హల్లులు : బ

బందీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బదతి స్థిరీభవతి కారాగృహే బందీ. చెఱ పట్టి తెచ్చినవారిని ఉంచు చోటు, చెఱ, చెఱబడ్డది, ప్రగ్రహము, గ్రహకము, కారాగారమున నిక్షిప్తమై ఉండువాడు.
బంధకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బధ్నాతి ఉదాసీనమపి పురుషంస్వ వశం కరోతీతి బంధకీ” . ఉదాసీనుడైన పురుషునికూడ స్వవశము చేసి కొనునది, ఱంకుటాలు, ఆటకత్తె, ఆడేనుగు, కులట, మోసపోయిన వేశ్య.
బంధనము
సం. నా. వా. అ. న. తత్స. బధ్యత ఇతి బంధనం. కట్టివేయుట. “బధ్యతే అనేనేతి బంధనం” . దీనిచేత కట్టబడును, కట్టు, కట్టుటకు తగినసాధనము, కుదువ, కొల, చెఱ, చెఱసాల, తొడిమ, తాకట్టు, ముడి, శరీరము, కట్టుట, నడపుట.
బంధనాలయము
సం. నా. వా. అ. పుం. తత్స. బంధన స్యాలయః బంధనాలయః” . బంధనమునకుస్థానము, చెఱసాల.
బంధస్తంభము
సం. నా. వా. అ. పుం. తత్స. (ఏనుగును కట్టెడు) కట్టుకంబము.
బంధుజీవకము
సం. నా. వా. అ. పుం. తత్స. బంధూక్ జీవయతి బంధుజీవకః. తనకు బంధువులైఉండు తుమ్మెదలను బ్రతికించునది. జీవప్రాణధారణే, మంకెన.
బంధుత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బంధూనాం సమూహోబంధుతా. బంధువుల యొక్క సముదాయము, బంధువుల గుంపు.
బంధుర
సం. నా. వా. అ. స్త్రీ. తత్స. బధ్నాతున్న తత్వేన సహానతత్వ మితి బంధురం. ఉన్నతత్వముతో కూడ నానతత్వమును పొందునది, మకుటము. అ. పుం. కలహంస, పక్షి, నూనెమడ్డి, ఆడుగుఱి, మంకెన. విణ. తత్స. ఒప్పిదమైనది, వంగినది, మధ్యోన్నతమును పార్శ్వానతమునైనది, రమ్యము, హంస, విహంగము, బండిగూడు. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వేశ్య.
బంధులుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్వకులపరిణాహాయ బంధూక్ లాతి స్వీయాన్ కరోతీతి బంధులః. స్వకులమును విస్తరింప చేయుట కొఱకు బంధువులను చేరదీయువాడు, ఱంకుటాలికొడుకు, కౌలటేరుడు, రండాపుత్రుడు. స్వనిందాపరిహారాయ బంధూక్ లాతి ఆత్మీయాన్ కరోతీతి బంధులః. తన నింద పోవుట కొఱకు బంధులను తనవారిగా చేసుకోనువాడు.
బంధువు
సం. నా. వా. అ. పుం. తత్స. బధ్నాతి ప్రీతిమితి బంధుః. ప్రీతిని పొందించువాడు, చుట్టము, జ్ఞాతి, మిత్రుడు, మంకెనచెట్టు, మన్మథుడు.
బంధూకము
సం. నా. వా. అ. పుం. తత్స. సుకుమారత్వాత్ బధ్నాతి చిత్తం బంధూకః. సుకమారమౌట వలన మనస్సులు బంధించునది, మంకెన, వేగిస. బధ్నాతి సౌందర్యేణ చిత్తమితి బంధూకః. పుష్పవృక్ష విశేషము, రక్తపుష్పము, బంధుజీవము.
బంభరము
సం. నా. వా. అ. పుం. తత్స. బమితి శబ్ధం బిభ ర్తీతి బంభరః” . బం అనెడు శబ్దమును భరించునది, భ్రమరము, తుమ్మెద.
బకము
సం. నా. వా. అ. పుం. తత్స. బకతి కుటిలో భవతీతి వా బకః . కుటిలమైఉండునది, వక్కుకొంగ, ఒకరాక్షసుడు, కుబేరుడు, కొంగ, ఒక సంకరజాతి, గుఱ్ఱపు కాలిబంధము. వాతీతి బకః. పరిమళించునది, ఒక పుష్పము.
బడబ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బడబానాం సమూహో బాడబం. కోడిగలమూక, ఆడుగుఱ్ఱము, బ్రాహ్మణస్త్రీ, తార్చునట్టి ఆడుది.
బడబానలము
సం. నా. వా. అ. పుం. తత్స. బడబాయాం భవః బాడబః. ఆడుగుఱ్ఱము, బడబాగ్ని, వార్వపుటగ్గి.
బడిశము
సం. నా. వా. అ. న. తత్స. బలినః మత్స్యాక్ శ్యతీతి బడిశం. బలముగల మత్స్యములను కృశమగా చేయునది, (చేపలను పట్టెడు), గాలము.
బదర
సం. నా. వా. అ. న. తత్స. బదర్యాః ఫలం బదరం. రేగుపండు, ప్రత్తికాయ సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బదతి స్థిరీభవతీతి బదరా. బదరాభ ఫలత్వాద్బధరా. రేగుపండు వంటి పండ్లు కలది. సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత్తి చెట్టు, పత్తి జడ, శొంటి. బదతి స్థిరీ భవతీతి బదరః. రేగుచెట్టు.
బదరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బదతీతి బదరీ. స్థిరమై ఉండునది, గంగరేగు, రేగు ప్రత్తిచెట్టు, నిద్రభంగి, సౌవీరము, కోలము, ఫేనిలము, కువలము, మేకలకు ఇష్టమైనది, విషమము, గట్టిబీజము.
బద్ధము
సం. విణ . (అ. ఆ. అ.). తత్స. బధ్యతే స్మ బద్ధం. కట్టబడినది, ఖర్వమను సంఖ్య. బంధనయుక్తము.
బధిరుడు
సం. విణ . (అ. ఆ. అ.). తత్స. బధ్యతే వాతాదినా శ్రవణసామర్థ్యమస్యేతి బధిరః” . ఇతనికి శ్రవణసామర్ధ్యము బంధింబడును, చెవిటివాడు. బధ్నాతి కర్ణమితి బధిరః. చెవులు లేనివాడు. బధ్నాతి కర్ణమితి భధిరః.
బభ్రువు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రియతే, బిభ ర్తీతిచ బభ్రుః. భరింపబడునది, వెంట్రుక, విష్ణువు, శివుడు, అగ్ని. బిభర్తి భరతి వా బభ్రుః. అగ్ని, విశాలము, మునివిశేషము, ముంగిస. సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. కపిలగోవు. సం. నా. వా. విణ. తత్స. పచ్చనిది, బట్టతలవాడు, కపిలవర్ణము.
బర్కరము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్కతే తృణాదికమితి బర్కరః. కసవుమొదలైనవి తినునది, ప్రాయపుపశువు, మేక, పరిహాసము, బాలమృగము.
బర్బర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పరుషపర్ణ త్వాద్భర్బరా. పరుషమైన పర్ణములుకలది. వాయింట చెట్టు, ఉగరముల జుట్టు.
బర్బరము
సం. నా. వా. అ. పుం. తత్స. శాఖాభిః పునః పునః వృణోతీతి బర్బరః. కొమ్మలచేత పలుమాఱు వ్యాపించునది, బారంగి, బొబ్బరలు, ఒకదేశము. గఱుకులుకలది. విణ. తత్స. సంకరజాతి, నిచము.
బర్హమ
సం. నా. వా. అ. న. తత్స. బర్హ తుల్యపుష్ప త్వాద్బర్హం. నెమలిపించము వంటి పువ్వులు గలది, నెమలి పురి, ఆకు, గండివనము, పచ్చాకు, మాచిపత్రి. బర్హతీతి బర్హం. వృద్ధి పొందునది. బర్హతే నృత్తేన బర్హః. నృత్యముచేత వృద్ధిపొందునది.
బర్హి
సం. నా. వా. న్. పుం. తత్స, బర్హమస్యాస్తీతి బర్హిః. పింఛముకలది, నెమలి దర్భ.
బర్హిణము
సం. నా. వా. అ. పుం. తత్స. బర్హమస్యాస్తీతి బర్హిణః. ఫింఛమకలది, నెమలి, దర్భ, ఒక ద్వీపము.
బర్హిపుష్పము
సం. నా. వా. అ. న. తత్స. పుష్యతీతి బర్హిపుష్పం. స్తంభాకారమై ఉండునది, గండివనము (వృక్షవిశేషము), పచ్చాకు, మాచిపత్రి.
బర్హిర్ముఖుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బర్హిర్ముఖాః బర్హిరగ్నిర్ముఖం యేషాంతే. అగ్నియే ముఖముగా గలవాడు, నిర్జరుడు, వేల్పు, దేవత.
బర్హిష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. బర్హతే వర్ధతే బర్హిష్ఠం. వృద్ధిబొందునది, కురువేరు, హ్రీబేరము.
బర్హిస్సు
సం. నా. వా. స్. పుం. తత్స. బృంహతి వర్ధతే ఆజ్యాదినేతి బర్హిః. ఆజ్యాదుల చేత వృద్ధి పొందువాడు, అగ్ని, హుతాశనుడు, దర్భ.
బల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బలమస్యాస్తీతి బలః. బలముకలవాడు. బలంత్యనేన బలం. బలముకలవాడు, ముత్తవపులగము, విద్యావిశేషము, బల రాముడు, సేన, సత్త్వము, సగము పండిన యవధాన్యము, ఒకరకపు చందనము, ఎముక, ఆకారము, దార్ధ్యము, వీర్యము, శక్తికలవాడు.
బలదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బలమస్యాస్తీతిబలః. బలము కలవాడు, బలరాముడు, వాయువు.
బలభద్రిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బలేన భద్రికా బలభద్రికా. బలముచేత భద్రమైనది, కలుక్రాంత, ఒక లత.
బలభద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బలేన భద్రః శ్రేష్ఠః. బలముచేత శ్రేష్ఠుడు, బలరాముడు.
బలవంతము
సం. విణ. (త్. ఈ. త్). తత్స. బలం స్థౌల్యమస్యాస్తీతి బలవాత్. స్థూలత్వము కలవాడు, మిక్కిలి ఎక్కువ, వీర్యవంతుడు, బలి, అంసలుడు, బలము కలది.
బలవిన్యాసము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యూహ్యతే రచ్యతే ఇతి బలవిన్యానః. సేన యొట్టుట, వ్యూహమునొడ్డుట.
బలాక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బలేన మేఘమాలామకతి బలాకా. బలము చేత మేఘపంక్తిని పొందునది, పెద్ద పెంటి కొక్కెర, పెంటికొక్కర, పెద్దకొక్కెర, కొక్కెర, చిన్నకొంగ.
బలాత్కారము
సం. నా. వా. అ. పుం. తత్స. బలాత్కరణం బలత్కారః. బలిమివలన చేయుట, మిక్కిలి నిర్భందిచుట, బలవంతము, బలవంతము చేయుట.
బలారాతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. బలాఖ్యస్యాసురస్య అరాతిర్బలారాతిః. బలాసురునిని శత్రువు, ఇంద్రుడు, వేల్పుఱేడు.
బలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దైవో బలిర్భౌతీ నృయజ్ఞోతిధి పూజనమితి స్కృతిః. భూతబలి, భూత యజ్ఞము. బలంత్యనేన బలిః. దీనిచేత రాజులు బ్రతుకుదురు, కప్పము, (పుజార్ధమైన) కానుక, చామరదండము, ఒక అసురరాజు, బలముకలవాడు. బల్యతే దీయతే ఇతి బలిః. పన్ను, పూజావాద్యము, జంతుబలి, ఒకరాక్షసుడు.
బలిధ్వంసి
సం. నా. వా. న్. పుం. తత్స. బలినః ధ్వంసితుం శీలమస్యేతి బలి. బలిని అణచినవాడు, విష్ణువు, హరి, వెన్నుడు.
బలిపుష్టము
సం. నా. వా. అ. పుం. తత్స. బలినాపుష్టః బలిపుష్టః. బలిచే పోషింపబడునది, కాకి, వక్కుకొంగ.
బలిభుక్కు
సం. నా. వా. జ్. పుం. తత్స. బలిం భుంక్తే బలిభుక్. బలిని భుజించునది, కాకి, ఊరపిచ్చుక, పిచ్చుక. బలిం వైశ్వదేవబలిం గృహస్థదత్తద్రవ్యం వా భుంక్తే ఇతి బలిభుక్.
బలిసద్మము
సం. నా. వా. న్. న. తత్స. బలేరసురస్య సద్మ నివాసః బలిసద్మ. బలిచక్రవర్తికి నివాసము, పాతాళలోకము.
బలీవర్ధము
సం. నా. వా. అ. పుం. తత్స. వలీః కంఠ ప్రదేశే వృణుతో స్వీకరోతీతి బలీవర్ధః. కంఠమందు వళులుగలది, వృషభము, ఎద్దు.
బష్కయణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బష్కయస్త్వేకహాయనో వత్స ఇతి శాకటాయనః, తద్యోగాద్బష్కయణీ. ఏడాది దూడ కలిగిన ఆవు, తరపి ఆవు.
బస్తకము
సం. నా. వా. అ. న. తత్స. బస్తః అజః తద్గం ధయోగాత్ బస్తకః. మేక కంపువంటి కంపుగలది, దౌమకము.
బస్తము
సం. నా. వా. అ. పుం. తత్స. బస్త్యతే హింస్యత ఇతి బస్తః. హింసింబడునది, ఛాగము, మేకపోతు.
బహిర్ద్వారము
సం. నా. వా. అ. న. తత్స. ద్వారాద్బహిః బహిర్ధారం. పుష్పమాలికాధులు కట్టుటకయి గృహము వెలుపల స్తంభద్వయముచేత ద్వారమువలె కట్టబడునది, తలవాకిలి, వెలుపలి ద్వారము.
బహుకరుడు
సం. విణ . (అ. ఆ. అ). తత్స. బహూని ఖలసమీకరణాదీని కరోతీతి బహుకరః” . కళ్లమును చక్కచేయుట మొదలుగా చాలపనులు చేయువాడు, ఖలపువు, చీపురు.
బహుపాదము
సం. నా. వా. అ. పుం. తత్స. బహవః పాదాః మూలాని సంత్యస్యేతి బహుపాదః. విస్తారమైన ఊడలు కలది, మఱ్ఱిచెట్టు.
బహుప్రదుడు
సం. విణ . (అ. ఆ. అ). తత్స. బహుప్రదదాతీతి బహుప్రదః. మెండుగా నిచ్చువాడు, మిక్కిలి యీవికాడు, దానశౌండు.
బహురూపము
సం. నా. వా. అ. పుం. తత్స. బహువిధం రూపం స్వభావోస్య బహురూపః. బహువిధమైన రూపముకలది, ఊసరవెల్లి, సజ్జరసము, విష్ణువు, శివుడు, మన్మధుడు, పెక్కురూపములుకలవాడు.
బహుళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రభూతం ప్రచురం ప్రాజ్యమ దభ్రం బహుళం. ఆవు, పెద్దఏలకి, చిట్టేలకి, నీలిచెట్టు, కృత్తికానక్షత్రము, ఆకాసము, కృష్ణపక్షము, అగ్ని, అధికము, తఱచు, నల్ల ఉప్పు, గొప్పది, ఎక్కువ, చాల, భూమి.
బహుళా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బహుని ఫలాని లాతీతి బహుళా. పెద్ద ఏలకి, ఆవు, చిట్టెలకి, నీలిచెట్టు, గోవు, దేవవిశేషము, నదీభేదము.
బహుళీకృతము
సం. విణ . (అ. ఆ. అ). తత్స. బహుమూల్యం లాతీతి బహుళం తధాకృతం బహుళీకృతం” . అధిక మూల్యమును తీసి కొనునట్టు చేయబడునది, తూర్పెత్తినది (ధాన్యము).
బహువారకము
సం. నా. వా. అ. పుం. తత్స. బహువృణోతి స్రోతాం సి బహువారకః. బహుళముగా ప్రవాహములను జుట్టువాఱి యుండునది విరిగి, నక్కేరు.
బహువారకము
సం. నా. వా. అ. పుం. తత్స. బహు వృణోతి స్రోతాంసి బహువారకః. బహుళముగా ప్రవాహములను చుట్టి ఉండునది, విరిగిచెట్టు, నక్కేరు.
బహువిధము
సం. విణ . (అ. ఆ. అ). తత్స. బహ్వ్యః విధాః ప్రకారాయస్యేతి బహువిధః. అనేక ప్రకారములుకలది, పెక్కు తెఱుగులుకలది, వివిధము.
బహువిధము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. బహ్వ్యః విధాః ప్రకారాయస్యేతి బహువిధః. అనేక ప్రకారములుకలది, పెక్కుతెఱగులు కలది, వివిధము.
బహుసుత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బహువస్సుతాః మూలాన్యస్యాః బహుసుతా. అనేకములైన వేళ్లుగలది, పిల్లపీచర, పెక్కుకొడుకులుగాని, కూతురులుకానికల ఆడుది, శతావరి (పిల్లి వేండ్రము) .
బాంధకినేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బంధక్యాః అపత్యం బాంధకినేయః. రంకుటాలి కొడుకు, కులట పుత్రుడు, బంధులుడు.
బాడబుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బడబాయాం భవః భాడబః. ఆడుగుఱ్ఱము ముఖమునందుండునది. బాడబాగ్నిది వాతృప్తోబాడబః. బడబాగ్నివలె తృప్తి లేనివాడు. బడబానాం సముహోబాడబం. గోదిగలమాక, బ్రహ్మణుడు, బడబాగ్ని, ఆడుగుఱ్ఱముల గుంపు.
బాడబ్యము
సం. నా. వా. అ. న. తత్స. బాడబానాం సముహోబాడబ్యం. బ్రాహ్మణుల యొక్క సమూహము, బాడబుల సమూహము.
బాఢము
సం. నా. వా. అ. న. తత్స. బాహతే బాఢం బాహృప్రయత్నే. యత్నము చేయబడునట్టిది. బాహుత ఇతి బాఢం. ప్రయత్నే, ప్రతిజ్ఞ, పెల్లు, అధికము, ఎక్కువ, అంగీకారము, దృఢము.
బాణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బణతిశుష్కదశాయాంబాణా. ఎండినపుడు మ్రోయునది, నీటి మద్ధి, బాణమూలము, నల్లగోరంట (వృక్షవిశేషము).
బాణము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రహితే బాణే. వేయబడి బాణము వణ తీతి బాణః. బాణశబ్దము, బాణాసురునికి, అమ్మునకుపేరు. బాణమూలము, నల్లగోరంట, అమ్ము, ఆవుపొదుగు, ఒకరాక్షసుడు. అస్త్రవిశేషము, శరము. బాణాసురుడు, నీటిమద్ది, రెక్కలులేని అమ్ము.
బాదరము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. బదరాయాః ఫలం బాదరం. నూలు చీర, నూలుచేనేయబడినది. బదరాయా వికారః ఫలమితి బాదరం. కార్పాసవస్త్రము.
బాధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. “బాద్యం తే అనేయతి బాధా” . దీనిచేగలియపెట్టబడుదురు, దుఃఖము, నిషేధము, పీడ, కష్టము.
బార్హతము
సం. నా. వా. అ. న. తత్స. “బృహత్యాః ఫలం బార్హతం” . ములకపండు, బృహతీఫలము (బృహతీ-ములక)
బాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వలతే భువనం మూలబాహుళ్యాద్బాలం. భూమిని వేళ్ళచేత చుట్టుకొనునది. బలతి అల్పయాసేన బాలః. అల్పాయాసముచేత బ్రతుకువాడు, వలత ఇతి బాలః. చలించువాడు, ఆడుది, నారికేళము, పసుపు, మల్లికావిశేషము, అయిదేండ్లఏనుగు పిల్ల, కురువేరు, పదునాఱేండ్లకు లోబడినపిల్ల, మూర్ఖురాలు, వేడి, వేడిది, చిన్నవాడు, అవివేకి.
బాలతనయము
సం. నా. వా. అ. పుం. తత్స. బాలాస్సూక్ష్మాః పత్రాత్మకాస్తనయాయస్యసః బాలతనయః. సూక్ష్మములైన పత్రరూపములైన కొమాళ్లుగలది. చంఢ్ర, ఖదిరము.
బాలతృణము
సం. నా. వా. అ. న. తత్స. బాలం చ తత్ తృణం బాల తృణం. లేతకసపు, పచ్చిక.
బాలమూషిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బాలా చ సామూషికా చ బాలమూషికా. చిన్న ఎలక, చిట్టెలుక, గిరిక, చుంచు.
బాలిశము
సం. నా. వా. అ. న. తత్స. పరదత్తం బలిం పూజాం శ్యతీతి బలిశ ఏవ బాలిశః. తనకు చేసిన సన్మానమును చెఱుచుకొనువాడు, మూర్ఖుడు, బాలుడు.
బాలేయము
సం. నా. వా. అ. న. తత్స. బాలేభ్యోవత్సే భ్వోహితాః బాలేయాః. తమ పిల్లలకు హితములైనవి, చిన్నముల్లంగి, గాడిద, బాలునికి హితమైనది, మెత్తనిది. బలయే ఉపకరణాయ సాధు బాలేయః.
బాలేయశాకము
సం. నా. వా. అ. పుం. తత్స. బాలేయస్య గర్దభస్య భోజ్యః శాకోబాలేయశాకః. ప్రియమైన కాయలుకలది, బారంగి.
బాల్యము
సం. నా. వా. అ. న. తత్స. బాలస్య భావః బాల్యం. బాలుని యొక్క భావము, చిన్నతనము, వయోవస్థ, శైశవము.
బాష్పము
సం. నా. వా. అ. న. తత్స. స్రవతి చ బాష్పః. జారునదియు, కన్నీరు, కొయగూర, ఆవిరి, ఇనుము.
బాష్పిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బాష్పం నిర్యాసం ముంచతీతి బాష్పికా. బంకను విడుచునది, ఇంగువమ్రాను, ఇంగువ ఆకు.
బాహు
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బాహ్వోర్మూలే బాహుములే. చేతుల యొక్క మొదళ్లు, బాహువు, భుజము, చేయి. బాధతే సత్రూన్ ఇతి బాహుః. భుజము.
బాహుజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రహ్మణః బాహ్వోర్జాతః బాహుజః. బ్రహ్మయొక్క బాహువుల యందు పుట్టినవాడు, రాచవాడు, బుజము పుట్టువు, క్షత్రియుడు.
బాహుద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బాహుదానాత్ బాహుదా. లిఖితుడను ఋషి శంఖుడను ఋషి ఆశ్రమమునందు అతడు లేనపుడు ఫలములను భక్షించి, అపరాధము కొఱకు అతని ఆజ్ఞ వలన ప్రద్యుమ్నుడను రాజుచేత చేతులు కోయించుకిని తనయందు స్నానముసేయుగా, ఆలిఖత ఋషికి బాహువులనుఇచ్చినది కనుక బాహుద. బహుదేన కార్త వీర్యార్జునేన అవతారితా బాహుదా. బహుప్రదుడైన కార్తవీర్యార్జునినిచే భూమికి తేబడినది ఒకఏఱు,బాహుపురి, ఒకనది.
బాహుమూలము
సం. నా. వా. అ. న. తత్స. బాహ్యోర్మూలే బాహుమూలే. చేతుల యొక్క మొదళ్లు, చంక, కక్షము.
బాహులేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బహులానాం కృత్తికానా మపత్యం బాహులేయః. కృత్తికల కొడుకు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు, ఎద్దు.
బాహుళము
సం. నా. వా. అ. న. తత్స. తద్యుక్తా పూర్ణిమా స్మిన్నస్తీతి బాహులః. అధికములైన అర్ధములు నిచ్చునది, బాహుత్రాణము కార్తీకమాసము, భుజకవచము.
బాహ్లికము
సం. నా. వా. అ. న. తత్స. బాహ్లిక దేశే భవత్వాత్ బాహ్లికం. బాహ్లిక దేశమందు పుట్టినది. బాహ్లిక దేశే భవాః బాహ్లికాః. బాహ్లిక దేశమందు పుట్టినవి. ప్రాయేణ బాహ్లిక దేశ జత్వాత్ బాహ్లికః. ఇంగువ, కుంకుమపువ్వు, ఒకదేశము, ఆదేశమునందు పుట్టిన గుఱ్ఱము, ఒకరాజు.
బిందువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. బిందం తీతి బిందవః. జలము యొక్క అవయవములు బిందువులు, నీటిబొట్టు, చుక్క, సున్న, శుక్రము, భ్రుమద్యము, దంతక్షత విశేషము, నశించుచున్న సంతానము కలది, శరీరముపైనుండుమచ్చలు.
బింబము
సం. నా. వా. అ. న. తత్స. బింబతి ప్రకాశత ఇతి వాబింబః. ప్రకాశించునది. ప్రతిబింబము, దొండపండు, ప్రతిమ, సముహము, ఊసరవెల్లి, (చంద్ర సూర్య) మండలము, సామ్యము, చిత్రము, ముఖము.
బింబిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఓష్ఠస్య బింబం ఆకృతిరివ ఫల మస్యా ఇతి బింబికా. ఓష్ఠమువంటిఆకారముకల ఫలములుకలది, దొండ, తుండికేరి.
బిడము
సం. నా. వా. అ. న. తత్స. బిడతి భిందతి గుల్మాదికమితిబిడం. అట్టుప్పు.
బిడాలము
సం. నా. వా. అ. పుం. తత్స. బిడతి మాషికాక్ బిడాలః. పిల్లి, కనుగుడ్డు, కంటి తెవులు. వేడతి విడ్యతే వా ఇతి బిడాలః. మార్జాలము.
బిడాలము
సం. నా. వా. అ. పుం. తత్స. బిడతి మూషికాన్ బిడాలః. మూషికములను భేదించునది, పిల్లి, కనుగ్రుడ్డు, కంటితెవులు.
బిడౌజుడు
సం. నా. వా. స్. పుం. తత్స. వబయోరభేదాద్చిడంవ్యాపన శీలం ఓజో యస్య సః బీడౌజాః. వ్యాపనశీలమైన తేజస్సుకలవాడు, ఇంద్రుడు.
బిడౌజుడు
సం. నా. వా. స్. పుం. తత్స. వేష్టీతి విడం వబయోర భేదాద్చిడం వ్యాపనశీలం ఓజోయస్ససః బీడౌజాః. వ్యాపనశీల మైన తేజస్సుకలవాడు, ఇంద్రుడు.
బిలము
సం. నా. వా. అ. న. తత్స. బిల్యతే భద్యత ఇతి బిలం. భేదింపబడునది, రంధ్రము, గుహ, ఉచ్చైశ్రవము. బిలతి భినత్తి విల్యతే వా ఇతి బిలం.
బిలేశయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బిలేశేత ఇతి బిలేశయః. బిలమునందు నిద్రించునది, ఉడుము, పాము, ఎలుక, గుహలోనివసించు జింక.
బిల్వము
సం. నా. వా. అ. న. తత్స. సేవకస్య పాపం బిలతి హినస్తీతి వా బిల్వః. సేవకుని పాపమును పోగొట్టునది, మారేడుపండు, మారేడు, రెండు శతమానములు.
బిసకంఠిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బిసవత్ కంఠోస్యా ఇతి బిసకంఠికా. తామరతూడువంటి మెడకలది, పెద్ద పెంటికొక్కెర, పెంటికొక్కెర, చిన్నకొంగ.
బిసప్రసూనము
సం. నా. వా. అ. న. తత్స. బిసస్య ప్రసూనం బిసప్రసూనం. తామర తూడుల యొక్కపుష్పము, తామర, పద్మము.
బిసప్రసూనము
సం. నా. వా. అ. న. తత్స. బిసస్య ప్రసూనంబిస ప్రసూనం. తామరపూవు, పద్మము.
బిసము
సం. నా. వా. అ. న. తత్స. బిస్యం తే ఉత్సృజ్యంతే బక్షణ సమయే తంతివోత్రబిసం. భక్షణ సమయమున దీనియందుకల తంతువులు విడువబడును, తామరతూడు, తామరతీగ.
బిసము
సం. నా. వా. అ. న. తత్స. బిస్యంతే ఉత్సృజ్యంతే భక్షణ సమయేతంత్రవోత్ర బిసం. తామరతీగ. తామరతూడు.
బిసిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బిసస్య ప్రసూనం బిసినీ. తామరతూడుల యొక్క పుష్పము, తామర తీగ, తామరకొలను తామరతంపర.
బిసినీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బిసమస్యామస్తీతి బిసినీ. తామర తూడు కలది, తామరకొలను, తామరదుంప, తామరతీగ, తామరతంపర.
బిస్తము
సం. నా. వా. అ. పుం. తత్స. బిస్యతి తులాకోటిం నీచైః ప్రేరయతీతి బిస్తః. త్రాసును క్రిందికి వంచునది, కర్షమెత్తుబంగారు, బిద్దె.
బీజకోశము
సం. నా. వా. అ. పుం. తత్స. బీజానం పద్మాక్షాణాం కోశః ఆకరోబీజకోశః. తామర విత్తులకు నెలవైనది, తామరపూస.
బీజకోశము
సం. నా. వా. అ. పుం. తత్స. బీజానః పద్మాక్షాణాం కోశః ఆకరోబీజకోశః. తామరవిత్తులకు నెలవైనది, తామరపూస, గింజలుకల దుద్దు.
బీజపూరము
సం. నా. వా. అ. పుం. తత్స. బీజైః పూర్యతే బీజపూరః. విత్తులచేత పూర్ణమైఉండునది, మాదిఫలము, దానిమ్మపండు.
బీజపూరము
సం. నా. వా. అ. పుం. తత్స. బీజైః పూర్వతే బీజపూరః. విత్తులచేత పూర్ణమైఉండునది, మాదిఫలము.
బీజము
సం. నా. వా. అ. న. తత్స. విశేషణ జాయత ఇతి బీజం. విశేషముగానగునది, విత్తనము, విత్తుట, ముష్కము, రేతస్సు, హేతువు, బలము, ఋతువు, వీర్యము, గింజ, ఆహారము.
బీజాకృతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. బీజైః కృతం బీజాకృతం. విత్తులతో గూడ దున్నబడినది, పట్టిత్రోలుట.
బీజ్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. బీజేకులే జాతో బీజ్యః. కులమందుపుట్టినవాడు, మంచికులమునందుపుట్టినవాడు, వంశజుడు.
బీభత్సము
సం. నా. వా. అ. పుం. తత్స. బంధ బంధన ఇత్యస్య నిందాయాంసన్ బీభత్సా. నిందకలిగినది, ఒకరసము. బీభత్సా స్యాస్తీతి బీభత్సః. రోతకలవాడుకనుక బీభత్సుడు.
బుద్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. బుధ్యతే అనయేతి బుద్ధిః. దీనిచేత నెఱుగ బడును, మతి. (అంతః కరణ వృత్తులు నాలుగింటిలో నొకటి, ఇది పండ, మేధ, చార్వి,గృహీతి, శ్రౌతి, చత్వరి అని ఆఱు- విధములుకలది. బుద్ధి, గుణములు, శుశ్రూష, శ్రవణము, గ్రహణము, ధారణము, ఊహము, అపోహము, అర్ధవిజ్ఞానము, తత్త్వజ్ఞానము).
బుద్ధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బుద్ధః సర్వం క్షణికం బుద్ధ్యతే బుద్ధః. సమస్తమును క్షణికముగా తలచువాడు బుధ్యతే స్మ బుద్ధః. ఎఱుగబడినది కనుక బుధ్యతీతి బుద్ధః. ఎఱగువాడు, బుద్ధదేవుడు, విధ్యాంసుడు, తెలియబడినవాడు, తెలిసినది.
బుద్భుదము
సం. నా. వా. అ. పుం. తత్స. నీరు బుగ్గ, గర్భమునందలి అవయవ విశేషము.
బుధితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. బుధ్యతే స్మ బుద్ధం బుధితం చ. ఎఱుగబడినది, తెలియబడినది.
బుధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బుధ్యతే సర్వమితి బుధః. సర్వమునుఁఎఱిగిన వాడు “సర్వం బుధ్యతే బుధః” . అన్నిటిని ఎఱిగిన వాడు, ఒకగ్రహము, విద్యాంసుడు వేలుపు, పండితుడు.
బుధ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. బుధ్యంతే అనేనేతి బుధ్నః. దీనిచేత వృక్షము నెఱుగబడును, వేరు, ఊడ, శివుడు.
బుభుక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భోక్తుమిచ్ఛాబుభుక్షా. దీనిచేత బుభుక్షితులౌదురు, భుజింపనిచ్ఛ, ఆకలి.
బుసము
సం. నా. వా. అ. న. తత్స. బిడతి భందతి గుల్మాదికమితిబిడం. గుల్మాదులను పోగొట్టునది, అట్టుప్పు.
బృంద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బృన్ద భేదాః. సమూహభేదములు, తొళసి, సముహము, ఒక సంఖ్య, నిఖర్వము, లక్షశంకులు.
బృందారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బృందారకాః శోభనం బృందం యేషాంతే. మంచి సమూహముకలవారు, వేలుపు, మనోజ్ఞుడు, శ్రేష్ఠుడు.
బృందిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన బృందారకోమనోజ్ఞః శ్రేయానణ బృందిష్ఠః. మిక్కిలి మనోజ్ఞమైనది.
బృంహితము
సం. నా. వా. అ. న. తత్స. బృంహణం బృంహితం. ఏనుగులమ్రోత, ఏనుగు యొక్కకేక.
బృహతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కంటకైర్బృహతీతి బృహతి. ముండ్లచే అధికమైఉండునది. బర్హత ఇతి బృహతీ. వృద్ధి పొందునది, వాకుడు, ములక, ఒకఛందస్సు, ఉత్తరీయము, విశ్వావసుని వీణ, గొప్పయైనది, వాక్కు.
బృహతిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బర్హతీతి బృహతికా. వృద్ధిపొందినది, ఉత్తరీయము.
బృహత్కుక్షి
సం. విణ. ఇ. తత్స. బృహత్కుక్షిరస్యేతి బృహత్కుక్షిః. దొడ్డకడుపుకలవాడు, పెద్దకడుపువాడు.
బృహత్తు
సం. విణ. (తా. ఈ. త్). తత్స. బర్హతీతి బృహత్. వృద్ధిపపొందినది, గొప్పది.
బృహద్భానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. బృహంతః భానవోయస్యసః బృహద్భానుః. అధికములైన కిరణములుకలవాడు, అగ్ని, పావకుడు.
బృహస్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. బృహతం దేవానాం వేదమంత్రాణాం వాపతిః బృహస్పతిః. దేవతలను, వేదమంత్రములను బృహత్తులన బడును, వారలకైనను, వానికైనను ప్రభువు, సురగురువు, వేల్పుటొజ్జ, గురుడు.
బోధకరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రాజ్ఞాం బోధం కుర్వం తీతి బోధకరాః. రాజులమేలు కొలువువారు. వైతాళికుడు, వేకువను రాజుల నిద్ర మేల్కోలిపెడువాడు.
బోలము
సం. నా. వా. అ. పుం. తత్స. బోల్యతే నిమజ్జతే ఔషధేష్వితి బోలం. జౌషధమలలో వేయబడునది, బాలెంత బోళము, పీనసము, చిత్రవర్ణము, నీటిసుడి, తక్కోల ఫలము, నేతితోడితేనె.
బ్రధ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. అన్యతేజః బద్నాతి ప్రతిబధ్నాతీతి బ్రధ్నః. ఇతర తేజస్సులను నిరోధించువాడు. బుధ్యంతే అనేనేతి బ్రధ్నః. దీనిచేత వృక్షము లెఱుగబడును, వేరు, బుధ్నము.
బ్రహ్మ
సం. నా. వా. స్. పుం. తత్స. బృంహతి వర్ధయతి ప్రజా ఇతి బ్రహ్మ. ప్రజలను వృద్ధి పొందించువాడు. బృంహతీతి బ్రహ్మ. వృద్ధిపొందునది, నలువ, (నవబ్రహ్మలు-భృగువు, పులస్త్యుడు, పులవాడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్టుడు, మరీచి) విష్ణువు, బ్రాహ్మణుడు, ఒక ఋత్విజుడు, పరమాత్మ, వేదము, తపము, ఒక గ్రహయోగము. సృష్టికర్త, సురజ్యేష్ఠుడు, పితామహుడు, హిరణ్యగర్భుడు, లోకేశుడు, స్వయంభువు, చతురాననుడు, కమలాసనుడు, ప్రజాపతి, విధాత, విధి, దేవదేవుడు, పద్మయోని, పద్మాసనుడు, పద్మగర్భుడు, వేదగర్భుడు, అష్టకర్ణుడు, హంసవాహనుడు, పురోహితుడు, వేదము, పరమాత్మ, సాంఖ్యమత, తత్వ్తములలో ముఖ్యమైనది.
బ్రహ్మంజలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. “బ్రహ్మణో వేదాయాంజలిః బ్రహ్మఞ్జలిః” . వేదము కొఱకు చేసిన అంజలి. వేదాధ్యయన కాలము నందలి మ్రొక్కు, వేదాద్యయనమునకు ముందు, వెనుకలు చేయునమస్కారము.
బ్రహ్మచారి
సం. నా. వా. న్. పుం. తత్స. బ్రహ్మవేదః తదద్యయనార్ధం వ్రతమపితచ్ఛరతీతి బ్రహ్మచారి. బ్రహ్మమనగా వేదము, ఆచరించువాడు, ముంజిత్రాడులోనగువాని ధరించి వేదము చదివి బ్రహ్మచర్యవ్రతము నందుండువాడు. వటువు, వేదాద్యయనము చేయువాడు, సుబ్రహ్మణ్యుడు.
బ్రహ్మణ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రహ్మణి వైదిక కర్మణి సాధుః బ్రహ్మణ్యః. వైదిక కర్మమందు మంచిది, గంగరావి, బ్రహ్మణహితము, రుద్రుడు, శుక్రుడు, బ్రహ్మ ఋత్విక్కు, యాగము, ఆకాశము, వేదాంతము ఆత్మతపస్సు.
బ్రహ్మదర్బ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బ్రహ్మసంబంధిత్వాద్బర్భాకారత్వాచ్ఛ బ్రహ్మదర్భా. బ్రహ్మసంబంధమైనది, ఒకదినుసు, ఓమము, వాము.
బ్రహ్మదారువు
సం. నా. వా. ఉ. న. తత్స. బ్రహ్మణో వైదిక కర్మణో యోగ్యం దారు బ్రహ్మదారు. వైదికకర్మకొఱకు తగిన వృక్షము, గంగరావి.
బ్రహ్మపుత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రహ్మణః పుత్రః బ్రహ్మపుత్రః. బ్రహ్మవలన పుట్టినది, పడమర పాఱేది, ఒకఏఱు, విషబేదము, కేతువు, రుద్రాదులు.
బ్రహ్మబంధువు
సం. నా. విణ (ఉ). తత్స. బ్రహ్మణ్యో బ్రహ్మణస్య బంధుః బ్రహ్మబంధుః. అనుష్ఠానాదులు లేక బ్రాహ్మణునికి బంధుమాత్రుడైన వాడు, గుఱింపబడువాడు, దూఱబడవాడు, నింద్యుడు, నిర్ధేశింపబడినవాడు, బ్రాహ్మణాధముడు.
బ్రహ్మబిందువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. బ్రహ్మణి వేదపాఠే బిందవః బ్రహ్మబిందవః. వేదపాఠమందలి తుంపురులు, నోటితుంపర, వేదపాఠసమయమున నోటినుండి పడిన బిందువు.
బ్రహ్మభూయము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మణీభావః బ్రహ్మభూయం. బ్రహ్మత్వము, బ్రహ్మణత్వము పొందుట.
బ్రహ్మవర్చనము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మణః తపస్య్వాధ్యాయా దేర్వర్చః. బ్రహ్మవర్చస్సు, సదాచారాధ్యయన సమృద్ధి, బ్రహ్మతేజస్సు.
బ్రహ్మసనము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మణే ఆసనం బ్రహ్మసనం. బ్రహ్మకొఱకైన ఆసనము, ధ్యానోపాయభూతమైన పద్మ స్వస్తిక దండా ధ్యాసనము.
బ్రహ్మసాయుజ్యము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మణః సాయుజ్యం బ్రహ్మసాయుజ్యం. బ్రహ్మమున కలయుట, బ్రహ్మత్వము.
బ్రహ్మసువు
సం. నా. వా. ఊ. పుం. తత్స. బ్రహ్మతపః బ్రహ్మణం వాసువతి చాలయతీతి బ్రహ్మసూః. తపస్సుని, బ్రహ్మను కలత పెట్టువాడు, మన్మధుడు, మరుడు.
బ్రాహ్మణము
సం. నా. వా. అ. న. తత్స. బ్రహ్మణి పరబ్రహ్మణి కులే భవత్వాద్వా బ్రహ్మణః. పరబ్రహ్మయందు నిష్ఠగలవాడు, బ్రహ్మం సమాహము, వేదభాగము, బ్రహ్మణత్వము, బ్రాహ్మణ కర్తవ్యము.
బ్రాహ్మణయష్టిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బ్రహ్మణరీతిత్వాత్ బ్రహ్మణ యష్టికా. బ్రాహ్మణుల రీతి కలది, చిఱుతేకు, బారంగి, బ్రహ్మదండి చెట్టు.
బ్రాహ్మణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బ్రాహ్మణవత్సని త్రత్వాత్ బ్రహ్మణి. బ్రాహ్మణునివలె పవిత్రమైనది, బ్రాహ్మణుని భార్య, నలికండ్లపాము చిఱుతేకు, కంచు, బచ్చలిపాము, ఎఱ్ఱచీమ.
బ్రాహ్మణ్యము
సం. నా. వా. అ. న. తత్స. బ్రాహ్మణానాం సమూహో బ్రహ్మణ్యం. బ్రాహ్మణుని యొక్క సమూహము, బ్రాహ్మణ భావము, బ్రాహ్మణ కర్మము, శని.
బ్రాహ్మి
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బ్రహ్మసంబంధినీ బ్రాహ్మి బ్రాహ్మణః ఇయం బ్రాహ్మి. ఒకమాతృక, సరస్వతి, బాపన చీమ, పొన్నగంటికూర బారంగి, సోమెదకూర, ఊర్ధ్వలోకము, బ్రాహ్మిమొక్క.
భాంధవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బంధురేవ బాంధవః. ప్రీతిని పొందించువాడు, చుట్టము, జ్ఞాతి, సుహృత్తు, మిత్రుడు.