హల్లులు : ప

పంకేరుహము
సం. నా. వా. అ. న. తత్స. పంకే రోహతీతి పంకేరుహం. బురదనందు మొలచునది, తామర, అసలు.
పంక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పచ్యతే వృక్షాదయోనయేతి పక్ష్త్కిః. దీనిచేత వృక్షాదులు వ్యక్తములుగా చేయబడును, వరుస, ఒక చందస్సు, పధి. పద్యతే వ్యక్తీక్రియతే శ్రేణీవిశేషేణ ఇతి యావత్పంక్తిః. వీధి, ఆవలి, శ్రేణి, పంక్తి, సరణి, సంతతి.
పంచజనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పంచభిః. పృధివ్యాదిభిర్జాయంత ఇతి పంచజనాః. భూమిమొదలగున పంచభూతములచే పుట్టినవారు, మనుష్యుడు. పంచభిర్భూతైర్జన్యతే అసౌ పంచజనః. పురుషుడు, ప్రజాపతి, సాగరరాజు యొక్క పుత్రుడు.
పంచత్వము
సం. నా. వా. అ. న. తత్స. పంచానాం భూతానాం పృథగ్ఛావః పంచత్వం. మరణము. శరీరము పంచభూతాత్మకము కనుక పోవునపుడు ఆయా అంశములు ఆయా భూతములు కలియును కనుక పంచత అనగా మరణము.
పంచదశీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పంచదశౌనాం తిథీనాం పూరణ్యౌ పంచదశ్యౌ. పంచదశతిధులను నిండించునవి, పౌర్ణమి, అమావాస్య.
పంచమము
సం. నా. వా. అ. పుం. తత్స. పికైః పంచ్యత ఇతి వాపంచమః. కోయిలలచేత విస్తరింప చేయబడినది, కోయిల, రాగవిశేషము, ఒక స్వరము. సం. విణ. తత్స. అయిదవది, ఇంపైనది.
పంచలక్షణము
సం. నా. వా. అ. న. తత్స. ? పురాణము (సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, వంశము, వంశానుచరితము).
పంచశరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనాఖ్యాః పంచశరాః యస్య సః పంచశరః. ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనము అను ఐదు బాణములు కలవాడు, మన్మధుడు, మరుడు.
పంచశాఖము
సం. నా. వా. అ. పుం. తత్స. అంగుళీరూపా అస్యేతి పంచశాఖః. వ్రేళ్ళు అనెడి ఐదు కొమ్మలు కలది, చేయి, హస్తము, శయము. పంచశాఖా ఇవాంగుళీయౌ యస్య సః పంచశాఖః.
పంచాంగుళము
సం. నా. వా. అ. పుం. తత్స. పంచ అంగుళయః పత్రాత్మకే హస్తే అస్యేతి పంచాంగుళః. ఆకులనెడు చేయి అందు అయిదు అంగుళములు కలది, ఆముదపు చెట్టు.
పంచాస్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పంచం విస్తృతమాస్యమస్యేతి పంచాస్యః. విస్తీర్ణమైన ముఖము కలది, సింహము, తెఱనోటి మెకము.
పంజరము
సం. నా. వా. అ. న. తత్స. పంజరము, గౌసెన. సం. నా. వా. అ. పుం. శరీరము, శరీరముయొక్క ఎముకలగూడు.
పండ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ? పండతే లజ్జయా ప్రదేశాన్తరం గచ్ఛతి పండః. సిగ్గుచేత దేశాంతరముకూర్చిపోవువాడు, యథార్ధమును ఎరిగెడిబుద్ధి, తోకతెగినది, నపుంసకుడు.
పండితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పండతే జానాతి పండితః. తెలిసినవాడు,చదువరి, విద్వాంసుడు. పండా వేదోజ్జ్వాలా త్తవవిషయిణీ వా బుద్ధిః, సా జాతా అస్యేతి పండితః. శాస్త్రజ్ఞుడు, విపశ్చితుడు, దోషజ్ఞుడు, కోవిదుడు, బుధుడు, ధీరుడు, మనిషి, ప్రాజ్ఞుడు, సంఖ్యావంతుడు, కవి, ధీమంతుడు, సూరి, కృతి, కృషి, లబ్ధవర్ణుడు, విచక్షణుడు, దూరదర్శి, దీర్ఘదర్శి, విశారదుడు, విదగ్ధుడు, మేధావి.
పక్కణము
సం. నా. వా. అ. పుం. తత్స. పచ్యతే కదన్న మత్రేతి పక్కణః. దీనియందు పాకము చేయబడును, బోయపల్లె. పచతి శ్వాదినికృష్టమాంసమితి. తస్య కణః కలహశబ్దః కోలాహలశబ్దో వా యత్ర, పచణం కలహ ఏవ యత్ర వా పక్కణః.
పక్వము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పచ్యతే స్మ పక్వం. పరిపాకమును పొందినది, చేటుమూడినది, పచ్యతే క్రమేణ పక్వం. కాలక్రమమున పరిపక్వము పొందునది, కాచిన పాల పెరుగు, వండబడినది, కాచబడినది.
పక్షకము
సం. నా. వా. అ. పుం. తత్స. పక్షద్వారం తుపక్షకః. పార్శ్వమునందుండునట్టివాకిలి, దిడ్డివాకిలి, పక్క, ఏనుగు యొక్క పార్శ్వభాగము, పంచ, గది, పెరటి గుమ్మము.
పక్షతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పక్షస్య మూలం ప్రారంభః పక్షతిః. శుక్ల, కృష్ణ పక్షముల యొక్క ప్రారంభము, పాడ్యమి, ఱెక్కమొదలు. పక్షస్యమూలం పక్షతిః. ఱెక్కల యొక్క మొదలు.
పక్షభాగము
సం. నా. వా. అ. పుం. తత్స. పక్షయోర్భాగః పక్షభాగః. పక్షముల యొక్క భాగము, ఏనుగు యొక్క పార్శ్వభాగము, ఏనుగు యొక్క ప్రక్క భాగము.
పక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. పక్షతి భూతానీతి పక్షః. భూతములను పరిపాకము నొందినది. పక్షస్య మూలం పక్షతిః. ఱెక్కల యొక్క మొదలు. పక్ష్యతే పరిగృహ్యతే పక్షః. పరిగ్రహింపబడునది. పక్షతి శరం గృహ్ణాతీతి పక్షః. బాణమును ప్రతి గ్రహించునది. వేయబడునవి. నెల యందు పదిహేనుదినములు, ఱెక్క, ప్రక్క, ప్రక్కయిల్లు, పగ, బలము, రాజెక్కడిఏనుగు, ప్రొయ్యినోరు, చెలికాడు, సహాయుడు, తర్కవిషయసాధ్యము, కేశతత్పర్యాయములకు పరమైనచో సమూహము. పక్ష్యతే పరిగృహ్యతే దేవపితృకార్యాయ యః సః పక్షః. పక్షులయొక్క అవయవ విశేషము, పత్రము, రెక్క, దేహాంగము, సహాయము, సమీపము, ఇంటిగోడ, పూర్వపక్షము, సాయము, పక్కదారి, కన్నము.
పక్షాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. పక్షయోః అంతౌ పక్షాంతౌ. శుక్ల, కృష్ణ పక్షముల యొక్క తుదలు, పున్నమ, అమావాస్య.
పక్షి
సం. నా. వా. న్. పుం. తత్స. పక్షౌవస్యస్త ఇతి పక్షీ. రెక్కలు కలిగినది, చిలుకమొదలైనవి, పులుగు, పక్షి.
పక్షిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఆగామి వర్తమానాహనీ పక్షావివ అస్యాఇతి పక్షిణి. రాబోవుపగలును, జరుగుచున్నపగలును ఇరుప్రక్కల ఱెక్కల వలెకలిగినది. రెండుపగళ్లతో కూడినరాత్రి, రాత్రి, పున్నమ, ఆడుపక్షి, ఒకరాత్రి, రెండుపగళ్లు.
పక్ష్మము
సం. నా. వా. న్. న. తత్స. పక్ష్మత ఇతి పక్ష్మ. గ్రహింపబడినది, ఱెప్పవెండ్రుక, పక్షిత్రుప్పుడు, నూలులోనగువాని సన్నపుతునక, అకరువు. పక్ష్యతే పరిగృహ్యతే ఆతపతాపాధికమనేన ఇతి పక్ష్మ. ఈనె, కనురెప్ప, నూలుపోగు.
పక్ష్మలము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పంకోస్యాస్తేతి పంకిలః. అడుసు కలిగినది, పక్ష్మములుకలది, దురద, తాపము.
పచ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పచనం పచా, వండుట, పాకము, వంట.
పచంపచ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రోగాన్ పచతీతి పచంపచా. రోగములను మిక్కిలి పాకము పొందించునది, మ్రానిపసుపు, కొమ్ముపసుపు.
పటచ్చరము
సం. నా. వా. అ. న. తత్స. పటదితి చరతిస్పుటతీతి పటచ్చరం. పట్టనిచినుగునది, ప్రాతగుడ్డ.
పటము
సం. నా. వా. అ. పుం. న. తత్స. పటతి వాయునా పటః. వాయువుచేత కదలునది. పటయతి దేహం పటః. దేహమును కప్పునది, వస్త్రము, చిత్తరువు రాయువస్త్రాదికము, చీర. పటయత్యనేన పటః. చిత్రపటము. సం. నా. వా. అ. పుం. తత్స. మోరటి (వృక్షవిశేషము).
పటలము
సం. నా. వా. అ. న. తత్స. పటకార్యంలాతీతి పటలం. కోక యొక్క ప్రయోజనము నిచ్చునది. పటం విస్తారం లాతీతి పటలం. విస్తారమును పొందునది ఇంటికప్పు, సమూహము, పరివారము, గ్రంథభాగము, నేత్రరోగ విశేషము, నొసటి బొట్టు, రత్నదోషము.
పటవాసకము
సం. నా. వా. అ. పుం. తత్స. పటాః వాస్యంతే అనేన పటవాసకః. కోకలు దీనిచేత వాసన కట్టబడును, వస్త్రములకు వాసనకట్టెడు బుక్కాము.
పటహము
సం. నా. వా. అ. పుం. తత్స. యశోర్థః పటహః యశః పటహః. కీర్తికొఱకైన పటాహముగనుక తప్పెట, యుద్ధవాద్యపుమ్రోత. వాద్యముఖ చర్మపటో హన్యతే త్రేతి పటహః. వాద్యమునందలి చర్మపటము వాయించబడును.
పటుపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పటూని శ్రేష్ఠాని పర్ణాన్యస్యా ఇతి పటుపర్ణీ. మంచి ఆకులు కలది, రెడ్డివారి నాబ్రాలు.
పటువు
సం. నా. వా. ఉ. న. తత్స. దేహపటుత్వయోగాత్పటుః. దేహపటుత్వమును చేయునది. పాటయతి ప్రయోజనానీతి పటుః. ప్రయోజనముల నడిపించువాడు. పాటయతి జాడ్యాదికమితి పటుః. జాడ్యాదులను బాపుకొనువాడు. ఇందుప్పు, చేదుపొట్ల, చొరవకాడు, తెవులులేనివాడు, నేర్పరి, ప్రియాగు వృక్షము, వస్త్రము.
పటోలము
సం. నా. వా. అ. పుం. తత్స. పటతి సరతీతి పటోలః. వ్యాపించునది, చేతి పొట్ల, పొట్ల.
పటోలికా
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఉలత్యావృణోతీతి వాపటోలికా. విస్తరించునది, పొట్ల, పటోలిక. బీర. పటతి విస్తీర్యత ఇతి పటోలికా. పుష్పసమూహము.
పట్టిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పట్టోవ్రణబంధనసామర్ధ్యమస్యాస్త్రీతి పట్టీ. ఘనమైన పట్టకలది. ఫాలపట్టిక, మంచములోనగు వానిచట్టము, కమ్మరవానిదాగలి, పలక.
పట్టికాక్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పట్టికా ఇత్యాఖ్యా యస్యసః పట్టికాక్యః. పట్టికఅనెడు పేరుకలది, ఎఱ్ఱలొద్దుగు.
పణవు
సం. నా. వా. అ. పుం. తత్స. పణ్యతే స్తూయతే అనేనేతి పణ వః. దీని చేతస్తోత్రము చేయబడును, పనస, వాద్య విశేషము, ఏనుగుమూపు.
పణాయితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పణ్యేతేస్మ పణాయితం. పొగడబడిన దేవతాదులు, పొగడదగినది, స్తుతింపబడినది.
పణితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పన్యతేస్మ పనాయితం. పొగడబడినది, పందెముగా చేయబడినది, స్తుతింపబడినవాడు.
పణితవ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పణితుం వ్యవహర్తుం యోగ్యం పణితవ్యం. అమ్మతగిన వస్తువు, పొగడతగినది, అమ్మతగినది.
పణ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పణ్యతే స్థూయత ఇతి పణ్యః. మానేరు తీగ, పొగడతగినది, అమ్మతగినది.
పణ్యవీధి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పణ్యనాం విక్రీతు మానీ తానాం విధిః. విక్రయింప తెచ్చిన వస్తువు ఉండెడు వీధి, అంగడి వీధి.
పణ్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పణ్యతే స్తూయత ఇతి పణ్యాః. స్త్రోత్రము చేయబడునది, మానేరుతీగ, పొగడతగినది, అమ్మతగినది, విక్రయింపతగినది.
పణ్యాజీవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పణ్యేన అజీవతీతి పణ్యాజీవః. అంగడి సరుకుల చేత బ్రతుకువాడు, వర్తకుడు, బేహారి
పతంగము
సం. నా. వా. అ. పుం. తత్స. పతత్యగ్నౌ పతంగః. అగ్నియందుబడునది. పతతీతిపతంగః. పోవునది, పాదరసము, పక్షి, మిడుత, బాణము, పిల్లి, శాలిధాన్య విశేషము. పతతి ఆకాశే గచ్ఛతీతి పతగః. బియ్యము, అగ్ని, సూర్యుడు.
పతంగిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పతతీతి పతంగికా. పడునది, తేనెటీగ, పుత్తిక, రెక్కల చీమ.
పతగము
సం. నా. వా. అ. పుం. తత్స. పతక్ గచ్ఛతీతి పతగః. ఎగురుచు పోవునది, పక్షి, పతంగము. పతేన పక్షేన గచ్ఛతీతి పతగః.
పతత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. పతతీతి పతత్. పోవునది, పక్షి, పతంగము
పతత్రము
సం. నా. వా. అ. న. తత్స. పతంతం త్రాయత ఇతి పతత్త్రం. పడుదాని రక్షించునది, ఱెక్క, పత్రము.
పతత్రి
సం. నా. వా. న్. పుం. తత్స. పతత్రే పత్రేచ అస్యస్త ఇతి పతత్రి. ఱెక్కలుకలది, పక్షి, గరుత్మంతము.
పతద్గ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. పతత్తాంబూలరాసాదికం గృహ్ణతీతి పతద్గ్రహః. పడుచుండెడు తాంబూల రసాదుల, గ్రహించునది. తమ్మపడిగెము.
పతయాళువు
సం. విణ. (ఉ). తత్స. పతతీ తాచ్ఛీల్యేనేతి పత యాళుః. స్వభావమునే పడువాడు, పడెడు స్వభావము కలవాడు.
పతాక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పతతీతి పతాకా. కదలు నది, టెక్కెము, టెక్కెపు గంబము, సౌభాగ్యము, అభినయహస్తవిశేషము, బొటన వ్రేలిని వంచి చూపుడు వ్రేలి మొదట గూర్చి వ్రేళ్లన్ని చక్కగా చూచి పట్టినది. పతతి గగనే ఉడ్డీయతే పత్యతే అనయా ఇతి పతాకా. జెండా, ఒక విధమయిన పిడికిలి.
పతాకి
సం. నా. వా. (న్. ఈ. న్). తత్స. పతాకాస్య స్త్రీతి పతాకీ. టెక్కెముకలవాడు, సేన, ధ్వజిని.
పతి
సం. నా. వా. ఇ .పుం. తత్స. పాతీతి పతిః. రక్షించువాడు, మగడు, ఏలిక, భర్త, స్వామి, అదిపుడు, ప్రభువు.
పతింవర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పతిం వృణుత ఇతి పతింవరా. పతినివరించునది, తనంతట మగని వరించునట్టి ఆడుది, వర్య, భర్తను ఎన్నుకొనునది.
పతివత్ని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జీవక్ పతిరాస్యా అస్తీతీ పతివత్ని. బ్రతికి యుండు పెనిమిటి కలది, మగనాలు.
పతివ్రత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పతినేవైవ వ్రత మస్యా ఇతి పతి వ్రతా. పతిసేవయే వ్రతముగా కలది, పతిభక్తికలయిల్లాలు, క్రొత్తది. పత్యౌ వ్రతం నియమః అస్యాః, పతిర్వ్రతమస్యా వా పతివ్రతా. సుచరిత, సతి, సాధ్వి, ఇల్లాలు.
పత్తనము
సం. నా. వా. అ. న. తత్స. ఆపతంతి వణిజో స్మిన్నితి పత్తనం. వర్తకులు దీనిని కూర్చివత్తురుకనుక పత్తనము, పట్టణము, ప్రోలు. పతంతి గచ్ఛంతి జనా యస్మిన్ తత్ పత్తనం. నగరము, పురము, జిల్లాముఖ్యనగరము.
పత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పతత్యరీక్ ప్రతి పత్తిః. శత్రువులను కూర్చిపోవువాడు, గమనము సేనా విశేషము (ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు ఏడుగురు కాల్వురు కలది) కాలిబండు. పతతీతి పతనం చ పత్తిః. పోవునది, పోవుటయును కనుక. పద్యతే విపక్షసేనాం ప్రతి పద్భ్యాం గచ్ఛతీతి పత్తిః. వీరుడు, మూడు గుఱ్ఱములు, ఐదు కాలుబంట్లు, రథము, ఏనుగు గల సైన్యము, పదాతి, సుగంధద్రవ్యము. పతతీతి గచ్ఛతీతి పత్తిః.
పత్ని
సం. నా. వా. ఈ .స్త్రీ. తత్స. పత్యురనయాసహ యజ్ఞయోగ స్సంపద్యత ఇతి పత్నీ. పతికి ఈమెతోకూడ యజ్ఞ యోగము కలది. అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము, భార్య, సహధర్మిణి, జాయ, దార, సధర్మిణి, గృహిణి, కళత్రము.
పత్రపరశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ప్రశ్చనః పత్రమివ పరశుః పత్రపరశుః. ఆకువలెనుండు ఆయుధము, ఆకుఱాయి, ఉలి.
పత్రపాశ్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పత్రవల్లలాటే పశ్యతే పత్రపాశ్యా. పత్రము వలెనొసటి యందు కట్టబడునది, పాపిట బొట్టు, నుదుటి ఆభరణం.
పత్రము
సం. నా. వా. అ. న. తత్స. వృక్షాతృతతీతి పత్రం. వృక్షమునందుండి పడునది. పతత్యనేన పత్రం. దీని చేత పక్షి పోవును “పతంత్యనేన పత్రం. దీని చేత పొందుదురు ఆకు, వ్యవహారము యొక్క చెల్లు బడికైఒకరొకరు వ్రాసికొనెడు ఆకు, ఱెక్క, వాహనము బాణము, చురకత్తి, లవంగపు బట్ట, వృక్షావయవవిశేషము, ఫలాశము, దళము, పాత్రము, అంశుకము, సుకుమారము, వస్త్రము.
పత్రరథము
సం. నా. వా. అ. పుం. తత్స. పత్రాని రథః గమనసాధనమస్సేతి పత్రారథః. ఱెక్కలే రధముగా కలది, పక్షి, పులుగు
పత్రలేఖా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పత్రరూపమైన లేఖ, పత్ర భంగము, మకరికా పత్రము.
పత్రాంగము
సం. నా. వా. అ. న. తత్స. పత్రేమకరికా పత్రే అంగతి పత్రాంగం. రక్తచందనము, భూర్జము, పద్మకాష్ఠము. పత్రాణ్యంగే అస్య పత్రాంగం. ఆకులు అవయవమందు కలది.
పత్రాంగుళి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పత్రాద్యాకృతి లేఖనే అంగుళ్యాకృతిరపి కపోలాదౌ భవతీతి పత్రాంగుళీ. స్త్రీలయొక్క చెక్కిలిలోనగు వాని అందురాయబడుమకరికాపత్రము, పత్రభంగము.
పత్రోర్ణము
సం. నా. వా. అ. న. తత్స. పత్రేఘార్ణాస్య పత్రోర్ణః. ఆకులయందునూగు కలది. ముఱికి ఎత్తిన పట్టుచీర, దుండిగము. ధౌత కౌశేయం పత్త్రోర్ణ మిత్యుచ్యతే. ఉతికిన పొత్తి చీర, పట్టుచీర మొదలగునవి.
పథము
సం. నా. వా. అ. పుం. తత్స. పద్యతే అనేనేతి పథం. దీనిచే పొందుదురు, మార్గము, త్రోవ.
పదగుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పదాభ్యాం గచ్ఛతీతి పదగః. పాదములు చేత పోవువాడు, కాలిబంటు.
పదవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పద్యంతే గచ్ఛంత్య స్యామితి పదవీ. దీనియందు నడతురు, ఉన్నత స్థితి, మార్గము.
పదాజి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పదాభ్యామజతీతి పదాజి. పాదములచేత చరించువాడు, పదాతి, కాలిబంటు, కాల్భలము, యుద్ధము.
పదాతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పదాభ్యామజతీతి పదాతిః. అడుగులతో ఎల్లప్పుడు నడుచువాడు, కాలిబటు.
పద్గుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పధ్య్భం గచ్ఛతీతి పద్గః. పాదములచేత చరించువాడు, పదాతి, కాలిబంటు.
పద్ధతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పదాభ్యాం హన్యత ఇతి పద్ధతిః. పాదములచేత కొట్టబడునది, త్రోవ, వరుస, అడుసు, మార్గము.
పద్మ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పద్యత ఇతి పద్మః. సేవింపబడునది. సం. నా. వా. అ. పుం, న. తత్స. పద్యతేత్ర లక్ష్మీరితి పద్మం. దీనియందు లక్ష్మిపొందును. లక్ష్మి, బారంగి, మెట్టతామర, తామర, ఒకనిధి, వ్యూహవిశేషము, సంఖ్యావిశేషము, ఏనుగు మొగమునందలి బొట్లసమూహము, పాము, పుష్పవిశేషము, నళినము, కమలము, అరవిందము, మహోత్పలము, సహస్రపత్రము, తామరసము, అంభోరుహము, పంకజము, అంభోజము, అంభుజము, సరసిజము, శ్రీవాసము, శ్రీపర్ణము, వనజము, అబ్జము, జపా పుష్పము, ఏనుగు ముఖముమీది మచ్చ, లక్షమహా గణములు, చిత్రవర్ణము, ఒక నాగరాజు, కుబేరుని నిది, అష్టక శార్థము.
పద్మకము
సం. నా. వా. అ. న. తత్స. పద్మవర్ణ సామ్యాత్ పద్మకం. పద్మము వన్నెకలది, ఏనుగు మొగము నందలి బొట్లసమూహము, పద్మకాష్ఠము.
పద్మచారిణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పద్మమివ చరతీతి పద్మచారిణీ. పద్మమువలె వ్యాపించునది, మెట్టతామర.
పద్మనాభుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పధ్మనాభః పద్మం నాభౌయస్యసః. పద్మము నాభియందుకలవాడు, హరి, వెన్నుడు.
పద్మపత్రము
సం. నా. వా. అ. న. తత్స. పద్మస్యేన పత్రాణ్యస్య పద్మపత్రం” .తామరపాకులవంటి ఆకులుకలది. మెట్టతామరదుంప.
పద్మరాగము
సం. నా. వా. అ. పుం. తత్స. పద్మవద్రాగోయస్య పద్మరాగః. తామరపువ్వువంటి యెఱుపుకలది, మాణిక్య విశేషము, తామరకెంపు.
పద్మా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పద్మమస్యాః కరేస్తీతి పద్మా. పద్మము హస్తము నందుకలది. పద్మాభవుష్పత్వా తృద్మా. పద్మములవంటి పుష్పములుకలది. పద్మన్యేన లక్ష్మి, బారంగి, మెట్టతామర, తామర ఒకనిధి, వ్యూహవిశేషము, సంఖ్యావిశేషము. పద్మం వాసస్థలత్వేన అస్తి అస్యాః ఇతి పద్మా. పద్మా సాదృశ్యా త్పద్మా. పద్మము వంటిది.
పద్మాకరము
సం. నా. వా. అ. పుం. తత్స. పద్మానాం ఆకరః పద్మాకరః. పద్మములకు ఉనికి పట్టు, కొలను, చెఱువు.
పద్మాటము
సం. నా. వా. అ. పుం. తత్స. పద్మవచటతీతి పద్మాటః. పద్మమువలే చలించునది, తగిరిస
పద్మాలయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పద్మాలయా పద్మమాలయోయస్యాస్సా. పద్మమే ఇల్లుగా కలది, లక్ష్మి, తమ్మియింటిగరిత.
పద్మి
సం. నా. వా. న్. పుం. తత్స. పద్మం బిందు జాలకమస్యా స్తీతి పద్మీః. పద్మమనగా దేహమందలి బొట్లు, ఏనుగు, గజము, ద్వీపము.
పద్మిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నళిన్యాం తు బిసినీ పద్మినీముఖాః. పద్మము కలిగినది, తామరతీగ, తామరకొలను, తామరతంపర, స్త్రీ జాతి విశేషము, ఆడేనుగు, లక్ష్మీ.
పద్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. త్రోవ, ఛందోబద్దమైన కావ్యము, శూద్రుడు. పాదాయ హితా శరీరావయవత్వాత్ యత్. స్తుతి పాద చిహ్నములకు యోగ్యమైనది.
పనాయితము
సం. విణ. ( అ. ఆ.అ). తత్స. పన్యతేస్మపనాయితం. స్తోత్రము చేయబడినది కనుక, పణాయితము.
పనితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పన్యతేస్మ పనితం. స్తోత్రము చేయబడినది గనుక, పొగడబడినది.
పన్నగము
సం. నా. వా. అ. పుం. తత్స. పన్నం పతితం యథాతథా గచ్ఛతీతి పన్నగః. పాదములచేత పోవనిది, పాము, పద్మకాష్ఠము. పన్నం అధోగమనం పతితం వా గచ్ఛతీతి పన్నగః. సర్పము, పడినట్లుగా పోవునది, క్రిందపడినది.
పన్నగాశనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పన్నగా అశనం యస్యసః పన్నగాశః. సర్పము లన్నముగా కలవాడు,గరుత్మంతుడు పాపమేపరి.
పయస్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పయసో వికారః పయస్యం. పాలయొక్క వికారము, పాల, పిన్నపాల, రెడ్డినవారినానబ్రాలు, పాలకుహితమైనది, పాలయందు పుట్టినది (నేయి), పాలు నీరు.
పయోధరము
సం. నా. వా. అ. పుం. తత్స. పయసోధరః పయోధరః. పాలను, నీళ్లను ధరించునది, పాలిండ్లు, మబ్బు, టెంకాయ, కోశకారమనుచెఱకు, స్తనము, మేఘము.
పరంపరవాహనము
సం. నా. వా. అ. న. తత్స. వోఢృభిః పరంపరయా వాహ్యత ఇతి పరంపరావాహనం. గుఱ్ఱములు మొదలుగువాని పరంపరచేత వహింపబడునది, తేరుమోకు, అనేకులు మోయునట్టి అందలము, చాలమందిచే.
పరంపరాకము
సం. నా. వా. అ. న. తత్స. పరంపరాం ప్రాణానాం అకతీతి పరంపరాకం. ప్రాణపరంపరను కుటిలముగా పొందునది, యజ్ఞమునందలి పశువధ, మునిమనవుని పుత్రుడు.
పరజాతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరస్మాజ్జాత ఇవవర్తత ఇతి పరజాతః. పరులచే పెంచబడి వారికి పుట్టిన బిడ్డవలెనుండువాడు, బానిసవాడు, సేవకుడు, ఇతరులపై ఆధారపడువాడు.
పరతంత్రుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరః స్వప్మాదన్యస్తంత్రం ప్రధాన మస్యేతి పరతంత్రః. పరుడు ప్రధానముగా కలవాడు, పరాధీనుడు” .
పరపిండాదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరపిండం పరాన్న మత్తీతి పరపిండాదః. పరాన్నమునే భక్షించువాడు, ఒకరింటికూడుతినువాడు, ఇతరుల అన్నము తినువాడు.
పరభృతము
సం. నా. వా. అ. పుం. తత్స. పరం కోకిలం బిభర్తితి పరభృత్. తనపలుకులు వినువారి మనస్సులను ఆకర్షించునది, కోయిల, పికము.
పరభృత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. పరైః కాకైః భృతః పరభృతః. కాకులచేత పెంచబడునది, కాకి, వాయసము. పర కోకిలం బిభర్తితి పరభృత్. కోయిల పిల్లను పోషించునది.
పరమము
సం. నా. వా. అ. పుం. తత్స. పరమాత్మ. సం. విణ. తత్స. ఆద్యము, ఉత్కృష్ఠము, ప్రధానము, అంగీకారసూచకమగు అవ్యయము.
పరమాత్మ
సం. నా. వా. న్. పుం. తత్స. పరబ్రహ్మ, పరంధాముడు. పరమః కేవలః ఆత్మా పరమాత్మా. ఆపోజ్యోతి, చిదాత్మ, విష్ణువు, మహాదేవుడు.
పరమాన్నము
సం. నా. వా. అ. న. తత్స. పరమం మన్నం పరమాన్నం. శ్రేష్ఠమైన అన్నము, పాలుపోసి అనుకుగా వండిన అన్నము, పాయసము.
పరమేష్ఠి
సం. నా. వా. న్. పుం. తత్స. పరమే ఉత్కృష్ఠే పదే బ్రహ్మలోకాఖ్యే తిష్ఠతీతి పరిమేష్ఠీ. ఉతృష్ట స్థానమందుండెడు వాడు, బ్రహ్మ, నలువ. పరమే వ్యోమ్ని చిదాకాశే బ్రహ్మపదే వా తిష్ఠతీతి పరమేష్ఠీ.
పరవంతుడు
సం. విణ. (త్. ఈ. త్). తత్స. పరోనియామకోస్యాస్తీతి పరవాత్. పరుడునియామకుడుగా కలవాడు, పరాధీనుడు.
పరశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పరాక్ శృణాతీతి పరశుః. శత్రువులను హింసించునది, గండ్రగొడ్డలి. పరాన్ శత్రూన్ శృణాతి హినస్తి అనేన ఇతి పరశుః. వెలిగారము.
పరశ్వథము
సం. నా. వా. అ. పుం. తత్స. పరాన్ శ్యతీతి పరశ్వథః. పరులను క్షయింపచేయునది, గండ్రగొడ్డలి.
పరశ్శతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. శతాత్పరా యేషాం తే పరశ్శతాః. వందకంటె అధికమైన సంఖ్యకలది.
పరాక్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. పరానా క్రమతేనేన పరాక్రమః. దీనిచేత శత్రువులను ఆక్రమించును. పరాక్రమ్యతే అనేనేతి పరాక్రమః. దీని చేత మిక్కిలి పరాక్రమింపబడును, వీర్యము, శౌర్యము, సామర్థ్యము, ప్రారంభము.
పరాగము
సం. నా. వా. అ. పుం. తత్స. పరాగచ్ఛతి వాయువశేనేతి పరాగః. వాయువశమున ప్రోవునది. పరాగచ్ఛతి వాయునేతి పరాగః. గాలికెగిరిపోవునది గనుక పరాగము, పుప్పొడి, దుమ్ము, నలుగుపిండి, రాహువు సూర్యచంద్రులనుపట్టుట, చందనము, విఖ్యాతి, పర్వత విశేషము, విష్ణుక్రాంతము, పసుపు.
పరాచితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరైరాచిత ఇతి పరాచితః. పరులచే పెంపబడువాడు, బానిసవాడు.
పరాచీనుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరాజేవపరాచీనః. పెడముఖముగా నున్నవాడు. పరాంచతి అనభిముఖీభవతీతి పరాచీనః.
పరాజయము
సం. నా. వా. అ. పుం. తత్స. పరాజయనం పరాజయః. పరులచేత ఓడుట, అపజయము, ఓటమి.
పరాజితుడు
సం.విణ.(అ.ఆ.అ). తత్స. పరాజీయతేస్మ పరాజితః. శత్రువులచేత తిరస్కరింపబడినవాడు, ఓడినవాడు.
పరాజ్యుఖుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరాజ్ ముఖం యస్య పరాజ్ముఖః. ఆవలి దిక్కు ముఖముకలవాడు పెడమొగము పెట్టినవాడు.
పరాధీనుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరస్మిన్నధీనః గుణభూతః పరాధీనః. పరునియందు అధీనుడు, ఒకరికి లోబడినవాడు, పరతంతుడు.
పరాన్నుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరస్యాన్నం అస్యేతి పరాన్నః. పరునియొక్క అన్నముకలవాడు, ఒకరింటికూడుతినువాడు, ఇతరులపై ఆధారపడినవాడు.
పరాభూతుడు
సం. విణ. (అ.ఆ.అ) తత్స. పరాభూయతేస్మ పరాభూతః. శత్రువులచేత తిరస్కరింపబడినవాడు, పరాభవింపబడినవాడు, జయింపబడినవాడు.
పరాయణము
సం. నా. వా. అ. న. తత్స. ఆశ్రయము, ప్రాపు. సం. విణ. తత్స. త్రిషుస్యాత్తత్పరేభీష్టేప్యాశ్రయేపి పరాయణం. అభీష్టము. పరం కేవలం అయనం ఆసక్తిస్థానమితి పరాయణం. తత్పరము, నిత్యప్రతిష్ఠ, శాశ్వతప్రతిష్ఠ, అసంగవచనము.
పరార్ధ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరార్థే ముఖ్యాంశే భవః పరార్థ్యః. ముఖ్యభాగమందుండువాడు, ముఖ్యము, ఉత్తమము.
పరాశువు
సం. విణ. (ఉ). తత్స. పరాగతాః అసవోయస్యసః పరాశుః. పోయిన ప్రాణములు కలవాడు, చచ్చినవాడు, మరణించినవాడు.
పరాసనము
సం. నా. వా. అ. న. తత్స. పరాస్యతే పరాసనం. చంపుట, మరణము, వధ.
పరాస్కంది
సం. వి. న్. మ. న్. పుం. తత్స. పరానాస్కందయతీతి పరాస్కందీ. శోషింపచేయువాడు, దొంగ, చోరుడు.
పరికరము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః కీర్యత ఇతి పరికరః. చుట్టూ నిలుపబడినది, ఒక అర్థాలంకారము ఉపకరణము, సమూహము, పరివారము, నడికట్టు, యోగపట్టె, ప్రారంభము, మంచము, వివేకము.
పరికర్మము
సం. న్. న. తత్స. మాలిన్య పరిమార్జనార్ధం కర్మపరికర్మ. మాలిన్యమును పోగొట్టునట్టి క్రియ, దేహమునందలి మురికి పోగొట్టుట, అలంకరించుట.
పరిక్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిక్రమణం పరిక్రమః. సంచరించుట, విహారము, ప్రదక్షిణము.
పరిక్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరితః క్రియా సర్పణమితి పరిక్రియా. చుట్టువారుట, చుట్టుకొనివచ్చుట.
పరిక్షిప్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరితః క్షిప్యతే సమంతాద్వేష్ట్యతేస్మ పరిక్షిప్తం. అంతటా చుట్టునది, నలుపక్కల చుట్టబడినది.
పరిఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరితః ఖన్యత ఇతి పరిఖా. అంతటా త్రవ్యబడినది, అగడ్త, ఖేయము.
పరిగ్రహణము
సం. నా. వా. అ. న. తత్స. పరిగృహ్యత ఇతి పరిగ్రహః. పరిగ్రహింపబడునది, ప్రియముతో పుచ్చుకొనుట
పరిఘము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితో హన్యతేనేన పరిఘః. అంతట దీని చేత కొట్టబడును, ఒక గ్రహయోగము, ఇనుపకట్లగుదియ, బాణము, గడియమ్రాను, కోడగవను, గాజుకుండ, కుండ, దెబ్బ.
పరిఘాతము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిహన్యతే నేనేతి పరిఘాతః. హింసకును, ఇనుప కట్ల గుదియకును పేరు, లవుడి.
పరిచయము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిచయనం పరిచయః. పరిచయము చేయుట, ఎఱుక, స్నేహము.
పరిచరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరితశ్చర తీతి పరిచరః. సేనచుట్టును తిరుగువాడు, కాచియుండుభటుడు, సేనగాచు భటుడు.
పరిచర్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరిచరణం పరిచర్యా. సమీపమందు చరించుట, సేవ, కొలువు.
పరిచాయ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిచీయతే పరిచాయ్యః. కూల్చబడునది, యాగాగ్నియందుపయోగింపదగినవేరు, సమూహ్యము.
పరిచారక
సం. నా. వా. అ. పుం. తత్స. పరిచరతీతి పరిచారకః. పరచర్యము చేయువాడు, ఊడిగపువాడు.
పరిణతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరిణమతే అవస్థాంతరమ పద్యతే పరిణతః. వేఱోకఅవస్థను పొందునది. పరిపాకము పొందినది, కొమ్ముతో అడ్డముగా పొడుచునది (ఏనుగు).
పరిణయము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిణయనం పరిణయః. వివాహము, పెండ్లి.
పరిణామము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిణతిః కాలేనాన్యధేతి పరిణామః. కాలముచే వేఱైన పరిపాకమును పొందుట. ఒక అర్థాలంకారము, క్షేమము, అడ్డముగా విసరబడినఏనుగు కొమ్ముదెబ్బ, మాఱురూపు.
పరిణాయము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః నయనం పరిణాయః. సారెలనంతట నడుపుట, సారెల యొక్క సన్యాస సవ్య ప్రసారణము, పాచికలు నడుపుట.
పరిణాహము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః నహ్యతే పరిణాహః. అంతట బంధింపబడునది, వెడల్పు, వైశాల్యము.
పరిత్రాణము
సం. నా. వా. అ. న. తత్స. పరితస్త్రాణం పరిత్రాణం. అంతట రక్షించుట, రక్షణము, చాలుననెడితలపు, చంపవచ్చినవాని నడ్డగించుట, రక్షించుట.
పరిదానము
సం. నా. వా. అ. న. తత్స. పరివృత్యదానం పరిదానం. పరివర్తనము చేత ఇచ్చుట, వస్తువుల మాఱుపు, దోవతి, అంతరీయం, కట్టుబట్ట.
పరిదిస్తుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరిథౌసేనా ప్రత్యన్తే తిష్ఠతీతి పరిధిస్థః. సేనచుట్టునుండువాడు, చుట్టుకొని కాచియుండుభటుడు, సేనకు కావలి ఉండువాడు.
పరిదేవనము
సం. నా. వా. అ. న. తత్స. పదిదేవన మనుశోచనం దేవృ పరిదేవనే. దుఃఖించిపలుకుట, దుఃఖముతోడిమాట, శోకనిమిత్త విలాపము, విచారము.
పరిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పరితో దదాతీతి పరిధిః. అంతటఆవరించునది. పరితో ధీయతే పరిధిః. చుట్టును ధరింపబడునది. సూర్యాది పరివేషము, యజ్ఞమునందు పశుబంధనార్ధమునాటిన పై పట్టగల కొయ్య, సూర్య చంద్రులగుడి కట్టుట, అగ్ని చుట్టూను పేర్చబడిన మోదుగు సమీదలు, బయటిగోడ.
పరిపంథి
సం. న్. పుం. తత్స. పరిపంథయతీతి పరిపంథీ. బంధించువాడు, శత్రువు, తెరువాటుదొంగ. పరి సర్వతోభావేన దోషాఖ్యానాం పంథయితుం శీలమస్యేతి పరిపంథీ. రిపువు, వైరి, అరి.
పరిపణము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిపణ్యతే లాభార్ధం ప్రయుజ్యత ఇతి పరిపణః. లాభార్థమై వ్యవహరింపబడునది, మూలధనము, సంచిమొదలు.
పరిపాటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పరిపాటనం పరిపాటీ. పూర్వమునుఅను సరించిపోవుట, అనుక్రమము, సొరిది, సంప్రదాయము, ఆనుపూర్వీ.
పరిపూర్ణము
సం. విణ. ( అ.ఆ.అ). తత్స. అభోగః పరిపూర్ణతా. దీనిచేత భుజింపబడును, చక్కగానిండినది.
పరిపేలవము
సం. నా. వా. అ. న. తత్స. కోమల త్వాత్పరితః పేలవం పరిపేలవం. అంతటను పేలవమైనది, కయివడిముస్తె, నీటితుంగ.
పరిప్లవము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిప్లవత ఇతి పారిప్లవం. కదలునది, నీరుకోడి, జలపక్షి.
పరిబర్హము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిబర్హత ఇతి పరిబర్హః. ప్రధానమైయుండునది. శ్వేతచ్ఛత్రాది రాజార్హవస్తువు, పరివారము, ఉపకరణము, రాజులకు అర్హమవు వస్తువు.
పరిభవము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిభూయతే పరిభవః. పరిభవించుట, అవమానము, అనాదరము, తిరస్కారము, నింద.
పరిభాషణము
సం. నా. వా. అ. న. తత్స. పరితః నిందం భాషణం పరిభాషణం. అంతటనిందతోడపలుకుట, నిందాసహితమైన ఉపాలంభము, ఆలాపము, నియమము, నింద, సంభాషణ, శాసించుట.
పరిభూతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పరిభూయతేస్మపరిభూతం. తిరస్కరింపబడినది. అవమానింపబడినది.
పరిమళము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిమల్యతే ధార్యత ఇతి పరిమలః. ధరింపబడునది, మెదపుటవలనను, రాయిడివలననుపుట్టిన యొప్పిదవుతావి, సురతముననలగిన మేనిపూతలోనగువాని వలన పుట్టినతావి, మెదపుట, రాయిడి, పొగడ వాసన కలది, రుద్దుట.
పరిరంభము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిరంభణం పరిరంభః. కౌగిలించుకొనుట, ఆలింగనము, కౌగిలింత.
పరివర్జనము
సం. నా. వా. అ. న. తత్స. పరివర్జ్యతే పరివర్జనం. సార్థత్వం, బొత్తిగా విడుచుట, చంపుట, వధ.
పరివాదిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పరితో వదతి సప్తస్వరానితి పరివాదినీ. అంతటను సప్తస్వరములనుపలుకునది, ఏడుతంతులకలవీణ.
పరివాపితము
సం. విణ. (అ.ఆ.అ) . తత్స. పరిత శ్శిరసి వాపః కేశఖండనం. జాతోస్యేతి పరివాపితం. కేశఖండనము కలిగినది, గొఱగబడినది, చక్కగాచేధింపబడినది, క్షౌరవము.
పరివిత్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పరిత్యజ్యయం వధూం విందతియస్య అనుజః పరివిత్తిః. పరివృత్త్యతే శ్రాద్ధదౌ పరివిత్తిః. శ్రాద్ధదుల యందు పరిత్యబింపపడినవాడు, ఎవనివిడిచి తమ్ముడు పెండ్లాడునోవాడు. తమ్మునికి పెండ్లిఅయి తనకు లేకుండెడి అన్న, వివాహితుడగు తమ్ముడు గల అవివాహితుడు.
పరివృఢుడు
సం. విణ (అ.ఆ.అ). తత్స. పరిబృంహతి వర్ధత ఇతి పరివృఢః. వృద్ధిపొందువాడు, ప్రభువు, ఏలిక.
పరివేత్త
సం. నా. వా. ఋ. పుం. తత్స. పరిత్యజ్య జ్యేష్ఠం వధూం విందతీతి పరివేత్తా. అన్నను విడిచిముందు పెండ్లాడిన తమ్ముడు.
పరివేషము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః పరితో విష్యతే అనేన పరివేషః. అంతటా వ్యాపించునది, గాలిగుడి, పరివేష్టనము, సూర్యచంద్రుల చుట్టూను కల గుడి.
పరివేష్టనము
సం. నా. వా. అ. న. తత్స. చుట్టివచ్చుట.
పరివ్యాధము
సం. నా. వా. అ. పుం. తత్స. పరివిధ్యతే అంభసా పరివ్యాథః. జలముచేత అంతట కొట్టబడును. వాయునా పరివిధ్యతే పరివ్యాధః. వాయువుచే కొట్టబడునది, కొండగోగు, నీరుప్రబ్బ. (వృక్ష విశేషము).
పరివ్రాజకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరిత్యజ్య సర్వం వ్రజతీతి పరివ్రాజః. అన్నిటిని పరిత్యజించి పోవువాడు, సన్యాసి.
పరిషత్తు
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. పరితస్సీదంత్యత్ర పరిషద్. అంతట దీనియందు పొందియుందురు. సభ, సమూహము.
పరిష్కారము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిష్క్రియతే అనేన పరిష్కారః. దీనిచేత అలంకరింపబడును, చక్కబెట్టుట, తొడవు, అలంకరించుట.
పరిష్కృతమ
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పరిష్క్రియతేస్మ పరిష్కృతః. అలంకరింపబడినవాడు, చక్కబెట్టబడినది, అలంకరింపబడినది.
పరిష్వంగము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః స్వంజనం పరిష్వంగః. అంతటకూడుట, కౌగిలింత. పరిష్వంజనమితి పరిష్వంగః. ఆలింగనము, క్రీడీకరణము, పరిరంభము.
పరిసరము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితస్సరంతి చర్యం త్య త్రేతి పరిసరః. దీనియందు నలుదిక్కుల చరింతురు, సమీపము, చావు, సమీప ప్రదేశము.
పరిసర్పము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితస్సరణం పరిసర్పః. అంతట తిరుగుట, చుట్టివచ్చుట. పరిసమంతాత్ సర్పణం, ఉపసర్పించుట.
పరిసర్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరితస్సరణం పరిసర్యా. కొండలోని సమీప మార్గమును అనుసరించి పోవుట, అంతట తిరుగుట, ఉపసర్పించుట.
పరిస్కందుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః స్కందతీతి పరిస్కందః. అంతట తిరుగువాడు, బానిసవాడు, కేశములను అలంకరించుకొనుట.
పరిస్తోమము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిస్తూయతే పరిస్తోమః. స్తోత్రము చేయబడినది, ఏనుగు మీద పఱచెడి ఎఱ్ఱకంబళి, కుథము. పరిస్తూయతే ప్రశస్యతే నానావర్ణవద్వాత్ పరిస్తోమః. ఆవాచీ.
పరిస్పందము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః స్పందః శరీరవ్యాపరః పరిస్పందః. అంతట ఇంచుకంత శరీరచలనము, మాల్యాది నిర్మాణము, దర్పణాద్యుపకరణము, పరివారము.
పరిస్రుత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరితః స్ర వంత్యన యేతిపరిస్రుత్. దీనిచేత నిట్టటు తిరుగుదురు, కల్లు, కాఱినది, మద్యము.
పరీక్షకుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పరిక్షతే అపధారయతి ప్రమాణైరర్ధమితి పరీక్షకః. ప్రమాణములచేత అర్ధమును నిర్ణయించువాడు, పరీక్షించువాడు, పరిశీలించువాడు.
పరీభావము
సం. నా. వా. అ. పుం. తత్స. పరిభూయతే పరిభవం. తిరస్కరించుట, పరిభావము యొక్క రూపాంతరము, అనాదరము.
పరీవర్తనము
సం. నా. వా. అ. పుం. తత్స. పరివర్తనం పరీవర్తః వృతువర్తనే. మార్చుకొనుట, వస్తువులమాఱుపు, యుగాంతము, పరివర్తనము, వినిమయము, పరిధానము.
పరీవాదము
సం. నా. వా. అ. పుం. తత్స. నికృష్టోవాదో నిర్వాదః పరీవాదః. నికృష్టమైనవాదము, దూఱు, అపవాదము, నిర్వాదము, ఆక్షేపము, దషోల్లాసము, నింద, జుగుప్స.
పరీవాపము
సం. నా. వా. అ. పుం. తత్స. పరీవాపః పర్యుప్తోః. అంతట విత్తులు వ్యధపెట్టుట పరీవాపము యొక్క రూపాంతము, పాదు.
పరీవారము
సం. నా. వా. అ. పుం. తత్స. పరివార్యతే అనేన పరీవారః. చుట్టబడును, పరిజనము, కత్తిఒఱ, తిరిగెడుప్రాణి, బాకు ఒర.
పరీవాహము
సం. నా. వా. అ. పుం. తత్స. పరివహతి జలం యైస్తే పరీవాహః. అధికమైన జలము, పరీవాహమునకు మొదటిరూపము. పరితో వహత్యనేనేతి పరీవాహః. కలుజు, శ్వేతచ్ఛత్రాది రాజర్హవస్తువు, పొంగిపొర్లుట.
పరీష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పర్యేష్యతే నయాపర్యేషణా పరీష్టిశ్చ. దీనిచేత అంతటా తిరుగబడును, ఆమంత్రణార్ధము వెదకుట, పరిచర్య, ప్రాకామ్యమను ఒక ఐశ్వర్యము. పరితః సేవయా ఇష్యతే ఆరోగ్యం కామ్యతే ఇతి పరీష్టిః. వెదుకుట, నమ్మకము.
పరీసారము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితస్సరణం పరిసర్యా పరీసారశ్చ. అంతట తిరుగుట, పరిసారము యొక్క రూపాంతరము, ఉపసర్పించుట.
పరీహాసము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః హసంత్యత్రేతి పరీహాసః. దీనియందు నవ్వుదురు, పరిహాసము యొక్క రూపాంతరము, పరిహాసనము, లీల, వినోదము.
పరుషము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పిపర్తి వక్తార మితి పరుషం. పలికెడువానిని పూర్ణముగా చేయనది. నిష్ఠురము, నిష్ఠురవాక్యము, చిత్రవర్ణము, కఠినముగ మాట్లాడువాడు, ఖర్జురపుటాకు, కాఠిన్యము, పులుపు, తీపి, వగరు, కారముల కలయిక, అసౌఖ్యమును కలిగించునది.
పరేతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరాందశామితః పరేతః. కడపటి దశను పొందినవాడు, భూతవిశేషము, చచ్చిన వాడు. పరం లోకమితః పరేతః. చనిపోయిన వాడు, ప్రేత.
పరేష్టుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరమన్యదపత్య మిచ్ఛతీతి పరేష్టుకా. మునుపటి దూడలకంటె వేఱైనదూడ నిచ్ఛయించునది. పెక్కుఈతలుఈనినఆవు. పరైరిష్యతే ఇతి పరేష్టికా. చాలా దూడలు కలిగిన ఆవు.
పరైధితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరైరేధితో వర్తత ఇతి పరైధితః. పరులచే పెంచబడిఉండువాడు, బానిసవాడు, సేవకుడు, ఇతరులచే పోషింపబడినవాడు.
పరోష్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శీతాసహత్వేన పరముష్ణమస్యా ఇతి పరోష్ణీ. చలినోర్వనిది, గబ్బిలము, తైలపాయిక, బొద్దింక.
పర్కటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పృచ్యతే పరస్పరం పర్కటీ. అన్యోన్యము కూడిఉండునది, జువ్వి, ప్రోకమానుగులోనగువాని క్రొత్తపండు, అత్తి చెట్టు.
పర్జని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కృష్ఠాదిరోగేభ్యః పిపర్తీతి పర్జనీ. కుష్ఠాది రోగములవలన రక్షించునది, మ్రానిపసుపు, పచంపచ, కొమ్ముపసుపు.
పర్జన్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పర్షతీతి పర్జన్యః. వర్షించునుకనుక, ఉఱుము, ఉఱిమెడు మేఘము. పర్షతి సించతి వృష్టిం దదాతీతి పర్జన్యః. మేఘము, ఇంద్రుడు, ఒక అస్త్రము.
పర్ణము
సం. నా. వా. అ. న. తత్స. పిపర్తి వృక్షమితి పర్ణం. వృక్షమున నిండిఉండునది. ప్రశస్త పర్ణ యోగా త్పర్ణః. మంచి ఆకులుకలది, ఆకు, మోదుగు, రెక్క.
పర్ణశాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పర్ణైః కృతాశాలా పర్ణశాలా. ఆకులచేత కట్టబడినది, ఆకుటిల్లు, ఉటజము, ఆకులతో నిర్మింపబడిన గుడిసె.
పర్ణాసము
సం. నా. వా. అ. పుం. తత్స. పురాణాని పర్ణాన్యస్యతి క్షిపతీతి పర్ణాసః. పండుటాకులను పోగొట్టునది, నల్లగగ్గెర, ఒక వృక్షము.
పర్యంకము
సం. నా. వా. అ. పుం. తత్స. అజ్యతే ఉపభోగాదినా లక్ష్యత ఇతి పర్యంకః. దీనియందు ఉపభోగాదులచేత నరుడు కానబడును, మంచము, పర్యస్తిక. పరితో అంక్యతే ఇతి పర్యంకః. పద్మాసనము, అర్థపద్మాసనము, పాదోపవేశనము, పడక, రెడ్డిగము.
పర్యటనము
సం. నా. వా. అ. న. తత్స. పరితః అటనం పర్యటనం. అంతటతిరుగుట, భిక్షలోనగువానికొఱకు తిరుగుట, ఇటు నటు తిరుగుట.
పర్యయము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రాప్తం పరిత్యజ్య అయనం పర్యయః. ప్రాప్తమును పరిత్యజించి పోవుట, క్రమముతప్పుట, కాలము వ్యర్థపుచ్చుట.
పర్యవస్థ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరితః నానాదేశేషు అవస్థానం పర్యవస్థా. విరోధించుట, వివాదము.
పర్యాప్తము
సం. నా. వా. అ. న. తత్స. పర్యాప్యతే ఇచ్ఛాయా అంతః సమ్యగాప్యతేనేనేతి పర్యాప్తం. దీనిచేత కోరిక తుదముట్టును, యధేష్టము, తృప్తి, శక్తి, నివారణము, చేతితో అడ్డి దెబ్బనుండి కాపాడుట, సాహసము, పరిత్రాణము, ఇష్టము.
పర్యాప్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పర్యాప్యతే వధోద్యోగోనేనేతి పర్యాప్తిః. దీనిచేత వధోద్యోగము చాలించబడును. చాలుననెడు బుద్ధి, చంపవచ్చిన వాని నడ్డగించుట. పరిరక్షితు మాప్తిః పర్యాప్తిః. రక్షించుటకు పొందుట.
పర్యాయము
సం. నా. వా. అ. పుం. తత్స. పర్యయవం పర్యాయః. స్వాధ్యాయక్రమము. పర్యయనం పర్యాయః. క్రమము తప్పక వచ్చుట కనుక, ఒక అర్ధాలంకారము, అవసరము, క్రమము, ప్రకారము, అవకాశము.
పర్యుదంచనము
సం. నా. వా. అ. న. తత్స. పర్యుదంచతే పరిప్రాప్యత ఇతి పర్యుదంచనం. పుచ్చుకొనబడినది, అప్పు, ఋణము, ఉద్ధారము.
పర్వతము
సం. నా. వా. అ. పుం. తత్స. పర్వాణి సంధయోస్య పర్వతః. సంధులు కలిగినది, కొండ, ఒకానొక ఋషి. పర్వతి పూరయతీతి పర్వతః.
పర్వము
సం. నా. వా. న్. న. తత్స. పర్వతి స్థూలో భవతీతి పర్వ. అధికమౌనట్టిది, గనుపు, దర్శప్రతిపత్సంధి, పండుగ, విఘవదాది, సమూహాము, ప్రస్తావము, లక్షణాంతరము (పంచపర్వములు, అష్టమి, చతుర్ధశి, కుహువు, పూర్ణిమ, రవిసంక్రాంతి), పూర్ణిమ, అమావాస్యముడి ద్రర్భముడి), ఉత్సవము, విషవత్తువు, పక్షములోని పదునైదవ దినము.
పర్వసంధి
సం. నా. వా.ఇ.పుం. తత్స. ప్రతి పత్పఞ్చదశ్యోర్య దంతరం ససంధిః పర్వేత్యుచ్యతే. పాడ్యమి యొక్కయు, అమావాస్యపున్నములయొక్కయు మధ్యకాలసంధి.
పర్శుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సృశ్యతే శయనాదినేతి పర్శుకా. శయనాదులచేత సృశింపబడునది, ప్రక్కఎముక.
పలగండుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పలేన మాంసేనేవ గండతి సుధాదినా భిత్త్యాదికమితి పలగండః. సున్నపుపూత పూయువాడు, లేపకుడు, ఇళ్లుకట్టువాడు. పలం మాంసం తద్వత్ గండతి భిత్తౌ మృదాదినా లింపతీతి పలగండః.
పలము
సం. నా. వా. అ. న. తత్స. పలతి తులాకోటిం గచ్ఛతీతి పలం. త్రాసునుపొందునది, నాలుగు కర్షములఎత్తు, వెండిపలము –ఇందువు, బంగారుపలము-కురుబిస్తము, మాంసము, పది వెండిధారణములు (ఒక శతమానము), ఎనిమిది పది బంగారు నిష్కములు (రెండు శతమానములు).
పలలము
సం. నా. వా. అ. న. తత్స. పాల్యతే దేహమనేనేతిపలలం. దీనిచేత దేహము రక్షింపబడును, మాంసము, బురద, నూవుపిండి, రాక్షసుడు, అల వృక్షము.
పలాండువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కఫం పిపర్తి పూరయతీతి పలాండుః. శ్లేష్మమును పూరించునది, నీరుల్లి.
పలాంశి
సం. నా. వా. న్. పుం. తత్స. పలాశాని పర్ణాని అస్య సంతీతి పలాశీ. ఆకులు కలది, చెట్టు, కోరింద, జువ్వి, రాక్షసుడు.
పలాలము
సం. నా. వా. అ. పుం. తత్స. పలతి పల్యతే వాపలాలః. పోవునది, గింజలులేనివరి పోచలోనగునది, మోడు, ఎండుగడ్డి.
పలాశము
సం. నా. వా. అ. న. తత్స. పలాశ్యతే గ్రస్యతే పలాశః. పుణ్యాని పలాశాని యస్యసః పలాశః. పుణ్యములైన ఆకులు కలది. వ్రతయుక్తులైన వారిచేత భక్షింపబడునది. పృధుపలాశ త్వాత్పలాశః. పెద్దఆకులుకలది, ఆకు, ఆకుపచ్చ, గంట్లకచోరము, మోదుగు,కచ్చోరము.
పలిక్ని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పలిత రోమయోగా త్పలిక్నీ. నెరసిన వెండ్రుకలు కలది, ముడిసినయాడురి తొలిచూలి ఆవు, నెరసిన జుట్టుకల స్త్రీ, తొలిచూరు గోవు.
పలితము
సం. నా. వా. అ. న. తత్స. పలతి గచ్ఛత్యనేన శరీర సౌన్దర్యమితి పలితం. దీనిచేశరీర సౌందర్యము పోవును, నర, నరవెండ్రుక బురద, ఱాతిపూవు, మిరియాలు, నెర, నెరయుట, నెరసినది, సాంబ్రాణి.
పల్యంకము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితః అఙ్క్యతే ఉపభోగాదినా లక్ష్యత ఇతి పల్యంకః. దీనియందు ఉపభోగాదులచేతనరుడు కానబడును, మంచము, మంచె, యతులులోనగువారి ఆసనము, యోగపట్టె, పడక.
పల్లవము
సం. నా. వా. అ. పుం. తత్స. చిగురు, చిగురించిన కొమ్మ, కోకచెఱగు, లత్తుకరంగు, శృంగారము, విరివి, వెనుకటి చరణముల అందలి అర్థమునను సరించి సంగీతము మొదట చెప్పెడువాక్యము, విటుడు, మోచేయి.
పల్వలము
సం. నా. వా. అ. న. తత్స. పలంతి మహేషాద యోత్ర పల్వలం. మహిషాదులు దీనియందు చలించును, నీళ్లుకలచిన్న పల్లము, పడియ.
పవనము
సం. నా. వా. అ. న. తత్స. పునాతీతి పవనః. పవిత్రము చేయువాడుకనుక నిష్పావః పవనేపవః. శోధించుట, గాలి, తూర్పెత్తుట, ఆవము, వాయువు, ఋతుపవనము, శుభ్రపరచుట.
పవనాశనము
సం. నా. వా. అ. పుం. తత్స. పవనః అశనం యస్యసః పవనాశనః. వాయువు ఆహారముగా కలిగినది, సర్పము, పాము.
పవమానుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పవతీతివా పవమానశ్చః. సంచరించువాడు, వాయువు, గాలి, యజ్ఞార్థముగా పడమట ఉండుగాలి.
పవము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం పవనం నిష్పావః పవనం. మిక్కిలి శోధించుట, తూర్పెత్తుట, పవనము, అవిసె, శుభ్రపరచుట.
పవి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పునాతివైరమితి పవిః. వైరశుద్ధిని చేయునట్టిది, వజ్రాయుధము, కులిశము, గాలి, కత్తివాదర.
పవిత్రకము
సం. నా. వా. అ. న. తత్స. నిర్మత్స్యేన జలం పునాతీతి పవిత్రకం. ఉదకమును పవిత్రముగా చేయునది. జనపనారతో అల్లిన వలత్రాడు, మేడి, రావి.
పవిత్రము
సం. నా. వా. అ. న. తత్స. పూయతే నేనేతి పవిత్రం. దీనిచేత పవిత్రము చేయబడును. పూయతేనేన పవిత్రః. పవిత్రము చేయబడును. జందెము, దర్భ, జలము, గోమయము, తామ్రమ, పరిశుద్ధము, మాయా బంగారము, యజ్ఞోపవీతము, యవధాన్యము, తెల్లతామర, అగ్ని, విష్ణువు, రాగి, వేదమంత్రము, పెరుగు, ధనము, పాత్రము.
పశుపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పశూనాం జీవానాం పతిః పశుపతిః. పశువులనగా ప్రమధులు, జంతువులు, వానికి ప్రభువు, శివుడు, ముక్కంటి, అగ్ని.
పశ్చాత్తాపము
సం. నా. వా. అ. పుం. తత్స. పశ్చాత్తాపయతీతి పశ్చాత్తాపః. అజ్ఞానముచేత ముందొక పనిచేసి వెనుక నొచ్చుకొనుట. అనుతాపము, వగపు. అగ్రతో అకార్యే కృతే పశ్చాత్ చరమే తాపః. వెనుక విచారించుట.
పశ్చిమము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పశ్చాద్భవా పశ్చిమా. వెనుక దిక్కు. పశ్చాద్భవం పాశ్చాత్యం పశ్చిమంచ. వెనుకపుట్టినది, పడమటిది, కడపటిది.
పాంచజన్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పంచజనాఖ్యాస్యా సురస్య అస్థిజత్వా త్పాంచజన్యః. సముద్రమందు తిమిర రూపుడై సంచరించుచున్న పంచజసుండనెడు రాక్షసునియొక్క అస్థివలనపుట్టినది, విష్ణువుయొక్క శంఖము, అగ్ని.
పాంచాలికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాంచాలదేశ భవాపాంచాలికా. పాంచాలదేశమందుపుట్టినది, వస్త్రదంతకాష్ఠాదులచేత చేయబడిననరమృగాదిరూపము, బొమ్మ, పాంచాలి.
పాండరము
సం. నా. వా. అ. పుం. తత్స. పండతే యాతి మనోస్మిన్నితి పాండరః. దీనియందు మనస్సు పొందును, తెలుపు, తెల్లనిది. పండతే మనః అస్మిన్ ఇతి పాండరః. పసుపురంగు కలిసిన తెలుపు.
పాండుకంబళి
సం. నా. వా. న్. పుం. తత్స. పాండు కంబళేన సంవీతః రథః పాండుకంబళీ. తెల్లకంబళిచే కప్పబడిన రథము. సం. విణ. తత్స. తెల్లకంబళి కలది.
పాండురము
సం. విణ. తత్స. పాండుగుణ యోగాత్పాండురః. తెలుపు వన్నెకలది. సం. నా. వా. అ. న. తత్స. తెల్లనిది, తెలుపుమించిన పచ్చనిది, తెల్లపులుము, కుష్ఠురోగవిశేషము. సం. నా. వా. పుం. తత్స. తెలుపు, తెలుపుమించిన పచ్చన.
పాండువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పండతేయాతి ఇతి పాండః. మనస్సును పొందునది, ఒకరోగము, పేరీదు, తెలుపు , తెలుపుమించినపచ్చన, ఒకరోజు. ఖర్జూర వృక్షము, పసుపురంగుగల తెలుపు.
పాంథుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పంథానం గచ్ఛతీతి పాంథః. తెరువరి, పథికుడు. పథి కుశలః, పంథానం నిత్యం గచ్ఛతీతి వా ఇతి పాంథః.
పాంసుల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాంసు దుశ్చరితమస్యా అస్తేతి పాంసులా. దుశ్చరితము కలది, ఱంకుటాలు, భూమి, జాలిని.
పాకము
సం. నా. వా. అ. పుం. తత్స. పచనం పచా, పాకశ్చపాకం. వండుట, పరిపాకము, పంట, నర, పిల్ల (కావ్యమునందు పాకములు, ద్రాక్షా, నారికేళ, కదళీపాకములు).
పాకలము
సం. నా. వా. అ. న. తత్స. కోష్ణం పాకం లాతీతి పాకలం. ఇంచుకంత ఉష్ణపాకమును గ్రహించునది, చెంగల్వకోష్టు, గుఱ్ఱము, గజమునకు కలుగు పిత్తజ్వరము, ఒక ఓషది.
పాకశాసని
సం. నా. వా. ఇ. పుం. తత్స. పాక శాసనస్యాపత్యం పాకశాసనిః. ఇంద్రుని కొడుకు, జయంతుడు.
పాకశాసనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పాకం వృత్రాసుర భ్రాతరం శాసితవాన్ పాకశాసనః. వృత్రాసురుని సోదరుడైన పాకాసురుని చంపినవాడు, ఇంద్రుడు.
పాక్యము
సం. నా. వా. అ. న. తత్స. పక్తవ్యం పాక్యం. వండదగినది, “పచనీయః పాక్యం. వండతగినది, అట్టుప్పు, యవక్షారము, ఒకరకపు ఉప్పు, నల్ల ఉప్పు.
పాటచ్ఛరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పటచ్ఛరమపి గృహ్ణాతీతి పాటచ్ఛరః. చిరిగిన కోకైననుతీసుకొనువాడు, తస్కరుడు, దొంగ.
పాటల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాటలీపుష్పవర్ణత్వాత్పాటలః. కలిగొట్టువువ్వు, ఎఱ్ఱ వడ్లు, తెలుపుమించినఎఱుపు. అ. పుం. విణ. తత్స. లేత ఎఱుపు, వేగముగ పండు వరిపంట, పాటల వర్ణముకలఆవు, పాటల వృక్షము.
పాటలి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పాటం విస్తారం లాతీతి పాటలిః. విస్తారము నిచ్చునది, మొక్కపుచెట్టు, కలిగొట్టుచెట్టు పాటలవర్ణ పుష్పత్వాత్పాటలిః. ఎఱుపు, తెలుపుపువ్వులుకలది, ఒక వృక్షము.
పాఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బహుయోగేష పఠ్యతి ఇతి పాఠా. అనేక యోగములందుబరింపబడునది, ఆరోగ్యము, నైపుణ్యము, శక్తత, తైక్ష్ణ్యము.
పాఠి
సం. నా. వా. న్. పుం. తత్స. వహ్నిపర్యాయే పాఠోస్యాస్తీతి పాఠీ. అగ్ని పర్యాయ శబ్ధములయందు పాఠముకలది. చిత్రమూలము, పాఠకుడు.
పాఠీనము
సం. నా. వా. అ. పుం. తత్స. పాఠీం పృష్ఠమున్నయతీతి పాఠీనః. వీపునెత్తుకొనిఉండునది, వేయికోఱలచేప, కొఱ్ఱ, ఒకరకమైన చేప.
పాణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కుంచితః పాణిః ప్రసృతి రుచ్యతే. వంచబడిన అఱచేయి ప్రసృతిఅనబడును, మణికట్టు మొదలుకొని వ్రేళ్ళతో కూడినచేయి. పణాయంతే వ్యవహరంత్యనేనేతి పాణిః.
పాణిగృహితి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పాణిః గృహితోస్యా ఇతి పాణి గృహీతీ. దీనిహస్తము గ్రహింపబడును, అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము, భార్య.
పాణిఘుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పాణింఘ్నస్తీతి పాణిఘాః. చేతులతో తాళము దట్టువారు, వేయువాడు, చేతితో తాళమువేయువాడు.
పాణిపేడనము
సం. నా. వా. అ. న. తత్స. వరపాణినా వధూపాణేః పీడనం గ్రహణం పాణిపీడనం. వరునిహస్తముచేత వధూహస్తము పట్టుట, వివాహము, పెండ్లి.
పాణివాదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పాణీవాదయన్తీతి పాణివాదాః. చేతువాయించువారు, పాణిఘుడు, చేతితో తాళమువేయువాడు.
పాతకము
సం. నా. వా. అ. పుం. తత్స. మహాపాపము (ఇవి అయిదు, స్వర్ణస్తేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీగమనము, ఇవి చేయువారితోడి సహవాసము). పాతయతి అధో గమయతి దుష్క్రియాకారణమితి పాతకం. పాపము, దురితము, కల్మషము.
పాతాళము
సం. నా. వా. అ. న. తత్స. పతం త్యస్మిన్ పాపాత్పాతాళం. పాపమువలన దీనియందు పడుదురు, క్రిందిలోకము, బడబాగ్ని. పతంత్యస్మిన్ దుష్క్రియావంత ఇతి పాతాళం. అధోభువనము, రసాతలము, నాగలోకము, అధోలోకము, ఉరగస్థానము, నీరు.
పాతుకుడు
సం. విణ .(అ.ఆ.అ).తత్స. పతతి తాచ్ఛీల్యేనేతి పతయాళుః. స్వభావముననే పడువాడు, పడునట్టి స్వభావము కలవాడు.
పాత్రము
సం. నా. వా. అ. న. తత్స. పీయత ఇతి పాత్రం. పానము చేయబడునది. పాతీతి పాత్రం. రక్షించునది. పాత్యాధేయ మితి పాత్రం. అధేయ వస్తువులను రక్షించునది. పాతిరక్షతి పీయతే స్మిన్నితి చపాత్రం. రక్షించుటకనుక. రెండుదరుల నడుము, భ్రుకుంసాది, మంత్రి, యోగ్యము, స్రువాది భాజనము (ఇది తెనుగున భాజనార్ధమునందు కొందఱు మహాకవులచే పాత్రయని ప్రయోగింపబడియున్నది ఒకచో నర్తకియును అర్ధమునందు వైకృతముగా ప్రయోగింపబడినది), ఒక జాతిపక్షి, హోమమునకుఉపయోగించు దర్వి, నాటక వేషదారి, నదీశయ్య, చిన్నగిన్నె, రెండురాశులు, విలువకలధి, ధనము.
పాదకటకము
సం. నా. వా. అ. పుం. తత్స. పాదస్యకటకః పాదకటకః. పాదము యొక్క కటకము, అందియ.
పాదగ్రహణము
సం. నా. వా. అ. న. తత్స. పాదయోర్గ్రహణం పాదగ్రహణం. పాదములు పట్టుకొనుట. అభివాదము.
పాదప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాదైర్మూలైః జలం పిబతీతి పాదపః. వేళ్లువానిచే జలమును పానము చేయునది, పావుకోళ్లు, చెట్టు, కాళ్లుంచుకొనెడు పీట.
పాదబంధనము
సం. నా. వా. అ. న. తత్స. పాదే బంధనమస్య పాదబంధనం. పాదమందు బంధనము కలది, ఆవుగేదెలోనగునది.
పాదము
సం. నా. వా. అ. పుం. తత్స. పద్యంత ఇతి పాదాః. పొందబడునవి. పద్యతే అనేనేతి పాదః. దీనిచేత పోదురు. పద్యత ఇతి పాదః. విభాగమును పొందునది. అడుగు, కిరణము, వేరు పద్యమునందలి ఒక చరణము, పాతిక, కొండతఱితిప్ప, కాలు, పాదము, నాల్గవ వంతు.
పాదస్ఫోటము
సం. నా. వా. అ. పుం. తత్స. పాదాః స్ఫుట న్త్యనేన పాదస్పోటః. దీనిచేత కాళ్లు పగులును, కాళ్లుపగుళ్లపాలెడు కుష్ఠవిశేషము.
పాదాంగము
సం. నా. వా. అ. న. తత్స. పాదే అంగదమివ పాదాంగదం. పాదమందు బాహుపురివలెనుండునది, అందియ.
పాదాగ్రము
సం. నా. వా. అ. న. తత్స. పాదస్య అగ్రం పాదాగ్రం. పాదముకొన, మీగాలు, ప్రపదము.
పాదాతము
సం. నా. వా. అ. న. తత్స. పాదాత మస్యాస్తీతి పాదాతికః. పదాతిసమూహముకలవాడు. పాదాభ్యాం అతతీతి పాదాతః. పదాతుల సమూహము.
పాదాతికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పాదాతమస్యాస్తీతిపాదాతికః. పదాతి సమూహముకలవాడు, కాలిబంటు, పదాతి.
పాదుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాదూరేవపాదుకా. పాదములయందుకట్టబడునది, పావుకోళ్లు.
పాదూకృత్తు
సం. నా. వా.త్.పుం. తత్స. పాదూం కరోతీతి పాదూకృత్. ముచ్చెలు నేయువాడు, మాదిగవాడు, చెప్పులుకుట్టువాడు.
పాద్యము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పాద్యం పాదాయవారిణి. పూజకొఱకైన జలము, పాదముకొఱకైనది.
పాధస్సు
సం. నా. వా. స్. న. తత్స. పయత ఇతియః పయగతౌ. ప్రవహించునది, జలము, అన్నము, నీరు.
పానగోష్ఠిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పానస్య గోష్ఠికా పానగోష్ఠికా. మాటలు దీనియందు కలిగియుందురు. అనేకులు చేరిమద్యపానముచేసెడి చోటు.
పానము
సం. నా. వా. అ. న. తత్స. పిబంత్యస్మిన్నితి పానం. దీనియందు కల్లుత్రాగుదురు, త్రాగుడు, త్రాగుడుగిన్నె, కాపు, లింగపీఠము, పానపట్టమ. పీయతే ఖగాదిభిర్యత్ర.
పానీయము
సం. నా. వా. అ. న. తత్స. పీయత ఇతి పానీయం. పానము చేయబడునది, జలము, త్రాగతగినది, కావదగినది, నీరు.
పానీయశాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పానీయస్య జలస్యశాలా పానీయశాలిక. జలము యొక్కఇల్లు, చలిపందిరి, చలివేంద్రము.
పాపచేలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పాపం చలయతీతి పాపచేలీ. పాపమును చలింపచేయునది, అగలుసొంటి, ఒక తీగ.
పాపము
సం. నా. వా. అ. న. తత్స. పిబతి పాపిష్ఠమితి పాపం. సం. విణ. తత్స. పాపిష్ఠుని గ్రసించునది. పాపమస్యేతి పాపః. పాపము కలవాడు, దుష్కృతము, తాడికాయ, దురితము, క్రూరుడు. పాతి రక్షతి అస్మాదాత్మానితి పాపః. అధమము, నికృష్టము, అధర్మము, దురదృష్టము, పంకము, పాపము, కల్మషము, కలుషము, అగము, అంహస్సు, దురితము, పాతకము, కణ్వము, శల్యము, పాపకము.
పాపాత్ముడు
సం. నా. వా.న్.అ. తత్స. పిబతి పాపిష్ఠమితి పాపం. పాపిష్ఠుని గ్రసించునది, పాపచిత్తుడు.
పామ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాతిపిబతి అంగసౌష్ఠవమితిపామ. శరీరసౌష్ఠవమును పానము చేయునది, గజ్జి.
పామనుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పామాస్యాస్తీతీ పామనః. గజ్జికలిగినవాడు.
పామరుడు
సం. విణ .(అ.ఈ.అ).తత్స. పాప్మానం పామానం వారాతీతి పామరః. పాపమునుగాని, తీటనుగాని పుచ్చుకొనువాడు అజ్ఞుడు, నీచుడు, సంకరజాతి, అధముడు, అజ్ఞాని.
పామా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాతి పిబతి అంగ సౌష్ఠవమితి పామా. శరీరసౌష్ఠవమును పానము చేయునది, గజ్జి.
పాయసము
సం. నా. వా. అ. న. తత్స. సరళదేవదారు పయోవికారత్పాయసః. సరళదేవదారువుల యొక్క పాలవలనపుట్టినది. పయసాసంస్కృతం పాయసం. పాలచేత పక్వము చేయబడినది. పరమాన్నము, దేవదారు బంకతో చేసిన ధూపము.
పాయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పాతిమలోత్సర్జనేనపాయుః. మలమును విడుచుట చేత రక్షించునది, గుదము, మూడి. పాతి రక్షతి శరీరం మలనిస్సారనేనేతి పాయుః. మలద్వారము, అధోమర్మము.
పాయ్యము
సం. నా. వా. అ. న. తత్స. మీయతే అనేనేతి పాయ్యం. దీనిచేత కొలువబడున, త్రాసు, మూర, తూములోనగుమానము, జలము, నిందింపదగినది, మూరతో కొలుచుట.
పారదము
సం. నా. వా. అ. పుం. తత్స. రోగస్య పారం దదాతీతి పారదః. రోగము యొక్క తుదనిచ్చునది, పాదరము. జరామరణ సంకటాదిభ్యః పారం దదాతీతి పారదః. ధాతువిశేషము, రసము, అమృతము, ఒక దేశము.
పారము
సం. నా. వా. అ. న. తత్స. పార్యతే తరణకర్మాత్ర పారం. దీనియందు దాటెడు వ్యాపారము ముగియును, ఆవరిదరి, సమీపము, ఎదుటి ఒడ్డు. పారయతీతి పారం. పరతీరము, పారదము.
పారశీకము
సం. నా. వా. అ. పుం. తత్స. పారశేకదేశేభవాః పారసీకాః. పారసీక దేశమందుపుట్టినవి. ఒకానొకదేశము, ఆదేశమునదు పుట్టిన గుఱ్ఱము, పర్షియా దేశపు గుఱ్ఱము.
పారశ్వధికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరశ్వధః ప్రహరణమస్య పారశ్వధికః. గండ్రగొడ్డలి ఆయుధముగా కలవాడు.
పారస్త్రైణేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరస్త్రియా అపత్యం పారస్తైణేయః. పరస్త్రీకొడుకు, పరస్త్రీ వలన పుట్టిన కొడుకు.
పారాయణము
సం. నా. వా. అ. న. తత్స. పరమాసక్తేరయనం పరాయణం. ఆసక్తికి ఉత్కృష్టస్థానమైనవాడు, అంతయు, అంతయు చదువుట, పారమును పొందుట. పారం సమాప్తిం అయతే గచ్ఛతి ప్రాప్నోతీతి పారాయణం, నీరు త్రాగుచు నాల్గునెలలు చేయు ఉపవాసవ్రతము, పూర్తిచేయుట, కొర్కెము తగుల్చుట.
పారావతము
సం. నా. వా. అ. పుం. తత్స. పారేణ బలేన అవతీతి పారావతః. పారమనగా బలము, దానిచేత పోవునది, పావురము, కోతి, తుమకి, సంకరజాతి, అగిసె పాదరసము, బియ్యము, ఇంద్రనీలము, వెలవెలబారినది కుఱుచైనది.
పారావతాంఘ్రి
సం. నా. వా.ఇ.స్త్రీ. తత్స. రక్తత్వేన పారాతాంఘ్రిస దృశత్వాత్ పారాహతాంఘ్రిః. పావురము, కాళ్లవలె ఎఱ్ఱనైఉండునది, మానేరు.
పారావారము
సం. నా. వా. అ. న. తత్స. పారమ పారమస్య పారాపారః. అపారమైన తీరముకలిగినది, సముద్రము, ఈవలావలిదరులు. పారావారం తటద్వయం, పారం అవారం చ వా అస్త్యస్యేతి పారావారః. సముద్రము.
పారాశరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పారాశర్య ప్రోక్త సూత్రమథీతే పారాశరీ. వేదవ్యాసులు, చెప్పిన సూత్రముల అధ్యయనముసేయువాడు వ్యాసముని, సన్న్యాసి.
పారికాంక్షి
సం. నా. వా. న్. పుం. తత్స. పరం బ్రహ్మజ్ఞానం కాంక్షత ఇతి పారికాంక్షే. బ్రహ్మజ్ఞానము కోరువాడు, ముని, కృఛ్రచాంద్రాయణాది వ్రతశీలుడు, తపస్సుచేయువాడు.
పారిజాతము
సం. నా. వా. అ. పుం. తత్స. పారముదకమస్మిన్నస్తితివా పారీసముద్రః తస్మాజ్ఞాతః పారిజాతః. సముద్రము వలన పుట్టినది. పారిణః సముద్రజ్జాతః పారిజాతః. సముద్రమందు పుట్టినది. పారిభ్రద్రము, కల్పవృక్షము, ధాన్యవిశేషము, కల్పవృక్షములలో ఒకటి.
పారితథ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కేశపాశస్యపరితస్సర్వతస్తధాభవతి శోషతేపారితథ్యా. కేశపాశమందతట ప్రకాశించునది, జడబిళ్ల, సిగపువ్వు, కేశాలంకారము.
పారిప్లవము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పరిప్లవత ఇతి పారిప్లవం. కదలునది కనుక చంచలము, చలించునది.
పారిభద్రము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితో భద్రమస్య పారిభద్ర. అంతటను శుభముకలది, దేవదారువు, వారిజము, వేము,మల్లె.
పారిభావ్యము
సం. నా. వా. అ. న. తత్స. పారిఘ తోయేఘ భవతీతి పారిభావ్యం. నీళ్లుండెడు స్థలమందు పుట్టునది, చెంగల్వకోస్టు, ఒక ఓషధి.
పారియాత్రకము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితో యాత్రాగమనమస్యాస్తీతి పారియాత్రకః”. చుట్టువాఱనడుచుట కలిగినది, ఒకానొకకొండ.
పారిషధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పరిషధి సాధవః పారిషదాః. సభయందుసాధువులు, ప్రమధగణమునందలి చండికేశ్వరవాది.
పారిహార్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పరితో హరంత్యనేనేతి పరిహారోహస్తః తత్రభవః పారిహర్యః. హస్తమునందుండునది, సూడిగము, ఆవాపకము పరిహరము చేయదగినది.” .
పారుష్యము
సం. నా. వా. అ. న. తత్స. పరుషమప్రియ వచః తస్యభావః పారుష్యం. అప్రియవచనము, పరుసదనము, పరుషపుమాట.
పార్ధివ
సం. నా. వా. అ. పుం. తత్స. పృథివ్యా ఈశ్వరః పార్ధివః. భూమికి ప్రభువు, ఒకానొక సంవత్సరము. గుఱ్ఱము, పృధివి సంబంధమైనది, రాజు.
పార్ప్ణి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పారయతి గమనం పార్ప్ణిః. గమనమును నెఱవేర్చునది, వేరుఱెత్తిన ఆడుది, కాలిమడమ, దండు వెనుక, వెనుక.
పార్ప్ణిగ్రాహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పార్ప్ణిం పృష్ఠభాగం యో గృహ్ణతిస పార్ప్ణిగ్రాహః. ఒక్కదిక్కును గెలువబోవు రాజునకు వెనుకనుండు శత్రువు. దండెత్తి పోవు రాజునకు వెనుకదిక్కునుండు శత్రువు, సేన వెనుక నుండ వీరభటుడు.
పార్వతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. పర్వతమునకు కూతురు. గౌరి, ద్రౌపది, ఒక గోపిక, అందుగు, పాలకూర. పర్వతో హిమాచలస్తస్య తదధిష్ఠాతృ దేవస్యేతి భావః. అపత్యమితి. దుర్గ, ఉమ, శివా, భవాని, రుద్రాణి, సువాసనకల భూమి.
పార్వతీనందనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పార్వత్యాః నందనః పార్వతీనందనః. పార్వతిదేవికొడుకు, కుమారస్వామి.
పార్శ్యము
సం. నా. వా. అ. న. తత్స. పార్శ్యయో ర్భాగః పార్శ్వభాగః. ఎనుగు యొక్క ఉభయ పార్శ్వములు, పర్శువులసమూహము, సమీపము, చంకక్రిందిభాగము, ప్రక్క ఎముకలు.
పార్శ్యము
సం. నా. వా. అ. న. తత్స. పార్శ్వయోర్భాగః పార్శ్వభాగః. ఏనుగు యొక్క ఉభయపార్శ్వములు, పర్శువులసమూహము సమీపము.
పాలంక్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాలేన రక్షణేన అంక్యతి ఇతి పాలంక్యా. రక్షణముచేత పొందబడునది. కుందురుష్కమనెడు గంధద్రవ్యము.
పాలాశము
సం. నా. వా. అ. పుం. తత్స. పలాశం పర్ణం తత్తుల్యవర్ణతయా పాలాశః. ఆకుతోసమానమైన కాంతికలది. ఆకుపచ్చనిది. పాలాశస్య వర్ణ ఇవ వర్ణో అస్త్యత్రేతి పాలాశః.
పావకము
సం. నా. వా. అ. పుం. తత్స. పునాతీతిపావకః. పవిత్రమును చేయువాడు, చిత్రమూలము, జీడి, నెల్లి, అగ్ని, ఒకవృక్షము, సోపానము.
పాశకము
సం. నా. వా. అ. పుం. తత్స. పశ్యన్తే బధ్యంతే ఏభిరితి పాశకాః. దీనిచేత కట్టబడుదురు, పాచిక, అక్షము.
పాశము
సం. నా. వా. అ. పుం. తత్స. పాశ్యత ఇతి పాశః. కట్టబడునది, త్రాడు, కేశపర్యాయములకు పరమైనచోవాని సమాహము. పశ్యతే బధ్యతే అనేనేతి పాశః. ఉరి.
పాశి
సం. నా. వా.న్.పుం. తత్స. పాశోస్యాస్తీతిపాశీ. వరుణుడు, యముడు, వ్యాధుడు, పాశధరుడు.
పాశుపతము
సం. నా. వా. అ. పుం. తత్స. పశుపతే రయం ప్రియః పాశుపతః. శివునికి ప్రియమైనది, పశుపతి అధిదైవతముగాకల ఒకఅస్త్రము. పశుపతిమతము, ఒకపుష్పము, పశుపతియందు ఆశకలది.
పాశుపాల్యము
సం. నా. వా. అ. న. తత్స. పాలయతీతి పశుపాలః. గోమహిష్యాది పశువులను పాలించువాడు, వృత్తి, పశుపోషణ.
పాశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పంసయతి దృష్టిమితి పాంసుః. దృష్టిని చెఱుచునది, దుమ్ము, ఎరుపు, ధూళి.
పాశ్చాత్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పశ్చాద్భవం పాశ్చాత్యం. వెనుకపుట్టినది, వరుణుడు, పడమటివాడు, వెనుకటివాడు, కడపటిది.
పాశ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాశానాం సమూహః పాశ్యా. త్రాళ్లయొక్క సమూహము, పాశములసమూహము, ఉరిత్రాళ్లు.
పాషండము
సం. నా. వా. అ. పుం. తత్స. పాశాన్ సంసృతి బంధహేతుభూతాని అసచ్ఛాస్త్రాణి అణంతి వదంతీతి పాషాండాః. సంసారబంధ హేతుభూతములైన యసచ్ఛాస్త్రములను పలుకువారు. ఒకమతము, నాస్తికులలో ఒకడు.
పాషాణదారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పాషాణం దారయతీతి పాషాణ దారణః. ఱాతిని వ్రక్కలించునది, ఱాయితొలుచు పనివాడు, కాసేడు, చిన్నగొడ్డలి.
పాషాణము
సం. నా. వా. అ. పుం. తత్స. వస్తూని పినష్టి చూర్ణయతీతి పాషాణ. వస్తువులను చూర్ణము చేయునది, ఱాయి, శిల, గ్రావము. పషతి పీడయత్యనేనేతి పాషాణః.
పింగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పింజతీతి పింగళః. వర్ణమును చేయునది, గోరోజనము, పార్వతి, ఇంగువ, కాడ, కురువేరు, గోరోజనపు వర్ణముకలది, ఒకజాతిపాము, కపిలవర్ణము.
పింగళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పింగళ వర్ణత్వాత్పింగళః. పింగళ వర్ణము కలవాడు. పింగ వర్ణం లాతీతి పింగళః. పింగవర్ణము నిచ్చునది. దక్షిణపుదిక్కునందలి ఆడేనుగు, ఒకనాడి, పైడికంటి, ఒకానొకవేశ్య, సంవత్సరవిశేషము. గోరోజనమువంటి వర్ణము, కోతి, ఒకపాము, ముంగిస, నిధి విశేషము, కురువేరు, కపిలవర్ణము.
పింజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పింజ్యతేస్మపింజః. హింసాయాం, దూది, పసుపు, బలము, హింస కలత పాఱినది.
పింజరము
సం. నా. వా. అ. న. తత్స. తామ్రో విపీతరక్తస్తు పిఞ్జరః. గలిగొట్టుపువ్వు, బంగారము, హరిదళము ఎరుపుమించిన పసుపు వర్ణము, తామ్రము, కలతపాఱినది. పీతవర్ణత్వాత్ పింజరం. పచ్చని వన్నెకలది, హరిదళము.
పింజలము
సం. నా. వా. అ. పుం. తత్స. సముత్పిఞ్జ్యతే భృశం సముత్పిఞ్జః పింజలశ్చ. మిక్కిలి పీడింపబడునది, మిక్కిలి కలత పాఱిన సేనలోనగునది.
పిండము
సం. నా. వా. అ. న. తత్స. పిండ్యతే సంహన్యత ఇతి పిండం. ముద్దగా చేయబడినది. పిండ్యతే పిండీక్రియత ఇతి పిండం. బ్రదుకుతెరువు, ఇనుము, అన్నపుపిడుచ, పితృదేవతలకిచ్చెడు అన్నపుముద్ద ,గర్భము, శరీరము, శరీరమందు ఏక దేశము, గృహమునందుఏక దేశము,చెండు, గజకుంభము, భోళము, బలము, సమూహము, దట్టము, చిల్లమడ్డి, దాసనము, పరిమళించుజిగురు, గుండ్రనిది, శరీరము.
పిండిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పిండాకారత్వాత్పిండికా. ముద్దగానుండునది, బండికంటినడిమితూము, తురుష్కదేశమునందు అందుగుబంకతోచేసెడు ధూపద్రవ్యము,పిక్కయందలిమాంసము, కాలిపిక్క, గృహనివేశనము, బంతి.
పిండీతకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వల్పం పిండీ భావమితః ప్రాప్తం పిండీతకః. కొంచెము పిండీ భావమును పొందునది, మంగ, మరువము, ఒకవృక్షము.
పికము
సం. నా. వా. అ. పుం. తత్స. అపికాయతీతి పికః. చాటు నుండి కూయునది, కోకిల.
పికవర్ధనము
సం. నా. వా. అ. పుం. తత్స. పికం వర్ధయతి పికవర్ధనః. కోయిలలను వృద్ధి పొందించునది, కాకి.
పిచండము
సం. నా. వా. అ. పుం. తత్స. పచతి అన్నం స్వగతిగ్నినా పిచండః. తనయందుండెడు అగ్నిచేత అన్నమును పక్వముసేయునది. కడుపు, పఱుపు, పడక, పొట్ట.
పిచండిలుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పిచండిలశ్చ తుందిభః. దొడ్డకడుపుకలవాడు, పెద్దకడుపువాడు. అతిశయితం పిచండముదరం అస్య ఇతి పిచండిలః. పొట్టకలవాడు.
పిచుమందము
సం. నా. వా. అ. పుం. తత్స. పిచు మృద్నాతీత పిచుమర్ధః. కుష్ఠమును మర్ధించునది, వేము, నింబము. పిచుం కుష్ఠవిశేషం మందయతి నాశయతీతి పిచమందః. వేపచెట్టు.
పిచులము
సం. నా. వా. అ. పుం. తత్స. పిచుంతూలం లాతీతి పిచులః. పిచుమనగాదూది, దానిని సంపర్గముననుంచుకొనునది నీటికాకి, గన్నేరు, పక్కె, ఒకవృక్షము.
పిచువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పిచ్యతే మర్ధ్యత ఇతి పిచుః. ఏకబడునది, దూది, కుష్ఠబేధము, మాడ, ఒకానొకరాక్షసుడు, 16 మాషములు, కష్ఠము, అసురవిశేషము, సస్యభేదము.
పిచ్చటము
సం. నా. వా. అ. న. తత్స. పిచ్యతే కుట్యత ఇతి పిచ్చటం. కొట్టబడునది, తగరము, సత్తు, కంటితెవులు.
పిచ్ఛ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పింఛయతీతి పింఛం. ప్రకాశించునది, అరటి, ఒఱ, గుఱ్ఱపు కాలిపుండు ,పోక, సమూహము, పాము యొక్క జొల్లు, బూరుగుబంక, వరుస, గంజిమీదిమీగడ, నెమలిపురి, సిగ, తోక, పక్షిరెక్క.
పిచ్ఛా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరాంగుళి సంగాత్ పిచ్ఛా. వేలికి అంటుకొనునది, అరటి, ఒర, గుఱ్ఱపుకాలి పుండు, పోక, సమూహము, పాము యొక్క జొల్లు, బూరుగుబంక వరుస, గంజి మీది మీగడ, బియ్యపు గంజి.
పిచ్ఛిల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పిచ్ఛాస్య సంజాతా పిచ్ఛిలం. అనగాబంక, అదికలిగినది. ఇరుగుడు, బూరుగు, పేరినది, మీగడకట్టినది, గడ్డకట్టినది.
పిటకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. పిటతి సంశ్లిష్యతి పిటకః. వ్రక్కలై కూడుకొన్నది, చిన్నపెట్టె, చిన్నగంప. పేటతీతిపిటకః. కూడుకొని ఉండునది, ధాన్యపుగంప, కురుపు, విస్ఫోటము, స్ఫోటకము, మంజూష, పేటకము, పేటిక, పేడిక. సం. నా. వా. అ. న. తత్స. కురుపు, పుండు.
పిటము
సం. నా. వా. అ. పుం. తత్స. పిట్యతే వేణుదళైరితిపిటః. వెదురుబద్దల చేత కూర్పబడునది, ఎలుకల చేత కొరకబడునది, గంప, కండోలము, ధాన్యపుగంప.
పిఠరము
సం. నా. వా. అ. న. తత్స. పచ్యతే పచత్యస్మిన్నితి, పిఠతీతి చ పిఠరం. పాకము దీనియందు చేయబడును. పచ్యతేన్నమత్రేతి పిఠరః. దీనియందు అన్నము వండబడును, కుండ, కవ్వపు కోలకును పేరు, ముస్తె (వృక్ష విశేషము), వంటకుండ, స్థాలి, పిఠరి.
పిణ్యాకము
సం. నా. వా. అ. పుం. తత్స. పిణ్యం పిండాకార మకతీతి పిణ్యాకః. పిడుచకట్టిఉండునది, తెలికపిండి, ఇంగువ, చిల్లమడ్డి, కుంకుమపువ్వు, గారచెట్టు.
పితామహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పితామహః పితృణాం పితా, పితృణామపి జనయితేత్యర్థః. పిత (తండ్రులను) పుట్టించినవాడు. పితామహస్యపితా ప్రకర్షేణ ప్రపితామహః. తాతతండ్రి, ముత్తాత, తండ్రియొక్కతండ్రి, తండ్రి, బ్రహ్మ.
పితృపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పితృణాం కవ్యవాహనాదీనాం పతిః పితృపతిః. పితృదేవతలైన కవ్యవాహనాదులకుపతి, యముడు, పితరులరాజు. పితృణాం పతిః పితృపతిః.
పితృప్రసువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. పితృణ్ ప్రసూత ఇతి పితృప్రసూః. పితృదేవతలను పుట్టించునది, ప్రొద్దు పొడుచుటకు ముందు ఐదు గడియల వరకును, ప్రొద్దుగుంకిన వెనుక మూడు గడియల వరకుకలకాలము, సంధ్య వెలుగు.
పితృవనము
సం. నా. వా. అ. న. తత్స. పితృక్ ప్రేతాక్ వనతీతి పితృవనం. శవములను పొందునది, శ్మశానము, ఒలికిమిట్ట.
పితృవ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పితః భ్రాతా పితృవ్యః. తండ్రితోడ పుట్టినవాడు.
పిత్తము
సం. నా. వా. అ. న. తత్స. పతతి పిత్తం పత్గ్ గతౌ. ద్రవరూపమై పడునది, ధాతువిశేషము, పైత్యము.
పిత్ర్యము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పితృణా మిదం పైత్రం. పితృసంబంధమైనది, తండ్రిది. పితరో దేవతా అస్య కవ్యాదేరితి పిత్ర్యం, పూర్ణిమ.
పిత్సంతము
సం. నా. వా. త్. పుం. తత్స. పతితు మిచ్ఛంతః పిత్సంతః. పోవనిశ్చయించునవి, పక్షి, పడనిచ్చకలది.
పిధానము
సం. నా. వా. అ. న. తత్స. పిధదాతీతి పిధానం. మఱుగగునట్టిది, మఱుగు, తిరోధానము, అంతర్ధానము, కప్పు.
పినద్ధము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. అపినహ్యత ఇతి పినద్ధః. బంధింపబడునది, కట్టబడినది, (వస్త్రము) తొడగబడినది (కవచము) .
పినాకము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రిపురదాహకాలే శరజ్వాలాజాలైర్నాకంపిహితవాన్ పినాకః. శరజ్వాలలచేత స్వర్గమును కప్పినది. పాతీతీ పినాకః. రక్షించునది, శివునివిల్లు, త్రిశూలము, మట్టివాన, దుమ్ముతోకూడినవాన.
పినాకి
సం. నా. వా. న్. పుం. తత్స. పినాక ఇతి ధను రస్యాస్తీతి పినాకీ. పినాకమనెడు విల్లుకలవాడు, శివుడు, ముక్కంటి.
పిపాస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాతుమిచ్ఛాపిపాసా. పానముసేయునిచ్ఛ, నీరుత్రావనిచ్చ, నీరువట్టు, తృష్ణ, దప్పి.
పిపీలిక
సం. నా. వా. అ. పుం. తత్స.
పిప్పల
సం. నా. వా. అ. పుం. తత్స. భక్తాన్ పాతీతి పిప్పలః. తననుసేవించువారిని రక్షించునది, పిప్పలి, జలము, రావి, బాతు. పిప్పలం జలం సిచ్యమానత్వేన అస్త్యస్య మూలావచ్ఛేధే ఇతి పిప్పలః. సూదిదారము.
పిప్పలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కరియోగ్యాపిప్పలీ. ఏనుగుకు యోగ్యమైన పిప్పలి, ఊషణ, రావి, ఏనుగు చెవి మొదటిభాగము.
పిప్లువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. నిజవర్ణేన పరిప్లవతే వ్యాప్నోతీతి పిప్లుః. వ్యాపించునది, పుట్టుమచ్చ, తిలకాలకము, గుర్తు.
పిశంగము
సం. నా. వా. అ. పుం. తత్స. పింశుతీతి పిశంగః. వర్ణాంతరమును పొందునది, కపిలవర్ణము.
పిశాచము
సం. నా. వా. అ. పుం. తత్స. పిశితం మాంసమశ్నాతీతి పిశాచః. దేవయోని విశేషము, పిల్లి, ప్రేతము.
పిశిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పింశతి శరీరావయవోభవతీతిపిశుతం. పింశత్యనృతస్యావయవో భవతీతి పిశునః. శరీరమునకు అవయవమగునట్టిది, జటామాంసి, మాంసము, పిశ్యతీతి పిశునః. పీడించువాడు.
పిశున
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బాహ్లికం పీతనం కాంతు పిశునం. ధరించునది, స్పృక్క, కొండబెండ, కుంకుమపువ్వు, కాకి. పింశత్యనృతస్యావయవో భవతీతి పిశునః. అసత్యమునకు అవయవమయినవాడు. పిశ్యతీతి పిశునః. పీడించువాడు.
పిష్టకము
సం. నా. వా. అ. న. తత్స. పిష్టవికారత్వాత్ పిష్టకః. పిండిచేత చేయబడునది, నూపొడి, పిండివంట నేత్రరోగవిశేషము, కించిజఘనాదిక్యమునుస్తనాంత విస్తృతియుకలగజ విశేషము, రొట్టె.
పిష్టపచనము
సం. నా. వా. అ. న. తత్స. పిష్టం పచ్యతేస్మిన్నితి పిష్టపచనం. దీనియందు పిండి పక్వము చేయబడును. పిండివంట చేసెడుపాత్రము, బూరెలమూకుడు, రొట్టెలు చేయుపాత్ర.
పిష్టాతకము
సం. నా. వా. అ. పుం. తత్స. పిష్టం పిష్టత్వం అతతి పిష్టాతః. చూర్ణరూపమును పొందిఉండునది. వస్త్రములకు వాసన కట్టెడు బుక్కామ, పటవాసకము, సువాసనకై బట్టలపై చల్లుపొడి.
పీఠము
సం. నా. వా. అ. పుం. తత్స. పీఠ్యతే సంశ్లిష్యతే పీఠం. పొందబడునది, ఆసనము, పీట. పేఠంత్యుపవిశంత్యస్మిన్నితి పీఠం.
పీడనము
సం. నా. వా. అ. న. తత్స. పీడ్యతే పీడనం. పీడించుట, పరులచేకలుగురాయిడి, బాధించుట.
పీడా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పీడ్యంతే అనేయేతి పీడా. పీడింపబడుదురు, బాధ, కరుణ, సిగదండ, సరళవృక్షము, వ్యధ, దుఃఖము, కష్టము, వేధన, జాలి.
పీత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పిబతి మన ఇతి పీతః. మనస్సులోనగొనునది, ఎండ్రకాయ, పసుపు, త్రాగబడినది, గంధకము.
పీత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పీతవర్ణత్వాత్ పీతా. పచ్చని వన్నె కలది, పసుపు.
పీతదారువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పీతవర్ణం దారుపీతదారు. పచ్చనిదారువు, దేవదారువు, కొమ్ముపసుపు, చవురుకరపుచందనము.
పీతద్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పీతవర్ణోద్రుః పీతద్రుః. పచ్చని వన్నెకల వృక్షము. పీతః ద్రుః స్కధోస్కపీతద్రుః. పచ్చనికొమ్మలు కలది, మ్రానిపసుపు, సరళవృక్షము.
పీతనము
సం. నా. వా. అ. న. తత్స. రసేన వస్త్రాదికం పీతం కరోతీతి పీతనః. రసముచేత వస్త్రాదులను పచ్చగా చేయునది. పీతయతి చందనాదికం పీతనం. చందనాదుల పచ్చగా చేయునది. కుంకుమపువ్వు, హరిదళము పీత వర్ణత్వాత్ పింజరం, పీతనం. దేవదారువు, అంబాళము. పచ్చనివన్నెకలదికనుక, అడవిమామిడి.
పీతసాలకము
సం. నా. వా. అ. పుం. తత్స. పీతవర్ణస్సాలః పీతసాలః. పచ్చని వృక్షము, వేగిస, పచ్చమద్ది.
పీతాంబరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పీతాంబరః పీతమంబరం యస్యసః. పచ్చనివలువకలవాడు, విష్ణువు, పచ్చవలువదారి, పీతవస్త్రముకలవాడు.
పీతి
సం. నా. వా.ఇ.స్త్రీ. తత్స. పీతిః పానేస్త్రీపీతి. వేగముగా పోవునది, పానము, గుఱ్ఱము, త్రాగుట.
పీనము
సం. నా. వా. అ. న. తత్స. ప్యాయత ఇతి పీనం. వృద్ధిపొందునది, సంతోషము, చెమట, బలిసినది, బలిసినవాడు.
పీనసము
సం. నా. వా. అ. పుం. తత్స. పీనం ప్రవృద్ధమప్యజ్గం స్యతీతి పీనసః. ఘనమైన శరీరమైనను నశింపచేయునది, రోగవిశేషము పడిసెము. పీనం స్థూలమపి జనం స్యతి నాశయతి ఇతి పీనసః. నాసికారోగ విశేషము, ఒకపాము, జలుబు, రొంప.
పీనాహము
సం. నా. వా. అ. పుం. తత్స. పీనహ్యాతే ఇష్టకాభిరితి పీనాహః. ఇటికెలు మొదలైనవానిచేత కట్టబడినది. ఇటిక లోనగువానిచేత కట్టబడిన నూతివాతికట్టు, నూతిపైకప్పు.
పీనోధ్ని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పీనమూధోయస్యాస్సా పీనోధ్ని. పెద్దపొదుగుకలది, పెద్దపొదుగుకల ఆవు, బలిసిన పొదుగుకల ఆవు.
పీయూషము
సం. నా. వా. అ. న. తత్స. పీయత ఇతి పీయూషం. పానము చేయబడునది. పీయతే వత్సైరితి పీయూషః. దూడల చేత పానము చేయబడునది. అమృతము, జున్ను, పాలు, లేగటిపాలు.
పీలుపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పీలోః వర్ణానీవ పర్ణాన్యస్యపీలుపర్ణీ. గోగుచెట్టు ఆకులుకలది. చాగ, దొండ, ఒక వృక్షము.
పీవము
సం. విణ. (న్. ఈ. న్). తత్స. తప్యాయత ఇతి పీవం. వృద్ధి పొందునది కనుక పీవము, బలిసినది, పినము, స్థూలము.
పీవరము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్యాయత ఇతి పీవరం. వృద్ధిపొందినది, తాబేలు, బలిసినది, క్రొవ్వినది, పచ్చమద్ధి, బలిసినవాడు.
పుంఖము
సం. నా. వా. అ. పుం. తత్స. పుమాంసమ ఖనతీతి పుంఖః. బాణము క్రింది చివర, పింజ, బాణమున రెక్కలు కట్టబడిన భాగము, తెల్లనివి, కాండమూలము.
పుంగవము
సం. నా. వా. అ. పుం. తత్స. ఎద్దు, ఓషధి విశేషము, శ్రేష్ఠమైనవాడు.
పుంజము
సం. నా. వా. అ. పుం. తత్స. పుంజ్యతే సమూహ్యత ఇతి పుంజః. కూర్పబడునది, రాశి, ప్రోగు, ధాన్యరాశి. పింజ్యతే పింజయతీతి వా ఇతి పుంజః. సమూహము.
పుండరీకము
సం. నా. వా. అ. న. తత్స. పుండరీక వర్ణత్వా త్పుండరీకః. తెల్ల తామరవంటి కాంతికలది. పుణతి మంగళత్వా త్పుండరీకం. తెల్లతామర. పుణతీతిపుండరీకః. శుభకర్మమును చేయునది, తెల్లతామర, తెల్లగొడుగు తీర్థవిశేషము, గంధద్రవ్యవిశేషము, ఆగ్నేయదిక్కునందలి ఏనుగు, బెబ్బులి, కప్ప, తియ్యమామిడి, తెల్లపొడలకుష్ఠము, ఒకానొకముని, నిఘంటువులు చేసినవారలలో ఒకడు, ఒక దిగ్గజము, రాజిలజాతి పాము, ఒక విషము, బొల్లి, జ్వరము, ఏనుగు.
పుండరీకాక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పుండరీకాక్షః పుండరీకే ఇవ అక్షిణీయస్యసః. తెల్లతామరలవంటి కన్నులు కలవాడు, విష్ణువు, తెలిదమ్మికంటి. పుండరీకవదక్షిణీ నేత్రే యస్య సః పుండరీకాక్షః.
పుండ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. పుణతీతి పుండ్రః. శుభమును చేయునది, నలుపుకలసిన ఎఱ్ఱచెఱకు, తెల్లతామరనుదుటినామము, పురుగు, పువ్వులగురివెంద, పుండ్రకము వంగదేశము, ఒకరాక్షసుడు. పుండ్యతే గుడశర్కరాద్యర్థం చూర్ణీక్రియంతే ఇతి పుండ్రం. చిత్రము, క్రిమి, చెఱకు, నుదుటిబొట్టు.
పుంశ్చలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పు మాంసం ప్రలోభ్య చలతి గచ్ఛతి పుంశ్చలీ. పురుషుని మోహింపచేసి పొందునది, ఱంకుటాలు, కులట. పుంసో భర్తుః సకాశాత్ చలతి పురుషాంతరం గచ్ఛతీతి పుంశ్చలీ. అసతి, లంక, ధర్షిత. ?
పుచ్ఛము
సం. నా. వా. అ. పుం. తత్స. పూయతే దంశాదీ మత్సారయతీతి పుచ్ఛః. ఈగలు మొదలయినవానిని పోగొట్టునది. తోక, వెనుకప్రక్క. పుచ్ఛతీతి పుచ్ఛం.
పుట భేదము
సం. నా. వా. అ. పుం. తత్స. పుటం సంశ్లిష్టం భిందతీతి పుటభేదాః. లెస్సగా గట్టియై కూడియున్నస్థలమును భేదించునవి. పట్టణము, చతుర్విధవాద్యము, ఏటివంపు, మండలముఖ్యనగరము, సుడిగుండము.
పుటీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పూలబుట్ట, దొప్ప.
పుణ్యకము
సం. నా. వా. అ. న. తత్స. పుణ్యహేతుత్వాత్ పుణ్యకం. పుణ్యవిశేషము, ఉపవాసాది రూపవ్రతము.
పుణ్యజనుడు
సం. నా. వా. అ. న. తత్స. విరుద్ధలక్షణయా పుణ్యవాన్ జనః పుణ్యజనః. విపరీతలక్షణము చేత పుణ్యముకలవాడు. నైరుతి, రాక్షసుడు, యక్షుడు, పుణ్యాత్ముడగుమనుష్యుడు, మంచివాడు.
పుణ్యజనేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పుణ్యజనాః యక్షౌవారాక్షసావా, తేషామీశ్వరః పుణ్యజనేశ్వరః. యక్షులుకాని, రాక్షసులుకాని పుణ్యజనులనబడును. కుబేరుడు.
పుణ్యభూమి
సం. నా. వా.ఇ.స్త్రీ. తత్స. పుణ్యాచ సా భూమిశ్చపుణ్యభూమిః. పుణ్యమైన భూమి, వింధ్యమునకును, హిమవంతమునకును మధ్యదేశము.
పుణ్యము
సం. నా. వా. అ. న. తత్స. పుణ్యం తీర్థమిదం పుణ్యానదీపుణ్యోయమాశ్రమః. ధర్మము, సుకృతము, పవిత్రము, మనోజ్ఞము. పుణతీతి పుణ్యం. శుభమును చేయునది, సుకృతము, దానము, నీరు, బంగారము, పూవు, అందమైనది.
పుణ్యవంతుడు
సం. విణ. (స్). తత్స. పుణ్యమస్యాస్త్రీతి పుణ్యవాన్. పుణ్యముకలవాడు, పుణ్యస్వరూపుడు.
పుత్తిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పుత్ కుత్సితం తాయతే పుత్తికా. కుత్సితమునుచేయునది, పెరఈగ, పతంగిక, చెదలు.
పుత్రిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృత్రిమా పుత్రీ పుత్రీకా. పుత్రిక వలెనుండునది, పుత్రిక, పుత్తళిక, లక్కదూది, కొమార్తె.
పుత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నరకాత్త్రాయత ఇతి పుత్రః. వీనిని ప్రసవించును. పుత్రశ్చ దుహితాచపుత్రౌ. కొడుకును, కూతురును. (పుత్రులు పన్నిద్దఱు) 1. ఔరసుఁడు, (భార్యయందు తనకుఁపుట్టినకొడుకు). 2. క్షేత్రజ్ఞుడు. (ఏదేనిఒక కారణమున సంతానవిచ్ఛిత్తికలుగఁగా పెద్దల అనుజ్ఞచేత తనభార్యయందు దేవరుఁడులోనగువారికి పుట్టినకొడుకు). 3. దత్తుఁడు, (దత్తుతీసికొన్నకొడుకు). 4. కృత్రిముఁడు. (గుణ జ్ఞుఁడని అభిమానించిపెంచుకొన్నకొడుకు). 5. గూఢోత్పన్నుఁడు, (భార్యయందు తనకుతెలియకుండఱంకుమగనికి పుట్టినకొడుకు). 6. అపవిద్ధుఁడు. (తల్లిచేతఁగాని, తండ్రిచేతఁగాని, ఉభయులచేతనుగాని విడువఁబడఁగా తెచ్చి పెంచుకొన్నకొడుకు). 7. కానీనుఁడు, (తన భార్యయందు కన్యత్వమున రహస్యముగా ఇతరునికిపుట్టినకొడుకు). 8. సహోఢజుఁడు, (గర్బిణిగానుండ తెలిసికాని, తెలియకకాని వివాహాముచేసికొన్న భార్యయందుపుట్టిన ఆ కొడుకు). 9. క్రీతుఁడు, (తల్లిదండ్రులవద్దవెలయిచ్చికొనుక్కొన్న కొడుకు). 10. పౌనర్భవుఁడు, (పునర్భువునందుపుట్టినకొడుకు). 11. న్వయందత్తుఁడు, (తల్లిదండ్రులులేకకానితల్లిదండ్రులచేత అకారణముగవిడువఁబడికానితనంతట నేనునీకు పుత్రుఁడనయ్యెదనని వచ్చినకొడుకు). 12. జ్ఞాతిరేతుఁడు (జ్ఞాతికొడుకు). వీరిలో మొదటి ఆరుగురు బంధువులుదాయాదులునగుదురు. వెనుకటిఆర్గురుబంధువులగుదురుగాని దాయాదులుకారు. ఇది భారతమునందు వ్రాయఁబడియున్నవిధనముననురించినది. జ్ఞాతిరేతుఁడనుదానికి మాఱుగా మనుస్తృతియందుపారశవుఁడు (లేక) శౌద్రుఁడనియు, విజ్ఞానేశ్వరీయమునందుపుత్రికాపుత్రుఁడనియు వ్రాయఁబడియున్నది). పునాతి పిత్రాదీనితి పుత్రః. ఆత్మజుడు, తనయుడు, సూనువు, సుతుడు, అపత్యము, దాయాదుడు, కులధారకుడు, నందనుడు, కొమరుడు, కొడుకు.
పునర్నవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛిన్నాపి పునర్జాయత ఇతి పునర్నవా. నరికినను తిరిగి పుట్టునది, గలిజేరు (వృక్ష విశేషము), ఒక ఔషధి, గోరు.
పునర్భవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛిన్నోపి పునర్భవ తీతి పునర్భవః. చేతియందు మొలచునది, చంద్రకళ, గోరు, సంసారము మరలపుట్టినది.
పునర్భువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. ప్రథమ మేకస్య జాయా భూత్వాపునః అన్యస్య జాయా భవతీతి పునర్భూః. ముందొనకి పెండ్లామైఉండి మరల మఱి ఒకనికి పెండ్లామగునది, మాఱుమనువుది, దిధిఘవు, పునర్వివాహము చేసికొన్న విధవ.
పున్నాగము
సం. నా. వా. అ. పుం. తత్స. పున్నాగ ఇవ పున్నాగః. పురుషశ్రేష్ఠునివలె పూజ్యమైనది, సురపొన్నఇంద్రుని ఏనుగు, పురుషశ్రేష్ఠుడు, తెల్లకలువ, జాజికాయ. పుమాన్ నాగ ఇవ శ్రేష్ఠత్వాత్ పున్నాగః, పొన్న.
పురంథ్రీ
సం. నా. వా. ఇ .స్త్రీ. తత్స. పురంగృహం ధరతీతి పురంథ్రీ. గృహమును భరించునది, కుటుంబముకల ఆడుది, ఆడుది. స్వజన సహితం పురం ధారయతీతి పురంథ్రీ.
పురందరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురణి అరీణాం దారయతీతి పురందరః. శత్రుపురముల వక్రలించినవాడు, ఇంద్రుడు.
పురము
సం. నా. వా. అ. పుం. తత్స. పురతి అగ్రే సరతి ధూపవృక్షేష్వితి పురః. ధూప వృక్షముల అందు అగ్రమైనది, గుగ్గిలపుచెట్టు. సం. నా. వా. అ. న. తత్స. పూర్వత ఇతి పురం. పరిపాలింపబడునది, పట్టణము, పాటలీపుత్రమను పట్టణము, శరీరము, ఇల్లు, మేడ, మూడు, ఒక వృక్షము, వాసనకల గడ్డి, సంకరజాతి. ప్రియతే పూర్యతే ఇతి పురం. దేహము, చర్మము.
పురస్కృతమ
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పురః క్రియత ఇతి పురస్కృతః. ముందుగా చేయబడినవాడు, ముందిపబడినది, పూజింపబడినది, సన్మానింపబడినది, పరిగ్రహింపబడినది, తడుపబడినది, శత్రువుచే ఆక్రమింపబడినది, అపదూఱుపడినది, ఎదిరింపబడినవాడు, ముందునిల్చినవాడు.
పురస్సరుడు
సం. విణ. (అ.ఆ.అ) తత్స. పురస్సరతీతి పురస్సరః. ముందర పోవువాడు, ముందునడుచువాడు, పురోగముడు.
పురాణము
సం. నా. వా. అ. న. తత్స. పురా పూర్వస్మిన్ భూతమితి పురాణం. పూర్వమునం దైనదిగనుక “పురా భవతీతి పురాణం. పూర్వమందు పుట్టినది కనుక. స్వర్గప్రతిసర్గాది పంచలక్షణములతో కూడినబ్రహ్మాది అవిపదునెనిమిది) బ్రహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, నారదీయము, మార్కేండేయము, ఆగ్నేయము, భవిష్యత్తు, బ్రహ్మవైవర్తకము, లైంగము, వారాహము, స్కాందము, వామనము, కౌర్మము, మాత్స్యము, గారుడుము, బ్రహ్మండము). పురాతనము, ఐదులక్షణములతో కూడిన ఇతి వృత్తము, పదునాల్గువిద్యలలో ఒకటి, ప్రాచీనమైనది.
పురాతనము
సం. విణ .(అ.ఈ.అ). తత్స. పురాభవతీతి పురాతనశ్చ. పూర్వము నందు పుట్టినది కనుక పురాతనము, బహుదినములనాటిది, ప్రాచీనము.
పురావృత్తము
సం. నా. వా. అ. న. తత్స. ప్రాయత్వాన్నివృత్తం పురావృత్తం. పూర్వచరిత్రనిబంధన ప్రాయమైనది, తొల్లిటికథ, ఇతి హసము.
పురీతత్తు
సం. నా. వా. త్. న. తత్స. పురీం దేహం తనోతి పురీతత్. శరీరమును విస్తరింప చేయునది, ప్రేగు, ఆంత్రము.
పురీషము
సం. నా. వా. అ. న. తత్స. పూర్యతే అనేన ఉదరిమితి పురీషః. దీనిచేత ఉదరము నిండింపబడును, మలము, విష్ఠ. పిపర్తి శరీరమితి పురీషం, మట్టిపొడి.
పురుభువు
సం. విణ. (ఉ.ఊ.ఉ). తత్స. పుర్వితి సంజ్ఞయా భవతీతి పురుభూః. పూరింపబడునది, మిక్కుటము, చాల, ఎక్కువ.
పురువు
సం. నా. వా. అ. పుం. తత్స. పూర్యత ఇతి పురుః. విస్తారమైనది, తల, ఒకరాజు. సం. విణ. తత్స. మిక్కుటము, చాలా, ఎక్కువ, ప్రచురము, రాజవిశేషము, పర్వతభేదము, శరీరము, దేవలోకము, పరాగము.
పురుషముడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురిదేహేసీద దతివా పురుషః. శరీరమందుండెడువాడు. పురుషువధున్నతత్వాత్పురుషః. పురుషుని వలె ఉన్నతమైనది. పురంతి ప్రాణినామగ్రే గచ్ఛంతీతి పురుషః ప్రాణులకెల్ల అగ్రేసరులు గనుక. పిపర్తీతి పురుషః. పాలించువాడు, క్రియల మీది విభక్తుల సంజ్ఞ (ఇవి మూడు ప్రధమ, మధ్యమ, ఉత్తమ పురుషములు) శాస్త్రము, సురపొన్న. పురతి అగ్రే గచ్ఛతీతి పురుషః. బ్రహ్మ, మగవాడు, ఆత్మ, పరమాత్మ.
పురుషోత్తముడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురుషేఘాత్తమః పురుషోత్తమః. పురుషులయందు ఉత్తముడు, విష్ణువు, శివుడు.
పురుహూతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురువ్రభూతం హూతం యజ్ఞేష్వాహ్వనం యస్యః పురుహూతః. యజ్ఞములయందు ప్రచురమైన పిలుపు కలవాడు, ఇంద్రుడు.
పురోగముడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పురోగచ్ఛతీతి పురోగమః. ముందరపోవువాడు, ముందునడుచువాడు.
పురోగామి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. పురోగచ్ఛతీతి పురోగామి. ముందునడచువాడు, కుక్క, ముందు నడచునాయకుడు.
పురోడాశము
సం. నా. వా. అ. పుం. తత్స. యజ్ఞార్థమైన అపూపము, సోమలత రసము, హుతశేషము, పిండితో చేయబడిన పిండము.
పురోధనుడు
సం. నా. వా. న్. పుం. తత్స. శాంతిక పౌష్టికాది కర్మసు పురో ధీయత ఇతి పురోధాః. శాంతిక పౌష్టికాది క్రియలయందు ముందర ఉంచబడువాడు, పురోహితుడు.
పురోభాగి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. పురో దోషం భజతి గృహ్ణాతి తాచ్ఛీల్యేనేతి పురోభాగీ. ముందు దోషమును స్వభావమున గ్రహించువాడు, ఎప్పుడూ తప్పులు వెతుకువాడు. పురః పూర్వమేవ భజతే ఇతి పురోభాగీ. దోషమును గ్రహించునది.
పురోహితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురోధాస్తు పురోహితః. శాంతిక పౌష్టికాది క్రియలయందు ముందరనుంచబడువాడు. శుభాశుభవైదిక కర్మలను చేయించుచు మేలుకీడులను తెలుపు చుండెడి ఆచార్యుడు, ఒజ్జ, కులగురువు.
పులాకము
సం. నా. వా. అ. పుం. తత్స. పులతి మహద్భవతీతి పులాకః. గొప్పదియౌనది, పొల్ల, మెతుకు, సంక్షేపము. పోలతి ఉచ్స్రితో భవతీతి పులాకః. పొట్లుధాన్యము, అన్నపుముద్ద.
పులినము
సం. నా. వా. అ. న. తత్స. పులః మహత్వ్తమస్యాస్తీతి పులినం. ఆధిక్యము కలిగినది, ఇసుకదిన్నె, సైకతము. పోలతీతి పులినం.
పులోమజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పులోమ్నోమునేర్జాతాపులోమజా. పులోముడనుముని వలన పుట్టినది, ఇంద్రునిభార్య, శచి.
పులోమజిత్తు
సం. నా. వా.త్.పుం. తత్స. ఇంద్రుడు
పుల్కసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్పర్శనేనకస్తే శాతయతీతి పుల్కసః. పెద్దలను స్పర్శచేత చెఱుచువాడు. బోయవాడు, మాలవాడు, అధముడు, సంకరజాతి, కంచరి, కల్లమ్మువాడు, సారె, ఉడుములను వేటాడువాడు, మేదరి.
పుషితము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పుష్యతే స్మ పుష్టం పుషితమ్. పోషింపబడినది.
పుష్కర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పుష్యత్యవకాశమితి పుష్కరః. అవకాశమును పోషించునది. పోషయతీతి పుష్కరం. పోషించునది. పుష్ణాతీతి పుష్కరం. బడలినవానిని పోషించునది. స్థల పద్మినీమూల త్వేన పుష్కరస్వమూలమిదం పుష్కరం. నేలతామరదుంప, మెట్టతామర, ఆకాశము, ఉదకము, తామర, తొండముచివర, వాద్యముఖము, కత్తివాదర, బాణము, కుష్ఠమనెడు ఓషధి, ఒక ద్వీపము, తీర్థవిశేషము, బెగ్గురుపక్షి రోగవిశేషము, సర్పవిశేషము, ఒకరాజు, వరుణుని కొడుకు, యుద్ధము, స్వర్గము, ఒకపుణ్యక్షేత్రము.
పుష్కరాహ్వము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్కరస్య ఆహ్వా అస్యేతి పుష్కరాహ్వః. తామరలయొక్క పర్యాయపదములు పేర్లుగాకలిగినది. బెగ్గురుపక్షి, ఒక జలపక్షి.
పుష్కరిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పుష్కరం జలం తద్యోగాత్పుష్కరిణీ. జలము కలిగినది, కోనేఱు, తామరకొలను, ఆడేనుగు. పుష్కరవత్ ఆకృతిః అస్త్యస్యాః ఇతి పుష్కరిణీ.
పుష్కలము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పుష్ణాతి మహిమ్నేతి పుష్కలః. మహిమచేత పుష్టిని పొందినవాడు, శ్రేష్ఠము, అధికము, సమృద్ధము. పుష్యతి పుష్టిం గచ్ఛత్యనేనేతి పుష్కలం, నాలుగు గ్రాసములు (కబళములు) ఎనిమిదిపిడికిళ్లు, వస్త్రముకొన, మంచిది.
పుష్టము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పుష్యతేస్మ పుష్టం. పోషింబడినది, బలిసినది.
పుష్పకము
సం. నా. వా. అ. న. తత్స. పుష్పమివ పుష్కకం. పుష్పము వలె ఉండునది, కుబేరుని విమానము, కుసుమాంజనము, రత్నకంకణము, కుంపటి. పుష్పం ఇవ పుష్పైర్వా కాయతి ప్రకాశతే ఇతి పుష్పకం. నేత్ర రోగము, ధనధుని యొక్క విమానము, కృష్ణుని తేరి గుఱ్ఱములలో ఒకటి, ఒక జాతిపాము.
పుష్పకేతువు
సం. నా. వా. అ. న. తత్స. పుష్పస్యకేతుః పరిపంధిభూతం పుష్పకేతుః. సాదృశ్యమున పుష్పమును ప్రతిఘటించునది, కుసుమాంజనము, మన్మధుడు.
పుష్పదంతము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్ప వత్ర్పకాశమానౌదంతౌయస్యసః పుష్పదంతః. పుష్పము వలె ప్రకాశించు నట్టి దంతముకలది. వాయువుదిక్కునందలి ఏనుగు, ఒక విద్యాధరుడు. పుష్పమివ శుక్లో దంతో అస్య ఇతి పుష్పదంతః. ఒక దిగ్గజము.
పుష్పధన్వుడు
సం. నా. వా.న్.పుం. తత్స. పుష్పం ధనురస్యాపుష్పధన్వా. పుష్పములు ధనుస్సు కలవాడు, మన్మధుడు, పూవిలుతుడు.
పుష్పఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్పాత్ఫలమస్యేతి పుష్పఫలః. పుష్పము వల్లనైనఫలము కలది, కపిత్థము, వెలగ.
పుష్పము
సం. నా. వా. అ. న. తత్స. పుష్యతీతి పుష్పం. వికసించునది. పుష్పతే వికసతి యోనిరనేనేతి పుష్పం. దీనిచేత యోనివికసించును, పూవు, స్త్రీరజస్సు.
పుష్పరసము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్పాణం రసః పుష్పరసః. పుష్పముల యొక్కరసము, పూదేనె.
పుష్పలిహము
సం. నా. వా. హ్. పుం. తత్స. పుష్పం లేడి ఆస్వాదయతీతి పుష్పలిహం. పుష్పమునుఆస్వాదించునది, షట్పదము, తుమ్మెద.
పుష్పవంతులు
సం. నా. వా. త్. పుం. తత్స. పుష్పం వికాసః పుష్పవికసనే, తద్వంతౌ పుష్పవంతౌ. వికాసము కలవారు, సూర్యచంద్రులు.
పుష్పవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పుష్పమార్తవ మస్యాః పుష్పవతీ. పుష్పమనగా అర్తవము, అది దీనికి కలదు, రజస్వల, ముట్టుది, బహిష్ఠ.
పుష్పసమయము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్పాణాం సమయః కాలః పుష్పసమయః. పుష్పము పూచెడుకాలము, వసంత ఋతువు, పూదఱి.
పుష్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్నీతి అభిలషితమితి పుష్యః. కోరికను వృద్ధి పొందించునది, పుష్యమీనక్షత్రము, పౌషమాసము, పుష్యరాగము, కలియుగము, ఒక నక్షత్రము. పుష్యంతి అస్మిన్ అర్థా ఇతి పుష్యః.
పుస్తము
సం. నా. వా. అ. న. తత్స. పుస్త్యతే ఆద్రియత ఇతి పుస్తం. చేయువానిచేత ఆదరింపబడునది, లప్పము వేయుటలోనగు శిల్పులపని, పుస్తకము, మాంసపుచక్కిలము, పూయుట.
పూగము
సం. నా. వా. అ. న. తత్స. పునాతి ముఖమితి పూగః. ముఖమును పవిత్రముగా చేయునది. పునాతీతి పూగః. పవిత్రము చేయునది, పోక, మాను, ప్రోగు, గంగరావి. పూయతే అనేనేతి పూగం. సమూహము.
పూజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పూజనం పూజ. పూజించుట, అర్చన, సపర్య, నమస్య, ఆరాధన.
పూజితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పూజ్యతే స్మ పూజితః. పూజింపబడినది, వేలుపు, పూజింపబడినవాడు, అర్చితుడు, గౌరవనేనుడు.
పూజ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పూజితుం యోగ్యః పూజ్యః. పూజింపతగినవాడు, “పూజనీయః పూజః. వేలుపు, పూజింపబడినవాడు, మామగారు, గౌరవింపతగినవారు.
పూతన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పునాతి దేహం పూతనా. దేహమును పవిత్రముగా చేయునది, ఒకానొకరాక్షసి, కరక, గజవిశేషము, ఒక వర్షము కలిగించు సూర్యకిరణములు.
పూతము
సం విణ .(అ.ఆ.అ). తత్స. పూయతేనేన పూతశ్చ. దీనిచేత పవిత్రము చేయబడును. పునాతి దేహాది కమితి పూతం. దేహదులను పరిశుద్ధముగా చేయునది. తూర్పెత్తినది, పరిశుద్ధమైనది, వడకట్టబడినది. ఎగరకొట్టబడినది, పవిత్రమైనది.
పూతిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దుర్గంధత్వాత్ పూతికః. దుర్గంధముకలది, కొమ్మనగొఱ్ఱపిండిచెట్టు, నెమిలడుగుచెట్టు, పూతిమార్జాలము, ఒక చెట్టు.
పూతికరజము
సం. నా. వా. అ. పుం. తత్స. పూతిగంధః కరజః పూతికరజః. దుర్గంధము కలకానుగు, నెమిలడుగు చెట్టు, ఒక చెట్టు.
పూతికాష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. పూతి ఉగ్రగన్ధం కాష్ఠమస్యేతి పూతికాష్ఠం. దేవతలవృక్షము. పూతి గంధి కాష్ఠం పూతికాష్ఠం. దుర్గంధముకల కాష్ఠము, దేవదారువు, సరళవృక్షము.
పూతిగంధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. పూతిగంధోస్యాస్త్రీతి పూతిగంధిః. దుర్గంధము కలిగినది, గదురు.
పూతిఫలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పూతిగంధః ఫలేష్వస్యాః ఫూతిఫలీ. దుర్గంధపు పండ్లుకలది, కారుగచ్చ, ఒక లత.
పూపము
సం. నా. వా. అ. పుం. తత్స. పునాతీతి పూపః. పవిత్రము చేయునది, భక్ష్యము, పిండివంట. పువం పవిత్రం పాతి రక్షతీతి పూపః. అప్పము.
పూయము
సం. నా. వా. అ. న. తత్స. చీము, జూదము, పీనుగు, పురుషము.
పూరణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పూరయతి తూలేన ఫలానీతి పూరణి. దూదిచేత ఫలములను నిండించునది, బూరుగు, పేక, చిన్నగలిజేరు.
పూరితము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పూర్యతే స్మ పూరితం. జలాదులచేత నిండింపబడినఘటం, నింపబడినది, గుణింపబడినది, పూర్ణము, పూరింపబడినది.
పూరుషుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పురంతి ప్రాణినా మగ్రే గచ్ఛంతీతి పూరుషాః. ప్రాణులకెల్ల అగ్రేసరులు కనుక, మనష్యుడు, మానిసి, మగవాడు.
పూర్ణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పూర్యత ఇతి పూర్ణం. నిండింపబడునది. తిథివిశేషము, పున్నమ, వింటినారిని చెవి వరకు లాగుట, పూర్తి అయినది, పూర్ణము. పూర్వతేస్మ ఇతి పూర్ణః.
పూర్ణిమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చంద్రస్య పూర్ణతయా నిర్వృత్తా పూర్ణిమా. చంద్రుని యొక్క నిండుటచేత, పౌర్ణమి, పున్నమ.
పూర్తము
సం. నా. వా. అ. న. తత్స. పిపర్తి పాలయతిపశుదేవ బ్రాహ్మణాదీనితిపూర్తం. పశుదేవ బ్రాహ్మణాదులను రక్షించునది, నూతిని, బావిని, చెఱువునుత్రవ్వించుట, గుడికట్టించుట, తోటపెట్టించుట, అన్నము పెట్టుట, పాలనము, నింపబడినది, కప్పబడినది.
పూర్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పూర్వతీతి పూర్వం. పూరించునది, తూర్పు, తొలిదిక్కు, మొదటివాడు, ప్రాచీనుడు.
పూర్వజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పూర్వస్మిన్ కాలే జాతః పూర్వజః. తనకంటెముందరపుట్టినది, అక్క, మొదట పుట్టినది, అన్న, పెద్దవాడు.
పూర్వదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పూర్వం దేవపదేస్థితాః పూర్వదేవాః. పూర్వకాలమందు దేవపదమునందున్నవారు, తొలివేల్పు. పూర్వశ్చాసౌ దేవశ్చ ఇతి పూర్వదేవః. అసురుడు, నరనారాయణ ఋషి.
పూర్వపర్వతము
సం. నా. వా. అ. పుం. తత్స. పూర్వశ్చాసౌపర్వతశ్చ పూర్వపర్వతః. తూర్పుదిక్కున ఉండెడు పర్వతము, తూర్పుకొండ.
పూర్వము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పూర్వత్వాత్పూర్వా. మొదటి దిక్కు, మొదటిది, మొదటి చోటిది, ముందటికాలముది.
పూర్వా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తూర్పు, తొలిదిక్కు.
పూషుడు
సం. నా. వా. న్. పుం. తత్స. పుష్ణాతీతి పూషా. పోషించువాడు, ద్వాదశ ఆది త్యులలో ఒకరు (సూర్యుడు).
పృక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పర్ఛనం పృక్తిః. ముట్టుట, స్పర్శము, తాకుడు.
పృచ్ఛా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రశ్నము, అడుగుట.
పృతన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రియతే వ్యాయచ్ఛతీతి పృతనా. తిరుగునది, సేన, సేనావిశేషము (243 రథములు, ఏనుగులు 169 గుఱ్ఱములు, 1015 కాలుబంటుకలది). మూడు వహినులసేన.
పృతనాషాట్టు
సం. నా. వా. హ్. పుం. తత్స. ఇంద్రుడు.
పృథగ్జనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సజ్జనేభ్యః పృథగ్భూతోజనః పృథగ్జనః. లోకములోని సజ్జనులకంటె నితరమైన జనుడు, పృథక్కార్యోజనః పృధగ్జనః. మూర్ఘుడు, నీచుడు, పాపి, అవివేకి.
పృథగ్విధము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పృథగ్విధాయన్యేతి పృథగ్విధః. వేఱు వేఱు విధములు కలది, పెక్కువిధములుకలది.
పృథివి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రథతే పృథివీ. ప్రసిద్ధమగునది, భూమి.
పృథివీపతి
సం. నా. వా.ఇ.పుం. తత్స. రాజు, యముడు, వృషభమనెడు ఓషధీవిశేషము.
పృథురోమము
సం. నా. వా. న్. పుం. తత్స. ముఖదేశే పృథూని రోమాణ్యస్య పృథురోమా. ముఖమునందుపొడుగు రోమములు కలది, చేప, పెద్ద వెండ్రుకలుకలది.
పృథులము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పృథు పృథుత్వమస్తీతి పృథులం. పృథుత్వము కలిగినది, విరివియైనది, విశాలమైనది.
పృథువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. బృహత్కరణయోగాత్ పృథుః. పెద్ద ప్రయోజనమును చేయునది, అగ్ని, ఒకరాజు. ప్రథత ఇతి పృథుః. పృథతే విఖ్యాతో భవతీతి పృథుః. అగ్ని. సం. విణ. తత్స. ప్రసిద్ధమైనది, గొప్పది, విరివి అయినది, మహత్తు. సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. నల్లజీలకర్ర, ఇంగువమ్రాను, కోతి, విశాలమైనది.
పృథ్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పృథుత్వాత్పృధివీ. విశాలమైనది. బృహత్కరణ యోగాత్ పృథ్వీ. దొడ్డప్రయోజనమును చేయునది, పుడమి, ఇంగువమ్రాను, నల్లజీలకఱ్ఱ, విరివియైనది.
పృథ్వీక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బహుఫలయోగాత్పృథ్వీకా. అనేక ఫలములుకలది, పెద్దఏలకులు.
పృదాకువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. పద్దతీతి పృదాకుః. కుత్సితముగా పలుకునది, పాము, తేలు, పులి, చిఱుతపులి.
పృధక్పర్ణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పృధక్ భిన్నాని పర్ణాన్యస్యాః పృథక్పర్ణీ. ఒకదానితో ఒకటి కలియని ఆకులు కలది, కోలపొన్న, చిత్రమూలము.
పృధుకము
సం. నా. వా. అ. పుం. తత్స. పృథుత్వాత్ పృథుకాయతీతి పృథుకః. పృథుత్వాత్ పృథుకః. దంచబడినదై పెద్దదగునది, పిల్ల, అటుకులు, ఉబికినది, బిడ్డ.
పృశిపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పృశ్నీని అల్పాని పర్ణాన్యస్యాః పృశ్నిపర్ణీ. సన్నిని ఆకులుకలది, కోలపొన్న, ఒక మల్లి.
పృశ్ని
సం. నా. వా. ఇ. పుం. తత్స. శిరసి ప్రాంశుభిః స్పృశ్యత ఇతి పృశ్నిః. పొడవైన వారిచేత తలమీద సృశింపబడువాడు, కిరణము, బోయవాడు, చిన్నది, కురుచనిది, పల్చనిది.
పృషతము
సం. నా. వా. అ. పుం. తత్స. పర్షంతి సించంతీతి పృషతః పృషతాః బిన్దవోస్యేతి పృషతః. చుక్కలు కలిగినది, దుప్పి, నీటిబొట్టు, బ్రహ్మబిందువుతోకూడినది, ఎఱ్ఱమచ్చల జింక.
పృషత్కము
సం. నా. వా. అ. పుం. తత్స. పర్షతి రుధిరేణ శత్రుమితి పృషత్కః. రుధిరము చేత శత్రువును తడుపునది, బాణము, శరము, అమ్ము. పృష్యతే సిచ్యతే క్షిప్యతే ఇతి పృషత్కః.
పృషత్తు
సం. నా. వా. త్. న. తత్స. పర్షంతి సించంతీతి పృషంతి. తడుపునవి, నీటిబొట్టు, దుప్పి, బ్రహ్మబిందువుతో కూడినది.
పృషదంశకము
సం. నా. వా. అ. పుం. తత్స. పృషాన్ మూషకాన్ దంశతీతి పృషదంశకః. మూషికమును కొరుకునది, పిల్లి.
పృషదశ్వుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పృషత్ మృగవిశేషః అశ్వః యస్యసః పృషదశ్వః. మృగము వాహనముగా కలవాడు, వాయువు, గాలి, ఒకానొకమృగము.
పృషదాజ్యము
సం. నా. వా. అ. న. తత్స. పృషద్భిః దధిబిందుభిః అన్వితమాజ్యం పృషదాజ్యం. దదిబిందువులతో కూడిన ఆజ్యము, పెరుగుతోకలపబడిన నెయ్యి.
పృష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. తనోశ్చరమం పృష్ఠ మిత్యుచ్యతే. శరీరము యొక్క వెనుకటి భాగము, మూడి, వీవు, వెనుకప్రక్క, యజ్ఞసంబంధిస్తోత్ర విశేషము. పృష్యతే సిచ్యతే ఇతి పృష్ఠం.
పృష్ఠ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. పృష్ఠేన వోఢుం క్షమః పుష్ఠ్యః. వీపున మోయుటకు సమర్థమైనది, వీపున మోసెడువాడు, మోపు మోసెడు గుర్రము.
పేచకము
సం. నా. వా. అ. పుం. తత్స. పచతి కాకాన్ పేచకః. కాకులను హింసించునది. పేచతి గచ్ఛతీతి పేచకః. పోవునది, గుడ్లగూబ, ఏనుగు తోకమొదలు, దాని సమీపము, మేఘము, పక్షివిశేషము, ఉలూకము, కాకభీరువు, నిశాచరుజు, రూపనాశనుడు.
పేట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పేటతి వస్తుభిరితి ఇతి పేటా. వస్తువులతో కూడుకొని ఉండునది, పెట్టె, మంజూష.
పేటకము
సం. నా. వా. అ. పుం. తత్స. పేటతీతి పేటకః. కూడుకొని ఉండునది, పెట్టె.
పేటిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పెట్టె, సమూహము.
పేలవము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పిల్యతే క్షిప్యత ఇతి పేలవం. ద్రొబ్బబడునది, పలుచనిది, విరళము. పేలం కంపనం వాతీతి పేలవః. అస్పృశ్యుడు, మిరియము, సంకరజాతి, చిన్నది, కొంచెము.
పేశలము
సం. నా. వా. అ. పుం. తత్స. పింశతి అవయవోభవతి కార్యేష్వితి పేశలః. అన్ని ప్రయోజనములందు అవయవభూతుడైయుండువాడు, కోయిల, రోకలి, నేర్పుకలది, చక్కనిది. పింశతీతి పేశల. అవయమైయుండునది, తెలివైనవాడు, అంగీకార్యము.
పేశి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పేశయతి గర్భమితి పేశీ. దీనియందు గర్భం అవయవయుక్తమగును, గ్రుడ్డు, కత్తిఒఱ, మాంసపుముద్ద, అండము, మాంసపిండము.
పైఠరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పీఠరే సంస్కృతం పైఠరమ్. కుండయందువండినపిండి, పిఠరమునందు వండబడినది (పిండివంట), కాగులో మరిగింపబడినది.
పైతృకము
సం.విణ. (అ.ఈ.అ). తత్స. పితృణామయంపైత్రః. పితృసంబంధమైనది. పితృణామిదం పైత్రం.
పైతృష్వసేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రితృష్యసుః పుత్రః పైతృష్వసేయః. పితృష్వ అనగా తండ్రితోడపుట్టినది, మేనత్తకొడుకు.
పైతృష్వస్రీయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పితృషసుః పుత్రః పైతృష్వస్రీయః. తండ్రితోడపుట్టినది, ఆమెకొడుకు, మేనత్తకొడుకు.
పోగండుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అపోకృష్టో గణ్యత ఇతి పోగండః. అపకృష్టుడుగా లెక్కపెట్టబడువాడు, వికలమైన శరీరము కలవాడు, వికలాంగడు.
పోట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్త్రీపుంస లక్షణైః పుటతి సంశ్లిష్యతి పోటా. స్త్రీపురుష లక్షణములతో కూడినదానిపేరు, మీసము కల ఆడుది, దాసి, పురుష చిహ్నము కల స్త్రీ. పుటతి స్త్రీ పురుష స్వరూపం సంశ్లిష్యతీతి పోటా.
పోటగళము
సం. నా. వా. అ. పుం. తత్స. పుటతి గళతి చేతిపోటగళః. కూడుకొని జాఱునది, క్కిసకసవు, ఱెల్లు, చేప, వైకంజ్య జాతి పాము.
పోతము
సం. నా. వా. అ. పుం. తత్స. పునాతినీడం పోతః. గూటిని పవిత్రము చేయునది. పునాతీతిపోతః. పవిత్రము చేయునది, పిల్ల, పదేండ్లఏనుగు, మనుజువెక్కిపోయెడు ఓడ, ఇంటిచోటు, వస్త్రము, కుమారుడు, బిడ్డ, పెద్దపులికి వచ్చురోగము, శిశువు, పదేండ్ల ఏనుగు గున్న.
పోతవణిజుడు
సం. నా. వా.జ్.పుం. తత్స. పవలే వాతేనేతి పోతః యానం తత్రృధానః వణిక్పోతవణికి. పోతమనగాకలము, అది ప్రధానముగా కలవర్తకుడు ఓడబేరగాడు.
పోతవాహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నియచ్ఛంతి పోతం నియామాకాః. కలమును నియమించువారు. ఓడనడపువాడు, తండేలు.
పోతాధానము
సం. నా. వా. అ. న. తత్స. పోతాః మత్స్యపోతాః అధీయంతే అస్మిన్నితి పోతాధానం. మీనుపిల్లులు దీనియందుండును, చేపపిల్లలగుంపు, చిన్న బాణలి.
పోత్రము
సం. నా. వా. అ. న. తత్స. పునాత్యనేనేతి పోత్రం. దీనిచేత పవిత్రమౌను, పందిమూతి, నాగటిదుంపమొన, వస్త్రము, పంది, దున్న, నాగలి కాడి, పంది ముట్టె.
పోత్రి
సం. నా. వా.న్.పుం. తత్స. దీర్ఘం పోత్రం ముఖాగ్ర మస్యేతి పోత్రీ. అధికమైనమోరకలది, వరాహము, పంది. పోత్రం అత్ర అస్తీతి పోత్రీ. దున్న.
పౌండర్యము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకర్షేణ పుండరీక స్యేదం రూపాంతరం దాహార త్వత్ప్రపౌండరం. దాహమును హరించునది కనుక, పుండరీకమను గంధద్రవ్య విశేషము, సంకరజాతి.
పౌతము
సం. నా. వా. అ. న. తత్స. పునాతి ధాన్యాదిమానం శోధయతీతిపౌతవం. ధాన్యాదిమానములను కొలుచువాడు, త్రాసు, మూర, తూములోనగుమానము, ఒకతుల ఎత్తు.
పౌత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పుత్రస్య పుత్రావా అపత్యం పౌత్రీ. కొడుకైనను కూతురైనను కూతురు, మనుమరాలు (కొడుకు కూతురు, కూతురుకి కూతురు) మనుమరాలు.
పౌరము
సం. నా. వా. అ. న. తత్స. పురేభవం పౌరం. పురమందు పుట్టినది. బలరాముడు.
పౌరస్త్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పురోభవతీతి పౌరస్త్యః. ముందరపుట్టినది, మొదటి దిక్కుది, మొదటిది, ప్రథానుడు.
పౌరుషము
సం. నా. వా. అ. న. తత్స. పురుషస్యేదం మానం పౌరుషం. పురుషుని యొక్క ప్రమాణము. పురుషస్యభావః కర్మచ పౌరుషం. పురుషునియొక్క భావమును, క్రియును, పురుషభావము, పురుషప్రయత్నము, రుషవ్యాపారము, పరాక్రమము, పరుషునిచే యెత్తుపొడుగు, నిలువెత్తు, వీర్యము, మగటివి.
పౌరోగవుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. పాకస్థానం తస్యాయ మద్యక్షః పౌరోగవః. వంటయింటి అధికారి. పురే అగ్రే గౌర్నేత్రం యస్యేతి పౌరోగవః.వంటల పెద్ద.
పౌర్ణమాసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పూర్ణమాః తస్యేయం పౌర్ణమాసీ. ఇతనిచేత తిథిలెక్క పెట్టబడును, పూర్ణిమ, పున్నమ. పూర్ణో మాసో అస్యస్తీతి పౌర్ణమాసీ.
పౌలస్త్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పులస్త్యస్య గోత్రాపత్యం పౌలస్త్యః. పులస్త్యుని వంశమునందు పుట్టినవాడు, కుబేరుడు, రావణుడు, యుద్ధము.
పౌళి
సం. నా. వా.ఇ.పుం. తత్స. పులతి మహద్భవతీతి పౌళిః. ఉబ్బునది, గుగ్గిళ్ళు, అభ్యూషము.
పౌషము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్యనక్షత్రయుక్తా పూర్ణిమాస్మిన్నితి పౌషః. పుష్యనక్షత్రముతో కూడిన పున్నమియందు కలది, నెల, పుష్యమాసము.
పౌషి
సం. నా. వా. ఈ .స్త్రీ. తత్స. పుష్యనక్షత్రయుక్తా పూర్ణిమాపౌషి. పుష్యమా సమందలి పున్నమి.
పౌష్కరము
సం. నా. వా. అ. న. తత్స. స్థలపద్మినీమూలత్వేన పుష్కరస్యమూలమిదం పౌష్కరం. నేలతామరదుంప, మెట్టతామరదుంప.
పౌష్పకము
సం. నా. వా. అ. న. తత్స. పుష్ప సదృశత్వాత్ పౌష్పకం. పూవువంటిది, కుసుమాంజనము, ఒక రత్నము.
ప్రకంపనము
సం. నా. వా. అ. పుం. తత్స. మిక్కిలి బలముకల వాయువు.
ప్రకరము
సం. నా. వా. అ. న. తత్స. అగలు. సం. నా. వా. అ. పుం. తత్స. సమూహము, చెదిరిన పువ్వులోనగునది, మృధులమైనది.
ప్రకాండము
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రహ్మణమచర్చికా ప్రశస్త్రో బ్రాహ్మణః గోప్రకాండం. శ్రేష్ఠవాచకములును, అఖండపదములును. ప్రకామ్యతే ఫలరక్షణాభిరితి ప్రకాండః. ఫలములను రక్షించుట, చెట్టునడిమినిడుకొమ్మ, చెట్టుబోదె, ప్రశస్తవాచకము. ప్రకృష్టః కాండః ప్రకాండః. వృత్తియందు ఉత్తరపదమై శ్రేష్ఠతను తెలుపునది, శ్రేష్ఠతా వాచకము, చెట్టు మొదలు.
ప్రకామము
సం. నా. వా. అ. న. తత్స. కామ్యతే సర్వైరితికామః ప్రకామం. అందరిచేత కోరబడునది, ఇచ్ఛవచ్చినట్లు. ప్రకటం కామమితి ప్రకామం, యదేష్ఠముగా.
ప్రకారము
సం. నా. వా. అ. పుం. తత్స. విషప్రకారః పిశునః ప్రక్రియ ఇతి ప్రకారః. ప్రకటముగా చేయబడునది, పోలిక, భేదము. ప్రభేద కరణం ప్రకష్ట కరణం వా ఇతి ప్రకారః. సాదృశ్యము, సామ్యము, పద్దతి.
ప్రకాశము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకాశతే ప్రకాశః. ప్రకాశించునది, ఎండ, వెలుగు, తలయాడించుచు నవ్వెడి నవ్వు మిక్కిలి ప్రసిద్ధము, బయటపడినది, సమానము, కాశరోగముకలది, స్పష్టము, కిరణము, సుందరము.
ప్రకీర్ణకము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకీర్యతే రాజసమీప ఇతి ప్రకీర్ణకం. రాజ సమీపమందు విసరబడునది, వింజామరము, విరివి, గుఱ్ఱము, చామరము.
ప్రకీర్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకీర్యతే కలహ స్థానే ప్రకీర్యః. కలహస్థానమందు చల్లబడునది, నెమలియడుగు చెట్టు, చల్లదగినది, ఒక చెట్టు.
ప్రకృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ప్రారంభః క్రియతే అనయేతి ప్రకృతిః. దీనిచేత జగత్ప్రారంభము చేయబడును. ప్రకృష్టం కరోతీతి ప్రకృతిః. పదార్ధమును ప్రకృష్టముగా చేయునది. ప్రక్రియతే అనయా కార్యమితి ప్రకృతిః. దీనిచేత కార్యము చేయబడును. ప్రత్యయము రాకముందున్న శబ్దస్వరూపము, ఉపాదానకారణము, ఒకఛందస్సు, పౌరవర్గము, సత్యాదిగుణ సామ్యావస్థ, స్వభావు, స్వామ్యాది (సప్తకృతులు, స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము), అవ్యక్తము. (అష్టప్రకృతులు, అవ్యక్తము, బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలు). మాయ, రాజ్యాంగములు, పంచభూతములు, స్వభావము, మూలకారణము, తల్లి, మర్మాయవము, జంతువు, మంత్రి మున్నగువారు.
ప్రకోష్ఠము
సం. నా. వా. ష. పుం. తత్స. ప్రకృష్యతే ప్రావరణా ద్భహిర్నిస్సార్యత ఇతి ప్రకోష్ఠః. కప్పునకు వెలుపలగా తీయబడునది, తొట్టికట్టు, ముంజేయి. ప్రకృష్యతే అనేనేతి ప్రకోష్ఠః. మేడ ముందుభాగము.
ప్రక్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రక్రమణం ప్రక్రమః. క్రియకు మొదట దొరకొనుట, క్రమము, ఉపక్రమము, అవసరము, తరవాయి.
ప్రక్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ క్రియత ఇతి ప్రక్రియా. చేయబడునది, అధికారము, ప్రకరణము, మేలైనకార్యము, శబ్దరూపము కలిగిన విధము, ప్రారంభము, కొనుట.
ప్రక్వణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ క్వణతీతి ప్రక్వాణః. మిక్కిలి మ్రోయునది, వీణాధ్వని.
ప్రక్వాణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ క్వణతీతి ప్రక్వాణాః. మ్రోయునది, వీణాధ్వని.
ప్రక్ష్వేడనము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రక్ష్వేడన్తీతి ప్రక్ష్యేడనాః. అవ్యక్తముగా మ్రోయునవి, ఇనుపబాణము, బాణము.
ప్రగండము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రగణ్యతే సువృత్తతయా ప్రగండః. మోచేతి మీద భుజమూలము వఱకు గల భాగము, సందిలి, మోచేతి మీది భాగము, జబ్బ.
ప్రగత జానుకుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రగతే విరళే జానునీయస్యసః ప్రగత జానుకశ్చ. నడుమనెడముగల మోకాళ్లుకలవాడు, దొడ్డికాళ్లవాడు, ప్రజ్ఞువు.
ప్రగల్భ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ గల్భతే ప్రగల్భః. ప్రకర్షణము చేత దిట్ట తనము కలిగినవాడు. స్వీయాంతర్భేద విశిష్టనాయికా విశేషము, ధీరుడు.
ప్రగాఢము
సం. నా. వా. అ. న. తత్స. ప్రగ్రాహత ఇతి ప్రగాఢం. కలచునది, అధికము, దృఢము, స్థిరమైనవాడు, గహనమైనది.
ప్రగుణము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకృష్టః అవక్రః గుణోస్యేతి ప్రగుణః. ప్రకృష్టమైన చక్కదనమును గుణము గలది, తిన్ననిది.
ప్రగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రగృహ్యతే బలాత్ ప్రగ్రహః. బలిమిచే బంధించుగాన ప్రగ్రహము, చెఱ, చెఱబడ్డది, త్రాసుతూనికకోలమొదలైనవానిత్రాడు, పగ్గము, గుఱ్ఱములోనగువాని కట్టెడు పగ్గము, బంగారు, నియమనము, భుజము, హరిద్రువు. ఒక వృక్షము, బంది, కళ్ళెము, ముచ్చిక, ప్రకాశము, పూజ.
ప్రగ్రాహము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రగృహ్యతే అనేనేతి ప్రగ్రాహః. దీనిచేత కట్టబడును, త్రాసుతూనికకోల మొదలైనవాని త్రాడు, పగ్గము, గుఱ్ఱములోనగు వాని కట్టెడు పగ్గము, బంగారు, నియమనము, భుజము, హరిద్రువు, ఒక వృక్షము, బంది, కళ్ళెము, మచ్చిక, ప్రకాశము, పూజ.
ప్రగ్రీవము
సం. నా. వా. అ. పుం, న. తత్స. కలశము, ఒరగుదిండు, మెడ, ప్రాసాదమునందలి కిటికీ.
ప్రఘణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రహన్యతే ఘటాదిరనేన ప్రఘాణః. కడవమొదలైనవి దీనిచేత పగులగొట్టబడును. తలవాకిటికి పక్కనుండెడుచిన్నగది, ఇనుపగుదియ, రాగిబిందె. ప్రవిషద్భిర్జనైః పాదైః ప్రకర్షేణ హన్యతే ఇతి ప్రఘణః. తామ్రకుంభము, మేడ ముందరి భాగము, ఇనుము, ముద్గరము.
ప్రఘాణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రహన్యతే ఘటాది రనేన ప్రఘాణః. కడవ మొదలైనవి దీనిచేత పగులగొట్టబడును, తలవాకిటికి పక్కనుండెడు చిన్నగది, ఇనుపగుదియ, రాగిబిందె, పెద్దకొమ్మ, మేడముందరి భాగము.
ప్రచక్రము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకర్షేణ కామతీతి ప్రచక్రం. మిక్కిలి కదలునది, ప్రయాణమైనసేన, ముట్టడి.
ప్రచలాయితుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రచల ఇవాచరతీతి ప్రచలాయితః. ఊగెడువానివలెనుండువాడు, కునికిపాటుకలవాడు, ఘూర్ణితుడు, నెమలిపురి.
ప్రచురము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణ చయత ఇతి ప్రచురం. మిక్కిలి కూర్చబడునది, అధికము, మిక్కుటము. ప్రచోరతీతి ప్రచురం. ప్రభూతము, ప్రాజ్యము, అదభ్రము, బహుళము, అనేకము, భూరి, ఎక్కువ.
ప్రచేతనుడు
సం. నా. వా. స్. పుం. తత్స. ప్రకృష్టం చేతః యస్యసః ప్రచేతాః. మంచి మనస్సు కలవాడు, వరుణుడు, ఒకముని, అగ్ని, గొప్పమనస్సు కలవాడు.
ప్రచోదనము
సం. నా. వా. అ. న. తత్స. కంటకైః చోదయతి ప్రేరయతి ప్రచోదనీ. ముండ్లచేత ప్రేరేపించునది, వాకుడు, సంగడు, తెడ్డు.
ప్రచ్ఛదపటము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రచ్ఛదః సచాసౌపటశ్చ ప్రచ్ఛదపటః. దీని చేతకప్పబడును, గవుసెన, పఱచెడువస్త్రము, కప్పుటకు ఉపయోగించు బట్ట.
ప్రచ్ఛన్నము
సం. నా. వా. అ. న. తత్స. ప్రచ్ఛాద్యత ఇతి ప్రచ్ఛన్నం. కప్పబడునది, లోవాకిలి, దుప్పటి.
ప్రజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రజాయత ఇతి ప్రజా. పుట్టునది, సంతతి, జనము, ఉత్పత్తి, సంతానము, సూర్యుడు.
ప్రజనము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రజాయంతే పశవోనేనేతి ప్రజనః. దీనిచేత పసులు పుట్టును, ఆవు ఎనుములోన గువానితొలిచూలు, చూలు, సృష్టి.
ప్రజవి
సం. విణ.(న్. ఈ.న్). తత్స. ప్రకృష్టః జవోయస్యసః ప్రజవీ. ప్రకృష్టమైన గమనవేగము కలవాడు, వడిగలవాడు, తరస్వి, సృజించువాడు.
ప్రజాత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ జాయంతే అపత్యాన్యస్యాః ప్రజాతా. మిక్కిలి బిడ్డలు దీనియందు పుట్టుదురు, బాలెంతరాలు, ప్రసూత. ప్రజాతం ప్రజననం సుతాదీనాముత్పత్తిరిత్యర్థః, తదస్యా అస్తీతి ప్రజాతా.
ప్రజాపతి
సం. నా. వా.ఇ.పుం. తత్స. ప్రజానాం పతిః ప్రజాపతిః. ప్రజలకు ప్రభువు, బ్రహ్మ, ఒక బ్రహ్మ, విశ్వకర్మ, సూర్యుడు, దక్షుడు మున్నగువారు, అగ్ని, అల్లుడు, రాజు, పరమాత్మ.
ప్రజావతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రజాస్సన్త్యస్యా ఇతి ప్రజావతీ. మఱిది మొదలైన ప్రజలుకలది, అన్నపెండ్లాము, తీడపుట్టినవాని పెండ్లాము, సోదరుని భార్య.
ప్రజ్ఞః
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రజ్ఞాయతే అనయేతి ప్రజ్ఞా. దీనిచేత లెస్సగా నెఱుగబడును, బుద్ధి, సామర్థ్యమును తెలిపెడుమాటలు, అనుభవము గల స్త్రీ, తెలివి గల స్త్రీ.
ప్రజ్ఞానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రజ్ఞాయతే అనేనేతి చ ప్రజ్ఞానం. ప్రకృష్టమైన జ్ఞానము, బుద్ధి, గుఱుతు, చిహ్నము.
ప్రజ్ఞుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రగతే విరళే జానునీ యస్సయః ప్రజ్ఞుః. వంగటి కాళ్లవాడు, పండితుడు, దొడ్డికాళ్లవాడు.
ప్రడీనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకృష్టం డయనం ప్రడీనం. వేగంగా పారుట, మొదటి ఎగురు.
ప్రణయము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రణయనం ప్రణయః. ప్రీతిచేత ప్రవర్తించుట. ప్రకర్షేణ నీయత ఇతి ప్రణయం. ప్రకర్షము చేత పొందబడునది, ప్రేమము, ప్రార్థన, వినయము, విశ్వాసము, పరిచయము, ప్రసరము, ప్రశ్రయము, తాకట్టు, యాచన, స్నేహము.
ప్రణవము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టోనవః ప్రణవః. మిక్కిలి స్తోత్రము చేయుట, ఓంకారము. ప్రకర్షేణ నూయతే స్తూయతే ఆత్మా స్వేష్టదేవతా వానేనేతి ప్రణవః.
ప్రణాదము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టోనాదః ప్రణాదః. ప్రకృష్టముగా పలుకుట, అనురాగము వలన పుట్టినధ్వని, గట్టిమ్రోత, చెవుడు, నీటికాలువ.
ప్రణాళి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రణల త్యంభోనయాప్రణాళి. దీనిచేత జలము పోవును, నీళ్లుపోవుదారి, నీళ్లుపోవుటకు భూమిలో పాతిన క్రోవి, నీటికాలువ. ప్రణవ్యతే బద్యత ఇతి ప్రణాళి. పార్శ్వనాళము చేత కట్టబడను.
ప్రణిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ప్రణిధీయత ఇతి చ ప్రణిధిః. ప్రార్థించుట, వేగులవాడు, ప్రార్ధన. ప్రణీధీయతే ఇతి ప్రణిధిః. ప్రార్థనము, అవధానము, యాచన, చారుడు.
ప్రణిహితము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణ నిహితం సన్నిధౌస్థాపితం ప్రణిహితం. మిగుల దగ్గరనుంచబడినది, ఒప్పుకొనబడినది, ఉంచబడినది, పొందబడినది, ప్రాప్తమైనది, జాగరుకుడు, యాసము, ప్రాప్తము.
ప్రణీత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రసాదినా ప్రకర్షం నీతం ప్రణీతం. రసాధులచేత అతిశయమును పొందింపబడునది. యజ్ఞపాత్రవిశేషము, చేయబడినది, చొప్పింపబడినది, త్రోయబడినది, నీళ్లుపోసివండబడినది, కూర్చబడినది.
ప్రణుతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రణూయతేస్మప్రణుతం. పొగడబడినది, మిక్కిలి పొగడబడినది.
ప్రణేయము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రణేతుం వశంనేతుం శక్యః ప్రణేయః. వశమున పొందింపశక్యమైనవాడు, మందుమాకులచేత లోబడినది, వశ్యము, విధేయుడు.
ప్రతతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ప్రకృష్ట తతిర్విస్తారోస్యాః ప్రతతి. ప్రాకుట కొఱకు గడలు మొదలైనవాటిని పట్టుకొన్నది, తీగ, విరివి. ప్రకృష్ణాతతిరస్యేతి చప్రతతిః. ప్రకృష్టమైన విస్తారముకనుక, పంక్తి, లత.
ప్రతనము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పూరభవతీతి ప్రాగ్భవ ఇతి ప్రతనః. పూర్వమందుపుట్టినది, పురాతనము, ప్రాత, అరచేయి.
ప్రతలము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతతే తలే అత్రప్రతలః. అరచేతలు కలది, పాతాళ విశేషము, చప్పట, అరచేయి.
ప్రతాపము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత పన్త్యనేన శత్రూనితి ప్రతాపః. దీనిచేత శత్రువులను తపింపచేయుదురు, కోశబలము వలన కలిగిన తేజము, వేడిమి, శౌర్యము, పౌరుషము, తాపము.
ప్రతాపసము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్ణాః తాపసాః అనేనేతి ప్రతాపసః. దీనిచేత తాపసులు ప్రకృష్టులౌదురు, తెల్లజిల్లేడు, శౌర్యము, వేడి.
ప్రతి కృష్టుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతికృష్టశ్చ కృషవిలేఖనే. తిరస్కరింపబడువాడు, ఆచారాది హీనత్వము చేత నిందింపబడినవాడు, నింద్యము.
ప్రతి సర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. పురా పూర్వస్మిన్ సర్గప్రతిసర్గ. మన్వాది సృష్టి (పురాణ లక్షణములలోఒకటి), సంహారము.
ప్రతికర్మము
సం. నా. వా.న్.న. తత్స. ప్రతిగతం అంగప్రాప్తం కర్మ ప్రతికర్మ. ప్రత్యం గమును పొందెడు క్రియ, వస్త్రాద్యలంకరణము, కైసేత. ప్రత్యంగం ప్రతిఖ్యాతం వా కర్మ ఇవ ప్రతికర్మా. అంగసంస్కారము, అలంకారము.
ప్రతికూలము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతిస్పర్ధి కూలమస్యేతి ప్రతికూలం. అనుకూలమును వర్జించిఉండునది, అనుకూలముకానిది. ప్రతీపం కూలాదితి ప్రతికూలం. విపక్షము, విరుద్దము.
ప్రతికృతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతి క్రియత ఇతి ప్రతికృతిః. ప్రతిగా చేయబడునది, మాఱుచేయబడినది, ప్రతిరూపము.
ప్రతిక్షిప్తుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతిక్షిప్యతేస్మ ప్రతిక్షిప్తః. ఆక్షేపించబడినవాడు, అడ్డగింపబడినవాడు, పంపబడినవాడు, పిలిచి పంపబడినవాడు, త్రోయబడినది.
ప్రతిగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతి గృహ్ణాత్యత్ర ప్రతిగ్రహః. దీనియందు సైన్యము చేపట్టును, పుచ్చుకొనుట, దానము పుచ్చుకొనుట, దానద్రవ్యము, సేనకు వెనుకటి బలము, తమ్మపడిగము, గ్రహభేదము, పనిచేయువారు, పీకుదాను, ఇయ్యబడిన వస్తువు, గ్రహించుట.
ప్రతిగ్రాహము
సం. నా. వా. అ. పుం. తత్స. చర్వితం తాంబూలాదికం ప్రతి గృహ్ణతీతి ప్రతిగ్రాహః. భక్షిత మైన తాంబూలాదులను గ్రహించునది, పతద్గ్రహము, తమ్మపడిగము, పీకుదాను.
ప్రతిఘము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిహంతీతి ప్రతిఘః. క్రోధించుట, కోపము, మాఱుదెబ్బ, పగతీర్చుకొనుట, మూర్చ, సత్కర్మను చెఱచునది, తీర్చుకొనుట, వధ.
ప్రతిఘాతనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతిహన్యతే ప్రతిఘాతనం. ఉద్వాసనం, చంపుట, వధము.
ప్రతిచ్ఛాయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రతిరూపాచ్ఛాయా ప్రతిచ్ఛాయా. ప్రతియైనఛాయ, ప్రతిమానము, ప్రతిమ. ప్రతిగతా ఛాయామితి ప్రతిచ్ఛాయా, ప్రతిరూపము.
ప్రతిజాగరము
సం. నా. వా. అ. పుం. తత్స. పూర్వవృత్త మర్థం ప్రతిజాగరణం ప్రతిజాగరః. జరిగిన అర్ధమును గూర్చి మేలుకొనియుండుట, ఎచ్చరిక, కాచుట. ప్రతిజాగరణమితి ప్రతిజాగరః. ఎదురు చూచుట.
ప్రతిజ్ఞాతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతిజ్ఞాయతే స్మ ప్రతిజ్ఞాతం. అంగీకరింపబడినది, ఇయ్యకొనబడినది.
ప్రతిజ్ఞానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతిజ్ఞాయతే అనేనేతి ప్రతిజ్ఞానం. దీనిచేత ప్రతిజ్ఞచేయబడును, అంగీకారము.
ప్రతిదానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రత్యర్పణం ప్రతిదానం. మరలనిచ్చుట, వస్తువులమాఱుపు, దానమిచ్చినదానిని మరలనిచ్చుట, కుండమార్పు, జ్ఞానమును తిరిగి ఇచ్చుట.
ప్రతిధ్వానము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిధ్వననం ప్రతిధ్వానః. ఎదురుగా పలుకుట, మాఱుమ్రోత, ప్రతిధ్వని.
ప్రతినిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ప్రతినిధీయత ఇతి ప్రతినిధిః. ప్రతిగా పెట్టబడినది, ప్రతిమ, మాఱు. ప్రతినిధీయతే సదృశీక్రియతే ఇతి ప్రతినిధిః. సదృశము, ప్రతి రూపము.
ప్రతిపక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతికూలః పక్షః ఇతి ప్రతిపక్షః. శత్రువు, ప్రతివాది, విరోధి, రిపువు, వైరి, సాదృశ్యము.
ప్రతిపత్తు
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. ప్రతి పద్యతే చంద్రస్స ఉదయః క్షయోవా అస్యాం ప్రతిపత్. దీనియందు చంద్రుని యొక్క ఉదయముగాని, క్షయముకాని తెలియును, పాడ్యమి, బుద్ధి. ప్రతి పద్యతే జానాత్యనయేతి ప్రతిపత్. జ్ఞానము తెలియును.
ప్రతిపదర్శిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రతీపం వక్రం ద్రష్టుం శీలమస్యా ఇతి ప్రతీపదర్శిని. వక్రముగా ఆలోచించునది, ఆడుది, అంగన. ప్రతీతం ప్రతికూలం వామం వా పశ్యతీతి ప్రతిపదర్శినీ, స్త్రీ.
ప్రతిపన్నము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతిపద్యతే స్మ ప్రతిపన్నం. అవగతమును, అంగీకరింపబడినది, తెలియబడినది.
ప్రతిపాదనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతి పాద్యతే అనేన ప్రతిపాదనం. దీనిచేత పుణ్యము ప్రతిపాదింపబడును. ఇచ్చుట, కలిగించుట, తెలుపుట, నిరూపించుట, దానము.
ప్రతిబంధము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతికూల్యేన బంధనం ప్రతిబంధః. కార్యము యొక్క అడ్డుపడుట, అడ్డగింత, విఘ్నము.
ప్రతిబద్దుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. మనసి ప్రతిబధ్యతే స్మ ప్రతిబద్ధః. మనస్సునందు కట్టబడిఉండువాడు, అడ్డగింపబడినవాడు, మనసుచెడినవాడు.
ప్రతిబింబము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతినిధిరూపంబింబం ప్రతిబింబం. ప్రతియైన బింబము, ప్రతిఫలనము, ప్రతిమ. ప్రతిగతం బింబమితి ప్రతిబింబం, ప్రతిరూపము.
ప్రతిభయము
సం. నా. వా. అ. న. తత్స. భయం ప్రతిగతం ప్రతిభయం. భయముతో కూడినది, భయానకరసము. విణ. తత్స. భయం ప్రతిగతమితి ప్రతిభయం. భయంకరము, భయానక రసము కలది.
ప్రతిభువు
సం. నా. వా. ఊ. పుం. తత్స. అధమర్ణస్య ప్రతినిధయోభవన్తీతి ప్రతిభుకః. అప్పుతీసుకొన్నవానికి ప్రతిగానుండువాడు, పూటకాపు, పూట (జామీను).
ప్రతిమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రతిమీయత ఇతి ప్రతిమా. ఒకదానికి దీటుగా నిర్మింపబడినది, శిలాది నిర్మిత విష్ణ్వాదిమూర్తి ఏనుగు వాహిత్థము, క్రిందికొమ్ములనడిమిచోటు, పోలిక, సాటి, ప్రతిబింబము.
ప్రతిమానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతిమీయతే అనేన ప్రతిమానం. దీనిచేత నెత్తి వేయబడును. శిలాది నిర్మిత విష్వాది మూర్తి, ఏనుగునాహిత్థము క్రిందికొమ్ములనడిమిచోటు తడగట్టెడి బద్దిక.
ప్రతిమానము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతిముచ్యతే స్మ ప్రతిముక్తః. ఉపసర్గవశమున బంధనార్ధకము కట్టబడినది కనుక కట్టబడినది (వస్త్రము) తొడగబడినది, (కవచము), కట్టివిడవబడినవాడు.
ప్రతియత్నము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతియతనం ప్రతియత్నః. యత్నముచేయుట, ఇచ్చ, అనుకూల్యము, ప్రతీకారము, సంస్కారము. ప్రతియత్యతే ఇతి ప్రతియత్నః. అలంకారము, గ్రహించుట, కోరిక.
ప్రతియాతనము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రతియత్యత ఇతి ప్రతియాతన. ప్రతిగా చేయబడునది, ప్రతిమ, తుల్యయాతన, ప్రతిబింబము.
ప్రతిరోధము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిరుణద్ధీతి ప్రతిరోధిః. అడ్డగించువాడు, ఎదిరించుట, దొంగతనము, దొంగ.
ప్రతివాక్యము
సం. నా. వా. అ. న. తత్స. పృష్టస్య ప్రతి వచనం ప్రతివాక్యం. అడిగినందులకు బదులు చెప్పుట, మాఱుమాట.
ప్రతివిష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విషస్య ప్రతి ప్రతివిషా. విషమునకు విరోధిమైనది, అతివస.
ప్రతిశాసనము
సం. నా. వా. అ. న. తత్స. భృత్యాన్ప్రతి శాసనం ప్రతిశాసనం. భృత్యులను గూర్చి ఆజ్ఞాపించుట, పిలిచి పనిపంచుట.
ప్రతిశ్యాయము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిక్షణం శ్యాయయతి ప్రాపయతిశ్లేష్మ జలమితి ప్రతిశ్యాయం. ప్రతిక్షణమును శ్లేష్మజలమును వెళ్లించునది, పడిసెము, జలుబు.
ప్రతిశ్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిశృణోతీతి ప్రతిశ్రవః. ఎదుటివారు చెప్పిన అర్థమును అభిముఖుడైవినుట అంగీకారము.
ప్రతిష్టంభము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతికూల్యేన స్తంభనం ప్రతిష్టంభః. కార్యము యొక్క అడ్డగింత, అప్పగింత, విఘ్నము.
ప్రతిసరము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ప్రతిశ్రియత ఇతి ప్రతిసరః. పొందబడునది, ఏనుగు కుంభముల క్రింది చోటు, చేతికి కట్టుకొనెడు తోరము, భూషణము. పుం. కడియము, పూదండ, మంత్ర విశేషము, సేన వెనుకటి దిక్కు, వ్రణశుద్ధి, కంకణము, కరసూత్రము, మంత్రభేదము, మాల్యము. సం. విణ. తత్స. నియోగింపతగినది.
ప్రతిసీర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రతిసీయతే ప్రతిబధ్యత ఇతి ప్రతిసీరా. అడ్డముగా కట్టబడునది, తెరచీర, యవనిక. ప్రతిసినోతి ప్రతిబధ్నాతీతి ప్రతిసీరా, తెర.
ప్రతిహతుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. మనసి ప్రతిహన్యతే స్మ ప్రతిహతః. మనస్సు నందు ఉత్సాహము చెడినవాడు, అడ్డగింపబడినవాడు, మనసు చెడినవాడు, వింతైనది, నిరోధింపబడినది.
ప్రతిహసము
సం. నా. వా. అ. పుం. తత్స. పుష్పైః ప్రతిహసతీ వతిష్ఠతీతి ప్రతిహసః. పువ్వులచే నవ్వునట్లుండునది, గన్నెఱు, ఒకచెట్టు.
ప్రతీకము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత్యేత్యన్యోన్యమాభిముఖ్యేన గచ్ఛతీతి ప్రతీకః. అన్యోన్యమభిముఖముగా నుండునది, అవయవము, ప్రతికూలము, అనుకూలము. ప్రతీయతే ప్రత్యేతి వా ఇతి ప్రతీకః. ఏకదేశము, అంగము, అవయవము, ముఖము, విరుద్ధము సమానము.
ప్రతీకారము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతీకరణం ప్రతీకారం. చేసిన దానికి బదులు చేయుట, ప్రత్యపకారము, చికిత్స, పగతీర్చుకొనుట.
ప్రతీకాశము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతీకాశత ఇతి ప్రతీకాశః. ప్రతిగా ప్రకాశించునది, (ఉత్తరపదము) తుల్యము.
ప్రతీక్ష్యుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. వివాహయజ్ఞాదిఘ సన్నిధానార్ధం ప్రతీక్షితు మర్హతీతి ప్రతీక్ష్యః. వివాహాఆజ్ఞాదులయందు సన్నిధానము కొఱకు ఎదురు చూడ తగినవాడు, పూజ్యుడు. ప్రతీక్ష్యతే ఇతి ప్రతీక్ష్యః. నిరీక్షింపతగినవాడు, గౌరవింప తగినవాడు.
ప్రతీచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రాక్ ప్రథమం అంచత్యస్యాం రవిరితి ప్రాచీ. ప్రధమున సూర్యుడు ఈదిక్కున బొడమునుకనుక, పచ్ఛిమ దిక్కు, పడమర. ప్రతిసాయం అంచతి సూర్యమితి ప్రతీచీ.
ప్రతీచీనము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రత్యక్ ప్రతీచ్యాం భవం ప్రతీచీనం. పశ్చిమమున పుట్టినది, పాశ్చాత్యుడు, తర్వాతివాడు.
ప్రతీతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతీయతే జ్ఞాయతే సర్వైరితి ప్రతీతః. అందరిచేత నెఱుగపడినవాడు, ప్రసిద్ధి కెక్కినది ఎఱుగపడినది, ఆదరింపతడినది, సంతోషము నొందినది. ప్రతీయతే ప్రత్యేతి చ ప్రతీతః. పూజింపపడినది, నమ్మతగినది, తెలివైనవాడు.
ప్రతీరము
సం. నా. వా. అ. న. తత్స. తీరమేవ ప్రతీరం. తీరము, గట్టు.
ప్రతీహరము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిహ్రియంతే రుద్ధ్యంతే జనా అనేనేతి ప్రతీహరః. దీనిచే జనులు అడ్డగించబడుదురు. ప్రతిహారతి నూతన జీనాన్ ప్రతీహరః. నూతన జనులను పరిహరించువాడు, ద్వారము, పూర్వము నేను వీనికి మేలు చేసితినిగాన ఇప్పుడు వీడునాకు మేలుయనని ఎంచి చేయునట్టి సంధి, ద్వారము, ద్వారపాలకుడు.
ప్రతీహరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రతి హ్రియతే నివార్యతే అత్ర అనేనేతి చ ప్రతీహరీః. వాకిలిగాచునట్టి యెగ్గడికత్తెకును పేరు, ద్వారపాలకురాలు.
ప్రతోళి
సం. నా. వా.ఈ. స్త్రీ. తత్స. ప్రతోల యంతి జనా అస్యామితి ప్రతోళి. దీనియందు జనులు మదింతురు, పెద్దవీధి, రథ్య. ప్రతుల్యతే పరిమీయతే ఇతి ప్రతోలీ, వీధి.
ప్రత్నము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రాగ్భవ ఇతి ప్రతనః ప్రత్నశ్చ. పూర్వమందుపుట్టినది, పురాతనము, ప్రాచీనము.
ప్రత్యక్ఛ్రేణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రత్యక్ ప్రతీచీ పర్ణావళిరస్యా ఇతి ప్రత్యక్ శ్రేణీ. విముఖమైన ఆకుల యొక్క వరుస కలది. ప్రత్యగ్భవతీ ప్రత్యక్ శ్రేణిరస్యా ఇతి ప్రత్యక్ఛ్రేణీ. బోర్లాపడు ఆకులయొక్క పంక్తికలది, ఎలుక చెవి చెట్టు, దంతి చెట్టు, ఒకలత, విష్ణుక్రాంత (వృక్షవిశేషము).
ప్రత్యక్పర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రత్యక్ విముఖం పర్ణమస్యా ఇతి ప్రత్యక్పర్దీ. విముఖమైఉండుఆకులుకలది, ఉత్తరేను. ప్రత్యగ్భవతీ ప్రత్యక్ శ్రేణి రస్యా ఇతి ప్రత్యక్ఛేణీ. ఒకలత.
ప్రత్యక్పర్ణి
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రతి గతం అక్షమింద్రియం ప్రత్యక్షం. ఇంద్రియమును పొందునది, చక్షురావీంద్రియగోచరమైనది ఇంద్రియకము, చూడతగినది.
ప్రత్యగ్రము
సం.విణ. (అ.ఆ.అ) తత్స. ప్రతిగతమగ్రమస్యేతి ప్రత్యగ్రః. పొందపడిన కొనకలిగినది, నూతనము, పరిశుద్ధము. ప్రతిగతః అగ్రం శ్రేష్ఠం ప్రథమదర్శనం వా ఇతి ప్రత్యగ్రః.
ప్రత్యయము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత్యక్షః ప్రత్యయః. విశ్వాసమునకు, సుప్తిజాది, విశ్వాసము, ప్రసిద్ధి, జ్ఞానము, ఆచారము, శపథము, అవకాశము, వశము, హేతువు, కీర్తి, రంధ్రము, నమ్మకము, పరతంత్రుడు, కారణము, శబ్ధము.
ప్రత్యయితుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రత్యయో విశ్వాసోస్యసంజాతః ప్రత్యయితః. విశ్వాసము ఇతనిఅందుపుట్టును, నమ్మబడినవాడు, ఆప్తుడు.
ప్రత్యవసితము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రత్యవసీయతే స్మ ప్రత్యవ సితం. గళితమని కొందఱు, భుజింపబడినది, కుడువబడినది, తినబడినది.
ప్రత్యాఖ్యాతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రత్యాఖ్యాయతే స్మ ప్రత్యాఖ్యాతః. ధిక్కరింపబడినవాడు, కూడదని, నిరాకరింపబడినది, తిరస్కృతి.
ప్రత్యాఖ్యానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రతి విరుద్ధ మాఖ్యానం ప్రత్యాఖ్యానం. విరుద్ధముగా పలుకుట, నిరాకరించుట, తిరస్కృతి.
ప్రత్యాదిష్టము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రత్యాదిశ్యతే నిరాక్రియత ఇతి ప్రత్యాదిష్టః. నిరాకరింపబడినవాడు, ప్రత్యాఖ్యాతము. ప్రత్యాదిశ్యతే స్మేతి ప్రత్యాదిష్టః. విప్రకృతుడు.
ప్రత్యాదేశము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతివిరుద్ధమాదేశనం ప్రత్యాదేశః. విరుద్ధముగా నియోగించుట, ప్రత్యాఖ్యానము, తిరస్కృతి.
ప్రత్యాలీఢము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత్యాలేఢి భువమితి ప్రత్యాలిఢం. భూమిని సృశించునది కనుక, విలుకాడు ఎడమకాలుముందటికిచాచి నిలుచుట. ఎడమ పాదమును ముందుకుచాచి కుడిపాదమును వంచుట.
ప్రత్యాసారము
సం. నా. వా. అ. పుం. తత్స. భగ్నానాత్మీయాన్ ప్రత్యాసరతి ప్రత్యాసారః. భగ్నులైన తమవారిని కూర్చుకొని వచ్చునది, వ్యూహము వెనుక నుండు మఱియొకవ్యూహము. ప్రత్యాస్రియతే ఇతి ప్రత్యాసారః. ఇంద్రియనిగ్రహము, ఒకయోగాంగము, వీణాది వాద్యములను వానిని వాయించు వారిని సరిగా అమర్చుట, గ్రహించుట.
ప్రత్యాహారము
సం. నా. వా. అ. పుం. తత్స. విషయముల వలన ఇంద్రియములను మదలించుట, వర్ణసంగ్రహము. ప్రత్యాహరణం ప్రత్యాహరః.
ప్రత్యుత్ర్కము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత్యుత్క్రమః ప్రయోగార్థః. ఎదురుగాపోవుట, ప్రయోగము, యుద్ధము కొఱకైన భటులయుద్యకుము, ప్రయత్నము.
ప్రత్యుషము
సం. నా. వా. న్. అ. పుం. తత్స. ప్రత్యూషతినిశాం ప్రత్యూషః. రాత్రిని పోగొట్టునది, ప్రభాతము, ఒకవసువు. ప్రత్యోషతి వినాశయతి అంధకారమితి ప్రత్యుషః ఒకప్రాతః. కాలము.
ప్రథి
సం. నా. వా.ఇ.పుం. తత్స. ప్రాంతే ధీయతే విక్షిప్యత ఇతి ప్రధిః. కడను పెట్టబడునది, బండికంటి కడకమ్మి,నేమి. ప్రధీయతే అనేనేతి ప్రధిః. చక్రధారుడు, చక్రపు కమ్మి.
ప్రదరము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రదారణం ప్రదీర్యతే అనేనేతి చప్రదరః. వ్రక్కలింపబడును, బాణము, చీలుట, విఱుచుట, ఆడుదానికి కలుగు రక్తస్రావరోగము, పెద్దనుయ్యి, ఒకరోగము, బ్రద్దలగుట.
ప్రదీపము
సం. నా. వా. అ. పుం. తత్స. దీప్యతే అనేన దీపః ప్రదీపశ్చ. దీనిచే ప్రకాశింప చేయబడును, దీపము, దివ్వె, మండునది.
ప్రదీపము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రదీపయతీతి ప్రదీపనః. మిక్కిలి దీప్తముగా చేయునది, అంజనాద్రి యందు పుట్టిన రక్తవర్ణముగల విషభేదము.
ప్రదేశనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రదిశ్యతే దీయతే రాజ్ఞే ప్రదేశనం. ప్రకృష్టముగా రాజుకొఱకియ్యబడునది, కానుక, ఉపాయనము. ప్రదిశ్యతే అనేనేతి ప్రదేశనం. చూపుట.
ప్రదేశిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రదిశతి నిర్ధిశ త్యనయా ప్రదేశినీ. దీని చేత నిర్థేశించును, చూపుడువేలు, జుట్టనవ్రేలు, తర్జని. ప్రదిశ్యతీతి ప్రదేశినీ.
ప్రదోషము
సం. నా. వా. అ. పుం. తత్స. దోషాయాం ప్రారంభః ప్రదోషః. దోష అనగా రాత్రి దానియొక్క ప్రారంభము, మునిమాపు, మిక్కిలిదోషము, రాత్రిలోని తొలిజాము, తప్పు, రాత్రిలోని తొలిభాగం.
ప్రద్యుమ్నుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టం ద్యుమ్నం బలమస్యప్రద్యుమ్నః. ప్రకృష్టమైన బలముకలవాడు, మన్మధుడు.
ప్రద్యోతనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టం ద్యోతతే ప్రదోతనః. విశేషముగా ప్రకాశించువాడు, సూర్యుడు. ప్రద్యోతతే ఇతి ప్రద్యోతనః.
ప్రద్రావము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రద్రవణం ప్రద్రావః. తొలగిపోవుట, యుద్ధమువలన పాఱుట, ఓడుట, ప్రద్రవము, పారిపోవుట.
ప్రధనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రధనంతి ఘ్నంతి అత్రేతి ప్రధనం. దీనియందు హింసింతురు, యుద్ధము, చీల్చుట. ప్రదధాతీతి ప్రధనం. దారణము.
ప్రధమము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రథత ఇతి ప్రథమః. ప్రసిద్ధమగునది, మొదటిది, మొదటివాడు, పూర్వుడు, మొదటనుండుటను తెలుపు అవ్యయము, శ్రేష్ఠుడు. ముఖ్యము. ప్రథతే ప్రసిద్ధో భవతీతి ప్రథమః.
ప్రధానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రథంతే ప్రధానాని. ప్రకృష్టముగా భరించువారు. ప్రకర్షేణ ధత్తే ఉపసర్జనం పుష్ణాతీతి ప్రధానం. అప్రధానుని పోషించువాడు. ప్రకర్షేణ దధాతీతి ప్రధానం. ప్రకర్షము చేత నన్నిటిని ధరించునది, పరమాత్మ, ప్రకృతి, బుద్ధి, ముఖ్యము. ప్రధత్తే సర్వమాత్మనీతి ప్రధానం. ప్రశస్తము, ప్రముఖము, ఉత్తమము, ముఖ్యము, అగ్రము.
ప్రపంచము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రపంచ్యత ఇతి ప్రపంచః. విస్తరింపబడునది, భూలోకము, సంసారము, శబ్దవిస్తరము, విరివి, రచన, వ్యత్యాసము, మోసపుచ్చుట, విస్తారము, విపర్యయము.
ప్రపదము
సం. నా. వా. అ. న. తత్స. పదస్య ప్రారంభః ప్రపదం. పదము యొక్క ప్రారంభము, ముంగాలు, మీగాలు. ప్రారబ్ధం ప్రగతం వా పదమితి ప్రపదం. పాదాగ్రము.
ప్రపాతము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రపతంత్యస్మాదితి ప్రపాతః. దీనినుండి పడుదురు, కొండచరియ, కునికిపాటు, చరియ, ఒడ్డు, పడుట, రాత్రిముట్టిడి.
ప్రపితామహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పితామహస్య పితాప్రకర్షేణ ప్రపితామహః. తాతతండ్రి, ముత్తాత, బ్రహ్మ.
ప్రపున్నాటము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ పుమాంసం నాటయతీతి ప్రపున్నాటః. ప్రకృష్టముగా పురుషుని నటింప చేయునది, తగిరస. పుమాసం నాటయతీతి పుపున్నాటః. చక్రమర్దుడు, ఒక చెట్టు.
ప్రపుల్లము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రపుల్లతి ఉత్ఫుల్లతి సంపుల్ల తీతి ప్రఫుల్లః. వికసించునది.
ప్రపౌండరీకము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకర్షేణ పుండరీకసేదం రూపాంతరం దాహహరత్వాత్ప్రపౌండరీకం. దాహమును హరించునదిగనుక, తెల్లతామర, పుండరీకమను గంధద్రవ్యము.
ప్రబర్హము
సం విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకృష్టో బర్హ ఉద్యమోయస్య ప్రబర్హః. ప్రకృష్టమైన ఉద్యోగము కలవాడు, ముఖ్యము, మొదటిది, ప్రధానము.
ప్రబోధనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రబోత్యతే కుంకుమాదిగంధోనేనేతి ప్రభోదనం. దీనిచేతకుంకుమాది గంధం పెరగబడును, అత్తరు, అనుబోధము, మైపూత.
ప్రభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ భాతీతి ప్రభా. మిక్కిలి ప్రకాశించునది, వెలుగు, కుబేరునిపట్టణము, సూర్యునిభార్య, దుర్గ, కాంతి సంజ్ఞ, అందము.
ప్రభంజనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రభంజతి వృక్షశాఖాదికమితి ప్రభంజనః. వృక్షశాఖాదులను విఱుగ కొట్టువాడు, వాయువు, చక్కగాచువాడు. ప్రకర్షేణ భనక్తి వృక్షాదీనితి ప్రభంజనః. పవనము, గాలి.
ప్రభవ
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రభవనం ప్రభవత్యస్మాదితిచ ప్రభవః. దీనియందు పుట్టుదురు, ఒకసంవత్సరము, పుట్టుక, పుట్టుటకుకారణము, తెలివికి మొదటిచోటు, పరాక్రమము, నీరు పుట్టుచోటు, జన్మకారణము, మొదట దొరికిన చోటు.
ప్రభష్టకము
సం. నా. వా. అ. న. తత్స. కేశమధ్యాత్ ప్రభ్రష్టం ప్రభ్రష్టకం. జుట్టున వ్రేలాడెడు దండ, సిగనువ్రేలాడుద, కేశములందు వ్రేలాడు పూలమాల, వెంట్రుకల వల్ల జారినది.
ప్రభాకరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రభాం కరోతీతి ప్రభాకరః. ప్రశస్తమైనకాంతిని చేయువాడు, సూర్యుడు, అగ్ని.
ప్రభాతము
సం. నా. వా. అ. న. తత్స. భాతుం ప్రవృత్తం ప్రభాతం. ప్రకాశింప ప్రవర్తించినది, తెల్లవాఱుటకుముందు నాలుగుగడియలకాలము, వేకువ, ప్రాతః కాలము.
ప్రభావము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రభవం త్యనేన శాసితుం జగదితి ప్రభావః. దీనిచేత జగత్తునేలుటకు సమర్ధులగుదురు, కోశబలము వలన కలిగిన తేజము, శక్తి, మహత్వము, ప్రతాపము, విశాల హృదయత.
ప్రభిన్నము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ భిన్నః ప్రభిన్నః. మిక్కిలి మదస్రావమునొందినది, మదముపట్టిన ఏనుగు, మిక్కిలి భేదపడినది.
ప్రభువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ప్రభవతి సమర్ధో భవతీ ప్రభుః. సమర్ధుడగువాడు, విష్ణువు, అధిపుడు, సమర్ధుడు. ప్రభవతీతి ప్రభుః. అధిపతి, స్వామి, నాయకుడు, నేత, పాలకుడు, యజమానుడు.
ప్రభూతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రభవతి కార్యం సంపాదయితుమితి ప్రభూతం. కార్యమును చేయు సమర్థమైనది, అధికము, ఉన్నతము, సంభూతము, మహత్వము, ఎక్కువ.
ప్రమథాధిపతి
సం. నా. వా.ఇ.పుం. తత్స. ప్రమధాన మదిపః ప్రమథాధిపః. ప్రమధ గణములకు అధికుడు, శివుడు, ముక్కంటి.
ప్రమద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకృష్టో మదశ్చేతో వికారోస్యా ఇతి ప్రమదా. మిక్కిలి మదముకలది, యవ్వనాది మదము కల ఆడుది, స్త్రీ. ప్రమదయతి పురుషమితి ప్రమదా.
ప్రమద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రమధ్నంతి శత్రూన్ ప్రమథాః. శత్రువులను మదించువారు, యౌవనాదిమదముగల ఆడుది, ఆడుది, సంతోషము, మిక్కిలి మదముకలది. ప్రమదయతి పురుషమితి ప్రమదా, స్త్రీ.
ప్రమదావనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రమాదానం వనం ప్రమదావనం. స్త్రీలయొక్కవనము, అంతఃపురస్త్రీలు విహరింపదగిన ఉద్యానవనము, ఉద్యానవనము.
ప్రమధనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రమథ్యతే ప్రమధనం. హింసాయాం, చంపుట, వధము.
ప్రమనుడు
సం. విణ .(స్). తత్స. ప్రకృష్టం మనోయస్యప్రమనాః. మంచిమనస్సుగలవాడు, సంతోషము నొందిన మనస్సు కలవాడు, ఆనందము, కలవాడు.
ప్రమాణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రమీయతేనేనేతి ప్రమాణం. దీనిచేత నెఱుగబడును, ప్రత్యక్ష్యాది జ్ఞానకారణము. అంగుళీమానాదిమానము, సత్యము, మేర, శాస్త్రము, ఎఱుగునది. (ప్రత్యక్షాదిప్రమాణములు, ప్రత్యక్ష్మము, అనుమానము, ఉపమానము, శాబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి, సంభవము,ఐతిహ్యము, ఇందు మొదటనుండి నాలుగు తార్కికులమతమునందు, ఆరువేదాంతులమతమునందు ఎనిమిది పౌరాణికులమతమునందు ననిక్రమముగా నెఱుంగునది), ఉపదేశము, హద్దు, గౌరవము, కారణము, శాస్త్రము, వక్త.
ప్రమాదము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టోమదః ప్రమాదః. ప్రకృష్టమైనమదము ప్రమాదము, ఏమఱుపాటు.
ప్రమాపణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకర్షేణ మాపణం ప్రమాపణం. హింసాయాం, చంపుట, వధము.
ప్రమితి
సం. నా.వా. ఈ.స్త్రీ. తత్స. ప్రమాణం ప్రమితిః. సత్యముగా నెఱుగుట, యదార్ధ జ్ఞానము, ప్రమ.
ప్రమీతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రమియత ఇతి ప్రమీతః. హింసింపబడునది, యజ్ఞమునందు చంపబడినది, చచ్చినది, మృతుడు.
ప్రమీల
సం. నా.వా. ఆ. స్త్రీ. తత్స. ప్రమీలం తీండ్రియాణ్యత్రేతి ప్రమీలా. ఇంద్రియములు దీనియందు మిక్కిలిమూయబడును, కునికిపాటు, తండ్రి, సోమరితనము. 1. ప్రముఖము, 2. ప్రమోదము, 3. ప్రముదితుడు, 4. ప్రయతుడు, 5. ప్రయామము, 6. ప్రయోగము, 7. ప్రలంబఘ్నడు, 8. ప్రలాపము, 9. ప్రవణము, 10, ప్రవహణము.
ప్రముఖము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకృష్టం ముఖం ఆరంభోస్యేతి ప్రముఖః. మంచి ఉద్యోగముకలవాడు, జరుగుతున్న కాలము. సం. నా. వా. అ. పుం. తత్స. పున్నాగచెట్టు. సం. విణ. తత్స. ముఖ్యము. ప్రకృష్టం ముఖ్యమాద్యం యస్యేతి ప్రముఖః. ప్రధానము, శ్రేష్టము, మాల్యము.
ప్రముదితుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ప్రమోదతేస్మ ప్రముదితః. సంతోషించినవాడు, హృష్టుడు.
ప్రమోదము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టో మోదః ప్రమోదః. అతిశయమైన సంతోషము, సంతసము, హర్షము, ఆమోదము, గంధవిశేషము.
ప్రయతుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ప్రయచ్ఛతి ఉపరమతీంద్రియేభ్య ఇతి ప్రయతః. శుచి అయినవాడు, పరిశుద్దుడు, పవిత్రము.
ప్రయామము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ యమనం ప్రయామః. లెస్సగా వచనమును ముగించుట, జయఘంటలోనగు వాని గుండ ధాన్యాదుల వెలను ప్రసిద్ధపరచుట, వ్యవహారాదులయందు న్యూనాధిక్యములు లేక కలిగినది కలిగినట్టు చెప్పుట, మహర్ఘ్యములైన ధాన్యాదులయందలి జనుల ఆదరాతిశయము.
ప్రయోగము
సం. నా. వా. అ. పుం. తత్స. యస్య కస్య చిదర్థస్య స్వయమాచరణేన పరేషాం పురః ప్రకాశనం ప్రయోగః. నడుపుట, మంత్రతంత్రాదులను నడపుట, ప్రయత్నము, తారకారణము, కర్తృకర్మక్రియలకూడిక, ప్రయుక్తి, కార్మణము, వశీకరణము, నిదర్శనము, ఘోటకము.
ప్రలంబఘ్నుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రలంబమసురం హతవానా ప్రలంబఘ్నుః. ప్రలంబుడను రాక్షసుని చంపినవాడు, బలరాముడు. ప్రలంబం దనుపుత్రం హంతీతి ప్రలంబఘ్నః.
ప్రలాపము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రలపనం ప్రలాపః. మిక్కిలి పలుకుట, అర్థశూన్యమైనమాట, పలవరము.
ప్రవణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రవస్యత ఆశ్రియత ఇతి ప్రవణః. ఆశ్రయింపబడును, చతుష్పథము. సం. విణ. తత్స. వాటము, పల్లము, ప్రహ్వము, ఉదరము, ఆయతము, ప్రంగుణము, క్షణము, ప్లుతము, స్నిగ్ధము, క్షీణము, ఆసక్తము.
ప్రవయుడు
సం. విణ. (స్). తత్స. ప్రగతం యౌవనాఖ్యం వయోస్యేతి ప్రవయాః. పోయిన యౌవనము కలవాడు, ముదుసలి. ప్రగతం వయో యస్య సః ప్రవయాః. వృద్ధుడు.
ప్రవారణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రవార్యతే అశుభాదిక మనేనేతి ప్రవారణం. అశుభాదికము దీనిచేత వారింపబడును, ఫలమునుకోరి చేయుదానము, నిషేధము.
ప్రవాసనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రవాస్యతే ప్రవాసనం. చంపుట, వధము
ప్రవాహము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణా విచ్ఛేదేన వహతీతి ప్రవాహః. ఎడతెగక నడుచునది, వెల్లువ, ప్రవృత్తి, పరంపర, సెలయేరు, శ్రేష్ఠమైన గుఱ్ఱము.
ప్రవాహిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మలం ప్రవహతి ప్రవాహికా. మలమును ప్రవహింప చేయునది, అతిసార రోగము, గూడులేని బండి, రాక్షసుడు.
ప్రవిదారణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రవిదృణం త్యత్రేతి ప్రవిదారణం. దీనియందు మిక్కిలి వ్రక్కలింతురు, యుద్ధము, పోరు. ప్రవిదారయంత్యత్రేతి ప్రవిదారణం. యుద్ధం, ఆకీర్ణము.
ప్రవీణుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకృష్లా వీణా యస్యేతి ప్రవీణః. ప్రకృష్టమైన వీణకలవాడు, నిపుణుడు, తీర్పరి.
ప్రవృత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ప్రవర్త ఇతి ప్రవృత్తిః. ప్రవర్తించునది, నడక, ప్రవేశము, బ్రతుకుతెరువు, వృత్తాంతము, మదజలము, ఉలవలు, జీవిక, వార్త.
ప్రవృద్ధము
సం. నా. విణ .(అ.ఆ.అ).తత్స. ప్రవర్ధతేస్మ ఇతి ప్రవృద్ధం. వృద్ధిపొందునది, పెరిగినది, కొనసాగి పెరిగినది, వ్యాపించినది.
ప్రవేకము
సం. వా. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకృష్టోవేకః పృథగ్భావోయస్యేతి ప్రవేకః. అప్రధానులతో ప్రకృష్టమైన యేర్పాటు కలవాడు, ముఖ్యము, గామిడి. ప్రవిచ్యతే పృథక్ క్రియతే ఇతి ప్రవేకః. ఉత్తముడు, ప్రధానము, ప్రధానుడు.
ప్రవేణి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. వేణితీతి ప్రవేణి. అణగియుండునది. ప్రకర్షేణ వయన్త్యేనామితి ప్రవేణీ. మిక్కిలి దీనినేయుదురు. ఏనుగు మీద పరచెడి యెఱ్ఱకంబళి, సర్పాకారముగా అల్లినజడ, జంబుఖానా, జడ.
ప్రవేష్టము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రవేష్ట్యతేనేన ప్రవేష్టః. దీనిచేత శిక్షింపబడును, బాహువు, చేయి, ఏనుగు దంతమూలము.
ప్రవ్యక్తము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకృష్టం వ్యజ్యతే స్మ ప్రవ్యక్తం. లెస్సగా నెఱుగబడినది, స్పష్టము, వెల్లడి.
ప్రశస్తము
సం. విణ (అ. ఆ. అ). తత్స. ప్రశస్యత ఇతి ప్రశస్తం. స్తోత్రము చేయబడునది, ప్రసిద్ధి కెక్కినది, నేయి, నూనెలోనగువానిచేత పొగడబడినది, అతిశ్రేష్ఠము, క్షేమము, ప్రశంసనీయము.
ప్రశ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రచ్ఛన్నం ప్రశ్నః. ఎఱుగగోరి అడుగుట, అడుగుట.
ప్రశ్రితుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణ శ్రియత ఇతి ప్రశ్రితః. ప్రకర్షము చేత సాధువులను పొందువాడు, వినీతుడు.
ప్రష్ఠవాహము
సం. నా. వా.హ్.పుం. తత్స. ప్రష్ఠం అగ్రగామినం వహతీతి ప్రష్ఠవాట్. ముందరి యెద్దుననుసరించి పోవునది, ప్రక్కకులాగు యెద్దు.
ప్రష్ఠుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ప్రతిష్ఠతే పురో గచ్ఛతీతి ప్రష్ఠః. పురోగామి, అగ్రేసరుడు, అగ్రగామి.
ప్రష్ఠౌహి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రష్ఠమగ్ర గర్భం వహతీతి ప్రష్ఠౌహి. ప్రధమ గర్భమును వహించునది, తొలిచూలిబిడ్డ.
ప్రసన్న
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రసీధతి ప్రసన్నా. తీటయై ఉండునది, కల్లు, మద్యము, మద్య విశేషము.
ప్రసన్న
సం. నా. వా. విణ. తత్స. ప్రసీదతీతి ప్రసన్నః. ప్రకృష్టముగా మనస్సును పొందునది, నిర్మలము, సంతుష్టము.
ప్రసభము
సం. నా. వా. అ. పుం. తత్స. యుక్తా యుక్త విచారో త్రేతి ప్రసభం. దీనియందు దౌష్ట్యము చేయుదురు, బలాత్కారము. ప్రగతా సభా సభాధికారో యత్ర ప్రసభం. హఠము, వేగము.
ప్రసరణము
సం. నా. వా. అ. న. తత్స. ఆసమంతాత్ సరణం ప్రసరణం. అంతటనెఱయుట, అంతటనేన వ్యాపించుట.
ప్రసరము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ సరణం ప్రసరః. అంతట వ్యాపించుట, వ్యాపనము, వినయము, వేగము.
ప్రసవము
సం. నా. వా. అ. పుం. తత్స. నం ప్రసూతిః. కనుట, కానుపు, పువ్యు, పుండు, పుట్టుక, బిడ్డ. ప్రసూయతే చ ప్రసవః పుట్టుటయు, హేమంత ఋతువు, ఫలము, ఆనుజ్ఞ, కుమారుడు, పారంపర్యము, ఐక్యము, బిడ్డను కనుట.
ప్రసవ్యము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రగతం సవ్యాదితి ప్రసవ్యం. దక్షిణ భాగము వలన బాసినదిగనుక, కుడి, ఎడమ, అనుకూలము, ప్రతికూలము, అధీనమైనది, ఎడమవైపుది.
ప్రసాదము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రసీదతీతి ప్రసాదః. ప్రసన్నమగుట ప్రసాదము. ప్రసదనమితి చ ప్రసాదః. దీనిచేత ప్రసన్నలౌదురు, ప్రసన్నత, కావ్యగుణములలో నొకటి అనుగ్రహము, స్వాస్థ్వము, భగవంతుడు లోనగువారిచే భుక్తపరిశిష్టమైన అన్నము మొదలుగునవి, అనుగ్రహము, స్వచ్ఛత.
ప్రసాదితుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రసాధ్యతే స్మప్రసాధితః. అలంకరించబడినవాడు, వస్త్రాదులచేత అలంకరింబడినవాడు, కైసేయ బడినవాడు.
ప్రసాధనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రసాధ్యతే అలంక్రియతేనేనాంగమితి ప్రసాధనం. దీనిచేత అంగము అలంకరింపబడును, వస్త్రాద్యలంకరణము, సిద్ధి, దువ్వెన, అభ్యంగము, అలంకృతి, వేషము.
ప్రసాధని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రసాధ్యం తేకేశాః అనయేతి ప్రసాధినీ. దీనిచేత వెంట్రుకలు లెస్సగా చేయబడును, దువ్వెన, కంకతిక, అభ్యంగము, అలంకృతి.
ప్రసారణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సార్యంతే వాతసంకుచితా న్యంగాన్యనయేతి సారణీ ప్రసారణీ. వాతము చేత ముడుచుకొన్న అంగములు దీనిచేత చాచబడును. గొంతెమగోరు.
ప్రసిత
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ప్రసీయతే అనేయేతి ప్రసితిః. దీనిచేత కట్టబడును, నిర్భంధము, కట్టెడు సాధనము, బంధనము.
ప్రసితుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రసినో త్యభిమత వస్తుని చిత్తమితి ప్రసితః. అభిమత వస్తువు నందు మనస్సు నిలుపువాడు, తత్పరుడు, అసూయ కలవాడు.
ప్రసిద్ధము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణ సిద్య తీతి ప్రసిద్ధః. ప్రకర్షము చేతనైనవాడు, ప్రసిద్ధి కెక్కినది, అలంకరింపబడినది, పేరుపడినది, పూజింపబడినది.
ప్రసువు
సం. నా. వా.ఊ.స్త్రీ. తత్స. పత్యుః భర్తుః పత్న్యా భార్యాయాశ్చ ప్రసూర్మాతాః. మగని యొక్కయు, ఆరియొక్కయు తల్లి, తల్లి, ఆడుగుఱ్రము, అరటి, ఒకటితోనొకటి పెనవేసుకొన్న ద్రాక్షతీగలోనగునది.
ప్రసూత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రసూయతే ప్రత్రాన్ పుసూతా. బిడ్డలును కనునది, బాలెంతరాలు, సం. నా. వా. అ. న. తత్స. పువ్వు. సం. నా. వా. విణ. తత్స. పుట్టినది. ప్రసూతే స్మ ప్రసూతా. ప్రజాత, ప్రసూతిక.
ప్రసూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ప్రసవనం ప్రసూతిః. కనుట, కానుపు, పుట్టుక, బిడ్డ. ప్రసూయతే ఇతి ప్రసూతి. సంతతి, తనయుడు, ప్రసవము, సంతానము, కుమారుడు.
ప్రసూతిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రసూయతే పుత్రాన్ ప్రసూతికా. బిడ్డలను కనునది, బాలెంతరాలు, ప్రసూత.
ప్రసూతిజము
సం. నా. వా. అ. న. తత్స. ప్రసూతాజాతం ప్రసూతిజం. ప్రసూతియందు పుట్టినది, బాధ, దుఃఖము, నొప్పులు.
ప్రసూనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రసూయత ఇతి ప్రసూనం. పుట్టునది, పుష్పము, ఫలము, పూవు, సారథి.
ప్రసృత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రసరతీతి ప్రసృతా. వృద్ధిపొందునది, పిక్కవేళ్లు, కాలిపిక్క, రెండు పిడికిళులు, పుడిసిలి. సం. నా. వా. అ. పుం. తత్స. చేర.
ప్రసృత
సం. నా. వా. విణ. తత్స. ప్రసరతి స్మ ప్రసృతం. వ్యాపించినది, కొనసాగి పెరిగినది, తీర్పబడినది.
ప్రసృతి
సం. నా. వా.ఇ.స్త్రీ. తత్స. ప్రర్యతే విరుద్ధ లక్షణయాసంకుచ్యత ఇతి ప్రసృతిః. చాచబడినది, చేర, పుడిసిలి.
ప్రసేవకము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రసేవ్యత ఇతి ప్రసేవకః. మిక్కిలి కదిసియుండునది, వీణకరివె, వీణకాయ, గోనెసంచి.
ప్రసేవము
సం. నా. వా. అ. పుం. తత్స. స్యోనః ప్రసేవశ్చ. వెదురుబద్దల చేత అల్లబడునది, ఎండుపుతట్ట, వీణ, కరివె.
ప్రస్తరము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తృణాతి ఆచ్ఛాదయతి భువమితి ప్రస్తరః. భూమిని కప్పునది, ఱాయి, రత్నము, కుథము, చిగుళ్లులోనగువానిచే ఏర్పరచినసెజ్జ, దర్భలు పఱచుట, పత్రశయ్య, దర్భ.
ప్రస్తావము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రసంగేన స్తవనం ప్రస్తావః. ప్రసంగము చేత కొనియాడుట, అవసరము, చెప్పుట, ఉపోద్ఘాతము.
ప్రస్థపుష్పము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రస్థే సానౌ పుష్ప్యతీతి ప్రస్థపుష్పః. చరియ అందు పుట్టినది, మరువము (వృక్షవిశేషము).
ప్రస్థము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిష్ఠం తేస్మిన్సమభాభాగతాత్ప్రస్థః. సమభూమి అవుటవలన మిక్కిలి దీనియందు వసింతురు. ప్రతిషతే ధాన్యమ త్రేతి ప్రస్ధః. దీనియందు ధాన్యముండును. ప్రతిష్ఠలేస్మిన్నితి ప్రస్థః. దీనియందు ధాన్యాదులు ఉండును, ప్రస్థమానము, నాలుగుమానికల కొలది, కొండనెత్తము, రెండుమానికలు, నాల్గుదోసిళులు, సమప్రదేశము, ఒకమానము.
ప్రస్థానము
సం. నా. వా. అ. న. తత్స. ప్రస్థీయత ఇతి ప్రస్థానం. గమనార్థకము, కదలిపోవుట, ప్రయాణము, శాస్త్రము, యాత్ర.
ప్రస్ఫోటనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రస్ఫోట్యతే బహిర్నిష్క్రియతే తుషాది రనేనేతి ప్రస్ఫోటనం. దీనిచేత పొట్టుమొదలయినవి నిదసింపబడును, చేట, ప్రకాశనము, దెబ్బ, తూర్పారబట్టు.
ప్రస్రవణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రస్రవం త్యాపోస్మాది ప్రసవణం. దీనియందు ఉదముజాఱును, సెలయూట, చెమట. ప్రస్రవతి జలమస్మాదస్మిన్ వా ఇతి ప్రస్రవణం, మాల్యవంతమను పర్వతము, ఊట.
ప్రస్రావము
సం. నా. వా. అ. పుం. తత్స. మూత్రయతి ప్రసవతి మూత్రం. జాఱునది, మూత్రము, ఉచ్ఛ, అన్నపుగంజి.
ప్రహరణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రహరంత్యనేన ప్రహరణం. దీనిచేత కొట్టుదురు, ఆయుధము. ప్రహ్రియతేస్మిన్నితి ప్రహరణం. యుద్ధము, అస్త్రము.
ప్రహరము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రహ్రియతే ఢక్కాది రస్మిన్ ప్రహరః. దీనియందు ఢక్కాది వాద్యములు వాయించబడును, జాము, దెబ్బ.
ప్రహస్తము
సం. నా. వా. అ. పుం. తత్స. విసృతోహస్తః ప్రహస్తః. విసృతమైన హస్తము, చప్పట, చపటమ, ఒకరాక్షసుడు, రావణుని మంత్రి, అఱచేయి.
ప్రహి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ప్రకృష్టం హ్రీయతే జలమస్మాది ప్రహిః. ప్రకృష్టముగా జలము దీనివలన గ్రహింపబడును, నూయి, కూపము. ప్రకర్షేణ హ్రియతే అత్రేతి ప్రహిః.
ప్రహేళికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రహేళయతి అభిప్రాయం సూచయతీతి ప్రహేళికా. అభిప్రాయమును సూచింప చేయునది, ప్రవల్లిక, గూఢ ప్రశ్న.
ప్రహ్లాన్నుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రహ్లాదతేస్మ ప్రహ్లాన్నః. సంతోషించినవాడు, ప్రముదితుడు.
ప్రాంతరము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకృష్టం గ్రామయోరంతరం వ్యవధానమత్రేతి ప్రాంతరం. అధికమైన గ్రామముల యొక్క వ్యవధానము కలిగినది, అడవి, తొఱ్ఱ, దవ్వ అయిన ఎడారి దారి, పొలిమేర. ప్రకృష్టమంతరమవకాశో వ్యవధానం వా యత్రేతి ప్రాంతరం. విపినము, కోటరము.
ప్రాంశువు
సం. విణ .ఉ. తత్స. ప్రకర్షేణ అశ్నుత ఇతి ప్రాంశుః. ఊర్ధ్వముగా వ్యాపించునది, పొడుగైనది, ఉన్నతము. ప్రకృష్టాః అంశవో అత్ర పాంశుః. తుంగము, పొడవైనవాడు.
ప్రాకామ్యము
సం. నా. వా. అ. న. తత్స. ఇచ్ఛయా నిర్విఘ్నసంచార శక్తిర్యేనతత్ప్రా కామ్యం. అష్టైశ్వర్యములు, ఐశ్వర్యము.
ప్రాకారము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ క్రియత ఇతి ప్రాకారః. లెస్సగా చేయబడునది, గుడి మొదలగువానిచుట్టుగోడ, ప్రహరి, వరణము, ప్రహరిగోడ.
ప్రాకృతము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకృతౌయథాజాతభావే వర్తమానో నవ్యుత్పన్న ఇతి ప్రాకృతః. విశేషజ్ఞానము లేక పుట్టినప్పటి వలెనుండువాడు, ఒకానొకభాష. (ఇది స్త్రీలులోనగువారు భాషించుటకు ఉపయుక్తముగా ఉండెనది, ఇది షడ్విధము, ప్రాకృతము, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికా పైశాచి, అపభ్రంశము. ప్రకృష్టమకృతమకార్యం యస్య ప్రాకృతః. నీచుడు.
ప్రాగ్యము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రాగ్రే ముఖ్యే స్థానే భవః ప్రాగ్యః. ముఖ్యమయిన స్థానమందుండువాడు, మొదటిది, ముందు నడుచునది.
ప్రాగ్రారము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణ అగ్రం శ్రేష్ఠం రత్నకుండలాదికం హరతీతి ప్రాగ్రహరః. మిక్కిలి శ్రేష్ఠమయిన రత్నకుండలాదులను పుచ్చుకొనువాడు, ముందునడచునది, మొదటిది.
ప్రాగ్వంశము
సం. నా. వా. అ. పుం. తత్స. వన్యతే ఆశ్రయత ఇతి వంశః ప్రా గగ్రే వంశః ప్రాగ్వంశః. ప్రాగ్భాగమందు యజమానాదుల చేత ఆశ్రయింపబడునది, హవిర్గృహమునకుముందున్నసభాగృహము, ఆవరణ తోడి చాట.
ప్రాచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రాక్ ప్రథమం అంచత్యస్యాం రవి రితి ప్రాచీ. ప్రధమమున సూర్యుడు ఈ దిక్కున పొడమును కనుక, తూర్పు, పచ్చాకుచెట్టు. ప్రథమం అంచతి సూర్యం ప్రాప్నోతీతి ప్రాచీ.
ప్రాచీనము
సం. నా. వా. అ. న. తత్స. పాక్ ప్రాచ్యాం భవప్రాచీనం. తూర్పున పుట్టినది. కంపకోట, పూర్వదిశయందుకలది, పూర్వకాలము నందుకలిగినది, ప్రాగేవేతి ప్రాచీనం. ఆవేష్టకము, వృత్తి, తూర్పుది.
ప్రాచీనావీతము
సం. నా. వా. అ. న. తత్స. అవీయతే ఆవీతం ప్రాచీనం చ తదావీతం చ ప్రాచీనవీతం. ప్రాచీనమై దక్షిణ భుజమందు కప్పబడునది. కుడిభుజము మీదుగా ఎడమప్రక్కను వ్రేలెడు జందెము. ప్రాచీనం ప్రదక్షిణం ఆవీయతే స్మేతి ప్రాచీనావీతం, అపసవ్యముగా వేసిన జందెము.
ప్రాచ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రాద్గక్షిణోదేశః సః ప్రాచ్య ఇత్యుచ్యతే. శరావతి యనునది, యెల్లగాగల ప్రాగ్ధక్షిణముల మద్యదేశము. తూర్పుదిక్కునందలిది, ఒక దేశము.
ప్రాజనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రాజ్యతే ప్రేర్యతే అనేన ప్రాజనం. దీనిచేత పశ్వాదికము ప్రేరేపింపబడును, మునికోల, తోత్రము. ప్రవాయతే అనేనేతి ప్రాజనం. తోదనము, ప్రతోదము, తోత్రము, కొరడా.
ప్రాజిత
సం. నా. వా. ఋ. పుం. తత్స. ప్రాజతి ప్రేరయత్యశ్వానితి ప్రాజితా. గుఱ్ఱములను ప్రేరేపించువాడు, సారధి, తేరుపూన్పరి.
ప్రాజ్ఞ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ జానాతీతి ప్రాజ్ఞీ. లెస్సగా తెలిసినది, లౌకికవ్యవహరమునందు మిక్కిలి తెలివిగల ఆడుది, పండితునిభార్య, విధ్వాంసుడు.
ప్రాజ్ఞుడు
సం. విణ .(అ.ఆ.అ).తత్స. ప్రకర్షేణ జానాతీతి ప్రజ్ఞః. మిగులనెఱుగువాడు, పిండితుడు, సమర్ధుడు.
ప్రాజ్యము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణాజ్యతే క్షిప్యత ఇతిప్రాజ్యం. మిక్కిలి ఒక దిక్కున కూర్చుట కొఱకుపెట్టబడునది, అధికము. ప్రవీయతే ఇతి ప్రాజ్యం. ప్రచురము, ఎక్కువ.
ప్రాడ్వివాకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ధర్మాధర్శౌ పృచ్ఛతీతి ప్రాట్ వివక్తీతివివాహకః ప్రాట్చాసౌలివాకశ్చ ప్రాడ్వివాకః వ్యవహరములనుఅడిగి విచారించి పలుకువాడు, తగవరి, అక్ష దర్శకుడు. పృచ్ఛతీతి ప్రాట్, వివిచ్య వక్తీతి వివాకః ప్రాడ్వివాకః. అక్షదర్శకుడు, వ్యవహారదర్శి, తీర్పరి (న్యాయాధిపతి).
ప్రాణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ అనంత్యనేనేతి ప్రాణః. దీనిచేత లెస్సగా బ్రతుకుదురు. ప్రాణోపాస్సమానశ్చ. ప్రాణంత్యనేన ప్రాణః. గాలి, హృదయమందలిగాలి, కావ్యజీవము, బలిమి, బోళము, బవుసుఱు, నిండింపబడినది, (పంచప్రాణములు, ప్రాణము, అసానము, సమానము, ఉదానము, వ్యానము). ప్రాణితి జీవతి బహుకాలమితి ప్రాణః. బలము, బ్రహ్మ, పరిమళము, ఒకబంక, జీవము, ఓంకారము, ఆత్మ, మనోవికారము, హృదయమునందుండు వాయువు, చైతన్యము.
ప్రాణి ద్యూతము
సం. నా. వా. అ. న. తత్స. ప్రాణినాం ద్యూతం ప్రాణిద్యూతం. ప్రాణులయొక్క ద్యూతము, కోడిపందెములోనగునది, సమాహ్యయము. ప్రాణిభిర్మేషాదిభిః కృతం ద్యూతమితి ప్రాణిద్యూతం. సమాహ్వయము, యుద్ధము, జంతుయుద్ధము.
ప్రాణి
సం. నా. వా.న్.పుం. తత్స. ప్రాణోస్యాస్తీతి ప్రాణీ. ప్రాణము కలిగినది, మనుష్యాది జంతువు. ప్రాణాః సంత్యస్యేతి ప్రాణీ. ప్రాణవిశిష్టము, చేతనము కలిగినది, జన్యువు.
ప్రాతిహరకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతిహరతి నయనే ఇతి ప్రాతిహరకః. కనుకట్టుచేత దృష్టిని హరించువాడు, గారడివిద్యయందు నేర్పరియైనవాడు, పూలమాలలుకట్టువాడు, మాయావి.
ప్రాథమ కల్పికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రథమః కల్పః ఆద్యారంభః ప్రయోజనం యేషాంతే ప్రాథమ కల్పికాః. ప్రథమారంభము ప్రయోజనముగాకలవారు. కొత్తగా చదువుగారంభించిన శిష్యుడు, శైక్షుడు, వేదాధ్యయనమారృంభించిన విద్యార్థి.
ప్రాదేశనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రాదిశ్యత ప్రాదేశనం. ఇచ్చుట, త్యాగము, దానము.
ప్రాదేశము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రదస్యతే పరిమీయ తేప్రాదేశః. పెనువ్రేలు జుట్టన వ్రేళ్లనడిమికొలత, బొటనవ్రేలిని చూపుడువ్రేలిని చాచిపట్టినంతకొలత, జుత్తిలి. ప్రదిశ్యతే ఇతి ప్రాదేశః.
ప్రాప్తము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రకర్షేణ ఆప్తం ప్రాప్తం. మిక్కిలి పొందబడినది, “ప్రాప్యతే స్మ ప్రాప్తం. పొందబడినది, కూడుకొన్నది, ఉచితము, చేరినది, న్యాయమైనది.
ప్రాప్తరూపడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రాప్తం రూపం యస్య ప్రాప్తరూపః. మంచిరూపముకలవాడు, చక్కనివాడు, తెలిసినవాడు, పండితుడు, రూపవంతుడు.
ప్రాప్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. యయా ఇష్టప్రాప్తి స్సా ప్రాప్తిః. అష్టైశ్వరములు, “ప్రాపణం ప్రాప్తిః. పొందుట, లాభము పొందు, శుభోదయము, ఒక ఐశ్వర్యము.
ప్రాప్యము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రాప్తుం యోగ్యం ప్రాప్యం. పొందతగినది.
ప్రాభృతము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకర్షేణ భ్రియతే ప్రాభృతం. ఎచ్చుగా భరించునది, కానుక, ఉపహరము. ప్రాభ్రీయతే స్మేతి ప్రాభృతం.
ప్రాయము
సం. నా. వా.అ.న.తత్స. ప్రకృష్ట మేతి పుణ్యలోక మనేనేతి ప్రాయః. దీనిచేపుణ్యలోకమునుపొందుదురు, వయస్సు, మరణార్థము, సర్వకర్మ పరిత్యాగ పూర్వకమైన ఉపవాసము, చావు, బాహుళ్యము, వృత్తియందుత్తర పదమైనచోసమానము.
ప్రార్ధితము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ లంబతే ప్రాలంబికా. మిక్కిలి వ్రేలుచుండినది, కాసులపేరు, మెడనుండివ్రేలెడు బంగారు బొట్లదండ.
ప్రార్ధితము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రార్థ్యతే స్మ ప్రార్థితః. అడుగబడినదకనుక, వేడబడినది, శత్రువుచే అడ్డగింపబడినది.
ప్రాలంబము
సం. నా. వా. అ. న. తత్స. ప్రలంబతే ప్రాలంబం. మిక్కిలి వ్రేలాడునది, మెడనుండి సరిగా ఉరమున వ్రేలెడుపూలదండ.
ప్రాలేయము
సం. నా. వా. అ. న. తత్స. ప్రళయాచ్ఛరదంతా దాగతమితిప్రాలేయం. శరత్కాలాంతమున వచ్చునది, మంచు, హిమము, నీహరము. ప్రకర్షేణ లీయంతే లీనా భవంతి పదార్థా అత్రేతి ప్రాలేయం.
ప్రావారము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రవ్రియతే అనేనేతి ప్రావారః. దీనిచేత మిక్కిలి కప్పబడును, ఉత్తరీయము, కంబళి.
ప్రావృట్టు
సం. నా. వా. ష్. స్త్రీ. తత్స. ప్రవర్షంతి ఘనా అత్రేతి ప్రావృట్. మేఘములు దీనియందు ఎక్కువగా వర్షించును, వర్ష ఋతువు. ప్రకర్షేణ ఆ సమ్యక్ ప్రకారేణ చ వర్షతీతి ప్రావృట్. వర్షాకాలము, శ్రావణ భాద్ర మాసములు.
ప్రావృతము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రావ్రియత ఇతి ప్రావృతం. కప్పుకొనబడునది, దుప్పటి, ముసుగు.
ప్రావృషాయణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రావృషిభవా ప్రావృషాయణీ. తరచుగా వర్షాకాలమందు పుట్టినది, దూలగొండి, ఒక ఓషధి, శోభాగ్ని మొక్క.
ప్రాసంగము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రాసజ్యతే బలీవర్దకం ఠేష్వితి ప్రాసంగః. ఎద్దుల మెడలమీద కూర్చబడునది కాడికిముందటికాడి రెండవకాడిపేరు, కాడి.
ప్రాసంగ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రాసంగం వహతీతి ప్రాసంగ్యః. తలకాడిమోయునది, కాడిమోసెడు ఎద్దు.
ప్రాసము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రాస్యతే శత్రు ష్వితి ప్రాసః. శత్రువులను గూర్చి చిమ్మబడునది, ఈటె, పద్యపాదమున రెండవ అక్షరము, ఒక ఆయుధము, కుంతాస్త్రము, ప్రాసకము.
ప్రాసాదము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రసీదన్త్యన్నితి ప్రాసాదః. దీనియందు ప్రసన్నలైయుందురు, దేవళము, నగరు, భవనము.
ప్రాసికుడు
సం. విణ .(అ.ఆ.అ). తత్స. పాశః ప్రహరణ మస్య ప్రాసికః. ఈటె ఆయుధముకలవాడు, ఈటెకాడు.
ప్రాహ్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. అహ్నః ప్రారంభః ప్రాహ్ణ్నః. అహస్సు యొక్క మొదటిభాగము, ఉదయము మొదలుపదిగడియల వఱకుకలకాలము, లేపగలు, దినములోని తొలిజాము.
ప్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రీణాతి ప్రియః. ప్రేమించువాడు. ప్రిణాతీతి ప్రియా. తృప్తిని చేయునది, ప్రియురాలు, ఒక వృక్షము, మిత్రుడు, భర్త, మనోహరుడు, సుందరమైనది.
ప్రియంగువు
సం. నా. వా.ఉ.స్త్రీ. తత్స. ప్రీణాతి రోగహరణే ప్రియజ్ఞః. రోగహరణము చేత సంతోషపెట్టునది. ప్రియాణ్యఙ్గాన్యస్య ప్రియఙ్గః. ప్రియమైనఅంగములు కలది, కొఱ్ఱలు, నల్లావలు, పిప్పలి, ప్రేంకణము, కుంకుమ పువ్వు. ప్రియం గచ్ఛతీతి ప్రియంగుః. సుగంధ వృక్ష విశేషము, లత, గోవందని, ఫలిని, విష్వక్సేన, గంధఫలి, గౌరి.
ప్రియంవదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రియంవదతీతి ప్రియం వదః. ప్రియముగా పలుకువాడు, ఖేచరుడు, ఇచ్చకమాడువాడు.
ప్రియకము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రీణాతీతి ప్రియకః. ప్రీతినిచేయునది. ప్రియ ఏవ ప్రియకః. ప్రియమైనది. ప్రియతి వాతం ప్రియకః. వాతమునొందునది. కుంకుమపువ్వు, చిత్రవర్ణముకల జింక, తుమ్మెద, కడప, ప్రేంకణము, వేగిస, పచ్చమర్ధి, ఒకజాతిజింక, ఒకవృక్షము.
ప్రియత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రియత హృదయే భవం హర్ధం. హృదయమందు పుట్టినది, స్నేహము, చెలిమి.
ప్రియాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రియతి అతిరసత్వాత్ హృదయం గచ్ఛతీతి ప్రియాలః. అత్యంతరసము కలది, ద్రాక్ష, మోరటి.
ప్రీణనము
సం. నా. వా. అ. న. తత్స. తృప్తిని పుట్టించునది.
ప్రీతి
సం. నా. వా.ఇ.స్త్రీ. తత్స. ప్రీణాతీతి ప్రీతిః. తృప్తి జేయునది, సంతోషము, స్నేహము, ఒకగ్రహప్రయోగము, మన్మధునిభార్య.
ప్రుష్టము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రష్యతే స్మ ప్రుష్టః. కాల్పబడినది, దగ్ధము, వేడి, వేడిది.
ప్రేంఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రేంఖతే ఇతస్తతః ప్రేంఖా. ఇటు అటు వోవునది. డోలా ప్రేంఖః పుమాన్ ప్రేంఖా. డోల, పర్యటనము, నృత్యము, అశ్వగతి, ఊయల, సేవకుడు, చిన్నమంచె. ప్రేంఖ్యతే గమ్యతే అనయేతి ప్రేంఖా.
ప్రేంఖితము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ప్రేంఖ్యతే స్మ ప్రేంఖతః. కదలింపబడినది, ఊచబడినది, కంపితము, డోలితము, తరలితము, లులితము, ధృతము, చలితము, ధూతము, వేల్లితము, ఆందోలితము.
ప్రేక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రేక్షంతే అనయేతి ప్రేక్షా. దీనిచేత లెస్సగా చూతురు, బుద్ధి, ఈక్షణము, నృతేక్షణము. ప్రకర్షేణ ఈక్ష్యతే యయేతి ప్రేక్షా. శాఖ, శోభ, నాట్యమును, చూచుట, బుర్ధి.
ప్రేతము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకర్షేణ నరక మిత్రాః ప్రేతాః. నరకమందుండెడు జంతువుల పేర్లు. ప్రకృష్టాం దశామితః ప్రేతః. ప్రకృష్టమైన దశను పొందినవాడు. ప్రైతి మ్రియతే స్మ ప్రేతః. మృతిపొందినవాడు, నరకమందుండు జంతువు, భూత విశేషము పీనుగ, నరకవాసి, దయ్యము.
ప్రేమ
సం. నా. వా.న్. పుం.న. తత్స. ప్రియస్య భావః ప్రేమా. ప్రియము యొక్క భావము, హర్షము, స్నేహము, అనురాగము, కేళి.
ప్రేష్ఠము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. అతిశయేన ప్రియః ప్రేష్ఠః. మిక్కిలి ప్రియమైనది. అయమేషామతిశయేన ప్రియ ఇతి ప్రేష్ఠః. అతిశయప్రియుడు.
ప్రైషము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రకృష్టమే షణం ప్రైషః. ప్రకృష్టమైన గమనము, ప్రేషణము, మర్ధనము, క్లేశము, ఉన్మాదము, పంపుట, పిండివిసురుట.
ప్రోక్షణము
సం. నా. వా. అ. న. తత్స. ప్రోక్ష్యతే ప్రోక్షణం. ప్రోక్షించుట. చిలుకరించుట (నీళ్లు) పశువునువధించుట.
ప్రోక్షితము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రోక్షణ మితః ప్రోక్షితః. ప్రోక్షణమును పొందినది, చిలుకరింపబడినది. (యజ్ఞమునందు) వధింపబడినది.
ప్రోధము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రోథతీతి ప్రోథః. దట్టమైఉండునది, గుఱ్ఱపుముక్కు, గర్భపిండము, పిఱుదు, జీర్ణవస్త్రము, తిరువది, ప్రసిద్ధి కెక్కినది, స్థాపించబడినది.
ప్రోష్ఠీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రోష్ఠతి పిత్త కృత్త్వా త్రోష్ఠీ. పైత్యకారిఅగుటవలన దహించునది, ఎగిరెగిరిపడెడు మత్స్య విశేషము. ప్రకృష్ట ఓష్ఠో యస్యాః ప్రోష్ఠీ. మత్స్యభేదము, ఒక చేప.
ప్రౌఢ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రకర్షేణ ఊఢం ప్రౌఢం. ప్రకర్షముగా వహింపబడునది. స్త్రీ స్వీయాంతర్భే దవిశిష్టనాయికా విశేషము. ప్రోహ్యతే స్మేతి ప్రౌఢా. వర్ద్ధితము, ప్రవృద్ధము, ధీరుడు.
ప్రౌష్ఠపద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రోష్ఠపదానక్షత్రయుక్తా పూర్ణిమాస్మిన్ని ప్రోష్ఠపదః. పూర్వా భాద్రానక్షత్రము, భాద్రపదమాసము.
ప్లక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్లక్షతి మూలై రధోగచ్ఛతీతి ప్లక్షః. వేళ్లచేత అడుగునకు జాఱునది. ప్లక్ష్యతే భక్ష్యత ఇతి ప్లక్షః. భక్షింప బడునది, జువ్వి, కలుజువ్వి, రావి, ఒకద్వీపము.
ప్లవ
సం. నా. వా. అ. పుం. తత్స. ప్లవం త్యనేనేతి ప్లవః. దీనిచేత దాటుదురు “ప్లవతే ప్లవః. గంతులు వేయుచుపోవునది. లఘుత్వాత్ ప్లవత ఇతి ప్లవం. లఘవౌటచేత తేలునది. ప్లవతే ప్లవం. నీళ్ళలో తేలునది. ప్లవతే ఉగ్రకర్మణ ఇతి ప్లవః. క్రూరకర్మ కొఱకు పోవువాడు. ఒకసంవత్సరము, కయివడిముస్తె, గంధతృణము, తెప్ప, కప్ప, కోతి, గొఱ్ఱె, నీరుకాకి, నీరుకోడి, వాటపు బల్లునేల, ప్లుతస్వరము, దాటు, కాకితుమ్మిక, జువ్వి, మాలవాడు, జలపక్షి, పాచి, చండాలుడు, బాహువు, ఈదుట క్రమముగా పల్లముగనుండు భూమి, గంతుచుండుపక్షి.
ప్లవంగ
సం. నా. వా. అ. పుం. తత్స. ప్లకేనుగచ్ఛతీతి ప్లవంగమః తేనగచ్ఛతి ప్లవంగః. దాటునది, ఒకసంవత్సరము, కోతి, కప్ప, ప్లవైర్లంఘనై ర్గచ్చతీతి ప్లవంగః. దాటుచుపోవునది. ప్లవనే ప్లుతమత్యా గచ్ఛతీతి ప్లవంగః. వానరము, మృగము.
ప్లవగము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్లవోలంఘనంతేన గచ్ఛతి ప్లవగశ్చ. దాటునది, కోతి, కప్ప, అనూరుడు. ప్లవేన ప్లుతగత్యా గచ్ఛతీతి ప్లవగః. సూర్యుని సారథి.
ప్లాక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్లక్షస్య ఫలం ప్లాక్షం. జువ్విపండు ప్లాక్షమనబడును. ప్లక్షఫలము.
ప్లీహము
సం. నా. వా.న్.అ.పుం. తత్స. ప్లీహతి కదాచి దుద్రిక్తః ప్రదేశాంతరం గచ్ఛతీప్రీహ. ఒకానొకప్పుడు ఉద్రిక్తమై మఱియొక చోటికి పోవునది. హృదయమున ఎడమ ప్రక్కనుండెడు మాంసగళము, గుల్మము.
ప్లీహశత్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ప్లీహఖ్యస్య రోగస్య శత్రుః. రోగమునకు శత్రువు, ములుమోదుగు.
ప్లుతము
సం. నా. వా. అ. న. తత్స. ప్లవనం ప్లుతం. నిశ్చలమై అతివేగము, వేగమున అంతమేరయు సమముగా పోయేడు అశ్వధారా విశేషము, నిబ్బరము, ఒకరకపు అశ్వగతి, కుప్పిగంతు.
ప్లుష్టము
సం. విణ .(అ.ఆ.అ). తత్స. ప్రుష్యతే స్మ ప్రుష్టః. కాల్చబడినది, కాల్చుట.
ప్లోషము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్లోషణం పోషః. కాల్చుట, ప్రోషము.