హల్లులు : త

తండకము
సం. నా. వా. అ. పుం. తత్స. మిద్దెటింటికి అడ్డముగా వేసెడు దంతె, వృత్త విశేషము.
తండులము
సం. నా. వా. అ. పుం. తత్స. తండులాస్సంత్యన్యేతి తండులః. విత్తులు కలది, బియ్యము,వాయువిడంగము, (వృక్ష విశేషము).
తండులీయము
సం. నా. వా. అ. పుం. తత్స. రోగా తాడయతీతివా తండులీయః రోగములను పోగొట్టునది, ధాన్యము, చిఱ్ఱికూర, ఒక ఆకుకూర.
తండువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. తన్యతే విస్తీర్యత ఇతి తండూః. విస్తృతమై ఉండునది, త్రెడ్డుకొయ్య. సం. నా. వా. ఉ. పుం. తత్స. నందికేశ్వరుడు.
తంతుభము
సం. నా. వా. అ. పుం. తత్స. తుదతి వ్యధయతి తంతుభః. వ్యధ పెట్టునది, సర్షపము, ఆవాలు.
తంతువాయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తంతూన్వయతి తంతువాయః. నూలును నేయునది, సాలెపురుగు. తంతూన్ వయతీతి తంతువాయః. నూలును నేయువాడు, సాలెవాడు. తంతూన్ వయతి విస్తారయతి జాలాకారేణ ఇతి తంతువాయః. ఒక సంకరజాతి.
తంతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. తన్యతే వస్త్రమేభిరితి తంతవః. వీని చేత వస్త్రము విస్తరింపబడును, నూలిపోగు, తంతు నాగము, యాగాంగములు, దారము, ఒకపాము.
తంత్రకము
సం. విణ. (అ.ఈ.అ.). తత్స. తంత్రాత్ తంతువాయశకాలాకాదేరచిరా దపహృతం తంత్రకం. అప్పుడే తేబడినది, క్రొత్తది (వస్త్రము), క్రొత్త బట్ట.
తంత్రము
సం. నా. వా. అ. న. తత్స. తన్యత ఇతి తంత్రం. విస్తరింపబడునది, ఉభయార్ధసాధకమైన ఉపాయము, స్వరాష్ట్ర చింత, వ్యాకరణ శాస్త్రము, కుటుంబ వ్యాపారము, ఉత్తమమైన ఔషధము, సిద్ధాంతము, ప్రధానము, మగ్గము, పరివారము, ఒకానొక వేదశాఖ, హేతువు, ఇట్లు చేయదగినది అనుట, నేత, స్వార్జితము, శాస్త్రము, యాగవిధి, గృహసంభారము, మందు, ప్రేగులు.
తంద్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అత్యంతమింద్రియాణి ద్రాంత్యత్రేతి తంద్రీ. కునికి పాటు. తామ్యం త్యనయేతి తంద్రీ. దీని చేత బడలుదురు, తంతి, తిప్పతీగ, నరము.
తక్రము
సం. నా. వా. అ. న. తత్స. తచ్యతే ఉదశ్విదపేక్షయా సంకుచ్యత ఇతి తక్రం. ఉద్వశిత్తు కంటె నీళ్ళ చేత సంకోచింపబడునది, పాతిక పాలు నీళ్ళు చేరిన మజ్జిగ. తనక్తి సంకోచయతి దుగ్ధం, పాదాంబుదధిరూపేణ పరిణమతి తత్ తక్రం.
తక్షకుడు
సం- సం. నా. వా. అ. పుం. తత్స. తక్ష్ణోతీతి తక్షకః. కృశముగా చేయువాడు, ఒక సర్పరాజు, వడ్ల వాఁడు.
తక్షుడు
సం. నా. వా. న్. పుం. తత్స. తక్ష్ణోతి త్వక్ష్ణోతి చ కాష్ఠాని తనూకరోతీతి తక్షా. కొయ్యలు చెక్కువాడు, తక్షకుడు, వడ్లవాడు. తక్షతి తనూకరోతి ఇతి తక్షా. వడ్రంగి, అయోగవుడు, ఒక సంకరజాతి.
తటము
సం. నా. వా. అ. పుం. న. తత్స. తటతీతి తటః. ఉన్నతమయినది, దరి, ఏటి ఒడ్డు, ప్రదేశము, వరిమడి తటతీతి తటః ఉన్నతమయినది, ఏటి ఒడ్డు , ప్రదేశము, వరి మడి. తటతీతి తటః. ఉన్నతమైనది, కొండచరియ. తటతి ఉచ్ఛ్రితో భవతీతి తటః.
తటాకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. తటాన్యకతీతి తటాకః. గట్టును కుటిలముగా పొంది ఉండునది, చెరువు.
తటిత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. ప్రభయా తమాంసి తాడయతీతి తడిత్. అంధకారమును పోగొట్టునది, మెరుపు, విద్యుత్తు.
తటిత్వంతము
సం. నా. వా. త్. పుం. తత్స. తటితః అస్య సంతీతి తటిత్త్వాక్. మెరుపులుకలది, మేఘము, మబ్బు.
తటిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తటమస్యా అస్తీతి తటినీ. కలిగినది, నది, ఏరు.
తతము
సం. నా. వా. అ. న. తత్స. తన్యత ఇతి తతం. విస్తరింపపడునది. తన్యంతే వ్యక్తీక్రియంతే స్వరా అత్రేతి తతం. దీని యందు స్వరములు వ్యక్తము చేయబడును, వీణ.
తతము
సం. విణ. తత్స. తాయతే స్మతతం. విస్తరింపబడునది, వ్యాపించునది, విరివి అయినది. సం. నా. వా. అ. పుం. తత్స. గాలి.
తత్పరుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. తస్యాభిమతవస్తునః పరః అధీన స్తత్పరః. అభిమత వస్తువునకు అధీనమైనవాడు, ఆనకలవాడు.
తత్వము
సం. నా. వా. అ. న. తత్స. కరణచరణగతీనాం ప్రత్యేకదర్శన క్రియాయాః తనమత్రా స్త్రీతితత్వం కర చరణాది గతి విశేషములయొక్క ప్రత్యేక దర్శన క్రియావిస్తారం కలిగినది, పరమాత్మ, స్వభావము, నృత్యాది విలంబితమానము, పంచవింశతి తత్వములు, అష్టప్రకృతులు, షోడశవికారములు, పురుషుడు, ప్రకృతి.
తథాగతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తధా సమ్యగ్గతం జ్ఞాన మస్యేతి తధాగతః. మంచి జ్ఞానము కలవాడు, బుద్ధ దేవుడు. యథా పునరావృత్తిః న భవతి తథా తేన ప్రకారేణ గతః తథాగతః.
తథ్యము
సం. నా. వా. అ. న. తత్స. విణ. తత్స. తథా తేన ప్రకారేణ సాధు తథ్యం. ఆ ప్రకారముగా మంచిది, సత్యము, సత్యమైనది.
తదాత్వము
సం. నా. వా. అ. న. తత్స. తదేత్యస్యభావః తదాత్వం. అప్పుడున్న కాలము, ఆ కాలము, వర్తమానము.
తనయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కులం ముదం వా తనోతీతి తనయః. కులమును గాని సంతోషమును గాని విస్తరింపచేయువాడు, పుత్రుడు. తనయతి విస్తారయతి కులం ఇతి తనయః. కొడుకు, కుమారుడు.
తనుత్రము
సం.నా.వా. అ. న. తత్స. తనుం త్రాయత ఇతి తనుత్రం. శరీరమును రక్షించునది, కవచము, బొందలము.
తనువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. తన్యతే ఆహారేణ తనుః. ఆహారము చేత విస్తారము చేయబడునది, శరీరము, దేహము, తోలు, మృదువు, కొంచము, సూక్ష్మము, పల్చనిది.
తనువు
సం. విణ. తత్స. తన్యత ఇతి తను విస్తరింపబడునది, పలుచనిది, ఒక చెట్టు, శరీరము, చర్మము, సూక్ష్మము, వ్యవహితము, చిన్నది.
తనూనపాత్తు
సం.నా.వా. త్. పుం. తత్స. తనూం నపాతయతి ధారయతీతి తనూనపాత్. శరీరమును నిలుపువాడు, అగ్ని.
తనూరుహము
సం.నా.వా. అ. న. తత్స. తన్వాం రోహతీతి తనూరుహం. శరీరమందు మొలచునది, వెంట్రుక, రెక్కక, రోమము.
తపనము
సం. నా. వా. అ. న. తత్స. పాపినః తాపయతీతి తపనః. పాపులను దహింపచేయునది, నరకవిశేషము, తాపము.
తపనీయము
సం. నా. వా. అ. న. తత్స. తాపమర్హతీతి తపనీయం. కాచుటకు యోగ్యమైనది, స్వర్ణము, బంగారము.
తపనుడు
సం. నా. వా. అ. పుం.తత్స. తపతీతి తపనః. తపింపచేయువాడు, సూర్యుడు, భానువు, అగస్ధ్యుడు, గ్రీష్మకాలము.
తపము
సం. నా. వా. అ .పుం. తత్స. తపతీతి తపః. తపింపచేయునది, వేసంగి కాలము, శిశిర ఋతువు, మాఘమాసము.
తపము
సం. నా. వా. స్. న. తత్స. తాపయతి తపతి వా ఇత తపః. మాఘమాసము. తపత్యస్మిన్నితి తపః. శిశిరకాలము, గ్రీష్మము, మూలప్రకృతి, ఒక గుణము, రాహువు, చీకటి, పాపము, దుఃఖము.
తపస్యము
సం.నా.వా. అ.పుం.తత్స. తపసి సాధుః తపస్యః. తపస్సు నందు యోగ్యమైనది, ఫాల్గుణమాసము.
తపస్వి
సం. నా. వా. స్. పుం. తత్స. తపః అస్యాస్తీతి తపస్వీ. తపస్సు కలవాడు, తపము చేయువాడు, కనికరింపతగినవాడు, చంద్రుడు, శిశిరబుతువు, దీనుడు.
తపస్విని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జటాయోగసామ్యాత్తపస్వినీ. జడల సామ్యము కలిగినది, తాపసురాలు, కటుకరోహిణి, జటామాంసి. (వృక్ష విశేషము), జాతమాషి.
తమము
సం. నా. వా. స్. పుం,న. తత్స. సూర్యాచంద్రమసౌ అనేన తామ్యత ఇతి తమః. ఇతని చేత సూర్యచంద్రులు వ్యధను పొందుదురు, రాహుగ్రహము. తామ్యత్యనేనేతి తమః. దీని చేత గ్లానిని పొందుదురు, చీకటి, శోకము తమయతి లోకం తమః. లోకమును గ్లాని పొందించునది, అంధకారము, ఒక గుణము. తామ్యత్యనేనేతి తమః. అంధకారము, రజోబలము, రజోరసము.
తమస్విని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తమః అస్యామస్తీతి తమస్వినీ. చీకటి కలిగినది, త్రియామ, రాతిరి. తమో విద్యతే అస్యామితి తమస్వినీ. రాత్రి.
తమాలపత్రము
సం. నా. వా.అ. న. తత్స. తమాలపత్రాకృతి త్వాత్ తమాలపత్రం. తమాలపత్రము వలె ఉండునది, బొట్టు,మకరికాపత్రము, చీకటిమ్రాను. తమాలస్య పత్రమివ వర్ణః అస్య అస్తీతి తమాలపత్రం. తిలకము.
తమాలము
సం. నా. వా. అ. పుం. న. తత్స. తామ్యతీతి తమాలః. వాడునది, కత్తి, ఉలిమిరి (వృక్షవిశేషము), చీకటి మ్రాను,బొట్టు, పచ్చాకు.
తమి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తామ్యంతి విరహిణః అత్రేతి తమీ. దీని యందు విరహవంతులు గ్లానిని పొందుదురు, రాతిరి, చీకటి.
తమిస్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తమో అస్యామస్తీతి తమిస్రా. అధికమైన తమస్సు కలిగినది, చీకటి రేయి, చిమ్మచీకటి. తమోబహుత్వమస్తి అస్యామితి తమిస్రా. రాత్రి.
తమిస్రము
సం. నా. వా. అ. న. తత్స. తమ ఏవ తమిస్రం. లోకమును గ్లాని పొందించునది, చీకటి, క్రోధము, నరకవిశేషము, అంధకారము.
తమ్రకుట్టకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తామ్రం కుట్టయతి ఛేదయతీతి తామ్రకుట్టకః. పని కొరకు రాగిని నరుకువాడు, రాగి పనివాడు, శౌల్బికుడు.
తరంగము
సం. నా. వా. అ.పుం.తత్స. తరతీతి తరంగః. దరి చేరునది, ఊర్మి, అల. తరతి ప్లవతే ఇతి తరంగః. ఏనుగు బీర, కెరటము.
తరంగిణి
సం.నా.వా. ఈ. స్త్రీ. తత్స. తరంగాః అస్యాం సంతీతి తరంగిణీ. అలలు కలిగినది, నది, ఏరు. తరంగో వీచిరస్త్యస్యా ఇతి తరంగిణీ, పసుపు, నిధి.
తరక్షువు
సం. నా. వా. ఉ. పుం.తత్స. తరన్ ప్లవన్ క్షిణోతీతి తరక్షుః. దుమికి చంపునది, సివంగి, మృగాదనము. తరం బలం మార్గం వా క్షిణోతీతి తరక్షుః. పులి.
తరణి
సం. నా.వా. ఇ. స్త్రీ. తత్స. తరంత్యనయా నదీమితి తరణిః. దీని చేత తరింతురు, ఓడ, దాటుట, చిన్న గోరంట, చేమంతి.
తరణి
సం.నా.వా. ఇ. పుం. తత్స. తరంత్యనేన తమ ఇతి తరణిః. అంధకారమునుఇతని చేత ధరింతురు, సూర్యుడు, సముద్రము. తరతి పాపమనేనేతి తరణిః. కిరణము.
తరపణ్యము
సం. నా. వా. అ. న. తత్స. పణ్యం మూల్యం తరస్య తరణస్య పణ్యం తరపణ్యం. దాటుటకు మూల్యము, ఓడ నడుపు వానికి ఇచ్చే కూలి, కేవు.
తరళము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రభయా తరతి తమ ఇతి తరళః. కాంతి చేత అంధకారమును ధరించునది, హార మధ్య రత్నము, హారము, జనపదవిశేషము.
తరళము
సం. విణ. తత్స. తరతీతి తరళం. కదలునది, చలించునది, అనురాగము కలది, ప్రకాశించునది, తోలుసంచి, నాయికామణి, మిశ్రవర్ణము, చంచలము.
తరసము
సం. నా. వా. అ. న. తత్స. తరంత్యేతేన కార్శ్యమితి తరసం. కార్శ్యమును దీనిచే ధరింతురు, మాంసము, పొల.
తరస్వి
సం. విణ. తత్స. తరః అస్యాస్తీతి తరస్వీ. వేగము కలవాడు, బలిమి కలవాడు, వడికలవాడు. తరః జవోబలం చాస్యాస్తీతి తరస్వీ. వేగమును బలమును కలవాడు, పులి.
తరస్సు
సం. నా. వా. స్. న. తత్స. తరత్యనేన తరః. దీని చేత జనము తరించుచున్నది, వడి. తరత్యా పదమనేనేతి తరః. దీని చేత ఆపదను తరించును, బలిమి, బలము, వేగము, తీరము.
తరి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. తరంత్యనయా నదీ మితి తరిః. దీని చేత తరింతురు, ఓడ, పొగ, మబ్బు, మాగాని, దశ, ద్రోణి, తోలుపెట్టి.
తరుణి
సం.నా.వా. ఈ. స్త్రీ. తత్స. కన్యావస్థాం తరతీతి తరుణీ. కన్యావస్థను దాటినది, యౌవనపు ఆడది, ఒకతాటి.
తరుణుడు
సం. విణ (అ.ఆ.అ.). తత్స. తరతి దుస్తరమపి తరుణః. దుస్తరమైన దానిని తరించువాడు, యౌవనము కలిగినవాడు. తరతి ప్లవతే ప్రమోదసలిలే ఇతి తరుణః. కొత్తది, ఆముదము, యువకుడు.
తరువు
సం.నా.వా. ఉ. పుం. తత్స. తరంత్యాతపమనేనేతి తరుః. ఎండను దీని చేత తరింతురు, చెట్టు. తరతి సముద్రాదికమనేనేతి తరుః. వృక్షము.
తర్కము
సం. నా. వా. అ. పుం. తత్స. తరంత్యనేన సంశయ విపర్యయా వితి తర్కః. దీని చేత సంశయభ్రాంతి జ్ఞానాదులను తరింతురు, ఊహ, అధ్యాహారము, కారణము, కోరిక, ఒక శాస్త్రము, హేతుశాస్త్రము, వాదము, హేతువాదము.
తర్కారి
సం.నా.వా. ఈ. స్త్రీ. తత్స. తర్కమియర్తీతి తర్కారీ. ఊహను పొందించునది, తక్కిలి చెట్టు.
తర్జని
సం.నా.వా.ఈ. స్త్రీ. తత్స. తర్జయంత్యనయా తర్జనీ. దీని చేత భయపెట్టుదురు, ప్రదేశిని, జుట్టనవ్రేలు, చూపుడువ్రేలు.
తర్ణకము
సం. నా. వా. అ. పుం. తత్స. తృణోతీతి తర్ణకః. భక్షించునది, అప్పుడు పుట్టిన దూడ.
తర్పణము
సం. నా. వా. అ. న. తత్స. తృప్యత ఇతి తర్పణం. తనియుట, తనివి. తృప్యతే అనేన భోక్తేతి తర్పణం. దీని చేత భోక్త తృప్తి పొందింపబడును, తృప్తి. తృప్యంతి పితరో ఏన ఇతి తర్పణం, నాచు, జావ, వంటచెఱకు.
తర్మము
సం. నా. వా. న్. న. తత్స. తరతి చషాలమితి తర్మ. ఊపవలయమును తరించునది, ఊపస్తంభపు కొన, ఊపాగ్రము.
తర్షము
సం. నా. వా. అ. పుం. తత్స. తర్షణం తర్షః. ఇచ్ఛయించుట, దప్పి, ఇచ్ఛ, తృష్ణ, కోరిక.
తలము
సం. నా. వా. అ. న. తత్స. తలతి ప్రతిష్ఠతే తలం. స్థిరమై ఉండునది, వింటినారి దెబ్బ తగలకుండా చేతికి కట్టుకొనే తోలు, అడవి, కారణము, పాతాళ లోకము. తలతీతి తలం. నిలిచిఉండునది, స్వరూపము, క్రింది భాగము, అరచేయి, రమాషములు, వీణమీటుట, సానములు, శీతము, శైత్యము, ప్రకృతి, సమతలము.
తల్పము
సం. నా. వా. అ. న. తత్స. తలంత్యత్రేతితల్పం. దూదిపఱపు, అట్టడి, భార్య. తల్యతే శయనార్థం గమ్యతే అత్ర ఇతి తల్పం, పడక, మిద్దిమీదగది.
తల్లజము
సం. నా. వా. అ. పుం. తత్స. వృత్తి అందు ఉత్తరపదమై శ్రేష్ఠతను తెలుపును.
తష్టము
సం. విణ (అ.ఆ.అ.). తత్స. తక్ష్యతే త్వక్ష్యతే స్మ తష్టః. చెక్కబడినది, బాడిశ.
తస్కరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తత్ చోరకర్మ కరోతీతి తస్కరః. దొంగతనము చేయువాడు, దొంగ, చోరుడు, వృక్షము.
తాండవము
సం. నా. వా. అ. పుం. న. తత్స. తండునా ప్రణీతం తాండవం. తండువు అనే ఋషి చేత చెప్పబడినది, ఉద్ధతమైన నృత్యము, తృణ విశేషము. తాండేన మునినా కృతం తాండం నృత్యశాస్త్రం, తదస్యాస్తీతి తాండవః.
తాంత్రికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తన్యతే అనేన మతధర్మ ఇతి తంత్రం తద్వేదీ తాంత్రికః. తంత్రమును ఎరిగినవాడు (మతధర్మమును విస్తరింపచేయునది తంత్రం), సిద్ధాంతమునెరిగినవాడు, విషవైద్యుడు.
తాంబూలవల్లి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తాంబూలార్ధం వల్లీ తాంబూలవల్లీ. తాంబూలము కొరకు అయిన తీగె, తమలపాకు తీగ.
తాంబూలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తామ్యతి వివశో భవత్యనయా జన ఇతి తాంబూలీ. దీని చేత నరుడు వివశ్రుడగుచున్నాడు, తమలపాకు తీగె.
తాత
సం. నా. వా. అ. పుం. తత్స. తనోతి కులం తాతః. కులమును విస్తరింపచేయువాడు, తండ్రి. తనోతి విస్తారయతి గోత్రాదికమితి తాతః. పిత, తండ్రి.
తాపసతరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. తపస్వి జనోపయుజ్యమాన త్వాత్తాపసతరుః. తాపసులు ఉపయోగించు ఫలములు కలది, గార చెట్టు.
తాపసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తపో అస్యాస్తీతి తాపసః. తపస్సు కలవాడు, తపస్సు చేయువాడు, తపసి, వానప్రస్తుడు, ముని.
తాపింఛము
సం. నా. వా. అ. పుం. తత్స. తాపినం ఛాదయ తీతి తాపిచ్ఛః. తాపము కలవానిని కప్పునది, చీకటిమ్రాను. తాపినం సంతప్తం ఛదతి ఆచ్ఛాదయతీతి తాపిచ్ఛః. ఒక పచ్చాకు.
తామరసము
సం. నా. వా. అ. న. తత్స. తమః ప్రకర్క్షోర సోస్య తామరసం ప్రకృష్టమైనరసముకలది. తామరం జలం తత్రస స్తితిష్ఠతీతి తామరసం. ఉదకము ఉండునది, తామరపువ్వు, బంగారు, రాగి. తామరే జలే సస్తీతి తామరసం. పద్మము, స్వర్ణము.
తామలకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తామ్యతే కాంక్ష్యత ఇతి తామలకీ. కాంక్షింపబడునది, నేల ఉసిరిక చెట్టు.
తామసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తమో బహుళా తామసీ. అధికమైన తమస్సు కలది, చీకటి, పార్వతి, వర్షాకాలపురాత్రి, ఆలస్యము.
తామ్రచూడము
సం. నా. వా. అ. పుం. తత్స. తామ్ర వర్ణా చూడాస్యేతి తామ్ర చూడః. తామ్రవర్ణమైన చుంచు కలది, కోడి, అభినయ హస్త విశేషము.
తామ్రపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తామ్రపర్ణాఖ్యౌషధీ సాహచర్యాత్తామ్రపర్ణీ. తామ్ర పర్ణమనెడి ఓషధితో కూడినది, ఒకానొక ఏరు, పడమటి దిక్కు నందుండు ఆడేనుగు, భార్య.
తామ్రము
సం. నా. వా. అ. పుం. విణ. తత్స. ఎరుపు, ఎర్రనిది. సం. నా. వా. అ. న. తత్స. తమ్యతే ఆకాంక్ష్యతే ఇతి తామ్రం, వరిష్ఠము, అరవిందము, రాగి.
తార
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తరంత్యనయా నావికా ఇతి తారా. దీని చేత నావికులు తరింతురు, కనుగుడ్డు, నక్షత్రము. తారయతీతి తారా.
తారక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తరంత్యనయా నావికా ఇతి తారకా. దీని చేత నావికులు తరింతురు, నక్షత్రము, కంటి నల్లగ్రుడ్డు. తరతి తారయతి వా తారకా, ఓంకారము.
తారకజిత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. తారకం జితవాన్ తారకజిత్. తారకాసురుని జయించినవాడు, కుమారస్వామి.
తారము
సం. నా. వా. అ. న. తత్స. తారయతిస్థానే భ్యస్స్వరమితి తారః. ఉచ్ఛధ్వనిపేరు. తరంత్యనేనేతి తారః. దీని చేత తరింతురు, కనుగ్రుడ్డు, నక్షత్రము, ఓం కారము, లావణ్యము, మిశ్రవర్ణము, గట్టిగా.
తారాపథము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆకాశము,మిన్ను.
తారుణ్యము
సం. నా. వా. అ. న. తత్స. తరుణ స్వభావః తారుణ్యం. పిన్న వయస్సు వాని యొక్క భావము, యౌవనము, జవ్వనము.
తార్క్ష్యడు
సం. నా. వా. అ. పుం. తత్స. తృక్షస్య ఋషేరపత్యం తార్క్ష్యః. తృక్షుడను ముని కొడుకు, గరుత్మంతుడు, అనూరుడు. తృక్షస్యాపత్యంపుమాన్ తారక్ష్యః. తృక్ష ప్రజాపతి సంతతి.
తాలపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తాళస్యేవ పర్ణాన్యస్యా ఇతి తాళపర్ణీ. తాళపర్ణము వంటి ఆకులు కలది, మురయనెడు గంధద్రవ్వపు చెట్టు, ఒక పరిమళ ద్రవ్యము.
తాలము
సం. నా. వా. అ. న. తత్స. తలతి ప్రతిష్ఠతే వర్ణో అత్రేతి తాలం. దీని యందు వర్ణముండును, హరి దళము.
తాలము
సం. నా. వా. అ. పుం. తత్స. తలతి ప్రతిష్ఠితే పరిమేయమస్మిన్నితి తాలః. కొలవదగిన వస్తువు, చాప బడిన బొటనవేలి నడిమివేలి నడిమి కొలత. తలత్యత్రేతి తాలః.
తాలాంకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తాలవృక్షాకృతి రంకో ధ్వజో యస్యసః తాలాంకః. తాళవృక్షాకారమైన ధ్వజము కలవాడు, బలరాముడు.
తాలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తాడయతి రోగానితి తాళీ. రోగమును పోగొట్టునది, నేల ఉసిరిక చెట్టు, తాటిచెట్టు, చూడు, తాళము, చెవి.
తాలువు
సం. నా. వా. ఉ. న. తత్స. తలతి ప్రతిష్ఠతి దగ్ధ శేషమత్రేతి తాలు. భుక్త శేషము దీని యందు నిలుచును, దవడ, కాకుదము. తరంత్యనేన వర్ణా ఇతి తాలు, అంగుడు.
తాళ పత్రము
సం. నా. వా. అ. న. తత్స. తాళస్య పత్త్రం తాళపత్రం. తాటాకు, చెవ్వాకు, కర్ణాభరణం.
తాళము
సం. నా. వా. అ. పుం. తత్స. తలతి ప్రతిష్ఠతే ధృడమూలత్వాత్తాళః. ధృఢమైన మొదలు గల దౌట చేత ప్రతిష్ఠ కలది, తాటి చెట్టు, వృక్షవిశేషము.
తాళమూలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తాళస్యేవ మూల మస్యా ఇతి తాళమూలికా. తాటి చెట్టు వంటి మొదలు కలది, నేల తాటి చెట్టు.
తాళవృంతము
సం. నా. వా. అ. న. తత్స. తాళవృంతవద్వృంతమస్యేతి తాళవృంతకం. దీని చేత బడలిక పోగొట్టబడును, విసన కర్ర, వ్యజనము. తాలస్య తాలపత్రస్య వృంతం కారణత్వేన అస్తి అస్యేతి తాలవృంతః.
తింత్రిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తిమ్యతి ముఖమనేనేతి తింత్రిణీ. దీని చేత ముఖము ఆర్ద్రమవును, చింతచెట్టు.
తింత్రిణీకము
సం. నా. వా. అ. న. తత్స. తింత్రిడీ వృక్ష జాతత్వాత్ తింత్రిణీకం. తింత్రిడీ వృక్షమున పుట్టునది, చింతపండు.
తిందుకము
సం. నా. వా. అ. పుం. తత్స. తిమ్యతి ఆర్ద్రీ భవతీతి తిందుకః. ఆర్ద్రమై ఉండునది, తుమ్మికి చెట్టు.
తిక్తము
సం. నా. వా. అ. పుం. తత్స. తేజయతి శ్లేష్మమితి తిక్తః. శ్లేష్మమును అల్పముగా చేయునది, చేదు, రసవిశేషము, గుగ్గిలము, పర్పాటకము, చేదుపొట్ల, చేదువాసనకలది.
తిక్తశాకము
సం. నా. వా. అ. పుం. తత్స. తిక్తరసశ్శాకో యస్య సః తిక్తశాకః. చేదైన ఆకులు కలది, ఉలిమిరి చెట్టు, చండ్ర చెట్టు, రసాలము.
తిగ్మము
సం. నా. వా. అ. న. తత్స. తేజయతీతి తిగ్మం. మిక్కిలి వేడియైనది, వేడిమి, క్షత్రియవిశేషము, సూర్యుడు, వాడిది.
తితఉవు
సం. నా. వా. ఉ. పుం. న. తత్స. తనోత్యధస్తాత్పిష్టసారమితి తితఉః. మిక్కిలి పొడి అయిన దానిని క్రిందకి కార్చునది, జల్లెడ.
తితిక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తితిక్షతే తితిక్షా. ఓర్చుట, క్షాంతి, ఓర్పు.
తితిక్షువు
సం. విణ. ఉ. తత్స. తితిక్షత ఇతి తితిక్షుః. స్వభావమున ఓర్చువాడు, క్షమించునట్టి స్వభావము కలవాడు, ఓర్పరి, శాంతుడు.
తిత్తిరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. తిత్తీతి రౌతీతి తిత్తిరిః. తిత్తియని పలుకునది, తీతువు పిట్ట, వంతెన.
తిథి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. తన్యతే షష్టిఘటికాభిరితి తిథిః. అరవై గడియల చేత పెంపొందునది, పాడ్యమిలోనగునది, శ్రాద్ధ దినము.
తినిశము
సం. నా. వా. అ. పుం. తత్స. చిరజీవిత్వాన్నిశామతిక్రాంతస్తినిశః. చిరకాల ఉండునది, తినాసపు చెట్టు.
తిమి
సం. నా. వా. ఇ. పుం. తత్స. తిమ్యతీతి తిమిః. ఆర్ద్రమై ఉండునది, నూరు యోజనముల పొడవుకల చేప, రాజవిశేషము, సముద్రము.
తిమింగలము
సం. నా. వా. అ. పుం. తత్స. తిమింగిలతీతి తిమింగిలః. తిమిని మ్రింగునది. (చేప), ఒక జలచరము.
తిమితము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తిమ్యతీతి తిమితం. తడిసినది, ఆర్ద్రము.
తిమిరము
సం. నా. వా. అ. న. తత్స. తిమ్యంతే కాముకహృదయాన్యనేనేతి వా తిమిరం. దీని చేత కాముక హృదయములు ఆర్ద్రముగా చేయబడును, చీకటి, నేత్రరోగవిశేషము. తిమ్యతీతి తిమిరం.
తిరస్కరిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తిరస్కరోతి ఆచ్ఛాదయతీతి తిరస్కరణీ. కప్పునది, తెరచీర, ప్రతిసీర. తిరో అంతర్ధానం కరోతీతి తిరస్కరిణీ, తెర.
తిరస్క్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తిరస్కరణం తిరస్ర్కియా. తిరస్కరించుట, తిరస్కారము, త్రోసిపుచ్చుట.
తిరీటము
సం. నా. వా. అ. పుం. న. తత్స. తీరయతి రోగాన్ తిరీటః. రోగములను సమాప్తి పొందించునది, తెల్ల లొద్దుగు చెట్టు, కిరీటము, ఎఱ్ఱలొద్దుగు.
తిరోధానము
సం. నా. వా. అ. న. తత్స. తిరోదధాతీతి తిరోధానం. అడ్డమగునది, మరుగుపాటు, ముసురుకొనుట, అంతర్ధానము, కప్పు.
తిరోహితుడు
సం.విణ. (అ.ఆ.అ.). తత్స. తిరః అదర్శనం హితః గతః తిరోహితః. కానరాకుండపోయినవాడు, మరుగునపడినవాడు.
తిర్యక్కు
సం. విణ. (చ్.ఈ.చ్.). తత్స. తిరోంచతీతి తిర్యజ్. అడ్డముగా పోవువాడు, అడ్డముగా పోవునది, అడ్డము.
తిలకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. తిలాభాని పుష్పాణ్యస్య తిలకః. నువ్వుపువ్వుల వంటి పువ్వులు కలది, తిలకపు చెట్టు, బొట్టుగు, పొట్ల. తిల ఇవ తిష్ఠతీతి తిలకః. నువ్వులవలె ఉండునది, పుట్టుమచ్చ. తిలతీతి తిలకం. మెరుగై ఉండునది, నీరు తిత్తి, కడుపులో కుడి పక్క ఉండెడు ఎర్ర మాంసము, సౌవర్చలమనెడి ఉప్పు. తిలతి స్నిహ్యతీతి తిలకం. మెరుగై ఉండునది, నొసటి బొట్టు,శ్రేష్ఠము. తిలతి స్నిహ్యతీతి తిలకం, గోరింట.
తిలకాలకము
సం. నా. వా. అ. పుం. తత్స. తిల ఇవ కాలవర్ణత్వాత్ తిలకాలకః. నువ్వుల వలె నల్లగా ఉండునది, పుట్టుమచ్చ, ఎర్ర చందనము.
తిలపర్ణి
సం. నా. వా.ఈ. స్త్రీ. న్. పుం. తత్స. తిలస్యేవ పర్ణాన్యస్యాస్తిలపర్ణీ. నువ్వుల వంటి ఆకులు కలది, రక్త చందనము.
తిలపేజము
సం. నా. వా. అ. పుం. తత్స. (రూ. తిలపింజము). నిష్ఫల స్తిల తిలపేజః. పొల్ల నువ్వులు, చేనువ్వులు.
తిలిప్సము
సం. నా. వా. అ. పుం. తత్స. తిలతి చరతీతి తిలిప్సః. చరించునది, కొండచిలువ.
తిల్యము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తిలానాం భవనోచితం క్షేత్రం తిల్యం. నువ్వులు పండెడు పొలము.
తిల్వము
సం. నా. వా. అ. పుం. తత్స. తిలతి స్నిహ్యత్యం గమనేనేతి తిల్వః. దీని చేత శరీరము నున్నగా అవును, లొద్దుగు, లోధ్రపు చెట్టు.
తిష్యఫల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తిష్యవచ్ఛుభఫలత్వాత్తిష్యఫలా. తిష్య నక్షత్రము వలె శుభమైన ఫలములు కలది, ఉసిరిక చెట్టు.
తిష్యము
సం. నా. వా. అ. పుం. తత్స. తుష్యంత్యస్మిన్నర్థ సిద్ధయే ఇతి తిష్యః. దీని యందు కార్యసిద్ధి కొరకు సంతోషింతురు, పుష్యనక్షత్రము. త్వేషతే తిష్యః. ప్రకాశించునది, పుష్యమాసము, కలియుగము. తుష్యంత్యస్మిన్నితి తిష్యః. తాడి, కలియుగము.
తీక్ష్ణగంధము
సం. నా. వా. అ. పుం. తత్స. తీక్ష్ణోగంధో అస్యాస్తేతి తీక్ష్ణగంధకః. తీక్ష్ణమైన గంధము కలది, మునగ చెట్టు, పెద్ద తుమ్మ చెట్టు, నెరవెంద చెట్టు.
తీక్ష్ణము
సం. నా. వా. అ. న. తత్స. విణ. తత్స. తేజయతీతి తిగ్మం తీక్ష్ణం. మిక్కిలి వేడైనది, వేడిమి, చురుకైనది, వాడి అయినది. తిజ్యత ఇతి తీక్ష్ణం. వాడిగా చేయబడునది, ఇనుము,విషము, పోరు, ఇందుప్పు. యుద్ధము, మరణము, శీఘ్రము, లవణము, చెడుమాట, క్రూరము, వేడి, వగరు, తులసి.
తీరము
సం. నా. వా. అ. న. తత్స. తరంత్యనేనేతి తీరం దీని చేత తరింతురు. తీరయతి సరిత్తరణ కర్మాత్రేతి వా తీరం. దీని యందు నదీతరణ వ్యాపారము సమాప్తమౌను, ఉరి,తగరము. తీరయతి సమాపయతి నద్యాదికమితి తీరం. గంగాతీరము.
తీర్థము
సం. నా. వా. అ. న. తత్స. తరంత్యనేనేతి తీర్థం. దీని చేత తరింతురు, మహర్షులు స్నానము చేసిన పుణ్యోదకము, పుణ్య నది, రేవు, నూతివద్ద తొట్టి, పుణ్యక్షేత్రము, యజ్ఞము, శాస్త్రము, ఉపాయము, పాత్రము, స్త్రీరజస్సు, ఉపాధ్యాయుడు, మంత్రి. తరతి పాపాదికం యస్మాదితి తీర్థం, పవిత్రము, మంత్రము, గురువు, యాగము.
తీవ్రము
సం. విణ. తత్స. తీవతీతి తీవ్రం. అధికమై ఉండునది, అధికము, మిక్కిలి వేడిమి కలది, కారముకలది.
తుంగము
సం. నా. వా. అ. పుం. తత్స. పురుషవదున్నత త్వాతుంగః. పురుషుని వలె ఉన్నతమైనది, కొండ, పొన్న చెట్టు, ఎత్తైయినది.
తుంగము
సం. విణ. తత్స. తుట్యతే వాయ్వాదినేతి తుంగః. వాయ్వాదుల చేత పీడింపబడునది, పొడవైనది.
తుంగి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అతి తీక్ష్ణత్వాత్తుంగీ. అతి తీక్ష్ణమైనది, వాయింట చెట్టు.
తుండము
సం. నా. వా. అ. న. తత్స. తుడ్యతే హింస్యతే ఖాద్యమనేనేతి తుండం. భక్ష్యవస్తువు దీని చేత పీడింపబడును, పక్షి ముక్కు, నోరు, మొగము. తుండతే నిష్పీడయతి అభ్యంతరస్థద్రవ్యమితి తుండం. ముఖము.
తుండి
సం. నా. వా. న్. పుం. తత్స. పక్షి.
తుండికేరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తుండం వదన మాశ్రయత్వేనాస్యేతి తుణికమోష్ఠః తమియర్తి అనురో తీతితుండికేదా. తుండికాన్ వదనగతరోగాన్ ఈరయతి ప్రేరయతీతి తుండికేరీ. ముఖగతములైన రోగములను పోగొట్టునది, ప్రత్తి చెట్టు. తుండికమియర్తి అనుకరోతీతి తుండికేరీ. పెదవిని అనుకరించునది, దొండ చెట్టు.
తుందపరిమృజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పునః పునస్తుందంమరిమార్ష్టీతి తుందపరిమృజః. పలుమారు కడుపు నిమురుకొనువాడు, సోమరి, అలసుడు.
తుందము
సం. నా. వా. అ. న. తత్స. తుద్యతే అజీర్ణాదినా తుందం. అజీర్ణాదుల చేత వ్యథ పెట్టబడునది,కడుపు, ఉదరము, కుక్షి. తుదతీతి తుందం. ఉదరము, జఠరము.
తుంది
సం. విణ. (న్.ఈ.న్.). తత్స. తుంద పిచండ శబ్దౌ కుక్షి పర్యాయౌ తద్యోగాత్ తుందీ. కుక్షివాచకములు కలిగినవాడు, బొజ్జ కడుపువాడు.
తుందిభుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తుంది పిచండ శబ్దౌ కుక్షిపర్యాయౌ తద్యోగాత్ తుందిభః. కుక్షి వాచకములు కలిగినవాడు, బొజ్జ కడుపువాడు, ఉరుకు బొడ్డువాడు. తుందిర్వృద్ధా నాభిరస్యేతి తుందిభః.
తుందిలుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తుందిపిచండశబ్దౌ కుక్షి పర్యాయౌ తద్యోగాత్ తుండిలః. కుక్షివాచకములు కలిగినవాడు, బొజ్జ కడుపువాడు, ఉరుకు బొడ్డువాడు. తుందం విశాలముదరమస్త్యస్యేతి తుందిలః. పెద్దదైన బొజ్జ కలవాడు.
తుందుభము
సం. నా. వా. అ. పుం. తత్స. తుదతి వ్యథయతి తుందు భః. వ్యథ పెట్టునది, సర్షపము, ఆవాలు.
తుంబి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తుంబ్యతే భక్ష్యత ఇతి తుంబీ. భక్షింపబడునది, తుమ్మి చెట్టు, సొర చెట్టు.
తుచ్ఛము
సం. నా. వా. అ. న. తత్స. తుదతి మనః క్లేశయతీతి తుచ్ఛం. మనస్సును వ్యథ పెట్టునది, దుఃఖము, శూన్యము. తేన తం వా ఛయతీతి తుచ్ఛః. హీనము, దుర దుష్టవంతుడు.
తుత్థ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తుద్యతే తుత్థా. పీడింపబడునది, నీలి చెట్టు. తుదతి తాపం తుత్థా. తాపమును పోగొట్టునది, చిన్న ఏలకులు.
తుత్థము
సం. నా. వా. అ. న. తత్స. తుదత్యక్షిరోగానితి తుత్థం. అక్షిరోగములను (కళ్ల రోగములను) చెరచునది, మ్రాని పసుపున వండిన అంజనవిశేషము, మైలతుత్తుము.
తుత్థాంజనము
సం. నా. వా. అ. న. తత్స. తుత్థం చ తదంజనం చ తుత్థాంజనం. అక్షిరోగములను చెరచునది, మైలుతుత్తము.
తున్నకము
సం. నా. వా. అ. పుం. తత్స. తుద్యతే హస్త్యాదిభిరితి తున్నః. గజాదులచే పీడింపబడునది, నందివృక్షము.
తున్నవాయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తున్నం త్రుటితం వయతీతి తున్నవాయః. చినిగిన దానిని కూర్చువాడు, కుట్రపువాడు, సౌచికుడు. తున్నం ఛిన్నం వయతీతి తున్నవాయః. సౌచికుడు, దర్జీపనివాడు.
తుభము
సం. నా. వా. అ. పుం. తత్స. తోభతే హినస్తి పర్ణానీతి తుభః. భక్షణార్థమై ఆకులను పీడించునది, మేకపోతు, ఛాగము.
తుములము
సం. నా. వా. అ. న. తత్స. తామ్యంతి సైనికా అత్రేతి తుములం. దీని యందు సైనికులు బడలుదురు, దొమ్మి యుద్ధము, సంకుల యుద్ధము.
తురంగమము
సం. నా. వా. అ. పుం. తత్స. తురం త్వరితం గచ్ఛతీతి తురంగమః. వేగముగా పోవునది, గుర్రము, అశ్వము.
తురంగము
సం. నా. వా. అ. పుం. తత్స. తురం త్వరితం గచ్ఛతీతి తురంగః. వేగిరముగా పోవునది, గుర్రము, అశ్వము. తురేణ వేగేన గచ్ఛతీతి తురంగః.
తురగము
సం. నా. వా. అ. పుం. తత్స. తురం త్వరితం గచ్ఛతీతి తురగః. వేగముగా పోవునది, గుర్రము, హృదయము, అశ్వము.
తురాషాహుడు
సం. నా. వా. హ్. పుం. తత్స. తురం శత్రు వేగం సహత ఇతి తురాషాట్. శత్రు వేగమును సంహరించువాడు, ఇంద్రుడు. తురం వేగవంతం సాహయతి అభిభవతీతి తురాషాట్.
తురీయము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మము, నాల్గవది.
తురుష్కము
సం. నా. వా. అ. పుం. తత్స. తురుష్క దేశే భవః తురుష్కః. తురుష్క దేశ మందు పుట్టినది, చిల్లమడ్డి, ఒకానొక దేశము, ధూపము.
తుల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తుల్యత ఇతి తులా. తూచబడునది, త్రాసు, దూలము, నూరు పలముల కలది, పోలిక, ఒక రాశి.
తులాకోటి
సం. నా. వా. ఇ. పుం. తత్స. తులతి ఆకుటతీతి చ తులాకోటిః. అధికమైన తూనిక కలిగి వక్రమై ఉండునది, అందె, నూపురము. సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. తులాం సాదృశ్యం కోటయతే ఇతి తులాకోటిః.
తుల్యము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తులయా సమ్మితస్తుల్యః. తూనికచేత కొలది పెట్టబడునది, సమము, సరి, సదృశము, సమానము, సధర్మము, సమ్మితము.
తువరము
సం. నా. వా. అ. పుం, న. తత్స. తౌతి ఆవృణోతి హినస్తివా కంఠమితి తువరః. కంఠమును అడ్డగించునవి, వెగటు చేయునది, వగరు, ఒకరసము. తవతి హినస్తి రోగానితి తువరః. కషాయము, ఒక ఆకుకూర, కారము.
తుషము
సం. నా. వా. అ. పుం. తత్స. తుష్యతి స్వల్పవారిణా తుషః. కొంచెము నీటి చేతనే తుష్టి పొందునది, తాండ్ర. తుష్యతే అనేనాగ్నిరితి తుషః. దీని చేత అగ్ని తుష్టిని పొందునది, ఉమక, తాడి, ఊష.
తుషారము
సం. నా. వా. అ. పుం. తత్స. తప్తం తోషయతీతి తుషారః. తాపము నొందిన వానిని సంతోషంపచేయునది, మంచు, తుంపర, చల్లనిది. తుష్యత్యనేవ సస్యాదిరితి తుషారః. హిమము, శైత్యము, శీతము.
తుషితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. తుష్యంతీతి తుషితాః. సంతోషించువారు,గణదేవతా విశేషము, ఒక దేవత.
తుహినము
సం. నా. వా. అ. న. తత్స. తోహతి అర్దయతి పద్మమితి తుహినం. పద్మమును పీడించునది, హిమము, మంచు, చంద్రుని యొక్క తేజస్సు.
తూణము
సం. నా. వా. అ. పుం. తత్స. తూణ్యతే కరైరితి తూణః. బాణముల చేత పూరింపబడునది, అమ్ములపొది. తూణ్యతే పూర్యతే బాణైరితి తూణః. బాణములను ధరించునది.
తూణీరము
సం. నా. వా. అ. పుం. తత్స. తూణ్యతే కరైరితి తూణీరః. బాణముల చేత పూరింపబడునది, అమ్ములపొది. తూణ్యతే పూర్యతే బాణైరితి తూణీరః. బాణములను ధరించునది.
తూదము
సం. నా. వా. అ. పుం. తత్స. తుద్యతే యూపార్థం తూదః.యూపర్థమై వ్యధ పెట్టబడునది, గంగరావి చెట్టు.
తూబరము
సం. నా. వా. అ. పుం. తత్స. తాం వృణోతీతి తూబరః. గోత్వాదికము దీని చేత విస్తరింపబడును, కాలమున కొమ్ములు మొలవని ఎద్దు.
తూర్ణము
సం. నా. వా. అ. న. తత్స. తురతే అనేనేతి తూర్ణం. దీని చేత జనము త్వరితమవును, త్వరితము, శీఘ్రము, వేగము.
తూలము
సం. నా. వా. అ. న. తత్స. తూల్యతే అస్మాదగ్నిరితి తూలం. దీని వలన అగ్ని బయలు వెడలును, గంగ రావి చెట్టు, ఆకాశము. తోల్యతే అనేనేతి తూలః. తూచబడునది, దూది.
తూలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తూలయతే వర్ణాదికం పూరయతీతి తూలికా. వన్నెల నించునది, చిన్నఈక, వ్రాసెడు కలము, చిత్రము వ్రాసెదడు వాగర, తృణ విశేషము, కుంచె.
తూష్ణీకుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స.తూష్ణీం శీలమస్య తూష్ణీకః. ఊరకుండు స్వభావము కలవాడు, మాటలాడక ఊరుకుండు వాడు, మౌనముగా.
తృణద్రుమము
సం. నా. వా. అ. పుం. తత్స. తాటి చెట్టులోనగునది.
తృణధాన్యము
సం. నా. వా. అ. న. తత్స. విత్తక పండెడు గునుకువరి, దూసర్లు మొదలైనవి. తృణబహుళం ధాన్యం తృణధాన్యం. ధాన్యవిశేషము.
తృణధ్వజము
సం. నా. వా. అ. పుం. తత్స. తృణానాం మధ్యే ముఖ్యత్వాత్ తృణధ్వజః. తృణ విశేషములలో ముఖ్యమైనది, వెదురు, వేణువు.
తృణము
సం. నా. వా. అ. న. తత్స. తృణ్యతే పశుభిరితి తృణం. పశువుల చేత హింసింపబడునది, కిక్కస గడ్డి, గంటి చామ పైరు. తృణ్యతే భక్ష్యతే గవాదిభిరితి తృణం. గోవులచేత తినబడునది, ధాన్యవిశేషము.
తృణరాజము
సం. నా. వా. అ. పుం. తత్స. తృణానాం రాజా ముఖ్యః తృణరాజః. తృణములలో ముఖ్యమైనది, తాటి చెట్టు, గిరక తాటి చెట్టు, టెంకాయ చెట్టు. తృణేషు రాజతే శోభతే ఇతి తృణరాజః.
తృణశూన్యము
సం. నా. వా. అ. న. తత్స. (రూ. తృణశూల్యము). తృణశూలే వాతగుల్మే సాధు తృణశూల్యం. వాతగుల్మమునకు మంచిది, మల్లె.
తృణ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తృణానాం సమూహస్తృణ్యా. తృణముల యొక్క సమూహము, గడ్డి మోపు.
తృతీయాకృతము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. త్రివారం కృష్టం తృతీయా కృతం. మూడు సార్లు దున్నిన భూమి.
తృతీయాప్రకృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. స్త్రీపుం సాపేక్షయా తృతీయాప్రకృతిః. స్త్రీ పురుషులను గూర్చి మూడవ ప్రకృతి, నపుంసకుడు,వేడి.
తృప్తము
సం. నా. వా. అ. పుం. తత్స. తృప్యతి స్మ తృప్తః. తనిసినవాడు, తృప్తి పొందినది, పురోడాశము.
తృప్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. తృప్యత ఇతి తృప్తిః. తనియుట, తనివి, తర్పణము, సంతుష్టి.
తృష
సం. నా. వా. ఆ. ష్. స్త్రీ. తత్స.తర్షణం తృట్. పానము చేయు ఇచ్ఛ, దప్పి, కోరిక.
తృష్ణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తర్షణం తృష్ణా. పానము చేయు కోరిక, ఇచ్ఛ, దప్పి.
తృష్ణక్కు
సం. విణ. జ్. తత్స. తృష్యతి తాచ్ఛీల్యేనేతి తృష్ణక్. స్వభావముననే కోరువాడు, ఇచ్ఛగొన్నవాడు, దప్పికొన్నవాడు. తృష్యతి ఆకాంక్షతీతి తృష్ణక్. లుబ్ధము, ఆశపోతు.
తేజనకము
సం. నా. వా. అ. పుం. తత్స. తేజయతి పిత్తాదిరోగానితి తేజనకః. పిత్తాదిరోగములను కృశముగా చేయునది, కాకి వెదురు చెట్టు.
తేజనము
సం. నా. వా. అ. పుం. తత్స. తేజయత్యగ్నిం తేజనః. అగ్నిని ప్రజ్వలింపచేయునది, వెదురు, వేణువు చెట్టు, ఒక రెల్లు.
తేజని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తేజయత్యగ్నిం తేజనీ. అగ్నిని ప్రకాశింపచేయునది, చాగ చెట్టు.
తేజస్సు
సం. నా. వా. స్. న. తత్స. తేజయతి తనూకరోతి స్రవణానంతరం తేజః. జారిన మీదట కృశముగా చేయునది, రేతస్సు. తేజయతీతి తేజః. కృశముగా చేయునది, ప్రకాశము, ప్రభావము, పరాక్రమము. తేజయతి తేజ్యతే అనేన వా ఇతి తేజః. దీప్తి, బలము, ఆహరము, వీర్యము, వెన్న, అగ్ని, ధర్మము.
తేజితము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తిజ్యతే స్మ తేజితం. వాడిగా చేయబడినది, శాతము, నిశితము, శాంతము, పదునైనది.
తేమనము
సం. నా. వా. అ. న. తత్స. తిమత్యార్ధ్రి భవతీతి తేమనం. ఆర్ధ్రమై ఉండునది, తడియుట, మజ్జిగ పులుసు, తిమ్మనము.
తేమము
సం. నా. వా. అ. పుం. తత్స. తేమనం తేమః. తడియుట, స్తేమము.
తైజసము
సం. నా. వా. అ. న. తత్స. తేజసో వికారః తైజసం. బంగారు వెండిలోనగు ధాతుద్రవ్యము, తీర్థవిశేషము.
తైజసావర్తని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తైజసం హేమాదికమావర్త్యతే ద్రవీక్రియతే అస్వామితితైజసావర్తనీ. దీని యందు బంగారము మొదలయినవి కరిగించబడును.
తైత్తిరము
సం. నా. వా. అ. న. తత్స. తిత్తిరీణాం సమూహః తైత్తిరం. తీతువుల గుంపు, తిత్తిరి పక్షుల సమూహము.
తైల పర్ణికా
సం. నా. వా. అ. పుం. తత్స. మలయైక దేశే తైల పర్ణాఖ్యగిరౌ భవం తైలపర్ణికం. మలయ పర్వతమున పుట్టినది, తెల్లచందనము.
తైలపాయిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సర్వదా వివృతా స్యత్వేన తైలం పిబతీవ తిష్ఠతీతి తైలపాయికా. ఎల్లప్పుడు నోరు తెరుచుకొని తైలపానము చేయు దాని వలె ఉండునది, గబ్బిలము, ఎర్ర తోటకూర, బొద్దింక.
తైలీనము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తిలానాం భవనోచితం క్షేత్రం తైలీనం. నువ్వులు పండెడు పొలము, తిలలు పండునది.
తైషము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్య ఏవ తిష్యః తద్యుక్తా పూర్ణిమా అస్మిన్నితి తైషః. పుష్య నక్షత్రముతో కూడిన పున్నమి, పుష్య మాసము, పౌషము.
తోకము
సం. నా. వా. అ. న. తత్స. తౌతి కులమనేన తోకం. దీని చేత కులము వృద్ధి పొందును, అపత్యము, బిడ్డ. తౌతి పూరయతి గృహమితి తోకం. శిశువు.
తోక్మము
సం. నా. వా. అ. పుం. తత్స. తుజ్యతే ఖాద్యత ఇతి తోక్మః. భక్షింపబడునది, పచ్చయవలు, దిక్కు, చెవిమొదలు, ఆకాశము.
తోత్రము
సం. నా. వా. అ. న. తత్స. తుద్యతే అనేన గజ ఇతి తోత్రం. దీని చేత ఏనుగు వ్యధ పెట్టబడును, మునికోల. తుద్యతే తోత్రం. దీని చేత పశ్వాదికము వ్యధ పెట్టబడును, బరిగోల. తుద్యతే తాడ్యతే అనేనేతి తోత్రం, అంకుశము, కొరడా.
తోదనం
సం. నా. వా. అ. న. తత్స. తుద్యతే తోదనం. దీని చేత పశ్వాదికము వ్యధ పెట్టబడును, నొప్పించుట, మునికోల, కొరడా, తోలుట.
తోమరము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చిల్లకోల, నర్వల, ఒక ఆయుధము.
తోయపిప్పలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తోయజా పిప్పలీ తోయపిప్పలీ. నీళ్ళ యందు పుట్టిన పిప్పలి, నీరు పిప్పలి (వృక్ష విశేషం).
తోయము
సం. నా. వా. అ. న. తత్స. తాయతే పాలయతీతి తోయం. రక్షించునది, ఉదకము. తౌతి వర్ధతే వర్షాసు ఇతి తోయం. నీరు, జలము.
తోరణము
సం. నా. వా. అ. న. పుం. తత్స. మంగళార్థం త్వరితా భవంత్యత్ర తోరణం. మంగళము కొఱకు దీని యందు త్వరితులగుదురు, పుష్పమాలికాదులు కట్టుటకై గృహమునకు వెలుపల స్తంభ ద్వయము చేత ఏర్పరచబడిన ద్వారము, మంగళార్థముగా ఆ తోరణమునకు కట్టెడు మామిడాకులు. తుతోర్తి త్వరయా గచ్ఛత్యనేనేతి తోరణం, గుమ్మము.
తౌర్వత్రికము
సం. నా. వా. అ. న. తత్స. తౌర్యేణత్రికం తౌర్యత్రికం. నృత్త గీత వాద్యములు.
త్యక్తము
సం. విణ (అ.ఆ.అ.) తత్స. త్యజ్యతే స్మ త్యక్తం. విడువబడినది, త్యాగము, హీనము, విధితము.
త్యాగము
సం. నా. వా. అ. పుం. తత్స. తృజ్యతే త్యాగః. ఇచ్చుట, ఈవి, విడుపు, దానము.
త్రప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్రపతే త్రపా. లజ్జించుట, సిగ్గు, ఱంకుటాలు.
త్రపువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. త్రపతే అగ్నిసన్నిధౌ ద్రవతీతి త్రపుః. అగ్ని సమీపమందు సిగ్గు పడునది, తగరము. త్రపతే వహ్నిం ప్రాప్య లజ్జతే ఇవ త్రపుః. సీసము.
త్రయి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. త్రయోవేదా అవయవాః అస్వా ఇతి త్రయీ. మూడు వేదములు అవయవములుగా కలిగినది, మూడు వేదములు, మూటి సమూహము, ఏనుగు కాలినంకెల, కుటుంబముకలఆడది, మంచి మనస్సకల ఆడది, ఒక విద్య, సుమతి, దుర్గ.
త్రయీతనువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. త్రయీ త్రయోవేదా ఏవ తనుర్యస్య త్రయీ తనుః. మూడు వేదములే శరీరముగా కలవాడు, సూర్యుడు.
త్రసము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. త్రస్యతీతి త్రసం. భయపడునది, తిరుగునది, జంగమము, చరము.
త్రసరము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రస్యతి భీతవ దితస్తతశ్చలతీతి త్రసరః. భయపడిన దాని వలె ఇటు అటు చలించునది, పంటె కర్ర, నూలు చుట్టుట, సూక్ష్మము, దారము.
త్రస్నువు
సం. విణ. ఉ. తత్స. త్రస్యతి తాచ్ఛీల్యేనేతి త్రస్నుః. వెరచు స్వభావము కలవాడు, భయపడువాడు, పిఱికి.
త్రాణము
సం. నా. వా. అ. న. తత్స. త్రాయతే స్మ త్రాణం. రక్షింపబడినది, కాపు, కావబడినది. రక్షణం త్రాణం. రక్షించుట, కలుకానుగు చెట్టు, రక్షితుడు.
త్రాతము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. త్రాయతే స్మ త్రాతం. రక్షింపబడునది, కావబడినది.
త్రాయంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రోగేభ్యః త్రాయత ఇతి త్రాయంతీ. రోగము వలన రక్షించునది, కలుకానుగు చెట్టు, కలుక్రాంత చెట్టు, గురువింద.
త్రాయమాణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రోగేభ్యః త్రాయత ఇతి త్రాయమాణా. రోగము వలన రక్షించునది, కలుకానుగు చెట్టు, గురువింద.
త్రాసము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రసనం త్రాసః. సాధువులను బాధించునది, భయము, మణి దోష విశేషము, రత్నము.
త్రిక
సం. నా. వా. ఆ.స్త్రీ. తత్స. త్రయః అవయవాః అస్య త్రికా. మూడు అవయవములు కలిగినది, నూతి గిరక, వెన్నెముక క్రింది చివర.
త్రికకుత్తు
సం. నా. వా. ద్. పుం. తత్స. త్రయః కకుదో యస్య త్రికకుత్. మూడు శిఖరములు కలది, త్రికూట పర్వతము, విష్ణువు, అభినయ హస్త విశేషము.
త్రికటువు
సం. నా. వా. అ. న. తత్స. త్రయాణాం కటూనాం శుంఠీమరీచపిప్పలీనాం సమాహారః త్రికటుః. శొంఠి, మిరియము, పిప్పలి యొక్క సమూహము.
త్రికము
సం. నా. వా. అ. న. తత్స. త్రయాణాం ఊరుద్యయపృష్ఠాస్తినాం సమాహారస్త్రీకం. మూటి సమూహము, ముడ్డి పూన, సొంటి పిప్పిలి మిరియాలు, కరకతాడి ఉసిరికలు, తొడలు రెండు వీపు ఎముక యొక్క కూటమి, మూడు దారులు కలయుచోటు, వెన్నముక క్రింది చివర.
త్రికూటము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రయః కూటాః శిఖరాణి యస్య సత్రికూటః. మూడు శిఖరములు కలది, ఒకానొక పర్వతము, ఉప్పు, త్రికోణాకారముకల వేదిక, చిత్రకూటము.
త్రిగుణాకృతము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. త్రివారం కృష్టం త్రిగుణాకృతం. మూడు సార్లు దున్నిన నేల.
త్రిదశాలయము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రిదశానామాలయః త్రిదశాలయః. దేవతలకు నివాస స్థానము, స్వర్గము, వేల్పు ప్రోలు. త్రిదశానాం దేవానాం ఆలయః నివాసస్థానమితి త్రిదశాలయః.
త్రిదశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఉత్పత్తి స్థితి వినాశాత్మికాస్తిస్రో దశావయోవస్థా యేషాం తేత్రిదశాః. ఉత్పత్తి స్థతి నాశములనే ముడు అవస్థలు కలిగినవారు, దేవత, వేల్పు. తృతీయా యౌవనాఖ్యా దశా యస్య సః త్రిదశః దేవుడు.
త్రిదివము
సం. నా. వా. అ. పుం. తత్స. తృతీయో దివో లోకః త్రిదివః. మూడవ లోకము, స్వర్గము. త్రయో బ్రహ్మవిష్ణురుద్రా దీవ్యంత్యత్రేతి త్రిదివః. ఆకాశము.
త్రిదివేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. త్రిదివస్య ఈశా త్రిది వేశాః. స్వర్గమునకు ప్రభువులు, త్రిదశుడు, వేల్పు.
త్రిపథగ
సం. నా. వా. ఆ.స్త్రీ. తత్స. స్వర్గమర్త్యపాతాళ మార్గేషు త్రిషు గచ్ఛతీతి త్రిపథగా. స్వర్గమర్త్య పాతాళ మార్గములు మూటి యందు పోవునది, గంగానది. త్రిపథే స్వర్గమర్త్యపాతాలమార్గే గచ్ఛతీతి త్రిపథగా. గంగ.
త్రిపుట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్రయః పుటా అస్య ఇతి త్రిపుటా. మూడు పుటములు కలది, తెల్ల తెగడ చెట్టు, మల్లె చెట్టు. త్రిపుటాకారత్వాత్త్రిపుటా. మూడు పుటలు కలది, చిన్న ఏలకులు.
త్రిపురాంతకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. త్రిపురాణా మంతకః త్రిపురాంతకః. త్రిపురములకు నాశకుడు, శివుడు. త్రిపురస్య త్రిపురాసురస్య అంతకః త్రిపురాంతకః. శివుడు.
త్రిఫల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్రయాణాం ఫలానాం సమాహారః త్రిఫలా. మూడు కాయల యొక్క సమూహము, కరకతాడి ఉసిరికలు, ద్రాక్షా కాశ్మర్య ఖర్జూర ఫలములు, జాజీలవంగ పూగ ఫలములు.
త్రిభండి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. త్రిభిర్గుణైర్భణ్యతేశబ్ద్యత ఇతి త్రిభండీ. గుణముల చేత పలుకబడునది, తెల్ల తెగడ చెట్టు.
త్రియామ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్రయోయామాః యస్యాం సాత్రియామా. మూడు జాములుకలది, రాతిరి, పసుపు, యమునా నది. త్రయో యామాః ప్రహరాః యస్యాః త్రియామా.
త్రిలోచనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. త్రీణిలోచనాని యస్యసః త్రిలోచనః. మూడు కన్నులు కలవాడు, శివుడు, ముక్కంటి.
త్రివర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రయాణాం వర్గః త్రివర్గః. ధర్మ కామార్థముల యొక్క సముహము, సత్వరజస్తమములు, క్షయ స్థాన వృద్ధులు, త్రికటుకము, త్రిఫల.
త్రివిక్రముడు
సం. నా. వా. అ. పుం. తత్స. బలిబంధనకాలే త్రిషు లోకేషు త్రయో విక్రమాః పాద న్వాసాః యస్యసః త్రివిక్రమః. బలిబంధన కాలమందు మూడు లోకములను మూడడుగుల చేత కప్పినవాడు, విష్ణువు.
త్రివిష్టపము
సం. నా. వా. అ. న. తత్స. తృతీయం విష్టపం త్రివిష్టపం. మూడవ లోకము, స్వర్గము, వేల్పుప్రోలు.
త్రివృత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్రిభిః పుటైర్వ్రియతే ఆచ్ఛాద్యత ఇతి త్రివృతా. మూడుపుటముల చేత కప్పబడునది, తెల్ల తెగడ చెట్టు.
త్రివృత్
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. కఫహరణ పిత్తహరణ రేచకత్వరూపాణాం త్రయాణాం గుణానాం వృత్తిర్వర్తన మత్రేతి త్రివృత్. శ్లేష్మహరణ పిత్తహరణ రేచకత్వములనెడు మూడు గుణముల యొక్క వర్తనము, తెల్ల తెగడ చెట్టు, మూడు పోచలు.
త్రిసంధ్యము
సం. నా. వా. అ. న. తత్స. తిసృణాం సంధ్యానాంసమాహారః త్రి సంధ్యం. మూడు సంధ్యల ఏకీభవము, పూర్వాహ్న మధ్యాహ్న పరాహ్న సంధ్యలు, మూడు సంధ్యలకాలము.
త్రిసీత్యము
సం. విణ. (అ.ఆ.అ.) తత్స. త్రివారం కృష్టం త్రిసీత్యం. మూడు సార్లు దున్నిన నేల.
త్రిస్రోత
సం. నా. వా. స్. స్త్రీ. తత్స. త్రీణి స్రోతాంసి యస్యాస్సా త్రిస్రోతాః. మూడు ప్రవాహములు కలది, గంగా నది, నదీ విశేషము.
త్రిహాయణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. త్రయోహాయనాః ప్రమాణమస్యా ఇతి త్రిహాయణీ. మూడేండ్ల వయస్సు కలది.
త్రిహాల్యము
సం. విణ. (అ.ఆ.అ.) తత్స. త్రివారం కృష్టం త్రిహల్యం. మూడు సార్లు దున్నిన భూమి, త్రిసీత్యము.
త్రుటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సూక్ష్మత్వాత్రుట్యతీతిత్రుటిః సూక్ష్మమగుచే త్రుంచబడునది, సన్న ఏలకులు. త్రుట్యత ఇతి త్రుటిః. త్రుంచబడునది,ఇంచుక, లఘు అక్షరము యొక్క చతుర్థ భాగోచ్చారణము చేయునంతటి కాలము, సంశయము, అల్పము, సంశయము, కాలభేదము, క్షణము, అణువు, సందేహము.
త్రేత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సదాత్రాం రక్షణం ఇతా త్రేతా. ఎల్లప్పుడు రక్షణము పొంది ఉండునది, మూడు అగ్నులు (అగ్నిత్రయము) త్రిత్వమితా ప్రాప్తా త్రేతా. త్రిత్వ సంఖ్యను పొందునది, ఒక యుగము. త్రీన్ భేదాన్ ఏతి ప్రాప్నోతీతి త్రేతా. దక్షిణాగ్ని, ఒక విధముగా పాచిక వేయుట.
త్రోటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. త్రుట్యతి మాంసాదిరమితి త్రోటిః. మాంసాదులను త్రుంచునది, పక్షిముక్కు, చేపముక్కు, టేకు చెట్టు. త్రోట్యతే భిద్యతే అనయేతి త్రోటిః. మత్స్యవిశేషము.
త్ర్యంబక సఖుడు
సం. నా. వా. అ. పుం. తత్స. త్ర్యంబకస్య శివస్యసఖా త్ర్యంబకసఖః. శివుని సఖుడు, కుబేరుడు, ముక్కంటి చెలి.
త్ర్యంబకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః. మూడు కన్నులు కలవాడు, శివుడు, ముక్కంటి.
త్ర్యూషణము
సం. నా. వా. అ. న. తత్స. త్రీణి ఊషణాని యస్య త్ర్యూషణం. దీనిచే రోగములు బాధింపబడును, సొంటి, పిప్పలి, మిరియాలు.
త్వక్కు
సం. నా. వా. చ్. స్త్రీ. తత్స. ఆవృణోతి వృక్షమితి త్వక్. వృక్షమును కప్పి ఉండునది, చెట్టుపట్ట. త్వగ్ఛూయస్త్వాత్త్వక్. పట్టలు తరచుగా కలది, లవంగపు చెట్టు. త్వచతి మాంసం వేష్టయతి త్వక్. మాంసమును కప్పునది, చర్మము, తోలు, నార. త్వచతి సంవృణోతి మేదశోణితాదికమితి త్వక్.
త్వక్షీరము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. (రూ. ఈ. స్త్రీ. త్వ క్షీరీ, అ. న. త్వక్షీరం). త్వచః వేణోః సకాశాత్ స్రవత్ క్షీరమస్యా ఇతి త్వక్షీరా. వెదురు వలన పుట్టిన పాలు కలిగినది, తవక్షీరి చెట్టు.
త్వక్సారము
సం. నా. వా. అ. పుం. తత్స. త్వచి సారోదార్థ్యమస్యేతి త్వక్సారః. పైన చర్మమందు సారము కలది, వెదురు.
త్వచము
సం. నా. వా. అ. న. తత్స. త్వగ్భూయస్త్వాత్త్వచం. పట్టలు తరచుగా కలది, లవంగపు పట్ట.
త్వచిసారము
సం. నా. వా. అ. పుం. తత్స. త్వచి సారోదార్థ్యమస్యేతి త్వచిసారః. పైన చర్మమందు సారముకలది, త్వక్సారము,వెదురు.
త్వర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్వరణం త్వరా. వేగిరపడుట, సంభ్రమము, వేగిరపాటు, తొందర.
త్వరితము
సం. క్రి. విణ. అ. న. తత్స. త్వరం త్యనేనేతి త్వరితం. దీని చేత సంభ్రమింతురు, శ్రీఘ్రము. త్వరితమస్యాస్తీతి త్వరితః. వేగము కలవాడు, వడికలది.
త్వష్ట
సం. నా. వా. ఋ. పుం. తత్స. తక్ష్ణోతి త్వక్ష్ణోతి చ కాష్ఠాని తనూకరోతీతి త్వష్టా. కొయ్యలు చెక్కువాడు, విశ్వకర్మ. త్వక్షతి త్వష్టా. చెక్కువాడు, ద్వాదశాదిత్వులలో ఒకడు, వడ్లవాడు. త్వక్షతి కాష్ఠాదికం శిల్పకార్యత్వాదితి త్వష్టా.
త్వష్టము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. తక్ష్యతే త్వక్ష్యతే స్మ త్వష్టః. చెక్కబడునది.
త్విట్టు
సం. నా. వా. ష్. స్త్రీ. తత్స. త్వేషతే త్విట్. కాంతియుక్తమైనది, ప్రకాశించుట, జగి, మంట, వెలుగు.
త్విషాంపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. త్విషాం ప్రభణాం పతిః త్విషాంపతిః. కాంతులకు పతి, సూర్యుడు, వెలుగురేడు.
త్సరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. త్సరతి ముష్టినా త్సరుః. పిడికిటితో కూడి ఉండునది, కత్తి యొక్క పిడి. త్సరతి కౌటిల్యం గచ్చతీతి త్సరుః. సర్పము, కత్తిపిడి.