హల్లులు : ధ
ధటము
సం. నా. వా. అ. పుం. తత్స. కొయ్యత్రాసు.
ధనంజయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధనంజయతీతి ధనంజయః. ధనమును జయించువాడు, అగ్ని, అర్జునుడు. ధనం జయతి సంపాదయతీతి ధనంజయః. ఇంద్రుడు.
ధనదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధనం దయతే రక్షతీతి కౌధనదః. ధనమును రక్షించువాడు. ధనం దదాతీతి ధనదః. ధనమునిచ్చువాడు, కుబేరుడు. ధనం దయతే పాలయతీతి ధనదః. సం. విణ. తత్స. దాత.
ధనము
సం. నా. వా. అ. న. తత్స. ధినోతి ప్రిణయతీతి ధనం. సంతోష పెట్టునది, విత్తము, ఆవులమంద. దధంతి ధాన్యాదికముత్పాదయతీతి ధనం. అర్థము, సంపద, రత్నము, భోజనము, మేధ, యశస్సు, ద్రవ్యము, ద్రవిణము.
ధనహరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బహుమూల్యత్వేన ధనం హరతీతి ధనహరీ. బహు మూల్యమౌట చేత ధనమును హరించునది, నల్లకచోరము, బలరక్కసి చెట్లు.
ధనాధిపుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధనస్య అధిపః ధనాధిపః. ధనమునకు అధిపతి, కుబేరుడు, పయిడిరేడు. (బంగారు రాజు).
ధని
సం. విణ. (న్. ఈ.న్.). తత్స. ధనమస్యాస్తీతి ధనీ. ధనము కలవాడు, ధనికుడు, కుబేరుడు.
ధనిష్ఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధనతి ధనం కరోతీతి ధనిష్ఠా. సంపదను చేయునది, నక్షత్ర విశేషము. అతిశయేన ధనవతీ ధనిష్ఠా. వసుదేవత.
ధనుఃపటము
సం. నా. వా. అ. పుం. తత్స. ధనుష ఇవ పటో విస్తారో అస్య ధనుష్పటః. ధనుస్సు వంటి విస్తారము కలది, మోరటి చెట్టు.
ధనుర్ధరుడు
సం. విణ. (అ. ఈ. అ.). తత్స. ధనుర్ధరతీతి ధనుర్ధరః. విల్లును పట్టినవాడు, విలుకాడు.
ధనువు
సం. నా. వా. ఉ. స్. పుం. న. తత్స. ధన్యతే ప్రార్ధ్యతే ధనుః. ప్రార్ధింపబడునది, ఒకరాశి, విల్లు, నాలుగు మూరల కొలది, వింటి, 8 అంగుళములు, 96 అంగుళములు (4 హస్తములు).
ధనుష్మంతుడు
సం. విణ. (త్. ఈ. త్.). తత్స. ధనురస్యాస్తీతి ధనుష్మాన్. విల్లు కలవాడు, విలుకాడు.
ధన్యుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ధనం పుణ్యం లబ్ధో ధన్యః. పుణ్యము పొందినవాడు, పుణ్యవంతుడు, ఉదారుడు.
ధన్వము
సం. నా. వా. న్. న. పుం. తత్స. ధన్యతే ధన్వం. ప్రార్ధింపబడునది, మెట్ట నేల, విల్లు, నిర్జల భూమి. ధన్వతి జలాభావం గచ్ఛతీతి ధన్వా. అంతరిక్షము, ఎడారి, 8 హస్తములధనస్సు.
ధన్వయాసము
సం. నా. వా. అ. పుం. తత్స. ధన్వని మరుదేశే యాసో ధన్వయాసః. మరుదేశమందు పుట్టునది, తీటకసిందచెట్టు.
ధన్వి
సం. నా. వా. న. పుం. విణ. తత్స. ధన్వాస్యాస్తీతి ధన్వీ. విల్లు కలవాడు, అర్జునుడు, ఏరుమధ్ధి చెట్టు, విలుకాడు.
ధమనము
సం. నా. వా. అ. పుం. తత్స. సుషిరవత్త్వా ద్ధ్మాయతే పూర్యత ఇతి ధమనః. రంధ్రముకలదౌటచేత ఊదబడునది, కిక్కసకసవు, రెల్లుగడ్డి, నాసాపుటము.
ధమని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుషిరత్త్వాద్ధమ్యత ఇతి ధమనీ. రంధ్రయుక్తమై ఊదబడునది, నరము, నఖమనెడు గంధ ద్రవ్యము, మెడ, అగసాలె వాని గొట్టము, గువ్వకుత్తిక, చెట్టు (ఒక ఆకుకూర) నాడి, స్నాయు భంధనము.
ధమ్మిల్లము
సం. నా. వా. అ. పుం. తత్స. ధమిత్యవ్యయం మూర్ధాధః ఊర్ధ్వం వా మిల్యతే ధమ్మిల్లః. శిరస్సయొక్కపైనకాని,కిందకానికూడిఉండునది,కొప్పు.
ధర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధరతి విశ్వం ధరా. విశ్వమును ధరించునది, భూమి, నేల, మావి, మెదడు. ధరతి జీవసంఘానితి ధరా. పృథివి, తిప్పతీగ.
ధరణి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. ధరతి విశ్వం ధరణి. విశ్వమును ధరించునది, భూమి, నేల. ధరతి జీవాదీనితి ధరణిః. పృథివి, ధరిత్రి.
ధరము
సం. నా. వా. అ. పుం. తత్స. ధరతి భువం ధరః. భూమిని ధరించునది, కొండ, తాబేటిరేడు, పత్తి, వెల. ధరతి పృథ్వీమితి ధరః. ధరుడు, మహాదేవుడు, శ్రీకృష్ణుడు, విష్ణువు.
ధరిత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ధరతి విశ్వం ధరిత్రీ. విశ్వమును ధరించునది, భూమి, నేల. ధరతి జీవజాతమితి ధరిత్రీ. పృథివి.
ధర్మ సంహిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధర్మః సంధీయతే మునిభిరత్రేతి ధర్మ సంహితా. ధర్మము దీని యందు మునులచేత కూర్చబడినది, మన్వాది ధర్మశాస్త్రం, స్మృతి.
ధర్మధ్వజి
సం. నా. వా. న. పుం. తత్స. ధర్మస్య ధ్వజన్చిహ్నమస్యేతి ధర్మధ్వజీ. ధర్మము యొక్క చిహ్నము కలవాడు, జీవనార్ధము లింగ జటాది చిహ్నములు ధరించినవాడు, తాటదమ్మడు.
ధర్మము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ధరతి విశ్వం ధర్మః. విశ్వమును ధరించునది, వేదోక్త విధి. ధరతి లోకానితి ధర్మః. లోకములను ధరించునది, ఉపనిషత్తు, యజ్ఞము. ధ్రియతే వా జనైరితి ధర్మః. జనుల చేత పూనబడునది, పుణ్యము, సామ్యము, ఆచారము. ధరతీతి ధర్మః. ధరించునది, న్యాయము, స్వభావము, అహింస, పుణ్యము, శ్రేయము, స్వభావము, కత్తి, శీలము, సోమపానము చేసినవాడు, విధి, యముడు బాధింపకుండుట, ఈవి, సమానత్త్వము.
ధర్మరాజు
సం. నా. వా. అ. పుం. తత్స. ధర్మస్య సత్యాహింసాదేః రాజా ధర్మరాజః. సత్యము, అహింస మొదలుగా కల ధర్మములకు రాజు, బుద్ధదేవుడు. యధాపరాధదండదానేన ధర్మస్య రాజా ధర్మరాజః. అపరాధమునకు తగినట్లు శిక్షించుట చేత ధర్మమునకు రాజు, యముడు. ధర్మస్య రాజా ధర్మరాజః. ధర్మమునకు రాజు, యుధిష్ఠిరుడు. ధర్మేణ రజతే ఇతి ధర్మరాజః. యముడు.
ధర్షణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఛర్షయతి ప్రగల్భతే ధర్షణీ. దిట్టతనము కలిగి ఉండునది, రంకుటాలు, పుంశ్చలి, లజ్జనేనిది.
ధవము
సం. నా. వా. అ. పుం. తత్స. ధునోతి స్త్రియం ధవః. స్త్రీని కంపించువాడు, మగడు. దూయతే అనేన, ధువతీతి చ ధవః. వీని చేత కంపింపచేయబడును, ఉమ్మెత్త చెట్టు, చండ్ర చెట్టు. ధునోతి ధవతీతి వా ధవః. పతి, మొగుడు, స్వామి, మనుష్యుడు.
ధవళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధవళత్వాత్ ధవళా. తెల్లని వన్నె కలది, ఆవు.
ధవళము
సం. నా. వా. అ. పుం. తత్స. ధావతి శుద్ధ్యతి ధవళః. దీని చేత పదార్ధము శుద్ధి పొందును, తెలుపు, ఆఁబోతు, రాగవిశేషము. సం. విణ. తత్స. తెల్లనిది, చక్కనిది, అందమైనది, ఉత్తమము.
ధవిత్రము
సం. నా. వా. అ. న. తత్స. ధూయతే అహ్నిరనేనే ధవిత్రం. దీని చేత అగ్ని కంపింపచేయబడును, యాగము నందు అగ్నిని ప్రజ్వలింపచేయుటకు కృష్ణాజినముతో చేయబడిన విసనకర్ర, తోలు విసనకర్ర.
ధాత
సం. నా. వా. ఋ. పుం. తత్స. సర్వం దధాతీతి ధాతా. సమస్తమును ధరించినవాడు, బ్రహ్మ, ఒక ఆదిత్యుడు, ఒక సంవత్సరము, మహాదేవుడు, ధారకుడు.
ధాతకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దధాతి పుష్పాణీతి ధాతకీ. పుష్పములను ధరించునది, ఆరె చెట్టు, ధాతు పుష్టిక అనుతీగ.
ధాతుపుష్పిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దాతువద్రక్తాని పుష్పాణ్యస్యా ఇతి ధాతుపుష్పికా. జేగురు వలె ఎర్రనైన పువ్వులు కలది, అరె చెట్టు, ధాతకి.
ధాతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ధత్తేమిథో వ్యావర్తకం ధర్మం ధాతుః. పరస్పరము భేదమైన ధర్మమును ధరించునది, వాతములోనగునది. దధాతీతి ధాతుః. ధరించునది, పోషించునది, వసలోనగునది, మణిసిలలోనగు శిలావికారము, గైరిక ధాతువు, పృధివిలోనగునది, శబ్దములోనగునది, త్వక్కులోనగునది, భూధాతువులోనగునది. ధీయతే సర్వమస్మిన్నితి ధాతుః. రసాదులగు శరీరభాగములలో ఒకటి, ప్రాణాది వాయువు, చర్మము, రోమము, శబ్దస్పృర్మాదికము మొదలుగునవి, ప్రకృతి, లోకము, ధనము, బంగారము, వీర్యము, ఎముక.
ధాత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. విణ. తత్స. దధాతీతి ధాత్రీ. ధరించునది, ధరింపచేయునది, నేల, దాది, తల్లి, ఉసిరిక చెట్టు. ధీయతే పీయతే ఇతి ధాత్రీ. గంగ, పెంపుడు తల్లి.
ధాన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధనతి పుష్ణంతీతి ధానాః. పోషించునది, బొరుగులు, ధనియాలు, మొగ్గ, ధాన్యకము, కొత్తిమిర, వేపుడు బియ్యము, విత్తనము.
ధానుష్కుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. ధనుః ప్రహరణమస్యేతి ధానుష్కః. విల్లే ఆయుధముగా కలవాడు, విలుకాడు.
ధాన్యము
సం. నా. వా. అ. న. తత్స. దధాతి దేహమితి ధాన్యం. దేహమును పోషించునది, కొలుచు, ధనియాలు. ధానే పోషణే సాధు ఇతి ధాన్యం. అన్నము. (నవధాన్యములు, గోధుమలు, యవలు, పెసలు, సెనగలు, కందులు, బొబ్బరలు, నువ్యులు, మినుములు, ఉలవలు).
ధాన్యాకము
సం. నా. వా. అ. న. తత్స. ధాన్యసాదృశ్యమకతీతి ధాన్యాకం. ధాన్య సాదృశ్యమును పొందునది, ధనియాలు. ధాన్యమకతి సాదృశ్యత్వేన ప్రాప్నోతీతి ధాన్యాకం.
ధాన్యామ్లము
సం. నా. వా. అ. న. తత్స. అమ్లీభూతధాన్యత్వాత్ ధాన్యామ్లం. పులిసిన ధాన్యజలము, పులియపెట్టిన కడుగునీరు, కలి. ధాన్యాద్ ధాన్యవికారాత్ జాతం ఆమ్లం ఇతి ధాన్యామ్లం, గంజి.
ధామనిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ధామ్నాం నిధిః ధామనిధిః. కాంతులకు గనియైనవాడు, సూర్యుడు.
ధామము
సం. నా. వా. న్. న. తత్స. దధాతి, ధీయతే చ ధామ. ధరించునది, ధరింపబడునది, ఇల్లు, చోటు, వెలుగు, కాంతి, ప్రభావము, మేను, పుట్టువు. దధాతి గృహస్థాదికమితి ధామ. రశ్మి, దేహము, ప్రభావము, ఘనత, ఆహరము, అందము, ఆకాశము, తినుట.
ధామార్గవము
సం. నా. వా. అ. పుం. తత్స. దామ్నో అర్గః ధామార్గవః. గేహావరణమును పొందునది, ఉత్తరేను చెట్టు. ధామ ఆర్జయతీతి ధామార్గవః. కాంతిని ఆర్జించునది, ఆవడ చెట్టు, ఒక రకపు దోశ.
ధాయ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధీయతే సమిదనయేతి ధాయ్యా. దీనిచేత సమిత్తు ధరింపబడును, యాగమునందు అగ్నిని ప్రజ్వలింపచేయునపుడు పఠించెడు ఋక్కు.
ధార
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధార్యతే తురగైరితిధారా అశ్వములచేత ధరింపబడునది. పై నుండి పడు నీరు, వానకాలు, కత్తిలోని వాడి, కుండలోని చిల్లి, దండు ముందరి భాగము, అశ్వగతి, ప్రవాహము, పరంపర, ఒకానొక పట్టణము. ధార్యంతే అశ్వా యయా ఇతి ధారా. ఉత్కర్షము, రథచక్రము. సం. నా. వా. అ. పుం. తత్స. అప్పు, పర్వత విశేషము.
ధారణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధార్యతే అనయా ధారణా. దీనిచేత ధరింపబడును, భగవంతుని తప్ప మరొకటి ఎరుగని, మేర. సం. నా. వా. అ. న. తత్స. ధరించుట, అష్టాంగములలో ఒకటి, మర్యాట, పూడు దూలము.
ధారాధరము
సం. నా. వా. అ. పుం. తత్స. జలాధారాణాం ధరః ధారాధరః. జలధారలను ధరించునది, మేఘము, ఖడ్గము.
ధార్తరాష్ట్రము
సం. నా. వా. అ. పుం. తత్స. ధృతరాష్ట్రదేశే భవో ధార్త రాష్ట్రః. ధృతరాష్ట్ర దేశమందు పుట్టినది, నల్లని ముక్కు కాళ్ళుకల హంస.
ధార్మపత్తనము
సం. నా. వా. అ. న. తత్స. ధర్మపత్తనే భవం ధార్మపత్తనం. ధర్మపత్తనమను దేశమందు పుట్టునది, మిరియాలు.
ధావని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ధావతి ప్రసరతీతి ధావనీ. వ్యాపించునది, నక్కతోక పొన్న చెట్టు, మల్లె చెట్టు.
ధిక్కృతుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. ధిగితి కృతః ఉచ్చారిత ఇతి ధిక్కృతః. చెడ్డవాడని పలుకబడినవాడు, తిరస్కరింపబడినవాడు. ధిగితి శబ్దవిషయః కృతః ధిక్కృతః. ధిక్కరింపబడినవాడు, వెలివేయబడినవాడు, నిందితుడు, తిరస్కృతుడు.
ధిషణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దృష్ణువంతి ప్రగల్భంతే అనయా ధిషణా. దీనిచేత ప్రగల్భులగుదురు, బుద్ధి, మనీష. ధృష్ణోత్యనయేతి ధిషణా. ప్రస్తరము, పార్వతి, స్త్రీ, చిహ్నము.
ధిషణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధిషణాబుద్ధిరస్యాస్తీతి ధిషణః. మంచి బుద్ధి కలవాడు, బృహస్పతి. ధృష్ణోతి ప్రాగల్భ్యం దదాతీతి ధిషణః.
ధిష్ణ్యము
సం. నా. వా. అ. న. తత్స. ధృష్ణోతీతి ధిష్ణ్యం. సమర్ధమై ఉండునది, గృహము, స్ధానము, బలము, నక్షత్రము. ధృష్ణోతి ప్రగల్భో భవతీతి ధిష్ణ్యః. అగ్ని, శుక్రుడు.
ధీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ధ్యాయంత్యనయేనేతి ధీః. దీనిచేత ధ్యానమును చేయుదురు, బుద్ధి, మతి.
ధీంద్రియము
సం. నా. వా. అ. న. తత్స. ధీః జ్ఞానం తన్నిమిత్తం ఇంద్రియం ధీంద్రియం. జ్ఞానమునకు నిమిత్తమైనది, జ్ఞానేంద్రియము.
ధీమంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. ధీరస్యాస్తీతి ధీమాన. బుద్ధికలవాడు, విద్వాంసుడు, బృహస్పతి, బుద్ధిమతి.
ధీరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రశస్తాం ధియం రాతీతి ధీరః. మంచి బుద్ధిని గ్రహించువాడు, విద్వాంసుడు. ధియం ఈరయతీతి ధీరః. బలవంతుడు, మెల్లగా పోవువాడు, స్థిరుడు, నిశ్చులుడు, సముద్రము, మెల్లన.
ధీవరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధత్తే మత్స్యా దీనితి ధీవరః. మత్స్యాదులను ధరించువాడు, జాలరి, కైవర్తుడు. దధాతి మత్స్యానితి ధీవరః. ఇనుము, సంకరజాతివాడు, బాట కాపరి.
ధీసచివుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధీయా సచతి సమవేతి ధీసచివః. బుద్ధితో కూడి ఉండువాడు, కార్యాలోచన యోగ్యుడగు మంత్రి.
ధుతము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ధూయతే స్మ ధుతః. కదలింపబడినది, విడువబడినది.
ధుత్తూరము
సం. నా. వా. అ. పుం. తత్స. వాతాది రోగాన ధువతీతి ధుత్తూరః. వాతాది రోగములను కంపింపచేయునది, ఉమ్మెత్త చెట్టు.
ధుని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ధునోతి వాతేన ధునీ. వాయువుచేత కంపించునది, నది, ఏరు.
ధురంధరము
సం. నా. వా. అ. పుం. తత్స. ధురం వహతీతి ధురంధరః. భారమును వహించునది, బరువు మోసెడి ఎద్దు, పాల చెట్టు.
ధురీణము
సం. నా. వా. అ. పుం. తత్స. ధురం వహతీతి ధురీణః. భారమును వహించునది, బరువు మోసెడి ఎద్దు.
ధుర్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ధురం వహతీతి ధుర్యః. భారమును వహించునది, బరువు మోసెడి ఎద్దు.
ధూతము
సం. విణ.మ(అ. ఆ. అ.). తత్స. ధూయతే స్మ ధూతం. విడువబడినది, ధూతము యొక్క రూపాంతరము.
ధూపాయితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ధూపాయ్యతే ధూప్యతే స్మ ధుపాయితః. తపింపచేయబడినది, సంతప్తము, బాధను అనుభవించుచున్నవాడు.
ధూపితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ధూపాయ్యతే ధూప్యతే స్మ ధూపితః. తపింపచేయబడినది, ధూపము వేయబడినది.
ధూమకేతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ధూమః కేతుశ్చిహ్నమస్యేతి, ధూమప్రధానం కేతురుత్పాత ఇతి చ ధూమకేతుః. ధూమము చిహ్నముగా కలవాడు కనుకను, ధూమ ప్రధానమైన ఉత్పాతము కనుకను ధూమ కేతువు, అగ్ని, ఉత్పాతము, ఉత్పాతవిశేషము, తోక చుక్క.
ధూమయోని
సం. నా. వా. ఇ. పుం. తత్స. ధూమః యోనిః కారణం యస్య స ధూమయోనిః. ధూమము కారణముగా కలిగినది, మబ్బు, మేఘము.
ధూమలము
సం. నా. వా. అ. పుం. తత్స. ధూమవర్దం రాతి లాతీతి చ ధూమలః. పొగ వంటి వన్నెని ఇచ్చునది, నలుపు ఎరుపు కలిసిన వన్నె. దేవతా పూజాసమయమున వాయించువాద్యము, పొగరంగుకలది.
ధూమ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధూమానాం సమూహో ధూమ్యా. ధూమముల యొక్క సమూహం.
ధూమ్యాటము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్ణతః ధూమ్యే వాటతి ధూమ్యాటః. ధూమ సమూహము వలె నల్లనై ఉండునది, పక్షివిశేషము.
ధూమ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. ధూమ వర్ణం లాతీతి చ ధూమ్రః. పొగ వంటి వన్నెను ఇచ్చునది, నలుపు ఎరుపు కలిసిన వన్నె. ధూమం ధూమవర్ణం రాతీతి ధూమ్రః. వేడి.
ధూర్జటి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ధూర్భార భూతాజటిః జటా యస్యేతి ధూర్జటిః. భారమైన జడలు కలవాడు, శివుడు, ముక్కంటి.
ధూర్తము
సం. నా. వా. అ. పుం. తత్స. ధూర్వతి ఉన్మాదేన హినస్తీతి ధూర్తః. ఉన్మాదము చేత హింసించునది, ఉమ్మెత్త పువ్వు. ధూర్వతి హినస్తి కుటుంబాదికమితి ధూర్తః. కుటుంబాదికమును చెరచువాడు, జూదరి. ధూర్వతి హినస్తీతి ధూర్తః. పీడించువాడు, మోసకాడు, త్రుప్పు, పెద్దకదంబచెట్టు, తెల్లగోరింట, రక్తచందనచెట్టు.
ధూర్వహము
సం. నా. వా. అ. పుం. తత్స. ధురం వహతీతి ధూర్వహః. భారమును వహించునది, బరువు మోసెడి ఎద్దు.
ధూళి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. ధూయతే వాయునా ధూళిః. వాయువు చేత కంపింపబడునది, దుమ్ము, పరాగము. ధువతి ధూయతే వేతీతి ధూళిః. రేణువు, అశ్వగంధచెట్టు.
ధూసరము
సం. నా. వా. అ. పుం. తత్స. ధునోతి విరూపతయా చిత్తమితి ధూసరః. కురూపమగుట చేత చిత్తమును కంపింపచేయునది, బూడిద వర్ణము, గాడిద, గార్దభము, కపోతము, పావురము, ధూళి, మూషికము, నూనెతయారు చేయువాడు, నెరయుట.
ధృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ధరణం, ధ్రియతే అనయాచ ధృతిః. ధరించుట, ధైర్యము, సంతోషము, సౌఖ్యము, ఒక గ్రహయోగము, ఒక ఛందస్సు. సం. నా. వా. అ. పుం. తత్స. యజ్ఞము, శివుని గుణములలో ఒకటి, తృప్తి, నిశ్చలత.
ధృష్టుడు
సం. విణ. (ఉ.). తత్స. ధృష్టోతీతి ధృష్టః. దిట్టమై ఉండువాడు, దిట్టతనము కలవాడు, ప్రగల్భుడు, చతుర్విధ శృంగార నాయకులలో ఒకడు, నిర్లజ్జుడు, మెండితనము కలవాడు.
ధృష్ణువు
సం. విణ. (ఉ.). తత్స. ధృష్టోతీతి ధృష్ణుః. దిట్టమై ఉండువాడు, దిట్టతనము కలవాడు.
ధేనుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధయత్యేనాం గజశిశురితి ధేనుకా. ఏనుగు పిల్ల దీని చన్ను గుడుచును, ఆడేనుగు. ధేను ఏవ ధేనుకా. ధేనువే ధేనుక, లేగటి ఆవు, ఆడ గుర్రము, చిన్న కత్తి, పార్వతి. ధేనురివ ప్రతికృతిః ధేనుకా. గోవు.
ధేనువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. ధయత్యేనాం వత్స ఇతి ధేనుః. దూడ దీని చన్నుగుడుచును, లేగటి ఆవు, ధేనుక, గోవు, చాలాకాలమునకు ఈనినది.
ధేనుష్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధేనురేవ ధేనుష్యా. ధేనువే ధేనుష్య, కుదవ పెట్టిన ఆవు.
ధైనుకము
సం. నా. వా. అ. న. తత్స. ధేనూనాం సమూహో దైనుకం. లేగటి ఆవుల గుంపు.
ధైవతము
సం. నా. వా. అ. పుం. తత్స. ధావతినాభ్యాధిస్థానేభ్య ఆగచ్ఛతీతివా దైవతః. ధీమద్భిర్గీయత ఇతి దైవతః. బుద్ధిమంతుల చేత పాడబడునది, సప్తస్వరములలో ఒకటి.
ధోరణము
సం. నా. వా. అ. న. తత్స. ధోరతి చాతుర్యేణ గచ్ఛత్యనేనేతి ధోరణం. దీని చేత చాతుర్యముగా పోవుదురు, ఎక్కదగిన ఏనుగు, వాహనము, హంస.
ధౌరితకము
సం. నా. వా. అ. న. తత్స. చాతుర్యేణాధోరణం ధోరితకం. ఆస్కందితము కంటె అధికమై చతురమైన గతి ధోరితకం, జోడన, అశ్వగతి విశేషము, గుర్రపునడక.
ధౌరేయము
సం. నా. వా. అ. పుం. తత్స. ధురం వహతీతి ధౌరేయః. భారమును వహించునది, బరువు మోసెడి ఎద్దు, బరువుమోయువాడు.
ధ్యామము
సం. నా. వా. అ. న. తత్స. ధ్యాయతే పశుభిరప్రియత్వాదితి ధ్యామం. కామంచి గడ్డి, ధవనము (వృక్ష విశేషము). సం. విణ. తత్స. నల్లనిది.
ధ్రువ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తిష్ఠతీతి ధ్రువా. స్ధిరమైనది, ముయ్యాకు పొన్న చెట్టు. ధ్రువతీతి ధ్రువా. స్ధిరమై ఉండునది, గీతి విశేషము, గుర్రపు సుడి.
ధ్రువము
సం. నా. వా. అ. పుం. న. తత్స. విణ. తత్స. ధ్రువతీతి ధ్రువః. స్ధిరమైనవాడు, ధ్రువుడు, నిలుకడ కలది. చలనాభావాత్ ధ్రువతీతి ధ్రువః. చలనము లేకుండుట వలన స్ధిరమై ఉండునది, మ్రోడు, మర్రి చెట్టు, గసిక, గ్రహయోగ విశేషము, తాళ విశేషము, ఎడతెగనిది, కదలనిది, సంతతము, శాశ్వతము, స్థిరము.
ధ్వజము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ధ్వజతీతి ధ్వజం. కదలునది, టెక్కెము, టెక్కెపు కంబము, గురుతు, మగగురి, గర్వము. ధ్వజతి ఉచ్ఛ్రితో భవతీతి ధ్వజః. పతాకము, జెండా, తూర్పున ఇల్లు, మగ అవయవము.
ధ్వజిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ధ్వజాః అస్యాం సంతీతి ధ్వజినీ. టెక్కెములు కలది, సేన, సీమా భేదము.
ధ్వని
సం. నా. వా. ఇ. పుం. తత్స. ధ్వననం ధ్వనిః. మ్రోత, శబ్దము, వ్యంగ్యప్రధాన శబ్దము, మోత.
ధ్వనితము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. ధ్వనతీతి ధ్వనితం. మ్రోయునది.
ధ్వస్తము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ధ్వంసతే స్మ ధ్వస్తం. జారిపడినది, నశించినది.
ధ్వాంక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. ధ్వాంక్షతి కాంక్షతి ఆమిషమితి ధ్వాంక్షః. మాంసమును కాంక్షించునది, కాకి. ధ్వాంక్షతి మాంసమితి ధ్వాంక్షః. మాంసమును ఇచ్ఛయించునది, కొక్కెర, కొంగ.
ధ్వాంతము
సం. నా. వా. అ. న. తత్స. ధ్వనంత్యత్ర మార్గమపస్యంత ఇతి ధ్వాంతం. మార్గము కనపడక దీని యందు మొర పెట్టుదురు, అంధకారము, చీకటి.
ధ్వానము
సం. నా. వా. అ. పుం. తత్స. ధ్వననం ధ్వానః. మ్రోత, ధ్వని, శబ్దము.