అచ్చులు : ఊ




సం., నా. వా., తత్స.,= శివుడు, చంద్రుడు, రక్షకుడు, సంభోధనమందు, వాక్యారంభమునందు, దయయందు, మహాదేవుడు, చంద్రుడు, పాలకుడు, ఒకానొక అక్షరము, విష్ణువు.
మాట - మంతి :
ఉకారాంత తత్సమ పదముల మీది సంబుద్ధిసంఙ్జకు వికల్పముగా ఆదేశమైన వచ్చునది. (ఇది ప్లుతముగా ఉచ్చరించబడును) .

ప్రయోగము :
ఉదా- శంభూ, విష్ణూ.


ఊఁదరులు
= శ్లో. ప్రియంగవోహ్యుదారాశ్చ కోరదూషాస్సతీనకాః.(విష్ణుపురాణము. ప్రథమాంశము. ౬,అధ్యాయము.)

ఊఅను
స. క్రి.= అంగీకరించు, సమ్మతించు.

ఊకదంపుడు
విణ.= వ్యర్థమైన, నిరుపయోగమైన.

ఊకదంపుపాట
వి. = వడ్లు దంచేటప్పుడు కాలక్షేపం కోసం స్త్రీలు పాడుకొనే పాట, అర్థంలేని వాగాడంబరభాషణం.

ఊకము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పక్షి.

ఊఖము
సం., నా. వా., తత్స.,= పిరుదు.

ఊగిసలాడు
అ. క్రి. = ఊగులాడు, సంశయించు, అనిశ్చితంగా ఉండు, డోలాయమానమవు.

ఊచకోత
వి. = ఘోరంగా అనేకులను చంపడం, సంఘాతహత్య, విచక్షణరహితంగా పెద్ద ఎత్తున చంపడం, మూకుమ్మడి హత్యాకాండ.

ఊటాడించు
క్రి. = మారుమోగించు, ప్రతిధ్వనింపజేయు, వడించు, వణికించు.

ఊడగొట్టు
స. క్రి. = తీసివేయు, తొలగించు, విడగొట్టు, పీకు, లాగు.

ఊడ్చుకొనిపోవు
అ. క్రి. = పూర్తిగా ఖర్చవు, సమూలంగా నాశనమవు ; స. క్రి. ఉన్నదంతా తీసుకొనని పోవు.

ఊడ్పుచేను
వి. = కాలువ, చెరువు మొదలైనవాటికింద సాగుచేసే నేల, వరిచేను.

ఊడ్పుమడి
వి. = వరిమడి, చెలక.

ఊఢ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= పెండ్లాము. ; విణ. పెండ్లాడినది.

ఊఢకంకటము
సం., నా. వా., అ., పుం., తత్స., = ధృఢకవచము.
వ్యుత్పత్త్యర్థము :
ఊఢో ధృతః కంకటః కవచో. ధృఢత్వము కలిగిన కవచము ఊఢకంకటము.


ఊఢము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= మోయబడినది, తీసికొనిపోబడినది, పెండ్లిచేసి కొనబడినది, పెండ్లాడిన పురుషుడు, పెండ్లాడిన స్త్రీ, వివాహిత, భార్య.

ఊఢి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = మోయుట, పెండ్లి.

ఊతంచేయు
స. క్రి.= బలపరచు, నిర్ధారణ చేసి చెప్పు.

ఊతపదము
వి. = మాట్లాడేటప్పుడు అలవాటుగా వచ్చేపదము, ఊనికమాట.

ఊతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కుట్టబడినది ; నపుం. స్యూతము, ఉతము, కూర్చబడినది, నేయబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఊయతే స్మ ఊతం. కూర్చబడినది ఊతము.

నానార్థాలు :
కుళ్లునీరు, దాచబడినది, రక్షితము, శుద్ధము.


ఊతాడు
అ. క్రి. = చేపలు పట్టు.

ఊతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స.,= అల్లిక, కుట్టుట, నేయుట.
నానార్థాలు :
లీల, క్రీడ, రక్షణము


ఊదగాలి
వి. = తూర్పుగాలి, పైరగాలి.

ఊదరకొట్టు
స. క్రి.= ఉబ్బించు, ధాన్యం మీద ఉండే చెత్త చెదారాలను పొలికట్టతో తుడిచివేయు, అదేపనిగా వాగు, రెచ్చగొట్టు, విసిగించు.

ఊదరి
సం., నా. వా., తత్స., = అంగీకృతిని తెలుపునది.

ఊదా
వి. = వంగపండు రంగు, నీలివన్నె, అసూయవల్ల కలిగే బాధ.

ఊదిపండు
వి. = విభూతిపండు.

ఊదుకడ్డీ
వి. = అగరువత్తి.

ఊదుకొను
అ. క్రి.= అలముకొను, వ్యాపించు, నాటు.

ఊదుబత్తి
వి. = అగరువత్తి.

ఊదువాద్యము
వి. = ఊదే వాద్యము.

ఊధము
సం., వి., స్., న., తత్స., = (ఆవు మొదలగువాని)పాలపొదుగు, ఆపీనము.
వ్యుత్పత్త్యర్థము :
ఉనత్తి క్షీరేణేతి ఊధః. పాలచేత తడుపునది.


ఊధస్యము
సం., వి., అ., న., తత్స., = క్షీరము, పాలు, దుగ్ధము, పొదుగున పుట్టినది.

ఊనచత్వారింశము
సం., నా. వా., (అ. ఈ. అ)., తత్స., = ముప్పదితొమ్మిది.
వ్యుత్పత్త్యర్థము :
ఊనచత్వారింశతః పూరణః. నలుబది పూరించుటకు ఒకటి తక్కువైనది.


ఊనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = తక్కువైనది, న్యూనము, హీనము, మిక్కిలి తక్కువైనవాడు, అసంపూర్ణము.
వ్యుత్పత్త్యర్థము :
నితరాం ఊనయతీత్యూనః. మిక్కిలి తక్కువైనది(తక్కువైనవాడు).


ఊనితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = హీనము, తక్కువైనది, అసంపూర్ణము.

ఊపిరితిత్తి
వి. = శ్వాసకోశము.

ఊపిరితీయు
అ. క్రి. = శ్వాస పీల్చుకొను, చంపు, బాధించు, బలవంతము చేయు.

ఊపిరిపోయు
అ. క్రి. = బతికించు, కొత్తచైతన్యం కలిగించు.

ఊబకాయము
వి. = స్థూలకాయము.

ఊమ
సం., నా. వా., అ., న., తత్స.,= ఆకాశము, ఒక పట్టణము, నగర భేదము.

ఊమ్
సం., అవ్య., తత్స., = కోపమును తెల్పునది, రోషమును తెల్పునది, నిందించు అర్థమందు, ప్రశ్నించుటయందు.

ఊరకుండు
క్రి. = మౌనం వహించు, మాట్లాడకుండా ఉండు.

ఊరకుక్క
వి. = ఊళ్లలో తిరిగే కుక్క, వీథికుక్క, పనికిమాలినది.

ఊరడింపు
వి. = ఓదార్పు, ఉపశమనము.

ఊరబావి
వి. = ఊరివారందరికీ ఉపయోగపడే మంచినీటి బావి.

ఊరభిన్నుడు
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స.,= విరిగిన తొడలు కలవాడు

ఊరరీ
సం., అవ్య., తత్స.,= విస్తారము, అంగీకృతిని తెల్పునది , విస్తీర్ణము, ఊరీ, ఉరీ, ఉరరీ.

ఊరవేయు
స. క్రి. = ఉప్పులో వేసిన ఊరగాయ మొదలైనవాటికి నిలువచేయు, తేనె మొదలైనవాటిలో నిలువచేయు.

ఊరవ్యుడు
సం., వి., అ., పుం., తత్స.,= కోమటి ; ఆ. స్త్రీ. వైశ్యజాతి స్త్రీ, కోమటిది.
వ్యుత్పత్త్యర్థము :
బ్రహ్మణ ఊర్వోర్భవాః ఊరవ్యః. బ్రహ్మదేవుని తొడలవలన పుట్టినవారు.

పర్యాయపదాలు :
పుం. ఊరుజుడు, ఆర్యుడు, విశుడు(శ. పుం), వైశ్యుడు, భూమిస్పృశుడు(శ. పుం).


ఊరించు
క్రి. = నోరు ఊరేట్లు చేయు, ఆశ పుట్టించు.

ఊరీ
సం., అవ్య., తత్స., = అంగీకారమును తెలుపునది, విస్తారము, విస్తీర్ణము, ఊరరీ, ఉరీ, ఉరరీ.

ఊరీకరించు
సం., స., క్రి., తత్స., = అంగీకరించు, ఒప్పుకొనబడినది, అంగీకరింపబడినది, విస్తారమందును, అంగీకారమందును వర్తించును.
ప్రయోగము :
ద్వి. నిర్వాణతత్వంబు, నూరీకరించివేఱొక ప్రదేశమున సారనిష్ఠఁదపంబుసల్పు చుండెదను. (విష్ణు. పూ. 3,ఆ.)


ఊరీకృతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= అంగీకరింపఁబడినది, ఒప్పుకొనఁబడినది.
వ్యుత్పత్త్యర్థము :
ఊరీక్రియతే స్మ ఊరీకృతం. అంగీకరింపబడినది ఊరీకృతం.

పర్యాయపదాలు :
నపుం. ఉరరీకృతము, సంశ్రుతము, ఆశ్రుతము, ప్రతిజ్ఞాతము, సంగీర్ణము, విదితము, సమాహితము, ఉపశ్రుతము, ఉపగతము.


ఊరుజుఁడు
సం., వి., అ., పుం., తత్స., = కోమటి.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్వోర్జాతా ఊరుజాః. బ్రహ్మదేవుని తొడలవలన పుట్టినవారు.

పర్యాయపదాలు :
పుం. ఊరవ్యుడు, వైశ్యుడు, ఆర్యుడు, భూమిస్పృశుడు(శ. పుం), విశుడు(శ. పుం).


ఊరుడు
సం., వి., ఉ., పుం., తత్స.,= ఊరధీయుడు, వైశ్యుడు

ఊరుదఘ్నము
సం., (అ. ఆ. అ)., తత్స.,= తొడలోతుకలది, తొడ వరకు వచ్చునది. (నీరు మొదలుగునవి)

ఊరుపర్వము
సం., వి., న్., పుం., తత్స.,= అష్ఠీవతము(ఎముక కలది), మోకాలు.
వ్యుత్పత్త్యర్థము :
ఉర్వోః పర్వ ఊరుపర్వః . తొడల యొక్క కనుపు.
నపుం. జానువు(ఉ. న).

ఊరుమూల
సం., వి., అ., న., తత్స.,= గజ్జ

ఊరువు
సం., వి., ఉ., పుం., తత్స.,= తొడ, జానువు ఉపరిభాగము ; నపుం. సక్థి(కూడుకొనియుండునది).

ఊరుసంధి
సం., వి., ఇ., పుం., తత్స.,= తుంటికీలు, వంక్షణము, తొడలు పిఱుఁదులు వీనియొక్క సంధి, గజ్జలు.

ఊరుస్తంభ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అరటి (వృ.వి).

ఊరుస్తంభము
సం., వి., అ., పుం., తత్స., = తొడల యందు కలుగు వాతరోగము.

ఊరేగింపు
వి. = ఊరేగించడం, మెరవణి, ఊళ్లో తిప్పేవేడుక.

ఊర్జ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = బలము, ఉత్సాహము, అన్నరసవికారము.
నానార్థాలు :
వశిష్ఠుని భార్య, దక్షుని కుమారి, యత్నము, గంజి.


ఊర్జము
సం., నా. వా., జ్., స్త్రీ., తత్స., = యత్నము, గంజి.

ఊర్జము
సం., వి., అ., పుం., తత్స., = ఊపిరి బయటకు వదులుట, ఊపిరి వెలికిబుచ్చుట, బాహులము ; నపుం. బలము, జలము, జీవనము, ప్రాణనము, వీర్యము ; స్త్రీ. హిరణ్యగర్భుని కన్య.
వ్యుత్పత్త్యర్థము :
1.ఊర్జముత్సాహః. తదస్మిన్మానే విజిగీఘాణామస్త్రీతి ఊర్జః., 2.ఊర్జయతి ఉత్సాహమితి జిగీషూనితి ఊర్జః.3. ఊర్జతి రసాదికం సోమో అత్రాధారే. ఊర్జము అనగా ఉత్సాహం, జీవనమునకు ఆధారము.

నానార్థాలు :
కార్తికమాసము, కార్తికికము, శ్రమ, ఉత్సాహము, పూనిక.


ఊర్జయోని
సం., నా. వా., ఇ., పుం., తత్స., = ఋషి భేదము.

ఊర్జవ్యుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = రాజు భేదము.

ఊర్జస్వంతము
సం., విణ., (త్. ఈ. త్)., తత్స.,= మిక్కిలి బలము కలది, మిక్కిలి ఉత్సాహము కలది.

ఊర్జస్వరుడు
సం., వి., అ., పుం., తత్స., = విశాలమైన వక్షస్థలము కలవాడు.

ఊర్జస్వలుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= గొప్పవాడు ; పుం. ఊర్జస్వి, శ్రేష్ఠుడు, ఊర్జాతిశయాన్వితుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్జః బలం తద్యోగాత్ ఊర్జస్వలః. మిక్కిలి బలముకలవాడు, మిక్కిలి ఉత్సాహము కలవాడు.


ఊర్జస్వి
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = విశాలవక్షముకలవాడు, గొప్పవాడు. ; పుం. శ్రేష్ఠుడు, ఊర్జస్వలుఁడు, ఊర్జాతిశయాన్వితుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్జః బలం తద్యోగాత్ ఊర్జస్వీ. మిక్కిలి బలముకలవాడు, మిక్కిలి ఉత్సాహము కలవాడు.


ఊర్జస్సు
సం., విణ., స్., న., తత్స., = బలము, అన్నము, ఉత్సాహము.

ఊర్జితము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = వృద్ధి కలది, దృఢము, గట్టి, గొప్పది, వృద్ధి చేయబడినది.
పర్యాయపదాలు :
బలాన్వితము, వృద్ధియుక్తము, బలము, ఉత్సాహము.

నానార్థాలు :
విశాలమైన వక్షస్థలము కలవాడు, ఉదారము, గంభీరము.


ఊర్ణ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఉన్ని, త్రుప్పుడు, నూలు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ణోతిత్యూర్ణా. కప్పి ఉండునది.

నానార్థాలు :
గొఱ్ఱెలోనగువాని బొచ్చు, కనుబొమ్మల నడిమిసుడి(ఇది మహాపురుష లక్షణము), కదళ్యాదుల తంతువు, అరటిమున్నగు వాని నార, నుదుటిసుడి.


ఊర్ణనాభము
సం., వి., అ., పుం., తత్స., = సాలెపురుగు, కీటవిశేషము, తంతువాయము, మర్కటకము, ఊర్ణనాభి, ధృతరాష్ట్రుని పుత్రుడు, దైత్యవిశేషము ; స్త్రీ. లూత.
వ్యుత్పత్త్యర్థము :
1.ఊర్ణ నాభావస్య ఊర్ణనాభః , ఉన్నివంటి దారము నాభియందు కలది ఊర్ణనాభము. 2.ఊర్ణేవ తంతుర్నాభౌ యస్య సః ఊర్ణనాభః.

నానార్థాలు :
దైత్యవిశేషము, రాగ విశేషము, అభినయహస్త విశేషము(అయిదు వ్రేళ్లను గొంచెము వంచి కొనలు కూడక పట్టినది), రోగ విశేషము, చీమ, కోతి.


ఊర్ణనాభి
సం., వి., ఇ., పుం., తత్స., = సాలెపురుగు, మర్కటకము, కీటక విశేషము.

ఊర్ణపటము
సం., నా. వా., అ., పుం., తత్స., = సాలెపురుగు, కీటక విశేషము.

ఊర్ణము
సం., వి., అ., న., తత్స., = ఉన్నిగుడ్డ.

ఊర్ణవాహి
సం., వి., అ., పుం., తత్స., = సాలెపురుగు

ఊర్ణాపిండము
సం., నా. వా., అ., పుం., తత్స., = ఉన్నివుండ.

ఊర్ణామయము
సం., నా. వా.,(అ. ఆ. అ)., తత్స., = గొర్రె.

ఊర్ణాయువు
సం., వి., ఉ., పుం., తత్స., = పొట్టేలు, గొఱ్ఱెత్రుప్పుటికంబళి, సాలెపురుగు, మేండము, ఊర్ణనాభము, ఉరభ్రము, ఉరణము, మేషము, క్షణభంగము, గంధర్వ విశేషము, వృష్ణి, ఏడకము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఊర్ణా మేషరోమ తదస్యాస్తీతి ఊర్ణాయుః. గొఱ్ఱె వెంట్రుకల వంటి రోమములు కలది. 2.ఊర్ణా అస్యాస్తీతి ఊర్ణాయుః. ఊర్ణము దీనికి కలదు కావున ఊర్ణాయువు.

నానార్థాలు :
క్షణభంగము, గంధర్వవిశేషము, మేక వెంట్రుకలతో చేసిన కంబళి, గొఱ్ఱెదుప్పుటి, కంబళి, పట్టుబట్ట.


ఊర్ణావలము
సం., విణ., అ., పుం., న., తత్స.,= ఉన్నికలది

ఊర్ణావలయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఉన్నికలది.

ఊర్ణావహి
సం., వి., అ., పుం., తత్స.,= సాలెపురుగు

ఊర్ణి
సం., నా. వా.,(ఇ. ఈ. ఇ).,తత్స., = మిక్కిలి బలము కలది, మిక్కిలి ఉత్సాహము కలది.

ఊర్ధకేతు
సం., నా. వా.,(ఉ. ఊ. ఉ)., తత్స.,= జనకవంశమునందు రాజు .
వ్యుత్పత్త్యర్థము :
ఊర్దః ఊచ్ఛ్రితః కేతుర్యస్య యత్ర వా. పైన ఉన్న జెండా కలిగినవాడు లేదా ఎక్కడ జెండా పైన ఉన్నదో అది.


ఊర్ధ్వ
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= మీదిలోకము

ఊర్ధ్వంధముడు
సం., వి.,(అ. ఆ. అ)., తత్స.,= ఊర్ధ్వస్థుడు, ఊర్ధ్వంగముడు.

ఊర్ధ్వకంఠి
సం., నా. వా.,ఈ., స్త్రీ., తత్స., = మహాశతావరి, పెద్దపీచర (వృ.వి).

ఊర్ధ్వకము
సం., వి., అ., పుం., తత్స., = ఒకడోలు, మృదంగము, యవ మధ్యమువంటి మధ్యముకల మృదంగము, అంక్యము, ఆలింగ్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వః సన్ కాయతి శబ్దాయతే. మృదంగభేదేన చ గోపుచ్ఛవదాకారస్త్రితాలపరిమితః ముఖేఽష్టాంగులః ఊర్ధ్వం ధృత్వా వాద్యతే. (దండాకారముగా ఉండు మృదంగము అని కొందరు) వాయించుటకై పొడవున నుండి పలుకునది .


ఊర్ధ్వకాయము
సం., నా. వా., అ., పుం., న., తత్స., = ఒడలి పైభాగము, నాభి మొదలు తల చివర వరకు ఉండు భాగము.

ఊర్ధ్వగతి
సం., విణ., ఇ., స్త్రీ., తత్స., = పైకిపోవునది, మరణము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం గతిః . ఊర్ధ్వగమనే యథా జ్వలనాదేః యథోక్తంసుశ్రు. ఊర్ధ్వలోకములకు స్వర్గాదులకు పోవుట.


ఊర్ధ్వగపురము
సం., నా. వా., అ., న., తత్స., = అంబరస్థపురము, హరిశ్చంద్రపురము, త్రిపురాసురపురము.

ఊర్ధ్వగుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పైకిపోవువాడు, పైనున్నవాడు, పైకిలేచువాడు, ఊర్ధ్వలోకమును పొందువాడు.

ఊర్ధ్వచరణము
సం., నా. వా., అ., పుం., తత్స., = శరభమృగము, అష్టపాదము.

ఊర్ధ్వచరణుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = కాళ్ళు పైకెత్తినవాడు, కాళ్లపైకెత్తి తపస్సు చేయు ఋషి, కాళ్ళు పైకి పెట్టబడినవాడు.

ఊర్ధ్వజానుకుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= పెద్దపిక్కలుకలవాడు

ఊర్ధ్వజానువు
సం., నా. వా., (ఉ. ఊ. ఉ)., తత్స., = ఎత్తయిన మోకాళ్లు కలవాడు.; పుం. ఊర్ధ్వజ్ఞువు.

ఊర్ధ్వజ్ఞువు
సం., విణ., ఉ., తత్స.,= కొంగ కాళ్ళవాడు, లేచినవాడు, పెద్ద పిక్కలు కలవాడు, ఎత్తయిన మోకాళ్లు కలవాడు. పుం. ఊర్ధ్వజానువు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం గతే జానునీ అస్యేతి ఊర్ధ్వజ్ఞుః. పొడవైన మోకాళ్ళు కలది.


ఊర్ధ్వదంష్ట్రకేశుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = మహాదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉర్ధ్వదష్ట్రకాణామున్నతదంష్ట్రాణాం భూతానామీశః. భూతపిశాచాలకు అధిపతి ఊర్థ్వదంష్ట్రకేశుడు.


ఊర్ధ్వదృష్టి
సం., విణ., ఇ., స్త్రీ., తత్స., = కనుబొమ్మల నడుమ నెలకొలుపు దృష్టి, మీది చూపుఁకలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉన్నత స్థితి యందు దృష్టి కలవాడు.


ఊర్ధ్వదేవుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= విష్ణువు, పంచమేశ్వరుడు
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వ ఉచ్చో దేవః. ఉన్నతస్థానమందున్న దేవుడు


ఊర్ధ్వదేహము
సం., నా. వా., అ., పుం.,న., తత్స.,= మరణమునకు పిదప కలుగు దేహం.

ఊర్ధ్వధన్వుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఇంద్రుడు.

ఊర్ధ్వనాపితము
సం., విణ., అ., న., తత్స., = సంకరజాతి.

ఊర్ధ్వపాత్రము
సం., నా. వా., అ., న., తత్స.,= యజ్ఞపాత్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం నేతవ్యం పాత్రమ్. పైన పెట్టవలసిన పాత్ర.


ఊర్ధ్వపుండ్రము
సం., నా. వా., అ.,పుం., తత్స., = నిలువుబొట్టు, తిలకభేదము
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వముఖః ఊర్థ్వ పుండ్రః ఇక్షుయష్టిరివ. ముఖమున నిలువుగా పెట్టు తిలకభేదము .


ఊర్ధ్వపృశ్ని
సం., నా. వా., ఇ., పుం ., తత్స.,= పశుభేదము.(అశ్వమేథము).
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వః పృశ్నయో బిందవోఽస్య. ఊర్ధ్వమైనటువంటి కిరణములు కలిగినటువంటి.


ఊర్ధ్వబర్హిసము
సం., నా. వా., స్., పుం., తత్స.,= పితృభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వం ప్రాగగ్రం బర్హిర్యేషామ్. అగ్రములు పైకి కలిగిన బర్హిసులు కలిగినది.


ఊర్ధ్వభాగము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పైభాగము
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వః ఉపరిస్థో భాగ ఏకదేశః కర్మ. ఉపరి భాగము.


ఊర్ధ్వమంథి
సం., విణ., న్., పుం., తత్స., = నిష్టతో ఉన్న బ్రహ్మచారి, యావజ్జీవ బ్రహ్మచారి.

ఊర్ధ్వమానము
సం., నా. వా ., అ., న., తత్స., = తూనికరాయి, తూచుకొనుటకు ఉపయోగించురాయి, ఎత్తును కొలుచు సాధనము.

ఊర్ధ్వము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= పొడవైనది, ఎత్తైనది, ఉపరితలము, మీదిది, ఉన్నమితము, ఉపరిష్టము, ఉపరి, మీదికెత్తబడినది, నిట్టనిలువుగా ఉన్నది.
నానార్థాలు :
ఎగజిమ్మబడినది, తరువాత కాలము, ఆసీనుడు, ఉపవిష్టుడు, తరువాత దేశము.


ఊర్ధ్వముఖము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = పైనభాగము, మీదుగా ఉన్న మొనకలది, ముఖము పైకెత్తినది, ప్రకృతమున ధ్వజము యొక్క ఉపరితనభాగము, ఉచ్ఛూలము, ఊర్ధ్వకోటికి చెందిన గుచ్ఛకము.

ఊర్ధ్వమూలము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స.,= దర్భ.

ఊర్ధ్వమౌహూర్తికము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = తర్వాతి ముహూర్తమున జరుగునది.

ఊర్ధ్వరేతసుడు
సం., వి., స్., పుం., తత్స., = ఋషి, శివుడు, మహాదేవుడు, ఈశ్వరుడు, ఒక ముని, భీష్ముడు.
వ్యుత్పత్త్యర్థము :
అధః పతనము లేని రేతస్సు కలవాడు.


ఊర్ధ్వరోమము
సం., వి., న్., పుం., తత్స., = కుశద్వీపమందలి సీమా పర్వతములలో ఒకటి. (చక్రబభ్రువు, చతుశృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, ఊర్ధ్వరోమము, ద్రవిణము ఇవి ఏడును కుశద్వీపస్థ సీమా పర్వతములు).

ఊర్ధ్వలింగము
సం, నా. వా., అ., పుం., తత్స.,= మహాదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వముత్‌కృష్టం లింగం చిహ్నమస్య. ఉత్కృష్టమైన చిహ్నము కలిగినవాడు,కలిగినది.


ఊర్ధ్వలోకము
సం., వి., అ., పుం., తత్స.,= స్వర్గమునందు.

ఊర్ధ్వలోచనము
సం., వి., అ., పుం., తత్స.,= శరభము, మీఁగండ్లమెకము, మీది కళ్ళముఖము.

ఊర్ధ్వవర్త్మము
సం., నా. వా., న్., న., తత్స., = ఆకాశము, వాయుమార్గము.

ఊర్ధ్వవృహతి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = వేదమందు ఛందోభేదము.

ఊర్ధ్వశాయి
సం., విణ.,(న్. ఈ. న్)., తత్స.,= శివుడు, ఊర్థ్వః (మహాదేవుడు, ఊర్థ్వలింగుడు) , వెల్లకిలాపడుకొనేవాడు.
వ్యుత్పత్త్యర్థము :
మీదివంకగా ముఖముత్రిప్పి పడుకొనేవాడు.


ఊర్ధ్వశ్వాసము
సం., వి., అ., పుం., తత్స.,= శ్వాసరోగ భేదము, ఉబ్బసము, ఎగరోజుట.

ఊర్ధ్వసానువు
సం., నా. వా., ఉ., పుం.,న., తత్స.,= పర్వత అగ్రము.

ఊర్ధ్వసూచిక
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= తలుపుగడియ

ఊర్ధ్వస్థితి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స.,= అశ్వ పృష్ఠభాగము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధం స్తితిర్యత్ర. ఊర్థ్వ స్థితిని కలిగినది.


ఊర్ధ్వస్రోతసము
సం., నా. వా., స్., పుం., తత్స.,= చెట్టు, వృక్షము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వమ్ ఊర్ధ్వగతం నాధోగామి స్రోతః. జలాదులను వేళ్ళుమూలమున పైకి తీసుకొనునది.


ఊర్ధ్వస్రోతుడు
సం., వి., స్., పుం., తత్స., =ఈశ్వరుడు, మహాదేవుడు, ఒక ముని, భీష్ముడు.

ఊర్ధ్వామ్నాయము
సం., నా. వా., అ., పుం., తత్స.,= తంత్రభేదమునందు.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వామామ్నాయ్యతే. వేదమార్గాతిరిక్త భోదకమందు.


ఊర్ధ్వాయనము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = వైశ్వవర్గస్థానము, పక్షిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్థ్వమయనం యస్య. పైకి పోవు మార్గము కలవాడు . పైకిపోవు మార్గము కలది.


ఊర్ధ్వావర్తము
సం., నా. వా., అ., పుం., తత్స., = గుఱ్ఱము వెనుకభాగము, దక్షిణావర్తము.

ఊర్ధ్వాసితము
సం., నా. వా., అ., పుం., తత్స.,= కాకర (వృ.వి).
వ్యుత్పత్త్యర్థము :
ఊర్ధ్వముపరిభాగే అసితః కృష్ణః. ఊర్ధ్వముగా కూర్చుండునది.


ఊర్మి
సం., వి., ఇ., పుం., స్త్రీ., తత్స.,= కెరటము ; పుం. భంగము, ఉల్లోలము, ప్రకాశము, ; స్త్రీ. వీచి.
వ్యుత్పత్త్యర్థము :
ఋచ్ఛతి గచ్ఛతీ త్యూర్మిః , చరించునది.

పర్యాయపదాలు :
అల, పెద్ద అల ; పుం. తరంగము, కల్లోలము, ప్రవాహము.

నానార్థాలు :
ఉమ్మి, తహ తహ, నొప్పి, పరంపర, వస్త్రపు ముడుత, వంకర, వేగము, భంగము ; స్త్రీ. వేదన, పీడ, ఉత్కంఠ, ఆకలి మొదలైనవి ; ఆరు సంఖ్య, ఋభుక్షాది (షడూర్ములు, ఋభుక్ష, తృష్ణ, శోకము, మోహము, జర, మరణము)


ఊర్మి
సం., విణ.,(న్. ఈ. న్)., తత్స., = కెరటము.

ఊర్మిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= అల, వస్త్రపుముడుత, ఉంగరము, అంగులీముద్ర ; పుం., నపుం., అంగుళీయకము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్మిరివ కాయతి, తరంగవత్ ప్రకాశమానే అంగులీయకే, అంగుళేరుపరి ఊర్మివద్వర్తతే ఊర్మికా. వేళ్ళ మీద కరుడువలె ఉండునది.

నానార్థాలు :
వస్త్రపుమూత ; పుం. భృంగనాదము, వస్త్రభంగము ; స్త్రీ. ఉత్కంఠ, వీచి ; తుమ్మెదల రవళి.


ఊర్మిమంతుడు
సం., విణ., త్., న., తత్స., = వక్రమైనది.

ఊర్మిమతము
సం., విణ.,(త్. ఈ. త్)., తత్స., = తరంగయుక్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఊర్మిరివ వక్రతాస్త్యస్య. తరంగము వలె వక్రత్వము కలిగినది.

ప్రయోగము :
నపుం. ఆరాళము, వృజినము, జిహ్మము, కుంచితము, నతము, ఆవిద్ధము, కుటిలము, భుగ్నము, వేల్లితము, వక్రము.


ఊర్మిమాలి
సం., నా. వా., న్., పుం., తత్స., = సముద్రము, కడలి, వంకరది, తరంగయుక్తము.

ఊర్మిళ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = లక్ష్మణుని భార్య, మగని నెడఁబాసిన స్త్రీ, జనక మహారాజు కూతురు, భర్తను ఎడబాసిన స్త్రీ.

ఊర్వంగము
సం., వి., అ., న., తత్స., = పుట్టగొడుగు (వృ.వి).

ఊర్వశీ
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= ఒకానొక స్వర్గవేశ్య.
వ్యుత్పత్త్యర్థము :
ఊరుం నారాయణోరుం కారణత్వేనాశ్నుతే. నారాయణుని ఊరువునుండి పుట్టినది. గొప్పవారిని వశపరచుకొనునది.


ఊర్వష్ఠీవము
సం., నా. వా., అ., న., తత్స.,= తొడల మోకాళ్ళ సముదాయము.
వ్యుత్పత్త్యర్థము :
ఊరూ చ అష్ఠీవంతౌ చ సమాద్వంద్వః. తొడలయొక్కయు, మోకాళ్ళ యొక్కయు సముదాయము.


ఊర్వి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = తొడ నడిమి చోటు.

ఊర్ష
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = దేవతాడము (వృ.వి).

ఊలుపి
సం., నా. వా., న్., పుం., తత్స., = ఉలుచమీను, ఉలూపి, జల జంతుభేదము.

ఊలూకము
సం., నా. వా.,(అ. ఈ)., పుం., స్త్రీ., తత్స., = గుడ్లగూబ, బల్బజము, మొదవగడ్డి.

ఊవధ్యము
సం., వి., అ., న., తత్స., = ఉపవాసము.

ఊషకము
సం., నా. వా., అ., న., తత్స.,= అంధకారము, పేచకం, ప్రభాతము, వేకువ.

ఊషణ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పిప్పిలి, చవ్వము ; అ. న. ము. మిరియము.
వ్యుత్పత్త్యర్థము :
రోగానూషతి ఊషణా. రోగములను పోగొట్టునది.


ఊషణము
సం., వి., అ., న., తత్స., = మిరియము, సొంఠి, వగరు.
పర్యాయపదాలు :
నపుం. వేల్లజము, మరీచము, కోలకము, పిప్పలీమూలము, కృష్ణము, ఊషణము, ధార్మపత్తనము ; స్త్రీ. కృష్ణ, ఉపకుల్య, వైదేహి, మాగధి, చపల, కణ, పిప్పలి, శౌండి, కోల.

వ్యుత్పత్త్యర్థము :
ఉషతి తాపయతీతి ఊషణం.తపించునది తపింపజేయునది.


ఊషము
సం., వి., అ., పుం., తత్స., = చవుడు ; స్త్రీ. క్షారమృత్తిక ; త్రి. ఊషరము, ఊషవము.
వ్యుత్పత్త్యర్థము :
ఉషతి బీజమూషః. విత్తనమును చెఱుచునది.

నానార్థాలు :
వేకువ, చవిటి భూమి, చవిటి ఉప్పు, వగరు, తీపికలిపినది.


ఊషరజము
సం., నా. వా., అ., న., తత్స., = చవుటి ఉప్పు.

ఊషరము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స.,= చవిటి భూమి, చవుటిది (నేల), ఊషవము, ఊషవతము, క్షారభూమి.
వ్యుత్పత్త్యర్థము :
ఉషోస్యాస్తీత్యూషరః. చౌటిమట్టి కలిగినది.


ఊషవతము
సం., నా. వా., (త్. ఈ. త్)., తత్స., = చవుటి భూమి . త్రి. ఊషవము, ఊషరము.

ఊష్మకము
సం., వి., అ., పుం., తత్స., = వేసంగి, వేడి, శ, ష, స, హ, లు
వ్యుత్పత్త్యర్థము :
ఉభతీత్యూష్మకః. దుఃఖపెట్టునది.

పర్యాయపదాలు :
పుం. గ్రీష్మము, నిదాఘము, ఉష్ణోపగమము, ఉష్ణము, ఊష్మాగమము, తపము.


ఊష్మము
సం., వి., న్., పుం., తత్స.,= వేడిమి, ఉమ్మ, ఉక్క, వేసంగి, ఉత్తాపము, బాష్పము, ఆవిరి, (వ్యాకరణమున) శ, ష స, హ లలో ఒకటి.

ఊష్మలము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఉమ్మగలది, ఆవిరి కలది, వేండ్రమైనది.

ఊష్మాగమము
సం., వి., అ., పుం., తత్స.,= వేసంగి.
వ్యుత్పత్త్యర్థము :
ఊష్మణః ఆగమోత్రేత్యూష్మాగమః. దీనియందు ఊష్మము యొక్క రాక కలదు

పర్యాయపదాలు :
గ్రీష్మము, నిదాఘము, ఊష్మకము, ఉష్ణోపగమము, ఉష్ణము, తపము.


ఊసకపోవు
అ. క్రి. = చవుడెక్కిపోవు, పనికిరాకపోవు.

ఊసిపోవు
అ. క్రి. = ఊడిపోవు, రంగుమాసిపోవు, సంబంధం తెగిపోవు, చెమ్మగిలి బొట్లు బొట్లుగా కారు.
పర్యాయపదాలు :
రాలిపోవు, పిందెలు రాలిపోవు, చెడిపోవు, శుష్కించు, ధాన్యం రాలిపోవు.


ఊసుపోవు
అ. క్రి. = కాలక్షేపము.

ఊహగానము
సం., వి., అ., న., తత్స., = సామగాన గ్రంథభేదము.

ఊహనము
సం., నా. వా., అ., న., తత్స., = ఊహించుట.

ఊహము
సం., వి., అ., పుం., తత్స.,= ఏదేవి విమర్శించి నిర్ణయించుట, సిద్ధిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఊహ్యతే అనేనేత్యూషః. దీనిచేత ఊహింపబడును.

పర్యాయపదాలు :
అపూర్వార్థమును ఉత్ప్రేక్షించుట, లేనిమాటలు కొన్నిటిని తెచ్చుకొనుట, వ్యూహము, ఆరోపము, వితర్కము, తర్కము, అధ్యాహారము, అపూర్వ ఉత్ప్రేక్షణము ; నపుం. ప్రతర్కణము, ఊహనము, పరీక్షణము, అధ్యాహరణము.


ఊహాగానము
వి.= ఊహించడము.

ఊహాజనితము
వి.= వాస్తవం కానిది, భావనలో మాత్రమే ఉన్నది, కల్పితమైనది.

ఊహాతీతము
వి.= ఆలోచనకు లేదా కల్పనకు అందని.

ఊహాపోహలు
వి.= ఆనుకూల్య ప్రాతికూల్యాలు ఊహించడము, తలపులు.

ఊహాశక్తి
వి.=ఊహించే సామర్థ్యం, కల్పనాశక్తి, ఊహాబలము.

ఊహి
సం., విణ., న్., పుం., తత్స., = ఊహ కలవాడు, ఊహించువాడు.

ఊహితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఊహింపబడినది.

ఊహ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= విచారము చేయదగినది, తర్కము, అధ్యాహార్యము, ఆకాంక్షను పూరించుటకై తెచ్చుకొనదగినది.