అచ్చులు : ఏ




సం., నా. వా., తత్స., = ఒక అక్షరము.
నానార్థాలు :
ప్రశ్నమునుదెలిపెడిది, ఏతలఁపు, మెచ్చుకొనుటను దెలిపిడిది, వ్యతిరేకమును దెలిపెడిది, ఎక్కువను దెలుపుటకు, దుఃఖమును దెలిపెడిది, విచారమునుదెలిపెడిది, ప్రార్థించుటను దెలిపెడిది, ఆఁడుదగుటనుదెలిపెడిది, ఉద్దేశమును తెలిపెడిది, మఱియొక దానిలేమినిదెలిపెడిది, చూపుటను దెలిపెడిది, తనంతట అనునర్థమును దెలిపెడిది.


ఏఁబలము
మి. వి. = అయిదుపలములు.
ప్రయోగము :
సీ. పంచపలీ సంజ్ఞపరఁగునేబలమున. ఆం.భా.ద్వి.వై.(ఇప్పటి వాడుకలో పది పలములు)


ఏండ్లూపూండ్లూ
వి. బహు. = అనేకసంవత్సరాలనే అర్థంలో వాడే పదబంధం.

ఏకకాలము
సం, విణ., అ., పుం., తత్స., = ఒకే కాలము.

ఏకకాలికము
విణ. = ఒకే కాలము, ఒకే సమయంలో జరిగే.

ఏకకుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స.,= అసహాయుడు, తదేక నిష్టకలవాడు.
పర్యాయపదాలు :
ఒంటరివాడు, కార్యమును తానే చేయువాడు, ఏకాకి, సజాతీయ సహాయము లేనివాడు.

ప్రకృతి - వికృతి :
ఎక్కటి.


ఏకకుండలుఁడు
సం., వి., ఆ., పుం., తత్స.,= బలరాముడు, కుబేరుడు, ఆదిశేషుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఒక కుండలము ఎవరికైతే ఉన్నదో అతడు ఏకకుండలుడు.


ఏకకుష్ఠము
సం., వి., అ., న., తత్స., = కుష్ఠభేదము, సుశ్రుతునిచేత చెప్పబడినది.

ఏకగుడు
సం., వి., అ., పుం., తత్స., = తదేక నిష్టకలవాడు.

ఏకగురువు
సం., వి., ఉ., పుం., తత్స., = సతీర్ధుడు, సహపాఠి, సతీర్థ్యుఁడు.

ఏకగ్రంథము
సం., వి., అ., పుం., తత్స., = 32 అక్షరములు.

ఏకగ్రామము
సం., వి., అ., పుం., తత్స., = అభిన్నగ్రామము, సమానగ్రామవాసి.

ఏకచక్రము
సం., విణ., అ., న., తత్స., = సూర్యరథము, సూర్యగృహమందు, పురభేదమందు, భారత ప్రసిద్ధమగు ఒకానొక గుర్రము, భరత ప్రసిద్ధమగు ఒకానొక పురము, ఒక చక్రముగలది.

ఏకచత్వారింశత్తమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= నలుబది ఒకటవది (41)

ఏకచత్వారింశము
సం., వి., త్., స్త్రీ., తత్స., = నలుబది ఒకటి (41).

ఏకచరణుడు
సం., విణ., అ., పుం., తత్స., = ఏకపాదయుక్తుడు, మనుష్యభేదమునందు.

ఏకచరము
సం., వి., అ., పుం., తత్స., = అడవిపంది, ఒంటిగాఁడు. ; విణ. ఏకాంతమైనది. ; ఏకాకి, అసహాయము, ఖడ్గమృగము, ఒక్కచారుడు కలది, ఒంటరిగాతిరుగునది, ఒంటరిగాఁడు.

ఏకచర్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= అసహాయగమనము.

ఏకచారిణి
వి. = పతివ్రత.

ఏకచ్ఛత్రాధిపత్యము
వి. = ఎదురులేని అధికారము.

ఏకజన్ముడు
సం., విణ., న్., పుం., తత్స.,= రాజు, శూద్రుడు, ముఖ్యమైన జన్మముకలవాడు, ఉపనయన రూపజన్మములేనివాడు.

ఏకజాతి
సం., విణ., ఇ., పుం., స్త్రీ., తత్స., = శూద్రుడు, కీట భేదము, స్త్రీ, ఒక జాతి.

ఏకజాతీయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒకజాతిలోనిది.

ఏకటపడు
అ. క్రి. = మొగంవాచు, ఆవురావురుమను.

ఏకత
సం., వి., అ., పుం., తత్స.,= ఏకాగ్రత, ఒక ఋషి, బ్రహ్మమానసపుత్రునియందు, ఏకాగ్రచిత్రుడు, తదేక నిష్ఠకలవాడు, ఒకే మనస్సుకలవాడు.

ఏకతమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చాలా ఇళ్లల్లో ఒకటి, పెక్కింటిలో ఒకటి/ చాలామందిలో ఒకరు.

ఏకతరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = రెండింటిలో ఒకటి.

ఏకతవేళ
వి.= ఏకాంతసమయము.

ఏకతానుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఏకాగ్రుఁడు, తదేక నిష్ఠకలవాడు, ఒకేమనస్సుకలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏకస్మిన్ విషయే తానో బుద్ధివిస్తారోయస్యేత్యేకతానః. ఒక పదార్థమందే బుద్ధివిస్తారము కలవాడు. 2.ఏకం భావరసం తనోతీతి ఏకతానః. ఒక పనిపైనే మనస్సును లగ్నం చేయడము ఏకాగ్రత.

పర్యాయపదాలు :
అనన్యవృత్తి, ఏకతాలుడు, ఏకాయనుడు, ఏకసర్గుడు, ఐకాగ్రుడు, ఒకట మనసుచెల్లినవాఁడు, ఏకాయనగతుడు.


ఏకతాళము
సం., వి., అ., పుం., తత్స.,= తాళ భేదము(4 అక్షరముల కాలము), లయతోడికూడిక, గీత వాద్య లయసామ్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకః సమః తాలః కాలక్రియా మానం యస్య స ఏకతాలః. సమానమైన కాలక్రియామానములు కలది, నృత్యగీతవాద్యములు సరిగా ముగించుట యెందు లెస్సగా గూడియుండునో అది ఏకతాలము అనబడును.


ఏకతీర్థుడు
సం., వి., న్., పుం., తత్స.,= సతీర్ధుడు, ఏకతీర్థుడు.

ఏకతోదతము
సం., విణ.,(త్. ఈ. త్)., తత్స.,= ఆవులు మొదలైన వాటి యందు, ఒకే వైపు దంతపంక్తి గల పశువులభేదము.

ఏకత్రపరుచు
స. క్రి. = ఒకచోటికి చేర్చు, ఒకటిగా చేయు, ఏకం చేయు.

ఏకత్రింశత్తమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ముప్పది ఒకటవది.

ఏకత్రింశత్తు
సం.,అవ్య.,తత్స.,= ముప్పది ఒక్కటి

ఏకదండి
సం., వి., న్., పుం., తత్స., = హింసుడు, ఏకదండముదాల్చు సన్యాసి.

ఏకదంతుఁడు
సం., వి., అ., పుం., తత్స., = గణేశుడు, విఘ్నేశ్వరుడు.
వ్యుత్పత్త్యర్థము :
కార్తికేయోత్పాటితైకదంతత్వాదేకోదంతో యస్య సః ఏకదంతః. కుమారస్వామిచే ఒక దంతము పెఱికి వేయపడినది కనుక ఏకదంతుడు. ఎవరికైతే ఒక దంతము ఉన్నదో అతను.

పర్యాయపదాలు :
విఘ్నరాజు, వినాయకుడు, ఒంటికొమ్ము వేలుపు, ద్వైమాతురుడు, గణాధిపుడు, ఏకదంతుడు, హేరంబుడు, లంబోదరుడు, గజాననుడు.


ఏకదంష్ట్రుడు
సం., వి., అ., పుం., తత్స., = గణేశుడు, బ్రహ్మజ్ఞాని, ఒక కన్నుకలవాడు, కానుడు, కాకి, శుక్రాచార్యుడు, శివుడు, తత్త్వవేత్త.

ఏకదా
సం., అవ్య., తత్స., = ఒకానొకప్పుడు, యుగపదమున, ఒక్కకాలమందు.

ఏకదృక్కు
సం., నా. వా.,అ., పుం., తత్స= కాకి, శివుడు, మహాదేవుడు, బ్రహ్మజ్ఞాని, తత్వవేత్త, ఏకపక్షాశ్రయుడు, ఏకాక్షి. (స్త్రీ.,ఏకదృశీ. న., ఏకదృశము. )

ఏకదృష్టి
సం., వి., ఇ., పుం., తత్స.,= కాకి, ఏకదృక్కు, ఒక చూపు కలది, ఒక కన్నుకలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకం సర్వమభిన్నం పశ్యతియః ఏకైవ దృష్టిరస్య ఏకదృష్టిః , అంతా ఒక్కటిగా చూసేవాడు.

పర్యాయపదాలు :
కరటము, అరిష్టము, బలిపుష్టము, సకృత్ప్రజ, ధ్వాంక్షము, ఆత్మఘోషము, పరభృతము, బలిభుక్కు, వాయసము, చిరంజీవి, మౌకళి, పికవర్ధనము.

నానార్థాలు :
బ్రహ్మజ్ఞాని, కానుడు, శుక్రాచార్యుడు, శివుడు, తత్త్వవేత్త.


ఏకదేవత
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = ఒకే దేవత,అగ్నిహోత్రుడు.

ఏకదేవుడు
సం., విణ., అ., పుం., తత్స., = పరమేశ్వరుడు, ముఖ్యదేవుడు.

ఏకదేశము
సం., వి., అ., పుం., తత్స.,= ఒకే దేశము, అంశము, భాగము, అవయవము, ఒకచోటు, ఏక భాగము.

ఏకదేశి
సం., విణ.,(న్. ఈ. న్).,తత్స., = అవయని, అంశములు కలది, ఏకదేశస్థుడు.

ఏకదేశీయుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఏకదేశస్థుడు, అవయవి, అంశములు కలది, సమాన దేశముకలవాడు.

ఏకదేహుడు
సం., వి., అ., పుం., తత్స., = ఒకే దేహము నందు మొదలుగునవి.
వ్యుత్పత్త్యర్థము :
సమానదేహము కలవాడు.


ఏకధని
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = ఏకధనుడు, ఏకధనము కలది, ఏకధనము.

ఏకధనుడు
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = ముఖ్య ధనము కలవాడు, అవిభక్త ధనము కలవాడు, పంచుకొననివాడు (సోదరాది), ఏకమాత్రధనము కలవాడు.

ఏకధర్ముడు
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = సమానమతము కలవాడు, ఏకధర్ముడు, సమానధర్మము కలవాడు.

ఏకధాటిగా
క్రి. విణ. = అవిచ్ఛిన్నంగా, ఎడతెరపి లేకుండా, నిరంతరంగా.

ఏకధారగా
అవ్య. = ఎడతెరిపి లేకుండా.

ఏకధురము
సం., వి., అ., పుం., తత్స.,= నాగటినైనను బండినైనను మఱి దేనినైనను ఒక్కటిని లాగెడి ఎద్దులోనగునది, ఏకధురావహము, ఏకధురీణము, ఒకే బరువుమోయునది(ఎద్దు), బండినిలాగునది.
వ్యుత్పత్త్యర్థము :
ఏకధురాం వహతీతి ఏకధురీణః. ఒక భారమునే వహించునది.


ఏకధురావహము
సం., వి., అ., పుం., తత్స., = నాగటినైనను బండినైనను మఱి దేనినైనను ఒక్కటిని లాగెడి ఎద్దులోనగునది, ఏకధురము, ఏకధురీణము, ఒకే బరువుమోయునది.
వ్యుత్పత్త్యర్థము :
ఏకధురాం వహతీతి ఏకధురావహః. ఒక భారమునే వహించునది.


ఏకధురీణము
సం., వి., అ., పుం., తత్స.,= నాగటినైనను బండినైనను మఱి దేనినైనను ఒక్కటిని లాగెడి ఎద్దులోనగునది, ఏకధురావహము, ఏకధురము, ఒకే బరువుమోయునది.
వ్యుత్పత్త్యర్థము :
ఏకధురాం వహతీతి ఏకధురీణః. ఒక భారమునే వహించునది.


ఏకనక్షత్రము
సం., వి., అ., న., తత్స., = ఒక నక్షత్రము.

ఏకనటుడు
సం., వి., అ., పుం., తత్స., = నాట్యములో ముఖ్యనటుడు.

ఏకనవతము(సంఖ్యేయము)
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తొంబది ఒకటవది (91)

ఏకనవతి(సంఖ్యా)
సం., నా.వా.,=తొంబదిఒకట (91)

ఏకనవతితమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తొంబది యొకటవది.

ఏకపంచాశత్తు
సం., విణ., త్., స్త్రీ., తత్స., = (ఏకపంచాశము) ఏబదియొకటి.

ఏకపక్షతము
సం., నా. వా., ఇ., పుం., తత్స., = పాడ్యమి.

ఏకపక్షము
సం., వి., అ., పుం., తత్స.,= సహాయము, ఒకే పక్షము, ఒకపక్షంపై చూపే అభిమానం.

ఏకపటలమాలి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = ఒక మల్లె.

ఏకపత్ని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పతివ్రత, క్రొత్తడి, ఒకడే భర్తగా కలది, సవతితోడు పెండ్లాము, తనభర్తకు తానొకతియే భార్యగా కలది, సవతులు లేనిది.

ఏకపత్నీకుడు
సం., విణ., అ., పుం., తత్స.,= ఒకటే భార్యగా గలవాడు.

ఏకపత్నీవ్రతము
సం., విణ., అ., న., తత్స., = ఒక్కభార్యతోనే ఉండుట అను వ్రతము.

ఏకపత్రిక
సం., విణ., ఆ., స్త్రీ., తత్స., = గంధపత్రాతవృక్షము.

ఏకపదము
సం., విణ., అ., న., తత్స.,= ఒకటే పదము, తత్కాలము.
వ్యుత్పత్త్యర్థము :
పదమాత్ర ఉచ్చారణ కాలములో ఒకే విధంగా ఉండునది.

నానార్థాలు :
తక్షణము, వైకుంఠము, ఒకానొక రతిబంధము, ఒకానొక స్థానము, వైకుంఠము, శ్రేష్ఠమైన కోష్ఠరూప పూజాస్థానము, వాస్తుమండలమందు కోష్ఠరూపస్థానము, వాస్తుయాగమండలమందు ఒక కోష్ఠమునకు పూజనీయుడైన దేవుడు, మృగ భేదము.


ఏకపది
సం., వి., ఈ., స్త్రీ., తత్స.,= మార్గము, త్రోవ, దారి, నిపాతము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏకేకతిపయేపదా లక్ష్యంతే అస్యామితి ఏకపదీ. కొన్ని అడుగులు దీనియందు కానపడును. 2.ఏకః పాదో యస్యామితి ఏకపదీ. దేని యందు ఒకే పాదము ఉన్నదో అది (ఒకే పాదము కల్గినది).

పర్యాయపదాలు :
నడవదగిన త్రోవ, అయనము, వర్త్మ, అధ్వము, పదవి, పంథానము, సృతి, సరణి, పద్ధతి, పద్యా, వర్తని.


ఏకపర్ణ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పార్వతి.

ఏకపర్వతకము
సం., వి., అ., పుం., తత్స., = పర్వతభేదము.

ఏకపాటల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పార్వతి.

ఏకపాత్తు
సం., విణ., (ద్. ఈ. ద్).,తత్స.,= శివుడు, విష్ణువు, ఒక్కపాదము కలది.

ఏకపాద
సం., వి., అ., పుం., తత్స.,= విష్ణువు, శివుడు, అసురుడు.

ఏకపాదిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= కొంగ మొదలగునవి, పక్షులు ఒక్కకాలి మీద నిలిచి ఉండుట.

ఏకపింగళుఁడు
సం., వి., అ., పుం., తత్స., = కుబేరుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకం చక్షుః గౌరీశాపాత్పింగళవర్ణం జాతం యస్య స ఏకపింగః. (పార్వతీదేవి శాపము వలన పచ్చనైన ఒక కన్నుకలవాడు.)


ఏకపింగుడు
సం., నా. వా., అ., పుం., తత్స.,= కుబేరుడు (ఇతని ఎడమకన్ను పార్వతిశాపమున పింగళవర్ణము అయినది), పచ్చనైన ఒక కన్నుకలవాడు.
పర్యాయపదాలు :
త్ర్యంబకసఖుడు, యక్షరాజు, గుహ్యకేశ్వరుడు, మనుష్యధర్ముడు, ధనదుడు, రాజరాజు, ధనాధిపుడు, కిన్నరేశుడు, వైశ్రవణుడు, పౌలస్త్యుడు, నరవాహనుడు, యక్షుడు, ఐడబిలుడు, శ్రీదుడు, పుణ్యజనేశ్వరుడు.


ఏకపిండుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = సపిండుడు.
వ్యుత్పత్త్యర్థము :
శ్రాద్ధమునందు ఈయతగిన పిండము కలవాడు.


ఏకపురుషుడు
సం., వి., అ., పుం., తత్స., = పురుషోత్తముడు, పరమేశ్వరుడు, ఒకే పురుషుడు.

ఏకపుష్కల(ర)ము
సం., విణ., అ., పుం., తత్స., = కాహలవాద్యము.

ఏకపుష్ప
సం., విణ., ఆ., స్త్రీ., తత్స., = ఒకానొకచెట్టు.

ఏకప్రస్థము
సం., నా. వా., అ., పుం., తత్స.,= పర్వతము, ఏక ప్రస్థయుక్తము.

ఏకఫల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఔషధిభేదము.

ఏకఫలి
సం., విణ., ఈ., స్త్రీ., తత్స., = ఓషధీ భేదము.

ఏకభంగీనయము
సం., నా. వా., అ., పుం., తత్స., = న్యాయ భేదము.

ఏకభక్తము
సం., వి., అ., న., తత్స., = పగలు రెండు జాములు దాటిన తర్వాత ఒక్క పూటమాత్రమే తినుట.

ఏకభక్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = నిశ్చలభక్తి, ఏకాంతభక్తి, నితాంతభక్తి, అనన్యభక్తి.

ఏకభార్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఒకే భార్య.

ఏకభావము
సం., వి., అ., పుం., తత్స., = రాగము, ఏకాశము, అభిన్నము, ఏకస్వభావము.

ఏకభుక్తము
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఒక్కపూటమాత్రమే తినుట, పగలు రెండు జాములు దాటిన తర్వాత ఒక్కపూటమాత్రమే తినుట.

ఏకభూమము
సం., వి., అ., పుం., తత్స., = ప్రాసాద భేదము.

ఏకభోగము
సం., వి., అ., పుం., తత్స., = కుటిక, సర్వాధికారాలతో ఇక్కడే అనుభవించే లేదా అధికారం, ఒక పంటకే నీరు లభించే భూమి.

ఏకభోగి
వి. = సర్వాధికారి.

ఏకము
సం., స., విణ., (అ. ఆ. అ)., తత్స., = మొదటిసంఖ్య, ముఖ్యము, ప్రాధాన్యమును పొందునది, ఇతరము, అన్యతరము, అన్యము, ఒక్కటి.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏతి ప్రాధాన్యం గచ్ఛతీత్యేకః. ప్రాధాన్యమును పొందునది. 2.ఏతి కార్యం కర్తుం స్వయమేవ గచ్ఛతీతి ఏకః. కార్యమును తానే చేయునది.

నానార్థాలు :
అసహాయము, కార్యమును తానే చేయునది, చక్కటిది, ఐలవంశీయరాజు, కేవలము, పరమాత్మ, విదువు, క్షితి, గణేశుని దంతము, శుక్రునికన్ను, వేఱుగా బాసిపోవునది, వేఱై ప్రకాశించునది, ప్రకృతార్థముకంటే వేఱైనది, అగ్ని, సూర్యుడు, దేవరాజు, యముడు, పరమేశ్వరుడు, విష్ణువు.


ఏకముఖము
సం., విణ., అ., న., తత్స., = ఒకద్వారముకలది, ఒక్కటే ఉద్దేశము కలది,(మండపము మొదలుగునవి), ఒకముఖమే కలది.


ఏకమూలము
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = అగిసె, సాలపర్ణి ముయ్యాకు పొన్నా (వృ.వి).

ఏకమూలి
సం., నా.వా., న్., పుం.,తత్స= అతసి, అగిసెనూనె, సాలపర్ణి, ముయ్యాకు పొన్న.

ఏకయష్ఠి
సం., విణ., ఇ., స్త్రీ., తత్స., = ఏకావళి, హారవిశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఏకయష్ఠిరివ, ఒకే యష్టివలె, ఏకయష్ఠికా. ఒక్కపేటకల హారము.


ఏకయష్ఠిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = హారభేదము, గోస్తనము, యష్టిభేదము, ఒక్కపేటగల హారము.
పర్యాయపదాలు :
గుచ్ఛము, గుచ్ఛార్థము, అర్ధహారము, మాణవకము, ఏకావళి, ఏకసరము, నక్షత్రమాల(ఇరువది ముత్యాలు కలది).

ఏకయోని
సం., విణ.,(ఇ. ఈ. ఇ).,తత్స., = ఒకే యోని యందు జన్మించినవారు.

ఏకరజము
సం., విణ., అ., పుం., తత్స., = భృంగరాజము, గుంటగలగర (వృ.వి).

ఏకరసము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఏకాభిప్రాయము, ఏకరాగవిశేషము, నాటకము.

ఏకరాజు
సం., నా. వా., అ., పుం., తత్స., = సార్వభౌముడు, పరమేశ్వరుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకో రాజా. శ్రేష్టుడగు ఒకరాజు.


ఏకరాత్రము
సం., విణ., అ.,న., తత్స., = ఒక్కరాత్రి, ఒక్క అహోరాత్రము, ఒక్కరాత్రి అంతయు చేయదగు కర్మము.

ఏకరాత్రికము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒక్కరాత్రి భోజనమునకు చాలినది, ఒక్కదినపు భోజనమునకు చాలినది, ఒక్కరాత్రి చేయునది.

ఏకరాశి
సం., వి., ఇ., పుం., తత్స., = ఒక రాశి, స్తూపము.

ఏకరువుపెట్టు
స. క్రి. = పదే పదే చెప్పు, వల్లెవేయు, కంఠస్థం చేయు.

ఏకరూపత
వి. = సమరూపం, అనురూపం, ఒకేరూపం, ఒకే విధం.

ఏకరూపము
సం., విణ., (అ. ఆ. అ)., పుం., తత్స., = అతి స్థిరమైనది, నిశ్చలము, సమానరూపముగలది.

ఏకరూప్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒకదానినుండియే వచ్చినది.

ఏకలము
సం., వి., అ., పుం., తత్స.,= అడవిపంది, ఒంటరిగా ఉండునది. ; విణ. అసహాయము.
ప్రయోగము :
చేకొనియాకువీటి విభుశ్రీ పెదవేంకటుఁజెందియాత్మలో,
నేకల సద్గుణంబు మహియెన్నదనేకలసద్గుణాప్తిచేఁ,
గైకొని శేషభోగముల కల్మిఁదలంపదశేషభోగలీ,
లాకలనంబు చేతఁగరులన్ గిరులన్ మఱిచెప్ప నేటికిన్.(రాఘ. 1, ఆ.)


ఏకలవ్యుడు
సం., వి., అ., పుం., తత్స., = నిషాదరాజు, హిరణ్యధన్వుని పుత్రుడు.

ఏకలూ
సం., వి., ఊ., పుం., తత్స.,= ఒక ఋషి.
వ్యుత్పత్త్యర్థము :
ఏకం లునాతి


ఏకవక్త్రుడు
సం., వి., అ., పుం., తత్స.,= అసురుడు, ఒకే ముఖ రుద్రాక్ష.
వ్యుత్పత్త్యర్థము :
ఒకే ముఖము కలవాడు.


ఏకవచనప్రయోగము
వి.= నువ్వు, నీవు, అనే ప్రయోగము, అవమానించడం.

ఏకవచనము
సం., విణ., అ., న., తత్స.,= ఒకమాట, ఏకత్వమును తెలుపు ప్రత్యయము.

ఏకవర్ణము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = శ్రేష్ఠము, శ్రేష్ఠజాతి, శబ్దము, మిశ్రిత వర్ణము, ఏకస్వరూపము, తెలుపు మొదలైన రంగులలో ఒకటి, సజాతీయుడు.

ఏకవర్షిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒక సంవత్సరం వయసుగల ఆవు పెయ్యి.

ఏకవస్త్ర
వి. = ఋతుపతి, ముట్టుత.

ఏకవస్త్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఉత్తరీయవస్త్రశూన్యము.

ఏకవాక్యము
సం., వి., అ., న., తత్స., = ఏకగ్రీవం, ఒక వాక్యము, ఒకే అర్థాన్ని ఇచ్చు వాక్యము.

ఏకవాదము
సం., విణ., అ., పుం., తత్స., = డిండిమము, అద్వైత వాదము, ఒకచేతితో వాయించబడునది.

ఏకవారము
సం., విణ., అ., న., తత్స., = ఒక పర్యాయము, ఒకమారు.

ఏకవింశతితమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇరువది యొకటి

ఏకవింశతితము
సం., విణ., త్., స్త్రీ., తత్స., = ఇరువది ఒకటవది.

ఏకవింశము(సంఖ్యా)
సం., నా.వా., అ., పుం., న., తత్స., = ఇరువది యొకటి

ఏకవింశస్తోమము
సం., వి., అ., పుం., తత్స., = సోమ భేదము.

ఏకవిధము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒకేప్రకారము.

ఏకవిలోచనము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = కాకము, ఒక కన్ను, ఒకానొక దేశము.

ఏకవిషయి
సం., విణ., (న్.ఈ.న్.)., తత్స., = ప్రతిస్పర్థి, పోటికాడు, ఒకటే విషయము కలవాడు.

ఏకవీరుడు
సం., వి., అ., పుం., తత్స., = శ్రేష్ఠవీరుడు, మహావీరుడు, అసహాయశూరుడు.
ప్రయోగము :
ఎక్కటీడు.


ఏకవృందము
సం., వి., అ., పుం., తత్స., = కంఠరోగభేదము.

ఏకవృక్షము
సం., వి., అ., పుం., తత్స., = ఒక్కచెట్టు, నాలుగుకోసుల లోపల ఒక్కచెట్టు తప్ప రెండవచెట్టులేని చోటు.

ఏకవృతము
సం., వి., త్., స్త్రీ., తత్స., = స్వర్గలోకమందు.

ఏకశకము(సంఖ్యా)
సం., నా.వా., అ., పుం., తత్స., = ఇరువది ఒకటి (21)

ఏకశతతమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = నూట ఒకటవ (101).

ఏకశతము
సం., వి., అ., న., తత్స., = నూటఒకటి.

ఏకశఫము
సం., వి.,అ., పుం., తత్స., = గాడిద, గుఱ్ఱము మొదలగునవి, రెండుపాయలుగా లేని డెక్కలు కలది.

ఏకశాఖీయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒక్కశాఖకు సంబంధించినది, ఒక్కటే శాఖ యందు పుట్టినది.

ఏకశుంగము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఓషథి భేదమునందు.

ఏకశృంగము
సం., విణ., అ., పుం., తత్స., = ఖడ్గమృగము, ఒంటి కొమ్ముకలది.

ఏకశేషము
సం., వి., అ., పుం., తత్స., = వృత్తిభేదము, ఏకాంతము, రహస్య ప్రదేశము, ఒకటిమిగులుగా కలది.

ఏకశ్రుతి
సం., విణ.,(ఇ. ఈ. ఇ)., తత్స., = ఒక వేదవాక్యము నందు, ఉదాత్త అనుదాత్తస్వరిత భేదముతో ఉచ్చరించు శబ్దభేదము.

ఏకషష్టము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = అరువది ఒకటవది. (61)

ఏకషష్ఠితమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= అరువది ఒకటవది. (61)

ఏకసంతగ్రాహి
వి. = ఒక్కసారి విని గుర్తుంచుకొనే వ్యక్తి.

ఏకసప్తతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = డెబ్భై ఒకటవ.

ఏకసప్తతి( సంఖ్యా)
సం., నా.వా., ఇ., స్త్రీ., తత్స= డెబ్బె ఒకటి

ఏకసభ
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= గోష్ఠి, ఒక సభ.

ఏకసర్గము
సం., విణ., అ., పుం., తత్స., = ఏకాగ్రచిత్తము, ఏకసృష్టి, ఏకాగ్రచిత్తము కలది.

ఏకసర్గుఁడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఏకతానుఁడు, తదేకనిష్ఠకలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకస్మిన్నేవ సర్గో నిశ్చయోయన్యేత్యేక సర్గః. ఒక పదార్ధమందే ఉండు నిశ్చయము కలవాడు.

పర్యాయపదాలు :
అనన్యవృత్తి కలవాడు, ఏకాగ్రుడు, ఏకాయనుడు, ఐకాగ్రుడు, ఏకాయనగతుడు.


ఏకసహస్రతమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= వేయింన్నొకటవది (1001).

ఏకసహస్రము
సం., వి., అ., న., తత్స., = ఒకవేయి, (1001) వెయ్యిని ఒకటి.

ఏకసూత్రము
సం., వి., అ., పుం., తత్స.,= ఒకత్రాడు కలది, డమరువాద్యము.

ఏకస్థము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒంటిగా ఉండునది, ఒకచోట ఉండునది.

ఏకస్వామ్యము
వి. = గుప్తాధిపత్యం.

ఏకహంస
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = సరము, తీర్థము.

ఏకహాయనము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స.,= ఒక సంవత్సరము బిడ్డ, శిశువు.

ఏకహాయని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఒకయేఁడు ఈడుగల ఆవుపెయ్య, ఏకాబ్ద, ఏకహా.
వ్యుత్పత్త్యర్థము :
ఏకోహాయనః ప్రమాణమస్యా ఇత్యేకహాయనీ. ఏడాది వయస్సు కలిగినది ఏకహాయని.


ఏకా
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= ఒకే దానిని చెప్పవలసి వచ్చినప్పుడు స్త్రీలింగము ఏకవచనము నందు “ ఏకా ” అని వస్తుంది.

ఏకాంకిక
వి.= ఒక అంకం గల రూపకం.

ఏకాంగగ్రహము
సం., నా.వా., అ., పుం., తత్స., = పక్షవాతము

ఏకాంగము
సం., వి., అ., పుం., తత్స., = ఉత్తమాంగము, శిరస్సు, నిరుపమానమైన అవయవములు కలది.
నానార్థాలు :
బుధ గ్రహము, అంగారక గ్రహము, చందనము, బుద్ధుడు.


ఏకాంగి
సం., వి., న్., పుం., తత్స., = ఒంటరి, సన్న్యాసి, విరక్తుఁడైన విష్ణుభక్తుడు. ; విణ. ఒంటివాఁడు.
ప్రయోగము :
క్రేవలనేకాంగులురా.(ఆము. ౨, ఆ)


ఏకాంగికము
సం., వి. ఆ., స్త్రీ., తత్స., = చందనముతో చేయబడిన ద్రవ్యవిశేషము.

ఏకాంగిపోరు
వి. = ద్వంద్వయుద్ధం.

ఏకాంగుడు
సం., వి. అ., పుం., తత్స., = విష్ణువు, అంగరక్షకుడు.

ఏకాంగులము
సం., విణ.,(అ. ఆ. అ).,తత్స., = మూత్రము.

ఏకాంగ్రహము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పక్షవాతము.

ఏకాండము
సం., వి., అ., పుం., తత్స., = అశ్వము, అశ్వశబ్దమునందు.

ఏకాంతదుఃషమ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = బౌద్ద కల్పితము, కాలభేదమునందు.

ఏకాంతమాడు
అ. క్రి. = మంతనం చేయు, రహస్యంగా మాట్లాడు, ఏకతమాడు.

ఏకాంతము
సం., క్రి., విణ., అ., న., తత్స., = అత్యంతము, ఎక్కువ, అధికము. ; విణ. మిక్కిలి, ఇద్దరి కంటె ఎక్కువ జనము లేని చోటు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏకః అంతః నిశ్చయోయత్రతదేకాంతం. అత్యంత ముఖ్యమైన నిశ్చయము. 2.ఏకస్మిన్నేవ అంతః సమాప్తిర్యస్యేతి. ఒకే చోట సమాప్తి కలిగినది.

పర్యాయపదాలు :
నిర్జనము, రహస్యము, జనములు లేకుండుట, జనము లేని చోటు, తదేకధ్యానము కలవాడు.


ఏకాంతరము
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స., = ఒక్కటి యెడగా కలిగినది, రహస్యము, తధేక ధ్యానము కలవాడు, ఎక్కువ, తీవ్రము, అధికము, నిర్జనము, ఒక్క వ్రేలు విడిచినది.

ఏకాంతరినుడు
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = దినము విడిచి దినము ఉపవాసము చేయువాడు.

ఏకాంతి
సం., వి., ఇ., పుం., తత్స.,= ఏకాగ్రచిత్తుడు, విష్ణుభక్తుడు.

ఏకాంతినుడు
సం., విణ., (న్. ఈ. న్).,తత్స., = ఏకాగ్రచిత్తుడు, విష్ణుభక్తుడు.

ఏకాకి
సం., విణ., (న్. ఈ. న్.)., తత్స.= ఏకకుఁడు, ఏకుడు, ఒంటరివాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏక ఏవ ఏకాకీ. ఒకడే ఏకాకి.


ఏకాక్షము
సం., వి., అ., పుం., తత్స.,= కాకి. ; విణ. ఒక అక్షము కలది, ఒక కన్ను కలది.

ఏకాగారము
సం., వి., అ., న., తత్స.,= ముత్యములందు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకమసహాయమగారమ్.


ఏకాగ్ని
సం., నా.వా., ఇ., పుం., తత్స., = ఔపాసనాగ్న కలవాడు.

ఏకాగ్రుడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఒకట మనసు చెల్లినవాడు, తదేక ధ్యానము కలవాడు, కలక బాఱని వాడు, ఒక విషయమందే లగ్నమైనది, ఒక విషయమునందే చిత్తము నెలకొల్పినది.
వ్యుత్పత్త్యర్థము :
ఏకమగ్రం చింతనీయమన్యేత్యేకాగ్రః. ఒక్కటే విచారించదగినదిగా కలవాడు. ఏకం ఏకస్మిన్ వా అగ్రం పురోగతం జ్ఞేయమస్యేతి ఏకాగ్రః. అనన్యచిత్తము కలిగినవాడు.

పర్యాయపదాలు :
అనన్యవృత్తి కలవాడు, ఏకతానుడు, ఏకాయనుడు, ఏకసర్గుడు, ఏకాగ్ర్యుడు, ఐకాగ్ర్యుడు, ఏకాయనగతుఁడు.


ఏకాతపత్రము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఏకఛత్త్రాధిపత్యము కలది, ఒక్కటే ఆతపత్రముకలది.

ఏకాత్మ
సం., వి., న్., పుం., తత్స., = ఏకస్వరూపము, ఏకస్వభావము.

ఏకాదశకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పదకొండు భాగములు కలది.

ఏకాదశద్వారము
సం., విణ., అ., న.,తత్స., = శరీరము.
వ్యుత్పత్త్యర్థము :
పదకొండు ద్వారములు కలది, శరీరము (తలయందు ఏడు, బొడ్డుతో కూడి క్రింది మూడు శిరస్సునందలి బ్రహ్మరంధ్రము ఒకటి కలిసి 11 ద్వారములు కలది.)


ఏకాదశము
సం., విణ., (అ. ఈ. అ.) తత్స., = పదకొండు. విణ. పదనొకండవది

ఏకాదశి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పదునొకండవతిథి, పదునొకండు తంత్రులు గల పరివాదిని అను ఒక వీణ.

ఏకానుదిష్టము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= శ్రాద్ధమందు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకోద్దేశేన దత్తశ్రాద్ధే. ఒకే ఉద్దేశము చేత ఇచ్చిన శ్రాద్ధమందు.


ఏకాన్నుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఏకభాండాశనుడు, అవిభక్తుడు.

ఏకాబ్దము
సం., వి. ఆ., స్త్రీ., తత్స., = ఒకయేడు ఈడుగల ఆవు పెయ్య, ఏకహా, ఏకహాయని.

ఏకాభిప్రాయము
వి. = ఒకే అభిప్రాయము, అంగీకారము, సమ్మతి.

ఏకాయనగతుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స.,= ఏకతానుఁడు, ఒక జ్ఞానమునే పొందినవాడు, తదేక ధ్యానము కలవాడు.
పర్యాయపదాలు :
ఏకాగ్రుడు, అనన్యవృత్తి కలవాడు, ఐకాగ్ర్యుడు, ఏకసర్గుడు, ఏకాయనుడు, ఏకాగ్రచిత్తుడు.


ఏకాయనుఁడు
సం., విణ.,(అ. ఆ. అ.).,తత్స., = ఏకతానుఁడు, ఒకడు మాత్రమే నడువతగినది కాలి బాట, ఒకడు మాత్రమే నడువడానికి యోగ్యుడు అయినవాడు, తదేక ధ్యానము కలవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఏకస్మిన్నేవ విషయే అయనం జ్ఞానమస్యేత్యేకాయనః. ఒక విషయమందే జ్ఞానము కలవాడు, ఒకే విషయమందు ఆసక్తి కలిగినవాడు.

పర్యాయపదాలు :
ఏకాగ్రుడు, అనన్యవృత్తి కలవాడు, ఐకాగ్ర్యుడు, ఏకసర్గుడు, ఏకాయనగతుడు, ఏకాగ్రచిత్తుడు.


ఏకార్థము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒకే అర్థముకలిగినది, ఒకప్రయోజనమునందు, అభిదేయమునందు, పదార్థమునందు, అభిన్నార్థమునందు, తుల్యార్థమునందు, సమాన అర్థమునందు, ఒకే అర్థము కలిగినది.

ఏకావళి
సం., వి., ఇ., ఈ., స్త్రీ., తత్స., = ఒకే పంక్తి కలిగినది, అలంకారవిశేషము, ఒక అర్థాలంకారం.
వ్యుత్పత్త్యర్థము :
భూషణానాం మధ్యే ఏకైన ఆవలతే ఏకావళీ. సొమ్ములలో ముఖ్యమై చలించుచుండునది.

పర్యాయపదాలు :
ఒక యష్టిక, హారవిశేషము, ఒంటిపేటకల ముత్యాలహారం, ఒక పంక్తి కలిగిన శ్రేష్ఠమైన మాల, (హారభేదము యష్టిభేదము వలన పేర్లు గుచ్ఛము, గుచ్ఛార్ధము, గోస్తనము, అర్ధహారము, మాణవకము, ఏకయష్టిక, నక్షత్రమాల).


ఏకాశీతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = ఎనభై ఒకటి (81).

ఏకాశీతితమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఎనభై ఒకటవది.

ఏకాశ్రయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒకే ఆధారము కలిగినటువంటి, వైశేషికమున చెప్పబడిన ఒక గుణ భేదము.

ఏకాష్టకము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మాఘమాసమున కృష్ణాష్టమి అందు, అప్పుడు చేసే శ్రార్థకర్మయందు.

ఏకాష్ఠీల
సం., వి., ఆ., స్త్రీ., అ., పుం., తత్స., = బక పుష్పము, చిఱుబొద్ది, అగరుశొంఠి, ఒక మందార.
వ్యుత్పత్త్యర్థము :
ఏకో ష్ఠీలో మజ్జా అస్యా ఏకాష్ఠీలా. ముఖ్యమైన సారముకలది.

నానార్థాలు :
శివమల్లి, పాశుపతము, బకము, వసువు, పాఠము, అబష్టము, విద్ధకర్ణి, స్థాపని, శ్రేయసి, శివా, అగ్నిది, పాపచేలి, వనతిక్తము.


ఏకాహగమము
సం., వి., అ., పుం., తత్స., = గ్రామము మొదలగునవి, ఒకనాటి పయనముచే చేరదగినది.

ఏకాహము
సం., వి., అ., పుం., తత్స., = ఒక దినము, మృతిఁ బొందినవారికి పదునొకండవనాడు చేయు శ్రాద్ధము, ఒక యాగము.

ఏకాహారము
సం., విణ., అ., పుం., తత్స.,= ఒక రోజు ఒకసారే ఆహారము.

ఏకివేయు
స. క్రి. = తీవ్రంగా విమర్శించు.

ఏకీకరణము
సం., వి., అ., న., తత్స.,= ఏకం చేయడం, సమైక్యం చేయడం, కలపడం, అనేకధాన్యాలను కలిపి ఒకటిగా చేయటం, సంఘీభావము, ఒక్కటిగా చేయబడినది.

ఏకీకరించు
స. క్రి. =ఏకమవు, ఒకటిగా చేర్చు, కలుపు.

ఏకీకృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒక్కటిగా చేయబడినది.

ఏకీభవించు
సం. అ. క్రి. = ఒక్కటియగు.

ఏకీభావము
సం., వి., అ., పుం., తత్స., = ఒక్కటియగుట, ఐక్యము.

ఏకీభూతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒక్కటిగా అయినది.

ఏకీయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒకే పక్షమునందు, ఒకే సంబంధమునందు.

ఏకుమేకవు
అ. క్రి. = మొదట ఉదాసీనంగా ఉన్న వ్యక్తి తరువాత ప్రతిబంధకంగా మారు, అణకువగా ఉన్న వ్యక్తి మొండివాడుగా మారు, సూదిలాగా వచ్చి దబ్బనంలాగా తేలు, వశం తప్పు.

ఏకేక్షణము
సం., వి., అ., పుం., తత్స., = కాకియందు, ఒకే కన్ను కలిగిన గుడ్డివాడియందు, శుక్రాచార్యుని అందు.

ఏకైకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒక్కొక్కటి, ఒకే ఒక, ఒక్కరే, ఒక్కటే, ఒక్కతే.

ఏకైషిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = వృక్షము.

ఏకోత్తరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఒకటి ఎక్కువగా కలది. (ఏకోత్తరశతము నూట ఒకటి).

ఏకోదకుడు
సం., విణ., (అ.ఈ.అ.)., తత్స., = సమానమైనవాడు, ఏడవ తరము నుండి పదునాలుగవ తరము వరకు గల గోత్రజుడు, సమాన జలము కలవాడు.

ఏకోదరుడు
సం., వి., అ., పుం., తత్స., = సోదరుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఒకతల్లి కడుపున పుట్టినవాడు.


ఏకోద్దిష్టము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = ప్రేతమును ఉద్దేశించి చేయు శ్రాద్ధము, ఒకఁడు ఉద్దేశింపబడినవాఁడుగా కలది.

ఏకోనచత్వారింశత్
సం., వి., త్., స్త్రీ., తత్స., = సంఖ్యలయందు ముప్పుది తొమ్మిది.

ఏకోనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఒకటి తక్కువయైనది.

ఏకోనవింశతి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = పంతొమ్మిది.

ఏకౌఘము
సం., వి., అ., పుం., తత్స., = అవిచ్ఛిన్న ప్రవాహము.

ఏగిలి
వి. = దుక్కి బాగా ఎండటం.

ఏజకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= చలించునది, చలింపచేయునది, వడికించునది, ప్రకాశించునది, ప్రకాశింపచేయునది.

ఏజనము
సం., వి., అ., న., తత్స., = చలించుట, వడకుట, చలింపచేయుట, ప్రకాశించట, ప్రకాశింపచేయుట, కంపము.

ఏజితము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = చలింపచేయబడినది, చలించినది, ప్రకాశింప చేయబడునది, ప్రకాశించినది.

ఏటగలుపు
స. క్రి. = ధ్వంసం చేయు, నాశనం చేయు.

ఏటికెదురీదు
అ. క్రి.= ప్రవాహానికి ఎదురీదు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచు.

ఏటిపాలవు
అ. క్రి. = వ్యర్థమగు, నశించు.

ఏటుకాడు
వి.= విలుకాడు.

ఏడక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = గొఱ్ఱె. ; అ. పుం. ము. పొట్టేలు.
వ్యుత్పత్త్యర్థము :
ఇలతి గచ్ఛతీత్యేడకః. సంచరించునది.

పర్యాయపదాలు :
మేండము, మేఢ్రము, ఉరభ్రము, ఊర్ణాయువు, మేషము, వృష్ణి.


ఏడగజము
సం., వి., అ., పుం., తత్స.,= తగిరిసచెట్టు, చక్రమర్ధము, చక్రమర్ధకము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏడశ్చాసౌ గజశ్చ ఏడగజః. మేక కండ్లవంటి పువ్వులు కలిగి శ్రేష్ఠమైనది. 2.ఏడో మేష ఏవ గజో యస్య సః ఏడగజః. మేషలోచనుడు.

నానార్థాలు :
ప్రపున్నాటుడు, దద్రుఘ్నుడు, పద్మాటుడు, చక్రి, ప్రపున్నాటుడు, ఉరణాక్షుడు, సలోమశుడు, కరంజుడు.


ఏడము
సం., విణ.,(అ. ఆ. అ.)., తత్స., = మేషము, చెవిటి వాడు, బధిరుడు, గొఱ్ఱె, పొట్టేలు, అడవిక, ఏడకము.
వ్యుత్పత్త్యర్థము :
శ్రుతిహీనతయా భారతాదిశ్రవణ హీనతయా మేష సదృశత్వాత్ ఏడ ఇవ ఏడః. భారతాది పుణ్య కథాహీనుఁడౌట చేత మేఁక వలె నుండువాడు.


ఏడమూకుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = చెవిటిఁమూగ, మోసకాఁడు.

ఏడాటము
వి. = ఇబ్బంది.

ఏడాది
వి. = సంవత్సరం, పన్నెండు నెలల కాలము.

ఏడి(ళి)
సం., విణ., ఈ., స్త్రీ., తత్స., = ఆడుగొఱ్ఱె.

ఏడిపించు
స. క్రి. = బాధించు.

ఏడుకట్లసవారీ
వి. = పాడె.గ

ఏడుకము
సం., నా. వా. అ., న., తత్స.,= బౌద్ధాలయము, ఎముకలతో కూడిన గోడ, ఎముకలను వాని వంటి కఠినపదార్థములును లోపల నుంచి కట్టిన కట్టడము.

ఏడుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చెవిటి వాడు, బధిరుడు.

ఏడూకము
సం., వి., అ., న., తత్స., = మెత్తినగోడ, (రూ. ఏడుకము), ఎముకలతో కూడినగోడ.
వ్యుత్పత్త్యర్థము :
ఇల్యతే క్షిప్యతే కీకస మంతరితి ఏడూకం. ఏడూకం యదంతర్న్యస్త కీకసం. దీనియందు ఎముకలు నడుమన ఉంచబడును.


ఏడ్చు
అ. క్రి. = ఈర్ష్య వహించు, బాధపడు.

ఏడ్పుగొట్టు
వి. = ఎప్పుడూ తనకేదో లేదని ఏడుస్తూ ఉండే వ్యక్తి, సర్వదా అసంతృప్తుడు.

ఏణతిలకుడు
సం., వి., అ., పుం., తత్స., = చంద్రుడు.

ఏణము
సం., వి., అ., పుం., తత్స., = జింక, హరిణము, ఏణకము, మృగ విశేషము, ఐణము, ఐణేయము, కృష్ణసారము, ఆడులేడియొక్కయు మొగదుప్పియొక్కయు తోలుమాంసము, పెద్దకన్నులుకల నల్లయిఱ్ఱి.
వ్యుత్పత్త్యర్థము :
ఏతీత్యేణః. పోవునది. ఏతి ద్రుతం గచ్ఛతీతి ఏణః. వేగముగా పోవునది.

నానార్థాలు :
రురువు(తరచుగా కూతలు పెట్టునది), న్యంకువు, రంకువు, శంబరము, రౌహిషము, గోకర్ణము, పృషతము, ఋశ్యము, రోహితము, చమరీమృగము.


ఏణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పెద్దకన్నులు కల నల్ల ఆడలేడి, విషవ క్రిమిభేదము.

ఏణికృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రతిధ్వని.

ఏతగ్వము
సం., వి., అ., పుం., తత్స., = అశ్వమునందు.

ఏతదీయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = వీనిది, దీనిది, వీరిది.

ఏతదుడు
సం., వి., అ., పుం., తత్స., = బ్రాహ్మణుడు.

ఏతదుడు
సం., నా.వా., అ., పుం., తత్స., = బ్రాహ్మణుడు

ఏతద్
సం., విణ., ద్., త్రి., తత్స., = పరిమాణార్థమునందు, సమాన దర్శనమునందు, సంబంధార్థమునందు.

ఏతనము
సం., వి., అ., పుం., తత్స., = నిశ్వాసము, ఒకజాతిచేప.

ఏతము
సం., వి., అ., పుం., తత్స.,= చిత్రవర్ణము, ఇఱ్ఱి, ఇఱ్ఱితోలు. ; విణ. చిత్రవర్ణము కలది, వచ్చినది(లింగమందు ఏని అను రూపముగలదు). ; ఉభ. వై. వి. నీళ్లెత్తెడు యంత్రవిశేషము ఆరఘట్టము.
పర్యాయపదాలు :
కర్పూరవర్ణము కలది, కిర్మీరము, కల్మాషము, శబలము, కర్బురము.


ఏతరితనము
వి. = గుండకొయ్యతనం, నీతి తప్పినవాని లక్షణం, ఔద్ధత్యం, దుర్నయం, లోభత్వం.

ఏతర్హి
సం., అవ్య., తత్స., = ఇప్పుడు.
పర్యాయపదాలు :
ఈ కాలము అనే అర్థము నందు, సంప్రతి, సాంప్రతము, అధునా, ఇదనీమ్.


ఏతశసుడు
సం., విణ.,(స్. ఈ. స్).,తత్స., = బ్రాహ్మణుడు, అశ్వము.

ఏతాదృక్కు
సం., విణ., (అ.ఈ.అ.)., తత్స., = ఇట్టిది.

ఏతాదృక్షము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఏతాదృక్కు, ఇట్టిది.

ఏతాదృశము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= ఏతాదృక్కు, ఇట్టిది

ఏతావత్
సం., విణ., (త్. ఈ. త్)., తత్స., = ఇంతమాత్రమైన, ఇంత పరిమితిగల.

ఏతావదిథము
సం., విణ.,(అ.ఆ.అ.)., తత్స., = చాలగా ఉన్న.

ఏతిన్
సం., విణ.,(న్. ఈ. న్)., తత్స.,= చిన్న ఊపిరి.

ఏతులబోవు
అ. క్రి. = నిక్కు, గర్వించు.

ఏతులాడి
వి. = గర్వోక్తులు పలికే స్త్రీ.

ఏత్థల
సం., వి., అ., పుం., తత్స., = ఒక చేప.

ఏధ
సం., వి., అ., పుం.,ఆ., స్త్రీ., తత్స.,= ధనాదిసమృద్ధినందు, నింపు. ; ఆ.పుం.ము. చిదుగు, సమిధ, ఇంధనము, ఇధ్మము, బిరుదు, వంటచెఱకు.
వ్యుత్పత్త్యర్థము :
ఏధతే అగ్నిరనేన ఏధః. దీనిచేత అగ్ని వృద్ధి పొందును, ఇధ్యతేనేనాగ్నిః. దీనితో అన్నము వృద్ధిపొందును.


ఏధనము
సం., వి., అ., న., తత్స., = వృద్ధి, పెరుగుట, సమృద్ధి.

ఏధమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = వర్ధిల్లుచున్నది.

ఏధస్సు
సం., వి., స్., న., తత్స., = సమిధ, ఏధ, చిదుగు, ఇధ్మము, ఇంధనము, వంటచెఱకు.

ఏధితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = సమృద్ధి అర్థమునందు, ప్రవృద్ధము, ప్రౌఢము, పెరిగినది.
వ్యుత్పత్త్యర్థము :
ఏధతే స్మ ఏధితం. వృద్ధి పొందినది.


ఏనస్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స.,= తప్పు, పాపము, అపరాధము వలన కలిగినది. పాపము వలన కలిగినది.

ఏనస్వంతుడు
సం., విణ., (త్. ఈ. త్)., తత్స., = పాపము కలవాడు, అపరాధము కలవాడు.

ఏనస్వి
సం., విణ., (న్. ఈ. న్) ., తత్స., = పాపము కలవాడు, అపరాధము కలవాడు.

ఏనస్సు
సం., వి., స్., న., తత్స., = అపరాధము, పాపము, తప్పు, నింద.
వ్యుత్పత్త్యర్థము :
ఏతి గచ్ఛతి ప్రాయశ్చిత్తేన ఇతి ఏనః. ప్రాయశ్చిత్తము వలన ఇది పోవును, ఏతి నరకమనేనేత్యేనః. దీని చేత నరకమును పొందుదురు.

పర్యాయపదాలు :
పంకము, పాప్మ, కిల్బిషము, కల్మషము, కలుషము, వృజినము, అఘము, అంహము, దురితము, దుష్కృతము.


ఏనుగుకాలు
వి. = బోదకాలు, కాలు లావయ్యే వ్యాధి.

ఏనుగుదాహము
వి. = తీరని దాహము.

ఏనుగునడక
వి. = మందగమనము.

ఏపుమిగులు
అ. క్రి. = విలసిల్లు, సరిపడు, ఉత్సహించే.

ఏమ
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రాప్యము, పొందదగినది.

ఏమనము
సం., వి., న్., న., తత్స., = గమనమందు, అవస్థితియందు.

ఏరం(లం)గము
సం., వి. అ., పుం., తత్స., = ఒక జాతి చేప.

ఏరండకము
సం., వి., అ., పుం., తత్స., = పిప్పలి (వృ.వి), పరండము.

ఏరండపత్రిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = దంతీవృక్షము.

ఏరండఫలము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = రఘుదంతీ వృక్షము.

ఏరండము
సం., వి., అ., పుం., తత్స.,= ఆముదపు చెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఈరయతి వాతం ఏరండః. వాతమును పోగొట్టునది.

పర్యాయపదాలు :
వ్యాఘ్రపుచ్ఛము, గంధర్వహస్తకము, ఉరుబూకము, రుబుకము, రుచకము, చిత్రకము, చంచువు, పంచాంగుళము, అమండము, వర్థమానము, వ్యాడంబకము.


ఏరండి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పిప్పలి (వృ.వి).

ఏరక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒకగడ్డి, కనుపులేని తృణభేదము.

ఏరు
సం., విణ., (ఉ. ఊ. ఉ).,తత్స., = గంతరి.

ఏర్వారుకము
సం., వి. అ., పుం., తత్స., = చిర్భటి, కర్కటీ భేదము, నక్కదోస (వృ.వి), పర్వారువు, వ్యాలపత్రాలోమశా, సక్థిలా, తోయఫలా, హస్తిదంతపలా.

ఏర్వారువు
సం., వి., ఉ., స్త్రీ., పుం., తత్స., = కర్కటీ, చిర్భటి, కర్కటీ భేదము, హస్తిదంతఫలము, ఏలవిలుడు, ఐలవిలుడు.
నానార్థాలు :
తోయఫలము, లోమశము, కుబేరుడు, వ్యాలపత్రము, స్థూలము, నక్కదోస.


ఏర్వారుహము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కర్కటీ భేదము, కర్కటీ.
నానార్థాలు :
వ్యల పత్రము, లోమసము, స్థూలము, తోయఫలము, ఏనుగు దంతఫలము, ఐలబిలుడు, కుబేరుడు, ఏలవిలుడు.


ఏల(లా)వాలువు
సం., వి., ఉ., న., తత్స., = నూగుదోస, కూతురుబుడమ, వెలగ పట్ట, వెలగ చెట్టు యొక్క బెరడు.

ఏల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పెద్దయేలకి (వృ.వి), విలాసము, పంచదశాక్షర పాదకమగు ఒకానొక వృత్తము, ఒకవంగ, పీఠికాపుర ప్రాంతము నందలి ఒక నది.
పర్యాయపదాలు :
పృథ్వీకము, చంద్రబాల, పేరేలకి, నిష్కుటి, బహుళ.


ఏలక
సం., నా. వా.,(అ. ఆ).,పుం.,స్త్రీ., తత్స., = నారింజ, ఏలకి.

ఏలాపర్ణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = కారేలకి, రాన్న(వృ.వి), ఏలకి ఆకులవంటి ఆకులు కలది, సువహము, రాస్నము, యుక్తరసము, వి. ఫిరంగి చెక్క, దాల్చినచెక్క.

ఏలాపురము
సం., వి., అ., న., తత్స., = ఒక నగరము.

ఏలారసాలకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = వగరు, చేదు, కారం కలసినది.

ఏలావాలుకము
సం., వి., అ., న., తత్స., = నూఁగుదోస, కూతురుబుడమచెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఏలావద్వలతే ఏలావాలుకం. ఏలకతీగవలె చలించునది.

పర్యాయపదాలు :
ఒక సుగంధద్రవ్యము, ఏలివాలుకము, ఐలేయము, సుగంధి, హరివాలుకము.


ఏలికపాము
వి. = పేగులలో పెరిగే ఒక పురుగు, ఏలపాము.

ఏలిననాటిశని
వి. = ఏడున్నర సంవత్సరాల శని.

ఏలీక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చిట్టేలకి, చిన్నయేలకి (వృ.వి).

ఏలుక
సం., వి., అ., న., తత్స., = నూగు దోస, కూతురు బుడుమ(వృ.వి), వెలకపట్టు గందద్రవ్యము.

ఏలుకోటి
మి. వి. = ఏలుబడికిలోపడిన జనము, ప్రకృతి జనము.

ఏలుదెంచు
స. క్రి. = శాసించు, పాలించు, అణచు.

ఏల్లవాలుకము
సం., వి., అ., న., తత్స., = ఒక సుగంధద్రవ్యము.

ఏవ
సం., అవ్య., తత్స., = సామ్య నిశ్చయములను తెల్పునది, పాద పూరిక, వలె, సాదృశ్యార్థమునందు, అని యోగమునందు, వాక్య భూషణమునందు, కొంచెము అను అర్థమందు.

ఏవగింపు
వి. = రోత, అసహ్యం, నిరసన, తిరస్కారం, నింద, అసూయ.

ఏవథ
సం., వి., అ., పుం., తత్స., = గమనమందు.

ఏవము
వి. = నీచం, రోతకలిగించేది, జుగుప్స, హేయవృత్తి.

ఏవమ్
సం., అవ్య., తత్స., = సామ్యమును, అంగీకారమును తెలుపునది, వలె, సరియో.
వ్యుత్పత్త్యర్థము :
ఏవమితి ప్రకృతపరామర్శప్రకారేవార్థోపదేశనిర్దేశనిశ్చయాంగీకారవార్థేషు"గణరఉక్తేషు అర్థేషు.క్రమేణ ఉదాహృతః. (1)ప్రకృతపరామర్శే , ప్రకృతమును ఉద్దేశించుట. (2)ప్రకారే.ఇలాగున. (3)ఇవార్థే సాదృశ్యే.పోలికయందు. (4)ఉపదేశే. బోధించుటయందు. (5)నిర్దేశే. నిర్దేశించుటయందు. (6)నిశ్చయే. నిశ్చయార్ధమందు.(7)అంగీకారే . అంగీకరించుటయందు. (8)వార్థే సముచ్చయార్థే. వికల్పము ,సముచ్చయమునందు. (9)సమన్వయే . అన్వయము నందు. (10)పరకృతౌ.ఇతరులు చేసినదానియందు .(11)ప్రశ్నే చ . ప్రశ్నలో కూడా(మేది).

ప్రయోగము :
1. ఏవం వాదిని దేవర్షౌ(కుమా.). 2.ఏవం కురుతే . 3. అగ్నిరేవం విప్రః. 4. ఏవం పఠ. 5. ఏవం తావత్. 6. ఏవమేతత్ కః సందేహః. 7.ఏవం కుర్మః.

పర్యాయపదాలు :
వత్, యథా, తథా, వా, ఇవ.


ఏవయావనుడు
సం., వి., న్., పుం., తత్స., = విష్ణువు, వేదము, రక్షించువాడు.

ఏవారము
సం., వి., అ., పుం., తత్స., = సోమ భేదము.

ఏష
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స.,= కోరిక, ఇచ్ఛ, గమనము.

ఏషణము
సం., విణ., (అ.ఆ.అ.)., తత్స., = కోరిక, కొత్తిమిరి, యాచన, పుత్రుడు, లోహమయమైన బాణము, ధనము, ఇచ్ఛ, కోరిక(పుత్ర-విత్త-లోకేప్స అను మూడు కోరికలు)

ఏషణవజము
సం., నా.వా., అ., పుం., తత్స., = బాణము, వ్రణవిదారణ వ్యాపార విశేషము.

ఏషణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = నారాచాకృతియైన యగసాలెవాని త్రాసు, కంసాలి త్రాసు, పుండి కంట చొప్పించెడు శలాక, వ్రణములోని చీము మొదలగు వానిని పైకి తీయుసాధనము.

ఏషణిక
సం., విణ., ఆ., స్త్రీ., తత్స., = కంసాలిత్రాసు, ఏషణి, నారాచి.

ఏషణీయము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఆశాస్యము, కోరదగినది, పొందదగినది.

ఏషమము
సం., విణ., అ., పుం., తత్స., = ఈ సంవత్సరము.

ఏషమహము
సం., విణ., అ., పుం., తత్స., = ఈ సంవత్సరము

ఏషి
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = కోరువాడు, పొందువాడు.
ప్రయోగము :
ఉదా- విషయైషి, వితైషి, మొదలుగునవి.


ఏషినము
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = ఇచ్ఛ, అభిలాష.

ఏష్ట
సం., విణ., (ఋ. ఈ)., పుం., స్త్రీ., తత్స., = కోరువాడు, కోరునది.

ఏష్టవ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరదగినది.

ఏష్యము
సం., విణ., (ఆ. ఆ. అ)., తత్స., = కాఁగలది, పొందదగినది, కోరదగినది, శలాక చొప్పించదగినది, రాదగినది.

ఏసట
వి. = స్నేహం.

ఏహము
సం., విణ., (అ. ఈ. అ)., తత్స., = చేష్టాయుక్తము, క్రోధము.

ఏహస్సు
వి. = కోపము.