హల్లులు : డ
డమరము
సం. నా. వా. అ. పుం. తత్స. దామ్యతి జనోనేనేతి డమరః. దీనిచేత జనులు అణుగుదురు, దేశోపద్రవము, హావడి. డేన భయేన మరో మృతిరివ యత్ర సః మరః. అస్త్ర కలహము, విప్లవము, బము, మరము, ఒక వాద్యము.
డమరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. డమేతి శబ్దం రౌతీతి డమరుః. డమ అనెడి శబ్దము పలుకునది, డమరుగము, చమత్కారము, ఒక వాద్యము.
డయనము
సం. నా. వా. అ. న. తత్స. డయతే డయనం. ఆకాశమందు పోవునది, బాలకాదుల క్రీడాశకటము, పక్షిగతి. యతే ఆకాశమార్గే గమ్యతే అనేన ఇతి డయనం. ఎగురుట.
డహువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. దహతి తోహతివా డహుః. కాల్చునది, పీడించునది, గజనిమ్మ చెట్టు.
డిండిమము
సం. నా. వా. అ. పుం. తత్స. డిండీతి శబ్దం మినోతి ప్రక్షిపతీతి డిండిమః. డిండి అను శబ్దము చేయునది, రాయడిగిడిగిడియను వాద్య విశేషము, ఒక వాద్యవిశేషము.
డిండీరము
సం. నా. వా. అ. పుం. తత్స. డిండి శబ్ద మీరయతీతి డిండీరః. డిండి అను శబ్దమును పుట్టించునది, ఫేనము, నురుగు.
డింబము
సం. నా. వా. అ. పుం. తత్స. డీయతే జనోనేతి డింబః. దీని చేత మనుజుడు తొలగిపోవును, దేశోపద్రవము, భయము, పక్షిగ్రుడ్డు, రొమ్మునందు ఎడమ ప్రక్కనుండెడు మాంసగోళము, కడుపున ఎడమ ప్రక్కనుండెడు మలాశయము, గుడ్డు, అపశకునము, ప్లీహము.
డింభుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. డయతే డింభః. కాలక్రమమున ఎగయునది, వెలికిల తిరిగి పడుకొన్నవాడు, బిడ్డ. డయతే డింభః. ఎగురువాడు, మూర్ఖుడు, శివుడు, శిశువు.
డుండుకము
సం. నా. వా. అ. పుం. తత్స. డుండు ఇతి శబ్దం కాయతీతి డుండుకః. డుండు అను శబ్దము పలుకునది, దుండిగపు చెట్టు, అల్పుడు, క్రూరుడు, దుర్మార్గుడు.
డుండుభము
సం. నా. వా. అ. పుం. తత్స. డుండతీతి డుండుభః. అణగి ఉండునది, ఇరుదలపాము. డుండుః సన్ భాతీతి డుండుభః. డుండుపాము.
డోల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. డోల్యతే వాతేన డోలా. వాయువుచేత కొట్టబడునది, నీలిచెట్టు. డుల్యతే ఉతిక్షప్యతే డోలా. ఊచబడునది, డోలి, ఉయ్యాల, తొట్ల.