హల్లులు : క
కంకటము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కం వక్షః కటతీతి కంకటకః. వక్షస్సును కప్పునది, వహింపబడిన జోడు కలవాడు, కవచము, బొందలము. 2.కం దేహం కటతి ఆవృణోతీతి కంకటః. కంకటకము.
కంకతికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కంకతే కేశాన్ కంకతికా. కేశములను పొందునది, దువ్వెన.
కంకము
సం. నా. వా. అ. పుం. తత్స. కంకతే కంకః. పోవునది, భాధ్రపదమాసము మొదలు ఆరునెలలు కనిపించక తిరుగునది, రాపులుగు, గ్రద్ద.
కంకాళము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కంజలం స్వాభ్యంతరేణ కాలయతి ప్రేరయతి కంకాళః. జలమును తనలోనికి ప్రేరేపించునది, చర్మమాంసరహితమై ఒడలిన ఎముకలగూడు, డొక్క, అస్థిపంజరము. 2.కం సుఖం శిరో వా కాలయతి క్షిపతీతి కంకాలః. శరీరమునందలి ఎముక, కరంకము.
కంగువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. కేన జలేన గచ్ఛత్యుద్గచ్ఛతీతికంగుః ఉదకముచేత ఎదుగునది, ప్రియంగువు, కొఱ్ఱలు, జొన్నలు.
కంటకము
సం. నా. వా. అ. పుం, న. తత్స. 1.కణంత్యనేన కంటకః. దీనిచేత మొఱ పెట్టుదురు, ముల్లు, చేపలోనగువాని ఎముక, కాకి, రోమాంచము, వెదురు, సూదిమొన, గగుర్భాటు, శత్రువు. 2.కంటతీతి కంటకః. క్షుద్రశత్రువు, దోషము, మకరము, వేణువు, సూచ్యగ్రము, లోమహర్షము, దోషము, మకరము, వేణువు.
కంటకారిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కంటకా నియర్తీతి కంటకారికా. ముండ్లను పొందిఉండునది, వాకుడు (వృక్షవిశేషము).
కంఠము
సం. నా. వా. అ. పుం. తత్స. కణతి ధ్వనతి కణ్ఠః దీనిచేత మింగుదురు, పలుకునది, కుత్తుక, కుత్తుక యొక్క ధ్వని, సమీపము, మంగ (వృక్ష విశేషము) మెడ, స్వరము, గళము, నికటము, ధ్వని.
కంఠీరథము
సం. నా. వా. అ. పుం. తత్స. కంఠేషుస్కందే ఘాహ్యమానోరథః కంఠీరథః. మూపులయందు వహింపబడురథము. బాలకాదుల క్రీడాశకటము, డయనము.
కంఠీరవము
సం. నా. వా. అ. పుం. తత్స. కంఠే రవోయస్యసః కంఠీరవః. కంఠమందు ధ్వని కలది, సింహము, సింగము.
కండువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. 1.కణ్ఢ్యతే నఖైరితి కణ్డూః. నఖముల చేత గోకబడునది, తీట, దురద. 2.కండతే శరీరం మాద్యతి అస్మాద్ ఉష్ణశోణితత్వాదితి కండుః. కండూతి, ఖర్జువు.
కండూయా
సం. నా. వా. అ. స్త్రీ. తత్స. కణ్ఢ్యతే నఖైరితి కణ్డూయా. నఖము చేత గోకబడునది, తీటవేళ్ళు, దురద.
కండూర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కడూం రాతీతి కండూరా. తఱచుగా వర్షాకాలమందు పుట్టునది. దురదగొండివేళ్ళు, దూలగొండి, కంద, ఎర్రతామర, గోరింట.
కండోలము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కండ్యతే మూషికైరితి కండోలః. ఎలుకచే కొరక పడునది, పిటము, గంప, బుట్ట.
కండోలవీణ
సం. నా. వా. అ. పుం. తత్స. కండ్యతే అభిరక్ష్యతే చండాలేనేతి కండోలాః. చండాలుర చేత రక్షింపబడునట్టి వీణ. మాల వీణ, కిన్నెర, చండాల వీణ.
కంద
సం. నా. వా. అ. పుం. తత్స. కందయతి భక్షకాన్ మత్స్యాదీనితి కందః. తన్ను భక్షించునట్టి మత్స్యాదుల సంతోషపెట్టునది. కొమ్మలు వానితో కూడిన దుంప. కంద్యతే రోగోనేనేతి కందః. దీని చేత రోగము పీడింపబడును, కందగడ్డ, తామర తూడు, మేఘము.
కందరము
సం. నా. వా. అ. పుం. తత్స. కేన జలేన దీర్యత ఇతికందరః. జలముచేత ప్రక్కలింపబడునది, గుహ, అంకుశము, జింక.
కందరాలము
సం. నా. వా. అ. పుం. తత్స. కందరాక్ సానూ నలతి భూషయతీతి కందరాలః. పర్వతగుహ ప్రదేశములను అలంకరించునది. కందర మలతీతి కందరాళః. గుహప్రదేశము నలంకరించునది, కొండగొనుగు, కలజువ్వి, కల్లోలి.
కందర్పుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితో దర్పోయస్యసః కందర్పః. కుత్సితమైన దర్పము కలవాడు, మన్మథుడు, మరుడు.
కందళి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కన్దాని కన్దతీతి కన్దళీ. కందమూలాదులయందు కూడియుండునది. దొడ్డకణువును నల్లని ముందరి కాళ్ళు కలమృగము టెక్కెము, ఒక విధమయిన పొద, ఇరువది అంగుళముల నిడివి కలలేడి, ఇరువది అంగుళముల కల యిఱ్ఱి.
కందుకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్కంద్యతే పీడ్యత ఇతి కందుకః. పీడింపపడునది, చెండు వేళ్ళు, ఆడెడు చెందు, బంతి.
కంధర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కంశిరోధారయతి కంధరా. శిరస్సును ధరించునది, మెడ, మబ్బు, మహాస్నాయువు.
కంపనము
సం. నా. వా. అ. న. విణ. తత్స. కంపతే తాచ్ఛీల్యేనేతి కంపనం. స్వభావముననే చలించునది, కదలుట, వణకుట. సం. విణ. తత్స. కదలునది, వణకునది.
కంపము
సం. నా. వా. అ. పుం. తత్స. కంపనం కంపః. చలించుట, వేపధువు, వణుకు, గాత్రము మొదలైన వాటి కదలిక, వేపనము, కంపనము, వేపథువు.
కంపితము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ? వణకెత్తినది.
కంబలము
సం. నా. వా. అ. పుం. తత్స. కామ్యతే శీతాళుభిరితి కంబళః. చలిగలవారిచేత కోరబడునది. కామ్యత ఇతి కంబళః. కోరబడునది, కంబళి, ఉత్తరీయము, కంభళిపురుగు, గంగడోలు, ఏనుగు పక్కెర . సం. నా. వా. అ. న. తత్స. నీరు. కం కుత్సితం శిరో వా కం సలిలం వా బలతే ఇతి కంబలః. రల్లకము, వేశకము, రేణుక, ప్రావారము.
కంబి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కామ్యతే ఉష్ణపరిహారాయేతి కంబిః. ఉష్ణపరిహారార్ధమై కోరపడునది, వెదురుకమ్మి, గరిట.
కంబుగ్రీవా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కంబు తుల్యా గ్రీవా కంబుగ్రీవా. శంఖసమానమైనమెడ మూడుముడతలుకల మెడ, మూడు రేఖలుకల మెడ. కంబువత్ రేఖాత్రయశోభితా గ్రీవా ఇతి కంబుగ్రీవా. శంఖము.
కంబువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కామ్యత ఇతి కంఋః. కాంక్షిప పడునది. కామ్యతే శుభార్థిభిరితి కంబుః. శుభార్థులైన వీరిచేత కాంక్షింపబడునది, గాలి, నెమలి. సం. నా. వా. అ. న. తత్స. నీరు, తల, సుఖము, ఏనుగు, శంఖము, కంకణము, ఒకసంఖ్య.
కంసము
సం. నా. వా. ఆ. పుం. తత్స. కామ్యతే పానార్థమితి కంసః. పానము యొక్క పాత్రము, కంచు, కంచుగిన్నె, మానవిశేషము, ఒకరాక్షసుడు, రెండు రాశులు, లోహము, కృష్టునిమేనమామ, తవ్వ.
కంసారాది
సం. నా. వా. ఇ. పుం. తత్స. కంసస్య అరాతిః. కంసుని శత్రువు, కృష్ణుడు, వెన్నుడు.
కకుదము
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. 1.అల్పం కః శిర ఇవతిష్టతీతి కకుదః. అల్పమైన శిరస్సువలె ఉండునది. ఎద్దుమూపురము, రాజచిహ్నము, శ్రేష్ఠము. 2.కం సుఖం ఉత్కర్షం వా కౌతి ప్రకాశయతి ఇతి కకుదః. పర్వతాగ్రభాగము, ప్రాధాన్యము, మంచిది, గజమేఢ్రము, మూపు.
కకుద్మతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. 1.శ్రోణి పార్శ్వదేశో మాంసలతయా కకుదాకారత్వాత్ కకుదిత్యుచ్యతేతర్యోగాత్ కకుద్మతీ. మూపురమువలె బలిసియుండు శ్రోణి పార్శ్వముకలది, శ్రోణి, పిఱుదు. 2.కకుదివ వృషస్కంధవత్ అతిశయితో మాంసపిండః అస్త్యస్యాం ఇతి కకుద్మతీ. కటిప్రదేశము.
కకుప్పు
సం. నా. వా. బ్. స్త్రీ. తత్స. 1.వాయుం స్కుభ్నాతి భధ్నాతీతిక కుభః స్కుభిస్తంభనే. వాయువును పోనీయక నిలుపునది. దిక్కు, శోభ, సంపెంగ, దండ, అల్లినజడ. 2.శాఖాభిః కకుభోదిశః వ్యాప్నోతీతి కకుభః. కొమ్మల చేత దిక్కులకు వ్యాపించునది, ఏరుమద్ది, దిక్కు.
కకుభము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కేవసూర్యేణ స్కుభ్నం తిద్యోత ఇతి కకుభః. సూర్యుని చేత ప్రకాశించునది, ఏరుమద్ది, వీణకరివె, రాగభేదము, వీణకాయ. 2.కస్య వాతస్య కుః భూమిః స్థానం ప్రకాశరూపవిశేష ఇతి యావత్ భాత్వస్మాత్ ఇతి కకుభః. అర్జున వృక్షము, రాగము, శివుడు.
కక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. 1.కష్యేతే స్వేదేన కక్షౌ. చెమట చేత పీడింపబడునవి. 2.కష్యత ఇతి కక్షః. హింసింపబడునది, కచ్చ, పోటి, చంక, కసెము, గడ్డి, పొద, ఎండినఅడవి. 3.కషదీతి కక్షః. మర్మావయములను కప్పు గుడ్డ, అసూయావిషయము, కచ్ఛము.
కక్ష్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. 1.కక్ష్యౌయాం గజమధ్యభాగే భవా కక్ష్యా. గజమధ్యభాగమందుండునది. 2.కక్ష్యా బృహతికాయాంస్యా. ఏనుగు నడుమున కట్టెడు మోకు నకును పేరు. తొట్టికట్టు, మొలనూలు, వాకుడు, అడవి, ఏనుగు నడుమునకు కట్టు తోలు, మర్మావయములను కప్పుగుడ్డ, ఏనుగు పటికా, అంచు, పటకాప్రహారి, చూష, వూష, వరత్ర, దృష్య, దూష్య, చర్మరజ్జువు.
కచ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. 1.కచ్యతేకచః. ముడువబడునది, ఆడేనుగు, వెండ్రుక, కట్టు ఎండిన పుండు, బృహస్పతి కొడుకు. 2.కచతే శోభతే శిరసీతి కచః. ఒక సంకరజాతి, జుట్టు, బంధము, మేఘము.
కచ్చపము
సం. నా. వా. అ. న. తత్స. 1.కూర్మవత్ స్థితత్వాతత్కచ్ఛపః. కూర్మము వలె నుండునది. 2.కచ్ఛేన పుచ్ఛేన పిబతీతి కచ్ఛపః. పుచ్ఛము చేత పానము చేయునది. తాబేలు, ఒక నిధి, మల్లబంధ విశేషము. 3.కచ్ఛం ఆత్మనో ముఖసంపుటం పాతి, స హి కించిత్ దృష్ట్వా శరీరే ఏవ ముఖసంపుటం ప్రవేశయతి ఇతి కచ్ఛపః. కూర్మము, ధరణీధరుడు, కఠినపృష్ఠం కలిగినది, పంచనఖము, ఒక నిధి, కమఠము, కచ్ఛేష్టము, పల్వలావాసము, పంచసుప్తము, క్రోడాంగము, పంచనఖము, గుహ్యము, పీవరము.
కచ్చపి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కచ్ఛం పాతీతి కచ్ఛపీ. జలప్రాయ భూమిని పాలించునది, ఆడుతాబేలు సరస్వతి యొక్కవీణ, మొటిమ.
కచ్చరము
సం. విణ. (అ.ఆఅ). తత్స. కుత్సితం చరతీతి కచ్చరం. కుత్సితమైఉండునది. మయిలది, మలినము.
కచ్చువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. కషతి కచ్ఛూః. హింసించునది, విచ్ఛరిక, గజ్జి, గజ్జికలవాడు.
కచ్ఛ
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కష్యతే జలైరితికచ్ఛః. జలమును విడుచునది. 2.కష్యతే గజైః కచ్ఛః. గజములచే పీడింపబడునది, చిమ్ముట, ఒకమాతృక, వెనుకచెక్కుకొనెడు దోవతికొంగు, గోచి, కసెము, ఓడఅంగము, దరి, పూదోట, ప్రక్క, నందివృక్షము, గట్టు, మర్మావయవములను కప్పుగుడ్డ, చంక. 3.కేన జలేన ఛృణత్తి దీప్యతే ఛాద్యతే వా ఇతి కచ్ఛః. కూలము, తటము, తీరము.
కచ్ఛురా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కచ్ఛురోగం రాతీతి కచ్ఛురా. కచ్చురోగమును ఇచ్చునది, గంట్లకచోరము, రేగడిదూల, వాకుడు, గోరింట (వృక్ష విశేషము).
కచ్ఛురుడు
సం. విణ. తత్స. కచ్ఛూరస్యాస్తీతి కచ్ఛురః. గజ్జి కలవాడు.
కచ్ఛూ
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. 1.కషతి కచ్ఛూః. విచ్చరిక, గజ్జికలవాడు. 2.కషతి హినస్తి దేహమితి కచ్ఛూ. ఒక రోగము, పామము, విచర్చిక.
కటంభరః
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కటుంబి భర్తీతి కటుంభరా. కారమును భరించునది. కటిం శ్రోణాద్యవయవం బిభర్తి పుష్ణాతి వాతహరణీన కటం భరా. పిరుదు మొదలైన అవయములను వాతహరణము చేతి బీషించుగది, ఆడేనుగు, కటుకరోహిణి, గొంతెమ్మగోరు.
కటకము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కటత్యావృణోతీతి కటకః. పర్వతము చుట్టువాఱియుండునది. 2.కటత్యావృణోతి హస్తమితికటకం. హస్తమును చుట్టిఉండునది. కడియము, కొండనడుము, ఏనుగు కొమ్మునకు వేసెడు పొన్ను, రాజధాని, సముద్రము నందు కలిగెడుఉప్పు. 3.కటతి వర్షతి అస్మిన్ మేఘ ఇతి కటకః. పర్వతమధ్యభాగము, కొండచరియ, కంకణము, సైన్యము, నగరి.
కటభి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కటత్యావృణో తీతి కటభీః. అంతట వ్యాపించునది. మానేరు తీగ, ఒకానొకమ్రాను.
కటా
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కటః కటా. మొల.
కటాక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కటే నేత్ర దేశే అక్ష్ణోతీతి కటాక్షః. నేత్రముల యొక్క వెలుపలిభాగము, కడగంటిచూపు, కడకన్ను. 2.కటావతిశయితౌ అక్షిణీ యత్ర కటాక్షః. అపాంగ దర్శనము.
కటాహము
సం. నా. వా. అ. న. తత్స. 1.కటం ఉత్తాపాదికం ఆహన్తి నివారయన్తీతి. నూనెలోనగునవి కాచెడికడవ, కప్పెర, తాబేటి వెన్నుచిప్ప, ఒకానొనదీవి. 2.కటం ఉత్తాపాదికం ఆహంతి నివారయతీతి కటాహః. నరకము, కూపము, కర్వురము.
కటి
సం. నా. వా. ఇ. పుం, స్త్రీ. తత్స. 1.కట్యతేకటిః. సంహతమైఉండునది. మొల. 2.కట్యతే కటురసేషు గృహ్యతే అసౌ ఇతి కటీ. శోణిఫలకము, కటి. 3.కట్యతే ఆవ్రియతే వస్త్రాదినా ఇతి కటీ. జఘనము. 4.కట్యతే వస్త్రాదినా వ్రియతే అసౌ ఇతి కటిః. శరీరావయవము, కప్పబడినది, నడుము, పిఱుదులు, శ్రోణి, కకుద్మతి, కటీరము, కాంచీపదము, కరభము, కటిపార్శ్వము.
కటుతుంబి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కటుః తిక్తాతుంబీకటుతుంబా. చేదైనసొర, పుచ్చకాయ.
కటురోహిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కటుశ్చాసౌరోహిణీ చకటు రోహిణీ. కటువైనరోహిణి, కటుకరోహిణి.
కటువు
సం. నా. వా. అ. పుం. విణ. తత్స. 1.కటతి ఆవృణోతీతి కటుః. వ్యాపించునది, ఇంపుకానిది, మచ్చరము, వాసనకలది, కారముకలది, వాడిమికలది. 2.సం. నా. వా. ఉ. పుం. తత్స. కటతి తీక్ష్ణతయా రసనాం ముఖం వా ఆవృణోతీతి కటుః. చీనకర్పూరము, కారము, వాసన, పటోలము. 3.సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. కటత్యా వృణోతి రోగం కటుః. రోగమును అడ్డగించునది. కటుకరోహిణి (వృక్షవిశేషము) ప్రేంకణము, నల్లావలు. 3.కటతి వర్షతి దుఃఖమితి, కటత్యావృణోతి పరోత్కర్షమితి చ కటుః. దుఃఖమును కలుగచేయునది, వెల్లుల్లి, అల్లము, మిరియము, శొంఠి, పిప్పలి, వెలిగారము, వగరు కలిగినది, చేదైనది, వెగటు వాసన కలది, తీవ్రము, అంగీకరముకానిది, అకార్యము, మంచివాసనకలది, ద్వేఘ్యడు. 4.కటతి పరలక్ష్మీ దర్శనేన కృపణతాం గచ్ఛతీతి కటుః తీక్ష్ణము, దుర్గంధము, సుగంధి, అకార్యము, దూషణము, మంచివిశేషము, చంపకవృక్షము.
కట్ఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. కటుని ఫలాన్యస్యేతి కట్ఫలః. కారముకల ఫలములుకలది, పినగుమ్ముడు, టేకు చెట్టు.
కట్వంగము
సం. నా. వా. అ. పుం. తత్స. కటూన్యం గాన్యస్య కట్వంగః. కారమైన అవయవములుకలది, దుండిగము, మజ్జిగ, పినువేప చెట్టు.
కఠింజరము
సం. నా. వా. అ. పుం. తత్స. కఠినం జరయతీతి కఠింజరః. కఠినము జీర్ణము చేయునది, నల్ల గగ్గెర.
కఠినము
సం. నా. వా. అ. న. తత్స. కఠతి క్లేశేన జీవతీతి కఠినం. క్లేశము చేత బత్రుకునది కనుక కఠినము, ప్రతిఫలాదులు ఉంచు బుట్ట, గట్టిది, కఠరము, కక్ఖటము, క్రూరము, కఠోరము, నిష్ఠురము, జరఠము, కర్కటము, కాఠరము, స్తబ్ధము, కమఠాయితము.
కఠిల్లకము
సం. నా. వా. అ. పుం. తత్స. కటత్యాపుణోతీతి కటిల్లకః. వ్యాపించునది, కాకరచెట్టువేళ్ళు, కప్ప, నల్లగగ్గెర.
కఠోరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. 1.కఠతిక్షేశేన జీవతీతికఠోరం. క్లేశము చేత బ్రతుకునది, కఠినము, గట్టి. 2.కఠతి పారుష్యమాచరతి ఇతి కఠోరః. దారుణము, పూర్ణము.
కడంగరము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.తచ్ఛాజ్గం రూపం యస్యసః కడంగరః. కళ్ళమును వ్యాపించిఉండునది, పొల్లు, పొల్లుకసవు, ఊక. 2.కడాద్ భక్షణీయతండులాదేః సకాశాద్ గ్రియతే క్షిప్యతే దూరీక్రియతే ఇతి భావః కడంగరః. బుషము.
కడంబ
సం. నా. వా. అ. పుం. తత్స. కడ్యతే భుజ్యత ఇతి కడంబః. భక్షింపబడునది. కలంబము, కూరనార, కాడ.
కడారము
సం. నా. వా. అ. పుం. తత్స. కడతీతి కడారః. బాగుగా తడుపునది. గోరోజనము వంటి వర్ణము, కపిలము, పింగళ వర్ణము.
కణము
సం. నా. వా. అ. పుం. తత్స. 1.కణతి నిమీలతీతికణః. సంకోచమైఉండునది. 2.కణతీతి కణః. మ్రోయునది, నీటిబొట్టు, నూక, కణ, లేశము, ఒక సంకరజాతి, ధాన్యపు ములుకు, నూకలు, బిందువు. 3.కణతి అగ్నిసూక్ష్మత్వం గచ్ఛతీతి కణః. అగ్నికణము, అతిసూక్ష్మము.
కణా
సం. నా. వా. అ. స్త్రీ. తత్స. 1.కణాస్స్తన్యస్యాః కణా. సూక్ష్మమైన అవయవములు కలది. 2.కణాస్సంత్యస్యా ఇతి కణా. జీలకఱ్ఱవేళ్ళు, పిప్పలి, ఒకానొక, ఈగ, చూడు, క్షణ.
కణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కణాస్సంత్యస్యామితికణికా. అగ్నికణములు దీనియందుకలవు. గోధుమరవ్వ, అత్యంతసూక్ష్మవస్తువు, నెల్లి, నీటిబొట్టు, బుడ్డినుండి తీయబడిన సిరా. వీణ తీగల చెవి, నువ్వుకాడ, భాగము, గోధుమ, గోధుమపిండి.
కణిశము
సం. నా. వా. అ. న. తత్స. 1.కణాస్స్తన్యత్రకణీశం. కణములు దీనియందుకలవు, ఎన్ను. 2.కణో విద్యతే అస్య ఇతి కణిశమ్. సస్యమంజరి.
కథ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కథ్యత ఇతి కథా. రచింపబడునది, ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధము (కాదంబర్యాది), ప్రబంధకల్పన, స్వయం రచన, ప్రస్తాపన, వార్త, వాక్యము, వివరణము.
కదంబము
1.సం. నా. వా. అ. న. తత్స. కం వాతం దమయతీతి కదంబః. వాతమును సమింపచేయునది, గుంపు, కడవ, తెల్లావలు, కడిమి చెట్టు, నీటి కడిమి, నికురంబము, సమూహము. 2.సం. నా. వా. అ. పుం. తత్స. కద్యతే దర్శనాద్ విరహిణాం చిత్తవైక్లవ్యం జాయతే అనేనేతి కదంబః. ఒకవృక్షము, నీపము, ప్రియకము, కాదంబము, హరిప్రియము, ప్రావృషేణ్యము, వృత్తపుష్పము, సురభి, లలనాప్రియము, కాదంబర్యము, సీధుపుష్పము, కర్ణపూరకము.
కదరము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం రోగం దృణాతీతి కదరః. కుత్సితమైన రోగమును కొట్టివేయునది, వెలిచండ్ర, రోగవిశేషము, ఱంపము, చండ్ర, ఆవులింత.
కదర్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. 1.కుత్సితిః అర్యః కదర్యః. కుత్సితుడైన ధనికుడు, పిసినిగొట్టు, లోభి. 2.కుత్సితో అర్యః స్వామీ ఇతి కదర్యః. #
కదళీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. 1.కేన వాయునా దళతీతి కదళీ. వాయువుచే పగులునది. అరటి (దీని పుష్పము శిలీంద్రము), ఏనుగు అంబారీమీద టెక్కెము, 20 అంగుళముల నిడివిగల లేడి. 2.కేనవాయునా దళ్యతే కదళీ. దట్టమైన ఎఱ్ఱనైన నల్లని వెంట్రుకలు కల మృగము, ఒక జింక, ఒకరకమైన ఔషధము, రంభ, పిల్లలకు ఇష్టమైనది, వనలక్ష్మి, మోచ, అంశుమత్ఫలము, కాష్ఠీళము, సుఫలము, సుకుమారము, సకృత్ఫలము, గుచ్ఛఫలము, హస్తివిషాణి, గుచ్ఛదంతిక, రాజులకు ఇష్టమైనది, ఊరుస్తంభము, భానుఫలము, వనలక్ష్మి, కదలకము, మోచకము, రోచకము, లోచకము, వారణవల్లభము, చర్మవతి.
కదుష్ణము
1. సం. నా. వా. అ. న. తత్స. ఇంచుకవేడి. 2. సం. విణ. తత్స. కించిదుష్ణం కదుష్ణం. కొంచము వేడియైనది.
కద్రువు
సం. నా. వా. ఉ. పుం. విణ. తత్స. 1.కామయత ఇతి కద్రుః. ఒప్పునట్టిది, గోరోజనము వంటి రంగు. సం. విణ. తత్స. కపిలము. 2.కుత్సితం ద్రాతీతి కద్రుః. కుత్సితమును పొందునది.
కద్వదుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కుత్సితం వదతీతి కద్వదః. కుత్సితముగా పలుకువాడు, నిందింపదగు మాటలాడువాడు, నింద్యుడు, చెడ్డను చెప్పువాడు, చెడ్డవాక్కు.
కధధ్వము
సం. నా. వా. న్. పుం. తత్స. ఏతే అకారాంతః కుత్సితో థ్వాకదథ్వా. కుత్సితమైన మార్గము, చెడుత్రోవ, కాపథము, చెడ్డదారి.
కనకము
సం. నా. వా. అ. న. తత్స. కనతి దీప్యత ఇతికనకం. ప్రకాశించునది, బంగారము, ఉమ్మెత్త, సంపెంగ (మఱియుగనక పర్యాయములన్నిదీనికి నామములగును), కాంచనము, నల్ల అగలు, నాగకేసరము, మోదుగ.
కనిష్ఠా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. అతిశయేన అల్పాకనిష్ఠా. మిక్కిలి చిన్నది, చిటికెనవ్రేలు, చెల్లెలు.
కనిష్ఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అత్యల్పో వయసా కనిష్ఠః. వయస్సుచేత మిక్కిలి తక్కువైనవాడు. సం. విణ. తత్స. అతి శయేన యువా, అల్పశ్చ కనిష్ఠః. మిక్కిలి కొంచెపు వయస్సుకలవాడు. చిటికినవ్రేలు, తమ్ముడు, మిక్కిలి అల్పుడు.
కనీనిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కనతి ప్రకాశయతి సర్వం కనీనికా. కంటి నల్లగ్రుడ్డు. చిటికెనవ్రేలు, అన్నీంటిని ప్రకాశింపచేయునది, కంటిపాప.
కనీయుడు
సం. విణ. (స్.ఈ.స్). తత్స. అతిశయే నయువా అల్పశ్చకనీయాక్. మిక్కిలి కొంచెమైనవయస్సుకలవాడు, మిక్కిలి అల్పుడు, తమ్ముడు.
కన్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కన్యతే కామ్యత ఇతి కన్యా. కోరపడునది, పెళ్ళికాని పడుచు, కూతురు, ఒకరాశి, ఆడుది, కలబంద, పొట్ల, ప్రియంగువు, ఒక చెట్టు, కుమారి, పది సంవత్సరములు నిండిన బాలిక, కన్యక, నారి, ఓషధి విశేషము, సుత, పుత్రి, తీర్థవిశేషము.
కపటము
సం. నా. వా. అ. పుం. తత్స. కం బ్రహ్మణమపి పటతీతి కపటః. బ్రహ్మను కూడపొందునది, కైతవము, కవుడు, అయథార్థవ్యవహారము, వ్యాజము, దంభము, మోసము.
కపర్దము
సం. నా. వా. అ. పుం. తత్స. కేన సుఖేన జలేన వాపరం పూర్తిందదాతీతి కపర్దః. సుఖముచేనిండించునది. గవ్వ, శివుని జడముడి, శివుని జటాజూటము, సవరము.
కపర్పి
సం. నా. వా. అ. పుం. తత్స. కపర్దోస్యాస్తీతి కపర్దీ. కపర్దమనెడి జూటముకలవాడు, శివుడు, ముక్కంటి.
కపాలభృత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. కపాలం బిభర్తీతి కపాలభృత్. కపాలమును భరించినవాడు, శివుడు, ముక్కంటి.
కపాలము
సం. నా. వా. అ. పుం. తత్స. పాలయతి కపాలః. శిరస్సును రక్షించునది, తలపుఱ్ఱె, కుండలోనగువాని పెంచిక, గుంపు.కం మస్తకం పాలయతీతి కపాలః. ఘటములోని సగము.
కపి
సం. నా. వా. అ. పుం. తత్స. కంపతే చలతీతి కపిః. చలనేచలించునది, కోతి, చిల్లమడ్డి, విష్ణువు. కంపతే యః సదా సః కపిః. ఏనుగు, సూర్యుడు.
కపికచ్ఛువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. కపిక్ కషతీతి కపికచ్ఛూః. కోతులను పీడించునది, ఎలుకజీడి, దూలగొండి, గోరింట.
కపిత్థము
సం. నా. వా. అ. పుం. తత్స. కపీనాం ప్రియత్వేన తిష్ఠతీతి కపిత్థః. కోతులకు ప్రియమైఉండునది, వెలగ, అభినయహస్త విశేషము. (నడిమివ్రేలు మొదలగు మూటినిముడిచి బొటన వ్రేలిని చూపుడు వ్రేలిని కొనలు కూర్చి పట్టినది).
కపిల
సం. నా. వా. ఆ. స్త్రీ .తత్స. కపిల వర్ణత్వాత్కపిలా. కపిలవర్ణము కలది. కమ్యాత ఇతి కపిలా. కోరబడునది, ఆగ్నేయదిశఅందలి ఆడేనుగు, పుల్లావు, ఇరుగుడు, కంపుటిరుగుడు, రేణుక అను గంధద్రవ్యము, గోరోజనము వంటి వర్ణము, పుండరీక దిగ్గజము, భార్య, కంచు, శింశుపము, కపిలగోవు, సుగంధ ద్రవ్యము.
కపిలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కపివర్ణం లాతీతి కపిలః. ఒకానొకముని, విష్ణువు, అగ్ని, విష్ణని అవతారము, కపిలుడు, కుక్కు, ధూపము, కపిల వర్ణము. కపిల వర్ణము నిచ్చునది. ఆగ్నేయదిశయందలి ఆడేనుగు, పుల్లావు, ఇరుగుడు, కంపుటిరుగుడు, రేణుక అను గంధద్రవ్యము, గోరోజనము వంటి వర్ణము కుక్క, ధూపము.
కపివల్లీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కపిరోమాభావయవత్వాత్కపివల్లీ. కపిరోమములవంటి అవయవములు కలది. గజపిప్పలి.
కపిశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కపిః మర్కటః తద్వర్ణయోగాత్కపిశః. మర్కట వర్ణము వంటి కాంతి కలిగినది, చిన్నఎఱ్ఱచీమ, చిల్లమడ్డి, పసుపు మీఱిన ఎఱుపు, మధ్యము, కపిల వర్ణము.
కపీతనము
సం. నా. వా. అ. పుం. తత్స. కపీనామిష్టైః ఫలైః ప్రీతింత నోతితి కపీతనః. ఫలములచే కోతుల కోరికను విస్తరింపచేయునది. “కంజలం పీతయతీతి కపీతనః. జలమును పచ్చగా చేయునది. “కపిం తనోతీతి కపీతనః. కోతులను విస్తరింపచేయునది, అంబాళము, కలుజువ్వి, దిరిసెనము, రావి, అడవి మామిడి, శిరీషము, కల్లోలము.
కపోతపాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కపోతాన్పాలయతీతి కపోత పాలికా. పావురములను రక్షించునది. కొణిగయందుఏర్పఱచిన పావురంగూడు.
కపోతము
సం. నా. వా. అ. పుం. తత్స. పోత ఇవకపోతః. వేగము చేత వాయువు కొదమవలె నుండునది. గువ్య, పావురము, అభినయహస్తవిశేషము (వ్రేళ్ళు, చాపబడిన రెండు చేతులను ప్రక్కలు గూర్చిబోలుగా పట్టినది). కో వాయుః పోతః నౌరివాస్య కపోతః. క్షారము, కపోత వర్ణము.
కపోతాంఘ్రి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కపోతాజ్ఘ్రీ సదృశమూలత్వాత్కపోతాజ్ఘ్రీః. గువ్వకాళ్లువంటి వేళ్ళుకలది, గువ్వగుత్తి, వాసన గల ఆకుకూర.
కపోలము
సం. నా. వా. అ. పుం. తత్స. భక్షణ సమయే కంపత ఇతి కపోలం. భక్షించు సమయమందు చలించునది, గండము, చెక్కిలి.
కఫము
సం. నా. వా. అ. పుం. తత్స. కేశిరసి, కేనజలేన వాఫలతికఫః. శిరస్సునందుకాని, జలము చేతకాని పుట్టినది, శ్లేష్మము, తెమడ. కేన జలేన ఫలతి ఇతి కఫః.
కఫి
సం. విణ. (న్.ఈ.న్.) .తత్స. కఫోస్యాస్తీతికఫీ. కఫముకలవాడు, కఫరోగముకలవాడు.
కఫోణి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. కం సుఖం పురోణి కరోతి కపోణిః. కం సుఖం పుణోతి కరోతి కఫోణీ. సుఖమును చేయునది. కర్పూరము, మోచేయి. కేన సుఖేన ఫణతి అనాయాసేన సంకోచవికోచనత్వం ప్రాప్నోతి స్ఫురతి వా ఇతి కఫోణిః.
కబంధము
సం. నా. వా. పుం. న. తత్స. కం శరీరం బధ్నాతీతి కబంధం. శరీరమును నిలుపునది. కంశిరోస్య బధ్యతేత్రేతి కబంధః. క అనగా శిరస్సు అది దీనియందు బంధింపబడును, నీరు, తలతెగిత్రుళ్ళెడు, శరీరము, మొండెము, సముద్రము. కేన ప్రాణవాయునా పునర్బధ్యతే సంబధ్యతే ఇతి కబంధః. రాహువు, ఒకానొక రక్ష, ఉదరము, ధూమకేతువు. న. జలము.
కబరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. 1. కేశ సామ్యాత్కబరీ. వెంట్రుక పోలిక. 2. కంశిరః వృణోతీతి కబరీ. శిరస్సును చుట్టియుండునది. 3. కదంకిం చిత్కబరీ సామ్యాత్ కబరీ. ఒకానొక విధమైన కొప్పు పోలికకలది, కొప్పు, వాయింట (వృక్షవిశేషము) ఇంగువమ్రాను, కేశపాశము, కేశవేషము, సీమంతము.
కబలము
సం. నా. వా. అ. పుం. తత్స. భక్షణ సమయేకే తాలుని వలత ఇతి కబళః. తినుసమయమునందు దవడయందు కదులునది, గ్రాసము, కడి.
కబళము
సం. నా. వా. అ. పుం. తత్స. భక్షణ సమయేకే తాలుని వలత ఇతి కబళః. భక్షణ సమయమందు దవడ యందు కదులునది, గ్రాసము, కడి.
కమండులువు
సం. నా. వా. ఉ. పుం. న. తత్స. కంజలం అండే మధ్యేలాతీతి కమండలుః. ఉదకమును మధ్యమందు గ్రహించునది, సన్యాసులు ఉంచుకొనెడి గిన్నె వంటి మట్టిపాత్రము, కమండలము. సం. నా. వా. ఉ. పుం. తత్స. జువ్వి (వృక్ష విశేషము).
కమఠము
సం. నా. వా. అ. న. తత్స. కే ఉదకే మఠతీతి కమఠః. జలము నందు వసించునది, భిక్షాపాత్రము, తాబేలు. కే జలే మఠతి వసతీతి కమఠః. పొట్టిది.
కమఠి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కమఠస్య స్త్రీ కమఠీ. ఆడుతాబేలు, ఢులి.
కమనీయము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. అభీకః కమనః. కామించు స్వభావముకలవాడు, మనోహరము, ఇంపైనది.
కమలము
సం. నా. వా. ఆ. న. పుం. తత్స. కామ్యతే తృషార్తైరితి కమలం. దప్పిగొన్నవారిచే కోరబడునది. “కేన మల్యతే ధార్యత ఇతి వా కమలం. జలము చేతధరింపబడునది. తామర, ఎఱ్ఱతామర, నీరు, మందు, కడుపులోనొక ప్రక్కనుండెడి ఎఱ్ఱనిమాంసము, రాగి, కామ్యత ఇతి కమలః. కోరబడునది. శివునిచేతియిఱ్ఱి, బ్రహ్మ, వాసన కల ఆకు, జింక. (సం. నా. వా. అ. పుం. తత్స.)
కమలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కమలమస్యా అస్తీతి కమలా. కమలము చేతియందు కలగినది, లక్ష్మి. కమలం అస్త్యస్యాః హస్తే ఇతి కమలా, ఉత్తమురాలు.
కమలాసనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కమలాసనః కమలం ఆసనం యస్యసః. కమలము ఆసనముగా కలవాడు, బ్రహ్మ, కలువ. కమలం ఆసనమస్య, విష్ణోః నాభిపద్మజాతత్వాత్ తథాత్వం.
కమలోత్తరము
సం. నా. వా. అ. న. తత్స. వర్ణాది క్యాత్కమలేభ్య ఉత్కృష్టమితి కమలోత్తరం. వర్ణాధిక్యము వలన కమలములకు కంటె ఉత్కృష్టమైనది, కుసుమపువ్వు.
కమిత
సం. విణ. (ఋ. ఈ. ఋ). తత్స. కామయతే తాచ్ఛీల్యేనేనేతి కమితా. కామించు స్వభావము కలవాడు, కమనుడు, కాముకుడు, కోరిక కలవాడు.
కరంజము
సం. నా. వా. అ. పుం. తత్స. కం జలం రంజయతీతి కరజః జలమును ఎఱ్ఱగా చేయునది, కానుగుచెట్టు, గోరు. కం సుఖం శిరో జలం వా రంజయతీతి కరంజః. కరజవృక్షము, ఒకానొక చెట్టు. సం. నా. వా. అ. న. తత్స. కం ఉదకం రంజయతీతి కరంజం. ఉదకమును ,రాగమును పొందించునది, పులిగోరు (వృక్షవిశేషము).
కరండము
సం. నా. వా. అ. పుం. తత్స. కత్తి, తేనె పొర, కరాండము.
కరంభము
సం. నా. వా. అ. పుం. తత్స. కరేటు కోకకురక కలహంసకరంబితే. పెరుగు కలిపిన వేపుడుపిండిపేరు, పెరుగుతో కలిపిన పేలపిండి. కేన జలేన రమ్యతే మిశ్రీక్రియతే ఇతి కరంభః.
కరక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృణోతి హినస్తి సస్యమితి కరకా. పైరులను చెరుచునది, వడగళ్లు.
కరకము
సం. నా. వా. అ. న. పుం. తత్స. కరోతి దోషాభావమితి కరకః. దోష శుద్ధిని చేయునది. కరోత్యానందమితి కరకః. ఆనందమును చేయునది, వడగళ్లు, పుట్టగొడుగు, గిన్నివంటిపాత్రము, లోపల ఏవిలేని పళ్ళచిప్ప, మామిడి, దానిమ్మ, చెట్టు, నేల సరిగా లేకుండుట.
కరజము
సం. నా. వా. అ. న. తత్స. పూతి గంధః కరజః పూతికరజః. దుర్గంధముకలకానుగు, పులిగోరు, గోరు, కానుగు.
కరట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కేతి రటతి కరోతి మదమితి చకరటః. కాయని కూయునదియును, మదజలమును చేయనదియ కనుక కరటము, ప్రయాసము చేత పితుక తగిన ఆవు అఱ్ఱ, కాచి, కాకి, కుసుమపువ్వు, గోధుమ కప్ప, ఏనుగు చెక్కిలి, నింద్యజీవనమ, వాద్యవిశేషము, ఏకాదశాహాశ్రాద్ధము, పాలు తీయుటకుకష్టమైన ఆవు.
కరణము
సం. నా. వా. అ. పుం. తత్స. కరోతి లేఖన కర్మేతి కరణః. లేఖన కర్మను చేయువానిపేరు. శూద్ర స్త్రీకి వైశ్యునకు పుట్టినవాడు, త్రికరణములు (మనస్సు, వాక్కు, కర్మము), ఒక సంకరజాతి, వ్రాయసకాడు, చారుడు. సం. నా. వా. అ. న. తత్స. క్రియతే అనేనేతి కరణం. దీనిచేత చేయబడును, లెక్కవ్రాయువాడు, బవాది (ఇవి బవ, బాలవ, కైలవ, తైత్తిల, గరజి, వణిక్కు, భద్ర, శకుని, చతుష్పాత్తు, నాగవము, కింస్తుఘ్నము, కొరముట్టు, ఇంద్రియము, కారణము, క్రియాబేధము, పని, క్షేత్రము, గీతాబేధము, నృత్యబేధము, పూత, రతిబంధము, శరీరము, కూర్చుండుట, బాహువు, సాధనము, ఉచ్ఛరణ భేదము, ధాన్యము, ఆసనములు, బంధములు, చేష్ట, పాట, ఇంద్రియము, గాత్రము, క్షేత్రము, హేతువు, కర్మ, హస్తలేపము, నృత్యప్రభేదము, కృతి).
కరతోయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఈశ్వర కరతోయాజ్జాతా కరతోయా. శివుని చేతి వలన పుట్టినది, గౌరీ వివాహకాలమందు ఈశ్వరుని హస్తము వలన పుట్టిన ఏరు.
కరపత్రము
సం. నా. వా. అ. న. తత్స. కరే పత్రమివ వర్తత ఇతి కరపత్రం. చేతిలో ఆకువలె ఉండునది, క్రకచము, రంపము. కరేణ కరాద్ వా పతతీతి కరపత్రం.
కరభము
సం. నా. వా. అ. పుం. తత్స. తమారభ్య కనిష్ఠపర్యన్తం హస్తబహిర్భాగః కరభః. మణికట్టు నుండి చిటికెనవ్రేలిదనుక చేతి యొక్క వెలుపలి పార్శ్వము కరభమనబడును, మణికట్టుమొదలు చిటికెన వ్రేలి మొదలుదాకకల చేతివెలుపలిచోటు, ఒంటెపిల్ల, ఉష్ట్రము, గాడిద.
కరమర్ధము
సం. నా. వా. అ. పుం. తత్స. కరేణ మర్ధ్యతే కరమర్ధకః. హస్తము చేత మర్ధింపబడునది, కలివె. (వృక్ష విశేషము).
కరము
సం. నా. వా. అ. పుం. తత్స. 1. కృణాతి తమ ఇతి కరః. తమస్సును హింసించునది. 2. కీర్యతే ప్రత్యేకం కరః. పరత్యేకమైన ప్రజలచేత చల్లబడునది. 3. కీర్యతే కరోతీతి చకరః ఇయ్యబడినది, చేయి, కిరణము, తొండము, కప్పము, వడగళ్లు, పన్ను, తెల్లధాన్యము, బలి అన్నము, అలంకృత కన్య. 4. కం సుఖం రాతి దదాతీతి కరః. రాజస్వము, భాగధేయము, ప్రత్యాయము, హస్తము, చేయి, వర్షోపలము. 5. కరోతి వృష్టిమితి వా కరః. వర్షమును కలుగచేయునది.
కరరుహము
సం. నా. వా. అ. పుం. తత్స. కరే రోహతీతి కరరుహః. చేతియందు మొలచునది, నఖము, గోరు. కరే రోహతి కరాంగులీభ్యః ఉత్పద్యతే ఇతి కరరుహః.
కరవాలము
సం. నా. వా. అ. పుం. తత్స. కరేవలతీతి కరవాలః. కరమందు చలించునది, ఖడ్గము, కత్తి.
కరవాలికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షుద్రః కరవాలః కరవాలికా. క్షుద్రమైన కరవాలము, కత్తి పీట, చురకత్తి.
కరవీరము
సం. నా. వా. అ. పుం. తత్స. కరవీరత్ ఖడ్గవత్ మరకత్వాత్ రసపానేన కరవీరః. తనరసపానముచేత ఖడ్గమువలె చంపునది. కత్తి, గన్నేరు, ఒకానొక రాక్షసుడు, ఎఱ్ఱ పాషాణము.
కరశాఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కరస్య శాఖా ఇవకరశాఖాః. హస్తమునకు కొమ్మలవలె ఉండునవి, అంగుళి, వ్రేలు.
కరహటము
సం. నా. వా. అ. పుం. తత్స. కరాత్ హస్తాక్ హట యతి దీపయతీతికరహాటః. హస్తముల ప్రకాశింపచేయునది, తామరదుంప, మంగ. కరేణ కిరణేన సూర్యస్యేతి యావత్ హాట్యతే దీప్యతే ఇతి కరహాటః. కలువ దుంప.
కరహాటకము
సం. నా. వా. అ. పుం. తత్స. దుస్స్పర్శ త్వాత్ కరహం తీతి కరహాటకః. దుష్టమైన స్పర్శము కలది కనుక కరమునుపీడించునది. మంగచెట్టు.
కరాళము
సం. నా. వా. అ. న. తత్స. కరోతి భయమితి కరాళః. భయమును చేయునది, నల్లగగ్గెర, వెన్నెముక, ఒడ్డుమిట్టయినది, పొడవైనది, వెఱపుపుట్టించునది. కరాయ క్షేపాయ భయప్రదర్శనాయ అలతి పర్యాప్నోతి ఇతి కరాలః.
కరి
సం. నా. వా. న్. పుం. తత్స. కరోస్యాస్తీతి కరీ. తొండము కలది, ఏనుగు, కోతి.
కరిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కరోస్యా అస్థీతి కరిణీ. తొండముకలది, ధేనుక, ఆడేనుగు.
కరిపిప్పలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కరియోగ్యా పిప్పలీ కరిపిప్పలీ. ఏనుగునకు యోగ్యమైన పిప్పిలి, గజపిప్పలి.
కరీరము
సం. నా. వా. అ. న. తత్స. కరిణం ఈరయతి కంటకైః కరీరః. ముండ్లచేత ఏనుగును పీడించునది. కీర్యత ఇతి కరీరః. తొలగత్రోయబడునది. వెదురుమొలక, కుండ, వెణుతురు.కీర్యతే క్షిప్యతే జలమత్ర. కిరతి విక్షిపతి స్వదేహజావరణాదీనితి. వంశాంకురము, చెట్టు.
కరీషము
సం. నా. వా. అ. పుం. తత్స. కీర్యత ఇతి కరీషః. చల్లబడునది, ఎండిన పేడవేరు, ఎరుపు, ఏఱుపిడక, పిడక.
కరుణ
సం. నా. వా. అ. పుం. తత్స. కరోతి మనః ఆనుకూల్యాయ ఇతి కరుణః. శృంగారాది అష్టరసములలో మూడవ రసము,కనికరము,కారుణ్యము, అనుకంప, ఒకనారింజ, ఒక ఆకుకూర, దయాళుడు, ఒకానొక చెట్టు.
కరుణా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుర్వంత్యాత్మాన మధీన మనేనేతి కరుణా. కనికరము, కారుణ్యము, కృప, దయ.
కరేటువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కే వృక్షాదీనాం శిరసిరేటతీతి కరేటుః. వృక్షాదుల కొనయందు పలుకునది, పెద్దకక్కెర.
కరేణువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. కేమూర్ధ్ని రేణురస్యేతి కరేణుః. తలమీద ధూళి కలిగినది, ఆడేనుగు, ఏనుగు, కొండగోగు, కర్ణికారము.
కరోటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కంవాయుం రోటతే కరోటిః. వాయువు నడ్డపెట్టునది. తలపుఱ్ఱె, తల ఎముక, పుఱ్ఱె. కేన వాయునా అంతర్వాయునా రుట్యతే ప్రతిహన్యతే ఇతి కరోటిః. కేన శిరసి రోటతే దీప్యతే శోభతే వా కరోటిః.
కర్కంధువు
సం. నా. వా. ఊ. పుం. తత్స. కర్కాణి లోహితాని పర్ణాని ఫలాని చదత్త ఇతి కర్కస్థూః. ఎరుపు, ఆకులును, పండ్లునుకలది, రేగు, గంగరేగు.
కర్కటము
సం. నా. వా. అ. పుం. తత్స. కృణోతి జననీం కర్కటః. పుట్టినపుడు తల్లిని చంపునది, ఎండ్రి, కక్కెర, చెఱకు, నూగుదోస, బూరుగుకాయ, ఒకరాశి, అభినయహస్తవిశేషము. (రెండు చేతుల వ్రేళ్ళను నొకటొకటి సందున నదికినట్టుగా గూర్చి పట్టినది). జలజంతు విశేషము, పక్షి విశేషము.
కర్కటీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కరోతి వర్షమితి కర్కటీ. వర్షమును చేయునది, దోస. కర్కం కంటకం అటతి గచ్ఛతి ఇతి కర్కటీ. ఫల లతా విశేషము.
కర్కము
సం. నా. వా. అ. పుం. తత్స. కరోతి కౌతుకం కర్కః కౌతుకమును చేయునది, అందము, అద్దము, ఎండ్రి, కుండ, తెల్ల గుఱ్ఱము, నిప్పు సం. విణ. తత్స. తెల్లనిది, మంచిది. కరోతి ఆదిష్టం పాలయతీతి కర్కః. అగ్ని, కర్కటవృక్షము.
కర్కరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కిరతి జలధారామితి కర్కరీ. జలధారను చల్లునది. దోస, గిండివంటి మట్టి పాత్రము. కర్కం హాసం హాస్యప్రకాశవత్ నిర్మల సలిలం లాతీతి కర్కరీ.
కర్కరేటువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కర్కఇతి రేటతి కర్కరేటుః. వృక్షాదులకొనయందుపలుకునది. పెద్దకక్కెర.
కర్కశము
సం. నా. వా. అ. పుం. తత్స. కృణోతి పీడయతీతి కర్కశం. పీడించునది. కఠినత్వాత్కర్కశః. కఠినమైనది. కంపిల్లము, కసింద, చెఱకు, కనికరములేనిది, కఱకైనది. గట్టిది, తెగువకలది, మెప్పించునది. పెద్ద పొట్ల, దయ లేనివాడు, కాఠిన్యము. కఠినత్వాత్కర్కశః.
కర్కారువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కర్కశ్చాసౌ అరుశ్చ కర్కారుః. తృప్తిని చేయునదియును, వ్యాపించు నదియును కనుక కర్కారువు, గుమ్మడి. కర్కం హాస్యవత్ శౌకల్యం వృచ్ఛతి ప్రాప్నోతి కర్కారుః. సొరకాయ.
కర్చూరము
సం. నా. వా. అ. న. తత్స. కర్చూం చూర్యతే దహతీతి కర్చూరః. తీటను పోకొట్టునది, బంగారు, గంట్లకచోరము.
కర్ణజలౌకసము
సం. నా. వా. స్. పుం. తత్స. కర్ణ ప్రవేశ యోగ్యత్వాత్ దీర్ఘత్వేన జలూకా సదృశత్వాచ్ఛ కర్ణ జలూకా. చెవిని దూరుటకు తగిన శరీరము కలిగి జలగవలె ఉండునది, చెవి, జోరుపాము, రోకలిబండ.
కర్ణధారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కర్ణమరిత్రం ధరతీతి కర్ణధారః కర్ణమనగా ఓడ నడిపెడు తెడ్డు దానిని ధరించినవాడు కర్ణధారుడు, సరంగు, ఓడనడుపువాడు. కర్ణం ధరతి ధారయతి వా ఇతి కర్ణధారకః. నావికుడు, ఆరకాటి.
కర్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. కరోతి శబ్దగ్రహణం కర్ణః. శబ్దగ్రహణమును చేయునది, చెవి, కన్నము, చుక్కాను. కుంతిమొదటికొడుకు. కీర్యతే క్షిప్యతే శబ్దో వాయునా యత్ర. కిరతి శబ్దగ్రహణేన మనసి సుఖం క్షిపతీతి కర్ణః. శ్రవణేంద్రియము, శ్రోత్రము, శ్రుతి, శ్రవణము, యుధిష్ఠిరాగ్రజుడు, రాధేయుడు, అర్కనందనుడు, ఘటోత్కచాంతకుడు, సూతపుత్రుడు, అంగరాజు, రాధాసుతుడు, అంగాధిపుడు, అర్కతనయుడు, చెవి లేనివాడు.
కర్ణవేష్టనము
సం. నా. వా. అ. న. తత్స. కర్ణౌ వేష్టతే కర్ణ వేష్టనం. కర్ణమును పరివేష్టించునది, కుండలము, పోగులు, చెవి పోగు.
కర్ణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కర్ణయోః అలంకారః కర్ణికా. చెవులకు అలంకారమైనది, చెవికమ్మ, తొండము చివర, తామరదుద్దు, చేతినడిమివ్రేలు, బాణవిశేషము, చేతి యొక్క మధ్యవేలు, తాళపత్రము, కృష్ణాజినము, పండుతొడిమ. కర్ణస్యాలంకారః కర్ణికా. కర్ణమును అలంకారమైనది.
కర్ణికారము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్ణికాం కర్ణభూషణత్వ మియర్తీతీవా వర్ణికారః. కర్ణభూషణత్వమును పొందునది, కొండగోగు, దీనికి దోహద క్రియ సల్లాపము, ఱేల.
కర్ణేజపుడు
సం. విణ (అ.ఆ.అ). తత్స. రాజా దీనాం కర్ణేజపతి వ్యక్తం వదతి, పరకీయ దోషా నితి కర్ణేజపః. రాజాదుల యొక్క చెవియందు ఇతరుల దోషములను చెప్పువాడు, సూచకుడు, కొండెకాడు, దుర్జనుడు.
కర్తరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కృత్యతే ఛిద్యతే నయేతి కర్తరీ. దీని చేత భేదింపబడును, కత్తెర భరణి మూడు నాలుగు పాదములయందును, కృత్తిక యందును, రోహిణి మొదటి పాదమునందును సూర్యుడు ఉండుకాలము, బాణములోని భాగము, బాకు, అడకత్తెర.
కర్ధమము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్ధతి కుత్సిత శబ్దం కరోతీతి వా కర్ధమః. కుత్సితశబ్దమును చేయునది, పంకము, అడుసు, బురద, జంబాలము, పాపము, ఛాయ. కృణోతీతి కర్ధమః. పీడించునది.
కర్పటము
సం. నా. వా. అ. పుం. తత్స. లజ్జాయై కల్పతే కర్పటః లజ్జకొరకు సమర్ధమైనది, వస్త్రము, చినిగిన వస్త్రము, మాసిన వస్త్రము, చింకిగుడ్డ. కీర్యతే క్షిప్యతే ఇతి కర్పటః. లక్తకము, నక్తకము.
కర్పరము
సం. నా. వా. అ. పుం. తత్స. భారధారణాయ కల్పతే సమర్ధోభవితి కర్పరః. భారమును ధరించుట కొఱకు సమర్ధమైనది, తలపుఱ్ఱె, కొప్పెర, శస్త్రభేదము, పెద్దకాగు, కపాలము, అగ్ని.
కర్పరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కల్పతే అక్షిరోగాత్ జేతుం కర్పరీ. నేత్రరోగములకు పోగొట్టుటకు సమర్ధమైనది, మ్రాని పసుపును వండిన అంజన విశేషము, మైలతుత్తము, కేశ కలాపము.
కర్పూరము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్పూరాగరుకస్తూరీ తక్కోలైః కతః. యక్షకర్ధమ ఇత్యుచ్యతే. కర్పూరము, అగరు, కస్తూరీ, తక్కోలము వీనితో కూడిన గంధము. యక్షకర్దమనబడును, ఘనసారము, కప్పురము, సుగంధ ద్రవ్య విశేషము, ఘనసారకము, చంద్రుడు.
కర్బుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కర్పుర వర్ణత్వాత్కర్బురః. చిత్ర వర్ణము కలవాడు. కీర్యం తే నానావర్ణా అత్రేతి కర్బురః. దీనియందు నానావర్ణములు నెఱపబడును. కీర్యతి లోహమధ్యే శ్రేష్ఠత్వాత్కర్బురం. లోహములలో శ్రేష్ఠమౌటచేత గర్విచునది, కలిగొట్టు, నీరు, బంగారు, పాపము, చిత్రవర్ణము, లేత ఆకుపచ్చ.
కర్మంది
సం. నా. వా. న్. పుం. తత్స. కర్మంద ఋషి ప్రోక్తసూత్రమ ధీత ఇతి కర్మందీ. కర్మందుండను ఋషి చెప్పిన సూత్రములను అధ్యయనము చేయువాడు, పారాశరి. కర్మందేన స్వానామఖ్యాతఋషివిశేషేన ప్రోక్తం భిక్షుసూత్రమధీతే యః కర్మందీ. భిక్షువు, సన్యాసి.
కర్మకరుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కర్మకరోతీతి కర్మకరః. చెప్పినపని చేయువాడు. కర్మకరోతి భృత్యర్థమితి కర్మకరః. కూలికొఱకు కార్యము చేయువాడు, పనివాడు, సేవకుడు.
కర్మకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కర్మకరణం శీలమస్యేతి కార్మః. కార్యము చేయుటయే స్వభావముగా కలవాడు, కమ్మరవాడు, వెట్టికి పనిచేయువాడు.
కర్మఠుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కర్మణి ఘటత ఇతి కర్మఠః. కార్యమందు వ్యాపారము కలవాడు, నెరవేరు దాకా ఒక పని చేయువాడు, కర్మశూరుడు, దబ్బ.
కర్మణ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కర్మణా సంపద్యత ఇతి కర్మణ్యా. పనిచేత కలుగునది, కూలి, జీతము.
కర్మము
సం. నా. వా. న్. న. తత్స. కర్మవ్యాజ్యే క్రియాయాం చపున్నపుంసక యోర్మతమ్. చేయుటకనుగ, కారకవిశేషము, (తర్కశాస్త్రమందలి పంచవిధ కర్మములు, ఉత్ క్షేపనము, అపక్షేపనము, ఆపుంచనము, ప్రసారణము, గమనము), షట్కర్మములు. (యజమనము, అధ్యాయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము, యాజనము). షోడశకర్మములు. (గర్భాదానము, పుంసవనము, సీమంతరము, జాతకర్మము, నాకరణము, అన్నప్రాసనము, చౌలము, ఉపనయనము, ప్రాజాపత్యము, సౌమ్యము, ఆగ్నేయము, వైశ్వదేవము, గోదానము, సమావర్తనము, వివాహము, అంత్యకర్మము). పని, ఆగ్నేయము, వైశ్యదేవము, గోదానము, సమావర్తనము, వివాహము.
కర్మసాక్షి
సం. నా. వా. న్. పుం. తత్స. కర్మణః సాక్షీ కర్మసాక్షీ. కర్మలకు సాక్షి, సూర్యుడు, చెయువుల సాకిరి. కర్మణాం సాక్షీ, యద్ వా కర్మ సాక్షాత్పశ్యతి ప్రత్యక్షం కరోతీతి కర్మసాక్షీ.
కర్మారము
సం. నా. వా. అ. న. తత్స. కర్మ ఇయర్తి కర్మాకః. క్రియను పొందునది, వెదురు, కమ్మరి.
కర్మేంద్రియము
సం. నా. వా. అ. న. తత్స. వచనాదాన గత్యుత్సదానంద రూపకర్మసాధన మింద్రియం కర్మేంద్రియం. పలుకుట, గ్రహించుట, నడచుట, విడుచుట, ఆనందించుట అనెడు కర్మములకు సాధనములయిన ఇంద్రియములు కర్మేంద్రియములు, పాయూపస్థపాణి పాదవాక్కులలోఏదేనఒకటి.
కర్షకుడు
సం. విణ. (అ.ఈ.అ). తత్స. కర్షతీతి కర్షకః. దున్నువాడు కనుక కర్షకుడు. ఈడ్చువాడు, దున్నుకొనిబ్రతుకువాడు, కృషీవలుడు, కుజుడు, అశ్వికుడు, వ్యవసాయం చేయువాడు.
కర్షఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్షమాత్రం ఫలాన్యస్య కర్షఫలః. కర్షమనగా పలములో నాలవపాలు, అంతతూనికేకల ఫలములు కలది, తాండ్ర, తాడికాయ, ఉసిరిక.
కర్షము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్షతీతి కర్షః. కృష విలేఖనే, తూచదగిన వస్తువులను నిష్కరించునది, పదునాఱుమాషములు ఎత్తు, ఒరయిక.
కర్షవు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. కర్షణం, కర్షతి, కృష్యతేచ కర్షూః. దున్నుటయును, పీండించునదియును, దున్నబడు నదియును కనుక కర్షువు, కాలువ, యజ్ఞార్ధమైనదుక్కి, వంగ, పిడకనిప్పు, ఊక.
కల
సం. నా. వా. అ. న. విణ. తత్స. సుఖం లాతీతి కలః. సుఖమును ఇచ్చునది. సం. నా. వా. తత్స. రేతస్సు. సం. నా. వా. విణ. అవ్యక్తమధురము (ధ్వని) అజీర్ణము, అస్పష్టము, మృదువు, వీణ తీగను మీటుట, మూగ. ?
కలంకము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్యతే జ్ఞాయతే అనేనేతి కళంకః. దీనిచేత పదార్ధము ఎరుగబడును. కల్యతే క్షిప్యతే కళంకః. త్రోయ బడునది, గుర్తు, ఇనుపచిట్టెము, దూఱు, చిహ్నము, నింద. కలయతీతి కలంకః. అపవాదము, దోషము.
కలంబము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్యతే క్షిప్యతి ఇతి కలంభః. వేయబడునది. కడ్యతే భుజ్యత ఇతి కలంబః. భక్షించునది, కూరనార, బాణము, తీగబచ్చలి, శరము, కదంబము.
కలంబి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కేజలే లంబతే కలంబీ. జలమందు ఉండునది, తీగబచ్చలి.
కలకలము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్యతే అవ్యక్తం శబ్ద్యత ఇతి కల కలః. అవ్యక్తముగా పలుమార్లు పలుకునది, గుంపున పుట్టిన పెద్దమ్రోత, అలబలము, సజ్జరసము, అవ్యక్తధ్వని. కలాదపి కలః యుగపత్సముత్థితబహులశబ్దానామేకీభూతతయా తుములత్వాత్తథాత్వమితి కలకలః. కోలాహలము.
కలధౌతము
సం. నా. వా. అ. న. తత్స. కలం కాలుష్యం ధౌత మస్యేతి కలధౌతం. పోగొట్టబడిన కాలుష్యము కలది, వెండి, బంగారు, అవ్యక్తమధురధ్వని, చక్కని ధ్వని. కలేన అవయవేన ధౌతమితి కలధౌతం. కలధూత్రము, రూప్యము, రజతము, స్వర్ణము, కలధ్వని.
కలభము
సం. నా. వా. అ. పుం. తత్స. కం ఉదకం లభతే కలభః. ఉదకమును పొందినది. ఏనుగుగున్న, 30 ఏళ్ళ ఏనుగు (తద్విశేషములు, బాలము, పోతము, విక్కము). కలేన కరేణ శుండేనేతి యావత్ భాతీతి కలభః. వ్యాలము.
కలమము
సం. నా. వా. అ. పుం. తత్స. కలే కలయతి వా, అక్షరం ప్రకాశయతి జనయతి వా ఇతి కలమః. రాసెడుకలము, వరిపైరు, లత్తుక, మంచివరి ధాన్యము, అంకురము, చౌరము.
కలలము
సం. నా. వా. అ. పుం. తత్స. కలతః యోగాత్ శుక్లశోణితే మిథస్సంగచ్ఛేతే అంత్రేతి కలలః. శుక్లశోణితము దీనియుందు కూడుకొనియుండును. గర్భపిండము, మావి, కలయుట, కలిసినయిఇసుకయు, సున్నమును,కలసినది. కల్యతే వేష్ట్యతే అనేనేతి కలలః. జరాయువు, తోలు సంచి, ఎముక, గర్భకోశము.
కలవరము
సం. నా. వా. అ. పుం. తత్స. కలః రవః అస్యేతి కలరవః. అవ్యక్త మధురమైన ధ్వని కలది, పారావతము, పావురము.
కలవింకము
సం. నా. వా. అ. పుం. తత్స. కం సుఖం యథా భవతి తథా లపతి కలవింకః. సుఖముగా పలుకునది. ఊరపిచ్చుక, కూకటిమూగ అను పక్షి. కలం మధురాస్ఫుటం వంకతే రౌతీతి కలవింకః. కలంకము, కళింగవృక్షము.
కలశము
సం. నా. వా. తత్స. కంజలం లాతీతి కలశః. ఉదకమును తీసికొనునది. ఘటము, కుండ. కలం మధురావ్యక్త శబ్దం శవతి జలపూరణ సమయే ప్రాప్నోతి ఇతి కలశః. కలసము, కుంభము, ఒక సంకరజాతి, నీటి కడవ, రెండు సేహితములు.
కలశీ
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. రసాధారత్వాత్ కించిత్కలశ సామ్యమస్త్రీతి కలశీ. రసాధారమౌటచే నించుక కలశసామ్యము కలది. కోలపొన్న, పెరుగు చిలికెడు కుండ, మల్లె, నీటి కడవ.
కలహంస
సం. నా. వా. అ. పుం. తత్స. కలోమధురాస్ఫుట ధ్వనిః తద్వాక్ హంసః కలహంసః. అవ్యక్త మధురధ్వని గల హంస, ధూమ్ర వర్ణములైన ముక్కు, కాళ్ళు ఱెక్కులుగల హంస, రాజహంస, రాజశ్రేష్ఠుడు. కలేన మధురాస్ఫుట ధ్వనినా విశిష్ఠో హంసః. హంస విశేషము, కలనాదము, మంచిరాజు.
కలహము
సం. నా. వా. అ. పుం. తత్స. కలం వికలం ఘ్నన్త్యత్రేతి కలహః. దీనియందు వికలుడయిన వాని హింసింతురు, జగడము, యుద్ధము, కత్తియొఱ. కలం కామం హంత్యత్ర కలహః. కలి, వివాదము, ఆయోధనము, ఆస్కందనము, సమరము, రణము, సంగ్రామము, సముదాయము, తృప్తి, యుద్ధము.
కలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కలయతి వృద్ధితో ధనం సంగృహ్ణాతి సంచినోతీతి కలా. కాలమానము, అంశమాత్రము, చంద్రుడి యొక్క షోడశాంశము, స్త్రీ రజస్సు.
కలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కల్యతే సంఖ్యాయత ఇతి కలా. లెక్కపెట్టబడునది. కాలం కలయతీతి కలా. కాలమును లెక్కు పెట్టునది. కల్యతి ఇతి కలా. ఎన్నబడునది, ముప్పది కాష్ఠల కాలము, చంద్రునిలో 14వ భాగము, భాగము, స్త్రీ రజస్సు, మొదటి సొమ్మువడ్డీ, శిల్పము. కలయతి వృద్ధితో ధనం సంగృహ్ణాతీతి కలా. కాలమానము, 64 కళలు (వాటి పేర్లు రాయాలి). ?
కలాదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కలాం స్వర్ణ శిల్పమాదత్త ఇతి కలాదః. బంగారం చేయు విద్యను స్వీకరించువాడు. అగసాలెవాడు, చంద్రుడు. అలంకార నిర్మాణాయ గృహస్తైః సమర్పితానాం స్వర్ణాదీనాం కలాం గృహ్ణాతి ఇతి కలాదః. స్వర్ణకారుడు, కంసాలి.
కలాపము
సం. నా. వా. అ. పుం. తత్స. కలః ఆప్నోతీతి కలాపః. కలలను పొందునది, ఇరవై ఐదు పేటలు కల స్త్రీల ఒడ్డాణము, నెమలిపురి, అమ్ముల పొది, భూషణము, సమూహము, నగ, మొలనూలు, గుంపు, నెమలి ఫించము. కలాం మాత్రం ఆప్నోతీతి కలాపః. చంద్రము, విదగ్ధము, గ్రామవిశేషము.
కలాయము
సం. నా. వా. అ. పుం. తత్స. కంవాతం లాతి అదత్తే కలాయః. వాయువును కలిగించునది. గుండ్రని సెనగలు, బఠాని.
కలి
సం. నా. వా. ఇ. స్త్రీ. పుం. తత్స. కల్యంతే బాణ అత్రేతి కలిః. ఇందు బాణములు వేయబడును. కల్యంతే అస్మిన్నితి కలిః. దీని యందు దొబ్బబడును, కళ్లెము, జగడము, ఒక యుగము, యుద్ధము, శూరుడు, కలియుగము, తాడి, పాచిక పడుట, కలహము. కలతే కలేరాశ్రయత్వే వర్తతే ఇతి కలిః. వివాదము, శూరము, కలియుగము.
కలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కల్యతే ప్రసూనమితి శబ్ద్యతే కలికా. పుష్పమగు నట్టిదని పలుకబడినది. సంపంగమొగ్గపేరు. మొగ్గ, కళ్లెము.
కలిద్రుమము
సం. నా. వా. అ. పుం. తత్స. కలేరాశ్రయోద్రమః కలిద్రుమః. కలికి ఆశ్రయమైనది, తాండ్ర, తాడి.
కలిమారకము
సం. నా. వా. అ. పుం. తత్స. కలహస్యమారకః నాశకః కలిమారకః. కలహమును చెఱుచునది. నెమలి అడుగు.
కలిలము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కల్యతే క్షిప్యతే మతిరత్రేతి కలిలం. దీనియందు బుద్ధి వెళ్లద్రోయబడును, ఎరుగరానిది, చొరరానిది, సమూహము, దుర్గమము.
కలుషము
సం. నా. వా. అ. న. తత్స. కల్యతే గణ్యతే చిత్ర గుప్తాదిభిరతి కల్మషం. చిత్రగుప్తాదులచేత లెక్కపెట్ట బడునది. కలతి మనః క్షిపతీతి కలుషః. మనస్సును పీడించునది, పాపము, దున్నపోతు, కలకబాఱినది, ఒక సంకరజాతి, మురికినీరు, కారము, పులుపు, వగరు కలిసినది, కారము, పులుపు, తీపి, వగరు కలిసినది.
కల్కము
సం. నా. వా. అ. న. తత్స. కల్యత క్షిప్యత ఇతి కల్కః. త్రోయబడునది, కపటము, పాపము, నెయ్యి, నూనెలోనగువాని యందు అడుగున నిలిచిన మడ్డి, మలము, మలసామాన్యము, తాండ్ర, పాపాత్ముడు, వంచన, ధూప ద్రవ్యము, మురికి, భక్ష్యము.
కల్పన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కల్ప్యతే కల్పనా. కల్పింపబడునది. ఆయిత్తము చేయుటకై ఏనుగునకు కట్టిన నిడుత్రాడు, క్లప్తి రచన, నేత కాని కుంచె, పల్యయుని కొడుకు.
కల్పము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్పయతః స్థితిం ప్రళయంచె కల్పౌ. నరులకు ఉత్పుత్తినాశములను చేయునవి. కల్పతే ప్రభవతి జగన్నాశాయేతికల్పః. లోకనాశము కొఱకు సమర్ధమైనది. యధోచిత సంకల్పనం కల్పః. యథోచితమైన సామర్ధ్యము కల్పము, బ్రహ్మాదినము, న్యాయము, ప్రళయము వేదాంగమైనవిధి, శాస్త్రము, తాడి, విధి, కల్పవృక్షము, వికల్పము.
కల్పవృక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్పయతి వాంఛితమితి కల్పవృక్షః. వాంచిత ఫలముల కల్పించు వృక్షము, కోరిన వస్తువులిచ్చెడు దేవవృక్షసామాన్యము, వేల్పుమ్రాను, తద్విశేషము. (ఇవి మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము). కల్పస్య సంకల్పస్య దాతా వృక్షః, కల్పస్థాయీ వృక్ష ఇతి వా. దేవతరువు.
కల్పాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్పస్య సృష్టే రంతః కల్పాంతః. కల్పము యొక్క అంతము, ప్రళయము, త్రుంగుడు, మహా ప్రళయము.
కల్మషము
సం. నా. వా. అ. న. తత్స. కల్యతే గణ్యతే చిత్ర గుప్తాదిభిరితికల్మషం. చిత్రగుప్తాదులచేత లెక్కపెట్టబడునది. పాపము, నకరవిశేషము,నలుపు, నల్లనిది.
కల్మాషము
సం. నా. వా. అ. పుం. తత్స. కలయతి కాంక్షతే అనేకవర్ణానితి కల్మాషః. అనేక వర్ణములనా కర్షించునది, చిత్రవర్ణము, నలుపు, రాక్షసుడు, చిత్రవర్ణముకలది, నల్లనిది, తెలుపు, నలుపు కలిసినది.
కల్యము
సం. నా. వా. అ. న. తత్స. కలయతి మంగళం కల్యం. శుభమును చేయునది, వేకువ. సం. విణ. తత్స. అరోగతయా కలాసు సాధుః కల్యః. రోగము లేక పోవుట చేత కళయం దొప్పెడువాడు. సంపాదింపబడినదానికిని, రోగములేని దానికిపేరు, మద్యము. కల్యత ఇతి కల్యః ఎన్నబడునది కనుక, బుద్దిశాలి, సిద్ధము, నేర్పరి, చెవిటిమూగ, ఉపాయము కలది, శుభమైనది, రోగము లేనిది, సంపాదింపబడినది.
కల్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కలయితుం సంఖ్యాతుం యోగ్యా కల్యా. ఎంచదగినవి. కలాసు క్రియాసు సాధురితివా కల్యా. క్రియల యందు ఉచితమైనది, మద్యము, సుభాషణము.
కల్యాణము
సం. నా. వా. అ. న. తత్స. కల్యం సుఖం అణయతి ప్రాపయతీతి కల్యాణం. సుఖమును పొందించునది, శుభము, చొక్కపు బంగారు, ఉత్సవము, సౌఖ్యముగల మంచి భూమి, పార్వతి, నశింప చేయదగని.
కల్లోలము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్యతే జలమనేనేతి కల్లోలః. దీనిచేత జలము చల్లబడును. పెద్దఅల, సంతోషము, శత్రువు, అల.
కల్హారము
సం. నా. వా. అ. న. తత్స. కే జలే హ్లాదతే కహ్లారం. జలమందు సంతోషించునది, ఇంచుక ఎరుపును, తెలుపును కలిగి మిక్కిలి పరిమళము కల కలువ, సౌగంధికము, తెల్లకలువ. ?
కవచము
సం. నా. వా. అ. పుం. తత్స. కంవాతం వంచయతీతి కవచః. గాలిని పట్టునది, బొందళము, తప్పెట, కలజువ్వి.
కవాటము
సం. నా. వా. అ. పుం. తత్స. కం వాతం వాటయతీతి కవాటం. గాలిని నిలుపునది, తలుపు, తలుపురెక్క.
కవి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. చాతుర్యము చేత వర్ణించువాడు. కవతే చాతుర్యేణ కవిః. చాతుర్యము చేత వర్ణంచువాడు. కళ్ళెము, కవిత్వము చెప్పువాడు, పండితుడు, శుక్రుడు, వాల్మీకి. కవతే సర్వం జానాతి, సర్వం వర్ణయతి, సర్వం సర్వతో గచ్ఛతి వా కవిః. విద్వాంసుడు, కవి.
కవిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కవికం కళ్ళెము, కవియని కొందరు, ఖలీనము, కళ్ళెము.
కవోష్ణము
సం. నా. వా. అ. న. తత్స. కించి దుష్ణం కోష్ణం కవోష్ణం. కొంచెము వేడియైనది, ఇంచుకవేడి, ఇంచుక వేడికలది, సుఖోష్ణం.
కవ్యము
సం. నా. వా. అ. న. తత్స. కూయతే పితృభిః స్తూయత ఇతికవ్యం. పితృదేవతల చేత స్తోత్రము చేయబడునది, పితృదేవతల కియ్యదగిన అన్నము.
కశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కశత్య శ్వాదీవితి కశా. గుఱ్ఱములు మొదలైన వానిని పీడించునది, గుఱ్ఱములోనగువాని కొట్టునట్టి చబుకు, పూతి మార్జాలము. కశతి శబ్దాయతే తాడయతి వా ఇతి కశా. ఒక సంకరజాతి, ముంగిస.
కశిపువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కశ్యత ఇతి కశిపుః. పొందబడునది, అన్నము, వస్త్రము, పఱుపు, తిండి, బట్ట, శయ్య. కశతి దుఃఖమితి కశిపుః.భక్తము.
కశేరుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కోవాయుశ్శేతేత్ర కశేరుకా. వాయువు దీనియందుఉండును, వెన్నెముక, కమ్మరేగు, కొట్టిగడ్డ, నాచు.
కశ్మలము
సం. నా. వా. అ. న. తత్స. కశతి తనూకరోతి ఇంద్రియప్రచారమితి కశ్మలం. ఇంద్రియ ప్రచారము అల్పముగా చేయునది, మూర్ఛ, మలినము.
కశ్యము
సం. నా. వా. అ. న. తత్స. అశ్వానాం మధ్యం కశ్యోమి త్యుచ్యతే. గుఱ్ఱమునడుము. కశంత్యనేనేతి కశ్యం. దీనిచేత తిరుగుదురు. కశామర్హతీతి కశ్యః. చబుకు పెట్ల కర్హమైనవాడు, గుఱ్ఱము, నడుము, మద్యము, కశకుతగినది. కషతి అనేన కశ్యం, కొరడాతో కొట్టతగినది.
కష
సం. నా. వా. అ. పుం. తత్స. నికష్యతే స్వర్ణమత్రేతి కషః. బంగారము దీనియందు పీడింపబడును, ఓరగల్లు, సాన, గీటురాయి, సానరాయి, తిరగలి. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దక్షుని కూతురులలో ఒకటి.
కషాయము
సం. నా. వా. అ. పుం. తత్స. రసభేదేచాంగరాగే నిర్యాసేచ విలేపనే, కషాయోస్త్రీ త్రిలంగస్తు సురభౌ రూషితే పిచ. కషతీతి కషాయః. పీడించునది, ఒగరు, ఔషధరసము, పూసికొనెడు చందనాది చందనాదులపూత, ఎఱ్ఱనిది, సువాసనగలది, వక్క, కారము, రుచికలది, గుగ్గిలము, ప్రేమ, సువాసన.
కష్టము
సం. నా. వా. అ. న. తత్స. కష్యతి హినస్తీతి కష్టం. హింసించునది. కషతీతి కష్టం. హింసించునది, దుఃఖము, పాపము, దుఃఖము కలది, పాపము కలది, చొరరానిది (అష్టకష్టములు దేశాంతరగమనము, భార్యావియోగము ఆపత్కాలమందు బంధుదర్శనము, ఉచ్ఛిష్టభక్షణము, శత్రుస్నేహము, పరాన్నప్రతీక్షణము, భంగము దారిద్ర్యము). వ్యధ, దుర్గమము.
కస్తూరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కే స్తూయతే కస్తూరీ. శిరస్సు నందు స్తోత్రము చేయబడినది, మృగమదము, కస్తూరి, కస్తూరి మృగము.
కహ్వము
సం. నా. వా. అ. పుం. తత్స. కే జలే హ్వయతే కహ్వః. జలము నందు పలుకునది, బకము, వక్కు కొంగ, కొంగ.
కాంక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాంక్షణం కాంక్షా. కాంక్షించుట, ఇచ్ఛ, కోరిక.
కాంచనము
సం. నా. వా. అ. న. తత్స. కచతి దీప్యత ఇతి కాంచనం. ప్రకాశించునది, బంగారు అకరువు. సం. నా. వా. అ. పుం. తత్స. ఉమ్మెత్త, సంపెంగ, కాంచనము, నాగకేసరము, పొన్న, మర్రి (వృక్ష విశేషము), స్వర్ణము, పద్మకేసరము, ధనము, దీప్తి, కుండలము, చంపకము, ఉదుంబరము, ధుస్తూరము.
కాంచనీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాంచన వర్ణత్వాత్ కాంచనీ. బంగారు వన్నెకలది, హరిద్ర, పసుపు, కంచు.
కాంచీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కచ్యతే బధ్యతే కాంచీ. కట్టబడునది, ఒక పేట కల ఆడుదాని మొలనూలు, ఒకానొకపట్టణము, మేఖల, సప్తకి, రసన, సారసనము, బంధనము.
కాంజికము
సం. నా. వా. అ. న. తత్స. కేన జలేన అంజికా అభివ్యక్తిరస్యేతి కాంజికం. జలము చేత అభివ్యక్తికలది, ఆరనాళము, సౌవీరము, కుల్మాషము, అభిషుతము, ధాన్యామ్లము, కుంజలము, కాంచికము, ధాన్యమూలము, గృహామ్లము, మహారసము, ఉన్నాహము, వీరము, అభిషవము, అమ్లసారకం.
కాండపృష్ఠము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కాండాః బాణాః పృష్ఠే యస్యసః కాండపృష్ఠః. బాణములు వీపున కలవాడు, ఆయుధములచేత బ్రతుకువాడు, శస్త్రాజీవుడు, యోధుడు, శూద్రపుత్రుడు, దత్తుడు, ఇతరకులమున చేరినవాడు. వైశ్యపతి.
కాండము
సం. నా. వా. అ. న. పుం. తత్స. కామ్యత ఇతి కాండః. కోరబడునది, కావ్యపరిచ్ఛేదము, సమూహము, బాణము, జలము, ఆకులోనగు వాని ఈనె, తామరలోనగు వానికాడ, వరిలోనగువానిపోచ, ముల్లులోనగువాని దుబ్బు, మోదుగులోనగువాని కఱ్ఱ, చెట్టుబోదె, గుఱ్ఱము, కుత్సితము, ఏకాంతము, సమయము, మొదలు, ఎలుక, బలము, అవకాశము, విభాము, ముడిగడ్డిదుబ్బు, మంచినీరు, నింద్యము, కుత్సితము, నాళము, ప్రస్తావము, వృందము, సమూహము, దండము, వారి, వర్గము, అవసరము, చెట్టు కాండము.
కాండీరుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కాండాః బాణాః అస్య సంతీతి కాండీరః. బాణములుకలవాడు, బాణములు ధరించినవాడు, దండమును ధరించినవాడు, ఏనుగుపిప్పలి (వృక్షవిశేషము), బాణ యుద్ధము.
కాండేక్షువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కాండేన ఇక్షురివకాండేక్షుః. కాడచేత చెఱకువంటిది, ములుగొలిమిడిచెట్టు.
కాంత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కామ్యత ఇతి కాంతా. కోరబడునది, కోరతగిన ఆడుది, ఆడుది, ప్రేంకణము, ఇనుము, రాయి, కాంతము, సూర్యకాంతము, అయస్కాంతము, సంపంగి, ఒక చెట్టు, దమనకము, మనోహరము, ప్రియము.
కాంతలకము
సం. నా. వా. అ. పుం. తత్స. కస్య జలస్య అంతం గచ్ఛంతీతి కాంతాగజాః తైర్లక్యత ఇతి కాంతలకః. జలసమీపమును పొందునవి కనుక కాంతములు అనగా గజములు వానిచేత ఆస్వాదింపబడునవి, నందివృక్షము.
కాంతారము
సం. నా. వా. అ. న. తత్స. కాంశ్చిన్న తారయతీతి కాంతారం. ఎవ్వరినీ చొచ్చి దాటనీయనిది. “కస్య జలస్య సుఖస్యవా అంతం నాశమృచ్ఛతీతి కాంతారం. జలనాశమును గాని, సుఖనాశమును గాని పొందునది పేరడవి, పోరానిత్రోవ, తెలుపు కలిసిన పచ్చచెఱకు, చెడ్డదారి.
కాంతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కామ్యత ఇతికాంతిః. కోరబడుచున్నది, జిగి, కోరిక, కాంతా కమనం కాంతిః. ఇచ్చగించుట, వశము, కాంతియును, శోభ.
కాందవికుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంస్కృత పిష్టాదికమపి ఉపచారాత్కందుః నపణ్య మస్యేతి కాందవికః. అపూపములు వండు పెనము కందువనబడును, పిండివంటలు చేయువాడు, రొట్టెలు చేయువాడు.
కాందిశీకుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కాందిశం గచ్ఛామీతి చింతయనపలాయతః కాందిశీకః. ఏదిక్కున పోవుదునని చింతించుచు పరుగెత్తువాడు, వెఱపుచే పాఱెడువాడు, పారిపోవువాడు, పలాయితుడు.
కాంపిల్యము
సం. నా. వా. అ. పుం. తత్స. కంపిల్ల్యాఖ్యదేశే భవః కాంపిల్యః. కంపిల్య దేశమునందు పుట్టినది, కంపిల్లము(వృక్షవిశేషము).
కాంబళము
సం. విణ. (అ. ఈ. అ) . తత్స. కంబళేనా వృతో రథః కాంబళః. కంబళి చేత కప్పబడునది, కంబళి కప్పినబండి.
కాంబవికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కంబోర్వికారః కాంబవః. తత్పణ్యమస్య కాంబవికః. శంఖముచేత చేసిన కడియములు మొదలయినవి, అమ్మకపు సరుకులు కలవాడు, శంఖములు సరిచేయువాడు.
కాంభోజము
సం. నా. వా. అ. పుం. తత్స. కాంభోజ దేశేభవాః కాంభోజాః. కాంభోజదేశమందు పుట్టిన ఒకానొకదేశము, కాంభోజదేశపు గుఱ్ఱము, వెలిచంద్ర, పొన్న (వృక్ష విశేషము), సోమవల్కము, పున్నాగచెట్టు.
కాంభోజీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాంభోజ దేశేభవాకాంభోజీ. కాంభోజ దేశమందు పుట్టినది. ఒకానొకరాగము, కారుమినుము, బండిగురివెంద, వెలిచంద్ర (వృక్ష విశేషము).
కాక
సం. నా. వా. అ. పుం. తత్స. కా ఇతి కాయతి కాకః. కా అను అరుచునది, కాకి, ఒకానొక చెట్టు. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాచి, కాకిదొండ, కారుకొల్లి, కుక్కమేడి, వెలమసంది (వృక్ష విశేషము). సం. నా. వా. అ. న. తత్స. కాకుల సమూహము, పక్షివిశేషము, కరటము, అరిష్టము, బలిపుష్టము, మంచి కార్యము చేయువారు, వాతజము, వలము, దీర్ఘాయువు, గ్రామీణము, పిశునము, కాణము, చిరాయువు, ఖరము, ముఖరము, మహాలోలము, చిరంజీవి, చలాచలము, ద్వీపవిశేషము, పరిమాణభేదము, తిలకము.
కాకచించి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాక వర్ణీ చిఞ్చౌ ప్రాంతో అస్యాః కాక చిఞ్చీ. కాకి వన్నెకల కడలుకలది, పూసలు గురువింద (వృక్ష విశేషము).
కాకతాళీయము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కాకి వ్రాలగా తాటి పండుపడిన విధము వంటిది.
కాకతిందుకము
సం. నా. వా. అ. పుం. తత్స. కాకై స్తిమ్యత ఇతి కాకతిందుకః. కాకుల చేత తడపబడినది, కాకి తుమ్మిక (వృక్ష విశేషము), నల్లతుమ్మ.
కాకనాసిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాకనాసికా సదృశఫలత్వా త్కాకనాసికా. కాకిముక్కువంటి ఫలములుకలది. కాకిదొండ.
కాకపక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. కార్ష్ణ్య చాఞ్చల్యాభ్యాం కాకపక్షసాదృశ్యాత్కకపక్షః. నలుపు చేతను, కదలుటచేతను కాకిఱెక్కవలె ఉండునది. పిల్లజుట్టు, కూకటి. కాకస్య పక్ష ఇవ ఆకారో అస్త్యస్యా ఇతి కాకపక్షః.
కాకపీలుకము
సం. నా. వా. అ. పుం. తత్స. కాకైః పియత ఇతి కాకపీలుకః. కాకులచేత పానము చేయబడునది, కాకితుమ్మిక, నల్ల తుమ్మ, పూసల గురువింద.
కాకమాచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాకాక్ మఞ్చత ఇతి కాకమాచీ. కాకులను ధరించునది, కాచి, చెట్టు.
కాకముద్గము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హీనముద్గత్వా త్కాకముద్గ, హీనమైన పెసలు కలది, కాకి పెసర.
కాకలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కలః మధురాస్ఫుటో ధ్వనిః సూక్ష్మేతస్మిన్ కాకలీ. సూక్ష్మమైన మధురధ్వని, సూక్ష్మమైన అవ్యక్తమధురధ్వని.
కాకాంగి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాకస్యేవాజ్గం ఫలమస్యా ఇతి కాకాజ్గీ. కాకివంటి ఫలములు కలది, కాకి దొండ, చిరుదొండ.
కాకిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మనందు నాల్గవపాలు. కొలిచెడుకోల, ఒకగవ్వ, తూనిక భాగము, ఎర్రగురిజ.
కాకుదము
సం. నా. వా. అ. న. తత్స. కాకు ధ్వని విశేషం దదాతీతికాకుదం. కాకుధ్వని ఇచ్చునది, తాలువు, దవుడ.
కాకువు
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం కూయత ఇతి కాకుః. కుత్సితముగా పలుకునది, పిచ్చుకకుంటు, ఒక స్వరము. ?
కాకేందువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కాకా ఇన్దం త్యత్ర కాకేన్దుః. కాకులు దీనియందు లెస్సనైయుండును, కాకితుమ్మిక, నల్లతుమ్మ.
కాకోదరము
సం. నా. వా. అ. పుం. తత్స. కాకస్యేవ ఉదరమస్యేతి వా కాకోదరః. కాకి పొట్టలాంటి పొట్ట కలది. కా ఈషత్ అకం గతికం ఉదరమ స్యేతి కాకోదరః. కొంచెం కుటిలగతి యైన కడుపుకలది, సర్పము, పాము. కు కుత్సితం అకతీతి కాకోదరః.
కాకోదుంబరికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాక ప్రియా ఉదుంబరీ కాకోదుంబరికా, కాకులకు ప్రియమైనది, కాకిమేడి (వృక్ష విశేషము), అత్తి చెట్టు.
కాకోలము
సం. నా. వా. అ. న. తత్స. కాకవత్కృష్ణ వర్ణత్వాత్కకోలః. కాకివలెనల్లనైఉండునది. కాకేఘ కోలతి స్థూలో భవతీతి కాకోలః. కాకులలో గొప్పది. నరక విశేషము, విషభేదము, మాలకాకి, కుమ్మరి. కం జలం ఆకోలతి సంస్త్యాయతి కాకోలః.
కాక్షి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కషతి కండ్వాది రోగానితి కాక్షీ. తీట మొదలైన రోగములను హరించునది. అడవితొగరితీగ, తొగరి, తొగరిమన్ను, సువాసన గల భూమి.
కాచము
సం. నా. వా. అ. న. తత్స. కచ్యతే బర్ధ్యతే సూత్రేణేతి కాచః. సూత్రముచేత బంధింపబడునది. కచ్యతే బధ్యత ఇతి కాచః. కట్టబడునది, కాచ శబ్దము ఉట్టికిని, గాజునకును, కండ్లవ్యాధికినిపేరు గాజుప్పు, గాజుపూస, గాజుమన్ను, కావడియుట్టి, నేత్రరోగవిశేషము, కాసు, ఊయల, పసుపు, నలుపు కలిసిన రంగు.
కాచస్థాలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రసాధార కుంభత్వాత్ స్థాలీ. పుష్పరసమునకు కుండవలె ఆధారమైనది, కలిగొట్టు, కాచస్థాలీ.
కాచితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కాచమారోపితం కాచితం. ఉట్టియందు పెట్టబడినది కావడిఉట్టి యందుంచ బడినది. (కుండలోనగునది)
కాతరుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఈషత్తర తీతి కాతరః. ధైర్యము లేకుండట చేత కార్యమునుఇంచుకంతదాటువాడు, అధీరుడు, భయశీలుడు.
కాత్యాయని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అవరక్షణేకతి అయనాని మోక్షమార్గా. స్సంతీతి విచారయతీతి కత్యయనః తస్యగోత్రాపత్యం కాత్యాయనీ. మోక్షమార్గములుఎన్నికలవని విచారించువాడు కత్యయనుడు, ఆఋషిగోత్రమందేపుట్టినది, పార్వతి, సగమువయసు చెల్లినకావిచీరకట్టిన విధవ. “కత్యస్య ఋషే రపత్యమిప వర్తతే కాత్యాయనీ. కత్యుడను ఋషికూతురువలెఉండునది.
కాదంబము
సం. నా. వా. అ. పుం. తత్స. కదం బస్య స్వసంఘస్య సహచారిత్వాత్ కాదంబః. ఆసంఘముతో కూడిఉండునది. ధూమ్రవర్ణము లైన ముక్కుకాళ్లు ఱెక్కలు కలిగినహంస, బాణము. కదంబే సమూహే భవః కదంబః. కదంబ వృక్షము.
కాదంబరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గోమంత పర్వతే కదంబకోటరే జాతత్వాత్ కాదంబరి. గోమంత పర్వతమందు కడప చెట్టుతొఱ్ఱలో పుట్టినది, ఒకానొకకావ్యము, ఆడుకోయిల, గోరువంక, మధ్యము, సరస్వతి.
కాదంబిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కముదక మాదదత కదంబః మేఘాః తేత్రసంతీతి కాదంబినీ. జలమును పుచ్చుకొనునవి కనుక కదంబములనగా మేఘములు, మేఘపంక్తి.
కాద్రవేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఇల్లు. కద్ర్వా అపత్యం పుమానితి కాద్రవేయః. కద్రువు యొక్క సంతానము, పాము.
కాననము
సం. నా. వా. అ. న. తత్స. కన్యతే గమ్యత ఇతి వా కాననం. పొందబడునది, అడవి, ఇల్లు, బ్రహ్మముఖము.
కానీనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కన్యాయాః పుత్రః కానీనః. కన్యకు కొడుకు, వ్యాసుడు, కర్ణుడు, కన్యకాపుత్రుడు. కన్యాయాం అనూఢాయాం జాతః కానీనః. కన్యక, అనూఢుల పుత్రుడు.
కాపథము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితిః పంథాః కాపథాః. కుత్సితమైన తెరువు, సం. నా. వా. అ. న. తత్స. నీటి వట్టివేరు సం. నా. వా. అ. పుం. తత్స. చెడుత్రోవ, చెడ్డదారి.
కాపోతము
సం. నా. వా. అ. న. తత్స. కపోతానాం సమూహః కాపోతం. గువ్వలయొక్క గుంపు, కపోత వర్ణత్వాతాకా పోతః. పావురపు వన్నెకలది, అంజన విశేషము వానప్రస్థుడు.
కామనుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అభీకః కమనః కామనః. కామించు స్వభావము కలవాడు, ఇచ్ఛకలవాడు, చక్కనివాడు, కామికుడు.
కామపాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కామం స్మరం పాలయతీతి ఆత్మజత్వా త్కామపాలః. కుమారుడుగుటవలన మన్మధుని పాలించువాడు, హలి, బలరాముడు. కామాన్ పాలయతీతి కామపాలః.
కామము
సం. నా. వా. అ. న. తత్స. కామం కామాభ్యనుజ్ఞాయాం. త్రికాండ శేషము, కామ్యము, రేతస్సు, ఇచ్ఛ, ఇచ్ఛవచ్చినట్టు, మన్మధుడు, గుగ్గిలము, స్వేచ్ఛగా, ప్రియము.
కామము
సం. నా. వా. అ. పుం. తత్స. 1. కామః కామ్యతే అనేన కామః దీనిచేత కోరబడును. 2. కమనం కామః. కోరుట, 3. కామయతే కామనాచకామః కామింపచేయువాడు ఇచ్ఛ. మన్మథుడు. 4. కామ్యతే అసౌ ఇతి కామః. కామదేవుడు, మదనుడు, ప్రద్యుమ్నుడు, మీనకేతనుడు, కందర్పుడు, దర్పకుడు, అనంగుడు, శ్రీకృష్ణ పుత్రుడు, పంచశరుడు, స్మరుడు, శంబరారి, మనసిజుడు, కుసుమేషుడు, అనన్యజుడు, రతిపతి, మకరధ్వజుడు, ఆత్మభువుడు, విశ్వకేతువు, మనోరథుడు, బలదేవుడు, మహారాజచూతుడు, కామ్యుడు. సం. నా. వా. అ. న. తత్స. కామ్యతే సర్వైరితి కామం. అందరిచేత కోరబడునది, కామ్యము, రేతస్సు, గుగ్గిలము, కోరిక, స్వేచ్ఛ, ప్రియము. కామాయ హితమితి కామః. నికామము, బాఢము, అనుమతి. సం. నా. వా. విణ. తత్స. ఇచ్ఛవట్టినట్లు.
కామయిత
సం. విణ. (ఋ. ఇ. ఋ). తత్స. కామయతే తాచ్ఛీల్యేనేతి కామయితా. కోరిక కలవాడు, కాముకుడు.
కామిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అతిశయేన కామోస్యా ఇతి కామినీ. అతిశయమైన కామము కలది. కామోస్యా అస్తీతి కామిని. అభిలాష కలిగినది. ప్రియసంగమమునందు మిక్కిలి ఆసకల ఆడుది, ఆడుది, ఆడుజక్కవ, ఆడుపావురము, బదనిక, స్త్రీ.
కాముకము
సం. నా. వా. అ. పుం. తత్స. కామయతే తాచ్ఛిల్యేనేతి కాముకః. కామించు స్వభావము కలవాడు, మన్మధుడు, మరుడు, ఇరుగుడు, తినాసము, ఇచ్ఛకలది.
కాముకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సురతం కామయత ఇతికాముకీ. సురతమును కోరునది. సంభోగము నందిచ్చకల ఆడుది, కాముకురాలు.
కాయము
సం. నా. వా. అ. పుం. తత్స. చీయతే అవయవైరితికాయః. అవయవముల చేతకూర్చబడునవి, శరీరము, సమూహము, స్వభావము, గురి, దానము. కాయతి ప్రకాశతే ఇతి కాయః. మూర్తి, దేహము, సంఘము, లక్ష్యము, మూలధనము.
కాయస్థ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాయస్తిష్ఠత్యనయేతి కాయస్థా. శరీరము దీనివలన నిలుచును, ఉసిరిక, కరక. కాయేషు సర్వభూత శరీరేషు అంతర్యామితయా తిష్ఠతీతి, వ్రాయసకాడు.
కారండవము
సం. నా. వా. అ. పుం. తత్స. కారండః తం వాతి గచ్ఛతీతి కారండవః. పంజరము, కన్నెలేడి, ఒక పక్షి, హంసవిశేషము.
కారంబా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఈషద్రం భాకారాకారంభా. కొంచెము అరటిని పోలిఉండునది, ప్రేంకణము, ప్రియంగువు.
కారణం
సం. నా. వా. అ. న. తత్స. కరోతి కారణం. చేయునది, యాతన, కొఱముట్టు, వధము, హేతువు, తీర్పు.
కారణా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తృణాతీతి కారణా. బాధించునది, యాతన, తీవ్రవేదన, యమయాతన.
కారణికుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కారణేన పరీక్షాది హేతునావ్యవహరతీతి కారణికః. పరిక్షాది కారణముల చేత వ్యవహించువాడు, పరీక్షకుడు, పరీక్ష.
కారవీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కేన జలేన రౌతి కరవః మయూరః కరవస్యే యం కారవీ. ఉదకము చేత కూయునది, నెమలి. కరోతీతి కారుః తస్యేయం కారవీ. కారువునకుపయోగించునది. కారువదగ్ని దీపన కర్మణి నిపుణత్త్వాత్ కారవీ. శిల్పివలె కార్యమందు సమర్ధమైనది, ఇంగువమ్రాను, ఓమము, నల్లజీల కఱ్ర, సదాప, వాద్యము. అగ్ని దీపమందు అగసాలవాని వలె నేర్పరియైనది. కారువత్కర్మణి నిపుణత్వాత్ కారవీ.
కారవేల్లము
సం. నా. వా. అ. పుం. తత్స. కారేణ ప్రయత్నేన వేల్లతి చలతీతి కారవేల్లః. ప్రయత్నము చేత చలించునది, కాకర.
కారా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కరోతి బంధనం కారా. బంధనము చేయునది, చెఱసాల, ధూతిక, వీణ, సువర్ణకారిక.
కారిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృణోతి కరోతీతి కారికా. హింసించునది, చేయునది కనుకారిక, సూత్రాది వివరణశ్లోకము, యాతన, చేయుట, మంగలిలోనగువానిపని, నట్టువునిపెండ్లాము, బొగ్గు, వడ్డి, బాధ, శ్లోకము, వ్యాఖ్య, పని.
కారీషము
సం. నా. వా. అ. న. తత్స. కరీషః శుష్కగోమయః తేషాం సమూహః కారీషం. ఎండిన పేడ యొక్కప్రోగు, కరీషముల సమూహము (కరీషము-ఏఱుపిడక).
కారుణికుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కారుణ్యమస్యాస్తీతి కారుణికః. కరుణకలవాడు, కనికరముకలవాడు, కృపాళువు, దయాళువు.
కారుణ్యము
సం. నా. వా. అ. న. తత్స. కరుణైవ కారుణ్యం. కరుణయే కారుణ్యము, దయ, కనికరము.
కారోత్తమము
సం. నా. వా. అ. పుం. తత్స. కారేణ క్రియయా ఉత్తమః కారోత్తమః. మాదక క్రియచేత ఉత్తమమైనది కల్లుతేట, ఒక ద్రవవేంజనము.
కార్తస్వరము
సం. నా. వా. అ. న. తత్స. కృతస్వరాఖ్యాకరోద్భవత్వాత్కార్త స్వరం. కృతస్వరమనుగని యందుపుట్టినది, స్వర్ణము, బంగారము, కనకము.
కార్తాంతికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కృతాన్తోదైవం తద్వేత్తీతి కార్తాన్తికః. దైవము నుఎఱిగిన వాడు, జ్యోస్యుడు.
కార్తికము
సం. నా. వా. అ. పుం. తత్స. కృత్తికానక్షత్రయుక్తా పూర్ణిమాస్మిన్నస్తీతి కార్తికః. కృత్తికా నక్షత్రముతో కూడిన పున్నమ దీనియందుకలదు, ఒకనెల.
కార్తికికము
సం. నా. వా. అ. పుం. తత్స. కృత్తికానక్షత్ర యుక్తాపూర్ణి మాస్మిన్న స్త్రీకార్తికః కార్తికికశ్చ. కృత్తికా నక్షత్రముతో కూడిన పున్నమ దీనియందుకలదు, కార్తికము, ఒకనెల.
కార్తికేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కృత్తికానామపత్యం కార్తికేయః. షట్కృత్తికలకొడుకు, కుమారస్వామి, కందుడు, శివపుత్రుడు, అగ్ని పుత్రుడు, మహాసేనుడు, శరజన్ముడు, షడాననుడు, పార్వతీ నందనుడు, స్కందుడు, సేనాని, గుహుడు, బాహులేయుడు, కుమారుడు, ధర్మాత్ముడు, భూతేశుడు, మహిషార్దనుడు, కామజిత్, కాంతుడు, భువనేశ్వరుడు, శిశువు, దీప్తవర్ణుడు, శుభాననుడు, రౌద్రుడు, ప్రియుడు, చంద్రాననుడు, దీప్తశక్తి, ప్రశాంతాత్మ, షష్ఠీప్రియుడు, పవిత్రుడు, మాతృవత్సలుడు, రేవతీసుతుడు, ప్రభువు, నేత, లలితుడు, బ్రహ్మచారి, శూరుడు, శరవణోద్భవుడు, విశ్వామిత్ర ప్రియుడు, దేవసేనాప్రియుడు, వాసుదేవప్రియుడు, స్వామి, ద్వాదశ లోచనుడు, శంభుతనయుడు, దేవసేనాపతి, మహాబాహువు, పావకాత్మజుడు, రుద్రశూరువు.
కార్పాసము
సం. నా. వా. అ. పుం. తత్స. కార్పాస్యాః ఫలం కార్పాసం. ప్రత్తి దాని చేత చేయబడిన చీర, కార్పాసం-పత్తి, నూలిచేత నేయబడినది (చీర), తర్కోలం, నూలుబట్ట.
కార్పాసీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జనోపకారాయ కల్పతే కార్పాసీ. జనోపకారము కొఱకు సమర్ధమైనది, ప్రత్తిచెట్టు.
కార్మణము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్మైవకార్మణం. కర్మమే కారణము. మూలికలచేత చేసెడి యుచ్చాట నాదిక్రియ, చిల్లింగి, నెఱవేఱుదాక పనిచేయునది, గండ పురులు.
కార్ముకము
సం. నా. వా. అ. న. తత్స. కర్మణే ప్రభవతి కార్ముకం. యుద్ధకర్మ కొరకు సమర్థమైనది. విల్లు, వెదురు, పనియందు నేర్పరి, ధనస్సు, ఆయుధము.
కార్ముడు
సం. విణ. (అ.ఈ.అ). తత్స. కర్మకరణం శీల మస్యేతి కార్మః. కార్యము చేయుటయే స్వభావముగా కలవాడు, కర్మశీలుడు.
కార్షాపణము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్ష సంబంధినా రూప్యేణ పణ్యతే వ్యవహ్రియత ఇతి కార్షాపణః. కర్షమెత్తువెండి చేత వ్యవహరింపబడునది, పదియాఱు పణముల యెత్తు, కర్షమెత్తు వెండిటంకము, అరువది నాలుగు పణములు, ఒకమాసము.
కార్షికము
సం. నా. వా. అ. పుం. తత్స. కర్షః ప్రమాణమస్యకార్షికః. కర్షమెత్తు ప్రమాణముకలది. కర్షమెత్తు వెండిటంకము, అరువది నాలుగు పణములు, ఇరువది మాసములు.
కాల
సం. నా. వా. అ. పుం. తత్స. కలయతి ధర్మా ధర్మాణామాయుషోవా సంఖ్యానం కరోతీతి కాలః. శబ్ద సంఖ్యానయోః ధర్మాధర్మాములైనను ఆయువునైనను లెక్కపెట్టువాడు. కాలే సాధు కాల్యమితివా. కాలమందు యోగ్యమైనది. కాలయతి మనఇతి కాలః. మనస్సును ప్రేరేపించునది. కలయతి ప్రాణిన ఇతి కాలః. ప్రాణులను పోద్రొబ్బువాడు. సమయము, నలుపు, చావు. ఆ. స్త్రీ. తత్స. కలిగొట్టు, నల్లజీలకఱ్ఱ, నల్లతెగడ, నీలి, మంజిడి. విణ. తత్స. నల్లనిది.
కాలకంఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కాలవర్ణః కణ్ఠోస్యేతి కాలకణ్ఠః. నల్లని మెడగలది, శివుడు, యముడు, కోకిల.
కాలకము
సం. నా. వా. అ. పుం. తత్స. కాలయతి కృష్ణయతి స్వప్రదేశమితి కాలకః. తన స్థలమును నల్లగా చేయునది, పుట్టుమచ్చ.
కాలకూటము
సం. నా. వా. అ. పుం. తత్స. కాలస్య వర్ణస్య కూటః కాలకూటః. కృష్ణ వర్ణమునకు స్థానము, విషభేదము.
కాలఖండము
సం. నా. వా. అ. న. తత్స. కాలంచ తత్ ఖండంచ కాలఖండం. నల్లని మాంసఖండము, కారిజము, యకృత్తు.
కాలధర్మము
సం. నా. వా. అ. పుం. తత్స. కాలస్య యమస్యధర్మః కాలధర్మః. యముని యొక్క ధర్మము, మరణము, చావు.
కాలపృష్ఠము
సం. నా. వా. అ. పుం. తత్స. కాలవర్ణః పృష్ఠోయస్యసః కాలపృష్ఠః. నల్లనైన వెనుక దిక్కు కలది, కర్ణుని విల్లు, విల్లు, ఒక దినుసు, ఇఱ్ఱి, రాపులుగు పక్షి, జింక.
కాలమేషి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాల వర్ణేన మిష్యతే కాలమేషి. నీలవర్ణము చేత పలుకబడినది, కారుగచ్చ, సోమలత.
కాలమేషికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాలేన వర్ణేన మిష్యతే కాలమేషికా. నల్లవన్నె చేత చెప్పబడునది. నల్లతెగడ, మంజిడి, ద్రాక్ష.
కాలశేయము
సం. నా. వా. అ. న. తత్స. కలశ్యాం భవ కాలశేయం. కలశమందుపుట్టినది, గోరసము, చల్ల, మజ్జిగ.
కాలసూత్రము
సం. నా. వా. అ. న. తత్స. కాలాన్య యోమ యాని సూత్రాణ్యస్మిన్నితికాలసూత్రం. ఇనుము తీగలు దీనియందు కలవు, ఇనుపతంతులు కల నరకవిశేషము.
కాలస్కందము
సం. నా. వా. అ. పుం. తత్స. కాలః స్కంధోస్య కాలస్కంధః. నల్లని మొదలుకలది. “కాలవర్ణః స్కంధోస్య కాలస్కంధః. నల్లనిమొదలుగలది, చీకటి మ్రాను, తుమ్మిక, వేగిస, తుమ్మ, పచ్చాకు.
కాలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నీలవర్ణత్వాన్నీకాలా. నల్లని వన్నె కలది. కాలవర్ణత్వాత్ కాలా. నల్లనిది, కలిగొట్టు, నల్లజీలకర్ర, నల్లతెగడ, నీలి, మంజిడి అను వృక్షాలు, ఎర్ర పాషాణము.
కాలానుసార్యము
సం. నా. వా. అ. పుం. తత్స. శీతోష్ణాభ్యాం కాలోను సార్యతేనేనేతి కాలానుసార్యం. శీతోష్టముల వలన కాలము దీనిచేత అనుసరింపబడును. కాలవర్ణేనానుసార్యం కాలాను సార్యం. నల్లని వన్నె చేత ననుసరింపదగినది, ఇరుగుడు, నల్ల అగలు, ఱాతిపువ్వు.
కాలాయసము
సం. నా. వా. అ. న. తత్స. కాలం చతత్ అయశ్చ కాలాయసం. నల్లనైన ఇనుము, అయస్సు, ఇనుము.
కాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాళ వర్ణత్వాత్ కాలికా. నల్లనిది, పార్వతి, పార్వతిభేదము, ద్రౌపది, బొగ్గు, నలుపు, చీకటి, ఆడుకాకి, నూగారు, పొగగుమి, బంగారునందలి దోషము, మద్యము, క్రొత్తమబ్బు, మబ్బుగుంపుపైవర్ణము, నెలవడ్డీ, జటామాంసి తేలుకొండి, పొట్ల, సుంకము వసూలు చేయువాడు, ఒక జింక, గూని కన్య, గుర్రము, దంతముల వరుస, చిరు జీలకర్ర, రంగుమార్పు.
కాలేయకము
సం. నా. వా. అ. న. తత్స. కాలయతి దోషాన్ కాలేయకః. దోషములను పోగొట్టునది. కాలవర్ణ సారత్వాత్కలేయకం. నల్లవన్నె చేవగలది, గంధకాష్ఠవిశేషము, మ్రానిపసుపు, తాడి, కొమ్ముపసుపు, ఒక మూలిక.
కాల్యకము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్యం నిరామయం కరోతీతి కాల్యకః. వ్యాధిలేని వానిగా చేయునది, కచోరము, ప్రాతః కాలము.
కాల్యము
సం. నా. వా. అ. న. తత్స. ప్రాప్త కాలము కలయావు. వేకువ, కచోరము, కాలమునందు యోగ్యమయినది, ప్రాతః కాలము.
కావచికము
సం. నా. వా. అ. న. తత్స. కవచినాం సమూహః కావచికం. కవచము గలవారి సమూహము, కవచము తొడిగిన వారి సమూహము, గుంపు.
కావేరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కవేరస్య రాజ్ఞో పత్యం స్త్రీ కావేరీ. కవేరుడను రాజు కూతురు, ఒకానొక ఏఱు, పసుపు, వెలయాలు, ఒకనది.
కావ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. కావేర పత్యం కావ్యః. కవియను ఋషికొడుకు. కబ్బము (పంచకావ్యములు-రఘువంశము, కుమారసంభవము, మేఖసందేశము, మాఘము, భారవి).
కాశము
సం. నా. వా. అ. పుం. తత్స. కాశత ఇతి కాశం. ప్రకాశించునది, ఱెల్లు, ఒకానొకదేశము. కాశతే దీప్యతే శోభతే ఇతి యావత్ కాశః. తృణభేదము, సిత పుష్పము, దర్భ.
కాశ్మరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కృశ్యతి తనూకరోతి పిత్తాదికమితి కాశ్మరీ. పిత్తాదులను కృశముగా చేయునది, గుమ్ముడు.
కాశ్మర్యము
సం. నా. వా. అ. పుం. తత్స. కృశ్యతితనూకరోతి పిత్తాదికమితి కాశ్మర్యః. పిత్తాదుల నుఅల్పముగా చేయునది. గుమ్ముడు.
కాశ్మీరజన్మము
సం. నా. వా. స్. న. తత్స. కాశ్మీరే జన్మాస్య కాశ్మీర జన్మః. కాశ్మీర దేశమందు పుట్టినది, కుంకుమపువ్వు.
కాశ్మీరము
సం. నా. వా. అ. న. తత్స. కాశ్మీరదేశే భవం కాశ్మీరం. కాశ్మీరదేశమందు పుట్టినది, కుంకుమపువ్వు, మెట్టతామరదుంప, ఒకానొకదేశము, తామరదుంప.
కాశ్యపీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కశ్యపస్య అపత్యం కాశ్యపీః. కశ్యప ప్రజాపతి కొడుకు. “కశ్యపస్యేయం కాశ్యపీ. పరశురాముని చేత కశ్యపుని కొఱకు యజ్ఞ దక్షిణగా ఇయ్యబడినది. భూమి, అనూరుడు.
కాష్ఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కాశతే కాష్ఠా. ప్రకాశించునది, పదునెనిమిది ఱెప్ప పాట్లకాలము, దిక్కు, మేర, మ్రానిపసుపు, అతిశయము, కఱ్ఱ, కాశత ఇతి కాష్ఠా. కాష్ఠా శబ్దము ఉత్కర్షనుకు, మర్యాదకును, దిక్కునకునుపేరు, ప్రకాశించునది.
కాష్ఠతషుడు
సం. నా. వా. ష్. పుం. తత్స. కాష్ఠాని తక్షతీతి కాష్ఠతట్. కొయ్యలు చెక్కువాడు, వడ్రంగి, తక్ష, వర్ధకి, రథకారుడు, వడ్లవాడు.
కాష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. కాశతే అగ్నినా సమంకాష్ఠం. అగ్నితోకూడి ప్రకాశించునది, కఱ్ఱ. కాశతే దీప్యతేతి కాష్ఠం. దారువు, 18 రెప్పపాట్ల కాలము.
కాష్ఠీలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కా ఈషదష్ఠీలం మజ్జాస్యా ఇతికాష్ఠీలా. ఇంచుకంత సారము కలది. అరటి చెట్టువేళ్లు, కదళి, అరటి, చిన్న అరటి.
కాసమర్ధము
సం. నా. వా. అ. పుం. తత్స. కాసమర్ధ-కసింద, ఒక ఆకుకూర.
కాసము
సం. నా. వా. అ. పుం. తత్స. కాసతే అనేన కాసః. దీనిచేత కుత్సిత ధ్వని చేయుదురు, దగ్గు, క్షావధువు, రోగవిశేషము.
కాసరము
సం. నా. వా. అ. పుం. తత్స. కా ఈష త్సరతి గచ్ఛతి మహాకాయత్వాద్వాకాసరః. గొప్పదైన శరీరము కలది కనుక మందముగా నడచునది, మహిషము, ఎనుపోతు. కం ఉదకం ఆసరతీతి కాసరః. ఉదకమును పొందునది, దున్న.
కాసారము
సం. నా. వా. అ. పుం. తత్స. కాసత ఇతి కాసారః. జలము దీనియందు పొందును, సరస్సు, కొలను.
కింకిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కించిత్కణతి కింకిణీ. ఇంచుకంత పలుకునది, గజ్జె, చిరుగంట.
కించులుకము
సం. నా. వా. అ. పుం. తత్స. కించిచ్ఛలతీతి కించులమకః. ఇంచుకంత చలించునది, మహీలత, ఎఱ్ఱ, మీది గాలి.
కింజల్కము
సం. నా. వా. అ. పుం. తత్స. కించిజ్జలతి జడీభవతి కింజల్కః. ఇంచుకంత జడమై ఉండునది. కేసరము, అ కరువు, వానపాము.
కింపచానుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కించి దన్నం వచతీతి కింపచానః. ఇంచుకంత వంటకమును వండుకొనువాడు, లోభి, పిసినిగొట్టు. కిం కుత్సితం కస్మైచిదపి న దత్వా కేవలం ఆత్మార్థం పచతీతి కింపచానః.
కింపురుషుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కించి త్పురుషః కింపురుషః. ఇంచుకంత పురుషాకృతి కలవాడు అశ్వముఖమును నరశరీరమును కల దేవయోని విశేషము, కిన్నెరలు, హేమకలాటము.
కింవదంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కింకిమితి పరస్పరం వదంత్యత్రేతి కింవదంతీ. జనులాడు కొనుమాట, నానుడి. కోపి వాదః కింవదంతీ. సత్యమును, అసత్యము కాని ఒకానొక వాదము.
కింశారువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. హస్తాదికం కుత్సితం శృణాతీతికింశారుః. హస్తాదులను కుత్సితముగా పీడించునది, బాణము, వరిముల్లు, ఱాపులుగు.
కింశుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కించి చ్ఛుకవన్నీలత్వాత్కింశుకః. ఇంచుకంత పచ్చనై చిలుకవలె నుండునది, మానేరు, మోదుగు. కించిత్ అవయవైకదేశః శుక ఇవ. (శుకతుండాభపుష్పద్వాత్ తదాత్వమితి భోధ్యం). పలాస వృక్షము, ఒక పాము.
కికీదివి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కికీతి దీవ్యతి భాషతే కికీదివిః. కీయని పలుకునది, చాషము, పాలపిట్ట. కికీతి అస్ఫుటనాదం కుర్వన్ దీవ్యతి. స్వర్ణచాతకము.
కిటి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కిటితి స్వైరం కిటిః. ఇచ్చ కొలది చరించునది, వరాహము, పంది.
కిట్టము
సం. నా. వా. అ. న. తత్స. కిటితి నిర్గచ్ఛతీతి కిట్టం. నవద్వారములనుండి వెడలునది, మలసామాన్యము, మలము.
కిణము
సం. నా. వా. అ. పుం. తత్స. కఠిన వస్తువు సంస్పర్శనముచేహస్తాదుల యందు కాచెడికాయ, బేతాళ ఆసనము, దేహముపై ఏర్పడిన కాయ.
కిణిహి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కిణినో దద్రురోగిణ జౌషధత్వేగ జిహీతే యాతి కిణిహే. ఔషధమై పొందునది, ఉత్తరేణు, తెల్లగినియ, విష్ణుక్రాంతము.
కిణ్వము
సం. నా. వా. అ. న. తత్స. కణన్తిమత్తా అనేనేతి కిణ్వం. దీని చేత మత్తులై కూతవేయుదురు, పాపము, సురాబీజము, పులియ బెట్టబడినది, తెలక పిండి.
కితవము
సం. నా. వా. అ. పుం. తత్స. ఉన్మాదయ తీత్యున్మత్తః తదైవ కితవశ్చ. ఉన్మాదమును చేయునది. కింతవాస్తీతి వదతీతి కితవః. ఆడవచ్చిన వాడని నీకేమి కలదని అడుగువాడు, జూదరి, మోసగాడు, ఉమ్మెత్త.
కిన్నరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అశ్వముఖత్వాత్కుత్సి తానరాః కింన్నరాః. గుఱ్ఱపు మోము కలవారు గనుక ఏవగింప దగినవారు కిన్నెరులు. కించిన్నరః కిన్నరః. ఇతని శరీరము కొంచెము నరాకారమైయుండును, అశ్వముఖంబును, నరశరీరమును గల దేవయోని విశేషము, స్వర్గ గాయకుడు, తుంబురు మొదలైనవారు, వీణ విశేషము, దేవత విశేషము.
కిన్నరేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కిన్నరాణా మీశః కిన్నరేశః. కిన్నరులకు ప్రభువు, కుబేరుడు, పైడిఱేడు.
కిమ్మీరము
సం. నా. వా. అ. పుం. తత్స. కీర్యతే నానావర్ణా అత్రేతికిర్మీరః. నానావర్ణములు దీనియందు నెఱపబడును, చిత్రవర్ణము, నారదబ్బ, చిత్రవర్ణముకలది.
కిరణము
సం. నా. వా. అ. పుం. తత్స. కిరతి తమ ఇతికిరణః. తమస్సును పోకొట్టునది, మయూఖము, వెలుగు. కీర్యతే విక్షిప్యతే ఇతి కిరణః. సూర్యరశ్మి, చంద్రరశ్మి, రత్నరశ్మి, సామాన్యరశ్మి, అంశువు, భానువు, ప్రభ, విభ, భ, దీప్తి, జ్యోతి, ప్రకాశము, భాసము, తేజము, ఓజము, సూర్యకిరణము.
కిరము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షితిం కిరతీతికిరః. ముఖము చేత భూమిని త్రవ్వునది, పంది. కిరతి విక్షిపతి మలోపలక్షితస్థలం కిరః. వరాహము.
కిరాతతిక్తము
సం. నా. వా. అ. పుం. తత్స. కిరాతదేశే భవస్తిక్తః కిరాతతిక్తః. చేదు కలది కనుకతిక్తము, నేలవేము.
కిరాతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కీతి శబ్దం రాతీతి కిరాతః. కేయను శబ్దమును పలుకువాడు, నెమలి పింఛము ధరించి అడవియందు తిరిగెడుబోయ, ఒక సంకరజాతి, పొట్టిది, కొంచెము, పల్చనిది.
కిరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. క్షితిం కిరతీతి కిరిః. ముఖము చేత భూమిని త్రవ్వునది, వరాహము, పంది, ధనస్సు చివర.
కిరీటము
సం. నా. వా.అ. పుం. తత్స. కేర్యతేలలాబో పరిక్షిప్యత ఇతికిరీటం. నొసటి మీద పెట్టబడునది, ఒకవిధమైన రాజుల తలపాగ, బొమిడి కము.
కిలాసము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితం లస్యతే శ్లిష్యతే అనేనేతి కిలాసం. దీనిచేత జనులు కుత్సితముగా పొందబడుదురు, సిబ్బెము, సిబ్బెముకలది. కిలం వర్ణం అస్యతి క్షిపతి వికృతం కరోతి ఇతి యావత్ కిలాసం, మచ్చకలది.
కిలాసిన్
సం.విణ.(న్.ఈ.న్.) తత్స. కిలాసమస్యాస్తీతి కిలాసీ. సిబ్బెము, సిబ్బెము కలవాడు, సిధ్మలుడు, పొడవు కలది.
కిలింజము
సం. నా. వా. అ. పుం. తత్స. కిల్యతే ధాన్య మస్మిన్నితి కిలింజకః. దీనియందు ధాన్యము పోయబడును, కటము, చాప.
కిల్బిషము
సం. నా. వా. అ. న. తత్స. కిల్యతే శిథిలీ క్రియతే అనేనలోక ఇతికిల్చిషం. దీనిచేత లోకము శిధిలముగా చేయబడును. పాపము, తప్పు, రోగము, చెడ్డవిషము. “కిల్యత ఇతి కిర్చిషం, ద్రొబ్బ బడునది.
కిశోరము
సం. నా. వా. అ. పుం. తత్స. కశ్యత ఇతికిశోరః. శిక్షింపబడునది, గుఱ్ఱపుపిల్ల, తైలపర్ణి.
కిష్కువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కించిదితి కూయతే కిష్కు. కించిత్తని చెప్పబడునది, జేన, ముంజేయి, మూర, ఇరువది నాలుగు అంగుళములు, నలువది రెండు అంగుళములు, పడ్రెండు అంగుళములు.
కిసలయము
సం. నా. వా. అ. న. తత్స. కించిచ్చల తీతి కిసలయం. ఇంచుకంత చలించునది, చిగురు వేళ్లు, పల్లవము, చిగురు.
కీకసము
సం. నా. వా. అ. న. తత్స. కీతి శబ్దం కుర్వన్ కసతి చలతీతి కీకసం. కీయనెడు శబ్దమును చేయుచు చలించునది, ఎముక, నులిపురుగు. కీ ఇతి కుత్సితేన రక్తాదినా దేహాభ్యంతరే కసతి ఉత్పద్యతే ఇతి కీకసం. అస్థి, చిన్న పురుగు.
కీచకము
సం. నా. వా. అ. పుం. తత్స. కిచేతి కాయతి శబ్దాయంత ఇతి కీచకాః. కీచ్ అని మ్రోయునవి, గాలి తాకున మ్రోగెడివెదురు, ఒకానొక రాక్షసుడు.
కీనాశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం నాశయతీతికీనాశః. కుత్సితమును చెఱచువాడు. యముడు, రాక్షసుడు, ఒంటినున్నచోచంపెడువాడు, దున్నేడువాడు, పిసినివాడు, పేదవాడు, ఆకుపచ్చ, పసుపు కలిసినది, లోభి, కృషీవలుడు.
కీరము
సం. నా. వా. అ. పుం. తత్స. కితి శబ్దం రాతికీరః. కీయను శబ్దమును గ్రహించునది, చిలుక, ఒకానొకదేశము, కాశ్మీరము.
కీర్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కీర్త్యత ఇతి కీర్తిః. కీర్తింపబడునది, యశస్సు, విరివి, తేట, అడుసు, సుఖ్యాతి, బురద.
కీలకము
సం. నా. వా. అ. పుం. తత్స. కీల్యతే పశ్వాదిక మత్రేతి కీలకః. దీనియందు పశువులు కట్టబడును, ఒక సంవత్సరము, పశువులను కట్టెడు గూటము, పండు. కీలతి బధ్నాతి అనేనేతి కీలకః. శంకువు, శివకము.
కీలము
సం. నా. వా. అ. పుం. తత్స. కీలతి పక్ష్యాది గతిం నిరుణద్ధీతి కీలః. పక్ష్యాదుల యొక్క గతిని నిరోదించునది, మేకు, చిల్లకోల, మంట, మోచేయి, లేశము. “కీల్యత ఇతి కీలః. బంధింపబడునది. కీల్యతే రుధ్యతే అనేన అత్ర వా ఇతి కీలః. అగ్ని శిఖ, జ్వాల, రుద్రుడు, బాహువు.
కీలాలము
సం. నా. వా. అ. న. తత్స. కీల్యతే బద్ధ్యత ఇతివా కీలాలం. బంధింపబడునది. అల్యతేత్వచా వార్యత ఇతి కీలాలం. నీళ్ళకును, నెత్తురుకునుపేరు. నెత్తురు, నీళ్ళు. కీలం వహ్నిజ్వాలాం అలతి వారయతి ఇతి కీలాలం.రక్తము,రుధిరము,జలము,అమృతము.
కీలితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కీల్యతే తేస్మకీలితః. బంధనే, యమ ఉపరమే కట్టబడువాడు, కట్టబడినది, బద్దము.
కీశపర్ణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కిణినోదద్రురోగిణి ఔషధత్వేన జిహీతియాతి కిణిహి. దద్రురోగము కలవారు, ఉత్తరేను.
కీశము
సం. నా. వా. అ. పుం. తత్స. కీతి శబ్దేన ఈష్టేకేశః. కీయను శబ్దము అధికమైనది కోతి, దిశమొలది.
కుంకుమము
సం. నా. వా. అ. న. తత్స. శుష్కదశాయాం కుమితి కూయతే కుంకుమం. ఎండినపుడు కుమని పలుకునది, కుంకుమపువ్వు. కుం కుం ఇతి శబ్దోస్తి వాచకత్వేనాస్యేతి కుంకుమం. గంధద్రవ్యవిశేషము, కాశ్మీరదేశము నందు పుట్టినది, అగ్నిశిఖము, వరము, పీతనము, రక్తము, సంకోచము, పిశునము, ధీరము, లోహితచందనము, వాహ్లికము, వరవాహ్లీకము, రక్తచందనము, అగ్నిశేఖరము, అసృక్కు, పీతకము, కాశ్మీరము, రుచిరము, శఠము, శోణితము, వరేణ్యము, అరుణము, కాలేయకము, జాగుడము, కాంతము, వహ్నిశిఖము, కేశరవరము, గౌరము, కేసరము, హరిచందనము, ఖలము, రజము, దీపకము, లోహితము, సౌరభము, చందనము.
కుంచితము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కుంచతి వక్రతయా అల్పీభవతీతి కుంచితం. వంకరగా ఉండుటచే కొంచమై ఉండునది, వంకరైనది, వక్రము.
కుంజర
సం. నా. వా. అ. పుం. తత్స. కుంజౌ కుంభాధో గర్తావస్యస్త ఇతి కుంజరః. కుంభస్థలములకు దిగువున ఉండుగుంతలు, ఏనుగు, వెంట్రుక, ఉత్తర పదమైన చోశ్రేష్ఠము. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఏరు జాజి, కలిగొట్టు (వృక్ష విశేషము). ప్రశస్తః కుంజః హనుర్దంతో వా అస్త్యస్య కుంజరః. కేశము, దేశభేదము, పర్వతవిశేషము.
కుంజరాశనము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంజరాణాం అశనం కుంజరాశనః. ఏనుగులకు భక్షణ మగునది, పిప్పలము, రావి (వృక్ష విశేషము).
కుంజలము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితం జలం కుంజలం. కుత్సితమైన జలముచేత అభివ్యక్తి కలది, పులియపెట్టిన కడుగు నీరు, గంజి.
కుండము
సం. నా. వా. అ. న. తత్స. కుణ్డ్యతేస్మిన్నితి కుండం. దీనియందు వండబడును. కుండయతి క్షేత్రిణః కులంకుండః. పెండ్లాముకల వారి కులమును దహించువాడు, మగడు బ్రతికియుండగా మఱి ఒకనికి కన్న కొడుకు, వంటకుండ, గుడిలోని గంట, నిప్పులగుండము, తూనికగుండు, కొండ. కుండ్యతే రక్ష్యతే భక్ష్యాది అస్మిన్ ఇతి కుండం. కులటాపుత్రుడు, హోమకుండము, గంజి.
కుండలము
సం. నా. వా. అ. న. తత్స. కుండవద్వృత్త త్వాత్ కుండలం. కుండము వలె వట్రువగానుండునది, పోగులు, గుండ్రన, త్రాడు, పాశము, వలయము.
కుండలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుండలాకారం వపురస్యేతి కుండలీ. కుండలాకారమైన శరీరము కలవాడు, ఉప్పి, తిప్పతీగ, కుండలాకారనృత్యము గొండ్లి, దండలాసక విధమను గుండలియును, పాము, నెమలి, వరుణుడు, పోగులుకలవాడు, విష్ణువు, గుడీచ.
కుండి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుండవద్వృత్తత్వాత్ కుండీ. కుండవలె వట్రువగానుండునది, కమండలువు, గిండి.
కుంతము
సం. నా. వా. అ. పుం. తత్స. కుణంత్యనేనేతి కుంతః. దీనిచేత మొఱ పెట్టుదురు, ఈటె, బల్లెము, అడవి గోధుమలు, ఒక దేశము.
కుంతలము
సం. నా. వా. అ. పుం. తత్స. ధైర్ఘ్యాత్ కున్తాకారం లాతీతి కుంతలః. ధైర్ఘ్యముచే కుంతమను ఆయుధాకృతిని ధరించునది, వెండ్రుక, నాగలి, యవలు, ఒకానొకదేశము, జుట్టు.
కుందము
సం. నా. వా. అ. పుం. తత్స. కమనీయత్వాన్ముకుందః. ఒప్పుచుండునది కనుక ముకుందము. కుం భూవం ధ్యతి ఉద్భవకాలేకుంద. పుట్టునపుడు భూమిని వ్రక్కలించునది, కుందః కుందుము. మల్లెచెట్టు. మొల్ల, ఒకనిధి, బండికంటి తిరుగుడు, పోగారు.
కుందురుకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుంద్యతే మూలైరితి కుందురుకీ. వేళ్లచేత భూమిని పీడించినది అందుగు.
కుందురువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కుంద్యతి మూలైరితి కుందురుః. భూమిని వ్రేళ్లచే పీడించునది. కుందురుష్కమనెడు గంధద్రవ్యము.
కుంబా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుంబయతి ఆచ్ఛాదయతి కుంబా. యజ్ఞశాలను కప్పు కొని ఉండునది, యూపము చుట్టు మిక్కిలి దుర్గమముగా నిడిన వెలుగు, యాగశాల ఆవరణ.
కుంభకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభం కరోతీతి కుంభకారః. కడవలు చేయువాడు, కులాలుడు, కుమ్మరి.
కుంభము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభతీతి కుంభః. అగస్త్యుడు, ద్రోణుడు, కుం భూమిం కుంభతి జలేన ఇతి కుంభః. ఘటము, ఏనుగు శిరస్సు, వేశ్యాపతి, ప్రాణాయామాంగ కుంభకము, ప్రహ్లాదపుత్రుడు, మేషాది పన్నెండు రాశులలో పదకొండో రాశి, హృద్రోగము, లగ్నవిశేషము, కడవ, విటుడు, పచ్చకామల, రెండు చతుష్కములు ఒక రాశి.
కుంభి
సం. నా. వా. న్. పుం. తత్స. కుంభోస్యాస్తీతి కుంభీ. కుంభీరము, గుగ్గులువు, జలజంతువిశేషము. ఏనుగు, కుమ్మరవాడు, మొసలి.
కుంభిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కేన జలేన ఉభ్యత ఇతి కుంభికా. జలము చేత పూర్ణమగునది, తీగపాచి.
కుంభినీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భూమి, నేల.
కుంభీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుంభయతి పర్ణై రాచ్ఛా దయతీతి కుంభీ. ఆకులచే కప్పుకొని ఉండునది, కలిగొట్టు (వృక్ష విశేషము), పినగుమ్ముడు, తీగపాచి, వంటకుండ, క్షుద్రకుంభము, ఉఖ, కట్ఫలము, వృక్షవిశేషము, కుంభీపుష్పము, రోమశము, దంతీవృక్షము.
కుంభీనసము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభీవ నసా నాసా యస్య సః కుంభీనసః. విషజ్వాలలు క్రక్కెడు పాము, క్రూరసర్పము.
కుంభీరము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభినో గజాక్ రాతీతి కుంభీరః. గజములను గ్రహించునది, నక్రము, మొసలి, మ్రోయునది, ఈచబోయిన చేయికలవాడు. కుంభినం హస్తినమపి ఈరయతి ఇతి కుంభీరః. జలజంతు విశేషము.
కుకుందరము
సం. నా. వా. అ. న. తత్స. కు ఈషత్ కుం నితంబ భూమిం దృణీత ఇతి కుకుందరే. ఇంచుకంత నితంబ భూమిని భిన్నముగా చేయునది, ఆడుదాని పిఱుదుల మీది గుంటలు, పిఱిది మీది గుంత. స్కుంద్యతే కామినా అత్ర ఇతి కుకుందరం. కటి నిమ్నభాగము.
కుకురుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుత్సితః కరోస్యకుకరః. కుత్సిత మైన చేయికలవాడు, ఈచ బోయిన చేయికలవాడు, వంకర చేయివాడు.
కుకూలము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితం కూల మస్యేతి కుకూలం. కుత్సితమైన దరి కలిగినది, వసినాసిగుంట, కుమ్ము, ఊక నిప్పు, కర్రముక్కతో కూర్చబడిన గొయ్యి.
కుక్కుటము
సం. నా. వా. అ. పుం. తత్స. కుకు ఇతి శబ్ద ముచ్చారయన్ కుటతీతి కుక్కుటః. కుకు అనుశబ్ధమును పలుకుచు వక్రముగా పోవునది, కోడి, కపటము, మిణుగురులు. పక్షి విశేషము, నెమలి, ఒక ఆకుకూర, ఒక సంకరజాతి, పక్షవాతము.
కుక్కుభము
సం. నా. వా. అ. పుం. తత్స. కుగితి కుభతి శబ్దాయత ఇతి కుక్కుభః. కుక్కు అని పలుకునది, గంపపులుగు, అలజము.
కుక్కురము
సం. నా. వా. అ. న. తత్స. శునకాకారత్వాత్కుక్కురం. శునకాకారము కలది. కోకతే అస్థ్యాదిక మాదత్త ఇతి కుక్కురః. ఎముకలు మొదలయిన వానిని తెచ్చుకొనునది. గండివనము, మాచిపత్రి, కుక్క.
కుక్షి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కుష్యతే బహిష్క్రియతే మలమస్మాదితి కుక్షిః. దీనివలన మలము బయలు వెళ్ళింపబడును, జఠరము, కడుపు, పొట్టలో బుర్రుమనుట.
కుక్షింభరి
సం. విణ. ఇ. తత్స. స్వకుక్షిమేవ బిభర్తీతి కుక్షింభరిః. తనకడుపు మాత్రము నిండించు కొనువాడు, పొట్టపోసికొనువాడు.
కుచందనము
సం. నా. వా. అ. న. తత్స. కౌ భూవి జాతం వాకు చందనమ్. చందనము, ఎర్రగంధము, కుష్ఠము, బుజపత్రి, భూమి యందు పుట్టిన చందనము, చెడ్డ చందనము.
కుచము
సం. నా. వా. అ. పుం. తత్స. కుచ్యతే కామినానఖైః కుచౌ. నాయకుని గోళ్ళచే గిల్లబడునవి, స్తనము. కృచతి సంకుచతి ఇతి కుచః.
కుచరుడు
సం. విణ. (అ.ఆఅ). తత్స. కుత్సితం చరతి భాషతే గచ్ఛతి వాకుచరః. కుత్సితముగా పలుకువాడుగాని, చరించువాడుగాని కుచరుడు, పరుల దోషమును చెప్పెడువాడు, నికృష్ఠపు మాటలాడువాడు, దుర్మార్గుడు.
కుజి
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కావజనీతి కుఞ్జ నిరుఞ్జశ్చ. భూమియందుపుట్టినది. పార్వతి, సీత, చెట్టు.
కుజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కౌ పృధి వ్యాం జాతః కుజః. భూమి యందు పుట్టినవాడు, అంగారకుడు, నరకాసురుడు, కుజగ్రహము, మంగళ గ్రహము, ఒక దేశము, చెట్టు.
కుటజము
సం. నా. వా. అ. పుం. తత్స. కుటిలో జాయతే కుటజః. కుటిలముగా పుట్టునది, మల్లిక వలెనుండునది, కొండమల్లె (ఇది వర్షఋతువున పూచును). కుటే పర్వతే జాతః కుటజః. గిరిమల్లిక, శత్రుపాదపము, మహాగంధము, అంకుడు చెట్టు.
కుటన్నటము
సం. నా. వా. అ. న. తత్స. కుటక్ వక్రీభవతీ నటతీతి కుటన్నటః. వక్రమైనటించునది. “కుటన్ వక్రీభవన్నటతీతి కుటన్నటం. వక్రమైనటించునది, కయివడిముస్తె, పుందుండిగము, పెద్దమ్రాని చెట్టు, తుంగముసై.
కుటము
సం. నా. వా. అ. పుం. తత్స. కుటతి శాఖాదినా వక్రీభవతీతి కుటః. శాఖాదులచేత వక్రమైఉండునది, కుండ, గుడిసె, చెట్టు, ఉప్పు.
కుటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కుటతి కుటిలీ భవతీతి కుటి. దీనియందు జనులు చేరుదురు, గుడిసె, నీళ్లు మోసెడు పనికత్తె, మురఅనెడు గంధద్రవ్యము, ఇనుము, ఇల్లు, వక్రము, గుడి.
కుటిలము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుటతీతి కుటిలం. కుటిలత్వమును పొందునది. ఒకానొకఏఱు, వంకరైనది, వక్రము.
కుటుంబిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుటుంబం పుత్ర భృత్యాదికం అస్యా ఇతి కుటుంబినీ. పోషింపతగిన పుత్ర భృత్యాదులు కలది. కుటుంబ పోషకురాలగు స్త్రీ, ఇల్లాలు.
కుట్టనీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విటస్య కుటుంబం అర్ధహరణేన కుట్టయతి నాశయతీతి కుట్టనీ. విటుని కుటుంబము నర్ధహరణము చేత చెరచునది, కుంటెనకత్తె. కుట్టయతి ఛీనత్తి నాశయతి స్త్రీణాం శీలం యా సా కుట్టనీ, వేశ్య.
కుట్టిమము
సం. నా. వా. అ. పుం. న. తత్స. రాతి కట్టడపునేల, నెలకట్టు, దానిమ్మ (వృక్ష విశేషము) సం. నా. వా. అ. పుం. తత్స. బద్ధభూమి, దాడిమవృక్షము.
కుట్మలము
సం. నా. వా. అ. పుం. తత్స. కుటతి ఈషత్కుట్మలః. కొంచెం కుటిలమై ఉండునది, నరక విశేషము, మొగ్గ, అరవిరిమొగ్గ. కుటతి ఈషద్ వికాసోన్ముఖీభవతీతి కుట్మలః. ముకులము.
కుఠరము
సం. నా. వా. అ. పుం. తత్స. కుటతి భ్రమత్యనేన మంథదండ ఇతి కుటరః. దీని చేత కవ్వము తిరుగును, కుటరము, కవ్వపురాట, గొడ్డలి.
కుఠారము
సం. నా. వా. అ. పుం. తత్స. కుఠాక్ వృక్షాక్ ఇయర్తీతి కుఠారః. వృక్షముల పొందునది. స్వధితి, గొడ్డలి.
కుఠేరుకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుణ్ఠ తిమశకాదిగతిం ప్రబధ్నాతీతి కుఠేరకః. మశకాదిగతినిఅప్పగించునది, నల్లగగ్గెర, తెల్లగగ్గెర.
కుడపము
సం. నా. వా. అ. పుం. తత్స. కుడపః కుల సంస్త్యానేలడయోభేదః. దీనియందు ధాన్యము కూర్చబడును, ధాన్యమాన విశేషము, మానిక, రెండు ప్రసృతములు.
కుఢ్యము
సం. నా. వా. అ. న. తత్స. కౌతి పతనసమయే కుడ్యం. పడునపుడు మ్రోయునది, గోడ, పూత.
కుణపము
సం. నా. వా. అ. పుం. తత్స. కుణం శబ్దం పాతీతి కుణపః. శబ్దమును పాలించునది, దనంజయమను వాయువు శవమందుండి శబ్దమును పుట్టించును, పీనుగు, దుర్గంధము, శవము, చీము.
కుణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కుణ్యతే కుత్సిత ఇతి కుణిః. కుత్సితుండని పలుకబడువాడు, నందివృక్షము, ఈచబోయిన చేయిగలవాడు, సొట్టచేయికలవాడు.
కుతపము
సం. నా. వా. అ. పుం. తత్స. సూర్యోస్మిన్ కుంభువం తపతీతికుతపః. సూర్యుడు దీనియందు భూమిని దహింపజేయును. దినము యొక్కఎనిఁమిదవభాగము, వాద్యము, మేకత్రుప్పటి కంబళి, ధర్భ, సూర్యుడు, వైశ్వానరుడు, అగ్ని, అతిధి, తోలుబుడ్డి.
కుతుకము
సం. నా. వా.అ.న.తత్స. కుత్సితం తోజయతి హినస్తీతి కుతుకం. అపూర్వ వస్తువును కోరుటవేళ్ళు, అనుభవింపని కోరిక అందలిఆస, తమి, తోలుబుడ్డి.
కుతుపము
సం. నా. వా. అ. పుం. తత్స. అల్పాకుతూః కుతుపః. పెద్దసిద్దె, చేతిసిద్దె, తోలుబుడ్డి.
కుతువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. కుత్సితం తన్యతే కుతూః. కుత్సితముగా చేయబడునది, సిద్దె.
కుతూహలము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితం పాపం తూలయతీతి కుతూహల. కుత్సితమైన పాపమును బయలుపఱచునది. కుతుకము, నాయికకు మనోజ్ఞమైన వస్తువును చూచుటఅందుకలలోలత్వము, ప్రశస్తము, ఉత్సాహము.
కుత్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుత్సలా నిందనం నిందాదిది కుత్సాయం. నిందించుట, నింద, దూఱు, అక్షేపము, నిర్వాదము, పరివాదము, అపవాదము, జుగుప్స.
కుత్సితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుత్సాస్య సంజాతేతి కుత్సితః. నిందకలవాడు, నికృష్టము, కీడ్వడినది, అధమము, అవద్యము, నింద్యుడు.
కుథము
సం. నా. వా. అ. పుం. తత్స. కుథ్యత ఇతి కుథః. బ్రాహ్మణ హస్తముల యందు కూర్చబడునది. గజ పృష్ఠే కుథ్నా తీతి కుథః. ఏనుగు వీవున నుండునది, ధర్భ, ఏనుగు వీపుమీద పఱచెడి ఎఱ్ఱకంబళి, చిత్రకంబళము, చిత్రాసనము, ఒక సంకరజాతి.
కుద్దాలము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభువం మూలైర్దళయతీతి కుద్దాలః. వేళ్ళచేత భూమిని వ్రక్కలించునది. త్రవ్వునట్టి ఒకానొక సాధనము, గుద్దలి, కాంచనము.
కునటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కౌనేపాళభూమౌ నటతీతి కునటీ. నేపాళభూమి యందు నటించునది, మణిసిల, నేపాలదేశపుమణిసిల, ఎఱ్ఱపాషాణము.
కునాశకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంనాశయతి కణ్టకత్వేన కునాశకః. ముండ్లచేత భూమిని చెఱుచునది. తీట కసింద, గోరింట.
కుపూయము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుత్సితం పూయతే కుపూయః. నశించువాడు, కుత్సితము, నీచము.
కుప్యము
సం. నా. వా. అ. న. తత్స. గోపనీయం కుప్యం. రక్షింపతగినది, వెండి, బంగారు దక్క తక్కిన లోహము. గుప్యతే రక్ష్యతే ద్రవ్యాదికం అత్ర ఇతి కుప్యం, చెడ్డలోహము, ఒక ఉప్పు.
కుబేరకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం బేరమస్యాస్తీతికుబేరకః. కుత్సితమైన శరీరము కలది, నంది వృక్షము.
కుబేరాక్షి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. యక్షాక్షితుల్యపుష్పత్వాత్కుబేరాక్షి. కుబేరనయన సదృశమైన పుష్పములుకలది, కలిగొట్టు, ఒక తీగ.
కుబేరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం బేరం శరీరం యస్యసః కుబేరః. కుత్సిత మైన శరీరముకలవాడు, దిక్పాలకుడు, ధనదుడు, పైడిఱేడు. కుంబతి ధనం అన్యస్య ఐశ్వర్యం వా ఇతి కుబేరః. నంది వృక్షము, పాల చెట్టు.
కుబ్జ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుత్సితం ఉజ్జతీతి కుబ్జః. కుత్సితమైన ఋజుత్వము కలవాడు, పొట్ల, గజవిశేషము, ఒకానొకచెట్టు, మరుగుజ్జు, మరుగుజ్జు కన్య.
కుమారము
సం. నా. వా. అ. న. తత్స. సదా తరుణత్వాత్కుమారకః. ఎల్లప్పుడు కోమలమైఉండునది, చొక్కపు బంగారు, గుఱ్ఱపు పిల్ల, చిలుక, ఉలిమిరి.
కుమారీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుత్సితాక్ రోగాన్మారయతీతి వాకుమారీ. కుత్సితములైన రోగములను సంహరించునది, కూతురు, పెండ్లికానిపడుచు, పార్వతి, ఒకానొకఏఱు, జంబూద్వీపము, నల్లపిచ్చుక, కలబంద, చేమంతి, పిన్నగోరంట, విరజాజి, అతిముక్త లత, ఒక తెల్లజింక, కొత్తిమిరి, కన్య.
కుమారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సదాబాలత్వాత్ కుమారః. ఎల్లప్పుడు బాలుడుగా ఉండువాడు. కుమారయతీతి కుమారః. దొరకొడుకు, కొడుకు, బాలుడు స్కందుడు, (నాట్యోక్తియందు) యువరాజు, కార్తీకేయుడు, మంగళ గ్రహము. ఆడువాడు, కుమార స్వామి, ఒక చెట్టు, గుఱ్ఱముల కాపరి, జింక, ఒక ద్వీపము, షణ్ముఖ రుద్రాక్ష.
కుముదబాంధవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుముదానాం బాంధవః కుముదబాంధవః. కలువలకుచుట్టము, చంద్రుడు, కలువవిందు.
కుముదము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంపృథ్వీం మోదయతీతి కుముదః. భూమిని సంతోషింపచేయునట్టిది. అ. న. తత్స. కౌమోదత ఇతి కుముదం. భూమియందు మోదించునది. గుమ్ముడు, టేకు, ఎఱ్ఱతామర, తెల్లకలువ, నిరృతి దిక్కునందలి ఏనుగు, ఒకానొకపాము. కుత్సితే నిర్ఋతికోణే మోదతి ఇతి కుముదః. వానర విశేషము.
కుముదికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుముద వర్ణ త్వాత్కుముదికా. తెల్ల కలువవంటి వర్ణముకలది, పినగుమ్ముడు.
కుముదిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుముదాన్యస్యాస్సంతీతి కుముద్వతీ. కుముదములుకల దేశమునకైనను, సరస్సుకైనను తెల్లకలువతీగెకైనను పేర్లు, తెల్లకలువతీగ.
కుముద్వంతము
సం. విణ. (త్. ఈ. త్). తత్స. కుము దాన్యస్మిన్ సంతీతి కుముద్వాత్. తెల్లకలువలు తఱుచుగా కలదేశము, తామరలు కలది.
కుముద్వతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుముదాన్యస్యాస్సం తీతికుముద్వతీ. తెల్లకలువ తీగెనైనను, తెల్లకలువతీగ, కుశుని పెండ్లాము.
కురంగమము
సం. నా. వా. అ. పుం. తత్స. కౌ రజతీతి కురంగః. భూమినందు చరించునది, హరిణము, జింక, కోతి.
కురంగము
సం. నా. వా. అ. పుం. తత్స. కౌరంగతీతి కురంగః. భూమి యందు తిరుగునది, జింక, కోతి. కౌ పృథివ్యాం రంగతి చలతీతి కురంగః. హరిణము.
కురంటకము
సం. నా. వా. అ. పుం. తత్స. కౌరమ్యతే కురంటకః. భూమియందు రమింపబడునది, పచ్చగోరంట, పచ్చచేమంతి (వృక్ష విశేషము). సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తుమ్మి. కుర్యతే శబ్ద్యతే ఇతి కురంటకః. ఒకానొక వృక్షము.
కురరము
సం. నా. వా. అ. పుం. తత్స. కురతీతికురరః. మ్రోయునది, ఉత్ర్కోశము, లకుమికిపిట్ట, గోరువంక, పెన్నడపులుగు, కురలపక్షి, అడవిగొర్రె.
కురవకము
సం. నా. వా. అ. పుం. తత్స. కౌరూయతే సాధురితి కురవకః. భూమియందు మంచిదని పలుకబడునది, ఎఱ్ఱగోరంట, దీనికి దోహదక్రియ ఆలింగనము, ఎఱ్ఱచేమంత, ఎఱ్ఱపూవ్వుల పెద్దగోరింట, గోరింట, ఎఱ్ఱ, పచ్చ, తెల్ల.
కురుబిస్తము
సం. నా. వా. అ. పుం. తత్స. కురుదేశ బిస్త ఇతి ప్రసిద్ధత్వాత్ కురుబిస్తః. కురుదేశమందు బిస్తమని ప్రసిద్ధమైనది, బంగారము యొక్క పలము.
కురువిందము
సం. నా. వా. అ. పుం. తత్స. కురుదేశ మాశ్రయత్వేన విందతీతి కురువిందః. కురుదేశమునుఆశ్రయముగా పొందునది, మాణిక్యవిశేషము, (ఇది కాలపురమునందుపుట్టినది, పసుపుదాళుకలది, మద్యమజాతి రత్నము). కురూన్ విందతీతి కురువిందః. అద్దము, ఇంగులికము, నిడుముసై, వ్రీహి విశేషము, కెంపు, పాదరసము, ముస్త.
కుర్దనము
సం. నా. వా. అ. న. తత్స. కుర్దః కుర్ధనం. క్రీడించుట, క్రీడ, ఆట.
కులకము
సం. నా. వా. అ. న. తత్స. కాకాదిభిః లక్యత ఇతి కులకః. కుత్సితములైన కాకాదులచేత ఆస్వాదింపబడునది. కులతీతి కులకం. గుంపై యుండునది. కుల మస్యాస్తీతి కులకః. కులమందు శ్రైష్ఠ్యముగలవాడు, ఒకక్రియతో ముగిసెడు పద్యముల సముహము, చేదుపొట్ల, కాకి, తుమ్మిక, పుట్ట.
కులట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విటకుల మటతి కులటా. విటసమూహము కూర్చిపోవునది, అసతి, ఱంకుటాలు. కులాని అటతీతి కులటా. వ్యభిచారిణి.
కులపాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కులం పాలయతీతి కులపాలికా. కులమును రక్షించునది, తల్లిదండ్రులచే ఇచ్చి పెండ్లిచేయబడిన స్త్రీ, పతివ్రత.
కులము
సం. నా. వా. అ. న. తత్స. కోలతి సంఘీభవతీతికులం. కూడుకొనిఉండునది. కుల్యతే బంధువర్గోనేనేతి కులం. బంధువర్గము దీనిచే కూర్చబడును, వంశము, తెగ, ఇల్లు, ఊరు, శరీరము, చేదుపొట్ల. కుం భూమిం లాతి గృహ్ణాతి కులం. జనపదము. కౌ భూమౌ లీయతే కులం. అగ్రము, దేవతలను కొలుచుట, జాతి సమూహము, తిలక పరిమళము.
కులసంభవుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కులే సంభవోస్య కులసంభవః. కులమందుపుట్టినవాడు, మంచివంశమునందు పుట్టినవాడు.
కులస్త్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కులేన అవ్యభిచారేణ రక్షితా స్త్రీ కులస్త్రీ. ఒచ్చెములేని కులముచేత రక్షితయైనది, కులపాలిక. కులే స్ధితా స్త్రీ కులస్త్రీ. కులవతి, పతివ్రత.
కులాయము
సం. నా. వా. అ. పుం. తత్స. సాయంకాలే పక్షికుల మయత ఏన మితి కులాయః. సాయంకాలమందు పక్షిసమూహము దీనిని పొందును, పక్షిగూడు, చోటు, ఇల్లు, కులానాం పక్షిసమూహానాం అయః వాసస్ధానం ఇతి కులాయః. నీడ.
కులాలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కులం పాషాణకుల మలతీతి కులాలీ. పాషాణమునుఅలంకరించునది, కనుపాలవిత్తులు, మైలతుత్తము.
కులాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుం భూమిం లడతి మృదర్ధమితి కులాలః. భూమిని మర్ధించువాడు, కుమ్మరవాడు. కులం ఘటాదినిర్మాణోపయోగిమృదాద్యుపాదానం ఆలాతి సంయగాదత్తే కులాలః.
కులి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కోలతి సంఘీభవతీతి కులీ. దట్టమై ఉండునది. వాకుడు, చేయి, కులిర్హస్తోభుజాదళః. త్రికాండశేషము, వంగ, వదిన. (భార్య అక్క).
కులికుడు
సం. విణ (అ. ఆ. అ.). తత్స. కులమస్యాస్తీతి కులికః. కులము కలవాడు, మంచికులమున పుట్టినవాడు, ఉత్తమాశ్వము, అభిజాతుడు, కులశ్రేష్ఠుడు.
కులిశము
సం. నా. వా. అ. పుం. తత్స. కుల్యతే సంతన్యతే కీర్తిరనేన కులిశం. కీర్తిని వృద్ధి బొందించునట్టిది, వజ్రాయుధము, మత్స్యవిశేషము. కులౌ హస్తే శతే అవతిష్ఠతే ఇతి కులిశః. వజ్రము. కు ఈషత్ కుత్సితం వా లిశతి ఇతి కులిశః.
కులీనుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుల స్యాపత్యం కులీనః. మంచికులమందు పుట్టినవాడు, కులే ప్రశస్తవంశే జాతః కులీనః. మహాకులుడు,ఆర్యుడు,సజ్జనుడు,సాధువు, శ్రేష్ఠుడు, ఉత్తమాశ్వము, అభిజాతుడు.
కుల్మాషము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితో మాషః కుల్మాషః. అలసందలు, కారుమినుములు, పులియపెట్టిన కడుగునీరు, కుత్సిత మైన మాసము, యవల రొట్టె, గంజి.
కుల్మాషము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితో మాషః కుల్మాషః. కుత్సితమైన మాషము కుల్మాషము. నల్లమినుములు, గుగ్గిళ్లు, గోధుమ విశేషము, యవవిశేషము, యవలరొట్టె. సం. నా. వా. అ. న. తత్స. పులియపెట్టిన కడుగునీరు, గంజి.
కుల్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కోలతి సంస్త్యాయతికుల్యం. కూడుకొని ఉండునది, కాలువ నీళ్లుపోయెడు క్రోవి, తిప్పతీగ.
కుల్యము
సం. నా. వా. అ. న. తత్స. కోలత సంస్త్యాయతి కుల్యం. ఎముక, తొలిచిన కొండదొన, మాంసము, మానవిశేషము.
కుల్యము
సం. నా. వా. విణ. తత్స. మంచికులమున పుట్టినది, కులమునకు హితమైనది.
కువలము
సం. నా. వా. అ. న. తత్స. కౌభువి వలతే భ్రమతీతి కువలం. భూమియందు చరించునది, కలువ, ముత్యము, రేగుపండు, రేగు.
కువలయము
సం. నా. వా. అ. న. తత్స. కౌవలత ఇతికువలయం. భూమి యందు చుట్టుకొనియండునది. ఉత్పలము, కలువ. కోః పృధివ్యాః వలయమివ శోభాకారకత్వాత్ కువలయం. నీలోత్పలము, రేగు.
కువాదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుత్సితః పరదోష ప్రఖ్యాపనశీలః వాదః భాషణం యస్యేతి కువాదః. పరదోష ప్రకాశకము లైనమాటలు కలవాడు. పరులదోషమును పలుకువాడు, నికృష్టపు మాటలాడువాడు.
కువిందుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభువం విందతి పటాది రచనార్ధమితి వాకువిందః. కోకనేయుటకై భూమిని పొంది ఉండువాడు. తంతువాయుడు, సాలెవాడు. కుత్సితం భక్తాదిమ్రక్షితసూత్రాధికం కుత్సితవృత్యా వా జీవికాం విందదీతి కువిందకః.
కువేణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుత్సితం వేణం తే మత్స్యా అస్యామితి కువేణీ. మత్స్యములు దీనియందు కుత్సితముగా సంచరించును. చేపలు పట్టి వేయుబుట్ట. కుత్సితా వేణీ యస్యాః కువేణీ.
కుశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కౌశతే కుంశ్యతి వాకుశం. భూమియందుండునది, లేక భూమినిఅల్పముగా చేయునది. త్రాడు, నీళ్లు, ధర్భ, ఒక ద్వీపము, పలుపు.
కుశలము
సం. నా. వా. అ. న. తత్స. కుశ్యతి సత్స్వితి కుశలం. మంచి వారియందు కూడుకొనియుండునది. కుశాక్ లాతీతి కుశలం. తనబుద్ధి సూక్ష్మతకు కుశాగ్రమును పోలికగా గ్రహించునది. కుత్సితమమంగళం. శ్యతీతి కుశలం. అశుభమును చెఱుచునది. క్షేమము, తృప్తి, పుణ్యము, నేర్పరి. కౌ పృధివ్యాం శలతి శ్లాగాం ప్రాప్నొతీతి కుశలః. శిక్షితుడు,చతుర్వుడు, సుఖముకలవాడు, నిపుణుడు, అర్హుడు.
కుశీలవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం శీల మేషామితి కుశీలవాః. కుత్సితమైన నడవడికలవారు. నానాదేశ సంచారకుడైన నట్టువుడు, నానాదేశ సంచారకుడైన బట్టువాడు. వాల్మీకి. కుత్సితం శీలం అస్య ఇతి కుశీలవః. గంతులువేయువాడు, నటుడు.
కుశేశయము
సం. నా. వా. అ. న. తత్స. కుశేజలేశేత ఇతికుశేశయం. నీళ్ళయందుఉండునది, పద్మము, తామర.
కుష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. కుష్ఠవ్యాధి నామాన్యస్యసంతీతివ్యాధిః. కుష్ఠువ్యాధి యొక్క వేళ్లుకలది. కుత్సితే తిష్ఠతీతి కుష్ఠం. కుత్సితునియం దుండునది. వ్యాధి విశేషము, పులుము చెంగల్వ కోష్ఠు, విషభేదము. కుష్ణాతి రోగం ఇతి కుష్ఠం. ఒక ఓషధి.
కుసీదము
సం. నా. వా. అ. న. తత్స. కుసీద మల్పవృద్ధ్యా గృహీతం ధనం తద్బహువృద్ధ్యర్థం ప్రయచ్ఛతీతి కుసీదకః. ఎక్కువ వడ్డికిచ్చిన వాడు. వడ్డీకిచ్చి జీవనము చేయుట.
కుసీదికుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుసీద మల్పవృద్ధ్యాగృహీతం ధనం తద్బము వృద్ధ్యర్థం ప్రయచ్ఛతీతి కుసీదకః. వడ్డీకిచ్చి జీవనము చేయువాడు. కుసీదం వృద్ధిస్తదర్థం ద్రవ్యం కుసీదం తత్, ప్రయచ్ఛతి ఇతి కుసీదకః.
కుసుంభము
సం. నా. వా. అ. పుం. తత్స. కుస్యతీతి కుసుంభః. కూడిఉండునది. కమండలవు, బంగారు, కుసుమపువ్యు . సం. నా. వా. అ. న. తత్స. కౌ పృథివ్యా సుంభతి శోభతే దీప్తిం ప్రాప్నోత్యీత్యర్థః కుసుంభం. స్వర్ణము, సువర్ణము, పుష్పవిశేషము, అగ్నిశిఖ, మహారజనము, పావకము, పీతము, పద్మోత్తరము, రక్తము, లోహితము. అకుశ్యతి సంశ్లిష్యతి వస్త్రాదావితి కుసుంభం. వస్త్రాదుల యందు కూడునది.
కుసుమము
సం. నా. వా. అ. న. తత్స. కుస్యతి భ్రమరాది నాశ్లిష్యతీతి కుసమం. భ్రమరములతో కలసి ఉండునది, పువ్వు, కంటితెవులు, స్త్రీరజస్సు, పండు, పుష్పము, ఫలము, నేత్రరోగవిశేషము.
కుసుమాంజనము
సం. నా. వా. అ. న. తత్స. కుసుమ సదృశ మంజనం కుసుమాంజనం. పుష్పమునకు సరియైన అంజనము, పుష్పాంజనము, ఇత్తడి చిలుము.
కుసుమేఘవు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కుసుమాన్యేవ ఇషవోయస్యసః. పుష్పములే బాణములుగాకలవాడు, మన్మధుడు, మరుడు.
కుసృతి
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుత్సితా సృతిర్గతిః కుసృతిః. కుత్సితమైన నడత, కుత్సితభావము.
కుస్తుంబరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుత్సితం దాహదిరోగం తుమ్పతీతి కుస్తుంబరు. కుత్సితమైన దాహది రోగములను చెఱచునది. ధాన్యాకము, కొత్తిమిరి. కుత్సితం తుంబతి అర్దయతి యత్ కుస్తుంబరు.
కుహనా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుహతీతి కుహనా. మోసపుచ్చునది, అర్థాపేక్ష చేతనగు కపటచర్య. ఎలుక, పాము, ఈర్ష్యకలది, వంచన.
కుహరము
సం. నా. వా. అ. న. తత్స. కుహతి విస్మావయతి తమసావాకుహరం. తమస్సు చేత విస్మయమును చేయునది. గుహ, బెజ్జము, ఒకానొకపాము. కుం భూమిం హరతీతి కుహరం, రంధ్రము.
కుహువు
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుహయతి విస్మాపయతి తమసేతి కుహుః. తమస్సుచేతఆశ్చర్యమును కలుగ చేయునది. చంద్రకళ కానరాని అమవాస్య, కోకిలధ్వని.
కూకుదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కన్యాం కులశీలసం పన్నాయ వరాయ సత్కృత్య దదాతి సకూకుద ఇత్యుచ్యతే. తనసంపదకొలది వస్త్రభూషణాదుల చేత అలంకరింపపడిన కన్యను వరునకు సత్కరించియిచ్చువాడు. కూకం కన్యాం దదాతీతి కూకుదః. కన్యనిచ్చువాడు.
కూటకము
సం. నా. వా. అ. న. తత్స. కుటతీతి కూటకం. వక్రమైఉండునది, ఏడికోలలేనినాగలి, గొడగ వెండ్రుకలకొప్పు.
కూటము
సం. నా. వా. అ. పుం. తత్స. కూట్యతే దహ్యతే సూర్యదావాభ్యాం కూటః. సూర్యదావాగ్నులచేత దహింపబడునది, ఇల్లు, విరిగినకొమ్ములకల ఎద్దు. సం. నా. వా. అ. న. తత్స. అమ్ము, ఆకాశములోనగునది, కపటము కర్రు, కొండకొమ్ము, గవను, గారడము, దుఃఖము, ప్రోగు, బొంకు, బోను, సంపెట, శిఖరము, రాళ్లుచెక్కువాడు, మోసము, బాణము, చేనికుప్ప, సమూహము, భ్రాంతి, తాపము, స్థుతి, అసత్యము, నాగలి, కొయ్య, వంచన, జింక, వల. సం. నా. వా. అ. న. తత్స. కూటవత్ శిఖరవత్ స్థితం కూటం. పర్వత శిఖరము వలె ఉండునది. కూట్యత ఇతి చ కూటం కాల్చునది. పర్వతశృంగము, నిశ్చలము, రాశి, కైతవము, యంత్రము, తుచ్ఛము, గృహము.
కూటశాల్మలి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కూటా కుత్సితాచా సౌశాల్మలీ చ కూటశాల్మలీ. కుత్సితమైనబూరుగు, కొండ బూరుగు (వృక్ష విశేషము).
కూటస్థము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కూటేన నిశ్చలత్వేన తిష్ఠతీతి కూటస్థః. వికారములేక నిశ్చలుడైఉండువాడు, చలనములేనిది.
కూపకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సిత శబ్దమును చేయునది. కాయతీతి కూపకః. పతాకము చేత నించుకంత ధ్వనికలిగినది. ఓడకంబము, పిఱిదిమీది గుంత, చెలమ, చేతిసిద్దె. కూపే గర్తే కాయతే ప్రకాశతే ఇతి కూపకః.
కూపము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితాః కోర్వా ఆపః అస్మిన్నితి కూపః. కుత్సితములైన ఉదకములు0కాని, భూమిసంబంధములైన ఉదకములు కాని దీనియందుకలవు, నుయ్యి, చెలమ, ఓడకంబము, పిఱిదిమీదిగుంత. కు ఈషత్ ఆపో యత్ర కూపః. జలధారా విశేషము, బావి, తెరచాపకొయ్య, కన్నము.
కూబరము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంమహీల వృణోతి ఆచ్ఛాదయతీతి వాకూబరః. భూమిని కప్పియుండునది. బండినాగ, మనోజ్ఞము, ఎద్దుబండి, బండినొగ కఱ్ఱ.
కూర్చము
సం. నా. వా. అ. పుం. తత్స. కోచతి భ్రూరోమాణి కుటిలాని కరోతి కూర్చం. కనుబొమ్మ వెండ్రుకలను కుటిలముగా చేయునది కనుబొమల నడిమిప్రదేశము. దర్భపిడికిని, కనుబొమలనడుమ, పెరిగినమీసగడ్డములు మెచ్చు, మోసము, కాలిబొటన వ్రేలి మధ్యభాగము, ఆసనము, గడ్డము, కూర్చ.
కూర్చశీర్షము
సం. నా. వా. అ. పుం. తత్స. కూర్చవత్ శ్మశ్రువత్సమశీర్షత్వాత్కూర్చశీర్షః. మీసము దానితో సమానమైన కోనకలది. జీవకమనెడిగంధ ద్రవ్యము.
కూర్చిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కూర్చం క్షీరమస్తుతదస్యామస్తీతి కూర్చికా. పాలమీగడ, కుంచెకోల, జున్ను, చిత్రము వ్రాసెడు తూలిక, మొగ్గ, సూది. కూర్చః తద్వదాకారః అస్త్యస్యాః కూర్చికా. క్షీర వికారము, వెన్నముద్ద, కుంటె.
కూర్పరము
సం. నా. వా. అ. పుం. తత్స. పదార్ధకర్షణే హఠాత్ కురతి కూర్పరః. పదార్థములను గొబ్బున తీయునపు డించుక ధ్వనించునది. మోచేయి, మోకాలు. వ్యుత్పత్తి doubt.
కూర్పాసకము
సం. నా. వా. అ. పుం. తత్స. కూర్పరేలేక పోణౌ అస్యతే కూర్పాసకః. మోచేతి యందు పెట్టబడునది, అరచట్ట, ఱవిక. కూర్పరే శరీరే అస్యతే ఆస్తే వా ఇతి కూర్పాసః. అంగీ.
కూర్మము
సం. నా. వా.అ. పుం. తత్స. కుత్సతః ఈర్మిర్వేగః అస్యకూర్మః. ఊర్మిఅనగావేగము. కుత్సితమైన వేగముకలది. తాబేలు, ఒక ఉపవాయువు. కు కుత్సితః ఈషద్ వా ఊర్మిః వేగో యస్య, కే జలే ఊర్మిర్యస్తేతి వా కూర్మః. జలజంతు విశేషము. ఏనుగు ముంగాలిలోకభాగము, ఒకనిధి.
కూలంకష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కూలాని కషతీతి కూలంకషా. ఏఱు, సముద్రము, నదులసమూహము.
కూలము
సం. నా. వా. అ. న. తత్స. కూలతీతి కూలం. నదిని కప్పిఉండునది, దరి, గుంట, మట్టిలోన వానిదిబ్బమూక వెనుక. కూలతి జలప్రవాహం ఆవృణోతీతి కూలం. తీరము, ఒడ్డు. గట్టు, సేనామద్యము.
కూష్మాండము
సం. నా. వా. అ. పుం. తత్స. కు ఈషత్ ఊష్మా అండేషు బీజేష్వన్యేతి కూశ్మండకః. కుత్సితమైన ఉష్ణము బీజములయందుకలది. గుమ్మడి, పిశాచ భేదము, భ్రూణ విశేషము.
కృకణము
సం. నా. వా.అ. పుం. తత్స. కృ ఇతి క్వణతి శబ్దాయతే కృకణః. కృ అను ధ్వనిచేయునది పక్షి విశేషము, కక్కెర, ఒక పక్షి.
కృకరము
సం. నా. వా. అ. పుం. తత్స. ఒక ఉపవాయువు, కక్కెర, ఒకపక్షి.
కృకలాసము
సం. నా. వా. అ. పుం. తత్స. కృకేనగళేన లసతీతికృకలాసః. కంఠముతోనాడునది. ఊసరవెల్లి, తొండ. కృకం కంఠం లాసయతి శోభాన్వితం కరోతీతి కృకలాసః. తొండ.
కృకవాకువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కృశేన శిరోగ్రేణ వక్తీతి కృకవాకుః. తలఎత్తి కూయునది, కోడి, మయిలచాయతొండ నెమలి. కృకేన గళేన వక్తీతి కృకవాకుః.
కృకాటికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృశం శిరోగ్రీవే అటతి వ్యాప్నోతి కృకాటికా. శిరస్సును మెడను పొందియుండునది. పెడతల, పెడతలయందలి ముచ్చిలిగుంట. కృకంకంఠం అటతి ఆప్నోతి, కంఠం వ్యాప్యాస్తీతి భావః కృకాటికా. మెడవెనుక.
కృచ్ఛము
సం. నా. వా. అ. న. తత్స. కృతతీతి కృచ్ఛ్రం. భేదించునది, పాపము, బాధ, సాంతపనాది వ్రతము. కృన్తతి పాపమితి కృచ్ఛ్రం. పాపమును పోకొట్టునది. బాధ, ఒకవ్రతము.
కృత హస్తుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కృతా శిక్షితౌ హస్తౌ యస్యసః కృత హస్తః. శిక్షితములయిన హస్తములు కలవాడు. గుఱి తప్పక వేయువాడు, నేర్పరి. కృతః అభ్యస్తః హస్తః బాణాదినిక్షేపలాఘవరూపా శిక్షా యేన సః కృతహస్తః. శిక్షితుడు.
కృతపుంఖుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. కృతో గృహీతః పుంఖోయేన సః కృత పుంఖః. లెస్సగా పట్టబడిన పింజలుకలవాడు, గురితప్పక వేయువాడు, కృతహస్తుడు, ఆయుధ కుశలుడు. కృతః అభ్యస్తః పుంఖః పుంఖయుక్తో బాణో యేన సః కృతపుంఖః. బాణశిక్షావిచక్షణము, సుప్రయోగవిశిఖుడు.
కృతమాలము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫలైః కృతా మాలా యస్య సః కృతమాలః. ఫలముల చేత చేయబడిన వరుసకలది, ఱేల. ఒక వృక్షము, ఒక జింక.
కృతముఖుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కృత మభ్యస్థం ముఖము పాయోనేనకృతముఖః. అభ్యసింపబడిన ఉపాయము కలవాడు, నేర్పరి. కృతం సంస్కృతం ముఖం యస్య సః కృతముఖః. నిపుణుడు.
కృతలక్షణుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కృత మభ్యస్తం లక్షణం నామయస్యేతి కృతలక్షణః. అందరికిని అభ్యస్తమైన పేరుకలవాడు. గుణముల చేత ప్రసిద్ధిచెందినవాడు.
కృతసాపత్నిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృతం సాపత్న్యమస్యా ఇతి కృత సాపత్నికా. సవతియొక్క భావము. అధ్యూడు. మొదటి పెండ్లాము.
కృతాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. కృతః అంతః అనేనేతి కృతాంతః. దీనిచేత అంతము చేయబడును. అశుభ కర్మము, భాగ్యము, సిద్ధాంతము.కృతః అంతః నాశః శాస్త్ర నిర్ణయః విపర్యయో వా యేన సః కృతాంతః. యముడు, విధి, అదృష్టము, అదృష్టములేనిపని.
కృతి
సం. నా. వా. న్. పుం. తత్స. 1. కృతం జ్ఞాన మనేనకృతీ. జ్ఞానము వీనిచేత చేయబడును. 2. ప్రశస్తం కృతం కృత్య మస్యాస్తీతి కృతీ. మంచి కృత్యము కలవాడు, చదువరి, తీగమోదుగు (వృక్షవిశేషము), నిపుణుడు, పండితుడు, సాధువు, పుణ్యవంతుడు.
కృత్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కృత్యతే స్మ కృత్తం. చేదింపబడినది.
కృత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కృత్యతేకృత్తిః. కోయబడునది, తోలు, ఒకానొకదేవత, చెట్టుపైన పట్ట, బుజపత్రి. కృష్ణాజినము, తోలుబుడ్డి, చర్మము.
కృత్తివాసుడు
సం. నా. వా. స్. పుం. తత్స. కృత్తిశ్చర్మ వాసోస్య కృత్తివాసాః. చర్మము వస్త్రముగా కలవాడు, శివుడు, ముక్కంటి. కృత్తిర్గజాసురస్య చర్మ వాసో అస్య కృత్తివాసాః.
కృత్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కరణం కరణీయాచకృత్యా. చేయుట, చేయదగిన దియును. ఒకానొకదేవత, పని, ధనాదులచే భేదింపదగినది, ఫలము, వ్యాపారము, కోపము, ఒక శక్తి.
కృత్రిమ ధూపకము
సం. నా. వా. అ. పుం. తత్స. కరణేన నిర్వృత్తః కృత్తిమః సచాసౌ ధూపశ్చ కృత్రిమ ధూపకః. పాకాదిక్రియలవలన నైన ధూపము అనేక పరిమళవస్తువులు కూర్చిచేసిన ధూపము.
కృత్స్నము
సం. నా. వా. అ. న. తత్స. కృత్యతే వ్యాప్రియతే నేనేతి కృత్స్నం. దీనిచేత వ్యాపింపబడును, కడుపు, నీళ్లు, అంతయు, సమస్తము.
కృప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృపయన్తే అనయాకృపా. దీనిచేత దయచేయుదురు, దయ, కనికరము. క్రపేః సంప్రసారణంచేతి భిదాదిపాఠాదంటాప్ చ కృపా. కరుణ, చూడ.
కృపణుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కల్పతే కుటుంబ పీడనే నాపి జీవనాయసమర్థో భవతీతి కృపణః. కుటుంబమును పీడించి యైనను బ్రతుకనేర్చినవాడు. లోభి, కుత్సితుడు. కల్పతే స్వల్పమపి దాతుమితి కృపణః.
కృపాణము
సం. నా. వా. అ. పుం. తత్స. కల్పతే హననేకృపాణః. హింసయందు సమర్థమైనది. కృపాం నుదతి ప్రేరయతి దూరీకరోతీత్యర్థః కృపాణః. కత్తి.
కృపాణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కల్పతే ఛేదనాయేతి కృపాణి. ఛేదించుట కొఱకు సమర్ధమైనది, బాకు.
కృపాళువు
సం. విణ. ఉ. తత్స. కృపాం లాతీతి కృపాళుః. కృపనుస్వీకరించువాడు. కనికరము కలవాడు.
కృపీటము
సం. నా. వా. అ. న. తత్స. కడుపు, నీళ్లు.
కృపీటయోని
సం. నా. వా. ఇ. పుం. తత్స. కృపీట ముదకం యోనిః కారణం యస్యసః. కృపీటయోనిః. ఉదకము అదికారణముగా కలవాడు. అగ్ని, నిప్పు. కృపీటస్య జలస్య యోనిః కారణం కృపీటయోనిః.
కృశము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కృశ్యతీతి కృశం. సన్నమైయుండునది, బక్క, సన్నము, సూక్ష్మము, క్షీణము. కేతువు, వేడి, బక్కచిక్కిన.
కృశానురేతనుడు
సం. నా. వా. మ. స్. పుం. తత్స. కృశాను రగ్నిః రేతోయస్యసః కృశానురేతః. అగ్నిరూపమైనరేతస్సు కలవాడు. శివుడు.
కృశానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కృశోప్యతి వర్ధతే కృశానుః. కృశుడైనను వృద్ధిపొందువాడు, అగ్ని, నిప్పు. కృశ్యతి తనూకరోతి తృణకాష్ఠాదివస్తుజాతమితి కృశానుః.
కృశాశ్వి
సం. నా. న్. పుం. తత్స. కృశాశ్వేన ప్రోక్తం నటసూత్రమధీయత ఇతి కృశాశ్వినః. కృశాశ్వుని చేత చెప్పబడిన నటసూత్రములనుఅధ్యయనము చేయువారు. నటుడు, నట్టువుడు.
కృషకము
సం. నా. వా. అ. పుం. తత్స. కృషతీతి కృషకః. దున్నువాడు, సేద్యకాడు, కృషకుడు, నాగలి, కర్రు.
కృషాణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కృషకశ్చ కృషవిలేఖనే. దున్నువాడు, సేద్యకాడు.
కృషి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కర్షణం కృషిః కృషవిలేఖనే. దున్నుట, సేద్యము, కరిసనము.
కృషికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కృష్ణతీతి కృషకః. భూమిని దున్నువాడు, సేద్యకాడు.
కృషివలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కృషిరస్యాస్తీతీ కృషేవలః. కృషిగలవాడు, దున్నుట, ఒక చారుడు, వ్యవసాయముచేయువాడు.
కృష్టపాకఫలము
సం. నా. వా.అ. పుం. తత్స. కృష్ణ వర్ణ పాకం ఫలమస్య కృష్ణపాకఫలః. పరిపాకమునందు నల్లనగు పండ్లు కలది. కలివె, ఒక చెట్టు.
కృష్టము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఉప్తం చతత్ కృష్టం చ ఉప్తకృష్టం. విత్తబడిదున్నబడినది. ఒకసారి దున్నబడినది (నేల)ఈడువబడినది.
కృష్టి
సం. నా. వా.ఇ. స్త్రీ. తత్స. కర్షతి నిష్కర్షతి కృష్టిః. సర్వమైనఅర్ధమును నిష్కరించువాడు, చదువరి. కృషత్యంతర్భువం విద్యాలోచనాభ్యాసాదివిరసౌ ఇతి కృష్టిః. పండితుడు, ఆకర్షణం, తెలివైనవాడు.
కృష్ణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృష్టం సర్వం కరోతీతి కృష్ణః. అన్నిటిని చేయువాడు. పూపూర్వాపరౌశుక్ల పక్షౌ కృష్ణౌ. ఇందు పూర్వపక్షము శుక్లమనియు, అపరపక్షము కృష్ణమనియు చెప్పబడును. కర్షతి చిత్తమితి కృష్ణః. చిత్తమునుఆకర్షించునది కృష్ణ వర్ణత్వాత్కృష్ణం. నల్లవన్నెకలది, ఒకానొకఏఱు, ద్రౌపది, ద్రాక్ష, నీలి, పిప్పలి, ఇనుము, మిరియము, నలుపు, కాకి, కోకిలము, దున్న, కృష్ణపక్షము, నల్లనికడుపుగల మందపిచ్చుక. నల్లనిది. కర్షత్యరీన్ మహాప్రభావశక్త్యా. యద్వా కర్షతి ఆత్మసాత్ కరోతి ఆనందత్వేన పరిణమయతి భక్తానాం మనః ఇతి కృష్ణః. విష్ణువు ఒక అవతారము, కృష్ణపాకఫలము, కృణ విశేషము, కలియుగము, శుద్రుడు, సీసము, పాపము, వ్యాసుడు, అర్జునుడు.
కృష్ణఫల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృష్ణ వర్ణాని ఫలాన్యస్యాః కృష్ణఫల. నల్లని పండ్లుకలది. కారుగచ్చ.
కృష్ణభేది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కృష్ణః భేదః ఛేదోస్యా ఇతి కృష్ణభేది. నల్లని తునకలుకలది, కటుకరోహిణి.
కృష్ణలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రాంతే కృష్ణవర్ణం లాతీతి కృష్ణలా. చుట్టు నల్లనివర్ణమును పుచ్చుకొనునది, గురిజ (వృక్షవిశేషము), పూసల గురివింద, గుంజ.
కృష్ణలోహితము
సం. నా. వా. అ. పుం. తత్స. కృష్ణ వర్ణమిశ్రిత, లోహితః. నలుపువన్నెతో కూడిన ఎఱుపుకనుక నలుపు మించకలసిన ఎఱుపు.
కృష్ణవర్త్మా
సం. నా. వా. ఈ. న్. పుం. తత్స. కృష్ణం వర్త్మమార్గోయస్యసః కృష్ణ వర్త్మా. నల్లనిజాడకలవాడు, అగ్ని, దురాచారుడు, రాహువు.
కృష్ణవృంత
సం. నా. వా. మ. ఆ. స్త్రీ. తత్స. కృష్ణం వృన్తమస్యాః కృష్ణవృన్తా. నల్లని తొడిమకలది, కలిగొట్టు, కారుమినుము, ఒక తీగ, మాషపర్ణీ.
కృష్ణసారము
సం. నా. వా. అ. పుం. తత్స. కృష్ణేన నీలవర్ణః సారః కృష్ణసారః. నల్లని వన్నెచేత శ్రేష్ఠమైనది, నల్లయిఱ్ఱి, ఇరుగుడు జెముడు, ఒక జింక.
కృష్ణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృష్ణవర్ణయోగాత్ కృష్ణికా. నల్లవన్నెకలది, తవిదలు, నల్లావాలు, నల్లపిచ్చుక, ద్రాక్ష.
కృష్ణుడు
సం. నా. వా.అ. పుం. తత్స.కర్షతి రోగాన్ కృష్ణవర్ణత్వాద్వా కృష్ణా. రోగములను సంహరించునది, విష్ణువు, అర్జునుడు, వ్యాసుడు.
కేక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కేశిరసి కాయతే అభివ్యజ్యత ఇతికేకా. శిరస్సునెత్తి పలుకబడినది. నెమలికూత, నెమలి అరుపు.
కేకరము
సం. నా. వా. అ. పుం. తత్స. కేశిరస్సమీపే అక్షిసఞ్చారం కరోతీతి కేకరః. శిరస్సమీప మందు నేత్ర సంచారము చేయువాడు కటకన్ను, మెల్లకన్ను, ఓరచూపు.
కేకి
సం. నా. వా. న్. పుం. తత్స. కేకారవోస్యాస్తీతి కేకీ. కేకారవముకలది, మయూరము, నెమలి. కేకా ధ్వనిభేదః అస్యాస్తీతి కేకీ.
కేతకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కిత్యతే జ్ఞాయతే గంధోనేనేతి కేతకా. దీనిచేత పరిమళము తెలియబడును.
కేతనము
సం. నా. వా. అ. పుం. తత్స. కేత్యతే జ్ఞాయతేనేన అయమసావితికేతః. దీనిచేత వీడు, వాడని ఎఱుగబడును. ఱెక్కెము, గుఱుతు, ఇల్లు, నిమంత్రణము. “కేతంస్య నేనేతి కేతనం. దీనిచేత నెఱుగుదురు. జెండా, విల్లు, మంతనము.
కేతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కిత్యతే అనేనేతి కేతుః. దీనిచేత నెఱుగబడును. ఒక గ్రహము, టెక్కెము, గుఱుతు, అగ్ని, కాంతి, ధూమకేతువు, చిహ్నము, తెగనచుక్క, జెండా, కిరణము.
కేదరము
సం. నా. వా. అ. పుం. తత్స. పొలము.
కేదారము
సం. నా. వా. అ. పుం. తత్స. కేదారాణాం సమూహః కైదారకం, కైదార్యం, కేదారికం. వరిమళ్లసమూహము, వరిమడి, కొండ, పాదు, ఒకానొకపుణ్యక్షేత్రము. కే జలే దార ఆదరో యస్య యద్వాకేన జలేన ద్రీయతే విదీర్యతే ఇతి కేదారః. శివుడు, భూమిభేదము, పొలము.
కేనిపాతకము
సం. నా. వా. అ. పుం. తత్స. కే జలే నిపాత్యన్తేనావః అనేనేతి కేనిపాతకః. జలమందు ఓడలు దీనిచేత గడపబడును. అరిత్రము, తెడ్డు.
కేపిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేనక్షిప్రఃకేపిష్ఠః. మిక్కిలి వేగము కలది, మిక్కిలి క్షిప్రము-శ్రీఘ్రమ, వేగము.
కేయూరము
సం. నా. వా. అ. న. తత్స. కేభుజశిరసి యౌతీతి కేయూరం. భుజాగ్రమందు కూడియుండునది. కే బాహుశిరసి భూషణతాం యాతి ఇతి కేయూరం. అంగదం, అలంకార విశేషము, బాహుమూల విభూషణము, భుజకీర్తి.
కేవలము
సం. నా. వా. అ. పుం. తత్స. కేవ్యత ఇతి కేవలం. ఆశ్రయింపబడునది. నిర్ణయింపబడినది, అంత ఒకటి.
కేశపాశి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కేశసమూహోత్రాస్తీతి కేశపాశీ. కేశసమూహముకలది. చూడు, సిగ.
కేశము
సం. నా. వా. అ. పుం. తత్స. కేశికసి శేతే వర్తతేకేశం. శిరస్సును నుండునది, వెండ్రుక, కురువేరు, చికురము, కుందలము, శిరోరుహము, శిరసిజము, మూర్ధజము, జుట్టు, బర్హిష్ఠ.
కేశవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కేశిన మసురం హతవానితికేశి. యసురు నిజంపినవాడు. ప్రశస్తాః కేశాస్సన్త్యస్యకేశవః. మంచివెండ్రుకలు కలవాడు, ఒకా నొకరాక్షసుడు. కః బ్రహ్మా, ఈశః రుద్రః తౌ ఆత్మని స్వరూపే వయతి కేశవః.
కేశవేశము
సం. నా. వా. అ. పుం. తత్స. కేశావింశత్యస్మిన్నితి కేశవేశః. కేశములు దీనియందు ఉండును, కబరి, కొప్పు.
కేశాంబునామము
సం. నా. వా. అ. న. తత్స. కేశస్యాంబునశ్చ పర్యాయ నామాన్యస్యేతి కేశాంబునామం. నీరు, వెంట్రుకల యొక్క పర్యాయనామము, కురువేరు (వృక్ష విశేషము).
కేశికుడు
సం. విణ. (అ. ఈ. అ). తత్స. ప్రశస్తాః కేశాస్సన్తస్య కేశికః. మంచి వెంట్రుకలుకలవాడు. శిఖగలవాడు.
కేశిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కేశప్రరోహత్వాత్కే శాస్స్యంత్యస్యా ఇతికేశినా. వెండ్రుకలు దీనివలన మొలచును కట్లతీగ, పద్మపుతీగ, మంచివెండ్రుకలుకలది (ఆడుది) కడిలచెట్టు.
కేశిన్
సం. నా. వా. న్. పుం. తత్స. ప్రశస్తాః కేశాస్సన్తస్యకేశిన. ఒకానొక రాక్షసుడు. సం. విణ. తత్స. మంచి వెంట్రుకలు కలవాడు, శిఖకలవాడు.
కేసరము
సం. నా. వా. అ. న. తత్స. కేశీర్యత ఇతి కేశరః. హింసాయాం కొనయందు విడిపోవునది. ప్రశస్తాః కేసరాస్సంత్యస్యకేసరః. మంచి అకరువులుకలది. కేశిరసి సరతీతి కేసరః. శిరస్సును పొందునది. ఇంగువ, అకరువు, సింహములోనగువాని మెడమీద వెండ్రుక, జూలు, నాగకేసరము, పొగడ, పొన్న. కే వృక్షశిరోవచ్ఛేదే ఉచ్ఛితదేశే ఇత్యర్థః సరతి కేసరః. వకుళ వృక్షము. వేంకటాచలము, ఒకపరిమళద్రవ్యము, కింజల్కము, బట్ట అంచు.
కేసరి
సం. నా. వా. న్. పుం. తత్స. కే శిరసి సరంతీతి కేసరాః సటాః తా అస్య సంతీతి కేసరీ. జూలుకలది, సింహము, గుఱ్ఱము పొన్న, నాగకేసరము, (వృక్షవిశేషము) దబ్బ. కేసరాః జటాః సంత్యస్య కేసరీ. ఘోటకము, పున్నాగము, వానరవిశేషము, హనుమంతుని తండ్రి.
కైడర్యము
సం. నా. వా. అ. పుం. తత్స. కడ్యతే ప్రకర్షేణ లక్ష్యతే కైడర్యః. మిక్కిలి కానబడునది, కఱివేము, పినగుమ్ముడు. గోరింట, నల్లజీలకఱ్ఱ.
కైతవము
సం. నా. వా. అ. న. తత్స. కితవస్యకర్మకైతవం. ధూర్తుడు, వాని వ్యాపాముకైతవము “కితవస్య కర్మకైవతం. జూదరి యొక్క కర్మ, కపటము, జూదము, మోసము.
కైదారికము
సం. నా. వా. అ. న. తత్స. కేదారాణాం సమూహః కైదారికం. ధాన్యములు చేత ఉంచబడును.
కైదార్యము
సం. నా. వా. అ. న. తత్స. కేదారాణాం సమూహం కైదార్యం. వరిమళ్లసమూహము, పొలములు.
కైరవము
సం. నా. వా. అ. న. తత్స. కేరౌతీతి తస్యేదం ప్రియమితికైరవం. జలమందు పలుకునదికనుకకేదవముగాహంస, తెల్లకలువ. కే జలే రౌతి కులనాదం కరోతీతి కైరవః. హంస.
కైలాసము
సం. నా. వా. అ. పుం. తత్స. కేలయో ర్జలభూమ్యోః ఆసనం స్థితిర్యస్య కేలాసః. జలభూములయందుండునది కనుక కేలాసము అనగా స్ఫటికము, దాని సంబంధమైనది, కుబేరునిఉనికిపట్టు, వెండికొండ, ఒక పర్వతము. కేశీనాం సమూహః కైలం తేన ఆస్వతీ స్థీయతే ఇతి కైలాసః. కే శిరసి శివయోర్లాసో నృత్యమస్మిన్నితి వా కైలాసః. శిఖరభాగమందు పార్వతీపరమేశ్వరులనాట్యము కలది.
కైవర్తము
సం. నా. వా. అ. న. తత్స. తేషామయం హంతాకైవర్తః. జలమునందు వర్తించునట్టివి కనుకకేవర్తములు అనగా మత్స్యాదులు. కైవడిముస్తె. కే జలే వర్తతే కైవర్తః. మత్స్యసంబంధమైనది. ఒక సంకరజాతి, వేటకాడు, జాలరి.
కైవర్తీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కేవర్తానాం మత్స్యానాం అశనం కైవర్తీ. మత్స్యములకు భక్ష్యము, కైవడిముసై, తుంగ ముసై.
కైవల్యము
సం. నా. వా. అ. న. తత్స. శరీరేంద్రి యాదివిరహిణ ఆత్మనః అద్వితీయత యా అవస్థానం కైవల్యం. శరీరేంద్రియములతో బాసిన ఆత్మ అద్వితీయమైఉండుట, అపసర్గము, మోక్షము. కేవలస్య సర్వోపాధివర్జితస్య భావః ఇతి కైవల్యం. ముక్తి.
కైశికము
సం. నా. వా. అ. న. తత్స. కేశానాం సమూహః కైశికం. కేశముల సమూహము, వెండ్రుకలసమూహము, కేశపాశము.
కైశ్యము
సం. నా. వా. అ. న. తత్స. కేశానాం సమూహః కైశ్యం. కేశముల సమూహము, కైశికము, కేశపాశము.
కోకనదము
సం. నా. వా. అ. న. తత్స. కోకాశ్చక్రవాకానదంత్యస్మిన్నితి కోకనదం. చక్రవాకములు దీనియందు అవ్యక్తముగా కూయును, చెంగలువ, చెందమ్మి, ఎర్రతామర, ఎర్ర కలువ.
కోకము
సం. నా. వా. అ. పుం. తత్స. కోకతే వృకతే మాంసాదికంకోకః. మాంసాదులను పుచ్చుకొనునది జక్కన, తోడేలు, బల్లి, కప్ప, ఈదు, ఒక హంస.
కోకిలము
సం. నా. వా. అ. పుం. తత్స. కోకతో శ్రోతృచిత్తం గృహ్ణతీతికోకిలః. తనపలుకులు వినువారి మనస్సులనుఆకర్షించునది, పికము, కోయిల, కోఱవి.
కోకిలాక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. కోకిలస్య అక్షీణీ ఇవ పుష్పాణ్యస్య కోకిలాక్షః. కోవెకండ్ల వంటి పువ్వులుకలది, ములుగొలిమిడి, గొలిమిడి చెట్టు.
కోటరము
సం. నా. వా. అ. న. తత్స. కుటతీతి కోటరం. కుటిలమై ఉండును, చెట్టుతొఱ్ఱ. కోటం కౌటిల్యకారం స్థానం గర్తమితి యావత్ రాతీతి కోటరం. నిర్గూఢము, ప్రాంతరము.
కోటవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుటేన కౌటిల్యేన వేతి యాతీతి కోటవీ. కౌటిల్యము చేత పోవునది, దిశమొలది, ఉచ్ఛమల్లి. కోటం కౌటిల్యం నిర్లజ్జానాం వాతి గచ్ఛతీతి కోటవీ.
కోటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కుటతీతి కోటిః. వంకరై ఉండునది, అంచు, అతిశయము, ఇంటి కప్పు చివర, సంఖ్యా విశేషము, కోణము, ప్రధానము, మూల, వెదురు, ఒక సంఖ్య. కోట్యతే ఛిద్యతే అనయేతి కోటిః. బాణపు అంచు.
కోటివర్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కోటి భిర్నే మిభిః స్వరసం వర్షతీతికోటివర్షా. కొనలచేత రసమును వర్షించునది, పిక్కచెట్టు. దేవి కొట్టము.
కోటిశము
సం. నా. వా. అ. పుం. తత్స. కోటిరగ్రభాగః సోస్యాస్త్రీతికోటిశః. మట్టిగడ్డలు కొట్టునది, మట్టిగడ్డలు నలుగకొట్టుకొయ్య, కోట్యా అగ్రేణ శ్యతి నాశయతి చూర్ణీకరోతీత్యర్థః కోటిశః. చూర్ణదండము, సుత్తి.
కోఠము
సం. నా. వా.అ. పుం. తత్స.కోఠ త్యసేన కోఠః. మండలాకారమైఉండునది, మండలాకారమైన కుష్ఠము.
కోణము
సం. నా. వా. అ. పుం. తత్స. కుణత్యు పకరోతీతి కోణః ఉపకరించునది, శని, గొల్లవాని కర్ర, గోలు కర్ర, ధ్వని. ఇల్లులోనగు వానిమూల, అంచు, గంటలోనగు వాని వాయించెడు కొడుపు, దుడ్డుగోల, వాద్య విశేషము. కుణతి వాదయత్యనేన కోణః.
కోదండము
సం. నా. వా. అ. న. తత్స. కుర్ధంతేనేనేతి కోదండం. దీనిచేత వేటాడుదురు, విల్లు, నాలుగమూరల విల్లు, వెదురు విల్లు. సం. నా. వా. అ. పుం. తత్స. కనుబొమ్మ, ఒకానోక దేశము, విలుకాడు.
కోద్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. కేన జలేన ఉద్యతే సిచ్యత ఇతి కోద్రవః. నీళ్లచేత తడపబడునది కోరదూషము, ఆళ్లు, ధాన్యవిశేషము, కుద్రవము, ఉద్దాలము, వనకోద్రవము.
కోపన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కోపశీలా కోపనా. కోపమే స్వభావముగా కలిగినది, కోపముకల ఆడుది, కోపముకలది, కోపి.
కోపము
సం. నా. వా. అ. పుం. తత్స. కోపనం కోపః కుపక్రోధే. కోపించుట, క్రోధము, కినుక. కుప్యతే ఇతి కోపః.
కోపి
సం. విణ. (న్. ఈ.న్). తత్స. క్రప్యత్య వశ్యమితి కోపి. అవశ్యము కోపము కలవాడు. స్వభావముననే కోపించు కొనువాడు, కోపముకలవాడు. అవశ్యం కుప్యతి ఇతి కోపి.
కోమలము
సం. నా. వా. అ. పుం. తత్స. కామ్యతే జనైరితి కోమలం. జనుల చేత కోరబడునది. నీళ్లు, మృదువు. అ. న. తత్స. కౌతి శబ్దాయతే వాయ్యాదియోగేన స్త్రోతోవేగేన వా కోమలం.
కోయష్టికము
సం. నా. వా.అ. పుం. తత్స. ఓకసా స్థానేన యజతే సంగచ్ఛతే కోయష్టికః. స్థానముతో సంగతమైఉండునది, చీకుగొక్కెర. కం జలం యష్టిరివాస్య కోయష్టిః. జలకుక్కుభ పక్షి. ఒక జాతికొంగ.
కోరంగి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కురతి శబ్దాయతే కోరంగి. మ్రోయునది, చిట్టేలకి.
కోరకము
సం. నా. వా. అ. పుం. తత్స. కూర్యతే శబ్ద్యతే కోరకః. పుష్పమగునట్టిదని పలుకబడినది మొగ్గ, అరవిరిమొగ్గ, తామరతూడు, తక్కోలము.
కోరదూషము
సం. నా. వా. అ. పుం. తత్స. కోరం రుధిరం దూషయతీతి కోరదూషః. నెత్తురును పీల్చునది, క్రోధము, ఆళ్లు. కోలం సంస్త్యానం దూషయతీతి కోరదూషకః.
కోలంబకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుల్యతే అనేన శబ్ద ఇతి కోలబంకః. దీనిచేత శబ్దము విస్తరింప చేయబడును, వీణెయొక్క సర్వాంగము, వీణాదండము.
కోలకము
సం. నా. వా. అ. న. తత్స. కోలతి సంఘీభవతీతి కోలకః. సంఘమైఉండునది, తక్కోలపుచెట్టు, మిరియము, ఒక పాము.
కోలదళము
సం. నా. వా. అ. పుం. తత్స. బదరీ పత్రాఖ్యత్వాత్కోలదళం. రేగాకు పేరుకలది, నలియనెడు గంధ ద్రవ్యము, ఖంఖ నఖము.
కోలదారము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభూమిం విదారయతీతి కోవిదారః. భూమిని ప్రక్కలించునది, కాంచనము, ఎఱ్ఱ కాంచనము.
కోలవల్లి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కోల రోమాభావయవత్వాత్కోలవల్లీ. పంది రోమములవంటి అవయములు కలది, గజపిప్పలి, ఏనుగు పిప్పలి.
కోలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. 1. కోలతి సంస్త్యాయతి కోలా. కూడుకొని ఉండునది, తేలుచుండునది. 2. కోల్యాః ఫలం గోలం రేగుపండు. 3. కోలతి సంహతాంగో భవతీతి కోలః. ఘనమైన శరీరముకలది. చవ్యమను గంధద్రవ్యము, పిప్పలి, (వృక్షవిశేషము) శొంఠి, మిరియాలు.
కోలాహలము
సం. నా. వా. అ. పుం. తత్స. కోలానా హలతీతి కోలాహలః. కోలములు వరాహములు వానినిభయపఱచునది, కలకలము, అలబలము. కాలే ఏకీభూతావ్యక్తవిశేషః తం ఆహలతి ఆలిఖతీతి కోలాహలః. అలజడి.
కోలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కోలతి నిబిడావయవత్వాత్ కోలీ. దట్టమై యుండునది, రేగు, గంగరేగు.
కోవిదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కిం నామ నవేత్తేతి కోవిదః. ఇది అదియనునియము లేక సర్వముఎరిగినవాడు, విద్వాంసుడు, చదువరి, పండితుడు.
కోశఫలము
సం. నా. వా. అ. న. తత్స. కక్కోలపు చెట్టు, జాజికాయ.
కోశము
సం. నా. వా. అ. పుం. తత్స. గర్భస్యకోశత్వాత్కోశః. గర్భమునకుఆధారమైనది. “కూయతే స్తూయత ఇతి కోశః. కొనియాడబడునది. కుశతీతి కోశః. కూడుకొనిఉండునది. కత్తొఒఱ, గ్రుడ్డు, జాజికాయబెరడు, ఒక దివ్యము పుస్తకము, బొక్కసము, కరగిపోసిన వెండిబంగారములముద్దముష్కము, మొగ్గ. కశ్యతే సంశ్లిష్యతే అత్ర కోశః. (తత్వకోశమున పంచకోశములు- అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము), నిధి, ఒక రాజ్యాంగము, మేడ్డ్రము, వుషణము, వికశించుట, శాస్త్రము, ఇల్లు, దేహము, గృహ్యవయవము, దేవత్వము, కష్టు.
కోశాతకీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కోశం కోశాఖ్యం జాలాకారం బీజపిధానమతతీతి కోశాతకీ. కోశమను పేరుకల బీజావరణమును పొందిఉండునది. అవడ, ఉత్తరేణు, పొట్ల, బీరకాయ.
కోష్ఠము
సం. నా. వా. అ. పుం. తత్స. కుష్యతేస్మిన్నితి కోష్ఠః. దీనియందు కూర్చబడును, లోకడువు, సామగ్రులుంచెడుకొట్టు, గాదె, ధనము, నట్టిళ్లు, స్థలము, మలకోశము.
కోష్ణము
సం. నా. వా. అ. న. తత్స. కించి దుష్ణం కోష్ణం. కొంచెము వేడియైనది ఇంచుకవేడి, ఇంచుకవేడికలది, గోరు వెచ్చన.
కౌంతికుడు
సం. విణ. (అ.ఈ.ఆ). తత్స. ప్రహరణమస్య కౌంతికః. ఈటె ఆయుధముగా కలవాడు. ఈటికాడు, బల్లెము పట్టుకొనువాడు.
కౌక్కుటికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కోడివలె మెల్లగా పోవువాడు, కపటము కలవాడు, చేరువ చూచుచుపోయేడివాడు. యాచన, దూరదృష్టి లేనివాడు, వంఛకుడు, పోయెడివాడు.
కౌక్షేయకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుక్షౌ చర్మ నిర్మిత కోశేభవః క్షౌకేయకః. చర్మనిర్మితమై కుక్షిప్రాయమైన ఒరలోనుండునది. ఖడ్గము, కత్తి.
కౌటతక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కుట్యాం స్వగృహే వర్తమానః కౌటః కౌటశ్చాసౌ తక్షాచ కౌటతక్షః. తనయింటనుండు వడ్రంగి ఒకరికినధీనుడు గాక తనయింట నుండే కూలిచేయువడ్రంగి. స్వతంత్రముగా పనిచేయువడ్రంగి.
కౌటికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృగపక్ష్యాది బంధన యన్త్రం కూటః తేన చరతీతి కౌటికః. మృగ పక్ష్యాదులను పట్టుటకుఉపయోగించుగాలము. మృగపక్ష్యాదులను చంపి విక్రయించి జీవించువాడు. కుటేన మృగాదిబంధనయంత్రేణ చరతీతి కౌటికః. మాంసమును విక్రయించువాడు.
కౌణపుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నెరృతుడు, మూలఱేడు. కుణప శవః తద్భక్షణ కౌణపః. కుణపము అనగా శనము, దానిని భక్షించువాడు. కుపాణః శరీరం శవో వా, తం భక్షయితుం శీలమస్య కౌణపః. వాసుకీ వంశమున పుట్టినవాడు, సర్పవిశేషము.
కౌతుకము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితం తోజయతి హినస్తీతి కౌతుకం. అపూర్వవస్తులనుకోరుట. అనుభవింపని కోరికయందలి ఆశ ,కోరిక, పెండ్లియందు చేతకట్టుకొనెడు తోరము, పండుగ, స్త్రీపురుష పరిహసము, పైపైవచ్చినమేలు సంతోషము, పాటలోనగుసుఖము, ఉత్సాహము, విషయాభోగము, కంకణము, కుతుహాలము, ప్రసిద్ధము, మంగళము.
కౌతుహలము
సం. నా. వా. అ. న. తత్స. కుత్సితం పాపం తూల యతీతి కౌతూహలం. పాపమును బయలుపఱచునది. అనుభవింపని కోరిక అందలి ఆశ, తమి. కుతూహలస్య భవః, కర్మ వా కౌతుహలః. ఆడబిడ్డ మగడు.
కౌద్రవీణము
సం. విణ(అ.ఆ.అ).తత్స. కుత్సిసం యథా తథా ద్రవతీతి కౌద్రవీణం.
కౌన్తి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుంత్యై దుర్యాససాదత్తాకౌంతీ. కుంతి కొఱకు దూర్వాసునిచే ఇయ్యబడినది, రేణుకయను గంధద్రవ్యము, ఒక పరిమళ ద్రవ్యము.
కౌపీనము
సం. నా. వా.అ.న.తత్స. కూపం ప్రవేష్టు మర్హ తీతి కౌపీనం. కూపమును ప్రవేశింప అర్హమైనది, గోచి, అకార్యము, గుహ్యప్రదేశము. కూపపతనమర్హతీతి కౌపినం. దుష్కార్యము, గుహ్యోవయము.
కౌమారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుమార సమ్బన్ధినీ కౌమారీ. ఒకమాతృక
కౌముది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కుముదినామియం కౌముదీ. కలువలు పుష్పించుటకు హేతువైనది కనుక చంద్రిక, వెన్నెల.
కౌమోదకీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హర్షయతీతి కుమోదకోవిష్ణుః తస్యేయం కౌమోదకీ. భూమిని సంతోషింపచేయు విష్ణుని సంబంధమైనది. విష్ణువు యొక్క గధపేరు. కోః పృథివ్యాః పాలకత్వాన్ మోదకః ఇతి కుమోదకో విష్ణుః, తస్యేయం కౌమోదకీ.
కౌలటినేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కులటాయాః అపత్యం కౌలటేయః. కులటయొక్క పుత్రుడు, భిక్షుకియైన పతివ్రత కొడుకు, ఱంకుటాలి కొడుకు, జారిణి పుత్రుడు.
కౌలటేయడు
సం. నా. వా. అ. పుం. తత్స. కులటాయాః అపత్యం కౌలటేయః. కులట యొక్కపుత్రుడు. భిక్షుకియైన పతివ్రత కొడుకు, ఱంకుటాలి కొడుకు, సన్యాసిని కొడుకు.
కౌలటేరము
సం. నా. వా.అ. పుం. తత్స. కులటాయాః అపత్యం కౌలటేరః. కులట యొక్క పుత్రుడు, భిక్షుకియైన పతివ్రత కొడుకు, ఱంకుటాలి కొడుకు.
కౌలీనము
సం. నా. వా. అ. న. తత్స. కులే భవం కౌలీనం. గొప్ప కులమందు పుట్టునది. గొప్పవంశమునందలి పుట్టుక, గుహ్యము, పశుపక్ష్యాదుల జగడము, జగడము, నిందింపదగినపని. కౌ పృథివ్యా లీనం కౌలీనం. జూదము, అభిజాత్యము, నింద.
కౌలేయకము
సం. నా. వా.అ. పుం. తత్స.కులే గృహేభవః కౌలేయకః. ఇంటనుండునది. కుక్క, మంచికులమున పుట్టినది, అభిజాతుడు.
కౌశికము
సం. నా. వా. అ. పుం. తత్స. కుంభోలూఖలకోశేభవః కౌశికః. మొగ్గవలెనుండెడు మోసువలన పుట్టినది. గుగ్గిలపు చెట్టు, గుడ్లగూలు, ముంగిస. వృక్షాః తేషుచరతీతి కేశికః. వృక్షములయందు చరించునది. కుశికస్యాపత్యం కౌశికః. కుశినికొడుకు, కొవ్వు, ఇంద్రుడు, విశ్వామిత్రుడు, పాములను పట్టువాడు.
కౌశేయము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కోశనిర్మితత్వాత్కౌశేయం. కోశమనగా క్రిములచేతనైన బుఱ్ఱ, అందువలన పుట్టిననూలుచేత నైన చీర.
కౌస్తుభము
సం. నా. వా.అ. పుం. తత్స.కుంస్తుభ్నాతి వ్యాప్నోతీతి కస్తుభ స్సముద్రః. తత్ర భవతీతివ కౌస్తుభః. సముద్రమందుపుట్టినది, విష్ణునియొక్క మణిపేరు, విష్ణువక్షస్థలమందలి మణి.
క్రందనము
సం. నా. వా. అ. న. తత్స. క్రనః క్రన్దనం. పిలుచుట. ఆర్పు, ఏడ్పు, పిలుపు, యుద్ధమున అరుపు, ధ్వని.
క్రందితము
సం. నా. వా. అ. న. తత్స. క్రన్దనం క్రన్దితం. రోదించుట, ఏడ్పు, పిలుపు, రోదనము, ఆహ్వానము.
క్రకచము
సం. నా. వా. అ. పుం. తత్స. క్ర ఇతి శబ్దం కచతీతి క్రకచః. క్ర అను శబ్దమును రచించునది. రంపము, వెణుతురు (వృక్ష విశేషము), నలభైరెండు అంగుళములు, కరపత్రము.
క్రకరము
సం. నా. వా. అ. పుం. తత్స. తీక్ష్ణత్వాత్ క్ర ఇతి శబ్దం కరోతీతిక్రకరః. తీక్షణ మైనది కనుక, కక్కెర, ఱంపము, వెణుతురు, బీదవాడు.
క్రతుధ్వంసి
సం. న్. పుం. తత్స. క్రతుం దక్షయజ్ఞం ధ్వంసితుం శీలమస్యేతి క్రతుధ్వంసి. దక్షయజ్ఞమును చెఱిచినవాడు, శివుడు, జన్నపుకొంగ.
క్రతుభుజుడు
సం. నా. వా. జ్. పుం. తత్స. క్రతౌ భుంజత ఇతి క్రతుభుజః. యజ్ఞమందు భుజించువారు, దేవత, జన్నపుతిండి.
క్రతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. క్రియతే బ్రాహ్మాణాది భిరితి క్రతుః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల చేత చేయబడునది. యజ్ఞము, ఒకానొకఋషి, నిశ్చయము, యాగము.
క్రధనము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రధ్యతే కథనం. వధ, కొల, ఊపిరి ఆడక పోవడం.
క్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రమ్యతే నేనేతి క్రమః. దీని చేత క్రమింపబడునది, విధి, పద్దతి, ఎలుక, సారిది, అడుగిడుట, అఱుముట, బలిమి, వడకు.
క్రముకము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రామతీతి క్రముకః. ఆక్రమించునది “క్రామంత్యస్మిన్ ఫలార్ధిన ఇతిక్రముకః. దీనియందు ఫలార్ధు లెక్కుదురు. పోక, తుమ్ములము, పోకచెట్టు, ఎర్రలొద్దుగు, గంగరావి, నాగముసై, ప్రత్తి చెట్టు, కొరవి.
క్రమేలకము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రమైః ఏళతీతి క్రమేళకః. పాదవిక్షేపములచేతపోవునది, ఉష్ణ్రము, ఒంటె. క్రమమాలంబ్య ఇలతి క్షిపతీతి క్రమేలకః. ఒక సంకర జాతి.
క్రయ విక్రయికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. క్రయ విక్రయాభ్యాం జీవతీతి క్రయవిక్రయః. క్రయవిక్రయములచేత బ్రతుకువాడు. (సరుకును) కొని అమ్మెడువాడు, బేహరి, వర్తకుడు.
క్రయికుడు
సం. నా. వా.అ. పుం. తత్స. క్రీణాతీతి. కొనువాడుకనుక (సరుకును వెలయిచ్చి) కొనువాడు, విలువకాడు.
క్రయ్యము
సం. విణ. (అ.ఆఅ). తత్స. క్రయార్థం ప్రసారితం క్రయ్యం. అమ్ముటకై పెట్టబడినది. కొనుటకు అంగడియందు పఱపబడినది (సరుకు), అమ్మచూపినది.
క్రవ్యము
సం. నా. వా. అ. న. తత్స. క్లరివ్యతేస్యాత్ క్రవ్యం. దీనికి భయపడుదురు, మాంసము, పొల.
క్రవ్యాదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. క్రవ్యం మాంసమత్తీతి క్రవ్యాత్. మాంసమును భక్షించువాడు, రాక్షసుడు, శ్మశానాగ్ని.
క్రిమి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మందం క్రామతి క్రిమిః. మెల్లగా నడచునది. పురుగు, చెట్లమీది నల్లపురుగు, లక్క. క్రము పాదవిక్షేపే క్రిమిః. కీటకము.
క్రిమిఘ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రిమీన్ హన్తీ తిక్రిమిఘ్నః. పురుగులనుచంపునది, వాయువిళంగము.
క్రిమిజము
సం. నా. వా. అ. న. తత్స. క్రిమిభిర్జమ్యతేక్రిమిజం. క్రిములచే తినబడునది, అగురువు, అగలు, పట్టుబట్ట.
క్రియాకారము
సం. నా. వా. అ. పుం. తత్స. క్వచిద థ్యాహృత క్రియయా. క్రియకలిగిన సుబంతసముదాయము. కర్మవ్యాప్యే క్రియాయాం చపున్న పుసంకయోర్మతమ్. చేయుట కనుక. క్రియతే కరణం చ క్రియా. చేయబడునదియు, చేయుటయు క్రియ ప్రతిజ్ఞ, చేతి తాళం, వ్యాపారం, త్వర, నేర్చుకొనుట, కప్పిపుచ్చుట, ఉపాయము, పని, సాధనము, ఆరంభము, పూజ, అభినయము, నిర్ణయము.
క్రియావంతుడు
సం. విణ. (త్.ఈ.త్). తత్స. క్రియా స్యాస్తీతి క్రియావాన్. క్రియకలవాడు, పనియందు పూన్కికలవాడు, వ్యాపారి.
క్రీడ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్రీడనం క్రీడా. విహరించుట, ఆట్లాట, పరిహాసము, దూఱు, ఆట, వినోదము.
క్రుధ
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. క్రోధః ఏవ క్రుధః. క్రోధించుట, కోపము.
క్రుష్టము
సం. నా. వా. అ. న. తత్స. క్రోశనం క్రుష్టం. ఏడ్చుట, ఏడుపు, సద్దు, ఏడ్చుచున్నవాడు.
క్రూరము
సం. విణ. (అ.ఆఅ).తత్స. కృంత తీతి క్రూరః. వ్యధ పెట్టువాడు. “కృంతతి క్రూరం. నొప్పించునది. కృణాతీతి క్రూరః. హింసించునది. నొప్పించునది, భయంకరమైనది, గట్టిది. పోక, ఎముక, వేడి, క్రూరము, బీదవాడు, భయంకరుడు, కోపి, దుర్మార్గుడు, కఠినుడు.
క్రేయము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. క్రేతుల యోగ్యం క్రేయం. అమ్మతగినది. కొనతగినది, డబ్బు ఇచ్చి కొనుగోలు చేసే సరుకు.
క్రోడము
సం. నా. వా.అ.న.ఆ.స్త్రీ.తత్స. క్రోడతీతి క్రోడః. ఘనమైనది. ఒడి, ఱొమ్ము, పంది.
క్రోధన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్రుధ్యతీతి క్రోధనః. స్వభావముననే కోపించుకొనువాడు. బెండ, అ. పుం. ఒకసంవత్సరము, విణ. కోపముకలది.
క్రోధము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రోధః క్రుధక్రోధే. క్రోధము, కోపము, కోపముకలది, కినుక, ఒకస్థాయిభావము.
క్రోష్టీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్రోశతీతి క్రోష్టీ. ధాతువర్ధనమందు సమర్ధమని మొఱపెట్టునది. ఆడునక్క, తెల్లనేల గుమ్మడి, లాంగలి. (లాంగలి శబ్దమునకు తరిగొఱ్ఱయు, నీరు పిప్పలిఅనుఅర్ధములు)
క్రోష్టువిన్న
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్రోష్టుభిర్విన్నా ఆదత్తేవ భాతి తత్పుచ్ఛసామ్యాత్ క్రోష్టువిన్నా. నక్కలచేత పొందపడిన దానివలెవుండి తత్పుచ్ఛసామ్యము కలదైఉండునది. నక్కతోక, పొన్న.
క్రోష్టువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. క్రోశతి క్రోష్టుః. ఫేయని కూయునది, జంబుకము, నక్క, గెనుసు.
క్రౌంచదారణుడు
సం. నా. వా.అ. పుం. తత్స. క్రౌంచాఖ్యం పర్వతం దారితవాన్ క్రౌంచదారణః. క్రౌంచ పర్వతమును వ్రక్కలించినవాడు, గుహుడు, కుమార స్వామి.
క్రౌంచము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రౌంచశ్చ క్రుఞ్చగతి కౌటిల్యాల్పిభావయోః. పంక్తిరూపముగా పోవునది, ఒకానొకకొండ, ఒకానొక ద్వీపము, ఒకానొక పక్షి, కొంగ.
క్లమథము
సం. నా. వా. అ. పుం. తత్స.క్లాంతిః క్లమథః. బడులుట, శ్రమము, బడలిక.
క్లమము
సం. నా. వా. అ. పుం. తత్స. క్లాంతిః క్లమదః. బడలుట, శ్రమము, బడలిక.
క్లిన్నము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్లిన్న మక్షియస్యసః క్లిన్నాక్షః. అక్షిరోగము చేతగాని, స్వభావముచేతకాని, తడియైఉండు కన్నులుకలవాని యుందు వర్తించును. ఆర్ధ్రము, తడిసినది. క్లిద్యత ఇతిక్లిన్నం. తేమకలది.
క్లిశితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్లిశ్యతే బాధ్యతేస్మ క్లిష్టః క్లిశితశ్చ. దారిద్ర్యాలుచే పీడింపబడినమనుష్యాదులు. దారిద్ర్యదులచేత క్లేశము పొందినది.
క్లిష్టము
సం. నా. వా. అ. న. తత్స. క్లిశ్యంత్యనేనేతిక్షిష్టం. దీనిచేత క్లేశము పొందుదురు. క్లిశ్వతే బాధ్యతేస్మ క్లిష్టః. పీడింప బడినవాడు, ఒకానొక శబ్దదోషము, దారిద్ర్యాదులచేత క్లేశము నొందినది. పూర్వోత్తరవిరుద్ధమైనది (వాక్కు), భాధితుడు.
క్లీతకము
సం. నా. వా. అ. న. తత్స. క్లీబత్వం తకతి ప్రతిహంతి క్లీతకం. నపుంసకత్వమును చెఱచునది, అతిమధురము.
క్లీబము
సం. నా. వా. అ. పుం. తత్స. క్లీబతే అధిరో భవతి క్లీబః. అధీరుడైనవాడు. అ. న. క్లీబత ఇతి క్లీబం. దిట్టతనము లేనివాడు, విక్రమములేనిది, నపుంసకము, పిరికి, షండుడు.
క్లేశము
సం. నా. వా. అ. పుం. తత్స. క్లేశనం క్లేశః. అలమటపడుట క్లేశము దుఃఖము, కోపము, వ్యవసాయము, బాధ.
క్లోమము
సం. నా. వా. న్. న. తత్స. క్లామ్యతి క్లోమ. వాడునది. కడుపులో నొక ప్రక్కనుండెడి ఎఱ్ఱనిమాంసము, నీరుతిత్తి, మూత్రకోశము.
క్వణనము
సం. నా. వా.అ. పుం. తత్స. క్వణతి ప్రకర్షేణ తీతి క్వణనః వీణాది సకలవాద్యధ్వనులకు పేర్లు, వీణలోనగువానిమోత, వీణాధ్వని.
క్వణము
సం. నా. వా. అ. పుం. తత్స. వీణాధ్వని. ప్రకర్షేణ క్వణతీతి క్వణః లెస్సగా పలుకునది, వీణ లోనగువానిమోత.
క్వథితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్వథ్యతే నిష్పద్యత ఇతి క్వథితం. మిక్కిలి కాచబడినది కనుక చక్కగాకాగినది, సారము.
క్వాణము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం క్వణతీతి క్వాణః లెస్సగా పలుకునది, క్వణము యొక్క రూపాంతరము, వీణాధ్వని.
క్వాధోద్భవము
సం. నా. వా. అ. న. తత్స. దార్వీహరిద్రాతస్యాః క్వాథోద్భవ మంజనం దార్వికా. మాని పసుపు పాకము వలన పుట్టిన అంజనము. మ్రాని పసుపు వండిన అంజన విశేషము.
క్షణద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షణమ వ్యాపార స్థితిం యూనాముత్సవం వాదదాతీతి క్షణదా. అ. న. వ్యాపారశూన్యమైనస్థితిని గాని యౌవనవంతులకు ఉత్సవమును గాని యిచ్చునది, రాత్రి, నీళ్ళు. క్షణం ఉత్సవం దదాతి ఇతి క్షణదా.
క్షణనము
సం. నా. వా. అ. న. తత్స. క్షణ్యతే క్షణనం. హింసాయాం, వధము, కొల.
క్షణప్రభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షణ ప్రభాయస్యాస్సా క్షణ ప్రభా. క్షణమాత్రము ప్రకాశించునది, తటిత్తు, మెఱపు.
క్షణము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షణాః ద్వాదశ ముహూర్త ఇత్యుచ్యతే. క్షణములు కూడిన కాలము ముహూర్తమనబడును. క్షణు తే హినస్తిదుఃఖమితి క్షణః. దుఃఖమును చెఱచునది. క్షణోతి దుఃఖమితి క్షణం. దుఃఖమును పోగొట్టునది. ఘటికయందాఱవపాలు, తిరునాళ్ళు, పండుగ, వ్యాపారము లేమి, సమయము. క్షణోతి హంతి నాశయతి వా సర్వం యథాకాలం ఆయురవసానం క్షణః. పదునైదు నేశముల కాలము, ఉత్సవము, ఊపిరి ఆడక పోవుట.
క్షతజము
సం. నా. వా.అ.న.తత్స. క్షతాజ్జాయత ఇతి క్షతజం. గండివలన పుట్టునది, రక్తము, నెత్తురు.
క్షత్తా
సం. నా. వా. ఋ. పుం. తత్స. క్షదతి తాడయత్యశ్వానితిక్షత్తా. గుఱ్ఱములను కొట్టువాడు, శూద్రస్త్రీయందు, క్షత్రియునుకి పుట్టినవాడు (దాసీపుత్రుడు), ద్వారపాలకుడు, బ్రహ్మసారధి, పారధేనుకుడు, పరవృత్తిని ఆశ్రయించినవాడు, ద్వాస్థుడు, సారథి, దాసిపుత్రుడు, నియుక్తుడు, బ్రహ్మ. క్షదతి ద్వారస్థత్వాత్ జనాన్పీడయతీతి క్షత్తా. వాకిలిని కాచువాడు కనుక జనులను పీడించువాడు. క్షదతీతి క్షత్తా. పీడించువాడు.
క్షత్త్రియా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షత్త్రియకులే జాతా క్షత్రియా. క్షత్త్రకులమందు పుట్టినది. రాచది, క్షత్త్రియ స్త్రీ.
క్షత్త్రియాణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్షత్త్రియకులే జాతా క్షత్త్రియాణీ. క్షత్త్రకులమందుపుట్టినది. రాచది క్షత్త్రియస్త్రీ.
క్షత్త్రియీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్షత్త్రియాకు ల జాతాక్షత్త్రియీ. క్షత్త్రియుడిభార్య.
క్షత్రియుడు
సం. నా. వా. అ. పుం. తత్స. క్షతాత్త్రాయతే క్షత్త్రః. తస్యాపత్యం క్షత్త్రియః. క్షతము వలన రక్షించువాడుగనుక, రాచది క్షత్త్రే రాష్ట్రే సాధుః, క్షత్రస్యాపత్యం వా క్షత్త్రియః రాజు, రాకుమారుడు, సార్వభౌముడు.
క్షప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షపయతి సర్వచేష్టా ఇతి క్షపా. సర్వవ్యాపారములను క్షయింపచేయునది, రాత్రి, రేయి.
క్షపాకరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. క్షపాం కరోతీతి క్షపాకరః. రాత్రిని చేయువాడు, చంద్రుడు.
క్షమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షమతే, కాంతిశ్చక్షమా. ఓర్చునది, ఓర్చువాడు, ఓర్చుట, ఓర్పు, నేల, అ. న. తత్స. యుక్తము ఉచితము, సమర్థము. విణ. తత్స. చాలునది. క్షమతే ఆత్మోపరిస్థితానాం జీవానాం అపరాధం యా క్షమా. పృథివి, భూమి, క్షాంతి.
క్షమి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. క్షమతే తాచ్ఛీల్యేనేతి క్షమీ. ఓర్పుకలవాడు.
క్షమిత
సం. విణ. (ఋ. ఈ. ఋ). తత్స. క్షమతే తాచ్ఛీల్యేనేతి క్షమితా. సహిష్ణువు, ఓర్పరి, ఓర్పుకలవాడు.
క్షయము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షీయన్తేనేనే తిక్షయః. దీని చేత క్షయింతురు. క్షీయతే క్షయః. చెడుట, అఱుదెవులు, తగ్గుదల, ప్రళయము, ఇల్లు, ఏనుగు ముందు కాలులోని ఒకభాగం, ఒక రోగము, నాశము, కల్పాంతము, కడుపు, నివాసం.
క్షవథువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. క్షౌత్యనేన క్షవథుః. దీనిచేత ధ్వని చేయుదురు, తుమ్ము, దగ్గు.
క్షవము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షవణం క్షుత్ క్షుతం. ధ్వని చేయుట, తుమ్ము, నల్లావలు. క్షౌత్యనేన క్షవః. దీనిచేత తుమ్ముదురు.
క్షాంతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్షమ్యతే స్మక్షాంతం. ఓర్వబడినది. సహించినవాడు, భాదితుడు.
క్షాంతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. క్షమాక్షాంతిః. క్షాంత-ఓర్పు, క్షమ, భూమి.
క్షారకము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షురతి ప్రసూతే క్షారకః. పుష్పాదులను పుట్టించునది, కసుగాయ, (పక్షులు, మత్స్యములు లోనగువాని పట్టివేసెడు) బుట్ట, పసరుమొగ్గ, మొగ్గలగుమి, పక్షులు, వికసించుట.
క్షారము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షరతి చలతీతిక్షారః. సూత్రముచేత బంధింపబడునది, ఉప్పు, కారము, గాజు, బూడిద, ఉమ్మెత్త, చేదు.
క్షారితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అక్షార్యతేస్వరూపాచ్చాల్యత ఇత్యాక్షారితః. స్వరూపమునుండి చలింపబడినవాడు, పరస్త్రీగమనాది దోషములచేదూఱబడినవాడు.
క్షితి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. క్షియంతి నివసంతి సర్వేస్యామితి క్షితిః. దీనియందందఱుందురు క్షయవాసావపిక్షితిః. ఉండుటయు నేల, ఉనికి, చిటికవేయునంతకాలము, నాశము, భూమి, నివాసం.
క్షిప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షిపాయాం క్షేపణమ్ క్షేపః క్షిపః. ప్రేరేపించుట, ప్రేరణము, త్రోయుట.
క్షిప్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్షిప్యతేస్మక్షిప్తః. నెట్టబడినది, త్రోయబడినది, వైవబడినది, నింద్యము, చిమ్మబడినది.
క్షిప్నువు
సం. విణ. ఉ. తత్స. క్షిపతి తాచ్ఛీల్యేనేతి క్షిప్నుః. తోయు స్వభావముకలవాడు, తిరస్కరించువాడు, నిరోధం కలించు.
క్షిప్రము
సం. అ. న. తత్స. క్షిప్యంతే అనేనేతి క్షిప్రం. దీనిచేత ప్రేరేపింపబడుదురు, శీఘ్రము, వడికలది, డేగ, కాలి బ్రొటనవేలి సంధు.
క్షియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షీయతే క్షయః క్షియా. చెడుట, క్షయము, తగ్గుదల, నాశము.
క్షీణము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కృశించినది. క్షీణమైన చీకటిపేరు, క్షయించినది.
క్షీబుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్షీబతి మాద్యత ఇతి క్షీబః. మదించినవాడు, క్రొవ్విన వాడు. కల్లు త్రాగినవాడు.
క్షీరము
సం. నా. వా. అ. న. తత్స. క్షీయతేక్షీరం. ప్రవహించునది. ఘస్యత ఇతి క్షీరం. త్రాగబడునది. భక్షింపబడునది, పాలు, నీళ్లు.
క్షీరవిదారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్షీర వద్విదారీ క్షీరవి దారి. పాలుకలగుమ్ముడు, నల్లనేల గుమ్ముడు, తెల్ల గన్నేరు.
క్షీరశుక్ల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షీరేణ శుక్లేవ క్షీరశుక్లా. పాలచేత తెల్లనైన దానివలె ఉండునది. తెల్లనేల గుమ్ముడు, నాచు.
క్షీరావి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్షీరమవతి క్షీరావి. పాలను రక్షించునది, చిఱుపాల.
క్షీరిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షీరవన్మధురాణి ఫలాన్యస్యాః క్షీరికా. పాలవలె తియ్యనైన పండ్లుకలది, పాలచెట్టు, ఏనుగు చనుమొన మధ్యభాగం.
క్షీరోదము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షీరమివ ఉదకం యస్యసః క్షీరోదః. పాలవంటి నీళ్ళు కలిగినది, పాలసముద్రము.
క్షుతమ
సం. నా. వా. అ. న. త్. తత్స. క్షవణం క్షుత్ క్షుతం. ధ్వనిచేయుట, తుమ్ము.
క్షుతాభి జననము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షుతం మభి జనయతీతి క్షుతాభిజననః. తుమ్మును పుట్టించునది, నల్లావలు.
క్షుత్తు
సం. నా. వా. ధ్. స్త్రీ. తత్స. క్షువణం క్షుత్. ధ్వని చేయుట, ఆకలి, భుభుక్ష.
క్షుదితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్షుదస్య సంజాతేతి క్షుదితః ఆకలి వీనికి కలిగినది కనుక, ఆకలిగొన్నది.
క్షుద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షుద్నాతి కుటుంబం పీడయతీతిక్షుద్రః. కుటుంబమును పీడించువాడు ఈగ, తేన టీగ, వేశ్య, అంగహీనయగు ఆడుది, నాట్యమాడెడు ఆడుది, హింసించెడు ఆడుది, పులిచింత, వాకుడు, క్షుద్యత ఇతి క్షుద్రా. మెదుపబడునది, పురుగు, లోభి, క్రూరుడు, పేద, దీనుడు, చిన్నది, నీచము, కుంటిపిల్ల, నటుడు, వంగ, లంజె.
క్షుద్రశంఖము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షుద్రాశ్చ తేశంఖాశ్చ క్షుద్రశంఖః క్షుద్రములైన శంఖములు, నత్తగుల్ల.
క్షుద్రా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వార్తాకాదికమ పేక్ష క్షుద్రత్వాత్ క్షుద్రా. వంగమొదలుగు దానికంటె నీచమైనది, ఈగ, తేనటీగ, వేశ్య, అంగహీనయగు ఆడుది, నాట్యమాడెడు ఆడుది, హింసించుడు ఆడుది, పులిచింత, వాకుడు (వృక్ష విశేషము), కుంటి పిల్ల, వంగ, లంజ, సరఘ, మధుమక్షిక, నటి, గవేధుక.
క్షుపము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షౌతీతిక్షుపః. దావాగ్ని చేత దహింపబడినదై ధ్వనించునది, కుఱుచుకొమ్మలును, ఊడలునుగల చెట్టు, చిన్న చెట్టు, వరినాళము, పొద.
క్షుమ
సం. నా. వా. అ. పుం. తత్స. క్షౌతీతి క్షమ. ఎండినప్పుడు గలగల అని మోయునది, నీలి చెట్టు, నూనె, అగిసె.
క్షుమకము
సం. నా. వా. అ. పుం. తత్స. పారుష్యాతుక్షర ఇవక్షురః పారుష్యము చేత కత్తి వలెనుండునది, గొలిమిడి, పల్లేరు, బొట్టుగు, గోచారువు.
క్షురకము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షురతి పరుషత్వాత్ క్షురకః. పరుషమై, దీప్తమై ఉండునది. గొలిమిడి, పల్లేరు, బొట్టుగు (వృక్ష విశేషము)
క్షురప్రము
సం. నా. వా.అ. పుం. తత్స. క్షుర ఇవ పృణాతి హినస్తి భేచనక్రియాం పూరయతి వా కురప్రః బాణవిశేషము, అర్ధ చంద్రబాణము, ఒక కత్తి.
క్షురి
సం. నా. వా. న్. పుం. తత్స. క్షుర మస్యాస్తీతిక్షురీ. కత్తికలవాడు, మంగలి, చిన్న కత్తి.
క్షుల్లకము
సం. నా. వా.అ. పుం. తత్స. క్షుదంలాతీతి క్షుల్లకః. క్షుద్రుడై ఆకలి గొనియండువాడు, విణ. తత్స. నత్తగుల్ల, అల్పమ, నీచము, పేద. క్షుద్యతే పీడ్యత ఇతిక్షుల్లకః. పీడింపబడునది. కొంచము దానికి, ఆకలికిని పేరు, చిన్నది.
క్షేత్రజీవుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్షేత్రేణ ఆజీవతీతి క్షేత్రాజీవః. భూమి చేత బ్రతుకు వాడు, దున్నుకొని బ్రతుకువాడు, కృషీవలుడు.
క్షేత్రజ్ఞుడు
సం. నా. వా. అ. పుం. తత్స. క్షీయత ఇతి క్షేత్రం శరీరం తజానాతీతి క్షేత్రజ్ఞః. క్షేతమనగా నశ్వరమైనయీ శరీరము దానినెఱింగినవాడు. క్షేత్రం స్థాన విశేషం జానాతీతి క్షేత్రజ్ఞః. స్థాన విశేషము ఎఱుగువాడు, జీవుడు, నేర్పరి. క్షేత్రం శరీర మమేతి కృత్వా యో జానాతి, ఆపదతలమస్తకం జ్ఞానేన విషయీకరోతీతి క్షేత్రజ్ఞః. కుశలుడు, చతురుడు, విద్వాంసుడు, జీవాత్మ, ఆత్మ, నిపుణుడు.
క్షేత్రము
సం. నా. వా. అ. న. తత్స. క్షియతే థాన్యై రస్మిన్నితి క్షేత్రం. దీనియందు ధాన్యముల చేత ఉండబడును. క్షీయత ఇతి క్షేత్రం. పొందబడునది, వరిమడి, గణితశాస్త్రవిశేషము, పెండ్లాము, శరీరము, సిద్దస్థానము, (ఏనుగు యొక్క హస్త, వదన, దంత, శిరో, నయన, కర్ణ, గ్రీవా, గాత్రోరః, కాయ, మేఢ్రపదములు పండ్రెండు క్షేత్రములనబడును). ఇల్లు, పొలము, భార్య, నగరము, దేహము, యోని, పుణ్యక్షేత్రము, పరిమాణం.
క్షేత్రము
సం. నా. వా. అ. న. తత్స. క్షీయతే ధాన్యై రస్మిన్నితి క్షేత్రం. దీని యందు ధాన్యమునుంచబడును, క్షేత్రముల సమూహము, పొలములు.
క్షేపణము
సం. నా. వా. అ. న. తత్స. క్షిపాయాం క్షేపణమ. ప్రేరేపించునది, బొటనవేలి సంధు, చిమ్ముట, ఉంచుట.
క్షేపణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్షిప్య తేనౌరనయేతి క్షేపణిః. నావనుత్రీయు కఱ్ఱ, ఓడనడుపుగడ, ఒకానొకవల, త్రెడ్డు.
క్షేమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షిణోత్యశుభమితి క్షేమం. అశుభమును పోగొట్టునది. పార్వతి, రక్షణ, మోక్షము, మంగళము.
క్షేమంకరుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్షేమం కరోతీతి క్షేమంకరః. క్షేమమును చేయువాడు, మేలుచేయువాడు, మంగళమునిచ్చువాడు.
క్షోణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. క్షౌతీతి క్షోణిః. శబ్దించునది, నేల, ముంజతృణముచే అల్లిన బ్రహ్మచారి మొలత్రాడు, భూమి.
క్షోదము
సం. నా. వా. అ. పుం. తత్స. క్షుద్యత ఇతి క్షోదః. మెదపబడునది, నూఱుట, పొడి, ధూళి, దంచుట.
క్షోదిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన క్షుద్రః క్షోదిష్ఠః. మిక్కిలి క్షుద్రమైనది, అల్పము.
క్షౌద్రము
సం. నా. వా. అ. న. తత్స. క్షుధ్రాభిర్మక్షికాభిః కృతం క్షౌద్రం. అనగాజుంటీగలు వానిచే కూర్చబడినది. తేనె, నీళ్లు.
క్షౌమము
సం. నా. వా. అ. న. తత్స. క్షువంతి శబ్ధాయంతే యోధా అత్రక్షౌమం. యుద్ధము చేయుటకై వాకిటిమండపము మీద కూత పెట్టుదురు. క్షుమాయాః అతస్యా వికారః క్షౌమం. నల్లఅగిసె. క్షూయతే శోభన మితి క్షేమం. శుద్ధత్వము చేత మంచిదని పలుకునది, పట్టు బట్ట, నారచీర, నూనెఅగిసె, కుందేటిత్రుప్పుటిచీర, అ. పుం. తెల్లచీర, యుద్దార్ధము వారిటిమండపము మీదగాని కొత్తళము మీదగాని ఏర్పరచినగది, మిద్దె మీదగది.
క్ష్ణుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. క్ష్ణూయతేస్మక్ష్ణుతం. వాడిగా చేయబడినది, పదును పట్టినది.
క్ష్మా
సం. నా. వా.ఆ. స్త్రీ. తత్స. క్షమతే భారం క్ష్మా. భారము నోర్చునది, నేల, నిద్ర అ. న. తత్స. స్థానము, రాక్షసుడు. క్షమతే సహతే భారం అపరాధజనితం వాత్మస్థానం జీవానాం చతుర్విధానం ఇతి క్ష్మా. పృథివి, భూమి.
క్ష్మాభృత్తు
సం. న్. త్. పుం. తత్స. క్ష్మాం బిభర్తీతి క్ష్మాభృత్. భూమిని ధరించునది, కొండ, రాజు
క్ష్వేడ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్ష్వేడనం క్ష్వేడా. బొబ్బపెట్టుట, సింహనాదము, వెదురుసలాక, అ. న. తత్స. ఆవడపువ్వు అ. పుం. ఎఱ్ఱజిల్లెడుకాయ, చెవుడు, మ్రోత, విణ. తత్స. విషము, పొందరానిది.
క్ష్వేడితము
సం. నా. వా.అ. న. తత్స. సింహనాదము.