నాట్యవర్గ



అంకావథి
నాటకములో అంకములను విధించే సమయము. ఒక నాటకంలో సంభవించే సంఘటనలు ఒక క్షణము కాని, ఒక ముహూర్తము కాని, ఒక యామము కాని లేదా ఒక దినము కాని ఉంటాయి. వీటిని బీజమును అనుసరించుకొని ఒకే ఒక అంకములో చేయగలగాలి. ఒక వేళ సంఘటనలు నెల లేదా సంవత్సర కాల పరిమితి కలవి అయితే అవి నాటకం చివరిలోపు పూర్తి చేయబడాలి. ఒక వేళ సన్నివేశము యొక్క కాల పరిమితి సంవత్సరమునకు పైన ఉంటే దానిని ఏకాంకములో పెట్టకూడదు.

అంగ
తూర్పు దేశము పేరు.

అంగము లేదా అంగములు
అంగము లేదా అంగములు అనగా శరీరములోని ప్రధాన అవయవాలు. ఇవి మొత్తం ఆరు. 1.శిరస్సు, 2.హస్తము, 3.కటి, 4.ఉరము, 5.పార్శ్వము, 6.పాదము.

అంగము
సం. నా. వా. అ. న. తత్స. అవయవము.

అంగరౌద్రము
అవయవాల చేత అభినయింపబడే రౌద్రరసము.

అంగహారము
ఇది ఆరు నుంచి తొమ్మిది కరణాల సమూహము. ఇవి మొత్తం ముప్పది రెండు.

అంగహారము
సం. నా. వా. అ. న. తత్స. అవయవముల యొక్క సొగసైన కదలికలను అంగహారము అంటారు. ఇవి మొత్తము 32. అవి వరుసగా 1.స్థిరహస్తము, 2.పర్యాస్తకము, 3.సూచీవిద్ధము, 4.అపవిద్ధము, 5.ఆక్షిప్తకము, 6.ఉద్ఘట్టితము, 7.విష్కంభము, 8.అపరాజితము, 9.విష్కంభాపసృతము, 10.మత్తాక్రీఢము, 11.స్వస్తికరేచితము, 12.పార్శ్వస్వస్తికము, 13.విక్షిప్తాపసృతము, 14.భ్రమరము, 15.మత్తస్ఖలితము, 16.మాదవిలసితము, 17.గతిమండలాకము, 18.పరిచ్ఛిన్నము, 19.పరివృత్తరేచితము, 20.వైశాఖరేచితము, 21.పరావృత్తము, 22.అలాతకము, 23.పార్శ్వచ్ఛేదము, 24.విద్యుత్భ్రాంతము, 25.ఉద్వృత్తకము, 26.ఆలీఢము, 27.రేచితము, 28.ఆచ్చురితము, 29.ఆక్షిప్తరేచితము, 30.సంభ్రాంతము, 31.అపసర్పితము, 32.అర్థనికుట్టకము.

అంగహాస్యము
అవయవముల చేత ప్రదర్శింపబడే హాస్యరసము.

అంగాభినయము
అవయవములతో చేసే అభినయము. ఇవి ఆరు రకాలు. 1.శిరము, 2.హస్తము, 3.కటి, 4.ఉరము, 5.పార్శ్వము, 6.పాదము.

అంగుళము
సం. నా. వా. అ. న. తత్స. విశ్వకర్మచేత చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. ఎనిమిది యవలు కలిసి ఒక అంగుళము. ఇరవై నాలుగు అంగుళములు కలిసి ఒక మూర.

అంచితగ్రీవము
అంచితగ్రీవము అనగా మెడను వంచి తలను వెనకకు తిప్పడం. దీనిని జుట్టును సరిచేసుకునేటప్పుడు, బాగా పైకి చూసేటప్పుడు ఉపయోగిస్తారు.

అంచితబాహుసంచారము
చేతిని ఛాతిపైన ఉంచి తలమీదకు తీసుకువచ్చి మరల ఛాతు మీదకు తీసుకురావడం.

అంచితము
మడమలను నేలపై ఉంచి ముందరి భాగమును పైకెత్తి మునివేళ్ళని చాచాలి.

అంచితశిరము
మెడను కొద్దిగా పక్కకు వంచడం. అనారోగ్య సమయంలో, నిషలో, బాధలో దీనిని ఉపయోగిస్తారు.

అంజలి
రెండు పతాక హస్తాల అరచేతుల యొక్క కలయిక వలన అంజలి హస్తము ఏర్పడుతుంది. దేవతలకు, గురువులకు, విప్రులకు నమస్కరించేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

అంతర్గిర
తూర్పుదేశము యొక్క పేరు.

అంతర్యవనికాంగములు
ఇది తొమ్మిది రకములు. అవి 1.ప్రత్యాహారము, 2.అవతరణము, 3.ఆరంభము, 4.ఆశ్రావణము, 5.వకత్రపాణి, 6.పరిఘట్టనము, 7.సంఘటనము, 8.ఆసారితము, తొమ్మిదవదైన ఆసారిత మరలా మూడు రకములు. అ.జ్యేష్ఠము, ఆ.మధ్యమము, ఇ.కనిష్ఠము. ఇవన్నీ కూడా తెర వెనకాల ఉన్న కళాకారుల చేత ప్రదర్శింపబడాలి. అందువల్లనే దీనికి ఆ పేరు.

అంధునిగతి
దారి కోసం చేతులను అటు, ఇటు ఊపుతూ, పాకుతూ చీకట్లో నడిచే వ్యక్తి లేదా అంధుడి గతి.

అంబుజసంభవము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మదేవుని లక్షణములలో ఒకటి.

అక్షరము
ఇది 3 రకములు. 1.దీర్ఘాక్షరము, 2.హ్రస్వాక్షరము, 3.ప్లుతాక్షరము.

అగ్రతల సంచారము లేదా తల సంచారము
మడమలను పైకెత్తి బొటనవేలిని ముందరికి వంచిమిగతా వాటిని వంచాలి.

అఘోషము
స్వరము లేనిది.

అచ్చురితము
సం. నా. వా. అ. పుం. తత్స. ?

అటవి
అడవి.

అట్టాలభంజిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సాలభంజికలు.

అడ్డితచారీ
ఒక పాదమును అగర్తల సంచారములో ఉంచి ముందరి భాగాన్ని రుద్దుతూ, వెనుక భాగాన్ని మరొక పాదముకు అభిముఖముగా ఉంచడాన్ని అడ్డితచారీఅంటారు. ?

అడ్డితాదృవము
చారీ విధిని ప్రదర్శించడానికి ముందు చతురస్ర తాళము, సన్నిపాతముతో మధ్యలయలో అడ్డితాదృవమును ప్రదర్శించాలి. దీనియందు నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదమునకు 12 అక్షరములు ఉంటాయి. 1, 4, 5, మరియు 12 అక్షరములు గురువులు మిగిలినవి లఘువులు.

అణువు
సం. నా. వా. ? అన్ని రకముల నాటకశాలలకు విశ్వకర్మచేత చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. ఎనిమిది అణువులు కలిసి ఒక రాజ ఏర్పడుతుంది.

అతికృతి
ఒక పాదములో 25 అక్షరములు గల ఛందస్సును అతికృతి అంటారు.

అతిక్రాంతచారీ
ఒక పాదమును కుంచితములో పైకెత్తి ముందరికి చాచి, మరలా పైకెత్తి భూమిపై ఉంచడం.

అతిక్రాంతము
రెండు పాదాలు చాచి చేతులకు తగ్గట్టుగా అభినయం చేయాలి.

అతిజగతి
ఒక పాదములో 13 అక్షరాలు ఉండే ఛందస్సును అతిజగతి అంటారు.

అతిధృతి
ఒక పాదములో 19 అక్షరాలు ఉండే ఛందస్సును అతిధృతి అంటారు.

అతిశక్కరి
ఒక పాదములో 15 అక్షరాలు ఉండే ఛందస్సును అతిశక్కరి అంటారు.

అతిహసితము
విలవిలలాడే నవ్వు. దీనిని ప్రదర్శించడానికి కళ్ళను బాగా తెరచి చేతితో పక్కలను పట్టుకొని కళ్ళలోంచి నీళ్ళు రావాలి. ఇది నీచ ప్రకృతికి చెందినది.

అత్మస్థహాస్యము
తనలో తాను నవ్వుకోవడం.

అత్యష్టి
ఒక పాదములో 17 అక్షరాలు ఉండే ఛందస్సును అత్యష్టి అంటారు.

అత్యుక్తము
ఒక పాదములో రెండు అక్షరాలు మాత్రమే ఉండే ఛందస్సును అత్యుక్తము అంటారు.

అద్భుతదృష్టి
దీనియందు కళ్ళు అందముగా, వెడల్పుగా తెరవబడి, కనురెప్పలు కొద్దిగా ఒంపులు తిరిగి, కనుపాపల యొక్క చివరలు ఆశ్చర్యంతో వికసిస్తాయి. అద్భుత రసములో దీనిని ఉపయోగిస్తారు.

అద్భుతము
ఇది రెండు రకాలు. 1.దివ్యజము, 2.ఆనందజము. ?

అద్భుతహాస్యగతి
ఇది మధ్యమ మరియు నీచ ప్రకృతికి సంబంధించినది. వీరు కదలికలను అనుసరిస్తూ హాస్యమును కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.

అధముడు
సం. నా. వా. అ. పుం. తత్స. పాత్రధారుల లేదా గుణముల యొక్క మూడు దశలలో చివరిది.

అధములు
తక్కువ జాతివారు. అనగా పుట్టుకతోనే అధమ ప్రకృతికి చెందినవారు.

అధరకర్మ
కింది పెదవులు చేసే కార్యము. ఇవి ఆరు రకాలు. అవి, 1.వివర్తనము, 2.కంపనము, 3.విసర్గము, 4.వినిగుహరము, 5.సందస్థతము, 6.సముగ్గము.

అధర్వవేదము
సం. నా. వా. అ. పుం. తత్స. నాలుగు వేదములలో ఒకటి. బ్రహ్మదేవుడు నాట్యశాస్త్ర నిర్మాణ సమయంలో భావసంబంధిత జ్ఞానాన్ని ఈ వేదమునుండే గ్రహించడమైనది. (తీసుకొనబడినది).

అధిదేవతలు
సం. నా. వా. అ. పుం, ఆ. స్త్రీ. తత్స. రక్షణను ఇచ్చు దేవతలు. అనగా ఎవరైతే నాట్యమండపము లేదా నటనను రక్షింటడానికి నియమింపబడతారో వారే అధిదేవతలని బ్రహ్మవాక్కు.

అధోగతశిరము
ముఖము కిందివైపుగా ఉంచి తలను వంచడం. సిగ్గు, బాధలోను, వందనం చేసేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

అధోముఖబాహు సంచారము
అధోముఖగతము కిందకి కదలడం.

అధ్యర్ధికచారీ
కుడి పాదము వెనుక భాగములో ఎడమ పాదము విశ్రాంతి తీసుకుంటూ తర్వాత తీసివేయబడటం. రెండు పాదముల మధ్య దూరము ఒకటిన్నర తాళములు ఉండాలి.

అనిష్టము
సం. నా. వా. అ న. తత్స. శంకుస్థాపన జరిగే సమయంలో నాస్తికులు, శ్రామణులు, కాషాయవస్త్రధారులు, అంగవైకల్యం కలిగినవారు కర్మ జరిగే ప్రదేశములో ఉండరాదు. వీరందరూ అనిష్టులుగా వ్యవహరింపబడతారు.

అనుకీర్తనము
సం. నా. వా. అ. న. తత్స. చెప్పబడుట.

అనుకృతి
సం. నా. వా. ? నాట్యము, నాటకము.

అనుమానము
విజ్ఞానమునకు ఒక ప్రమాణము. సందేహము, ఊహ. ఒక ప్రామాణికమైన ముగింపు ఇచ్చే సమయంలో ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపమేయము మరియు నిగమము ఈ ఐదు మూలాలు కూడా అత్యంత ఆవశ్యకము.

అనువృత్తము
ఏదైనా ఒక రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించడం లేదా అనుసరించడం.

అనుష్టుప్
ఒక పాదములో ఎనిమిది అక్షరములు ఉండే ఛందస్సును అనుష్టుప్ అంటారు.

అపక్రాంతచారీ
తొడలను వలనములో కదుపుతూ ఒక పాదమును పైకెత్తి కుంచితములో పక్కలకు విసరబడడం ద్వారా అపక్రాంతచారీ వస్తుంది.

అపక్రాంతము
(కరణము) పాదంతో గట్టిగా చేస్తూ చేతులతో కూడా ప్రయోగించాలి.

అపరాజితము
(అంగహారము) ఒక చేయి దండ పాద ముద్రతో ఉండి విసిరేస్తూ (విక్షప్త మరియు ఆక్షిప్త) ఎడమ చేయి, పాదంతో వ్యంసిత కరణము చేయాలి. రెండవ చేతితో కటిసుర, పాదంతో నికింటిత మరియు చేతితో భుజగాశ్రిత అమలుచేయాలి. ఉద్వస్త కరణ మరియు నికింటిత, అర్థనికుంటిత, ఆక్షిప్త, ఉరోమండల, కరిహస్త మరియు కఠిఛిన్న కరణాలు చూపించాలి.

అపరాధజభయము
తప్పుచేయడం ద్వారా కలిగే భయము.

అపవిద్ధము
(బహుసంచారము) ఛాతి నుంచి చేతిని వృత్తాకారములో తిప్పడం.

అపవిద్ధము
(కరణం) కుడిచేయి సుకతుండంలో ఉంచి కుడి తొడ మీద ఉంచి గుండ్రంగా కదలికలు చేస్తూ ఎడమ చేతిని ఛాతి (కటకాముఖం) మీద ఉంచాలి. ఈ విధమైన భంగిమ ఈర్ష్య మరియు కోపానికి సంకేతము.

అపసర్పితము
(అంగహారము) అపక్రాంతము మరియు వ్యంసిత కరణాలు చేతితో ఊర్ధ్వహస్తంగా మరల అర్థసూచి, విక్షిప్త, కఠిఛిన్న, ఊర్వత, ఆక్షఇప్త, కరిహస్త మరియు కఠిఛిన్న కరణాలు ఉపయోగించాలి.

అపస్యందితచారీ
స్యందితమునకు వ్యతిరేకమే అపస్యందితము.

అపహసితము
వెటకారపు నవ్వు. సరైన సమయంలో పనికి రాదు. కళ్ళళ్ళో నీళ్ళు మరియు తలను, భుజములను ఆడించుట అనేవి అపహసితమునకు గుర్తులు. ఇది నీచ ప్రకృతికి చెందినది.

అపూపము
సం. నా. వా. అ. న. తత్స. మధురము, మోదకము.

అప్రదక్షిణప్రవేశము
అపసవ్య (ఎడమ) దిశలో ప్రవేశించడం. పాంచాలి, ఓడ్రమాగధి ప్రవృత్తులలో అప్రదక్షిణప్రవేశము ఉపయోగింపబడాలి.దీనియందు దక్షిణ ద్వారము గుండా ప్రవేశించాలి. అనగా ప్రవేశమునకు, వెలుపలికి ఒకటే మార్గము లేదా ద్వారము.

అప్సరస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దివ్యమైన శక్తులు కలవారు, వీరు మొత్తం 24 మంది.

అభికృతి
ఒక పాదములో 25 అక్షరములు గల ఛందస్సును అభికృతి అంటారు.

అభిజిత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. జర్జరమును అర్పించు సమయంలో ఇది శత్రువులను సంహరించుటకు అభిజిత్ లగ్నంలో పుట్టినదని పొగుడుతారు.

అభితప్తదృష్టి
కనురెప్పలను సొగసుగా కదుపుతూ, కనుపాపలను నెమ్మదిగీ కదుపుచూ నొప్పిని , బాధను సూచించడమే అభితప్తదృష్టి. ఇది చింత, నిర్వేదము, అభిఘాతము, అభితాపము మొదలాన అభినయాలకు ఉపయోగిస్తారు.

అభినయము
అభినయము అనే పదము అభి అనే ఉపసర్గతో న అనే శబ్దమూలముతో దాని తర్వాతి స్థానంలో అభిని అవుంది. ? ఒక ప్రత్యయము చేర్చడం ద్వారా అభినయము అవుతుంది. అనగా ప్రయోగమును ప్రత్యక్షముగా అర్ధం తెలుసుకోవడానికి తీసుకువెళ్ళడం. వాటి నుంచి వచ్చినదే ఈ అభినయము అనే పదం. అభినయము శాఖ, అంగము మరియు ఉపాంగములతో కలిసి అర్ధమును వివరిస్తుంది. ఇది నాలుగు రకాలు. అవి, 1.ఆంగికము, 2.వాచికము, 3.ఆహార్యము, 4.సాత్వికము.

అభినయము
ఇవి నాలుగు రకాలు. 1.ఆంగికము(శరీరకదలికలు), 2.వాచికము(నోటితోచెప్పడం), 3.ఆహార్యము(అలంకరణ), 4.సాత్వికము(భావనలు).

అభినయము
సం. నా. వా. అ. న. తత్స. సభ్యులను ఆకర్షించడానికి చేసే హావభావ విన్యాసము. ఇది నాలుగు రకములు 1.ఆంగికము, 2.వాచికము, 3.ఆహార్యము, 4.సాత్వికము.

అభుగ్నవక్షము
ఛాతిని కొద్దిగా వంచి, నడుమును పైకెత్తి భుజములను వంచి వదులుగా చేయడం.

అభ్యంతరకక్ష్య
సభావేదిక పైన అంతరమునకు చెందిన కక్ష్యా విభాగము. నటులు వేదికపైకి ప్రవేశించిన తర్వాత వారు నిల్చునే లేదా కూర్చునే ప్రదేశమునే అభ్యంతరకక్ష్య అంటారు.

అభ్యంతరాసనవిధి
అనగా రాజ సభ యందు పురుషాసనము. Chapter12.

అమరులు
సం. నా. వా. అ. పుం. తత్స. మరణము లేనివారు, దేవతలు.

అమృతమయనము
దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తునట్టు చేసేది. బ్రహ్మ భరతునికి ఈ ప్రదర్శనను కొత్తగా కనిపెట్టి అతడే చేయాలని సెలవిచ్చాడు. ఈ ప్రదర్శన ధర్మ, అర్థ, కామములకు ఆధారంగా ఉండాలి.

అరాలకటకాముఖము
(నృత్తహస్తము) అరచేయి పైనున్న అలపల్లవ హస్తములు రెండు పద్మకోశ హస్తములోకి మార్చబడాలి. అరాళ కటకము అనునది దానికి మరొక పేరు.

అరాళము
(అసంయుతహస్తము) పతాక హస్తములోని తర్జనని వంచితే అరాళహస్తం ఏర్పడుతుంది. విషము, అమృతము మొదలైనవి త్రాగడం వీటిని ప్రదర్శించే సమయంలో అరాళహస్తం ప్రయుక్తమవుతుంది.

అర్గలము
(కరణము) పాదాలు, చేతులు కూడా 21/2 అడుగుల (తాళాల) ముందుకి శరీరం వెనకకు వంచి చాచాలి. అంగదుడు మొదలైనవారు పరికర్మలు ఇది చేసి నిరూపించారు.

అర్థఛిన్నము
సం. నా. వా. న్. న. తత్స. నాట్యమండపంలో భూతలాన్ని శుభ్రపరచిన తర్వాత ఒక తెల్లని దారంతో కొలత తీసుకుంటారు. ఇలాంటప్పుడు ఈ బంధము తెగిపోకూడదు. ఒకవేళ తెగినచో నాటకము యొక్క రక్షకుడు ఖచ్చితముగా మరణించును.

అర్థనాశకరణము
సంపదను పోగొట్టుకోవడం వల్ల కలిగే శోకము.

అర్థనికుట్టకము
(కరణం) చేతులు అలపల్లవ ముద్రతో వ్రేళ్ళు, ముఖం, భుజాలు మరియు ఒకే పదంలో వంగాలి. (నికుట్టిక అనునది ఒకవైపు చేసేది అర్థనికుట్టికము)

అర్థపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. నిర్మాత, సంరక్షకుడు.

అర్థమత్తల్లి
(కరణం) నూపురకారి అనునది చలా తొందరగా వేసెడి పాదం. చేతులు, పాదాలు ఒకేసారి తీవ్రంగా తిరిగి చేతులు, పాదాలుతో నికుంటిత, ఉరోమండల, కరిహస్త, కఠిఛిన్న కరణాలను ప్రదర్శించాలి.

అర్థము
సం. నా. వా. అ. న. తత్స. ధర్మార్థకామమోక్షములలో ఒకటి, ఐశ్వర్యము.

అర్థము
సంపద, పురుషార్ధములలో ఒకటి.

అర్థరేచితము
(కరణం) సూచి ముఖ ముద్ర చేయి చాలా వదులుగా ఉంచాలి. తర్వాత కొంచెం లాగి సాగదీసి పాదాన్ని వంచాలి. (నికుంచిత, సన్నుత ప్రసర ముద్రలతో)

అర్థసమము
ఛందస్సు లేదా వృత్తుల యొక్క జాతులలో ఒకటి. అర్థసమము అంటే సగభాగము సమముగా ఉండటము. ఇది గురులఘువుల యొక్క మేళనముతో ఏర్పడుతుంది.

అర్థస్వస్తికము
(కరణము) పాదం స్వస్తిక ముద్రలో ఉంచికుడిచేతితో కరిహస్త ముద్ర చూపాలి. ఎప్పుడైతే ఎడమచేతి స్థానంలో కుడిచేతిని అర్ధచంద్ర ముద్రలో ఉంచాలి.

అర్ధచంద్రము
(అసంయుతహస్తము) పతాక హస్తములోని బొటనవేలిని దూరంగా చాచితే అది అర్ధచంద్ర హస్తము అవుతుంది.

అర్ధనారీగతి
అర్ధనారీ యొక్క గమనము. ఇది పురుష, స్త్రీ గతుల యొక్క సమ్మేళనము. దీనియందు అవయవములు స్థిరముగా మరియు శృంగారభరితముగా ఉండాలి. ఈ గతియందు అడుగులు సరసముగా ఉండాలి.

అర్ధమాగది
చిత్ర పూర్వాంగములో మాగధితో పాటు దీనిని ఉపయోగిస్తారు.

అర్ధముకుళదృష్టి
ఆనందంతో కనిరెప్పలను సగం మూసి సగం తెరచి, కనుపాపలు కొంచెం వికసించి కొద్దిగా కదులుతూ ఉండటాన్ని అర్ధముకుళదృష్టి అంటారు. దీనిని గంధస్పర్శములో ఉపయోగిస్తారు.

అర్ధరేచిత హస్తము
(నృత్తహస్తము) చతురస్రములో ఉన్నట్టు ఎడమ చేతిని, రేచితములో ఉన్నట్టు కుడిచేతిని ఉంచడం. ?

అర్ధసూచి
(కరణం) అలపాదంలో ఉన్నచేయి తలని పైకి పెట్టి కుడి పాదం సూచికారి ముద్రతో చేయాలి.

అర్భుదము
ఒక దేశము యొక్క పేరు. ?

అలంకారము
?

అలపద్మము లేదా అలపల్లవము
అన్ని వేళ్ళు వేరు చేయబడి, అరచేతి వైపుగా కొంచెం పక్కకు వంచబడితే దానిని అలపద్మము అంటారు. ?

అలపల్లవము
(నృత్తహస్తము) రెండు చేతులు వాటి యొక్క కదలికలలో ఉద్వేష్ఠిత కరణమును కలిగి ఉండటం. ?

అలాతకము
(అంగహారము) స్వాతిక మరియు వైముస్త కరణాలు (రెండు సార్లు ఉపయోగించి) చేయాలి. మరల అలాతక, ఊర్వజను, నికుంచితము, అర్థసూచి, విక్షిత, ఉద్వాత, ఆక్షిప్త. కరిహస్త మరియు కఠిఛిన్న చేయాలి.

అలాతకము
(కరణము) అలాతకచారి ప్రదర్శింపబడిన తర్వాత కుడిచేతిని భుజాల మీద ఉంచిఊర్వజాని కరిచేయాలి. ఫలితం నాట్యమును సూచిస్తుంది.

అలాతచారీ
ఒక పాదమును వెనుకకు చాచి కదిపి మరల లోపలికి తెచ్చి చివరకు దాని మడమ యొక్క క్రింది భాగములో వచ్చేటట్లు చేయడము.

అవంతి
Chapter14 .

అవంతిక
ఒక దేశము యొక్క పేరు.

అవకృష్టాద్రువము
ఇది చతురస్ర తాళములో విలంబిత లయలో పాడబడాలి. ఈ దృవములో ఎక్కువ గురు అక్షరములు ఉంటాయి. దీనియందు అవరపాణి, స్థాయీ, వర్ణము మరియు ఎనిమిది మాత్రలు ఉండాలి. దీనియందు నాలుగు పాదములు ఉంటాయి. ఒక్కొక్క పాదములో పది అక్షరములు ఉంటాయి. ఇది పంక్తి ఛందస్సుకు దగ్గరగా ఉంటుంది.

అవతరణము
సంగీతకారుల యొక్క ప్రవేశము మరియు వారి స్థానము. అనగా ప్రవేశము తర్వాత వారికి నిర్దేశించిన స్థలములను ఆక్రమించడం. అప్సరసలు దీనిచేత ఆనందింపబడతారు.

అవధూతశిరము
తలను కిందకు వంచడం. ఏదైనా సందేశం ఇచ్చేటపుడు, దేవతలను ప్రార్ధించేటపిడి, మాట్లాడిటపుడు, ముగింపు సమయంలో దీనిని ఉపయోగిస్తారు.

అవరము
సం. నా. వా. అ న. తత్స. జ్యేష్ఠ, మధ్యమ తర్వాత నాట్యమండపము యొక్క మూడవ ప్రమాణము అవరము (చిన్నది). ఇది దేవతలకు, రాజులకు కాకుండా మిగిలిన ప్రజల కొరకు ఉద్దేశించబడింది. అభినవగుప్తుడి ప్రకారం నాట్యమండపాలు మూడు చిన్న పరిమాణము కలిగినవి. అవి 1)అవరవికృష్ఠము, 2)అవరచతురస్రము, 3)అవరత్ర్యాస్రము.

అవరోహణగతి
నదులలోకి కాని, ఏదైనా లోతైన ప్రదేశాలలోకి దిగినప్పుడు శరీరమును కొద్దిగా వంచి ఒక పాదమును అతి క్రాంతాచారీలోను, మరొక దానిని అంచితములోను ఉంచాలి.

అవలోకితదృష్టి
కిందికి, నేలవైపు చూడటం.

అవస్థ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రకరకాల భావసంబంధితములు. నాట్యశాస్త్రము వివిధ రకముల భావములను, వేరు వేరు పరిస్థితులను కలిగి ఉంటుంది.

అవహిత్థకము
(కరణము) కుడిచేతిని అరాళ ముద్రతో నుదురుపై ఉంచి రెండవ చేటిని అలపల్లవ ముద్రతో ఛాతి మీద ఉంచి రెండు చేతుల వేళ్ళు ఎదురెదురుగా ఉండునట్లు చేయునది. ఇది జనిత కరణం చేసిన తర్వాత చేయాలి.

అవహిత్థము
(సంయుతహస్తము) రెండు సోల పద్మహస్తాలు వక్షం మీద (అభిముఖంగా) ఉంచడం. శృంగారనటనము, లీలాకందుకము మొదలైనవి దీని యందు ప్రయుక్తమవుతాయి.

అవహిత్థము
అంతర భావనలను రహస్యముగా దాచుట.

అవహిత్థస్థానము
వెనుకకు తిప్పిన పాదములతో ఆయత స్థానములో చేసినట్టుగానే చేయడం. ఎడమ పాదము కుడి పాదములో ఉన్నట్టుగానే త్ర్యాస్రములో ఉండటం. దీని ఆస్థాన దేవత దుర్గ.

అవిద్ధప్రయోగము
1.శక్తివంతమైన రకము. దీని యొక్క కదలికలు, భంగిమలు కొట్టడాన్ని, గాయపరచడాన్ని, ప్రతిజ్ఞ చేయడాన్ని, యోగికమైన శక్తులను, మంత్రములను, కృత్రిమమైన వస్తువులను ఉపయోగించడం మొదలైన వాటిని అభినయిస్తాయి, 2.సభ్యులలో ఎక్కువ మంది పురుషులు, తక్కువ మంది స్త్రీలు ఉంటారు, 3.సాత్వతీ, ఆరభటీ వృత్తులు ప్రధానము, 4.డిమ, సమవకారము, వ్యాయోగము, ఈహామృగము ఇవన్నీ ఆవిద్ధ రూపకాలు, 5.దేవతలు, దానవులు, రాక్షసులు వీరందరూ గొప్పగా పరాక్రమమును చూపించేవారై ఉండాలి.

అవిద్ధవక్రము లేదా అవిద్ధవక్త్రము
(నృత్తహస్తము) ఎదుటి భుజమును, చేతులను, అరచేతులను స్పర్శించిన తర్వాత రెండు చేతులు చేసే సుకుమార కదలికలు. ?

అవేష్టితము
చూపుడు వేలు మొదలుకొని అన్నివేళ్ళను లోపలికి ఉంచేటప్పుడు జరిగే మణికట్టు యొక్క కదలికలను అవేష్టితము అంటారు. ఇది ఒక కరణము.

అవ్యక్తము
సం. నా. వా. అ న. తత్స. వ్యక్తము కానిది. హావభావము మరియు పాటలలో స్పష్టత లేకపోవటం.

అశ్వక్రాంతస్థానము
ఒక పాదమును సమస్థితిలో ఉంచి మరొక దానిని అగర్తలాంచితములో పైకెత్తి సూచీ లేదా అవిద్ధాచారీకి సిద్ధం కావడం.

అశ్వయానగతి
దీనియందు గతి వైశాఖ స్థానమును కలిగి ఉండి వివిధ రకాల చిన్న అడుగులు వేస్తూ ఉండాలి.

అశ్వినులు
సం. నా. వా. ? అశ్వినీ దేవతలు, దివ్యకవలలు.

అష్టాంగపదసంయుక్తము
సం. నా. వా. అ. న. తత్స. నాందియందు ఒక భాగము, ఎనిమిది రకాల పదాలు కలిగిన ఒక అవయవము.

అష్టి
ఒక పాదములో 16 అక్షరాలు ఉండే ఛందస్సును అష్టి అంటారు.

అసంయుతహస్తములు
ఒకే చేతితో సంజ్ఞలు చేయడం. ఇవి 24. 1.పతాకము, 2.త్రిపతాకము, 3.కర్తరీముఖము, 4.అర్ధచంద్రము, 5.అరాళము, 6.శుకతుండము, 7.ముష్టి, 8.శిఖరము, 9.కపిత్తము, 10.కటకాముఖము, 11.సూచీముఖము, 12.పద్మకోశము, 13.సర్పశిరము, 14.మృగశీర్షకము, 15.లాంగులము, 16.అలపద్మము, 17.చతురము, 18.భ్రమరము, 19.హంసాస్యము, 20.హంసపక్ష్మము, 21.సందంశము, 22.ముకుళము, 23.ఊర్ణనభము, 24.తామ్రచూడము.

అసురులు
సం. నా. వా. అ. పుం. తత్స. రాక్షసులు.

అస్పృశ్యగతి
నాచమైన గుణము. నీచ లేదా అస్పృశ్యగతి యందు నడవడిక చుట్టుపక్కల చూస్తూ తమ అవయవాలను ఇతర వ్యక్తుల చూపునుండి రక్షించుకొనే విధముగా ఉంటుంది.

ఆంగికాభినయము
ఆంగికాభినయము అనగా అవయవాల కదలిక ద్వారా చేసే అభినయము. ఇది నాలుగు రకాల అభినయాలలో ఒకటి. ఆంగికము, శాఖ, అంగము, ఉపాంగముల యొక్క కలయిక. ఇది మూడు రకాలు. అవి, 1.శారీరజము, 2.ముఖజము, 3.చేష్టాకృతము.

ఆంచితం
(కరణం) కరిహస్త, అర్థసాత్విక, వైవర్తిత మరియు పరివర్తిత కదలికలలో ముక్కు వంచినట్టుగా ఉండాలి.

ఆంధ్రమహారాష్ట్ర
ఇవి రెండు స్వతంత్రముగా ఆంధ్రదేశము మరియు మహారాష్ట్రగా పిలువబడతాయి లేదా ఆంధ్ర మహారాష్ట్రముగా (ఆంధ్ర మహారాజ్యము) చెప్పబడుతుంది.

ఆంధ్రము
నాలుగు ప్రాంతాలలో ఒకటి. పూర్వరంగము నాలుగు ప్రాంతాల వారిచేత ప్రదర్శింపబడాలి. నాయకుడు ఏ ప్రాంతానికి సంబంధించినవాడో ఆ ప్రాంత దుస్తులను ధరించాలి.

ఆకంపితశిరము
తలను పైకి, కిందకి నెమ్మదిగా ఊపడం. ఏదైనా శిక్షణనిచ్చేటప్పుడు, సూచననిచ్చేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు, సహజముగా సంభాషించేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

ఆకాశకీచారీ
దీనియందు ఒక పాదము లేదా రెండూ కూడా పైకెత్తబడి ఉంటాయి. ఎక్కువగా ఇవి సున్నితమైన పాదకర్మములుగా చెప్పబడతాయి. అవయవాల యొక్క అద్భుతమైన కదలికల ద్వారా దీనిని బాణము, వజ్రము వంటి ఆయుధములు సంధించటంలో ఉపయోగిస్తారు. ఇది 16 రకాలు. Chapter10. ఈ ఆకాశకీ తారీలు భరతుని చేత అంగీకరింపబడ్డాయి. దేశీ విధానములలో మరికొన్ని చారీలు కూడా ఉన్నాయి. సంగీత రత్నాకరము మరియు నృత్తరత్నావళిలో చెప్పబడినవి 19 రకాలు.

ఆకాశగమనగతి
శరీరమును వంచి కిందకి చూస్తూ సమపాదస్థానము నుండి కదిలి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆకాశగతిని పొందాలి.

ఆకుంచితశయనము
అవయవాలు అన్ని విశ్రాంతి దశలో ఉండి మోకాళ్ళు రెండూ ఒకదానితో ఒకటి తాకుతూ సేద తీరడం. దీనిని చలిని అనుభవిస్తున్న వ్యక్తిని అభినయించటానికి ఉపయోగిస్తారు.

ఆకృతి
ఒక పాదములో 22 అక్షరాలు ఉండే ఛందస్సు.

ఆకేకరా దృష్టి
కనురెప్పలను కొద్దిగా వంచి ఒకదానితో ఒకటి చేర్చి, కనుపాపలను పైకి, ప్రక్కలకు మరల మరల చేస్తే దానిని ఆకేకరా దృష్టి అంటారు. దీనిని దురతకము, విచ్ఛేదప్రేక్షితములలో ఉపయోగిస్తారు.

ఆక్షిప్తకము
దీనిలో కరణాలు ఈ ప్రకారముగా అమర్చబడినవి. నూపుర, విక్షిప్త, అలాతక, ఆక్షిప్త, ఉరోమండల, నితంబ, కటిహస్త మరియు కఠిఛిన్న.

ఆక్షిప్తచారీ
కుంచ్త పాదము పైకి విసరబడి నేలపైన అంచిత పాదము నుంచి చేతులను స్వస్తికములో ఉంచితే ఆక్షిప్తచారీ అంటారు.

ఆక్షిప్తము
(కరణము) దీనియందు పాదములు మరియు చేతులు కూడా ఆక్షిప్త దశలో ఉండాలి. అనగా వెనకకు కాని, పక్కకుగాని వేయబడాలి.

ఆక్షిప్తరేచితము
ఎడమ చేతిని ఛాతి మీద, కుడి చేయి ప్రక్కకు తిప్పి అపవిద్ధంగా ఉంచాలి. (ఇక్కడ ఆంచిత మరియు సూచిపాద వాడాలి.)

ఆఖ్యాతము
(క్రియ) 500 మూలాలు 25 సమూహాలుగా వర్గీకరణ చేయబడితే దానిని ఆ మూలమునకు చెందిన క్రియగా చెప్తారు. ఇవి నామవాచకాలకు అర్ధాలను చేకూరుస్తాయి. ఇవి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో కలవబడి ఆఖ్యాతములుగా చెప్పబడతాయి.

ఆఖ్యానము
సం. నా. వా. అ. న. తత్స. నాటకము లేదా నాట్యమునకు ఉత్సాహాన్ని ఇవ్వగలిగే కథలను ఆఖ్యానము అంటారు. దీనియందు వేదాలు మరియు చారిత్రకగాథలు ఉంటాయి.

ఆచ్ఛురితము
సం. నా. వా. అ. పుం. తత్స. నూపుర కరణము తర్వాత త్రికము త్రిప్పబడి, వ్యంసిత కరణము మరల త్రికము తిప్పబడి తర్వాత ఎడమ ప్రక్కనుంచి అలాతక సూచి, ఆ తర్వాత కరిహస్తము, కఠిఛిన్నము చేయాలి.

ఆతోద్యము
సంగీత వాయిద్యములు. ఇవి నాలుగు రకాలు. 1.తతము(తీగవాద్యాలు-వీణ, తుంబుర), 2.అవనద్ధము(మూసుకొని ఉన్నవి, చర్మవాయిద్యములు), 3.శుషిరము(వేణువు, గాలి, నాదస్వరము), 4.ఘనము(గట్టివి, ధృఢమైనవి).

ఆత్రేయ
సం. నా. వా. అ. పుం. తత్స. ఒక ముని పేరు. వీరు ఇద్దరు కలరు, ఒకరు మహాభారతములోని యాజ్ఞవల్క్యుని శిష్యుడు, రెండవవాడు బ్రహ్మపురాణము నందు వామదేవుని శిష్యుడు.

ఆదానము
ధనుస్సును పైకి తీసే కర్మ. అనగా గ్రహణ క్రియ.

ఆదిత్యులు
సం. నా. వా. అ. పుం. తత్స. నాట్యరంగానికి మూలమైనవాటి రక్షణ బాధ్యతను రుద్రులతో పాటు తీసుకునేవారు.

ఆధూతశిరము లేదా ఉద్వాహితశిరము
తలను పైకెత్తడం ఆధూతశిరము లేదా ఉద్వాహితశిరము. గర్వమును ప్రదర్శించేటప్పుడు, స్విచ్ఛగా పైకి చూసేటప్పుడు, గౌరవం కలిగినపుడు దీనిని ఉపయోగిస్తారు.

ఆనందజాద్భుతము
రెండు రకాల అద్భుత రసాలలో ఒకటి.

ఆనర్తము
ఒక దేశము యొక్క పేరు. ఉత్తర కటియావర్ ద్వీపము అయి ఉండవచ్చు.

ఆమంత్రణము
ఆహ్వానము, స్వాగతము.

ఆయతస్థానము
కుడిపాదమును సమస్థితిలో ఉంచి, ఎడమ పాదమును ఒక తాళము దూరములో ఉంచాలి. దీనియందు ఉల్లాసమైన ముఖము కలిగి ఉండాలి. ఛాతిని పైకెత్తాలి. నడుముని కదపకుండా కుడిచేతిని నడుముపై ఉంచి మరొక చేతిని లతాభంగిమలో ఉంచాలి. దీని ఆస్థాన దేవత లక్ష్మి.

ఆయసము
సం. నా. వా. అ. న. తత్స. అనగా ఇనుము. చతుర్వర్ణ స్తంభాలను ప్రతిష్ఠించే సమయంలో శూద్ర స్తంభము కింద ఇనుము మరియు బంగారమును ఉంచుతారు.

ఆరంభము
సంగీతముతో ఆరంభించిట. అనగా పరిగీతక్రియారంభము. పాడటానికి ముందు చేసే వ్యాయమమునే ఆరంభము అంటారు. దీనిచేత గాంధర్వులు ఆనందింపబడతారు.

ఆరభటి
సం. నా. వా. ? నాలుగు వృత్తులలో ఒకటి, ఈ వృత్తియందు కదలికలు కలవు.

ఆరోహణగతి
మెట్లు, చెట్టు లేదా కొండ లాంటివి ఎక్కేటప్పుడు పాదములు అతిక్రాంతీ చారీలో ఉండాలి. శరీరము పైకి ఉంచాలి.

ఆలీఢము
(అంగహారము) రెండు చేతులు వైముస్తకంలోను, తొడలు మరియు తల నికుంటితంలోనప, ఎడమ పాదం నూపుర మరలా కుడివైపు అలాతక, ఆక్షిప్త, ఉరోమండల ముద్రసు చేతితో చేస్తూ కరిహస్త, కఠిఛిన్న అభినయాల్ని అనువదించాలి.

ఆలీఢస్థానము
ఎడమ తొడను గాలిలో నిశ్చలముగా ఉంచి మరియు కొద్దిగా వంచబడి కుడి పాదమును 5 తాళముల వరకు ముందరికి చాచడం.

ఆలోకితము
జాలి, చూచుట. ఏదైనా వస్తువు కోసం ఆకస్మికంగా అడుగుట.

ఆవంతిక
ప్రాంతములలో ఒకటి. త్ర్యాస్రము, చతురస్రము యొక్క పూర్వరంగములు అవంతి, పాంచాల, దక్షిణాత్య, మరియు ఓద్ర ప్రాంతముల చేత ప్రదర్శింపబడాలి.

ఆవర్తము
కుడి పాదాన్ని కొంచెం పైకెత్తి ఒక ఆవర్తము తిరిగి చేతులు కూడా సమముగా ఊపాలి. దీనిలో కసగతికారి కరణం చేతులకు ఊధ్వస్తిత, అపవస్తిత మరియు డోల ముద్రలు ఉపయోగించాలి. ఇది సైగరిక పాశ బంధాన్ని సూచిస్తుంది.

ఆవర్తితము
ఎడమ పాదమును కుడిపక్కకి, కుడ్పాదమును ఎడమ పక్కకి పదే పదే తిప్పడం.

ఆవాహము
సం. నా. వా. అ. న. తత్స. త్యాగము.

ఆవిద్ధచారీ
స్వస్తికము నుంచి కుంచిత పాదము కదపబడి ముందుకు చాచి అంచితముతో భూమిపై పడితే దానిని ఆవిద్ధచారీ అంటారు.

ఆశీర్వచనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రదర్శన విజయవంతమైన తర్వాత బ్రహ్మ, దేవతలు, రాజులు, అర్థపతి మొదలైనవారు ఇచ్చే అభినందన ఆశీర్వచనము.

ఆశ్రమిణము
సం. నా. వా. అ. న. తత్స. శంకుస్థాపన (పునాది) జరుగు సమయంలో నాస్తికులు, శ్రామిణులు, కాషాయ వస్త్రధారులు, వికలాంగులు కర్మ దరిదాపులలో ఉండరాదు.

ఆశ్రావణము
వాయిద్యములను శృతి చేయడం. సంగీత వాయిద్యములను వాయించుటకు ముందు శృతిని నియమించుకోవడం. దీని ద్వారా దైత్యులు ఆనందింపబడతారు.

ఆసనవిధి
నాట్యములో స్త్రీ, పురుషుల ఆసనములకు సంబంధించిన నియమాలు రెండు విధములు. అవి, 1.బాహ్యము, 2.అభ్యంతరము.

ఆసారితము
?

ఆసారితము
ఇది పూర్వాంగములలో ఒకటి. దీనిని లోపల ప్రదర్శింపచేసినది యవనిక. ఇది రెండు విధములు. 1)సుశక్షర ప్రయోగ యవనిక లోపల ఉండును. ఇది ఉపహన. 2)ఉపహన తరువాత యవనిక విముక్తింపబడి అసలు నర్తకి ప్రవేశ పెట్టబడి నిజమైన నృత్యములు చేయును. ఇది నాలుగు దశలుగా ఉండును. అవి 1)ప్రథమ సరిత, 2)ద్వితీయ సరిత, 3)తృతీయ సరిత, 4)చతుర్థ సరిత. దీనితో పాటు కాలము కూడా నాలుగు భేదాలుగా చెప్పబడింది. అవి వరుసగా 1)కనిష్ఠ సరిత, 2)దివ్యంగుళముక్త సరిత, 3)మధ్యమ సరిత, 4)జ్యేష్ఠసరిత. ణరల నాలుగు అంగాలుగా చెప్పబడినవి. అవి 1)ముఖ, 2)ప్రతిముఖ, 3)శరీర, 4)సంహరణ.

ఆస్యకర్మ
నోటితో చేసే పని. ఇది ఆరు రకాలు. 1.వినివృత్తము, 2.విధూతము, 3.నిర్భుగ్నము, 4.భుగ్నము, 5.విదృతము, 6.ఉద్వము.

ఇందువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చంద్రుడు.

ఇతిహాసము
సం. నా. వా. ? గతంలో జరిగిన విషయాల గురించి తెలియజేసేవి. ఇవి రెండు విధములు. అవి 1)విజయ గాథలు, 2)ఆచరించదగిన, ప్రకాశవంతమైన విజ్ఞానాన్ని అందించేవి. చతుర్విధ పురుషార్థములతో కూడిన పూర్వగాథలను తెలియజేస్తాయి. పూర్వకాలంలో చరిత్రను మనోయోగం ద్వారా అభ్యసించిన కారణంగా ఇది పంచమవేదంగా పిలువబడుతోంది. నాట్యశాస్త్రము కూడా పైవిధములైన పద్ధతులను అవలంబించడం ద్వారా పంచమవేదంగా పిలువబడుతోంది.

ఈర్ష్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఇతరుల అభివృద్ధిని, ఉన్నతిని చూసి ఓర్వలేకుండుట.

ఈశ్వరీ, వృషభపిండి
శివుని యొక్క చిహ్నము. శివుని ఆనందింప చేయునది.

ఉత్కారికము
సం. నా. వా. అ. న. తత్స. ఒకరకమైన మాంసము.

ఉత్క్షిప్త శిరము
పైకి చూసేలాగ తలను వెనుకకు వంచడం. ఆకాశములో ఉన్నవాటిని చూసేటపుడు, బాగా పైన వాటిని చూసేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

ఉత్క్షేప భ్రువు
కనుబొమ్మలను ఒకేసారి కాని, ఒకదాని తర్వాత ఒకటి కాని పైకెత్తడం. కోపములోను, ఆలోచనలోను, గుణములోను, రసములోను, విలాసములోను, రసములోను, శృంగారములోను, వినడంలోను, చూడడంలోను ఉపయోగిస్తారు. వినేటపుడు కేవలము ఒక కనుబొమ్మ మాత్రమే గత్యంతరముగా ఎత్తబడాలి. ఆస్చర్యములోను, ఆనందములోను మరియు భయంకరమైన కోపములోను రెండు కనుబొమ్మలు ఒకేసారి ఎత్తబడాలి.

ఉత్తమ,మధ్యమ,నీచగతులు
3 ప్రకృతుల యొక్క కాల, తాళ విధుల విషయానికి వస్తే ఉత్తమ ప్రకృతికి చెందిన వ్యక్తులు తీసుకునే సమయం 4 కాలాలు, మధ్యమ ప్రకృతికి చెందిన వ్యక్తులు తీసుకొనే సమయం 2 కాలాలు, నీచ ప్రకృతికి చెందినవారు తీసుకునే సమయం 1 కాలంగా చెప్పబడింది. ఉత్తముని యొక్క గతి స్థిరముగాను, మధ్యముని యొక్క గతి మధ్యమముగాను, నీచుని యొక్క గతి వేగముగాను ఉంటుంది.

ఉత్తమము
శ్రేష్టమైన ప్రకృతి.

ఉత్తరకురువర్షము
ఏడు వర్షములలో ఒకటి.

ఉత్థానవంచితము
(నృత్తహస్తము) రెండు నృత్తహస్తములు కొద్దిగా వంచబడి భుజములు రెండు కదపబడినట్లైతే దానిని ఉత్థానహస్తము అంటారు.

ఉత్థాపనము
అనగా ప్రారంభము. సభావేదిక పైన నాందీపతాకములు ప్రదర్శనకు సిద్ధము కావటం. దీనివలన బ్రహ్మదేవుడు ఆనందింపబడతాడు.

ఉత్థాపనిధ్రువము
ఐదు ధ్రువములలో ఒకటి. ఒక చిన్న మార్పుతో చతురస్రములోను, త్ర్యాస్రములోను, పూర్వరంగములోను దీనిని ఉపయోగించవచ్చు. శుద్ధచతురస్ర పూర్వరంగములో ఉత్థాపనిధ్రువమునకు నాలుగు పాదములు ఉండి ఒక్కొక్క పాదములో ఎనిమిది అక్షరములు ఉంటాయి. 1, 2, 4, 8, 13 అక్షరములు గురువులు. మిగిలినవి లఘువులు. ఇవి త్రిష్టుప్ ఛందస్సు మరియు విశ్లోక వృత్తికి సంబంధించినవి. ఇది చతురస్ర తాళములో ఉండాలి. దీనియందు నాలుగు సన్నిపాతాలు, మూడు లయలు, మూడు యతులు, నాలుగు పరివర్తనములు, మూడు పాణులు కలవు. తాళములో వరుసగా రెండు కళల యొక్క తాళము, ఒక కళ యొక్క సామ్యము, మూడు కళల యొక్క సన్నిపాతము ఖచ్చితంగా ఉండాలి. శుద్ధత్ర్యాస్రములోని వృత్తాపనిధ్రువము జగతి ఛందస్సుకు సంబంధించినది. ఇది నాలుగు పాదములు కలిగి ఉండి ఒక్కొక్క పాదములో పన్నెండు అక్షరాలు ఉంటాయి. 1, 4, 8, 10, 12 అక్షరాలు గురువులు, మిగిలినవి లఘువులు.

ఉత్సంగము
(సంయుతహస్తము) రెండు మృగశీర్ష హస్తాలు పరస్పరం బాహుమూలములందు లేదా బాహువులందు ఉంటే అది ఉత్సంగహస్తము అవుతుంది. ఆలింగనము, సిగ్గు, భుజకీర్తులను చూపటం, బాలురను శిక్షించటం మొదలైన అర్ధముల యందు ఈ హస్తము ఉపయోగపడుతుంది.

ఉత్సృందితచారీ
పాదములు మేచకములో లోపలికి, బయటకి కదపబడడం.

ఉదావృత్తచారీ
అవిద్ధచారీ పాదమును మరొకదానిని తీసుకొని చుట్టూ కదిలిన తర్వాత పైకి విసిరి నేలపై ఉంచడం. మరొక పాదంతో కూడా దీనినే ప్రదర్శిస్తారు.

ఉద్గటితము
(కరణము) పాదముతో ఉద్గటితము చేసిన తర్వాత రెండు చేతులను తలసంఘట్టితములో ఉంచి నాటపార్శ్వమును ప్రదర్శించాలి. ఇది ప్రమోదము మొదలైనవాటికి సంబంధించినది.

ఉద్గటితము
కుడిచేతిని ఉద్వేష్ఠితములోను, అపవిద్ధ భంగిమలోను ఉంచి పాదమును భూమికి ఆన్చి ఇదే విధముగా ఎడమ పక్క కూడా చేసి తర్వాత రెండు చేతులను ఉరోమండలములో ఉంచి ఆ తర్వాత నితంబము, కరిహస్తము, కఠిఛిన్న కరణములు చేయాలి.

ఉద్ఘటితపాదము
పాదాన్ని సగానికి ఎత్తి నిల్చోవడం. ?

ఉద్వర్తితోరువు
(చాలా తొందరగా తిరగాలి), మోకాలును గట్టిగా లాగడము. ?

ఉద్వాహి ఆస్యము
ఉద్వాహి అనగా నోటిని పైకి తిప్పడం. స్త్రీల గర్వములోను, కోపముగా ఉన్నపుడు, పక్కకి పొమ్మనపుడు దీనిని ఉపయోగిస్తారు.

ఉద్వాహితకటి
ఛాతి రెండు పక్కల ఎగరవేయడం.

ఉద్వాహితజంఘ
?

ఉద్వాహితవక్షము
ఛాతిని పైకెత్తడం.

ఉద్వాహితశయనము
తలను భుజముపైన ఆన్చి, మోచేతిని నేల పైన కదుపుతూ నిద్ర చేయడం. ప్రభువు ముందు చేసే భంగిమ.

ఉద్వృత్తకము
(అంగహారము) ముందుగా నూపురపాదాచారీని చేతులను రెండు పక్కల వ్రేలాడదీసి ఆ తర్వాత రెండు చేతులనూ విక్షిప్తకరణము, సూచీచారీలో ఉంచి త్రికమును తిప్పి లతావృశ్చికము, కఠిఛిన్న కరణములను చేయాలి.

ఉద్వృత్తము
(నృత్తహస్తము) రెండు హంసపక్షహస్తాల కదలికలు ఫ్ను తిరిగినట్లుగా తిప్పాలి. దీనికి మరొక పేరు తాళవృత్తము.

ఉద్వృత్తము
(కరణము) చేతులను, పాదాలను, శరీరమును పైకెత్తి అనగా ఆక్షిప్త దశలో ఉంచి ఉద్వృత్తచారీ ప్రదర్శించాలి.

ఉద్వేష్ఠితము
1.(బహుసంచారము) ఇది చేతితో చేసే అభినయము. ఛాతి మీద ఒక చేయి ఉంచి వేరే చేతితో కదలడం. 2.(హస్తకరణము) ?

ఉద్వేహి
మూడు రకాల బీభత్స రసములలో ఒకటి. రక్తము మరియు దానికి సంబంధించిన వస్తువులను చూసినపుడు కలిగేది.

ఉన్నతగ్రీవము
ముఖముతో పాటు మెడను పైకెత్తుట. పైకి చూసేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

ఉన్నతము
(సమున్నతపార్శ్వము) నతకి మరొక పేరు.

ఉన్మత్తకము
(కరణము) అంచిత పాదములతో రేచితహస్తమును ప్రదర్శించడం.

ఉన్మత్తులగతి
వీరి గతి నియమానుసారాలు లేకుండా రకరకాల పురుషుల చారీలను అనుకరిస్తూ ఉంటుంది. వేదిక యొక్క మూలకు చేరేందుకు ఇతడు బద్ధాచారీ మరియు స్వస్తిక పాదములను తీసుకొని వేదిక చుట్టూ తిరుగుతూ భ్రమర మండలమును ప్రదర్శించాలి.

ఉన్మేషపుటము
కనురెప్పలను తెరవడము. క్రోధములో ఉపయోగిస్తారు.

ఉపచారము
సేవ, ధ్యానమార్గము.

ఉపన్యాసము
ఇది తాండవ విధియందు వస్తుంది.

ఉపసృతకము
(కరణము) ఒక పాదమును ఆక్షిప్తములో ఉంచి చేతులను కొద్దిగా వంచి పాదములకు తగ్గట్టుగా కదపడం.

ఉపహసితము
హేళనగా నవ్వడం. ముక్కును ఎడమ చేసి, కళ్ళను అడ్డంగా ఊపుతూ తలను, భుజములను కొద్దిగా వంచి నవ్వడం. ఇది మద్యమ ప్రకృతికి సంబంధించినది.

ఉపాంగము
ఉపాంగము అనగా చిన్న అవయవములు. ఇవి ఆరు. 1.నేత్రము, 2.భ్రువు, 3.నాసము, 4.అధరము, 5.కపోలము, 6.చిబుకము.

ఉపేంద్రుడు
పూర్వరంగములో పరివర్తనము చివరలో సూత్రధారుడు పురుష, స్త్రీ, నపుంసక పదములతో ముందుకు వెళ్ళేటప్పుడు తూర్పుకు అభిముఖంగా నించుని రుద్రునికి, అంబుజునకి (బ్రహ్మ) మరియు ఉపేంద్రునికి (విష్ణువుకి) తలవంచి నమస్కరించాలి.

ఉపోహనము
అనగా గీతములో ఒక భాగము. తరచుగా వచ్చే పాటకు ముందు ఝుంకారము చేయడం లేదా మందస్థాయిలో పాడటం. అనగా వస్తుగీతంలోకి వెళ్ళే ముందు కాలమును, స్వరమును సరిచేయడం కోసం ఒక పాటను అర్ధం లేకుండా పాడతారు. దీనినే ఉపోహనము అంటారు. దీనిలో చేతి వాయిద్యాలు వాడకూడదు. కేవలం తీగ వాయిద్యాలు, గాలివాయిద్యాలు మాత్రమే వాయించాలి.

ఉరూకర్మ
ఛాతితో చేసే నటన. ఇవి 1.వకాసకర్మ, 2.హార్ధ్యకర్మ, 3.ఊర్ధ్వకర్మలను నది ఐదు రకాలు. అవి, 1.అభుగ్మ, 2.నిర్భుగ్న, 3.ప్రకంపిత, 4.ఉద్వహిత, 5.సమము.

ఉరోమండలము
(కరణము) పాదములను స్వస్తికము నుండి తీసి అపవిద్ధాచారీ యందు ఉంచడం. చేతులను ఛాతిపై ఉంచడం.

ఉల్బణ
(నృత్తహస్తము) చేతులు చాచడము. ?

ఉల్లోకిత దర్శనము
కనుపాపలను పైకెత్తి చూడటం.

ఉశీనరము
ఒక రాజ్యము యొక్క పేరు.

ఊరుద్వృత్తచారీ
అగర్తల సంచారీ యొక్క మడమ బయటవైపుకు ఉంచి ఒక కాలిని కొద్దిగా వంచి మరొక దానిని పైకెత్తాలి.

ఊరుద్వృత్తము
(కరణము) ఒకచేతిని ఆవృత్తములో ఉంచి తొడకు వెనుక భాగంలో ఉంచాలి. పాదమును అంచితములో ఉంచి, తర్వాత ఉద్వృత్తములో పైకెత్తాలి. దీనిని ప్రార్థన యందు, శృంగారములో అసూయ, కోపమునందు ఉపయోగిస్తారు.

ఊర్ధ్వజానుచారీ
ఒక పాదమును కుంచితములో పైకెత్తి మోకాలిని ఛాతికి సమముగా తీసుకువచ్చి, మరొక పాదమును కదలికలు లేకుండా ఉంచడం. మరొక పాదంతో కూడా ఇదే విధముగా చేయాలి.

ఊర్ధ్వజానువు
(కరణము) కుంచిత పాదమును ఛాతి స్థాయిలోకి వచ్చే విధంగా ఎత్తాలి. చేతులను కూడా అదే విధంగా ఛాతిస్థాయిలోకి వచ్చే విధంగా ఎత్తాలి.

ఊహము
సం. నా. వా. అ. న. తత్స. స్తంభము యొక్క పై భాగము.

ఋగ్వేదము
సం. నా. వా. అ. పుం. తత్స. నాలుగు వేదములలో ఒకటి. బ్రహ్మ నాట్యశాస్త్రములో వచనమును ఈ వేదము నుండే స్వీకరించాడు.

ఏడకాక్రీడితచారీ
నిద్రలో నడవడం. అగర్తల సంచారములోనున్న పాదములతోటి పైకి, కిందకి గెంతడం.

ఏలకాక్రీడితము
(కరణము) పాదమును అగ్రతల సంచారంలో ఉంచి పైకి గెంతి శరీరాన్ని వంచుతూ కిందికి వచ్చి తిరగడం.

ఐరావతపిండి
సం. నా. వా. ఇది ఇంద్రుని యొక్క గుర్తు.

ఐలవృత్తము
సప్త వర్షములలో ఒకటి.

ఓంకారము
సం. నా. వా. అ. న. తత్స. ఇచట ఓంకారము ప్రణయ దేవతగా పరిగణించబడుతుంది. నాట్య మండప నిర్మాణం తర్వాత విదూషకుని పరిరక్షణను ఓంకారుడు చూసుకోవలసినదిగా కోరబడ్డాడు.

ఓఘము
దీనిని సంగాతములో మూడు రకాలుగా వాడతారు. అవి తత్వ, అనుగత, ఓఘము. ఈ మూడు కలిసి చాలా కరణాలు ఏర్పడతాయి. ఈ ఓఘ సంగీతము ఉపరిపాణి కలిగి ఉండి అవిద్ధ కరణములో ఎక్కువగా కన్పిస్తుంది. మార్గము, దృతకాలము, గ్రహ రెండు కూడా పాట అర్థమును బట్టి మారుతూ ఉంటాయి. నియమ నిబంధనల ప్రకారం ఓఘము దృతలయలో ఉండాలి. లయను, తాళమును అనుసరించే సమయంలో మూడవదానిలో ఉన్న ఓఘమును ప్రదర్శన సమయంలో పాడాలి.

ఓఢ్రమాగధి
Chapter13.1. అన్నీకూడా ఓఢ్రమాగధిని అవలంబించాలి. పురాణములలో చెప్పబడిన కొన్ని తూర్పుభాగమునకు చెందిన రాజ్యాలు కూడా ఈ పద్ధతినే అవలంబించాలి.

ఓఢ్రము
తూర్పురాజ్యము యొక్క పేరు.

ఓషధులు
సం. నా. వా. న్. పుం. తత్స. హోమము చేసే సమయంలో ఉపయోగించే పవిత్రమైన మొక్కలు.

కంపనము
ప్రకంపనము. పెదవులను కదల్చుట. భాదలోను, నాష్టిలోను, భయెలోను, కోపంలోను, జపంలోను దీనిని ఉపయోగిస్తారు.

కంపితగండము
బుగ్గలు వణకడము. దీనిని రోషమునందు, హర్షమునందు ఉపయోగిస్తారు.

కంపితము లేదా ప్రకంపితకటి
నడుమును సొగసుగా పైకి, క్రిందకి ఊపుట. ?

కంపితశిరము
ఆకంపితము త్వరగా పదే పదే చేయబడినట్లైతే దానిని కంపితశిరము అంటారు.

కంపితోరువు
మడమలను పదే పదే పైకెత్తి దించడం.

కటకవర్ధమానము
రెండు కటకాముఖ హస్తాలు మణికట్టుల వద్ద స్వస్తికము కావటం చేత కటకవర్ధమానము ఏర్పడుతుంది. పట్టాభిషేకం, పూజ, దీవెన మొదలైనవాటికి ఇది తగును.

కటకాముఖము
కపిత్థ హస్తమందలి తర్జని చివర బొటనవేలితో నడిమి వేలితో కలిస్తే అద్ కటకాముఖ హస్తమవుతుంది. దీనిని పూలు కోయడం, ముత్యాల పూలదండలు ధరించడం, మాట, చూపు మొదలైన అర్ధముల యందు వినియోగింపబడుతుంది.

కటికర్మ
మణికట్టుతో చేసే పనులు ఐదు రకములు. 1.ఛిన్నము, 2.నివృత్తము, 3.రేచితము, 4.కంపితము, 5.ఉద్వాహితము.

కటిచ్ఛిన్నము
(కరణము) ఇది రెండు పక్కల ఒకదాని తర్వాత ఒకటి అమలుచేయబడతాయి. చేతులను తలపై ఒకదాని తర్వాత ఒకటి ఉంచాలి. విస్మయానికి సంబంధించిన అభినయంలో దీనిని వినియోగిస్తారు.

కటిభ్రాంతము
(కరణం) సూచీచారీ తర్వాత కుడి పాదములో అపవిద్ద ఆ తర్వాత కటిరేచిత చేయడం.

కటిరేచకము
త్రికమును పైకెత్తి చుట్టూ తిప్పి వెనకకు చాచడం.

కటిసమము
(కరణం) జర్జరమునకు మంత్రమును జపించు సమయంలో సూత్రధారుడు ఈ కరణమును ప్రదర్శించాలి. ?

కఠినము
సం. నా. వా. అ. న. తత్స. నాట్యమండప నిర్మాణ సమయంలో ఎంపిక చేయబడే భూమి ధృఢముగా ఉండాలి.

కనకము
సం. నా. వా. అ. న. తత్స. బంగారము. బ్రాహ్మణ స్తంభము కింది భాగంలో బంగారమును ఉంచుతారు. మిగిలిన మూడు స్తంభాల కింద కూడా బంగారమును ఉంచుతారు.

కపిత్థము
శిఖరహస్తమందలి అంగుష్టం మీదకు తర్జని వంగితే అది కపిత్థ హస్తం అవుతుందని కీర్తించినారు. లక్ష్మి, సరస్వతి, చుట్టటం, పాలుపిదకటం, ధూపదీపమును పూజించుట మొదలైన అర్ధముల యందు ఈ హస్తము ప్రయుక్తమవుతుంది.

కపోతము
అంజలి హస్తమందలి మొదలు, చివర, పక్కలు కలిస్తే అది కపోతము అవుతుంది. ప్రణామము లేదా ప్రమాణము, గురువుతో సంభాషించడం, వినయపూర్వకంగా అంగీరకించడం మొదలైన అర్ధాలను సూచించడంలో ఈ హస్తము ప్రయుక్తమవుతుంది. ?

కపోతము
కరుణ కసము యొక్క వర్ణన (పావురపు రంగు). అన్ని రసములకు కూడా వర్ణములు చెప్పబడ్డాయి.

కపోతలి
సం. నా. వా. ? పావురం గూడు.

కరణము
చేతులు, పాదములు యొక్క కదలికను కరణము అంటారు. ఇవి 108. రెండు కరణములు కలిస్తే నృత్తమాత్రము, మూడు కరణములు కలిస్తే కూపకము, నాలుగు కరణములు కలిస్తే మండపము, ఐదు కరణములు కలిస్తే సంఘటకము, ఆరు ఏడు, ఎనిమిది, తొమ్మిది కరణాలు కలిపి ఒక అంగహారము అవుతుంది. స్థానములు మరియు చారీల యొక్క వ్యాయాయము కొరకు చెప్పబడిన పాద కదలికలను కరణములలో ఉపయోగించారు. 108 కరణముల పేర్లు వరుసగా, 1.తలపుష్పపుటము, 2.వర్తితము, 3.వలితోరువు, 4.అపవిద్ధము, 5.సమనఖము, 6.లీనము, 7.స్వస్తికరేచితము, 8.మండలస్వస్తికము, 9.నికుట్టకము, 10.అర్థనికుట్టకము, 11.కఠిఛిన్నము, 12.అర్ధరేచితము, 13.వక్షవస్తికము, 14.ఉన్మత్తము, 15.స్వస్తికము, 16.పృష్ఠస్వస్తికము, 17.దిక్స్వస్తికము, 18.అలాతము, 19.కఠిసమము, 20.ఆక్షిప్తరేచితము, 21.విక్షిప్తాక్షిప్తము, 22.అర్ధస్వస్తికము, 23.అంచితము, 24.భుజంగత్రాసితము, 25.ఊర్ధ్వజానువు, 26.నికుంచితము, 27.మత్తలి, 28.అర్ధమత్తలి, 29.రేచకానికుత్తకము, 30.పాదాపవిద్ధకము, 31.వలితము, 32.ఘూర్ణితము, 33.లలితము, 34.దండపక్షము, 35.భుజంగత్రసతరేచితము, 36.నూపురము, 37.వైశాఖరేచితము, 38.బ్రమరకము, 39.చతురము, 40.భుజంగాంచితము, 41.దండకరేచితము, 42.వృశ్చికకుట్టితము, 43.కటిభ్రాంతము, 44.లతావృశ్చికము, 45.చిన్నము, 46.వృశ్చికరేచితము, 47.వృశ్చికము, 48.వ్యంసితము, 49.పార్శ్వనికుట్టనము, 50.లలాటతిలకము, 51.క్రాంతకము, 52.కుంచితము, 53.చక్రమండలము, 54.ఉరోమండలము, 55.ఆక్షిప్తము, 56.తలవిలసితము, 57.అర్గలము, 58.విక్షిప్తము, 59.ఆవృత్తము (ఆవర్తము), 60.డోలాపాదము, 61.నివృత్తము, 62.వినివృత్తము, 63.పార్శ్వక్రాంతము, 64.నిశుంభితము, 65.విద్యుభ్రాంతము, 66.అతిక్రాంతము, 67.వివర్తికము, 68.గజకృదితము, 69.తలసంఫోటితము, 70.గరుడప్లుతకము, 71.గండసూచీ, 72.పరివృత్తము, 73.పార్శ్వజానువు, 74.గృధ్రావలీనకము, 75.సన్నతము, 76.సూచీ, 77.అర్ధసూచీ, 78.సూచీవిద్ధము, 79.అపక్రాంతము, 80.మయూరలలితము, 81.సర్పితము, 82.దండపాదము, 83.హరిణప్లుతము, 84.ప్రేంఖొలితము, 85.నితంబము, 86.స్కలితము, 87.కరిహస్తము, 88.ప్రసర్పితకము, 89.సింహవిక్రీడితము, 90.సింహకర్షితము, 91.ఉద్వృత్తము, 92.అపశృతము, 93.తలసంఘట్టితము, 94.జనితము, 95.అవహిత్తకము, 96.నివేశము, 97.ఏలకాక్రీడితము, 98.ఊరూద్వృత్తము, 99.మదస్కలితము, 100.విష్ణుక్రాంతము, 101.సంభ్రాంతము, 102.విష్కంభము, 103.ఉద్ఘట్టితము, 104.వృషభక్రీడితము, 105.లోలితకము, 106.నాగాపసర్పితము, 107.శకటస్యము, 108.గంగావతరణము.

కరణము
సం. నా. వా. అ న. తత్స. చాంద్రమానములో సగము దినము.

కరణములు
రెండు పాదములు ఒకదానితో ఒకటి కదలినట్లైతే దానిని కరణము అంటారు. ఇది నృత్త కరణమునకు భిన్నమైనది.

కరణసంశ్రయహస్తము
ఇవి హస్త కరణాలు. వేళ్ళను నలుపుతూ మణికట్టును వృత్తాకారములో తిప్పడం. ఇవి నాలుగు విధములు. అవి, 1.అవేష్టితము, 2.ఉద్వేష్టితము, 3.వ్యావర్తితము, 4.పరివర్తితము.

కరిహస్తము
(నృత్తహస్తము) ఒకచేతిని తారాహస్తములో ఉంచి, అటు ఇటు ఊపుతూ, మరొక చేతిని చెవికి దగ్గరగా ఉంచడం.

కరిహస్తము
(కరణం) ఎడమచేతిని ఛాతిపై ఉంచి ఇంకొక అరచేతిని తిప్పి చెవుల దగ్గర ఉంచి పాదములను అంచితలో ఉంచాలి.

కరుణ
?

కరుణ
కరుణ రసము మూడు రకములు. అవి, 1.ధర్మనాశము, 2.అర్థనాశము, 3.శోకము.

కరుణదృష్టి
పై కనురెప్ప కొద్దిగా కిందకి వచ్చి మానసిక వేదన వలన కనుపాపలు విశ్రాంతి దశలో ఉంటాయి. కంటిచూపు ముక్కు చివర ఉండి, కళ్ళు కన్నీళ్ళతో నిండి ఉంటాయి. కరుణ రసములో దీనిని ఉపయోగిస్తారు.

కరుణాగతి
ఈ గతి యందు తక్కువ శృతి కలిగి ఉండి, కళ్ళు కన్నీళ్ళతో అవయవాలు క్షీణించి మరియు పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇది మధ్యమ మరియు నీచ ప్రకృతికి సంబంధించినది.

కర్కటము
(సంయుతహస్తము) కపోత హస్తమందలి వ్రేళ్ళ సందున వ్రేళ్ళు దూర్చి, వెలుపలకి కాని, లోపలకి కాని వచ్చేటట్లు చేస్తే అది కర్కటహస్తము అవుతుంది. సమూహము రావటం లేదా చూడటం, లావైన దానిని లేదా పొట్టను చూపటం, శంఖం పూరించటం మొదలైన అర్ధాలను నిరూపించడంలో ఈ హస్తము ప్రయుక్తమవుతుంది.

కర్తరీముఖము
త్రిపతాక హస్తములోను తర్జనిని, కనుష్టకను వెలుపలకి చాచితే కర్తరీముఖము ఏర్పడుతుంది. దీనిని స్త్రీ, పురుషుల ఎడబాటు, వ్యతిరేకత లేదా వెనుకకు తిరగటం, విరహంతో ఒంటరిగా శయనించటం, క్రిందపడటం మొదలైన అర్ధాలను అభినయించటంలో ఈ హస్తము వినియోగింపబడుతుంది.

కలా
సంగీతములో కాలమునకు కొలమానము. దీనికి, తాళమునకు వ్యత్యాసము ఉంది. కలా, కాష్ఠము, నిమేషము. ఈ మూడు కూడా పండితుల చేత వివిధ రకాలుగా ఉపయోగించబడ్డాయి. ఐదు నిమేషములు కలిసి ఒక మాత్ర. మాత్రల యొక్క సమూహము ద్వారా కల ఉద్భవిస్తుంది. గానం చేసేటప్పుడు రెండు కలల మధ్య ఉండే సమయం కూడా ఐదు నిమేషములతో తయారు అవుతుంది. కలల యొక్క సమయాన్ని బట్టి, మాత్ర విభజన బట్టి లయ చేయబడుతుంది. మధ్యమ లయ ప్రమాణ కాలమును నిర్దేశిస్తుంది. మూడు మార్గముల ద్వారా మూడు రకాలుగా చెప్పబడుతుంది. 1.చిత్రవిధానములో రెండు మాత్రలు, 2.వృత్తివిధానములో నాలుగు మాత్రలు, 3.దక్షిణ విధానములో ఎనిమిది మాత్రలు ఉంటాయి.

కలాపకము
మూడు కరణముల యొక్క కలయిక.

కలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కలియుగమును పరిపాలించే దైవము. అయినప్పటికీ ఇతడు దుష్ట లక్షణములు కలిగి ఉన్నాడని చెప్పబడుతోంది. ఈ పేరుతో కూడా ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు.

కళింగము
దక్షిణ సముద్రము, వింధ్య పర్వతము మధ్య దేశము, తూర్పురాజ్యము యొక్క పేరు. దీని పేరు బ్రహ్మ పురాణములో కూడా చెప్పబడింది.

కాంగూలము
(అసంయుతహస్తము) మధ్యవేలు, చూపుడువేలు మరియు బొటనవేలిని వేరు చేసి, ఉంగరపు వేలిని కొద్దిగా వంచి, చిటికెన వేలుని బాగా చాచాలి. ?

కాంచుకీయునిగతి
కాంచుకీయుడు అనగా మోసేవాడు. ఇతని గతి వయస్సు మరియు పరిస్థితికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ ఇతడు పెద్దవాడు కాకపోతే అతని గతి యందు పాదములు అర తాళము పైకెత్తబడి సామాన్యమైన అడిగిలి వేస్తూ చూడటానికి బురదలో నడుస్తున్నట్టుగా కన్పిస్తుంది. ఒకవేళ ఇతడు పెద్దవాడు అయితే శరీరం వణుకుతూ, పాదములు మెల్లిగా పైకెత్తి ప్రతి అడుగులోను లోతైన శ్వాస తీసుకుంటాడు.

కాంతదృష్టి
ఒక వ్యక్తి ఎక్కువ ప్రేమలో ఉన్నపుడు కలిగే అత్యధిక ఆనందం వల్ల పుడుతుంది. ఇది శృంగార రసములో ఉపయోగిస్తారు.

కారిక
స్మరణ శ్లోకాలు. కారిక అనేది తక్కువ పదాలతోనే అర్ధాన్ని వివరిస్తుంది. అంటే ఒక చిన్న సూత్రంలోనే అర్ధాన్నంతటినీ వివరిస్తుంది.

కార్షశము
సం. నా. వా. అ. పుం. తత్స. సూత్రము, బంధనము, తాడు.

కాలపంజరము
దక్షిణాపథములోని ఒక రాజ్యము పేరు. దీనికే మరొక పేరు పాలమంజరము.

కాలము
సం. నా. వా. అ. పుం. తత్స. సమయము, మృత్యుదేవత, నల్లరంగు. ఇంకా ఎందరో గొప్ప వ్యక్తులు ఈ పేరును కలిగి ఉన్నారు.

కాశ్మీరము
ఒక రాజ్యము యొక్క పేరు.

కాషాయవసనుడు
కాషాయ వస్త్రమును ధరించినవాడు. శంకుస్థాపన సమయంలో వీరిని అనుమతించరు.

కింపురుషము
ఏడు వర్షాలలో ఒకటి.

కుంచిత గండము
బుగ్గలు కిందకి రావడం. స్పర్శ, శీతము, భయము, జ్వరము మొదలైనవాటి యందు ఉపయోగిస్తారు.

కుంచిత దృష్టి
కనురెప్పలు, కనువెంట్రుకలతో కలిసి చివరలు కొద్దిగా వంచబడి కనుపాపలతో కూడా కలిసి ఉంటే కుంచిత దృష్టి అంటారు.దీనిని అసూయ, అనిష్టము, దుష్ప్రేక్షము మొదలైనవాటి యందు ఉపయోగిస్తారు.

కుంచితగ్రీవా
కుంచితగ్రీవా అనగా వెనకకు తిరిగిన తల ఉన్న మెడ. బరువులను ఎత్తేటప్పుడు మెడకు రక్షణ కల్పించడానికి ఉపయోగిస్తారు.

కుంచితపుటము
కనురెప్పలు రెండు ఒకదానితో ఒకటి కలవడం. దర్శనము, స్పర్శ, గంధము మొదలైనవాటిని పొందటానికి ఉపయోగిస్తారు.

కుంచితభ్రూ
రెండు కనుబొమ్మలను ఒకదాని తర్వాత ఒకటి లేదా ఒకేసారి వంచడం. అనురాగము, కోపమును చూపించేటప్పుడు, ఉల్లాసముగా ఉండేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

కుంచితము
?

కుంచితము
(కరణము) కుడిపాదము, కుడిచేతిని వంచి అరచేతిని పైకి ఉంచి తర్వాత అలపల్లవ హస్తము చేయడం.

కుట్టనచిబుకము
పై దంతాలతో కింది దంతాలను కొరకడం. కోపము, చలి, జ్వరము, భయము, అనారోగ్యములలో దీనిని ఉపయోగిస్తారు.

కుతపము
సం. నా. వా. అ న. తత్స. అభినవగుప్తుడు దీనికి వివిధ రకాల అర్థాలను చెప్పాడు.గాయక, వాద్యసమూహము. నాలుగు విధములైనఅతీధ్య భాండములు. వాద్యకారులు.

కుతపవిన్యాసము
సంగీతకారులు, వాద్యకారులు స్థానాలను ఏర్పాటు చేయడం. సంగీత వాయిద్యములకు, గాయకులకు స్థానములు ఇవ్వబడతాయి. వారు చెప్పబడిన స్థలమును ఆక్రమించుకోవాలి. దీనిని కుతప విన్యాసం అంటారు.

కూర్మపృష్ఠము
సం. నా. వా. ? రంగశీర్షము నిర్మించే సమయంలో తాబేలు మూపులా ఉండకూడదు.

కృతకభయము
మూడు భయానక రసములలో ఒకటి. తనకు తాను తెచ్చుకున్న భయాన్ని కృతకభయము అంటారు.

కృశునిగతి
ఇతడు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడుస్తాడు.

కృష్ణ
సం. నా. వా. ? నాట్యమండపం నిర్మించే భూమి నల్లని ఇసుక కలిగి ఉండాలి.

కృష్ణము
భయానక రసముకు చెప్పబడిన వర్ణము, నలుపు రంగు.

కృసరము
సం. నా. వా. అ. న. తత్స. నువ్వులు, పాలు, అన్నముతో చేసిన ఒక పదార్థము. కిచిడీ వంటిది.

కేశబంధము
రెండు చేతులు పైకి ముడి వేసుకున్నట్లైతే దానిని కేశబంధము అంటారు. (ఈ అభినయం చాలా సార్లు వస్తుంది).

కైలాసము
ఏడు పర్వతములలో ఒకటి. హిమాలయాలలో ఉన్న ఈ ఉత్తమ పర్వాతములపైన దేవాంశ సంభూతులు, యక్షులు, కుబేరుని అనుచరులైన గుహ్యకులు నివసిస్తారు.

కైశికన్యాయము
?

కోణము
సం. నా. వా. అ న. తత్స. త్ర్యాస్రము యొక్క మూడు మూలలను కోణములు అంటారు.

కోశలము
దక్షిణ సముద్రమునకు, వింధ్య పర్వతమునకు మధ్యనున్న దేశము.

క్రాంతకము
(కరణము) ఒక కాలిని వెనకకు ఉంచి అతిక్రాంతాకారి చేస్తూ చేతులను కిందకి పెట్టడం.

క్రియాత్మకశృంగారము
శృంగార రసము మూడు రకాలుగా చెప్పబడింది. క్రియ ద్వారా చెప్పబడే శృంగారాన్ని క్రియాత్మకశృంగారము అంటారు.

క్రుద్ధదృష్టి
కఠినమైన చూపు. కనుపాపలు, రెప్పలు పైకెత్తి చలనము లేకుండా కనుబొమ్మలను అల్లడం. క్రోధములో దీనిని ఉపయోగిస్తారు.

క్షత్రియస్తంభము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షత్రియస్తంభ ప్రతిష్ఠాపన సమయంలో అన్ని ద్రవ్యములు ఎరుపు రంగులో ఉండాలి. వస్త్రము, పూలమాలలు, లేపనం కూడా ఎరుపు రంగులో ఉండాలి. ఈ స్తంభమునకు కింది భాగములో రాగి మరియు బంగారం ఉంచబడుతుంది. ఈ ప్రతిష్ఠ సమయంలో బెల్లంతో కూడిన అన్నమును బ్రాహ్మణులకు పంచుతారు. ఇది నైరుతిలో ప్రతిష్ఠింపబడాలి. పనివారికి విందు కల్పిస్తారు.ఎరుపు రంగు శక్తి, సామర్థ్యమునకు చిహ్నము.

క్షామగండము
భాద పడటం. బుగ్గలు రెండూ పడి ఉండటం. దీనిని భాదలో ఉపయోగిస్తారు.

క్షామజఠరము
సన్నని (పలుచని) కడుపు.

క్షిప్తజంఘము
విసిరివేయబడ్డ కాలు.

క్షేపము
ప్రథమావస్థ మొదలైనవాటిలో ఉపోహనము.

క్షోభణబీభత్సము
మూడు బీభత్స రకములలో ఒకటి. ఆసనమును, క్రిములను చూసినపుడు కలుగుతుంది.

క్ష్వేడనము
సం. నా. వా. అ. న. తత్స. సింహ గర్జన.

ఖంజకము
చతుష్పాదవృత్తములో ధృవగీతము.

ఖంజునిగతి
దీనియందు ఒకపాదము స్థిరముగా ఉండి మరొక పాదము అగర్తల సంచారములో ఉంటుంది. ఇది కుంటివారి కదలిక. ఆధారంగా ఉన్న కాలిని తీసి మరొక పాదమును ముందరికి తీసుకువచ్చి మొదటి పాదమునకు పక్కన పెట్టాలి.

ఖండనచిబుకము
రెండు పెదవులను పదే పదే దగ్గరగా తీసుకురావడం. మంత్రములను చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

ఖండము
3 కరణముల యొక్క కలయిక.

ఖగేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పక్షులకు రాజు, గరుత్మంతుడు.

ఖల్వజఠరము
అణిగి ఉన్న కడుపు.

ఖసము
దక్షిణ సముద్రము, వింధ్య పర్వతమునకు మధ్య దేశము.

గంగావతరణము
మునివ్రేళ్ళు, అరికాళ్ళతో సహా పాదమును పైకెత్తి అరచేతులను అధోముఖంగా ఉంచాలి. తలభాగంతో సన్నతమును ప్రదర్శించాలి.

గండము
బుగ్గలు చేసే పనులు. ఇవి ఆరు రకాలు. 1.క్షామము, 2.ఫుల్లము, 3.ఘార్ణము, 4.కంపితము, 5.కుంచితము, 6.సమము.

గండసూచి
(కరణము) సూచీపాదముతో నట ప్రదర్శింపబడాలి. అంటే ఒక పక్క ఎడమ చేతిని ఎత్తి ఛాతి మీద ఉంచి కుడి చేతిని వంచి దవడ మీదికి తీసుకురావాలి.

గంధపుష్ప ఫలోపేతము
సం. నా. వా. ? గంధము అనగా సుగంధ ద్రవ్యము, పుష్పమనగా పువ్వు, ఫలమనగా పండ్లు. దిక్పాలకులకు కానుకలిచ్చు సమయంలో పై పదార్థములన్నియు ఖచ్చితముగా ఉండాలి.

గంధర్వులు
సం. నా. వా. అ. పుం. తత్స. గాంధర్వ లక్షణాలు కలిగిన దేవతలలో ఒక వర్గము. ఆకాశమునందు నివసిస్తూ చంద్రుని పర్యవేక్షిస్తారు. వరుణుని చేత ఆదేశింపబడతారు, ఉత్తమ ఔషధ సంపద గురంచి తెలిసినవారు.అప్సరసలతో పాటు దేవసభ యందు నివసిస్తారు, దేవగాయకులు.

గజక్రీడితము
(కరణము) ఎడమ చేతిని ఎడమ చెవి వద్ద వంచి కుడి చేతిని లతా భంగిమలోనికి తీసుకువచ్చి పాదములను దోలాపాదములో ఉంచాలి. దీనియందు కరిహస్తము చూపబడుతుంది.

గజదంతము
(సంయుతహస్తము) ఎప్పుడైతే రెండు సర్పశీర్ష హస్తములు భుజముల మధ్యలోనున్న ఎదురెదురు మోచేతులను స్పర్శిస్తాయో దానిని గజదంతము అంటారు.

గతిప్రచారము
స్తానాచార్యులకు చెప్పబడిన పాద కదలికలు.

గతిబేధములు
ఇవి 3 రకాలు. 1.సమగతి. సమానులైన వారందరితో కలిసి నడవడం. ఈ గతి యొక్క శృతి 4, 2, లేదా 1 కాలాలు ఉండాలి. 2.మిశ్రమగతి. ఉత్తముడు, మధ్యముడు నడుస్తునపుడు వారి గతి 4 మరియు 2 కాలాలు ఉండాలి. అధముడితో కలిసి నడిచేటప్పుడు వారి గతులు 4 మరియు 1 కాలాల కలయిక అయి ఉండాలి. దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాజులు, రాక్షసులు మొదలైన వారందరి గతులు 4 తాళాల వెడల్పు ఉండాలి. 3.మధ్యమగతి. స్వర్గమందు ఉండే వారందరూ కూడా మధ్యమ గతిని కలిగి ఉంటారు. దివ్యమైనవారు, దేవతలతో సమానమైన గతిని కలిగి ఉంటారు.

గతిమండలకము
(అంగహారము) ముందుగా మండల స్థానమును తీసుకొని చేతులను రేచితలో ఉంచి, పాదాలను ఉద్ఘటితములో ఉంచి ఆ తర్వాత మత్తల్లి, ఆక్షిప్త, ఉరోమండల మరియు కఠిఛిన్న కరణములు చేయాలి.

గరుడపక్షము
(నృత్తహస్తము) అరచేతులను కింద ఉంచి రెండు చేతులను వేగంగా కదుపుతూ ఉంటే దానిని గరుడపక్షము అంటారు.

గరుడప్లుతకము
(కరణము) పాదాలను వెనక్కి చాచి ఒక చేతిని లతా భంగిమలో, మరొక చేతిని రేచిత భంగిమలో ఉంచి ఛాతిని ఎత్తాలి.

గరుడుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణువు యొక్క పవిత్ర వాహనము, గ్రద్ద.

గాంభీర్యము
సం. నా. వా. అ. న. తత్స. నాట్యగృహము గాలి లేకుండా ఉండాలి. ఇలా ఉండటం వలన గాయకుల గొంతులో ఉచ్ఛారణ పెరుగుతుంది.

గానము
దృవగానము ఐదు రకాలు. అవి, 1.ప్రవేశము, 2.ప్రాశాదికము, 3.ఆక్షేపము, 4.నిష్క్రామము, 5.అంతరము.

గీతకము
పూర్వరంగములో నాలుగు రకాల గీతికలు కలవు. 1.మాగధి, 2.అర్ధమాగధి, 3.పృథుల, 4.సంభవితము. చిత్రపూర్వరంగములో మాగధి చిత్రమార్గములో పాడబడాలి. సంభవితగీతి వర్తిత మార్గములో పాడబడాలి. శుద్ధపూర్వరంగములో పృథుల గీతి దక్షిణ మార్గములో పాడబడాలి.

గీతము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మదేవుడు సామవేదము నుండి గీతమును, ఋగ్వేదము నుండి వచనమును, అధర్వవేదము నుండి రసమును, యజుర్వేదము నుండి అభినయమును స్వీకరించి పంచమవేదంగా తయారుచేసారు. దీనియందు కళ, విజ్ఞానము విశదీకరంచబడ్డాయి.

గీతవిధి
పాచల యొక్క లేపనము. ఆ గానమును దేవతలను పూజించడానికి ఉపయోగిస్తారు. ఇది శుద్ధపూర్వరంగ విధి. దీనివలన దేవతలు సంతుష్టులౌతారు. చిత్రపూర్వరంగము నందు గీతవిధి వర్ధమానకసహిత తాంజవ ప్రయోగము చేత చేయబడుతుంది. దీని ద్వారా రుద్రుడు తన అనుచరులతో సహా ఆనందింపబడతాడు.

గీతులు
ఇవి నాలుగు రకాలు. మాగధి, అర్ధమాగధి, పృథులము, సంభవితము. ఇవి పూర్వరంగవిధిలోను, నృత్యములోను ఉపయోగించబడతాయి.

గుడౌదనము
సం. నా. వా. అ. న. తత్స. శంకుస్థాపన రోజు బెల్లంతో చేలృసిన పాయసమును పనివాళ్ళకు కానుకగా ఇస్తారు.

గృధ్రావలీనకము
(కరణము) ఒక పాదమును వెనకకు చాచి మోకాలును కొద్దిగా వంచి చేతులను పక్కకు చాచాలి.

గౌరము
వీరరసము యొక్క వర్తనము (పసుపురంగు).

గౌరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఇసుక, నాట్యగృహము కోసం ఎంపిక చేసుకొన్న స్థలము శ్వేత వర్ణములో ఉండకూడదు.

గ్రహణము
సం. నా. వా. అ. న. తత్స. గురువు నుండి విజ్ఞానమును గ్రహించుట.

గ్రహము
దుందుభిల మోతకు ఆరంభము. వస్తువు (విషయము)లో నిబద్ధ, గీతక తర్వాత అంతిమంలో గ్రహము ఉండాలి. ఒకవేళ ఇది సరళమైన చరణాలు, శ్లోకాలు కలిగి ఉంటే ఆరంభములో మాటి మాటికి రావాలి.

గ్రామము
ఊరు.

గ్రామ్యధర్మము
సం. నా. వా. అ. పుం. తత్స. అనాగరికపు జీవనవిధానములు. చిన్న చిన్న ఆనందాలకు ఆకర్షితులౌట, నాగరికత లేకుండా జీవించడం.

గ్రాహ్యకులు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవాంశ సంభూతులు, వారు యక్షులు, కుబేరుని ఐశ్వర్యమునకు, నిధికి రక్షకులు. పర్వత శ్రేణులలో నివసించటం వలన “యక్షులు” అను పేరును పొంది ఉండవచ్చు.

గ్రీవాకర్మము
మెడ యొక్క పనులు. ఇవి తొమ్మిది రకాలు. 1.సామము, 2.లతము, 3.ఉన్నతము, 4.త్ర్యాస్రము, 5.రేచితము, 6.కుంచితము, 7.అంచితము, 8.వలితము, 9.వివృత్తము. మెడతో చేసే అభినయములన్నీ ఖచ్చితముగా శిరస్సును అభినయించాలి.

గ్రీవారేచకము
మెడను పైకెత్తి కిందికి వంచడం, పక్కలకు వంచడం, చుట్టూ తిరగడం.

గ్లానదృష్టి
కనురెప్పలు, కనుబొమ్మలు, కనువెంట్రుకలు అలసిపోయి చాలా నెమ్మదిగా కదలడము. కనుపాపలు కనురెప్పల కింద కప్పబడి ఉంటే దీనిని గ్లానము అంటారు. దీనిని అపస్మారము, గ్లాని, వ్యాధి మొదలైనవాటిలో ఉపయోగిస్తారు.

ఘూర్ణము లేదా పూర్ణగండము
బుగ్గలు వ్యాకోచించడము. ఉత్సాహములోను, గర్వములోను ఉపయోగిస్తారు.

ఘూర్ణితము
(కరణము) కుడిచేతితో వలిత నృత్త హస్తము ప్రదర్శించాలి. తిరిగి తిరిగి ప్రదర్శించాలి. ఎడమ చేతిని దోలములో ఉంచాలి. పాదములను స్వస్తిక భంగిమ నుండి దూరముగా తీసుకురావాలి.

ఘృతపాయసము
సం. నా. వా. అ. న. తత్స. మధురమైన ఒక పదార్థము. దీనిని అన్నం, చక్కెర, నేతితో చేస్తారు.

చంద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఒకగ్రహము, నాట్యగృహమును రక్షించుటకు నియమింపబడినవాడు.

చక్రమండలము
ఈ కరణములో రెండు కాళ్లు సగానికి వంచి వాటికి సమానంగా రెండు చేతులను కిందికి ఆన్చి ఉంచాలి. దీనిని ఉద్ధత పరికర్మ యందు ఉపయోగిస్తారు.

చణకులు
సం. నా. వా. ? శనగలు.

చతుర భ్రూ
కనిబొమ్మలు ఆహ్లాదకరమైన రీతిలో కొద్దిగా పైకి విస్తరించడం. ప్రేమలోను, ఆనందంలోను, సున్నితమైన స్పర్శలోను ఉపయోగిస్తారు.

చతురము
తర్జని మౌదలైన మూడు వేళ్ళు దగ్గరకు చేరినవి, చిటికెన వేలు చాచబడి, ఉంగరపు వేలు మొదట బొటనవేలు అడ్డంగా ఉంచబడినది అయితే అది చతురహస్తము అవుతుంది. దీనిని బంగారం, రాగి, కొంచెం, కన్ను, కస్తురి, ద్రవపదార్ధాలు వీటి అర్ధాలను నిరూపించడంలో ఉపయోగపడుతుంది.

చతురము
ఈ కరణంలో ఎడమ చేయి ఆంచిత (అలపల్లవ), కుడిచేయి చతురహస్త మరియు కుడి కాలు కుట్టితగా ఉండును.

చతురస్రము
(నృత్తహస్తము) రెండు కటకముఖ హస్తములను, మోచేయి మరియు భుజములకు సమముగా తీసుకువచ్చి, ఛాతికి ముందరి భాగంలో ఎనిమిది అంగుళాల దూరంలో ముఖమును ముందుకి తీసుకురావడం.

చతురస్రము
చతురస్ర విధ పూర్వరంగమునకు సంబంధించినది. రంగమండపము మూడు రకాలు. అవి 1.వికృష్టము, 2.చతురస్రము, 3.త్ర్యాస్రము. ఇది దృవమునకు సంబంధించినది. పూర్వరంగములో మహాచారీ ప్రదర్శించేటప్పుడు చతురస్ర దృవమును ఉపయోగిస్తారు. ఇది దృతలయలో ఉండి నాలుగు సన్నిపాతాలు, ఎనిమిది మాత్రలు కలిగి ఉంటుంది. దీనియందు 4 పాదాలు ఉండి ఒక్కొక్క పాదములో 11 అక్షరాలు ఉంటాయి. 1, 4, 7, 10, 11 గురు అక్షరములు, మిగిలినవి లఘువులు. దీని పేరుతో ఒక తాళము కూడా ఉన్నది.

చతురస్రము
సం. నా. వా. అ. న. తత్స. మూడు నాట్యమండపములలో ఒకటి. దీనియందు పొడవు, వెడల్పు సమానంగా ఉంటాయి.

చతురస్రాంతములు
వైష్ణవ స్థానమును తీసుకొని చేతులను నడుము వద్ద, నాభి వద్ద కదుపుతూ ఛాతిని పైకెత్తడం.

చతుర్థకారుడు
పూర్వరంగములో పరివర్తనము పూర్తి అయిన తర్వాత చతుర్థకారుడు చేతిలో పువ్వులతో వేదిక పైకి వస్తాడు. అతడు జర్జరమునకు, అన్ని రకాల సంగీత వాయిద్యములకు, సూత్రధారునికి పూజ చేస్తాడు. ఈ విధంగా చేసేటప్పుడు అతని పాదకదలికలకు అనుగుణంగా మృదంగమును వాయిస్తారు. ఎటువంటి పాటలను ఉపయోగించకూడదు. శుష్కాక్షర (అర్థములేని అక్షరములు కలిగినటువంటి) పాటలను పాడాలి.

చతుష్పదవృత్తాని
నాలుగు పాదాలు. ఇవి దృవగానములో వచ్చును. అవి నర్కుటము, కుంజకము, పరిగీతిక. ఇవి చతుష్పాద వృత్తాలు. ?

చర్య
చారిలు, స్థానాలు, నృత్తహస్తాలు మరియు మాతృకలు. చారి అంటే పాదము యొక్క కదలిక. ఇది రెండు విధములు. అవి 1. ఆకసిరి, 2. భౌమి. ఆకశిరి మరల 16, భౌమి 16 విధములు. దీనియందు పాదాలు, తొడలు, కాలి ఎముకలు ఒకేసారి కదిలించాలి. ఈ చారి కదలిక కొన్ని నియమాలతో ఉంది. దీనిని వ్యాయామం అని అంటారు.

చలనతార
కనుపాపల యొక్క ప్రకంపనము. దీనిని భయానక రసములో ఉపయోగిస్తారు.

చారీ
నడుము, తొడలు, కాళ్ళు, మరియు పాదాలు ఒకదానితో ఒకటి సంబంధముగా చేసే కదలికలు. పాదములు మరియు వాటి కదలికలకు ఎక్కువ ప్రాధాన్యము ఉంది. చారీ ప్రధానముగా ఒక పాదముతో చేసే కదలికలను తెలుపుతుంది. దీనిని సామాన్య కదలికల యందు, నృత్యమునందు, యుద్ధమునందు, వేదికలపైన ప్రదర్శిస్తారు. ఇది రెండు రకాలు. 1.భౌమీచారీ. ఇది 16 రకాలు, 2.ఆకాశకీచారీ. ఇది 16 రకాలు. మొత్తం 32 చారీలు.

చారీ
శృంగార అభినయమే చారీ. దీనియందు సహనము మరియు శృంగారముతో కూడిన భావనలు ఉంటాయి. శృంగారభరితమైన పార్వతీపరమేశ్వరుల యొక్క ఇతిహాసము వివిధ రకాల అంగహారములు, చారీల చేత ప్రదర్శింపబడుతుంది. దీని ద్వారా పార్వతీ దేవి ఆనందింపబడుతుంది.

చాషగతీచారీ
కుడి పాదమును చాచి వెనుకకి లాగడం. ఎడమ పాదంతో కూడా ఇదే విధముగా చేయడం.

చిత్రపూర్వరంగము
ఇది శుద్ధపూర్వ రంగంలానే ఉంటుంది. కాని ఉత్తాపని, పరివర్తిని తర్వాత వస్తుంది. చతుర్ధాకారుడు ఇచ్చిన పువ్వులతో సభా వేదికను అలంకరించునపుడు ఆ వేదిక పెద్ద పెద్ద ధ్వనులతో మారు మ్రోగాలి. దుంధుభిలు మరలా మరలా మ్రోగాలి. దేవతల వేషాలు వేసుకున్న నటులు అంగహార నృత్యము చేయాలి. నాంది యొక్క పాదాల మధ్యలో పిండి, రేచకములు, న్యాసములు, అపన్యాసములు అంగహారములతో పాటు తాండవం చేయాలి. ఇవి చేసిన తర్వాత శుద్ధపూర్వ రంగము చిత్రపూర్వ రంగముగా మారుతుంది.

చిత్రపూర్వరంగము
దీనిలో శుద్ధపూర్వరంగములో ప్రదర్శింపబడ్డట్టుగా అన్ని బహిర్యవనికాంగములు ప్రదర్శింపబడాలి. ఉత్తాపనము, పరివర్తనము ప్రదర్శించిన తర్వాత చతుర్థకారుడు వేదికను పూలతో అలంకరిస్తాడు. ఆ తర్వాత గాంధర్వులు గట్టిగా గాత్రం చేస్తారు. దుందుభిలు మరల మరల మ్రోగబడతాయి. దేవతల వేషధారణలో ఉన్న నటులు పువ్వులను వేదికపైకి చల్లుతూ అంగహారములు ప్రదర్శిస్తారు. నాంది యొక్క మధ్యమంలో పిండీ, రేచకము, అంగహారము, న్యాసము, అపన్యాసము ఇవన్నీ కూడా పరిచయం చేయబడిన తర్వాత శుద్ధపూర్వరంగము చిత్రపూర్వరంగముగా మారుతుంది. దీని తర్వాత నాంది నుంచి ప్రరోచనము వరకు ఉన్న విధానం అంతా కూడా శుద్ధపూర్వరంగములో లాగనే కొనసాగుతుంది.

చిత్రమార్గము
మూడు మార్గములలో ఒకటి. చిత్రపూర్వరంగములో కళను చిత్రమార్గం అనుసరించాలి. మాగధి, అర్ధమాగధీ గీతికలలో మాగధి చిత్ర మార్గమును అనుసరించాలి.

చిత్రవృత్తము
గద్యములలో ఒకటి.

చిబుకకర్మ
దంతములు, పెదవులు, నాలుక మొదలానవాటికి సంబంధించి గడ్డము చేసే పనులు. ఇవి ఏడు రకములు. అవి, 1.కుట్టనము, 2.ఖంఢనము, 3.ఛిన్నము, 4.చుక్కితము, 5.లేహితము, 6.సమము, 7.దష్టము.

చుక్కితచుబుకము
రెండు పెదవులు దూరముగా వేరుచేయబడడం. ఆవులించేటపుడు ఉపయోగింపబడుతుంది.

చూర్ణపదము
దీనియందు పాదములు ఒక ఛందస్సు ప్రకారము అమర్చబడి ఉండవు. పాదములోని అక్షరములు నియమానుసారము ఉండవు. భావాన్ని తెలియజేయడానికి ఎన్ని అక్షరములు అవసరమౌతాయో అన్ని అక్షరములు ఉంటాయి.

చేటగతి
పరిచారికల యొక్క గతి. ఇది తలను ఒకవైపు తిప్పి చేతులను, పాదాలను కిందకు చేసి కళ్ళు చంచలముగా ఉండే గతి.

ఛందస్సు
వృత్తము అని కూడా పిలువబడే ఛందస్సు నాలుగు పాదములను కలిగి ఉంటుంది. ఇది వివిధ రకాల ఆలోచనలను వ్యక్తపరుస్తుంది. దీనియందు గురులఘువులు ఉంటాయి. ఛందస్సు లేదా వృత్తము మూడు రకాలు. 1.సమము, 2.విషమము, 3.అర్థసమము. ఛందస్సు లేదా వృత్తము అనేది పదము యొక్క శరీరముగా పరిగణించబడుతుంది. ఛందస్సు లేని పదము ఉండదు, పదము లేని ఛందస్సు ఉండదు. అందువలనే ఈ రెండిటి యొక్క కలయిక నాట్యప్రదర్శన యొక్క వ్యాఖ్యాతగా చెప్పబడుతుంది.

ఛందోవిధివిభాగము
ఛందస్సుకు సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అవి, 1.సంపత్తు (పూర్తైనది), 2.విరామము, 3.పాదము, 4.దేవత, 5.స్థానము, 6.అక్షరము, 7.వర్ణము, 8.స్వరము, 9.విధి (నియమాలు), 10.వృత్తము.

ఛత్రము
సం. నా. వా. అ. న. తత్స. గొడుగు, ధ్వజమహోత్సవము తర్వాత మొదటి ప్రదర్శనకుగాను సూర్యదేవుడు భరతునికి మరియు అతని బృందానికి బహుకరించిన కానుక.

ఛిన్నకటి
నడుము యొక్క మధ్యభాగమును తిప్పుట. ?

ఛిన్నచుబుకము
రెండు పెదవులు దగ్గరగా కలవడం. అనారోగ్యము, భయము, ఏడుపు, చావు, వ్యాయామము, కోపముగా చూసేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

ఛిన్నము
ఈ కరణములో కుడి చేతిని నడుము మీద ఉంచి ఎడమ చేతిని ఎడమ కాలి తొడ మీద ఉంచాలి. ఎడమ పాదం కొంచెం ఎడంగా ఉంచాలి.

ఛేద్ధము
సం. నా. వా. అ. న. తత్స. ఆయుధ పోరాటము.

జంఘాకర్మ
ఇది ఐదు రకములు. అవి, 1.ఆవర్తితము, 2.నతము, 3.క్షిప్తము, 4.ఉద్వాహితము, 5.పరివృత్తము.

జంబూద్వీపము
సం. నా. వా. అ న. తత్స. భౌగోళికాంశాల ప్రకారం భరత ఖండం ఏడు విభాగాలుగా విభజింపబడింది. అందులో జంబూద్వీపము ఒకటి. దీనిని లోకపాలకులు రక్షిస్తూ ఉంటారు. ఇది భరత వర్షంలో ఒక భాగం.

జఠరకర్మ
ఉదరము చేసే పనులు. ఇది మూడు రకములు. అవి, 1.క్షామము, 2.ఖల్వము, 3.పూర్ణము.

జనార్ధనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణువు.

జనితచారీ
ఒక చేతిని ముష్ఠి హస్తములో ఛాతిపై ఉంచి, మరొక చేతిని సుందరముగా తిప్పుతూ పాదమును అగర్తల సంచారములో ఉంచడం. దీనియందు పాదకదలిక ప్రధానమైనది, హస్తకదలిక రెండవది.

జనితము
(కరణం) ఒకచేతిని ఛాతిపై ఉంచి మరొక చేతిని వదులుగా ఉంచి తాళాగ్రసంస్థితము చేయడం.

జర్జరము
సం. నా. వా. అ. పుం. తత్స. ఇంద్రుని యొక్క ఆయుధము. విరూపాక్షుడు అసురులతో, విఘ్నాలతో కళాకారులందరినీ మూర్ఛపోయేలా చేసాడు. అపుడు ఇంద్రుడు ధ్యానం ద్వారా కారణం తెలుసుకొని చాలా బాధపడి తన జెండా స్తంభమును తీసుకొని దానితో రాక్షసులను తరిమికొట్టాడు. దానితో దేవతలు అందరూ ఎంతో సంతోషించి ఆ ఆయుధమునకు “జర్జరము” అని నామకరణము చేసారు. దీనిద్వారా మనకు ఏమి తెలుస్తుందంటే ఈ ఆయుధము భవిష్యత్తులో జరిగే ఏ ప్రదర్శనకు ఆటంకం రాకుండా చేస్తుంది.

జితశ్రమ
సం. నా. వా. ఆ స్త్రీ. తత్స. మంచి శక్తి మరియు దేహధారుఢ్యము కొరకు రోజూ చేసే వ్యాయామము. తొందరగా అలసిపోకుండా ఉండేందుకు ఇది అవసరము.

జిహ్మదృష్టి
కనురెప్పలు కిందకు వేలాడుతూ కనుపాపలను కప్పి ఉంచడం. కొద్దిగా వాలుగా చూడటాన్ని జిహ్మదృష్టి అంటారు. అసూయ, జడత. ఆలస్యములలో దీనిని ఉపయోగిస్తారు.

జ్ఞానము
సం. నా. వా. ? తెలివి, ప్రజ్ఞ, విజ్ఞానము.

జ్యేష్ఠము
సం. నా. వా. అ న. తత్స. మూడు మండపములలో పెద్దది. ఇది దేవతల కోసం నిర్మించబడినది. అభినవ గుప్తుని మతానుసారం మూడు నాట్యమండపములు కూడా జ్యేష్ఠములే. అవి జ్యేష్ఠవికృష్టము, జ్యేష్ఠచతురస్రము, జ్యేష్ఠత్ర్యాస్రము.

ఝషపిండి
అనగా చేప, మన్మథునికి సంబంధించినది.

డిమ
దశరూపకాలలో ఒకటి.

డోలము
ఒక కరణములో రెండు భుజములు సులభముగా ఉన్నప్పుడు మరియు రెండు పతాక హస్తాలు కిందకి వేలాడుతూ ఉంటే డోలము అంటారు. ?

డోలాపాదచారీ
కుంచిత పాదమును పైకెత్తి అటు ఇటు ఊపి, అంచితములాగ భూమిపై ఉంచడం.

తండులము
సం. నా. వా. అ. న. తత్స. పవిత్రమైన బియ్యము.

తండువు
నందికేశ్వరునికి కల మరొక పేరు. శివుడు భరతునికి అంగహారాలు నేర్పించమని తండుణ్ణి అడిగాడు. అందువల్లనే తాండవము అనే పేరు వచ్చింది. (ఈ రేచకములను, అంగహారములను, పిండిబంధములను స్వయంగా శివుడే సృష్టించి తండుడికి ఇచ్చాడు.

తంత్రీభాండసమాయోగము
పూర్వరంగము పద్యములతోటి, భాండములు వాయించడంతో మరియు తీగ (తంత్రి) వాయిద్యములతోటి ప్రదర్శింపబడుతుంది.

తలపుష్పపుటము
(కరణము) ఎడమవైపు పుష్పపుట హస్తమునుంచి, కుడిపాదమును అగర్తల సంచారములో నడుమును ఎడమవైపు సన్నతములో వంచడం. (ఇక్కడ పుష్పపుటము అనునది సంయుత హస్తము, అగర్తల సంచారమనేది పాదభేదము, సన్నతము, పార్శ్వ కర్మ భేదనము). సూత్రధారుడు పువ్వులను చల్లు సమయంలో దీనిని ఉపయోగిస్తారు.

తలముఖము
చతురస్త భంగిమలోనున్న చేతులు రెండు వంకరగా పెట్టి ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉంచాలి.

తలవిలాసితము
(కరణము) పాదముల యొక్క మునివేళ్ళు మరియు మడమలను పైకెత్తి ఒక పక్క ఎత్తుగా ఉంచాలి. చేతులను పైకెత్తి పాదముల యొక్క మడమలకు తగిలేట్లుగా వంగాలి. దీనిని సూత్రధారునికి సంబంధించిన వాటిలో ఉపయోగిస్తారు.

తలసంఘట్టితము
(కరణము) పాదమును దోలాపాదాచారీలో ఉంచి చేతులను రెంటిని ఒకదానితో ఒకటి కొట్టి, ఆ తర్వాత ఎడమ చేతితో రేచిత హస్తమును ప్రదర్శించాలి.

తలసంస్ఫోటితము
(కరణము) పాదములను నెమ్మదిగా పైకెత్తి ముందుకు చాచి చేతులను తలసంస్ఫోటితములో ఉంచడం. కరతాళధ్వనుల యందు దీనిని ఉపయోగిస్తారు.

తాండవము
శివుడు రేచకాలను, అంగహారాలను మరియు పిండిబంధాలను సృష్టించిన తర్వాత వాటిని “తండు”, అను సభావేదిక పైకి పంపడానికి గాత్రవాద్యాలు, మరియు సంగీత వాద్యాలకు తగ్గట్లుగా ఒక పరిపూర్ణ నృత్యము చేసాడు. అందువల్లే దీనికి “తాండవము” అని పేరు. ఇది కేవలం పురుషులకు మాత్రమే కాదు. ఎందుకంటే కరణముల యొక్క భంగిమలి, లాస్యము ఈ రెండూ కూడా స్త్రీలచేత ప్రదర్శింపబడ్డవి.

తామ్రచూడము
ముకుళ హస్తమందలి తర్జనిని వంచి పడితే అది తామ్రచూడ హస్తమవుతుంది. కోడి, కొంగ, ఒంటె మొదలైన అర్ధముల యందు ఈ హస్తము తగినది.

తామ్రము
సం. నా. వా. ? రాగి. క్షత్రియ స్తంభ ప్రతిష్ఠ సమయంలో కింద రాగి, బంగారమును ఉంచాలి.

తామ్రలిప్తిక
తూర్పురాజ్యము యొక్క పేరు.

తారాకర్మ
కనుపాపల యొక్క కదలిక. ఇది తొమ్మిది రకాలు. అవి, 1.బ్రాహ్మణము, 2.వలనము, 3.పాతనము, 4.చలనము, 5.సంప్రవేశనము, 6.వివర్తనము, 7.సముద్వృత్తము, 8.నిష్క్రామము, 9.ప్రకృతము. ఇది సరైన అభ్యాసంతో చేయబడి అన్ని రకాల భావములకు చేర్చబడాలి.

తార్క్ష్యపిండీ
ఇది విష్ణువుకి సంబంధించినది. తార్క్ష్యము అనగా గరుడుడు.

తాళము
కాలము.

తాళము
కాలమానము.

తిథి
సం. నా. వా. ఇ. పుం. తత్స. చాంద్రమాన దినము.

తిర్యక్కు
(బహుసంచారము) ఈ గతి వంకరగా వెళుతుంది.

తుంబురులు
సం. నా. వా. ఉ. పుం. తత్స. గాంధర్వులు, నారదుడితో పాటు ప్రసిద్ధి చెందినవారు.

తోశలము
దక్షిణ సముద్రమునకు, వింధ్య పర్వతమునకు మధ్య దేశము.

త్రస్తదృష్టి
భయముతో కనుపాపలను పైకెత్తడం. భయము వలన కంటి మధ్యభాగం వికసించడం. త్రాసములో దీనిని ఉపయోగిస్తారు.

త్రికము లేదా త్రిగతము
విదూషకుడు, సూత్రధారుడు, పారిపార్శ్వకుల మధ్య నాటకం కోసం జరిగే సంభాషణను త్రికము లేదా త్రిగతము అంటారు.

త్రిపతాకము
పతాకహస్తములోని అనామికను వంచితే అది త్రిపతాక హస్తము అవుతుంది. దీనిని కిరీటము, వజ్రాయుధము, ఇంద్రుడు, దీపము, స్త్రీ పురుషుల సమాయోగం మొదలైన అర్ధాలను ప్రదర్శించటంలో ఈ హస్తము వినియోగింపబడుతుంది.

త్రిపాణి లేదా పాణి
ఇది మూడు రకాలు. అవి 1.సమపాణి, 2.ఉపరిపాణి, 3.అర్ధపాణి. ఇది సంగీతానికి, వాయిద్యములు వాయించడానికి సంబంధించినది. లయతో పాటుగా వాయిద్యములను వాయిస్తే అది సమపాణి. లయ యొక్క ప్రారంభముతో పాటు వాయిద్యములను వాయిస్తే అది ఉపరిపాణి. లయ ప్రారంభమునకు ముందే వాయిద్యములను వాయిస్తే అది అర్ధపాణి.

త్రిపురదాహము
రాక్షసుల బూడిదతో శివుడు మూడు పురములను తయారుచేసాడు. శివుడు తనదగ్గర ఉన్న అగ్నిబాణములలో ఒకదానితో త్రిపుర అనే పేరుగల రాజ్ఞసుడిని సంహరించాడు. అందువల్లనే శివుని త్రిపురాంతకుడు అంటారు. ఇది డిమము. దీనిని శివుని ముందర ప్రదర్శిస్తారు.

త్రిపురము
ఒక రాజ్యము యొక్క పేరు.

త్రిపురాంతకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరమేశ్వరుడు, ముల్లోకములలో రాక్షసులను సంహరించువాడు.

త్రిభాగఛిన్నము
సం. నా. వా. ? బంధనము మూడు భాగాలుగా తెగినచో రాజగృహము నందు ఇబ్బందులు ఏర్పడును.

త్రీణ్యుత్తరము
సం. నా. వా. అ. న. తత్స. ఉత్తర నక్షత్రములు. 1)ఉత్తరాషాఢ, 2)ఉత్తరఫాల్గుణి, 3)ఉత్తరభాద్ర.

త్ర్యశ్రము
నాట్యమండపాలలో మూడవది. దీనియందు అన్ని భుజములు సమానముగా ఉండును.

త్ర్యస్రగ్రీవా
త్ర్యస్రము అనగా త్రిభుజాకారము. అనగా ముఖముతో పాటు మెడను పక్కలకు తిప్పడం. భాదలో మరియు బరువులు మొసేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

దండకరేచితము
ఈ కరణములో చేతులు దండపక్ష ముద్రలో, పాదాలు దండపాదచారి ముద్రలో ఉండాలి. ఇది ఉద్ధతకు సంబంధించినది.

దండపక్షము
(నృత్తహస్తము) రెండు హంస పక్ష హస్తములను ఒకదాని తర్వాత ఒకటి కదుపుతూ, దండము వలె చేయడం.

దండపక్షము
(కరణము) ఊర్ధ్వజానూచారీలత ప్రదర్శన తర్వాత చేతులను మోకాళ్ళపై ఉంచాలి. రెండవ వైపు కూడా ఇదే విధంగా చేయాలి.

దండపాదచారీ
ఒక పాదముతో నూపుర చారీ ప్రదర్శించి దానిని బయటకు చాచి మరల వెంటనే ముందుకి చాచడం.

దండపాదము
(కరణము) నూపురచారిలో ఉన్న పాదమును దండపాదచారిలోకి తీసుకువచ్చి వెంటనే చేతిని అవిద్ధ భంగిమలో ఉంచాలి.

దండము
సం. నా. వా. అ. పుం. తత్స. నాలుగు ఉపాయములలో చివరిది, బలమును ఉపయోగించుట.

దండము
సం. నా. వా. అ. పుం. తత్స. విశ్వకర్మ చేత చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. నాలుగు మూరలు కలిస్తే ఒక దండము.

దక్షయజ్ఞ విమర్ధినీ పిండి
అనగా గణములకు అధిపతి. దక్షుల త్యాగమును నశింప చేసే దేవత.

దక్షిణమార్గము
మూడు మార్గములలో ఒకటి. శుద్ధపూర్వరంగములో కళలన్నీ దక్షిణ మార్గమును అనుసరించాలి. పృథుల గీతి యందు దక్షిణ మార్గమును ఉపయోగిస్తారు.

దక్షిణసముద్రము
ఒక సముద్రము పేరు.

దక్షిణాత్యప్రవృత్తి
ఇది దక్షిణ దేశము. దక్షిణ రాజ్యాలలోని ప్రజలు వివిధ రకాల నృత్యములకు, పాటలకు మరియు వాద్య సంగీత ప్రియులు. వీరు ప్రధానముగా కైశికీ వృత్తిని మరియు తెలివైన, సొగసైన సంజ్ఞలను ఉపయోగిస్తారు. మహేంద్ర, మలయ, సహ్య, మేఖల, కలపంజర పర్వతములు లేదా వాటి చుట్టూ ఉన్న ప్రదేశాలను దక్షిణాపథము అంటారు. కోశల, తోసల, కళింగ, మోసల, ఖాస, ద్రవిడ, ఆంధ్ర, మహారాష్ట్ర, వైణ్ణ మరియు వనవాసికము అనబడు దేశాలు దక్షిణ సముద్రానికి మరియు వింధ్య పర్వతమునకు మధ్యన ఉన్నాయి. ఇవి దాక్షిణాత్య ప్రవృత్తిని అవలంబిస్తాయి.

దక్షిణాత్యము
నాలుగు ప్రాంతములలో ఒకటి. ఇది దక్షిణ ప్రాంతము. పూర్వరంగము అన్ని రకాల ప్రాంతాల వారిచేత ప్రదర్శింపబడాలి.

దక్షిణాపథము
మహేంద్ర, మలయ, సహ్య, మేఖల పర్వతములలో లేదా వాటి చుట్టూ ఉన్న దేశాలు.

దక్షిణావృత్తము
గద్.ములలో ఒకటి.

దమక్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ?

దర్శనభేదములు
ఇవి తాళ కర్మకు సంబంధించినవి. ఇవి ఎనిమిది రకములు. అవి, 1.సమము, 2.సాచి, 3.అనువృత్తము, 4.ఆలోకితము, 5.విలోకితము, 6.ప్రలోకితము, 7.ఉల్లోకితము, 8.అవలోకితము. ఇవి అన్ని రకముల రసములకు, భావనలకు సంబంధించినవి.

దశార్ణము
ఒక దేశము యొక్క పేరు.

దష్టచిబుకము
కింది పెదవిని పళ్ళతో కొరుకుట. క్రోధములో దీనిని ఉపయోగిస్తారు.

దానము
సం. నా. వా. అ. న. తత్స. ఇచ్చుట, నాలుగు ఉపాయములలో రెండవది, బహుమతులిచ్చి ఒప్పించుట, నమ్మించుట.

దానవీరము
? బహుమతులు ఇవ్వడం ద్వారా వీరరసము ఉత్పన్నమైతే దానిని దానవీరము అంటారు.

దానవులు
సం. నా. వా. అ. పుం. తత్స. రాక్షసులు, దానువు మరియు వారి వంశము యొక్క సంతతి.

దారుకము
సం. నా. వా. అ. న. తత్స. చెక్కముక్క. రంగశీర్షము చెక్కల ద్వారా చేయబడుతుంది. అందుకే షట్దారుక అని కూడా అంటారు.

దారుకర్మ
సం. నా. వా. న్. పుం. తత్స. వడ్రంగి పని. వేదికను అలంకరించడానికి చెక్కను ఉపయోగిస్తారు. నిర్యూహతో పాటుగా అలంకరించుట, చెక్కుట, శిల్పమును చేయుట, తొలుచుట మొదలైనవి వీరి కార్యాలు.

దిక్స్వస్తికము
చేతులు మరియు పాదాలతో స్వస్తిక చేయునపుడు ఇరుపక్కలకి, ముందుకి చేసే కదలికలు.

దివౌకసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్వర్గమునందు కాపురముండేవారు, దేవతలు. ఇక్కడ మాత్రం ఈ పదాన్ని వరుణదేవుని గురించి ప్రస్తావించడం జరిగింది. నాట్యమండపములో బాండ, వాద్యములను రక్షించమని వరుణదేవుని అడిగారు.

దివ్యఛందము
గాయత్రి, ఉష్ణిక, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్ మరియు జగతి మొదలైనవి దివ్యఛంధములు.

దివ్యమానుషఛంధము
కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అభికృతి, ఉత్కృతి, మొదలైనవి దివ్యమానుషఛంధములు.

దివ్యాద్భుతము
రెండు అద్భుత రసాలలో ఒకటి. స్వర్గములాంటి ప్రదేశాలను చూడటం ద్వారా ఉత్పత్తి అయ్యే రసము.

దిశ
సం. నా. వా. అ. పుం. తత్స. దిక్కు, లక్ష్యము, గురి. ఇవి నాలుగు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము.

దీనదృష్టి
కనురెప్పను కిందకి వంచి, కనుపాపలు కొద్దిగా వాల్చి కన్నీళ్ళతో నెమ్మదిగా కదపడం. దీనిని శోకములో ఉపయోగిస్తారు.

దీర్ఘము
గురు అక్షరము.

దుందుభి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ఒకరకమైన డోలు.

దూరధ్వానగతముయొక్కగతి
దూరధ్వానగతము యొక్క గతి అనగా చాలా దూరముం నడిచే వ్యక్తి యొక్క కదలిక. ఈ గతి చిన్న చిన్న అడుగులతో అవయవాల ఇరకాటంతో మరియు మోకాళ్ళను రుద్దుకుంటూ చూపబడాలి.

దూరము
వేదిక పైన అత్యంత దూరమును సూచించటానికి ఉపయోగించే పదము. ఒకే ప్రదేశములో ఎక్కువసేపు నడిచినా దూరముగానే పరిగణిస్తారు.

దృతలయము
వేగవంతమైన లయ. మూడు లయలలో ఒకటి.

దృప్తదృష్టి
గర్వముగా చూడటము. కనుపాపలను కదపకుండా కళ్ళను స్థిరముగా, ఎడమగా తెరిచి పరాక్రమమును వ్యక్తపరచడం. శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

దృశ్యము
సం. నా. వా. అ. న. తత్స. చూచుట, చిత్రము, పటము.

దృష్టిభేదములు
నాట్యములో దృష్టులకు ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. మిగిలిన అవయవ కదలికలతో అర్ధమును చెప్పేటప్పుడు దృష్టులు మరికొంత అందాన్ని చేరుస్తాయి. ఇవి మొత్తం 36. రసములను వ్యక్తపరిచేవి రసదృష్టులు, ఇవి 8. స్థాయీభావదృష్టులు, ఇవి 8. సంచారీభావ దృష్టులు, ఇవి 20.

దృహిణుడు
సం. నా. వా. అ పుం. తత్స. బ్రహ్మదేవుడు.

దేవరాజు
సం. నా. వా. అ పుం. తత్స. దేవతలకు రాజు, ఇంద్రుడు.

దేవరాట్టు
సం. నా. వా. జ్. పుం. తత్స. దేవతలకు రాజు, ఇంద్రుడు.

దేవా
సం. నా. వా. ఋ. పుం. తత్స. దేవుళ్ళు, 33 మంది దేవతలు, వీరు వరుసగా అష్ఠవసువులు (8), ఏకాదశ రుద్రులు (11), ద్వాదశాదిత్యులు (12), సూర్యుడు, చంద్రుడు.

దేశము
రాజ్యము.

దేహలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గడప, యమదండము చేత ఈ భాగము రక్షించబడుతుంది.

దేహలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గడప.

దైత్యులు
సం. నా. వా. అ. పుం. తత్స. రాక్షసులు. కశ్యపుని భార్య అయిన దితి యొక్క కుమారులు.

దైవతము
అగ్ని మొదలైనవారు.

దోలాపాదకము
(కరణము) పాదమును మోకాలి వద్ద వంచి పక్క పక్కకు ఊగుతూ చేతులను కూడా అదే విధంగా ఊపడం. (డోలహస్తము)

ద్రమిడము
దక్షిణ సముద్రమునకు, వింధ్య పర్వతమునకు మధ్య గల రాజ్యము.

ద్రవ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ధనము, మూలవస్తువు.

ద్రవ్యములు
ఆహారమును వండేటప్పుడు వివిధరకాల రుచులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే వస్తువులు.

ద్వారపత్రము
సం. నా. వా. అ. న. తత్స. ద్వారము యొక్క రెండు అలుగులు. నాట్యమండపం పూర్తి అయిన తర్వాత నాగరాజు దీనిని సంరక్షిస్తాడు.

ద్వారశాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ముఖద్వారము, దీనిని యముడు రక్షించును.

ద్వికలము
రెండు కళలు. వివిధ రకాల అంశములలో దీనిని ఉపయోగిస్తారు.

ద్విజములు
పళ్ళు, దంతములు.

ద్విభూమి
సం. నా. వా. ఇ. పుం. తత్స. రెండు వేరు వేరు దశలలో ఉండు భూమి.

ధనుష్కరణము
ధనుస్సుకు సంబంధించిన క్రియలు. ఇవి నాలుగు రకాలు. 1.పరిమార్జనము, 2.ఆదానము, 3.సంధానము, 4.మోక్షణము.

ధనేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుబేరుడు, ధనాధిపతి.

ధర్మనాశకరుణము
మూడు కరుణ రసములలో ఒకటి. భయంకరమైన పనులకు ఆటంకములు కలగడం ద్వారా కరుణ రసం ఉత్పత్తి అయితే దీనిని ధర్మనాశకరణము అంటారు.

ధర్మము
సం. నా. వా. అ. పుం. తత్స. న్యాయము, యథార్థ్యము, చతుర్విధ పురుషార్థములలో మొదటిది.

ధర్మవీరము
మూడు వీరరసములలో ఒకటి. ఒకరి కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా వీరరసము పుడితే దానిని ధర్మవీరము అంటారు.

ధర్మి
అభినయ పద్ధతి. ఇది రెండు రకములు. 1.లోకధర్మి, 2.నాట్యధర్మి.

ధర్మి
ఇది రెండు విధములు. 1.లోకధర్మి, 2.నాట్యధర్మి.

ధారణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గ్రహించబడిన జ్ఞానాన్ని జ్ఞాపకముంచుకొనే శక్తి.

ధారణ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. నాట్యమండపము నందు కటకటాలతో కూడిన పీఠము లేదా ఆసనము. దీనిని భూతములు రక్షించును.

ధారాపిండి
గంగా ప్రవాహము.

ధుతశిరము
తలను నెమ్మదిగా కదపటము. అయిష్టత, భాద, ఆశ్చర్యము, నమ్మకము, పక్కలకు చూచుట, శూన్యత, తిరస్కరించడము, మొదలైనవాటిలో ఉపయోగిస్తారు.

ధృతి
ఒక పాదములో 18 అక్షరములు ఉండే ఛందస్సును ధృతి అంటారు.

ధ్వజమహము
సం. నా. వా. అ. న. తత్స. ఇంద్రుని యొక్క పతాకోత్సవము (జెండా పండుగ). ఇంద్రుడు దేవతల యొక్క సహాయముతో దానవులతో యుద్ధము చేసి గెలిచిన సందర్భముగా విజయ సంకేతంగా చేసుకొనే పండుగ. దీనిని భాద్రపద మాసంలో శుక్ల ద్వాదశి 12వ రోజున జరుపుకుంటారు. ఇది ప్రాచీన భారతదేశములో అత్యంత ఆదరణ పొందిన పండుగగా ప్రాచుర్యం పొందింది. దీని గురించి అశ్వగోషుని యొక్క కావ్యములో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇదే తరహా పండుగ మహాభారతములో కూడా ఉంది.

ధ్వజము
సం. నా. వా. అ. న. తత్స. ఇంద్రుని యొక్క పతాక స్తంభము. పతాకావిష్కరణ రోజున భరతుడు మరియు అతని పుత్రులు ప్రదర్శించిన మొదటి ప్రదర్శనకు ఇంద్రుడిచ్చిన బహుమానము.

నంది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శివుని యొక్క గొప్ప వాహనము, గణములకు అధిపతి.

నక్షత్రములు
సం. నా. వా. అ. న. తత్స. ఇవి మొత్తం 27. అవి వరుసగా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. స్థల నిర్ణయం అయిన తర్వాత దానిని శుభ్రపరచి తెల్లని దారంతో కొలతలు తీసుకోవాలి. ఇది ఖచ్చితముగా పుష్యమి నక్షత్రంలోనే జరగాలి. మిగతా నక్షత్రాలు ఈ వేడుకలో త్రిణ్యిత్త కరణికి, మృగశిర, విశాఖ, రేవతి, హస్త, మరియు అనురాధ నక్షత్రాలలో చెయ్యాలి. శంకుస్థాపన మూల నక్షత్రంలో, నాలుగు స్తంభాల ప్రతిష్ఠ రోహిణి మరియు శ్రవణ నక్షత్రాలలో జరగాలి. రంగదేవతా పూజకు మరియు జర్జర పూజకు ఆరుద్ర, మఖ, భరణి, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పుబ్బ, ఆశ్లేష మరియు మూల నక్షత్రాలు శ్రేయస్కరము.

నగరములు
పట్టణములు.

నతగ్రీవా
క్రందకి వంచిన ముఖము. ఆభరణాలను ధరించేటప్పుడు చేతులను మెడచుట్టూ పెట్టేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

నతజంఘము
మోకాళ్ళు రెండు వంచడం.

నతనాసికము
అవయవములు పదే పదే గట్టిగా పట్టుకొనుట. వెక్కి వెక్కి ఏడవటం, ప్రేయసిని ఓదార్చటం, మదోత్కంపనముతో నిట్టూర్పును వదలడం మొదలైనవాటి యందు దీనిని ఉపయోగిస్తారు.

నతపార్శ్వము
ఛాతి కొంచెం ఒక పక్కకి వంగి మరియు భుజం కూడా కొద్దిగా వంగడం. ?

నతశయనము
కాళ్ళను వేరు చేసి రెండు చేతులను వదులుగా విశ్రాంతి దశలో ఉంచి నిద్ర చేస్తే దానిని నతశయనము అంటారు. దీనిని బాధలోను, అలుపులోను, బద్ధకంలోను ఉపయోగిస్తారు.

నదము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆనందము, ఉత్సాహము, విష్ణువు యొక్క ఒక లక్షణము, వేడుక.

నది
సం. నా. వా. ? గొప్పనదులు.

నదీపిండి
అనగా వరుణ దేవునికి సంబంధించినది.

నపుంసకపదము
పూర్వరంగములో పరివర్తనము తర్వాత దేవతలందరికీ వందనం చేసి సూత్రధారుడు మూడు అడుగులతో ముందరికి వెళ్తాడు. అందులో ఒకటి నపుంసక పాదము. కుడిపాదమును పూర్తిగా పైకెత్తకుండా మధ్యస్థంగా ఉంచడమే ఈ పాదము.

నపుంసకులగతి
వీరు మూడో రకానికి చందినవారు. వీరిలో స్త్రీ పురుషుల ఇద్దరి లక్షణాలు ఉంటాయి. కాని వీరి గతి మాత్రం స్త్రీల గతిలాగనే ఉంటుంది.

నర్కుడము లేదా నర్కుటము
ఇది చతుష్పాదవృత్తములోని దృవగీతము.

నర్తకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఆడ నాట్యకారులు.

నర్తకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఎవరైతే ప్రదర్శనకు ముందు పూజా విధానాన్ని ఆచరించడో అతడు నష్టాన్ని భరించవలసి ఉంటుంది.

నళినీపద్మకోశము
(నృత్తహస్తము) వెనుకకు తిప్పబడిన రెండు పద్మకోశహస్తాలు స్వస్తికంగా ఉంటే అది నళినీపద్మకోశము అవుతుంది. మొగ్గ, నాగబంధము, పూలగుత్తి, పదిసంఖ్య మొదలైన అర్ధముల యందు ఈ హస్తము ప్రయుక్తమవుతుంది.

నాంది
వేదాలలో చెప్పబడిన మంగళప్రదమైన ఎనిమిది వాక్యాలను పాడడం. దేవతలు, బ్రాహ్మణులు మరియు రాజుల యొక్క ఆశీర్వచనం కోసం వేడుకోవడం.

నాంది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఎనిమిది పాదాలు కలిగిన ఆశీర్వచన శ్లోకము. వేదాలనుండి గ్రహింపబడినది. పవిత్రమైనది. ఆశీర్వచనము కలిగి ఉండునది. ధ్వజోత్సవములో మొట్టమొదట దీనిని ప్రవేశపెట్టారు. పరాజయమనేది లేకుండా చంద్రుని సంతృప్తి పరచునది. పూర్వరంగములోని అంతర్యవనికాంగములలో ఒకటి. ఈ అంతర్యవనికాంగములలో కొన్ని ప్రదర్శింపబడతాయి, కొన్ని ప్రదర్శితము కావు. కాని నాంది మాత్రం ఖచ్చితంగా ప్రదర్శింపబడుతుంది. దీనిలో ప్రార్థన, విజ్ఞప్తి రెండు ఉంటాయి. దీనిలో బ్రహ్మ, అర్థపతి, రాజుల యొక్క ఆశీర్వచనములు ఉంటాయి.

నాందిపాఠకుడు
సూత్రధారుడు, నాందిపాఠకుడు అనునవి పర్యాయ పదాలు. ఇతడు దర్శకుడు, విదూషకుడు మరియు పారిపార్శ్వకుని యొక్క సహాయంతో సరైన కారణాలతో, సరైన హేతువుతో వేదికను నిర్వహిస్తాడు.

నాగదత్తము
సం. నా. వా. అ. న. తత్స. పాము తల ఆకారములో ఉండే కిటికీ. ఏనుగు ఆకారము కల ఒక వాయిద్యము స్తంభము పైన పెట్టాలి. గోడలో మేకు వలె ఉండే సన్నని చెక్క.

నాగపసర్పితము
(కరణము) ఈ భంగిమ సాత్విక కరణంతో ప్రదర్శించి పరివర్తిసిర మరియు రేచిత ముద్రలు పెట్టాలి.

నాగపుష్పము
? నాగపుష్పము యొక్క పొడి.

నాగరాజు
సం. నా. వా. అ. పుం. తత్స. అనంతుడు, వాసుకి వీరిరువురు సర్పరాజులు. వీరు నాట్యమండపం యొక్క ద్వారపు అలుగులను (ద్వారపత్రాలను) రక్షిస్తారు.

నాట్యకుమారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నృత్యము చేయువారు.

నాట్యగృహము
సం. నా. వా. అ. న. తత్స. నాటకశాల, నాట్యమండపము, నాట్యవేశ్మము, ప్రేక్ష్యగృహము. ఇవన్ని నాట్యగృహము యొక్క పేర్లు.

నాట్యధర్మి
సాంకేతికమైన అభ్యాసము. 1.సంభాషణలు, పనులు ఎక్కువగా ఉంటాయి, 2.సత్త్వము, భావము విపరీతములై ఉంటాయి, 3.నటనయందు ఎక్కువ అంగారములు ఉంటాయి, 4.ఒకవేళ నాటకములో నృత్యమునకు లేదా స్వరము మరియు అలంకారమునకు సంబంధించిన గుణాలు బాగా సమకూర్చబడితే దానిని నాట్యధర్మి అంటారు.

నాట్యమండపము
సం. నా. వా. అ. పుం. తత్స. నాటకశాల.

నాట్యమాతరము
సం. నా. వా. అ. న. తత్స. సరస్వతీదేవి, దృతి, మేథ, హ్రీ, శ్రీ, లక్ష్మి, స్మృతిమతి ఇవన్నియూ నాట్యమాతరములు. వీరు రక్షణతో పాటు సిద్ధిని కూడా కల్పిస్తారు.

నాట్యము
సం. నా. వా. అ. న. తత్స. నాటకము.

నాట్యయోగము
సం. నా. వా. అ. పుం. తత్స. పాటలు పాడటాన్ని గానయోగంగా, నృత్యం చేయడాన్ని నాట్యయోగంగా చెప్పవచ్చు. తన శిష్యుడైన స్వాతితో పాటు మిగతా శిష్యులందరూ మరియు నారదుడు, గంధర్వులు నాట్యగానయోగం కలిగి ఉన్నారు.

నాట్యరసాలు లేదా లౌకికరసాలు
ప్రేక్షకులు, నటులు చేసే భావములను ఆస్వాదిస్తారు. ప్రేక్షకులకు వచ్చే ఈ భావనలను నాట్యరసాలు లేదా లౌకికరసాలు అంటారు. వ్యజనములతోటి, ఓషధులతో మరియు వివిధ రకాల ద్రవ్యములతో రకరకాల రుచులను తెల్పుతూ వండబడ్డ ఆహారమును ఆస్వాదించడాన్ని లౌకికరసము అంటారు.

నాట్యవేదము
సం. నా. వా. అ. పుం. తత్స. నాట్యశాస్త్రమునకు పర్యాయపదము. నాట్యశాస్త్రము నాలుగు వేదాల నుండి గ్రహింపబడినది. అందుచేత దీనికి వేదాలతో సమమైన హోదాని కల్పించారు.

నాట్యవేశ్మము
సం. నా. వా. అ. న. తత్స. నాట్యగృహము, నాటకశాల, ప్రేక్షకగృహము.

నాట్యశాస్త్రము
నాట్యమును గురించి తెలిపెడు గ్రంథము. భరతునిచే రచించబడినది. నాటకమును గురించి తెలిపే భారతీయ గ్రంథము. రచయితకు, నటుడికి సూత్రాలను తెలియజేస్తుంది. దీనియందు ఛందస్సు, వ్యాకరణము, నృత్యగీతములు, గానము మొదలైన ఆంతరంగిక జ్ఞానం కలదు. ఒకరకంగా చెప్పాలంటే నాట్యశాస్త్రము భారతీయ నాటక రంగానికి విజ్ఞాన భాండాగారము లాంటిది.

నాట్యసంగ్రహము
అంగ, ఉపాంగ, ప్రత్యంగ సహితమైనది.

నానాభోజన సంయుతము
సం. నా. వా. అ. పుం. తత్స. పలురకాల తినుబండారాలు.

నారదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురాణములలో బాగా తెలిసిన ముని. బ్రహ్మదేవుని మెదడు నుండి పుట్టినవాడు. అనుభవజ్ఞుడైన గాయకుడు. తన గాత్రాన్ని భరతుని కోసం అధీనం చేసాడు.

నాసాకర్మ
ముక్కు చేసే పనులు. ఇవి ఆరు రకములు. 1.నతము, 2.మందము, 3.వికృష్టము, 4.సోచ్ఛ్వాసము, 5.వికూణితము, 6.స్వాభావికము.

నికుంచితము
(కరణము) దీనిని విషిక కరణంతో కదుల్చుతూ, ఎడమచేతిని ఎడమవైపుకు వంచుతూ కుడిచేయిని ముక్కుకి దగ్గరగా తీసుకురావాలి. (రెండు చేతులు అరాల ముద్రలోనే, ఎడమచేతిని ఎడమ తల దగ్గరకు తీసుకు రావాలి.

నికుట్టకము
రెండు చేతులు బాణాకారంగా పైకి, కిందకి కదుల్చుతూ తల, పాదాలు మధ్యమధ్యలో కదల్చాలి. ఇక్కడ కాళ్ళు, చేతులు కూడా వంచాలి.

నితంబము
పైకి ఎత్తబడిన రెండు పతాకహస్తములు క్రిందుమొగములుగా పిరుదుల వరకు ప్రసారితములైతే అది నితంబ హస్తము అవుతుంది.

నితంబము
(కరణము) శరీరం బద్ధాచారీని ప్రదర్శిస్తూ తొడలు పైకెత్తి కాలివేళ్ళను ఆన్చి ఉంచాలి.

నిమిత్తము
ఒక విశేషమైన కారణము.

నిమేషపుటము
కురెప్పలను ఆర్పుట. క్రోధరసములో దీనిని ఉపయోగిస్తారు.

నియతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. అదృష్ట దేవత, మృత్యువు, నియతి ద్వారపాలకులు.

నియుద్ధము
ఇది కరణములతో ప్రదర్శింపబడాలి.

నిరుక్తము
శబ్ద లక్షణము. నిఘంటువుల సహాయంతో వ్యాకరణ నియమాలకు అనుగుణంగా శాస్త్రాలలో వెతికి వివిధ నామవాచకాల కలయిక ద్వారా ఒక ఖచ్చితమైన అర్ధము ఏర్పడటం. ?

నిర్గీతము
బహిర్గీతమునకు మరొక పేరు. దీనియందు వాద్యసంగాతము, పాట కూడా ఏడు రూపాలలో ఉంటాయి. కాని దైత్యులు వాద్య సంగాతము వినడానికి మాత్రమే ఇష్టపడతారు. ఎందుకంటే పాటలన్నీ కూడా దేవుళ్ళను పొగుడుతూ ఉంటాయి. నిర్గీతము అంటే పాటలు లేకుండా ఉండుట. బహిర్గీతము అంటే వాద్యము, పాట రెండూ కూడా ఉండటం.

నిర్భుగ్నవక్షసము
ఛాతి గట్టిగా ఉంచి ?

నిర్భుగ్నాస్యము
నోరు కిందకి రావడం. గంభీరమైన, ముఖ్యమైన విచారణ యందు దీనిని ఉపయోగిస్తారు.

నిర్యూహ కుహురము
సం. నా. వా. అ. న. తత్స. నిర్మాణమునకు సంబంధించినది. స్తంభమును ప్రణాళికగా చేసుకొని ఏర్పడిన రంగము.

నిర్వాతము
సం. నా. వా. అ. పుం. తత్స. నియంత్రించబడ్డ వాయువు (గాలి) లేకుండుట.

నివృతము
ముందుకి తిరిగి వెనుక భంగిమలో ఉండటం.

నివేశము
(కరణము) రెండు చేతులు ఛాతిమీద ఉంచి కొంచెం వంగి మండల స్థానంలో నిలబడి ఉండాలి.

నిశుంచితము
(కరణము) ఇక్కడ పాదాన్ని వెనకకి వంచి ఛాతిని బాగా పెంచి చేతి దగ్గరగా తెచ్చి నుదుటి మీద ఉంచి (మధ్యలో కటకాముద్రలో చేయి) ఉండాలి. ఇది అభినయం చేస్తున్న శివుడిలా ఉంటుంది.

నిషధము
(సంయుతహస్తము) ముకుళము కపిత్థము చేత చుట్టబడినప్పుడు నిషధము అవుతుంది. శిఖరహస్తము మృగశీర్షము చేత చుట్టబడినప్పుడు నిషధము అవుతుంది. ?

నిషధము
ఏడు పర్వతములలో ఒకటి. ఈ పర్వతము నందు నాగశేషులు, వాసుకి, దక్షకులు మొదలైన వారందరు కూడా నివసిస్తారు.

నిష్కామము లేదా నిష్క్రమణతారా
కనుపాపలను బయటకు తెరచుట. వీరరసము, రౌద్రరసము, అద్భుతరసము, భయానకరసములలో దీనిని ఉపయోగిస్తారు.

నిహంచితశిరము
రెండు భుజములను పైకెత్తి మెడను పక్కకు వంచడం. ఇది ఆడవారిచేత, గర్వము, ఈర్ష్య, కోపము, విలాసము, లలితము, అపస్మారకస్థితి, కోపము తెచ్చుకోవడం, పక్షవాతము మొదలైనవాటి యందు ఉపయోగపడుతుంది.

నీలకంఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శివునికి మరొర పేరు. క్షీరమథనం జరుగుతున్న సమయంలో లక్ష్మి, ఐరావతములతో పాటు కాలకూట విషము కూడా ఉద్భవించింది. దానిని లోక రక్షణార్థం శివుడు సేవించగా అతని కంఠం నీలపు రంగులోకి మారింది. అందువలన శివుడిని నీలకంఠుడిగా వ్యవహరిస్తున్నారు.

నీలపర్వతము
ఏడు పర్వతములలో ఒకటి. ఈ పర్వతము వాఢూర్యములతో నింపబడి ఉంటుంది. దీనియందు సిద్ధులు, బ్రహ్మర్షులు నివసిస్తారు.

నీలము
బీభత్స రసమునకు చెప్పబడిన వర్ణము.

నీలము
సం. నా. వా. అ. పుం. తత్స. దక్షిణ దిక్కునకు శంకుస్థాపన రోజు సమర్పించడం కోసం వండబడిన నల్లని లేదా నీలం రంగు అన్నము.

నూపురపాదికచారీ
అంచిత పాదము వెనుక వైపుగా కదిపి మునివేళ్ళతో నేలను తాకితే నూపురపాదికచారీ ఏర్పడుతుంది.

నూపురము
త్రికరమును తిప్పి, చేతులను లత మరియు రేచిత హస్తములలో ఉంచి పాదములను నూపుర కరణంలో ఉంచాలి.

నృత్తమాతృక
ఇది రెండు కరణాల కలయిక.

నృత్తము
స్వచ్ఛమైన నృత్యము.

నృపగతి
దేవతల యొక్క స్వభావము చాలా గొప్పది. అదే విధముగా రాజులు కూడా దివ్య మానుషులుగా మరియు దేవతల నుంచి వివిధ భాగముల నుంచి పుట్టిన వారుగా చెప్పబడ్డారు. కాబట్టే రాజులకు దేవతలతో సమానమైన స్థానమును కల్పించి దేవగతినే వారి గతిగా చెప్పబడింది.

నేపథ్యగృహము
సం. నా. వా. అ. న. తత్స. అలంకరణ గది.

నేపథ్యభూమి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కళాకారులు అలంకరణ చేసుకునే గది. దీనిని మిత్రుడు రక్షిస్తాడు.

నేపథ్యరౌద్రము
వస్త్రధారణ ద్వారా అభినయింపబడే రౌద్రము.

నేపథ్యహాస్యము
వస్త్రధారణ ద్వారా అభినయింపబడే హాస్యము.

నేపథ్యాత్మక శృంగారము
వస్త్రధారణ, వేశముల ద్వారా శృంగారమును అభినయిస్తే దానిని నేపథ్యాత్మక శృంగారము అంటారు.

నేపాలకము
తూర్పురాజ్యము యొక్క పేరు.

నైపథ్యము
సం. నా. వా. అ న. తత్స. అలంకరణ గదికి సంబంధించినది.

నైరుతము
సం. నా. వా. త్. పుం. తత్స. రాక్షసుడు.

నైరుతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దక్షిణ పడమర మూల.

నౌస్థులగతి
ఓడలలో నడిచేవారు వడివడిగా చూర్ణపాదములతో నడవాలి. ఒక పాదము అతిక్రాంతలో మరొకటి అంచితములోను ఉండాలి.

న్యాయములు
నాలుగు న్యాయములు కలవు. ఇవి ఆయుధములను ఉపయోగించే పద్ధతులు. Chapter10.2 . ఆయుధములను అవయవముల యొక్క సరైన కదలికతో ఉపయోగించాలి. సభావేదిక పైన ఏ అవయవము తెగకూడదు. రక్తము చిందకూడదు. ఇవన్నీ కూడా కేవలము భంగిమల ద్వారా, సంజ్ఞల ద్వారా, సూచనల ద్వారా చేయబడాలి.

న్యాసము
ఇది తాండవ విధిలో వస్తుంది.

పంగోపగతి
ఇది చేతకాని వారి గతి. దీనియందు ఒక పాదము అగర్తల సంచారములోను మరొకటి అంచితములోను ఉండి, శరీరము స్థిరముగాను, కాళ్ళు నతములోను ఉంటాయి.

పంచపదిగమనము
ఒక శ్రేష్ఠమైన వ్యక్తి సామాన్య గతిలో మోకాలుని నడుము వరకు పైకెత్తుతాడు. యుద్ధాచారీ ప్రయోగములో ఇది ఛాతి వరకు ఎత్తబడాలి. అప్పుడు అతడు పార్శ్వక్రాంతచారీలో గంభీరమైన అడుగులను వేదిక పైకి సంగీత వాయిద్యాలు వాయిస్తుండగా వేస్తాడు. ఈ కదలికల యందు ఇతడు 21 అడుగులను వేస్తాడు. ఈ పాద కదలికలు త్ర్యాస్రంగములోని త్ర్యాస్రములోను, చతురస్రంగములోని చతురస్రములోను ఉండాలి.

పంచమవేదము
సం. నా. వా. అ పుం. తత్స. ఆది నుంచి కూడా నాట్యము అనేది చిత్ర, సంగీత, వాస్తు మొదలైనవాటి సమూహము. బ్రహ్మ వచనమును ఋగ్వేదము నుండి, సంగీతాన్ని సామవేదము నుండి, కదలికలు మరియు అలంకరణలను యజుర్వేదము నుండి, భావసంబంధితమైన వాటిని అధర్వవేదము నుండి తీసుకొని ఒక కొత్త శాస్త్రాన్ని పరికల్పించాడు. దీనినే పంచమవేదం అంటారు. ఇది నాలుగు వేదాల నుండి చెప్పబడినది కాని అయిదవ వేదము కాదు.

పక్షప్రద్యోతము
(నృత్తహస్తము) ఒకవేళ త్రిపతాకములో ఉన్న చేయి పిరుదులకు ఉంటే రెండో చేయి తలమీద ఉంచడం. ?

పట్టసీపిండి
ఇది నాందికి సంబంధించినది. ఇది పట్టసీ పిండి కాని పాదసి పిండి కాని అవ్వొచ్చు.

పణకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఒక చిన్న డోలు.

పతాకహస్తము
బొటనవేలు వంచి, తక్కిన నాలుగు వేళ్ళను దగ్గరగా చేర్చి చాచినట్లైతే దానిని పతాకహస్తము అంటారు. దీనిని నాట్యప్రారంభములో, దేవతా సమూహము, అశ్వము, నేను అనడము, మొదలైనవాటిని ప్రదర్శించడంలో ఉపయోగిస్తారు.

పద్మకోశము
ఐదువ్రేళ్ళు ఎడంగా ఉన్నవి, అరచేతిలోనికి వంగినవి అయితే పద్మకోశహస్తము ఏర్పడుతుంది. దీనిని పండ్లు, గుండ్రంగా తిరగటం, బంతి, కవచం, పాముపుట్ట, పద్మము ఈ అర్ధముల యందు ఈ హస్తము విధించబడినది.

పద్మపిండి
కలువ.

పద్మోద్భవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పద్మము నుండి పుట్టినవాడు, బ్రహ్మదేవుడు.

పన్నగము
సం. నా. వా. అ. న. తత్స. సర్పరాజు.

పరస్థహాస్యము
ఒక వ్యక్తి ఇతరులను నవ్విస్తే దానిని పరస్థహాస్యము అంటారు.

పరావృతశిరము
తలను వెనుకకు తిప్పుట. వెనుకకు చూచుటకు, సమ్మతి లేదని చెప్పేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

పరావృత్తము
(అంగహారము) కుడిపాదమును జనితంలో ఉంచి మరొక పాదమును చాచి త్రికమును తిప్పుతూ ఎడమ చేతిని వంచి బుగ్గపై పెట్టి అలాతకము చేసి చివరగా కఠిఛిన్న కరణము చేయాలి.

పరిగీతకము
చతుష్పదవృత్తములో దృవగీతము.

పరిఘట్టనము
తీగవాద్యములను శృతి చేయడాన్ని పరిఘట్టనము అంటారు. శుష్కాక్షరములను గానం చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా వాద్యముల యొక్క తీగలను సరి చేయడమే పరిఘట్టనము. దీనివలన రాక్షస గణాలు సంతృప్తి చెందబడతాయి.

పరిఛిన్నము
(అంగహారము) సంపాదస్థానంలో పరిఛిన్న కరణం చేయాలి. ఎడమ పాదమును అవిద్ధములో ఉంచి బ్రహ్మ కరణమును చేయాలి. మిగతా వాటిని సూచీ, అతిక్రాంత, భుజంగత్రాష్టము, కరిహస్త మరియు కఠిఛిన్న కరణమును చేయాలి.

పరిమార్జనము
విల్లును వంచడం.

పరివర్తనము
ఇది గానక్రియకు సంబంధించిన ఆవృత్తి. గుండ్రంగా నడవడమే పరివర్తనము. నాటకము అన్ని రకాల మతాలను రక్షించే దేవతలను పొగుడుతూ ప్రారంభమవుతుంది. అంటే నటులు అందరూ కూడా సభావేదిక చుట్టూ తిరుగుతూ దేవతలను పొగుడుతారు.

పరివర్తితము
?

పరివాహితశిరము
తలను గత్యంతరముగా రెండు పక్కలకు తిప్పడం. ఆశ్చర్యములోను, ఆనందములోను, గుర్తుపెట్టుకోవడంలోను, అయిష్టములోను, ఎన్నికలోను, దాష్టములోను, విలాసములోను దీనిని ఉపయోగిస్తారు.

పరివృత్త రేచితము
(అంగహారము) స్వస్తికము నుంచి చేతులను తీసి తలపై ఉంచాలి. శరీరమును వంచి ఎడమ చేతిని రేచితములో ఉంచాలి. తర్వాత రేచిత హస్తములతో శరీరమును పైకెత్తి, ఆ తర్వాత లతాహస్తములతో వృశ్చికరణము చేసి తర్వాత రేచితము, కరిహస్త, భుజంగ త్రాసితము, ఆక్షిప్తము చేయాలి. పాదములను స్వస్తికలో ఉంచి మునివేళ్ళను వేరు వేరు దిక్కులకు అభిముఖంగా ఉంచి కరిహస్తము, కఠిఛిన్నము చేయాలి.

పరివృత్తము
వెనుకకు తిరగడం.

పరివృత్తము
(కరణము) రెండు చేతులను అపవేష్టితములో పైకెత్తి, పాదమును సూచీపాదములో తిప్పి త్రికమును భ్రమరీచీరీలో తిప్పాలి.

పర్యస్తకము
1.(అంగహారము) మొదటగా తలపుష్పపుటము, అపవిద్ధ మరియు వర్ధిత కరణములు ప్రదర్శింపబడాలి. ఆ తర్వాత ప్రత్యాలీఢ స్థానమును తీసుకొని నికుట్టకము, ఊరుద్వృత్తము, ఆక్షిప్తము, ఉరోమండలము, కఠిఛిన్న కరణములు చేయాలి. 2.(కరణము) శుద్ధవృత్తము. దీనిలో అభినయము ఉండదు. కేవలం ఆంగికాభినయం మాత్రమే ప్రదర్శింపబడుతుంది.

పర్వతములు
మొత్తం ఏడు పర్వతాలు కలవు. Chapter13.2.

పలలము
సం. నా. వా. అ. న. తత్స. మాంసాహారము.

పల్లవము
ఎప్పుడైతే రెండు పతాక హస్తాలు కలపబడి ఛాతిమీద ఉంటాయో అది పల్లవము అవుతుంది.

పవనాశనము
సం. నా. వా. ? పాములు వీరు వాయువును ఆహారముగా కలిగి ఉంటారు.

పాంచాలమధ్యమప్రవృత్తి
పాంచాల రాజ్యములైనటువంటి పాంచాల సౌరసేన, కాశ్మీరము, హస్తినాపురము, బాహ్లికము, షకలము, మాద్రకము, ఉశీనరము మొదలైనవన్నీ పాంచాల లేదా పాంచాల మధ్యమ ప్రవృత్తిని అవలంబించాలి. ఇవి సాత్త్వతి మరాయు ఆరభటి వృత్తులను అనుసరించాలి.

పాంచాలము
హిమాలయాలకు కాని, గంగానది యొక్క ఉత్తర సమీపమునున్న రాజ్యాలు.

పాంచాలము
పూర్వరంగము ప్రదర్శింపబడే నాలుగు ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతాలను అనుసరించుకొనే ప్రవృత్తులు ఏర్పడతాయి.

పాఠ్యము
సం. నా. వా. అ న. తత్స. చదవడము, వచనము.

పాణి
ఇది మూడు రకములు. 1.సమపాణి, 2.ఉపరిపాణి, 3.అవరపాణి.

పాతనభ్రూ
కనుబొమ్మలను ఒకదాని తర్వాత ఒకటి ఒకే సమయములో కిందకి తీసుకురావడం. అసూయ, చిరాకు, నవ్వడం, మరియు వాసన చూడటంలో దీనిని ఉపయోగిస్తారు.

పాతనము లేదా పాతతారా
కనుపాపలకు విశ్రాంతిని ఇవ్వటం. దీనిని కరుణ రసములో ఉపయోగిస్తారు.

పాదకర్మ
ఇది ఐదు రకములు. 1.ఉద్ఘట్టితము, 2.సమము, 3.అగర్తల సంచారము, 4.అంచితము, 5.కుంచితము.

పాదపవిద్దకము
(కరణము) రెండు చేతులను కటకాముఖంలో ఉంచి అరచేతులను నాభికి అభిముఖంగా పాదములను వరసగా సూచీవిద్ధ మరియు అపక్రాంతములో ఉంచాలి.

పాదభాగము
ఇవి దృవ, స్వరూప, విరూపకాలు. ఇది తాళమునకు సంబంధించిన అంశము. ప్రతీ విషయములో కాలము 16 మాత్రలను కలిగి ఉంటుంది. దీనిలో ప్రతీ పావు భాగాన్ని పాదభాదము అంటారు. మాత్రల కలయిక వల్ల పాదభాగం ఏర్పడుతుంది. చిత్ర, వార్తిక, దక్షిణ, దృవ మార్గములలో 1, 2, 4, మరియు 8 మాత్రలు కలిసి ఒక పాదభాగము ఏర్పడుతుందని సంగీత రత్నాకరములో చెప్పబడింది.

పాదరేచకము
స్ఖలిత పాదముతో అటు ఇటు కదలడం.

పారిపార్శ్వకుడు
పరిచయ సమయంలో సూత్రధారునికి పక్కనే నిలబడే సహాయకుడే పారిపార్శ్వకుడు.

పార్శ్వకర్మ
ఇది ఐదు రకాలు. అవి, 1.నతము, 2.సమున్నతము, 3.ప్రసరితము, 4.వివర్తము, 5.అపసృతము.

పార్శ్వక్రాంతచారీ
కుంచితములోనున్న ఒక పాదమును పైకెత్తి మోకాలును ఛాతి వరకు తీసుకువచ్చి, చివరకు పాదమును ఉద్ఘట్టితములో భూమిపై ఉంచాలి.

పార్శ్వక్రాంతము
(కరణము) పాదములను పార్శ్వక్రాంతచారీలో ఉంచి దానికి తగ్గట్టుగా చేతులను ముందుకు కదపాలి. దీనిని రౌద్రరసం కలిగిన భీమసేనుడిలాంటి పాత్రలను చేయుటకు ఉపయోగిస్తారు.

పార్శ్వచ్ఛేదము
(అంగహారము) చేతులను ఛాతిపై ఉంచి నికుట్ఠితము చేయాలి. ఆ తర్వాత ఊర్ధ్వజానువు, ఆక్షిప్తము, స్వస్తికము తర్వాత త్రికమును తిప్పి తర్వాత ఉరోమండలము, నితంబము, కరిహస్తము మరియు కఠిఛిన్న కరణములు చేయాలి.

పార్శ్వజానువు
(కరణము) ఒక పాదమును సమస్థితిలో ఉంచి రెండవ పాదమును పైకెత్తి తొడ పక్కకు తీసుకురావాలి. చేతిని ముష్ఠిభంగిమలో ఛాతిపై ఉంచాలి.

పార్శ్వనికుట్టకము
(కరణము) స్వస్తికహస్తమును ఒకవైపుకి తీసుకొని పాదములను పార్శ్వనికుట్టకములో ఉంచాలి. రెండవ పక్క కూడా ఇదే విధముగా చేయాలి.

పార్శ్వమండలము
ఒకవేళ కదలికలు ఊర్ధ్వమండలములో ఉండి ఒక పక్క చేయబడితే దీనిని పార్శ్వమండలము అంటారు.

పార్శ్వస్వస్తికము
(అంగహారము) మొదటగా ఒకవైపు స్వస్తికమును, అర్ధనికుట్టకమును చేయాలి. తర్వాత ఇదే కదలికను రెండవ పక్కకూడా చేయాలి. తొడపైన ఆవుత్త హస్తమును ఉంచి తర్వాత ఊరుద్వృత్తము, ఆక్షిప్తము, నితంబము, కరిహస్తము మరియు కఠిఛిన్న కరణములు చేయాలి.

పావకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అగ్ని, అగ్నిదేవత.

పాశపిండి
యముని యొక్క పాశము (తాడు).

పాషండము
సం. నా. వా. ? శంకుస్థాపన సమయంలో నాస్తికులు, అంగవైకల్యులు, కాషాయ వస్త్రధారులు పరిసరాలలో ఉండరాదు.

పిండి యొక్క ఉద్భవహేతువు
దీనియొక్క ఆది రెండు రకాలుగా చెప్పవచ్చు. 1.యంత్ర(ఆధార, స్థానబిడము), 2.భద్రాసనము(అంగభేదము) ఇంకొకటి శిక్షాయోగముగా చెప్పబడుతుంది. (కరణాంగహారాల అభ్యాసము).

పిండీ
ఆకారము వలన దీనికి ఈ పేరు వచ్చింది. ఇది గుండ్రటి ఆకారములో ఉంటుంది. ఇది ఒక ముద్దను పోలి గుండ్రంగా ఉంటుంది. ఇది చిన్న ఆసారితముల కొరకు ఉపయోగపడుతుంది.

పిండీబంధము
కరణములు మరియు అంగహారముల యొక్క కలయిక. ఇది బృంద నృత్యమునకు సంబంధించినది. ఇద్దరు నృత్యకారులు ఒకే సమయంలో ఒకే రకమైన నృత్యమును కాని, ఒకేలాంటి కదలికలను కాని చేసినట్లయితే పిండీబంధము ఏర్పడుతుంది. దీనియందు ఇద్దరు కన్నా ఎక్కువమంది ప్రదర్శించవచ్చు. ఇవి సంగీత వాయిద్యములు వాయిస్తుండగా తాళము, లయతో ప్రదర్శింపబడతాయి. ఇవి దేవతల యొక్క వివిధ స్వరూపాలలాగ కనబడతాయి. ఇలా ఏర్పడిన వాటికి ఆ దేవతల యొక్క పేర్లు కాని, ఆయుధముల పేర్లు కాని నిర్దేశించబడతాయి.

పిండీవిధులు
వివిధ ఆసారితములలో వినియోగించే పిండిబంధములు 4 రకాలు. 1.పిండి, 2.శృంఖలికము, 3.లతాబంధము, 4.భేద్యకము. ఈ నీలుగు కూడా బృంద నృత్యమునకు సంబంధించినవి.

పితామహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సృష్టికర్త, బ్రహ్మ యొక్క లక్షణము. దేవతలతో పాటు జీవనిర్జీవులను సృష్టించాడు. అంగీరసుడు, భృగువు, దక్షుడు, మరీచుడు మొదలైన ప్రజాప్రతినిధులందరూ బ్రహ్మ యొక్క సంతతిగా చెప్పబడుతున్నారు.

పిశాచములు
సం. నా. వా. అ. న. తత్స. భూతములు, దెయ్యాలు.

పిష్టభక్ష్యము
సం. నా. వా. అ. న. తత్స. మొక్కజొన్న పిండితో చేయబడిన తినుబండారము.

పిహితపుటము
కనురెప్పలను విశ్రాంతిగా ఉంచటం. దీనిని శుక్తమూర్ఛితము, వేడి, పొగ, వాన, కాటుక వల్ల కళ్ళు మండటం మొదలైనపుడు ఉపయోగిస్తారు.

పీతము
అద్భుత రసము కొరకు చెప్పబడిన వర్ణము (పసుపు రంగు).

పీతము
సం. నా. వా. అ. పుం. తత్స. శంకుస్థాపన సమయమున పడమర దిక్కునకు సమర్పించుటకు వండబడిన పసుపు అన్నము.

పుటకర్మ
కనురెప్పలకు సంబంధించి కనుపాపలు చేసే పనులు. అంటే కనుపాపల కదలికలను కనురెప్పలు ఏ విధంగా అనుసరిస్తాయో చెప్పడం. ఇది తొమ్మిది రకాలు. అవి, 1.ఉన్మేషము, 2.నిమేషము, 3.ప్రసృతము, 4.కుంచితము, 5.సమము, 6.వివర్తితము, 7.స్ఫురితము, 8.పిహితము, 9.వితాడితము.

పురుషపదము
పూర్వరంగములో పరివర్తనకు చినరులో సూత్రధారుడు దేవతలకు తల వంచి నమస్కరిస్తూ ముందుకి మూడు అడుగులు వేస్తూ వెళ్తాడు. అందులో ఒకటి పురుషపదము. దీనియందు కుడి పాదము ఎత్తబడుతుంది.

పుళిందము
తూర్పురాజ్యము యొక్క పేరు.

పుష్పపుటము
చిటికెనవ్రేళ్ళు, మణికట్టులు సన్నిహితములగునట్లుగా రెండు పతాక హస్తాలు కలిస్తే అది పుష్పపుటహస్తము అవుతుంది. దీనిని కర్పూరహారతి ఇవ్వటం, అర్ఘ్య ప్రదానము మొదలైన అర్ధముల యందు ఉపయోగిస్తారు.

పుష్పమోక్షణము
సం. నా. వా. అ. న. తత్స. పూలను చల్లుట.

పూర్ణజఠరము
పూర్తిగా ఉబ్బిన కడుపు.

పూర్వరంగము
నాట్యమునకు ముందర వచ్చే ప్రదర్శనను పూర్వరంగం అంటారు. అసలు ప్రదర్శనకు ముందు దీనిని ప్రదర్శిస్తారు. తెరకు వెనకాల జరుగుతుంది. దీనియందు తొమ్మిది అంగములు ఉండును. అవి 1.ప్రత్యాహారము, 2.అవతరణము, 3.ఆరంభము, 4.ఆశ్రవణము, 5.వక్రపాణి, 6.పరిఘట్టనము, 7.సంభోటనము, 8.మార్గసారితము, 9.ఆసారితము. పూర్వరంగము రెండు విధములు. 1.శుద్ధపూరివరంగము, 2.చిత్రపూర్వరంగము.

పృథివి
భూమి.

పృథుల
ఈ గీతమును శుద్ధపూర్వరంగములోని దక్షిణ మార్గంలో ఉపయోగిస్తారు.

పృష్ఠము
ఈ గతిని చేతులు వెనుకకు ఊపడానికి, బాణాలు తీసుకోడానికి ఉపయోగిస్తారు.

పృష్ఠస్వస్తికము
(కరణము) రెండు భుజములను విక్షేప, ఆక్షేపములలో పాదాలను అపక్రాంత, అర్ధసూచీలో ఉంటే దానిని స్వస్తికము అంటారు.

పౌండ్రము
తూర్పురాజ్యము యొక్క పేరు.

ప్రకంపితవక్షము
వణకడము, ఛాతిని పైకి కిందకి కదపడము.

ప్రకృతి
అన్ని రసములకు ప్రధాన మూలము.

ప్రకృతులు
ఇవి 3 రకాలు. 1.ఉత్తమ ప్రకృతి (దేవతలు, రాజులు), 2.మధ్యమ ప్రకృతి (మధ్యములు), 3.నీచ లేక అధమ ప్రకృతి (స్త్రీలు మరియు నీచులు). దేవతా ప్రకృతి కలిగినవారు దివ్యులు, నృపప్రకృతి కలిగిన వారు దివ్యమానుషులు, మిగిలిన ప్రకృతికి చెందినవారు మానుషులుగా చెప్పబడ్డారు.

ప్రగల్భుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వేదిక భయం లేనివాడు.

ప్రతిక్షేపము
ద్వితీయావస్థ మొదలగువానిలో ఉపయోగించే ప్రత్యూపోహనము.

ప్రతిసరము
సం. నా. వా. అ. న. తత్స. ఎర్రని దారపు గాజు.

ప్రత్యాలీఢస్థానము
కుడిపాదమును వంచి, ఎడమ పాదమును ముందుకు చాచటం. అనగా ఆలీఢ స్థానముకు వ్యతిరేకము. దీని ఆస్థాన దేవత రుద్రుడు.

ప్రత్యాహారము
వాద్య సమూహమునకు కేటాయించిన స్థలము. అన్ని వాయిద్యములను ఒక క్రమములో ఏర్పరచడమే ప్రత్యాహారము. ఇదే కుతపవిన్యాసం కూడా. దీని వలన యాతుధానువులు మరియు పన్న్గములు ఆనందింపబడతాయి.

ప్రత్యూహము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తంభము యొక్క కింది భాగము.

ప్రదక్షిణప్రవేశము
కుడి వైపు నుండి వేదిక పైకి ప్రవేశించడం. అవంతి, దక్షిణాత్య ప్రవృత్తులలో ప్రదక్షిణప్రవేశము ఉపయోగింపబడాలి. అనగా ఉత్తర ద్వారము నుండి ప్రవేశించాలి.

ప్రధావనము
సం. నా. వా. ? వేగముగా పరిగెత్తుట.

ప్రధీప్తనము
?

ప్రమాణము
సం. నా. వా. అ. న. తత్స. కొలతలు, పొడవు.

ప్రమాణము
సం. నా. వా. అ. న. తత్స. పర్యంతము, విరివి. భరతుని కుమారులు నాట్యవేదం యొక్క ఆది ఎక్కడ? అది ఎవరికోసం? దాని పర్యంతం ఏమిటి? ప్రమాణము ఏమిటి? రచయిత ఎవరు? అన్న ప్రశ్నలను ప్రశ్నించారు.

ప్రయోగద్వైవిధ్యము
నాట్య అభ్యాస నియమాలతో నాటకము రెండు రకాలుగా చెప్పబడింది. 1.ఆవిద్ధ ప్రయోగము, 2.సుకుమార ప్రయోగము.

ప్రయోగము
సం. నా. వా. అ. పుం. తత్స. సభ యందు ఇచ్చే ప్రదర్శన.

ప్రరోచన
అనగా పొగడటం. ఘనత. సూత్రధారుడు నాటకం ప్రారంభమయ్యే ముందు నాటకము యొక్క ప్రధానాంశము, దాని కారణాలు, వాదనలు మొదలైన వాటిని పరిచయం చేస్తూ ఏదైనా విజయ గాథ ఉంటే వాటి ఘనతను కూడా చాటి చెప్తారు.

ప్రలోకిత దర్శనము
కనుపాపలను రెండిటినీ ప్రక్కలకు తిప్పడము.

ప్రవాలము
సం. నా. వా. అ. న. తత్స. రంగశీర్షము యొక్క ఉత్తర దిక్కున పగడమును ఉంచుతారు.

ప్రవృత్తులు
స్థానికమైన ప్రయోగాలు. వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి వస్త్రధారణకు, భాషలకు, ప్రవర్తనకు, సంప్రదాయాలకు సంబంధించిన వివరణాత్మక విషయాన్ని ఇస్తుంది కాబట్టే దీనికి ఆ పేరు. భారతి, సాత్త్వతి, కైశికి, ఆరభటి మొదలైనవాటిల్లాగా ప్రవృత్తులు కూడా నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి. అవి, 1.అవంతి, 2.దాక్షిణాత్యము, 3.పాంచాలి, 4.ఓఢ్రమాగధి.

ప్రవృత్తులు
నాటక ప్రదర్శనలో నాలుగు రకాల ప్రవృత్తులు కలవు. అవి, 1.ఆవంతికము, 2.దాక్షిణాత్యము, 3.ఓద్రమాగధి, 4.పాంచాలమద్యమము.

ప్రసన్నముఖరాగము
ప్రకాశవంతమైన ముఖము. దీనిని ఆశ్చర్యములో, నవ్వులో, ప్రేమలో ఉపయోగిస్తారు.

ప్రసర్పితకము
(కరణము) ఒకచేతిని రేచితములో ఉంచి రెండవ దానిని లతలో ఉంచి పాదములను ప్రసర్పితములో ఉంచాలి. అనగీ రేచిత హస్తములు ఏ దిశలో అయితే కదులుతున్నాయో అదే దిశలో పాదములు కూడా కదలాలి. ఖేచరసంచరమును నిరూపించడానికి ఉపయోగిస్తారు.

ప్రసారితము
(బహుసంచారము) ముందుకు చాచడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనిని బహుమతులు ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

ప్రసారితశయనము
మోకాళ్ళను చాచి ఒక చేతిని దిండుగా చేసుకొని పడుకోవడము. నిద్రలోని ఆనందాన్ని ఆస్వాదించేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

ప్రసృతపుటము
కనురెప్పలను ఎడమగా తెరవడం. విస్మయములోను, హర్షములోను, వీరములోను దీనిని ఉపయోగిస్తారు.

ప్రస్తావన
నాంది. పూర్వరంగ ప్రదర్శన తర్వాత స్థాపకుడు నాటక కర్త యొక్క పేరు చెప్పి నాందిని ప్రారంభిస్తాడు. నాంది యందు నాటకాంశము చెప్పబడి ఉంటుంది.

ప్రాకృతతారా
కనుపాపలను యథాస్థానంలో ఉంచడం. మిగిలిన రసములలో ఉపయోగిస్తారు.

ప్రాగ్జ్యోతిషము
తూర్పురాజ్యము యొక్క పేరు.

ప్రాయశ్చిత్తము
సం. నా. వా. అ. న. తత్స. పరిహారము, పాపనివృత్తి కోసం చేసే దైవకార్యము.

ప్రియంగవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుంకుమ పువ్వు పొట్టు.

ప్రేంఖొలితము
(కరణము) మొదటగా దోలపాదచారీ చేసి ఆ తర్వాత గెంతి భ్రమరాచారీలోకి వచ్చి త్రికమును గుండ్రంగా తిప్పడం.

ప్రేక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రేక్షకుల ఎదుట ప్రదర్శన ఇవ్వడం.

ప్రేక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నాటక ప్రదర్శన.

ప్రేశ్యులగతి
బానిస బాలికల యొక్క గతి విభ్రాంతములో ఉండాలి. నడిచేటప్పుడు శరీరమును కొద్దిగా పైకెత్తి అవహిత్థస్థానములో ఉంచాలి. ఎడమ చేతిని కింది వైపునకు సూచిస్తూ కుడిచేతిని కటకాముఖములో నాభి వద్ద ఉంచాలి.

ప్లవంగము
తూర్పురాజ్యము యొక్క పేరు.

ఫుల్లగండము
బుగ్గలు వికసించటం. ఆనందములో దీనిని ఉపయోగిస్తారు.

బద్ధాచారీ
కాళ్ళు రెండూ స్వస్తికములో ఉంచి తొడలు రెండు వలినములో ఉండటం.

బలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. నైవేద్యము, కానుక, రంగమును పూజించు సమయములో భక్ష్యము, భోజ్యము మరియు పానీయమును నైవేద్యముగా సమర్పించుట.

బలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. నైవేద్యము, శంకుస్థాపన జరిగే సమయంలో దిక్కులను రక్షించే వివిధ దేవతలకు సమర్పించే కానుకలు.

బలిప్రదానము
సం. నా. వా. అ. న. తత్స. పూజాద్రవ్యములు కానుకగా ఇచ్చుట.

బహిర్గిరము
తూర్పుదేశము యొక్క పేరు.

బహిర్గీతములు
తెర వెనకాల అంతర్యవనికలను డోలు మరియు తీగ వాయిద్యములతో పాటు ప్రదర్శించడాన్ని బహిర్గీతములు అంటారు. దీనియందు తీగవాద్యములు మరియు డోలుతో పాటు దేవతలను పొగుడుతూ ఏడు విధాలుగా పాటలను పాడతారు. దైత్యులు ఈ పాటలను అడ్డుకున్నారు. కాని, సంతుష్టులైన దేవతలు వీటిని ఉంచి నిర్గీతమునకు స్వస్తి పలికారు. నారదుడు దేవతలను ఒప్పించి రాక్షసులను సంతుష్టపరచడానికి నిర్గీతమును ఉంచి, దేవతల కోసం బహిర్గీతమును ఉంచారు. దీనిలో వాద్యసంగీతము మరియు పాటలు రెండూ కూడా ఏడు విధములలో ఉన్నాయి.

బహుసంచారములు
నాట్యము మరియు నృత్యముకు సంబంధించిన వ్యక్తులు పది రకముల చేతి కదలికలు చెప్పారు. అవి, 1.తిర్యక్కు, 2.ఊర్ధ్వగతము, 3.అధోముఖము, 4.ప్రసారితము, 5.అపవిద్ధము, 6.మండలము, 7.స్వస్తికము, 8. అంచితము, 9.ఉద్వేష్టితము, 10.పృష్టగతము.

బాదరము
సం. నా. వా. అ. పుం. తత్స. పట్టు, నూలు వస్త్రము. ఎడమ నుంచి కుడువైపుకు కదులుతున్న నత్తగుల్ల, శంఖము.

బాలగతి
చిన్న పిల్లల యొక్క కదలికలు సాధారణముగా వారి ఇష్టానుసారంగా సౌష్టవము లేకుండా ఒక నిర్ణీత సమయము అవసరము లేకుండా ఉండాలి.

బాలము
సం. నా. వా. అ పుం. తత్స. విశ్వకర్మ చేత చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. 8 రాజలు కలిసి ఒక బాల, 8 బాలలు కలిసి ఒక లిక్ష.

బాహ్యకక్ష్య
వేదికపైన బాహ్యమునకు సంబంధించిన కక్ష్యావిభాగము. తర్వాత ప్రవేశించిన నటులందరూ కూడా బాహ్యకక్ష్య నుంచి వచ్చినట్టు పరిగణింపబడతారు.

బాహ్యాసనవిధి
గృహమునందు సంభాషించేటప్పుడు ఆసనములు ఒకరి కోరిక మేరకు సమకూర్చబడాలి. మహర్షులకు, లింగస్థులకు వారి వారి కోరిక మేరకు ముండాసనమును కాని, వేత్రాసనము (దర్భ) కాని ఉపయోగించుకుంటారు.

బాహ్లిక
ఒక దేశము యొక్క పేరు.

బీభత్సగతి
ఇచీవల జరిగిన యుద్ధము లేదా దహనక్రియ కారణంగా నేల భయంకరంగా, వికారంగా తయారవుతుంది. ఏడక్రీడితాచారీలో ఉన్న పాదాలు ఒకసారి దూరంగాను, మరొకసారి దగ్గరగాను పడతాయి.

బీభత్సదృష్టి
కనువెంట్రుకలు తొలిగినప్పటికీ, చిరాకు భావనలతో కప్పబడి ఉంటాయి. దీనిని బీభత్స రసములో ఉపయోగిస్తారు.

బీభత్సము
?

బీభత్సము
ఇది మూడు రకములు. అవి 1.శుద్ధము, 2.ఉద్వేగి, 3.క్షోభజము.

బుధులు
సం. నా. వా. అ. పుం. తత్స. మంచి మనుషులు. విజ్ఞత కలిగినవారు.

బృహతి
ఒక పాదములో 9 అక్షరములు ఉండే ఛందస్సును బృహతి అంటారు.

బ్రహ్మ
సం. నా. వా. అ. న్. తత్స. పితామహుడు, నాట్యశాస్త్ర సృష్టికర్త, వేదాలలో చెప్పబడిన దేవతల లక్షణములు కలిగినవాడు, కమలము నుండి పుట్టినవాడు, విశ్వమునకు తాత, స్వయంభువు.

బ్రహ్మమండలము
అనగా బ్రహ్మ యొక్క వృత్తము. వేదికా కేంద్రమునకు మరొక పేరు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడని చెప్తారు.

బ్రహ్మసంభవము
ఎనిమిది త్రికములను బ్రహ్మసంభవము అంటారు. అవి, 1.భ గణము, 2.ర గణము, 3.మ గణము, 4.త గణము, 5.జ గణము, 6.య గణము, 7.స గణము, 8.న గణము.

బ్రహ్మోత్తరము
తూర్పుదేశము యొక్క పేరు.

బ్రాహ్మణ స్తంభము
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రాహ్మణ స్తంభం ప్రతిష్ఠించేటప్పుడు ద్రవ్యములు అన్నియు తెలుపు రంగులో ఉండాలి మరియు ఆవాలు, నేతితో శుద్ధి చెయ్యాలి. ఈ స్తంభము యొక్క కింది భాగములో చెవి ఆభరణమును ఉంచి కొంత బంగారమును ఉంచాలి. ప్రతిష్ఠ తర్వాత బ్రాహ్మణులకు పాయసం ఇచ్చి సంతృప్తి పరచాలి. తెలుపు రంగు స్వచ్ఛతకు, పాండిత్యమునకు చిహ్నము. ఇది ఆగ్నేయములో ప్రతిష్ఠింపబడాలి. గోదానం జరగాలి.

బ్రాహ్మణులు
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రాహ్మణులు. శంకుస్థాపన సమయంలో నేతితో కూడిన పాయసము ఇచ్చి బ్రాహ్మణులను సంతుష్టపరచాలి.

భక్ష్యము
సం. నా. వా. అ. న. తత్స. విందు భోజనము, రుచికరమైన వంటకము.

భయానకగతి
భయానకగతి నీచ ప్రకృతికి చెందిన స్త్రీ, పురుషుల విశ్వాసలేమి వలన వారి ప్రకృతికి అనుగుణంగా చేసే గతి. కళ్ళను ఎడమగా తెరచి కదుపుతూ వడివడిగా అడుగులు వేస్తూ, వణుకుతున్న శరీరంతో తడబడుతూ నడవడం.

భయానకము
?

భయానకము
ఈ రసము మూడు రకాలు. అవి 1.కృతకము, 2.అపరరజము, 3.విత్రాసితకము. మరొక రెండు రకముల భయానకములు. 1.స్వభావజభయము. ఇది అవయవాలు, ముఖము, కళ్ళు, తొడల యొక్క కదలికల వలన, చింతతో చుట్టుపక్కల చూడటం వలన కలుగుతుంది. నోరు ఎండిపోవడం, గుండె కొట్టుకోవడం, రోమాలు నిక్కబొడుచుకోవడం మొదలైనవి దీని ద్వారా ప్రదర్శింపబడతాయి. 2.కృతకభయము. ఇది స్వభావజ భయములాంటిదే కాని కొంచెం మృదువైనది.

భయానికదష్టి
కనురెప్పలు రెండు నిశ్చలంగా ఉంచి కనుపాపలు తళుకులీనేటట్లుగా తిప్పడం. దీనిని అత్యంత భయమును అభినయించటానికి భయానకరసములో ఉపయోగిస్తారు.

భరతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నాట్యశాస్త్ర కర్త, గొప్పముని, అనుభవజ్ఞుడు. ఇతడు సాక్షాత్తు బ్రహ్మ, మహేశ్వరుల ద్వారా నాట్యశాస్త్రమును గ్రహించి తన వందమంది శిష్యులకు బోధించాడు. మత్స్యపురాణములో కూడా ఈయన ప్రస్తావన ఉంది.నాట్యశాస్త్ర కర్త విషయములో అనేకరకాల సంశయాలున్నప్పటికీ కాళిదాసులాంటి మహాకవులెందరో భరతుడే నాట్యశాస్త్ర కర్త అని నిర్ధారించారు. ఇక్కడ “భరత” అను పదములో ‘భ’ అను అక్షరమునకు ‘భావము’ అని, ‘ర’ అను అక్షరమునకు ‘రాగము’ అని, ‘త’ అను అక్షరమునకు ‘తాళము’ అని అర్థము వ్యక్తమవుతోంది. నాట్యశాస్త్రములో భరతుని పేరును నటుడి పేరుగా కూడా వినియోగించడమైనది.

భరతుని శతపుత్రులు
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రహ్మనుండి స్వీకరించిన అతీత జ్ఞానాన్ని భరతుడు తన వందమంది పుత్రులకు బోధించాడు. వీరే భరతుని శతపుత్రులు. పంచమ వేద నిర్మాణం తర్వాత ఇంద్రుడు ఈ నాట్యశాస్త్రాన్ని ఎవరైతే దానిలోని గుణాలను అభ్యాసం ద్వారా గ్రహించగలుగుతారో అటువంటి మునికి బోధించమని బ్రహ్మదేవుని కోరాడు. భరతుడు ఈ శాస్త్రాన్ని తన 100 మంది పుత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రను నిర్దేశించి వారికి దానియందు శిక్షణనిచ్చాడు. అనగా పాత్రచిత్రణ, పదము ఉపయోగించే విధానము మరియు కదలికలు మొదలైనవి. భరతుని 100 మంది పుత్రుల పేర్లు వరుసగా---------- 1.శాండిల్యుడు, 2.వాత్స్యుడు, 3.కోహలుడు, 4.దత్తిలుడు, 5.జఠిలుడు, 6.అంబష్టకుడు, 7.తండుడు, 8.అగ్నిశిఖుడు, 9.సాంధవుడు, 10.పులోముడు, 11.శాద్వలి, 12.విపులుడు, 13.కపిఞ్జలుడు, 14.బాదిరుడు, 15.యముడు, 16.ధూమరాయణుడు, 17.జంబూధ్వజుడు, 18.కాకజంఘుడు, 19.స్వర్ణకుడు, 20.తాపసుడు, 21.కైదారుడు, 22.శాలికర్ణుడు, 23.దీర్ఘగాత్రుడు, 24.శాలికుడు, 25.కౌత్సుడు, 26.తాండయానుడు, 27.పింగళుడు, 28.చిత్రకుడు, 29.బంధులుడు, 30.భల్లకుడు, 31.ముష్ఠికుడు, 32.సైంధవాయనుడు, 33.తైతిలుడు, 34.భార్గవుడు, 35.శూచి, 36.బహులుడు, 37.అభుదుడు, 38.బుధసేనుడు, 39.పాండుకర్ణుడు, 40.కేరలుడు, 41.ఋజుకుడు, 42.మంఢకుడు, 43.సంభరుడు, 44.వాఞ్జులుడు, 45.మాగధుడు, 46.సరలుడు, 47.కర్తా, 48.ఉగ్రుడు, 49.తుషారుడు, 50.పార్షదుడు, 51.గౌతముడు, 52.బాదరాయణుడు, 53.విశాలుడు, 54.శాబలుడు, 55.సునాభుడు, 56.మేషుడు, 57.కాళియుడు, 58.భ్రమరుడు, 59.పీతముఖుడు, 60.ముని, 61.నఖకుత్తుడు, 62.అశ్మకుత్తుడు, 63.షట్పదుడు, 64.ఉత్తముడు, 65.పాదుకుడు, 66.ఉపానతుడు, 67.శృతి, 68.చాషవరుడు, 69.అగ్నికుందుడు, 70.ఆజ్యకుందుడు, 71.వితంద్యుడు, 72.తాంద్యుడు, 73.కర్తరాక్షుడు, 74.హిరణ్యాక్షుడు, 75.కుశలుడు, 76.దుఃసహుడు, 77.లాజుడు, 78.భయానకుడు, 79.బీభత్సుడు, 80.విచక్షణుడు, 81.పుంద్రాక్షుడు, 82.పుంద్రనాశుడు, 83.అసితుడు, 84.విద్యుజ్జిహ్వుడు, 85.మాహజిహ్వుడు, 86.శాలణకాయనుడు, 87.శ్యామాయనుడు, 88.మాఠరుడు, 89.లోహితాంగుడు, 90.సమవర్తకుడు, 91.పంచశిఖుడు, 92.త్రిశిఖుడు, 93.శిఖుడు, 94.శంఖవర్ణముఖుడు, 95.శాండుడు, 96.శాక్రణినుడు, 97.గభస్తి, 98.అంశుమాలి, 99.శఠుడు, 100.విద్యుత్తు, 101.శాతజంఘుడు, 102.రౌద్రుడు, 103.వీరుడు.

భాండము
సం. నా. వా. అ. పుం. తత్స. ఏదైనా పాత్ర లేక కుండ.

భారతన్యాయము
నటుడు ఎడమ చేతిలో కవచమును, కుడిచేతిలో ఆయుధములను ఉంచుకొని చేతులను బాగా చాచి వాటిని వెనుకకు తీసుకోవడం, తర్వాత కవచములను పక్కలకు తిప్పడం. శిరపరిగామము చేయాలి. ఆ తర్వాత ఆయుధమును బుగ్గకు, భుజమునకు మధ్య తిప్పాలి. మరల ఇంకోసారి శిరపరిగామము చేయబడాలి.

భారతము
సప్త వర్షములలో ఒకటి.

భారతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వాక్కులో నైపుణ్యం కలిగి ఉండటమే భారతీ వృత్తి. భరతుడు తన వందమంది శిష్యులకు ఈ వృత్తిని నేర్పించెను.

భార్గవము
తూర్పుదేశము యొక్క పేరు.

భావము
భౌతిక దశలు. (అ).స్థాయీభావాలు. ఇవి మొత్తం ఎనిమిది 1.రతి, 2.హాసము, 3.శోకము, 4.క్రోధము, 5.ఉత్సాహము, 6.భయము, 7.జుగుప్స, 8.విస్మయము. (ఆ).సంచారీభావాలు. ఇవి మొత్తం 33. 1.నిర్వేదము, 2.గ్లాని, 3.శంక, 4.అసూయ, 5.మదము, 6.శ్రామము, 7.ఆలస్యము, 8.దైన్యము, 9.చింత, 10.మోహము, 11.స్మృతి, 12.ధృతి, 13.వ్రీడము, 14.చపలతము, 15.హర్షము, 16.ఆవేగము, 17.జడతము, 18.గర్వము, 19.విషాదము, 20.ఔత్సుక్యము, 21.నిద్ర, 22.అపస్మారము, 23.సుప్తము, 24.విబోధము, 25.అమర్షము, 26.అవహిత్థము, 27.ఉగ్రతము, 28.మతి, 29.వ్యాధి, 30.ఉన్మాదము, 31.మరణము, 32.త్రాసము, 33.వితర్కము. (ఇ).సాత్వికభావములు. ఇవి మొత్తం ఎనిమిది. 1.స్తంభము, 2.స్వేదము, 3.రోమాంచము, 4.స్వరభంగము, 5.వెపథువు, 6.వైవర్ణ్యము, 7.అశ్రువు, 8.ప్రళయము. వీటన్నిటినీ కలుపుకొని భావములు 49. సామాన్య గుణములు వీటితో కలిసినప్పుడు రసములు ఉత్పత్తి అవుతాయి.

భావములు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రేక్షకుల హృదయాలను హత్తుకొనేటట్లు చేసే సంఘటన లేదా అభినయమునకు కారణములు ఆ భావములు.

భాష్యము
సూత్రముతో పాటు ఉండే వ్యాఖ్యానము. సంగ్రహములో ఇది వస్తుంది.

భిత్తికర్మ
సం. నా. వా. ? గోడలు మరియు స్తంభాల నిర్మాణమును భిత్తికర్మ అంటారు.

భిత్తిలేపనము
సం. నా. వా. అ. న. తత్స. గోడలను అలుకుట.

భుగ్న, వ్యాభుగ్నాస్యము
నోటిని కొద్దిగా బయటకి తెరవడం. సిగ్గుతో ఉన్నపుడు, అసహనంతో, ఆందోళనగా ఉన్నపుడు దీనిని ఉపయోగిస్తారు. ఇది సన్యాసుల యొక్క సహజ లక్షణము.

భుజంగత్రాసితము
ఈ కరణంలో కుడి పాదాన్ని మోకాలు వరకు కొంచెం వెనకగా వంచి ఎడమ పాదాన్ని ఆన్చి ఉంచి ఒక చేయి ఛాతి మీద, కటకముఖ ముద్రతో రెండవ చేయి డోల ముద్రలో ఉంచాలి.

భుజంగాంచితము
(కరణం) ఇది పాదం కుడిపక్క రేచిత, ఎడమ పక్క లతతో కొనసాగుతుంది.

భుజంగాత్రస్తరేచితము
ఈ కరణములో రెండు చేతులు రేచిత ముద్రతో ఎడమ వైపు ప్రదర్శింపబడతాయి.

భుజాంగత్రాసితచారీ
ఒక కుంచిత పాదము ఎత్తబడి తొడ, నడుము, మోకాలు చుట్టూ తిప్పబడాలి.

భురిక్కు
ఒక పాదము ఋక్కులో ఉండి, ఒక అక్షరము ఎక్కువగా ఉండి, మిగిలిన పాదాలు సమముగా ఉంటే దానిని భురిక్కు అంటారు.

భూకర్మములు
కనురెప్పలకు, కనుపాపలకు సంబంధించి కనుబొమ్మలు చేసే పని. ఇవి మొత్తం ఏడు. అవి, 1.ఉత్క్షేపము, 2.పాతనము, 3.భ్రుకుటి, 4.చతురము, 5.కుంచితము, 6.రేచితము, 7.సహజము.

భూతములు
సం. నా. వా. అ. న. తత్స. ధారణి యొక్క రక్షణ కోసం నియమింపబడినవి.

భూమి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నాట్యమండప నిర్మాణం కోసం అర్థపతి సరైన భూమిని ఎన్నుకొని తర్వాత ప్రమాణాలను తీసుకోవాలి. నాట్యరంగము కోసం ఎన్నుకొనే భూమి సమముగా, స్థిరముగా, కఠినముగా ఉండాలి.

భృంగారము
సం. నా. వా. అ. పుం. తత్స. కుండ లేదా పాత్ర. భరతుడు మరియు అతని బృందానికి దేవతలు బహుమతులు ఇచ్చారు. దీనిని చూసి ఉత్సాహభరితుడైన వరుణుడు ఒక బంగారు పాత్రను భరతునికి బహుకరించాడు. దీనిని “పూర్వరంగవిధి”లో పారిపార్శ్వకులు ఉపయోగించారు.

భృకుటి భ్రూ
అల్లడము. కనుబొమ్మలు వాటి స్థానం నుంచి పైకి లేవడం. కోపములోను, మిరమిట్లుగొల్పే కాంతులను చూసే సమయంలోను దీనిని ఉపయోగిస్తారు.

భేదము
సం. నా. వా. ? వ్యత్యాసమును కలిగించుట. విఘ్నములను పోగొట్టుటకు బ్రహ్మ 4 ఉపాయములను సృష్టించాడు. అవి వరుసగా సామ, దాన, భేద, దండోపాయాలు. వాటిలో భేదము మూడవది. సామము, దానము పనిచేయని సందర్భంలో శత్రువుల మధ్య వ్యత్యాసమును సృష్టించి విజయమును పొందవచ్చు.

భేద్యము
భేద్యం మరియు భేద్యకం రెండు కూడా నృత్తము ద్వారా విడదీయబడతాయి. నర్తనములో ఇవి భాగములు.ఇది చాలా పొడవైన ఆసరితము. (ఇది ఒకరుగా లేదా బృందాలుగా కూడా చేయవచ్చు.)

భేద్యము
సం. నా. వా. అ. న. తత్స. ముష్టియుద్ధము (చేతులతో కొట్టుకొనుట).

భోజ్యము
సం. నా. వా. అ. న. తత్స. కఠినమైన తినుబండారము.

భౌమీచారీ
పాదములు రెండు పూర్తిగా భూమిపై ఉండాలి. నియుద్ధములోను, కరణములలోను దీనిని ప్రదర్శిస్తారు. ఇవి 16 రకాలు. Chapter10.1 . భౌమీచారీలు ఎక్కువగా పాదకర్మములుగా చెప్పబడి ఛందోబద్ధమైన కదలికలలో ఉపయోగిస్తారు.

భ్రమణతార
కనుపాపలను గుండ్రంగా తిప్పడం. వీర, రౌద్ర రసములలో ఉపయోగిస్తారు. వీరోచితకోపం ప్రదర్శించేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

భ్రమరకము
ఈ కరణములో ఒక పాదం సాత్విక మరియు ఇంకొకటి ఆక్షిప్త గతిలో ప్రదర్శిస్తూ చేతులు రెండూ ఊద్వసిస్త మరియు త్రికములలో ఉంచి తిరుగుతూ చేయాలి.

భ్రమరము
(అసంయుతహస్తము) నడిమివ్రేలు, బొటనవ్రేలు కలిసినవి, చూపుడువేలు వంగినది. తక్కిన రెండు వేళ్ళు ప్రసారితములు అయితే అది భ్రమర హస్తము అవుతుంది. తుమ్మెద, చిలుక, యోగాభ్యాసం నిరూపించడానికి ఇది తగుదునని చెప్పబడింది. ?

భ్రమరము
నూపుర కరణము ప్రదర్శన తర్వాత ఆక్షిప్త, కఠిఛిన్న, సూచివిద్ద, ఉరోమండల మరియు కఠిఛిన్న కరణములు అభినయించాలి.

భ్రమరీచారీ
అధక్రాంత చారీగా ఉన్న పాదము విసరబడి నడుముతో పాటు మొత్తం శరీరం తిప్పబడాలి మరియు మరొక పాదము అరికాలి మీద కదపబడాలి.

భ్రమార్జనము
విల్లును వంచడం.

మండకము
నాలుగు కరణములను కలిపి మండకము అంటారు.

మండపము
ప్రదర్శన ఇచ్చే నాట్య మండపము.

మండలము
(బహుసంచారము) ఇది రెండు పక్కలకు కదులును.

మండలము
3 లేదా 4 ఖండములు కలిసి ఒక మండలము ఏర్పడుతుంది.

మండలస్థానము
రెండు పాదములను భూమిపై నుంచి 4 తాళాల దూరములో బయటివైపుకు సూచించడం. నడుము, మోకాళ్ళు సమస్థితిలో ఉండి తొడలు నిశ్చలముగా భూమికి పైభాగంలో ఉండాలి.

మండలస్వస్తికము
(కరణము) శరీరమును మండల స్థానములో ఉంచి, చేతులను స్వస్తికలో ఉంచి, అరచేతులు లోపలకి ఉండేలా చేతులను పైకెత్తాలి.

మందనాసిక
మందము అనగా ఆలస్యము లేదా సౌమ్యము. అవయవాలు విశ్రాంతి దశలో ఉండటం. నిర్వేదము, ఔత్సుక్యము, చింత, శోకములలో దీనిని ఉపయోగిస్తారు.

మకరహస్తము
ఎప్పుడైతే రెండు పతాక హస్తాలు ఒక దాని మీద ఒకటి ఉంచి రెండు బొటనవేళ్ళను ప్రక్కలకు ఉంచుతూ కిందికి చూపడం.

మకుటము
సం. నా. వా. అ. పుం. తత్స. ధ్వజమహోత్సవ సమయంలో భరతునికి మరియు అతని కుమారులకు కుబేరుడు ఇచ్చిన కిరీటము.

మతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. బుద్ధి, ప్రజ్ఞ, జ్ఞానము.

మత్తల్లి
(కరణము) ఒక పాదమును చుట్టి తిప్పుతూ, రెండవ పాదమును నెమ్మదిగా ముందరికి చాచలి. చేతులను ఉద్వేష్ఠితము, అపవిద్ధములో మరల మరలా ఉంచాలి. మత్త ఈ కరణముపై ఎక్కువ అభిరుచిని కలిగి ఉన్న కారణంగా దీనిని మత్తల్లి అంటారు.

మత్తల్లిచారీ
రెండు పాదములతోను, వృత్తాకార కదలికలో వెనుకకు కదలడం. చేతులు ఉద్వేష్ఠితములో కదపబడి బైటకు విసరడం.

మత్తవారణి
ఇలాంటివి సభావేదికకు రెండు ఉండాలి. ఏనుగు ఆకారం కలిగి ఉండాలి. సభావేదికకు ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉండాలి. నాట్యమండపము యొక్క నాలుగు మూలలు ఒకలాగనే ఉండాలి.

మత్తస్ఖలితము
(కరణము) ముందు మత్తల్లి కరణము చేయాలి. కుడిచేతిని వంచి కుడి దవడకు దగ్గరగా తీసుకురావాలి. ఆ తర్వాత అపవిద్ధ, సంఘట్టిత, కరిహస్త మరియు కఠిఛిన్న కరణములను చేయాలి.

మత్తాక్రీడము
త్రికమును నూపుర కరణముతో తిప్పి తర్వాత భుజడంగత్రాసిత కరణము చేయాలి. కుడి పక్క వైశాఖరేచిత ప్రదర్శన తర్వాత ఆక్షిప్తక, ఛిన్న, భ్రమరక (ఎడమవైపు), వ్యంసిత, ఉరోమండల, నితంబము, కరిహస్తము చివరన కఠిఛిన్న్ కరణములను చేయాలి.

మత్తులగతి
మత్తెక్కిన వ్యక్తుల యొక్క కదలిక. మత్తు తరుణంలో కాని, మద్యంలో కాని ఉంటే ఆ వ్యక్తి యొక్క అడుగులు అప్పుడప్పుడూ తూలుతూ ఉంటాయి. ఒక వేళ మత్తు ఎక్కువగా ఉన్నట్లైతే వారి నడక అస్థిరమైన పాదాలతో, తడబడిన అడుగులతో, శరీరం దేనికో ఒక దానికి ఆనుకున్నదై ఉంటుంది.

మత్స్యపృష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. రంగశీర్షము నిర్మించే సమయంలో పునాది విషయములో జాగ్రత్త తీసుకోవాలి. ఆ పునాది చేప యొక్క వీపు భాగము వలె ఉండరాదు.

మదవిలసితము
(అంగహారము) చేతులు డోలావస్థలో ఉండి పాదములను స్వస్తికము నుండి తొలగించి మరల చేతులను అంచితము మరియు వదితములోనికి తీసుకురావాలి. ఆ తర్వాత తలసంఘట్టితము, నికుట్టకము చేయాలి. ఊరుద్వృత్తము, కరిహస్తము మరియు కఠిఛిన్న కరణములను ప్రదర్శించాలి.

మదస్ఖలితము
(కరణము) రెండు చేతులను లతాహస్త భంగిమలో ఉంచి పరివీహిత సూచిని ప్రదర్శించి అవిద్ధచారీని జరపడం. మత్స్యమదమును నిరూపింతచడానికి దీనిని ఉపయోగిస్తారు.

మదిరదృష్టి
కళ్ళ మధ్యభాగము తిరుగుతూ, ఒక కన్ను సన్నగా వంచబడి రెండు కళ్ళనూ వంచి, కనుల చివరలను పూర్తిగా తెరవాలి. తరుణ మదమునందు ఉపయోగిస్తారు. కనురెప్పలు, వెంట్రుకలు కొద్దిగా వంచబడి కనుపాపలలో కొంచెం కదలిక ఉంటే మధ్యదృష్టి అంటారు. మధ్యమదమునందు దీనిని ఉపయోగిస్తారు. కనుపాపలను అత్యధికముగా కాని, అతి తక్కువగా కాని రెప్పవేయటాన్ని మదిర దృష్టి అంటారు.అధమ మదములో దీనిని ఉపయోగిస్తారు.

మద్రకము
రాజ్యము యొక్క పేరు.

మద్రకాదిగీతములు
మద్రకము అనునది ఒక రకమైన గీతము. దీనితో పాటు మరొక ఏడు గీతములు పాట పాడే విధానములు కలవు. పటలలో ఇదొక విధానము.

మధుపర్కము
సం. నా. వా. అ. న. తత్స. వేదకాలములో తగిన వ్యక్తికి ఇది ఇయ్యతగినది. ఇది పెరుగు, తేనె, నెయ్యి, నీరు, బెల్లముల కలయికతో తయారవుతుంది. దీనిని వివాహాది సమయములలో రాజులకు ఇస్తారు.

మధ్యమకక్ష్య
వేదికపైన మధ్యమమునకు సంబంధించిన కక్ష్యావిభాగము.

మధ్యమనాట్యమండపము
సం. నా. వా. అ. న. తత్స. జ్యేష్ఠమండపం తర్వాత మధ్యమనాట్య మండపము. ఇది రాజుల కొరకు నిర్మింపబడినది. అభినవగుప్తుని లెక్క ప్రకారం మొత్తం మూడు నాట్య మండపాలు మధ్యమంగానే ఉంటాయి. అవి మధ్యమవికృష్ఠము, మధ్యమ చతురస్రము, మధ్యమ త్ర్యాస్రము.

మధ్యమలయ
మధ్యమగతి. మూడు గతులలో ఒకటి. ఇది వేగముగా, నెమ్మదిగా ఉండకుండా మధ్యస్థముగా ఉంటుంది.

మధ్యములు
మధ్యమ ప్రకృతికి చెందినవారు.

మయూరలలితము
(కరణము) వృశ్చికరణము చేయుటకు చేతులను రేచితలో ఉంచి, త్రికమును భ్రమరీచారీతో తిప్పాలి.

మరణము
సం. నా. వా. అ. న. తత్స. చావు, ఒకవేళ సూత్రము రెండుగా బద్ధలైతే ఏ కారణము చేతనైనా నిర్మాతకు మరణం తప్పనిసరి.

మరుతము
సం. నా. వా. అ. పుం. తత్స. వాయుదేవుడు.

మర్త్యలోకము
సం. నా. వా. అ న. తత్స. మనుష్య ప్రపంచము.

మలదము
తూర్పురాజ్యము యొక్క పేరు.

మలయము
దక్షిణాపథములోని రాజ్యము యొక్క పేరు.

మలినదృష్టి
కనురెప్పలు, కనుపాపలు భయంతో, ఆందోళనతో సగం మూయబడి కనురెప్పలను కొద్దిగా కదిలిస్తూ దీనమైన చూపులతో చూడటం మలినదృష్టి. నిర్వేదములోను, వైవర్ణ్యములోను దీనిని ఉపయోగిస్తారు.

మల్లవర్తకము
తూర్పురాజ్యము యొక్క పేరు.

మహాగీతము
దృవగీతములను మహాగీతములు అంటారు.

మహాగ్రామణ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రామదేవతలకు అధిపతి. అభినవగుప్తుని ప్రకారము గణపతే గ్రామదేవతలకు అధిపతి. కాని, విమర్శకుల ప్రకారం నాట్యశాస్త్ర సమయంలో గణపతి పూజ లేదు. అందువల్ల గణపతి పూజను దక్షయక్ష విమర్ధిని అని పేరు పెట్టారు.

మహాచారీ
రౌద్రాభినయము. ఈ కదలికలు ఉగ్రమైన భావనలను కలిగి ఉంటాయి. శివునికి సంబంధించినవి. త్రిపురమర్ధనలాంటి ఉగ్రభావనలను వివిధ రకాల మండలములతోను, అంగహారాలతోను ప్రదర్శించాలి.

మహామేరువు
ఏడు పర్వతాలలో ఒకటి. విజ్ఞానవేత్తలుగా చెప్పబడునట్టి 33 దేవ గణాలు దీనియందు నివసిస్తారు.

మహాయోగి
సం. నా. వా. న్. పుం. తత్స. గొప్పయోగి.

మహేంద్రము
దక్షిణాపథములో రాజ్యము యొక్క పేరు.

మాగధము
తూర్పు రాజ్యము యొక్క పేరు.

మాగధము
ఓద్రమాగధమునకు మరొక పేరు ఆంధ్రమాగధము. నాలుగు ప్రాంతములలో ఒకటి.

మాగధి
చిత్రపూర్వరంగములో అర్ధమాగధితో పాటు ఈ గీతమును ఉపయోగిస్తారు. ఇది చిత్రమార్గములో ఉండాలి.

మాతృక
స్థానములు, చారీలు, నృత్తహస్తములు. ఇవన్నీ మాతృకలు.

మారుతము
సం. నా. వా. అ. న. తత్స. మొత్తం 49 రకాల గాలులు నాట్యమండప నాలుగు దిక్కులను రక్షించును.

మార్గవము
తూర్పురాజ్యము యొక్క పేరు.

మార్గాసారితము
తంత్రీభాండ సమాయోగము. అంటే తీగవాద్యములను, డోలును వాయించడం. ఒకదానికొకటి అనుగుణంగా లయను ఉంచడం. దీని ద్వారా యక్షులు సంతృప్తి చెందుతారు.

మాళవము
ఒక రాజ్యము యొక్క పేరు.

ముకుళదృష్టి
సంతోషము వలన కనురెప్పలను కొద్దిగా కదిల్చి, కనుబొమ్మలను ముకుళములో ఉంచి కనుపాపలను బాగా ఎడమగా తెరిచి ఉంచడం. నిద్ర, స్వప్నము, సుఖమునందు దీనిని ఉపయోగిస్తారు.

ముకుళము
ఐదు అంగుళములను చివరలంచు కలిపి ప్రదర్శించితే అది ముకుళము అవుతుంది. కలువపూవు, భోజనము, మన్మథుడు మొదలాన అర్ధముల యందు ఈ హస్తము తగినది.

ముఖరాగములు
ముఖరాగములు అనగా ముఖము యొక్క వర్ణనలు. పరిస్థితులను బట్టి ఇవి నాలుగు రకాలు. అవి, 1.స్వాభావికము, 2.ప్రసన్నము, 3.రక్తము, 4.శ్యామము. భావములను, రసములను తెలియజేయడానికి ముఖవర్ణాలను ఉపయోగిస్తారు. నటన అనేది శాఖ, అంగము, ఉపాంగము మరియు సరైన ముఖవర్ణముతో చేయబడాలి. లేదంటే ఆ నటనయందు కళ ఉండదు.

ముఖాసారితము
ఆసారితము నాలుగు విధములు. అందులో ముఖ ఒకటి. మిగిలినవి ప్రతిముఖము, శరీరము, సంహరణము.

ముష్ఠికస్వస్తికము
(నృత్తహస్తము) ఎప్పుడైతే రెండు కటకముఖహస్తాలు వంచబడతాయో ఛాతి దగ్గరకు తిరిగి కదులుతాయో అదే ముష్ఠికస్వస్తికము. ?

ముష్ఠిహస్తము
నాలుగు వ్రేళ్ళను దగ్గరకు చేర్చి అరచేతిలోనికి వంచి, వాటిపై బొటనవేలు ఉంచితే అది ముష్ఠిహస్తము అవుతుంది. స్థిరత్వము, ధృడత్వము, మల్లయుద్ధము మొదలైనవాటిని అభినయించటంలో ఉపయోగపడుతుంది.

ముహూర్తము
సం. నా. వా. అ. పుం. తత్స. అభివృద్ధి జరగడానికి చేసే ఏ కార్యక్రమమునకైనా ఇది తప్పనిసరి. శుభసమయము, భాగ్యము, శ్రేయస్సు, సంపద.

మృగశీర్షకము
సర్పశీర్షహస్తమందలి చిటికెన వేలిని, బొటనవేలిని చాచితే మృగశీర్షకము అవుతుంది. దీనిని చెక్కిలి, ఆహ్వానము, ప్రియులను పిలవడము వంటి అర్ధాలను చూపించటంలో ఈ హస్తము ప్రయుక్తమవుతుంది.

మృత్తిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నల్లరంగు మట్టితో రంగశీర్షమును నింపాలి. ఇక్కడ ప్రదేశము చాలా శుభ్రంగా ఉండాలి. రాళ్ళు, గడ్డి, ఇసుక వగైరాలు ఉండకూడదు.

మృత్తికావతి
ఒక రాజ్యము యొక్క పేరు.

మృత్యువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. యముడు. మృత్యువు మరియు యముడు, నియతి నాట్యమండప ద్వారపాలకులుగా నియమింపబడ్డారు.

మృదంగము
సం. నా. వా. ? ఒక విధమైన చర్మ వాయిద్యము.

మేఖలకము
దక్షిణాపథములోని రాజ్యము యొక్క పేరు.

మేధ
సం. నా. వా. ఆ స్త్రీ. తత్స. జ్ఞాపకశక్తి, తెలివితేటలు.

మోక్షణము
బాణమును వదలటం.

మౌంజము
సం. నా. వా. అ. న. తత్స. కొలతలు కొలవడానికి ఉపయోగించే తాడు. దీనిని నూలుతో కాని, గడ్డితో కాని తయారుచేస్తారు.

మ్లేచ్ఛులగతి
మ్లేచ్ఛ జాతికి చెందిన కదలిక. వీరి నడక వారు జన్మించిన స్థలమును బట్టి ఉంటుంది.

యంత్రజాల గవాక్షకము
సం. నా. వా. అ. న. తత్స. ఆవు కన్ను పరిమాణములో ఉండేది.

యక్షపిండి
కుబేరునికి సంబంధించినది.

యక్షిణ్యులు
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. యక్షజాతి స్త్రీలు.

యక్షులు
సం. నా. వా. అ. పుం. తత్స. దైవచింతన కలిగిన రాక్షసులు. విష్ణువు మరియు కుబేరుని యొక్క సేవకులు. సాధారణముగా వీరు ధర్మ గుణములు కలిగినవారు అని చెప్పబడినా కొన్ని సందర్భాలలో పిశాచములు మరియు ఇతర క్రూరమైన మృగములుగా పరిగణించబడ్డారు.

యజుర్వేదము
సం. నా. వా. అ. పుం. తత్స. నాలుగు వేదములలో ఒకటి. బ్రహ్మ నాట్యశాస్త్ర నిర్మాణంలో కదలికలను, అలంకరణలను ఈ వేదమునుంచే సంగ్రహించాడు.

యతి
విరామము.

యమదండము
సం. నా. వా. అ. పుం. తత్స. యముని యొక్క ఆయుధము. నాట్య మండపము యొక్క దేహలిని (గడప) రక్షించడానికి దీనిని ఉపయోగించారు.

యవనము
దక్షిణ సముద్రానికి, వింధ్య పర్వతానికి మధ్యగల రాజ్యము.

యవనిక
సం. నా. వా. ఆ స్త్రీ. తత్స. జవనికా, యవనిక అనునవి పర్యాయపదాలు.

యవము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆవాలు. విశ్వకర్మచేత చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. ఎనిమిది యూకలు కలిపి ఒక యవము, ఎనిమిది యవలు కలిపి ఒక అంగుళము.

యుక్తి
నిర్ణయము.

యుద్ధము
కరణములను సాధారణంగా యుద్ధములోను, నృత్యములోను, నడకలోను ఉపయోగిస్తారు.

యుద్ధవీరము
శత్రువులతో పోరు కలిగినపుడు ఉత్పత్తి అయ్యే వీరరసాన్ని యుద్ధవీరము అంటారు.

యూకము
సం. నా. వా. ? విశ్వకర్మచే చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. ఎనిమిది లిక్షలు కలిపి ఒక యూకము, ఎనిమిది యూకలు కలిపి ఒక యవము.

యోగము
సం. నా. వా. అ పుం. తత్స. మెదడును, జ్ఞానాన్ని, అహంకారమును క్రమములో పెట్టునది. పతంజలి యొక్క గ్రంథాలలో యోగా గురించి చెప్పబడింది. ఇది శరీరము, మెదడు యొక్క చిత్త ఏకాగ్రతకు సంబంధించినది. బ్రహ్మదేవుడు నాలుగు వేదాలని స్మరించుకొని ఐదవ వేదాన్ని సృష్టించడానికి యోగంలోకి వెళ్ళాడు.

రంగద్వారము
దీనివద్దనే పద మరియు సైగల ప్రదర్శన మొదలౌతుంది. అందువలనే దీనికి రంగద్వారమని పేరు. దీని ద్వారా విష్ణువు ఆనందింపబడతాడు.

రంగపీఠపరిక్రమద్వైవిధ్యము
ప్రవృత్తులకు అనుగుణంగా రెండు రకముల ప్రవేశములు కలవు. అవి, 1.ప్రదక్షిణ ప్రవేశము, 2.అప్రదక్షిణ ప్రవేశము. సమావేశము, ప్రదేశము మరియు సందర్భమునుబట్టి వీటిని రెండూ కలిపి కూడా ఉపయోగించవచ్చు.

రంగపీఠము
సం. నా. వా. అ. న. తత్స. సభావేదిక, అసలైన ప్రదర్శన జరుగు స్థలము.

రంగపీఠము
సం. నా. వా. అ. న. తత్స. సభావేదిక, నటులు ప్రదర్శన ఇచ్చే చోటు. రంగపీఠ రక్షణకు సాక్షాత్తు ఇంద్రుడే అండదండలుగా నిలబడి నాట్యమండపాన్ని రక్షించాడు. వేదికా కేంద్రమును బ్రహ్మ రక్షించెను.

రంగము
వేదిక. ఇది మూడు రకాలు. 1.వికృష్టము, 2.చతురస్రము, 3.త్ర్యాస్రము.

రంగము
సం. నా. వా. అ. న. తత్స. వేదిక, రంగస్థలము, సభావేదిక.

రంగశీర్షము
సం. నా. వా. అ. న. తత్స. సభావేదిక.

రంగసిద్ధి
అర్ధపతి పూర్వరంగములోని నియమనిబంధనలకు అనుగుణంగా ప్రదర్శన ఇస్తే అతడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. ఒకవేళ అతడే నియమనిబంధనలను అతిక్రమించి తాను అనుకున్నట్టుగా ప్రదర్శన ఇస్తే అతనికి భారీ నష్టము సంభవించి అతని మరణము తర్వాత తక్కువ జాతికి చెందిన జంతువుగా మళ్ళీ జన్మిస్తాడు.

రక్తగంధము
సం. నా. వా. అ. న. తత్స. ఎర్రచందనము.

రక్తము
రౌద్రరసమునకు చెప్పబడిన వర్ణము (ఎరుపు).

రక్తము
సం. నా. వా. అ. పుం. తత్స. శంకుస్థాపన రోజున ఉత్తర దిక్కునకు సమర్పించుటకు వండబడిన ఎర్రని అన్నము.

రక్తముఖరాగము
ఎర్రబడ్డ ముఖము. వీర, రౌద్ర, మద, కరుణ రసాలలో ఉపయోగిస్తారు.

రక్షసా
సం. నా. వా. ?

రక్షావిభాగము
పరిధుల యొక్క విభాగము. ఇది 3 నాట్య మండపముల యొక్క విజ్ఞానమును సంపాదించిన తర్వాతే చేయబడుతుంది. ఒకరి పరిధి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వారు ఆ పరిధి యొక్క మార్పును చూపించాలి. అనగా పరిధి విభాగము వేదిక పైకి వెళ్తున్నప్పుడు చూపించాలి. పరిధి విబాగ సంకేతం ద్వారా ఒకరు సన్నివేశం ఏ ప్రాంతంలో ప్రారంభమైనదో తెలుసుకోగలుగుతారు. న్వాసస్థలము, నగరము, తోట, భూమి, సముద్రము, ఆశ్రమము, ముల్లోకములలోని ఏదైనా ప్రదేశము, సప్తవర్షాలు, నవద్వీపాలు, పర్వతాలు, రసతాలాలు మొదలైన అన్ని కూడా రక్షావిభాగములు.

రజతము
సం. నా. వా. అ. న. తత్స. వెండి, వైశ్య స్తంభమునకు కింద వెండి మరియు బంగారమును ఉంచుతారు.

రజనీకరుడు
సం. నా. వా. అ పుం. తత్స. చంద్రుడు.

రజము
సం. నా. వా. అ. పుం. తత్స. అన్నిరకాల సభావేదికల కోసం విశ్వకర్మచే చెప్పబడిన ప్రమాణాలలో ఒకటి. ఎనిమిది అనువులు కలిపి ఒక రజము, ఎనిమిది రజములు కలిపి ఒక బాలము.

రజ్జువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. తాడు.

రథస్థగతి
రథమును నడిపే వ్యక్తి యొక్క నడక చూర్ణ పాదమును కలిగి ఉండాలి. నటుడు సమపాదస్థానము నుంచి దండమును తీసుకొని, మరొక చేతితో స్తంభమును తీసుకొని రథమును నడుపుతున్నట్టుగా అభినయించాలి.

రమ్యము
ఏడు వర్షములలో ఒకటి.

రసగతులు
రసమును ఆధారముగా చేసుకొని వాటి గతులు చెప్పబడ్డాయి. అనగా శృంగార, రౌద్ర, బీభత్స, వీర, అద్భుత, హాస్య, కరుణ, భయానక మరియు శాంత రసము యొక్క గతులు.

రసదృష్టి
రసమును వ్యక్తపరిచే చూపులు. ఇవి ఎనిమిది రకాలు. అవి, 1.కాంతము, 2.భయానకము, 3.హాస్యము, 4.కరుణ, 5.అద్భుతము, 6.రౌద్రి, 7.వీరము, 8.బీభత్సము.

రసము
విభావ, అనుభావాలు, వ్యభిచారీ భావాలతో కలిసి రసము ఉత్పత్తి అవుతుంది. దీనిని ఆస్వాదించడం ద్వారా తెలుసుకోగలుగుతాము కనుకే దీనిని రసము అంటారు. ఒక వ్యక్తి ఎలా అయితే రకరకాల రుచులతో చేయబడిన ఆహారాన్ని ఆస్వాదిస్తాడో, అదే విధమగా ప్రేక్షకులు కూడా నటులచేత అభినయింపబడ్డ భావములను ఆస్వాదిస్తారు. ప్రేక్షకులు పొందే ఈ భావననే నాట్యము యొక్క రసము అంటారు.

రసము
సం. నా. వా. అ. న. తత్స. భావాలు, అభిప్రాయము. భరతుడు మొదట ఎనిమిది రసాల గురించి చెప్పెను. తర్వాత తొమ్మిదవ రసముగా శాంతరసమును చేర్చాడు.

రసములు
ఇవి ఎనిమిది రకాలు. అవి, 1.శృంగారము, 2.హాస్యము, 3.కరుణ, 4.రౌద్రము, 5.వీరము, 6.భయానకము, 7.బీభత్సము, 8.అద్భుతము. ఈ రసాలకు పేర్లు ద్రుహిణుడు (బ్రహ్మ) చెప్పాడు.

రసాతరువు
సం. నా. వా. అ. న. తత్స. అధోర్యకాలలో ఒకటి.

రాగము
సం. నా. వా. అ. పుం. తత్స.

రుద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శివుడు, రంగపీఠము యొక్క మూలస్తంభ రక్షణ భాద్యతను రుద్రుడు మరియు శివుని యొక్క రూపాలు, ఆదిత్యులు చూసుకుంటారు.

రూపపిండి
లక్ష్మీదేవికి సంబంధించినది. గుడ్లగూబ కూడా లక్ష్మీదేవి యొక్క పిండి.

రూపబలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. రూపమును పూజించుట.

రేచకనికుట్టితము
(కరణము) కుడిచేతిని రేచితములో, కుడిపాదమును నికుట్టితములో, ఎడమచేతిని దోల హస్తములో ఉంచడం.

రేచకము
అవయవములను విడివిడిగా కదపడం, తిప్పడం, పైకెత్తడం మొదలైనవాటిని రేచకము అంటారు. కరణములలో, అంగహారములలో మాత్రమే కాకుండా రేచకమునకు ఒక ప్రత్యేకమైన ఉపయోగం కూడా ఉంది. వీటిని సుకుమార గీత వాయిద్యాలలో ఉపయోగిస్తారు. అవి నాలుగు రకాలు. 1.కరము లేక హస్తరేచకము, 2.పాదరేచకము, 3.కటిరేచకము, 4.గ్రీవారేచకము.

రేచితకటి
వ్రేళ్ళను ఎక్కువగా కదిలించటం.

రేచితగ్రీవా
మెడను ఊపి అటు ఇటు కదపడం. భావములోను, నృత్యములోను దీనిని ఉపయోగిస్తారు.

రేచితభ్రూ
విలాసముగా కనుబొమ్మలను ఎగరవేయడం. నృత్యములో ఉపయోగిస్తారు.

రేచితము
(నృత్తహస్తము) రెండు సమపాత హస్తములను మార్చి మార్చి తిప్పుతూ అరచేటులను ముఖముపై పెట్టడము.

రేచితము
(అంగహారము) చేతిని రేచితములో ఉంచి ఒకవైపునకు వంచి మరలా అదే కదలికను చేయడం. ఇదే విధముగా శరీరమును వంచడం ఆ తర్వాత నూపురము, భుజంగత్రాసితము, రేచితము మరలా మరలా చేయాలి. ఆ తర్వాత ఉరోమండలము, కటిఛిన్నము చేయాలి.

రౌద్రగతి
ఇది దైత్యులు, రాక్షసులు, నాగుల కోసం వారి స్వభావాలలో ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది కనుక వారికోసం చెప్పబడింది. ఇది మరల 3 రకాలు. 1.నేపథ్యరౌద్రము. ఇది అలంకరణలో చెప్పబడుతుంది. ఉదా: రక్తములో తడిసిన రాక్షసుని శరీరము, చేతిలో మాంసపు ముక్కలు కలిగి ఉండటం. 2.అంగరౌద్రము. అవయవాలకు చెందినది. ఉదా: చాలా పొడవుగా అనేకమైన తలలతో చేతిలో ఆయుఘము కలిగిన రాక్షసుడు. 3.స్వాభావజరౌద్రము. సహజముగానే రొద్రము కలిగినవారు. ఉదా: ఎర్రని కళ్ళు, తామ్ర వర్ణమైన జుట్టు, నల్లటి రంగు, గంభీరమైన గొంతు మరియు ఎల్లప్పుడు తిడుతూ ఉండే రాక్షసుడు.

రౌద్రపిండి
శివునికి సంబంధించినది.

రౌద్రము
?

రౌద్రము
ఇది మూడు రకములు. 1.బాహ్యరౌద్రము, 2.అంగరౌద్రము, 3.నేపథ్యరౌద్రము.

రౌద్రిదృష్టి
దీనియందు కనురెప్పలు, కనువెంట్రుకలు స్థిరముగా ఉండి కనుబొమ్మలు సంతుష్టము చెంది కనుపాపలు కఠినముగా, ఎర్రగా అవ్వడం. రౌద్రరసములో దీనిని ఉపయోగిస్తారు.

లక్ష్మి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విష్ణువు యొక్క భార్య, ధనాది దేవత.

లజ్జాన్వితదృష్టి
కనువెంట్రుకల చివరలు కొద్దిగా ఉంచి సిగ్గుతో పై కనురెప్పను కిందకి తెచ్చి కనుపాపలు కూడా కిందికి రావడం. సిగ్గును అభినయించటానికి ఉపయోగిస్తారు.

లతాబంధము
(పిండిబంధము) దీని ఆకారాల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇది ఒక వలలోని ముడుల వలె ఉంటుంది. ఇది మధ్యస్థంగా ఉండి చూడటానికి తీగలాగా ఉంటుంది. ఇది మధ్యమసరితలో ఉంటంది. ఇది రెండు పాదాలకు,

లతాబంధము
సం. నా. వా. అ. న. తత్స. నాట్యగృహము గోడల యందు అద్భుతముగా వర్ణించబడిన గీతలు.

లతావృశ్చికము
(కరణము) పాదాన్ని ఆంచితంగా ఉంచి వెనుకకు తిరగాలి. లతాహస్తమును ఎడమచేతితో అరచేయి మరియు వేళ్ళను వంచి పైకి వంచాలి. ఆకాశం నుంచి పడటాన్ని అభినయించటంలో దీనిని ఉపయోగిస్తారు.

లయ
గతి, స్వరబద్ధ రచన. 1.స్థితిలయ, విలంబిత, 2.మధ్యమ, 3.దృతలయ.

లయ
పూర్తి ఛందస్సును, వర్ణాలను, పాదాలను లయవేదమానం అంచారు. ఇది కళల ప్రదర్శనలో భిన్న రీతులను చూపించడం ద్వారా లయవేదమానం అవుతుంది. ఇది 3 రకాలు. దృత(వేగము), మధ్యమ(మధ్యస్థము), విలంబ(నెమ్మది) లయలు. గానము చేయడానికి, వాద్యాలు వాయుంచడానికి ఇది అత్యంత ఆవశ్యకమైన అంశము. తత్వానుగతము, ఓఘము రెండూ కూడా కరణములకు సంబంధించినవి. తత్వము ఎప్పుడూ కూడా విలంబిత లయలోనే ఉండాలి. అనుగత మధ్యమ లయలో, ఓఘము దృతి లయలో ఉండాలి.

లలాటతిలకము
మొదట వృశ్చికరణం చేసిన తర్వాత పెద్ద బొమ్మ ఆకారంలో నుదుటి మీద పెట్టాలి. ఇక్కడ ఈ బొమ్మతో పాటు ఎడమచేతి బొటనవేలు కడా నుదుటి మీద ఉంచాలి. దీనిని విద్యాధర గతి యందు ఉపయోగిస్తారు.

లలితదృష్టి
కళ్ళు చివరలో సంకోచం చెంది కనుబొమ్మల కదలిక ద్వారా మరియు నవ్వడం ద్వారా ప్రేమను, మాధుర్యాన్ని చూపించడం. దీనిని దృతి హర్షములో ఉపయోగిస్తారు.

లలితము
+ ఎడమచేయి కరిహస్తము, కుడిచ్యి వివర్తము, పాదాలను కుట్టితలో ఉంచి పాదాలను మరల మరల అనుసరించాలి.

లాజము
సం. నా. వా. అ. న. తత్స. వేయించిన పేలాలు.

లాలితహస్తము
(నృత్తహస్తము) రెండు అలపల్లవ హస్తాలు శిరస్సు మీద స్వస్తికంగా ఉంటే అది లాలితహస్తము అవుతుంది.

లింగులగతి
శాంత ప్రకృతికి చెందినవారు. ఇది సమపాదచారీలో ఉండాలి.

లిక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశ్వకర్మచే చెప్పబడిన ప్రమాణములలో ఒకటి. ఎనిమిది బాలలు ఒక లిక్ష, నిమిది లిక్షలు ఒక యూకము.

లీనము
(కరణము) ఛాతిపైన అంజలి హస్తమునుంచి మెడను పైకెత్తి భుజములను వంచాలి. దీనిని ప్రార్థనలో ఉపయోగిస్తారు. కాని దైవ ప్రార్థన యందు కాజు.ఎందుకంటే దైవ ప్రార్థనలో చేతులు తల పై భాగంలో ఉండాలి.

లేహితచిబుకము
నాలుకతో పెదవులను నాకుట. అత్యాశ యందు దీనిని ఉపయోగిస్తారు.

లోకధర్మి
నిజమైన అభ్యాసము. 1.సహజ ప్రవర్తన కలిగిన పాత్రలమీదే ఇది ఆధారపడి ఉంటుంది, 2.ఇది కృత్రిమమైనది కాకుండా సరళముగా ఉంటుంది, 3.దీనియందు ప్రజల యొక్క పనులు, వృత్తులు ఉంటాయి, 4.అవయవముల యొక్క శృంగారము దీనియందు ఉండదు, 5.ఇది వివిధ రకములైన స్త్రీ, పురుషుల మీద ఆధారపడి ఉంటుంది.

లోలితము
(కరణము) రేచిత హస్తమును వంచి తలను రెండు వైపుల తిప్పి సహజావస్థకు తీసుకురావడం.

లోలితశిరము లేదా పరిలోలితశిరము
తలను అన్నివైపులా కదపడం లోలితశిరము లేదా పరిలోలితశిరము. మూర్ఛ, అనారోగ్యము, మత్తు, దుష్టశక్తి ఆవాహన మొదలైనవాటి యందు దీనిని ఉపయోగిస్తారు.

వంగ
తూర్పురాజ్యము యొక్క పేరు.

వంశము
తల్లిదండ్రుల తర్వాత సాంప్రదాయమునకు అనుగుణంగా పేరును పొందడం. ఇది కుటుంబ చరిత్రను తెలుపుతుంది.

వక్త్రపాణయము
వాద్యవృత్తిలో సంగీత వాద్యములకు ఇవ్వబడే శృతి. వృత్తులకు అనుగుణంగా వాయిద్యములను క్రమములో పెట్టడం. దీనివలన దానవులు సంతృప్తి చెందుతారు.

వక్షస్వస్తికము
(కరణము) రెండు కాళ్ళను స్వస్తికములో ఉంచి, రెండు రేచితహస్తములను కూడా స్వస్తికములో ఉంచి ఒకదానితో ఒకటి ఆభుగ్నఛాతి యందు కలపాలి.

వజ్రపాణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. చేతియందు వజ్రము కలిగినవాడు, ఇంద్రుడు.

వజ్రము
సం. నా. వా. ? రంగశీర్షము యొక్క తూర్పుభాగములో దీనిని ఉంచుతారు.

వత్సము
తూర్పురాజ్యము యొక్క పేరు.

వనగానులగతి
ఈ గతి స్వస్తిక పాదములో చూపబడాలి. మొదట పార్శ్వక్రాంతాచారిని, తర్వాత స్వస్తిక పాదమును చేర్చి రేచకమును చేయాలి.

వనవాసిజము
ఒక రాజ్యము యొక్క పేరు.

వర్ణములు
అన్ని రసములకు వర్ణములు చెప్పబడ్డాయి. అవి శ్యామము, సితము, కపోతము, రక్తము, గౌరము, కృష్ణము, నీలము, పీతము.

వర్ణములు
సం. నా. వా. అ. పుం. తత్స. పూర్వ భారతీయ సమాజంలో ఉన్న నాలుగు ప్రధాన కులములు. అక్షరములు.

వర్తితము
(కరణము) ఒకచేతిని వ్యావృత్తములోను మరొక చేతిని పరివర్తితములో ఉంచి చేతి మణికట్టు దగ్గర కొంచెం వంచి తొడలపై ఉంచాలి. (చేతులు వృత్తానములో ఉన్నప్పుడు అసూయను, కిందకు ఉన్నప్పుడు చికాకును ప్రదర్శిస్తాయి.

వర్ధమానకగీతములు
నృత్యముతో పాటు చేసే పాటల వర్గము.

వర్ధమానకము
(సంయుతహస్తము) 1.నడుము వద్ద రెండు హంసపక్ష హస్తములు ఒకదానిని ఒకటి దాటినట్లైతే వర్ధమానకము అంటారు. 2.ముకుళహస్తము కపిత్థము చేత చుట్టబడి ఉండడమే వర్ధమానకము.

వర్ధమానకయోగము
అక్షరములలోను, లయలోను అదే విధంగా నృత్యకారుల సంఖ్య పెరగడం వల్ల కళలలో కూడా పెరుగుదల ఉండటం చేత దీనికి ఆ పేరు. ఇది నృత్యముతో పాటు పాడబడుతుంది.

వర్షములు
వర్షములు మొత్తం ఏడు. Chapter13.4. దేవతలకు, దేవాంశ సంభూతులకు అన్ని వర్షములలోను ప్రవేశము కలదు. కాని మానవులకు కేవలం భరత వర్షములోనే ప్రవేశము కలదు.

వలనతార
కనుపాపలను త్రిభుజాకారంలో తిప్పడం. వీర, రొద్ర రసములలో దీనిని ఉపయోగిస్తారు.

వలిజగతి
వైశ్యులు లేక సచివుల యొక్క గతి. అతిక్రాంతాచారీతో సాధారణముగా ఉండాలి. ఎడమ చేతితో కటకాముఖ హస్తమును చూపించి నాభి పైన ఉంచాలి. మరొక చేతిని ఎడమచేతికి దూరముగా అరాళములో ఉంచాలి. ఇవి అటు నిశ్చలముగాను, ఇటు చంచలముగాను ఉండకుండా మధ్యస్థముగా ఉండాలి.

వలితగ్రీవము
ముఖముతో సహ మెడను వెనుకకు తిప్పి చూడడం.

వలితము
(నృత్తహస్తము) ఎప్పుడైతే రెండు లతాహస్తములు వాటి మోచేతుల వద్ద ఒక దానిని ఒకటి దాటబడతాయో దానినే వలితము అంటారు.

వలితము
చేతులతో ఆవిద్ధము ప్రదర్శించిన తర్వాత సూచీపాదము మరియు త్రికమును తిప్పాలి. త్రిక వలన దీనిని వలితము అని అంటారు.

వలితోరుకము
(కరణము) చేతులను శుకతుండములో వర్తిత, పరివర్తితములలో ఉంచి తొడలను వలితములో ఉంచాలి. ఇది ముగ్ధమునకు సంబంధించినది.

వలితోరువు
వలితము లేదా వలనము. వెళ్ళేటప్పుడు మోకాళ్ళను లోపలికి లాక్కోవడము.

వల్కలము
సం. నా. వా. అ. న. తత్స. పట్టువస్త్రము.

వల్గనము
సం. నా. వా. అ. న. తత్స. గెంతుట, ఉదుకుట, ఎగురుట.

వసుమతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భూమి, భూదేవి.

వస్తు
విషయము, అంశము.

వాక్యరౌద్రము
వాక్యముల ద్వారా రౌద్ర రసమును వ్యక్తపరుచుట.

వాక్యహాస్యము
వాక్యముల ద్వారా హాస్యరసమును వ్యక్తపరుచుట.

వాగాత్మకశృంగారము
పదాల ద్వారా శృంగారమును అభినయింపచేయడం.

వాతాయనము
సం. నా. వా. అ. న. తత్స. చిన్న కిటికీ.

వాదనము
సం. నా. వా. అ. న. తత్స. నూలు వస్త్రము.

వామనులగతి
వీరియొక్క అన్ని అవయవములు చిన్నవిగా ఉండటం వల్ల వేగముగా కాని, వెడల్పుగా కాని అడుగులు వేస్తూ నడవలేరు.

వాయలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఉత్తర, పడమర దిక్కులకు మధ్యనుండు దిక్కు వాయవ్యము.

వాయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మరుతము, పవనుడు.

వార్తికమార్గము
మూడు మార్గములలో ఒకటి. చిత్రపూర్వరంగములోని కళలు వార్తిక మార్గమును అనుసరించాలి.

వార్షగన్యన్యాయము
?

వాసుకి
సం. నా. వా. ఇ. పుం. తత్స. జర్జరము యొక్క ఐదవ భాగమైన పర్వమును శేషుడు, తక్షుడితో పాటు వాసుకి కూడా సంరక్షిస్తుంది.

వాస్తు
సం. నా. వా. ? భవన నిర్మాణ సమయంలో ఉపయోగించు శాస్త్రము. మొట్టమొదటివాడైన విశ్వకర్మ మరియు మాయాసురుడు ఇంకా ఇతర వాస్తు శిల్పులు వాస్తుశాస్త్రమును తయారుచేసారు. మానసార, వాస్తుసార అను వాస్తు పుస్తకము, ప్రేక్షక గృహము యొక్క వివరణకు ఎంతగానో ఉపయోగింపబడింది. ఈ పుస్తకము నాట్యశాస్త్రంలో వివరించబడ్డ నాట్యమండపమునకు దగ్గరగా ఉన్నది.

వింధ్యపర్వతము
ఒక పర్వతము పేరు.

వికారములు
?

వికూణితనాసిక
?

వికృష్టనాసికము
ఎడమగా చేయబడ్డ ముక్కు. ఘాటుగా ఉన్నవాటిని వాసన చూసేటపుడు, శ్వాస సమయంలో, రౌద్ర మరియు వీరరసములలో దీనిని ఉపయోగిస్తారు.

వికృష్టము
సం. నా. వా. అ. పుం. తత్స. మూడు రకాల నాట్యమండపాలలో ఒకటి. దీనియందు పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువగా ఉండి దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.

వికోశదృష్టి
కనురెప్పలను ఆర్పకుండా, బాగా తెరచి, కనుపాపలు ఆనందంగా కదులుతూ ఉండటం. దీనిని విబోధము, గర్వము, అమర్షము, ఉగ్రతము, మతి మొదలైనవాటి యందు ఉపయోగిస్తారు.

విక్షిప్తము
(కరణము) చేతిని, పాదమును ఒకదానితో ఒకటి పక్కలకు కాని, వెనుకకు కాని విసరడం. దీనిని ఉద్ధత పరికర్మలు నిరూపించడానికి ఉపయోగిస్తారు.

విక్షిప్తాక్షిప్తము
(కరణము) చేతులను బయటకు, లోపలకు విసరడం. దీనిని వివిధ రకాల నడకలలో ఉపయోగిస్తారు.

విఘ్నములు
సం. నా. వా. అ. పుం. తత్స. దుష్ట ఆత్మలు, ఏ పనికైనా అడ్డంకులను సృష్టిస్తాయి.

విచ్యవచారీ
పాదములను సమపాదము నుంచి వేరు చేసి మునివేళ్ళతో నేలను తాకడం.

విటులగతి
ఇది సొగసైన గతి. దీని యందు ఒక తాళముతో కుంచిత పాదమును ముందరికి పెట్టి, సౌష్టవముతో కటకవర్ధమాన హస్తములు పాదములను అనుసరిస్తాయి.

వితర్కితదృష్టి
ఊహించేటపుడు కనురెప్పలు పైకెత్తబడి, కనుపాపలను కిందకి కదల్చడం. దీనిని స్మృతి, తత్త్వములలో ఉపయోగిస్తారు.

వితాడితపుటము
కనురెప్పలు కొట్టుకోవడం. దీనిని అభిఘాతములో ఉపయోగిస్తారు.

వితుషము
సం. నా. వా. అ. పుం. తత్స. పొట్టులేనిది.

విత్రాసితక భయము
ఏదైనా ప్రమాదం వలన కలిగే భయాన్ని విత్రాసిత భయము అంటారు.

విదగ్ధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విద్యావేత్త.

విదిశము
ఒక రాజ్యము యొక్క పేరు.

విదిశము
సం. నా. వా. అ. పుం. తత్స. మూలలు, దిక్కులు, కోణములు. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము.

విదూషకుడు
సూత్రధారుని పరిచయ సమయంలో అతని ప్రక్కన పారిపార్శ్వకునితో సహా నించునేవాడు.

విదూషకునిగతి
ఇతని గతి సహజమైన నవ్వుతో సాధారణమైన అడుగులు కలిగి ఉంటుంది. ఇవి 3 రకాలు. 1.అంగజము. కొంగలాగ ఉల్లోకిత, విలోకిత దృష్టితో, వెడల్పైన అడుగులు వేస్తూ నడవటం. 2.కావ్యజము. అర్ధం లేకుండా మాట్లాడటం, అసంబంధమైన మాటలు, నీచమైన పదములు వాడుతూ మాట్లాడటం. 3.నేపథ్యజము. వస్త్రధారణ ద్వారా నడవడము.

విద్య
సం. నా. వా. ఆ స్త్రీ. తత్స. జ్ఞానము, చదువు, ప్రజ్ఞ, విద్యాభ్యాసము. నాట్యశాస్త్రము యొక్క ఉద్దేశ్యములలో ఒకటి. ప్రతివారిని విద్యావంతులుగా చెయ్యడం, నాలుగు వర్ణాల వారికి విజ్ఞాన వినోదాలను కలిగించే శాస్త్రాన్ని సృష్టించమని ఇంద్రుడు బ్రహ్మదేవునికి విజ్ఞప్తి చేసాడు.

విద్యుత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. దైత్యులను సంహరించుటలో సామర్థ్యము కలిగిన దేవుడు.మత్తవారాణి సంరక్షణకు నియమింపబడినవారు.

విద్యుత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. ప్రకాశము ఇచ్చు దేవత.

విద్యుత్భ్రాంతచారీ
పాదమును వెనుకకు తిప్పి తలను తాకడం కోసం చాచి, తర్వాత అన్ని దిశలలో తిప్పడం.

విద్యుత్భ్రాంతము
(అంగహారము) ఎడమపాదమును అర్ధసూచీలో, కుడిపాదమును విద్యుద్భ్రాంతిలో తర్వాత కుడిపాదముతో అర్ధసూచీ, ఎడమ పాదంతో విద్యుత్భ్రాంతి చేయాలి. ఆ తర్వాత పరిఛిన్నము, త్రికమును తిప్పాలి. తర్వాత లతాహస్తము, కఠిఛిన్న కరణములు ప్రదర్శించాలి.

విద్యుత్భ్రాంతము
(కరణము) మండలవిద్ధ భంగిమలో తలను, చేతులను తాకేటట్లుగా పాదమును వెనుకకు వంచడము. దీనిని ఉద్ధత పరికరృమలో ఉపయోగిస్తారు.

విద్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. సందేహముతో, భయముతో, భ్రమతోనూ చేసెడి పనులు.

విధుతఆస్యము
నోటిని వ్యాకోచింప చేయడం. జాగ్రత్తలు తీసుకునేటప్పుడు, కాదు అని చెప్పే సమయంలోను ఉపయోగిస్తారు.

విధుతశిరము
దృతశిరమును త్వరగా చేయడం. చలిలోను, భయంలోను, జ్వరములోను, మత్తు కలగడానికి ప్రారంభ దశలోను ఉపయోగిస్తారు.

వినిగుహనాధారము
పెదవులను లోపలకు లాక్కొనుట. ప్రయత్నము చేసేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

వినివృత్తము
(కరణము) పాదమును సూచీవిద్ధచారీలో ఉంచి త్రికమును తిప్పాలి. చేతులను రేచితములో ఉంచాలి. ఉద్ధాన పరికర్మను సూచించడానికి ఉపయోగిస్తారు.

వినివృత్తాస్యము
నోటిని ఒకవైపు తిప్పడం. కోపం, అసూయ, తిరస్కారములో దీనిని ఉపయోగిస్తారు.

విప్రకీర్ణము
(నృత్తహస్తము) స్వస్తికహస్తము వేగంగా విడిపోతే అది విప్రకీర్ణహస్తము అవుతుంది. పైట జారటము, పైట తీసివేయటము అనే అర్ధముల యందు ఈ హస్తము వినియోగింపబడుతుంది.

విప్రకృష్టము
సం. నా. వా. అ. పుం. తత్స. ఇది పొడవైనది.

విప్రలంభ శృంగారము


విప్రులు
విద్యావేత్తలు, బ్రాహ్మణులు, విజ్ఞానవంతులు.

విప్లుతదృష్టి
కనురెప్పలు రెండు జలదరింపబడి తర్వాత నిశ్చలముగా వాలిపోయి, కనుపాపలు పైకెత్తి మరలా కదలడం. చపలత, ఉన్మాదము, దుఃఖము, ఆర్తి, మరియు మరణముల యందు ఉపయోగిస్తారు.

విభ్రాంతదృష్టి
కనుపాపలను కదుపుతూ, అయోమయంతో కనురెప్పలను తెరవడం. దీనిని ఆవేగము, సంభ్రమము, యుద్ధములలో ఉపయోగిస్తారు.

విమానునిగతి
ఇది రథస్థాస్యుని గతిలానే ఉంటుంది.

విరూపాక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధ్వజమహోత్సవ సమయములో దేవతల విజయాన్ని పొగుడుతూ ప్రస్తావన జరుగుతున్న సమయంలో దానవులతో పాటు విరూపాక్షుడు సభావేదిక పైకి వెళ్ళి మాయ ద్వారా విఘ్నములను సృష్టించి కదలికలను, వచనమును స్తంభింప చేసి కళాకారులను సైతం జ్ఞాపకహీనులుగా చేస్తాడు. ఇతని ప్రస్తావన మహాభారతంలోను, మరికొన్ని పురాణాలలో కూడా కలదు.

విలోకిత దర్శనము
చుట్టుపక్కల, వెనుకకు చూడటం.

వివర్తనతార
కనుపాపలను పక్కకు తిప్పి పక్క చూపులు చూడటం. శృంగార రసములో దీనిని ఉపయోగిస్తారు.

వివర్తనాధరము
పెదవులను ఒకవైపుకు తిప్పుట. అసూయ, బాధ, తిరస్కారము, నవ్వులలో దీనిని ఉపయోగిస్తారు.

వివర్తికము
చేతిని, పాదమును బయటకు విసిరి త్రికమును తిప్పి మరొక చేతితో రేచితమును చేయాలి.

వివర్తితపార్శ్వము
త్రికమును గుండ్రంగా తిప్పడము.

వివర్తితపుటము
కనురెప్పలను పైకెత్తుట. దీనిని క్రోధములో ఉపయోగిస్తారు.

వివర్తితశయనము
ముఖమును క్రింది వైపుకు పెట్టి నిద్రపోవడం. ఆయుధములతో గాయపడ్డవారు దీనిని ఉపయోగిస్తారు.

వివర్తితోరువు
వివర్తనము లేదా వివర్తితము. మడమలను తొడకు తగిలే విధంగా లోపలకు లాక్కొని కదలికలు చేయడము.

వివృత్తగ్రీవా
మెడను ముఖముతో పాటు ముందరికి వంచుట. స్వస్థలానికి వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

వివృత్తము
(కరణము) చేతులు మరియు పాదములు ఆక్షిప్తములో త్రికమును చుట్టూ తిప్పి చేతులతో రేచితమును ప్రదర్శించాలి. దీనిని ఉద్ధత పరికర్మ యందు ఉపయోగిస్తారు.

వివృత్తాస్యము
పెదవులను, నోటిని తెరచి ఉంచటము. బాధ, భయము, హాస్యములలో దీనిని ఉపయోగిస్తారు.

విశ్లోకజాతి
ఒక ఛందస్సు.

విశ్వకర్మ
సం. నా. వా. న్. పుం. తత్స. దివ్యమైన శిల్పి. నాట్యమండపము యొక్క ప్రథమ కర్త. బ్రహ్మదేవుని ద్వారా అన్ని సదుపాయములతో కూడునట్టి నాట్యవేశ్మమును నిర్మించమని ఆదేశింపబడ్డాడు. ఈయన ప్రస్తావన ఋగ్వేగములో ఉంది కాని పురాణాల యందు బాగా ప్రాచుర్యం పొందాడు. ఇతని పనుల గురించి పురాణాలలో ప్రస్తావన కలదు.

విశ్వదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవతల సమూహము. వీరు విశ్వ, వసు, సత్య, క్రతు, దక్ష, కల, కామ, ధృత, కురు, పురూరక మరియు మాద్రవుల యొక్క కుమారులని చెప్పబడతారు.

విశ్వరత్నము
సం. నా. వా. అ. న. తత్స. యోగ్యము కాని శబ్దము చేయుట.

విశ్వావసువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. గాంధర్వుడు, నారదుడితో పాటు సంగీతములో ప్రసిద్ధి చెందినవారు, అనుభవజ్ఞులు.

విషణ్ణదృష్టి లేదా విషాదిని
కనురెప్పలు, బాధలో తెరవబడి, కనుపాపలు చలనం లేకుండా, ఆర్పకుండా ఉండటం. విషాదములో దీనిని ఉపయోగిస్తారు.

విష్కంభకము
(అంగహారము) చేతులను ఒకదాని తర్వాత ఒకటి ఉద్వేష్టితలో మరియు పాదములను నికుట్టితములో ఉంచి ఆ తర్వాత వంగి ఊరుద్వృత్త కరణమును ప్రదర్శించాలి. చేతులను చతురస్రములో ఉంచి, పాదములను నికుట్టితములో ఉంచిన తర్వాత భుజంగత్రాసిత కరణమును ప్రదర్శించాలి. మరలా ఉద్వేష్టిత హస్తము, భ్రమరక కరణము, పరిఛిన్నమును, త్రికమును తిప్పుతూ చేయాలి. తర్వాత కరిహస్తము, కఠిఛిన్న కరణాలు చేయాలి.

విష్కంభము
(కరణము) సూచీహస్తములో ఉన్న కుడిచేతితో అపవిద్ధమును ప్రదర్శించి ఎడమ పాదమును నికుట్టితములో ఉంచి, ఎడమ చేతిని ఛాతి పైన ఉంచాలి.

విష్కభాపసృతము
(అంగహారము) ప్రారంభములో నికుట్టిత, అర్ధనికుట్టితము మరియు భుజంగత్రాసిత కరణములలో ఉన్న రేచిత హస్తముతో పతాక భంగిమను చూపించి ఆ తర్వాత ఆక్షిప్తమును, ఉరోమండలమును ప్రదర్శించాలి. చివరగా లతాహస్త కరణములతో పాటు కఠిఛిన్న కరణములను కూడా ప్రదర్శించాలి.

విష్ణుక్రాంతము
(కరణము) ఒక పాదమును ముందుకు చాచి, నడవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మరొక కాలిని ఉంచి చేతులను రేచితములో ఉంచడం. విష్ణు పరికర్మకు సంబంధించిన వాటియందు దీనిని ఉపయోగిస్తారు.

విష్ణువు
సం. నా. వా. ఉ పుం. తత్స. త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) ఒకరు.

విసర్గాధరము
పెదవులను బయటకు వ్యాకోచింప చేయడం. ఆడవారి సొగసు, విలాసము, కోపము చూపించుట, పెదవులకు వర్ణములు పూసుకునేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

విస్తారము
సం. నా. వా. అ. న. తత్స. వ్యాప్తిచేయుట.

విస్మితదృష్టి
విస్మయ పరిచేది. కనుపాపలను పైకెత్తి, కనురెప్పలను కదల్చకుండా ఉంచడం. ఇక్కడ దృష్టి చాలా ప్రకాశవంతంగా సమస్థితిలో ఉంటుంది. దీనిని విస్మయములో ఉపయోగిస్తారు.

విహగాదులగతి
పక్షుల మరియు జంతువుల యొక్క గతి వాటి సహజ గుణాలకు అనుగుణంగా ఉంటుంది.

విహసితము
చిన్నగా నవ్వడము. కళఅళు, బుగ్గలు కన్పించడమే సరసమైన అంగము ముఖములో చిగురిస్తే దానిని విహసితము అంటారు. ఇది మద్యమ ప్రకృతికి చెందినది.

వీరగతి
రకరకాల చారీలతో ఊగుతూ అడుగులు వేయడం. మానసిక ఆనందంలో నడక సరైన కాల, తాళాలతో పార్శ్వక్రాంతము, అవిద్ధము, మరియు సూచీచారీలతో ఉంటుంది.

వీరదృష్టి
కంటి మధ్య భాగంలో కనుపాపలు కోపంగా, ప్రకాశవంతంగా తెరిచి ఉండడం. దీనిని వీరరసము యందు ఉపయోగిస్తారు.

వీరము


వీరము
ఈ రసము మూడు రకాలు. 1.దానవీరము, 2.ధర్మవీరము, 3.యుద్ధవీరము.

వృత్తము
ఛందస్సు అని కూడా పిలువబడే వృత్తము నాలుగు పాదములను కలిగి ఉంటుంది. ఇది వివిధ రకాల ఆలోచనలను వ్యక్తపరుస్తుంది. దీనియందు గురులఘువులు ఉంటాయి. ఛందస్సు లేదా వృత్తము మూడు రకాలు. 1.సమము, 2.విషమము, 3.అర్థసమము. ఛందస్సు లేదా వృత్తము అనేది పదము యొక్క శరీరముగా పరిగణించబడుతుంది. వృత్తము లేని పదము ఉండదు, పదము లేని వృత్తము ఉండదు. అందువలనే ఈ రెండిటి యొక్క కలయిక నాట్యప్రదర్శన యొక్క వ్యాఖ్యాతగా చెప్పబడుతుంది.

వృత్తులు
ఇవి నాలుగు రకాలు. 1.భారతీ, 2.సాత్వతీ, 3.కైశికీ, 4.ఆరభటీ.

వృశ్చికము
(కరణము) రెండు చేతులను వంచి భుజముల పైన ఉంచాలి. ఆ తర్వాత పాదములను వెనుకకు వంచి వెనక వైపుకు తిరగాలి.

వృశ్చికరేచితము
(కరణము) వృశ్చిక కరణము చేసిన తర్వాత చేతులను స్వస్తికము నుండి రేచితమునకు తర్వాత విపకీర్ణ హస్తమునకు (అనగా చేతులను వేరు చేయడం) తీసుకురావాలి. ఆకాశయానము నందు దీనిని ఉపయోగిస్తారు.

వృశ్చికాపసృతము
(అంగహారము) లతాహస్తములతో వృశ్చికాకరణమును, ఇదే విధంగా ముక్కు యొక్క కొనలోను ప్రదర్శించాలి. ఆ తర్వాత ఉద్వేష్టితము, నితంబము, కరిహస్తము మరియు కఠిఛిన్న కరణములు చేయాలి.

వృషభక్రీడితము
(కరణము) చేతులు, పాదములతో అలపల్లవ కరణముతో వృశ్చిక కరణము చేయడం ద్వారా నికుత్తిక కదలికలు తయారుచేయడం.

వేదములు
సం. నా. వా. అ పుం. తత్స. నాలుగు వేదములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము.

వేదాంగములు
సం. నా. వా. అ పుం. తత్స. వేదముల యొక్క అంగములు. అవి శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, కల్పము, జ్యోతిషము, ఛందస్సు.

వేదాచారీ
ఒక కాలి మడమ పైన మరొక పాదముతో కొట్టడం. ఇది సూచీచారీని సూచిస్తుంది.

వేదిక
సం. నా. వా. ? ఇనుప కడ్డీలతో కూడిన విభాగము.

వేదిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సభావేదిక, కళాకారులు ప్రదర్శన ఇచ్చు స్థలము. దీని సంరక్షణ అగ్నిదేవుడు చూస్తాడు.

వైఢూర్యము
సం. నా. వా. ? రంగశీర్షమున దక్షిణ భాగమును వైఢూర్యమును ఉంచుతారు.

వైణము
స్వరములు ఏడు. అవి రెండు విధాలుగా విభజింపబడ్డాయి. వాటిలో వైణము ఒక విధము. వీణలాంటి వాయిద్యములతో వాయించే సంగీతమును వైణము అంటారు.

వైణ్ణము
కృష్ణ మరియు పినాకినికి మధ్య గల దేశము.

వైదేహము
తూర్పురాజ్యము యొక్క పేరు.

వైశాఖరేచితము
(అంగహారము) శరీరముతో పాటు చేతులను రేచితములో ఉంచి ఆ తర్వాత అపవిద్ధములోకి తీసుకువచ్చి, శరీరమును పైకెత్తేటప్పుడు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలి. తర్వాత నూపురపాదము, భుజంగత్రాసితము, రేచితము, మండలస్వస్తికము చేయాలి. తర్వాత చేతులను, తలను వంచి ఉద్వృత్తము, ఆక్షిప్తము, ఉరోమండలము, కరిహస్తము మరియు కఠిఛిన్న కరణములను ప్రదర్శించాలి.

వైశాఖరేచితము
(కరణము) శరీరమంతటిని వైశాఖ స్థానములో ఉంచి చేతులను, పాదములను, మెడను, నడుమును రేచితములో ఉంచాలి. ఇక్కడ చతుర్విధ రేచితములను ఉపయోగించాలి.

వైశాఖస్థానము
రెండు తొడలను భూమిపైన మూడున్నర తాళాల దూరములో ఉంచి పాదములను నేలపైన అదే దూరములో ఉంచడం. దీని ఆస్థాన దేవత కార్తికేయుడు.

వైశికశాస్త్రకారులు
వైశికశాస్త్రకారులు అనేది ఒక విజ్ఞాన శాస్త్రము. దీనిలో పది రకముల కామములు గురించి చెప్పబడ్డాయి.

వైశ్యస్తంభము
సం. నా. వా. ? స్తంభ ప్రతిష్ఠ సమయంలో ద్రవ్యములన్నియు పసుపు రంగులోనే ఉండాలి. దీని కింది భాగంలో వెండి, బంగారమును ఉంచుతారు. స్తంభ ప్రతిష్ఠ వాయవ్యములోనే జరగాలి. పసుపు రంగు సంపదకు చిహ్నము.

వైష్ణము
కృష్ణ మరియు పినాకినికి మధ్య గల దేశము.

వైష్ణవము
ఒక పాదమును సమస్థితిలోను, రెండవ దానిని దక్షస్థితిలోను రెండున్నర తాళాల దూరములో త్ర్యాస్రములో ఉంచాలి. కాలిని కొద్దిగా వంచి అవయవాలన్ని సౌష్టవములో ఉండాలి. దీని ఆస్థాన దేవత విష్ణువు.

వ్యంజనములు
వండబడిన పదార్థములు. రసమును వివరించే సమయంలో దీనిని ఉపయోగించారు. ఎలా అయితే ఒక వ్యక్తి వివిధ రకాల వస్తువులతో, వ్యంజనములతో వండబడిన ఆహారాన్ని ఆస్వాదిస్తాడో, అదే విధంగా నృత్యము చేసేటప్పుడు కూడా ప్రేక్షకుడు ఆ భావననే పొందుతాడు. దీనినే రసము అంటారు.

వ్యంసితము
(కరణము) ఆలీఢ స్థానమును తీసుకున్న తర్వాత చేతులను రేచితములో ఉంచి విపకీర్ణ భంగిమతో వక్షముపై పైకి, కిందకి కదపాలి. విభ్రమ మొదలైన వాటియందు దీనిని ఉపయోగిస్తారు.

వ్యజనము
సం. నా. వా. అ. న. తత్స. విసనకర్ర. భరతుడు మరియు అతని బృందము యొక్క మొదటి ప్రదర్శనకు సంతుష్టుడై వాయుదేవుడు బహుకరించిన బహుమానము.

వ్యాధిగ్రస్తాధికులగతి
అనారోగ్యం చెందిన వ్యక్తులు బలహీనమైన నడకతో, గొంతుతో, కళ్ళలో కాంతి లేకుండా, చేతులు, పాదాల యొక్క కదలిక నెమ్మదిగా, కష్టమైన అవయవ కదలికలతో, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందిగా భావిస్తూ నడుస్తారు.

వ్యాయమము
అంగహారాలు, చారీలు ప్రదర్శించడానికి నృత్యకారుడు వ్యాయమం చేయాలి. దీనికోసం నటుడు నువ్వుల నూనెతో శరీరమునకు మర్ధనా చేసుకోవాలి. వారి వారి ఆహార అలవాట్లను బట్టి వ్యాయమ నియమాలు పాటించాలి.

వ్యాలము
సం. నా. వా. అ. న. తత్స. క్రూర జంతువు, అడవి ఏనుగు, అడవి పాము.

వ్యావర్తితము
(హస్తకరణము) చిటికెన వేలితో మొదలుకొని అన్ని వేళ్ళు కూడా మణికట్టు చుట్టూ కదులుతున్నపుడు లోపలికి సూచించడము.

శంకితదృష్టి
దృష్టిని కొంచెం కదిపి, విశ్రాంతికి తీసుకువచ్చి తర్వాత కొద్దిగా పైకెత్తడం. అపుడు కనుపాపలు భయంతో తీవ్రంగా తెరుచుకుంటాయి. దీనినే శంకిత దృష్టి అంటారు. సందేహం కలిగినపుడు దీనిని ఉపయోగిస్తారు.

శంఖము
సం. నా. వా. అ. పుం. తత్స. సంగీత వాయిద్యముగా ఉపయోగించే నత్తగుల్ల. ఉత్సవాలలో ఆలయాలలో శంఖము ఊదడం అనేది సంప్రదాయము.

శకటాస్యచారీ
శరీరమును తిన్నగా ఉంచి, ఒక పాదమును అగర్తల సంచారములో ఉంచి, ఛాతిని ఉద్వాహితములో పైకెత్తడం.

శకటాస్యము
(కరణము) శరీరము ఒక భంగిమను చేస్తున్నప్పుడు ఉద్వాహితాచారీ ఏర్పడాలి. ఆ తర్వాత అగ్రతల సంచార పాదమును చాచాలి. బాలక్రీడములో దీనిని ఉపయోగిస్తారు.

శకారగతి
శకారము అనగా అహంకారము. ఈ గతిలోని వ్యక్తులు నడిచేటప్పుడు సాధారణమైన అడుగులు వేస్తూ, అతని దుస్తులను, ఆభరణాలను తాకుతూ ఉంటాడు. అసాధారణమైన కదలికల వలన ఇతని యొక్క దండలు మరియు దుస్తుల యొక్క చివరలు ముందుకు వెనుకకు ఊగుతూ ఉంటాయి.

శక్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవతల రాజైన ఇంద్రునికి మరొక పేరు.

శతక్రతుడు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ఇంద్రుడు, వంద అశ్వమేధ యాగములు చేసినవాడు.

శయనవిధి
ఇది ఆరు రకాలు. Chapter12.1

శరీరము
స్వరములు ఏడు. అవి రెండు భాగాలుగా ఉంటాయి. అవి, 1.శరీరం. అనగా మానవుల శరీరమ నుండి ఉత్పత్తి అయినవి. ఉదాహరణ గాత్ర సంగీతము.

శాంతదృష్టి
దీనియందు కనురెప్పలు సగం తెరవబడి, దృష్టి ముక్కు యొక్క చివరి భాగంలో ఉండాలి. కనులు ఆర్పకూడదు. శాంత రసములో దీనిని ఉపయోగిస్తారు.

శాంతము


శాఖ
శాఖ, అంకురము మరియు నృత్తము ఈ మూడు కూడా అభినయము యొక్క రూపాలు. శాఖ అనగా సంజ్ఞ లేదా అభినయము. అభినయము ద్వారా సూచనలను ఇవ్వడం అంకురము. కరణాలను, అంగహారాలను ఆధారంగా చేసుకోవడం నృత్తము.

శిఖపిండి
కార్తికేయునికి సంబంధించినది. ఇది నెమలి ఆకారములో ఉంటుంది.

శిఖరము
ముష్టి హస్తములోని అంగుష్టము పైకి ఎత్తబడితే శిఖరహస్తము ఏర్పడుతుంది. మన్మథుడు, ధనుస్సు, కౌగిలించుకోవటం, అభినయ మార్పు ఈ అర్ధాలను అబినయించటంలో ఈ హస్తము ప్రయుక్తమవుతుంది.

శిరము
ప్రధాన అంగములలో ఒకటి. ఇది ముఖజాభినయము కిందకి వస్తుంది. ఇది 13 రకాలు. 1.ఆకంపితము, 2.కంపితము, 3.ధూతము, 4.విధూతము, 5.పరివాహితము, 6.అధూతము, 7.అవధూతము, 8.అంచితము, 9.నిహంచితము, 10.పరావృత్తము, 11.ఉత్క్షిప్రము, 12.అధోగతము, 13.లోలితము. అభినయ దర్పణములో తొమ్మిది శిరోభేదాలు చెప్పబడ్డాయి.

శుకతుండము
అరాళ హస్తములోని అనామికను వంచితే శుకతుండ హస్తము ఏర్పడుతుంది. బాణ ప్రయోగము, ఈటె అని అర్ధము. తీక్ష్ణభావం అభినయించటంలో ఈ హస్తము ప్రయుక్తమవుతుంది.

శుక్లాన్నము
సం. నా. వా. అ. న. తత్స. శంకుస్థాపన రోజున తూర్పు దిక్కునకు సమర్పించుటకు వండబడిన తెల్లని అన్నము.

శుద్ధపూర్వరంగము
దీనియందు గీతకవిధి, ఉత్తాపనము, పరివర్తనము, చతుర్థకారుడి ప్రవేశము, అవకృష్టదృవము, నాంది, శుష్కావకృష్టదృవము, రంగద్వారము, చారీ, మహాచారీ మరియు త్రిగతము, ప్రరోచనములు ఉంటాయి. ఇవన్నీ కూడా బహిర్యవనికాంగములు.

శుష్కాపకృష్టము లేదా శుష్కావకృష్టము
ఒకవేళ అవకృష్టదృవము అర్ధములేని శబ్దాలతోను, అక్షరాలతోను కల్పించబడినట్లైతే దానిని శుష్కావకృష్టదృవము అంటారు. జర్జరమును పొగడటానికి అవకృష్టనాదములకు పితృగానములు ఆనందింపబడతాయి. జర్జరమును పొగిడినందుకు విఘ్నవినాయకులు ఆనందింపబడతారు.

శుష్కావకృష్టాధ్రువము
పూర్వరంగవిధిలో నాంది పూర్తయిన తర్వాత జర్జరమును పొగుడుతూ చెప్పే శ్లోకాలను శుష్కావకృష్టాధ్రువము అంటారు. దీనియందు ఎనిమిది మాత్రలు, తొమ్మిది గురువులు, ఆరు లఘువులు మరియు మూడు గురువులు ఉంటాయి.

శూద్రస్తంభము
సం. నా. వా. ? దీని ప్రతిష్ఠ సమయంలో ద్రవ్యములు అన్నియు నల్లని రంగులో అండాలి. స్తంభము యొక్క అడుగు భాగములో ఇనుము మరియు బంగారమును ఉంచాలి. స్తంభ ప్రతిష్ఠ ఈశాన్యములో జరగాలి. పనివాళ్ళకి విందు భోజనము పెట్టాలి. ఆర్యులు కాని వారి చిహ్నము నలుపు రంగు.

శూన్యదృష్టి
బయటి వస్తువులపై దృష్టి మళ్ళకుండా కనురెప్పలను, కనుపాపలను సమస్థితిలో ఉంచి చూపును స్థిరముగా ఉంచడం.

శృంఖలికము
ఇది ఒక గొలుసు వలె ఉండటం చేత దీనికి ఆ పేరు. దీనిని లయాంతర ఆసారితము కొరకు ఉపయోగిస్తారు.

శృంగవంతపర్వతము
ఏడు పర్వతములలో ఒకటి. పితృదేవతలు ఈ పర్వతమునందు సంచరిస్తూ ఉంటారు.

శృంగారగతి
ఆడదూత మార్గమును చూపిస్తుండగా ప్రియుడు సభావేదిక పైకి ప్రవేశించేటప్పుడు చేసే గతి. ఈ భాగమును అతడు సౌచాభినయములో చేయాలి. అతడు మంచి వస్త్రధారణ, పరిమళమైన సుగంధ ద్రవ్యాలను, ఆభరణాలను, సువాసనలను ఇచ్చు పువ్వులను ఉపయోగించాలి. నెమ్మది శృతితో సొగసైన అడుగులు వేస్తూ సౌష్టవమును అనుసరించాలి. చేతులు పాదములను అనుసరించాలి. ఇదంతా వికసించిన ప్రేమలో ఉండే నడవడిక. బైట పడని ప్రేమలో ఉన్న వ్యక్తి ఆడదూతల యొక్క ఉపదేశము ద్వారా నడవాలి. సాధారణమైన వస్త్రధారణతో నెమ్మదిగా నిశ్శబ్దమైన అడుగులు వేస్తూ నడవాలి. శరీరములో వణుకు, నడకలో తడబాటు ఉండాలి.

శృంగారము
?

శృంగారము
ఇది మూడు రకాలు. అవి, 1.వాగాత్మకము, 2.నేపథ్యాత్మకము, 3.క్రియాత్మకము.

శోకకరుణ
ఏదైనా కోల్పోవడం ద్వారా కరుణ కసం ఉత్పత్తి అయితే దానిని శోకకరుణము అంటారు.

శోధనము
సం. నా. వా. అ. న. తత్స. మంచి మట్టితో కూడిన భూమిని ఎన్నుకున్న తర్వాత దానిని దున్నటం ద్వారా బాహ్యశుద్ధి జరిపించాలి. ఆ తర్వాత ఎముకలను, కొయ్యమేకులను, కపాలములను, గడ్డిని, పొదలను తొలగించాలి. దీనినే భూమి శోధనము లేదా ఆభ్యంతరశుద్ధి అంటారు.

శ్యామము
శృంగార రసమునకు చెప్పబడిన వర్ణము (నీలవర్ణము).

శ్యామముఖరాగము
శ్యామము అనగా నలుపు, విచారమైన ముఖము. దీనిని భయానక, బీభత్స రసములలో ఉపయోగిస్తారు.

శ్రాంతదృష్టి
అలసట వలన కనురెప్పలు మందగించి కళ్ళు రెండు సన్నని మూలలతో ఉంటాయి. కనుపాపలు వాలి ఉంటాయి. దీనిని శ్రమ, స్వేదము నందు ఉపయోగిస్తారు.

శ్వేతపర్వతము
ఏడు పర్వతములలో ఒకటి. దైత్యులు, దానవులు నివసిస్తారు.

షణ్మకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అతిపెద్ద సైన్యానికి నాయకుడు. ఆరు ముఖముల కలవాడు.

షాడవము
వివిధ రకాల వస్తువులతో కలిసి కొత్త రుచిని తేవడం కోసం తయారు చేసే పిండి పదార్ధము. అనగా షాడవము అనునది వ్యజనము, ఓషధులు మరియు ద్రవ్యముల యొక్క కలయిక.

సంగ్రహము
తత్త్వము సమపాళ్ళలో ఉండటాన్ని సంగ్రహం అంటారు. సూత్రము, దాని భాష్యములు, వివిధ రకాల అంశములు చెప్పబడిన ఒక వివరణాత్మక ప్రబంధము. నాట్యవేదం ప్రకారం సంగ్రహము రసాలను, భావాలను, అభినయమును, ధార్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వరములు, అతోద్యము, గానము, రమంగము మొదలైనవాటిని కలిగి ఉండును.

సంఘాతకము
ఐదు కరణాల కలయిక.

సంఘోటనము
కాలమును సూచించటానికి చేతితో చేసే వివిధ భంగిమలు. దీనివలన గుహ్యకులు సంతుష్టి చెందుతారు.

సంచారీదృష్టి
ఈ దృష్టులు సంచారీ భావాల ఆధారంగా చెప్పబడ్డాయి. ఇవి 20 రకాలు. 1.శూన్యము, 2.మలినము, 3.శ్రాంతము, 4.లజ్జాన్వితము, 5.గ్లానము, 6.శంకితము, 7.విషన్నము, 8.ముకుళము, 9.కుంచితము, 10.అభితప్తము, 11.జిహ్మము, 12.లలితము, 13.వితర్కితము, 14.అర్ధముకుళము, 15.విభ్రాంతము, 16.విప్లుతము, 17.ఆకేకము, 18.వికోశము, 19.త్రాస్తము, 20.మదిరము.

సంజవనము
సం. నా. వా. అ. న. తత్స. నాలుగు గృహములు కలిసి ఏర్పడు ఒక చతురస్రము.

సందంశములు
పద్మకోశ హస్తమందలి వ్రేళ్ళను మరల మరల దగ్గరకు చేర్చి దూరం చేయడము. ఇది పొట్ట లేదా త్యాగం, బలిదానం, ఐదు అను సంఖ్య లేదా ఐదు అనటం అనే అర్ధములయందు వినియోగింపబడుతుంది.

సందష్టక అధరము
పళ్ళతో పెదవులను కొరుకుట. క్రోధములో దీనిని ఉపయోగిస్తారు.

సంధానము
బాణమును ధనుస్సుకు పెట్టడం.

సంప్రవేశము లేదా ప్రవేశతార
కనుపాపలను లోపలకి లాక్కొనుట. హాస్యము మరియు బీభత్స రసములలో దీనిని ఉపయోగిస్తారు.

సంఫేటము
సం. నా. వా. అ. న. తత్స. నాయకుల, ప్రతినాయకుల మధ్య మాటల యుద్ధం. ఆరభటి వృత్తియందు ఇది ఒకటి.

సంభవితము
దీనిని చిత్రపూర్వరంగములో వార్తిక మార్గములో ఉపయోగిస్తారు.

సంభోగశృంగారము
సంయోగములోని ప్రేమ. ?

సంభ్రాంతము
(అంగహారము) మొదట విక్షిప్త కరణమును చేసి ఎడమ చేతిని సూచీహస్తములో ఉంచి పైకి విసరాలి. కుడిచేయి ఛాతిపైన ఉండాలి. ఆ తర్వాత త్రికము, నూపురకరణము, ఆక్షిప్తము, అర్ధస్వస్తికము, నితంబమము, కరిహస్తము, ఉరోమండలము మరియు కఠిఛిన్న కరణములు చేయాలి.

సంభ్రాంతము
(కరణము) ఆవర్తితములో ఉన్న చేతిని తొడకు వెనుక భాగములో ఉంచి తొడను అవిద్ధములో ఉంచాలి. సంభ్రాంతమును నిరూపించుటకు దీనిని ఉపయోగిస్తారు.

సంవృత్తతార
కనుపాపలను పైకెత్తుట. వీర, రౌద్ర రసములలో ఉపయోగిస్తారు.

సంశ్రితవ్రతులు
సం. నా. వా. అ. పుం. తత్స. అభ్యాస దక్షులు. అభ్యాసము ద్వారా నైపుణ్యమును సంపాదించినవారు.

సదాచారము
సం. నా. వా. అ. పుం. తత్స. సాంప్రదాయాలు, ఆచార వ్యవహారములు, ధర్మములు. నాట్యశాస్త్రములో శృతి, స్మృతి, సదాచారములను ఆహ్లాదకరంగా చూపించారు.

సన్నతము
(కరణము) ముందుకు గెంతి రెండు పాదములను స్వస్తికలో ఉంచి చేతులు దోలహస్తములో ఉంచి వంగాలి. ఆ తర్వాత గెంతేటప్పుడు హరిణప్లుతాచారీ శ్రేయస్కరము. నీచులను, ఉపసర్పణులను పొగుడుటకు ఉపయోగిస్తారు.

సన్నివేశము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆకారము. ఖగోళ వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ వాస్తుశాస్త్రం ప్రకారం ప్రేక్షగృహం కోసం మూడూ రకాల సన్నివేశాలను తయారుచేసారు.

సన్నిహితము
సన్నిహిత దూరము మరియు మధ్యమ దూరము రెండూ కూడా దూరమును సూచించే సూత్రంలాగనే సూచిస్తారు.

సప్తద్వీపములు
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మ నాట్యశాస్త్రము నందు ప్రపంచాన్ని అనుకరించడం కోసం ఏడు విభాగాలను సృష్టించాడు. వీటినే సప్తద్వీపములు అంటారు. అవి 1)జంబు, 2)ప్లక్ష, 3)శాల్మలి, 4)కుశ, 5)క్రౌంచ, 6)శాక, 7)పుష్కర ద్వీపములు. జంబు ద్వీపమును మరలా తొమ్మిది భాగములుగా విభజించారు. వాటిలో భరత ఖండము ఒకటి.

సమగండము
బుగ్గలు సహజస్థితిలో ఉండటం. అవశిష్ట పరిస్థితులలో దీనిని ఉపయోగిస్తారు.

సమగ్రీవము
మెడను సహజ భంగిమలో ఉంచడం. ధ్యానంలోను, సహజస్థితిలోను, మంత్రమును జపించేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

సమచిబుకము
పెదవులు సహజ స్థితిలో ఉండి, కంచెం వేరుగా ఉండటం. సహజావస్థను ప్రదర్శించేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

సమదృష్టి
సమము అనగా స్థితి. సౌమ్యమైన చూపు. కనుపాపలు రెండు సరైన స్థితిలో విశ్రాంతిలో ఉండటం.

సమనఖము
(కరణము) రెండు పాదముల యొక్క గోర్లు ఒకదానితో ఒకటి తాకబడి చేతులు రెండు సహజావస్థలో ఉండాలి. సభావేదిక పైకి నటుడు ప్రవేశించే సమయంలో దీనిని ఉపయోగిస్తారు.

సమపాదచారీ
పాదములను రెండిటినీ సమతలములో ఉంచి నిలబడటం.

సమపాదము
పాదమును సమతలములో ఉంచడము.

సమపాదస్థానము
అవయవములు సైష్టవములో ఉండి పాదములు రెండిచికీ మధ్య ఒక తాళము దూరముతో సమస్థితిలో ఉంచడం. దీని ఆస్థాన దేవత బ్రహ్మ.

సమపుటము
సమము అనగా స్థితి. కనురెప్పలను సహజ స్థితిలో ఉంచడం. శృంగారములో దీనిని ఉపయోగిస్తారు.

సమము
సం. నా. వా. ? సభావేదిక కొలతలు తీసుకునే సమయంలో భూమిని ఎన్నుకునే సమయంలో అర్థపతి తగు జాగ్రత్త తీసుకోవాలి. భూమి సమంగా ఉండాలి.

సమవకారము
దశరూపకాలలో ఒకటి.

సమవక్షము
అన్ని అవయవాలు చతురస్రములో మరియు దానితో పాటు సౌష్టవంగా ఉండటము.

సమశయనము
తలను పైవైపుగా చేతులను వదులుగా ఉంచి నిద్ర చేయడం. నిద్రలో ఆనందాన్ని ఆస్వాదించేటప్పుడు దానిని ఉపయోగిస్తారు.

సముద్గ అధరము
పెదవులను సహజ స్థానంలో ఉంచి కదపడము. జాలి చూపించేటపుడు, కొనియాడేటపుడు దీనిని ఉపయోగిస్తారు.

సముద్రము
సం. నా. వా. అ. పుం. తత్స. సాగరము.

సమోత్సారితమత్తల్లి
అగర్తల సంచారములోని పాదములతో వృత్తాకార కదలికలతో వెనుకకు వెళ్ళడం.

సర్పపిండి
పాములకు సంబంధించినది.

సర్పశిరము
పతాకహస్తము వ్రేళ్ళ చివరలు లోనికి వంగితే లేదా పతాకహస్తం అరచేయి పల్లంగా అయితే అది సర్పశీర్ష హస్తమవుతుంది. దీనిని గంధము, పాము, నీళ్ళు చిలకరించటము మొదలైన అర్ధాలను ప్రదర్శించటంలో ఈ హస్తము ఉపయోగింపబడుతుంది.

సర్పి
సం. నా. వా. ఇ. పుం. తత్స. నెయ్యి.

సర్పితము
రెండు పాదములను అంచికము నుంచి కదిపి తలను పరివాహితము నుంచి చేతులను రేచిత హస్తములో ఉంచాలి. ఒకవైపు చేసిన తర్వాత రెండవ వైపు కూడా చేయాలి.

సర్వాతీథ్యేయము
సం. నా. వా. అ. పుం. తత్స. చేతితో వాయించే అన్ని రకముల సంగీత వాయిద్యములు.

సర్షపము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆవాలు.

సల్యకము
ఒక రాజ్యము యొక్క పేరు.

సహజభ్రూ
కనుబొమ్మలు యథాస్థానంలో ఉండటం. అనీవిద్ధ స్థితిని నిరూపించడానికి దీనిని ఉపయోగిస్తారు.

సహ్యము
దక్షిణాపథములోని రాజ్యము యొక్క పేరు.

సాచీకృతదర్శనము
కనుపాపలు కనురెప్పల చేత కప్పబడటం.

సాత్వతన్యాయము
ఆయుధము మరియు కవచము యొక్క కదలిక భరత న్యాయములో లాగనే ఉండాలి. కాని, అస్త్ర సంధానముం నటుడికి వెనుకాల జరగాలి.

సామము
సం. నా. వా. అ. పుం. తత్స. మర్యాద పూర్వకంగా మాట్లాడుట, ఇష్టంగా మాట్లాడుట, స్నేహభావంతో మాట్లాడుట. ఎవరైనా ఒక వ్యక్తిని ఒప్పించి, ఒక సమస్యను పరిష్కరించడానికి నాలుగు ఉపాయములలో (సామ, దాన, భేద, దండ) మొదటిది ఉపయోగిస్తారు. నాట్యశాస్త్రమునందు దైత్యులను సముదాయించటానికి ముందుగా సామమును, అది విఫలమైనచో మిగిలిన మూడు ఉపాయములను ఉపయోగించమని బ్రహ్మ చెప్పెను.

సామవేదము
సం. నా. వా. అ. పుం. తత్స. నాలుగు వేదములలో ఒకటి. సంగీతమునకు పుట్టినిల్లు. నాట్యశాస్త్రంలో సంగీతమును బ్రహ్మ ఈ వేదము నుంచే స్వీకరించాడు.

సింధు
ఒక రాజ్యము యొక్క పేరు.

సింహకర్షితము
(కరణము) ఒక పాదమును వెనుకకు చాచి చేతులను నికుంచితములో తెచ్చి ముందుకు తిరిగి మరలా వంగడము. దీనిని సింహము మొదలైనవాటి అభినయములో ఉపయోగిస్తారు.

సింహవాహినిపిండీ
ఛండికకు సంబంధించినది.

సింహవిక్రీడితము
(కరణము) ఒక పాదమును హలాతకములో ముందుకు ఉంచి మరొక పాదమును చేతులతో పాటుగా త్వరితముగా కదిలించాలి. రుద్రగతి నిరూపణకు దీనిని ఉపయోగిస్తారు.

సింహాదిగతి
విష్ణువు, నరసింహుని అవతారంగా చెప్పబడిన సింహము, ఎలుగుబంటి, కోతులు మొదలైనవాటి యొక్క గతి ఈ విధముగా ఉంటుంది. ఆలీఢ స్థానములో నించొని, అవయవాలు దానిని నిశ్చితము చేసుకొని ఒక చేతిని మోకాలిపైన, మరొక చేతిని ఛాతి పైన, గడ్డమును భుజముపైన ఉంచి 5 తాళముల దూరములో పాదములను ఎత్తి నడవాలి.

సితము
హాస్యమునకు చెప్పబడిన వర్ణము (తెలుపు).

సిద్ధార్థకములు
సం. నా. వా. ? తెల్లని ఆవాలు.

సిద్ధి
ఇది రెండు రకాలు. అవి, 1.దైవికీసిద్ధి, 2.మానుషీసిద్ధి.

సిద్ధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సఫలము.

సుకుమార నృత్తము
నాయకీనాయకుల ప్రేమలో ఉత్పత్తి అయ్యే శృంగార రసాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడే నృత్యము.

సుకుమారప్రయోగము
ఇది చాలా సున్నితమైనది. నాటకము, ప్రకరణము, భాణము, వృత్తి, అంకము దీనికి చెందినవి. ఇది ప్రధానముగా మానవ అవతారము మీద ఉంటుంది.

సుధాకర్మము
సం. నా. వా. న్. పుం. తత్స. సున్నము వేయుట.

సుపీఠధరణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పైకప్పుకు ఉపయోగపడు వృక్షము. పీఠము అనగా వేదిక.

సుమనసులు
దేవతలు.

సుమనుసులు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవతలు.

సురులు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవతలు, స్వర్గము నందు నివసించువారు.

సూచీ
(కరణము) కుంచిత పాదమును పైకెత్తి చేతులను కదుపుతూ మరలా భూమిపై పెట్టాలి.

సూచీచారీ
కుంచిత పాదమును పైకెత్తి, మోకాలును కూడా పైకి తీసుకువచ్చి తర్వాత దాని ముందరి భాగము నేలము తాకడం.

సూచీముఖము
(నృత్తహస్తము) ?

సూచీముఖము
కటకా హస్తమందలి తర్జనిని పైకి ప్రసారితమైతే అదే సూచీముఖము. ఒకటి, పరబ్రహ్మ, నూరు, సూర్యుడు. ఏది అనటం, రథచక్రం యొక్క అంచు లేక బండి చక్రం మొదలైన అర్ధాలను సూచిస్తుంది.

సూచీవిద్ధము
(అంగహారము) అలపద్మము, సూచీముఖ భంగిమలు ఒకదాని తర్వాత ఒకటి ప్రదర్శింపబడిన తర్వాత విక్షిప్తము, ఆవర్తితము, నికుత్తకము, ఊరుద్వృత్తము, ఆక్షిప్తము, ఉరోమండలము, కరిహస్తము మరియు కఠిఛిన్న కరణములు ప్రదర్శింపబడాలి.

సూచీవిద్ధము
(కరణము) ఒక పాదమును సూచీచారీలో ఉంచి మరొక పాదము యొక్క మడమను తాకుతూ ఒక చేతిని ఛాతిపై ఉంచి మరొక చేతిని నడుముపై ఉంచడం. చింతకు సంబంధించిన విషయాలను ప్రదర్శించేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

సూత్రధారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నాందీ పాతకుడు, సూత్రధారుడు అనునవి పర్యాయపదాలు. సూత్రధారుడు అనగా దర్శకుడు. ఇతడు విదూషకుడు మరియు పారిపార్శ్వకునితో కలిసి నాటక పరిచయం చేసే సభావేదికా నిర్వాహకుడు.

సూత్రభృత్ లేదా సూత్రధారుడు
సూత్రభృత్ లేదా సూత్రధారుడు అనునవి పర్యాయపదాలు.

సూత్రము
లక్షణము. సంగ్రహములో భాష్యముతో పాటు వచ్చినవి.

సూత్రము
సం. నా. వా. ? బంధనము, కొలతలు తీసుకొనుటకు తెల్లని సూత్రమును ఉపయోగిస్తారు. ఇది నూలుతో కాని, గడ్డితో కాని ఉంటుంది. ఈ సూత్రం తెగకూడదు. ఒకవేళ రెండుగా తెగితే రక్షకుడు మరణిస్తాడు. మూడుగా తెగితే రాజగృహము నందు ఇబ్బందులు వస్తాయి. నాలుగుగా తెగితే అర్థపతి మరణిస్తాడు. ఈ సూత్రం చేయిజారినచో ఖచ్చితంగా ఏదో ఒక నష్టం జరుగుతుంది. కావున ఈ సూత్రమును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

సూర్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సూర్యభగవానుడు.

సోచ్ఛ్వాసనాసికము
సోచ్ఛ్వాసనాసికము అనగా గాలిని తీసుకోవడం. శ్వాస తీసుకునేటపుడు, పరిమళమైన వాసనను చూసేటపుడు ఉపయోగిస్తారు.

సౌమ్యము
సం. నా. వా. అ. న. తత్స. మృగశిర నక్షత్రం యొక్క మరొక పేరు.

సౌరసేన
పాంచాల రాజ్యము యొక్క పేరు.

సౌరాష్ట్రము
ఒక రాజ్యము యొక్క పేరు.

సౌవనులనారీగతి
కోపముగా ఉన్న స్త్రీల యొక్క గతి ఈ విధముగా ఉంటుంది. అవహిత్థస్థానములో నించొని ఎడమ చేతిని కిందికి సూచిస్తూ, కుడి చేతిని కటకాముఖములో నాభి పైన ఉంచి కుడి పాదమును సొగసుగా ఔక తాళము పైకెత్తి ఎడమ పాదము వద్ద ఉంచి వెంటనే కుడి పక్కన కొద్దిగా ఉంచి, ఎడమ చేతిని లతాహస్తములో నాభిపై ఉంచి, కుడిచేతిని నడుముపై ఉంచి, ఎడమ చేతితో ఉద్వేష్టితమును ప్రదర్శించి, ఎడమ పాదమును ముందరకు తీసుకురావడం.

సౌవీరము
ఒక రాజ్యము యొక్క పేరు.

సౌష్టవము
?

సౌష్ఠవము
నాట్యం చేసేవారి శరీరము సమస్థితిలో ఉండి నడుమును, చెవులను, మోకాళ్ళను, భుజాలను మరియు తొడలను ఒకే రేఖలో ఉంచాలి. ఛాతి తగిన విధంగా ఎత్తబడాలి. దీనినే సౌష్ఠవము అంటారు. నటులు వారి నృత్యానికి అందాన్నిచ్చే సౌష్ఠవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

స్ఖలితము
(కరణము) పాదమును దోలాపాదాచారీలో ఉంచి రేచితహస్తములో ఉంచి అటు, ఇటు తిరగుట.

స్తంభద్వారము
సం. నా. వా. అ. న. తత్స. స్తంభము యొక్క ద్వారబంధములు.

స్తంభితోరువు
స్తంభిత లేదా స్తంభన అనేవి ఏవైనా కదలికలను ఆపుచేయటం.

స్త్రీపదము
పూర్వరంగములో పరివర్తనకు చివరిలో సూత్రధారుడు దేవతలందరికీ తలవంచి నమస్కరిస్తూ మూడు అడుగులు ముందరికి వెళ్తాడు. అందులో ఒకటి స్త్రీపదము. దీనియందు ఎడమకాలిని పైకెత్తుతారు.

స్త్రీలస్థానములు
స్త్రీల స్థితులు. ఇవి 3 రకాలు. 1.ఆయతము, 2.అవహిత్థము, 3.అశ్వక్రాంతము.

స్థానకప్రయోగనియమము
కదలిక ప్రారంభమయ్యే వరకు స్థానములు సంరక్షింపబడాలి. ఎందుకనగా ఒక నృత్యము చేసేటప్పుడు, చారీ ప్రారంభమయ్యేటప్పుడు స్థానం చివరలో ఉంటుంది. ఈ నియమాన్ని స్త్రీ, పురుషులిరువురూ పాటించాలి.

స్థానములు
A.స్థానములు అనగా ఒక స్థిరమైన భంగిమ. కదలికల ప్రారంభ, అంతములలో ఒక భంగిమ ఉంటుంది. ఒకరు ఒక భంగిమ నుంచి కదలికను ప్రారంభించి తర్వాత దానిని ఆపేస్తారు. శరీరములో కదలికలు లేని భంగిమను స్థానము అంటారు. ఇవి 3 రకములు. 1.స్థానకము, 2.ఉపవిష్టస్థానకము, 3.సుప్త లేదా శయన స్థానకము. ఇది మరల రెండు విధములు. 1.పురుషస్థానము, 2.స్త్రీస్థానము. వీటిని మృగస్థానములు అని కూడా అంటారు. B.అన్నికరముల బాణములను వదిలేటప్పుడు ఉపయోగించే స్థానములు ఆరు రకములు. Chapter10.3 . వీటిలో మొదటి నాలుగు నృత్తము మరియు నాట్యములో చూడవచ్చు. మిగతా రెండు నాట్యములో అనుభవజ్ఞుల చేత ఉపయోగించబడతాయి.

స్థానీయగతి
పెద్దవారైన స్త్రీల యొక్క గతి. అవహిత్థములో నిలబడి, ఎడమ చేతిని నడుముపై ఉంచి, కుడిచేతిని అరాళములో తిప్పకుండా ఛాతికి, నాభికి మధ్య భాగములో ఉంచాలి. వీరి గతి విశ్రాంతితో ఉన్న శరీరముతో కాని, స్థిరమైన శరీరముతో కాని, ఎక్కువగా కదలకుండా ఉంటుంది.

స్థాపనము
సం. నా. వా. అ. న. తత్స. శంకుస్థాపన కార్యక్రమము.

స్థాయీభావదృష్టి
ఇవి ఎనిమిది రకాలు. అవి, 1.స్నిగ్ధము, 2.హృష్టము, 3.దీనము, 4.క్రుద్ధము, 5.దృప్తము, 6.భయాన్వితము, 7.జుగుప్సితము, 8.విస్మితము.

స్థాయీవర్ణములు
అలంకారములు, వర్ణములపై ఆధారపడి ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. 1.ఆరోహివర్ణము-దీనియందు స్వరములు పైకి వెళ్ళును. ఉదా-స రి గ మ ప, 2.అవరోహివర్ణము-దీనియందు స్వరములు పైనుండి కిందకి వచ్చును. ఉదా-ని ద ప మ గ, 3. స్థాయీవర్ణము-దీనియందు స్వరములు ఒకేరకమైన శృతిని కలిగి ఉంటాయి. ఉదా-స స స స రి రి రి రి, 4.సంచారీవర్ణము-దీనియందు రకరకాల స్వరాలు కలిసి వస్తాయి. ఉదా-రి గ మ మ గ రి, స రి గ గ రి స. ఈ నాలుగు వర్ణాలు కలిసి మంద్ర. మద్య, తార స్థాయిలతో భౌతిక స్వరము నుండి వస్తాయి. ఒక పాదములో రెండు లేదా మూడు వర్ణాలు చేరినప్పుడు రసము ఉత్పత్తి అవుతుంది. అన్ని పాటలకు నాలుగు వర్ణాలు వర్తిస్తాయి.

స్థితలయము
మూడు లయలలో ఒకటి. ఇది విళంబలయ. అనగా నెమ్మది.

స్థితావర్తచారీ
పాదమును నేలపై రుద్దుతూ లోపలికి కదుపుతూ మరొక పాదమును పక్కకి విసరడం.

స్థిరము
సం. నా. వా. ? నాట్యమండపమునకు ఎంచుకునే భూమి ఎప్పుడూ స్థిరముగా ఉండాలి.

స్థిరహస్తము
(అంగహారము) చేతులను రెండిటిని చాచి పాదములను సంపాదములో పైకెత్తి ఎడమ చేతిని భుజములపైకెత్తి తర్వాత ప్రత్యాలీఢ స్థానమును వెంటనే నికుట్టకము, ఊరుద్వృత్తము, ఆక్షిప్తము, స్వస్తికము, నితంబము, కరిహస్తము, కటిఛిన్న కరణములను చేయాలి. అన్ని కరణాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రదర్శింపబడాలి. ఈ అంగహారము శివునికి ఎంతో ప్రీతికరమైనది.

స్థూలులగతి
లావైన వారి గతి. ఈ గతి యందు పాదములు నెమ్మదిగా పైకి లేపబడి, శరీరమును అత్యధికమైన శ్రమతో కదుపుతూ, అమితముగా శ్వాస తీసుకుంటూ, ఆయాసము వల్ల చెమటను కారుస్తూ, చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటుంది.

స్థోబక్రియ
అర్ధములేని వర్ణాలను, పదాలను సంగీతంలో చెప్పడం. దీనినే శుష్కాక్షర గానం అని కూడా అంటారు.

స్నిగ్ధదృష్టి
ప్రేమ మరియు మాధుర్యముతో కళ్ళు వికసించబడి కనుపాపలు స్థిరముగా ఉండి, ఆనంద భాష్పాలు వస్తే స్నిగ్ధదృష్టి అంటారు. రతియందు దీనిని ఉపయోగిస్తారు.

స్ఫటికము
సం. నా. వా. అ. న. తత్స. రంగశీర్షమునకు కింద పడమర భాగమున స్ఫటికమును ఉంచుతారు.

స్ఫురితపుటము
కనురెప్పలు కొట్టుకోవడం. ఈర్ష్య యందు ఉపయోగిస్తారు.

స్ఫోటనము
సం. నా. వా. అ. న. తత్స. చింపుట, వేళ్ళను విరుచుట.

స్మితము
సౌమ్యమైన నవ్వు. బుగ్గలను చిన్నగా వికసించి ముఖములో సొగసైన దృష్టితో దంతాలు కనబడకుండా నవ్వడం. ఇది ఉత్తమ ప్రకృతికి సంబంధించినది.

స్మృతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. జ్ఞాపకము, స్మరణము, నెమరువేయుట.

స్యందితచారీ
ఒక పాదమును మరొక పాదమునుంచి వేరుగా 5 తాళముల ముందరికి తీసుకువెళ్ళడం.

స్వభావజభయము
రెండు రకాల భయాలలో ఒకటి. అవయవాలు, కళ్ళు, నోరు వదులుగా అవ్వడం. నిశ్చేష్టులైన చూపులు, ఎండిన నోరు, గుండె వేగంగా కొట్టుకోవడం, రోమాలు నిక్కబొడుచుకోవడం మొదలైనవన్నీ స్వాభావజ భయము యొక్క లక్షణములు.

స్వరములు
నాట్యములో ఏడు రకాల స్వరములను ఉపయోగిస్తారు. అవి, 1.షడ్జము, 2.రిషభము, 3.గాంధారము, 4.మద్యమము, 5.పంచమము, 6.దైవతము, 7.నిషాదము. ఈ స్వరాలు రెండు విభాగాలుగా విభజింపబడ్డాయి. 1.శారీరజ స్వరములు (గాత్ర సంగాతమునకు సంబంధించినవి), 2.వైణవ స్వరములు (తీగవాద్యములు, వాణకు సంబంధించినవి).

స్వస్తిక
(బహుసంచారము) రెండు చేతులు ఒకదానిపైన ఒకటి ఉండటం.

స్వస్తికము
రెండు పతాక హస్తాలు మణికట్టు వద్ద అడ్డంగా కలిస్తే అది స్వస్తిక హస్తమవుతుంది. మొసలి, భయంతో మాట్లాడటం, పొగడటం మొదలైన అర్ధాలకు ఈ హస్తము తగినది. (next same నృత్తహస్తము). ?

స్వస్తికము
(కరణము) చేతులు మరియు పాదములను స్వస్తిక భంగిమలో ఉంచడం.

స్వస్తికరేచితము
(అంగహారము) రేచితములో ఉన్న చేతులు మరియు పాదములతో వశ్చిక కరణమును తర్వాత ఎడమ చేతితో నికుట్టితమును తర్వాత లతాహస్తమును చివరగా కఠిఛిన్న కరణములు చేయాలి.

స్వస్తికరేచితము
(కరణము) మొదట రెండు చేతులను రేచిత మరియు ఆవిద్ధములో ఉంచి తర్వాత వేరు చేయాలి. తర్వాత పక్షప్రద్యోతహస్తము మరియు పక్షవంచిత హస్తములను నడుముపై ఉంచాలి. ఇది ప్రధానముగా నృత్తము ఎక్కడైతే ఉపయోగింపబడుతుందో అక్కడ ఉపయోగిస్తారు.

స్వాభావికనాసిక
అవయవాలను సహజ స్థితిలో ఉంచడం. అవశిష్టావస్థలలో దీనిని ఉపయోగిస్తారు.

స్వాభావిత ముఖరాగము
స్వాభావిత ముఖరాగము అనగా సహజ వదనము. మధ్యస్థ భావాలలో దీనిని ఉపయోగిస్తారు.

స్వామినుడు
సం. నా. వా. న్. పుం. తత్స. నిర్మాత, అర్థపతి.

స్వాహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. అగ్నిదేవుని భార్య, స్వాహాదేవి.

హంసపక్షము
(అసంయుతహస్తము) సర్పశీర్ష హస్తమందలి చిటికెనవేలు బాగుగా ప్రసారితమైతే అది హంస పక్ష హస్తమౌతుంది. ?

హంసాస్యము
(అసంయుతహస్తము) నడిమివేలు మొదలుకొని మూడు వ్రేళ్ళు ఎడంగా చాచినవి కాగా చూపుడువ్రేలు, బొటనవ్రేలు కలిస్తే అది హంసాస్య హస్తమవుతుంది. ఆశీస్సు, ఉత్సవం, మంగళసూత్రం కట్టుట, గగుర్పాటు, వ్రాయటం, జలబిందువు ఈ అర్ధాలలో ఈ హస్తం తగినది.

హరిణప్లుతము
?

హరితప్లుతచారీ
ఒక పాదముతో అతిక్రాంతచారీ ప్రదర్శించి పైకి గెంతి పాదమును భూమిపై నుంచి మరొక కాలిని వంచి వెనక్కి విసరడం.

హరివర్షము
సప్తవర్షములలో ఒకటి.

హలపిండి
నాగలి, బలరాముని ఆయుధము.

హసితము
మందహాసము (నవ్వు) ముఖము, కళ్ళు వికసించి, బుగ్గలు ప్రకాశవంతంగా, దంతైలు కొద్దిగా కన్పించాలి. ఇది ఉత్తమ ప్రకృతికి సంబంధించినది.

హస్తపాదసమయోగము
కరణము.

హస్తము
సం. నా. వా. అ. పుం. తత్స. మూడు రకముల మండపముల యొక్క పరిమాణములు హస్తము మరియు దండములలో చెప్పబడతాయి. జ్యేష్ఠ మండపము 108, మధ్యమ మండపము 64 మరియు అవర మండపము 32 హస్తము మరియు దండముల పరిమాణము కలిగి ఉంటుంది. 24 అంగుళాలు కలిసి ఒక మూర. నాలుగు మూరలు కలిసి ఒక దండము.

హస్తరేచకము
చేతులను పైకెత్తి పరిక్షేప, విక్షేప, పరివర్తన, విసర్పణ చేయడం.

హస్తాభినయము
హస్తముల చేత చేయబడు అభినయము. ఇది మూడు రకములు. 1.అసంయుతహస్తములు, 2.సంయుతహస్తములు, 3.నృత్తహస్తములు.

హస్తినాపురము
ఒక రాజ్యము పేరు.

హాస్యదృష్టి
ఆనందముతో చేసేది. కనుపాపలు కొద్దిగా కనబడుతూ కదలడం, కొద్దిగా వంచి చూడడం అన్నీకూడా హాస్యదృష్టులు. దీనిని హాసమునందు ఉపయోగిస్తారు.

హాస్యము
?

హాస్యము
ఇది మూడు రకాలుగా అభినయింపబడుతుంది. 1.అంగహాస్యము, 2.నేపథ్యహాస్యము, 3.వాక్యహాస్యము.

హిమవంతము
సం. నా. వా. అ. న. తత్స. భరతుడు తన శిష్యులతో కలిసి అమృతమథనమును, సమవతారమును, త్రిపురదాహము ప్రదర్శించిన పర్వతము.

హేతువు
కారణము.

హేతువు
కారణము.

హేమకూటము
సప్త పర్వతములలో ఒకటి. దీనియందు గాధర్వులు, అప్సరసలు నివసిస్తారు.

హైమవతము
సప్తపర్వతములలో ఒకటి. ఈ పర్వతము నందు కుబేరుని అనుచరులు, రాక్షసులు, భూతములు, పిశాచములు నివసిస్తాయి. వీరు ఇక్కడ నివసిస్తున్న కారణంగా దీనిని హైమవతము అని కూడా అంటారు.

హైవము
సప్తవర్షములలో ఒకటి.

హోమము
సం. నా. వా. అ. పుం. తత్స. నాట్యమండప దేవతలకు హవిస్సును సమర్పించుట.