హల్లులు : న

నందకము
సం. నా. వా. అ. పుం. తత్స. నందయతి దేవా నితి నందకః. విష్ణుఖడ్గము, దేవతలను సంతోషపెట్టునది, ఆనందము, కృష్ణుని తండ్రి.
నందన
సం. నా. వా. అ. న. తత్స. నందయతీతి నందనం. ఇంద్రుని ఉద్యానవనము. సంతోషింపచేయునట్టిది. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కూతురు. సం. నా. వా. అ. పుం. తత్స. ఒక సంవత్సరం. యుజ్ఞములలో హవిస్సుకలుపుటకు ఉపయోగించునది. కొయ్య తెడ్డు, కొడుకు, కుమారుడు, కూతురు.
నందివృక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. నన్దయతీతి నన్దీ, నన్ది సంజ్ఞకో వృక్షః నన్దివృక్షః సంతోషము పెట్టునది కనుక నన్ది, నందిఅను పేరుగల వృక్షము, (వృక్ష విశేషం).
నంద్యావర్తము
సం. నా. వా. అ. పుం. తత్స. నందమానంద మావర్తయతీతి నంద్యా వర్తః. ఆనందమును ప్రవర్తింపచేయునది, పడమటి దిక్కు తప్ప తక్కిన మూడు దిక్కుల వాకిళ్లుగల రాజ్యగృహము, నందివర్థనము, మత్స్యభేదము.
నకులేష్ట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నకులానామిష్టా నకులేష్టా. ముంగిసలకు ప్రియమైనది, సర్పాక్షి, (వృక్ష విశేషము).
నక్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. మంచునజతే లజ్జతే నక్తకః. మంచికోకలలో సిగ్గుపడునది, చినిగినవస్త్రము, మాసినవస్త్రము, నల్లగూబ, గుడ్లగూబ.
నక్తమాలము
సం. నా. వా. అ. పుం. తత్స. నక్తమలతి మండయతీతి నక్తమాలః. రాత్రిని అలంకరించునది, కానుగుచెట్టు. నక్తం రాత్రౌ ఆ సమ్యక్ప్రకారేణ అలతి పర్యాప్నోతీతి నక్తమాలః. వృక్షవిశేషము, గోరింట.
నక్తము
సం. నా. వా. అ. న. తత్స. రాత్రి.
నక్రము
సం. నా. వా. అ. పుం. తత్స. నక్రామతీతి నక్రః. భూమియందు పాద విక్షేపము చేయనిది, మొసలి. న క్రామతి దూరస్థలమితి నక్రః. మకరము. సం. నా. వా. అ. న. తత్స. అడ్డకమ్మి, తొక్కుడు కమ్మి.
నక్షత్రమాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నక్షత్రమాలేవ భాతీతి నక్షత్రమాలా. నక్షత్ర పంక్తి వలె ప్రకాశించునది, ఇరవై ఏడు ముత్యాల పేటహారము, ఏనుగులకు వేయుహరము.
నక్షత్రము
సం. నా. వా. అ. న. తత్స. న క్షరతీతి నక్షత్రం. న క్షీయతే వా ఇతి నక్షత్రం. నశింపనిది, అశ్విని మొదలగురిక్క, తార, చుక్క. (ఇవి ఇరువదియేడు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాక, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని. అభిజిత్తు అని ఇరువదియెనిమిదవ నక్షత్రము ఒకటి కలదందురు).
నక్షత్రేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నక్షత్రాణామీశః. నక్షత్రేశః. చుక్కల రేడు, చంద్రుడు, రిక్కరాయడు.
నఖము
సం. నా. వా. అ. పుం. న. తత్స. నఖతి కుష్ఠాదీన్ గృహీత్వా గచ్ఛతీతి నఖం. కుష్ఠాదులను గ్రహంచునది, గంధ ద్రవ్య విశేషము. న విద్యతే ఖమింద్రియం స్పర్శజ్ఞాపకమత్ర నఖః. స్పర్శజ్ఞాపకమైన ఇంద్రియము దీనికి లేదు, గోరు, శంఖము.
నఖరము
సం. నా. వా. అ. పుం. తత్స. నఖైక దేశమస్యాస్తీతి నఖరః. నఖైకదేశము కలది, నఖము, గోరు. న ఖనతి ఖన్యతే వా నఖరః.
నగము
సం. నా. వా. అ. పుం. తత్స. న గచ్ఛత ఇతి నగః. ఎక్కడికి కదలనివి, కొండ, చెట్టు, వృక్షము, పట్టణము, పురము, కస్తూరి.
నగరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నగాః నగసదృశాః ప్రాసాదాదయోత్ర సంతీతి నగరీ. పర్వత సమానములైన రాజగృహము మొదలైనవి కలిగినది, పట్టణము, పురము, నగరము.
నగౌకసము
సం. నా. వా. స్. పుం. తత్స. నగో వృక్షః ఓకః స్థానమస్యేతి నగౌకాః. వృక్షము స్థానముగా కలది, పక్షి, సింహము, శరభము, కాకి.
నగ్నహువు
సం. నా. వా. ఉ. ఊ. పుం. తత్స. నగ్నాహూయంతే అనేనేతి నగ్రహూః. నానాద్రవ్యములచేత చేయబడిన సురాబీజము, కిణ్వము, పులియు, పొంగ, ఉద్రేకము, చూపు.
నగ్నిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నజతే నగ్నికా. లజ్జించునది, కన్యక, దిసమొల ఆడది, గౌరి, దిగంబరస్త్రీ.
నగ్నుడు
సం. విణ. తత్స. నలజ్జత ఇతి నగ్నః. సిగ్గులేనివాడు, దిసమొలవాడు. సం. నా. వా. అ. పుం. తత్స. బుద్ధదేవుడు, భట్టువాడు, జౌపాసాగ్నిలేని, బ్రాహ్మణుడు, దిగంబరుడు, స్థుతిపాఠకుడు.
నటనము
సం. నా. వా. అ. న. తత్స. నట్యతే నటనం. నటించుట, నాట్యము, నటన, కపట ప్రవర్తనము.
నటము
సం. నా. వా. అ. పుం. తత్స. నటతి వా తేన నటః. వాయువుచేత నటించునది, దుండిగపు చెట్టు, ఇరుగుడు చెట్టు. నటతి నృత్యతీతి నటః. నర్తకుడు, ఆడువారు, సంకరజాతివాడు, గూఢచారుడు, నట్టువకాడు, దొమ్మరి.
నటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వాయువశాన్నటతి చలతీతి నటీ. వాయువశమున నటించునది, వేశ్య, నట్టువుని పెండ్లాము, కాకిదొండ చెట్టు, గువ్వగుత్తిక చెట్టు, నెల్లికూర.
నడము
సం. నా. వా. అ. పుం. తత్స. కిక్కనసపు.
నడ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నడానాం సమూహో నడ్యా. కిక్కస వామి.
నడ్వలము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. బాహుళ్వేన నడ్యోస్త్వస్మిన్నితి నడ్వలః. గ్రాలు కసపు కలిగిన దేశము, కిక్కసకసవు కలది, పచ్చిక కలది.
నతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నమతీతి నతం. వంకరయెడునది, వంగినది, వంకరైనది, లోతైనది, కుటిలము.
నది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నదతీతి నదీ. మ్రోయునది, ఏరు, ఆమడకు మీరి పారెడి ఏరు, తోయ, తరంగిణి, తూర్పునకు ప్రవహించునది.
నదీమాతృకము
సం. నా. వా. అ. పుం. తత్స. నదీ మాతాస్వ నదీ మాతృకః. నదియే తల్లిగా కలది, ఏటినీళ్ళచేత పండెడు పైరు కల దేశము. నదీ మాతేవ పోషికా యస్య సః నదీమాతృకః. పంటలకైనదులపై ఆధారపడినభూమి.
నదీసర్జము
సం. నా. వా. అ. పుం. తత్స. నద్యాం భవః సర్జో నదీసర్జః. నదియందు పుట్టిన మద్ది, ఏరుమద్ది చెట్టు.
నధ్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నహ్యతే అనయేతి నధ్రీ. దీని చేత కట్టబడును, టంగువాఱు, పరత్ర, తోలుపట్ట.
ననంద
సం. నా. వా. ఋ. స్త్రీ. తత్స. న నన్దయతీతి ననన్దా. సంతోషింపచేయనిది, మగనితోడఁబుట్టినది, (రూ. ననాంద). ఆడపడుచు.
నపుంసకము
సం. నా. వా. అ. న. తత్స. న స్త్రీ పుంసౌ నపుంసకః. స్త్రీ పురుషులు కానివాడు, షండుండు, పేడి.
నప్త్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. న పత త్యనయా కులమతి నప్త్రీ. కులము దీనిచేత పడదు, మనుమరాలు.
నభము
సం. నా. వా. స్. న. పుం. తత్స. న భాసతే మేఘచ్ఛన్న త్వాత్ నభాః. మేఘచ్ఛన్నమై ప్రకాశింపనిది, ఆకాశము, శ్రావణమాసము, మేఘము, వర్షాకాలము, బిసతంతువు, తుమ్మపడిగము, ముక్కు. నహ్యతే మేఘైరితి నభః. మేఘైర్నభాతీతినభః. మొయిళ్లచేత ప్రకాశించునది.
నభసంగమము
సం. నా. వా. అ. పుం. తత్స. నభసి గచ్ఛంతీతి నభ సంగమాః. ఆకాశమున పోవునవి, పక్షి, పిట్ట.
నభస్యము
సం. నా. వా. అ. పుం. తత్స. నభాంసి మేఘాః తీఘ సాధు ర్నభస్యః. నభస్సులు అనగా మేఘములు, వాని యందు సమర్థమైయుండును, భాద్రపదమాసము.
నభస్వంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. నభ గీకారణ త్వాన్నభోస్యాస్తీతి నభస్వాన్. ఆకాశము ఉత్పత్తి స్థానముగా కలవాడు, వాయువు, గాలి. ఆకాశాదాయురితి శ్రుతేః నభః ఉత్పత్తికారణత్వేన అస్త్యస్యేతి నభస్వాన్.
నమసితుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నమస్యతే స్మ నమస్యితం నమసితం. నమస్కరింపబడినవాడు కనుక నమస్వితుఁడు, అర్చితుడు, గౌరవింపబడినవాడు.
నమస్కారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అంజలిరూపత్వా న్నమస్కరోతీవ నమస్కారీ. అంజలి రూపము కలదౌటఁజేసి నమస్కారము చేయుదానివలె ఉండునది, ముడుగుతామర (వృక్ష విశేషము). నిద్రభంగి చెట్టు.
నమస్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నమనం నమస్యా. నమస్కరించుట, పూజ, సపర్య.
నమస్యితుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నమస్యతే స్మ నమస్యితం. నమస్కరింపబడిన వాడు కనుక నమస్యితుడు, అర్చితుడు, గౌరవింపబడినవాడు.
నముచిసూదనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నముచిం సూదితవాన్ నముచి సూదనః. నముచి అను రాక్షసుని హింసించినవాడు, ఇంద్రుడు.
నయనము
సం. నా. వా. అ. న. తత్స. నీయతే అనేన నయనం. నేత్రం, కన్ను పొదించుట. నీయతే దృష్టివిషయో అనేనేతి నయనం. ప్రాపణము.
నరకము
సం. నా. వా. అ. పుం. తత్స. నృణాతి ప్రాపయతి పాపి నస్స్వమీపమితి నరకః. పాపిష్టులను తనసమీపమును బాందించునది కనుక నరకము, దుర్గతి, దైత్యవిశేషము. ఒక రాక్షసుడు, పాపాత్ములు చేరులోకము. (నరకములు 21 తామిస్రము, లోహశంకువు, మహానిరయము, శాల్మలి, రౌరవము, కుంభలము, పూతిమృత్తికము, కాల సూత్రము, సంఘాతము, లోహితోదము, సవిషము, సంప్రపాతనము, మహానరకము, కాకోలము, సంజివనము, మహాపథము, అవీచి, అంధతామిస్రము, కుంభీ పాకము, అసిపత్రవనము, తాపనము). ఒకరాక్షసుడు.
నరవాహనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నరోవాహనం యస్యసః నరవాహనః. నరుడు వాహనముగా కలవాడు, కుబేరుడు.
నర్తకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నృత్యతీతి నర్తకీ. ఆడునట్టిది, ఆటకత్తె, ఆఁడేనుఁగు, గువ్వ, గుత్తిక (వృక్ష విశేషం).
నర్తనము
సం. నా. వా. అ. న. తత్స. నృత్యం నర్తనం. నృత్యము, నర్తించుట, నటనము, ఆట, నాట్యము.
నర్మము
సం. నా. వా. న్. న. తత్స. నృణాతి రత్యతియం ప్రాపయతీతి నర్మః. రత్యతిశయమును పొందించునది, పరిహాసము, మేలము, కేశి, క్రీడ, వినోదము.
నలకూబరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నలస్యేవ కూబరో రథావయవోయస్యసః నల కూబరః. నలుడి యొక్క రధ అవయవమువంటి అవయవము కలవాడు. తయా ప్రీయతే అభిలష్య తేవా నల కూబరః. నలమనగా కమలము, కుబేరుని కొడుకు. నలః కూబరో యుగంధరో యస్య సః నలకూబరః.
నలదము
సం. నా. వా. అ. న. తత్స. తద్ధ్యతీతి నలదం. వట్టివేరు, పూతేన.
నలినము
సం. నా. వా. అ. న. తత్స. నల్యతే బద్ధ్యతే చంద్రేణాతి నళిను. చంద్రునిచేత ముకుళ రూపమున బంధింపబడునది, పద్మము, తామర, నీరు.
నలిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నళం పద్మమస్యామస్తీతి నళినీ. పద్మము, తామర, తామరకొలను, తామరతీగ, తామరతంపర. మిన్నేఱు. నళాని పద్మాని సంత్యత్ర నలినీ. పద్మిని.
నల్వము
సం. నా. వా. అ. పుం. తత్స. నల్యతే బద్ధ్యతే అనేనేతి నల్వః. దీనిచేత లెక్కపెట్టబడును, నాలుగు వందలమూరల దూరము, తొమ్మిదివేల ఆరువందల అంగుళములు.
నవనీతము
సం. నా. వా. అ. న. తత్స. నవా ద్దధ్నో నీతం నవనీతం. అప్పుడే చిలికిఎత్తిన వెన్న, నూతనమైన పెరుగువలన తీయపడినది కనుక నవనీతము. నవం నీయతే అనేనేతి నవనీతం. వెన్న.
నవమాలికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నవాస్తుత్యా మాలా అస్యా ఇతి నవమాలికా. స్తోత్రము చేయగినదండ కలది, విరజాజి (వృక్ష విశేషం). నవా నూతనా మాలికా మల్లికాపుష్పమితి నవమాలికా. సురభి, జాజిమల్లి చెట్టు.
నవము
సం. నా. వా. అ. పుం. తత్స. అభినూయత ఇతి నవః. కొనియాడ బడునది. స్తోత్రము, వీణ. సం. విణ. తత్స. కొత్తది, క్రొత్త.
నవీనము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. అభినూయత ఇత్యభినవో, కొనియాడబడునది కనుక అభినవము, నవ్యము, నవీనము, నుతింపదగినది, నూతనము.
నష్టము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నశ్యతేస్మ నష్టః. కానరానివాడు, నాశమునొందినది, మఱుగుపడినది, అధముడు.
నస్తితము
సం. నా. వా. అ. పుం. తత్స. నస్తా నాసికావయవ విశేషః, తస్మిన్ విద్ధో నస్తితః. ముక్కుదూలము, ముక్కుకుత్రాడు కట్టిన ఎద్దు. నస్తా సచ్ఛిద్రనాసికా సంజాతా అస్యేతి నస్తితః.
నస్యోతము
సం. నా. వా. అ. పుం. తత్స. నస్యే నాసికారంధ్రే ఊతః నస్యోతః. ముక్కురంధ్రము, మక్కుకుత్రాడు కట్టిన ఎద్దు.
నాకము
సం. నా. వా. అ. పుం. తత్స. నవిద్యతే అకం దుఃఖ మత్ర నాకః. స్వర్గము, ఆకాశము. న కం సుఖమితి అకం దుఃఖం, తన్నాస్త్యత్రేతి నాకః. క్షత్రియజాతి విశేషము.
నాకులి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నకులానా మియం ప్రియా నాకులీ. ముంగిసలకు ప్రియమైనది, సర్పాక్షి, నకుల చెట్టు.
నాగకేసరము
సం. నా. వా. అ. పుం. తత్స. నాగ ప్రియాణి కేసరవన్తి పుష్పాణ్యస్య నాగ కేసరః. ఏనుగలకు ప్రియమైన ఆకరువులు కల పుష్పములు కలది, ఒకానొక చెట్టు. నాగస్యేవ కేసరో అస్యేతి నాగకేసరః. పుష్పవృక్షవిశేషము.
నాగజిహ్విక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నాగ జిహ్వా ప్రతికృతిః నాగజిహ్వికా. పాము నాలికెవలె ఉండునది, మణిశిల, ఎఱ్ఱపాషాణము.
నాగబల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నాగానాం గజానాం బల కృన్నాగబలా. ఏనుగులకు బలమును చేయునది, బీఱ (వృక్ష విశేషము), మేడి చెట్టు.
నాగము
సం. నా. వా. అ. న. తత్స. న గచ్ఛతీ త్యగం. తన్నభవతి చలత్వాదితి నాగం. మెత్తనౌటచేత కదలునది, సత్తు, తగరము, రతిబంధ విశేషము. నగే భవో నాగః. పర్వతమందు పుట్టినది. సం. నా. వా. అ. పుం. తత్స. పాము, ఏనుగు, కొండ, గ్రహము, గొళ్ళెము తగిలించెడు నాగవాసరము, ఒక ఉపవాయువు, మబ్బు, ముస్తె, నాగకేసరము, పొన్న, శ్రేష్టము.
నాగరము
సం. నా. వా. అ. న. తత్స. నగరాఖ్యదేశే భవం నాగరం. నగరదేశమందు ప్రచురమైనది, సొంటి, ముస్తె (వృక్ష విశేషం), నాగర దేశీయాక్షరము. నగరేభవం నాగరం నగరము అందు పుట్టినది. సం. నా. వా. అ. పుం. తత్స. గోరింట.
నాగలోకము
సం. నా. వా. అ. పుం. తత్స. నాగానాం సర్పాణాం లోకః నాగలోకః. సర్పముల యొక్క లోకము, పాతాళము.
నాగసంభవము
సం. నా. వా. అ. న. తత్స. నాగాత్ సీసా త్సంభవో స్య నాగసంభవం. సీసము వలన పుట్టునది, సింధూరము.
నాగసుగంధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నాగానాం సర్పాణామివ సుగంధో స్యా ఇతి నాగసుగంధా. సర్పముల వంటి పరిమళముకలది, సర్పాక్షి (వృక్ష విశేషము).
నాట్యము
సం. నా. వా. అ. న. తత్స. నటస్య కర్మ నాట్యం. నటుని యొక్క వ్యాపారము, నృత్యము. నటన్వేదం నాట్యం. నృత్తగీత వాద్యముల కూడిక. నటానాం కార్యం నాట్యం, ఒకజాతి, ఇత్తడి.
నాడి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఆరుక్షణముల కాలము. అంతస్సుషిరవత్త్వాత్ నడాఖ్యతృణ వత్తిష్ఠతీతి నాడీ. నడుమ రంధ్రము కలిగి నడమనుకసవువలె ఉండునది, నరము, గడియకాలము, ఈనె, కాడ, తెల్లగఱిక, మోసకాని నడక. (ప్రాణాయామ విషయమున నాడులు మూడు, ఇడ, పింగళ, సుషుమ్న), నారికురుపు, ధమని, సిర, నళతీతినాడీ పోవునది.
నాడింధముడు
సం. నా. వా. అ. పుం. తత్స. అగ్ని సందీపనార్థం నాడిం ధమతీతి నాడింధమః. అగ్ని ప్రజ్వలించుకొరకు కొలిమినూదువాడు, అగసాలెవాడు. నాడీం వంశనలీం ధమతీతి నాడింధమః. స్వర్ణకారుడు.
నాడీవ్రణము
సం. నా. వా. అ. పుం. తత్స. నాడీయుక్తో వ్రణోనాడీ వ్రణః. రంధ్రము కల వ్రణము, నారికురుపు, పుండు.
నాథవంతుడు
సం. విణ. (త్. ఈ. త్). తత్స. నాధోస్యాస్తీతి నాధవాన్. ఏలికకలవాడు, పరాధీనుడు.
నాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నదతీతి నాదః. ధ్వని, మ్రోత, శబ్దము.
నాదేయి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నద్యాం భవా నాదేయీ. నదియందు పుట్టినది, కిత్తలి, నారదము, తక్కిలి, దాసనము, నీరుప్రబ్బ, కాకి నేరేడు, నేలనేరేడు (వృక్ష విశేషము), ఒకలత వరారోహలత.
నానారూపము
సం. విణ. (అ. ఈ. అ). తత్స. నానావిధాని రూపాణ్యస్యేతి నానారూపః. అనేక రూపములు కలది, పలుదెరుగులు కలది.
నాపితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నాప్నోతి అస్పృశ్యత్వాదితి నాపితః. మంగలవాడు. న ఆప్నోతి సరళతామితి నాపితః. క్షురకుడు.
నాభి
సం. నా. వా. ఇ. స్త్రీ. పుం. స్త్రీ. తత్స. నభ్యతే హింస్యతే అక్షేణేతి నాభిః. ఇరుసుల చేత పీడింపబడునది, వసనాభి. నహ్యత ఇతి నాభిః. కట్టబడునది, బండి కంటినడిమతూము, తిలకము, క్షత్రియుడు, చక్రవర్తి. నాహ్యతే బధ్నాతి విపక్షాదీనితి నాభిః. రాజు, కస్తూరి, బొడ్డు, ప్రభుత్వముకల రాజు.
నామధేయము
సం. నా. వా. అ. న. తత్స. నమ్యతే అనేనేతి నామధేయం. దీని చేత పలుకబడును కనుక నామధేయము, అభిధానము , పేరు, లక్షణము, ఆహ్వానము, సంజ్ఞ, ఆహ్వయము, గోత్రము, అభిక్య, నామకరణము.
నాయకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మయతి ప్రాపయతీతి నాయకః. పతకము నడిమిరత్నము, నేత, శ్రేష్ఠుడు, అధిపతి. (సాధారణ నాయకులు నలుగురు. ధీరోదాత్తుఁడు. ధీరోద్ధతుఁడు, ధీరలలితుఁడు, ధీరశాంతుఁడు).
నారకము
సం. నా. వా. అ. పుం. తత్స. నరకే భవాః నారకాః. నరకమున నుండువారు, నరకము, నిరయము, నరకవాసి.
నారాచము
సం. నా. వా. అ. పుం. తత్స. నారం నరసమూహ మంచం తీతి నారాచాః. నర సమూహమును కూర్చి పోవునవి, అచ్చము, ఇనుపబాణము, బాణము, నీటి ఏనుగు.
నారాచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నారం నరసమూహ మఞ్చతీతి నారాచీ. జనసమూహమును పొందునది, బంగారంనునఱకెడు కొఱముట్టు, సానము, అగసాలెవాని ఇనుపత్రాసు.
నారాయణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నారాయణాజ్జాతా నారాయణీ. నారాయణునివలన పుట్టినది, పార్వతి, లక్ష్మీ, పిల్లపీచర (వృక్ష విశేషము), శతావరి, గౌరి.
నారాయణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నరన్యేదం నారం అవతారేషు నారం వపురయత ఇతి నారాయణః. నరసంబంధమైన శరీరము నారము, విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, శివుడు, అగ్ని. నరాజ్జాతాః, ఆపో వై నరసూనవః ఇత్యుక్తేః నారాయణః.
నారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నృణాతి నయతి స్వవశం పురుషమితి నారీ. పురుషుని వశముచేసికొనునది, ఆడది. నుర్నరస్య వా ధర్మ్యా ఇతి నారీ. స్త్రీ, అబల, మహిళ, వామ, వనిత, ప్రియ, ధనిక, యోషిత, చింతపండు.
నాళికేరము
సం. నా. వా. అ. పుం. తత్స. నాళ్యాక ముదక మీరయతీతి నాళికేరః. రంధ్రముల చేత ఉదకమును పీల్చునది, నారికేళము యొక్క రూపాంతరము, కొబ్బరి.
నావికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నావా తరతీతి నావికః. ఓడ చేత దాటువాడు, ఓడనడుపువాడు, కర్ణధారుడు, సంకరజాతి, పడవ ప్రయాణము చేయువాడు.
నావ్యము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నావా తార్యం నావ్యం. ఓడ చేత దాటతగినది, గంభీరమైన జలము.
నాశము
సం. నా. వా. అ. పుం. తత్స. నశ్యతే నాశః. నశించుట, చేటు, కనబడని, అనుభవములేమి, మృత్యువు, పలాయనము, అదర్శనము, వధ, కానరాకుండుట.
నాస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గృహస్య నాసికేవ తిష్ఠతీతి నాసా. ఇంటికి ముక్కువలె ఉండునది. నాసతే శబ్దాయతే నాసా. ధ్వని చేయునది, ముక్కు, నాసిక, ఆధారముగా ఉన్న దూలము, ద్వారము క్రింది కర్ర.
నాసత్యులు
సం. నా. వా. అ. పుం. ద్వి. తత్స. న విద్యతే అసత్యం యయోస్తౌ నాసత్యౌ. అసత్యము లేనివారు, అశ్వనీదేవతలు. నాస్తి అసత్యం యయోస్తౌ నాసత్యౌ. అశ్వినీకుమారులు.
నాసిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నాసతే శబ్దాయతే నాసికా. ధ్వని చేయునది, ముక్కు, ష్రూణము, నాసికము, వాసనను కనిపెట్టునది.
నాస్తికత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నాస్తిపరలోక ఇతి మతి రస్యేతి తస్యభావో నాస్తికతా. పరలోకము లేదనెడివాని భావము నాస్తికత, పరలోకములేదనెడుబుద్ది.
నింద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిందనం నిందా. నిందించుట, దూఱు, అపదూఱు, ఆక్షేపము, ఉపక్రోశము, విరుద్ధముగా చెప్పుట.
నింబతరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. నయత్వారోగ్యం నింబః. స చాసౌ తరుశ్చ నింబతరుః. ఆరోగ్యమును పొందించునది, వారిజేము (వృక్ష విశేషము).
నింబము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆరోగ్యం నయతీతి నింబః. ఆరోగ్యమును పొందించునది, వేప చెట్టు, వేము (వృక్ష విశేషము).
నికర్షణము
సం. నా. వా. అ. న. తత్స. నివృత్తం కర్షణ మత్ర నికర్షణం. దీనియందు దున్నుట లేదు, ఇల్లులోనగు వాని వెనుకటిభాగము, పట్టణము, చుట్టు వాఱిన బయలు, మైదానము.
నికష
సం. నా. వా. అ. పుం. తత్స. నికష్యతే స్వర్ణ మత్రేతి నికషః. బంగారం దీనియందు పీడింపబడును, సాన, ఓరుగల్లు, గీటురాయి, తిరుగలిరాయి.
నికషా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నికషతి హినస్తీతి నికషా. రాక్షసుల తల్లి, సమీపము.
నికషాత్మజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నికషతి హినస్త్రీ తినికషారాక్షసమాతా. తస్యాః ఆత్మజః నికషాత్మజః. నికష యను రాక్షస స్త్రీకి కొడుకు, నిరృతి.
నికామము
సం. నా. వా. విణ. అ. న. తత్స. యథేచ్ఛము.
నికాయము
సం. నా. వా. అ. పుం. తత్స. నిచీయతే నికాయః. లెస్సగా కూర్చబడునది, ఒకే విధమైననడవడికల వారియొక్క సముహము, ఇల్లు, తెగ, లక్ష్యము, ప్రోగు, పరమాత్మ, నిలయము.
నికాయ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. నిచీయతే ద్రవ్యమత్ర నికాయ్యః దీని యందు ద్రవ్యము కూర్చబడును, గృహము, ఇల్లు. నిచీయతే అస్మిన్ ధాన్యాదికమితి నికాయ్యః. నిలయము.
నికారణము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం క్రియతే నికారణం. వధము, కొల.
నికారము
సం. నా. వా. అ. పుం. తత్స. నికృష్టకరణం నికారః. నికృష్టమైన చేత, వంచన, ధాన్యము ప్రోగుచేయుట, దంతముతీయించుకొనుట వలన ఏర్పడిన ముఖము, నింద, దంతనిష్పీడనము వలన కలిగిన ముఖ వికారములోనగునది, విప్రకారము, అపకారము.
నికుంచకము
సం. నా. వా. అ. పుం. తత్స. నికుంచత్యల్పీభవతీతి నికుంచకః. కొంచెమైనది, సోల, రెండుశతమానములు.
నికుంజము
సం. నా. వా. అ. పుం. తత్స. కా వజనీతి కుఞ్జః నికుఞ్జశ్చ. భూమి యందు పుట్టినది, పొదరిల్లు. నితరాం కౌ పృథివ్యాం జాతమితి నికుంజం. కుంచము.
నికుంభము
సం. నా. వా. అ. పుం. తత్స. రసాధారత్వేన నిశ్చితః కుంభో నికుంభః. రసమునకు ఆధారమైన కుంభము, దంతి (వృక్ష విశేషం).
నికురుంబము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం కురతి శబ్దాయతే నికురంబం. మిక్కిలి రొదచేయునది, సమూహము, గుమి.
నికృతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నితరాం దుఃఖితః క్రియతేస్మ నికృతః మిక్కిలి పీడింపబడినవాడు కనుక నికృతుడు. నికృణోతి హినస్తి నికృతః. పీడించువాడు, దూఱబడినది, వంచింపబడినది, త్రోపుడు చేయబడినది, నిరీకృతము, వంచితము, నరకబడినది.
నికృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నికృష్టం కృణాతి హినస్తీతి నికృతిః. నీచముగా హింసించునది, బెదురుమాట, వంచన, తోపుడు.
నికృష్టము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నికృష్యతేస్మ ప్రతి కృష్యతే స్మ తిరస్కృత ఇతి నికృష్టః. తిరస్కరింపబడువాడు, అధమము, తుచ్ఛము, నీచుడు.
నికేతనము
సం. నా. వా. అ. న. తత్స. నికేతయంతి నివసంత్య స్మిన్నితి నికేతనం. దీనియందు నివసింతురు, గృహము, ఇల్లు.
నిక్వణము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం క్వణతీతి నిక్వణః. వీణలోనగువాని మ్రోత, వీణాది సకల వాద్యధ్వనులకు పేర్లు.
నిక్వాణము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం క్వణతీతి నిక్వాణః. వీణాది సకల వాద్యధ్వనులకు పేర్లు, వీణలోనగు వాని మ్రోత. వీణా ధ్వని.
నిఖిలము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నివృత్తం ఖిలాచ్ఛూన్యాధితి నిఖిలం. ఖిలమైన దానివలన బాసినది, సర్వము, ఎల్ల. నివృత్తం ఖిలం శేషో యస్మాదితి నిఖిలం. సమస్తము, సంపూర్ణము.
నిగదము
సం. నా. వా. అ. పుం. తత్స. నిగదనం నిగాదః. వ్యక్తముగా పలుకుట నిగాదము, స్పష్టముగా చెప్పుట.
నిగమము
సం. నా. వా. అ. పుం. తత్స. నియతంజనో గచ్ఛత్యత్ర నిగమః. నియతముగా దీనియందు జనులు చేరుదురు, పట్టణము. నియతం గమ్యత ఇతి నిగమః. నియతముగా పొందబడునది, బేహారి, వణిజుడు. నితరాం గచ్ఛంత్యత్ర నిగమః. వేదము, నిశ్చయము, వేగము, అంగడివాడు, మార్గము, వాణిజ్యవీథి.
నిగరణము
సం. నా. వా. అ. న. తత్స. ఉద్గరణ ముద్గారః గృ నిగరణే. మింగ్రుట, క్రక్కుట, క్రాయుట. సం. నా. వా. అ. పుం. తత్స. కంఠము.
నిగళము
సం. నా. వా. అ. పుం. తత్స. నిగళ్యతే మదేనేతి నిగళః. మదము చేత తడుపబడునది, ఏనుగుకాలి సంకెల, సంకెల. (రూ. నిగడము), ఏనుగు కాలిగొలుసు.
నిగాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నిగదనం నిగాదః. వ్యక్తముగా పలుకుట, నిగాదము, నిగదము యొక్క రూపాంతరము.
నిగాళము
సం. నా. వా. అ. పుం. తత్స. నిగళ త్యనేన కబళ మితి నిగాళః. దీనిచేత ఆహారమును మింగును, (గుఱ్ఱపు మెడ సమీపపు చోటు).
నిగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. నియమనాయ గ్రహణం నిగ్రహః. నియమించు కొఱకు గ్రహించుట నిగ్రహము, బెదురుమాట, చెఱ, మేర, త్రోపాట, హద్దు, బెదిరింపు.
నిఘము
సం. నా. వా. అ. పుం. తత్స. నియతం హన్యతే నిఘః. నియతముగా కొట్టబడునది, చదరపు వస్తువు, పోగారు (మణులు మొదలగు వానిని రంధ్రము చేయుసాధనము).
నిఘసము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరా మదనం నిఘసః. మిక్కిలి భక్షించుట నిఘసము, భోజనము, కుడుపు, తినుట.
నిఘ్నడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిహన్యతే ప్రతికూల మాచరన్ పీడ్యతే ప్రభుణేతి నిఘ్నః. ప్రతికూల కార్యము చేసినప్పుడు ప్రభువు చేత పీడింపబడువాడు, లోకువైనవాడు, అధీనుడు. నిహన్యతే నిగృహ్యతే ఇతి నిఘ్నః.
నిచులము
సం. నా. వా. అ. పుం. తత్స. నిచోల్యతే అంబునా నిచులః. జలము చేత నిందింపబడునది, ఎఱ్ఱగన్నేరు, కప్పుడుదుప్పటి. నిచోలతి సముచ్ఛ్రయతీతి నిచులః.
నిచోళము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం చుల్యతే ఆచ్ఛాద్యతే శయ్యాదికం నిచోళః. దీనిచేత పఱుపు మొదలైనవి కప్పబడును, గవుసెన, కప్పుడుదుప్పటి, అంకుడుచెట్టు, పుస్తకములు మొదలగువానికి చుట్టుగుడ్డలేక కాగితము, రవికె.
నిజము
సం. నా. వా. అ. న. తత్స. నియతం జాయత ఇతి నిజం. నియతముగా అగునది, స్వభావము. సం. విణ. తత్స. తనది, శాశ్వత మైనది, చెలికాడు, సహజమైనది, సొంతము, ఎడతెగకుండుట.
నితంబము
సం. నా. వా. అ. పుం. తత్స. పర్వతస్య నితంబ ప్రాయత్వాన్నితంబః. పర్వతమునకు నడుమువంటిది నితంబము, కొండనడుము, మూపు. సురత సమ్మర్దేన నితరాం తామ్యతి నితంబః. స్త్రీల మొలకు వెనుకనున్న ప్రదేశము, పిఱుదు, మొల. నిభృతం తమ్యతే ఆకాంక్ష్యతే పర్వతీయైః కాముకైరితి వా నితంబః. స్కంధము, దరి, కొండచరియ.
నితంబిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పృథుర్నితంబః కటిపశ్చాద్భాగః సోస్యా అస్తీతి నితంబినీ. గొప్పపిఱుదులుకలది, ఆడుది. అతిశయితో నితంబో అస్త్యస్యా ఇతి నితంబినీ.
నితాంతము
సం. నా. వా. క్రి. విణ. అ. న. తత్స. నితరాం తామ్యతీతి నితాంతం. మిక్కిలి కాంక్షించునట్టిది, పెల్లు, అధికము, తీవ్రము.
నిత్యము
సం. నా. వా. క్రి. విణ. అ. న. తత్స. నియతం భవతీతి నిత్యం. నియతమైనది, ఎల్లప్పుడు, ఎడతెగనిది. నియమేన భవం నిత్యం. సతతము, సంతతము, ప్రసక్తము, ఆసక్తము. సం. విణ. తత్స. నియతం భవతీతి నిత్యః. నియతమై ఉండునది, ఎడతెగనిది, శాశ్వతమైనది, అవిచ్ఛిన్నమైనది, ఎల్లపుడు.
నిదాఘము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం దహ్యతే జనోత్ర నిదాఘః దీనియందు జనము మిక్కిలి దహింపబడును, వేడిమి, వేసంగి. నితరాం దహతీతి నిదాఘః. మిక్కిలి పీడించునది, చెమట, వేసవికాలము, ఉష్ణము.
నిదిగ్ధము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిదిహ్యత ఇతి నిదిగ్ధం. వర్ధిల్లింప చేయబడినది కనుక నిదిగ్గము, పెంపబడినది, లేపనము చేయబడినది.
నిదిగ్ధిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిదిహ్యతే అంగోపాంగై రుపచీయతే నిదిగ్ధికా. అవయవములచే వృద్ధిపొందునది, వాకుడు (వృక్ష విశేషము), చిరువంగ.
నిదేశము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్దిశ్యతే ఆదిశ్యతే నిర్ధేశః. ఉపదేశింపబడునది, పసుపు, చెప్పుట, దాపు, ఆజ్ఞ, చెప్పుట.
నిద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నియతం ద్రాన్తి ఇంద్రియాణ్వత్రీతి నిద్రా. దీనియందు ఇంద్రియములు నియతముగా ఉపరతములౌను, నిదుర, కునుకు.
నిద్రాణుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిద్రాతీతి నిద్రాణః. నిద్రించువాడు, నిదురపోతు, సోమరి.
నిద్రాళువు
సం. విణ. ఉ. తత్స. నిద్రాతి తాచ్ఛీల్యేనేతి నిద్రాళుః. నిద్రపోవు స్వభావము కలవాడు, నిదురపోతు, నిద్రభంగి, సోమరి.
నిధనము
సం. నా. వా. అ. న. పుం తత్స. నియతం ధనమత్రేతి, నిర్గతం ధనమస్మాధితి చనిధనం. నియతముగా దీనియందు ధనము నివృత్తో అర్థ సంబంధో అత్ర నిధనః. ధనసంభంధము దీనియందు నివృత్తమౌను, చావు, చేటు, మరణము.
నిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. నితరాం ధీయతే అస్మిన్నితి నిధిః. మిక్కిలి రక్షింపబడునది, (నవ నిధులు-పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము). నిధీయతే అత్రేతి నిధిః. సముద్రము, ఆధారము, పాతర.
నిధువనము
సం. నా. వా. అ. న. తత్స. నిధూయంతే అఙ్గౌన్యత్రీతి నిధువనం. దీనియందు అంగములు కదులును, కలయిక, వడకు. నితరాం ధువనం హస్తపాదాదికంపనం యత్ర నిధువనః. మైథునము, సురతము, మైధునమున కూర్చిన ఆక్రోశము.
నిధ్యానము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం ధ్యానం నిద్యానం. దృష్టి దర్శనం, దర్శనము, చూపు.
నినదము
సం. నా. వా. అ. పుం. తత్స. నినదతీతి నినాదః. మ్రోయునది నినాదము, ధ్వని, మ్రోత.
నినాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నినదతీతి నినాదః. నినదము యొక్క రూపాంతరము.
నిపఠము
సం. నా. వా. అ. పుం. తత్స. నిపఠనం నిపఠః. పాఠము, చదువు.
నిపము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం పిబన్త్య నేనేతి నిపః. దీనిచేత మిక్కిలి పానముసేయుదురు, కుండ, కలశము. నిపతం పిబత్యనేనేతి నిపః. నీటికుండ.
నిపాఠము
సం. నా. వా. అ. పుం. తత్స. నిపఠనం నిపాఠః. నిపఠము యొక్క రూపాంతరము, చదువుట నిపాఠము.
నిపాతనము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం యాతనం నియాతనం. దిగద్రొబ్బుట, మిక్కిలి, తిరస్కరించుట. (నియాతనము), మరణము.
నిపానము
సం. నా. వా. అ. న. తత్స. నియతం పిబంతి జలం పశవోత్ర నిపానం. నియతముగా పశువులు దీనియందు పానము చేయును, పసులులో నగునవి. నీళ్లు త్రాగుటకై నూతివద్ద ఱాయిలోనగు వానితో ఏర్పరిచినతొట్టి. నిపీయతే అస్మిన్నితి నిపానం.
నిపుణుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నితరాం పుణతి శుభకర్మ కరోతీతి నిపుణః. మిక్కిలి శుభకర్మమునుచేయువాడు, నేర్పరి, కుశలుడు.
నిబంధనము
సం. నా. వా. అ. న. తత్స. నిబధ్యంతే తంత్ర్యోత్ర నిబంధనం. దీనియందు దంతులు కట్టబడును, ఏర్పాటు, బంధము, ఉపవాహము (చూ). హేతువు.
నిబంధము
సం. నా. వా. అ. న. తత్స. ఆనహ్యతే నిబధ్యతే నిబంధః. మలమూత్ర నిర్బంధము, బంధము, వర్షాశనము, మలమూత్ర బంధము మొదలైనది.
నిబర్హణము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం బర్హణం నిబర్హణం. వధము, చంపుట.
నిభము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం భాతీతి నిభః. మిక్కిలి ప్రకాశించునది, నెపము. సం. విణ. తత్స. సమానము.
నిభృతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నితరాం భ్రియత ఇతి నిభృతః. మిక్కిలి పోషింపబడినవాడు, తీర్పబడినది.
నిమయము
సం. నా. వా. అ. పుం. తత్స. నిమయనం నిమయః. ఒక వస్తువును పుచ్చుకొని మఱియొక వస్తువు నిచ్చుట, (వస్తువుల) మాఱుపు.
నిమిత్తము
సం. నా. వా. అ. న. తత్స. నిమేద్యత ఇతి నిమిత్తం. కూడుకొనిఉండునది, కారణణము, శకునము, గుఱి, గుఱుతు, లక్ష్యము, హేతువు.
నిమేషము
సం. నా. వా. అ. పుం. తత్స. అష్టాదశ నిమేషాః. పదునెనిమిది ఱెప్పపాట్లు కాలము, నిమిషము యొక్క రూపాంతరము.
నిమ్నగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిమ్నం గచ్ఛతీతి నిమ్నగా. పల్లమును గూర్చి పోవునది, ఏఱు, నది.
నిమ్నము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ఖననాయ నితరాం మ్నాయతే అభ్యస్యత ఇతి నిమ్నం. త్రవ్వుటకు మిక్కిలి అభ్యసింపబడునది, లోతు, గభిరము. నికృష్టా గ్నా అభ్యాసః శీలమత్ర ఇతి నిమ్నం. నీచము, గంభీరము.
నియంత
సం. నా. వా. ఋ. పుం విణ. తత్స. నియచ్ఛత్యశ్వానితి నియంతాః. అశ్వములను నియమించువాడుకనుక నియంత, తేరునడువువాడు, నడపువాడు, శాసించువాడు, సారథి.
నియతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నియముకలది, నిత్యమయినది, వట్టివేరు, నూరువేలు, ప్రయుతము.
నియతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నియమ్యతే అవయేతినియతః. దీని చేతనియమింపబడును, నియమము, భాగ్యము. నియమ్యతే ఆత్మా అనయేతి నియతిః. దైవము, భాగ్యము, ప్రతిజ్ఞ, పద్ధతి.
నియమము
సం. నా. వా. అ. పుం. తత్స. నియమ్యత ఇతి నియమః. శాస్త్రము చేత నియమింపబడునది. నియమ్యతే పురుషోనేనతి నియమః. పురుషుడు దీనిచేత నియమింపబడును, ఏర్పాటు, కట్టు, పసుపు, ప్రతిజ్ఞ, శరీరము కంటె భిన్నములైన మృజ్జలాదులు సాధనముగా కలిగి నిత్యముగా ఆచరింపతగిన ఒక యోగాంగము. (ఇది దశ విధము, తపము, సంతోషము, అస్తికత్వము, దానము, భగవదర్చన, వేదాంత శ్రవణము, లజ్జ, మతి, జపము, వ్రతము, చూ. అంగము). అంగీకారము, వాగ్దానము, నిచ్ఛయము.
నియామకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నియచ్ఛంతి పోతం నియామకాః. ఉపరమేకలమును నియమించువారు, ఆరకాటి (చూ), తండేలు (చూ). చుక్కాని పట్టువాడు. సం. విణ. తత్స. నియమించువాడు.
నియుద్ధము
సం. నా. వా. అ. న. తత్స. శస్త్రాదిక మనాదేయ మితి నియతం యుద్ధం నియుద్ధం. శస్త్రాదులు పట్టకూడదు అను నియమముకల యుద్ధము, బాహు యుద్ధము.
నియోజ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నియోక్తుం శక్యో నియోజ్యః. నియోగింప శక్యమైనవాడు, పనివాడు, భృత్యుడు, సేవకుడు.
నిరంతరము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిర్గత మన్తరమస్యేతి నిరంతరం. ఎడలేనిది, దట్టము, ఎడతేగనిది, అవిచ్ఛిన్నము, ముదుకైనది.
నిరయము
సం. నా. వా. అ. పుం. తత్స. అస్మాదితి నిరయః. దీని వలన. నిర్గతమౌను, దుర్గతి, నరకము. నికృష్టః అయో గమనం యత్ర ఇతి నిరయః.
నిరర్గళము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిష్క్రాంత మర్గళాదితి నిరర్గళం. అడ్డుపాటు వలన బాసినది, అడ్డము లేనిది.
నిరర్ధకము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిష్క్రాన్తః అర్థః ప్రయోజన మస్మాదితి నిరర్ధకం. ప్రయోజనము లేనిది.
నిరవగ్రహుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిష్క్రాంతః అవగ్రహాదితి నిరవగ్రహః. అడ్డుబాటు వలన పాఱినవాడు, అడ్డుపాటులేనివాడు, స్వతంత్రుడు. నిర్గతో అవగ్రహః ప్రతిబంధో యస్మాదితి నిరవగ్రహః. మహాదేవుడు, అనిరుద్దము, స్వతంత్రము.
నిరసనము
సం. నా. వా. అ. న. తత్స. నితరా మసనం నిరసనం. మిక్కిలి ద్రొబ్బుట నిరసనము, తిరస్కారము, ఆక్షేపము, వధము, ఉమియుట. నిరస్యతే క్షిప్యతే ఇతి నిరసనం.
నిరస్తము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిరస్యతే త్వరయా నిరస్తం. త్వరగా చెప్పినమాట, త్వరితముగా చెప్పబడినది. నిరస్యతే స్మ నిరస్తః. ప్రయోగింపబడినది (బాణము), నిరసింపబడినవాడు, తిరస్కరింపబడినది, వెడలక్రక్కపడినది, న్యాయముచే త్రోయబడినది, ప్రతిహతము, తిరస్కృతుడు.
నిరాకరిష్ణువు
సం. విణ. ఉ. తత్స. నిరాకరోతి తాచ్ఛీల్యేనేతి నిరాకరిష్ణుః. స్వభావముననే తిరస్కరించువాడు.
నిరాకృతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిరాక్రియతే స్మ నిరాకృతః. నిరాకరిపంబడినవాడు, న్యాయముచే త్రోయబడినది, నిరస్తము, వేదమును చదవనివాడు.
నిరాకృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. విణ. తత్స. నిరాక్రియత ఇతి నిరాకృతిః. వేదశూన్యుడని నిరాకరింపబడువాడు, వేదము చదువనివాడు. నికృష్టం ఆసమంతాత్కరణం నిరాకృతః. నికృష్టముగా అంతట చేయుట, రూపము లేనివాడు, తిరస్కారము, అస్త్రాధ్యాయము.
నిరామయము
సం. నా. వా. అ. పుం. విణ. తత్స. నిర్గతః ఆమయాదితి నిరామయః. వ్యాధి వలన భాసినవాడు, రోగము లేనిది. నిర్గత ఆమయో వ్యాధిర్యస్మాదితి నిరామయః. చిన్నది, రోగమునుండి కోలుకొన్నవాడు.
నిరృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. పుం. తత్స. ఋతా స్సన్మార్గాన్నిష్క్రాంతా నిరృతిః. సన్మార్గము వలన బాసినది, దిక్పాల విశేషము, నరకసంబంధమైన అభాగ్యము వేళ్లు. నిర్నియతా ఋతిర్ఘృణా అశుభం వా యత్ర ఇతి నిరృతిః. రాక్షసము. సం. విణ. తత్స. ఉపద్రవము లేనిది. సం. నా. వా. ఇ. స్త్రీ. పెద్దమ్మ, దారిద్ర్యము.
నిర్గుండి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గుడాత్పరి వేష్టనాన్నిష్క్రాంతా నిర్గుండీః వావిలి చెట్టు. గుడా ద్వేష్టానా న్నిష్క్రాంతా నిర్గుండీ. నల్లనిపువ్వులు కలది, నల్లవాలివి వేళ్లు. సిందు వార వృక్షము, కొండగోగు.
నిర్గ్రంధనము
సం. నా. వా. అ. న. తత్స. నిర్గ్రంధ్యతే నిర్గ్రంధనం. వధము, చంపుట.
నిర్ఘరము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్ఘీర్యతే కాలేన స్వల్పో భవతీతి నిర్ఘరః. కాలక్రమము చేత స్వల్పమైపోవునది, సెలఏఱు, ఝరము. నిర్ఝృణాతి జీర్ణీభవతి ఉచ్చస్థానపతనాదితి నిర్ఝరః.
నిర్ఘరిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నిర్ఝర ఉత్పత్తికారణత్వనాస్త్యస్యా ఇతి నిర్ఝరిణీ. నది, సెలఏరు, సరిత్తు.
నిర్ఘోషము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్ఘోషతీతి నిర్ఘోషః. మ్రోత, ధ్వని.
నిర్జర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తిప్పతీగ, ముర (వృక్ష విశేషం).
నిర్ణయము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం మతేరంతం నయతీతి నిర్ణయః. మిక్కిలి బుద్దిని ఒకదరిని పొందించునది, ఏర్పాటు, నిశ్చయము.
నిర్ణిక్తము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిర్ణిజ్యతేస్మ నిర్ణిక్తం. కల్మషము లేకుండ శోధింపబడిన వస్తువు, కడుగుటలోనగు వానిచేత గరగరికైనది, మృష్టము, పరిశుద్ధముచేయ బడినది.
నిర్ణేజకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నేనేక్తి క్షాళయతి వస్త్రాణీతి నిర్ణేజకః. కోకలను ఉతుకువాడు, చాకలివాడు, రజకుడు. నిర్నేనోక్తి నిర్మలీకరోతి వస్త్రమితి నిర్ణేజకః.
నిర్దేశము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్దిశ్యతె ఆదిశ్యతేనిర్దేశః. ఉపదేశింపబడునది, ఆజ్ఞ, చెప్పుట, సమీపము.
నిర్ధార్యము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిర్థార్యతే జనేభ్యః పృధగ్వ్యపదిశ్యతే ఆధిక్యేనేతి నిర్థార్యః. ఆధిక్యముచేత జనులవలనఏర్పఱుబడువాడు, నిర్థారణీయము.
నిర్భరము
సం. నా. క్రి. విణ. అ. న. తత్స. నిశ్శేషో భరో యస్మిన్ తన్నిర్భరం. ఇందు సమస్తమైన భరము నిశ్శేషమైఉండును, పెల్లు, అధికము, హెచ్చు.
నిర్మదము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్గతో మదాత్ నిర్మదః. మదము వలన బాసినది, మదము ఉడిగినఏనుగు.
నిర్ముక్తము
సం. నా. వా. అ. పుం. తత్స. కంచుకేన ముక్తః నిర్ముక్తః. కుబుసముచే విడువబడినది, కుబుసము విడిచినపాము, పొర విడి చినపాము.
నిర్మోకము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్ముచ్యత ఇతి నిర్మోకః. విడువబడినది, పాముకుబుసము, కుబుసము, విడుపు, ఆకాశము, మోచనము, పాము పొర.
నిర్యాణము
సం. నా. వా. అ. న. తత్స. నిర్యాతి నేత్రజల మస్మాదితి నిర్యాణం. కన్నీళ్లు దీనివలన జాఱును, ఏనుగు కడకన్ను ముక్తి, చావు, వెడలబాటు. నిర్యాతి నిర్గచ్ఛతి మదో అనేనేతి నిర్యాణం. మోక్షము, పోవుట, మరణము.
నిర్యాతనము
సం. నా. వా. అ. న. తత్స. నిశ్శేషేణ యాతనం నిర్యాతనం. పగతీర్చుట, చంపుట, అప్పులోనగువానితీర్చుట, దాచబెట్టిన సొమ్ము మరల అప్పగించుట, ఈవి, ప్రతిఫలము.
నిర్యూహము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్యాం త్యస్మాత్, నిర్యాతీతి చ నిర్యూవః. సిగబంతి, నాగవాసము, గృహదారు విశేషము, మ్రానిబంక, వాకిలి, ముంజూరు, కషాయము, శిరోభూషణము.
నిర్వపణము
సం. నా. వా. అ. న. తత్స. నిర్యాప్యతే నిర్వపణం. దీనిచేత పాపము వర్జింపబడును, దానము, ఈవి, బహుమానము, దానము.
నిర్వర్ణనము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం వర్ణనం నిర్వర్ణవం. చూపు, ఆలోకనము, నిధ్యానము, దర్శనము, వీక్షణము.
నిర్వహణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రస్తుత కథాయా నిర్వహః పరిసమాప్తిః నిర్వహణం. ప్రస్తుత కథ యొక్క సమాప్తి నిర్వహణము, ప్రస్తు కథా సంహారరూపమైన ఒక నాటక సంధి, నిష్ఠ, నాటక సంధులలో చివరిది.
నిర్వాణము
సం. నా. వా. అ. న. తత్స. నిర్వాంతి నిర్గచ్ఛంతి దుఃఖాదయోస్మిన్నితి నిర్వాణం. దుఃఖాదులు దీనియందు నిర్గతమవును, ముక్తి, సుఖము, ఏనుగు నీళ్లలో మునుగుట. నిర్వాతి శామ్యతి స్మ నిర్వాణః. ఆదిశబ్దము చేత మగ్నమైన గజాదులకును, శాంతుడైన మునికిని, అగ్ని మొదలైన దానికిని పేర్లు, నిర్వృత్తి, సంగమము, విశ్రాంతి, సౌఖ్యము, నాశము, గజస్నానము.
నిర్వాతము
సం. నా. వా. విణ. అ. పుం. తత్స. నిర్వాతిస్మ నిర్వాతః. సంచారముడిగినది, గాలి లేనిది, చలింపనిగాలి.
నిర్వాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నిష్క్రాంతో వాదాదితి నిర్వాదః. వాదము వలన నిష్క్రాంతమైనది, వాదములేమి. నికృష్టో వాదో, నిశ్చితోదాదో, వాదా భావశ్చ నిర్వాదః. అపవాదము, నిశ్చితవాదము. నిర్వదనమితి నిర్వాదః. పరీవాదము, నింద.
నిర్వాపణము
సం. నా. వా. అ. న. తత్స. నిర్వాపత్యతే నిర్వాపణం. కొల, ఈవి, వధ, దానము.
నిర్వారిన్
సం. నా. వా. అ. పుం. తత్స.
నిర్వాసనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రవాసనశబ్దవ న్నిర్వాసనశబ్దః. చంపుట, వెళ్లగొట్టుట, వధ.
నిర్వృత్తము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిర్వర్త్యతే స్మ నిర్వృత్తం. ఆయత్త పఱచబడినది, ముగిసినది, నెఱవేఱినది.
నిర్వేశము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్విశ్యతే భుజ్యత ఇతి నిర్వేశః. భుజింపబడునది, కూలి, మూర్చపోవుట. నిర్వేశనం నిర్వేశః. భోగించుట, భోగము. నిర్విశ్యత ఇతి నిర్వేశః జీతము, భృతి.
నిర్వ్యధనము
సం. నా. వా. అ. న. తత్స. నిశ్చయేన వ్యథనం భయమత్ర నిర్వ్యథనం. దీని యందు నిశ్చయముగా భయము కలదు, రంధ్రము, బెజ్జము, ఛిద్రము.
నిర్హానము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం హ్రాదతే నిర్హ్రాదః. మ్రోతః ధ్వని.
నిర్హారము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం హరణం నిర్హారః. మిక్కిలి తీయుట, నాటిన ములిగిలోనగువానిఊడపెఱుకుట, పైరునకు విఘాతమైన గాదము మొదలైన వాని పెఱకుట.
నిలయము
సం. నా. వా. అ. పుం. తత్స. నిలీయనై ఆలియంతే జనోత్ర నిలయః. దీనియందు జనులు అణగియుందురు, గృహము, ఇల్లు.
నివసనము
సం. నా. వా. అ. న. తత్స. న్యుష్యతే అత్ర నిలయం. నిలయము, ఇల్లు, గృహము, వస్త్రము.
నివహము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం వహతి ప్రాపయతి స్వసంబంధినా మేకత్వమితి నివహః. తన సంబంధమైన వస్తువులను మిక్కిలి ఏకత్వమును పొందించునది, సమూహము, గుంపు, సప్తగాలులలో ఒకటి.
నివాతము
సం. నా. వా. అ. పుం. ప్రాపు. విణ. తత్స. నివాయతే గమ్యతే, నివృత్తో వాతోత్రేతి చ నివాతః. పొందబడునది కనుకను గాలిదూఱనిదికనుకను నివాతము, బాణములచే భేదియరానిది (కవచము), గాలిలేనిది (చోటు), దృఢముగా కవచము ధరించుట ఆశ్రయము.
నివాపము
సం. నా. వా. అ. పుం. తత్స. నివాప్యతే నివాపః. పితృదేవతలను గూర్చి చేయబడునది, పితాళ్లనుద్దేశించి నువ్వులు నీళ్లువిడుచుటలోనుగాకల కర్మము. నితరాముచ్యతే ఇతి నివాపః. పితృతర్పణము, క్షేత్రము.
నివీతము
సం. నా. వా. అ. న. తత్స. నియతం వీయతేస్మ నివీతం. నియతముగా కప్పబడునది, మెడను దండవలె వ్రేలెడు జన్నిదము, కప్పుకొను వస్త్రము, ముఖావరణము.
నివృతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నితరాం ప్రియతే స్మ నివృతం. మిక్కిలి ఆవరింపబడినది, నలుప్రక్కల చుట్టబడినది పరిక్షిప్తము. నివ్రియతే ఆచ్ఛాద్యతే స్మేతి నివృతం, త్రవ్వబడినది.
నివేశము
సం. నా. వా. అ. పుం. తత్స. నివిశ్యత ఇతి నివేశః. దీనియందు నిద్రింతురు, ఇల్లు, చొరివ, ఎత్తన దండు విడిసినపాళెము, పెండ్లి, ఇల్లడ, శిబిరము, ఉద్వాహము, ఏర్పాడు, శిబిరము, వివాహము.
నిశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నితరాం శ్యతి సర్వ వ్యాపారాన్ నిశా. అన్ని వ్యాపారములను మిక్కిలి స్వల్పముగా చేయునది, రేయి, పసుపు, మ్రాని పసుపు. నితరాం శ్యతి తనూ కరోతి వ్యాపారానితి నిశా. రాత్రి, చీకటి.
నిశాంతము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం శామ్యత దుఃఖమత్రేతి నిశాంతం. దీనియందు దుఃఖము మిక్కిలి శమిచుంను, ఇల్లు, వేకువ. నిశమ్యతే విశ్రమ్యతే అస్మిన్నితి నిశాంతం. గృహము.
నిశాఖ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిశాయాః ఆఖ్యా యస్యాస్సా నిశాఖ్యా. రాత్రికి ఏ పేర్లు కలవో ఆ పేర్లు దీనికి కూడా కలవు కనుక నిశాఖ్య అని పిలువబడుతుంది, పసుపు, హరిద్ర.
నిశాటుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నిశాయామటతీతి నిశాటనః. రాత్రియందు తిరుగునది, రాక్షసుడు, రేద్రిమ్మరి.
నిశాపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. నిశాయాః పతిః నిశాపతిః. రాతిరికి ఱేడు, చంద్రుడు, రేఱేడు, కర్పూరము.
నిశారణము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం శీర్యతే నిశారణం. మారణము, చంపుట, రాత్రియుద్ధము.
నిశితము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిశాయతేస్మ నిశితం. అరుగతీయబడినది కనుక నిశితము, మిక్కిలి వాడిచేయబడినది, సాన బెట్టబడినది, వాడి అయినది.
నిశీధిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నిశీథః అస్యామస్తీతి నిశీధీనీ. నిశీథమనగా నడిరేయి, అది దీనియందు కలదు, రేయి, రాత్రి, నిశ.
నిశేథము
సం. నా. వా. అ. పుం. తత్స. నియతం శేరతే అస్మిన్నితి నిశీథః. దీనియందు నియతముగా నిద్రింతురు, నడిరేయి, రేయి, అర్థరాత్రి.
నిశ్చయము
సం. నా. వా. అ. పుం. తత్స. నిశ్చినోతీతి నిశ్చయః. బుద్ధిని చెదరకుండునట్లు కూర్చునది, నిర్ణయము, సందేహము లేనటువంటి జ్ఞానము.
నిశ్రేణి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నిశ్చయేన శ్రయంతి ఉన్నతస్థలమనయేత నిశ్శ్రేణిః. దీనిచేత ఉన్నతస్థలమును నిశ్చయముగా పొందుదురు, నిచ్చెన, ఈత చెట్టు. నిర్నిశ్చితా శ్రేణిః సోపానపంక్తిః యత్ర ఇతి నిఃశ్రేణిః. ఖర్జూరపుచెట్టు.
నిశ్రేణి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నిశ్చయేన శ్రయంతి ఉన్నతస్థలమనయేతి నిశ్శ్రేణిః. దీనిచేత ఉన్నతస్థలమును నిశ్చయముగా పొందుదురు, నిచ్చెన, ఈత చెట్టు.
నిశ్రేయసము
సం. నా. వా. అ. న. పుం. తత్స. నిశ్చిత మవిచలితం శ్రేయో నిశ్శ్రేయసం. నిశ్చితమైన శ్రేయస్సు, ముక్తి, మేలు, మోక్షము, శుభము, అనుభావము, భక్తి, విద్య, శుభము.
నిశ్శలాకము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిర్గతాశ్శలా కాశ్శారికా అస్మిన్నితి నిశ్శలాకః. శలాకములనగా గొరవంకలు, ఏకాంతము (చోటు), జనులు లేని చోటు, నిర్జనము.
నిశ్శేషము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. శేషాన్నిర్గతమితి నిశ్శేషం. శేషమైన దానివలన బాసినది, సర్వము, అంతయు, సమస్తము, సంపూర్ణము.
నిశ్శోధ్యము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిర్గతం శోధ్యాత్పరిత్యాజ్యాంశాదితి నిశ్శోధ్యం. పరిత్యజంపతగిన అంశము వలన బాసినది, కడుగుటలోనగు వానిచేత గరగరికైనది, శోధితము, పరిశుభ్రము.
నిషంగము
సం. నా. వా. అ. పుం. తత్స. సజ్జంతే శరా అత్రఉపాసంగః నిషం. అమ్ములపొది, మిక్కిలి సంగము, బాణములు దీనియందు కూర్పబడును. నితరాం సంజంతి శరా యత్ర ఇతి నిషంగః. తూణీరము, కలయిక.
నిషంగి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. నిషంగో స్యాస్తీతి నిషంగీ. అమ్ములపొది కలవాడు, విలుకాడు.
నిషద్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిషీదంతి వణిజో స్వామితి నిషద్యా. దీనియందు వర్తకులుందురు, అంగడి, కూర్చుండుట.
నిషద్వర
సం. నా. వా. ఆ. స్త్రీ. అ. పుం. తత్స. నిషీదంతి వరాహాదయో త్రేతి నిషద్వరః. వరాహాదులు దీని యందుండును, రేయి, అడుసు. నిషీదంతి విషణ్ణా భవంతి జనా అత్రేతి నిషద్వరః. బురద, మన్మధుడు.
నిషధము
సం. నా. వా. అ. పుం. తత్స. నిషీదంత సురా అత్రేతి నిషధః. సురలు దీనియందుందురు, ఒకానొక కొండ, ఒకానొక దేశము, ఒక రాజు.
నిషాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నిషీదంతి స్వరా అస్మిన్నితి నిషాదః. కడపటి స్వరమగుట వల్ల దీనియందు స్వరములన్నియు చేరి యుండును, ఒక స్వరము. నిషీదతి పాప మస్మిన్నితి నిషాదః. దీనియందు పాపము ఉండును, నిషదము (రూ). నిషద్యతే గ్రామసీమాయాం ఇతి నిషాదః. సంకరజాతి, అంభష్ఠుడు, వేటగాడు, సస్యరక్షకుడు, జాలరి.
నిషాది
సం. నా. వా. న్. పుం. తత్స. హస్తిషు నిషాదంతీతి నిషాదినః. ఏనుగు ఎక్కువారు, మావటివాడు. నిషీదత్యవశ్యం హస్త్యుపరీతి నిషాదీ.
నిషూదనము
సం. నా. వా. అ. న. తత్స. నిఘాద్యతే నిషూదనం. వధము, చంపుట.
నిష్కము
సం. నా. వా. అ. పుం, న. తత్స. నితరాం కాయతే స్తూయత ఇతి నిష్కః. మాడ, టంకము, నూటఎనిమిదిమాడలు, పతకము, పలము, బంగారు, వెండి. నిశ్చయేన కాయతి శోభతే ఇతి నిష్కః. హేమము, సువర్ణము, మెడయందు ధరించునది, వక్షమునందు అలంకరించుకోతగినది, కంఠభూషము.
నిష్కళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిర్గతం కళం శుక్రమస్యా ఇతి నిష్కళా. శుక్రము వలన బాసినది, ముట్లుడిగిన ఆడుది, వృద్ధురాలు, మాచకమ్మ. సం. విణ. తత్స. కళలేనిది, వీర్యములేనిది.
నిష్కాసితము
సం. విణ. (అ. ఆ. అ) తత్స. నిష్కాస్యత ఇతి నిష్కాసితః. వెళ్లగొట్టపడినవాడు, ఉనుపబడినది, వెడలింపబడినది.
నిష్కుటము
సం. నా. వా. అ. పుం. తత్స. కూటాత్ గృహాత్ నిర్గతః నిష్కుటః. ఇంటి చేరువనున్నతోట, తొఱ్ఱ (రూ. నిష్కూటము). అంతపురము, ఇంటితోట, తలుపు, మడి, కోటరము, వృక్షఖాతము, క్షేత్రము, ప్రమదవనము, కపాటము.
నిష్కుటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నిష్క్రాంతా కుటేః కోశా న్నిఘ్కటిః. మొగ్గలను బాసిఉండునది, పెద్ద ఏలకులు.
నిష్కుహము
సం. నా. వా. అ. పుం. తత్స. నిష్కాయతే విస్యాపయతీతి నిష్కుహః. విస్మయమును, పొందించునది, మ్రాని తొఱ్ఱ, తొఱ్ఱ. (రూ. నిష్కూహము).
నిష్క్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. నిష్క్రమ్యతే బహిష్క్రియతే అజ్ఞాన మనేనేతి నిష్క్రమః. దీనిచేత అజ్ఞానము పోగొట్టబడును, చెడుకులము, బుద్ది సంపత్తి, (శ్రుశ్రూష, శ్రవణము, గ్రహణము, ధారణము, ఊహ, అపోహము, అర్థవిజ్ఞానము, తత్వవిజ్ఞానము, అను ఎనిమిది. బుద్ధిబలము, వెడలిపోవుట.
నిష్ఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నియతం స్థానం నిష్ఠా. ప్రస్తుత కథ యొక్క సమాప్తి నిర్వహణము, తుది, ముగియిక, ప్రసుత కథా సంహారరూపమయిన ఒకనాటక సంధి (చూ. సంధి). నియతా స్థితిర్నిష్ఠా. నియతమైన స్థితి, ఉనికి, చేటు, వేడికోలు. నితరాం స్థితిః నిష్ఠా. క్లేశము, అవసానము, అంతము, వ్యవస్థ, ఉత్కర్షము, వ్రతము, నిష్పత్తి, సమాప్తి, నాశము, నిర్వహణము, ప్రాప్యము, స్థితి, నాటకాంతము, ఏర్పాటు, ప్రతిజ్ఞ.
నిష్ఠానము
సం. నా. వా. అ. న. తత్స. ఆష్ఠంత్యస్మిన్ రసా ఇతి నిష్ఠానం. దీనియందు రసములుండును, మజ్జిగపులుసు, తిమ్మనము, ఉమ్మినీరు.
నిష్ఠీవనము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం ష్ఠేవః నిష్ఠేవః. మిక్కిలి శ్లేష్మాదుల నిరసించుట కనుక నిష్ఠేవము, ఉమ్ముట.
నిష్ఠురము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. నిశితమివ తిష్ఠతీతి నిష్ఠురం. తీక్ష్ణమై ఉండు, కఠినము. నితరాం తిష్ఠతీతి నిష్ఠురం. మిక్కిలి ఉండునది, పరుషమైనది. (మాట), పరుషము, కఠినము, పంచలోహము, కాఠిన్యము.
నిష్ఠేవనము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం ష్ఠేవః నిష్ఠేవనః. మిక్కిలి శ్లేఫ్మాదులను నిరసించును, ఉమ్మివేయుట.
నిష్ఠేవము
సం. నా. వా. ఆ. స్త్రీ. అ. పుం. తత్స. నితరాం ష్ఠేవః నిష్ఠేవః. మిక్కిలి శ్లేష్మాదుల నిరసించుట గనుక నిష్ఠేవము, ఉమ్మినీరు.
నిష్ఠ్యూతము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నిష్ఠీవ్యతేస్మ నిష్ఠ్యూతః. నిరసింపబడునది, ఉమ్మివేయపడినది, త్రోయబడినది.
నిష్ఠ్యూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నితరాం ష్ఠేవః నిష్ఠ్యూతిః. మిక్కిలి శ్లేష్మాదుల నిరసించుట, ఉమ్ముట, నిష్ఠీవనము.
నిష్ణాతుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నితరాం స్నాతో నిష్ణాతః. ఏ ప్రయోజనమందును మిక్కిలి ప్రవేశము కలవాడు, నేర్పరి. నితరాం స్నాతి స్మేతి నిష్ణాతః. నిపుణుడు, పారంగతుడు, విజ్ఞుడు.
నిష్పక్వము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నితరాం పచ్యత ఇతి నిష్పక్వం. మిక్కిలి కాచబడినది కనుక నిష్పక్వము, చక్కగా కాగినది, క్వథితము.
నిష్పతినుత
సం. నా. వా. అ. న. తత్స. భర్త, సంతతిలేని పడతి.
నిష్పన్నము
సం. నా. వా. విణ. (అ. ఆ. అ.). తత్స.నిష్పద్యత ఇతి నిష్పన్నం. ముగిసినది, సిద్ధించినది, పరినిష్ఠితము.
నిష్పావము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం పవనం నిష్పావః. ధాన్యము తూర్పెత్తుట, అనుములు, చేటగాలి, తూర్పెత్తుట, పెసలులోనగువాని పొట్టు, పొల్లు, అవిసె, తెల్లచిక్కుడు, శుభ్రపరచుట.
నిష్ప్రవాణి
సం. విణ. ఇ. తత్స. నిర్గతా ప్రవాణిః యస్యతత్ నిష్ప్రవాణి. సాలెవాని నాడె మొదలైనది, క్రొత్తది(వస్త్రము).
నిసర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. నిసృజ్యతే అనేనేతి నిసర్గః. పదార్ధము దీనిచేత మిక్కిలి సృజింపబడును, స్వభావము, కలిగించుట, ఈవి, సృష్టి.
నిస్తర్హణము
సం. నా. వా. అ. న. తత్స. నిస్తృహ్యతే నిస్తర్హణం. వధము, చంపుట.
నిస్తలము
సం. నా. వా. విణ. (అ. ఆ. అ.). తత్స. నిర్గతం తలమస్యేతి నిస్తలం. నిలుకడలేనిది, కదలునది, వట్రువైనది, గుండ్రమైనది.
నిస్త్రింశము
సం. నా. వా. అ. పుం. తత్స. నిష్క్రాంత స్త్రింశ దంగుళీభ్యో నిస్త్రింశః. ముప్పది అంగుళముల కంటె అంగుధికమైనది, కత్తి. నిర్గతిస్త్రింశతో అంగుళిభ్య ఇతి నిస్త్రింశః. క్రూరమైనది.
నిస్పష్ట
సం. నా. వా. అ. న. తత్స. అప్పగింపబడినది, దాచబడినది.
నిస్రావము
సం. నా. వా. అ. పుం. తత్స. మూత్రం నిస్రావయతి నిస్రావః. మూత్రమును వెళ్లించునది, గంజి, ఆచామము.
నిస్వ
సం. నా. వా. ఆ. పుం. తత్స.
నిస్వనము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం స్వనతీతి నిస్వానః. మ్రోత, ధ్వని.
నిస్వానము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం స్వనతీతి నిస్వానః. మ్రోత, ధ్వని.
నిస్సరణము
సం. నా. వా. అ. న. తత్స. గృహత్ నిస్సరంత్యనేనేతి నిస్సరణం. గృహము నుండి దీనిచేత వెడలుదురు, ఇల్లులోనగువాని ముందటి భాగము, చావు, ముక్తి, వెడలబాటు, వెరవు, మరణము, ఉపాయము, నిర్వాణము, నిగమము.
నిస్సరణము
సం. నా. వా. అ. న. తత్స. గృహాత్ నిస్సరంత్యనేనేతి నిస్సరణం. గృహము నుండి దీనిచేత వెడలుదురు, ఇల్లులోనగువాని ముందటి భాగము, చావు, ముక్తి, వెడలబాటు, వెరవు, పురద్వారము.
నిహననము
సం. నా. వా. అ. న. తత్స. నిహన్య తే నిహననం. వధము, చంపుట.
నిహాక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నిజహాతి స్ధలమితి నిహాకా. భూమిని విడచి నీళ్లయందు ఉండునది, ఉడుము, నీటి ఉడుము.
నిహింసనము
సం. నా. వా. అ. న. తత్స. నిహింస్య తే నిహింసనం. వధము, చంపుట.
నిహీనుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నితరాం హీయతే జనైరితి నిహీనః. మిక్కిలి జనులచేత విడువబడువాడు, నీచుడు.
నిహ్నవము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం హ్నూయతే అనేనేతి నిహ్నవః. దీనిచేత మోసపుచ్చబడును, కపటము. నిగ్నవనం నిగ్నవః. మోసపుచ్చుట, అపనమ్మిక, తిరస్కారము, దాపఱికము, నమ్మిక, మఱుగు మాట.
నీకాశము
సం. నా. వా. అ. పుం. తత్స. నియతం కాశత ఇతి నీకాశః. నియతముగా ప్రకాశించునది, ప్రకాశము, నిశ్చయము.
నీకోచకము
సం. నా. వా. అ. పుం. తత్స. నికుచ్యతే కంటకత్వేనాస్మాన్నికోచకః ముండ్లు కలది కనుక దీని వలన సంకోచము కలుగును, ఊడుగ (వృక్ష విశేషము).
నీచుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నికర్ష మఞ్చతీతి నీచః. తక్కువను పొందువాడు, అధముడు (రూ.నీచు), వామనుడు. నికృష్టామీం లక్ష్మీం శోభాం చినోతీతి నీచః. వివర్ణము, పామరుడు, ప్రాకృతుడు, పృథగ్జనుడు, నిహీనుడు, క్షుల్లకుడు, ఇతరుడు, హీనుడు, క్షుణ్ణము, వామనుడు, హ్రస్వము, అనుదాత్తము, క్రిందిది, పేద, పొట్టిది.
నీడోద్భవము
సం. నా. వా. అ. పుం. తత్స. నీడాత్ ఉద్భవతీతి నీడోద్భవః. గూడు వలన పుట్టునది, పక్షి, గూడు కానుపు.
నీపము
సం. నా. వా. అ. పుం. తత్స. నయతి ప్రాణి న స్సుఖం నీపః. ప్రాణులకు సుఖము నొందించునది, కడిమి, మంకెన, ఇరుగుడు. (వృక్షవిశేషము), కదంబవృక్షము.
నీరము
సం. నా. వా. అ. న. తత్స. నయతి సుఖమితి నీరం. సుఖమును పొందునది, నీరు, జలము. నయతి ప్రాపయతి స్థానాత్ స్థానాంతరమితి నీరం, రసము.
నీలంగువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. నీలతి మందం నీలంగుః. మెల్లగా పోవునది, నక్క, పురుగు. నిలంగతి గచ్ఛతీతి నీలంగుః. క్రిమిభేదము, శృగాలము, ప్రసూనము.
నీలకంఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నీలః కంఠో యస్య నీలకంఠః. నల్లని మెడ కలవాడు, కఱకంఠుడు. నీలః నీలవర్ణః కంఠో యస్య సః నీలకంఠః. మయూరము, నెమలి, శివుడు, ముల్లంగి.
నీలము
సం. నా. వా. అ. న. తత్స. నితరాం ఈడ్యతే నీలః. మిక్కిలి కొనియాడబడునది. నీలతి వర్ణయతి వస్త్వన్తరమితి నీలః. వస్తువును నల్లగా చేయునది, నల్లఱాయి, నీలిచెట్టు, నవనిధులలో ఒకటి, ఒక జాతిజింక, పలుపు.
నీలలోహితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నీలః కంఠే లోహితః నీలలోహితః. కంఠమందు నీలందంగును, జుట్టుకు ఎర్రరంగునుకలవాడు. తతో అయం జాత ఇతి నీలలోహితః. బ్రహ్మ హోమము చేయునపుడు లలాటస్వేదము వలన కలిగిన తేజము అగ్ని అందు పడి నీలవర్ణమై పిమ్మట రక్తవర్ణమాయెను. అందువలన పుట్టినవాడు కనుక నీలలోహితుడు, శివుడు, ముక్కంటి. నీలశ్చాసౌ లోహితశ్చేతి నీలలోహితః. శివుడు, కల్పవిశేషము.
నీలాంబరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నీలం అంబర వాసోయస్యసః నీలాంబరః. నల్లని వలువకలవాడు. నీలంబరం యస్యేతి నీలంబరః. బలరాముడు, నైరృతి, శని, బలదేవుడు, రాక్షసుడు.
నీలాబ్జము
సం. నా. వా. అ. న. తత్స. నీలం చతత్ అంబుజన్మ. నీటియందు జన్మము కలిగినది అంబుజన్మము, నల్లకలువ, నీలోత్పలము.
నీవారము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం వ్రియంతే నీ వారాః. మిక్కిలి వరింపబడునవి, విత్తక పండెడు దూసర్లలోనగు తృణ ధాన్యము, నివ్వరి.
నీవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నితరాం వీయత ఇతి నీవీ. మిక్కిలి రక్షింపబడునది, పందెపు సొమ్ము, సంచి మొదలు, పోకముడి, చెఱసాల.
నీవృత్తు
సం. నా. వా. వి. త్. పుం. తత్స. నియమేవ వర్తం తేజనా అస్మిన్నితి నీవృత్. ఇందు జనులు నియమముగా వర్తింతురు, గ్రామము, దేశము. నియతం వర్తతే వసత్యత్ర జనసమూహః ఇతి నీవృత్. జనపదము, దేశము.
నీవ్రము
సం. నా. వా. అ. న. తత్స. నిశ్చయేన వ్రియతే అనేనేత నీవ్రం. నిశ్చయముగా కప్పబడునది, చూరు, బండి కంటి కడకమ్మి, అడవి, రేవతీ నక్షత్రము.
నీహరము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం హ్రీయతే అగ్ని నా నీహారః. అగ్నిచేత మిక్కిలి హరింపబడునది, మంచు.(రూ.నిహారము.), తుహినము, హిమము, నిహారము.
నుతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నూయతే అనేనేతి నుతిః. దీనిచేత నుతింపబడును, స్తోత్రము, పొగడిక, స్తుతి, పూజ.
నుత్తము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నుద్యతే స్మ నుత్తః. ప్రేరేపింపబడునది కనుక నుత్తము, త్రోయబడినది, క్షిప్తము, నున్నము, ప్రేరితము, పంపబడినది.
నూతనము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. అభినూయత ఇత్యభినవో, నవశ్చ, నవ ఏవ నవ్యో, నవీనో, నూతనో. క్రొత్త, నవీనము. నవ ఏవ నూతనః. పురాతనము కానిది, అభినవము, నవానము, నవ్యము, నవము, నూత్నము.
నూత్నము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. అభినూయత ఇత్యభినవో, నవశ్చ, నవ ఏవ నవ్యో, నవీనో, నూతనో, నూత్నశ్చ. క్రొత్త, నవీనము. నవ ఏవ నూత్నః. కొత్తది.
నృత్యము
సం. నా. వా. అ. న. తత్స. వివాహాది శుభకార్యముల అందలి సర్వరస ప్రధానమయినది నాట్యము, శరీర హస్తనేత్రాభినయముల చేత భావమును తెలుపుచు ఆడెడు ఆట, తాండవము, నాట్యము, లాస్యము, లాసము, నృతి.
నృపలక్ష్మము
సం. నా. వా. న్. న. తత్స. నృపాణాం లక్ష్మ నృపలక్ష్మ. రాజులకు చిహ్నమైనది, రాజునకు పట్టెడు తెల్లగొడుగు, ఛత్రము.
నృపుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నృప్ పాతీతి నృపః. రాజు, ఱేడు. నృన్ నరాన్ పాతి రక్షతీతి నృపః. నరపతి.
నృశంసుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నృస్ శసతి శంసతి చ నృశంసః. మనుష్యులను పీడించువాడు, క్రూరుడు. నృన్ నరాన్ శంసతి హినస్తీతి నృశంసః. క్రూరుడు, పరద్రోహి.
నేత
సం. విణ. (ఋ. ఈ. ఋ.). తత్స. నయతి వినియుజ్త్కే సేవకానితి నాయకః, నేతా. సేవకుల నియోగించువాడు, ప్రభువు, ఏలిక, గజనిమ్మ.
నేత్రము
సం. నా. వా. అ. న. తత్స. నీయతే అనేన నయన నేత్రం. దీనిచేత అర్ధములు పొందింపబడును. నయతి నీయతే అనేనేతి చ నేత్రం. పొందించునది కనుక, దీనిచేత పొందబడును కనుకను నేత్రము, కన్ను, తరిత్రాడు, ఏఱు, వలిపము, తేరు, వేరు, వృక్షమూలము, అంశుకము, రథము, కవ్వపుతాడు, నాడి, వస్త్రము.
నేదిష్ఠము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. అతిశయేనాంతికం నేదిష్ఠం. మిక్కిలి సమీపమైనది నేదిష్ఠము, మిక్కిలి సమీపము.
నేపథ్యము
సం. నా. వా. అ. న. తత్స. నేత్రయోః పథ్యం నైపథ్యం. నేత్రములకు హితమైనది, వస్త్రాద్యలంకారము, నాట్యస్ధానము.(కొన్ని నిఘంటువుల యందీ పాఠము.), అలంకారము, రంగభూమి.
నేమి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. నీయతే జల మనేనేతి నేమిః. దీనిచేత జలము పొందింపబడును, గిఱక. నయతి రథ మితి నేమిః. రథమును నడిపించునది, బండికంటికడకమ్మి, గాడిద, బండికమ్మి, గోడపునాదు, నూతి పైకప్పు.
నైకభేదము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నైకే అనేకే భేదా అస్యాస్తీతి నైకభేదం. అనేక భేదములు కలది.
నైచికి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నీచైః స్వరేణాపి చరతీతి నైచికీ. సన్నపు, చక్కని రూపమును, మంచి ప్రాయమును కలిగి సమృద్దిగా పాలిచ్చెడి ఆవు.
నైమేయము
సం. నా. వా. అ. పుం. తత్స. సరుకులమార్పు, నిమయము.
నైయగ్రోధము
సం. నా. వా. అ. న. తత్స. న్యగ్రో ధస్యఫలం నైయగ్రోధం. మఱ్ఱి పండు.
నైరృతి
సం. నా. వా. అ. పుం. తత్స. నిరృతే ర్ధిక్పాలస్య అపత్యం నైరృతః. నిరృతిఅనెడి దిక్పాలునికొడుకు, చతుర్ధదిక్పాలకుడు, మూలఱేడు, రాక్షసుడు, పశ్చిమ దక్షిణములమధ్యమూల.
నైష్కికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నిష్కేహేమ్ని నియుక్తః నైష్కికః. బంగారమందు నియోగింపబడినవాడు, టంకసాల అధికారి. వెండిని పరిశీలించు అధికారి.
నైస్త్రింసికుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నిస్త్రింశః ప్రహరణమస్య నైస్త్రింశికః. నిస్త్రింశ మనగా ఖడ్గము, కత్తి ఆయుధముగా కలవాడు.
నౌకాదండము
సం. నా. వా. అ. పుం. తత్స. నౌకాయాః ప్రేరణదండో నౌకాదండః. నావను త్రోయు కఱ్ఱ, ఓడనడుపు గడ.
న్యక్షము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నితరాం నిక్షరేణ చ అక్ష్ణోతీతి న్యక్షం. మిక్కిలియును, నికృష్టముగాను వ్యాపించునది కనుక న్యక్షము, అధమము, సమస్తము. నియతాని అక్షాణి యత్ర యస్య వా ఇతి న్యక్షః. అంతయు, క్రింద.
న్యగ్రోధము
సం. నా. వా. అ. పుం. తత్స. న్యక్ రుణద్ధి మార్గమితి న్యగ్రోధః. మార్గము నడ్డముగా కప్పునది. న్యక్ రోహతీతి న్యగ్రోధః. అడ్డముగా వ్యాపించునది, మఱ్ఱి, జమ్మి(వృక్షవిశేషము), బార, శమీవృక్షము.
న్యగ్రోధి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. న్యక్ తిర్యక్ రుణద్ధి న్యగ్రోధీ. అడ్డముగా ప్రాకునది, ఎలుకజీడి.(వృక్షవిశేషము) చిత్రవర్ణమగుమఱ్రి.
న్యస్తము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. న్యస్యతే స్మ న్యస్తం. పెట్టబడినది కనుక న్యస్తము, ఉంచబడినది, నిహితము, స్థాపితము, నిక్షిప్తము, త్యక్తము, పరిక్షిప్తము, నివృతము, పరివేష్టితము, అప్పగింపబడినది, ఆరోపింపబడినది.
న్యాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరా మదనం నిఘసః, న్యాదశ్చః. మిక్కిలి భక్షించుట నిఘసము, న్యాదమును, భోజనము, కుడుపు, తినుట, ఆహారము.
న్యాయము
సం. నా. వా. అ. పుం. తత్స. నియత మీయతే న్యాయః. నియతముకా పొందబడునది, తగవు, స్వధర్మము వలన చలింపకుండుట, తర్కశాస్త్రము, ఉచితము, కల్పము, దేశరూపము, సమంజసము, నీతి, జయోపాయము, భోగము, యుక్తి, తర్కవిద్య, అర్హము.
న్యాయ్యము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. న్యాయాదన వేతం న్యాయ్యం. న్యాయము వలన బాయనిది, న్యాయముతో కూడినది, ఉచితము, న్యాయయుక్తము, యుక్తము, అర్హము.
న్యాసము
సం. నా. వా. అ. పుం. తత్స. న్యసనం న్యాసః. దాచబెట్టుట, ఉంచుట, ఇల్లడ, వాడిక.
న్యుబ్జము
సం. నా. వా. అ. పుం. తత్స. న్యుబ్జతే వక్రీభవతీతి న్యుబ్జః. వక్రమైనవాడు, దర్భతో చేసిన స్రుక్కు. న్యుబ్జంత్యస్మిన్నితి న్యుబ్జః. అధోముఖము, కుబ్జము, ఒక జాతినిమ్మ, గూనివాడు, కర్మరంగ వృక్షము.
న్యూనము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నితరాం ఊనయతీతి న్యూనః. మిక్కిలి తక్కువైనవాడు, తక్కువైనది, నిందింపదగినది.