హల్లులు : ఢ

ఢక్క
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఢగితి అవ్యక్తం కాయతీతి ఢక్కా. ఢక్ అనెడి శబ్దమును పలుకునది, యశః పటహము, ఢంకా.
ఢులి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. ఢులతీతి ఢులిః. జలమును చల్లునది, ఆడ తాబేలు, కమఠి.