హల్లులు : ట

టంకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. టమితి శబ్దం కారయతీతి టంకః. టం అను శబ్దమును చేయునది, కాసెయులి(ఉలి), కత్తి, కత్తి ఒఱ, గడ్డపార, కోపము, వెలిగారము, నల్లవెలగ, రాళ్లు పగలగొట్టునది, ఒకమానము, గర్వము.
టిట్టిభకము
సం. నా. వా. అ. పుం. తత్స. టిట్టీతి శబ్దేన భాతీతి టిట్టిభకః. టిట్టి అను శబ్దము చేత ఒప్పునది, లకుముకిపిట్ట, తీతువు పిట్ట.
టీక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. అర్థ వివరణము.