హల్లులు : ఫ
ఫ
సం. నా. వా. అ. పుం. తత్స. తీక్ష్ణత్వేన ఫణీవ ఆర్జకః ఫణిర్జకః” . సర్పమువలె తీక్ష్ణత్వము నార్జించునది, మరువము, ఒక జాతి తులసి.
ఫణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఫణత్యనయా ఫణా. సర్పము దీనిచేత పోవును, పాముయొక్క పడగ. ఫణతి ప్రసారసంకోచం గచ్ఛతీతి ఫణా.
ఫణి
సం. నా. వా. న్. పుం. తత్స. ఫణా అస్యాస్తీతి ఫణీ. పడగ కలిగినది, సర్పము, భోగి, రేలచెట్లు.
ఫలకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫలతి విశీర్యతే ప్రహారైరితి ఫలకః. వ్రేలుటచే పగులునది, పలక, కేడెము, కత్తిడాలు, ఒక కాయగూర, కఱ్ఱపలక (పీట), డాలు, పావుకోడు.
ఫలపూరము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫలైః పూర్వతే ఫలపూరః. ఫలములచే పూర్ణమైఉండునది, మాదిఫలము.
ఫలము
సం. నా. వా. అ. న. తత్స. కార్పాస్యాః ఫలం కార్పాసం. ఫలంబాదరం ఫలతి విశీర్యతే ప్రహారైరితి ఫలం. వ్రేలుటచేపగులునది, ఫలతీతి ఫలం. లాభించునది, పుట్టునది, పండు, పంట, ప్రయోజనము, లాభము, జాజికాయ, ప్రత్తికాయ, కేడెము,బాణముములికి, నాగటికఱ్ఱు, పందికోఱచివర. ఒక చెట్టు, కత్తిఅంచు, కత్తిడాలు, లాభము, ఉత్పత్తి, భోగము, బీజము, ఫాలము, ధనము.
ఫలవంతము
సం. విణ. (త్. ఈ. త్). తత్స. ఫలమస్యాస్తీతి ఫలవాన్. పండ్లుకలది (వృక్షము), ఫలినము, ఫలితము, ఫలి.
ఫలాధ్యక్షము
సం. నా. వా. అ. న. తత్స. అధ్యక్షాని శ్రేష్ఠాని ఫలాన్యస్య ఫలాధ్యక్షః. శ్రేష్ఠమైన ఫలములు కలది, క్షీరిక, పాల, (వృక్ష విశేషము), పనస.
ఫలినము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ఫలాని సంత్యస్య ఫలినః. ఫలములు కలిగినది, పండ్లుకలది.
ఫలిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఫలతి విశీర్యత ఇతి ఫలినీ. పగులునది, ఫలాన్యస్య సంతీతి ఫలినీ. ఫలములుకలది, తరిగొఱ్ఱ, ప్రేంకణము, చెట్టు, ప్రియంగువు, చీర, ఒక ఓషధి. సం. నా. వా. విణ. తత్స. పండ్లుకలది.
ఫలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఫలతీ విశీర్యత ఇతి ఫలీ. పగులునది. ప్రేంకణము. ఫలమస్యాతీతి ఫలీ. ఫలితము, ప్రియంగువు, బీర, చిన్నడాలు, ఫలము.
ఫలేగ్రహి
సం. నా. విణ. (ఇ). తత్స. “ఫలాని గృహ్ణతీతి ఫలేగ్రహిః” . ఫలములను గ్రహించునది, ఫలించునది, పూచుచు, కాయచునున్నచెట్టు.
ఫలేరుహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సాంకుర ఫలత్వాత్ ఫలే రోహతీతి ఫలేరుహ. మొలకతో కూడిన ఫలములు కలది, కలిగొట్టు, చెట్టు, ఒకలత, తాడిచెట్టు.
ఫల్గువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. నిస్సార త్వా త్ఫలతి ఫల్గుః. నిస్సారమౌట చేత వ్రక్కలౌనది. ఫలతి శీఘ్రమేవేతి ఫల్గు. శీఘ్రముగా నశించునది, కుక్కమేడి, చెట్టు, కాకిబొడ్డ. సం. నా. వా. విణ. తత్స. సారములేనిది, అసారము.
ఫాంటము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫణ్యతే అనాయాసేన ప్రాప్యత ఇతి ఫాంటం. అనాయాసమున పొందబడినది, ఆయాసములేకుండ చేయు కషాయము.
ఫాణితము
సం. నా. వా. అ. న. తత్స. ఫణతి ద్రవత్వాదితి ఫాణితం. ద్రవరూపమై జాఱునది, కండచక్కెర, చెఱకు పానకము.
ఫాలము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫలతి విశీర్యతి భూ రనేవ ఫాలః. దీనిచేత భూమి వ్రక్కలౌను, నాగటి కఱ్ఱు, బలరాముడు, శివుడు. ఫల్యతే విదార్యతే క్షేత్రమనేనేతి ఫాలః. భూమిని దున్నువాడు, కృషకుడు, రైతు, ఫలము. సం. నా. వా. అ. న. తత్స. నెత్తి. సం. నా. వా. విణ. తత్స. నులిచే నేయబడిన వస్త్రము, కాడి, తక్కోలము, ప్రత్తితో తయారైనది, దానిమ్మ.
ఫాల్గునము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫల్గునీ నక్షత్రయుక్తా పౌర్ణమాసీ సాస్మిన్నితి పాల్గునః. ఫాల్గుణమాసము, ఒక మాసము, ఏఱుమద్ది, చెట్టు, అర్జునుడు.
ఫాల్గునికము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫల్గునీ నక్షత్రయుక్తా పౌర్ణమాసీ ఫాల్గునికశ్చ. ఉత్తర ఫల్గునీనక్షత్రముతో కూడిపున్నమిదీనియందుకలదు, పాల్గుణమాసము.
ఫుల్లము
సం. విణ . (అ. ఆ. అ). తత్స. పుల్లతీతి పుల్లః. వికసించునది, విరిసినది, అచ్చెరువైనది, ఒక జాతిపాము.
ఫేనము
సం. నా. వా. అ. పుం. తత్స. స్ఫాయతే వర్ధత ఇతి ఫేనః. ఉప్పొంగునది, సముద్రపునురుగు, నురుగు.
ఫేనిలము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫేనా స్సంత్యస్య ఫేనిలః. నురుగులు కలది, చెట్టు, కుంకుడు. ఫేనో స్యాస్తీతి ఫేనిలః రేగుపండు.
ఫేరవము
సం. నా. వా. అ. పుం. తత్స. ఫే ఇతి రవోస్య ఫేరవః. ధ్వనికలది, నక్క, రాక్షసుడు.
ఫేరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ఫే ఇతి రౌతి ఫేరుః. అకూయునది, నక్క, జంబుకము. ఫే ఇతి శబ్దేన రౌతీతి ఫేరుః. శృగాలము.
ఫేల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఫేలతి భోజనా చ్ఛలతీతి ఫేలా. భోజనము వలన పాయునది, ఎంగిలి, ఉచ్ఛిష్టము, కక్కిన అన్నము.