అచ్చులు : ఎ
ఎ
=ఒక యక్షరము.
ప్రయోగము :
మాతామహుండైనమనశూరఁడున్నాఁడె. భాగ. 1, స్కం.
.
ఉ. నీమగఁడంతయెక్కువె మనీషులుభూసురులింత తక్కువే. భార. ఆర. 2, ఆ.
.
సతీజన మిట్టిదె యేజగంబులన్.భార. విరా. 1, ఆ.
.
రావేసుందరియేమెబోటి వినవే. భాగ. 10, స్కం. పూ.
.
సీ. కుసిగుంపులిడకేగు కొన్న యంగడిలోనమాఱు చబేరములేలెమంజువాణి. చంద్ర. వై. .
.
నన్నె దనుజుఁజేసితేముగుద. కళా. 3, ఆ.
.
క. దుర్యోధననీ,
దోర్బలమె పాండవేయుల,
దౌర్బల్యమువాయు,
ఇక్కడ నీదోర్బలమె- నీదోర్బలమొకటి మాత్రమా అని యర్థము. ఇట్లితర స్థలములయందు నెఱంగునది. భార. ఉద్యో. 3, ఆ. .
.
హరుఁడదెచిక్కె. భార. ఆర. 5, ఆ.
అల్లదెయర్జునధ్వజవిహారముగానఁ గనయ్యెడున్. భార. కర్ణ. 2, ఆ. .
.
చ.ఇదెయొకపిన్నద్రో. 5, ఆ.
అవెయివెపెన్ బొగల్ నెగనె. రా. సుం. కాం.
వాఁడె భృంగీశుఁడు. కాశీ. 5, ఆ.
వీఁడెకృష్ణుఁడు. హరి. ఉ. 2, ఆ. .
.
క. వీరెవసువులు. భార. ఉద్యో. 4, ఆ.
వంశమెల్లఁబూ,
తమ్మగు నీదు చర్యననిధాతపడంతియెయానతిచ్చెస్వ, .
ప్నమ్మున వచ్చి. కళా. 4,ఆ.
ఎఁడు
దే. అప.= పరిమాణార్ధకము.
ప్రయోగము :
క. నీనుడుపుల కేనడుగెం,
డైననుదాఁటనని సత్యమాడెను. రుక్మాం. 5, ఆ.
ఎంగిలి
దే. వి.= ఉచ్ఛిష్టము.
ఎంగెస
దే. వి.= ఒక దినుసు అడవిచెట్టు.
ఎంచు
దే. స. క్రి. =గణించు, తలఁచు, ఆక్షేపించు.
ప్రయోగము :
1). ఉ. వింతలుభూమి నేమయినవింటివె పౌరులునన్నుఁ గూర్చినిం,
దింతురొయెంతురో. ఉ. రా. 6, ఆ.మ. ఫలభుక్కుల్ హతశేషులెల్లఁజనిచెప్పన్ జబ్బెనే లంకుకున్ గల సేనాధిపుఁడింద్రవహ్ని ముఖ దిక్పాల ప్రదాహారిక్రోఁ, తులచేనంచుఁబ్రహస్తు నెంచి. రామా. 8, ఆ.
ఎండఁగట్టు
దే. స.క్రి.= (ఎండన్ +కట్టు.) ఎఁడఁజేయు. (ముంగిటగుడ్డను ఎండఁగట్టుము.)
ఎండఁగొట్టు
దే. స. క్రి. =(ఎండన్ + కొట్టు.) ఎండఁజేయు. (నీళ్లు చల్లక ఆ పైరును ఎఁడగొట్టినవాడు.)
ఎండఁబెట్టు
దే. స. క్రి. =(ఎండన్ +పెట్టు.) ఎండవేయు. (వరుగులెండంబెట్టుము.)
ఎండదొర
దే. వి. =సూర్యుడు.
ప్రయోగము :
గీ. విపులఖరకరభీతినవ్విపినసీమ యండగొనియెండదొరఁబోరికయఁబిలుచు,
వీఁకఘూక మహార్భటల్ వెలయుఁజీమ,
కైనఁదూఱంగ రానియక్కాననధిప. శేష. 2, ఆ.
(ఇట్లు ఎండఱేఁడులోనగునవి.)
ఎండమావులు
దే. వి. బ.= మిట్టమధ్యాహ్నవేళ బయళ్ల యందు నీటివలెఁదోఁచెడి సూర్యకిరణములు, మృగతృష్ణ.
ఎండు
దే. అ. క్రి. =తడియాఱు, (గుడ్డంయెండెను, చెట్టుఎండెను.) నీరింకు, (చెఱవు ఎండిపోయెను.) తపించు, (వాఁడు ఎండలో ఎంచు చున్నాఁడు.) శుష్కించు. (అది అన్నములేక ఎండుచున్నది.)
ఎండుగులు
దే. వి. బ.= ఎండఁబోసిన ధాన్యము.
ప్రయోగము :
చ. కలమపుటెండుగుల్ ద్రవిడకన్యలు ముంగిటఁగాచు కుండి. ఆము. 1,ఆ.
ఎండుతెవులు
దే. వి.= దేహము శుష్కించెడువ్యాధి విశేషము.
ఎండుపుఁడట్ట
దే. వి.= (ఎండు తట్ట.) ఏదేని ఎండబెట్టుటకు వెదురు బ్రద్దలు లోనగువాని చేతనల్లిన తట్ట. దాఁగర, ప్రసేవకము.
ఎండువులు
దే. వి. బ. =ఎండుగులు యొక్కరూపాంతరము.
ఎంత
ద్వ. స. (ఏ +అంత.)= ఏకొలఁది, ఎంతకాలము, ఏయుద్దేశ్యముకొలఁది.
ప్రయోగము :
గీ. ఇతనిఁజూచి మీకు నెంతమోహముగల,
దంతకంటెమాకునధికమైన,
మోహరసముమూరిమోచియున్నది. వి, పు. 7, ఆ.
సీ. ఎంతయుసంయమవంతుండు సహదేవుఁడుధ్యాత్మ విద్యనారాధ్యుఁడెంత ననఘుండుధౌమ్యుండు. భార. సభా. 2, ఆ.
నీకెంతేనితఁడాప్తుఁడో. కళా. 3, ఆ.
ఎందనుక
ద్వ. ద్ర. =(ఎంత+ దనుక.) ఎందాఁక.
ఎందఱు
ద్వ. స.= (ఎంత+ వారు.) (ఎంతశబ్దమునకు మహమ్మహత్యర్ధకబహువచనరూపము.)ఎంత సంఖ్యగలవారు, ఇకారములోపింపఁగా ఎందఱేన్ (దీనికి ఏనిశబ్దము వెనుకఁజేరునపుడు అనేకులనెడి యర్ధము కలుగుచున్నది.)
ప్రయోగము :
క. కడకంటఁ గరుణవొడమఁగఁ,
బడఁతులు తన్నెందఱేనిఁబరి వేష్టింపన్. వీర. 2, ఆ.
హెగ్గడికత్తెలెందఱేఁగోరి భజింప. కళా. 2, ఆ.
ఎందాఁక
ద్వ. ద్ర.= (ఎంత+ దాఁక.) ఎంతపర్యంతము.
ఎందు
దే. ద్ర.= ఎచ్చోట.
ఎందులకు
దే. ద్ర.= ఎచ్చోటికి, దేనికి.
ప్రయోగము :
క. ఎందుండి మేమిపనికై, యెందులకేగెదవు. భార. శాం. 3, ఆ.
వ. ఇదియేమి యెందులకుంబోయెదవు. భార. ఆర. 2, ఆ.
ఎంబన్న
దే. విణ.= (ఎంబె+అన్న.) చేతకానివాఁడు.
ఎకదొట్టు
దే. అ. క్రి.= అతిశయించు.
ప్రయోగము :
నిట్టూర్పెకదొట్టన్. ఆము. 5, ఆ.
ఎకరా
దే. వి. =ఏనుఁగునుగట్టుమొగసాల.
ప్రయోగము :
మహాస్రగ్ధర. ఎకరాలన్ మండువాసాహిణములఁగల భద్రేభ సందోహవాహ,
ప్రకరంబుంగొంచు. స్వా. 1, ఆ.
ప్రయోగము :
ఎకసకియము
దే. వి. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. (చూ.ఎక్కసక్కెము.)
ఎకసకెము
దే. వి.ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. (. =(ఎకసక్కెము.) వికటమునకు-
ప్రయోగము :
సీ. జడలల్లిచొల్లియంబిడియెక సకెముగా బాలేందు శకలంబుపదిలపఱుచు. కాశీ. 2, ఆ.
ఎకసక్కెము
దే. వి. =వికటపుమాట, అవమానము, వంచన, వికటము.
ప్రయోగము :
గీ. జముని నాలికతోనెకసక్కెమాడఁ,
దమకపడు క్రొత్తపైఁడి మోళముకటారి. నై. 6, ఆ.
చ. మునిపతివచ్చి పూవొసఁగి మోదముతోడభవత్ర్పి యాంగనన్,
వినుతియొనర్పఁగావినినవీనుల మాచవిగాని మాటలన్,
వినవలసెన్ గదా యిపుడు నీవిటవచ్చుట పారిజాతవా,
సనఁబ్రకటించినాకు నెకసక్కెముచేయన కాదెచెప్పుమా.
క. మానంబెతొడవు సతులకు,
మానమేప్రాణాదికంబు మానమఖిలస,
న్నానములకు మూలంబగు,
మానరహితమయిన బ్రదుకుమానిని కేలా. పా. 1, ఆ.
ద్వి. అకటచేతికిఁజిక్కి నటులమాటాడి,
యెకసక్కెమె యొనర్చి యిచటనిల్వ కయె,
యిపుడొగిఁజనియె నయ్యిందీ వరాక్షి. విష్ణు. ఉ. 4, ఆ.
ఉ. చక్కనివారిలో మిగులఁ జక్కనివాఁడవు గానినీకెనౌ, చక్కనివారిఁజంద్రునివ సంతునిఁగూరుచ కొంట యందమౌఁ,
జక్కెరవింటి రాజయెకసక్కెమదేమని కూర్చుకొంటివ,
మ్మక్కయరూప కంబయిన యాయెల తెమ్మెరనాలిబూతమున్. విజ. 3, ఆ.
( దీనికిన దీని రూపాంతరముకును పరిహాసమర్ధమని కొందఱుచెప్పుచున్నారుగాని కవుల ప్రయోగసరణినిబట్టి అది నిర్ధారణ చేయఁగూడలేదు.)
ఎకసెకము
దే.వి. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( (చూ. ఎకసెక్కము.)
ఎకసెకియము
దే. వి. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ((చూ. ఎకసెక్కము.)
ఎకసెకియము
దే.వి. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( (చూ. ఎకసెక్కంము, ఎకసెక్కెము.)
ఎకసెక్కియము
దే. వి. = ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( (చూ. ఎకసెక్కము.)
ఎకసెక్కెము
దే. వి.=ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( వికటము మాటకు.
ప్రయోగము :
చ. బొమలెగ వైచికన్గొనుచుఁబొందుగఁగన్గొని పేరు గ్రుచ్చికొం,
చెకసెక్కెమటాడియయారె నీకుగం,
దముకడునందమౌనని ముదంబునఁజెక్కిలి గీఁటి యిట్లునె,
య్యమెసఁగఁబల్కరిచెనలినాక్షుల నందఱనన్ని భంగులన్. చమ. 1, ఆ.
ఎకిమీఁడు
దే. వి. =అధిపతి, ఒడయఁడు, రాజు.
ఎకిరింత
దే.వి. =ఎక్కిరింతయొక్క రూపాంతరము.
ప్రయోగము :
సీ. రేవెలుంగునుదాల్చుదేవేరియగుదుర్గు కెకిరింతయైమించుమెకముదక్క. రామా. 2,ఆ.
ఎక్కడ
దే.వి. ఏ,=(ఏ+ కడ.) ఏచోటు. (చూ.అక్కడ.)
ఎక్కము
యు. దే. వి.= గనిమ. వై. స. ఏ. ఒకటి. బ. గుణకహారపధకము, ఎక్కాలు.
ఎక్కలి
దే.వి. ప్రవాహముచే కొట్టుకొనివచ్చికమ్ముకొనిన యిసుక.
ఎక్కసకియము
దే. వి.= ఎకసక్కియము యొక్క రూపాంతరము. (ఎకసక్కంము.)
ఎక్కసకెము
దే.వి. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( (చూ.ఎకసక్కెము, ఎకసక్కెము.)
ఎక్కసక్కెము
దే. వి. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ((చూ.ఎకసక్కెము, ఎకసక్కెము.)
ఎక్కసక్కెము
దే. వి.. =ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( (చూ.ఎకసక్కెము. వికటపుమాటకు,-
ప్రయోగము :
సీ. నిక్కివీనులతోడ నెక్కసక్కెములాడు కరణినున్నవి వీనిఘనభుజములు. స్వా. 2, ఆ.
ఎక్కసెకెము
దే. వి. = ఎక్కసెక్కియము, యొక్క రూపాంతరము. ( (చూ. ఎకసెక్కము,ఎకసెక్కము.)
ఎక్కాడు
దే. స. క్రి. =(ఎక్కు+ ఆడు.) పురికొలుపు.
ప్రయోగము :
ఎ, గీ. పులిపేదవడినఁబసులవాం డ్రెయెక్కాడి రనుకత వచ్చెనాకు. ఉ, హరి. 4, ఆ.
ఎక్కిడు
దే. స. క్రి. =నారిగలదానిగాఁజేయు, మోపెట్టు.
ప్రయోగము :
అన్యచాపమె క్కిడుటయు. భార. శల్య. 1, ఆ.
ఎక్కిరింత
దే. వి.= వాహనము.
ప్రయోగము :
సీ. వేదాదివిద్యలువిహరణ,
స్థలములు చక్కనిరాయంచయెక్కిరింత. నై. 1, ఆ.
ఎక్కు
దే.అ.క్రి.= అతిశయించు, ఇష్టమగు, సిద్ధించు, (చూ.ఉపాసము.) స.కి. ఆరోహించు, వింటినారి, ప్రేరేఁపణ.
ప్రయోగము :
కెంపెక్కిన కంటి క్రేవచెలువెక్కుడుసేయఁగ భార.భీష్మ.2,ఆ.
అధ్వరకర్మములెల్లనీదునెమ్మనమునకెక్కఁజేయుదుము. భార. అశ్వ. 3, ఆ.
ఆత్మనలందురి మంద చెష్టుఁడై,
ఎక్కుడించిన,
సం అపజ్యమకరోత్పార్ధో గాండీవంసుభయంకరమ్. భార. విరా. 1, ఆ.
ఎక్కుడించు
దే. స. క్రి.= హెచ్చించు.
ప్రయోగము :
గీ. వర్ణములు నాశ్రమంబులువసుమతీశ,
కలియుగంబునఁ గత్తరఁ గలసిపోవుఁ,
గానధర్మంబురూపయి కానరాదొ, కింత కలిగిననదిఫలంబెక్కుడించు. హరి. ఉ. 9, ఆ.
ఎక్కుడు పెట్టు
దే. స.= క్రి. ఎక్కుపెట్టు, మాపెట్టు.
ప్రయోగము :
అంతడొండొక బాణాసనమెక్కుడుపెట్టి. విక్ర. 6, ఆ.
ఎక్కుడు
దే. వి.= ఆరోహణము, వాహనము, వింటినారి, (చూ. ఎక్కుడుపెట్టు,) అధికము, రూపెక్కుడు, ఎక్కుడువేగము, ఉత్త్కృష్టము.
ప్రయోగము :
ద్వి. మెలఁతకు నెక్కుడల్లన నేర్పుచు. రా. ఆర, కాం.
ఎక్కడివారొకోగరుడుఁడెక్కుడుగాఁ గలవారు. ఉ, హరి. 6, ఆ.
వీరపోయెక్కుడువారులోకులకు. ఉ, హరి. 6, ఆ.
ఎక్కుడుదీఁగ
దే. వి. =మానేరు, జ్యోతిష్మతి.
ఎక్కుడుమెకము
ద్వ.వి.= ఏనుఁగు, మహామృగము.
ఎక్కుపెట్టు
దే. స. క్రి. =ఎక్కిడు, మోపెట్టు, ఒక్కవిల్లెక్కుపెట్టంగా.
ప్రయోగము :
వ. గాండీవంబుఁ బుచ్చికొనియెక్కుపెట్టి. భార. విర. 4, ఆ.
(రూ.ఎక్కుపెట్టు.)
ఎక్కులుపెట్టు
దే.స. క్రి. =పురికొలుపు, ప్రేరేఁపించు.
ఎక్కువ
దే. వి.=ఆధిక్యము, అధికము.
ప్రయోగము :
క. అనుపమతత్పురనారీ,
జనులకునచ్చరలకంగసౌందర్యమునం,
గనఁబడ దెక్కువ తక్కువ,
కనుఱెప్పలయందగానిగణు తింపంగన్. కవి. 1, ఆ.
ఉ. నీమగఁ తండయెక్కు వెమనీషులుభూసురులింత తక్కువే. భార. ఆర. 5, ఆ.
ఎగ
దే.అప.= ఎగు శబ్దమునకు వృత్తియందు ఆదేశముగావచ్చిన రూపము. (చూ.దిగ.) (వృత్తియందిది అర్ధవిశేషములనిచ్చుచున్నది. ఎగగొట్టు, స.క్రి.ఎగురఁజేయు ,ఎగఁగ్రోలు, స.కి. పీల్చు, ఎగఁజల్లు, స. క్రి. పైకిఁజల్లు, ఎగఁజేఁపు, అ.క్రి.పొదుగునందుపాలు పైకితెచ్చు. (ఆవు ఎగఁజేఁపినది,) ఎగఁదన్ను, అ. క్రి. ఎగువకుఁదన్ను, (పాడిఁయావు ఎగఁదన్నినది.) ఎగంబట్టు, స.క్రి. ఎత్తిపట్టు, ఎగఁబాఱు, దే.అ. క్రి. ఎగువకుఁబాఱు, ఎగఁబోఁత, ఎగువకు వ్యాపించుట, (వానికి చెమటఎగఁబోఁతదిగఁబోఁతలుగా నున్నది.) దుర్బధనచేయుట, ఎగఁబోయు, అ.క్రి. దుర్బధచేయు, స.క్రి. సూచించు, ఎగఁబ్రాఁకు, అ.క్రి. మీఁదికిఁ బ్రాఁకు ఎగదువ్వు, స.క్రి. మీఁదికిదువ్వు, ఎగఁనూందు, స.క్రి. పైకినూందు, తిరస్కరించు, ఎగనెత్తు, స.క్రి. మీదికెత్తు, ఎగరోఁజు, నిట్టూర్పు, (వాఁడు ఎగరోఁజుదిగరోఁజులుగా పరుగెత్తుచున్నాడు.) (ఇట్లుఎగరొప్ప.) ఎగవిడుచు, స.క్రి. ఊరకవిడుచు, ఎగవేయు, స.క్రి. అపహరించు, చేసినదిలేదనిసాధించు, ఎగవైచు, స.క్రి. ఎగురవైచు,
ప్రయోగము :
, సీ. వీచితన్నెగఁగొట్టువెక్కసంబగు సుడిగాలి రక్కసుమీఁదలాలియూఁగి. చమ. 1, ఆ.
క. బలుమీనొక్కటినోరన్, సలిలంబెగఁ గ్రోలుచుండఁజనిరాచెలువల్, నలువురుఁదద్వదనములో,
పలికాసలిలంబువెంటఁబార్థివతిలకా. కళా. 6, ఆ.
చ. నెలఁతలు బంతిగట్టుకొని నీరెగఁజల్లఁదదీయ మంజులాం,
జలికలి తొదకంబెగయు జాడనుతింపఁ నయ్యె. వసు. 3, ఆ.
చ. కరములు నెత్తరాక యధికంబుగ వ్రేఁగయి యున్నదేవుఁగ్ర,
మ్మఱఁబెనుగౌఁగిటం బెనఁచి మాటికి మాటికిఁ బట్టి యెత్తినన్,
బరువయితో నంతనెగఁ బట్ట సమర్ధుఁడు గాక యద్భుత,
స్ఫురితగతిన్ విభీషణుఁడు బుద్ధిగలఁగి దురంతచింతతోన్. శేష. 5, ఆ.
చ. దయవృషపర్వపుత్రి యెడఁదద్దయునుంచి యయాతిభార్గవ,
ప్రియసుత నాదరింపక చరింప యదుండదిచూచితల్లికెం,
తయు నెగఁబోసిరోసమెదఁ దార్కొనజేసిన. ఉ. రా. 6, ఆ.
మధునదంబెగఁబోసె మాకంద మాలికా క్రీడా నుషంగిభృంగీరవంబు. స్వా. 6, ఆ.
ద్వి. అచలంబు పైకి గుండనకచెట్టనక, కిచకిచధ్వనులతోఁగిన కొట్టుకొనుచు, నెగఁబ్రాఁకియెక్కుచో. రా. కిష్కిం. కాం.
సీ. డిగజాఱు ముంగురు లెగదువ్వుకైతనంబున నెమ్ముగంబుపై మోముఁజేర్పి. కవి. 3, ఆ.
సీ. వాంశికవంశికా వైభవంబెగనూఁదెఁ దాళికాధరకరతాళగరిమ. వసు. 5, ఆ.
నెగనెత్తిపట్టఁగా. కళా. 7, ఆ.
తెకతేరగనీకె గవిడిచిపోయెదనె. కళా. 3, ఆ.
ద్వి. ఎంతైనఁజేసితానెగమేయఁగలుగు. సా. 7, ఆ.
శైలములెత్తి కందు కముచందముగానెగవైచి. రామా. 5, ఆ.
ఎగచు
దే. ప్రే. =ఎగయంజేయు, తరుము.
ప్రయోగము :
ఆ. వీరసేనసుతుఁడు వీరుండుహంసల,
నడబెడంగుంజూచినగుచువాని,
నెగచి చెగచి యందు నెగయకుండఁగనొక్క,
హంసఁబట్టు కొనియెనతిరయమున. భార. ఆర. 2, ఆ.
(ఈప్రయోగమును బట్టుయు తగిన యాధారములేకుడుటఁబట్టియు గటు అనునది వేఱొకపదమనిగ్రహింపక యిట్టు గయుధాతుప్రేరణ రూపమని గ్రహించుటయే యుక్తము.(చూ. ఎగయు)(ఇదిపొగచువెటిది.) క. అమ్మెయినినోడితా నుం, దమ్ముఁడు హతశేషమయిన దానవబలమున్,
గ్రమ్మఱితనవచ్చినమా,
ర్గమ్మునఁబాఱెను విహంగ గమనుండెగవన్. నిర్వ. 3, ఆ.
(కొన్నియెడలధతునునకు ప్రేరఁమునెదర్ధ భేదమును కలుగు చున్నది.( చూ.కావించి.)
ఎగతాళి
దే. వి.= గేలి, పరిహాసము.
ఎగదిగ
దే. ద్ర.= ఎగువదిగువలుగా .
ప్రయోగము :
1). ఎ, గీ. ఏగితన కూఁతుసింగారమెల్లఁబెక్కు,
మాఱులెగదిగఁగ్రేగంటం బాఱఁజూచి. కళా. 7, ఆ.
ఎగపు
దే.వి. =గర్వము, మండిపడుట.
ప్రయోగము :
1). ద్వి. బాగుమీఱిన నాగబందపుమొగపు,
తీఁగదానికిఁగల్గఁ దీఱదేయెగవు. భాగ. 10, స్కం.
ఎగయు
దే.అ.క్రి.= ఎగురు, పైకిలేచు.
ప్రయోగము :
క. మసమసకనయ్యెదిక్కులు,
పసిక్రేపుఁదలంచితిరుగఁ బడెగూళ్లశకుం,
తసమాజముకలకలములె,
గసెవెడవెడ కన్ను మొగిచెఁగగమలవనంబుల్. జై. 2, ఆ.
ఎగవు
దే.వి.=ఎగురుట,ఉడ్డీనము.
ఎగసన
దే. ద్ర. =ఎగువగా.
ప్రయోగము :
సీ. తుదివ్రేలనెగసనఁద్రోచిన పుదియబొట్టురుఫాలపట్టిక నుల్లసిల్ల. రా. ఆర. 2, ఆ.
ఎగసిపడు
ద్వ.అ.క్రి. =ఎగిరిపడు, గర్వించు, మండిపడు.
ఎగసిపాటు
ద్వ.అ. క్రి.= ఎగిరిపడుట, గర్వించుట, మండిపడుట.
ప్రయోగము :
క. భసలమనీకింతయె గసిపాచేమిటికిన్. రసి. 4, ఆ.
ఎగసిల్లు
దే.అ.క్రి.= ఎగయు.(అ.ప్ర)
ఎగాదిగ
దే.ద్ర.= ఎగదిదయొక్క రూపాంతరము.
ప్రయోగము :
కాంచిసు మాలివెండియునెగాదిగఁజూచి. ఉ, రా. 2, ఆ.
ఎగు
దే.విణ.= వృత్తియందు ఎగువశబ్దమునకును ఎగురుశబ్దమునకును అంత్యవర్ణము లోపింపఁగా మిగిలినరూపము.
ఎగుచు
దే.స.క్రి.= తఱుము.
ప్రయోగము :
క. అమ్మెయినినోడి తానుం,
దమ్ముఁడ హతశేషమైన దానవబలమున్,
గ్రమ్మఱి తన వచ్చినమార్గమ్మునబాఱెనువిహంగ గమనుండెగువన్. నిర్వ. 3, ఆ.
ఎగుడు
దే.విణ.= ఉన్నతము.
ఎగుడుదిగుడు
దే.విణ.= సమముకానిది, విషమము, (ఎగుడుదిగుడు నేల) అసంగతము. (ఎగుడుదిగుడుమాటలు.)
ఎగుదల
ద్వ.వి. (ఎగువ తల.) పైభాగము, వృద్ధి.
ఎగుబుజము
ద్వ.వి.= ఉన్నతభుజము.
ప్రయోగము :
1). ఎ, గీ. పొలుపు మీఱుచు నెగుబుజంబులునుదారు,
జమలి మూఁపుర ములతోడ నమరుమల్ల,
రంపుటాఁబోతులును బోలెఁ బెంపుమీఱ,
జెట్లుచనుదెంచిరా నృపు సేనకొఱకు. పర. 3, ఆ.
ఎగుబోద
ద్వ.వి.= ఱెక్కలుమొలచి యెగిరెడు వయసువచ్చిన పక్షిపిల్ల.
ఎగుమతి
దే.వి. =ఓడకు సరకులెక్కించుట.
ఎగుమతిచేయు
దే.స.క్రి.= ఓడకుసరకులెక్కించుట.
ఎగురు
దే.అ.క్రి. = ఎగయు.
ఎగురులాడు
దే.అ.క్రి. =దుముకులాడు.
ఎగువ
దే.వి. =మీఁదు, ఆధిక్యము, ఉన్నతము. (వృత్తియందు అంత్యవర్ణలోపము,)
ప్రయోగము :
క. తగవా మగవారికినిటు,
మగువలయందెగువఁజూప. రామా. 5, ఆ.
ఎగ్గాడు
దే.స.క్రి.= (ఎగ్గు ఆండు.) దూషించు.
ప్రయోగము :
శా. తోడంబుట్టిన వాని భంగమునకున్ దుఃఖించిమా కృష్ణువె,
గ్గాడంజూడకు మమ్మ. భాగ. 10, స్కం. ఉ.
ఎగ్గించు
దే.స.క్రి.= అనాదరించు.
ప్రయోగము :
శా. ఏలాషట్పదయెగ్గు మావలన నీకెగ్గింపఁగానేటికిన్. భాగ. 10, స్కం. పూ.
ఎగ్గు
దే.వి. = కీడు, అపకారము, కీడుమాట, అపరాధము, దోషము, అనాదరము, దూషణము.
ప్రయోగము :
1). ఉ. అగ్గి సొరందలంచునటు లర్జునునెక్కటిదా, కఁబోరనీ, కెగ్గిది. భార. కర్ణ. 2, ఆ.
బ్రహ్మణసీమలకెగ్గుసేయ. భో. 3, ఆ.
ఎగ్గునారు శతిపేరెసఁగుచుండు. ఆం, భా. ప్ర. వాగ్వ.
శా. ఏలాయింత వృథాభిమానము క్రియాహీనుండవైనావిధం,
బాలోకింపక యెగ్గు చేసితివి. భో.3,ఆ.
నను నెగ్గలుపట్టకుండినన్ బొందొనరున్. భార. కర్ణ. 1, ఆ.
శా. ఏలాషట్పదయెగ్గు మావలన నీగెగ్గింపఁగా నేటికిన్. భాగ. 10, స్కం. పూ.
చ. ఇతనికినన్ను నిట్లుఱక యెగ్గులు పల్కఁగఁబోలుఁగాక. భార. సభా. 2, ఆ.
ఎగ్గుఱుతు
దే.వి.= (ఎగువ గుఱుతు.) విషయసంగ్రహము.( ఎగ్గుఱుతులెక్క.) (రూ.ఎగ్గుర్తు)
ఎగ్గులాడు
దే.స.క్రి.= (ఎగ్గులు ఆడు.)
ఎచటు
దే.వి. ఏ. =ఎచ్చోటు యెక్క రూపాంతరము. (చూ.) ఎచ్చోటు.
ఎచరించు
దే.స. క్రి.=ఎచ్చరించు, యొక్కరూపాంతరము. (దీనికి ఈ ప్రయోగమొక్కటే కనంబడుటతేత అది యింకను విచారింపఁదగినది.)
ప్రయోగము :
ద్వి. పచరించి మాయలుపన్ని భూపాలు,
నెచరించి కోయింపనెట్లాడెమనసు. నవ. 3, భా.
ప్రయోగము :
ఎచోటు
దే. వి. ఏ.= ఎచ్చోటు యొక్క రూపాంతరము. (చూ. ఎచ్చోటు.)
ఎచ్చటు
దే. ని. ఏ. –పై-.
ఎచ్చరము
దే.వి.= ఎచ్చరిక.
ప్రయోగము :
వ. మఱియునయ్యచ్చర లెచ్చరంబులఁగచ్చువదలి.
కవిక. 6, ఆ.
ఎచ్చరించు
దే. స. క్రి.= ఎచ్చరికచేయు.
ఎచ్చరింత
దే.వి.= ఎచ్చరిక.
ప్రయోగము :
ఉ. వింతకపుంగిలింతల నవీనగళధ్వనియెచ్చరింతలన్. పాంచా. 3, ఆ.
ఎచ్చరిక
దే.వి.= అవధానము, సూచన.
ప్రయోగము :
చ. మరలఁగఁబట్టఁ గట్టఁగ సమస్తమరుద్గవినన్నుఁ గూర్చియె,
చ్చరిక ధరింపఁ బోలునన. పాండు, 2, ఆ.
ఎచ్చరికించు
దే.స.క్రి.= ఎచ్చరించుయొక్కరూపాంతరము.
ప్రయోగము :
ఉ. కననిచ్చలువచ్చు చేడియల నెచ్చరికించుచు ధూర్తకోటితో మచ్చరికించుచున్. విక్ర. 8, ఆ.
ఎచ్చిరిలు
దే.అ.క్రి.= వర్ధిల్లు, ఎచ్చిర్లు.
ప్రయోగము :
గీ. ఏయుపాయంబుచేనైన నెచ్చిరిలఁగ,
నీకరాక్షసకులమురమేశ్వరుండు,
తునుము నను శంకయొక్కటి మనమునందు,
నున్నయది దీనికెద్దియోయుక్తియింక. కళా. 6, ఆ.
గీ. నృపులకపుల సమరనిష్ఠుర త్వంబుల,
నొచ్చిచరమ దశకువచ్చి దనుజు,
లెపుడు ప్రొద్దుగ్రుంకునెపుడు మాకెచ్చిర్లఁ,
గలుగునుచుఁ బోరుసలుపుచుండ. రామా. 8, ఆ.
ఎచ్చిఱు
దే.అ.క్రి. =ఎచ్చిరిలు, బాగుపడు.
ప్రయోగము :
చ. మఱుసటినాఁటి వేకువ నమాత్యుఁడుమేల్కనివంశమంతయున్,
జెఱచిరికూఁతురుంగొడుకుఁజేకొనిముందఱఁజంద్రహాసుఁడె,
చ్చిఱినఁబ్రమాదమౌననుచుఁజిత్తమునందలపోసివీనినే,
తెఱఁగుననైనఁనైనఁజం పెదయతి ప్రవరోక్తులు బొంకు చేసెదన్. జై. 8, ఆ.
చ. నెఱయుఁగ వంపరాని ధరణీజము వంపఁగడంగెనీనియే,
డైఱబలు ఖడ్గధారజగతీధరశృంగమువ్రేసెనేనియే,
దెఱుఁగక బుద్ధిహీనునకు నెంతయుబుద్ధులు చెప్పెనేనియె,
చ్చిఱఁడొక వానరంబునకుఁజెప్పిన సూచి ముఖంబు చాడ్పునన్. పంచ. నా. 1, ఆ. <,py>
ఎచ్చు
దే.అ.క్రి. =అధికమగు, ఆధిక్యము, విణ.అధికము.
ఎచ్చోటు
దే.వి. ఏ.= (ఏ చోటు.)ఏ స్థానము, ,(రూ.)ఎచ్చోటు.
ఎట
దే.వి. ఏ.= ఎక్కడ.
ప్రయోగము :
ఇచ్చనుపయెటఁబోయెడు. భార. ఆర. 2, ఆ.
ఎటవారె
దే.వి.= కుందురుకి.
ఎటు
దే. అవ్య.= ఎట్లు.
ప్రయోగము :
ఎటాడుకొన్ననుంజేల్లుఁ గదమ్మనీకు. కళా. 1, ఆ.
ఎటులు
దే.అవ్య.= ఎట్లు.
ప్రయోగము :
ఏనెటులట్లనీవరసి యిచ్చ మెయింబనిగొమ్ము. భార. విరా. 1, ఆ.
ఎటువంటి
దే.విణ.= ఎట్టి.
ప్రయోగము :
మీరెటువంటిపెద్దవారు. కళా. 3, ఆ.
ఎటువలె
దే.ద్ర.= ఎట్లు.
ప్రయోగము :
ఎటువలెభీతినీకొదవె. నకల. 9,ఆ.
ఎట్టఎదురు
దే.వి. ఏ.= (ఎదురు+ ఎదురు.)చక్కనియెదురు.
ఎట్టకునేని
దే.అవ్య. =అతిప్రయాసమున.
ప్రయోగము :
గీ. ఇట్టులురియాడు చిత్తంబునెట్టకేని,
నాధుచెప్పినధర్మంబునకుఁజొరంగ,
నూలు కొల్పి. భార. ఆను. 1, ఆ.
ఎట్టకునేని
దే.అవ్య.=ఎట్టకేని.
ప్రయోగము :
కొంతసేపువేపుల్పెక్కినభంగినుండిధృతినెట్టకునేనియుఁబూని. రా. ఆ. కాం.
ఎట్టకేలకు
దే.ద్ర. ఎట్టకేని.
ప్రయోగము :
1). ఎట్టకేలకుననుఁదేర్చునప్పుడు బలంబులత గురురాజుసూడ. భార. విరా. 5, ఆ.
క. పెన్నిధింకనిపోవఁగలే,
కున్నకృపణుమాడ్కిఁజిత్తమూటాడఁగవా,
కన్నెపరాధీనతనతి,
భిన్నయగుచునింటికెట్టలేలకుఁజనియెన్. జై. 8, ఆ.
ఎట్టట
దే.అవ్య.= (ఎట్టు +అటు+ అ.) ఎట్టయిన.
ప్రయోగము :
క. ముదమొదవఁగసురుఁచెట్టట,
బ్రదికనఁజాలునని చనియె. పర. 2, ఆ.
ఎట్టపోగు
ద్వ.వి.= దండు.
ప్రయోగము :
చ. హరునకువెట్టఁజుచ్చినయమాల యవాటికఁజేరియచ్చటన్,
మరుఁడుతదీయ శాసనమునన్ విరహిప్ర,
కరంబునొంపదు,
ప్కరగతినెట్టపోగెసఁగఁగైకొనివచ్చినరీతి వచ్చఁ గ్రొ,
వ్విరిరవదువ్వచాల్గొని దినిన్ మలయానిలవాతపోతముల్. చంద్ర.
ఎట్టి
దే.విణ.= ఎటువంటి.
ఎట్టిఁడు
దే.విణ. =(ఎట్టి +వాఁడు.)ఎటువంటివాండు,
ప్రయోగము :
ఎట్టిఁ డునానిజేశుఁడు. రా. సుం. కాం. (బ. ఎట్టిరు.)
ఎట్టు
దే.అవ్య. =ఎట్లు.
ఎట్టులు
దే.అవ్య.=ఎట్లు.
ఎట్టువోలె
దే. ద్ర. =ఎట్లు.
ఎట్టూ
దే.అవ్య.= ప్రశ్నమును దెలుపును,ఆమ్రేడితమందుయెట్టెటూ, ఎట్టెట్టూ.
ప్రయోగము :
ఎట్టూయిట్టగునయ్య పల్కదయలేక. ఆము. 6, ఆ.
అనుటయునెట్టెటూ తెలుపుమయ్యమహాత్మక. కళా. 7, ఆ.
శా.ఎట్టెట్టూవినమైతిమింకనొకమాటేర్పాటు గాఁజేప్పుమా. కాశీ. 7, ఆ.
ఎట్లు
దే.అవ్య.= ఏ ప్రకారము.
ప్రయోగము :
1).క.అమరవరులందుఁబురుషోత్తముఁదెట్లు విశేషమట్లుధరణింగలతీ,
ర్థములందునుబుష్కరతీ,
ర్థము కరము విశేషమభిమతార్థప్రదమై. భార. ఆర. 2, ఆ.
ఎడ
యు.దే.వి.= స్ధానము, అవకాశము, దూరము, గడువు, భేదము, విఘ్నము, వ్యవహారము, సంధి, దేవతానైవేద్యవస్తువు. (ఇది విచార్యము,ఎలప్రాయముకలది, (ఎడ దూడ,ఎద పడ్డ.)నడుమ, (ఆమ్రేడితమందు ఎడనెడ.)
ప్రయోగము :
పార్థులరుగునెడకు మనము నరిగి. భార. ఆది. 6, ఆ.
ఉ. నిచ్చలు నిచ్చలోఁబొదలు నీపితృభక్తికిజ్ఞానశక్తికిన్,
మెచ్చితినచ్చితిన్ గరము నియ్యెడనియ్యెడయేలవేఁడుకొ,
మ్మిచ్చెదఁజెచ్చరన్ నలయునీప్సితముల్ శతమేనిదీననే,
పొచ్చెమునొచ్చెముంజొర దుభూసురజేసరినమ్మునావుడున్. పాండు. 2, ఆ.
క. కడు నెడగావుననదియి,
క్కడవినఁబడదేమొ. కళా. 4, ఆ.
ఇప్పుదేదయిచ్చుటయుక్తమునాకు. భార. ఉద్యో. 1, ఆ.
క. ఎడయెఱింగియుఁదమలోవల, నెడయెఱుఁగక ధర్మపథనమేతస్థితికిన్,
నడిమింటివారలైరా,
నడిమింటిరవిన్ హసించునవ్యప్రభలన్. రామా. 3, ఆ.
క. నాకెం తయుఁబ్రియశిష్యుం,
డీపకివరుఁడితనిపనికినెడకాకుండన్,
బోక యుచితమనుకరణివి,
భాకరుఁడపుడపరశిఖరిపైకరుగుటయున్.
క. ఎనిమిదియేఁడులు శిశువగు,
నెనిమిదియేఁడులటబాలుఁడెడయెఱుఁగఁడుగా,
వునబాలుఁ డెన్నిభంగుల,
జనకుని బుణమరువఁజనదుచనునటమీఁదన్.
సం. గర్భస్థైన్సదృశోజ్ఞేయ అష్టమాద్వత్సరాచ్ఛిశుః,
బాల ఆషోడశాద్వర్షాత్పౌగండశ్చేతిశబ్ద్యతే,
పరతోవ్యవహారజ్ఞనస్వతం త్రపితురా వృతః,విజ్ఞా. వ్య, కాం. 8, సంధి.
ద్వి. ఎడమాటలాడి యీయినవంశుఁదేరఁ, గడుహనుమంతుండుగలిగెనే నీకు. రా. కిష్కిం, కాం.
ఎ, గీ. అంత నాభీష్ముఁడెడఁదు నుమాడెనధిప. భార. భీష్మ. 3, ఆ.
ఎడఁబొలివోని వేడుకలయేడ్తెఱసొంపున. నిర్వ. 8, ఆ.
ఎడఁబాటు
దే.వి.= ఎడఁబాయుట, వియోగము.
ప్రయోగము :
సీ. సాదరంబుగ రఘుస్వామి వెంటనె లక్ష్మణుండెడఁబాటు లేకుండు సేవ్య,
సేవకభావంబు చెన్నొంద. అధ్యా. బాల. కాం.
ఎడఁబాపు
దే.ప్రే.= ఎడఁబాయఁజేయు.
ఎడఁబాయు
దే.స.క్రి.= (ఎడ పాయు.)వీడు, వదలు.
ఎడకట్టు
దే.అ.క్రి.= ఆఱినపుండు మరల చీముపట్టు, స.క్రి. చేర్చు.
ప్రయోగము :
1). స్రీ. ఇంద్రనీలముతో నెడకట్టి గ్రుచ్చిన రమణీయతారహారముధరించి. కాశీ. 7, ఆ.
ఎడకత్తియ
ద్వ.వి.=దూతిక.(రూ.ఎడకత్తె.)
ఎడకాఁడు
దే.వి.= తార్చువాఁడు, దూత.
ఎడకారు
ద్వ.వి.= మాఘమాసముమొదలు జ్యేష్ఠమాసములోపల పండించెడు పంట.
ఎడగడ్డ
ద్వ.వి. =ఒడ్డు, గట్టు, దరి, తీరము.
ఎడగిల్లు
దే.అ.క్రి.=తొలఁగు, అపసరిల్లు.
ఎడతాఁకు
దే. అ.క్రి.= చేరు, సంధించు.
ప్రయోగము :
వ. అంతట వారలు ద్రవ్యంబునకుంబ్రతిదినంబు నెడతాఁకంగ డంగినం దమనంబున. పర. 5, ఆ.
సీ. తనభూమి వదలక ధనవంతులగువారియిండ్లకు నెడతాఁకు చెల్లప్రొద్దుఁ,
జేరిమిథ్యానమస్కారముల్ సేయుచుఁ బ్రియములునయములు పెక్కు చూపి. హరిశ్చ. 4, ఆ.
ఎడతీయు
దే.అ.క్రి.= ఎడతెగు.
ఎడతెగు
దే.అ.క్రి.= ఎడపడు, విడివడు.
ప్రయోగము :
క. ఒక్కకరినాథుఁడెడతెగిచిక్కెన్. భాగ. 8, స్కం.
ఎడతెర్పి
దే.వి =ఎడతెఱపియొక్కరూపాంతరము.
ప్రయోగము :
చ. ఇద్దెసవచ్చెనేనియ,
త్తెఱఁగయిపోయెయంచు నెడతెర్పిగఁ గొందఱు పాయవాఱఁగన్. భార. విరా. 5, ఆ.
ఎడతెఱపి
దే.వి. =వ్యవధానము. (తిరులాళ్ళకు జనులు డతెఱపిలేక పోవుచున్నారు. (చూ.ఎడతెరపి.)
ఎడత్రెచ్చు
దే.అ.క్రి.= ఎడతెగు.
ప్రయోగము :
క. పెనఁకువ యెడ త్రెవ్వకపదు,
నెనిమిదివనములు సెల్లె. భార. శల్య. 1, ఆ.
ఎడదవ్వు
దే.వి.=అతిదూరము.
ప్రయోగము :
ఎ, గీ. విశ్వభర్త. యాన తిచ్చినయట్టులయధివసించెఁ,
గాశికాపురి కెడదవ్వు గలుగునడవి. కాశీ. 7, ఆ.
ఎడనీరు
ద్వ.వి.= లేఁతటెంకాయలోని తియ్యనీరు, ఎడనీటికాయ.
ప్రయోగము :
1). సీ. ఎడనీటిబొండ్లాల వడువునమెదడెల్లజుఱ్ఱివైచిన డొల్లు పుఱ్ఱెగములు. ఆము. 6, ఆ.
సీ. ఎడనీరటంచననగుఁ దచ్ఛలాటువు. ఆం, భా, ద్వి. వ.
ఎడపడు
ద్వ. అ.క్రి.= ఎడతెగు, పూఁటపడు.
ప్రయోగము :
క. ఎడపడక యహో రాత్రము, వడిగొని చదివింప. భార. ఆర. 3, ఆ. 2.
క. కుడిచితఁడరువకుండిన,
నెడపడిన యతండ యచ్చుటెఱిఁగి నృపతియా,
కుడిచినతనిఁగని నప్పుడు,
ఎడపడి నాతనికి రెట్టి యిప్పింపఁదగున్.
సం. ప్రతి భూర్ధాపితో యత్తు ప్రకాశంధనినాంధనమ్,
ద్విగుణంప్రతిదాతవ్య మృణికైస్తస్యతద్భవేత్. విజ్ఞా. వ్య. కాం.
ఎడపదడప
దే.అవ్య.= అప్పడప్పుడు.
ప్రయోగము :
గీ. ఎడపదడప తనూభవుఁడెచటనుండుఁ గానరాఁడనిగృహభర్తకాంతనడుగ. కాశీ. 4, ఆ.
ఎడపు
దే.ప్రే. =ఎడయఁజేయు.
ప్రయోగము :
క. జనవినుతయగ్ని హోత్రం,
బునుసంతానమును వేదములు నెడపంగాఁ,
జనదు. భార. ఆది. 4, ఆ.
ఎడపెట్టు
దే.అ.క్రి.= దౌత్యముచేయు.(అప్ర.)
ఎడపెట్టు
దే.స.క్రి.= తొలఁగించు, మాఱువడ్డించు కొనుటకై యన్నమును దగ్గఱ యెత్తియుంచు.
ప్రయోగము :
గీ. ఎఱుఁగు మతఁడునిన్ను నెడపెట్టిపలికినవాఁడు. భార. ద్రో. 1, ఆ-2.
ఎడమ
దే.విణ.= సవ్యము. (ఎడమకాలు ఎడమచేయి, మొ.వృత్తియందు, అంత్యవర్ణలోపము, ,ఎడకన్ను,ఎడవంక, మొ.)
ఎడమడుగు
దే.వి.=వ్యత్యాసము. (చూ. ఎడమడుపు) వైషమ్యము, విణ.వ్యత్యస్ధము, (చూ.ఎడమడుగు.)
ప్రయోగము :
క. ఉడుగుడుగుమోహనాస్త్రము
విడువకుమను నెలుఁగుతోడ వేగంబునన,
య్యెడకేగు దెంచినారదుఁ,
డెడమడుగించుకయులేక యిట్లను నాతోన్. భార. ఉద్యో. 4, ఆ. విణ. వ్యత్యస్తము.
ఎ. గీ. వడుగుచందంబుతనకెడమడుగుగాక,
కొమరుగా నేగెనెలకఱ్ఱిగుజ్జువేల్పు. హరి. ఉ. 10, ఆ.
ఎడమడుపు
దే.వి.= వ్యత్యసము ,వైషమ్యము, వ్యత్యస్తము. (చూ.ఎడమడుగు.)
ప్రయోగము :
క. నడిపింపఁగఁ బొడిపింపఁగ,
నెడమడువైకలఁగినప్పుడేర్పఱపఁగనేఁ,
గడునేర్తుఁబేర్చునాదగు,
కడిమియనీ సైన్యమునకు గవుసెనకాదే. భార. ఉద్యో. 4, ఆ.
క. అడలడఁచినెమ్మనమ్మున,
వెడతెలివొడఁగూర్చి మాట వేర్పడకుండన్,
జిడిముడిపడకనయంబున,
నెడమడు వొక్కింత లేకయిట్లను సతితోన్. నిర్వి. 8, ఆ-విణ. వ్యత్యస్తము.
ఎడమడువుపరువడి
దే.వి.= మల్లబంధవిశేషము.
ఎడము
దే.వి. =చోటు, అవకాశము.
ప్రయోగము :
అతిథులకునెడమిచ్చి. భార. అశ్వ. 2, ఆ.
నాకు నాహారనిద్రల కెడము లేదు. భార. ఆర. 5, ఆ.
ఎడయిక
దే.వి. =ఎడఁబాటు,వియోగము.
ఎడయు
దే.అ.క్రి.= తొలఁగు, ఎడఁబాటు.
ప్రయోగము :
క. ఏవురుపతులందు ధర్మువెడయకయుండున్. భార. ఆది. 7, ఆ.
(ఇటీవలికవులు కొందఱు దీనిని సకర్మకముగా ప్రయోగించుచున్నారు, పూర్రవ గ్రంధములయందుణబ్రయోగము కనఁబడలేదు. విచార్యము.)
ఎడరు
దే. అ. క్రి. =భగ్నమగు, ఆపద, భంగము, సందు, ఎడారి. (కొన్నిప్రతులయందు ఎడవున అని పాఠమున్నది.)
ప్రయోగము :
1). చ. తడయక ఘోరదర్శన సుదర్శనపావకుచేదహింపఁగాఁ,
బడిపరమేశ్వరోగ్రశర పావకదగ్ధపురత్రయాభమై,
యెడరిధరిత్రిమీఁదఁబడియెన్ జెడెసౌంభకమంతసాల్వుఁడున్,
బడియెమదీయచక్రపటుపాతరయంబున రెండువ్రయ్యలై. భార. ఆర. 1, ఆ.
గీ. వలదుశంకింపనింద్రుని వలనఁబుట్టు,
నెడరువొందకయుండంగఁ గొడుకునోపి,
నంతగావుము కావంగనచావు,
నపుడునన్నుఁదలంపు మేనదిమరల్తు. భార. శాం. 1, ఆ.
చ. ఇదితగదంచునడ్డపడునింతకు నేరక సభ్యులందఱున్, మదిమదినున్న యట్టియెడమానినికిందనుఁదానకాచికో,
లొదవినదానఁజేసి సభనొచ్చెముదక్కినఁ బాండునందనుల్,
బ్రదికిరిగాకయయ్యెడరు రాచ కొమారులకోర్చునట్టిదే. భార. ఉద్యో. 1, ఆ.
గీ. అప్పాఱుఁడసతి,
నెత్తుకొని పోవనిందందు నెడరు వేచె. పాండు. 3, ఆ.
వ. ఎడరు నంజలిపందిరిడియెదమనియు. ఆము. 4, ఆ.
ఎడలు
దే. అ.క్రి.= వికలమగు, విచ్ఛిన్నమగు, స.క్రి. విసర్జించు.
ప్రయోగము :
1). చ. అనవినిమేటి ధర్మమగునట్టిదియెయ్యది యెద్దియెప్పుడుం,
గనియఁగఁ బండియుండు నెసకంబుగ నెయ్యది నిగ్రహించినన్,
దనరుఁబ్రమోదసిద్దియతంబుగనెవ్వరి తోడి సంధియెం,
దునువికలంబుగాదు పరితోష మెలర్పనుపన్యసింపవే.
వ. అని దివ్వుండు పలికిన నా దివ్య బోధనుండిట్లనియె.
గీ. వినుమహింసమేటియనఁజను ధర్మంబు,
యోగకర్మమెపుడునొనరఁబండి,
యుండు మనసుక్రొవ్వు ఖండింపఁగామోద,
మెసఁగుసుజనసంధి యెడలదెందు. భార. ఆర. 7, ఆ.
కురువంశమెడలవచ్చిన. భార. స్త్రీ. 2, ఆ.
క. వందురివగలన్ దేహము, పొందెడలఁగఁ జూచునన్నుఁబొడఁగనిదివిఁదా,
నెందులకేగుచునోగిరి,
నందనదిగివచ్చికరుణనాకిట్లనియెన్.
మ. అతిసౌందర్య నిశాంతమీతనువలభ్యంబిట్లుశోకాతురా,
న్వితవైదీనిఁ దొఱంగఁగాఁదగునె. స్వా. 6, ఆ.
ఎడవాఁడు
దే. స. =కడవాఁడు, అన్యుఁడు.
ఎడవు
దే.విణ.= దవ్వు, దూరము, ఎ, గీ. తెరువు.
నెడ వనుచు జాలిఁగొని సంశయించువేళ. ఆము. 6, ఆ.
ఎడసాల
ద్వ. వి.= ప్రత్యేకమైన గది.
ఎడాటము
దే.వి.= విషయము. (దీనికి ఆట అని అర్ధము చెప్పుచున్నారు.)
ప్రయోగము :
1). సీ. నెపమేమియునులేక నీయోడాటమ్మునఁ బాడిఁదప్పఁడుగదా భైరవుండు. భీ. 2, ఆ.
ఎడారి
దే.వి. =చెట్లు చేమలు లేని విశాలపు నిర్జల భూమి.
ఎడారె
ద్వ.వి.= (ఎడ +ఆరె.)చెప్పులు కుట్టెడు చిన్నసూది.
ఎడ్డమి
దే.వి.= ఆపద.
ప్రయోగము :
ఉ. ఎడ్డమియైనయప్పటికి నెవ్వరుఁ జేరరు లోకులేమియున్,
సడ్డలు సేయనొల్ల రవసానపు వేళల దండధారుచే,
జడ్డలెకాని మేలు కొనసాగ దయోతలసోసి చూచినన్. వి, పు. 5, ఆ.
ఎడ్డము
దే.వి. = అడ్డంకి, ,నిరోధము.
ప్రయోగము :
ఉ. ఏడుదినంబు లన్నమున కెడ్డముపుట్టినయంతమాత్రలో,
నేడుచుచున్న వాఁడవుమునీశ్వర. భీ. 2, ఆ.
ఎడ్డెన
దే.వి. =భోజన పాత్రమునుంచుకొనెడి ఉన్నత పీఠము.
ప్రయోగము :
సీ. వెండియెడ్డెనలపైవెలచితెచ్చినపైఁడి పళ్లెంబు లాయితపఱచువారు. నై. 6, ఆ.
గీ. పసిఁడి యెడ్డె నలనుమించుపద్మరాగ,
భాజనంబుల వడ్డించు బహుపదార్థ,
వితతులమరెసుమేరుసంగతసహస్ర,
కరునిఁబొదివిన చిత్రమేఘములకరణి. జై. 8, ఆ.
ఎడ్లు
దే.వి.బ.= (ఎద్దు+ లు.)వృషభములు.
ఎతఁడు
దే.స.ఏ.ఏపూజ్యుఁడు. (ఏంతడు యొక్క రూపాంతరము.)
ఎతుబరికాడు
దే.వి.=ఎతుబరికాఁడు యొక్క రూపాంతరము.
ఎత్తనగోల
దే.వి.= గోనెలెత్తి యెడ్లమీఁద వేయుటకు సాధనమైన కఱ్ఱ, ఊఁతగానానించిన కోల.
ప్రయోగము :
సీ. తనరుగోణ్యుద్ధారి దండాఖ్య యెత్తనగోలనాబట్టిన గోలయనఁగ. ఆం, భా. ద్వి. వై-2.
ఎత్తనగోలు
దే.వి. =మొదలు, ప్రారంభము.
ఎత్తరము
దే.విణ.= ఉన్నతము.
ప్రయోగము :
సీ. ఇలఁజుట్టువడు తుండములమించి పూర్వాంగమెత్తరం బైపిఱుందత్త మిల్ల. స్వా. 5, ఆ.
ఎత్తరవు
దే.విణ.= ఎత్తరము, ఉన్నతము.
ఎత్తళి
దే.వి. =కొఱముట్టు, సాధనము.
ఎత్తికొను
దే.అ.క్రి.= కడఁగు, యత్నిచు, అపహరించు, వహించు, ఉద్ధరించు.
ప్రయోగము :
గీ. ఎట్టి కష్టుఁడైననిట్టి పాపముసేయ,
నెత్తికొనునె ధరణి నీవుదక్క. భార. ఆర. 6, ఆ.
బూసురకాంతనెత్తికొని పోవుటదోసముయామినీశ. వి, పు. 6. ఆ.
క. ఇపుడానన్నెత్తికొనన్,
గృపపుట్టుటనీకుజానకీవృత్తాంతం,
బెవుడుకొనివచ్చితిచ్చటి,
కపుడేననునెత్తికొంటి వనిలకుమారా. రామా. 8, ఆ.
ఎత్తికోలు
దే.వి.= కడఁక, ప్రయత్నము, సంకల్పము.
ప్రయోగము :
క. తరతరమ ప్రజలఁదునిమెడు,
నరునప్పటియెత్తికోలునకుసుర విద్యా,
ధరఖేచరులునుభీతిన్,
బొరసిరి. భార. విరా. 5, ఆ.
క. పదివేలఁజంపఁగానో,
పుదునేననునెత్తికోలు పుట్టినయది. భార. ఉద్యో. 4, ఆ.
వ. ఎప్పుడేని మీరలడ్డమాడుదు రప్పుడు శపింతు నిట్టిదనాయెత్తికోలు. భార. ఆను. 2, ఆ.
ఎత్తిపొడుచు
దే.స.క్రి.= దోషములెత్తిచెప్పి మర్మము దూఱునాడు.
ఎత్తిలి
దే.అవ్య.= గట్టిగా.
ప్రయోగము :
ఉ. ఎత్తిలికావుకావురని యేడ్చితదీయపయోధరాగ్రముల్,
కుత్తుకదాఁకఁ బీల్చికొని క్రోలె. హరి. పూ. 5, ఆ.
ఎత్తివేయు
దే.స.క్రి. =తూఁచు.
ఎత్తివేయు
దే.స. క్రి.=తీసివేయు.(వాని పేరెత్తివేయుము.) అలక్ష్యముచేయు, (నన్నెత్తివేసిమాటాడను.)
ఎత్తు
దే.అ.క్రి.= కలుగు, పుట్టు, బయలుగేరు, అపహరించు, దండెత్తు, పైకెత్తు, తీయు, చల్లుడునీరు, పాఱించు, ప్రస్తావించు, వహించు, సంగ్రహించు, పరుగెత్తు, భిక్షమెత్తు, చదరంగపుఎత్తు, ఉన్నతి., ఉపాయము, రెఁడువీసెలకొలఁది, తూనిక, ప్రయత్నము, పుష్పసరము, వలపుకత్తెవలచినవానికిచ్చు ధనము,ఉన్నతము.
ప్రయోగము :
క. కౌరవులు సేయునవమతి,
కారణముగఁగోపమెత్తు. భార. శాం. 1, ఆ.
వ. ఎత్తెడుచోట్లను విడిదలలయందునులోనుగాని స్సాణాదులైనయుద్భట చిహ్నంబులు ప్రకటింపక. భార. విరా. 3, ఆ.
గీ. అనికెవ్వరిఁ గొనియతండు,
కౌరవుల మీఁదనెత్తిరాఁగడఁగువాఁడు. భార. ఉద్యో. 2, ఆ.
చెలిప్రాణమెత్తుటసదె. హరి. ఉ. 8, ఆ.
సీ. నీరెత్తువేళలనీరెత్తుఁబాదుపాదునకుఁ గాలువలు పొందుగనమర్చి. కళా. 4, ఆ.
ఉ. తమ్ములకెల్లఁ బెద్దయగు తామరసోద రాభికాసరో,
జమ్మదివిశ్వమున్ విధివశమ్మునఁగాని సృజింపఁజాలదీ,
తమ్ములయెత్తు చిత్ర చరితమ్ము. వసు. 5, ఆ.
గీ. ఇంతవట్టును నాపాలనిచటఁగూడె,
నేమిసేయుదుఁ బనికిఁబైయెత్తు దోఁప,
దనుచుఁజింతాపరంరాత్యంత దంతు,
రాంతరంగంబుతో నుండెనవ్విభుండు. రామా. 8, ఆ.
సీ. తొలునాడు శోధ్యునిఁదులఁదూంచియాతని యెత్తైన యొద్దికలెల్లఁదాఁచి. విజ్ఞా. వ్య, కాం.
చ. విలసితమోహదాహపరివేదనపొమ్మని యెత్తు పెట్టఁగా. హంస. 1, ఆ.
బ. వలపుకత్తెవలచినవానికిచ్చు ధనము.
సీ. పద్మాస్యపురి ననుభవమునకీవయెత్తులు వెట్టుదనఁగరావలసెనిటకు. ఆము. 2, ఆ.
. సీ. ఔదలకుపధానమగు సొంపుదీపింపఁగుడికరం బెత్తుగానిడిచెలంగి. శేష. 4, ఆ.
ఎత్తుగడ
దే.వి.= (ఎత్తు+ కడ.) ఉపాయము, యత్నము.
ఎత్తుగడ్డలు
ద్వ.వి. బ.= ఎత్తుడుప్రొయ్యిగడ్డలు.
ఎత్తుగున్న
ద్వ.వి.= లేఁతయేనుఁగుపిల్ల.
ప్రయోగము :
ఎ, గీ. అచటి మదపుటేనుంగులకమరకరటి,
యెత్తుగున్న. చంద్రా. 1, అ.
ఎత్తుదెంచు
దే.అ. క్రి.=(ఎత్తు తెంచు) దండెత్తివచ్చు.
ప్రయోగము :
ఆ కాలయవనుఁడనఁగఁగాల కల్పుఁడుశత్రుఁ,
డేచి నుధురమీఁదనెత్తుదేర. హరి. ఉ. 2, ఆ.
ఎత్తుపెట్టు
దే.స.క్రి.= పురికొలుపు.
ప్రయోగము :
చ. విలసితమోహదాహపరివేదనపొమ్మనియెత్తుపెట్టఁగా. హంస. 1, ఆ.
ప్రయోగము :
ఎత్తుబరికాఁడు
దే.వి. =దొంగ, చోరుఁడు.
ఎత్తువచ్చు
దే. అ. క్రి.= (ఎత్తు +పడు.)చెడు. (వాని పేరుఎత్తువనిపోయినది.)
ప్రయోగము :
వ. అక్షవిద్యానైపుణ్యముగలభూపకుమారులతోఁ బసులకాఁపరులెత్తువత్తురేయని క్రొవ్వున నవ్వుచుంబలికిన. భాగ. 10, స్కం. ఉ.
ఎత్తువడు
దే.అ.క్రి. =(ఎత్తు +పడు.) చెడు.(వాని పేరు ఎత్తువడిపోయినది.) లేవలేకపడు,
ప్రయోగము :
సీ. ఎత్తువడ్డమహాకుభృత్తులనతులితధృతిఁజీరికిఁగొనని ధీర భటులు. వసు. 2, ఆ.
ఎత్తువోవు
దే.అ.క్రి. =(ఎత్తు +పోవు.) చెడు, తగ్గు.
ప్రయోగము :
గీ. శిలచిగురుఁబోఁడియైయుల్లపిల్ల నొనర్చి. యెత్తు వోయిన గౌతమునిల్లునిలిపె. రామా. 4, ఆ.
క. అవియునునొకటికొకటికె,
త్తువోకపెనఁగిననుగని మధుత్రిపురహరుల్,
సవరణతో మగుడంగాఁ,
దివిచిరి ఖేచరగణంబు దివిరినుతింపన్. ఉ, హరి. 6, ఆ.
ఎత్తెల
దే.వి.= చేపలఁబట్టెడిఁఅడ్డువల.
ప్రయోగము :
క. వెరవున సూఁదుల నెత్తెలఁ,
బొరయుచుఁద్రాళ్లంగ్రువ్వఁగఁ,
గరమూహించిమదిఁబ్రాప్తకాలజ్ఞుఁడనున్. భార. శాం. 3, ఆ.
ప్రయోగము :
ఎద
యు.దే.వి.= పశుఋతువు, భయము.
ప్రయోగము :
వ. ఎదపదనునం బొదలు పెట్టలకుంజుట్టంబులై. స్వా. 4, ఆ.
సీ. ఎదడిందిమద మొందిగదనొందిరొదఁజెందిపొదసంది పెదపంది మెదుపునొక్కఁడు. చంద్రా. 2, ఆ.
ఎదావు
దే. వి.=(ఆఁబోతుచేర సమయమైనయావు.)
ఎది
దే.స. = శబ్దమునకు అమహదర్ధప్రధమైకవచనము. (ఏయాఁడుది, ఏపశ్వాది. ఏజడవస్తువు.)(ఏది యొక్కరూపాంతరము.)
ఎదిరి
దే.వి. =విరోధి.
ఎదురాడు
దే.అ.క్రి.= (ఎదురు+ ఆడు.) మాఱాడు.
ఎదురు
దే.స.క్రి.=ఎదిరించు, పురోభాగము, ఎదుటివాఁడు, వలపుకత్తె వలచి వానికిచ్చుధనము,అన్యుడు.
ప్రయోగము :
క. ఒకమరికిరీటికట్టెది,
రికినఱిముఱిఁబోయిరేని రెండవమాఱి,
య్యకొనుటకోర్వఁగ లేరయి,
రొకళ్లుఁ గురురాజుసేనయోధులలోనన్. భార. విరా. 5, ఆ. ఎదుర్వోర్వవలయు. భార. కర్ణ. 1, ఆ.
గీ. ఇంటిలోనున్న వస్తువులెదురువెట్టి. హంస. 2, ఆ.
విణ. పదపడిదుస్తరమగునీ,
పదు మూడవయేఁడు గడవఁబడుటయరిదిత.
మ్మెదురెఱుఁగ మికైయాపద,
లొదవినసైరించిరిట్టియునికియునికియుఁగలదే. భార. ఉద్యో. 1, ఆ.
ఎదురుకట్టుల
దే.ద్ర.= ఎదుట.
ప్రయోగము :
క. అల్లంతనెదురు కట్టుల,
నుల్లమలరఁగాంచి. భో. 5, ఆ.
గీ. గొల్లపడుచులుచనిగుంపుగూడిచూడ,
ఱోలుదామెన త్రాడునులీలతోడ,
నీడ్డికొనివట్టి తమయింటి యెదురుకట్లఁ,
దనరుధవళార్జునంబులఁ దగులఁబెట్టి. వి, పు. 8, ఆ.
ఎదురుకుత్తుక
దే.వి.= అంకిళ్లుపట్టుకొనెడు వ్యాదివిశేషము.
ఎదురుకొను
దే.అ. క్రి. =ఎదురగు, అభిముఖమగు, స.క్రి.ఎదిరించు. (వాఁడునన్నెదురుకొని నిలువనేరండు.)(రూ. ఎదుర్కొను.)
ఎదురుకోలు
దే.వి.= వివాహమునందుఁబడు చింటివారు వరునికెదురుగాఁబోవుట,పూజ్యులువచ్చునప్పుడు ఎదురుగాఁబోవుట.
ఎదురుగడ
దే.వి. =(ఎదురు+ కడ.) మాఱువ్రాసినయొడంబడికలోనగునజి.( ఎదురుగడయొడంబడిక,ఎదురుగడలెక్క.)
ఎదురుచు
దే.అ.క్రి.= ప్రతికూలమగు, (చూ.ఎద్రుచు.) స.క్రి.ఎదిరించు.
ప్రయోగము :
1). ఉ. తమ్ములువీఁగినంబతి యుదగ్రతభీమునెదిర్చియార్చుచున్. భార. భీష్మ. 2, ఆ.
(రూ. ఎదుర్చు)
ఎదురుచుక్క
దే.స.క్రి.= వేచు,ప్రతీక్షించు.
ఎదురుచుక్క
ద్వ.విణ. =కానిది. (చుక్క అనఁగా శుక్రుఁడు శుక్రుఁడెదురగుట, యనిష్టప్రదము, కనుక లక్షణచే నీయర్ధము కలుగుచున్నది.)
ఎదురుపడు
ద్వ.అ.క్రి.=ఎదురుగావచ్చు(దారిలోనాకువాణడెదురుపడెను.)ఎదురుతిరుగు,
ప్రయోగము :
1). చ. యవనజంరాసుతాదులకు నాజి నెదుర్పడలేక. భా. 3, స్కం.
ఎదురుపాటు
ద్వ.వి.= ఎదురుపడుట. (రూ.ఎదుర్పాటు.)
ఎదురుమ్రోయు
ద్వ.అ.క్రి.= మాఱుచెలఁగు.
ఎదురేగు
దే.అ.క్రి.= (ఎదురు+ ఏగు.) ఎదురుగాఁబోవు.
ఎదురొత్తు
దే.అ.క్రి. (ఎదురు+ ఒత్తు.) మాఱొత్తు, మాఱొత్తులు.
ఎదుఱురొమ్ము
ద్వ.వి.= ఱొమ్మునడిభాగము.
ఎద్దడి
దే.వి.= దారిద్య్రము, విణ. దరిద్రము, శూన్యము.
ప్రయోగము :
1). క. పసులకుమేపెద్దడియై. హరి. పూ. 7, ఆ.
ఎద్దడినేల
దే. వి. =నిర్జలభూమి, మరుభూమి.
ఎద్దము
దే.వి.= పట్టెతీరినయంచు.(ఎద్దపుచీర.)
ఎద్ది
దే.స.= ఏదియొక్కరూపాంతరము. (చూ.)
ఎద్దు
దే.వి. =వృషభము. (బ. ఎడ్లు.)
ఎద్దునాలుక
దే.వి. =గోజిహ్వ.
ఎద్దుపట్టు
దే.స.క్రి.= ఎద్దునుముష్కహీనము చేయు.
ప్రయోగము :
వ. వానింబట్టికట్టింపుము,
ఒండెనెద్దుపట్టింపుము. హరి. పూ. 6, ఆ.
ఎద్దుముట్టె
దే.వి. =ఒకదినుసుగడ్డ.
ఎద్దురాశి
ద్వ. వి.= వృషభరాశి.
ఎద్రుచు
దే.అ.క్రి.= (ఎదురుచు యొక్క రూపాంతరము.)ప్రతికూలము.
ప్రయోగము :
చ. ఎద్రిచినకాల పాకముననీగతి నీమదింగ్రోధవల్లికన్,
బద్రిచినవారు. ఉ. హరి. 4, ఆ.
ఎన
దే.విణ. =ఏ.సమాసము.
ప్రయోగము :
నీకెనయె మానవనాథులు. భార. సభా. 1, ఆ. దీనికి, వెనకాపుసుఁడీతలంపనే ధర్మములన్. భార. ఆను. 2, ఆ.
ఎనమండ్రు
దే.స. =ఎనిమిదిమంది. (ఎనిమిదికి మహన్మహత్యర్ధకరూపము.)
ఎనమందుము
ద్వ.వి.= (ఎనిమిది+ తూము.) ఎనిమిదితూములు.
ఎనయిక
దే.వి. = పొందిక, సామ్యము.
ప్రయోగము :
క. వినుఁడీతగుసంబంధపు,
టెనయికగ నిమోచితెచ్చియిచ్చెననరెచు, ల్కనివరులు. ఆము. 9, ఆ.
ఎనయు
దే.అ. క్రి.= సరిపోలు, పొందు, పోలు.
ప్రయోగము :
1). ఉత్ఫుల్లలోచనుఁడా విష్ణుమూర్తితో నెనయునీసన్మూర్తి. హరి. ఉ. 5, ఆ.
చ. గనగననెల్లప్రొద్దుఁగొనికాలెడు వేఁడిమిఁబేర్చుభర్తమే,
నెనయనుడగ్గఱన్ సయిఁపక. హరి. పూ. 1, ఆ.
చ. ఎనయుదెనీవు పౌరుష విహీనుఁడవిద్దివిజేంద్రనందనున్. భార. కర్ణ. 2, ఆ.
ఎని
ద్వ.స. =ఎన్నియొక్కరూపాంతరము. (చూ.ఎన్ని.) (హల లుపరుమగుచో నిత్యలోపమువికల్పముగా నగు.)
ఎనిక
దే.వి. =గణనము, నాలుగుపోఁగులనూలుదారము.
ప్రయోగము :
క. తనకంటెనధికుఁబరసతి,
నెనికమిగులఁదిట్టెనేని నేఁబదిపణముల్,
తనకంటె హీనుఁదిట్టిన,
దనరఁగఁ బండ్రెండ్రున రయుదండువు గలుగున్. విజ్ఞా. ప్రా. కాం.
ఎనిమిది
దే.స.= ఏడునొకటి, (రూ) ఎన్మిది.
ఎనిమిదికాళ్లచుక్క
ద్వ.వి.= పూర్వభద్రపదానక్షత్రము.
ఎనిమిదికాళ్లరిక్క
ద్వ.వి.= భాద్రపదమాసము, నెల.
ఎనియు
దే.అ.క్రి. =కలిసికొను.
ఎనుచు
దే.ప్రే. ఎనియఁజేయు, ఎనుపు.
ఎనుపతేలు
ద్వ.వి. =(ఎనుము+ తేలు.) నల్లతేలు.
ఎనుపమోఁకాలు
ద్వ.వి.= ఒకానొకచెట్టు.
ఎనుపసరము
ద్వ.వి.= (ఎనుము+ పసరము.) బఱ్ఱె.
ఎనుపు
దే.ప్రే. =ఎనియంజేయు,ఎనుచు.
ఎనుపుడు
దే.వి.= ఎనుచుట.
ఎనుపెంటి
ద్వ.వి.= (ఎనుము+ పెంటి.)బఱ్ఱె.
ఎనుపోతు
ద్వ.వి.= (ఎనుము+ పోతు.) దున్న,మహిషము.
ఎనుబండ్రు
ద్వ.స. =ఎనుబదిమంది, .(ఎనుబదికి మహన్మహత్యర్ధక రూపము.)
ఎనుబది
ద్వ.స.= (ఎనిమిది +పది.) ఎనిమిదిపదులు, అశీతి.
ఎనుమనూఱు
దే.స.=( ఎనిమిది+ నూఱు.)
ఎన్నఁడు
దే.వి.ఏ,= (ఏ +నాఁడు.) ఏ కాలము, ఎప్పుడు, (ఎన్నెండేనియనుచో ఏనిశబ్దమువాక్యాలంకారార్ధము. ఎల్లప్పుడు. (ఇది ఈ యర్ధమందుద్రుతాంతమునగు)
ప్రయోగము :
1). ఎ, గీ. భూతములుగ్రాలునెన్నఁడేఁబుట్టి నిండ్ల,
నపుడువారాణసీక్షేత్రమైదుకోసు,
లంతమేర యుపద్రవంబందకుండు. కాశీ. 2, ఆ.
ఎన్నాళ్లు
దే.వి. బ.=(ఎన్ని+ నాళ్లు.)ఎన్నిదినములు.
ఎన్ని
ద్వ. స.ఏ.= (ఎంతశబ్దమునకు అమహదర్ధక బహువచనాదేశము.) ఎంతసంఖ్యకలవి, అన్ని.
ప్రయోగము :
ఉ. ఏకపుఁబ్రోకమైన శత్రులెన్నియు నేర్పున నేర్పరించి. భో. 1, ఆ.
ఏను గయ్యపుశకు నంబులెన్నియేని గంటిని. భార. ఉద్యో. 3, ఆ.
ఎన్నిక
దే.వి.= ఎనిక, గణనము.
ఎన్నికచేయు
దే.స. క్రి. =ఎంచు, గణించు.
ఎన్నికపెట్టు
దే.స.క్రి.= ఆక్షేపించు, గణించు.
ప్రయోగము :
సీ. చంద్రచంద్రాతప చంద్రనశారదాశారదాంభో దకేసరులనెన్ని. రసి. 1, ఆ-2.
ఎన్నువ
దే.వి.= ఆండువారేడ్టునప్పుడు అనుభవమునెంచియెంచి పాటగాఁబాడెడు చచ్చినవారిచారిత్రము.
ఎన్నెమ
దే.వి.= పురిటిపురుగు.(అప్ర)
ఎన్బది
ద్వ.స.= ఎనుఁబదియొక్కరూపాంతరము.
ఎపుడు
ద్వ.వి.ఏ =ఎప్పుడు యొక్కరూపాంతరము.
ఎప్డు
ద్వ వి.ఏ.= ఎపుడుయొక్క రూపాంతరము.
ఎప్పటి
దే.అవ్య.= అప్పటి మరల.
ప్రయోగము :
క. ఇవ్విధమునఁబురమంతయు,
నివ్వలనవ్వలను రేఁగియెప్పటిఱాలన్,
ఱువ్వంగబెగడిరయమున,
న్వనచరమేగె దట్టమగు కానలకున్. భో. 5, ఆ.
ఎప్పుడు
దే.వి. = ( ఏ+ ప్రొద్దు.)ఏకాలము, ఎల్లప్పుడు.
ప్రయోగము :
రేయిపగలునిద్రయునెప్పుడెఱుఁగక. భా. ఆర. 2, ఆ.
ఏమఱకుండు నెనిజకృత్యములనెప్పుడును. భార. సభా. 1, ఆ.
ఎబ్బఱాసి
ద్వ.విణ. = రోఁతకలవాడు, (లేక) రోతకలది. (ఎబ్బేరికపువస్తురాశిలోఁజేరినది అనివ్యుత్పత్యర్ధము.)
ఎబ్బె
దే.వి.=రోఁతపడుటయందుపయోగిఁపఁబడు మాట.
ఎబ్బెఱ
దే.వి.= పక్షివిశేషము.
ఎబ్బెఱికము
దే.వి.= రోఁత.
ప్రయోగము :
1). సీ. తొండమీఁదినిడుకొని దోషాచరాగ్రణియెత్తుకచనిలంకనేఁడుగాల,
ముంచినయిల్లాలినించుకకొంచకమరలఁదాఁగొనివచ్చి మరులు హెచ్చి,
యెబ్బెఱికములేకయేలుచునున్నాఁడు. ఉ, రా. 6, ఆ.
ఎమిడిక
దే.వి.= కడుపులోఁగలుగు పామువంటి తెల్లని పురుగు, ఎమిడికపాము.
ఎముక
దే.వి.= ఎమ్ముకయొక్కరూపాంతరము.
ఎముకలవఱ్ఱు
దే.విణ. =వ్యాధిచే బక్కటిల్లినవాఁడు(లేక) బక్కటిల్లినది.
ఎమ్ము
దే.వి. =ఎముక,అస్థి.
ఎమ్ముక
దే.వి.-పై-.
ఎమ్మూట
దే.వి, =(ఎమ్ము+ ఊఁట.) మూలగ.
ఎమ్మె
దే.వి.= మనోహరత్వము, విలాసము.
ప్రయోగము :
జాబిల్లియెమ్మె విడంబించునెమ్ముగంబు. చంద్రా. 3, ఆ. 2.
ఒకనాఁడు వేలుపుటోడయఁడెమ్మెననుఁగోరి. అచ్చ. బాల, కాం.
ఎమ్మెకాఁడు
దే.విణ. =విలాసవంతుఁడు.
ఎమ్మెలాండి
దే.వి.= (ఎమ్మెలు +ఆండి) విలాసముగల ఆడుది, విలాసిని.
ఎయిదు
దే.స. క్రి.= వెంబడించు, అనుగమించు, పొందు.
ప్రయోగము :
గీ. ఇట్లుపఱచుటయును నెంతయురయమున,
నమ్మృగంబువెనుకనరిగియరిగి,
యెయిదలేక. భార. ఆర. 4, ఆ-2.
నీదుపూన్కిపారంబెయిదన్. భార. విరా. 2, ఆ.
ఎయ్దు
దే.స.క్రి.= ఎయిదు యొక్క రూపాంతరము. (వెంబడించుటకు-
ప్రయోగము :
సచివులఁజూచియిప్పుడవెసన్ మన మెయ్దకతక్కినన్. భార. విరా. 3, ఆ.
ఎయ్యది
దే.స.= (ఏ +అది.) ఎది.
ప్రయోగము :
చ. ఏమిటికింగడంగియె,
య్యదిదొరఁకొంటిమేలనుచునబ్జజుఁడిద్దఱం జంచలాత్ములన్,
సదృశులలెస్సగూర్చెజతనంబుననంచు. కళా. 8, ఆ.
ఎర
దే.వి.=ఆహారము,బలి,వ్యసనము.
ప్రయోగము :
ఫలముదళమంబునుందొడిమఁబాయుటరాలినవానిఁగొంచునాఁ, కలికెరఁజేసి. భార. ఆను. 5, ఆ-2.
క. అప్పాంచాలో, త్తరునొకనారసమునకును, నెరసేసె. భార. శల్య. 1, ఆ-3,
ఎరనొకడుండుభంబనునహింగని. భార. ఆది. 1, ఆ.
ఎరఁగు
దే.అ.క్రి.= దిగు, నమస్కరించు.
ప్రయోగము :
గీ. అవనికెరఁగిపోయి యతనివ్రేసె. సం. తతోవిరాటః ప్రస్కంద్యరథాదథ సుశర్మణః భార. విరా. 3, ఆ-2.
గీ. ఎట్టిరాజులునుమహీసురోత్తములెదు,
రరుగుదెంచు నప్పుడధిభక్తి,
నెరఁగిప్రియమువలికితెరువిత్తురు. భార. ఆది. 7, ఆ.
ఎరఁగుడు
దే.వి.=నమస్కారము.
ప్రయోగము :
సీ. మ్రొక్కుదండముకేలు మోడ్పెరఁగుడు,
నాఁగఁజెన్నొందునునతి. ఆం. భా. ద్వి. బ్ర.
ఎరగలి
దే.వి. =మ్రాను, ఒకటితో నొకటి ఒరసికొనఁగా పుట్టి అడవినిదహించెడి అగ్ని,కార్చిచ్చు, దావము.
ఎరగొను
దే.అ.క్రి.= (ఎర +కొను.) పరవశమగు, స.క్రి. మ్రింగు.
ప్రయోగము :
వ. మృణాళంబులాహారం బులుగమెసంగి యెరగొని సుఖించురాజహంసంబులుంగల పులినస్థలంబులవలనను. మై. 2,
స. క్రి. మ్రింగ. క. ఉగరము నెరగొనుగరుడుని,
వెరపుననపుడతఁడుగగన వీధికి దాఁటెన్. ఉ, హరి. 5, ఆ.
ఎరవలి
దే.వి.= ఎరగలి యొక్కరూపాంతరము.
ఎరవు
దే.వి. =ఒకటిరెండుదినములు వైడుకొనుటకై యడిగి తెచ్చుకొనెడి సొమ్ము, యాచితకము, భేదము, అన్యము.
ప్రయోగము :
క. లోభమ్ముననునొండ్లసొమ్ములు, రమ్మననుపచ్చునే యెరవుసతమగునే. భార. ఆర. , ఆ.
క. గురుభీష్మాదులమనములు, దురమునకుంజొరక యుండదుర్యోధనుఁడా,
తురుఁడైయొడఁబఱపఁగని,
ప్పరుసుననెరవైనఱిచ్చవడుబలమెల్లన్. సం. భీష్మద్రోణకృపాదీనాం భేదంసంజనయిష్యతి. భార. ఉద్యో. 1, ఆ- విణ.
3). చ. ఎరవుగఁజూడసాగెహరిణే క్షణపిన్నటనాటనుండియున్,
బరిచితిఁబూనిమంజుగతి మాధురియున్ మృదువాగ్విభూతియున్,
వరుసనెతెల్పి తల్లికడవారును దండ్రిభజించునారునై,
గరిమముఁగన్నసద్ద్విజశిఖామణులన్ వసులుబ్ధచిత్తయై. వసు. 3, ఆ.
ఎరియు
దే.అ. క్రి.= కాలు,మండు.
ప్రయోగము :
క. గురుకర్ణుల యస్త్రాగ్నుల,
నెరిసినయది. భార. శల్య. 2, ఆ-2.
క. సుకుమారుఁడతఁడుగోపా,
లకవృత్తి వహించియడవులం గ్రుమ్మరుచు,
న్కికినాకకాదుపగవా,
రికినైననునకటమనమెరియదేవగలన్.
సం. దూయామి భరతశ్రేష్ఠదృష్ట్వాతే భ్రాతరంప్రియమ్. భార. విరా. 2, ఆ.
ఎరువంటి
దే.వి. =పంజెచెట్టు.
ఎరువాటు
దే.వి. =(ఎరువు +వాటు.) ఎరువువైచుట.
ప్రయోగము :
1). సీ. సిరముకప్రపుదుమ్ముమరువంపుఁబాదులకెరువాటు వైచిన యింపుసొంపు. రా, వి. 3, ఆ.
ఎరువు
దే.వి.= బైరుకైపెక్కునాళ్లు చేర్చి పెట్టినపేఁడ.పాంశువు. (ఎండచే పరితపించునదియని యర్ధము.)
ఎర్కు
దే.వి. =ఎఱుకుయొక్క రూపాంతరము, ఎఱ్ఱనైనది.
ప్రయోగము :
1). ఎరువుటెఱలకు. ఆము. 2, ఆ.
నెత్తుటఁదోంగినేల యెఱనింగి తెఱంగుననుండె. భార. ద్రో. 2, ఆ.
ఎఱఁగు
దే.అ.క్రి.= దిగు, నమస్కరించు.
ప్రయోగము :
1). క. ఎఱఁగినయప్పెను వ్రేగున, ఎఱ్ఱనైనది విఱుగుటయును. భార. ఆను. 1, ఆ-2.
సీ. తండ్రికిరేపుమ్రొక్కియాచార్య విప్రులకువరుస,
మఱిమ్రొక్కునదివీరికెఱఁగుటతక్కదే వార్చనంబునకుమున్నన్యుకడకుఁ,
జనఁగాదు. భార. ఆను. 4, ఆ.
ఎఱక
దే.వి.= ఱెక్క, పక్షము, భుజము.
ప్రయోగము :
క. ఎఱకలుగల కుల శైలము,
తెఱఁగుమెఱయ. భార. ఆర. 6
ద్వి. చంద్రహాసంబెత్తిజానకి వ్రేయు,
నింద్రారిగమకింపనెఱకలువట్టి. రా. సుం, కాం.
ఎఱగందు
ద్వ.వి.= (ఎఱ+ కందు)లేంతబిడ్డ ,శిశువపు.
ఎఱగన్ను
ద్వ.వి.= (ఎఱ+ కన్ను,)శివునియొక్కఅగ్ని నేత్రము.
ఎఱగొను
ద్వ. అ.క్రి. =(ఎఱ+ కొను.) కోపగించు.
ప్రయోగము :
ద్వి. ఎఱిఁగియువిషమిట్టులేల క్రోలెదవు,
ఎఱగొన్న పెనుఁబాము నేలత్రొక్కెదవు. రా. ఆర, కాం.
ఏపఱియుండుటేయెఱగొంటగాఁగయు, కాం.
(చూ. ఎఱ్ఱనాఱు)
ఎఱచి
దే.వి.= పొల,మాంసము.
ప్రయోగము :
క. ఉఱవగునారుగ పంటలు, దొఱియలపాఁడియును దఱచగున్ ఋరుషులకున్,
దెఱవలుచుట్టుములయ్యెద,
రెఱచియ భుజియింతురర్థి నెల్లజనంబుల్. భార. ఆ. 4, ఆ.
ఎఱచిదిండి
దే.వి.= (ఎఱచి +తిండి.) అసురుడు.
ప్రయోగము :
సీ. బలిమిమైపోవుఁడుపట్టుఁడు కొట్టుఁడంచేడ్తెఱఁదొడరి యయ్యెఱచిదిండ్లు. అచ్చ. యు, కాం.
ఎఱచిపిడుక
దే.వి.= చోరపుష్పి.
ఎఱబఱికము
దే.వ.= రోఁత.
ప్రయోగము :
చ. అఱమరయేలనే నిలుచు నాశ్రమదేశమునీదెకాదెనీ,
కెఱబఱికంబులేక యిఁక నిచ్చుటనున్న తపస్వికాంతలం,
దఱునుచితోప చారము లొనర్పఁగలారు వివేకశాలినుల్,
మఱతురెతెల్వి దైవగతి మాన్పఁగ నెవ్వరికైనశక్యమే. ఉ, రా. 6, ఆ.
ఎఱుంగు
- దే.స.క్రి.= తెలియు.
ఎఱుక
దే.వి.= తెలివి ,పరిచయము, గుఱుతు, జోస్యము.
ప్రయోగము :
క. చదివినయెఱుకలకు సరియె చదువనియెఱుకల్. లక్ష్మీ. 4, ఆ,
ఎఱుకపెఱికెఁడుధనము. కు. 1, ఆ.
3). గీ. భూతిడాఁచిపసుపుఁబూసి త్రిశూలహ,
స్తంబుడాఁచిచేత సజ్జయమర,
వెలఁదిమేనఁగల్గువీజరుండువెలఁదియై,
యెఱుయెఱుకయనుచునేగుదెంచె. వీర. 2, ఆ.
సీ. ఇటునేలజేజేఱుకైనచెంగావి సుదసంజదగుకొండఁజూచినాఁడ. కా. 5, అ. గీ. రాజునకుఁగీడుపుట్టెడు రాజ్యమడఁగు,
ననుచునెఱుకచెప్పెడుజ్యోతిషాధములను,
గుడుపు కొఱకువిప్రాకృతిఁగొన్న శూద్రుఁ,
బణసహస్రదండము గొనఁబాడిగలదు. విజ్ఞా. ప్రా, కాం.
ఎఱుకచేయు
ద్వ.స.క్రి. =తెలియజేయు, తెలుపు.
ప్రయోగము :
1). లోనికెఱుకచేసి. భార. శాం. 6, ఆ.
ఎఱుకత
దే.వి.= (ఎఱుక+ త.) సోదె చెప్పునది, దైవఙ్ఞ.
ప్రయోగము :
క. కడకంటఁగరుణవొణమఁగఁ,
బడఁతులుతన్నెంద ఱేనిపరివేష్టింపన్,
మృడుసతియా యెఱుకతతో,
నడిగినకృత్యంబుఁజె ప్పనగుమతిగలవే. వీర. 2, ఆ.
ఎఱుకపడు
ద్వ.అ. క్రి. =విదితమగు.
ప్రయోగము :
క. కడువలు కయుఁగూర్మియునే,
ర్పడనెఱిఁగించునదివానిఫల కాలమునన్,
బిడుగునుగాడ్పునుజనులకుఁ,
బడుటయువీచుటయు నెఱుకపడియెడు భంగిన్. భార. ఆది. 9, ఆ.
ఎఱుకసాని
దే.వి.= ఎఱుకత.
ప్రయోగము :
చ. అనపుడు నెందఱేని కమలాక్షులువేమపాఱివీధికిన్,
జనిగిరిజాతయోయెఱుక సానినినుంబిలువంగఁబంచె. వీర. 2, ఆ.
ఎఱుకు
దే.వి.= కిరాతుఁడు, వ్యాధుఁడు, (ఎఱుకు అనగా వ్యతిరేక లక్షణచే ఎఱుంగనివాడు, మూఢుడు అని వ్యుత్పత్యర్ధము.)
ప్రయోగము :
క. ఎఱుకనియెఱుఁగక మిమ్మున్,
మఱకువమార్కోన్న తప్పుమఱవుఁడు. భార. ఆర. 1, ఆ.
చ. ఎఱుకుకులంబునందు జనియించి యుధర్మువులెల్లనిమ్ముగా, నెఱిఁగెదు. భార. ఆర. 5, ఆ.
గీ. సాళువంబులు డేగలు జాగిలములు,
వలలు జిగురులు నురులుబోనులువహించి,
బోయదొరలును నెఱుకులు బోడికలును,
నడచిరిరువంకవేఁట సన్నాహ మమర. భల్లా. 3, ఆ.
ఎఱుకువ
దే.వి. =ఎఱుక, తెలివి,ఙ్ఞానము.
ఎఱ్ఱగొల్ల
దే.వి.= ఒకానొకజాతి, బ. ఆజాతివారు.
ఎఱ్ఱనివేలుపు
ద్వ.వి.= జ్వలనుఁడు అగ్ని.
ఎఱ్ఱపోతమ్మ
ద్వ.వి.= (ఎఱ్ఱపోతు +అమ్మ.) ఒకానొకగ్రామదేవత.
ఎఱ్ఱవాఱు
ద్వ.అ.క్రి.= (ఎఱ+ పారు.) ఎఱ్ఱనగు, కోపగిల్లు.
ప్రయోగము :
గీ. మొగముఁగన్నులునెఱ్ఱ,
వాఱెమిగులశౌక పైకములకు. ఆము. 5, ఆ.
గీ. కుటిలమగునీ కటాక్షంబుకువలయాక్షి,
యించుకించుకనామీఁద నెఱ్ఱవాఱి,
నిగిడిమరలిన భావంబు నిజముదెలిసె,
శ్రవణ కూపనిపాతైకశంకఁజూవె. నై. 8, ఆ.
ఎల
దే.విణ.= యౌవనముగలది, స్వల్పము.
ప్రయోగము :
క. ఎలప్రాయమిచ్చితినినీ,
కలఘుమతీయిచ్చెదనుమదాత్మజనుల్లం,
బలరఁగఁబెండిలికమ్మని,
పలికిమఱియునాతపస్విపతి యిట్లనియెన్.
(దీని వెంబడిని) క. సజ్జననుతనీ,
వనుమానముదక్కుముయౌ,
వనమును గైకొనుము కన్యవరియింపుతగన్. భార. ఆశ్వ. 3, ఆ.
గీ. ఎమ్మెకాఁడయగ్గియెలగాఁగఁబెడిలి, యైనచెలినిడించి యకటయొంటి, నేగఁదగునె. అచ్చ. ఆ, కాం. క్రీ. విణ. స్వల్పముగా. ఎలనగుచున్. ఎలచూచున్.
ఎలగోలు
దే.వి.= కలకలము, ముందునడచుట, మొడటిప్రసరణము, మొదట పటపటమనువచ్చువాన, ముందునడచునది, మొదటిది.
ప్రయోగము :
చ. కులగిరిరాజనందనుఁడు గూరిమినాభువనాభినందితన్,
దలఁపఁదలంపులోపలన్ దర్పకకేత నవల్గవంబులం,
చలయెలగోలునంబుజవిశాలశిలీ ముఖతాండవంబులు,
త్పలదళమండలాగ్రములు పైకొనునెట్టి వొతత్ప్రభావముల్. వసు. 2, ఆ.3
గీ. దవులజర్గనితూఱనంతకమునుపటి,
జల్లునీరుని వచ్చునజ్జల్లుమొదలి,
గాలియెలగోలుచేఁ గొమ్మకదలి జల్లు,
తలపడకమున్నె వంగుళ్లఁదడిపఁదరులు. ఆము. 4, ఆ.
సీ. పుష్కలావర్త కాంభోధరవ్రాతంబులెలగోలువర్షించు నెన్నఁడేని. కాశీ. 2, ఆ. విణ.
అమ్మరునెలగోలు పౌఁజులు. పా. 3, ఆ.
వ. ఒండొరువులమఱు పెట్టి చూచు నెలగోలు చూపులనితరేతర ధైర్యంబులు గంటివడ. పా. 2, ఆ.
ఎలదోఁట
దే.వి.= ఆరామము.
ప్రయోగము :
వ. అంతనమ్మహా మునీంద్రునియాజ్ఞానుసారంబునఁ దద్విమానంబుకల భాషిణఇవిహరించుచున్న యెలదోఁటలోనికిడిగియె.
ఉ. వసంతోరువిలాసభాసురపురో పవనంబునకేగియచ్చటన్. కళా. 1, ఆ.
ఎలనాంగ
దే.వి. =యౌవనముగల ఆఁడుది, ఆఁడుది.
ఎలనీరు
ద్వ.వి.= లేఁతటెకాయలో తియ్యనినీరు.
ప్రయోగము :
ద్వి. ఎలనీటితోఁబ్రవహించెనందొకటి. రా. అ, కాం.
ఎలమి
దే.వి. =వికాసము, సంతోషము.
ప్రయోగము :
సీ. ముదముననెలమి సొంపొదవినెమ్మోముపైఁదోఁపఁగ వచ్చినఁద్రోచి త్రోచి. భార. విరా. 3, ఆ.
పేరెలమిఁబొల్పుంజెందె నంభోజముల్. భార. ఉద్యో. 2, ఆ-2.
ఎలయు
దే. అ.క్రి.= చేరు, ప్రవేశించు, కలుగు, ఆసక్తిపడు.
ప్రయోగము :
సీ. ఏనుఁగుమదమున కెలయు తేఁటుల మొత్తముల నీలి గొడుగులు చెలువు మిగుల. భార. భీష్మ. 1, ఆ.
సీ. వినుతొల్లిధర్మ వర్తనములసహ్యంబులైన దానవులు మహాగ్రహమున, నరులయందెలసిన. భార. శాం. 5, ఆ.
అద్భుతంబెలయఁగఁబుష్పవృష్టి గురుయించిరి. భార. ఆర. 7, ఆ.
ఇంద్రియా ర్థములకునెలసిన పురుషుండు. ఆర. 5, ఆ.
క. కడుమే, లెలసిపరమసుఖము పొందుమిచ్ఛావృత్తిన్. భార. శాం. 4, ఆ.
ఎలరారు
దే.అ.క్రి.= (ఎలరు +ఆరు.) అతిశయించు.
ఎలరు
దే.వ.= అతిశయము వికసనము.
ఎలరుచు
దే.అ.క్రి.= అతిశయించు, వికసించు సంతోషించు.
ప్రయోగము :
1). గీ. బలున కప్పటికంటెనుబలమెలర్చె. హరి. ఉ. 8, ఆ.
వేగుజామిప్పలెలర్చుగాడ్పులకు. ఆము. 5, ఆ-3.
గురుఁడును గృపుఁడునులోనగు,
గురులనుమోదింపబాహ్లికుండు మొదలుగాఁ,
గురుజాతియెలర్పఁగన,
న్నరపతిభీష్మాభిషేచనంబొనరించెన్. భార. ఉద్యో. 4, ఆ.
ఎలరువు
దే.వి.= సంతోషము.
ప్రయోగము :
వచ్చిన సంభ్రమంబుగరువంపు టెలర్పునునుల్లసిల్ల. భార. శాం. 6, ఆ.
ఎలుఁగించు
దే.అ.క్రి.= కూయు. (లక్షణప్రకారము ఎలింగించు అనియుండవలసియున్నను ప్పతులయెదంతటపాఠమిట్లే యున్నది, కావున ఆలక్షణ మిక్కడ ప్రవర్తంపదన యొరుంగవలెను.)
ప్రయోగము :
1). సీ. ఇనుఁడున్న దెసనుండి యెలుఁగింపఁ దొడఁగెఁబక్షులు మృగంబులు నతిఘోరరుతుల. భార. ఆర. 6, ఆ.
ఎలుఁగు
దే.వ.= కంఠస్వరము, ఎలుఁగుగొడ్డు.
ఎలుఁగుగొడ్డు
దే.వి.=ఎలుంగు ,భల్లూకము.
ఎలుఁగుబంటి
దే.వి.= ఎలుంగు ,భల్లూకము.
ఎలుక
దే.వ. =మూషకము.(దీనిభేదములు –కల్లెలుక, చిట్టెలుక, చుంచెలుక,)
ఎలుకచెవి
ద్వ.వి.= మూషికపర్ణి.
ఎలుకజీడి
ద్వ.వి.= మూషికపర్ణి..
ఎలుకమొక్క
దే.వి.= ఎలుంగుయొక్కరూపాంతరము.
ఎలుకమొక్క
దే.వి.= ఒకానొకచెట్టు.
ఎల్ల
దే.వి.= పొలిమేర, ద్ర, సమస్తము.
ఎల్లమ్మ
ద్వ.వి. =(ఎల్ల+అమ్మ.) ఎల్లయందుండెడు నొకగ్రామదేవత.
ఎల్లరు
దే. వి.= (ఎల్ల+వారు) అందఱు,(దీనికేకవచనము ఎల్లవాఁడు.)
ఎల్లవాఁడు
దే.స. =దే.స. ఎవ్వఁడును.
ప్రయోగము :
సీ. వెరవిట్టితెఱఁగని వెంగలితనమని యెల్లవాఁడునుదన యెఱిఁగినట్టి,
తెఱఁగుననిజకార్యదృష్టిఁగొనును. భార. సౌ. 1, ఆ.
ఎల్లాఁపికత్తియ
ద్వ.వి. =దొంగతనముగల స్త్రీ.(రూ. ఎల్లాంపికత్తె.)
ఎల్లాపి
దే.వి.= (ఎల్ల+ఆపి)
ఎల్లి
దే. వి.=గొడుగు, ఏ. ఱేపు.
ఎల్లిదము
దే.వి.= చులుకఁదనము,(చూ. ఏలిదము.) చులుకనిది.
ప్రయోగము :
ఇంతయెల్లిద మెయాతనికిన్ మనయాజ్ఞ. భార. అశ్వ. 1, ఆ.
ఎల్లిదుఁడు
దే.విణ. =చులకనివాఁడు.
ప్రయోగము :
చ. ఎల్లిదులగు వారికేటికిసలీలవిహారమువేడ్క సేయఁగన్. నిర్వ. 8, ఆ.
ఎల్లుండి
దే.వి.=రేపటికి ఆవలిదినము.
ఎళ్లు
దే.వి.బ.=ఎడ్లు యొక్క మారురూపము.
ప్రయోగము :
. సీ. బండ్లు మెట్టింపుపై బరువులెక్కింపుమీఁ దెళ్లనుబూన్పుకావళ్లనునుపు. హరి. పూ. 6, ఆ.
ఎవఁడు
దే.స.= ఏవాఁడు, యొక్కరూపాంతరము.
ఎవత
దే.స. ఏ.= ఎవరిత యొక్కరూపాంతరము.
ఎవతి
దే.స.ఏ. =ఎవరితి యొక్క రూపాంతరము.
ఎవతుక
దే.స.ఏ. =(ఎవత క) ఏస్త్రీ (ఇక్కడ స్వార్ధమునకప్రత్యయము, కప్రత్యయముపరమగు నపుడుఉకారము వచ్చును. ఇట్లు ఇతరస్ధలములయందును తెలియునది.)
ఎవతె
దే.స.ఏ. =ఎవరితె యొక్కరూపాంతరము.
ఎవనీరు
ద్వ.వి.=ఎడనీరుయొక్క రూపాంతరము.
ఎవయు
దే.అ. క్రి.=ఎగయు యొక్క రూపాంతరము.
ఎవరిత
దే.స.ఏ. =(ఎవరి+ త)ఏస్త్రీ(రూ,ఎవర్త.)
ఎవరితి
దే.స. =అ( ఎవరి+ తి) –పై-.(రూ.ఎవర్తి.)
ఎవరితె
దే.స.ఏ.= (ఎవరి+ తె) -పై-.(చూ.ఎవర్తె)
ఎవర్తుక
దే.స. ఏ.= (ఎవర్త +క) -పై-. (చూ. ఎవతుక.)
ఎవుచు
దే.స.క్రి= ఎగుచుయొక్కరూపాంతరము.
ప్రయోగము :
1). మ. వైరిమనుజేంద్రశ్రేణికిన్ గొంగనా,
నవనింబేర్కొని యున్న యట్టివిజయక్ష్మాధీశ్వరున్ గాసిగా,
నెవిచెన్ జోళనమన్మ సిద్ధియని ప్రాయేటన్ బ్రగాఢోద్ధతిన్. నిర్వ. 1, ఆ
.
ఎవ్వఁడు
దే.స. =ఏవాఁడు యొక్కరూపాంతరము. (ఎల్లవాఁడగుటకు)
ప్రయోగము :
క. ఇమ్మహిధనవం తుఁడతఁడ యెవ్వరి కంటెన్. భార. ఆర. 2, ఆ.
ఎవ్వత
దే. స. ఏ.= ఎవ్వరితయొక్కరూపాంతరము.
ఎవ్వతి
దే. స. ఏ.=ఎవ్వరితియొక్కరూపాంతరము.
ఎవ్వతుక
దే. స. ఏ.=(ఎవ్వత క) ఏస్త్రీ(చూ.ఎవతుక)
ఎవ్వతె
దే. స. ఏ.= ఎవ్వరితె యొక్క రూపాంతరము.
ఎవ్వరిత
దే. స. ఏ.= (ఎవ్వరి త) ఏస్త్రీ.( రూ. ఎవ్వర్త.)
ఎవ్వరితి
దే. స. ఏ.= (ఎవ్వరి+ తి) ఏస్త్రీ..(రూ.ఎవ్వర్తి.)
ఎవ్వరితె
దే. స. ఏ.=(ఎవ్వరి +తె)ఏస్త్రీ..(రూ.ఎవ్వర్తె.)
ఎవ్వర్తుక
- దే. స. ఏ.=(ఎవ్వర్త+ క) ఏస్త్రీ.( చూ. ఎవతుక.)
ఎవ్వల
దే. స. ఏ.= ఏవల యొక్క రూపాంతరము.
ఎవ్వాఁడు
దే. స. ఏ.= (ఏ+ వాఁడు)ఏపురుషుఁడు.
ఎస
దే.వి. =ఆధిక్యము, అంత్యము.
ప్రయోగము :
చ. వనరుహపత్రనేత్రయిటు నాగెవదల్చినకోర్కులన్మనో,
జునకెస యిచ్చిడిల్లపడఁ జూచినఁజూచినవారుమెత్తురే. కవిక. 2,
ఆ. క్రి. విణ. మ. అసమానస్థిరదానవైభవకళాహంకార సింహాసనా,
గ్రసమాసీనుఁడు వీఁడొకండుకలుగంగా నర్థియాచ్నారస,
స్వసనాభావబహూభవత్ఫలభర వ్యాజంబునన్ నమ్రమై,
యెససంక్రందనశాఖిడెంద మునయందెక్కించుమందాక్షమున్. నై. 5, ఆ.
ఎసఁగు
దే.అ.క్రి. =తనరు, అతిశయించు, విజృంభించు.
ప్రయోగము :
మనసు క్రొవ్వు ఖండింపఁగామోదమెసఁగు. భార. ఆర. 7, ఆ.
క. అప్పలు కులకలు కలుమది,
నుప్పరమెగయంగనెసఁగెనుల్లా సముమై.
నొప్పారంగబరిగోలల,
నొప్పించినభద్రగజము నూల్కొన్న గతిన్. ఉ, హరి. 5, ఆ.
ఎసకము
దే.వి. =అతిశయము, విజృంభణము, విధము.
ప్రయోగము :
1). క. ఆపల్లెలోననెప్పుడు,
గోపతరుణఉలెల్లఁదనదుకోర్కిసలుపులీ,
లాపాత్ర ములుగఁజేయుట,
కేపారఁగనుత్సహించి యెసకపు వేడ్కన్. హరి. పూ, 7, ఆ.
గీ. అంతఁదెలిసిరాముఁడతికుపితాత్ముఁడై,
యేఱు పాఱు తెంచునెసకమెసఁగ,
నప్రమేయశరములడరింప నతిసత్వ,
రమున నేను బ్రతిహతములుచేసి. భార. ఉద్యో. 4, ఆ.
వెండికొండపైఁగంధర ఖండమున్న యెసకంబున. కాశీ. 6, ఆ.
ఎసకొను
దే.అ.క్రి. =పురికొను. (ప్రే. ఎసకొలుపు, ) దీనికి ప్రేరణమునందే ప్రయోగములు కనఁబడుచున్నవి.)
ప్రయోగము :
తనవారణేంద్రమక్కురుకులవీరుమీఁద నెసకొల్పిన. భార. ఆర. 6, ఆ.
ఎసటిపోఁతలు
దే.వ. బ.=(ఎసరు +పోఁతలు.)ఎసటవేయఁదగినబియ్యము.
ప్రయోగము :
సీ. ఇనుమాఱుదంచినయెసటి పోఁతలటంచునౌనట్లయుడికెదుగానియంచు. కళా. 6, ఆ.
ఎసపు
దే.అ.క్రి. =ఎసఁగు యొక్కరూపాంతరము.
ప్రయోగము :
వ.ఆర్పులనదల్పులఁబొగడుటలందెగడుటల నెసపునులివుతూర్యరవంబులంగెలువ. భార. కర్ణ. 2, ఆ.
ఎసరు
దే.అ.క్రి.= మీఱు. (చూ. రూ. ఏసరు.)వంటకై కాఁగబెట్టిననీరు.
ప్రయోగము :
క. ఇసుమంతకానిలేఁడీ,
పసిబాలుఁడు కుడువఁగూటిప్రాయమువాఁడి,
ట్లెసరి బహుభక్షశ్ర్యరాసులు,
మెసవెడువిసువఁడు ప్రతుష్టిమే కొనఁడుగదే, పాండు. 4, ఆ.
ఎసరేఁగు
దే.అ.క్రి. =విజృంభించు.
ప్రయోగము :
1). గీ. ఎడపకెసరేఁగి నుతియించెదిచట నతని. హరిశ్చ. 1, ఆ.
ఎసలారు
దే.అ.క్రి.= (ఎసలు+ ఆరు.) అతిశయించు.
ప్రయోగము :
1). సీ. అనిక్రమంబున వారలందఱవిండులు పెంపెసలారవేర్వేఱఁబొగడి. భార. విరా. 1, ఆ.
ఎసలిక
దే.వి.= తీఱిక,అవకాశము.
ఎసలు
దే.వి. =దొమ్మియుద్ధము.(ఇట్లు ఒకఁడువ్రాసియున్నాఁడు.)
ఎసవెట్టు
దే.స. క్రి.= (ఎస +పెట్టు) పురికొలుపు ,ప్రేరేపించు.
ప్రయోగము :
. లయగ్రాహి. కయ్యాలకెసవెట్టుచునుహాళిఁజలపట్టుచు సుమాళములఁగిట్టుచునుబాలికలువేడ్కన్. కళా. 6, ఆ.
ఏక్కసెక్కియము
దే. వి.= (చూ. ఎకసెక్కెము, ఎకసెక్కము.)