హల్లులు : భ
భంగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భజ్యత ఇతి భంగా. మెదపబడునది, జనపవిత్తులు.
భంగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భజ్యతే స్వయమేవ భంగ. తనంతట నశించునది, జనపవిత్తులు, చెఱుపు, అల, అవమానము, రోగము, రోగ విశేషము.
భంగి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. విధము. సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భంగము, గంజాయి, వివరణము, వ్యాజము, కల్లోలము, విన్యాసము, విచ్ఛేదము.
భంటాకీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భటతి బిభర్త్యనయా దీపనాగ్ని మితి భంటాకీ. జనుడు దీనిచేత దీపనాగ్నిని భరించును, ములకచెట్టు.
భండీరీ
సం. నా. వా. అ. పుం. తత్స. భండత ఇతి భండీరీ. వర్ణ ద్రవ్యములలో పేర్కొనబడినది, దిరిసెనము (వృక్షవిశేషము), చిఱ్ఱికూర, దోస.
భక్తము
సం. నా. వా. అ. న. తత్స. భస భక్షణ దీప్త్యోః భద్యత ఇతి భక్తం. ఆశ్రయింపబడునది, అన్నము, భాగింపబడినది. భజ్యతే స్మేతి భక్తం. ఆహారము, భక్తికలవాడు.
భక్షకుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భక్షయత్యధికమితి భక్షకః. అధికముగా భక్షించువాడు, తిండిపోతు. భక్షయతీతి భక్షకః.
భక్షణము
సం. నా. వా. అ. న. తత్స. అవదంశస్తు భక్షణమ్. కొఱక బడునది, భక్షించుట, తిండి. ఆహారము, భోజనము, నమలుట.
భక్షితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భక్ష్యతే స్మ భక్షితం. భుజింపబడునది, భక్షింపబడునది, తినబడినది.
భక్ష్యకారుడు
సం. విణ. (అ.ఈ.అ). తత్స. భక్షం కరోతీతి భక్షకారః. కఠినమై, విశదమై భక్షింపతగిన పదార్ధము, పిండివంటచేయువాడు.
భగందర
సం. నా. వా. అ. పుం. తత్స. భగం గుదసమీపదేశం దారయతి భగందరః. చూడరాని చోట పుట్టు భగందరము అను వ్రణము, మర్మస్థానమునందలి వ్రణము, గుద వ్రణము.
భగము
సం. నా. వా. అ. పుం. తత్స. “భజ్యతే పురుషైరితి భగః”. పురుషులచే ఆశ్రయింపబడునది. భజ్యత ఇతి భగః. ఆశ్రయింపబడునది, శ్రీ, వీర్యము, ఇచ్ఛ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మహత్య్మము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము, యోని, ద్వాదశాదిత్యులలోనొకడు, యోగి, నాయకత్వము, ఆదిత్యుడు, ధనము, అందము, కోరిక, తపస్సు.
భగవంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. మహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశసశ్రియః జ్ఞానవైరాగ్య యోశ్చైవషణ్ణాం భగ. సంపూర్ణమైన మాహత్య్మము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునవి, విష్ణువు, శివుడు, బుద్ధదేవుడు, పూజ్యుడు. భగం శ్రీ యోని వీర్యేషు జ్ఞునవైరాగ్య ధర్మ యోరి తివసభసః. ఐశ్వర్యమునకు, ఇచ్ఛకును, శక్తికిని, ప్రయత్నమునకు పేరు.
భగిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భగః కల్యాణం శ్రేయః వివాహేస్యా ఇతి భగినీ. వివాహమందలి శ్రేయస్సుకలది, తోడపుట్టినది, సోదరి.
భజమానము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. న్యాయం భజతే భజమానం. న్యాయమును పొందునది, సేవించునది, భాగించునది ,న్యాయముతో కూడినది, ఉచితము.
భటము
సం. నా. వా. అ. పుం. తత్స. “భటన్తే కాంక్షన్తే యుద్ధంభటాః”. యుద్ధమును కాంక్షించువారు, దినముయొక్క పదునేనవ భాగము. భట్యతే భ్రియతే ఇతి భటః. వీరుడు, సంకరజాతి యోధుడు.
భటిత్రము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భటతీతి భటిత్రం. పోషించునది, ఇనుపసలాకకుగ్రుచ్ఛికాల్చినది (కఱకుట్లు). శూలమునకు గ్రుచ్చికాల్చబడినది.
భట్టారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భటాః సేవకాః తైర్యుద్ధమత్తారయతీతి భట్టారకః. భటులు, సేవకులు, (నాట్యపరిభాషయందు) రాజు, ముని, సూర్యుడు, నాటకములోని రాజు.
భట్టిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భటతి ఉద్ధతం భాషత ఇతి భట్టినీ. బిగ్గరగా పలుకునది, (నాట్యపరిభాషయందు, రాజు పెండ్లాము, బ్రాహ్మణుని పెండ్లాము). భడ్డం స్వామిత్వమస్యా అస్తీతి భడ్డినీ. రాజపత్ని. నాటకములో పట్టపుదేవికంటేవేరైనరాణి.
భద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భందతే భత్రం. కల్యాణమైనది. భన్దత ఇతి భద్రః. కళ్యాణ స్వరూపమైనది. తిధి విశేషము, కృష్ణుని అష్టమహిషులలోఒకతి, గంగానది, శుభము, బంగారు, నాగముస్తె, ఒక కరణము, గజ జాతి విశేషము, (ఈ జాతి గజము శుభకార్యములందు పురప్రచారయోగ్యమైనది) ఎద్దు, కాటుకపిట్ట, వీరభద్రుడు, పురుషజాతి విశేషమ, శుభకరము, శ్రేష్ఠము). గొప్పది, సౌఖ్యము, ఆరోగ్యము, మంగళము.
భద్రకుంభము
సం. నా. వా. అ. పుం. తత్స. భద్రార్ధం కుంభః భద్రకుంభః. మంగళార్ధమైన కుంభము, రాజద్వారముందుంచిన జలపూర్ణమైన స్వర్ణకలశము, మంగళకలశము.
భద్రదారువు
సం. నా. వా. ఉ. న. తత్స. భద్రం చ తత్ దారుచ భద్రదారు. శుభమైన దారువు, దేవదారువు.
భద్రపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భద్ర ప్రదాని పర్ణాని యస్యాస్యా భద్రపర్ణీ. శుభప్రధమైనఆకులుకలది, గుమ్ముడు.
భద్రబల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భద్రం బలమస్యా అస్తీతి భద్రబలా. శుభస్వరూపమైనబలముకలది, గొంతెమ్మ గోరు.
భద్రముస్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. భద్రశ్చాసౌముస్తశ్చ భద్రముస్తకః. శుభస్వరూపమైన ముస్తకము, నాగముస్తి, రాగముస్త.
భద్రయవము
సం. నా. వా. అ. న. తత్స. దీపనాది కళ్యాణకారిత్వ ద్యవాకృతి త్యాచ్చభద్రయవం. దీపనము మొదలైన శుభమునుచేయునది, కొడిసెకాయ, కొడిసెవిత్తు.
భద్రశ్రీ
సం. నా. వా. ఈ. పుం. తత్స. భద్రాశ్రీ శ్శోభాస్య భద్రశ్రీ. శుభస్వరూపమైనఒప్పిదముకలది, చందనము, గంధము.
భద్రాసనము
సం. నా. వా. అ. న. తత్స. భద్రం చతత్ ఆసనం చ భద్రాసనం. శుభమైన ఆసనము, రాజుకూర్చుండుపీఠము. సింహాసనము.
భయంకరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భయం కరోతీతి భయం కరం. భయమును కలుగచేయునది, భయమును పుట్టించునది.
భయము
సం. నా. వా. అ. న. తత్స. భీరోస్సంత్రా సకృద్బైరవం భీభయే. భీరులకు వెఱపుపుట్టించునది, వెఱపు పుట్టించునది, భయము.
భయానకము
సం. నా. వా. అ. పుం. తత్స. బిభే త్యస్మాదితి భీషణం, భీష్మం, భీమం భయానకం. అధీరుడు దీనిచేత వెఱపు చెందును, ఒక రసము, భయము.
భరణము
సం. నా. వా. అ. న. తత్స. భ్రియతే అనయా భరణం. దీనిచేత మోపు మొదలైనవి భరింపబడును, భరించుట, కూలి, జీతము, ఇరువది తూముల మానము.
భరణ్యము
సం. నా. వా. అ. న. తత్స. భ్రియతే అనయా భరణ్యం. భరింపబడునది, కూలి, జీతము.
భరద్వాజము
సం. నా. వా. అ. పుం. తత్స. భరద్వాజేన సృష్టః భరద్వాజః. భరద్వాజులచేత సృజింపబడునది, ఏట్రింత, ఒకముని, ద్రోణుడు. ద్వాభ్యాం జాత ఇతి భరద్వాజః. ఒక పక్షి.
భరము
సం. నా. వా. అ. పుం. తత్స. బిభర్తీతి భరః. అన్నిటిని భరించునది, అతిశయము, బరువు, బారువ, ప్రాధాన్యము, కావడిబరువు.
భర్గుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భర్జతే కామకాలా దీనితి భర్గః. కామకాలాదులను కాలపాకమును పొందించినవాడు, శివుడు, ముక్కంటి. భృజ్యతే కామాదిరనేనేతి భర్గః. రుద్రుడు, ఉమాపతి, త్రినేత్రుడు.
భర్త
సం. నా. వా. ఋ. పుం. తత్స. బిభర్తీతి భర్తా. భరించువాడు, మగడు. భిబర్తి పృష్ణాతి పాలయతి ధారయతీతి వా భర్తా. పతి, అధిపతి, అధిపుడు, ఈశుడు, నేత, ఇంద్రుడు, స్వామి, నాథుడు, ఆర్యుడు, ప్రభువు, ఈశ్వరుడు, విభువు, నాయకుడు. సం. విణ. తత్స. మోచువాడు, ప్రోచువాడు.
భర్తృదారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భర్తుః దారకః భర్తృదారకః. దొరకొడుకు, యువరాజు. (నాట్యపరిభాషయందు). భర్తా దియతే ఇతి భర్తృదారకః.
భర్తృదారిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తత్సుతా భర్తృదారికా. పూర్వవద్యుత్సత్తి, రాజుకూతురు (నాట్యపరిభాషయందు)
భర్త్సనము
సం. నా. వా. అ. న. తత్స. భర్త్సతే అనేనేతి భర్త్సనం. దీనిచేత బెదరింపబడును, బెదరింపుమాట.
భర్మము
సం. నా. వా. న్. అ. న. తత్స. భ్రియతే ఆభరణ రూపేణే భర్మ. ఆభరణ రూపమైధరింపబడునది, బంగారు, జీతము.
భల్లము
సం. నా. వా. అ. న. తత్స. భల్లతి హినస్తీతి వా అచ్ఛభల్లః. తన సంబంధమైనవారిని ఛేదింపక పరులను హింసించునది బల్లెము, ఎలుగుబంటు, ఒక బాణము.
భల్లాతకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భల్ల ఇవాతతీతి భల్లాతకీ. అంబువలె పోవునది, జీడి.
భల్లూకము
సం. నా. వా. అ. పుం. తత్స. భాలూక బాణీస్త ఇతి నిర్మలభల్లుకా. ఎలుగుగొడ్డు, భల్లుకము. భల్లతే ఇతి భల్లూకః. దుండిగపు చెట్టు.
భవనము
సం. నా. వా. అ. న. తత్స. భవంతి బాలా అత్రేతి భవనం. బాలురు దీని యందు జనింతురు, అగుట, ఇల్లు. భవత్యస్మిన్నితి భవనం, కుక్క.
భవము
సం. నా. వా. అ. పుం. తత్స. భవతి భవతేవా సర్వమితి భవః. అంతయు తానగువాడు, పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము, సత్త. భవత్యస్మా త్సర్వమితి చ భవః. భూసత్తాయాం. అభివృద్ధి, శివుడు, ఉండుట, జన్మము.
భవాని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భవస్య పత్నీ భవానీ. భవుని భార్య, పార్వతి, గట్రాచూలి.
భవికము
సం. నా. వా. అ. న. తత్స. భవః వాంఛిత ప్రాప్తితత్రేతి భవికం. కోరికనొందుట, శుభము, మేలు, సౌఖ్యము, బాగు.
భవిత
సం. విణ. (ఋ.ఈ.ఋ). తత్స. భవతి తాచ్చీల్యేనేతి భూష్ణుః భవిష్ణుః భవితా. భూసత్తాయాం. కాగల స్వభావముకలవాడు.
భవిష్ణువు
సం.విణ. (ఉ). తత్స. భవతి తాచ్చీల్యేనేతి భూష్ణుః భవిష్ణుః. కాగల స్వభావముకలవాడు, జరుగవలసినది.
భవ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భవనార్హం భవ్యం. పుట్టుట కర్హమైనది, పార్వతి, గజపిప్పలి, శుభము, ఎముక, శుభమైనది, సత్యమైనది, యోగ్యమైనది, కాగలది, గజనిమ్మ, సౌఖ్యము, భవిష్యత్తు, అర్హము.
భషకము
సం. నా. వా. అ. పుం. తత్స. భషతీతి భషకః. మొఱుగునది, శునకము, కుక్క.
భస్త్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భస్యతే దీప్యతే అనయా అగ్నిరితి భస్త్రా. దీనిచేత అగ్ని ప్రజ్వలింపబడును, (కమ్మరివాని) కొలిమితిత్తి.
భస్మగర్భ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. “భస్మతు ల్యామజ్జా అత్రేతి భస్మగర్భా”. బూడిదవంటి చేవకలది, కంపుటిరుగుడు, ఇరుగుడు.
భస్మగ్రంధిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భస్మనా గంధయతి భస్మగంధినీ. ధూళిచే పీడించునది, రేణుకయను గంధ ద్రవ్యము.
భస్మము
సం. నా. వా. న్. న. తత్స. భూతి, భసిత, భస్మ, క్షార. బూడిద వేళ్లు, ఏదయినను కాలి తెల్లగానైన పొడి, బూది, బూడిద.
భా
సం. నా. వా. స్. స్త్రీ. తత్స. ప్రకర్షేణ భాతీతి ప్రభా. మిక్కిలి ప్రకాశించునది, సూర్యుని వెలుగు, కిరణము, ప్రభ, కాంతి.
భాండ
సం. నా. వా. అ. న. తత్స. భండ త్యాధేయస్య భాండం. ఆధేయ వస్తువునకు శుభమును చేయునది. భండయతీతి భాండం. శుభమును చేయునది, తొడవు, గుఱ్ఱపు తొడవు, కుండలోనగు మట్టిపాత్రము, వస్తువు, మొదలి సొమ్ము, సంచి మొదలు మూలధనము, పాత్ర, ఆభరణము, అశ్వాభరణము.
భాగధేయము
సం. నా. వా. అ. న. తత్స. భగస్య ఐశ్వర్యస్య ఇదం భాగదేయం. ఐశ్వర్య సంబంధమైనది, భాగ్యము, కప్పము. భాగ ఏవ భాగధేయః. ప్రజలచేత చల్లబడునది, పన్ను, సపిండుడు, అదృష్టము.
భాగము
సం. నా. వా. అ. పుం. తత్స. భజ్యతే క్రమేణేతి భాగః. క్రమముగా పొందబడునది, పాలు, భాగము, ఛాగము, అవయవభాగము, వంతు, అదృష్టము, వంతు, నాలుగవ వంతు.
భాగినేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భగిన్యాః అపత్యం పుమాన్ భాగినేయః. తోడపుట్టిన ఆమెకొడుకు, మేనల్లుడు.
భాగీరథి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భగీరథేన రాజ్ఞా భూలోకమవతారితేతి భాగీరథీ. భగీరథుడును రాజుచేత భూలోకమునకు తేబడినది. గంగ, మిన్నేఱు.
భాగ్యము
సం. నా. వా. అ. న. తత్స. భజనీయత్వాద్భాగ్యం. సేమిపదగినది. భజనీయం భాగ్యం. పొందతగినది, అదృష్టము, సుకృతము, భాగింపతగినది, పూర్వజన్మ కర్మము.
భాజనము
సం. నా. వా. అ. న. తత్స. భజ్యతే ఆధేయేనేతి భాజనం. ఆధేయము చేత పొందబడినది, పాత్రము, యోగ్యము, చిన్నపాత్ర.
భాద్రపదము
సం. నా. వా. అ. పుం. తత్స. భాద్రాయుక్తా పూర్ణిమాస్మిన్నితి భాద్రపదః. భాద్రనక్షత్రముతో కూడిన పున్నమి దీనియందు కలదు, భాద్రపదమాసము.
భామ
సం. నా. మ. ఆ. స్త్రీ. తత్స. భాతీతి భానుః . ప్రకాశించువాడు, ఆడుది, కోపము, సూర్యకిరణము, సూర్యుడు.
భామిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భామ్యత్య వశ్యం కుప్యతి భామినీ. అవశ్యము కోపగించుకొనునది, క్రీడాసమయమునందు కోపము చూపెడు ఆడుది, ఆడుది, స్త్రీ, కోపముగల స్త్రీ.
భారతము
సం. నా. వా. అ. న. తత్స. భరతస్య గోత్రాపత్యాని భారతాః. భరతుడు అను ఋషి యొక్క గోత్రమునందు పుట్టినవారు. వ్యాసప్రోక్తమైన అయిదవవేదము, హిమవత్పర్వమునకును దక్షిణ సముద్రమునకును నడుమైన ఒక వర్షము, నట్టువుడు, భారత వర్షము.
భారతము
సం. నా. వా. అ. న. తత్స. భరతస్యరాజ్ఞ ఇదం భారతం. భరతుడు అను రాజు సంబంధమైనది, వ్యాసప్రోక్తమయిన ఐదవ వేదము, హిమలయాలకు దక్షిణ సముద్రమునకు మధ్య ఒక దేశము.
భారతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భరతేన మునినా అవతారి తత్వాద్వాభారతీ. ఈలోకమునకు భరతుడు అనుమునిచేత తేబడినది, సరస్వతి, వాక్కు, ఒకకావ్యవృత్తిః, పక్షివిశేషము, తులసి, ఒకవృత్తి (అలంకార శాస్త్రము), నటుని సంభాషణము.
భారద్వాజి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భరద్వాజ సృష్టత్వాత్ భారద్వాజీ. భారద్వాజముని చేత పుట్టింపబడినది, అడవిప్రత్తి, ప్రత్తి.
భారము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రియత ఇతి భారః. మనుష్యుల చేత భరింపబడునది, బరువు, బారువ, రెండు ఋక్షములు (ఒక మాసము), అతిశయము, పూజు (కాడి).
భారయష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భరవహనార్థం యష్టిః భారయష్టిః. భారము మోయట కొఱకైన బ్రద్ద, కావడిబ్రద్ద. భారస్య యష్టిః భారయష్టిః. కాడి.
భారవాహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భారం వహతీతి భారవాహః. బరువును మోసెడువాడు భారకుడు, అశ్వగతి, బరువు మోయువాడు.
భార్గవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భృగోరియం భార్గవీ. భృగుసంబంధమైనది, లక్ష్మీ, పార్వతి, గఱిక, దూర్వ.
భార్గవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భృగోరపత్యం భార్గవః. భృగుసంతతి యందు పుట్టినవాడు, శుక్రుడు, పరశురాముడు.
భార్జి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భ్రజ్జతి కఫాదికమితి భార్గీ. శ్లేష్మాదుల పోగొట్టునది, బారంగి, ఒకజాతి మిరియము.
భార్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భ్రియత ఇతి భార్యా. భరింపబడునది, అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము. భరణీయా స్త్రీ భార్యా. పత్ని, ద్వితీయ, సహధర్మిణి, జాయ, ధర్మచారిణి, దార, కలత్రము, పెండ్లాము.
భాలూకము
సం. నా. వా. అ. పుం. తత్స. భలతీతి భాలూకః. హింసించునది, భల్లుకము, ఎలుగు. భలతే హినస్తి జీవానితి భాలూకః.
భావము
సం. నా. వా. అ. పుం. తత్స. భావయతీతి భావః. భావింపచేయువాడు, “ప్రశ్చాదర్థం భావయతి ప్రకాశయతీత్యనుభావః”. అర్ధమునుఎరిగినది. “భవనం భవతీతి చ భావః”. పుట్టునది, పుట్టుటయు అనిభావం, ఒకసంవత్సరము, సత్తు, మనోవికారము, అభిప్రాయము, ఆత్మ, పుట్టుక, ధాత్వర్థరూపక్రియ, స్వభావము, పదార్థము, విభూతి, రత్యాది (నాట్యపరిభాషయందు) విద్వాంసుడు. భావయతి ప్రకాశయతి పదార్థానితి భావః. స్వభావము, అభిప్రాయము, ఆత్మ, జన్మ, మనః ప్రవృత్తి, సాత్త్వికభావము, లీల, క్రియ, చేష్ట, ఐశ్వర్యము, జంతువు, మూల కారణము.
భావితము
సం. విణ. (అ. ఆ. అ). పుం. తత్స. భావ్యతే సురభిద్రవ్యైరితి భావితం. సురభి ద్రవ్యములచే చేయబడినది. భావ్యత ఇతి భావితం. భాసింపడిన వస్తువు. భావ్యతేస్మ భావితం. పొందబడినది, కర్పూరాదుల చేత వాసన కట్టినది.
భావుకము
సం. నా. వా. అ. న. తత్స. భవనం శీలమస్యతి భావుకం. ధన్యుల యందు కలుగుటయే స్వభావముకలది, శుభము,భావికము,ఉత్పాదకుడు.
భాష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భాష్యత ఇతి భాషితం, భాష వ్యక్తాయాంవాచి. భాషింపబడినది, సంస్కృతాది, మాట, ప్రతిజ్ఞ, ప్రమాణము, సరస్వతి, వాదన, సంస్కృతాది కమగు భాష.
భాషితము
సం. నా. వా. అ. న. తత్స. భాష్యత ఇతి భాషితం. భాషింపబడినది, మాట, మాటాడినది.
భాష్యము
సం. నా. వా. అ. న. తత్స. సూత్ర వాఖ్యాన గ్రంథము, మాటాడతగినది.
భాస్కరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భాసం కరోతీతి భాస్కరః. కాంతిని కలుగ చేయువాడు, సూర్యుడు, అగ్ని. భాః కరోతీతి భాస్కరః. వీరుడు, అర్కవృక్షము.
భాస్వంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. భాసః అస్యసన్తీతి భాస్వాత్. కాంతులు కలవాడు, సూర్యుడు. భాసః సంత్యస్యేతి భాస్వాన్. రవి, అగ్ని, చంద్రుడు, ప్రకాశించునది.
భాస్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బాసంత ఇతి భాస్వరాః. అంతట ప్రకాశించువాడు, సూర్యుడు, క్షుద్రదేవత.
భిందిపాలము
సం. నా. వా. అ. పుం. తత్స. బిందతః పాలయతీతి భిందిపాలః. నరుకు వారిని రక్షించునది, విడుచివాటు గుదియ, నాలికాస్త్రము, సృగము, రెండు మూడు చక్రములు కల మాదిగ కత్తి.
భిక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భిక్షణం భిక్షా. యాచన. భిక్షా భిక్షిత వస్తుషు. అడుగుట, బిచ్చము, బిచ్చమెత్తిన వస్తువు, కడికొలది అన్నము, కూలి, సేవ, కబళము, బిచ్చమెత్తిన అన్నము.
భిక్షువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. భిక్షతే యాచతే భిక్షుః. యాచించువాడు, సన్యాసి, “భిక్షతే భిక్షుః”. అడుగువాడు, బ్రహ్మచారి, సన్యాసి. పరివ్రాజకుడు, వ్రజకుడు, చారుడు, నాలుగుదినముల కొకసారి భుజించువాడు.
భిత్తము
సం. నా. వా. అ. న. తత్స. భిద్యిత ఇతి భిత్తం. వ్రక్కలింపబడునది, ఖండము, తునుక, భాగము.
భిత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భిధ్యతే భిత్తిః. భేదింపబడునది, భేదనము, గోడ, జుత్తిలి.
భిదురము
సం. నా. వా. అ. న. తత్స. భినత్తి శత్రుబలమితి భిదురం. శత్రుసైన్యమును భేదించునట్టిది, వజ్రాయుధము, ఱాతివాలు, ఏనుగు కాలిగొలుసు.
భిన్నము
సం. నా. వా. అ. పుం. తత్స. భిద్యతే స్మ భిన్నః. వ్రక్కలించ బడినది, అర్ధదోషములలో నొకటి, నీలరత్నదోషము, పగిలినది, చీలినది, విరిసినది, వేఱుపడినది, కూడినది, చీల్చబడినది, కలుపబడినది.
భిర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భేదనం బిదా. వ్రక్కలించుట, భేదము, భేదనము, భేదోపాయము, చీల్చుట.
భిషక్కు
సం. నా. వా. జ్. అ. పుం. తత్స. భిషజ్యతి భిషక్. చికిత్ససేయువాడు, వైద్యుడు, చికిత్సకుడు. బిభేతి రోగో యస్మాదితి భిషక్.
భిస్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భిస్యతే భక్ష్యత ఇతి భిస్సా. భక్షింపబడునది, అన్నము, వంటకము. బభస్తీతి భిస్సా. ఓదనము.
భిస్సట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కుత్సితా భిస్సాభిస్సటా. కుత్సితమైన అన్నము, మాడన్నము.
భీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. త్రసీ ఉద్వేగేభీః భయం, వెఱపు.
భీతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. త్రసనం త్రాసః ఉద్వేగే భీతిః. భయం, వెఱపు, వడకు, ఒక స్థాయీభావము.
భీముడు
సం. నా. వా. అ. పుం. తత్స. భిభేత్యస్మాత్ త్రైలోక్యం భీమః. ముల్లోకము ఇతనివలన భయపడును, ధర్మరాజు తమ్ముడు, ఒకరాజు, శివుడు, భయంకరుడు. బిభేత్యస్మాదితి భీమః. భయంకరమైనది.
భీరుకుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భీరుకః భీలుకశ్చ. వెఱచుస్వభావముకలవాడు, భీరుకుడు యొక్క రూపాంతరము, పిరికి.
భీరువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. భయం శీలమస్యా ఇతి భీరూః. వెఱపు స్వభావము కలది, వెఱపరియగు ఆడుది, పిల్లపీచర, వెఱపర. బిభేతీతి భీరుః. భయశీలుడు, చకితుడు, ఒక వృక్షము, స్త్రీ, పిరికి.
భీషణము
సం. నా. వా. అ. పుం. తత్స. బిభేత్యస్మాది భీషణం. భయం భయానకరసము, భయంకరమైనది.
భీష్మము
సం. నా. వా. అ. పుం. తత్స. భీష్మం భీమం భయానకచ. భయముతో కూడినది, భయానకరసముకలది, భయంకరమైనది.
భీష్మసువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. భీష్మం సూత ఇతి భీష్మసూః. భీష్ముని కన్నది, గంగానది.
భుక్తము
సం. విణ. (అ.ఆ.అ).తత్స. అశభోజనే భుజ్యతే స్మ భుక్తం. భుజింపబడునది, అనుభవింపబడునది, తినబడినది.
భుగ్నము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుటతీతికుటిలః భుజతీతి భుగ్నం. వంకరయైయుండునది, వంగినది, విరిగినది, వంకరైనది, కుటిలము.
భుజంగభుక్కు
సం. నా. వా. జ్. పుం. భుజంగాన్ భుజ్త్కే భుజంగభుక్. సర్పములను భుజించునది, నెమలి, పాపమేపరి.
భుజంగమము
సం. నా. వా. అ. పుం. తత్స. భుజం కుటిలం గచ్ఛతీతి భుజంగమమః. కుటిలముగా పోవునది, పాము.
భుజంగము
సం. నా. వా. అ. పుం. తత్స. భుజంకుటిలం గచ్ఛతీతి భుజంగః. కుటిలముగా పోవునది, పాము, విటుడు. భుజః వక్రః సన్ గచ్ఛతీతి భుజంగః. సర్పము.
భుజంగాక్షి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సర్పనయన సదృశపుష్పవత్వాత్ భుజంగాక్షి. పాముకన్నులవంటి పువ్వులుకలది, సర్పాక్షి.
భుజగము
సం. నా. వా. అ. పుం. తత్స. భుజం కుటిలం గచ్ఛతీతి భుజగః. కుటిలముగా పోవునది, పాము. భుజః వక్రః సన్ గచ్ఛతీతి భుజగః. సర్పము.
భుజశిరస్సు
సం. నా. వా. స్. న. తత్స. భుజస్య శిరోగ్రం భుజశిరః. భుజము యొక్క కొన, మూపు, అంసము.
భుజాంరము
సం. నా. వా. అ. న. తత్స. భుజయోరం తరం భుజాంతరం. భుజముల యొక్క నడుము, ఱొమ్ము, క్రోడము.
భుజిష్య
సం. నా. వా. ఆ. పుం. తత్స. భుజ్త్కే వేతన మితి భుజిష్య. కూలిని భుజించువాడు, పరిచారిక, వేశ్య, చేతకట్టుకొనెడు తోరము, పరిచారకుడు, స్వతంత్రుడు. భుజ్యతే స్వామ్యుచ్ఛిష్టమితి భుజిష్యః. దాసుడు, కింకరుడు, సేవకుడు, దాస్యముక్తుడు.
భువనము
సం. నా. వా. అ. న. తత్స. భవత్యస్మిన్నితి భువనం. దీనియందు సర్వము కలుగును, జగము, ఉదకము, ఆకాశము, లోకము, రంధ్రము, నీరు.
భూతకేశము
సం. నా. వా. అ. పుం. తత్స. భూతస్య కేశా ఇవకేశా యస్య భూతకేశః భూతపు వెంట్రుకలు వంటి పీచుకలది, మరులు జడ (వృక్ష విశేషము).
భూతధాత్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భూతాని ధరతీతి భూతధాత్రీ. భూమి, నేల, పృథివి.
భూతము
సం. నా. వా. అ. న. తత్స. భవన్తి ఇష్టం ప్రాప్నువంతీతి భూతాః. ఇష్టము నొందెడి బాలగ్రహాదులు. భావ్యతే స్మ భావితం భూతం. ప్రాప్తము, విన్నపము, పొందబడినది. భూయతే భవతీతి చ భూతం. పొందబడునది, పృథివ్యాది (ఇవి అయిదు పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము). పిశాచాది, ప్రాణి, దేవయోనివిశేషము, కృష్ణ చతుర్ధశి, కొడుకు, తగినది, కడచినది, నిక్కువమయినది, వెలసినది, సమానమైనది, క్షుద్రదేవత, పంచమహాభూతములు, జంతువు, గతించినది.
భూతవేశి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భూతాని విశతి ఆహ్లదయతీతి భూతవేశి. భూతములను సంతోష పెట్టునది, తెల్లవావిలి.
భూతాత్మము
సం. నా. వా. న్. పుం. తత్స. భూతానాం ప్రాణినా మాత్మా పృథివ్యాధి భూత స్వరూప ఇతి చ భూతాత్మ. ప్రాణులకు ఆత్మకనుక, దేహము, బ్రహ్మ, వాయువు, శరీరము, శరీరక్త.
భూతావాసము
సం. నా. వా. అ. పుం. తత్స. భూతానామావాసో భూతావాసః. భూతములకుస్థానమైనది, విభీతకము, తాండ్ర.
భూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. “విశేషణ భవతీతి విభూతిః”. విశేషముగా కలుగునట్టిది. “భూయతే భూతిః”. పొందబడునది, భస్మము, సంపదకును పేరు, ఐశ్వర్యము, సంపద, సత్త, పుట్టుక, ఏనుగు శృంగారము, విభూతి, పక్వమాంసము, అభివృద్ది, జన్మ, అణిమాద్యష్టసిద్ధులు.
భూతికము
సం. నా. వా. అ. న. తత్స. భువి ఊతిః సంబంధోస్యాస్తీతి భూతికం. భూమియందుసంబంధముకలది, ఓమము, కర్పూరము, కామంచికసవు, చీపురుకసపు, నేలవేము, వేపచెట్టు.
భూతేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భూతేశః భూతానాం ప్రమథానామీశః. ప్రమథగణములకు ఈశ్వరుడు, శివుడు, బూచుల ఱేడు.
భూదారము
సం. నా. వా. అ. పుం. తత్స. భువందారయతీతి భూదారః. భూమిని వ్రక్కలించునది, కిటి, పంది.
భూదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భువిదీవ్యతి బ్రహ్మవర్చసాభూదేవః. బ్రహ్మ వర్చస్సుచేత భూమి యందు ప్రకాశించువాడు, బ్రాహ్మణుడు, నేలవేలుపు.
భూనింబము
సం. నా. వా. అ. పుం. తత్స. భువి నింబోభూనింబః. నేల వేలము.
భూపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. భువం పాతీతి భూపః. భూమిని పాలించువాడు, రాజు, నేరఱేడు. భువః పతీతి భూపతిః.
భూపది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భువిపదమస్యాః భూపతిః. భూమి యందు స్థానము కలది, మల్లి.
భూభృత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. భువంబ భర్తీతి భూభృత్. భూమిని ధరించును, కొండ, రాజు (దీనికి సరియైన తెనుగుమాట నేలతాలుపు).
భూమి జంబుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. “భూమౌజమ్యత ఇతి భూమి జంబుకా”. భూమియందు భక్షింపబడునది. “భూమౌజంబూః భూమిజంబుకా”. భూమియందు పుట్టిన నేరేడు, కాకినేరేడు, నేలనేరేడు.
భూమి స్పృశుడు
సం. నా. వా. శ్. పుం. తత్స. క్షేత్రసంస్కారాయలాంగలాదినా నిత్యం భూమి స్పృశస్తీతి భూమిస్పృశః. పొలమును చక్కగా చేయుట కొఱకు నాగేలు మొదలయినవానిచేత భూమిని స్పృశిందువాడు, కోమటి, మనుష్యుడు, వైశ్యుడు, మనుజుడు.
భూమి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భవతీతి భూః. ఉదకమువలనపుట్టును, నేల, చోటు. భవంతి భూతాన్యస్యామితి భూమిః. పృథ్వి, స్థలము.
భూయస్సు
సం. విణ. (స్). తత్స. అతిశయేన భహుభూయిశ్చ. మిక్కిలి బహుళమైనది, అధికము, మిక్కుటము. భువే భవాయ యస్యతి యతతే వా ఇతి భూయః.
భూయిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన బహుభూయిష్టం. మిక్కిలి బహుళమైనది, అధికము, మిక్కుటము.
భూరి
సం. నా. వా. ఇ. న. తత్స. భవత్య నల్పమితి భూరి. అధికముగానౌ నది, బంగారు, అధికము.
భూరిఫేన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భూరయః ఫేనాః అస్యా ఇతి భూరిఫేనా తఱచైననురుగులుకలది, సంబరేను.
భూరిమాయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. భూరయో మాయా అన్యేతి భూరిమాయుః. అనేకమాయలుకలది, జంబుకము, నక్క.
భూరుండి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భువి రోహతీతి భూరుండీ. భూమియందు మొలచునది, గురుగు.
భూర్జము
సం. నా. వా. అ. పుం. తత్స. భూరిత్యవ్యయం భూః భూమౌజాయత ఇతి భూర్జః. భూమియందు పుట్టునది, బుజపత్తిరి, భూర్జపత్రము.
భూషణము
సం. నా. వా. అ. న. తత్స. భూషణం స్యాదలం క్రియా భూషా భూషణం. అలంకరించుట, అలంకరణము, తొడవు. భూష్యతే అనేనేతి భూషణమ్.
భూషితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భూష్యతే స్మ భూషితః. భూషింపబడినవాడు, అలంకరింపబడినవాడు.
భూష్ణువు
సం.విణ. (ఉ). తత్స. భవతితాచ్ఛీల్యేనేతి భూష్ణుః. కాగలవాని వేళ్లు, కాగలస్వభావముకలవాడు.
భూస్తృణము
సం. నా. వా. అ. న. తత్స. భువం సంస్తృణాతీతి భూస్తృణం. భూమిని కప్పియుండునది, చిప్పకసపు, తృణ విశేషము.
భృంగము
సం. నా. వా. అ. న. తత్స. కృష్ణ పర్ణత్వాద్భృంగం. నల్లనైనది. భృగవర్ణసామ్యాత్ భృజ్గః. తుమ్మెదలవలే నల్లనైనది. ఆకృత్యా భృజ్గమియర్తీతి బృజ్గారీ. ఆకృతి చేత తుమ్మెదను పొందునది, తుమ్మెద, కూకటిమూగ, గుంటగలిజేరు, విటుడు. బిభర్త్యనురాగమితి భృంగః. భ్రమరము, భృంగరాజు, లవంగపట్ట, పరిమళద్రవ్యము.
భృంగరాజము
సం. నా. వా. అ. పుం. తత్స. భృంగ వద్రాజతే భృంగరాజః. తుమ్మెద వలె ప్రకాశించునది, గుంటగలజేరు, గండుతుమ్మెద, కూకటిమూగ, ఒక వృక్షము, ఒక పక్షి.
భృంగారము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రియతే జలమనేనతి భృంగారః. దీనిచేత జలము భరింపబడును, గుంటగలిజేరు, బంగారుగండి, బంగారుబరిణె.
భృంగారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఆకృత్యా భృజ్గమియర్తీతి భృజ్గారీ. ఆకృతిచేత తుమ్మెదను పొందునది, చిమ్మరుగు ఝిల్లిక, కీచురాయి.
భృంగి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అతివస వృక్ష. సం. నా. వా. అ. న. తత్స. భృంగీశ్వరుడు.
భృగువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. భ్రజ్యతే తప్యతే సూర్యాగ్ని తేజసా భృగుః. సూర్యాగ్ని తేజస్సుల చేత తపింపచేయబడినది, కొండచరియ, ఒక ముని, శుక్రుడు, శివుడు. తపసా భృజ్జ్యతేతి భృగుః. పతనస్థానము, జమదగ్ని, సానువు.
భృతకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రియత ఇతి భృతః. పాత్రుడై భరింపబడువాడు, కూలివాడు, సేవకుడు.
భృతి భుజుడు
సం. నా. వా. జ్. పుం. తత్స. భృతిం భుజ్త్క ఇతి భృతి భుక్. కూలిని భుజించువాడు, కూలివాడు, సేవకుడు.
భృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భ్రియతే అనయా ఇతి భృతిః. దీనిచేత మోపు మొదలైనవి భరింపబడును, మోచుట, కూలి, వెల, జీతము.
భృత్యము
సం. నా. వా. అ. పుం. తత్స. భరణీయోభృత్యః. పోషింపతగినవాడు, కూలి, పనివాడు, బంటు. భ్రియతే అనయా భరణమితి వా భృత్యా, సేవకుడు.
భృత్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భ్రియతే అనయా భృత్యా. దీనిచేత మోపు మొదలైనవి భరింపబడును, భరణం, కూలి, వేతనము, జీతము.
భృశము
సం. నా. వా. అ. న. తత్స. భిభర్తీతి భృశం. భరించునట్టిది, అధికము. భృశ్యతి ప్రాచుర్యేణ వరేతతే ఇతి భృశం, మిక్కిలి.
భేకము
సం. నా. వా. అ. పుం. తత్స. బిభేతి సర్పాద్భేకః. సర్పము వలన భయపడునది, కప్ప, మేఘము. మండూకము, ప్లవము, దర్దురము, ప్లవగము, ఒకసంకరజాతి, భీతుడు.
భేకీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భేకస్య స్త్రీ భేకీ. భేకము యొక్క స్త్రీ, భేకీ, ఆడుకప్ప, వర్పాభ్వి
భేదకుడు
సం. విణ. (అ.ఆ.అ).తత్స. సంహత యోర్భేదనం భేదః. కూడియున్నవారి నెడబాపుట, ఛేదించువాడు.
భేదము
సం. నా. వా. అ. పుం. తత్స. “సంహత యోర్భేదనం భేదః”. కూడియున్నవారి నెడబాపుట, భేదనము, వేఱిమి, విశేషము ఒక ఉపాయము (ఇది త్రివిదము-ఒండొరుల స్నేహము చెఱుచుట, ఒండొరులకు రాయిడి పుట్టించుట, బెదరుచూపుట), అసమ్మతి, విభజించుట, చించుట.
భేదితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దార్యతేస్మ ధారితః భద్యతేస్మ భిన్నః భేదతశ్చ. వక్రవింపబడునది, భేదింపదగినది, విభజింపబడినది.
భేరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బిభ్యతి శత్రవోస్యా ఇతి భేరీ. దీనివలన శత్రువులు భయపడుదురు, వాద్య విశేషము, దుందుభి.
భేషజము
సం. నా. వా. అ. న. తత్స. బిషజ్యన్తి చికిత్సన్త్య నేనేతి భేషజం. దీనిచేత చికిత్స చేయుదురు, ఔషధము, మందు.
భైక్షము
సం. నా. వా. అ. న. తత్స. భిక్షాణాం సమూహో భైక్షం. భిక్షమెత్తిన పదార్ధముల గుంపు, భిక్షా సముహము, బిచ్చము.
భైరవము
సం. నా. వా. అ. పుం. తత్స. భీరోస్సం త్రాసకృద్భైరవం. భీరులకు వెఱపు పుట్టించునది, భయానకరసము. భీరోరిదం భైరవం, భయంకరము, పర్వతము.
భైషజ్యము
సం. నా. వా. అ. న. తత్స. భిషజ్యన్తి చికిత్సన్త్యనేనేతిభైషజ్యంచ. దీనిచేత చికిత్స చేయుదురు, ఔషధము, మందు.
భోగము
సం. నా. వా. అ. పుం. తత్స. భుజ్యత ఇతి భోగః. అనుభవింపబడునది, సుఖము, భోజనము, పాముయొక్క పడగ, పాము యొక్క శరీరము, ధనము, వేశ్యాదులకిచ్చెడు వెల, పాలనము, అష్టభోగములు (గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము). పడుపుకూలి.
భోగవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భోగాః సర్పాకాయా ఉప భోగావాసంత్యస్మామితి భోగవతీ. దీనియందు సర్పశరీరములుగాని, సుఖములుకలవు. పాతాళము, పాతాళము నందలిఏఱు, భోగము కలది.
భోగి
సం. నా. వా. న్. పుం. తత్స. భోగస్సర్ప శరీరం తదస్యాస్త్రీతీతి భోగీ. భోగమనగా సర్ప శరీరము, పాము, రాజు, మంగలి, సుకవాసి.
భోగిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భోగః సంభోగో యాస్వితి భోగినీ. ఎవ్వరియందు సంభోగముకలదో వారు భోగినులు, ఆడుపాము, భోగముది, పట్టాభిషిక్తురాలుకాని రాజుభార్య, పట్టమహిషికాక ఇతరభార్యలు.
భోజనము
సం. నా. వా. అ. న. తత్స. భుర్తిః భోజనం. భుక్తిః భక్షించుట, ఆహారము, కుడుపు, తిండి.
భౌముడు
సం. నా. వా. అ. పుం. తత్స. భూమేర పత్యం భోమః. భూమి కొడుకు, అంగారకుడు, నరకాసురుడు, భూమియందు పుట్టినవాడు, కుజుడు.
భౌరికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భూరిసువర్ణం పాలయతీతి భౌరికః. బంగారు దాని పాలించువాడు, బంగారునాణెపు బండారమునకధికారి, ఒకదేశము స్వర్ణాధ్యక్షుడు.
భ్రంశము
సం. నా. వా. అ. పుం. తత్స. యధోచితా ద్యథా ప్రాప్తా ధ్ధర్మాత్ భంశ. తనకు ఉచితమైన ధర్మమువలనచలించుట, చలించుట, జాఱుట.
భ్రకుంసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రూభ్యాంకుంసః భాషణం శోభా వాయస్యసః భ్రకుంశః. కనుబొమ్మలచేత అర్ధమును సూచించుకాంతియైననుకలవాడు. భ్రుకుంసుడు యొక్క రూపాంతరము, స్త్రీవేషదారి.
భ్రకుటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భువోః కుటిః కుటిలతాభ్రకుటిః. కనుబొమ్మల కుటిలత్వము, భ్రకుటి యొక్క రూపాంతరము, బొమముడి.
భ్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రామ్యతేనయతి భ్రమశ్చ. దీని చేత భ్రమింపచేయబడును. భ్రమణం భ్రమః. తిరుగుట, భ్రాంతి, తిరుగుడు, బండికంటి తిరుగుడు, నీళ్లు వెలికి పోవుటకుఏర్పరచిన తూములోనగునది, పోగారు.
భ్రమరకము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రమరాకృతి త్వాత్ భ్రమరకాః. తుమ్మెదలవలెనుండునవి, తుమ్మెద, బొంగరము, ముంగురులు, తేనె.
భ్రమరము
సం. నా. వా. అ. పుం. తత్స. బమితి శబ్దం బిభర్తీతి బంభరః. శబ్దమును భరించునది, తుమ్మెద, ముంగురులు, అభినయ హస్త విశేషము, సాహిసికుడు.
భ్రమి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. భ్రమణం భ్రమః భ్రవికా. తిరుగుట, భ్రమణము, తిరుగుడు, సుడి.
భ్రష్టము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. భ్రస్యతే స్మ భ్రష్టం. జాఱిపడినది, పడినది.
భ్రాంతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భ్రామ్యతే నయతి భ్రాన్తిః. అసత్య మైనబుద్ధి, మిథ్యామతి (ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లును తలచుట, భ్రమణము, ఒక అర్ధాలంకారము). సుడి.
భ్రాత
సం. నా. వా. ఋ. పుం. తత్స. భ్రాతా చ భగినీ చ భ్రాతరౌ. తోడపుట్టినవారు, ఒకే గర్భమునందు పుట్టినవారు, సహోదరుడు, సోదర్యుడు, సగర్భుడు,
భ్రాతృవ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రాతు రపత్యం భ్రాతృవ్యః. తోడపుట్టినవాని కొడుకు, పగవాడు.
భ్రాత్రీయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రాతు రపత్యం భ్రాత్రీయః. తోడపుట్టిన వాని కొడుకు.
భ్రాష్ట్రము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రజ్యతేస్మిన్నితి భ్రాష్ట్రం. దీని యందువేచబడును, వేపుడుచట్టి, మంగలము, పెనము.
భ్రుకుంసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రూభ్యాం కుంసః భాషణం శోభా వా యస్యః భ్రుకుంసః కనుబొమ్ముల చేత అర్ధమును సూచించుట అయినను ,కాంతి అయినను కలవాడు, స్త్రీ వేషం వేసుకొని ఆడెడు పురుషుడు.
భ్రుకుటి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. భువోః కుటిః కుటిలతా భ్రుకుటిః. కనుబొమ్మల కుటిలత్వము, బొమ్మముడి.
భ్రూణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భ్రియతే మాత్రేతి వాభ్రూణః. తల్లిచే భరింపబడునది, చూలాలు, గర్భము, బిడ్డ. భ్రూణయతి ఇచ్ఛతీతి భ్రూణః. ఇచ్ఛయించునది. శిశువు, వేదవేత్త, గర్భిణి.
భ్రేషము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రేషణం భ్రేషః. చలించుట, తనకుఉచితమైన ధర్మమునుండి చలించుట.