉత్సత్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = గట్టిగా. ఉచ్ఛేదే.

ఉత్సధి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = జలప్రవాహము, బావి.

ఉత్సన్నము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = పెల్లగింపబడినది.
నానార్థాలు :
పైకెత్తబడినది, నష్టము, నశించినది, క్షీణించినది, వాడుకలోలేనిది, ప్రచారములో లేనిది, (గ్రంథము మొ) ఉద్గతమైనది, ఉబికినది.


ఉత్సము
సం., వి., అ., పుం., తత్స., = ఊట, ప్రస్రవణము, నెమ్మదిగా ప్రవహించునట్టి నీరు, జలప్రవాహము, ఋషిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉనక్త్యంభసా ఉత్సము. జలముకలది. ఉనత్తి జలేనేతి ఉత్సః. ఊటగలచోటు.


ఉత్సర్గము
సం., వి., అ., పుం., తత్స., = దానము.
నానార్థాలు :
త్యాగము, విడుపు, సామాన్యము, విసర్జనము, విడుచుట, విచ్చల విడిగా దిరుగుట, యాగము, విశ్రణనము, వితరణము, స్పర్శనము, ప్రతిపాదనము, ప్రదేశము వదలిపెట్టుట, సామన్య విధానము, సామాన్యవిథి, న్యాయము, సమాప్తి, సంవత్సరకాల వేదపాఠసమాప్తము, జన్నియవిడుచుట, వేదాధ్యయన, వ్రాతాదులముగియిక (వృషోత్సర్గము మొదలుగునవి) ఈవి, (వ్యతి, అపవాది) విశేషవిధి, గుదస్థానము, పాయువు, విహాపితము, ప్రాదేశనము, నిర్వపణము, వర్జనము, అపవర్జనము, అంహతి, అపానవాయోర్వ్యాపారము, మలమూత్రాదివర్జనము.


ఉత్సర్గి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = విడుచువాడు, ఇచ్చువాడు.

ఉత్సర్జనము
సం., వి., అ., న., తత్స., = త్యాగము, విడుపు, దానము, విడుచుట, అధ్యయనాదులు సమాప్తి చేయుట, విడిపింపబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సృజ్యతే ఉత్సర్జనం. ధనాదుల విడుచుట.


ఉత్సర్జించు
సం., స., క్రి., = విసర్జించు, విడుచు.

ఉత్సర్జితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = విడువబడినది, విడిపింపబడినది.

ఉత్సర్పణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉత్సృజ్యము,
వ్యుత్పత్త్యర్థము :
ఉల్లంఘనే చ ఉత్సర్పము. ఉల్లంఘనము.


ఉత్సర్పి
సం., నా. వా., (న్. ఈ. న్).,తత్స.,= పైకెగురునది, మీదికిబ్రాకునది, గొప్ప విషయములను సరించిపోవునది, ఉదారము ఎగబ్రాకుట, ఉల్లంఘనము, దాటుట, పయికిబోవుట.

ఉత్సర్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= పొర్లుటకు దగిన స్థితిలో నున్నయావు, ఎదపదను గలయావు.

ఉత్సవము
సం., వి., అ., పుం., తత్స.,= పండుగ, వివాహము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉత్సూతే సుఖమితి ఉత్సవః. సుఖమును పుట్టించునది. 2.సువతి ప్రేరయతి జనానితివా ఉత్సవః. జనులను ప్రేరేపించునది.

నానార్థాలు :
పుట్టునది, కోరికలు కొనసాగుట, గర్వము, కోపము, ఎత్తు, క్షణము, ఉద్ధవము, ఉద్ధర్షము, ఉత్సేకము, ఉన్నతి, అభ్యుదయము, దున్నుట, ఔషధము, రాచి వ్రణమును శుద్ధిచేయుట, సంబంధములు లేక విచ్చలవిడిగా స్త్రీలును, ఋషులును ప్రవర్తించునొక పర్వతీయ జాతిభేదము, ఉత్సవము, నియతాహ్లాదజనక వ్యాపారము, గొప్పది.


ఉత్సవవిగ్రహము
వి., = దేవాలయాలలో ఉత్సవాల సందర్భములో ఊరేగించే విగ్రహము, సత్తాలేని వ్యక్తి, అలంకారప్రాయుడు.

ఉత్సవసంకేతము
సం., నా. వా., అ., పుం., తత్స., = వివాహము, సంబంధములు లేక విచ్చలవిడిగా స్త్రీలును ఋరుషులను ప్రవర్తించునొక పర్వతీయ జాతిభేదము

ఉత్సహనము
వి., = మిక్కిలి, ఓర్పు.

ఉత్సహించు
సం., అ., క్రి., = యత్నించు, కడగు.

ఉత్సాదనము
సం., వి., అ., న., తత్స.,= ఉన్మూలనము, తొలగించుట, నలుగు, పెల్లగించుట, పైకెత్తుట, నాశనము, సముల్లేఖము, ఉద్వాహనము, వినాశము, జిడ్డు పోవునట్లు కడుగుట, నలుగుపెట్టుట, నశింపజేయుట, పోగొట్టుట, పెల్లగించుట, దున్నుట, ఔషధము, ఉద్వర్తనము, రాశివ్రణమును శుద్దిచేయుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సాద్యతే అనేన శరీరమాలిన్యమితి ఉత్సాదనం. దీనిచేత శరీర మలము పోఁగొట్టఁబడునది.


ఉత్సాదనీయము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = ఉత్సాదనము చేయదగినది, పుండు మాన్చుమందు.

ఉత్సాదించు
సం., స., క్రి.,= పెల్లగించు, పైకెత్తు.

ఉత్సాదితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పెల్లగింపబడినది, నశింపజేయబడినది, నలుగు పెట్టబడినది (శరీరాది), పై కెత్తబడినది.

ఉత్సారకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = తొలగించువాడు, ద్వారపాలకుడు, కావలివాడు, మార్గమందుండు జనులను తొలగించి దారిచేయు భటుడు.

ఉత్సారణము
సం., వి., అ., న., తత్స., = తొలగించుట, కదలించుట, జనులను తప్పించి దారి చేయుట, ఉత్సారణము.

ఉత్సారించు
సం., స., క్రి., = కదలించు.

ఉత్సారితము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = కదలింపబడినది, తొలగింపబడినది, కదల్పబడినది, దూరీకృతము.

ఉత్సాహకము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = ఉత్సాహించునది.

ఉత్సాహనము
సం., నా. వా., అ., న., తత్స., = ఉద్యోగము, ఉత్సాహవృద్ధి, అతియవాశయము, ఉత్సహముకల్గించుట, ఉద్యమము, అధ్వవసాయము, ప్రయత్నము, సూత్రము, వీరరసస్థాయీభావము, ఉత్సాహనము, ఉత్సాహము కలిగించుట.

ఉత్సాహము
సం., వి., అ., పుం., తత్స., = ప్రయత్నము.
నానార్థాలు :
సూత్రము, ఉద్యమము, కళ్యాణము, భావ విశేషము, శ్రమ, ధ్రువకవిశేషః, ఒక స్థాయీభావము, ఇత్తడి, అధ్యవసాయము, అస్థ, అభిలాష, శుభము, దారము, ఒకనొక వృత్తము.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతం సహనం ఉత్సాహః. ప్రయాణమును ఓర్చుట.


ఉత్సాహవర్ధనము
సం., వి., అ., పుం., తత్స.,= వీరరసము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సాహేన వర్ధత ఇత్యుత్సాహవర్ధనః. ఉత్సాహముచేత వృద్ధిఁపొందునది.


ఉత్సాహశక్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = రాజు పరాక్రమము, బలము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సాహ ఏవ శక్తిర్బలమ్. ఉత్సాహము బలముగా కలది.


ఉత్సాహించు
సం., అ., క్రి., = ఉద్యమించు, కడగ.
ప్రయోగము :
శా. మరుద్మైత్రింబొల్చుహంతాశులీలఁగుశుఁడుత్సాహించెసోదర్యుతోన్.జై.6,ఆ.


ఉత్సిక్తము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = జలాదులచే ప్రోక్షింపబడినది.
నానార్థాలు :
చల్లబడినది, అతిశయించినది, గర్వించినది, పొంగినది (నది మొదలుగునవి), క్రోధాధులచే ఉద్రేకమునొందినది.


ఉత్సుకత
వి., = కుతూహలము, సంతోషము, ఉత్సాహము, తహతహ, అభిలాష.

ఉత్సుకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉత్కంఠితుడు.
పర్యాయపదాలు :
తహతహపడువాడు, వేడుక కలవాడు, ఉవ్విళ్లూరువాడు, తహతహ, తమకము, ఇష్టమైన కార్యమునందు ఆసక్తి కలిగినవాడు, ఉత్కంఠితము.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్సు ఉద్యోగాతిశయః అస్యాస్తీత్యుత్సుకః. ఇష్టమైన ప్రయోజనమందు ఉద్యోగాతిశయముగలవాఁడు.


ఉత్సూత్రము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = పెరిగిపోయిన దారము కలది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రాంతః సూత్రమ్ అత్యా స. సూత్రము (దారము) నుండి వీడినది.


ఉత్సూరము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సాయంకాలము, దినావసానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రాంతః అతిక్రాంతః సూరం సూర్యమ్ అత్యా స. దినాత్యయే హేమచ ఉత్సూర్యాదయోప్యత్ర. సూర్యప్రకాశనావసానకాలము.


ఉత్సృజ్యము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వదిలిపెట్టుట, వదులుట.

ఉత్సృష్టము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఇయ్యఁపడినది, త్యక్తము, హీనము, ద్యూతము, ఒక ఆకుకూర, సముజ్జితము, కృతోత్సర్గము, ధూతము, విధుతము.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్సృజ్యతే స్మ ఉత్సృష్టం. విడువఁబడినది.


ఉత్సేకము
సం., వి., అ., పుం., తత్స., = ప్రోక్షణము, చల్లుట.
నానార్థాలు :
ఉద్రేకము, అతిశయము, హెచ్చుట, గర్వం, కావరము, పొంగు, ఉప్పొంగుట, అతిశయించినది, పొంగినది, ఉప్పొంగినది, (నది మొదలుగునవి) గర్వము కలది.


ఉత్సేకి
సం., నా. వా., (న్. ఈ. న్)., తత్స.,= అతిశయించినది, పొంగినది, ఉప్పొంగినది (నది.మొ), గర్వము కలది.

ఉత్సేకించు
సం., అ., క్రి., = అతిశయించు, గర్వించు, పొంగు.; స., క్రి., ప్రోక్షించు.

ఉత్సేచనము
సం., నా. వా., అ., న., తత్స.,= పైకిచల్లుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రమ్య ఆధారమతిక్రమ్య సేచనమ్.


ఉత్సేధము
సం., వి., అ., పుం., న., తత్స.,= శరీరము.
నానార్థాలు :
పొడవు, దేహము, సంహననము, పైభాగము, ఎత్తు, బలుపు, పర్వతవృక్షాదీనాం దైర్ఘ్యము, ఉచ్ఛ్రయము, గొప్పతనము.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతిరుత్సేధః. ఊర్ధ్వముగాఁపోవునది.


ఉత్స్వనము
సం., నా. వా., అ., పుం., తత్స., = పెద్ద ధ్వని గలది, పెద్దధ్వని.

ఉత్స్వప్నము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = స్వప్నమున కలవిరించునది, స్వప్నమున కలవిరించువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రాంతః అతిక్రాంతః స్వప్నం తన్మర్యాదామ్ అత్యా స. నిద్రాయాం బాహ్యేంద్రియాణాం విలీనత్వేన మనసైవ సర్వవ్యవహారనియమేన తదతిక్రమేణ జాగ్రదవస్థావత్ స్పష్టవచనాదివ్యవహారే. (2)ఉత్స్వప్నమివ చరతి ఉత్స్వప్నాయతే .


ఉత్‌ఫాలము
సం., నా. వా., అ., పుం., తత్స., = (1) ఉల్లంఫే (2) ఊద్ధ్వతోవిసరణే చ

ఉదంకము
సం., నా. వా., అ., పుం., తత్స., = తోలు తిత్తి (నూనే, నెయ్యి మొదలగు పోసెడి), సిద్దె.

ఉదంచనము
సం., వి., అ., న., తత్స., = మూకుడు, విజృంభించుట, మూత, ఎగజిమ్ముటకు సాధనమైనది, నూతి నుండి నీరు చేదుపాత్ర, చేద, పైకి వచ్చుట.

ఉదంచితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పూజింపబడినది, విజృంభించినది, పైకి విసురపడినది, పైకి వైవబడినది.

ఉదండపాలము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒకజాతిచేప, సర్పభేదము.

ఉదంతము
సం., వి., అ., పుం., తత్స., = వృత్తాంతము.
నానార్థాలు :
సుద్ది, వార్త, ఉదంతకము, సాధు అయినది, వృత్తియాజనము, సాధువు.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతః అంతో నిశ్చయోస్యేత్యుదంతః. ఉత్పన్నమైన నిశ్చయముగలిగినది.


ఉదంతిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = తృప్తి.

ఉదంతుడు
సం., వి., అ., పుం., తత్స., = మంచి మనుష్యుడు, వర్తకుడు, వడ్డీవర్తకము చేయువాడు, వర్ధుషికుడు, మంచివాడు, సజ్జనుడు.

ఉదకకర్మ
వి., = పితృదేవతాదులకు చేసే జలాది తర్పణము.

ఉదకకృచ్ఛ్రము
సం., నా. వా., అ., పుం., తత్స., = విష్ణువుచే చెప్పబడిన వ్రతభేదము.

ఉదకక్రియ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = పితృదేవాదులకు జలాదిచేయు తర్పణము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకేన క్రియా తర్పణమ్. శాస్త్రవిహితే జలాదితర్పణే.
వి., తర్పణము, నీళ్లు వదలడము.

ఉదకపరీక్ష
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= వివాహాదులందు లౌకిక ప్రమాణములు దొరకనిచో చేయతగు దివ్య ప్రమాణభేదము.

ఉదకము
సం., వి., అ., న., తత్స.,= జలము, నీరు, తోయము, ఉదకుంభము, ఉదకకుంభము.
వ్యుత్పత్త్యర్థము :
ఉనక్తీతి ఉదకం. ద్రవమైఉండునది.


ఉదకమేహము
సం., నా. వా., అ., పుం., తత్స.,= నీరు, నీరోగము, మూత్రవ్యాధి.

ఉదకమేహి
సం., విణ., (న్. నీ. న్)., తత్స.,= మూత్రవ్యాధికలవాడు.

ఉదకమ్
సం., అవ్య., తత్స., = అకము కిచ్చ. కృఞి వా గతిత్వమ్. ఉదకంకృత్యుదకంకృత్వా క్లేదం కృత్వేత్యర్థః. క్షేదము.

ఉదకలము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స.,= జలము కలది.

ఉదకశుద్ధము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= స్నానము, ఉదకస్పర్శచేతశుద్ధి.

ఉదకషట్‌పలము
సం., నా. వా., అ., న., తత్స.,= ఘృతభేదము.

ఉదకాంతము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉదకపర్యంతము.

ఉదకీయము
సం., నా. వా., అ., పుం., తత్స.,=
వ్యుత్పత్త్యర్థము :
నామధాతు ఆత్మన ఉదకమిచ్ఛతి. ఉదకీయతి అతితర్షాయాంతు ఉదన్యతి.


ఉదకీర్ణ(ర్య)ము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కానుగు (వృ.వి)

ఉదకోదరము
సం., నా. వా., అ., న., తత్స.,= సుశ్రుతుడు చెప్పిన ఉదరరోగసంభందమైనది.

ఉదక్
అవ్య., త్రి. = ఉత్తరదిగ్దేశకాలాలు, ఉత్తర దిక్కు, ఉత్తర దేశము, ఉత్తర కాలము

ఉదక్తము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= చేదబడినది, నుయ్యి మొదలగువానినుండి పైకెత్తబడినది (నీరు).

ఉదక్య
సం., వి., (అ. ఆ. అ).,తత్స.,= ఋతుమతి, రజస్వల, ముట్టుది, జలస్నాము చేయవలసినది (అశూది).
వ్యుత్పత్త్యర్థము :
ఉదకమర్హతి ఉదక్యా. నాల్గవదినమున ఉదకమునకర్హురాలు. ఉదకం జలం శుద్ధిస్నానార్థమర్హతీతి ఉదక్యా. నీటిచేత శుద్ధి స్నానము చేయించటానికి అర్హురాలు. 3.ఉదకమర్హతి దండా యత్. జలమును ఆపేక్షించునది (వరి).


ఉదక్ర్పవణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఉత్తరపు వైపునకు ఏటవాలుగా ఉన్నది, ఉత్తరమార్గ గతిక హేతువైనది (యజ్ఞము).

ఉదగద్రి
సం., నా. వా., అ., పుం., తత్స.,= హిమాలయము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదగుత్తరస్యామద్రిః. ఉత్తరదిక్కు పర్వతము.


ఉదగయనము
సం., నా. వా., అ., న., తత్స., = ఉత్తరాయణము (మకరసంక్రమణం మొదలు కర్కాటక సంక్రమణంవరకు ఆరునెలల కాలము).

ఉదగ్దశ
సం., నా. వా., అ., న., తత్స., = ఉత్తరాగ్రవస్త్రము.

ఉదగ్భూమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఉన్నతమైన భూమి కలది. సద్భూమి, ఉత్కృష్టస్థానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదగుత్తరదిగ్వత్ ప్రశస్తా భూమిర్యత్ర.


ఉదగ్రదత్
సం., నా. వా., (త్. ఈ. త్)., తత్స.,= పెద్దదంతములు కల ఏనుగు, పాఱపండ్లు కలవాడు.

ఉదగ్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = మిక్కిలి పెరిగినది, దీర్ఘము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతమగ్రం యస్యేత్యుదగ్రం. ఊర్థ్వముఁపొందిన కొనదగినది.

నానార్థాలు :
భయంకరమైనది, విశాలము, మహత్తు, తీవ్రము, గొప్పుది, పెద్దది, వృద్ధము, ఉద్దతము, ఉచ్ఛ్రితము, ఉచ్చము, గర్వించినది.


ఉదగ్రాభము
సం., నా. వా., అ., పుం., తత్స., = మేఘము, మహాప్రభము.

ఉదచమసము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉదకమును కలుపుగరిటె.

ఉదచము
సం., నా. వా., (చ్. ఈ. చ్).,తత్స.,= ఒక దేశము, ఊర్ధ్వము, ఉత్తరదిక్కు.

ఉదజము
సం., వి., అ., పుం., తత్స.,= పసులఁద్రోలుట, పశువులను కాచుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉదజనముదజః. నీటఁపుట్టినది.


ఉదజినము
సం., నా. వా., అ., పుం., తత్స., =
వ్యుత్పత్త్యర్థము :
ఉత్క్రాంతమజినమ్ అత్యా స. చర్మాతీతే నిరుదకాది.


ఉదజ్ఞుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒక ఋషి.

ఉదధానము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కుండ, మేఘము, తైలము, పిపీలిక.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకం ధీయతేఽత్ర ఆధారే. ఉదకము దీనియందు ధరింపఁబడును.


ఉదధి
సం., వి., ఇ., పుం., తత్స.,= సముద్రము, కడలి, నాలుగు, మేఘము, కుండ.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకం ధీయతే అస్మిన్నిత్యుదధిః. ఉదకము దీనియందు ధరింపఁబడును.


ఉదధిక్రా
సం., నా. వా., ఆ., త్రి., తత్స., = సముద్రకామకము.

ఉదధిమలము
సం., నా. వా., అ., పుం., తత్స., = సముద్రపునురుగు.

ఉదధిమేఖల
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= భూమి, సముద్రపునురుగు, మొలనూలుగాకలది.
వ్యుత్పత్త్యర్థము :
ఉదధిర్మేఖలేవ యస్యాః. సముద్రము మొలనూలుగా కలది.


ఉదధిసుత
సం., నా. వా., ఆ., స్త్రీ., అ., పుం., తత్స.,= లక్ష్మీ, చంద్రుడు.

ఉదధ్మానము
సం., నా. వా., అ., న., తత్స., = పొయ్యి

ఉదన్
సం., నా. వా., న్., న., తత్స.,= జలము.

ఉదన్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= పిపాస, నీరువట్టు, దప్పి, దాహము, నీళ్ళు త్రాగునిచ్ఛ.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకేచ్ఛా ఉదన్యా. ఉదకమందలి యిచ్ఛ. 2.ఉదన్యతి ఉదకమిచ్ఛతి వా ఇతి ఉదన్యా. నీరు తాగాలనే కోరిక.


ఉదన్వతుడు
సం., వి., త్., పుం., తత్స.,= సముద్రము, కడలి, సాగరము, జలధి.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉదకమస్మిన్నస్తీత్యుదన్వాన్. ఉదకము కలిగినది. 2.ఉదకాని సంత్యత్రేతి ఉదన్వాన్. ఉదకయుక్తమాత్రము.


ఉదప
ఆఘాతే సౌత్రః పర సక సేట్. ఉదపతి. ఔదపీత్ ఔదాపీత్. సముద్రుడు.

ఉదపాత్రము
సం., నా. వా., అ., న., తత్స.,= జలముతో నిండిన పాత్ర, నీటి పాత్ర.

ఉదపానము
సం., వి., అ., పుం., న., తత్స.,= బావి, కూపము, నుయ్యి, జలపానము, పిచండము, కుక్షి, జతరము, తుండము.

ఉదమానము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఆడకమానమందు ఏబదియవపాలు (అడగాల) మానభేదము, పిచండము, కుక్షి, జఠరము, తుండము.

ఉదయ
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒకపర్వతము, ఆదాయము.

ఉదయగామిని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., =
వ్యుత్పత్త్యర్థము :
ఉదయం సూర్యోదయం గచ్ఛతి ముహూర్తాదినా వ్యాప్నోతి.


ఉదయగిరి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = సూర్యుడు ఉదయించుగిరి.

ఉదయత్రయము
వి., =క్షయము, స్థానము, వృద్ధి.

ఉదయనము
వి., = ఉదయించడము.

ఉదయనీయము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = సమాప్తేష్టి, యాగము చివరి కృత్యము (పని), ఇష్టిభేదము, అతిరాత్రభేదము.

ఉదయనుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= అగస్త్యుడు, వత్సరాజు, ఉదయనాచార్యుడు, సమాప్తి, వృషభరాజు.

ఉదయము
సం., వి., అ., పుం., తత్స.,= పుట్టుక, ఉద్భవము, పైకివచ్చుట, రాశియొక్క ఉదయరూపమగు లగ్నము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్యంతి గ్రహాసూర్యాదయ అస్మాత్ ఉదయః. దీనియందు సూర్యాదయులు ఉదయింతురు.

నానార్థాలు :
ఉన్నతి, తూర్పుకొండ, పొడవు, ఆదాయము, ఒకపర్వతము, వెడలుట, సృష్టి, ఫలసిద్ధి, లగ్నము, ఉదయాచలము, వృద్ధి, ఉత్గము, వర్దిల్లునది, పైకివెడలునది.


ఉదయవేల
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = సూర్యోదయకాలము, అరుణోదయకాలము.

ఉదయాంతరము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉదయము.
వ్యుత్పత్త్యర్థము :
ఉదయస్యోదయజ్ఞానార్థమ్ అంతరం యత్ర. గ్రహాణాముదయజ్ఞానర్థం సంస్కారభేదే ఉదయశబ్దే వివృత్తిః. గ్రహములు ఉదయించుటయందు సంస్కారభేదము.


ఉదయాస్తసూత్రము
సం., నా. వా., అ., న., తత్స., ="క్ష్మ జే ద్యురాత్రసమమణ్డలమధ్యభాగజీవాగ్రకా భవతి పూర్వపరాశయోః సా. అగ్రాగ్రయోః ప్రగుణమత్ర నివద్ధసూత్రం యత్తద్వదన్తి గణకా ఉదయాస్తసూత్రమ్" సి శి ఉక్తే (1)క్షితిస్వాహోరాత్రవృత్తసమ్పాతయోర్బద్ధే సూత్రే

ఉదయించు
క్రి., = పుట్టు, పొడుచు, పొడము, కలుగు, ప్రవేశించు.

ఉదరంభర
వి., = స్వార్థపరురాలు.

ఉదరంభరి
సం., విణ.,(ఇ. ఈ. ఇ).,తత్స., = తన పొట్ట పోసికొనువాడు.

ఉదరగ్రంధి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = గుల్మరోగము, ప్లీహము, పెరుగుట.

ఉదరత్రాణము
సం., నా. వా., అ., న., తత్స.,= కడుపు, రొమ్ము మొదలుగుచోట ధరించెడి ఇనుప కవచము, మొలనూలు, నడికట్టు, ఉదరకవచము.

ఉదరథి
సం., నా. వా.,ఇ., పుం., తత్స., = సముద్రము.

ఉదరపిశాచుడు
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స.,= సర్వాన్నభక్షుడు, తిండిపోతు.

ఉదరము
సం., వి., అ., న., తత్స., = కడుపు.
పర్యాయపదాలు :
కుక్షి, జఠరము, తుందము, నాభిస్థనముల మధ్యభాగము, మధ్యభాగము.

వ్యుత్పత్త్యర్థము :
ఉదయర్తి గర్భోస్మాదితి ఉదరం. దీని వలన గర్భము ప్రకాశమౌను

నానార్థాలు :
పిచండము, జలోదరాది రోగము. యుద్ధము, ఉదరరోగము, అల్పము.


ఉదరరోగము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉదరమునకు సంభందించినరోగము.

ఉదరవతము
సం., నా. వా.,(త్. ఈ. త్).,తత్స., = బానపొట్ట.
వ్యుత్పత్త్యర్థము :
వృద్ధముదరమస్త్యస్య. పెరిగినపొట్ట ఇతనికి ఉన్నది అని. తుందాది వృద్ధతాయామ్. పెద్దగాపొట్టపెరిగి ఉండుటచేత అని. బృహదుదరయుక్తే. పెద్దపొట్టకలిగినవాడు అను అర్థమునందు.


ఉదరశయము
సం., నా. వా., అ., పుం., తత్స., = బోర్లాపరుండునది, గర్భమందలిశిశువు.

ఉదరశాండిల్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక ఋషి.

ఉదరాధ్మానము
సం., నా. వా., అ., న., తత్స.,= రోగభేదము.

ఉదరామయము
సం.,నా. వా., అ., పుం., తత్స., = అతిసారవ్యాధి.

ఉదరావర్తము
సం., నా. వా., అ., పుం., తత్స., = బొడ్డు, నాభి.

ఉదరిణి
సం., నా. వా., ఈ., స్రీ., తత్స., = గర్భిణీ, చూలాలు.
వ్యుత్పత్త్యర్థము :
ఉదరంతస్థగర్భోఽస్త్యస్యాః . కడుపున శిశువు కలది.

ఉదరిలుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పెద్దకడుపుకలవాడు.
పర్యాయపదాలు :
పెద్ద బొజ్జకలవాడు, బృహదుదరయుక్తుడు, పిచిండిలుడు, తుందిడు, తుందికుడు, తుందిలుడు, ఉదరీ.


ఉదర్కము
సం., వి., అ., పుం., తత్స., = రాగల కాలము.
నానార్థాలు :
రాగల ఫలము, ఉమ్మెత్త ముల్లు, భవిష్యత్తు, మదనకంటకము (వృ.వి), ఉత్తరకాలము, భావికాలము. రాబోయె కాలంలో కలిగే ఫలము.

వ్యుత్పత్త్యర్థము :
ఉదర్చ్యత ఇతి ఉదర్కః. మిగుల సమ్మానింపఁపడునది.


ఉదర్చి
సం., వి., స్., పుం., తత్స.,= పైకి లేచు జ్వాలలు కలది, అగ్ని, మన్మథుడు, శివుడు, కందర్పము, ఉన్నతశిఖాన్వితము.

ఉదర్ద్దము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక విధమైన దద్దురు రోగము, కుష్టభేదము.

ఉదర్యము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ఉదరమందు ఉన్నది, ఉదరమందు సంబంధించినది, జఠరభవము.

ఉదలావణికము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స., = ఉప్పులో ఊరవేసినది, ఉప్పునీట పక్వము చేయపడినది.

ఉదవసితము
సం., వి., అ., పుం., న., తత్స., = గృహము, ఇల్లు.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకం వసితమాచ్ఛాదనీకృతమనేనేతి ఉదవసితం. ఉదూర్ధ్వమవసీయతేస్మిన్నితి ఉదవసితం. ఉదకము దీనిచేత ఆచ్ఛాదనముగాఁచేయఁబడును.


ఉదవాపుడు
సం., నా. వా., అ.,పుం., తత్స.,= పితృదేవతలకు ఉదకతర్పణము చేయుజ్ఞాతి. జలమందు నివసించుట, తపస్సుకై జలమందు నిలిచి ఉండుట.

ఉదవాసము
సం., నా. వా., అ., పుం., తత్స., = జలమందు నివసించుట, జలమందు నిలిచి ఉండుట (తపస్సుకై).

ఉదవాహము
సం., నా. వా., అ., పుం., తత్స., = నీటిని మోయునది, మబ్బు.

ఉదశరావము
సం., నా. వా., అ., పుం., తత్స., = నీటితోనిండి ఉన్నమూకుడు, జలపూరకము.

ఉదశుద్ధి
సం., నా. వా., (ఇ. ఈ. ఇ).,తత్స., = (ఉద్గా ఉదకేన శుద్ధిః)నీటితో శుధ్ది చేయుట.

ఉదశ్రువు
సం., నా. వా., (ఉ. ఊ. ఉ).,తత్స., = ఏడ్చువాడు, కన్నీరు.

ఉదశ్విత్తు
సం., వి., త్., న., తత్స., = సగము నీళ్ళు చేర్చిన మజ్జిగ.
వ్యుత్పత్త్యర్థము :
ఉదకేనశ్వయతి వర్ధత ఇతి ఉదశ్విత. నీళ్ళచేత వృద్ధిఁబొందునది.


ఉదసనము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉత్ క్షేపణము.

ఉదస్తుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తొలగింపబడినవాడు, ఎగజిమ్మపడినది, నిరసింపపడినది, తొలగింపబడినది, అవమానపడినది..

ఉదస్థానము
సం., నా. వా., అ., న., తత్స.,= జలవాసము.

ఉదస్వంతము
సం., వి., త్., పుం., తత్స.,= సముద్రము, కడలి, సాగరము, జలధి.

ఉదహరణము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కుండ.

ఉదహారుడు
సం., నా. వా.,(అ. ఈ. అ).,తత్స., = నీళ్లుమోయువాడు.

ఉదాకరము
సం., వి., అ., పుం., తత్స., = సముద్రము, కడలి.

ఉదాజము
సం., నా. వా., అ., పుం., తత్స., = సేనాదికమును నడుపుట.

ఉదాత్తము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స.,= వేదము నందలి స్వర విశేషము, ఎత్తైనది, ఒక స్వరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్చైరాదీయతే ఉచ్చార్యత ఇత్యుదాత్తః. మీఁదఁ పలుకఁపడునది.

నానార్థాలు :
ఒక అర్థాలంకారము, దానము, పెద్ద మద్దెల ధాతృ, మహతి, దాయాత్యాగాది సంపన్నము, హృదయం, వాద్యవిశేషము.


ఉదాత్తరాఘవము
సం., నా. వా., అ., న., తత్స.,= నాటకభేదము.

ఉదాత్తుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= గొప్పవాడు, అధికుడు.
నానార్థాలు :
ఒప్పిదము కలవాడు, ధీరోదాత్తనాయకుడు, బల్చిరము కలవాడు, మనోజ్ఞుడు, నాయకభేదము, దయగలవాడు, ఇచ్చువాడు, ఇచ్చువాడు, పూర్వపదలోపము, దానము, వాద్యవిశేషము, మహతి, దాత, స్వరభేదము, అలంకారభేదము.


ఉదానము
సం., వి., అ., పుం., తత్స.,= కంఠము నందలి గాలి, పాము, బొడ్డు.
వ్యుత్పత్త్యర్థము :
భాషణాది సామర్ధ్య జననాత్. మాటలాడుట మొదలైన సామర్థ్యములు కలుగచేయుటవలన. ఊర్ధ్వమనంత్వనేనేత్యుదానః. పైకి తీసుకొని వెళ్ళబడతాయి దీనిచేత.(శబ్దములు) కనుక ఇది ఉదానము అనబడుచున్నది.


ఉదాపు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = జరాసంధునిపాత్రయందు, క్షత్రియభేదము.

ఉదారతావాదము
వి., = వ్యక్తి స్వాతంత్ర్యం సమాన ఆర్థిక అవకాశాలూ ఉండాలనే వాదము.

ఉదారధి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= ఉత్కృష్టబుద్దియందు, విష్ణువు, ఉత్కృష్టధీరమతి, ఉదారధీరుడు.

ఉదావర్తము
సం., నా. వా., అ., పుం .,తత్స., = మలబద్దకము, నురుగుతో, నొప్పితో ముట్టురక్తమునువెలువరుచు యోని రోగము, రోగభేదము.

ఉదావసువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = (నిమివంశ్యే నృపభేదే)నిమి వంశరాజు.

ఉదాసము
సం., వి., అ., పుం .,తత్స., = ఎగజిమ్మునది, ఉపేక్షించునది, నిరశించునది, తటస్థముగా ఉండుట, తగులమి.

ఉదాసించు
సం., స., క్రి., = తిరస్కరించు.

ఉదాసీనత
వి., = దేన్నీ పట్టించుకోకపోవడము, ఉపేక్ష, దేనిపట్లా తగిన ఆసక్తి చూపకపోవడము, పట్టీపట్టనట్లు ఉండటము.

ఉదాస్థితుడు
సం., వి., అ., పుం., తత్స., = అధ్యక్షుడు, ద్వారపాలకుడు, తనధర్మమును విడిచి వేగుల వాడుగా పనిచేయు సన్న్యాసి, చారుడు, వాకిటికావలివాడు, స్వకర్మమును వదిలిన ముని, వేగులవాడు.

ఉదాహరణము
సం., వి., అ., న., తత్స., = కథనము చెప్పుట.
నానార్థాలు :
వృత్తాంతము, పైకెత్తబడినవాడు, ఉన్నతికి తేబడినవాడు, దృష్టాంతము, ఉపోద్ఘాతము, వాక్యభేదము, కథాప్రసంగము, ప్రామాణికము, ఉపన్యాసము, చెప్పెడి అర్థమునకు సరితాకునట్లు ఎత్తిచూపెడు అర్థాంతరము, తెలివిడి.

వ్యుత్పత్త్యర్థము :
లక్షణసంబద్ధతయా ప్రామాణికవాక్యోపన్యాసే చ. లక్షణసంబంధమైన వాక్యోపన్యాసమందు.


ఉదాహరించు
సం., స., క్రి., = ఉదాహరణపరచు.

ఉదాహారము
సం., వి., అ., పుం., తత్స., = ఉదాహరణము, వృత్తాంతము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధృత్య ఆహ్రియత ఇత్యుదాహారః. ఎత్తి చెప్పఁబడునది.


ఉదాహృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= వృత్తాంతము, కథనము చెప్పుట. ఉదహరింపబడినది.

ఉదితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పుట్టినది, చెప్పఁపడినది, ఉదయించినది, కథనము, చెప్పుట, వాక్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్యతే స్మ ఉదితం. పలుకఁబడినది, చెప్పఁపడినది.

నానార్థాలు :
కురువేరు (వృ.వి), లగ్నము, (జ్యోతి) ఉదయమునొందిన రాశి కథ, ఉత్థితము, రాశి, రాజు జయించినపుడు చేయు స్వరభేదము, స్వరభేదము, సమృద్ధి, రాశి యొక్క ఉదయరూపమగులగ్నము.


ఉదితి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = ఉదయించుట.
నానార్థాలు :
రాశియొక్క ఉదయరూపమగులగ్నము, ఉద్గమము, వెడలుట, పుట్టుక, వృద్ధి, సృష్ఠి, తూర్పుకొండ, ఫలసిద్ధి, వడ్డి, ఉదయము.


ఉదీక్షణము
సం., నా. వా., అ., న., తత్స., = మీదికి చూచుట, బాగుగా ఆలోచించుట.

ఉదీక్ష్య
సం., అవ్య., తత్స., = ఉద్భావనీయము, ఉదీక్షనీయము.

ఉదీచి
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= ఉత్తరపు దిక్కు.

ఉదీచీనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఉత్తరమున ఉన్నది, ఉత్తరకాలమున ఉన్నది (తరువాత కాలమున), ఉత్తరదిక్కున పుట్టినది.

ఉదీచ్యము
సం., వి.,(అ. ఆ. అ).,తత్స., = ఉత్తరదేశము, కురువేరు (వృ. వి), ఉత్తర దిక్కున నున్న అమరావతీ నదికి పశ్చిమోత్తరముల మద్యముననుండుదేశము, ఉత్తరకాలముననున్నది. పుం. శరావతీ నదియెల్లగాగలపశ్చిమోత్తరముల మధ్యదేశము. విణ. ఉత్తరపుదిక్కు.
వ్యుత్పత్త్యర్థము :
తస్యాశ్శరావత్యాః అనధేః యః పశ్చిమోత్తరః స ఉదీచ్య ఇత్యుచ్యతే. ఆనదియే ఎల్లగాఁగల పడమరతో కూడిన ఉత్తరపు దిక్కున నుండు దేశము, శరావతీ నదియెల్లగాఁకల పశ్చిమోత్తరముల మధ్యదేశము.


ఉదీచ్యవృత్తి
సం., నా. వా.,ఇ., స్త్రీ., తత్స.,=వైతాలీయభేదము.

ఉదీపము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స., =వెల్లువ, ప్రవాహము.

ఉదీరణము
సం., నా. వా., అ., న., తత్స., = పలుకుట, ఉచ్చారణము, చెప్పుట, కథనము. విసరివేయుట (బాణములను), ప్రేరణము, క్షేపణము.

ఉదీరితము
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స.,= చెప్పపడినది, ఉదికృతము, చెలరేగినది, ప్రేరితము, పురికొల్పపడినది, చెప్పుట.

ఉదీర్ణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఉదారము.
నానార్థాలు :
గొప్పది, ఉత్పన్నము, పుట్టినది, ఉద్రేకము పొందినది, గర్వించునది, పలుకపడినది, ఉదారుడు. ఉత్తేజితము, ఉద్దీపితము, ఉద్ధతము, విష్ణువు.


ఉదుంబరదళ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = దంతి (వృ.వి) అత్తిచెట్టు.

ఉదుంబరపర్ణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = దంతి.
వ్యుత్పత్త్యర్థము :
ఉదుంబరస్వ పర్ణానీవ పర్ణాన్యస్యా ఇతి ఉదుంబపర్ణీ. అత్తిఆకుల వంటిఆకులు కలది.


ఉదుంబరము
సం., వి., అ., న., తత్స.,= రాగి, తామ్రము.; పుం. మేడి, అత్తి.
వ్యుత్పత్త్యర్థము :
ఉదంబరాభత్యాదుదుంబరం. మేడి వంటి వన్నెకలది. ఉన్నతత్వాదుల్లంఘితమంబరం అనేనేతి ఉదుంబరః. ఔన్నత్యము చేతనాకాశమును దాఁటునది.

నానార్థాలు :
పుం. ఉదుంబరవృక్షము, క్షీరవృక్షము, సుప్రతిష్ఠితము, అక్షము, హేమదుగ్ధము, సదాఫలము, కాలస్కంధము, యజ్ఞయోగ్యము, యజ్ఞీయము, శీతవల్కము, జంతుఫలము, పుష్పములు లేనటువంటిది, పవిత్రకము, సౌమ్యము, ఎర్రని పొడలుకల కృష్ణ భేదము, కర్షము అనెడి మాన విశేషము, వృక్షము, నపుంసకుడు, కుష్ఠభేదము, సాల్వజనపదావయవము, మేడిపండు, దేహము, పండకము, గుమ్మము, ఒక దేశము, నపుంసకము, శీతఫలము, గడప.


ఉదుంబరుడు
సం., వి., అ., పుం., తత్స.,= నపుంసకుడు, పేడి,

ఉదుంబలము
సం., నా. వా., అ., పుం., తత్స.,= విస్తీర్ణవలయుక్తము.

ఉదుత్యము
సం., నా. వా., అ., న., తత్స.,= సూర్యోపస్థానమునందు మంత్రము, సంధ్యాప్రయోగమందు కనబడుతుంది.

ఉదుమ్బరావతి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఒక నది.

ఉదూఖలము
సం., వి., అ., న., తత్స., = ఱోలు, గుగ్గిలపుచెట్టు, ద్రవ్యము, సంధిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధం ఖమాకాశమస్య ఉదూఖలం. మీఁద బయలైయుండునది.


ఉదూఢము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఊఢము, పెండ్లి అయినది, స్థూలము, బలిసినది, వహింపపడినది, గొప్పది.

ఉదృచము
సం., నా. వా., చ్., స్త్రీ., తత్స.,= ఉదయము.

ఉదేజయము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= వడరించునది, గజగజలాడించునది, వుడికించునది.

ఉదౌదనము
సం., నా. వా., అ., పుం., తత్స., = నీటిలో వేసిన అన్నము, జలాహారము.

ఉద్
సం., అవ్య., తత్స., = ప్రకాశము, విభాగము, లాభము, ఊర్ధ్వము, ఉత్కర్షము, ప్రాబల్యము, ఆశ్చర్యము, శక్తి, ప్రాధాన్యము ,బంధనము, అభావము, మోక్షము.

ఉద్గంధి
సం., విణ., (ఇ. ఈ. ఇ)., తత్స., = ఎక్కువ వాసన కలది.

ఉద్గతము
సం., విణ., (అ. ఆ. అ).,తత్స.,= భేదించుకుని వెలికుఱికినది.
నానార్థాలు :
క్రక్కబడినది, పైకిపోయినది, పుట్టినది, ఉదయము, పుట్టుక, వాంతి, ఛందోభేదము, ఉదితము, ఉత్పన్నము.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్గచ్ఛతిస్మ ఉద్గతం. వెడలునది.


ఉద్గతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఉదయము.
నానార్థాలు :
ఉత్పత్తి, పైకిపోవుట, పుట్టుక, ఉదయము, వాంతి, ఎగవు.

ప్రయోగము :
ఉదా. జగదుద్గతికిని బీజము. ఆము. 3, ఆ.


ఉద్గమనీయము
సం., వి., అ., న., తత్స.,= ఉతికిన దోవతి జోడు. (కొందరిది త్రిలింగమనియు దీనికర్థము ఉదికినదోవతి అనియు సహేతుకముగ చెప్పుచున్నారు); విణ. ఎగయఁతగినది. పంచెలచాపు, ధౌత వస్త్రము.
వ్యుత్పత్త్యర్థము :
పరిధానార్థం ఉత్తరాసంగార్థం చ ఉద్ధమ్యత ఇతి ఉద్గమనీయం. కట్టుకొనుటకును మీఁదవేసికొనుటకు ఎత్తఁబడునది.


ఉద్గమము
సం., వి., అ., పుం., తత్స., = ఉన్నతి.
నానార్థాలు :
ఎత్తు, పుట్టుక, ఉదయము, నిట్టనిలుచుట, వెలువడుట, మొలక, ఎగపు, పుట్టుక.


ఉద్గమించు
సం., అ., క్రి., =ఎగయు.

ఉద్గాత
సం., వి., ఋ., పుం., తత్స.,= యజ్ఞము నందు సామవేద తంత్రము నడుపువాడు, సామవేదగాయకుడు, ఋత్విక్ భేదము, గ్రంథపరిచ్చేదము, సామగానము చేయువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గాయతి దేవాదీన్ స్తౌతి ఉద్గాతా. దేవతలను బెట్టుగాఁ స్తోత్రము చేయువాడు, యజ్ఞము నందు సామవేద తంత్రము నడుపువాడు.


ఉద్గారము
సం., వి., అ., పుం., తత్స.,= క్రక్కుడు, త్రేఁపు, వాంతి, కారుట, కంఠశబ్దభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్గరణ ముద్గారః. వెళ్ళించుట ఉద్గారము.


ఉద్గారి
సం., నా. వా., (న్.ఈ.న్)., తత్స., = క్రక్కునది, త్రేన్చునది, వెడలించునది.

ఉద్గారించు
సం., అ., క్రి.,= తేచు.

ఉద్గిరణము
సం., నా. వా., అ., న., తత్స.,= కంఠశబ్దభేదము, కారించువాడుకక్కించువాడు.

ఉద్గీతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., .= గట్టిగా పాడుట, ఒకానొక రాగము, సామ గానము చేయుట, ఒకానొక మాత్రావృత్తము.

ఉద్గీథము
సం., వి., అ., పుం., తత్స., = సామప్రణవము, సామవేదము, ఉద్గాత గానము చేయు సామవేదభేదము.

ఉద్గీర్ణము
సం., విణ., (అ. ఆ. అ).,తత్స.,= క్రక్కబడినది, వెడలింపబడినది, కారబడుచున్నది.

ఉద్గ్రంథము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = బంధనములేనిది, విషయబంధమునుండి విడిపోయినవాడు, ఉన్నూక్తము, ఉన్మోచనము, బంధోన్ముక్తము. వి., = గొప్పగ్రంథము, విడిచిపెట్టడము.; విణ. కట్టువిడువబడే.

ఉద్గ్రభణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉదృత్యగ్రహణము, వాదభేదము.

ఉద్గ్రహణము
వి., = పైకెత్తి పట్టుకోవడము.

ఉద్గ్రాహిత
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = న్యాసము, కట్టబడినది, గ్రహింపబడినది.

ఉద్గ్రీవుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = మెడపైకి ఎత్తినవాడు, పైకెత్తబడిన మెడగలవాడు, గర్వముకలవాడు.

ఉద్ఘట్టనము
సం., నా. వా., అ., న., తత్స., = ఒరపిడి.

ఉద్ఘనము
సం., వి., అ., పుం., తత్స., = చెక్కెడుమ్రానికి ఊతగా క్రిందనుంచుకొనెడి బల్లలోనగునది, దాయి, వడ్రంగి పనిచేయుబల్ల.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధన్యతే కాష్ఠమత్రేతి ఉద్ఘనః. దీనియందు కొయ్య చెక్కఁబడును.


ఉద్ఘము
సం., విణ., అ., పుం., తత్స.,= ఇది వృత్తియందు ఉత్తర పదమై శ్రేష్ఠతను తెలుపును. (ఉదా. గవోద్ఘము మొ.).
నానార్థాలు :
శస్త్రం, శ్రేష్ఠము, ప్రశస్తము, ప్రకాండము, అగ్ని, హస్తపుటము, డొప్పువలె పట్టిన చేయి, దేహమునందలి వాయువు.


ఉద్ఘర్షణము
సం., నా. వా., అ., న., తత్స., = రుద్దుట, రాచుట.

ఉద్ఘసము
సం., నా. వా., అ., న., తత్స.,= మాంసము.

ఉద్ఘాటకము
సం., నా. వా., అ., పుం., న., తత్స.,=ఘటీయంత్రము, నుయ్యి నుండి నీటిని తోడుటకు ఉపయోగించు సాధనము.

ఉద్ఘాటనము
సం., వి., అ., న., తత్స.,= ఏతము, ఉగ్గడించుట, భేదించుట, నీరు తోడు గిలక, కూచిక, తాళం చెవి, పైకిలాగుట, వెలికి చెప్పుట, అడ్డులేకుండగాచేయుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ఘాట్యతే జలమనేనేత్యుద్ఘాటనం. దీనిచేత నీళ్ళు కూర్చఁబడును.


ఉద్ఘాటము
సం., నా. వా., అ., పుం., తత్స., = చేద.
నానార్థాలు :
గిలక, చితము, కుంచిక, తాళంచెవి, సరుకులపై సుంకము పుచ్చుకొను చోటు, ఘాటి.


ఉద్ఘాటించు
సం., స., క్రి., = భేదించు, వ్రచ్చు.

ఉద్ఘాటితజ్ఞుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= బుద్ధిమంతుడు, విజ్ఞుడు.

ఉద్ఘాటితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒరవడి.
నానార్థాలు :
చెప్పబడినది, భేదింపబడినది, తెరవపడినది, పైకిలాగబడినది, ఉగ్గడింపబడినది, భేదింపబడినది.


ఉద్ఘుషితము
సం., నా. వా., (అ. ఆ. అ).,తత్స.,= శబ్దముచేత తెలుపపడిన అభిప్రాయము కలది (వాక్యము).

ఉద్ఘుష్టము
సం., విణ., (అ.ఆ.అ.) తత్స.,= ధ్వనిచేసినది, మ్రోగినది, పేనబడినది. ఉద్ఘోషింపబడినది.

ఉద్ఘోషము
సం., వి., అ., పుం., తత్స.,=గట్టిగా మాటలాడుట, కింవదంతి, చాటుట, మొర, జనప్రవాదము.

ఉద్ఘోషించు
సం., వి., అ., క్రి.,=మొరపెట్టు.

ఉద్దండపిండము
వి., =ఘటికుడు, అసాధ్యుడు.

ఉద్దండము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= ఎత్తబడిన కర్ర గలది, పైకి లేచిన కాడ గలది, భయంకరమైనది, ప్రచండమైనది, పొడవైనది, ఎక్కువైనది.

ఉద్దండించు
సం., అ., క్రి.,= ఎక్కుడగు, పొడవగు. క్రి.,= విడుచు, సాహసించు.

ఉద్దండుడు
వి., = గొప్పవాడు, ఘటికుడు

ఉద్దంతురము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స.,= ఉత్తుంగము, పొడవైనది, మిట్టపన్ను, ఉన్నతమైనది, భయంకరమైనది.

ఉద్దంశము
సం., వి., అ., పుం., తత్స.,= మత్కుణము, నల్లి, జోరీగ, దోమ, పేను.

ఉద్దర
వి.,= తాకట్టు, అరవు.

ఉద్దానము
సం., వి., అ., న., తత్స.,= కట్టు, మరుపుట, ప్రొయ్యి, లేచుట, బందించుట, ఉద్యమము, మధ్యభాగము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్దీయతే ఖండ్యతే రక్ష్యతే వా ఉద్దానం. దీనియందు ఖండింపబడును లేక రక్షింపబడును.


ఉద్దామము
సం., నా. వా.,(అ. ఆ. అ).,తత్స.,= ఒకానొక దండకము.
నానార్థాలు :
బంధనరహితము, అప్రతినియమము, అతిరుద్రవరుణడు, వరుణుడు, స్వతంత్రుడు. మహాన్, గంభీరము, ధండకభేదచ్ఛందోవిశేషము.


ఉద్దాముడు
సం., వి., అ., పుం.,= వరుణుడు.; విణ. కట్టులేనివాడు, స్వతంత్రుడు.

ఉద్దాలకవ్రతము
సం., నా. వా., అ., న., తత్స.,= సావిత్రీ వ్రతము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్దాలకం పాపనాశకం వ్రతం. పాపనాశనానికి చేయు వ్రతము.


ఉద్దాలకాయనులు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉద్దాలకుని కుమారులైన శ్వేతకేతువులు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్దాలకస్య గోత్రాపత్యం. ఉద్దాలకుని గోత్రమున పుట్టినవారు.


ఉద్దాలకుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒకానొక ఋషి, విరిగి (వృ. వి), భంగము, కావించెడి ఒకయాట.

ఉద్దాలము
సం., వి., అ., పుం., తత్స., = విరిగిచెట్టు, చేపలను పట్టుగూడు, అడవియాళ్ళు, బహువారవృక్షము, వనకోద్రవము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్యాలయత్యంగముద్దాలకః. శరీరమును చీల్చునది.


ఉద్దాసము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉత్పీడనము.

ఉద్దిగొను
క్రి.,= జతకూడు, జంట అవు.

ఉద్దినము
సం., వి., అ., న.,= పట్టపగలు.

ఉద్దిష్టము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఉద్ధేశింపబడినది, ఉద్దేశింపకోరబడినది, బోధింపబడినది, ఉపాయభేదము, అభిలషితము.

ఉద్దీపకము
సం., వి.,(అ. ఆ. అ)., తత్స.,= ఉద్దేశింపచేయునది, ప్రకాశించుట, జ్వలించుట, మెరుగుపెట్టుట, పురికొలుపుట. పుం., కొండచీమ.; విణ.వెలిగించునది.

ఉద్దీపనము
సం., వి., అ., న., తత్స.,= ప్రకాశించుట.
పర్యాయపదాలు :
రసాద్యుద్దీపకము, అలంకారోక్తి, ఉత్తేజము, వెలుగుట, విభావభేదము(ఆలంబనగుణాదికము)


ఉద్దీపితము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., =ప్రకాశింపచేయబడినది, జ్వలింపచేయపడినది, హెచ్చింపబడినది, వెలిగింపబడినది.

ఉద్దీప్తము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = వెలిగినది, రేగినది, ప్రకాశించినది.

ఉద్దీప్రము
సం., నా. వా., అ., పుం., తత్స.,= మండునది, గుగ్గిలము, ప్రకాశించునది.

ఉద్దురము
సం., నా. వా., అ., పుం., తత్స.,= దింపిన బరువుకలది (ఎద్దు), దృఢము, ఉచ్ఛుము, దట్టమైనది, నిండినది, సమర్థము.

ఉద్దృప్తము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స.,= గర్వాన్వితము.

ఉద్దేశకము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉదాహరణవాక్యము, ఉద్దేశించువాడు, ఉపదేశించువాడు, అడుగువాడు.

ఉద్దేశము
సం., వి., అ., పుం., తత్స.,= అన్వేషణము, లక్ష్యము, సంక్షేపము, ఆధారము, గురి.
నానార్థాలు :
అనుసంధానము, ఉపదేశము, అభిలాష, ఉత్కృష్ఠదేశము, తంత్రాధికరణభేదము, ఎత్తైనప్రదేశము, ఒకభాగము, ప్రఛ్చకము, అభిప్రాయము, ఉదాహరణములతో వివరించుట, శ్రేష్టమైన ప్రదేశము.


ఉద్దేశించు
సం., స., క్రి., = గుర్తించు.

ఉద్దేశ్యము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స.,= గుర్తింపతగినది.
నానార్థాలు :
సరిగా చేయదగినది, ఉద్దేశింపదగినది, ఉదాహరణములతో వివరింపదగినది, అభిలాషకు గానీ అభిప్రాయమునకు గానీ విషయమైన వస్తువు, కోరదగినది, ఉపదేశించదగినది.


ఉద్దేశ్యాసిద్ధి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= అనుమతి రోషభేదము.

ఉద్దేహికము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= చెదపురుగు.

ఉద్ద్యోతము
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రకాశింపచేయునది, కిరణము, కాంతి, వ్యాకరణమునందు ఒక గ్రంథము, అలంకార శాస్త్రమునందు ఒక గ్రంథము, సూర్యకిరణము.

ఉద్ద్యోతించు
సం., అ., క్రి., = ప్రకాశించు, వెలుగు.

ఉద్ద్రావము
సం., వి., అ., పుం., తత్స., = ఈడబోక, పారిపోవుట, పలాయనము, ఉత్కృష్టగద్య కావ్యము, వెనుదీయునది.

ఉద్ద్రుతము
సం., విణ., (అ.ఆ.అ.) = ఈడబోయినది, వేగంగా పరిగెత్తునది, వెన్నిచ్చిపారిపోయినది.

ఉద్ధతమనస్కత్వము
సం., నా. వా.,అ., న., తత్స.,= అభిమాన గర్వము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధతం మనో యస్య. ఉద్ధతమైన మనస్సు కలది.


ఉద్ధతము
సం., విణ., (అ.ఆ.అ)., తత్స.,= అవినీతి.
నానార్థాలు :
నిష్ఠూరము, పైకెగిరినది, ఉద్గతము, గర్వించినది, కఠినమైనది, ఆహతము, కొట్టపడినది, ఘోరము, నివిడము, ఉత్థితము, ఉత్ క్షిప్తము, ఆహతము, చాలితము, రాజువద్ద ఉండు మల్లుడు.


ఉద్ధతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= పైకెగురుట, పెద్దదెబ్బ, అణకువ లేకుండుట, గర్వము, ఉద్వృత్తి.

ఉద్ధమచూడా
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = నిదేశ క్రియ.

ఉద్ధమము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = పిల్లనగ్రోవి మొదలగునవి ఊదునది, పూరించునది.

ఉద్ధయ
సం., నా. వా., అ., త్రి., తత్స., = పానము చేయువాడు.

ఉద్ధరణము
సం., వి., అ., న., తత్స., = ముళ్ళు మొదలగువాని ఊడదీయుట.
నానార్థాలు :
వస్త్రాదులనులాగుట, విప్పుట, ఆపదనుండి తొలగించుట, రక్షించుట, పెకలించుట, నిర్మూలనము చేయుట, పదవి నుండి తీసివేయుట, స్థానభ్రంశము కలిగించుట, పైకెత్తుట, వాంతి, మోక్షము, ఋణ విమోచనము, క్రక్కిన పదార్థము, క్రక్కిన అన్నము, పైకిలాగుట. పెకలించుట, మీదికెత్తుట, వాంతియెత్తినయన్నము.


ఉద్ధరణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = నీళ్లుఎత్తి చేతపోసికొనెడు లోహ సాధనము.

ఉద్ధరణీయము
సం., నా. వా., అ., త్రి., తత్స., = ఉన్మూలనీయము, ఉత్థాపనీయము, ఆహరణీయము.

ఉద్ధరావసృజా
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఉద్ధరణావసర్జనార్థనిదేశక్రియ.

ఉద్ధరించు
సం., స., క్రి., = పెల్లగించుట, మీదికెత్తు.

ఉద్ధర్త
సం., విణ., (ఋ.ఈ.ఋ)., తత్స., = మీదికెత్తువాడు.
పర్యాయపదాలు :
ఆపదనుండి విడిపించువాడు, రక్షకుడు, నిర్మూలించువాడు, నాశముచేయువాడు, ఉద్ధరించువాడు.


ఉద్ధర్షణ
సం., నా. వా., అ., న., తత్స., = సంతోషము, ప్రోత్సాహనము, రోమాంచనము.

ఉద్ధర్షము
సం., వి., అ., పుం., తత్స., = ఉత్సవము, పండుగ.
నానార్థాలు :
సంతోషమును కలిగించునది, ప్రోత్సాహపెట్టునది, గగ్గురుపాటు, రోమాంచము.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధర్షయంత్యనేనేత్యుద్ధర్షః. దీని చేత సంతోషింతురు


ఉద్ధర్షి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ప్రోత్సాహపెట్టునది, సంతోషకరము, ఎక్కువసంతోషము కలవాడు.

ఉద్ధవుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = పండుగ, యజ్ఞవహ్ని, ఒక యాదవుడు, ఉత్సవము, యాగాగ్ని, కృష్ణునికి మంత్రి అయిన ఒకనొక యాదవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ ధునోతి దుఃఖమిత్యుద్ధవః. దుఃఖమును పోఁగొట్టునది.


ఉద్ధస్తము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = చేతులైత్తినవాడు.

ఉద్ధాంతము
సం., నా. వా., అ., పుం., తత్స., = మిక్కిలి అడపపడినది.సం., నా. వా., అ., పుం., తత్స., = ఏనుగు వమితము.

ఉద్ధానము
సం., వి., అ., న., తత్స., = పొయ్యి.
నానార్థాలు :
ఉద్గతము, వమితము, క్రక్కబడినది, వాంతి, లేచినది, లేచుట.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధీయతేగ్నిరనేనేతి ఉద్ధానం. దీనిచేతఅగ్ని ధరింపఁబడును.


ఉద్ధారకుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = మీదికెత్తువాడు, ఆపదనుండి విడిపించువాడు, రక్షకుడు, నాశనముచేయువాడు, ఉద్ధరించువాడు.

ఉద్ధారణము
సం., వి., అ., న., తత్స., = పైకెత్తుట, నీళ్లుమొదలుగునవి చేదుట, ఆపదనుండి విడిపించుట, పంచుకొనుట, ఉద్ధరించుట, ఉత్ఫాపనము, ఉద్దేరసంవాదనము.

ఉద్ధారము
సం., వి., అ., పుం., తత్స., = ఉద్దరువు.
నానార్థాలు :
అప్పు, పైకెత్తుట, లేవనెత్తుట, ఋణము, ఉద్ధృతి, మోచనము, మోక్షము, నిర్వాణము, ముక్తి, వర్జనము, ఋణశూన్యము, ఉత్కర్యము, ఋణశుద్ధి, విడిపించుట, వెలికితీయుట, ఉద్దృతి, వడ్డీలేని అప్పు.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధ్రియతే గృహ్యత ఇతి ఉద్ధారః. పుచ్చుకొనఁబడినది.


ఉద్ధి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ధారకము.

ఉద్ధూపనము
సం., నా. వా., అ., న., తత్స., = ఊదరపెట్టుట, పొగపెట్టుట, పొగవేయుటకు ఉపయోగించుపదార్థము.

ఉద్ధూలనము
సం., నా. వా., అ., న., తత్స., = పొడిచల్లుట, వేశవారము, సాంబారుపొడి.
వ్యుత్పత్త్యర్థము :
ధూలివదున్మర్దయతి. పొడిచేయుట


ఉద్ధూషణము
సం., నా. వా., అ., న., తత్స., = రోమాంచనము, గగుర్పాటు.

ఉద్ధృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చేఁదఁబడినది.
నానార్థాలు :
అనుభవించి విడువఁబడినది, కృతోద్ధరణము, సముదక్తము, ఉత్ క్షిప్తము, వడకింపబడనది, మీదికి కదిలింపపడినది, చెదరగొట్టబడినది, గట్టిగా పిలవబడినది, ఎత్తబడినది, లాగబడినది, పరిభుక్తోజ్ఝితము, వేగంగా పరిగెత్తినది, వెన్నిచ్చిపారిపోయినది.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్ధ్రియతే స్మ ఉద్ధృతం. పయికెత్తబడినది.


ఉద్ధృతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఎగజిమ్ముట.
నానార్థాలు :
పై కెత్తుట (నీళ్లు మొదలుగునవి) చేదుట, ఊడదీయుట, విమోచనము, విముక్తి, గర్వము, ఆపదనుండి తప్పించుట.


ఉద్ధృతుడు
సం., వి., అ., పుం., తత్స., = పొలిమేర విధమును సామంతులవలన విని దానియనుభవాదులెరిగి యా పొలిమేరనేర్పాటు చేసినవాడు.; విణ. పైకెత్తబడినవాడు.

ఉద్ధ్యము
సం., నా. వా., అ., పుం., తత్స., = నదీభేదము, నదము.

ఉద్బంధకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = వ్రేలాడ చేయువాడు, ఉరితీయువాడు, చాకలపనిచేయు ఒక సంకీర్ణవర్గము కలవాడు.

ఉద్బంధనము
సం., నా. వా., అ., న., తత్స., = కట్టువీడినది, చెఱనుండి తొలగినది, ఉరితీయుట.

ఉద్బా(ద్వా)హు
సం., నా. వా.,(ఉ.ఊ.ఉ.)., తత్స.,= చేతులెత్తినవాడు.

ఉద్బాసము
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రకాశము, కాంతి.

ఉద్బుద్ధము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = వికసితము.
పర్యాయపదాలు :
ప్రబుద్ధము, మేలుకొన్నది, జాగరితము, నిదురనుండి మేల్కొన్నది, వికసించినది.

నానార్థాలు :
తలపునకు వచ్చినది, ఉద్రేకించినది, అతిశయించినది.


ఉద్బోధకుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = తలపునకు తెచ్చువాడు, మేలుకొలుపువాడు, ఉద్దీపకము, ఉద్బోధకారము, సూర్యుడు.

ఉద్బోధము
సం., వి., అ., పుం., తత్స., = తలపు, మేలుకొలుపు, వికాసము, ఉద్భోదనము.

ఉద్బ్రమణము
సం., నా. వా., మ., న., తత్స., ఉద్భ్రమము

ఉద్బ్రాంతకము
సం., నా. వా., మ., న., తత్స., చుట్టుతిరిగినది, బ్రాంతినిపొందినది

ఉద్భందనము
సం., నా. వా., మ., న., తత్స., ఉద్బంధము

ఉద్భటము
సం., వి., అ., పుం., తత్స., = తాబేలు, అధికము.

ఉద్భటుడు
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = ఉద్బటుడు, మహాశయుడు, శ్రేష్ఠమైన భావముకలవాడు, శౌర్యముకలవాడు, శ్రేష్టుడు, గొప్పదైన కోరిక గలవాడు, ఉదారుడు, ఉదాత్తుడు, ఉదీర్ణుడు, మహాశయుడు, గొప్పమనస్సుకలవాడు, మహాత్మా, పుం., సూర్యుడు, తాబేలు, సూర్పః (అంటే చేట అని అర్థము, ఈ శబ్దము సంస్కృతములో సూర్పః అని పుంలింగములో ప్రయోగింపబడినది.) విణ. అధికుడు.

ఉద్భవము
సం., వి., అ., పుం., తత్స., = జననము, పుట్టుక, విష్ణువు, సరిసారాతీతము, ఉత్తత్తిమతి.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్భవనముద్భవః. ఉద్భవించుట.


ఉద్భావనము
సం., నా. వా., అ., న., తత్స., = కల్పనము, పుట్టించుట, ఊగించుట.

ఉద్భిజ్జము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = చెట్టు, వృక్షము, భూమిని భేదించుకొని పుట్టునది, తరుగుల్మాదికము.
వ్యుత్పత్త్యర్థము :
భూమేరుద్భేదనముద్భిత్, తతోజాతముద్భిజం. భూమిని వ్రక్కలించి పుట్టినది, భూమిని భేదించుకుని పుట్టునది.


ఉద్భిదము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = సహజమైన ఊట, ఒకరకమైన యాగము, పెట్లుట, తరుగుల్మాదికము.(ఇది దకారాంతముగాను కలదు.)
వ్యుత్పత్త్యర్థము :
ఉద్భినత్తీత్యుద్భిదం. భూమిని వ్రక్కలించునది, భూమిని భేదించుకొని పుట్టునది.


ఉద్భిన్నము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = పుట్టినది, మొలచినది, దళితము, చీల్చబడినది, విరిసినది.

ఉద్భూతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = పుట్టినది, ప్రత్యక్షయోగ్యమైనది. (రూపము మొదలుగునవి). పొడవైనది.

ఉద్భూతి
సం., నా. వా., (ఇ.ఈ.ఇ.)., తత్స., = పుట్టుక, ఉత్పత్తి ఔన్నత్యము, గొప్ప ఐశ్వర్యముకలవాడు.

ఉద్భేదము
సం., వి., అ., పుం., తత్స., = ఎగవ్రచ్చుట, పుట్టుక, ప్రకాశము, బయలుపరచుట, రోమాంచనము, మేలనము.

ఉద్భ్రమము
సం., వి., అ., పుం., తత్స., = ఉబ్బించుట.
నానార్థాలు :
ఊర్ధ్వ భాగమును కదిలించుట, అవ్యవస్థిత చిత్తత, చమత్కారము, మనస్సు యొక్క వ్యాకులపాటు.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్భ్రమణముద్భ్రమః. మీఁదఁ కలిగించుట.


ఉద్భ్రాంతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = చుట్టూతిరిగినది.
పర్యాయపదాలు :
కత్తినిద్రిప్పుట, చుట్టుతిరుగుట, గిరగిరత్రిప్పబడినది, (మనస్సు మొదలుగునవి) బ్రాంతిపొందినది, పైనతిరిగినది, తిరుగుడుపడినది.


ఉద్యతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = పైకెత్తువాడు, యత్నము, పూనిక, యత్నము, కడక.

ఉద్యత్
సం., నా.వా., (త్.ఈ.త్.)., తత్స., = పైకి పోవుచున్న, లేచుచున్న, ఉదయించుచున్న.

ఉద్యమనము
సం., నా. వా., అ., న., తత్స., = పైకెత్తుట, ఎగజిమ్ముట.

ఉద్యమము
సం., వి., అ., పుం., తత్స., = ఉద్యోగము.
నానార్థాలు :
యత్నము, కడఁక, పట్టుదల, ప్రాయాసము, పూనిక, సిద్ధమగుట.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్యమనముద్యమః.


ఉద్యమించు
సం., అ., క్రి., = యత్నించు, కడగు, ప్రారంభించు.

ఉద్యమితము
సం., నా.వా., (అ.ఆ.అ.)., తత్స., = పైకెత్తబడినది, ప్రయత్నించుచు పురి కొల్పబడినది.

ఉద్యము
సం., నా. వా., అ., త్రి., తత్స., = కథనీయము.

ఉద్యాపనము
సం., వి., అ., పుం., న., = వెడలించుట.

ఉద్యుక్తము
సం., విణ., (అ.ఆ.అ.) = ఉద్యోగించినది, పూనివది, సిద్ధమైనది.

ఉద్యోగపర్వము
సం., నా.వా., న., న., తత్స., = భారతమున ఐదవపర్వము.

ఉద్యోగము
సం., వి., అ., పుం., న., తత్స. = ఉత్సాహము, కడఁక, అధ్యవసాయము, ప్రయాణము, పాటుపడుట. పుం. యత్నము, చేష్ట, ఉత్సాహము, అధ్యవసాయము, ఉద్యమము.

ఉద్యోగస్థుడు
వి., = కొలువు చేసే వ్యక్తి, పనివాడు.

ఉద్యోగి
సం., విణ., (న్.ఈ.న్)., తత్స., = వ్యాపారము గలవాడు, పాటుపడువాడు. ఉద్యోగము కలవాడు.

ఉద్యోగించు
సం., అ., క్రి., = ఉద్యమించు, కడగు.

ఉద్యోగిస్వామ్యము
వి., = ఉద్యోగివర్గపాలన.

ఉద్యోతించు
సం., అ., క్రి., = ప్రకాశించు.

ఉద్యోతితము
సం., విణ., (అ.ఆ.అ.) = ప్రకాశితము.

ఉద్రంగము
సం., వి., అ., పుం., = అంతరమున నిలుచు వస్తువు.

ఉద్రథము
సం., నా. వా., అ., పుం., తత్స., = రధకీలకము, బండి యిరుసుచీల, కోడి.

ఉద్రము
సం., వి., అ., పుం., = నీటిపిల్లి

ఉద్రిక్తత
వి., = ఉద్రేకము, (పరిస్థితికి చెందిన) విషమత్వము, అతిశయము, భయాందోళనలస్థితి.

ఉద్రిక్తము
సం., విణ., (అ.ఆ.అ.) = ఉద్రేకించినది, అతిశయించినది, విజృంభించినది, తెల్లదైనది

ఉద్రేకము
సం., వి., అ., పుం., = విజృంభణము, అతిశయము, అధికము.

ఉద్రేకించు
సం., అ., క్రి., = విజృంభించు, అతిశయించు.

ఉద్వమనము
సం., నా. వా., అ., పుం., తత్స., = వాంతి, కక్కు.

ఉద్వయస్కుడు
సం., నా. వా., (స్.ఈ.స్.)., తత్స., = వయసుగడిచినవాడు, ముదుసలి.

ఉద్వర్తనము
సం., వి., అ., న., తత్స., = ఎగయుట, నలుఁగు, రాయిడి, అతిక్రమించి నడతగలది, ఘర్షణము, విలేపనము, ఉత్పతనము, ఉత్సాదనము, నలుగుపెట్టుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్వర్తతే అనేనాంగమితి ఉద్వర్తనం. దీనిచేత దేహము తోమఁబడును.


ఉద్వర్తము
సం., నా. వా., అ., పుం., తత్స., = అతిశయించిన, నలుగుపెట్టుట.

ఉద్వహ
సం., వి.,అ., స్త్రీ., = కూతురు.

ఉద్వహనము
సం., వి., అ., న., = ఎగబట్టుట, పై కెత్తుట, పెండ్లి ఆడుట.

ఉద్వహించు
సం., స., క్రి., = ఎగబట్టు, మోచు. మోయువాడు, ముఖ్యుడు, పితృదేవతలను నరకమునుండి ఉద్ధరించువాడు, పుత్రుడు.ఎగబట్టు, మోచు. మోయువాడు, ముఖ్యుడు, పితృదేవతలను నరకమునుండి ఉద్ధరించువాడు, పుత్రుడు.

ఉద్వహుడు
సం., వి.,అ., పుం., = కొడుకు, పైకెత్తువాడు.

ఉద్వాంతము
సం., వి., అ., పుం., న., తత్స.,= మదములేని ఏనుగు.; విణ. క్రక్కఁబడినది, భేదించుకొని వెలికుఱికినది.
వ్యుత్పత్త్యర్థము :
మదముద్వమతీతి ఉద్వాంతః. మదమును వెళ్ళించునది, ఉద్వమతి స్మ ఉద్వాంతం వెడలునది.


ఉద్వాపము
సం., నా.వా., అ., పుం., న., తత్స.,= పాదవైయుట, కొదుకుట, ఉద్ధరణము, వ్రేళ్లతో పెకల్చుట, ఉన్మూలనము.

ఉద్వాసనచెప్పు
అ., క్రి., = తొలగించు, స్థానభ్రంశము చేయు.

ఉద్వాసనము
సం., వి., అ., న., తత్స., = తొలగించుట.
పర్యాయపదాలు :
వధించుట, ఇంటినుండిగాని పురమునుండిగాని వెడలుగొట్టుట, విడుచుట, విసర్జనము, విడనాడుట, త్యజించుట, వెడలుకొట్టుట, వధ, పంపివేయుట.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్వాస్యతే ఉద్వాసనం. చంపుట


ఉద్వాస్యము
సం., అవ్య., తత్స., = ఉద్వాసనము, చేయదగినది, ఉత్తోలనీయము, ఉద్దరణీయము.

ఉద్వాహనము
సం., వి., అ., న., తత్స., = పెండ్లాడుట, ఉత్కంఠ, పైకెత్తునది, చేదునది, పుత్రాదులకు పెండ్లిచేయుట, మఱియొక చోటికి పోవుట, పెండ్లాడుట, ఇనుమాఱదున్ననపొలము.?

ఉద్వాహని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = గవ్వ.

ఉద్వాహిని
సం., వి., ఈ., స్త్రీ., = రజ్జువు, త్రాడు

ఉద్విగ్నమగు
క్రి., = కలతబారు, భయపడు.

ఉద్విగ్నము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉద్వేగము కలది, వ్యవస్థ తప్పినది, వెరుపునొందినది, మనస్సు కుదురు లేనిది, వ్యాకులచిత్తము.

ఉద్వీక్షణము
సం., వి., అ., న., తత్స., = మీదికి చూచుట, తన్ను, చూచుట, చూచు.

ఉద్వీత
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ప్లావితము.

ఉద్వృత్తము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = నీతిని అతిక్రమించినడచునది.
నానార్థాలు :
అధికము, ఉచ్ఛిష్ఠము, అనుభవించివిడువబడినది, పైకెత్తబడినది, చెడునడతకలది, క్షోభపడినది, కలతనొందినది, గర్వించినది, క్రక్కబడినది, పయికిపొంగినది, వెలికుబ్బినది, పయిపెచ్చు.


ఉద్వృత్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = చెడునడక, గర్వము, ఆధిక్యము, వాంతి, కలత, ఎగిరిపడుట, ఉద్ధతి.

ఉద్వేగము
సం., వి., అ., న., తత్స., = పోక.
నానార్థాలు :
ఉబ్బించుట, వెఱపు, ఆవేగము, నక్క, అతురత, శీఘ్రగామి, వేగముగాపోవునది, నిశ్చలము, మందగామి (మెల్లగా పోవునది) విరహమువలన పుట్టు దుఃఖము వణకటం, ఊర్ధ్వభాగమును కదలించుట, అవ్యవస్థితచిత్తత, చమత్కారము, వెరపు, మెల్లగాపోవునది.

వ్యుత్పత్త్యర్థము :
ఉద్గతో వేగోస్య ఉద్వేగం. ఉద్గతమైన వేగము కలది.


ఉద్వేగిల్లు
సం., అ., క్రి., భీతిల్లు, వెరచు.

ఉద్వేజనము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = ఉద్వేగము.
పర్యాయపదాలు :
వ్యాకుల చిత్తత, వెఱపు, భయము, కలచునది. (మనస్సును) భయపెట్టునది, కలత, వ్యాకుల పెట్టుట, విరహమువలని దుఃఖము.


ఉద్వేజిత
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = భయపడువాడు, కలత పెట్టబడినది, వ్యాకులము, వెరిపింపబడినది.

ఉద్వేది
సం., నా. వా., (ఇ.ఈ.ఇ)., తత్స., = ఉన్నతమైన వేదిక యందు.

ఉద్వేపము
సం., నా. వా., అ., పుం., తత్స., = కంపవము.?

ఉద్వేలము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = అగ్గలము.
పర్యాయపదాలు :
గట్టున మీదినది (నది మొదలగు) మర్యాదనతిక్రమించినది. మేఱు మీరినది, మిక్కుటమైనది, ఉత్కటము.

వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రాంతోవేలామ్ అత్యా వేలను అతిక్రమించునది.


ఉద్వేష్టనము
సం., వి., అ., న., తత్స., = చుట్టుకొనుట.
పర్యాయపదాలు :
ప్రదిలినది, సడలినది, విడిపోయినది, కట్టువీడినది, చుట్టుకొనుట, (గుండె వెన్ను మున్నగు వాని యందు గలుగు) నొప్పి (హృదయోద్వేష్టనము) చుట్టుకొనునది.


ఉద్వేష్టితము
సం., విణ., (అ.ఆ.అ.)తత్స., = చుట్టుకొనబడినది. చుట్టుకోబడినది.

ఉద్వోఢ
సం., నా. వా., ఋ., పుం., తత్స., = పెండ్లాడినవాడు, మగడు.

ఉధ్మానము
సం., వి., అ., న., తత్స., = అధిశ్రయణి, పొయ్యి.

ఉనికిపట్టు
వి., = వాసస్థానము, నిలయము, ఉన్నచోటు. స్థానము.

ఉనుకువగొను
క్రి., = ఉండు, నివసించు, నెలకొను.

ఉన్న
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = తేమకలది, క్లిన్నము, దయాపరము.

ఉన్నట్లుండి
క్రి., విణ.,= ఆకస్మికముగా, అదాటున.

ఉన్నతకాలము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఎక్కువ కాలము.

ఉన్నతనాభి
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తుండిలము, ఎత్తైన బొడ్డు కలవాడు,కలది.

ఉన్నతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పొడవైనది.
పర్యాయపదాలు :
వర్ధితము, ఉచ్చము, తుంగము, ఎత్తైన, ప్రాంశువు, ఉదగ్రము, ఉత్తుంగము, గొప్పది, ఎత్తెనది, పొడవైనది, ఎత్తబడినది, ఉన్నతి, వర్ధితము, ఉచ్ఛ్రితము, స్థితము.

వ్యుత్పత్త్యర్థము :
ఉన్నమత్యూర్థ్వం గచ్ఛతీత్యున్నతం. ఊర్ధ్వముగాఁపోవునది.


ఉన్నతానతము
సం., నా. వా., అ., న., తత్స., =మెరకపల్లముగా ఉండునది, విషమము.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతం చ తదానతఞ్చ, ఉచ్చనీచస్థానములయందు.


ఉన్నతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఎత్తు, పొడవు.
నానార్థాలు :
ఉచ్చస్థితి, వృద్ధి, గరుడునిభార్య, నాట్యవిలాస విశేషము, ఔన్నత్యము.


ఉన్నతీశుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= గరుడుడు.

ఉన్నద్ధము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పెరిగినది, పైకెత్తికట్టబడినది, ఉచ్చినది.

ఉన్నమనము
సం., వి., అ., న., తత్స., = ఉత్తోలనము, పైకెత్తుట.

ఉన్నమాట
వి., = నిజము, వాస్తవము, యథార్థము.

ఉన్నమితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = పైకెత్తబడినది, పొడిగింపబడినది.

ఉన్నమ్రము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉన్నత, నిట్టనిలువుగా ఉండునది.

ఉన్నయనము
సం., నా. వా., అ., న., తత్స.,= కన్నులెత్తినది, దిద్దుట, సవరించుట.

ఉన్నయము
సం., వి., అ., పుం., తత్స.,= పైకెత్తుట, ఊడపెరుకుట, ఉన్నతి, పైకి తీసుకొని పోవుట, అనుమతి, ఊహించుట.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం నయనమున్నాయః, ఉన్నయశ్చ, ఊర్ధ్వమును పొందించుట.


ఉన్నాభుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = సూర్యవంశరాజు, ఉన్నతమైననాభికల స్త్రీ.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నతా నాభిర్యస్య. ఉన్నతమైన నాభికలిగినవాడు.


ఉన్నాయము
సం., వి., అ., పుం., తత్స., = ఉన్నయము, పైకిచూచెడికన్ను, ఉచ్చయము, వితర్కము.

ఉన్నాల
సం., నా. వా., అ., పుం., తత్స., ఒకజాతి ధాన్యము

ఉన్నాహము
సం., వి., అ., పుం., తత్స., = పుల్లనీళ్ళు.

ఉన్నిద్రము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = మేల్కొని వుండుట.
పర్యాయపదాలు :
వికసించుట, నిదురలేనిది, ప్రపుల్లము, వికసించునది, ఎచ్చరికకలది, పడక మీద నుండి లేచిన, మేలుకొన్నది, వికసించినది.


ఉన్నీతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = విత్కమునందు, పైకితీసుకుపోయిన, పైకెత్తబడినది, ఊహింపబడినది, పై కెత్తబడినవాడు, ఊహింపబడినవాడు.

ఉన్నేత్రము
సం., నా. వా., (ఋ.ఈ.ఋ.)., తత్స., = ఎత్తెనకన్నులు కలది, ఎత్తెనకన్ను.

ఉన్నేయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పైకెత్తతగనది, ఊహింపతగినది.

ఉన్మ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఊర్థ్వమానము.

ఉన్మండలకర్ణము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఊర్ధ్వమండల కర్ణము.

ఉన్మండలన
సం., నా. వా., ఋ., పుం., తత్స., = ఊర్ధ్వమండలనిధి విశేషము.

ఉన్మంథనము
సం., నా. వా., అ., న., తత్స., = దండము, విలోడనము. సం., వి., అ., న., = కదిలించుట, చంపుట

ఉన్మంథము
సం., నా. వా., అ., పుం., తత్స., = వథ, ఉన్మర్థనము, హింస. సం., వి., అ., పుం., తత్స., = చంపుట, వధ, చిలుకుట.

ఉన్మంథితము
సం., విణ.,(అ.ఆ.అ.)., తత్స., = కదిలింపబడినది.

ఉన్మజ్జక
సం., నా. వా., అ., పుం., తత్స., = తాపసి, పడవ, తెప్ప.

ఉన్మజ్జకుడు
వి.,= నీళ్లలో తపస్సుచేసే వ్యక్తి, ఋషి, నీళ్లపై తేలే వ్యక్తి.

ఉన్మజ్జనము
సం., నా. వా., అ., న., తత్స., = నీటి పై తేలుట.

ఉన్మత్తకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = తాపసభేదము, ఉన్మత్తార్థము, అవధూత.

ఉన్మత్తము
సం., వి., అ., పుం., తత్స., = ఉమ్మెత్త, వెర్రెత్తినది, గర్వించినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్మాదయతీత్యున్మత్తః. ఉన్మాదమును చేయునది.


ఉన్మథనము
సం., నా. వా., అ., న., తత్స., = తరచునది.
పర్యాయపదాలు :
పీడించునది, చంపునది, రాచునది, వధ, హింస, సుశ్రుతయందు చెప్పిన యంత్ర కర్మభేదము, ఉన్మర్థనము.


ఉన్మథితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = మథింపబడినది, పీడించబడినది, చంపబడినది.

ఉన్మదితుడు
సం., విణ., (అ.ఆ.అ.) = ఉమ్మాదము పట్టినవాడు.

ఉన్మదిష్ణువు
సం., విణ.,(ఉ.ఊ.ఉ.)., తత్స., = పిచ్చివాడు, పిచ్చిది, మత్తుకొనినది, మదము పట్టినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్మాదశీలః ఉన్మదిష్ణుః. ఉన్మాదము పట్టినవాఁడు. ఉన్మాద స్వభావము కలవాఁడు.


ఉన్మని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = యోగుల అవస్థలలో ఒకటి.

ఉన్మనుఁడు
సం., విణ., (స్.ఈ.స్.)., తత్స., = ఉత్కంఠ కలవాఁడు, ఆవేగము కలవాడు, తహతహ పడువాడు, ఉత్కంఠాయుక్తము, అన్యమనస్కుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్భ్రాన్తం మనోఽస్య. ఉద్గతం మనో యస్య సః ఉత్కః, ఉన్మనాశ్చ. ప్రియవస్తువునందు ఎత్తినమనస్సు కలవాఁడు,


ఉన్మర్దనము
సం., నా. వా., అ., న., తత్స., = రుద్దుట, పిసుకుట, సుశ్రుత చెప్పిన దానిలో ఒకటి.

ఉన్మాథము
సం., వి., అ., పుం., తత్స., = బోను.
నానార్థాలు :
గాలము, వధము, జౌలము, వల, కూట యంత్రము, మృగములను వధించు యంత్రము, మారణము, ఘాతము.

వ్యుత్పత్త్యర్థము :
ఉన్నథనం ఉన్మాథః. చంపుట.


ఉన్మాథుడు
సం., వి., అ., పుం., = వధించువాడు.

ఉన్మాదకము
సం., నా. వా., అ., పుం., తత్స., = పిచ్చి, వెర్రి, ఉన్మధము కలిగించునది.

ఉన్మాదకుడు
సం., విణ., (అ.ఈ.అ.) = ఉన్మదితుడు, పిచ్చి, వెర్రి.

ఉన్మాదనము
సం., వి., అ., పుం., తత్స., = వెఱ్ఱికొలుపునది, మత్తుకలిగించునది, మన్మథునియొక్క యొకబాణము.

ఉన్మాదము
సం., వి., అ., పుం., తత్స., = ఉన్మాదము(ప్రియవియోగ విభవభ్రంశాదులచే చేతనాచేతనముల యందు సమానముగా ప్రవర్తించుట.), వల, గాలము, బోను.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నాద్యతే అనేనేత్యున్మాదః. దీనిచేత మదించును.


ఉన్మాది
వి.,= పిచ్చివాడు, వెర్రివాడు, ఉద్రేకి.

ఉన్మాది
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ఒకనొక వ్యభిచారీభావము, ఒకానొక మన్మథవికారము.

ఉన్మానము
సం., వి., అ., న., తత్స., = తులామానము.
పర్యాయపదాలు :
తూనిక, రెండు శాహికములు, తూచుటకు సాధనమైనత్రాసు, తూనికరాళ్ళు, త్రాసు, కాటా.


ఉన్మార్గము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = విరుద్ధపథము, చెడుదారి, దారితప్పినది, చెడ్డనడత, తప్పుత్రోవ.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ క్రాంతః మార్గాత్ నిరా


ఉన్మితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = తూనికవేయబడినది, కొలవబడినది, త్రాసు.

ఉన్మితి
సం., నా. వా., (ఇ.ఈ.ఇ.)., తత్స., = తూనికవేయబడినది, కొలవబడినది, త్రాసు.

ఉన్మిషము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ప్రపుల్లము, కొద్దిగా ప్రకాశించునది, వికసించునది.

ఉన్మిషితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = వికసించునది, ప్రపుల్లము, విరిసినది.

ఉన్మీలనము
సం., వి., అ., న., తత్స., = వికసించుట, విరియుట, కన్నులు తెరచుట, రంగుచే ప్రకాశింపజేయుట.

ఉన్మీలితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = విరిసినది.
పర్యాయపదాలు :
వికాసము, తెరవబడినది, వికసించినది, వికసితము, ప్రస్ఫుటితము.
రంగుచే ప్రకాశింపచేయుట.

ఉన్ముక్తము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = విడువబడినది, బంధనరహితము

ఉన్ముఖము
సం., విణ., (అ.ఆ.అ)., = మీదు చూచునది, ఉద్యుక్తము, ఉత్పశ్యము, ఉచ్చుకము, ఊర్ధ్వముఖము, ఉత్సుకము.
వ్యుత్పత్త్యర్థము :
ఉద్ ఊర్ద్ధ్వం ముఖమస్య. మీదికి చూచునది.


ఉన్ముఖుడు
వి., = సిద్ధమైన వ్యక్తి.

ఉన్మూలనము
సం., నా. వా., అ., న., తత్స., = అడుగుతోచెడినది, వేరుతెగినది.

ఉన్మూలము
సం., విణ., (అ.ఆ.అ.)., = వేరుతెగినది, అడుగుతో చెడినది.

ఉన్మూలించు
సం., స., క్రి., = పెల్లగించు.

ఉన్మూలితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఊడతీయపడినది.
పర్యాయపదాలు :
పీకినది, పెల్లకింపబడినది, వేరుతో తెంపబడినది, వేరుత్రెంపబడినది, అడుగుతో జెరపబడినది.


ఉన్మేయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = తూచుటకు తగినది, త్రాసు.

ఉన్మేషము
సం., వి., అ., పుం., తత్స., = వికాసము, తెలివి, కన్నుతెరుచుట.

ఉన్మేషించు
సం., క్రి., = వికసించు, విశాలం చేయు, తెరచు.

ఉన్మోచనము
సం., నా. వా., అ., న., తత్స., = బంధనమునుండి విముక్తి పొందుట, ముక్తి పొందుట.

ఉప(ష్ట)స్తమ్భ
సం., నా. వా., అ., పుం., తత్స., అవలంబనము, ఉనికితొడ్పాడు, స్థితి, ఊత.

ఉపఎన్నిక
వి.,=సాధారణ ఎన్నికల తరువాత ఖాళీ అయిన నియోజకవర్గాలకు ప్రతినిధులను ఎన్నుకొనే ప్రక్రియ.

ఉపకంఠము
సం., నా. వా., (అ.ఆ.అ.) తత్స., = దాఁపైనది.
నానార్థాలు :
అశ్వగతి భేదము. నికటము, గ్రామాంతము, ఉపశల్యము, ఆస్కందితము, కంఠమునకు సమీపముగా ఉండునది, పోలిమేర, సమీపకాలము, సమీపదేశము, సమీపము, అశ్వపంచమగతి, దాపు.

వ్యుత్పత్త్యర్థము :
కంఠ సమీపం గత ఉపకంఠః. కంఠ సమీపమును పొందినది, ఉపగతః కంఠః సామీప్యమస్యేతి ఉపకంఠః.


ఉపకనిష్ఠక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = చిటికెనవ్రేలు దగ్గర ఉన్నది, అనామికా, ఉంగరపువ్రేలు.

ఉపకన్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఉపగతా కన్యామ్. కన్యకకు చెలికత్తె, కన్యకయొక్క సహవాసిని.

ఉపకము
సం., నా. వా., అ., పుం., తత్స., = అనుకంపింతము, ఋషిభేదము.

ఉపకరణము
సం., వి., అ., న., తత్స., = సాధనము.
నానార్థాలు :
కొరముట్టు, రాజుల ఛత్రచామరాదులు, పరిచ్చదము, పరివహ్వము, తంత్రము, ప్రధానాంగీ భూతోపకారక ద్రవ్యము, భోజనమందు కూరలు, పూజలయందు నైవేద్యము, పనిముట్టు, ఉపకరించుట. జంతువులను బంధిచు వలలాంటిసాధనము.


ఉపకరించు
సం., అ., క్రి., = ఉపయుక్తమగు, ఒదవు.

ఉపకర్ణ
సం., అవ్య., = కర్ణసమీపమున.

ఉపకర్త
సం., విణ., (ఋ.ఈ.ఋ.)., తత్స., = ఉపకరించువాడు, మేలుచేయువాడు.

ఉపకల్పనము
సం., నా. వా., అ., న., తత్స., = ఆయోజనము, సంపాదనము, పన్నుట, సిద్ధపరచుట, కల్పించుట.

ఉపకాది
సం., నా. వా., ఇ., పుం., తత్స., = శబ్దసమూహము.

ఉపకార
సం., నా. వా., అ., పుం., తత్స., = మేను, ఉపకృతి, మేలు. సహాయము పూవులోనిదిచెది.

ఉపకారకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపయోగించునది, అనుకూలమగునది, ఉపకారము, చేయునది.

ఉపకారవేతనము
వి., = చదువుకోసము విద్యార్థులకిచ్చే సొమ్ము.

ఉపకారి
సం., విణ., (న్.ఈ.న్.)., తత్స., = ఉపకారముచేయువాడు, ఉపకర్త.

ఉపకారిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఉపకారము చేసెడు స్త్రీ.
నానార్థాలు :
ఉప్పరిగ, ఉక్కెఱ, రాజగృహము, రాజభవనము, ఉపకార్య, పటభవనము, కుశూలము, పిష్టభేదము, కుశలము, మేడ, గుడారము, ఉక్కెర, చక్కెర చేర్చి పిండితో చేసిన పదార్థము.

వ్యుత్పత్త్యర్థము :
ప్రయాణాయ ఉపకరోతీతి ఉపకారికా. ప్రయాణము కొఱకు ఉపయోగించునది.


ఉపకార్య
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = ఉప్పరిగ.; విణ. ఉపకరింపఁతగినది.
నానార్థాలు :
ఉపకార్య, పటభవనము, కుశూలము, పిష్టభేదము, రాజగృహము, రాజభవనము, నగరు, మేడ, గుడారము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే క్రియత ఇత్యుపకార్యా. ప్రయాణ సమయమందుఁచేయఁబడునది.


ఉపకావ్యము
వి., = సర్గలవంటి విభజన లేని చిన్నకావ్యము.

ఉపకిరణము
సం., నా. వా., అ., న., తత్స., = వ్యాపించుట, అంతటనూ చిమ్ముట.

ఉపకిరణము
వి., = వ్యాపించడము, వెదజల్లడము.

ఉపకుంచి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = నల్లజీరకఱ్ఱ, యాలకి.

ఉపకుల్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పిప్పలి.
వ్యుత్పత్త్యర్థము :
1.ఉపగతాకుల్యా జన్మభూమిత్వేనానయే ఇత్యుపకుల్యా. జన్మభూమియౌటచేత పొందఁపడిన కాలువఁకలది, ఉపకోలతి ఉపకుల్యా, చిన్న కాలువ.


ఉపకుశ
సం., నా. వా., అ., పుం., తత్స., = పండ్లచిగుళ్ళవాపు, దర్బ అనే అర్థమందు కుశసామీప్యమున.

ఉపకూజితము
వి.,= రెట్టించడము, ప్రతిధ్వని.

ఉపకూపము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = నిపానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగతః కూపం అత్యా స. నూతివద్ద పశువులు నీరుత్రాగుటకై కట్టిన తొట్టి.


ఉపకూలము
సం., నా. వా., అ., న., తత్స.,= తీరము, తీరసమీపము.

ఉపకృతము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = ఉపకారము చేయబడినది, ఉపకారము, ప్రయోజితము, ప్రయోజనము.; విణ. ఉపకరింపబడినది.

ఉపకృతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఉపకారము, మూడువిధములైన తత్సమధాతువులలో ఒకటి, (ఉపకృతి, పరిణతి, సంవృతి) మేలు.

ఉపకృష్ణము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = విత్తినపిదప దున్నబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగతః కృష్ణమ్ అత్యా స. కృష్ణునిసామీప్యమునందు.


ఉపక్రమణము
సం., నా. వా., అ., న., తత్స.,= సమీపించుట, ఉద్యోగించుట, పూనిక, ప్రారంభించుట, చికిత్స.

ఉపక్రమణీయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఆరంభణీయము, భూమిక, అవతారిక, పీఠిక, సమీపింపదగినది, చికిత్సచేయదగినది, ఆరంభింపదగినది.

ఉపక్రమము
సం., వి., అ., పుం., తత్స., = ప్రారంభించుట.
నానార్థాలు :
చికిత్స, సమీపించుట, పూనిక, ఉద్యోగించుట, మొదలుపెట్టుట, ప్రథమారంభము, ఆరంభము, జ్ఞాత్వారంభము, ఉపధ, భావతత్త్వనిరూపణము, ప్రక్రమము, విక్రమము, పలాయనము, ఉపాయము. ఉపాయము నెఱంగి ప్రారంభిచుట, మంత్రులు లోనగువారిబరీక్షించుట, విక్రమము, ప్రస్తానము, మోసము, దొరఁకొనుట, పరీక్షణము, సామాద్యుపాయము, భూమిక, భావతత్వ నిరూపణ.

వ్యుత్పత్త్యర్థము :
ఉపక్రమణం ఉపక్రమః. ఇది ఈ ప్రకారముగా సిద్ధించునిది. ఉపాయము నెఱిఁగి ప్రారంభించుట


ఉపక్రమించు
సం., అ., క్రి., స., క్రి., = ప్రారంభించు. (పౌరాణికుడు కథ చెప్పనుపక్రమించెను.)
ప్రయోగము :
అధ్వరకర్మముపక్రమించె. రామా. 4, ఆ.


ఉపక్రాంతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఆరంభింపబడనది, విస్తృతము, విరివైనది.

ఉపక్రియ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఉపకారము.

ఉపక్రోశము
సం., వి., అ., పుం., తత్స., = ఉపక్రోశము, నింద, దూఱు, ఆక్రోశము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపక్రోశముపక్రోశః. అంతట ఆక్రోశించుట.


ఉపక్రోష్ట
సం., నా. వా., ఋ., పుం., తత్స., = ఓండ్రపెట్టునది, (గాడిద) నిందించునది.

ఉపక్లృప్తము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సజ్జీకృతము, నియతము, సిద్ధిపరుపబడినది, అర్హమైనది.

ఉపక్లేశము
సం., నా. వా., అ., పుం., తత్స., = మదము మొదలయినవి.

ఉపక్వ(క్వా)ణము
సం., నా. వా., అ., పుం., తత్స., = వీణశబ్దము, వీణానినాదము, వీణానాదము.

ఉపక్షయము
సం., నా. వా., అ., పుం., తత్స., = క్షీణించునది, వ్యయము, తరిగినది.

ఉపక్షిత్
సం., నా. వా., (త్.ఈ.త్.)., తత్స., = సమీప నివాసిని, దగ్గరగా ఉండునది.

ఉపక్షీణము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = క్షీణించునది, తరిగినది, అసామర్థ్యము, వ్యయము.

ఉపక్షేపణము
సం., నా. వా., అ., న., తత్స., = త్రోసివేయుట.
నానార్థాలు :
విసరుట, ఆక్షేపించుట, దోషారోపణము చేయుట, సమర్పణము, ఇచ్చుట, శూద్రుని యొక్క బియ్యము మొదలుగు పదార్థములను బ్రాహ్మణుని ఇల్లునందు వంటకై సమర్పించుట.


ఉపక్షేపము
సం., నా. వా., అ., పుం., తత్స., = త్రోసివేయుట, విసిరివేయుట, సూచించుట, ఆక్షేపము, దోషోపము, ప్రారంభము, సమీపమున ఉంచుట.

ఉపఖండము
వి.,= ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉండి, ఖండంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతము.

ఉపగ
సం., నా. వా., ఆ., పుం., తత్స., = యజ్ఞము, ఋత్విగ్భేదము.

ఉపగంత
సం., నా. వా., (ఋ.ఈ.ఋ.)., తత్స., = పొందువాడు, తెలిసినవాడు, స్వీకరించినవాడు, సమీపించువాడు, స్వీకరించువాడు, అంగీకరించువాడు.

ఉపగణము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = గణమును, సముదాయమును పొందినది.
పర్యాయపదాలు :
గణమును చేరినది, చిన్నగణము, ముఖ్యము కాని గణము, గణమనెడి సేనాసముదాయముకంటే తక్కువసేన.


ఉపగతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = సమీపించుట, జ్ఞానము, అంగీకారము, ప్రాప్తి, పుచ్చుకొనుట, పొందు.

ఉపగమనము
వి.,= దగ్గరకి రావడము, కలయిక, అగీకారము, స్వీకారము, జ్ఞానము, ప్రాప్తి.

ఉపగమము
సం., వి., అ., పుం., తత్స., = సమీపించుట.
నానార్థాలు :
అంగీకరించుట, జ్ఞానము, అంగీకారము, ప్రాప్తి, పుచ్చుకొనుట, పొందుట.


ఉపగము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పొందునది, సమీపించునది.

ఉపగమ్య(త్య)ము
సం., అవ్య., తత్స., = సమీపమున, సామీప్యమందు.

ఉపగహనుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక ఋషి.

ఉపగాత
సం., నా. వా., ఋ., పుం., తత్స., = తోడుగాపాడువాడు, సహగాయకుడు, యజ్ఞమున ఉద్గాతదగ్గర గానము చేయు ఋత్విజుడు.

ఉపగామి
సం., నా. వా., (న్.ఈ.న్)., తత్స., = సమీపించువాడు, పొందువాడు, తెలియువాడు, అంగీకరించువాడు, స్వీకరించువాడు.

ఉపగీతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = గానము, స్తుతి, ఆర్యావృత్తిభేదము.

ఉపగు
సం., నా. వా., (ఉ.ఊ.ఉ.)., తత్స., = గోపాలుడు, ఆవునందు ప్రాప్తకిరణాలు.

ఉపగుధము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = రోధనము.

ఉపగురువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = సహోపాధ్యాయుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగతః సాదృశ్యేన గురుమ్ అత్యాస. గురువువలె ఉపదేశాదులు చేయువాడు. ఉపాధ్యాయుడు.


ఉపగూఢము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = దాచబడినది, కౌగిలింపపడినది, పట్టుకోబడినది, కౌగిలి.

ఉపగూహనము
సం., వి., అ., న., తత్స., = కౌగిలింత, దాఁచుట, ఆలింగనము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే గూహన ముపగూహనం. దగ్గర కప్పుకొనుట.


ఉపగ్రంథము
వి.,= ఒక గ్రంథానికి అనుబంధంగా కానీ, అనుకరణంగా కానీ రాసిన పుస్తకము.

ఉపగ్రహణము
సం., నా. వా., అ., న., తత్స., = పట్టుకొనుట.
నానార్థాలు :
బందిగాబట్టుకొనుట, చెఱబెట్టుట, తోడ్పడుట, అనుకూలించుట, స్వీకరించుట, కాత్యాయనుడు చెప్పబడిన ఆజ్యాధార కరణభేదము, ఉపాకారణము, సంస్కారపూర్వకమైన వేదగ్రహణము.


ఉపగ్రహము
సం., వి., అ., పుం., తత్స., = అనుకూలించుట.
నానార్థాలు :
ఉపయోగము, చెఱఁబడ్డది, చెఱ, సూర్యాది గ్రహణము, ఖైదీ, స్వీకరించుట, ఓదార్చుట, అడ్డు, నిరోధము, రాహువు, కేతువు, సంధి.

వ్యుత్పత్త్యర్థము :
ప్రగృహ్యతే బలాత్ ప్రగ్రహః, ఉపగ్రహశ్చ. బలిమిచే బంధించుఁగాన ఉపగ్రహము.


ఉపగ్రాహము
సం., నా. వా., అ., పుం., తత్స., = కానుక, కానుక ఇచ్చుట.

ఉపగ్రాహ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపహారము.
పర్యాయపదాలు :
కానుక. బహుమానము, నజరాన, కానుక ఇచ్చుట, ఉపఢౌకనము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపగృహ్యతే రాజ్ఞా ఉపగ్రాహ్యః. రాజుచే గ్రహింపఁబడునది.


ఉపఘాతకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = నాశనము చేయునది, పీడించునది.

ఉపఘాతము
సం., వి., అ., పుం., తత్స., = నాశనము.
నానార్థాలు :
కర్మయోగ్యతా సంపాదనము, దెబ్బకొట్టుట, హలోమభేదము, పాపసమూహము, దెబ్బ, వేట, కొట్టడం, బాధ, నాశం, రోగము, అపకారము.


ఉపఘాతి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = నాశముచేయునది, పీడించునది.

ఉపఘ్నము
సం., వి., అ., పుం., తత్స., = సమీపాశ్రయము, ప్రాఁకు. నికటాశ్రయము, సహయము, ఆసన్నము, ఆశ్రయము.
వ్యుత్పత్త్యర్థము :
ఉప సమీపే హన్యతే గమ్యత ఇత్యుపఘ్నః. సమీపమునఁపొందబడునది.


ఉపచ(జ)ము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = తరువాత పుట్టినది.

ఉపచక్షువు
సం., నా. వా., స్., న., తత్స., = ఉపనేత్రము, దర్మనసాధనము. వి. కళ్లజోడు, సులోచనము.

ఉపచయము
సం., వి., అ., పుం., తత్స., = పొడవు.
నానార్థాలు :
వృద్ధి, ప్రోగు, ఎత్తు, ఔన్నత్యము, లగ్నము.


ఉపచరము
సం., వి., అ., పుం., తత్స., = గోమహిష్యాది గర్భగ్రహణము, వెద, గోమహిష్యాది మొదలగువాని మొదటి గర్భము.

ఉపచరించు
సం., స., క్రి., = సమ్మానించు, సేవించు.

ఉపచరితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సేవింపబడినది, సన్మానింపబడినది, అర్థమును బోధించుటకు ప్రయుక్తము (శబ్దము).

ఉపచరితుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = సేవింపఁబడినవాడు, ఉపాసితుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపచర్యతే స్మ ఉపచరితం. ఉపచరింపఁబడినది.


ఉపచర్మము
సం., అవ్య., తత్స., = చర్మమును పొందినది.

ఉపచర్య
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సేవ, కొలువు.సేవనము, కొలువు, సేవ, చికిత్సా.

ఉపచాకు
సం., నా. వా., (ఉ.ఊ.ఉ.)., తత్స., = ప్రతిఘాతకము.

ఉపచాయ్యము
సం., వి., అ., పుం., తత్స., = యాగాగ్నియందు ఉయోగింపఁతగిన పేరు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపచీయతే ఉపచాయ్యః. కూల్పఁపడునది.


ఉపచారచ్ఛలము
సం., నా. వా., అ., న., తత్స., = దూషణము.

ఉపచారము
సం., వి., అ., పుం., తత్స.,= లంచము, వాడుక (పంచోపచారములు, స్నానము, పూజ, నైవేద్యము, ప్రదక్షిణము, నమస్కారము, షోడశోపచారములు: ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీచయము, అభిషేకము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణము, నమస్కారము.)
నానార్థాలు :
సేవ, బహుమానము, రోగప్రతీకారము, చికిత్స, నిగ్రహము, శమము, వ్యవహారము, అలంకారము, సమ్మానము, ఊడిగము, ఉత్కోచము, ఉపచర్య, చికిత్స, రుక్ప్రతిక్రియ, వేదనానిష్ఠ, క్రియ, ఉపక్రమము.


ఉపచార్య
సం., నా. వా.,(అ.ఆ.అ)., తత్స., = సేవ, సేవించుట, చికిత్స.

ఉపచితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కాలినది.
నానార్థాలు :
కూడఁబపెట్టినది, వర్ధిల్లినది, పూయపడినది, వృద్ధిపొందినది, లేపనము, సమృద్ధి, సమూహితము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపచీయత ఇత్యుపచితం. వర్ధిల్లఁచేయఁపడినది.


ఉపచితి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = రాశి, అగుట, ఉన్నతి, వృద్ధి, ఎత్తు.

ఉపచేయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పోగుచేయదగినది.

ఉపచ్ఛందనము
సం., నా. వా., అ., న., తత్స., = సాంత్వనము, బ్రతిమాలుట, అనుసరించుట.

ఉపచ్యవము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఇంటి నుండి బయటకు పోవడము.

ఉపజనము
సం., నా. వా., అ., న., తత్స., = ఉత్పత్తి, శరీరము, పుట్టుక.

ఉపజప్యుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = వేరుపరచతగినవాడు, భేదము కలిగింపతగినవాడు.

ఉపజల్పి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ఉపదేశకము.సంభాషించువాడు

ఉపజాతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = వృత్తభేదము, ఆంధ్రపద్యభేదము, సప్తవిధసీసములను నవవిధ గీతములును ఉపజాతులనబడును, తెగ.

ఉపజాపకుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = భేదము పుట్టించువాడు.

ఉపజాపము
సం., వి., అ., పుం., తత్స., = భేదోపాయము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపాంశు జపనం ఉపజాపః.
మెల్లగాఁపలుకుట, విఘటనము, భేదము, విచ్ఛేదము, ఉపాంశువు, మెల్లగా చేయుజపము, నిఘటనము, భేదము, విచ్ఛేదము.

ఉపజాపసహ
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = భేదోపాయము, ఉపాంశువు, మెల్లగా చేయుజపము.

ఉపజిహ్విక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కొండనాలుక, చెదపురుగు, నాలకక్రింద పక్కన కండపెరుగు రోగము, కీటభేదము.

ఉపజీక
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపజీవకము.

ఉపజీవకుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఆశ్రయించువాడు, అండగా ఉండువాడు, ఒకరిని అనుసరించి జీవించువాడు.

ఉపజీవనం
వి., ఆధారపడి బతకడము.

ఉపజీవి
సం., విణ., (న్.ఈ.న్.)., = ఒకరిననుసరించి జీవించువాడు. ఆశ్రితము, ఉపజీవకుడు.
వ్యుత్పత్త్యర్థము :
వృత్త్యాద్యర్థమాలమ్బకే. వృత్యర్థము ఒకరిని అనుసరించి జీవించువాడు.


ఉపజీవించు
సం., స., క్రి., = ఒకరిననుసరించి జీవించు.

ఉపజీవిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = జీవనోపాయము, జీవనాధారము, బ్రతుకు.
వ్యుత్పత్త్యర్థము :
జీవనోపాయభూతాయాం వృత్తౌ. జీవనోపాయ వృత్తియందు


ఉపజీవుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఆశ్రయించువాడు, అండగోరువాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగతో జీవం జీవనమ్ అత్యా స. ఒకరిననుసరించి జీవించువాడు.


ఉపజీవ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = జీవనోపాయము గలిగించునది, అవలంబింపదగినది, విషయాదులు సంగ్రహించుటకు ఆధారమైనది (గ్రంథాది), జీవనోపాయము.

ఉపజోషము
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రీతియందు, సేవనందు, సుఖమును తెలుపునది, సౌఖ్యమును తెల్పునది.

ఉపజోషమ్
సం., అవ్య., తత్స., = ప్రీతిని తెల్పునది, కళ్యాణము, సుఖముతెల్పునది, సామీప్యము, మౌనము.

ఉపజ్ఞ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఉపదేశము లేక తనంతట మొట్టమొదట పుట్టెడు జ్ఞానము.(వాల్మీకి యొక్క శ్లోకనిర్మాణజ్ఞానము వంటిది.)
పర్యాయపదాలు :
సొంత తెలివి, ప్రథమజ్ఞానము, అపూర్వముగా కనిపెట్టబడినది, స్వయం ప్రజ్ఞ, ఆద్యజ్ఞానము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపజ్ఞాయత ఇత్యుపజ్ఞా. మొదట ఎఱుఁగఁబడుట, ఉపజ్ఞాయతే జ్ఞా అవభోదనే ఇతి ఉపజ్ఞా. ఉపదేశము లేక తెలియబడినది.


ఉపజ్ఞాతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = అపూర్వముగా కనిపెట్టపబడినది.
వ్యుత్పత్త్యర్థము :
వినోపదేశేన జ్ఞాతేఽర్థే. ఉపదేశములేక తెలియపడినది.


ఉపఢౌకనము
సం., నా. వా., అ., న., తత్స., = కానుక, కానుక ఇచ్చుట, రాజు సంతోషముగా ఇచ్చేటువంటి కానుక.

ఉపతపించు
క్రి., = బాధపడు, దుఃఖపడు, అసూయపడు.

ఉపతప్త
సం., వి., (ఋ,ఈ,ఋ.)., తత్స., = రోగము, తెవులు. తాపము, సంతాపము, వేడి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపతాపయతీత్యుపతప్తా. తపింపఁచేయునది.


ఉపతప్తము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఆధిక్యము, వేపబడినది, కాగునట్లు చేయునది, బాధింపబడినది.

ఉపతాపకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపతాపము కలిగించునది, సంతాపమును కలిగించును, రోగమును అశుభమును కలిగించునది, కీడును కలిగించునది.

ఉపతాపనము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సంతాపము, వేడి కలిగించుట, పీడించుట.

ఉపతాపపడు
అ., క్రి., = బాధపడు, దుఃఖపడు, అసూయపడు.

ఉపతాపము
సం., వి.., అ., పుం., తత్స., = తొందర.
నానార్థాలు :
సంతాపము, రోగము, అశుభము, కీడు, వ్యాధి, వేడి, ఉత్తాపము, పీడ.

వ్యుత్పత్త్యర్థము :
ఉపతప్యంతేనేనేతి ఉపతాపః. దీనిచేత తపింపఁచేయబడుదురు.


ఉపతాపి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = వేడికలిగించువాడు.
పర్యాయపదాలు :
ఉపతాపముగలవాడు, సంతాపకారకము, రోగి, వేడి, పీడించువాడు.


ఉపతారకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సంతారకము.

ఉపత్యక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= కొండచేరువనేల, పర్వతములకు సమీపమునందుండు ప్రాంతము, కొండప్రాంతము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే భూమిరుపత్యకా. పర్వతము క్రిందనున్న సమీపభూమి.


ఉపద
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= కొండచేరువనేల, ఉపగ్రాహ్యము, కానుక, లంచము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపదీయత ఇతి ఉపదా. రాజసమీపమందుఈయఁబడునది.
కానుక, నజరాన, లంచము, అరణము, ఉపగ్రాహ్యము, ఉపఢౌకనము. వి., = కానుక, కానుకగా ఇచ్చేసొమ్ము, లంచము.

ఉపదంశము
సం., వి., అ., పుం., తత్స.,= ఊరగాయ.
నానార్థాలు :
కొరుకురోగము, భక్ష్యద్రవ్యము, పుట్టుటకూరమొదలుగునవి, మునగ, ఏరువంగ (వృ.వి) మధ్యపానరోచకభక్ష్యవిశేషము, అవదంశము, చక్షణము, మద్యపానము, మేఢ్ర్రేగవిశేషము, సమిష్ఠిలవృక్షము, శిగ్రువృక్షము, వ్యంజనద్రవ్యము, శిశ్నమువాపు.


ఉపదర్శకుడు
సం., వి., అ., పుం., తత్స.,= తప్పు జరగకుండా చూసుకొనువాడు, సాక్షి, ద్వారపాలకుడు

ఉపదశము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= పదికి దగ్గరగా ఉన్నది తొమ్మిది, పదకొండు.

ఉపదానము
సం., వి., అ., న., తత్స.,= అరణము, కానుక.

ఉపది
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = చెదపురుగు, బదనిక (వృ.వి).

ఉపదిక్కు
సం., అవ్య., తత్స.,= మూలదిక్కు. (ఈశాన్య, వాయవ్య, ఆగ్నేయ, నైరుతి అను 4 ఉప దిక్కులు)

ఉపదిశ
సం., నా. వా., అ., పుం., తత్స.,= మూలదిక్కు (ఈశాన్య, ఆగ్నేయ, వాయవ్య, నైరుతి, అను 4 ఉపదిక్కులు)

ఉపదిష్టము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపదేశింపబడినది, బోధనము, హితబోధనము, దీక్షాపూర్వకముగా మంత్రములను ఉపదేశింపబడినది, విధివాక్యము.

ఉపదేవత
సం., నా. వా., అ., పుం., తత్స., = దేవయోని (విద్యాధరాధి) అక్రూరపుత్రభేదము, సామర్థ్యయుక్తము, పిశాచము.

ఉపదేవి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= వసుదేవుని యొక్క పత్నీ భేదము, విద్యాధరజాతిస్త్రీ.

ఉపదేశం
వి., = బోధన, మంత్రము నేర్పడము, విధివాక్యము.

ఉపదేశకుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపదేశమును చేయువాడు.

ఉపదేశము
సం., వి., అ., పుం., తత్స., = హితవచనము,మంచిమాట (దీక్షాపూర్వకముగా మంత్రములను ఉపదేశించుట, విధివాక్యము)

ఉపదేశి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స.,= ఉపదేశము చేయువాడు.

ఉపదేశించు
సం., స., క్రి.,= ఉపదేశముచేయు, పన్ను.

ఉపదేశ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపదేశార్హమైన కర్మ. అనుశాసనము.

ఉపదేష్ట
సం., విణ., (ఋ.ఈ.ఋ.)., తత్స.,= ఉపదేశించువాడు, ఉపదేశకుడు, గురువు, ఆచార్యుడు.

ఉపదేహ
సం., నా. వా., అ., పుం., తత్స.,= దేహవృద్ధి.

ఉపదేహిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చెదపురుగు, కీటకము, ఉపజిహ్వ, వమ్ప్రీ, ఉపదీక.

ఉపదోహము
సం., నా. వా., అ., పుం., తత్స., = పాలుపితికెడుపాత్ర.

ఉపద్రవము
సం., వి., అ., పుం., తత్స.,= విప్లవము.
నానార్థాలు :
హావడి, విపత్తు, ఆపద, భాద, రోగోద్రేకమును సూచించుకారకము, ఉత్పాతము.


ఉపద్రుతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= విపత్తు, ఆపద, విప్లవములను పొందించునది.

ఉపధ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.= ధర్మార్థ కామములచేత మంత్రిలోనగువారి చిత్తమును పరీక్షించుట.
నానార్థాలు :
(వ్యాకరణమున)కడపటఅక్షరమునకు ముందటిఅక్షరము, మోసము, పరీక్ష, స్థాపనము, ఉపాయము, కపటము, కూట కల్పన.

వ్యుత్పత్త్యర్థము :
ఉపధీయతే శుద్ధిజ్ఞానమత్ర ఉపధా. దీనిచేత శుద్ధిజ్ఞానము కలుగును.


ఉపధర్మము
సం., వి., అ., పుం., తత్స.,= పాషాండ ధర్మము, అప్రధాన ధర్మము, వైదికముకానిది.

ఉపధాతువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = తక్కువ రకపు ధాతువు (ఇవి 7 స్వర్ణ మాక్షికము, తారామాక్షికము, తుత్తము, కాంస్యము, రీతి, సిందూరము, శిలాజతువు) శరీరమందలి రసాది సప్త ధాతువుల వలన పుట్టిన చనుబాలు మొదలుగునవి (స్తనము, రజస్సు, వప, స్వేదము, దంతములు, కేశములు, జౌజస్యము)

ఉపధానము
సం., వి., అ., న., తత్స., = తలగడ,
నానార్థాలు :
విషము, స్నేహము. ప్రణయము, వ్రతము, ఉపధానము, స్థాపనము, ఉంచుట, విశేషము, ప్రత్యేకగుణము, ప్రత్యేకలక్షణము, శిరోధానమము, ఉపవర్హము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపధీయతే శిరోత్రేతి ఉపధానం, ఉపధీయతే ఆరోప్యతే మస్తకమత్రేతి, దీనియందు శిరస్సు పెట్టఁబడును.


ఉపధానీయము
సం., నా. వా., అ., న., తత్స.,= దగ్గర ఉంచతగినది, తలగడ.

ఉపధారణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఎత్తుగా ఉండు వస్తువును క్రిందికిదించుటకు ఉపయోగించు సాధనము, ఒకే విషయముపై మనస్సు నిలుపుట.

ఉపధావనము
సం., నా. వా., అ., న., తత్స.,= వెంబడించుట, వెంటపరుగెత్తుట, మననముచేయుట.

ఉపధావించు
సం., అ., క్రి.,= ప్రధానించు, పారు.

ఉపధాశుద్ధుడు
వి.,= కపటం లేనివాడు, మోసం లేనివాడు.

ఉపధూపితము
సం., వి., అ., పుం., తత్స., = సమీపించిన యస్తమయము.; విణ., చావుసమీపించినది, పొగ వేయఁబడినది, సంతాపము కలది, ఎక్కువభాదకల మృత్యువు.

ఉపధూమితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= పొగకలది.

ఉపధృతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = సంధారణము, పైకి ఎత్తిపట్టుకొనుట, కిరణము, మయూఖము, అంశువు.

ఉపధ్మానము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఓష్ఠము, పెదవి, ఊదుట, ముఖమార్గమున గాలివిడుచుట.

ఉపధ్మానీయము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఓష్ఠమునందు పుట్టినది. పఫలకు పూర్వము అర్థవిసర్గవలె ఉండువర్ణభేదము (ఉదా - తపఃఫలము, శిరఃపాతము మొదలుగునవి.)

ఉపధ్వస్తము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= నశించునది, నష్టము, మిశ్రితము.

ఉపనందుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= గోకులాధిపుడైన నందుని భ్రాత సోదరుడు.

ఉపనక్షత్రము
సం., నా. వా., అ., న., తత్స.,= అప్రధాన నక్షత్రము (అశ్వని మొదలు 27 నక్షత్రములకు మరల ఒక్కొక్క నక్షత్రమునకు 27 భిన్న నక్షత్రములు అనుగతములై రాశి చక్రమందుండును.)

ఉపనఖము
సం., నా. వా., అ., న., తత్స.,= చిప్పము, గోళ్లయందు మాంసముపుట్టు రోగము, సుశ్రుతలో చెప్పబడిన నలభైనాలుగు క్షుద్రరోగములలో చిపాఖ్యే అను రోగభేదము. వి.,= గోటి దగ్గర పుట్టే రోగము.

ఉపనతము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స.,= కదిసినది.
నానార్థాలు :
పొందపడినది, ప్రాప్తము, సమీపించినది, వంగినది, సంభవించినది, లోనైనది, నమ్రము, ఉపగతము, ఉపస్థితి.


ఉపనతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= సమీపించుట, పొందుట.

ఉపనద(ది)
సం., అవ్య., తత్స., = నదులు.

ఉపనయనము
సం., వి., అ., న., తత్స.,= వడుగు.
పర్యాయపదాలు :
ఉపనయము, ఉపనాయము, దగ్గరకు తెచ్చుట, ఇచ్చుట, అర్పించుట, (వేదపఠనార్థము బాలుని గురుసమీపమునకు పంపుటకు అయిన సంస్కారము) ఉపనయనము, ఉపయోగించుట.


ఉపనయము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉపనయనము, న్యాయావయవభేదము.

ఉపనహనము
సం., నా. వా., అ., న., తత్స.,= కట్టుట, కట్టుటకు సాధనమగువస్త్రాదికము.

ఉపనాగరిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = వృత్యనుప్రాస వృత్తిభేదము.

ఉపనాథుడు
వి., = ఉపపతి, రంకు మొగుడు.

ఉపనామము
వి., = వంకరపేరు, కులనామము, ఇంటిపేరు.

ఉపనాయకుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= దగ్గరకు తెచ్చువాడు, ఉపపతి, నాయకునకు కొంచెము తక్కువై సహాయకుడుగా ఉండు నాయకుడు. (రామాయణమునందు లక్ష్మణుడు.)వి.,= నాటకం మొ. వాటిలో నాయకుడికి సహాయకుడు.

ఉపనాయనము
సం., నా. వా., అ., న., తత్స.,= దగ్గరకు తెచ్చుట, ఇచ్చుట, అర్పించుట, వడుగు (వేదపఠనార్థము బాలుని గురుసమీపమునకు పంపుటకు అయిన సంస్కారము) ఉపనయనము, ఉపయోగించుట

ఉపనాయము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉపనయన సంస్కారము, వడుగు.

ఉపనాయిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= నాటకాదులందు ముఖ్యనాయికకు కొంచెముతక్కువ అగునాయిక. వి.,= నాటకం మొ. వాటిలో నాయకుడికి సహాయకురాలు.

ఉపనాహనము
సం., నా. వా., అ., న., తత్స.,= విలేపము పూయుట, పుండుపైమందురాయుట, కట్టుట, కట్టటకు సాధనమగు వస్త్రాధికము.

ఉపనాహము
సం., వి., అ., పుం., తత్స., = తంతి చుట్టెడు బిరడ.
నానార్థాలు :
పుంటిమీఁద పూసెడి మందు, వీణకు తీగలు కట్టుచోటు, వీణక్రిందిభాగము, శత్రుత్వము, మూట, కట్ట, ఒకానొక రోగము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపనహ్యంతే తంత్ర్యో ఉపనాహః” తంతులు దీనియందుఁ కట్టఁబడును.


ఉపనిక్షేపము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఇల్లడపెట్టుట, న్యాసము, వస్తురూప సంఖ్యాదులను చెప్పి ఏదేని ఒక వస్తువును ఒకనివద్దదాచుట.

ఉపనిదాయకుడు
ఇల్లడపెట్టుట, న్యాసము, వస్తురూప సంఖ్యాదులను చెప్పి ఏదేని ఒక వస్తువును ఒకనివద్దచాచుట

ఉపనిధాత
సం., నా. వా., (ఋ.ఈ.ఋ.)., తత్స.,= ఇల్లడపెట్టుట, న్యాసము, వస్తురూప సంఖ్యాదులను చెప్పి ఏదేని ఒక వస్తువును ఒకనివద్దచాచుట.

ఉపనిధానము
సం., నా. వా., అ., న., తత్స., = రూపమును సంఖ్యను చెప్పక, చూపక తన ధనమును పదిలపరుచుటకై మరొకని వద్ద ఉంచుట, వాడిక.

ఉపనిధి
సం., వి., ఇ., పుం., తత్స., = చెప్పక చూపక యుంచిన యిల్లడ.
నానార్థాలు :
వాడిక, న్యాసము, పనిమంత్రవి, స్థాప్యద్రవ్యము, రెండు సామమంత్రముల గానము, వాసుదేవపుత్రుడు.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే నిధానముపనిధిః. ఒకని వద్ద పెట్టుట ఉపనిధి, ఉపనిధీయతే ఇతి ఉపనిధిః. దగ్గరలో ఉన్న వస్తువు.


ఉపనిపాతం
వి., = దగ్గరకి రావడము, ఆకస్మికముగా జరగడము, అకస్మాత్తుగా పైకిబడటము.

ఉపనిపాతము
సం., నా. వా., అ., పుం., తత్స., = దగ్గరకువచ్చుట, ఆకస్మికముగా సంభవించుట, ఆకస్మికముగా పైపడుట.

ఉపనిపాతి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స.,= ఆకస్మికముగా వచ్చువాడు.

ఉపనిబంధనం
వి.,= నెరవేర్చే సాధనము, కూర్చడము, కట్టడము.

ఉపనిబంధనము
సం., నా. వా., అ., న., తత్స.,= ఒడకూర్చెడు సాధనము, కట్టుట.

ఉపనియమావళి
వి.,= ఒక సంస్థ నిర్వహణకు సంబంధించి, పాలకమండలి రూపొందించిన నియమాలు.

ఉపనివేశితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = నివాసితము, వసతి, విశేషరూపేణ స్థాపితము, నివేశితమాత్రము.

ఉపనిషాది
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = దగ్గరకూర్చుండువాడు, (గురువు మొదలగువారి దగ్గర ఉండువాడు.)

ఉపనిష్కరము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉక్కళము, ఉపనిష్కరము, పురమార్గము. (రాజమార్గమని హేమచంద్రుడు)
వ్యుత్పత్త్యర్థము :
ఉపనిష్కీర్యతే సైన్యమత్రేతి ఉపనిష్కరం. అంతట సైన్యము పర్యాప్తముగాఁచల్లఁబడును.


ఉపనిష్కురము
సం., వి., అ., న., తత్స.,= ఉక్కళము, (రూ.) ఉపనిష్కరము.

ఉపనిష్క్రమణము
సం., నా. వా., అ., న., తత్స.,= రాజమార్గము.

ఉపనిహితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపనిధిగా ఉంచబడినది.

ఉపనీతము
వి.,= ఉపనయనము, వడుగు.

ఉపనీతి
వి.,= ఉపనయనము.

ఉపనీతుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= వడుగు అయినవాడు, సమీపమునకు తేబడినవాడు.

ఉపనేత
సం., నా. వా., ఋ., పుం., తత్స.,= దగ్గరకు తెచ్చువాడు, ఆచార్యుడు

ఉపన్యసించు
సం., స., క్రి., = ఉనుచు. ఉపన్యాసము చేయు.
ప్రయోగము :
వ. పురుషోత్తమునందుజిత్తంబుపన్యసించి. భాగ. 2, స్కం. – 2


ఉపన్యాసకుడు
వి., = అధ్యాపకుడు, ఉపన్యసించే వ్యక్తి, వివరించే వ్యక్తి.

ఉపన్యాసము
సం., వి., అ., పుం., తత్స., = ఏదేని ఒక విషయమునెత్తి విస్తరించి చెప్పుట, దగ్గర ఉంచుట, ఇల్లడ పెట్టుట, స్వకార్యము నెరవేరుటకై చేసికొను సంధి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపన్యసనముపన్యాసః. ఉపన్యసించుట ఉపన్యాసము


ఉపపతి
సం., వి., ఇ., పుం., తత్స., = జారుడు, ఱంకుమగడు, మారుమగడు.
నానార్థాలు :
కలిమి, అంతము, అర్హత, కారణము, దృష్టాంతము, పుట్టుక, వృత్తాంతము.

వ్యుత్పత్త్యర్థము :
పత్యా ఉపమితః ఉపపతిః. పతితో సరిపోల్పఁపడువాఁడు.


ఉపపత్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = కలిమి.
నానార్థాలు :
అంతము, అర్హత, కారణము, దృష్టాంతము, పుట్టుక, వృత్తాంతము, కలుగట, ప్రాప్తి, పొందుట, సిద్ది, ఒనగూడుట, యుక్తి సంగతి, పొందిక, హేతువు, సమాప్తి, ఉపాయము, సాహాయ్యము, సమాధి, చిత్తవృత్తి విరోధము, ప్రతిపాలనము, చెప్పుట, సిద్ధించుట.


ఉపపత్ని
వి., = ఉంచుకొన్న భార్య.

ఉపపదము
సం., నా. వా., అ., న., తత్స., = ఒకపదమునకు అవ్యవహిత పూర్వముగా ఉన్న పదము, ఒక నామమునకు వెనువెంట ఉచ్చరింపబడు బిరుదాది సూచకమగు శబ్దము.

ఉపపన్నము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉపపత్తికలది.
పర్యాయపదాలు :
పుట్టినది, ఉత్పన్నము, ప్రాప్తము, పొందబడినది, కూడినది, సంపన్నము, కలిమికలది, అర్హమైనది, యుక్తియుక్తమైనది.


ఉపపన్నుడు
వి., = భాగ్యవంతుడు.

ఉపపాతకము
సం., నా. వా., అ., న., తత్స., = చిన్నపాపము.

ఉపపాతము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆకస్మికముగా వచ్చుట, నాశము, ఫలించుటకు సిద్ధముగా ఉండుట.

ఉపపాతి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స.,= తొందరగా వచ్చుట.

ఉపపాదకము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = కలిగించునది, ఉత్పాదకము, యుక్తాయుక్తముగా చెప్పునది, ఉపపత్తికలదిగాచేయునది.

ఉపపాదనము
సం., వి., అ., న., తత్స., = కలిగించుట, ఇచ్చుట, యుక్తిచేత సమర్థించుట, చక్కగా ప్రతిపాదించుట, వివరించి చెప్పుట.

ఉపపాదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పాదమును పొందినది, పాదము దగ్గరకు వచ్చినది.

ఉపపాదించు
క్రి., = తెలుపు, తెలియజేయు.

ఉపపాదితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = కలిగింపబడినది, చక్కగా ప్రతిపాదించబడినది, యుక్తిచేత సమర్థించునది.

ఉపపాద్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = కలిగింపతగినది, ప్రతిపాదింపతగినది, చెప్పదగినది, యుక్తిచే సమర్ధింపబడినది.

ఉపపురము
సం., నా. వా., అ., న., తత్స., = పేట, శాఖానగరము, పురములో ఉన్నవాడి పేరు.

ఉపపురాణం
వి., = వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలు కాకుండా ఇతర మునులు రాసిన పురాణాలలో ఒకటి.

ఉపపురాణము
సం., నా. వా., అ., న., తత్స., = వ్యాసునిచేరచింపబడిన పదునెనిమిది పురాణములవంటి అనేకమంది మునులచే రచించబడిన నానావిధపురణాములు. వ్యాసప్రోక్తములగు అష్టాదశపురాణములవంటి వైనానాముని ? ప్రణీతములగు నారసింహాదిపురాణములలోఒకటి

ఉపపుష్పిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = దీనిచే పువ్వువలె నోరు వికసించును. జృంభణము, ఆవులింత.

ఉపపౌర్ణమాస(సి)
సం., అవ్య., తత్స.,= పౌర్ణమాసానికి దగ్గరగా.

ఉపప్రదానము
సం., నా. వా., అ., న., తత్స., = అప్పగించుట, లంచము, సంధికొరకుభూమి మొదలగువాని ఇచ్చుట, కప్పము.

ఉపప్రలోభనము
సం., నా. వా., అ., న., తత్స., = ఆకర్షణము, వశీకరణము, లంచము.

ఉపప్లవము
సం., వి., అ., పుం., తత్స., = ఉత్పాతము.
నానార్థాలు :
ఉపద్రవము, రాహువు, నీటిపై తేలుట, సమీపగతి, సూర్యచంద్రులగ్రహణము, విపత్తు, భయము, విఘ్నము, మారిమసూరిక మొదలుగువ్యాథుల వలన పీడ, ఉపరోధము, అరికట్టుట, రాహుగ్రహము. పుం. గ్రహణము, విప్లవము.


ఉపప్లవ్యము
సం., నా. వా., అ., న., తత్స., = పీడింపతగినది, విరాటనగర సమీపమున ఉండు పురభేదము, నీటిపై తేలుట.

ఉపప్లుతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = స్త్రీలకు గర్భాశయమున కలిగెడు ఒకానొకరోగము.

ఉపబంధము
సం., నా. వా., అ., పుం., తత్స., = దృఢముగా ఉండుటకై రెండవమారు బంధించుట, రతిబంధవిశేషము, పద్మాసనబంధమువంటి ఒక ఆసన భేదము.

ఉపబర్హణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉపధానము, పీడించుట, తలగడ.

ఉపబర్హము
సం., వి., అ., పుం., తత్స.,= ఉపధానము, పీడించుట, తలగడ.
వ్యుత్పత్త్యర్థము :
ఉపబృహ్యతే ఉన్నమ్యతే శిరోత్రేతి ఉపబర్హః. దీనియందు శిరస్సు ఎత్తఁబడును.


ఉపబహు
సం., నా. వా., (ఉ.ఊ.ఉ.)., తత్స.,= ఎక్కువ సంఖ్యల యందుండునది.

ఉపబాధ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = పీడనము, ఒత్తిడి.

ఉపబాహు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = బాహువు దగ్గరి భాగము, బాహువు సమీప అవయవము.

ఉపబృంహణము
సం., వి., అ., న., తత్స., = చక్కగా పెరుగుట, సంవృద్ధి.

ఉపబృంహితము
సం., విణ., (అ.ఆ.అ)., తత్స., = చక్కగాపెరిగినది, సంవర్థితము.

ఉపబ్ది
సం., నా. వా., ఇ., పుం., తత్స., = వినతగిన శబ్దము.

ఉపభంగము
సం., నా. వా., అ., పుం., తత్స.,= యుద్దమునుండి పరిగెత్తుట.

ఉపభుక్తము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= అనుభవింపబడినది, ఆస్వాదింపబడినది, ఉపయోగింపబడినది.

ఉపభుక్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = అనుభవము, తినుట, వినియోగించుట, ఉపభోగము.

ఉపభూషణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఉత్తరీయాదికము భూషణమువంటిది.

ఉపభృత్తు
సం., వి., త్., స్త్రీ., తత్స.,= స్రుగ్భేదము, ఒక హోమసాధనము, యజ్ఞాంగ పాత్ర విశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపభ్రియతే హోమార్థమిత్యుపభృత్. హోమార్థమైబరింపఁబడునది.


ఉపభోగము
సం., వి., అ., పుం., తత్స., = అనుభవము.
పర్యాయపదాలు :
వినియోగించుట, విషయసుఖము, ఆస్వాదించుట, సంభోగము, భోగించుట, అనుభవింపఁతగినది, నిర్వేశము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపభుక్తిరుపభోగః. అనుభవింపఁతగినది.


ఉపభోగ్యము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = అనుభవింపతగినది.

ఉపభోజి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = అనుభవించతగినది, భక్ష్యము, తినదగినది.

ఉపమ
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఒక అర్థాలంకారము.
నానార్థాలు :
పోలిక, ఉపమేయము, అంతికము, ఉపాయము, పోల్పఁదగిన, చంద్రాది, వలె.

వ్యుత్పత్త్యర్థము :
ఉపమీయత ఇత్యుపమా. ఉపమింపఁబడునది.


ఉపమంత్రణము
సం., నా. వా., అ., న., తత్స.,= ఆమంత్రణము, పిలుపు, ఉపచ్చందనము, గుప్తదానము, బుజ్జగించుట.

ఉపమంత్రి
వి., = కాబినెట్ మంత్రికంటె తక్కువ స్థాయి మంత్రి. పిలువాడు, బుజ్జగించువాడు

ఉపమంథని
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= అగ్నినిమధించుటకు సాధన ద్రవ్యము.

ఉపమద్గు
సం., నా. వా., ఉ., పుం., తత్స.,= ఒక క్షత్రియుడు, శఫల్కపుత్రుడు, అక్రూరుని అనుజుడు, యుదువంశము.

ఉపమన్యువు
సం., నా. వా., ఉ., పుం., తత్స.,= ఒక ఋషి.

ఉపమర్దకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = అవమానపరచువాడు, హింసించువాడు.

ఉపమర్దము
వి.,= ఒరపిడి.
నానార్థాలు :
బాధించడము, అవమానించడము, దంచడము, కలయబెట్టడము, మోపిన తప్పును ఖండించడము, బాధించుట, అవమానపరచుట, తిరస్కరించుట, నిష్పీడనము, హింసనము, ధాన్యాదులు దంపుట, ఆలోడనము, విప్రకారము.


ఉపమా
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= సాదృశ్యము, పోలిక, వలె, ఉపమాన జన్యమైన శబ్దశక్తి జ్ఞానరూపానుభవ విశేషము, అర్థాలంకార విశేషము, ప్రత్యక్షాది ప్రమాణములలో ఒకటి.

ఉపమాత
సం., వి., ఋ., స్త్రీ., తత్స., = దాది.; విణ. ఉపమానమును చెప్పెడువాఁడు, ఉపమించువాడు, ధాత్రి, పోల్చువాడు, మాతృతుల్యురాలు (పినతల్లి) మొదలుగునవి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపమితా మాతా. తల్లివంటిది.


ఉపమాతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= ఉపమానము, హింసనము, వ్యాపృతము.

ఉపమాదము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= హర్షము కలిగించునది, ఉపమాదకము.

ఉపమానచింతామణి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = గంగేశోపాధ్యాయ విరచిత ఉపమాన ప్రామాణ్యవ్వవస్థాపక గ్రంథభేదము.

ఉపమాస్యము
సం., నా. వా., అ., న., తత్స.,= ప్రతిమాసముచేయు పితృశ్రార్ధము (మాసికము).

ఉపమించు
సం.,స., క్రి.,= పోల్చు.

ఉపమితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపమింపబడినది, పోల్పబడినది.

ఉపమితి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఉపమానము, పోలిక, ఉపమాలంకారము, ఉపమానఫలము.

ఉపమేతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = శాలవృక్షము.

ఉపమేయము
సం., వి.,(అ.ఆ.అ.)., తత్స.,= పోలిక యందలి విషయము. విణ పోల్పతగినది, వర్ణనీయము (ముఖాది).

ఉపమేయోపమ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= ఒక అర్థాలంకారము.

ఉపయంత
సం., నా. వా., ఋ., పుం., తత్స.,= ఆజ్ఞాపించువాడు, మగడు, వరుడు.

ఉపయంత్రము
సం., నా. వా., అ., న., తత్స.,= శల్యమును తీయుటకు సాధనమైన యంత్రభేదము.

ఉపయమనము
సం., నా. వా., అ., న., తత్స.,= వివాహము, సంయమనము, కట్టుబాటులో ఉంచుట, బంధించుటకు సాధనమైనకుశాది.

ఉపయాచకుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = దగ్గరకు వచ్చి యాచించువాడు.

ఉపయాచనము
సం., నా. వా., అ., న., తత్స.,= దగ్గరకువచ్చియాచించుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగమ్య యాచనమ్. సమీపమునకు వచ్చి అభీష్టములను ప్రార్థించుట


ఉపయాచితకము
సం., వి., అ., న., తత్స.,= అభీష్టసిద్ధికై దేవతలకీఁబడు ద్రవ్యము, మ్రొక్కుబడి.

ఉపయాచితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= దగ్గరకు వచ్చియాచింపబడినది. (ధనాది), అభీష్టసిద్ధికై దేవతలకీయబడినది(పశ్వాది) యాచన, ప్రార్థన, ప్రార్థించబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపయాచ్యతేఽనేన


ఉపయాతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= దగ్గరకు వచ్చినది, మరలవచ్చినది, దగ్గరకు వచ్చుట, మరల వచ్చుట, రాక, వచ్చినది.

ఉపయానము
సం., నా. వా., అ., న., తత్స.,= దగ్గరకు ప్రార్థించుట, దగ్గరకువచ్చువాడు, యాచించువాడు.

ఉపయామము
సం., వి., అ., పుం., తత్స., = ఉపయమము, పెండ్లి, వివాహము, కళ్యాణము, యజ్ఞమందు ఉపయోగించు పాత్ర విశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపయమనం ఉపయామః. ఉపయమనమే ఉపయామము.


ఉపయుక్తము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఒదవుబడియైనది.
నానార్థాలు :
కూర్చపడినది, ఉపయోగపడినది, న్యాయమైనది, అర్హమైనది, తినబడినది.


ఉపయుక్తి
వి., = ఉపయోగము, ప్రయోజనము, కూడి ఉండటము, వాంఛలు తీర్చగలశక్తి, అనుభవసౌఖ్యము.

ఉపయోగము
సం., వి., అ., పుం., తత్స.,= ఒదవుబడి.
నానార్థాలు :
అనుకూలము, వాడుక, అనుభవించు, ప్రయోజనము, ఆచరణము, భోజనము, ఫలము, ఉద్దేశముతో పనిచేయుట.


ఉపయోగి
సం., నా. వా., (న్.నీ.న్.)., తత్స.,= అనుకూలము.
నానార్థాలు :
వాడుక, అనుభవించు, ప్రయోజనము, ఫలము, ఉద్దేశముతో పనిచేయుట, ఉపయోగపడునది, ఉపయోగపఱచునది.
సం., అ., క్రి.,= ఒదవు.

ఉపరంజకము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపరాగముకలిగించుట.

ఉపరంజ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపరాగము కలిగింపదగినది. ఉపరాగము కలిగించునది.

ఉపరంధ్రము
సం., వి., అ., న., తత్స.,= తొలకు, మృగముల వెనుక కాని మూలమునకును ప్రక్కకును మద్యకల చోటు.

ఉపరక్షకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = అంగరక్షకుడను భటుడు. రాజునొద్ద కావలియుండు భటుడు, ఇతరులవలన సాయములేకుండా రాజువద్ద కావలి ఉండుభటుడు.

ఉపరక్షణము
సం., వి., అ., న., తత్స., = బెత్తములవారు సందడి లేక తొలఁగించుట. శిబిర రక్షణముకొఱకు చుట్టుఁపెట్టిన వెలుగులోనగునది.
పర్యాయపదాలు :
రక్షణము, పహారా, రక్షార్థము సైన్యాదులను స్థాపించుట, శిబి రక్షణము కొరకు చుట్టూ వేసిన కంచె మున్నగు ఆవరణము, కావలి.

వ్యుత్పత్త్యర్థము :
ఉపరక్ష్యతేనేనేతి ఉపరక్షణం. దీనిచేత శిబిరము రక్షింపఁబడును.


ఉపరతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఉడిగినది, విరమించినది, చచ్చినది, విరక్తిపొందినది, మరలినది.

ఉపరతాతి
సం., నా. వా., ఇ., స్ర్రీ., తత్స., = యుద్దము.

ఉపరతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఉడుకున.
నానార్థాలు :
పురుషాయితము, చాలించుట, నిలుపుదల, ఋద్ధి, సన్యాసము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపరమణముపరతిః. శాస్త్రవిహితకర్మములను విధ్యుక్తముగా త్యజించుట.


ఉపరథ్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పనులులోనగువాని రాకపోకల చేత నేర్పడిన ఊరిముందఱిదారి, పుంత, చిన్నదారి, చిన్నవీధి.

ఉపరమము
సం., నా. వా., అ., పుం., తత్స., = విరమించుట, ఉపేక్ష.

ఉపరవము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక దేశ భేదము

ఉపరసము
సం., నా. వా., అ., పుం., తత్స., = గంధకము, ఇంగీలీకము, పాదరసముతోసాటియైనది, ప్రధానరసమునకు అంగమైన రసము. వి., = మందుతోపాటు తీలుకొనే అనుపానము.

ఉపరాగము
సం., వి., అ., పుం., తత్స., = రాహువు సూర్య చంద్రులను పట్టుట.
నానార్థాలు :
అన్యాయము, గ్రహకల్లోలము, వ్యసనము, గ్రహణము, రాహువు, విగానము, పరీవాదము, దుర్నయము, ఎరువు, నింద, ఆపద, చెడునడవడి.

వ్యుత్పత్త్యర్థము :
ఉపరజ్యేతే సూర్యాచంద్రమసావనేన ఉపరాగః. సూర్యచంద్రులు దీనిచేత రాగమును పొందింపబడుదురు.


ఉపరాజ
సం., అవ్య., తత్స., = రాజుసమీపంలో ఉన్నవాడు, రాజ తుల్యుడు.

ఉపరావము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సమీపమున ఉచ్చరిత శబ్దము.

ఉపరి
సం., అవ్య., తత్స., = సప్తమ్యంతార్థవృత్తులు, ఊర్ధ్వశబ్ద అర్థము ప్రథమా పంచమీ. పైన, పైనుండి.

ఉపరిచరము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= పైనతిరిగెడి పక్షులు, రాజభేదము.

ఉపరితనము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= మీదపుట్టినది, మీదిది, పైది.

ఉపరితలము
వి., = పై భాగము.

ఉపరిమర్త్యము
సం., అవ్య., తత్స., = మర్త్యమునకు ఉపరిభాగము.

ఉపరిమేఖలము
సం., నా. వా., అ., పుం., తత్స.,= గోత్తప్రవక్త , ఋషిభేదము.

ఉపరివృహతి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = చంధోభేదము.

ఉపరిష్టాత్
సం., అవ్య., తత్స., = పైన, మీదది.

ఉపరీతకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఒకానొకరతిబంధము.

ఉపరుద్ధము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= అడ్డగింపపడినది, చెఱపట్టబడినది, ముట్టడింపబడినది, కప్పపడినది.

ఉపరూపకము
సం., నా. వా., అ., న., తత్స., = దృశ్యప్రబంధభేదము, ఇది అష్టాదశవిధములు.వి., = దృశ్యప్రబంధభేదము.

ఉపరోఘము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఆవరణము, అనురోధము, ప్రతిబంధము.

ఉపరోధకము
సం., నా. వా., అ., న., తత్స., = ప్రతిబంధకము, అడ్డగించునది, ముట్టడించునది, వాసగృహము, పడకటిల్లు, ఆవరించునది.

ఉపరోధము
సం., వి., అ., పుం., తత్స., = అవరోధము, అడ్డగింత, ఆవరించుట.

ఉపరోధించు
సం., స., క్రి.,= అవరోధించు, అడ్డగించు.

ఉపల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కల్వపుగుండు, పొత్రము, మొరపరాయి.; అ.పు.ము. రాయి, రత్నము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపలాతీత్యుపలా. సమీపమునకు తేఁబడినది.


ఉపలక్షకము
సం., నా. వా., అ., (అ.ఆ.అ.)., తత్స., = చూచునది, ఊహించునది, కనుగొనునది, స్వార్థమును విడువక అన్యార్థమును లక్షణచే దెలుపునట్టిది.

ఉపలక్షణము
సం., వి., అ., న., తత్స., = ఒకటినుద్దేశించి చెప్పినది సామాన్యధర్మముచే తదితర స్థలములయందును ప్రవర్తించుట. చూచునది, గుఱుతు, చిహ్నము, సూచించుట, వాచ్యార్థమునే కాక దాని కంటె వేఱగు నర్థమునుగూడ లక్షణచేఁ దెలుపుట. (కాకుల నుండి పెరుఁగును గాపాడుము అనుచో కాక శబ్దము కాకినే కాక దానికంటె వేఱై కాకివలె పెరుఁగును త్రాగివేయు కుక్క మొదలగువానిని గూడఁ దెలుపుచున్నది. ఇట్లు తెలుపుట ఉపలక్షణము మనఁబడును.)

ఉపలధిప్రియము
సం., నా. వా., అ., పుం., తత్స., = చమరమృగము.

ఉపలబ్ధ
సం., నా. వా., (ఋ.ఈ.ఋ.)., తత్స., = ప్రాప్తము, పొందినది, తెలిసికొనినది.

ఉపలబ్ధము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = పొందబడినది, తెలియఁబడినది, ప్రాప్తము.
వ్యుత్పత్త్యర్థము :
కేనాప్యుపాయేన ఉపలబ్ద అర్థః యస్యాస్యా ఉపలబ్ధార్ధా. ఏయుపాయముచేతనైన ఎఱుగఁబడిన అర్థముగలది.


ఉపలబ్ధి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = తెలివి.
నానార్థాలు :
పొందు, బుద్ధి, ప్రాప్తి, మతి, జ్ఞానము, ప్రాప్తము, పొందినది, ప్రత్యక్ష జ్ఞానము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపలభ్యతే అనయేత్యుపలబ్ధిః. పదార్ధము దీనిచేత లెస్సగాపొందబడును.


ఉపలభేది
సం., నా. వా., న., పుం., తత్స.,= రాయిని భేదించునది.కొండపిండిచెట్టు

ఉపలభ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పొందతగినది, తెలియతగినది, ప్రాప్తము, తెలిసినది.

ఉపలము
సం., నా. వా., అ., పుం., తత్స., =, రాయి, రత్నము, పాషాణము, పాత్రము, తిరగలి యొక్క పై రాయి, గులకరాయి, శర్కరా, మేఘము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపలాతి భినత్తి వస్తూనితి ఉపలః. వస్తువుల ఖంఢించునది.
తిరగలి మీదిరాయి, రత్నము, రాయి

ఉపలాలనము
సం., వి., అ., న., తత్స., = బుజ్జగము.

ఉపలాలించు
సం., స., క్రి., = బుజ్జగించు.

ఉపలాలితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = బుజ్జగింపబడినది.

ఉపలింగము
సం., వి., అ., న., తత్స., = ఉపద్రవము, అరిష్ట సూచకమగు భూకంపము మొదలగునవి, అరిష్టము, దుర్భాగ్యము, దుశ్శకునము.

ఉపలిప్తము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = అలుకబడినది, పూయపడినది.

ఉపలేపనము
సం., వి., అ., న., తత్స., = గోముఖము.
నానార్థాలు :
అలుకుట, ఆవుపేడతో అలుకుట, సున్నము మొదలగునవి పూయుట, తైలాదికము, రాసుట, అలుకుటకు పూయుటకు రాసుటకు ఉపయోగించు ద్రవ్యము.


ఉపలేపము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆవుపేడతో అలుకుట.
నానార్థాలు :
సున్నము మొదలగునవి పూయుట, తైలాదికము రాసుట, అలుకుటకు పూయుటకు రాసుటకు ఉపయోగించు ద్రవ్యము.


ఉపవంగము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వంగదేశ సమీప దేశము.

ఉపవక్త
సం., నా. వా., ఋ., పుం., తత్స., = వక్తకు సహాయము చేయు వక్త, బ్రహ్మ, ఒకానొక ఋత్విజుడు.

ఉపవర్ణనము
సం., నా. వా., అ., న., తత్స., = వర్ణించుట, ప్రతిపాదనే లక్షణగుణ ప్రతిపాదనము.

ఉపవర్తనము
సం., వి., అ., న., తత్స., = దేశము.
నానార్థాలు :
విలాతి, జనపదము, విషయము, నూరుకంటె ఎక్కువ గ్రామములుకల దేశము, గుర్రము దొర్లుచోటు, మండలము, సాధనచోటు, ప్రదేశము, జనపదసముదాయము, జనపదైకదేశము, సజలనిర్జలస్థానమాత్రము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపవర్తతే అస్మిన్నితి ఉపవర్తనం. దీనియందు జనులు ఉందురు.


ఉపవర్షుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒకానొక ఋషి, పాణిని యొక్క గురువు.

ఉపవర్హము
సం., నా. వా., అ., పుం., తత్స., = శిరోధానము, ఉపధానము.

ఉపవల్లిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = అమృతస్రవ యనులత.

ఉపవల్హము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ప్రాధాన్యము.

ఉపవసధము
సం., వి., అ., పుం., తత్స., = గ్రామము, ఊరు, యాగమునకు పూర్వదివసము.

ఉపవసించు
సం., అ., క్రి., = భుజింపకుండు, పస్తుండు.

ఉపవస్తము
సం., వి., అ., పుం., న., తత్స., = ఉపవాసము, ఉపవసించువాడు, అగ్ని సమీపమందుండుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉప సమీపే వసనం ఉపవస్తం. సమీపమున ఉండుట ఉపవస్తము.


ఉపవాకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పరస్పరాలాపము, సంభాషణము.

ఉపవాచకము
వి.,= ప్రధాన పాఠ్యపుస్తకముతో పాటు అభ్యసించే మరో వాచకము.

ఉపవాదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= అపవాదము, నింద.

ఉపవాసకుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపవసించువాడు, భోజనము లేకుండుట, ఒక వ్రతము. వి.,= పస్తు ఉన్న వ్యక్తి.

ఉపవాసనము
సం., నా. వా., అ., న., తత్స.,= సేవించుట.

ఉపవాసము
సం., వి., అ., పుం., న., తత్స.,= పస్తు, అగ్ని సమీపమందుండుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉప సమీపే వాసం ఉపవాసః. దగ్గరగా ఉండుట ఉపవాసము.


ఉపవాసి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ఉపవాసకుడు, ఆహారం తీసుకోకుండా ఉండుట.

ఉపవాహనము
సం., నా. వా., అ., న., తత్స., = సమీపమునకు కొనిపోవుట, దగ్గరకు గొనిపోవుట.

ఉపవాహ్యము
సం., వి., అ., పుం., తత్స., = రాజు ఎక్కెడి ఏనుగు, ఔపవాహ్యము, రాజాదులెక్కదగినది.

ఉపవిందు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = రాజబేధము.

ఉపవిద్
సం., నా. వా., ద్., స్త్రీ., తత్స.,= తెలుసుకొనుట, ప్రాప్తము, జ్ఞానము.

ఉపవిభక్తి
జౌప విభక్తికము

ఉపవిష
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అతివస, అతివిషము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగతా విషం ఉపవిషా. విషమునుపొందునది.


ఉపవిషము
సం., నా. వా., అ., పుం., తత్స., = జిల్లేడుపాలు, అతివస, కృత్రిమవిషము.

ఉపవిష్ణుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = కూర్చుండినవాడు.

ఉపవీతము
సం., వి., అ.,న., తత్స., = ఎడమ భుజముమీఁదుగా కుడి పార్శ్వమున వ్రేలెడు జందెము, ఉత్తరీయము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపవీయతే వామస్కంధో అనేనేతి ఉపవీతం. ఎడుమ భుజము దీనిచేతఁ కప్పఁబడును.


ఉపవేణ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఒక నది.

ఉపవేదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= వేదసదృశమగు ఆయుర్వేదాదికము, ఋగ్వేదమునకు ఆయుర్వేదము, యజుర్వేదమునకు, ధనుర్వేదమును సామవేదమునకు గాంధర్వవేదము, అధర్వవేదమునకు శస్త్రశాస్త్రాలు, వేదములకు నాలుగు ఉపవేదములు.

ఉపవేశనము
సం., నా. వా., అ., న., తత్స., = ఉపవేశనము, స్థాపనము, ఉపదేశము.

ఉపవేశము
సం., వి., అ., పుం., తత్స., = ఆసన, కూర్చుండుట, ఆహార్యరూపసదృశము.

ఉపవేశి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఆసనమున ఉన్నవాడు, యజుర్వేదసంప్రదాయ ప్రవర్తకుడైన ఒక ఋషి.

ఉపవైణవము
సం., నా. వా., అ., న., తత్స., = పగటిలోని 3 భాగములు.

ఉపవ్యాఖ్యానము
సం., నా. వా., అ., న., తత్స., = వ్యాఖ్యానము చాలని పట్టులకు రాయువ్యాఖ్యానము.

ఉపవ్యాఘ్రము
సం., నా. వా., అ., పుం., తత్స., = పులి సమీపము, పులితో సమానమైన మృగము, సివంగి, పశుభేదము.

ఉపశమనము
సం., వి., అ., పుం., న., తత్స., = అడగుట, ఓర్పు, ఉపశమము కలిగించునది.

ఉపశమము
సం., వి., అ., పుం., తత్స., = అడగుట, ఓర్పు, తగ్గుట, ఇంద్రియనిగ్రహము, నిమ్మళించుట, రోగాదులు మానుట, క్షీణమగుట.

ఉపశమించు
సం., అ., క్రి., = అడగు, ఓర్చు. (రూ. ఉపశమిల్లు.)

ఉపశయము
సం., వి., అ., పుం., తత్స., = వలయొడ్డి యాచెంత తాను దాగి ఉండుటకై త్రవ్విన పల్లము(గొయ్యి), మాటు.
నానార్థాలు :
దగ్గరపరుండుట, అన్నౌషదాధుల చేత వ్యాధిని కనిపెట్టుట, పథ్యాదులచే రోగమునకు ఉపశమనము కలిగించుట, హస్తసమీపమున ప్రక్కపరుండునది.


ఉపశరదము
సం., అవ్య., తత్స., = బాణసమీపము.

ఉపశల్యము
సం., వి., అ., న., తత్స., = గ్రామము చేరువ నేల, గ్రామోపకంఠము, గ్రామాంతము, గ్రామ ప్రాంతభాగము, ఊరి పొలిమేర.
వ్యుత్పత్త్యర్థము :
ఉపగతః శల్యః కీలకో యస్య ఉపశల్యం. నేల గుఱుతు తెలియుటకుఁగాను సమీపమందు శిలకలిగినది.


ఉపశాంతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = అడుగుట, ఓర్పు, ఉపశమము నొందినది.

ఉపశాయము
సం., వి., అ., పుం., తత్స., = నిద్రించుట.
పర్యాయపదాలు :
కావలివారు వరుసక్రమమున పండుకొనుట, వరుస, పర్యాయమున నిద్రించుట, దగ్గరగా పరుండుట, విశాయము, కావలి వారు వంతులప్రకారము పరుండుట.

వ్యుత్పత్త్యర్థము :
ఉపశయనముపశాయః, దగ్గరగా పరుండుట ఉపశాయము


ఉపశాయి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = దగ్గరపడుకునేవాడు, పరుండువాడు, నిద్రను కలిగించునది. (మందు).

ఉపశిక్ష
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = బాగుగా విద్య నేర్పుట, బాగుగా విద్యనేర్చుకొనుట.

ఉపశిష్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= శిష్యునకు శిష్యుడు, ప్రశిష్యుడు.

ఉపశునము
సం., అవ్య., తత్స., = శునకము, శునకము దగ్గర.

ఉపశోభ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ప్రకాశము, శోభ, అలంకరణము.

ఉపశోభితము
సం., విణ., (అ.ఆ.అ)., తత్స., = ప్రకాశించినది, ప్రకాశింపజేయబడినది.

ఉపశోషణము
సం., నా. వా., అ., న., తత్స., = ఎండునది, ఎండించునది, ఎండుట, ఎండించుట.

ఉపశ్రుతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= సమ్మతింపఁబడినది, ఒడఁబడినది, వినబడినది, అంగీకరింపబడినది.

ఉపశ్రుతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = తమ భాషణ మప్పుడు డబ్బాటునగలిగెడి శుభాశుభ సూచకమగు అన్యసంభాషణ శ్రవణము.
నానార్థాలు :
ఒడబాటు, వినికి, వినుట, ఒకదేవతను శుభాశుభములు గూర్చి ప్రశ్నవేయగా ఆదేవత ఆవేశముగల చాలాదులద్వారమున చెప్పబడు ఉత్తరవాక్యము, అంగీకారము, సమీపశ్రవణము, ప్రసంగసమయమున దైవికముగా వినబడు శుభాశుభసూచకమగు వాక్యము.


ఉపశ్రుత్
సం., నా. వా., త్., పుం., తత్స., = యజ్ఞము.

ఉపశ్లేషము
సం., నా. వా., అ., పుం., తత్స., = కౌగిలి, ఆధారాధేయుములకుగల ఏకదేశ సంబంధము.

ఉపసం(సఙ్క)క్రమణము
సం., నా. వా., అ., న., తత్స., = ఉన్న ఆధారమును విడచి సమీపమున ఉండు మరియొక ఆధారము చేరుట.

ఉపసం(సఙ్గ్ర)గ్రహణము
సం., నా. వా., అ., న., తత్స., = నమస్కారము,
నానార్థాలు :
సాధనము, ఉపాకరణము, పాదగ్రహణము, చరణస్పర్శ, సంతోషపెట్టుట, స్వీకారము, లెస్సగా సంగ్రహించుట, చక్కగా కూర్చుట, ఉపసంగ్రహము, పరికరము.


ఉపసం(సఙ్గ్ర)గ్రహము
సం., నా. వా., అ., పుం., తత్స.,= నమస్కారము,
నానార్థాలు :
సాధనము, ఉపకరణము, పాదగ్రహణము, చరణస్పర్శ, సంతోషపెట్టుట, స్వీకారము, లెస్సగా సంగ్రహించుట, చక్కగా కూర్చుట, పరికరము.


ఉపసం(సఙ్గ్రా)గ్రాహ్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = నమస్కారమునకై పాదములను పట్టుకొనదగినవాడు, ఉపసంగ్రహణీయము, అభివాద్యము.

ఉపసంఖ్యానము
సం., నా. వా., అ., న., తత్స.,= సూత్రార్థమును చెప్పబడినది, వార్తిక వాక్య భేదము.

ఉపసంఘము
వి.,= పెద్ద సంఘములోని కొద్ది మందితో వేసిన చిన్న సంఘము.

ఉపసంపన్నము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = యజ్ఞార్ధము చంపపడినది (పశ్వాది).
నానార్థాలు :
నీళ్ళుపోసి వండినది, పర్యాప్తము, మృతము, యజ్ఞము కొరకు చంపబడిన పశువు, ప్రమీతము, ప్రోక్షితము, సంస్కృతము, ప్రణీతము, సహితము, సమీపమున ఉన్నది, సమృద్ధము, చాలినది, వస్త్రభూషితుడు, చివర, పొందబడినది, నిష్పన్నము, హింసింపబడినది, రసాదులచేత నతిశయమును బొందింపఁబడినది, రసాదులచేత సమగ్రమైనది, పాకముచేతను రసముచేతను సమగ్రమైనశాకాదులపేర్లు, సిద్ధమైనది, పాకము చేత సంస్కరింపబడినది.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసంపద్యతే హరణార్థం ఉపసంపన్నః. హింసార్థమై పొందఁపడునది, రసాదిభిరుపసంపద్యతే ఇతి ఉపసంపన్నం. రసాదులచేత సమగ్రమైనది.


ఉపసంభాష
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = సంభాషణము, మాటాడుట.

ఉపసంయమనము
సం., నా. వా., అ., న., తత్స.,= చక్కగానియమించుట, ఉపసంహారము, చందనము.

ఉపసంయమము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఉపసంహారము, మంచి నియమము, బంధనము.

ఉపసంయోగము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సమీపసంబంధము.

ఉపసంరోహము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సమీపప్రరోహము.

ఉపసంవాదము
సం., నా. వా., అ., పుం., తత్స., = అంగీకారపూర్వకకతనే ఒడంబడిక.

ఉపసంవ్యానము
సం., వి., అ., న., తత్స., = పరిధానవస్త్రము, ధోవతి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపసంవీయతే అనేనేత్యుపసంవ్యానం. దీనిచేత కప్పఁబడును.
ఉత్తరీయ వస్త్రము, ధరించెడివస్త్రము.

ఉపసంహరించు
సం., స., క్రి., =మరలించు, సంహరించు.

ఉపసంహారము
సం., వి., అ., పుం., తత్స.,= మరలించుట.
నానార్థాలు :
సంహారము, తర్కఖండనము, నాశనము, సమాప్తి, సంక్షేపము, సంగ్రహము, సంకుచితము చేయుట, కూర్చుట, సమూహము.


ఉపసంహారి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ఉపసంహారము చేయువాడు.

ఉపసత్త
సం., నా. వా., (ఋ.ఈ.ఋ.), తత్స., = ఆసన్నుడు, దగ్గర ఉండువాడు, అనుసరించువాడు, సేవకుడు.

ఉపసత్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = సంబంధము, సమీపసంబంధము, అనుసరించుట, సేవ.

ఉపసదనము
సం., నా. వా., అ., న., తత్స., = సమీపించుట.
నానార్థాలు :
గురుపాదములదగ్గర కూర్చుండుట, శిష్యుడు అగుట, సేవ, కొలువు, పొందుట.


ఉపసదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= దగ్గరనుండునది, కొలుచునది, సేవించునది, సేవించుట, సమీపించుట, యాగము దగ్గర.

ఉపసద్
సం., నా. వా., (ద్.ఈ.ద్.)., తత్స., = సమీపించుట, జ్యోతిష్టోమము, ఇష్టి భేదము, గార్హపత్యము.

ఉపసద్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= సేవించుట, దగ్గర ఉండి సేవించుట.

ఉపసన్నము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= దగ్గర ఉన్నది, సేవకై సన్నిధి ఉన్నది, సేవింపబడినది, పొందబడినది, సమీపించినవాడు, ఉపనతుడు, ఉపస్థితుడు,

ఉపసమాధానము
సం., నా. వా., అ., న., తత్స., = ప్రోగుచేయుట, రాశీకరణము, సమిధలను వెలిగించుట.

ఉపసమిధ(ధ్)
సం., అవ్య., తత్స., = సమిధ సమీపము.

ఉపసరణము
సం., నా. వా., అ., న., తత్స.,= సమీపించుట, సమీపగమనము, దగ్గరుండుట.

ఉపసరము
సం., వి., అ., పుం., తత్స., = గోమహిష్యాదిగర్భ గ్రహణము.
నానార్థాలు :
వెద, గోమహిష్యాది ప్రథమగర్భము.(అని కొందరు) కూడుట, ఉపసరము, ఉపచరము, సమీపించునది, పశువుల ప్రథమగర్భ గ్రహణము, నిరంతరగమనము.


ఉపసర్గము
సం., వి., అ., పుం., తత్స., = (క్రియాయోగమున) ప్రాది.
నానార్థాలు :
ఉత్పాతము, ఒకానొక రోగం, ప్రాణి, ఉపప్లవము, ఉపద్రవము, ఆపద, శుభాశుభసూచకము, అపశకునము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసృజ్యతేదైవేనేత్యుపసర్గః. దైవము చేత సృజింపఁబడునది.


ఉపసర్జనం
వి., = ప్రమాదము, త్యాగము.; విణ. అప్రధానమైన.

ఉపసర్జనము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = అప్రధానము, ప్రధానభిన్నము, త్యాగము, ఉపద్రవము, అప్రాగ్ర్యము, విశేషణము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపసృజ్యతే నియుజ్యతే ప్రధానభూతేనేత్యుషసర్జనం. ప్రధానమైన వాని చేత నియోగింపఁపడునది.


ఉపసర్పణము
సం., వి., అ., న., తత్స., = ఆశ్రయము, ప్రాపు, సమీపించుట.

ఉపసర్పి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = సమీపింపజేయువాడు.

ఉపసర్పించు
సం., స., క్రి., = ఆశ్రయించు, ప్రాపుగొను.

ఉపసి
సం., అవ్య., తత్స., = సమీపస్థానము.

ఉపసీర
సం., అవ్య., తత్స.,= నాగలి, నాగలి సమీపము.

ఉపసుందుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= సుందుని తమ్ముడును నికుంభుని కొడుకును అగు ఒక రాక్షసుడు.

ఉపసృష్టము
సం., నా. వా., అ., న., తత్స., = పాద్యుపసర్గ యుక్తము,
నానార్థాలు :
ధాతువు, కూడినది, విడువబడినది, గ్రస్తము, ఉపరాగయుక్తము, కాముకము, మైథునము, ఉపదృతము, విసృష్టము.


ఉపసేకము
సం., నా. వా., అ., పుం., తత్స., = తడుపుట, జలాదులచే తడుపువాడు.

ఉపసేచనము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = తడుపునది, తడుపుటకు సాధనమైనది.

ఉపసేవకుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సేవించువాడు, అనుభవించువాడు.

ఉపసేవనము
సం., నా. వా., అ., న., తత్స., = సేవించుట, అనుభవించుట.

ఉపసేవి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స.,= ఉపసేవకుడు.

ఉపసోమము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సోమయాజి, సోమయాజి సమీపము.

ఉపస్కరణము
సం., నా. వా., అ., న., తత్స., = మరొకదానికి గుణము కలిగించుట.
నానార్థాలు :
అలంకరించుట, రుచి కలిగించుట, గుణాధాయక ద్రవ్యము, గృహోపకరణము, వికారము, వికృతి, సముదాయము, హింస.


ఉపస్కారము
సం., నా. వా., అ., పుం., తత్స., = మరొకదానికి గుణము కలిగించుట.
నానార్థాలు :
వికారము, సంఘాతము, భూషణము, ఉపస్కరణము, అధ్యాహారమునందలి వాక్యము.


ఉపస్కీర్ణము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = హింసింపబడినది.

ఉపస్కృతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = కొత్తగుణము కలుగునట్లు చేయునది.
నానార్థాలు :
అలంకరింపబడినది, వికారముకలదిగా చేయబడినది, కూర్చబడినది, అధ్యాహృతము, తెచ్చిపెట్టుకొన్నది, భూషితము, రుచికలుగునట్లుచేయబడినది.


ఉపస్తం(ష్టం)భము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆధారముగా ఉండునది.

ఉపస్తరణము
సం., నా. వా., అ., న., తత్స., = ఆస్తరణము, పఱచుట, అన్నాదులు పెట్టుటకు అడుగున ఆధారముగా వేసిన ఆకుపాత్ర మొదలుగునవి.

ఉపస్తుతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సమీపస్తుతము, శ్రవణయోగ్యస్తవేన స్తుతి.

ఉపస్తుతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = స్తుతి.

ఉపస్తుత్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = దగ్గరగా స్తుతింపబడు స్తోత్రము.

ఉపస్థపత్త్రము
సం., నా. వా., అ., పుం., తత్స., = రావిచెట్టు.

ఉపస్థము
సం., నా. వా., అ., పుం., న., తత్స., = యోని.
నానార్థాలు :
లింగము, క్రోఢము, భగము, గుహ్యద్వారము, రెండుయూపములు, ఒడి, శిశ్నములు, దగ్గర ఉన్నది, మద్యచేటు, గుదము (స్త్రీపురుషుల రహస్యావయవము) స్థితి, సమీపము, అంతరాలము, వేశ్య.


ఉపస్థాత
సం., నా. వా., (ఋ,ఈ,ఋ.)., తత్స., = సేవించువాడు, పరిచారకుడు, నమ్రుడు, చెప్పినకాలమునకు సరిగా వచ్చువాడు, ఉపాసకుడు, ఋత్విక్ భేదము.

ఉపస్థానము
సం., వి., అ., న., తత్స., = చేరిక.
నానార్థాలు :
సేవ, కలియుట, దగ్గర చేరుట (దేవతాదులను ఉపాసించుట) వాసస్థానము, ఉపాసగృహము, దేవపూజ గృహము, పొందుట, స్మరణము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే తిష్ఠతీత్యుపస్థః. పరస్పరము సమీపమందుండునవి.


ఉపస్థానీయుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపాసకుడు, సేవించువాడు, ఉపాసింపతగినవాడు (దేవతా).

ఉపస్థాపకుడు
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = దగ్గరకు తెచ్చువాడు, తలపించువాడు, దగ్గరనుంచువాడు, స్మరింపచేయువాడు.

ఉపస్థావర
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= పురుషమేధయజ్ఞమందు, దేవతాభేదము.

ఉపస్థితం
వి., = స్మరణ, దగ్గరకి రావడము.; విణ. సమీపించిన, సేవించిన, పొందిన, ఉపాసించిన, గుర్తుకు వచ్చిన.

ఉపస్థితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = చేరినది.
నానార్థాలు :
దగ్గరనిలుచువాడు, సేవించువాడు, జ్ఞప్తికి వచ్చినది, దగ్గరకు వచ్చినది, సేవింపబడినది, పొందబడినది, సమీపస్థితము, ఉపనతము, ఉపసన్నము, మృష్టము, శోధితము.


ఉపస్థితి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = చేరిక, తోఁచుట.వి., = దగ్గర ఉండటము, సమీపించడము, హాజరుకావడము, పొందడము, స్మృతి, సేవ, దేవపూజ.

ఉపస్థేయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సమీపించుట.

ఉపస్పర్శము
సం., వి., అ., పుం., తత్స., = ఆచమనము, స్పర్శము, స్నానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపస్పృశ్యంతే అఙ్గౌన్యత్రేతి ఉపస్పర్శః. దీనియందుఅంగములు స్పృశింపఁబడును


ఉపస్రవణము
సం., నా. వా., అ., న., తత్స.,= క్షురణము, కారుట, రక్తాది స్రావము అగుట.

ఉపస్వేదము
సం., నా. వా., అ., పుం., తత్స.,= అగ్ని మొదలగువాని దాపున ఉండుటవలన కలిగిన వేడి, ఉక్క, చెమట.

ఉపహంత
సం., నా. వా., (ఋ.ఈ.ఋ.)., తత్స.,= ఉపఘాతకే (కటుకః), అడ్డు పెట్టువాడు, చంపువాడు.

ఉపహతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉపద్రవమునొందినది.
నానార్థాలు :
నాశము నొందినది, కొట్టబడినది, నాశనము చేయబడినది, దూషితమైనది, చెడినది, నిందింపబడినది, పిడుగు మొదలగునుత్పాతములచే ఉపద్రవము నొందినది.


ఉపహతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= ఉపద్రవము, నాశము, దెబ్బ, అడ్డగింత.

ఉపహత్ను
సం., నా. వా., (ఉ.ఊ.ఉ.)., తత్స., = ఉపహంతరి.

ఉపహరణము
సం., నా. వా., అ., న., తత్స., = పట్టుకొనుట, కానుకలు ఇచ్చుట, బలియిచ్చుట, వడ్డించుట, దగ్గరకు తెచ్చుట.

ఉపహవము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆహ్వానము.

ఉపహవ్యము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పదిహేడు సోమకములయందు ఐదు క్రుతువులు.

ఉపహసించు
క్రి.,= పరిహసించు, నవ్వు, ఎగతాళిచేయు.

ఉపహసితము
సం., నా. వా., అ., న., తత్స.,= పరిహసింపబడినది, నవ్వు, ఎగతాలి చేయునది, హాస్యభేదము, ఎగతాళితో గూడిన నవ్వు.

ఉపహస్తము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఔపహస్తిక తదుపజీవిని.

ఉపహస్తిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= అడపము, తాంబూల ద్రవ్యములుంచెడుసంచి.

ఉపహారము
సం., వి., అ., పుం., తత్స., = ఉపాయనము
నానార్థాలు :
కానుక, ప్రాభృతము, ఉపగ్రాహ్యము, ఉపద, రాజు, దేవతలకు ఇచ్చుబలి, సత్కారము, పూజ, కానుకగానిచ్చు ద్రవ్యము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపహ్రియతే రాజ్ఞా ఉపహారః. రాజుచేత హరింపఁబడునది.


ఉపహాల(ళ)కము
సం., నా. వా., అ., పుం., తత్స., = కుంతలదేశము, పిలుచుట.

ఉపహాసము
సం., నా. వా., అ., పుం., తత్స., = నిందాసూచకమగు హాస్యము, పరియాచకము.

ఉపహాస్యము
సం., నా. వా., (అ.ఆ.అ)., తత్స.,= నవ్వతగినది, పరిహసించతగినది.

ఉపహితము
సం., విణ., (అ.ఆ.అ)., తత్స.,= ఉంచబడినది.
నానార్థాలు :
కూడుకొన్నది, నిహితము, అర్పితము, సమీపస్థాపితము, దగ్గరగా ఉంచబడినది.


ఉపహూతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = పిలువబడినది.

ఉపహూతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= ఆహ్వానము, పిలుపు.

ఉపహృతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= ఇవ్వబడినది, కానుక, వడ్డింపబడినది, యజ్ఞపశువుగానీయబడినది.

ఉపహ్వానము
సం., నా. వా., అ., న., తత్స= పిలుపు, ఆహ్వానము, మంత్రమునుచ్చరించి పిలుచుట.(దేవతాదులను)

ఉపాంగము
సం., వి., అ., పుం., న., తత్స.,= సుతి పోసెడితిత్తి, మీమాంసాది. (అవి నాలుగు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము) అంగమునకు అంగముగా ఉపయోగించు అంతరభాగము, వేదాంగసదృశ శాస్త్రభేదము, తిలకము, అంగశబ్దము, ప్రధానాంగోపయోగి.

ఉపాంజనము
సం., నా. వా., అ., న., తత్స.,= లేపనము, ఆవుపేడమొదలగునవి, అలుకుట, సున్నము మొదలుగునవి పూయుట.

ఉపాంతము
సం., వి., అ., పుం., తత్స.,= సమీపము, మూల.; విణ. సమీపించినది, నికటము, ప్రాంతము.

ఉపాంతికము
సం., నా. వా., అ., న., తత్స.,= అత్యంతసమీపము, అతిసమీపము.

ఉపాంతిమము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= అతి సమీపము, చివరి దానికి ముందరది.

ఉపాంత్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స.,= చివరిదానికి ప్రాంతమందున్నది, చివరిదానికి దగ్గరగా ఉన్నది.

ఉపాంశు
సం., అవ్య., = ఏకాంతము.
నానార్థాలు :
జపభేదము, రహస్యభాషణము, రహస్యము, విజనము, నిర్జనప్రదేశము, అప్రకాశము, మౌనము, నిగూఢము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపగతాః అంశవః యత్రేతి ఉపాంశుః.

ప్రయోగము :
గంజాహాల లుపాంశున భుజించునధముల. ఆము.4, ఆ.
వి.ఉ.పుం. వు. జపభేదము.

ఉపాంశుయాజము
సం., నా. వా., అ., పుం., తత్స.,= యజ్ఞభేదము.

ఉపాకరణము
సం., వి., అ., న., తత్స., = సంస్కారపూర్వకముగా వేదమును గ్రహించుట, యజ్ఞపశువును విద్యుక్తముగా చంపుట.
వ్యుత్పత్త్యర్థము :
ఉపాక్రియతే స్వీక్రియతే శ్రుతిరనేనేత్యుపాకరణం. వేదము దీనిచేత స్వీకరింపఁబడును.


ఉపాకర్మము
సం., వి., న్., న., తత్స., = సంస్కార పూర్వకముగా వేదమును గ్రహించుట.

ఉపాకృతము
సం., వి., (అ.అ.ఆ.)., తత్స.,= యజ్ఞమునందు అభిమంత్రించి చంపబడిన పశువు. విణ. కుదియింపబడినది, ఉపద్రుతము, ఉపద్రవము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపామంత్ర్యక్రియత ఇతి ఉపాకృతః. అభిమంత్రించి హింసింపఁబడునది,


ఉపాక్ష
సం., అవ్య., తత్స., = నేత్రసమీపమందు.

ఉపాఖ్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= నిర్వచించుట, వర్ణించుట, ఉపనామము, ప్రత్యక్షమగునది.

ఉపాఖ్యానము
సం., వి., అ., న., తత్స., = ఇతిహాసము, ప్రధాన కథలో వచ్చెడి చిన్నకథ, వృత్తాంతము చెప్పుట.

ఉపాగతము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సమీపించినది, జరిగినది, సంభవించినది, వచ్చినది, పొందపడినది, ఒప్పుకొనబడినది.

ఉపాగమము
సం., నా. వా., అ., పుం., తత్స., = జరుగుట, అంగీకారము, దగ్గరకు వచ్చుట, సంభవించుట.

ఉపాగృతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = పొందబడినది, వచ్చినది.

ఉపాగ్రహణము
సం., నా. వా., అ., న., తత్స.,= సంస్కార పూర్వకముగా వేదమును గ్రహించుట.

ఉపాత్తము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స.,= పొందబడినది.
నానార్థాలు :
అపహరింపబడినది, మదించిన ఏనుగు, ఆరంభించబడినది, సంపాదితము, గ్రహింపబడినది, నిర్మదహస్తి, ప్రాప్తము.


ఉపాత్యయము
సం., వి., అ., పుం., తత్స., = అతిక్రమణము.
నానార్థాలు :
తుటారము, యజ్ఞము నందు అభిమంత్రించి చంపఁబడిన పశువు, కుదియింపఁబడినది, ఆలస్యము, శాస్త్రలోకాచారములను అతిక్రమించుట, నాశము.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపస్థమతిక్రమ్య అయనం ఉపాత్యయః. సమీపమందుండుదానినతిక్రమించి పోవుట.


ఉపాదానమెత్తు
అ., క్రి.,= బిచ్చమెత్తు.

ఉపాదానలక్షణ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= అజహత్స్వార్థలక్షణ.

ఉపాదేయము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= గ్రహింపతగినది, పొందతగినది, ఉత్తమము, (మట్టి ఉపాధానము, కుండ ఉపాధేయము.) ఉపాధానకారణజన్యమగు కార్యము ఉత్తమము.

ఉపాధానము
సం., వి., అ., న., తత్స.,= ఉంచుట, ధరించుట, కప్పుట.

ఉపాధి
సం. వి. ఇ. పుం. తత్స. = ధర్మచింత.
నానార్థాలు :
కపటము, కుటుంబమునందు మిక్కిలి యాసకలవాడు, విశేషణము, ఛలము, నామచిహ్నము, మోసము, ధర్మవిషయమైన ఆలోచన, ఉపనామము, స్ఫటికము నెర్రగాజేయు, జపాకుసుమము వలన తన సామీప్యాదుల వలన మరియొక దానియందు తన ధర్మమును ఆరోపించుట.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే ఆధీయతే ధర్మోస్య ఉపాధిః. దీనిచేత దైన్యము సంపాదింపఁబడును.


ఉపాధ్యక్షుడు
వి., = అధ్యక్షుడి హోదా కంటె కింది హోదాలో ఉన్న వ్యక్తి, విశ్వవిద్యాలయపు ఉపకులపతి.

ఉపాధ్యాయ
సం., వి., ఆ., స్త్రీ., = ఉపాధ్యాయత్వము చేసెడు ఆడుది, విద్యగరపువనిత, ఉపాధ్యాయత్వము చేసెడు ఆఁడుది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపేత్య అధీయతే అస్యాస్సకాశాదిత్యుపాధ్యాయాః. ఈమె సమీపమునకు వచ్చి చదువుదురు.


ఉపాధ్యాయాని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = గురుభార్య, ఉపాధ్యాయత్వము చేసెడు ఆడుది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపాధ్యాయస్య పత్నీ ఉపాధ్యాయాని. ఉపాధ్యాయుని పెండ్లాము.


ఉపాధ్యాయి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఉపాధ్యాయత్వము చేసెడి ఆఁడుది, ఉపాధ్యాయుని భార్య, గురుభార్య, ఉపాధ్యాయస్య పత్నీ ఉపాధ్యాయి.

ఉపాధ్యాయుడు
సం., వి., అ., పుం., తత్స., = వేదమును చదివించువాఁడు, చదువు చెప్పువాఁడు, అధ్యాపకుడు, గురువు, ఉపాధ్యాయుడు, వేదమందు ఒక భాగమునో వేదాంగమునో వేతనము పుచ్చుకొని చదువు చెప్పిడివాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపేత్యాధీయతే అస్మాదితి ఉపాద్యాయః. అతని వలన అధ్యాయము చేయుదురు.


ఉపానసము
సం., నా. వా., (స్.ఈ.స్.)., తత్స.,= మన్ను మొదలుగువానితో చేసిన బండి, పినతండ్రి.

ఉపానహము
సం., వి., హ్., స్త్రీ., తత్స., = చర్మముతో చేయబడిన చెప్పులు.
నానార్థాలు :
పాదుక, తంతి చుట్టెడు బిరడా, పుండు మీద పూసెడు మందు, శత్రుత్వము, వీణ క్రింది భాగము, వీణకి తీగలు కట్టెడు చోటు.

వ్యుత్పత్త్యర్థము :
ఉపానహ్యతే పాదయోరితి ఉపానత్. పాదములందు కట్టబడునది.


ఉపాప్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = ప్రాప్తి.

ఉపాయనము
సం., వి., అ., న., తత్స., = ఉపహారము.
నానార్థాలు :
కానుక, ప్రాప్తి, పొందుట, ఉపఢౌకనము, వ్రతాదిప్రతిష్ఠ, సమీపగమనము, గురువుల సమీపమునకు పోవుట.

వ్యుత్పత్త్యర్థము :
1.రాజ్ఞస్సమీపమయతేనేనేత్యుపాయనం. దీనిచేత రాజమీపమునుపొందుదురు.


ఉపాయము
సం., వి., అ., పుం., తత్స., = వెరవు, పొందు, (చతురుపాయములు - సామము, దానము, భేదము, దండము, మాయ, ఉపేక్ష, ఇంద్రజాలము ఈ మూటిని గూడఁజేర్చి సప్తోపాయములని కొందఱు నీతికోవిదులు చెప్పుదురు. మఱియు నాయకుఁడు నాయిక యొక్క కోపమును పోఁగొట్టునపుడు ఉపయోగించెడు ఉపాయములు ఆఱు – సామము, భేదము, దానము, నతి, ఉపేక్ష, రసాంతరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపైతివాంఛిత మనేనేత్యుపాయః. దీనిచేత కోరికను పొందుదురు.


ఉపాయి
సం., నా. వా., (న్.ఈ.న్)., తత్స., = సమీపివాడు, ఉపాయము కలవాడు.

ఉపారంభము
వి., = మొదలుపెట్టడము, ప్రారంభము.

ఉపారతము
సం., నా. వా., (అ.ఆ.అ)., తత్స., = విరమించునది, మరలినది.

ఉపారము
సం., నా. వా., అ., పుం., తత్స.,= సమీపము.

ఉపార్జనము
సం., వి., అ., న., తత్స., = సంపాదనము, గడన.

ఉపార్జించు
సం., స., క్రి., = సంపాదించు, గడించు.

ఉపార్జితము
సం., విణ., (అ.ఆ.అ.) = గడింపబడినది.

ఉపాలంభము
సం., వి., అ., పుం., తత్స., = మర్మముదూఱి పాఱనాడుట, నింద, చెడువాక్యము, దెప్పుట, నిందించుట, చెప్పుట,
వ్యుత్పత్త్యర్థము :
ఉపాలభ్యత ఇత్యుపాలంభః. దుర్వాక్యమును పలుకుట.


ఉపాలంభించు
సం., స., క్రి., = మర్మముదూఱి పాఱనాడు.

ఉపాలబ్ధము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = మర్మముదూఱ పాఱనాడఁబడినది, నిందించబడినది, దెప్పబడినది.

ఉపావర్తనం
వి., = తిరిగిరావడము, పొర్లాడటము, సమీపించడము.

ఉపావర్తనము
సం., నా. వా., అ., న., తత్స., = నేలపై పొర్లుట, సమీపించుంట.

ఉపావృత్తము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పలుమాఱు నేలఁపొర్లాడినది (గుఱ్ఱము), గుర్రము దొర్లుట, మరలి వచ్చినది, ఉడిగినది.
వ్యుత్పత్త్యర్థము :
ఉపావర్తతే స్మ ఉపావృత్తః. పొర్లాడినది.


ఉపాశ్రమము
సం., నా. వా., అ., పుం., తత్స.,= ఆశ్రమములో వలె పాశుపతాది, ఆశ్రమసమీపమందు దీక్ష.

ఉపాశ్రయము
సం., వి., అ., పుం., తత్స., = ప్రాపు, ఆనిక, ఆస్పదము, ఆశ్రయము, ఊత.

ఉపాశ్రయించు
క్రి., = కొలుచు, పాదారుణం చేయు, ఆశ్రయించు, సేవించు.

ఉపాశ్రితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఆశ్రయింపబడినది, ఆశ్రయించినది, సేవించబడినది, ఆశ్రయింపబడినది, దేవతోపాసనచేయువాడు.

ఉపాసంగము
సం., వి., అ., పుం., తత్స., = అమ్ములపొది, తూణీరము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపాసజ్యంతే శరా అత్ర ఉపాసంగః. బాణములు దీనియందు కూర్పఁబడును.


ఉపాసకుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = సేవకుడు, సేవించువాడు, దేవతోపాసన చేయువాడు.

ఉపాసా
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఉపాసనము.

ఉపాసాదితము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = పొందబడినది, పొందుట.

ఉపాసించు
సం., స., క్రి., = సేవించు, కొలుచు.

ఉపాసిత
సం., విణ., (ఋ,ఈ.ఋ.) = ఉపాసించువాడు.

ఉపాసితుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉపాసింపబడినవాఁడు, సేవితుడు, పూజింపబడినది, మననము చేయబడినది, సేవింపబడినది.

ఉపాసీనుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = సమీపమందు కూర్చున్నవాడు.

ఉపాస్తి
సం., వి., ఇ., స్త్రీ., = ఉపాసనము, సేవ.

ఉపాస్త్రము
సం., నా. వా., అ., న., తత్స., = అప్రధానాస్త్రము, చిన్నఅస్త్రము.

ఉపాస్యుడు
సం., విణ., (అ.ఆ.అ.) = ఉపాసింపతగినవాడు.
పర్యాయపదాలు :
సేవ్యుడు. ఉపాసింపదగినది, సేవింపదగినది, చింతింపదగినది, మననము చేయదగినది.


ఉపాహితము
సం., వి., అ., పుం., తత్స.,= తోకచిచ్చు.; విణ. ఆరోపితము.
నానార్థాలు :
తోకచుక్క, తెగిన చుక్క, ఉంచబడనది, జరితము, స్వభావమును విడిచి వికారమును పొందుట ఉత్పాతము, అగ్ని యొక్క ఉత్పాతము అగ్న్యుత్పాతము, ఉపాప్లాతము మొదలుగాగల అగ్న్యుత్పాతము, ఆరోపించబడినది.

వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే, ఆధీయతే స్థాప్యతే స్మ ఉపాహితః. సమీపమందుఁపెట్టబడినది, ఉపమాసన్నమహితమస్య ఉపాహితః. అనిష్టము దీనికాసన్నమైయుండును.


ఉపాహృతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= గ్రహింపబడినది, పట్టుపడినది, తేబడినది.

ఉపేంద్రవజ్ర
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = ఛందోభేదము, ప్రతీపాదమునకు, అక్షరములుగల వృత్తిభేదము.

ఉపేక్ష
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అశ్రద్ధ.
నానార్థాలు :
ఒప్పరికము, ఉదాసీనత్వము, తిరస్కారము, త్యాగము, ఉదాసీనత, అనపేక్షణము.
పుం., గాందినీసుతుడు, అక్రూరసోదరుడు.

ఉపేక్షకుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ఉపేక్షుంచువాడు, ఒప్పరికించువాడు, అశ్రద్ధచేయువాడు, ఉదాసీనుడు.

ఉపేక్షణము
సం., నా. వా., అ., న., తత్స., = త్యాగము, ఉదాసీనము, రాజులసప్తవిధోపాయములలో నొకటి, అశ్రద్ధ, ఉదాసీనత.

ఉపేక్షణీయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = త్యాజ్యము, చేయదగినది, అశ్రద్ధ.

ఉపేక్షించు
సం., స., క్రి.,= అశ్రద్ధచేయు, ఒప్పరికించు.

ఉపేక్షితుడు
సం., విణ., (అ.ఆ.అ.).,= ఉపేక్షింపబడినవాడు, ఒప్పరికింపబడినవాడు.

ఉపేత
సం., విణ., (ఋ.ఈ.ఋ.)., తత్స.,= ఉపాయములు పన్నువాడు, సమీపించువాడు, పొందబడినది, పొందినది, సమీపగతము, కూడుకొన్నది.

ఉపేతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= కూడుకొన్నది.

ఉపేయము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = ఉపాయముచే సాధ్యమైనది, పొందదగినది, సమీపింపదగినది.

ఉపోఢము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సన్నివేశవిశేషయుక్తము, సైన్యము, సమీపము, వివాహితము, వహింపబడినది.

ఉపోత్తమము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., =
వ్యుత్పత్త్యర్థము :
ఉపాన్తిమే అన్త్యాత్ పూర్వతనే. రెండుకంటే ఎక్కువైన దానిలో చివరిది.
(అక్షరము మొదలుగునవి)ఉదా - కలికి, ఇందు లి ఉపోత్తమము.

ఉపోదక
సం., వి., ఆ., స్త్రీ., పుం., తత్స.,= దుంపబచ్చలి, (రూ. ఉపోదకి.ఈ.స్త్రీ.) ఒక ఆకుకూర, మట్టుబచ్చలి (వృ.వి).
వ్యుత్పత్త్యర్థము :
ఉపశబ్ద అధికార్థః అధికముదకమస్యా ఇత్యుపోదకా. అధికమైన ఉదకము ఉపోదకము. ఉపగతముదకమ్ అత్యా స. ఉదకసమీపమందు. ఉదకసమీపము.


ఉపోదకి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = దుంపబచ్చలి, మట్టుబచ్చలి, ఉదకసమీపము.

ఉపోదిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = దుంపబచ్చలి, ఒక ఆకుకూర, మట్టుబచ్చలి.

ఉపోద్గ్రహ
సం., నా. వా., అ., పుం., తత్స., = జ్ఞానము.

ఉపోద్ఘాతము
సం., వి., అ., పుం., తత్స., = చెప్పబోవు విషయమును ఎరుగచేయబడినది, పీఠిక, ఒకానొక సంగతి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపసమీపే ఉద్ధన్యత ఇత్యుపోద్ఘాతః. మిక్కిలి సమీపమునందుఎఱుఁగఁచేయఁబడునది.


ఉపోద్బలము
వి., = ప్రోత్సాహము, ధైర్యం చెప్పడము.

ఉపోద్వలనము
సం., నా. వా., అ., న., తత్స., = ఉద్దీపనము, ఉత్తేజము.

ఉపోషణము
సం., వి., అ., న., తత్స., = ఉపవాసము, పస్తు.

ఉపోషితుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉపవశించినవాడు, పస్తున్నవాడు, ఉపవాసము, పస్తు.

ఉప్తకృష్ట
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = విత్తినపిదపదున్నబడినది. విత్తిన పిదప దున్నినభూమి.

ఉప్తము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= ధాన్యములు విత్తబడినది (నేల) గొఱిగింపబడినది.

ఉప్తి
సం., వి., ఇ., స్త్రీ., = విత్తుట, వెద.

ఉప్త్రిమము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = విత్తుటవలన బుట్టినది, చల్లుటవలన బయలు దేరినది.

ఉప్పగించు
స., క్రి., = అంగీకరించు.

ఉప్పరియు
క్రి., = ఉరిసిపోవు, పొడిపొడిగా రాలిపడు, చితికిపోవు, వృథా అయిపోవు.

ఉప్పుకయ్య
వి., = ఉప్పు నిలవచేసే గోదాము.

ఉప్పుకాగితము
వి., = ఇసుక కాగితము; వడ్రంగి చెక్కను నునుపు చేయడం కోసం రుద్దడానికివాడే ఒకరకం కాగితము.

ఉప్పుటేరు
వి., = ఉప్పునీటి కాలువ.

ఉప్పుడు
విణ., = ఉడికిన, ఉడకబెట్టిన.

ఉప్పుడుబియ్యము
వి., = వడ్లు ఉడకబెట్టి చేసిన బియ్యము.

ఉప్పుతిను
అ., క్రి., = సొమ్ముతిను, సొత్తు తిను.

ఉప్పుపాతరవేయు
వి., = ఉప్పువేసిన గోతిలో పూడ్చిపెట్టు, ఒకరకం శిక్ష, ఒక తిట్టు మాట.

ఉప్పుమిరపకాయలు
వి., బహు., = మజ్జిగలో ఉప్పువేసి ఎండించిన పచ్చి మిరపకాయలు.

ఉప్పెనబోవు
అ., క్రి., = తనకు కాకుండా పోవు, పాడవు, కొట్టుకొని పోవు.

ఉప్పెల్లు
క్రి., = చవుడుబారు, చవుడుదేరు .

ఉప్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = విత్తదగినది (వడ్లు మొదలుగునవి).

ఉబలాటపడు
అ., క్రి., = మిక్కిలిగా ఉత్కంఠపడు, మిక్కిలిగా కోరు, వేడుకపడు.

ఉబుసుపుచ్చు
అ., క్రి., = కాలం గడుపు, కాలక్షేపం చేయు.

ఉబ్బరించు
అ., క్రి., = ఉక్కపోయు.

ఉబ్బవేయు
స., క్రి., = పొగడు, అ., క్రి., ఉక్కపోయు.

ఉబ్బించు
క్రి., = పొంగించు, పెంచు, వృద్ధిచేయు, పొగడి సంతోషపెట్టు.

ఉబ్బితబ్బిబ్బవు
అ., క్రి., = సంతోషపరవశుడవు, మిక్కిలి సంతోషించు, సంతోషం ఎక్కువయిన స్థితిని కనబరచు.

ఉబ్బెత్తు
విణ., = ఉబికిన, ఎత్తుగా ఉన్న. క్రి. ఉబ్బు, పైకిలేచు.

ఉభయ
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = జంట, యగలము, రెండవయవములు కలది, అనేకులు కలిసి చేసెడు ధర్మకార్యములలోవంతుల ప్రకారము ఒక్కొక్కరు ఇచ్చెడు ధనము.

ఉభయఖర్చులు
వి., బహు., = పెండ్లిలో ఇరుపక్షాలు వారి ఖర్చులు.

ఉభయతశ్శీర్ష్ణి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఈనునపుడు ఒకప్రక్క దూడముఖమును ఒకప్రక్క తనముఖమును కలది. ఈనుచున్న ఆవు.

ఉభయతోదత్ (న్త)ము
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = రెండవరుసల పండ్లుకలది, పైవరుసను, క్రిందివరుసను, పండ్లుగలది.

ఉభయతోముఖము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = రెండుప్రక్కల ముఖద్వారములు కలది. (ఇల్లు, మొదలుగునవి).

ఉభయత్ర
అవ్య., = రెండు పక్షాలలో, రెండుచోట్ల.

ఉభయభ్రష్టుడు
వి., = రెండుచోట్ల భంగపడినవాడు, రెంటికి చెడ్డరేవడు.

ఉభయవేతనుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = దూత, రెండు పక్షముల నుండియు జీతము పుచ్చుకొనువాడు, పైకి శత్రురాజు కొలువులో ఉన్నట్లు కనిపించువాడు.

ఉమ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పార్వతి, నూనెయగిసె, కాంతి, పసుపు, యశము, దుర్గ, పార్వతి, పసుపు, నల్లయగిసె, (వృ.వి), కీర్తి, కాంతి, శాంతి, అవిసె.
వ్యుత్పత్త్యర్థము :
అవతీత్యుమా. రక్షించునట్టిది, పార్వతి. ఉమతి శుష్కదశాయామిత్యుమా. ఎండినప్పుడు గలగలయని మ్రోగునది.


ఉమాకటము
సం., నా. వా., అ., పుం., తత్స., = నల్లయగిశయొక్కరజము, పసుపుపొడి.

ఉమాచతుర్థీ
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = పార్వతి పుట్టిన చవితి, జ్యైష్ఠశుక్లచతుర్థీ.

ఉమాపతి
సం., వి., ఇ., పుం., తత్స., = శివుడు, ముక్కంటి, త్రినేత్రుడు. మహాదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉమాయాః పతిః ఉమాపతిః. పార్వతీ దేవికి భర్త.


ఉమావనము
సం., నా. వా., అ., న., తత్స., = శోణితపురము, దేవికోట. (ఇది బాణుని పట్టణము)

ఉమాసుతుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = కార్తికేయుడు, కుమారస్వామి, వినాయకుడు.

ఉమ్
సం., అవ్య., తత్స., = రోషము, స్వీకారము, ప్రశ్న.

ఉమ్మగించు
క్రి., = ఉక్కగా ఉండు.

ఉమ్మడిచిహ్నము
వి., = భిన్నరాజకీయపక్షాలు కలిసి పోటీ చేయడానికి ఎంపిక చేసుకొన్న ఒకే ఎన్నికల గుర్తు.

ఉమ్మడిజాబితా
వి., = రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాలు రెండింటి అధీనంలో ఉన్న పరిపాలన వివరణ పట్టిక.

ఉమ్యము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉమలుపండుభూమి. (పొలము) నల్ల అగసిచెట్లు బయలు దేరునది, (పొలము), ఔమీనము, అతసీక్షేత్రము, హరిద్రాక్షేత్రము.

ఉమ్లోచ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = అప్సరభేదేము.

ఉయ్యెలలూగు
అ., క్రి., = సందిగ్ధావస్థలో ఉండు.

ఉరంగమము
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = సర్పము, సీసము, సర్పదేవతాకము, ఆశ్లేషానక్షత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసా గచ్ఛతి. ఱొమ్ముతో బ్రాకునది.


ఉరంగము
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = సర్పము, సీసము, సర్పదేవతాకము, ఆశ్లేషానక్షత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసా గచ్ఛతి. ఱొమ్ముతో బ్రాకునది.


ఉరఃసూత్రిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = రొమ్మున వ్రేలాడు ముత్యాలహారము. ఒకముత్యాలహారము, ముత్యములచే చేయబడిన మౌలిక.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసి సూత్రికా ఉరస్సూత్రికా. ఉరస్సునందలి సూత్రిక.


ఉరకలుపెట్టు
అ., క్రి., = ఉత్సాహం పొందు, పరుగులు పెట్టు.

ఉరగభూషణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = సర్పభూషణుడైన మహాదేవుడు.

ఉరగము
సం., వి., అ., పుం., స్త్రీ., తత్స., = సర్పము, పాము, సీసకము, ఆశ్లేషానక్షత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసాగచ్ఛతీత్యురగః. ఉరస్సు చేతి సంచరించునది.


ఉరగరాజ
సం., నా. వా., అ., పుం., తత్స., = వాసుకి, శేషుడు, మహాసర్పమ.

ఉరగస్థానము
సం., నా. వా., అ., న., తత్స., = పాతాలము.

ఉరగాశనుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = గరుడుడు, నెమలి.

ఉరణము
సం., వి., అ., పుం., స్త్రీ., తత్స.,= మేషము, పొట్టేలు, మేక, దంతెపు చెట్టు, మేఘము.
వ్యుత్పత్త్యర్థము :
ఉచ్ఛైః రణత్యురతః. బిగ్గరగా మొరఁపెట్టునది.


ఉరణాక్షము
సం., నా. వా., అ., పుం., తత్స., = పుష్పం తంటెవు చెట్టు, తగిరిస (వృ.వి).
వ్యుత్పత్త్యర్థము :
ఉరణస్య మేషస్య అక్షీవ అక్షి. మేషము కళ్లువంటి కళ్లు కలిగినది. ఉరణో మేషస్తదక్షి సదృశపుష్పత్వాదురణాక్షః. మేక కండ్ల వంటి పువ్వులు కలది, తగిరిస.


ఉరభ్రము
సం., నా. వా., అ., పుం., స్త్రీ., తత్స., = పొట్టేలు, తగిరిస (వృ.వి). మేషమాంసము, మేషము, ఉరణము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరోభ్రమయతీత్యురభ్రః. ఉరమును త్రిప్పునది.


ఉరభ్రసారిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = సుశ్రుతలో చెప్పదగిన కీటకభేదము.

ఉరము
సం., వి., స్., న., తత్స.,= రొమ్ము; విణ. శ్రేష్ఠము, వక్షస్థలము, వక్షము, వత్సము, క్రోడము, భుజాంతరము, ఉత్తమము.

ఉరరీ
సం., అవ్య., తత్స., = అంగీకారము, విస్తారము, అంగీకారమును తెలుపునది, స్వీకారము, అంగీకృతిని తెల్పునది.

ఉరరీకృతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = అంగీకారము, ఇయ్యకోఁలు, విస్తారము. అంగీకృతిని తెల్పునది.

ఉరశ్ఛదము
సం., వి., అ., పుం., తత్స., = కవచము, బొందలము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరశ్ఛాదయతీత్యురశ్ఛదః. ఉరస్సునుకప్పునది. ఉరో వక్షఃస్థలం ఛాద్యతే అనేనేతి ఉరశ్ఛదః. వక్షస్థలము దీనిచేత కప్పబడును.


ఉరసిజము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉరోజము, ఱొమ్ము, స్త్రీ స్తనము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసి జాయతే ఉరము నుండి పుట్టినది.


ఉరసిలుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = విశాలమైన రొమ్ముకలవాడు, శత్రువులకు రొమ్మిచ్చి తన బలమును రక్షించుకొనువాడు, శౌర్యవంతుడు.
వ్యుత్పత్త్యర్థము :
ప్రశస్తమురోస్యాస్తీతి ఉరస్వాన్ ఉరసిలశ్చ. ప్రశస్తమైన ఱొమ్ముకలవాఁడు.


ఉరసుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = విశాలమైన రొమ్ముకలవాడు, శత్రువులకు రొమ్మిచ్చి తన బలమును రక్షించుకొనువాడు, శౌర్యవంతుడు.

ఉరస్కటము
సం., నా. వా., అ., పుం., తత్స., = బాలకులకు యజ్ఞోపవీతాకారంలో వున్న ఉత్తరీయము.

ఉరస్త్రము
సం., నా. వా., అ., న., తత్స., = ఉరస్సుని రక్షించునది.
వ్యుత్పత్త్యర్థము :
వక్షోరక్షకే కవచే. వక్షమును రక్షించు కవచము.


ఉరస్త్రాణము
సం., వి., అ., న., తత్స., = ఉరశ్ఛదము, బొందలము, కవచము.

ఉరస్యము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఱొమ్మునందుండునది, ఱొమ్మునబుట్టనది.

ఉరస్వంతుఁడు
సం., విణ., (త్.ఈ.త్)., తత్స., = ఉరసిలుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ప్రశస్తమురోస్యాస్తీతి ఉరస్వాన్. విశాలమైనరొమ్ముకలవాడు.


ఉరి
సం., అవ్య., తత్స., = అంగీకారము, స్థిరము.

ఉరికంబం
వి., = ఉరితీసే స్తంభము.

ఉరికించు
క్రి., = పరుగుతీయించు, ఉన్నపళంగా పంపించు.

ఉరితీయు
క్రి., = మెడకు తాడు బిగించి వేలాడ దీసి చంపు.

ఉరీకారము
సం., నా. వా., అ., పుం., తత్స., = స్వీకారము, విస్తారము, అంగీకారము, విస్తృతము చేయుట.

ఉరీకృతము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ఉరరీకృతము, అంగీకృతి, విసృతము.

ఉరు
సం., నా. వా., (ఉ.ఊ.ఉ.)., తత్స., = విశాలము.
పర్యాయపదాలు :
అధికము, విస్తీర్ణము, విశాలమైనది, విపులము, విశంకటము, లావు, పెద్దది, గొప్పది, వికటము, బహులము. వెడల్పు కలది, మిక్కిలి అయినది, శ్రేష్ఠము, ఎక్కువ కలది.


ఉరుండము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉపద్రావకము, అసురభేదము.

ఉరుకాలము
సం., నా. వా., అ., పుం., తత్స., = (రాఖాలశఖా) మహాకాల లత, దీర్ఘకాలము.

ఉరుకు
వి., = పరుగు.

ఉరుక్రముడు
సం., నా. వా., అ., పుం., తత్స., = పెద్దయడుగులిడువాడు, విష్ణువు, వామనమూర్తి, పెద్ద అడుగు వేయువాడు, త్రివిక్రముడు.

ఉరుచక్షు
సం., నా. వా., (స్.ఈ.స్.)., తత్స., = మహాదర్శనము, సూర్యుడు.

ఉరుజ్మ
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = బహుభూమియుక్తము.

ఉరుబూకము
సం., వి., అ., పుం., తత్స., = ఆముదపుఁచెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఉరుభృశం వాతం వాతి నాశయతీతి ఉరుబూకః. మిక్కిలి వాతమును పోగొట్టునది.


ఉరుము
వి., = కాలు మొ. వాటికి దెబ్బ తగిలినప్పుడు గజ్జలో ఏర్పడే వాపు.

ఉరురి
సం., అవ్య., తత్స.,= అంగీకారము, విస్తారము.

ఉరులోకము
సం., నా. వా., అ., న., తత్స., = శ్రేష్ఠలోకము.

ఉరువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = ఆముదపుచెట్టు.వి., = ఉనికి, మొదలు.; విణ., బరువైన, జాడ.

ఉరువూకము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఆముదపుచెట్టు, ఎర్ర ఆముదముచెట్టు.

ఉరువ్యచము
సం., నా. వా., (స్.ఈ.స్.)., తత్స., = ఎక్కువగా వ్యాపించినది, విశేషంగా వ్యాపించినది.

ఉరుష్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = రక్షించాలనే కోరిక.

ఉరుసు
వి., = మహమ్మదీయ సాధువు మరణించిన రోజూ చేసే ఉత్సవం, ఉర్సు.

ఉరోజము
సం., వి., అ., పుం., తత్స., = కుచము, ఉరోజాతము, ఉరోభవము.
వ్యుత్పత్త్యర్థము :
ఉరసి జాయతే. వక్షమున పుట్టినది.


ఉరోబృహతి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = వైదికఛందోభేదము.

ఉరోభూషణము
సం., నా. వా., అ., న., తత్స., = వక్షోలంకారహారము.

ఉరోహస్తము
సం., నా. వా., అ., పుం., తత్స., = యుద్ధభేదము, మల్ల యుద్ధము.

ఉర్లగడ్డ
వి., = బంగాళదుంప, ఆలుగడ్డ.

ఉర్లబడు
క్రి., = కూలు, విరిగిపడు.

ఉర్వ
సం., నా. వా., అ., పుం., తత్స., = భూమియందు తిరుగువారు, ఋషిభేదము, పితృభేదము.

ఉర్వర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఎల్లపైరులచే నిండిన నేల, భూమి, ఫలవంతమైన భూమి, ఒక అప్సర, సమస్తమైనపైర్లతో గూడియున్నభూమి.
వ్యుత్పత్త్యర్థము :
ఉర్వతి క్షుధం హినస్తీత్యుర్వరా. ఆకలిని పోగొట్టునది.


ఉర్వర్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = సర్వసస్యాఢ్యమగు భూమి, రుద్రభేదము.

ఉర్వశి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = నదీభేదము, ఉర్వశీతీర్థము, గొప్పవారిని వశపరుచు కొనునది, ఊర్వశి, ఒకానొక స్వర్గ వేశ్య.

ఉర్వశీతీర్థము
సం., నా. వా., అ., న., తత్స., = ఉర్వశీ అను పేరు గల ఒక తీర్థము.

ఉర్వశీరమణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉర్వశీం రమయతి పురూరవుడు.

ఉర్వారువు
సం., వి., ఉ., స్త్రీ., తత్స., = దోస, బీర.
వ్యుత్పత్త్యర్థము :
ఉరుమూత్రం ఆరయతి సిస్సారయతీతి ఉర్వారుః. మిక్కిలి మూత్రమును వెళ్ళించునది.


ఉర్వీధవుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = రాజు.

ఉర్వీభృత
సం., నా. వా., త్., పుం., తత్స., = పర్వతము, రాజు, కొండ.
వ్యుత్పత్త్యర్థము :
ఉర్వీం బిభర్తి ధారయతి పాలయతి. భూమిని ధరించువాడు, పాలించువాడు.


ఉర్వీరసం
వి., =నీరు, సూర్యుడు.

ఉర్వీశుడు
వి., = రాజు, భూపతి.

ఉర్వ్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = మహత్త్వము.

ఉలంగవము
సం., వి., అ., పుం., = పెద్దనల్ల చీమ, కండచీమ

ఉలపము
సం., వి., అ., పుం., న., తత్స., = ఒకటితో నొకటి పెనగొన్న ద్రాక్షలోనగునది.
నానార్థాలు :
ఉలుపము, గుల్మిని, ప్రతానిని, వీరుధ, బల్బజము, సూర్యగ్రహము, స్థూలకము, సంప్రసారణము, మొదవగడ్డి.
పుం. దర్భవిశేషము.
నానార్థాలు :
తృణవిశేషము, ఉలూకము, సూచ్యగ్రము, స్థూలకము, దర్వ్యము, జూర్ణాఖ్యము, ఖరచ్ఛదము.

వ్యుత్పత్త్యర్థము :
ఉలతే ఆవృణోతీత్యులపః. చుట్టుకొనియుండునది, తీగ, దర్భ. వలతీతి ఉలపః. విస్తరించబడిన తీగ. శాఖాపత్రప్రచయయుతాయాం లతాయామ్. రెమ్మలు ఆకులు జొంపముగా గలతీగ.


ఉలవవిత్తు
వి.,= పోకిరి

ఉలిందము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒకానొక దేశము.

ఉలిపిరిగొట్టు
వి.,= ఓర్వలేనివాడు.

ఉలుకూపలుకూ
వి., = స్పందన.

ఉలుపము
సం., నా. వా., అ., పుం., న., తత్స., = మొదవ గడ్డి, బల్బజము.

ఉలులి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = వృద్ధిని సూచించు శబ్దము.

ఉలూకము
సం., వి., అ., పుం., తత్స., = గుడ్లగూబ.
పర్యాయపదాలు :
దివాంధము, కౌశికము, కుశి, నిశాటము, నక్తంచరము, కాకారి.

నానార్థాలు :
ఘోరదర్శనము, పేచకపక్షి, తామసము, ఘూకము, దివాంధము, ఇంద్రుడు, భారతయోధ, శకునిపుత్రుడు, విశ్వామిత్రపుత్రడు, ఉలూకదేశవాసిని, దుర్యోధనుని ఒకానొకదూత, ఒక తృణము, (ఉలుఖడ?) ఒకనొకదేశము, ఒకానొకదేశరాజు.
నానార్థాలు :

వ్యుత్పత్త్యర్థము :
ఉలతి నేత్రజ్యోతిషాకాకాన్ దహతీత్యులూకః. నేత్ర తేజస్సు చేత కాకులను దహించునది.


ఉలూకుడు
సం., వి., అ., పుం., తత్స.,= ఇంద్రుడు, భారతవంశమునందలి యొకానకయోధుడు, భారతయోధుడు, శకుని పుత్రుడు, విశ్వామిత్రుని కొడుకు.

ఉలూఖలకము
సం., వి., అ., న., తత్స., = గుగ్గిలపు చెట్టు, ఉదుంబరదండము, తోలు, బంతిగిన్నెకీలు.
వ్యుత్పత్త్యర్థము :
కుంభోలఖలాకారాత్ వృక్షకోశాన్నిర్యాతి కుంభోలూఖలకం. కుంభాకారమై ఉలూఖలాకారమైన మానిమోసుల వలన పుట్టినది.


ఉలూతము
సం., నా. వా., అ., పుం., తత్స., = కొండచిలువ.

ఉల్క
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మంటలేని కట్టెనిప్పు.
పర్యాయపదాలు :
భస్మము, అగ్ని, తేజోపుంజము, అగ్నిశిఖ, కాగడ, కొరవి, దీపావళినాడు లక్ష్మీపూజ అనంతరము వెలిగించుదీప విశేషము, మిణుగు, ప్రసిద్దదీపభేదము, జ్యోతిషంలో చేప్పిన నాక్షత్రిక దశ భేదము. ఆకాశాము నుండి పడుతున్న అగ్ని.

వ్యుత్పత్త్యర్థము :
రేఖాకారే గగనాత్ పతత్తేజః పుఞ్జే. ఆకాశమునుండి రేఖాకారముగా పడు తేజపుంజము


ఉల్కం
వి., = ఆకాశంలో నుంచి పడే అగ్నికణం, కాగడా, కొరకంచు, మిణుగురు, దీపావళి నాడు లక్షీపూజ తరవాత వెలిగించే దీపం.

ఉల్కాపాతం
వి., = ఉల్కలు పడటం.

ఉల్కాముఖము
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రేతము, కొరవిదయ్యము.

ఉల్కుషి
సం., నా. వా., ఊ., స్త్రీ., తత్స., = ఆకాశమునుండి రేఖాకారముగాబడుతేజః పుంజము.

ఉల్బణము
సం., వి., అ., న., తత్స., = పొంగు, అతిశయం.; విణ. అతిశయించినది.
పర్యాయపదాలు :
స్పష్టమైనది, ఉత్కృష్టముగా చెప్పబడునది, అధికము, తెరవు అయినది, డాబుకలది, మిక్కుటమైనది, సర్వోన్నతమైనది.


ఉల్బము
సం., నా. వా., అ., న., తత్స., = మావి, జరాయువు, గర్భపిండము, గర్భకోశము. గర్భపిండము, మావి.
వ్యుత్పత్త్యర్థము :
ఉపత్యావృణోతి గర్భమిత్యుల్బం. గర్భమును కప్పియుండునది


ఉల్ముకము
సం., వి., అ., న., తత్స.,= అలాతము, కొఱవి, మండుచున్నకొరవి, వృష్ణివంశీయరాజు.
వ్యుత్పత్త్యర్థము :
ఉచతి సమవైత్యగ్నినేతి ఉల్ముకం. అగ్నితో కూడియుండునది. ఓషతీతి ఉల్ముకమ్. అంగారము.


ఉల్లంఘనము
సం., వి., అ., న., తత్స.,= అతిక్రమణము, దాటుట, కడచుట, అతిక్రమించుట, మీఱుట.

ఉల్లంఘనీయము
విణ. = దాటదగిన, అతిక్రమించదగిన, ఉల్లంఘితవ్యము, దాటింపతగినది, అతిక్రమింపతగినది, మీఱతగినది.

ఉల్లంఘించు
సం., స., క్రి.,= అతిక్రమించు, తుటారించు.

ఉల్లంఘితము
సం., విణ., (అ.ఆ.అ.)= అతిక్రమింపబడినది, దాటబడినది, మీఱబడినది.

ఉల్లంఘ్యము
సం., విణ.,(అ.ఆ.అ.)= అతిక్రమింపదగినది

ఉల్లకసనము
సం., నా. వా., అ., న., తత్స., = రోమాంచము.

ఉల్లకుట్టుమాటలు
వి. బహు. మర్మం భేదించే పరిహాసపుమాటలు.

ఉల్లడి
వి.,=కలవరం, అలజడి, గందరగోళము.

ఉల్లలము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స., = చలనము, కదలిక, కదలునది, పెక్కు తెగుళ్లుకలది.

ఉల్లలితము
సం., విణ., (అ.ఆ.అ)., తత్స., = కదలినది, పైకెగిరినది, అల్లలాడినది, ఊపబడినది.

ఉల్లసనకము
సం., నా. వా., అ., న., తత్స., = రోమాంచము, గగ్గురపాటు, రోమాంచము.

ఉల్లసనము
సం., నా. వా., అ., న., తత్స., = సంతోషము, ప్రకాశము, వికాసము, స్ఫుటత, బయలుదేరుట, గరువు రోమాంచము. సంతోషము, ప్రకాశము, వికాశము, స్ఫుటత, బయలుదేరుట, గగురుపు, రోమాంచము

ఉల్లసితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = ప్రకాశితము, ప్రకాశించినది.
నానార్థాలు :
సంతోషించినది, గర్వించినది, అదరినది, చలించినది, పైకి లాగబడినది.


ఉల్లసిల్లు
సం., అ., క్రి., = సంతోషించు, ప్రకాశించు, వికసించు.

ఉల్లాఘుడు
సం., విణ., (అ.ఆ.అ.)., = రోగముదీరినవాడు.
నానార్థాలు :
నిరామయుడు, గదాన్నిర్గతము, నీరోగము, శుచి, దక్షుడు, కృష్ణము, మరీచము, హృష్టము, రోగనిర్ముక్తము, వ్యాధికుదిరినది, దక్షము, సమర్ధము, శుచియయినది, సంతోషయుక్తము, ఉల్లాభము, సమర్ధుడైనవాడు, రోగము నుండి కోలుకొన్నవాడు, మిరియము, సంతోషపడువాడు.
వ్యుత్పత్త్యర్థము :
రోగమునుండి కోలుకొన్నవాడు. ఉల్లాషుతి సమర్థోభవతి ఉల్లాషుః. మీఁదకానబడునది.


ఉల్లాపనము
సం., నా. వా., అ., న., తత్స., = వ్యాఖ్యానము, వివరణము.

ఉల్లాపము
సం., వి., అ., పుం., తత్స., = శోకభీత్యాదులచే కలిగిన ధ్వని వికారముతో చెప్పబడిన మాట, దూషణవాక్యము, సూచనము, బిగ్గరగా బిలుచుట, మాట, కాకువుతోమాటలాడుట.

ఉల్లాభము
సం., వి., అ., పు., = వితానము, మేలుకట్టు.

ఉల్లాసపురుషుడు
వి., ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి, సుఖభోగజీవనం గడిపే వ్యక్తి.

ఉల్లాసము
సం., వి., అ., పుం., తత్స., = ప్రకాశము.
నానార్థాలు :
ఆహ్లాదము, సంతోషము, ఒకానొక అర్థాలంకారము, గ్రంథమందలి ప్రకరణము, ప్రారంభము, వికాసము, స్ఫుటతము, ఉల్లసింపజేయునది, కాంతి, వికాసము.


ఉల్లాసి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ఉల్లాసముకలది, ఉల్లసించునది, ఉల్లసింపజేయునది.

ఉల్లిఖితము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = గోకబడినది.
పర్యాయపదాలు :
రాచి సన్నముగా జేయబడినది, సానబట్టబడినది, వ్రాయబడినది, గీయబడినది, కలుపబడినది, చెక్కబడినది.


ఉల్లిపాషాణము
మి., వి., సౌవీరము.

ఉల్లు
సం., నా. వా., (ఊ.ఊ.ఊ.)., తత్స., = ఉత్పాటకము భేదింపబడినది, త్రుంచబడినది. కంద

ఉల్లుంచనము
సం., నా. వా., అ., న., తత్స., = భేదించుట, కత్తిరించుట, ఉన్మూలనము, పెకల్చుట.

ఉల్లుంఠనము
సం., వి., అ., న., తత్స., = ఉపాలంభము, వ్యాజస్తుతి, మనసులో కోపముంచుకొని పైకి స్తుతించునట్లు పలుకుట, దెప్పుట, మర్మముదూరిపారనాడుట.

ఉల్లూనము
సం., వి., అ., పుం., తత్స., = ఒకదినుసు ధర్భ, ఉలపము, చేధింపబడినది, త్రుంచబడినది.

ఉల్లేఖనము
సం., నా. వా., అ., న., తత్స., = గోకుట, రాచుట, త్రవ్వుట, క్రక్కుట, ఉచ్ఛారణము, వ్రాయుట.

ఉల్లేఖము
సం., వి., అ., పుం., తత్స., = ఒక అర్థాలంకారము, ఉచ్చారణము. (చూ. అలంకారము.)
నానార్థాలు :
గోకుట, రాచుట, చెప్పుట, ఉచ్చరించుట, ఘర్షణ, మాట్లాడుట.


ఉల్లేఖించు
క్రి., = ఎక్కువచేసి చెప్పు, పెంచి చెప్పు.

ఉల్లోచము
సం., వి., అ., పుం., తత్స., = ఉల్లాభము, మేలుకట్టు, ఆవులింత, చంద్రాతపము, వితానము.
వ్యుత్పత్త్యర్థము :
ఉపరిలోచ్యతే ఉల్లోచః. మీదకానబడునది.


ఉల్లోప్యము
సం., నా. వా., అ., న., తత్స., = లౌకికభేదము.

ఉల్లోలము
సం., వి., అ., పుం., తత్స., = పెద్ద అల, పెద్దకెరటము, మహాతరంగము, కడలు, కల్లోలము, మిక్కిలి చలించునది.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్ ఊర్ధ్వం లోడతీత్యుల్లోలః. పైకి లేచునది.


ఉల్వణము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = వ్యక్తము, ప్రకాశము, బాధలేకుండుట, స్పష్టము, నిర్బాధము.

ఉల్వము
సం., నా. వా., అ., పుం., తత్స., = గర్భము, గర్భమునకు కారణమైన రక్తము, మావి, జరాయువు, కలలము.

ఉవాచ
వి., = ఒక విషయం లేదా సంఘటనపై తెలిపే అభిప్రాయము.

ఉవ్వెత్తుగా
అవ్య., = పూర్తిగా, సునాయాసంగా, అవలీలగా, ఒక్కుమ్మడిగా.

ఉశతి
సం., విణ.,(త్.ఈ.త్.)., తత్స., = అశుభమైనది, (వాక్కు)(రూ. ఉషతి)

ఉశనసస్తోమము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒకే రోజు సాధ్యమైనది యాగభేదము, సూత్రమందు చెప్పబడినది.

ఉశనుఁడు
సం., వి., స్., పుం., తత్స., = భార్గవుడు, శుక్రాచార్యుడు, దైత్యగురువు.
వ్యుత్పత్త్యర్థము :
వష్టి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః. అసురల శ్రేయస్సు నిచ్ఛయించువాడు.


ఉశము
సం., నా. వా., (అ.ఆ.అ)., తత్స., = ఇచ్ఛ, కోరిక, అగ్ని, వట్టివేరు.

ఉశాన
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = సోమసాధనభూతాయాం గిరిజాతాయామోషధౌ.

ఉశి
సం., నా. వా., జ్., పుం., తత్స., = ఇచ్ఛ, కోరిక, కామ్యము.
నానార్థాలు :
అగ్ని, నెయ్యి, అన్నము, వట్టివేరు.
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఒకానొక కోరిక.

ఉశీనరము
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రకృతగాంధార దేశము.

ఉశీరకుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = శిభిచక్రవర్తి, వట్టివేరు అమ్మువాడు.

ఉశేన్యము
సం., నా. వా., (అ.ఆ.అ.)., తత్స., = కమనీయము.

ఉషంగు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = రుద్రుడు.

ఉషణ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పిప్పలి.; అ., న., ము., మిరియము, సొంఠి, చవ్యమనుగ్రంథము, పిప్పలివేరు.
వ్యుత్పత్త్యర్థము :
రోగానూషతి ఊషణా. రోగములను పోగొట్టునది.


ఉషతి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = రాయముకుటము, అమంగళ వాక్కు.

ఉషద్గువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., పు. = యదువంశ్య నృపభేదము.

ఉషద్రథుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = పౌరవుడు, ఒకానొక రాజు.

ఉషపుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = సూర్యడు, అహర్పతి, అగ్ని, చిత్రమూలము (వృ. వి).

ఉషర్బుధ
సం., నా. వా., (ధ్.ఈ.ధ్.)., తత్స., = అగ్ని, బిడ్డడు, అగ్నిహోత్రుముచేయుకాలము.
వ్యుత్పత్త్యర్థము :
అగ్నిహోత్రకాలే ప్రబుద్ధే. వేకువజామున మేలుకొనువాడు.


ఉషర్బుధుడు
సం., వి., (అ.ఆ.అ.)., తత్స.,= వైశ్వానరుడు.
నానార్థాలు :
అగ్ని, వేకువజామున మేలుకొనువాడు, బిడ్డ, రక్తచిత్రకము, వృక్షవిశేషము, అగ్నిహోత్రము చేయు కాలము, చిత్రమూలము.

వ్యుత్పత్త్యర్థము :
ఉషసి ప్రభాతే బుధ్యతే జ్వలతీత్యుషర్జుధః. ప్రభాతకాలమందు జ్వలించువాడు.


ఉషసి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = మఱుసంధ్య, సాయంసంధ్య.

ఉషస్తి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఒకానొక ఋషి.

ఉషస్సు
సం. వి. స్. న. తత్స. = తెల్లవాఱుటకు ముందు నాలుగు గడియల కాలము, ఐదు గడియలకాలము, ఉషస్సు.
పర్యాయపదాలు :
ప్రత్యూషము, రాత్రి విశేషము, త్రికాలసంధ్యాసమయము, బ్రాహ్మీముహూర్తము, ప్రాతఃకాలము.
అభిమాన దేవతాభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఓషతి అర్కకరైరిత్యుషః. సూర్యకిరణముల చేత దహింపచేయునది. ఓషతి నాశయత్యంధకారమితి ఉషా. అంధకారమును నాశనము చేయునది.
వ్యుత్పత్త్యర్థము :
.

ఉషాకలము
సం., నా. వా., అ., పుం., తత్స., = కోడి.
వ్యుత్పత్త్యర్థము :
ఉషాయాం కలో రవో యస్య. ఉషః కాలమునకూయునది.


ఉషాపతి
సం., వి., ఇ., పుం., తత్స., = అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుని కుమారుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉషా బాణసుతా తస్యాః పతిః ఉషాపతి. బాణాసురుని కూతురైన ఉషకు మగఁడు.


ఉషారమణుడు
సం., వి., ఇ., పుం., తత్స., = అనిరుద్దుడు, మన్మథుని కొడుకు. ఉషాపతి, కామదేవపుత్రుడు.

ఉషితము
సం., వి., (అ.ఆ.అ.)., తత్స.,= చలిది.; విణ. కాల్పబడినది, దగ్ధము.
నానార్థాలు :
ఉన్నది, పాసిపోయినది, నిల్వబడనది, పర్యుషితము, బహూకాలముంచబడినది, నివాసము.

వ్యుత్పత్త్యర్థము :
ఉష్యతే స్మ ఉషితః. కాల్పబడినది.


ఉషీరము
సం., నా. వా., అ., పుం.,న., తత్స., = వట్టివేరు, ఉశీరము, వీరణమూలము.

ఉష్ట్రకర్ణికము
సం., నా. వా., అ., పుం., తత్స., = సహదేవ దక్షిణ దిగ్విజయ వర్ణనము, దక్షిణ దిక్కునందుయవనదేశ భేదము.

ఉష్ట్రస్థానము
సం., నా. వా., అ., న., తత్స., = ఒంటెలు ఉండు చోటు.

ఉష్ట్రిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఆడు ఒంటె.
నానార్థాలు :
ఒక దినుసు కుండ, ఆడులొట్టియ, ఒంటెవలెనుండు ఒకరకముకుండ లొట్టి, ఒకపాత్ర, మృత్తికాభాండభేదము, ఒంటె భార్యా, ఉష్ట్రీ, వృశ్చికాలీవృక్షము.


ఉష్ణంకరణము
సం., నా. వా., అ., న., తత్స., = వేడిచేయుట, వేడికిసాధనము, ఉష్ణసాధనము. (కంబళి మొదలుగునవి)

ఉష్ణకము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = వేసంగి కాలము, చురుకు గలది, జ్వరముకలది, వేడిసేయునది, కాకకలిగించునది, జ్వరము, తెలివైనవాడు.

ఉష్ణకాలము
సం., నా. వా., అ., పుం., తత్స., = గ్రీష్మ ఋతువు.

ఉష్ణకుడు
సం., విణ., (అ.ఆ.అ.)., = చొరవకలవాడు, వ్యాధిగ్రస్తుడు.

ఉష్ణగము
సం., నా. వా., అ., పుం., తత్స., = గ్రీష్మ కాలము.

ఉష్ణగుడు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = వేడి, వెలుగు, సూర్యుడు.

ఉష్ణనది
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = వైతరణీనది, నరకమందలి ఒకనది.

ఉష్ణమండలము
వి., = కర్కాటక, మకరరేఖల మధ్యలో ఉన్న అత్యుష్ణప్రదేశము.

ఉష్ణమాపకం
వి., = ఉష్ణోగ్రతను కొలిచే సాధనము, థర్మామీటరు.

ఉష్ణరశ్మి
సం., వి., ఇ., పుం., తత్స., = సూర్యుడు, వేడి వెలుగు.
వ్యుత్పత్త్యర్థము :
ఉష్ణాః రశ్మయో యస్య ఉష్ణరశ్మిః. ఉష్ణములైన కిరణములను కలిగినవాడు.


ఉష్ణవారణము
సం., వి., అ., న., తత్స., = ఆతపత్రము, గొడుగు, ఛత్రము, ఉష్ణమును పోగొట్టునది.

ఉష్ణవీర్యము
సం., నా. వా., అ., పుం., తత్స., = జలజంతువు.

ఉష్ణాంశువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = సూర్యుడు. (ఇట్లే ఉష్ణకరుడు, ఉష్ణభానుడు, ఉష్ణదీధితి, ఉష్ణరుచి మొదలగునవి)
వ్యుత్పత్త్యర్థము :
ఉష్ణాః అంశయో యస్య. వేడి అయిన కిరణములు కలిగినవాడు.


ఉష్ణాగమము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఊష్మాగమము, గ్రీష్మ ఋతువు. వేసంగి యొక్కరాక గ్రీష్మము.

ఉష్ణాలువు
సం., నా. వా., (ఉ.ఊ.ఉ.)., తత్స., = ఉష్ణమునుకోర్వనివాడు.

ఉష్ణాసహము
సం., నా. వా., అ., పుం., తత్స., = వేడిసహింపలేనిది, హేమంత ఋతువు.

ఉష్ణిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = యవాగువు, కాపుడు గంజి, ఉష్ణమైనది,
వ్యుత్పత్త్యర్థము :
అల్పమన్నమస్యామితి ఉష్ణికా. అన్నము అల్పముగా కలది.


ఉష్ణిహ్
సం., నా. వా., హ్., స్త్రీ., తత్స., = ఏడు అక్షరముల పాదలములుగల ఛందోభేదము.

ఉష్ణీగంగ
సం., నా. వా., అ., న., తత్స., = భృగుతుంగ పర్వత తీర్థభేదము.

ఉష్ణీషి
సం., నా. వా., (న్.ఈ.న్.)., తత్స., = ఉష్ణీషముకలవాడు, మహాదేవుడు, శివుడు.

ఉష్ణోదకుడు
సం., నా. వా., అ., న., తత్స., = అగ్నిచే వేడి చేయువాడు.

ఉష్ణోపగమము
సం., వి., అ., పుం., తత్స., = వేసంగి కాలము, గ్రీష్మము ఉష్మాగమము, గ్రీష్మ ఋతువు.
వ్యుత్పత్త్యర్థము :
ఉష్ణస్య ఉపగమో త్రేత్యుష్ణోపగమః. దీనియందుఉష్ణమునకు ప్రాప్తికలదు.


ఉష్మము
సం., నా. వా., అ., పుం., తత్స., = ధర్మము.
పర్యాయపదాలు :
ఆతపము, గీష్మ ఋతువు, ఎండ, ఉష్ణత, ఉక్క, ఆవిరి, వేసంగి, వేడి, గ్రీష్మము.


ఉసికొలుపు
క్రి., = రెచ్చగొట్టు, కవ్వించు, ఇతరులపై దాడికి ప్రోత్సహించు.

ఉసురుతగులు
అ., క్రి., = పాపఫలితము చుట్టుకొను.

ఉసూరుమను
అ., క్రి., = కలత-దిగులు-విసుగు మొ. వాటిని సూచించే అనుకరణపదం.

ఉస్ర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఆవు, ఎలుకజీడి.; అ.,పు., ము., ఎద్దు, కిరణము. అర్జుని, సురభి, గోవు, ఉపచిత్ర, భూమి.
వ్యుత్పత్త్యర్థము :
వసత్యస్మిన్ క్షీరమితి ఉస్రా. దీనియందు పాలుండును.


ఉస్రికము
సం., నా. వా., అ., పుం., తత్స., = నీటియావు, కొద్దిగా పాలిచ్చే ఆవు.

ఉస్రియము
సం., నా. వా., అ., పుం., తత్స., = జీర్ణ వృక్షభము, ఆవు.

ఉహ
సం., అవ్య., తత్స., = సంభోధనమునందు, అదేఅర్థమునందు.

ఉహహ
సం., అవ్య., తత్స., = సంభోధమునమందు.

ఉహూ
సం., నా. వా., ఊ., స్త్రీ., తత్స., = దుఃఖసూచకమగుశబ్దము, వాహకము.

ఉహ్న
సం., నా. వా., అ., పుం., తత్స., = వృషభము.