హల్లులు : మ
మంగళ దేవత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. అస్యైవనామ్న ఏక దేశ గ్రహణం మేతి లోకమాత, లక్ష్మి.
మంగళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మంగతి ధన్యమితి మంగళం. ధన్యతిని పొందునది, పార్వతి, తెల్లగఱిక, శుభము, క్షేమము, మల్లెవాసన, కుజుడు
మంగళ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మంగళే సాధుమంగళ్యం. శుభమందుమంచిది, గోరోజనము, మీగడపెరుగు, కలుక్రాంత, మారేడు, రావి, చిఱుసెనగలు, శుభకరము, మల్లెపూవాసనకల అగరు, వస, మల్లెవాసన కలది, ఒకఅరటి, సర్వౌషదులతో చేయు స్నానము.
మంచము
సం. నా. వా. అ. పుం. తత్స. మచ్యతే సరోనేన మచ్చః. దీనిచేత నరుడు ధరింపబడును, మంచము, మంచె.
మంజరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మన్యతే పికాది భిర్బహుమన్యతే మంజరీ. కోకిలాదులచేత నిక్షేపము వలె తలచబడునది. చిగురించిన లేత కొమ్మ, పూచిన లేత కొమ్మ, బొట్టుగు, పెద్దముత్తెము, గుత్తి, ఒకలత.
మంజిష్ఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మంగుని మనోజ్ఞేవర్ణేతిష్ఠతీతి మంజిష్ఠ. మనోహర వర్ణమందుండునది, ఒకానొక చెట్టు, మిక్కిలి ప్రకాశించెడి ఎఱుపు, పసుపు.
మంజీరము
సం. నా. వా. అ. పుం. తత్స. మంజు మనోహరం ఈర యతి ధ్వవతీతి మంజీరః. మనోహరముగా మ్రోయునది, అందె, నూపురము. మంజతి మధురం శబ్దాయతే ఇతి మంజీరః. కాలియందె.
మంజులము
సం. నా. వా. అ. న. తత్స. మంజుత్వ మస్యేతి మంజులం. మంజుత్వము కలది, పాచి, పొదరిల్లు, ఒక దినుసుకూర, ఒప్పిదమైనది, మనోహరము.
మంజువు
సం. విణ. (ఉ). తత్స. మన్యతే సర్వైరితిమంజు. అందరిచేత తలపబడునది, మనోజ్ఞము, మనోహరము.
మంజూష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మజ్జన్తి వస్తూన్యత్రేతి మంజూషా. దీనియందు వస్తువులుఅణగిఉండును, పెట్టె, మందసము, పట్టణము.
మండనము
సం. నా. వా. అ. పుం. తత్స. మండ్యతే అనేనేతి మండనం. దీనిచేత అలంకరింపబడును, మండయతి తాచ్ఛీల్యేనేతి మండనః. అలంకరించు స్వభావముకలవాడు, భూషణము. అలంకరించుట, అలంకరించునది, అలంకారము, అలంకార ప్రియత్వము.
మండపము
సం. నా. వా. అ. పుం. తత్స. మండ్యతే జనైరితి మండపః. జనులచేత అలంకరింపబడునది, చుట్టును నడుమును, అఱుగు లేక స్తంభములు నిలిపికట్టినకట్టడము, చలిక, చావడి.
మండము
సం. నా. వా. అ. పుం. తత్స. మండయతి స్వప్రదేశం మండః తన ప్రదేశమును అలకరించునది, ఆముదపు చెట్టు, భూషణము, ఒక దినుసుకూరాకు. సం. నా. వా. అ. న. తత్స. మండయతి రసమితి మండం. రసమును అలకరించునది, మీగడ. సం. నా. వా. పుం. న. తత్స. గంజి, నూనెలోనగు తేట.
మండలము
సం. నా. వా. అ. న. తత్స. మండయత్యలంకరోతీతి మండలం. అలంకరించునది. మండయతి భూషయతీతి మండలం. పరివేషము, దేశము, కుష్ఠము, విలుకాడు రెండు కాళ్ళతో మండలాకారము గానిలుచుట, పన్నిద్దఱురాజులు, సమూహము, వలయాకారము గాతీర్చిన ఒక వ్యూహము, కుక్క, సూర్యచంద్రులబింబము, గ్రామముల గుంపు, ప్రతిబింబము, సూర్యపరివేషము, పండ్రెండుగురు రాజులు పాలించుదేశము.
మండలేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మండలన్యేశ్వరో మండలేశ్వరః. కొంత భూఖండమును ఏలువాడు, అధీశ్వర సార్వభౌముల కంటె ఇతరుడైన రాజు, ఒక దేశమునకు అధిపతి. మండలస్య ఈశ్వరః మండలేశ్వరః. భయాపహుడు, ఏకజన్ముడు, భూమి, ఒక్కదేశానికి అధిపతి.
మండహరకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మండమచ్ఛసురాం హరతీతి మండహరకః. కల్లుమీది తేటను అమ్ముటకై తీయువాడు, కబ్బలివాడు, ఒక సంకరజాతి.
మండితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మండతేస్మమండితః. అలంకరింపబడినవాడు.
మండులాగ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. మండలాకారమగ్రమస్యేతి మండలాగ్రః. మండలాకారమైన కొనకలది, ఖడ్గము, కత్తి.
మండూకపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మండూకాకారాణి పర్ణాన్యస్యండూకపర్ణః. కప్పవంటి ఆకారముకల ఆకులు కలది, పొన్నగంటి,బెండ, మంజిష్ఠ, దోస.
మండూకము
సం. నా. వా. అ. పుం. తత్స. మండతే శోభతే తటాకాడౌ మండూకః. తటాకము నందు ఉండునది, కప్ప, దుండిగము (వృక్ష విశేషము). కప్పవంటి యంత్రము. మండయతి భూషయతి జలాశయమితి మండూకః. భేకము, శోణకము, మునివిశేషము, అశ్వజాతిభేదము.
మండూరము
సం. నా. వా. అ. న. తత్స. మండ్యతే అయః పిండా ధ్విభజ్యత ఇతి మండూరం. ఇనుపముద్దవలన విభజింపబడినది, ఇనుపచిట్టెను, ఇనుపచిట్టెముతో చేసిన సిందూరము, ఇనుపత్రుప్పు.
మంతువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. మన్యతే కష్టమితి మంతుః. కష్టమని తలంపబడునది, తెలివి.
మంత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. మన్యత ఇతి మంత్రః. విచారింపబడునది, గాయత్రిలోనగునది, రహస్యము, అధర్వవేదము. మంత్ర్యతే గుప్తం పరిభాష్యతే ఇతి మంత్రః. పరామర్శ, వేదమంత్రము, ఋక్కుమున్నగు మంత్రములు.
మంత్రి
సం. నా. వా. న్. పుం. తత్స. మన్త్రోగుప్తవాదః ఇతి కర్తవ్యతాధారణం వాసోస్యాస్తీతి మన్త్రీ. రహస్యవాదముకలవాడు, బుద్ధిసహయుడు, సహయుడు, అమాత్యుడు, సచివుడు, యువరాజు.
మంథదండము
సం. నా. వా. అ. పుం. తత్స. మంథనార్ధం దండం మంథదండకః. దండః. మంథనార్ధమైన దండము, కవ్వము.
మంథని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మథ్యతేస్యామితి మన్థనీ. దీనియందు పెరుగు ద్రచ్చబడును, తరిగడప, కవ్వము.
మంథము
సం. నా. వా. అ. పుం. తత్స. మథ్యతే అనేనేతి మంథః. దీనిచేత మథింపబడును, కవ్వము, కంటినొప్పి, అంబలి, వధము, నేతితో కూడిన పిండి, మంథనము, కరహర్షకము, భక్తాటము, తక్రాటము, ఖజకము.
మంథరము
సం. నా. వా. అ. పుం. తత్స. మథ్నాతి చరణావితిమంథరః. నడవలేక కాళ్లను పిసుకుకొనువాడు, కవ్వము, చొరవలేనిది, మెల్లగాపోవునది, వంకరైనది, విరివియైనది, కోపము, ఫలము, సుడి, కొండెములు చెప్పుట.
మందగామి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. మందం గచ్ఛతీతి మందగామీ. మెల్లగానడచువాడు.
మందాక్షము
సం. నా. వా. అ. న. తత్స. మన్ద మక్షం వాగ్యత్ర మన్దాక్షం. తిన్నని మాటలు కలది, సిగ్గు, లజ్జ, వ్రీడ, త్రప. మందే సంకుచితే అక్షిణీ నేత్రే యస్మాత్ తత్ మందాక్షం. సిగ్గుతో మూసుకొన్నటివంటి కన్నులు కలది.
మందారము
సం. నా. వా. అ. పుం. తత్స. మదంతి మోదంతే అనేనేతి మందారః. దీనిచేత సంతోషింతురు. మందాని సూక్ష్మాణి అరాణి కంటకాని యస్యసః మందారః. సూక్ష్మములైనముండ్లుకలది. మందాన్ క్షుద్ర వ్యాధీన్ ఔషధత్వేన ఇయర్తీతి మందారః. క్షుద్రవ్యాధులను పోగొట్టునది, ఒక కల్పవృక్షము, జిల్లేడు, బాడిదము. మంద్యతే స్తూయతే ప్రశస్యతే వా ఇతి మందారః. ప్రవాళవృక్షము.
మందిరము
సం. నా. వా. అ. న. తత్స. మాదతే సుప్యతేత్ర మందిరం. దీనియందు నిద్రింపబడును, ఇల్లు, పట్టణము, శరీరము.
మందుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మందంతే అశ్వా అత్రమందురా. దీనియందు గుఱ్ఱములు మదించును, లాయము, పడక. మందంతే స్వపంతి మోదంతే వా అశ్వాః యత్ర సా మందురా. గుర్రపుశాల.
మందోష్ణము
సం. నా. వా. అ. న. తత్స. మన్దంచ తత్ ఉష్ణం చ మందోష్ణం. కొంచెము వేడియైనది, ఇంచుకవేడి, సుకోష్ణము.
మంద్రము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మన్యతే బుధ్ధ్యతే అనేనేతి మంద్రః. దీనిచేత ఎరుగబడును, గంభీరమైనది (స్వరము), గంభీరధ్వని, ఒకజాతి ఏనుగు.
మంధానము
సం. నా. వా. అ. పుం. తత్స. మథ్యతే అనేనేతి మంథానః. దీనిచేత మధింపబడును, మంథదండము, కవ్వము.
మకరందము
సం. నా. వా. అ. పుం. తత్స. మంక్యతే పుష్ప్యతే అనేనేతి మకరందః. దీనిచేత పుష్పమలంకరింపబడును, పూదేనె. మకరమపి అందతి బధ్నాతి ధారయతీతి వా మకరందః. పుష్పరసము, మధువు, తేనె.
మకరధ్వజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మకరోధ్వజోయస్యసః. మకరము ధ్వజముగాకలవాడు, మన్మధుడు. మకరేణ చిహ్నితో ధ్వజో యస్య మకరధ్వజః. మకరకేతనుడు, కందర్పము.
మకరము
సం. నా. వా. అ. పుం. తత్స. మకర ఇవ గ్రహీతు మశకృత్వా న్మకరః. మొసలి వలె గ్రహింపనశక్యమైనది. మాయాం కరోతీతి మకరః. మాయను చేయునది, పెద్దచేప, మొసలి, ఒకనిధి, ఒకరాశి అభినయ హస్త విశేషము. కృణాతీతి మకరః. జలజంతు విశేషము, కుబేరుని నిధులలోఒకటి.
మకుటము
సం. నా. వా. అ. న. తత్స. మంక్యతే అనేన మకుటం. దీనిచేత అలంకరింపబడును, కిరీటము, బొమిడికము.
మకుష్ఠము
సం. నా. వా. అ. పుం. తత్స. మంక్యతే ఫలైరితి మకుష్ఠకః. పండినప్పుడలంకృతమైఉండునది, అడవిపెసలు.
మకూలకము
సం. నా. వా. అ. పుం. తత్స. మంక్యతే చిత్రత్వాత్ మకూలకః. చిత్రమై ఒప్పునది, దంతిచెట్టు.
మక్షిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దంశతీతి దంశః వనేమక్షికా. అడవి అందలి ఈగ, ఈగ.
మఖము
సం. నా. వా. అ. పుం. తత్స. మఖన్తిదేవా అత్రేతి మఖః. దీనికి దేవతలు వత్తురు, యజ్ఞము, జన్నము.
మగధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మగధ్యంతి స్తువంతి మగధాశ్చ. వంశములు స్తోత్రము చేయువారు, వంశావళి చదివెడువాడు, ఒక దేశము.
మఘవంతుడు
సం. నా. వా. న్. పుం. తత్స. మహ్యతే పూజ్యతే మఘవా.. పూజింపబడువాడు, ఇంద్రుడు, వేల్పుఱేడు.
మజ్జా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మజ్జతీతి మజ్జా. పరిశుద్ధమైనది, చెట్టుచేవ. సం. నా. వా. అ. పుం. తత్స. ఎముకల యందు నేయి, మెదడు, కొవ్వు.
మఠము
సం. నా. వా. అ. పుం. తత్స. మఠ్యన్తేస్మిన్నితి మఠః. దీని యందునివసింతురు, సన్యాసులు లోనగువారు ఉండుచోటు. మఠంతి వసంతి యత్ర మఠః. విద్యార్థి గృహము.
మణి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. మణ్యతే స్తూయత ఇతి మణిః. స్తోత్రము చేయబడునది, పచ్చఱాయి లోనగునది (అశ్మజాతి ఇది) ముత్యము లోనగునది, ముంత, మనికట్టు, గొఱ్ఱెమెడచన్ను, మగవాని కామచివర, సర్పవిశేషము, రత్నము, గుహ్య మధ్యము, అజాగళస్తనము, రత్నము, పెద్దకూజా.
మణికము
సం. నా. వా. అ. పుం. తత్స. మణతి గంభీరం ధ్వనతీతి మణికః. గంభీరముగా మ్రోయునది, కాగు, ముంత. మణిరేవతి మణికం, పెద్దకూజా.
మణితము
సం. నా. వా. అ. న. తత్స. మన్యత ఇతి మణితమ్. కేకవేయబడునది, రతికాలమునందలి గళరవము, కోకిలధ్వని, రత కూజితము.
మణిబంధము
సం. నా. వా. అ. పుం. తత్స. మణిబన్ధో హస్త గ్రంధిః తమారభ్యక నిష్ఠపర్యన్తం హస్తబహిర్భాగః కరభ. మణికట్టునుండి చిటికెనవ్రేలివరకు, మణికట్టు. మణిర్బధ్యతే యత్ర మణిబంధః. మణి.
మతంగజము
సం. నా. వా. అ. పుం. తత్స. మతంగాదృషేర్జాతో మతంగజః. మతంగుడును ఋషివలన పుట్టినది, ఏనుగు, గజము.
మతము
సం. నా. వా. అ. న. తత్స. అభిప్రాయము, సమ్మతి, శాస్త్రము. సం. విణ. తత్స. సమ్మతము, తెలియబడినది, పూజింపబడినది. (త్రిమతములు- వైష్ణవము, మాద్వము, స్మార్ధము), షణ్మతములు (వైష్ణవము, శైవము, శాక్తము, గాణపధము, సౌరము, కాపాలికము).
మతల్లిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మతల్లికాదయః పంచప్రశస్తవాచకాః. ప్రశస్తవాచకమ, మచ్చరిక, ప్రశస్తము.
మతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మన్యతే అనయేతి మతిః. దీనిచేత ఎఱుగబడును, శాస్త్రచింతనాదులచే కలుగు అర్ధ నిర్ణయజ్ఞానము, ఇచ్ఛ, తలపు, ఓంకారము, కోరిక, బుద్ధి.
మత్తకాశిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మధుపానం వినామత్తేవ ఇతి మత్తకాశినీ. మధుపానములేకఏమత్తురాలివలె ప్రకాశించునది. మదముచేత ప్రకాశించునట్టి ఆడుది, ఆడుది. మత్తేవ కాశతే భాతి మత్తకాశినీ. ఉత్తమ స్త్రీ, స్త్రీ.
మత్తము
సం. నా. వా. అ. పుం. తత్స. మాద్యతీతి మత్తః. మదించునది, మాద్యతి స్మమత్తః. హర్షించినవాడు, మదము పట్టినఏనుగు, త్రాగుబోతు.
మత్సరము
సం. నా. వా. అ. పుం. తత్స. మదేన సరతీతి మత్సరః. పరుని దుఃఖముచేత సంతోషించువాడు, ఈర్ష్య, క్రోధము, ఈర్ష్యకలది, క్రోధముకలది, అసూయ కలవాడు, అసూయ.
మత్స్యంది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మందం స్యం దత ఇతీ మత్స్యందీ. ఇంచుకంత కరగునది, కండచెక్కర. మదం మధురసం స్యందతే ఇతి మత్స్యండీ.
మత్స్యధాని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మత్స్యాః ధీయం తేత్రమత్స్యధానీ. మత్స్యములు దీనియందు వేయబడును, మీనబుట్ట, కువేణి.
మత్స్యపిత్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మత్స్యానాం పిత్తం జీవనం మత్స్యపిత్తా. మత్స్యములకు జీవనమైనది, కటుకరోహిణి.
మత్స్యబంధనము
సం. నా. వా. అ. న. తత్స. మత్స్యాః భద్యంతే అనేనమత్స్యబంధనం. మత్స్యములు దీనిచే బంధింపబడును, గాలము, బడిశము. మత్స్యానాం బంధనం మత్స్యబంధనం. జాలము.
మత్స్యము
సం. నా. వా. అ. పుం. తత్స. మాద్యతి మాంసజి ఘృక్షయా మత్స్యః మాంసమును హరించు ఇచ్ఛచేత హర్షించునది, చేప, ఒకానొక దేశము. మాద్యంతి లోకా అనేనేతి మత్స్యః. జలజంతువిశేషము, ఝషము, మీనము, అండజము, విసారము, శకలి, శంధలి, సంవరము, మూకము, ఆత్మాశి, కంటకి, శల్కి, మచ్ఛము, అనిమిషము, పన్నెండవ రాశి.
మత్స్యాక్షి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మత్స్యాక్షి తుల్య పుష్పత్వాన్మత్స్యాక్షీ. చేపకండ్లవంటి పువ్వులు కలది, పొన్నగంటికూర, సోమెదకూర, సోమలత, తోటకూర.
మథితము
సం. నా. వా. అ. న. తత్స. మథనమాత్ర నిష్పన్న త్వాన్మథితం. వరసగానాలవపాలునీళ్లుకలిసినమజ్జిగకును, సగమునీళ్లుకలిసినమజ్జిగకును, నీళ్లుకలియని మజ్జిగకును పేరు, నీళ్లుకలియని మజ్జిగ, త్రచ్ఛబడినది, ఒరయబడినది, తక్రము, మజ్జిగ.
మథ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విలంబితద్రుత యోర్మధ్యే భవత్వాన్మద్యం. విలంబిత ద్రుతముల యొక్క కూడుట యొక్క ఆరెంటినడుమనుండునది. మధ్యేభవం మద్యం. శరీరమునడుమపుట్టినది. మన్యత ఇతిమధ్యం. (ఉదయించి యౌవనముకలది, పదమూడేండ్లుమొదలు పదునెనిమిదేండ్లు పర్యంతమైనవయస్సుకలది). మధ్యకాలము, ఒకసంఖ్య, నడిమిచోటు, తలంపబడునది, ఒకఛందస్సు, యాంతర్భేద విశిష్టనాయికాలివిశేషము. అవకాశము, నడుము, మానమున అరత్ని ప్రమాణము హీనమైనఏనుగు, నడితరముది, నడిమిది.
మదకలము
సం. నా. వా. అ. పుం. తత్స. మదేన కలో మనోజ్ఞః మదకలః. మదము చేత మనోజ్ఞమైనది, మదపుటేనుగు. సం. విణ. తత్స. మత్తుచేత వ్యక్తము కాని మాటలు కలది, మదగజము.
మదనము
సం. నా. వా. అ. పుం. తత్స. మదయతీతి మదనః. మదింపచేయువాడు, మదయతీతి మదనః. హర్షింపచేయునది, ఆమని, ఉమ్మెత్త, మంగ, మలునము, పక్షి, రేల చెట్టు, ఒక ధాన్యము, మైనము, వసంత ఋతువు, మన్మథుడు.
మదము
సం. నా. వా. అ. పుం. తత్స. మాద్యతే నేనేతి మదః. దీనిచేత మదించును, ఏనుగును పీడించునది, మదనం మదః. మదించుట. మాద్యతే మదః. గర్వించుట, కొవ్వు, ఏనుగు కొవ్వు, రేతస్సు, ఏనుగు రేతస్సు, కస్తూరి, గర్వము, సంతోషము, (మూడు మదములు-విద్యామదము, ధన మదము, కులమదము) ఎనిమిది మదములు అన్న, అర్ధ, స్త్రీ, విద్యా, కుల, రూప, ఉద్యోగ, యవ్వన మదములు, మత్తు, సంతోషము, వీర్యము, ఏనుగుచెక్కెళ్లనుండి కారుజలము, హర్షము, ఆమోదము, ఒకానొక రోగము, మద్యము, క్షైవ్యము.
మదలకము
సం. నా. వా. అ. పుం. తత్స. మాద్యతే నేనేతిమదః. దీనిచేత మదించును, మదనం మాదః. మదించుట, మాద్యతే మదః మదపుటేనుగు.
మదస్థానము
సం. నా. వా. అ. న. తత్స. మదస్యస్థానం మదస్థానం. మదమునకు ఉనికి పట్టైనది, కల్లుత్రాగెడి ఇల్లు, కల్లంగడి.
మదావళము
సం. నా. వా. అ. పుం. తత్స. ఏనుగు, గజము. ?
మదిర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాద్యం త్యనయేతి మదిరా. దీనిచేత మదింతురు, సుర, మద్యము, కల్లు.
మదోత్కటము
సం. నా. వా. అ. పుం. తత్స. మదేన ఉత్కటో మదోత్కటః. మదముచేత వ్యాప్తమైనది, మదపుటేనుగు, కపోతము, పావురము, పుష్పాసవము.
మద్గురము
సం. నా. వా. అ. పుం. తత్స. జలేమజ్జతీతి మద్గురః. జలమందు మునిగి ఉండునది, బొమ్మిడాయ. మాద్యతి జలం ప్రాప్య హ్రష్యతీతి మద్గురః.
మద్గువు
సం. నా. ఉ. పుం. తత్స. మజ్జతీతి మద్గుః. జలవాయసము, నీరుకాకి, మత్స్యవిశేషము.
మద్యము
సం. నా. వా. అ. న. తత్స. మదస్య స్థానం మదస్థానం. మదమునకు ఉనికి పట్టైనది, కల్లు, సుర, కాదంబరి. మాద్యతి జనో అనేన మద్యం,సారాయి.
మధుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధుకరత్వేన మధుసమత్వాన్మధుకం. తీపుచేత తేనెకు సరియైనది. తిప్పతీగ, మధురము, ఇప్ప నెమిలి, వంశావళి చదువువాడు, ఒక సంకరజాతి, వైతాళికుడు, ప్రాతతేనె, తీపి, కారము, ఉప్పు కలిసినది.
మధుకరము
సం. నా. వా. అ. న. తత్స. మధుకరోతీతి మధుకరః. పూతేనేను చేయునది, భిక్షాన్నము, తుమ్మెద, జీవకము.
మధుక్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. మధునః క్రమాః మధుక్రమాః. మద్యపానము యొక్క వనరులు, మద్యపానక్రమము, ఎడతెగని పానము.
మధుద్రుమము
సం. నా. వా. అ. పుం. తత్స. మధుప్రదానో ద్రుమః మధుద్రుమః. మద్యమే ప్రధానముగాకల వృక్షము, ఇప్ప.
మధుపము
సం. నా. వా. అ. పుం. తత్స. మధుపిబతీతి మధుపః. పద్మాదుల నుఅలంకరించునది, తుమ్మెద, తేనెతిండి, మద్యపానము చేయునది.
మధుపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మధూని స్వాదూని పర్ణాన్యస్య మధుపర్ణికా. తియ్యనైన ఆకులుకలది. మధుమాసే పర్ణాన్యస్యాః మధుపర్ణికా. చైత్రమాసమందు పర్ణమలుకలది, గుమ్ముడు, తిప్పతీగ, నీలిచెట్టు, విశల్యలత.
మధుయష్టికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధునా తుల్యా యష్టిర్మదు యష్టికా. తేనెతో సరియైనది, అతిమధురము.
మధుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కటుతికత్తరసత్వేపి విరుద్ధలక్షణయా మధురా. కారము చేదు నైనను విరుద్ధలక్షణము చేత మధురము అనబడును, ఒక పట్టణము, సదాప (వృక్షవిశేషము). సం. నా. వా. . పుం. తత్స. తియ్యన, కంఠమాధుర్యము, అందమైనది. సం. విణ. తత్స. తియ్యనిది, ఇంపైనది. సం. నా. వా. అ. న. తత్స. విషము.
మధుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధుమాధురస్యమ స్యాస్తీతి మధురః. మాధుర్యము కలిగినది, ఒక పట్టణము, సదాప, అడవిసదాప విషము, తియ్యనిది, ఇంపైనది, అతిమధురము, కంఠమాధుర్యము, పుల్లని గంజి, తీపి, తీపికలది, అందమైనది.
మధురస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధురస్యోస్యా అస్త్రీ తీమధురసా. మధురమైన రసముకలది. మధురసయోగాన్మధురసా. మాధుర్యముకలది, ద్రాక్ష, చాగ, పిన్నపాల.
మధురిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధుర రసయోగాన్మధురికా. మధురసము కలది, అడవి సదాప (వృక్ష విశేషము).
మధురిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధురత్వాన్మధురికః. మధురమైన రసముకలది మధురసయోగాన్మధురసా. మాధుర్యము కలది, ద్రాక్ష, చాగ, పిన్నపాల.
మధురిపుడు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మదోరసురస్యరిపుః మధురిపుః. మధువనెడి రాక్షసునికి శత్రువు, విష్ణువు, శౌరి, వెన్నుడు.
మధులిహము
సం. నా. వా. హ్. పుం. తత్స. మధులేఢీతి మధులిట్. పూతేనెను, ఆస్వాదించునది, తుమ్మెద, తేనెతిండి.
మధువారము
సం. నా. వా. అ. పుం. తత్స. మధునోమద్యపానస్యవారాః మధువారాః.మద్యపానము యొక్క వరుసలు, మద్యపానక్రమము, కల్లు ఎడతెగక త్రాగుట.
మధువ్రతము
సం. నా. వా. అ. పుం. తత్స. మధుపుష్పరసం వ్రతయతి భుజ్త్కేమధువ్రతః. పూదేనెను భుజించునది, తుమ్మెద, భృంగము. మధు మధుసంచయో వ్రతం వ్రతమివ సతతానుశీలనీయం యస్య మధువ్రతః. భ్రమరము.
మధుశిగ్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మధుప్రధానశ్శిగ్రుః మధుశిగ్రుః. తేనె ప్రధానమైయుండెడు మునగ, ఎఱ్ఱపువ్వులమునగ, ఎఱ్ఱమునగ.
మధుశ్రేణి
సం. నా. వా. ఈ. స్త్రీ తత్స. మధునః శ్రేణిః పంక్తిః అస్యాః మధుశ్రేణి. తేనె మొక్క పంక్తిగలది, చాగ, ఒక సంకరజాతి.
మధుష్ఠీలము
సం. నా. వా. అ. పుం. తత్స. మధుష్ఠీవతీతి మధుష్ఠీవః. తేనెను స్రవించునది, ఇప్ప.
మధుస్రవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధుస్రవతీతి మధుస్రవా. పాలకూర.
మధూకము
సం. నా. వా. అ. పుం. తత్స. మధురసః ఉచ్యతే యుజ్యతే అత్రేతి మధూకః దీనియందు తేనెకూర్చబడును, ఇప్ప.
మధూలకము
సం. నా. వా. అ. పుం. తత్స. మధు ఉల తీతి మధూలకః. తేనెను కప్పుకొని యుండునది, నీరిప్ప, కొండయిప్ప, తీపి, తీయనిది, మద్యము.
మధూలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధు అస్యా అస్తీతి మధూలికా. తేనెకలది, పుప్పొడి, చాగ, కారము, తీపి, వగరు కలిసినది.
మధ్యదేశము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రత్యగేవ ప్రయాగాచ్ఛ మధ్యదేశస్స ఉచ్యతే. మధ్యదేశము, భారతవర్షము నడిమి దేశము, ఒక దేశము.
మధ్యమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మధ్యే వయసి తిష్ఠతీతి మధ్యమా. మద్యమ వయస్సు నందు ఉండునది, దుద్దు, వాగ్భేదము, నడిమివ్రేలు, కొత్తగా సమర్తాడిన పడుచు. మధ్యేభవా మధ్యమా. నడుమ ఉండునది, మధ్యకాలము, నడిమిచోటు, తగినది, ఒక సంఖ్య, కర్ణిక, అంగుళీభేదము.
మధ్యమము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వరాణాం మధ్యస్థిత త్వాద్వామధ్యమః. సప్తస్వరములయొక్కమద్యమునందుండునది, మధ్యేభవత్వాత్ మధ్యమః. హిమవద్వింధ్యగిరులయొక్కయు, వినశనప్రయాగల యొక్కయ మధ్యమదుండునది. మధ్యేభవం మధ్యమం. శరీరమునడుమ పుట్టినది, దుద్దు, వాగ్భేదము, నడిమివ్రేలు, కొత్తగా సమర్తాడినది, నడుము, కురుక్షేత్రప్రయాగ హిమద్రి వింధ్యములకు నడుమనున్నదేశము, ఒకస్వరము, నడిమిది, సప్తస్వరములలో ఒకటి, నట్టనడుమది.
మధ్యాసవము
సం. నా. వా. అ. పుం. తత్స. మధునామధుపుష్పేణ కృతః ఆసవోమధ్యాసవః. ఇప్పపువ్వు చేత చేయబడినకల్లు, ఇప్పపువ్వుకల్లు, పుష్పాసవము.
మధ్యాహ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. అహ్నః మధ్యోభాగః మధ్యౌహ్నః. అహస్సు యొక్కమధ్య భాగము, పట్టపగలు, సూర్యుడు నడి నెత్తికి వచ్చు కాలము.
మనశ్శిల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మనశబ్ద వాచ్యాశిలా మనశ్శిలా. మనశ్శబ్దము చేత చెప్పతగినశిల, మణిశిల, పసుపు.
మనసిజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మనసి జాయత ఇతి మనసిజః. మనస్సు నందు పుట్టినవాడు, మన్మథుడు, తలపుచూలి, కామదేవుడు.
మనస్కారము
సం. నా. వా. అ. పుం. తత్స. మనసః కారో నిశ్చయః మనస్కారః. మనస్సు యొక్క నిశ్చయము, మనః ప్రయత్నము, మనః పూర్తి. మనస్సంతుష్టి.
మనస్సు
సం. నా. వా. స్. న. తత్స. మన్యతే అనేనేతి మనసం. దీనిచేత నెఱుగబడును కనుక, మానసము (మొదటిరూపము మనస్సు) ఇష్టము. మన్యతే బుధ్యతే అనేనేతి మనః. చిత్తము, హృదయము, స్వాంతము.
మనితము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. మన్యతే స్మ మనితం. ఎరుగబడినది, తెలియబడినది.
మనీష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మనుతే మనీషా. అన్నింటిని తెలుసుకొనునది, బుద్ధి, మతి, ప్రజ్ఞ, ధిషణ, స్తుతి.
మనీషి
సం. నా. వా. న్. పుం. తత్స. మనీషా స్యాస్తీతి మనీషీ. బుద్ధికలవాడు, విద్వాంసుడు. సం. విణ. తత్స. బుద్దిమంతుడు, పండితుడు.
మనుజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మనోర్జాతామనుజాః. మనువు వలన పుట్టినవారు, మనుష్యుడు, మానిసె. మనోజతి ఇతి మనుజః. మానవుడు.
మనుష్యకము
సం. నా. వా. అ. న. తత్స. మనుష్యాణాం సమూహో మానుష్యకం. మనుష్యుల యొక్క సమూహము, మనుష్యుల గుంపు.
మనుష్యధర్ముడు
సం. నా. వా. న్. పుం. తత్స. మనుష్యాణాం ధర్మ ఇవధర్మః ఆచారోయస్యసః మనుష్యధర్మః. మనుష్యులయొక్క ఆచారమువంటి ఆచారముకలవాడు కుబేరుడు. మనుష్యస్యేవ ధర్మ ఆచారో యస్య మనుష్యధర్మా. కుబేరుడు.
మనుష్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మనోర పత్యాని మనుష్యాః. మనువు కొడుకులు, మనుజుడు, మానిసి, మానుషుడు, మర్త్యుడు, మానవుడు, నరుడు, భూమిజుడు, ద్విపద, చేతనుడు, పంచజనుడు, పురుషుడు, పూరుషుడు, మర్ణుడు, కుబేరుడు.
మనోగుప్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మనశ్శబ్దేన గోప్యత ఇతి మనోగుప్తా. మనశ్శబ్దముచేత రక్షింపబడునది, మణిసిల.
మనోజవసుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మనోజవాః మనోజకః. తండ్రినిపోలువాడు.
మనోజ్ఞము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మనసాజ్ఞేయం మనోజ్ఞం. మనసు చేత ఎఱుగతగినది, సుందరము, మనోహరము.
మనోరథము
సం. నా. వా. అ. పుం. తత్స. మనఏవరధోయస్యస మనోరథః. మనస్సేరథముగాకలిగినది, ఇచ్ఛ, కోరిక. మనసః రథ ఇవ మనోరథః. కవివిశేషము.
మనోహతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మనసి ప్రతి హన్యతే స్మ ప్రతిహతః. మనస్సునందలి ఉత్సాహము చెడినవాడు, మనసుచెడినవాడు.
మనోహరము
సం. నా. వా. అ. న. తత్స. మనోహరతీతి మనోహరం. మనస్సునిహరించునది, బంగారు, భక్ష్యవిశేషము, మనోజ్ఞము, ఇంపైనది.
మనోహ్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మనశ్శబ్దేన హూయత ఇతి మనోహ్వ. మనశ్శబ్దము చేత రక్షింపబడునది, మణిసిల.
మన్మథుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః. బుద్ధిని కలియపెట్టువాడు. ఫలైః మనో బధ్నాతీతి మన్మథః. ఫలములచే మనస్సును కలగించునది, మరుడు, మారుడు. మనో మధ్నాతి వికరోతీతి మన్మథః. పంచబాణము చేత మనస్సులో కామాన్ని పుట్టించువాడు, మన్మథుడు, మదనుడు, వెలగ.
మన్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మన్యత ఇతి మన్యా. ఎఱుగబడినది, పెడతలయుందుండు నరము. మన్యతే న్యాయతే స్థంభదుఃఖాదికం అనయా ఇతి మన్యా, అంకుశముయొక్కమద్యభాగము, మెడ కండరము.
మన్యువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మన్యతే అనేనేతి మన్యుః. దీనిచేత ఎరుగబడును, మన్యత ఇతి మన్యుః. క్రోధము, శోకము, దైన్యము, యజ్ఞము, దుఃఖము, పేదరికము.
మన్వంతరము
సం. నా. వా. అ. న. తత్స. దివ్యానాం యుగానా మేక సప్తతిర్మ న్వంతరం. ముందు చెప్పిన దేవయుగములు. డెబ్బై యొక్క దివ్యయుగములు, మనుకాలమధ్యచరితము. కల్పములో పద్నాల్గవ భాగము.
మయము
సం. నా. వా. అ. పుం. తత్స. మయతి దూరం గచ్ఛతీతి మయః. దూరముగా పోవునది, ఒంటె, కంచరగాడిద. మయతే దృతం గచ్ఛతీతి మయః. వేగముగా పోవునది.
మయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మయతే వినిమయత ఇతిమయుః. కామరూపి కనుక రూపవినిమయము చేసుకొనువాడు, అసుర శిల్పి, రాక్షస శిల్పి.
మయూఖము
సం. నా. వా. అ. పుం. తత్స. మినోతి ప్రక్షి పత్యంధకారమితి మయూఖః. అంధకారమును పోగొట్టునది, కిరణము, కాంతి, జ్వాల. మాపయన్ గగనం ప్రమాణయన్ ఓఖతి గచ్ఛతి ఇతి మయూఖః. సూర్యకిరణము.
మయూరకము
సం. నా. వా. అ. పుం. తత్స. మయూర చూడా ప్రతికృతిత్వాత్ మయూరకః. నెమలిచుంచునకు ప్రతికృతియైనది. అ. న. మయూర సదృశత్వాత్ మయూరకం. నెమలివంటి వర్ణము కలది, మయిలు తుత్తము, ఉత్తరేణు.
మయూరము
సం. నా. వా. అ. పుం. తత్స. కేన జలేన రౌతి కరవః మయూరః. ఉదకము చేత కూయునది. మినాతి సర్పాన్ మయూరః. సర్పములను హింసించునది, నెమలి, నెమలి జుట్టు, ఓమము, ఉత్తరేను. మయురివ రౌతి శబ్దాయతే ఇతి మయూరః.
మరకతము
సం. నా. వా. అ. న. తత్స. మరం మరణం తకత్యనేనేతి మరకతం. విషహరమైనది కనుక దీనిచేత మరణమును గెలుతురు, పచ్చఱాయి, గారుత్మతము. మరకం మారిభయం తరంత్యనేన ఇతి మరకతం, ఒక మాణిక్యము.
మరణము
సం. నా. వా. అ. న. తత్స. మ్రియతే మరణం. చచ్చుట, చావు, మృతి. మ్రియతే అనేనేతి మరణం. కాలధర్మము, ప్రళయము, నాశము, మృత్యువు, మహానిద్ర.
మరీచము
సం. నా. వా. అ. న. తత్స. మ్రియతే వ్యథతే జిహ్వగ్రమనేనేతి మరీచం. జిహ్వగ్రము దీనిచేత వ్యథపడును, మరీచము యొక్క రూపాంతరము, మిరియము.
మరీచి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మ్రియంతే క్షుద్రజంతవస్తమాంసి వా అనేనేతి మరీచిః. దీనిచేత క్షుద్రజంతువులుకాని, అంధకారముకాని నశించును, కిరణము, ఒక ఋషి. సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మ్రియంతే ఇవ దేవాః యద్దర్శనాదితి మరీచిః.
మరీచిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మ్రియంతే అనయా క్షుద్ర జంతో మృగావా మరీచికా. క్షుద్రజంతువులైనను, మృగములైనను దీని చేత మృతి చెందును. ఎండమావులు, మృగతృష్ణ, ఎనిమిదిత్రసరేణువులు.
మరుత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. మ్రియతే అనేనేతిమరుత్. ప్రాణత్యాగే. కుపితేన అనేన మ్రియతే లోక ఇతి మరుత్. కుపితుడైన యితని చేత లోకము మృతి పొందింపబడును, పిక్కచెట్టు, దేవత, వాయువు, ఒకతీగ.
మరుత్వంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. మరుతోదేవాః అస్యసంతీతి మరుత్వాత్. దేవతలుకలవాడు, ఇంద్రుడు. మరుతో దేవాః పాలనీయత్వేన సంత్యస్య ఇతి మరుత్వాన్.
మరున్మాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మరుతః మాలా అస్యా ఇతి మరున్మాలా. వాయుపంక్తికలది, పిక్క, ఒక తీగ.
మరువకము
సం. నా. వా. అ. పుం. తత్స. విషపుష్పత్వాత్ మ్రియంతేనేన మరువకః. విషపుష్పము కనుక జనులు దీనిచేత మృత్యులౌదురు. మరౌ దేశే వాతి వర్తత ఇతి మరువకః. నిర్జల భూమి యందు వర్తించునది, మరువము, మంగ.
మరువు
సం. నా. వా. అ. పుం. తత్స. తృష్ణయా మ్రియన్తేత్ర మరుః. దప్పి చేత దీని యందు మృతులగుదురు, నీళ్లులేని భూమి, మ్రియంతేస్మిన్నితి మరుః. నిర్జల ప్రదేశము, పర్వతము, నీళ్ళులేనటువంటి ప్రదేశము.
మర్కటము
సం. నా. వా. అ. పుం. తత్స. మర్కతి గచ్ఛతీతి మర్కటః. పోవునది, కోతి, సాలెపురుగు, వానరుడు, కోతి ఆకారమున ఉన్నగడియ.
మర్కటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మర్కట వర్ణత్వా న్మర్కటీ. కోతి వన్నెకలది, తీగగానుగ, దూలగొండి.
మర్త్యము
సం. నా. వా. అ. పుం. తత్స. మర్తోభూలోకః తత్రభవాః మర్త్యాః. భూలోకమున పుట్టినవారు, భూలోకము. మ్రియంతే అత్రేతి మర్తో భూలోకస్తత్ర భవః ఇతి మర్త్యః. మనుషి, నరుడు, పురుషుడు, మానవుడు, మానుషుడు, మనుజుడు.
మర్దనము
సం. నా. వా. అ. న. తత్స. సంవాహనం సంవహనే భారాదేరంగమర్ధనే. ఒడలు పిసుకుట, సంవాహనము, నూఱుట, చూర్ణము. మర్దో మర్దనం. పిసుకుట, రుద్దుట.
మర్దలము
సం. నా. వా. అ. పుం. తత్స. మృద్యత ఇతి మర్ధళః. మర్ధింపబడునది, మద్దెల.
మర్మము
సం. నా. వా. న్. న. తత్స. జీవస్థానము, కిటుకు.
మర్మరము
సం. నా. వా. అ. పుం. తత్స. మర్మరధ్వని రత్రాస్తీతి మర్మరః. దీనియందు మరమర అనెడు ధ్వనికలదు. చొక్కా, వస్త్రముల యొక్క మ్రోత, పెళపెళ. మర్మ తత్వం మమత్యవ్యక్తశబ్దం వా రాతీతి మర్మరః. బరబర ధ్వని.
మర్మస్పృక్కు
సం. విణ. (శ్. ఈ. శ్). తత్స. మర్మాణి స్పృశతీతి మర్మస్పృశ్. ఆయములను సోకునది, మర్మమును తాకునది, తీవ్రము.
మర్యాద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మర్యేతి సీమార్ధేవ్యయం తత్రదీయత ఇతి మర్యాదా. హద్దు, పొలిమేర, తీరము, కట్టుపాటు, సమ్మానము, క్రమపద్దతి, సముద్రపు ఒడ్డు, మర్య అనగా సీమ అందు ఇయ్యబడినది మర్యాద.
మలపువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. మలాత్ శ్విత్రా దికాత్ పునాతీతి మలపూః. శ్విత్రము మొదలైన కల్మషములనుండి శుద్ధిచేయునది, కుక్కమేడి.
మలము
సం. నా. వా. అ. పుం. తత్స. మలతే ధారయతి దేహం ఇతి మలః. దేహమును ధరించునది. మల్యత ఇతి మలః. ధరింపబడునది, విష్ఠ (ద్వాదశమలములు, వస, శుక్లము, రక్తము, మజ్జము, మూత్రము, విష్ఠ, పింజూషము, నఖము, శ్లేష్మము, అశ్రువు, దూషిక, స్వేదము) (జిహ్వమలము, కులుకము, దంతమలము, పిప్పిక) కిట్టము, దోషము.మృజ్యతే శోధ్యతే ఇతి మలః. ఒక రకపుకంచు సంకరాతి, తేలుకొండె, పురీషము, మడ్డి.
మలయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఒక కొండ, ఆరామము, ఒక దేశము, ఒక పర్వతము, కొండచరియ, తోక.
మలయజము
సం. నా. వా. అ. పుం. తత్స. మలయశైలే జాతః మలయజః. మలయ పర్వతమునందు పుట్టినది, చందనవృక్షము, చందనము. మలయే జాతమితి మలయజం.
మలినము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మలమస్యాస్తీతి మలినం. ముఱికి కలిగినది, మాసినది, నల్లనిది, దూషితమైనది, మలతే ధారయతీతి మలినం, నీరు.
మలిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మలిన మార్తవ మస్యా ఇతి మలినీ. మలినము అనగా ఆర్తవము, అది దీనియందుకలదు, ముట్టది, ఋతుమతి, రజస్వల.
మలిమ్లుచము
సం. నా. వా. అ. పుం. తత్స. మలినం యథా తథా మ్లోచతి గచ్ఛతీతి మలిమ్లుచః. మలినముగాచరించువాడు, దోమ, మలమాసము, దొంగ, అగ్ని, పంచ మహాయజ్ఞములు చేయనివాడు.
మలీమసము
సం. నా. వా. విణ. తత్స. మలమస్యాస్తీతి మలీమసం. మురికి కలిగినది, మాసినది, మలీనుడు.
మల్లకము
సం. నా. వా. అ. పుం. ఆ. స్త్రీ. తత్స. దీపపు ప్రమిద, గ్రద్ద.
మల్లము
సం. నా. వా. అ. పుం. తత్స. మల్ల, ఒకసంకరజాతి, పిండివండుట, పల్లు.
మల్లిక
సం. నా. వా. అ. పుం. తత్స. మల్యతే ధార్యతే అసన్ ఇతి మల్లికః మూసినముక్కు కాళ్లుగల తెల్లహంస.
మసీ
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. కాగితము, వ్రాసేడు కాటుక, పెద్దసదాప చెట్టు..
మసూర విదళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మసూర ఇవ విదళా మసూర విదళా. చిరు శెనగల వలె వ్రక్కలై ఉండునది. నల్ల వన్నె చేత చెప్పబడునది, నల్లతెగడ.
మసూర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మస్యతి పరిణమతి మసూరః. పరిపక్వమగునది, వేశ్య, స్త్రీ, ఒకజాతి శెనగ.
మసృణ
సం. నా. వా. విణ. తత్స. మస్యతి ద్రవత్వేన పరిణమతీతి మసృణం. ద్రవముగా పరిణమించునది, చిక్కనిది, నున్ననిది, నల్ల అగిసె, మెత్తనిది.
మస్కరము
సం. నా. వా. అ. పుం. తత్స. మా క్రియతే ప్రతిషిధ్యతే. అనేనేతి మస్కరః. దీనిచేత ప్రతిషేధించబడును, వెదురు, వేణువు. మస్కతే గచ్ఛత్యనేనేతి మస్కరః.
మస్కరి
సం. నా. వా. న్. పుం. తత్స. మస్కరో వేణు దండః సోస్యాస్తీతి మస్కరీ. వెదురుగడ. మా కరణశీలః కామకర్మ ప్రతిషేధపరోవా మస్కరీ. కామ్యకర్మములను ప్రతిషేధించు స్వభావం కలవాడు, సన్న్యాసి, భిక్షుకుడు. మస్కతే ఇతస్తతో గచ్ఛత్యనేనేతి మస్కరీ.
మస్తిష్కము
సం. నా. వా. అ. న. తత్స. మస్తం శిరోదేశ మిష్యతి మస్తిష్కం. శిరస్సును పొంది ఉండునది, తలమెదడు.
మస్తువు
సం. నా. వా. ఉ. న. తత్స. మస్యతి పరిమణతీతి మస్తు. పులుసై పరిణమించునది, పెరుగు మీద మీగడ,తేట.
మహతీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహ్యత ఇతి మహతీ. పూజింపబడునది, నూరు తంతులుకల నారదుని వీణ, గొప్పది, తెలుగు వ్యాకరణమున తిర్యగితర స్త్రీ వాచక శబ్దములకు సంజ్ఞ, ఒక తీగ.
మహత్తు
సం. నా. వా. త్. న. తత్స. మహ్యతే పూజ్యత ఇతి మహత్. పూజింపబడునది, దొరతనము, ఒక సాంఖ్య తత్త్వము, ఒక లోకము, రాజ్యము, గొప్పది, నీరు మొదలైనవి.
మహము
సం. నా. వా. అ. పుం. తత్స. మహ్యత ఇతి మహః. పూజింపబడునది, ఉత్సవము, తేజము, శోభ.
మహము
సం. నా. వా. అ. పుం. తత్స. మహ్యతే జనైరితి మహః. జనుల చేత పూజింపబడును, ఉత్సవము, తేజము. మహ్యతే పూజ్యతే అస్మిన్నితి మహః.
మహాంగము
సం. నా. వా. అ. పుం. తత్స. మహాంగన్యౌ అస్యేతి మహాంగః. ఘనమైన అంగములు కలది, ఒంటె, క్రమేలకము.
మహాకందము
సం. నా. వా. అ. పుం. తత్స. మహాన్ కందోస్య మహాకందః. పెద్ద గడ్డలు కలది, వెల్లుల్లి, దురదకంద, (వృక్ష విశేషము), శొంఠి.
మహాకాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహాంశ్చాసో కాలశ్చేతి మహాకాలః. శివుడు, ఒక శివభటుడు, మహాదేవుడు, మహేశ్వరుడు, శంకరుడు, ఉమాపతి, ఈశ్వరుడు, బాణాసురుడు.
మహాకులుడు
సం. నా. వా. విణ. (అ.ఆ.అ). తత్స. మహాకులే జాతో మహాకులః. మహాకులము నందు పుట్టినవాడు, గొప్ప కులము నందు పుట్టినవాడు, కులీనుడు.
మహాజాలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహాజ్జాలం వితాన మస్యా ఇతి మహాజాలీ. మహతైన విస్తారము కలది, పచ్చని పువ్వులుకల ఆవడ. (వృక్ష విశేషము), ఒకజాతి బీర, పెట్లుప్పు.
మహాదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహాం శ్చాసౌ దేవశ్చ మహాదేవః. శ్రేష్ఠుండైన దేవుడు, శివుడు, ముక్కంటి.
మహాధనము
సం. నా. వా. అ. న. తత్స. మహాధన మత్రాస్తి మహాధనం. అధికమైన ధనము కలిగినది, చిల్లమడ్డి, బంగారు, కృషి, గొప్పవెలకలవస్త్రము, గొప్పవెలకల వస్తువు, గొప్పవెలకలది, అమూల్యమగు వస్త్రము.
మహానటుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శివుడు, ముక్కంటి.
మహానసనము
సం. నా. వా. అ. న. తత్స. మహత్ అనః ఉపకరణమస్య మహానసనం. అధికమైన ఉపకరణము కలిగినది, పాకస్థానము, వంటి ఇల్లు.
మహాపద్మము
సం. నా. వా. అ. పుం. తత్స. మహాంశ్చాసౌ పద్మశ్చ మహాపద్మః. గొప్పదైన పద్మము, ఒక నిది, సంఖ్యా విశేషము, దేవయోనిసర్ప విశేషము, ఒకజాతిదుంప, ఒకజాతిపాము, తామర.
మహామాత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహానతిమాత్రః పరిచ్ఛదః యేషాం తే మహామాత్రాః. అధికమైన సేన కలవారు, కార్యసహాయుడు, మావటిదొర, సంపన్నుడు. మహతీ మాత్రా మర్యాదా పరిమాణం యస్య సః మహామాత్రః.
మహారజతము
సం. నా. వా. అ. న. తత్స. రజ్యతేత్రా మ్రాదికమనేనేతి రజతం, మహచ్చ తద్రజతం చ మహారజతం. తామ్రము మొదలైనది దీని చేత రంజింపబడును, స్వర్ణము, బంగారు.
మహారజనము
సం. నా. వా. అ. పుం. తత్స. మహచ్చ తత్ రజనం చ మహారజనం. దీని చేత వస్త్రాదులు ఎరుపు అగును కనుక రజనము, కుసుమ పువ్వు, బంగారు. రజ్యతే అనేనేతి మహారజనం. మహచ్చ తద్రజనం చేతి మహారజనం.
మహారణ్యము
సం. నా. వా. అ. న. తత్స. మహదరణ్యం మహారణ్యం. మహతైన అరణ్యము, గొప్ప అడవి, పేరడవి, పెద్ద అడవి.
మహారాజకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహతీ రాజిః పంక్తిర్వేషాంతే మహారాజికాః అధికమైన పంక్తి కలవారు, గణదేవత విశేషము, నాటకములోని రాజు, గోరు, రక్షకుడు.
మహారౌరవము
సం. నా. వా. అ. పుం. తత్స. మహాన్ రౌరః రవః అత్రేతి మహారౌరవః. మిక్కిలి భయం కరమైన ధ్వని కలిగినది, నరకభేదము.
మహాశయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహా నాశయో మనో యస్య స మహాశయః. ఘనమైన మనస్సు కలవాడు, సముద్రుడు, గొప్ప అభిప్రాయము కలవాడు, ఉదారుడు.
మహాశూద్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహా శూద్రస్య భార్యా తజ్జాతీయా వా మహా శూద్రీ. గొల్లవాని భార్య, గొల్లది.
మహాశ్వేతా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. క్షీరతః శ్వేత త్వాత్ మహాశ్వేతా. పాల చేత మిక్కిలి తెల్లదై ఉండునది, నల్ల నేలగుమ్మడు, యష్టి మధుకము.
మహాసహా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మహా రోగాన్ సహత ఇతి మహాసహా. మహారోగములను సహించునది, కారుమినుము (వృక్ష విశేషము) మహతీం పీడాం సంమర్ధం సహతే మహాసహా. అధికమైన సంమర్ధమును సహించునది, గొజ్జంగ, పెద్ద గోరింట. (వృక్ష విశేషము), ఒక లత, మాషపర్ణి.
మహాసేనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహతీ సేనా యస్యసః మహాసేనః. గొప్ప దండు కలవాడు, కుమార స్వామి, గొప్పసేనకలవాడు.
మహిమా
సం. నా. వా. న్. పుం. తత్స. మహత్త్వేన మహిమా. అష్ట ఐశ్వర్యములు, గొప్పతనము, ఒక ఐశ్వర్యము.
మహిళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మహ్యత ఇతి మహిళా. ఆదరింపబడునది, స్త్రీ, ఆడది, ప్రేంకణము. (వృక్ష విశేషము).
మహిషము
సం. నా. వా. అ. పుం. తత్స. మహ్యత ఇతి మహిషః. ఎనుబోతు, దున్న, ఒకసంకరజాతి.
మహిషి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహ్యతే పూజ్యత ఇతి మహిషీ. పూజింపబడునది, రాజు పుట్టపు దేవి పేరు, ఎనుము, ఒకానొక చెట్టు. మహిషస్య కృతాభిషేకస్య నృపస్య పత్నీ మహిషీ. పుష్య పూర్ణిమ, పట్టపురాణి, గేదె.
మహీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహ్యతే ఇతి మహీ. పూజింపబడునది, భూమి, ఆవు, లోకము.
మహీక్షితుడు
సం. నా. వా. త్. పుం. తత్స. మహీం క్షియత అధివసతి మహీక్షిత్. జనులను, భూమిని రక్షించువాడు రాజు. ఱేడు.
మహీధ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. మహీం కీలభూతో ధరతీతి మహీధ్రః. భూమిని చీలవలె నుండి ధరించునది, కొండ, పుడమి తాలుపు.
మహీరుహము
సం. నా. వా. అ. పుం. తత్స. మహ్యాం రోహతీతి మహీరుహః. భూమి యందు మొలచునది, వృక్షము, పుడమిపుట్టు.
మహీలత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మహ్యాం లతేవ తిష్ఠతీతి మహీలతా. భూమి యందు లత వలె ఉండునది, ఎఱ్ఱ, గండూపదము.
మహీసుతడు
సం. నా. వా. ఆ. స్త్రీ. అ. పుం. తత్స. మహ్యాః సుతః మహీసుతః. భూమి కొడుకు, అంగారకుడు, నరకాసురుడు, సీత.
మహేచ్ఛుడు
సం. నా. వా. విణ. (అ.ఆ.అ). తత్స. మహతీ ఇచ్ఛా యస్య మహేచ్ఛః. ఘనమైన ఇచ్ఛ కలవాడు, గొప్ప అభిప్రాయము కలవాడు, మహాశయము, మహోత్సాహము, ఉదాత్తము, మహాత్మ, ఉదారము.
మహేరణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మహత్ ఈరణం ప్రేరణం గజనాం భక్షణే అస్యా ఇతి మహేరణా. ఏనుగులకు భక్షనార్ధమైన మహత్తైన ప్రేరణము దీని యెడ కలదు, అందుగు, సల్లకి (వృక్ష విశేషము).
మహేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మహాంశ్చాసా వీశ్వరశ్చ మహేశ్వరః. శివుడు, గొప్ప ప్రభువు, గుగ్గిలము.
మహోక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. మహాంశ్చాసా వుక్షా చమహోక్షః. దొడ్డఎద్దు, ఆంబోతు.
మహోత్పలము
సం. నా. వా. అ. న. తత్స. మహచ్చ తత్ ఉత్పలం చ మహోత్పలం. మహత్తైన ఉత్పలము, వేయిరేకులు కలది, తామర, పద్మము, కమలము.
మహోత్సాహుడు
సం. నా. వా. విణ. (అ.ఆ.అ). తత్స. మహానుత్సాహో యస్య మహోత్సాహః. ఎక్కువ వేడుక కలవాడు, అద్భుత కార్యారంభము కలవాడు.
మహోద్యముడు
సం. నా. వా. విణ. (అ.ఆ.అ). తత్స. మహా నుద్యమో యస్య మహోద్యమః. ఘనమైన ఉద్యోగము కలవాడు, మహోత్సాహుడు.
మహౌషధము
సం. నా. వా. అ. న. తత్స. మహచ్చ తత్ ఔషధం మహౌషదం. గొప్ప ఔషధము,అతివస, వెల్లుల్లి, సొంటి, ఒక జాతి ఉల్లి.
మా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లోకానాం మాతా మా. ఎల్లలోకములకు తల్లి, లక్ష్మీ. మాతి పరిమాతి అదృష్టం ధనదానాయ ఇతి మా. మాత, నిషేధార్ధక వ్యయము.
మాంసము
సం. నా. వా. అ. న. తత్స. మన్యతే బలకరమితి మాంసం. బలమైనది అని తెలుపబడినది, నంజుడు, పలము.
మాంసలుడు
సం. నా. వా. విణ. (అ.ఆ.అ). తత్స. బహు మాంసమస్యా స్తీతి మాంసలః. బహు మాంసము కలవాడు, బలిసినవాడు, బలిమికలవాడు.
మాంసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మాంససామ్యావయవత్వా న్మాంసీ. మాంసము వంటి అవయము కలది, జటామాంసి, కారుకొల్లి. (వృక్ష విశేషము).
మాంసికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మాంసం పణ్యమస్య మాంసికః. మాంసము అమ్మేవాడు, మృగ పక్ష్యాదుల మాంసము విక్రియంచి జీవించువాడు, కౌటికుడు, కసాయివాడు.
మాక్షికము
సం. నా. వా. అ. న. తత్స. మక్షికాభిః కృతం మాక్షికం. తైల వర్ణముకల తేనె, అగ్నిశిల, తేనె.
మాగధి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మగధ దేశే ప్రచురా మాగధీ. మగధ దేశము నందు ప్రచురమైనది, అడవి మొల్ల, పిప్పలి (వృక్ష విశేషము), షడ్విధ ప్రాకృత భాషలలో ఒకటి. మగధే జాతా స్త్రీ మాగధీ, పెద్దపొట్ట. మగధ దేశే భవ మాగధీ. మగధ దేశమందు పుట్టినది.
మాగధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మగధ దేశే ప్రాయేణ భవన్తి తిష్ఠన్తీతి మాగధాః. మగధ దేశమందు తరచుగా ఉండువారు, వంశవీర్యాదులను పొగడింప జీవించువాడు. మగధస్య తత్ వంశస్యాపత్యం పుమాన్ మాగధః. మగధ్యంతి స్తువంతి మాగధాః. వంశములను స్తోత్రము చేయువారు, ఒక సంకరజాతి, అంగడి వీధిలోని, విషయములు రాజుకు తెలుపువాడు, చిత్రకారుడు, స్తుతిపాఠకుడు, జీలకఱ్ఱ.
మాఘము
సం. నా. వా. అ. పుం. తత్స. మా అవిద్య మానం అఘం అస్మిన్నితి మాఘః. దీని యందు పాపము లేదు కనుక మాఘము, మాఘ మాసము పేర్లు, ఒక మాసము, ఒక కవి.
మాఘ్యము
సం. నా. వా. అ. న. తత్స. మాఘే మాసి భవం మాఘ్యం. మాఘ మాసము నందు పుట్టినది, మొల్ల, కుందము, (వృక్ష విశేషము), మల్లె.
మాచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కాంచి. (వృక్ష విశేషము)
మాణవకము
సం. నా. వా. అ. పుం. తత్స. మనోరల్పమపత్యం మాణవకః. మనువు యొక్క అల్పమైన అపత్యము. మయా లక్ష్మ్యా నవక అభినవః మాణవకః. ఒప్పిదము చేత నూతనమైనది, ఇరువై పేటల మణి హారము, బాలకుడు.
మాణవ్యము
సం. నా. వా. అ. న. తత్స. మాణవా బాలాః తేషాం సమూహో మాణవ్యం. బాలుర యొక్క సమూహం, మాణవకుల సమూహము, బాలుర గుంపు.
మాణిక్యము
సం. నా. వా. అ. న. తత్స. రత్నము, కెంపు.
మాణిబంధము
సం. నా. వా. అ. న. తత్స. మణిబంధశై లేభవం మాణిబంధం. మణి బంధమను, పర్వతము నందు పుట్టినది, సైంధవ లవణము, రాతి ఉప్పు.
మాతంగము
సం. నా. వా. అ. పుం. తత్స. మా తంగతి న గచ్ఛతి గ్రామ మధ్య మితి మాతంగః. గ్రామ మధ్యమును పొందనివాడు మతంగసంతతి కాగా మాతంగులని పౌరాణికులు చెప్పుదురు, మాదిగవాడు, చండాలుడు.
మాతరపితలు
సం. నా. వా. ఋ. పుం. ద్విం. తత్స. మాతా చ పితా చ మాతా పిరౌ. మాత పితరౌ. తల్లి దండ్రులు, మాతా పితలు.
మాతరిశ్వుడు
సం. నా. వా. న్. పుం. తత్స. మాతరి అంతరిక్షే శ్వయతి వర్ధతే ఇతి మాతరిశ్వా. వాయువు, గాలి. మాతరి ఆకాశే శ్వయతి వర్ధతే ఇతి మాతరిశ్వా.
మాతలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మాతాని సూతకర్మాణి లాతి గృహ్ణాతీతి మాతలిః. సారథి కర్మల యందుగల మతముల గ్రహించినవాడు, ఇంద్రుని సారథి. మతం లాతీతి మాతలిః.
మాతాపితలు
సం. నా. వా. ఋ. పుం. ద్విం. తత్స. మాతా చ పితా చ మాతా పితరౌ. తల్లిదండ్రులు.
మాతామహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మాతుః పితా మాతామహః. తల్లికి తండ్రి, తల్లి తండ్రి. మాతమహుల పూర్వులు, తల్లివంశపువారు.
మాతుల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఉన్మాదక ద్రవ్వేషు మానాస్తితు లావ్యేతి మాతులః. ఉన్మాదక ద్రవ్యములలో సాటిలేనిది, మాతులస్య పత్నీ మాతులనీ. మేనమామ భార్య. సం. నా. వా. అ. పుం. ఉమ్మెత్త, ముఱ్ఱపాము, కుసుమలు.
మాతులపుత్రకము
సం. నా. వా. అ. పుం. తత్స. మాతులస్య పుత్రః ఫలం మాతుల పుత్రకః. ఉమ్మెత్త నందు పుట్టినది, ఉమ్మెత్త కాయ, మేనమామ కొడుకు, మేనమామ.
మాతులాని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఉపయోగివస్తుషు మా తులా స్యా ఇతి మాతులానీ. ఉపయుక్త వస్తువుల యందు దీనికి సరిలేదు, జనుము, కుసుమలు, లంకలు. మాతులస్య పత్నీ మాతులనీ. మేనమామ భార్య.
మాతులాహి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మాతులానామ ఓషధిః తస్యాం స్థితః అహిః మాతులాహిః. మాతుల అనెడి ఔషధి యందు ఉండు సర్పము, ఉమ్మెత్తలోని ముఱ్ఱుపాము, పాము.
మాతులి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మాతులస్య పత్నీ మాతులీ. మేనమామ పెండ్లాము, జనుము.
మాతులుంగము
సం. నా. వా. అ. పుం. తత్స. రుచ్య వస్తుష్వనేన మా తులాం గచ్ఛతీతి మాతులుంగకః. రుచి గల వస్తువులలో దీనితో సరియైనరుచికలవస్తువు లేదు, మాది ఫలపు చెట్టు, పుల్ల దబ్బ.
మాతృ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాతి వర్తతీ గర్భో త్రమాతా. గర్భము ఈమె యందు ఇమిడిఉండును, తల్లి, దాది, పార్వతి, వర్ణమాల, అసలు గ్రంథము, పుష్యపూర్ణిమ, తిరగలి క్రిందిరాయి, ఆవు, వర్ణ సమామ్నాయము, బ్రహ్మ, గౌరి.
మాత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాతాతి మాత్రా. అణగిఉండునది, అక్షరావయవము, వృత్తాంశము, కొంచెము, కొలది, త్రుటి, పరివారము, భూషణము, ధనము. మీయతే అనయా ఇతి మాత్రా. అల్పము. ఛందస్సులో దీర్ఘము హ్రస్వము అని భేదాలు. సం. నా. వా. అ. న. తత్స. అవధారణము, సర్వము, స్వాజితము, ధనము భాగము, ప్రవృత్తి, కర్ణభూషణం, మౌనము.
మాదము
సం. నా. వా. అ. పుం. తత్స. మదనం మాదః. మదించుట మాదము, మదము యొక్క రూపాంతరము, వ్యాధి.
మాధవకము
సం. నా. వా. అ. పుం. తత్స. మధునా మధుపుష్పేణ కృతః ఆపవో మాధవః. ఇప్ప పువ్వు చేత చేయబడిన కల్లు, ఇప్ప పువ్వు కల్లు. మధు మధుకపుష్పం తేన కృతః సంధితః మాధవకః.
మాధవము
సం. నా. వా. అ. పుం. తత్స. మాధవః మాయః లక్ష్మ్యః దవః. లక్ష్మీదేవికి భర్త, విష్ణువు, లచ్చిమగడు, మధ్యము. మధుః వసంతః, అస్మిన్నితివా మాధవః. మధువనంగా వసంతుడు, వైశాఖమాసము, వసంతఋతువు.
మాధవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మధౌ చైత్రే పుష్పతీతి మాధవీ. చైత్ర మాసము నందు పుష్పించునది, పువ్వుల గురివెంద, మాది ఫలము, సదాప, (వృక్ష విశేషం) కల్లు, తేనె, చక్కెర. మధౌ సాధు పుష్ప్యతి ఇతి మాధవీ. ఒకలత, మధ్యము, లక్ష్మీ, గోమాహిష్యాధి సంవృద్ధి, కుంటెన కత్తె.
మాధ్వీకము
సం. నా. వా. అ. న. తత్స. మృద్వీ కావికారో మార్ధ్వీకం. ద్రాక్ష పండ్ల వికారము, మాధవకము, మకరందము, పుష్పరసము, తేనె.
మానము
సం. నా. వా. అ. న. తత్స. ఆత్మానం మానయతీతి మానః. మాన పూజించుకొన చేయునది, త్రాసు, మూర, తూము లోనగునది. మన్యతే బుధ్యతే అనేన ఇతి మానః. (త్రివిధముః- తులామానము, అంగుళీ మానము, ప్రస్తమానము), కొలది, మానిక. అ. పుం. తత్స. చిత్తౌన్నత్యము, గర్వము, స్త్రీలకు పురుషులకు ఎడకలుగు పోక విశేషము.
మానవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మనోరిమే మానవాః. మనువు సంబంధమైనవారు, మనుష్యుడు, మానిషి. మనోరపత్యం మనోర్గోత్రాపత్యం వా పుమాన్ ఇతి మానవః.
మానసము
సం. నా. వా. అ. న. తత్స. మన్యతి అనేనేతి మానసం. దీని చేత ఎరుగబడును. మనస్సు, ఒక సరస్సు.
మానసౌకసము
సం. నా. వా. స్. పుం. తత్స. మానస సరః ఓకః స్థానమస్య మానసౌకాః. మానస సరస్సు స్థానముగా కలది, హంస, మరాళము. మానసం సర ఓకో వాసస్థానం యస్య సః మానసౌకః.
మానిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మానో స్యా ఇతి మానినీ. ప్రణయ కోపము కలది, మానము కల ఆడది, నిద్రభంగము.
మానుషుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మనోరపత్యాని మనుష్యాశ్చ. మనువు కొడుకులు కనుక మనుషులు, మనుష్యుడు, మాసిని. మనోజతిః మానుషః.
మాయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాత్యస్యాం విశ్వమితి మాయా. దీని యందు జగత్తు మితమైఉండును, అవిద్య, ఇంద్రజాలాది విద్య, ఒక పట్టణము, బుద్ది. మీయతే అపరోక్షవత్ ప్రదర్శ్యతే అనయా ఇతి మాయా. కృప, ప్రజ్ఞ, తెల్ల తెగడ, మూల ప్రకృతి, భ్రమ. సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణువు, అసురుడు.
మాయాకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మాయాం కరోతీతి మాయాకారః. మాయ చేయువాడు, మాయగాడు, మోసగాడు.
మాయాదేవిసుతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మాయాదేవ్యాస్సుతః మాయాదేవిసుతః. మాయాదేవి కొడుకు, శాక్యబుద్దదేవుడు.
మాయువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. మీనోతి శిరో భ్రమణేన భువి క్షేపయతీతి మాయః. శిరోభ్రమణము చేత జనమును పడ ద్రొబ్బునది, పైత్యము. మినోతి ప్రక్షిపతి దేహే ఉష్మాణమితి మాయుః. పిత్తము, శబ్దము.
మాయూరము
సం. నా. వా. అ. న. తత్స. మయూరాణాం సమూహో మాయూరం. నెమళ్ల యొక్క గుంపు, మయూరముల సముహము.
మారకుడు
సం. నా. వా. విణ. (అ.ఆ.అ). తత్స. మారయతి విరహిజనం మారః. విరహిజనులను చంపువాడు, మరణింపచేయువాడు, మృత్యుపు.
మారజిత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. మారం మన్మథం జయతీతి మారజిత్. మన్మథుని జయించినవాడు, బుద్ధదేవుడు. మారం కామదేవం జితవాన్ ఇతి మారజిత్. కామదేవుని జయించినవాడు, మాయాదేవి కుమారుడు.
మారణము
సం. నా. వా. అ. న. తత్స. మార్యతే మారణం. చంపుట, ఒక విద్య, వధ.
మారిష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మారయతి పాపానీతి మారిషః. పాపములను చెరుచువాడు, దక్షునితల్లి. మర్షతి దోషానితి మారిషః. ఒక ఆకుకూర, నాటకములో సూత్రధారుని సహచరుడు. సం. నా. వా. అ. పుం. తత్స. తోటకూర.
మారుతము
సం. నా. వా. అ. పుం. తత్స. మరుదేవ మారుతః. వాయువు, గాలి.
మార్కవము
సం. నా. వా. అ. పుం. తత్స. మార్కః సంపర్కః ఔషధేషు తం వాతీతి మార్కవః. ఔషధముల యందు సంపర్కమును పొందునది, గుంటగలగర (వృక్ష విశేషము), భృంగరాజము.
మార్గణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మార్గయతి లక్ష్యమితి మార్గణః. గుఱిని వెదకునది. మార్గయతి దాతారమితి మార్గణః. దాతను వెదకువాడు. మార్గ అన్వేషణే మార్గణః. వెదకుట, యాచించుట, బాణము.
మార్గము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగయంతేగవేషయంత్య నేన మార్గః. దీని చేత పదార్ధమును వెదుకుదురు, త్రోవ, అన్వేషణము. మార్గ్యతే సంస్క్రియతే పాదేన, మృగ్యతే గమనాయాన్విష్యతే ఇతి వా మార్గః. సంగీత విశేషము, కస్తూరి, బాట, జింక అడుగు జాడ, వెదుకుట.
మార్గశీర్షము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగశీర్షనక్షత్రయుక్తా పూర్ణిమా మార్గశీర్షీ. మృగశీర్షః నక్షత్రముతో కూడిన పున్నమ, మార్గశీర్షమాసము, ఒక నెల.
మార్గితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మార్గ్యతే స్మ మార్గితం. అన్వేషణ, వెదకబడినది.
మార్జన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మార్జయతి ఉద్వర్తయత్యంగమనేన మార్జనః. దీనిచేత అంగము శుద్ధిచేయబడును, మురజధ్వని, తుడుపు, తోముడు, లొద్దుగు, మార్దవము.
మార్జాలము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆఖుగ్రహణేన గృహం మార్జీతి మార్జారః. మూషక గ్రహణము చేత గృహమును శుద్ధిచేయునది, పిల్లి.
మార్తాండుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మార్తాండః మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తాండం. నశించిన బ్రహ్మండమును బ్రతికించువాడు, సూర్యుడు. మృతశ్చాసౌ అండశ్చ, తత్ర భవతీతి మార్తాండః. అర్కవృక్షము.
మార్దంగికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృదంగవాదనం శిల్పమేషామితి మార్గంగికాః. మద్దెలవాయించుట పనిగా కలవారు, మృదంగం వాయించువాడు.
మార్ద్వీకము
సం. నా. వా. అ. న. తత్స. మృద్వీకావికారో మార్ద్వీక. ద్రాక్ష పండ్ల చేత చేసిన మద్యము, ద్రాక్షకల్లు, ద్రాక్షసంబంధమైనది.
మార్ష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మృజ్యతే అనయామార్ష్టిః. దీనిచేత శుద్ధి చేయబడును, మార్జనము, సుగంధ ద్రవ్యములను పూయుట.
మాలకము
సం. నా. వా. అ. పుం. తత్స. మలతే కాకసమూహం మాలకః. కాకసమూహమును ధరించునది, వేము, గగ్గిర, దిబ్బ, ఒక ద్వీపము, కృష్ణతులసి.
మాలతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మల్యతే ఆమోదైర్మాలతీ. పరిమళములచేత ధరింపబడునది, జాజి, ఒకానొకస్త్రీ. మలతే శోభాం ధారయతీతి మాలతీ. పుష్పలతా విశేషము, యువతి, చంద్రిక, కౌముది, పగలు, రాత్రి, నదీవిశేషము, సువర్చల.
మాలా తృణకము
సం. నా. వా. అ. న. తత్స. మాలారూపాణి తృణాన్యత్ర మాలా తృణకం. భూమిని కప్పిఉండునది, చిప్పకసవు, గడ్డిపువ్వు.
మాలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాం లక్ష్మీ లాతీతి మాలా. ఒప్పిదమును ఇచ్చునది, పూదండ, పిక్క. మాతి మానహేతుర్భవతీతి మాలా.మాల్యము, స్రక్కు, మాలిక, శ్రేణి, లేఖ, వీచి, ఆవలి, పంక్తి, ధారణి. సం. నా. వా. అ. పుం. తత్స. చెండాల జాతి విశేషము, ఒకద్వీపము, కృష్ణతులసి, జనుడు, దేశవిశేషము.
మాలాకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మాలాం కరోతీతి మాలాకారః. పువ్వులదండను కట్టువాడు, పూవులను మాలలుగాకట్టి అమ్మువాడు. మాలాయాః కరః ఇతి మాలాకరః. పూలమాలలు చేయువాడు.
మాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాలా నిర్మాణం శిల్పమస్య మాలికః. పువ్వులు దండగాకట్టుట పనిగా కలవాడు, పూమాల,మెడపెట్టుకొనెడుతీగ,విరజాజి, మాడుగు, నదీ విశేషము, కూతురు, దొంతర మల్లె.
మాలుధానము
సం. నా. వా. అ. పుం. తత్స. మాలు భిర్ధీయతే పోష్యత ఇతి మాలుధానః. నీచులుచే పోషింపబడునది, ముఱ్ఱుపాము, ఒక పాము.
మాలూరము
సం. నా. వా. అ. పుం. తత్స. మల్యతే దేవైః మాలూరః. దేవతల చేత ధరింపబడునది, మారేడు, వెలగ. మాం పరేషాం వృక్షాంతరాణాం శ్రియం ప్రభావం లునాతీతి మాలూరః. బిల్వ వృక్షము, శ్రీఫలము.
మాల్యము
సం. నా. వా. అ. న. తత్స. మల్యతే ధార్యత ఇతి మాల్యం. ధరింపబడునది, పుష్పమాలిక, పుష్పము, పూమాల.
మాల్యవంతము
సం. నా. వా. త్. పుం. తత్స. మాల్యాకారతాస్యాస్తీతి మాల్యవాక్. పూలదండ ఆకారము కల కొండ, క్రౌంచ పర్వతము, ఒకానొకకొండ.
మాషపర్ణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మాష్యస్యేవ పర్ణాన్యస్యా మాషపర్ణీ. మినుము యొక్క ఆకుల వంటి ఆకులు కలది, నల్లమినుములు.
మాసము
సం. నా. వా. అ. పుం. తత్స. మస్యతే పరిమీయతే నేనేతి మాసః. దీనిచేత కాలము పరిమాణము చేయబడును, నెల (ఇవి పన్నెండు - చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తికము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గునము), మాషపరిమాణము.
మాసరము
సం. నా. వా. అ. పుం. తత్స. మస్యతి ఘనీభావేన పరిణమతీతి మాసరః. పేరుకొనునది, వార్పుగంజి, గంజిమీది మీగడ, వ్యాప్తము, దీర్ఘము, వడపోతకు ఉపయోగించు ద్రావకము, అన్నపుగంజి.
మాసికము
సం. నా. వా. అ. న. తత్స. మాసే మాసే క్రియత ఇతి మాసికం. నెల నెలకు చేయబడునది, ఆబ్ధికము వఱకు నెలనెలకు చేసెడు శ్రాద్ధము, ప్రతి అమవాస్యనాడు చేసెడు శ్రాద్ధము, మాససంబంధమైనది, మాస శ్రాద్ధము.
మాహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మహ్యత ఇతి మాహ. పూజింపబడునది, ఆవు.
మాహిఘ్యడు
సం. నా. వా. అ. పుం. తత్స. మాహిషి రక్షణే సాధుః మాహిష్యః. అంతః పురస్త్రీలను రక్షించుటకు సమర్ధుడు, అంతః పుర కావలికి తగినవాడు.
మాహేయి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహాగౌః తస్యా అపత్యం మాహేయి. ఆవు,గోవు. మహ్యాః సురభ్యాః అపత్యమితి మాహేయీ. సురభి.
మాహేశ్వరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహేశ్వర సమ్బన్ధీమాహేశ్వరి. ఒక మాతృక, సప్త మాతృకలలో ఒకటి.
మితంపచుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మితం అత్యల్పం పచతీతి మితం పచః. కొద్దిగా వండుకొనువాడు, లోభి. మితం పరిమితం పచతీతి మితంపచః.
మిత్రము
సం. నా. వా. అ. న. పుం. తత్స. సర్వభూతేషు మేధ్యతి స్నిహ్యతీతి మిత్రః. సర్వభూతముల యందు స్నేహయుక్తుడు. మేద్యతీతి మిత్రం. స్నేహించువాడు, స్నేహితుడు, దండెత్తి పోవువాని శత్రుదేశమున కావలి దేశపురాజు, సూర్యుడు. చెలికాడు, సఖుడు, మాచిపత్రి.
మిథునము
సం. నా. వా. అ. న. తత్స. మేథతే సంగచ్ఛత ఇతి మిథునం. కూడియుండునది, ఆలుమగల జత, ద్వయము, ఒకరాశి. మేథతీతి మిథునం. యుగళము, తేనె, నెయ్యి కలిసినది, దంపతులు, జత, కవలలు.
మిథ్య
సం. అవ్య. తత్స. మథతే ఇతి మిథ్యా. అసత్యము.
మిశ్రేయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మిశ్రయితుం యోగ్యా మిశ్రేయా. ఔషధములలో కూర్చుటకు యోగ్యమైనది, అడవిసదాప.
మిసి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. మస్యతి పరిణమతీతి మిసిః. కాలక్రమమున రూపాంతరమును పొందునది. మస్యతి పరిణమతే తిక్తత్వేనేతి మిసిః. చేదై పరిణమించునది, జటామాంసి, ఓమము, సదాప. (వృక్ష విశేషము). సం. నా. వా. ఇ. పుం. తత్స. అడవి సదాప అను ఒక వృక్షము.
మిసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మస్యతీతి మిసీ. మాఱునది, జటామాంసి.
మిహిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మేహతి భువనమితి మిహికా. భూమిని తడపునది, మంచు, హిమము. మేహతి స్నిహ్యతీతి మిహికా. నీహారము.
మిహిరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మేహతి మేఘరూపీ విశ్వం పీసించ తీతి మిహిరః. మేఘరూపియై ప్రపంచమును తడిపెడువాడు, సూర్యుడు. మేహతి సించతి మేఘజలేన భూమిమితి మిహిరః. మేఘము, వాయువు, అర్కవృక్షము.
మీఢము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మిహ్యతే సిచ్యతే స్మ మీఢం. చిమ్మబడినది, విడువబడినది, పొట్టేలు, మూత్రము మున్నగునవి.
మీనకేతనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మీనః కేతనం ధ్వజోయస్యసః. మీనకే తనః. మత్స్యము టెక్కెముగా కలవాడు, మన్మధుడు, మరుడు.
మీనము
సం. నా. వా. అ. పుం. తత్స. మీయతే ధీవరేణమీనః. జాలరివాని చేత హింసింపబడునది, మత్స్యము, ఒకరాశి. మీయతే హింస్యతే హినస్తి వా ఇతి మీనః. జలచరము, ఒక చేప.
ముకుందుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కమనీయత్వాన్ముకుందః. ఒప్పుచుంజును కనుక ముకుందుడు. ముఖాత్కుంద ఇవ ప్రతిభాతి ముకుందః. ముఖము వలన మొల్లవలె దోచునది, విష్ణువు, వెన్నుడు, ఒక నిధి. ముకుం ముక్తిం దదాతీతి ముకుందః. పారదము, రత్నభేదము, కుందురువు.
ముకుటము
సం. నా. వా. అ. న. తత్స. మంక్యతే అనేన ముకుటం. దీనిచేత అలంకరింపబడును, కిరీటము పేర్లు, మకుటము యొక్క రూపాంతరము. మంకతే మండయతీతి ముకుటం. కిరీటము, మౌళి, కోటీరము, ఉశ్ణీషము, శేఖరము, అవతంసము, ఉత్తంసము.
ముకురము
సం. నా. వా. అ. పుం. తత్స. మంక్యతే అనేన ముకురః. దీనిచేత అలంకరింపబడుదురు, అద్దము, పొగడ (వృక్ష విశేషము), మల్లెపువ్వు, కుమ్మరిలాతము, దర్పణము, ఆదర్శము, కులవృక్షము, కోరకము.
ముకుళము
సం. నా. వా. అ. పుం. తత్స. కలికావస్థాం ముచ్ఛతీతి ముకుళః. మొగ్గగా ఉండుటను విడుచునది, మొగ్గ, అభినయ హస్త విశేషము. సం. నా. వా. అ. న. తత్స. అరివిరి మొగ్గ. ముంచతిం కలికాత్వమితి ముకుళః. శరీరము, ఆత్మ.
ముక్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ముచ్యతే శుక్తి సంపుటాదితి ముక్తా. ముత్యపు చిప్పవలన విడువబడునది కనుక ముక్తము, ముత్తెము, ఱంకుటాలు, ముక్తినొందినది, విడువబడినది, ముత్యము, కులట.
ముక్తావళి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. ముక్తానాం ఆవళీముక్తావళీ. ముత్యముల యొక్కపంక్తి, ముక్తాహారము, ముత్యాలసరము.
ముక్తాస్పోటము
సం. నా. వా. అ. పుం. తత్స. ముక్తాః స్ఫుటంత్యస్మాదితి ముక్తాస్ఫోటః. ముత్యములు దీనివలన వికసించును, ముత్తెపు చిప్ప. ముక్తానాం స్ఫోటః వికాశోత్ర ముక్తాస్ఫోటః. శుక్తి.
ముక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శరీరేంద్రియా భ్యామాత్మనోముక్తత్వం ముక్తిః. శరీరేంద్రియముల వలన ఆత్మ విడువబడుట, మోక్షము, విడుపు, కైవల్యము, నిర్వాణము, అమృతము.
ముఖము
సం. నా. వా. అ. న. తత్స. గృహస్య ముఖ ప్రాయత్వాత్ ముఖం. గృహమునకు ముఖము వంటిది. ఖన్యతే భక్ష్యమనేనేతి ముఖం. దీనిచేత భక్ష్యము పీడింపబడును, మొగము, నోరు, మాట, ఒకనాటకసంధి, ఇల్లులోనగు వాని ముందటి భాగము, ఉపాయము, ప్రయత్నము. ఖనతి విదారయతి అన్నాదికమనేన, ఖన్యతే విధాత్రా సుఖమనేనేతి వా ఇతి ముఖం. ఇంటి యొక్క ప్రవేశభాగము, అగ్రభాగము, వదనము, ఆననము, ప్రధానము, రాతి ఉప్పు, గోపురము ముందుండు ప్రదేశము, రాగి, ద్వారము, అభ్యుపాయము.
ముఖరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దుష్టం ముఖం వచనమస్యేతి దుర్ముఖః ముఖరచ్చ. అప్రియమైన మాటలు కలవాడు, మ్రోగునది, అసంబర్ధవచనములాడునది. ముఖం అస్యాస్తీతి ముఖరః. దుర్ముఖుడు, అబద్ధపు మాటలు మాట్లాడువాడు, నిందించువాడు.
ముఖవాసన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ముఖం వాసయతీతి ముఖవాసనః. ముఖమును పరిమళింప చేయునది, కర్పూరాది వాసన, పుష్పాసవము.
ముఖ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ముఖమివ ప్రధానత్వాత్ ముఖ్యః. ప్రధానమైనది, ప్రధానము, గామిడి. ముఖే ఆదౌ భవః ముఖ్యః. శ్రేష్ఠము, ప్రముఖము.
ముదిరము
సం. నా. వా. అ. పుం. తత్స. మోదం తే అనేన కృషీవలా ఇతి ముదిరః. దీనిచేత పైరు పెట్టు కాపులు సంతోషింతురు, మేఘము, విటుడు.
ముద్గపర్ణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ముద్గస్యేవ పర్ణాన్యస్యా ఇతి ముద్గపర్ణీ. పెసర ఆకులువంటి ఆకులుకలది, పిల్లపెసర.
ముద్గరము
సం. నా. వా. అ. పుం. తత్స. ముదం సంతోషం గిరతీతి ముద్గరః. సంతోషమును హరించునది, ఇనుపగుదియ సమ్మెట. అస్త్ర విశేషము, ఘనము, యజ్ఞమునకు ఉపయోగించు సుత్తి వంటి సాధనము, కొయ్యసుత్తి.
ముని
సం. నా. వా. ఇ. పుం. తత్స. సర్వ ధర్మాణాం మననాన్మునిః. సర్వధర్మముల నెఱుంగట వలనముని. మన్యతేముని. జ్ఞానముకలవాడు, వశిష్టాది, బుద్ధదేవుడు, అగిసియ. మనుతే జానాతి యః ఇతి మునిః. ఋషి, ఒక వృక్షము, అగస్త్య వృక్షము, కుశలు.
మునీంద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మునీనా మింద్రః శ్రేష్ఠః. మునీంద్రః. మునులలో శ్రేష్ఠుడు, బుద్ధదేవుడు, ఋషిశ్రేష్ఠుడు.
మురజము
సం. నా. వా. అ. పుం. తత్స. చర్మపట్టికాసంవేష్టనాజ్జాతః మురజః. మురము అనగా చర్మవలయము, అందువలన కలిగినది, మృదంగము. మురాత్ సంవేష్టనాజ్జాతః అసౌ ఇతి మురజః. మద్దెల.
ముషితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ముష్యతేస్మ ముషితం. దొంగిలించబడినది, నఱకబడినది.
ముష్కకము
సం. నా. వా. అ. పుం. తత్స. ముష్ణాతి రోగాన్ ముష్కకః. రోగములను హరించునది, మొక్కపు చెట్టు, వృషణము.
ముష్కము
సం. నా. వా. అ. పుం. తత్స. ముష్ణాతి గోపాయతి రేత ఇతి ముష్కః. రేతస్సును దాచునది, వృషణము, మొక్కపుచెట్టు, మొత్తము. ముష్ణాతి వీర్యమితి ముష్కః. అండకోశము.
ముసలము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ముస్యతే ధాన్య మనే నముసలః. దీనిచేత ధాన్యము దంచబడును, రోకలి, అయోగ్రము.
ముసలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ముస్యతి రోగాన్ ముసలీ. రోగములను ఖండించునది. ముస్యతి క్రిమినితి ముసలీ. పురుగులను ఖండించునది, ఉడుము, ఎలుకజీడి, నేలతాడు (వృక్ష విశేషము),బల్లి. సం. నా. వా. ఈ. పుం. తత్స. బలరాముడు. సం. విణ. తత్స. వృద్దుడు.
ముసల్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ముసలేన వధ్యో ముసల్యః.రోకటి చేత చంపతగినవాడు, ముసలముచేత చంపతగినవాడు.
ముస్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ముస్యతి ఖండయతి రోగాన్ ముస్తా.రోగములను పోగొట్టునది, నిడుముస్తె, తుంగముస్తె. (వృక్ష విశేషము).
ముస్తకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ముస్యతే వరాహైరితి ముస్తకం. వరాహములచేత ఖండించపడునది. ముస్యతి ఖండయతి రోగాన్ ముస్తకం. రోగములను పోగొట్టునది, కయివడి ముస్తెనిడుముస్తె. ముస్తయతి సంహతీకరోతి రుధిరమితి ముస్తకః. తృణమూలవిశేషము, తుంగముస్తె.
ముహూర్తము
సం. నా. వా. అ. పుం. తత్స. హూర్ఛతి కుటిలో భవతి శుభాశుభదర్శనాదితి ముహూర్తః. శుభాశుభ దర్శనము వలన కుటిలమగునట్టిది, పన్నెండు క్షణాల కాలం, రెండు గడియల కాలం.
మూఢుడు
సం విణ. (అ.ఆ.అ). తత్స. ముహతీతి మూఢః. మోహమును పొందువాడు, తెలివిలేనివాడు, బాలుడు, మూర్ఖుడు, మందుడు.
మూతము
సం. నా. వా. అ. న. తత్స. మూయత ఇతి మూతః. బంధింపబడినది, రాజులచేత క్రిందనుంచుకొను తలగడ, కట్టబడినది, తోడు వేయుట, వరిధాన్యము, వరివెన్నులను గడ్డితో కట్టుట.
మూత్రకృచ్ఛము
సం. నా. వా. అ. న. తత్స. మూత్ర విస్రవణకాలే కృచ్ఛ్రం కష్టమస్యేతి మూత్ర కృచ్చ్రం. మూత్రము విడుచునపుడు ప్రయాణము దీని యందు కలదు, నీరుడిరోగము, ఒక వ్యాధి.
మూత్రము
సం. నా. వా. అ. న. తత్స. మూత్ర యతి ప్రస్రవతి మూత్రం. జాఱునది, నీరు, కాలుమడి, మూత్రము.
మూర్ఖుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ముహతీతి మూర్ఖశ్చ. మోహమును పొందువాడు, తెలిసీతెలియనివాడు.
మూర్ఛ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మూర్చా మోహసముచ్ఛ్రాయయోః. మోహము పొందుట, రోగాదులచేత స్మృతి దప్పుట, సొమ్మ, మూఢుడు.
మూర్ఛాలుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మూర్ఛా స్యా స్త్రీతి మూర్ఛాలః. మూర్ఛకల వాడు, మూర్చరోగముకలవాడు, మూర్ఛనొందినవాడు.
మూర్తము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. మూర్తిః కాఠిన్యమస్యాస్తీతి మూర్తం. గట్టితనము కలది. మూర్చతిస్మ మూర్తః. మోహమును పొందువాడు, కఠినమైనది, మూర్చరోగము కలది, స్వరూపము కలది.
మూర్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మూర్ఛతి సమూచ్ఛ్రితో భవతీతి మూర్తిః. ఉన్నతమగునది. మూర్ఛయతీతి మూర్తిః. ఆధిక్యమును పొందునది, శరీము, కాఠిన్యము, ప్రతిమ. (త్రిమూర్తులు- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు), ఆకాశము, చిత్రము, కాకి, తనువు, దేహము, గాత్రము, కాయము, కళేబరము, కాఠిన్యము, ప్రతిమ, స్వరూపము.
మూర్ధము
సం. నా. వా. న్. పుం. తత్స. మూర్ఛత్యున్నతో భవతి మూర్ధా. ఉన్నతమైనది, శిరము, తల.
మూర్ధాభిషిక్తుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అభిషిక్తో మూర్ధాభిషిక్తః ప్రధమః క్షత్రియః తత్ర భవతయా అన భిషిక్తా అపి మూర్ధాభిషిక్తాఖ్యాః. రాచవాడు, రాజు, మంత్రి. మూర్ధ్ని అభిషిచ్యతే స్మ మూర్ధాభిషిక్తః. శిరస్సునందు అభిషేకము చేయబడువాడు. మూర్ద్ధన్యభిషిక్తో మూర్ద్ధాభిషిక్తః. క్షత్రియుడు, ప్రభువు.
మూర్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మూర్వతి యస్ట్యాదికం మూర్వా. కొయ్యను చుట్టుకొనునది, చోగ, గోకర్ణీలత.
మూలకము
సం. నా. వా. అ. న. పుం. తత్స. ప్రశస్తాని మూలాన్యస్యేతి మూలకం. మంచిదుంపలు కలది, ముల్లంగి (వృక్ష విశేషము).
మూలము
సం. నా. వా. అ. న. తత్స. మూలయతీతి మూలం. ప్రతిష్ఠను చేయునది. స్థలపద్మనీ మూలత్వేన పుష్కరస్య మూల. నేలతామరదుంప. మూల తీతిమూల. నిలకడ కలిగియుండునది, వేరు, మెట్టు తామరదుంప మొదలు, సంచిమొదలు సమీపము, ఒకనక్షత్రము. మవతే బధ్నాతి వృక్షాదికమితి మూలం. పాదము, వశీకరణము, స్వీయము, ఇతరులపై ఆధారపడిన చెట్టుకొమ్మ, సమీపము.
మూల్యము
సం. నా. వా. అ. న. తత్స. మూలేన అనామ్యమనభి భవనీయ మూల్యం. మొదటి సొమ్ము చేత క్రిందుపడనిది, వెల, జీతము. మూలేన ఆనమ్యతే అభిభూయతే, మూలేన సమం వా ఇతి మూల్యం. వేతనము.
మూష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మూయతే బధ్యతే స్వర్ణాదిక మత్రేతి మూషా. దీని యందు బంగారు మొదలగునవి మూసి పెట్టబడును, మూస.
మూషిక పర్ణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మూషక కర్ణాభ పత్రత్వాత్ మూషికపర్ణీ. ఎలుక చెవులవంటి ఆకులు కలది, ఎలుకజీడి. (వృక్ష విశేషము).
మూషికము
సం. నా. వా. అ. పుం. తత్స. ముష్ణాత్యన్నాదికం మూషికం. అన్నము మొదలైన వానిని దొంగిలించునది, ఎలుక, పందికొక్కు. ముష్ణాతి ద్రవ్యాణితి మూషికః. సాలె పురుగు.
మూషితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మూష్యతే స్మ మూషితం. దొంగలింపబడినది.
మృగ ధూర్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగేషు ధూర్తః మృగధూర్తకః. మృగములయందు ధూర్తమైనది, నక్క, జంబుకము.
మృగణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మృగ అన్వేషణే మృగణం. వెదకుట, అన్వేషణము.
మృగతృష్ణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మృగాణాం తృష్ణా అస్యామితి మృగతృష్ణా.మృగములకు దీనియందు ఆశకలదు, ఎండమావులు, మరీచిక.
మృగదంశకము
సం. నా. వా. అ. న. తత్స. మృగాన్ దశతీతి మృగదంశకః. మృగములను కొఱుకునది, కుక్క, ఎలుగు.
మృగనాభి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మృగనాభి భవ త్వాన్మ గనాభిః. మృగము యొక్క నాభి వలన పుట్టునది. జింక పొక్కిలి, కస్తూరి. మృగస్య నాభిః మృగనాభిః.
మృగమదము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగస్య మదో మృగమదః. మృగము యొక్కమదము, కస్తూరి, మెకపుటామ. మృగాః మాద్యంతి అనేనేతి మృగమదః.
మృగము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగ్యతే లుబ్ధకైరితి మృగః. వేటగాండ్రచే వెదకబడినది. పశువు, జింక, అడవియందు తిరిగెడి ఏనుగు మృగశీర్షము, అన్వేషణము, వేట, వేడుట. మృగయతే అన్వేషయతి తృణాదికం మృగః. మృగయతే అన్విష్యతే అసౌ వ్యాధైః ఇతి మృగః. కురంగము, దుప్పి, వెదకుట, ఒకజాతి ఏనుగు, మృగశిర.
మృగయ
సం. నా. ఆ. స్త్రీ. తత్స. మృగాణామన్వేషణం మృగయా. మృగములను వెదకుట, వేట. మృగ్యంతే పశవో అస్యామితి మృగయా.
మృగయుడు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మృగాన్ వథార్థం యాతీతి మృగయుః. వదార్థములైన మృగములను తరుముకొని పోవువాడు, బోయవాడు, బ్రహ్మ, వ్యాధుడు, లుబ్ధకుడు, వాగురికుడు.
మృగవ్యము
సం. నా. వా. అ. న. తత్స. మృగా విధ్యంతే అస్మీన్నితి మృగవ్యం. దీనియందు మృగములు సంహరింపబడును. వేట, ఆఖేటము. మృగాన్ విధ్యతి అత్ర ఇతి మృగవ్యం.
మృగశిర
సం. నా. వా. స్త్రీ. స్. న. తత్స. ఆకృత్యామృగస్యేవ శీర్షం యస్యతత్ మృగశీర్షం, మృగశిరశ్చ. మృగశీర్షము, మృగశిర ఆకృతి చేత మృగము యొక్క శిరమువంటి శిరము కలిగినది.
మృగశీర్షము
సం. నా. వా. అ. న. తత్స. ఆకృత్యా మృగస్యేవ శీర్షం యస్యతత్ మృగశీర్షం. ఆకృతి చేత మృగము యొక్క శిరము వంటి శిరముకలది. ఒక నక్షత్రము, మృగశిర.
మృగాంకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృగః అంకో యస్యసః మృగాంకః. మృగము చిహ్నముగా కలవాడు, చంద్రుడు, జింకతాలుపరి. మృగః అంకే యస్య సః మృగాంకః. కర్పూరము, వాయు.
మృగాదనము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగానత్తీతి మృగాదనః. మృగములభిక్షించునది, సివంగి, మెకములతిండిడు బోయవాడు.
మృగితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మృగ్యతే స్మ మృగితం. వెదుకబడినది.
మృగేంద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృగాణామింద్రః శ్రేష్ఠః మృగేన్ద్రః. మృగములలో శ్రేష్ఠమైనది, సింహము, మెకములఱేడు.
మృజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మృజ్యతే అనయామృజా. దీనిచేత శుద్ధి చేయబడును, నూనె మొదలుగువాని పూత.
మృడాని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మృడస్య పత్నీ మృడాని. మృడుని భార్య, పార్వతి, గట్రాచూలి, శివా, హైమవతి, అంబిక.
మృడుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృడతి సుఖః యతి భక్తానితి మృడః. భక్తులను సుఖింపచేయువాడు, శివుడు, ముక్కంటి. మృడతి హృష్యతీతి మృడః. మహాదేవుడు, ముక్కంటి.
మృణాళము
సం. నా. వా. అ. న. తత్స. మృణ్యతే భక్ష్యత ఇతి మృణాళం. భక్షింపబడునది, వట్టివేరు, బిసము, తూడు, తామర తూడు.
మృతము
సం. నా. వా. అ. న. తత్స. మ్రియతే స్మ మృతః. చచ్చినవాడు. మరణసమదుఃఖితయా మృత వద్భవ తీతి మృతం. మరణమునకు సమమైన దుఃఖము కలదిపనుక యాజ్ఞవృత్తి. మృతి, యాచితవృత్తి, మృతిపొందినది, మరణించినవాడు, మరణనము.
మృతాలకము
సం. నా. వా. అ. న. తత్స. మ్రియతే నిలీయతే హేమ అనేనేతి మృతాలకం. బంగారం దీనిచేత కరుగును, తొగరిమన్ను.
మృత్తిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మృద్యత ఇతి మృత్తికా. మెదుపబడునది, మన్ను, తొగరిమన్ను.
మృత్తు
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. మృద్యత ఇతి మృత్. మెదుపబడు నది, మన్ను, తొగరి మన్ను. మృద్నాతి ప్రళయే చూర్ణతయా స్వకారణే లీయత ఇతి మృత్.మట్టి, మృత్తిక, తువరి.
మృత్యుంజయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృత్యుం జయతీతి మృత్యుం జయః. మృత్యువును గెలిచినవాడు, శివుడు, మిత్తికొంగ.
మృత్యువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మ్రియతే మృత్యుః. చచ్చుట, మరణము, మరణాధి దేవత. మ్రియతే అస్మాదితి మృత్యుః. ప్రాణవియోగము, కాలధర్మము, ప్రళయము, అంతము, నాశము, మరణము, పరలోకగమనము, అవసానము.
మృత్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రశస్తామృత్ మృత్తికామృత్సా. ప్రశస్తమైన మృత్తిక, మంచిమన్ను, అడవి తొగరితీగ, తొగరి, మన్ను, సారవంతమైన మన్ను.
మృత్స్నా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రశస్తామృత్ మృత్తికా మృత్స్నా. ప్రశస్తమైన మన్ను, మంచిమన్ను, తొగరి మన్ను, అడవి తొగరి తీగ.
మృథము
సం. నా. వా. అ. న. తత్స. మ్రియంతే స్మిన్నితి మృథం. దీనియందు మృతులౌదురు, యుద్ధము, ప్రథనము, పోరు.
మృదంగము
సం. నా. వా. అ. పుం. తత్స. మృద్యత ఇతి మృదంగః. కొట్టబడునది, మద్దెల, తప్పెట, సద్దు, వెదురు. మృద్యతే ఆహన్యతే అసౌ ఇతి మృదంగః. పెద్దబీర, పొట్ల.
మృదువు
సం. విణ. (ఉ. ఈ. ఉ). తత్స. మృద్యత ఇతి మృదు. మెదుపబడునది, మెత్తనిది, సోమరి, కఠినము కానిది.
మృధము
సం. నా. వా. అ. న. తత్స. మ్రియంతే స్మిన్నితి మృధం. దీని యందు మృతులగుదురు. యుద్ధము, పోరు. మర్ధతే క్లిద్యతీతి మృధం. యుద్ధము.
మృష్టము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మార్జ్యతే స్మ మృష్టం. శోథింపబడునది, కడుగుటలోనగువాని చేత గరగరికైనది. పరిశుభ్రము.
మేఖల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మీయతే ప్రక్షిప్యతే కట్యామితి మేఖలా. మొల యందుంచబడునది, ఎనిమిది రసములుకలది. మీయతే మణిబంధ ఇతి మేఖలా. మణికట్టు మీద కట్టబడునది, ఆడుదానియొక్క ఎనిమిది పేటల మొలనూలు, కొండనడుము, చిలుకడుత్రాడు, నడుము, నడుము భాగము, మొలనూలు, కత్తిపటకా.
మేఖలకన్యక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మేఖల పర్వత ప్రభవత్వాన్మేఖల కన్యకా. మేఖల పర్వతమున పుట్టుటవలన మేఖలకన్యక, నర్మదానది. మేకలః మేఖలాయుక్తః తన్నామా వా వింధ్యాపర్వతః తస్య కన్యకా మేకలకన్యకా.
మేఘద్వారము
సం. నా. వా. అ. న. తత్స. ఆకాశము, మొగులదారి.
మేఘనాదానులాసి
సం. నా. వా. న్. పుం. తత్స. మేఘనాదమనుల సతీతిమేఘనాదానులాసీ. మేఘ ధ్వనినికూర్చి క్రీడించునది, నెమలి.
మేఘనామము
సం. నా. వా. న్. పుం. తత్స. మేఘస్య నామాన్యస్యేతి మేఘనామా. మేఘము యొక్క వేళ్లుకలది, నిడుముస్తె.
మేఘపుష్పము
సం. నా. వా. అ. న. తత్స. మేఘనాం పుష్పం మేఘపుష్పం. మేఘములకు పుష్పము వంటిది, ఉదకము, తూర, కృష్ణుని తేరి గుఱ్ఱములలో ఒకటి, నీరు.
మేఘము
సం. నా. వా. అ. పుం. తత్స. మేహతీతి మేఘః. తడుపునది, మబ్బు, ఏనుగు కాలి అందలి మదము, ముస్తె (వృక్ష విశేషము), అభ్రకము, ముస్తెలు, అబ్భ్రము, వారివాహము, స్తనయిత్నువు, ధారాధరము, బలాహకము, జలధరము, తడిత్వంతము, వారిదము, ఘనము, ముదిరము, జలముక్, ధూమయోని, అభ్రము, పయోధరము, అంభోదరము, వ్యోమధూమము, ఘనాఘనము, వాయుదారువు, నభశ్చరము, కంధరము, కంధము, నీరదము, గగనధ్వజము, వారిముక్, అబ్దము, పర్జన్యము, నభోగజము, మదయిత్నువు, కదము, కందము, గవేజువు, గదామరము, వాతరథము, శ్వేతనీలము, జలకరంకము, నాగము, పేచకము, భేకము, దర్దురము, అంబుదము, తోయదము, అంబువాహము, పాథోదము, గదాంబరము, గాడవము, అద్రి, గ్రావ, గోత్రము, బలము, అశ్రము, బలిశానము, అశ్మ, పర్వతము, గిరి, వ్రజము, చరువు, శంబరము, రౌహిణి, రైవతము, ఫలిగము, ఉపరము, ఉపలము, చమసము, అహి, హతి, ఓదనము, కోశము, అసురము.
మేఘవాహనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మేఘాగజరూపధారిణ ఐరావతాదయో వాహనం యస్య స మేఘవాహనః. గజరూపధారులైన మేఘములు వాహనముగాకలవాడు, ఇంద్రుడు, మబ్బురౌతు, రుద్రుడు.
మేచకము
సం. నా. వా. అ. న. తత్స. మచతే మి శ్రీ భవతీతి మేచకః. మిశ్రమగునట్టిది. హరిత మిశ్ర వర్ణత్వాత్ మేచకః. పచ్చవన్నెయు, నల్లవన్నెయుకలది, చీకటి. అ. పుం. నెమలిపురి, కన్ను, నలుపు, విణ. తత్స. నల్లనిది. మచతి వర్ణాంతరేణ మిశ్రీబవతీతి మేచకః. స్తనాగ్రము.
మేఢ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. రేతసా భగం మేహతి మేఢ్రః. రేతస్సు చేత భగమును తడుపునది, మేహనము, శిశ్నము.
మేథ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మేధతే అనుభూతం సర్వమస్యామితి మేథా. అనుభూత మైనవన్నియు దీనియందు సంగతములైఉండును,ధారణశక్తి కల బుద్ధి, అ. పుం. తత్స. (యజ్ఞము). మేఘతే సంగచ్ఛతే అస్యామితి మేధా.
మేదకము
సం. నా. వా. అ. పుం. తత్స. మేద్యతీతి మేదకః. జిడ్డు కలిగియుండునది, పెళ్లెము, వడపోతకు ఉపయోగించు ద్రావకము.
మేదస్సు
సం. నా. వా.స్. న. తత్స. మిద్యతే స్నిహ్యతే మేదః. మెఱుగైయుండునది, మెదడు, కొవ్వు.
మేదిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మధుకైట భ యోర్మేదసా పరిప్లుత త్వాత్ మేదినీ. మధుకైటభుల మెదడుచేతతడుపబడునది. భూమి, వసుధ, నేల. మేదో అస్యా అస్తీతి మేదినీ.
మేదురము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మేధ్యతి తాచ్ఛీల్యేనేతి మేదురః. స్వభావముననే నిగ్గుకలిగియుండును, చక్కనైనునుపైనది, మృదువు.
మేధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మేధతే సంగచ్ఛతే బలీ వర్దైరితి మేధిః. ఎద్దులతో కూడుకొనునది, పశులకట్టుటకు కళ్లమున పాతినగుంజను కట్టుగొఱ్ఱు.
మేధ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. మేధనీయం మేధ్యం. పొందతగినది, ముంజికసవు, విణ. తత్స. (పవిత్రము), ముంజి గడ్డి.
మేనకాత్మజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మేనకాయాః ఆత్మజా మేనకాత్మజా. మేనకకూతురు, పార్వతి.
మేషము
సం. నా. వా. అ. పుం. తత్స. మిషతి స్పర్ధత ఇతి మేషః. ఎదుటి పొట్టేలితో పోరాడునది, పొట్టేలు, ఒకరాశి, ఔషధి విశేషము, పశువిశేషము, ఉరభ్రము, ఉరణము, ఊర్ణాయువు, వృష్ణి, ఏడకము, భేడము, హుడము, శృంగిణము, అవి, లోమశము, బలి, రోమశము, భేడు, హులువు, సంఫలము.
మేహనము
సం. నా. వా. అ. న. తత్స. రేతసా భగం మేహతి మేహనం. రేతస్సు చేత భగమును తడుపునది, మగగుఱి, మూత్రము. మేహతి సించతి మూత్రరేతసీతి మేహనం. శిశ్నము.
మేహము
సం. నా. వా. అ. పుం. తత్స. మేహయతే మూత్రయతే భృశమనేనేతి మేహః. దీని చేత మిక్కిలి మూత్రము కలుగును, రోగ విశేషము, (ఇది 20 విధములు కలది).
మైత్రావరుణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మిత్రావరుణయో రపత్యం మైత్రావరుణిః. మిత్రావరుణులకొడుకు, అగస్త్యుడు.
మైత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మిత్ర భావము, మిత్ర కర్మము, అనురాధానక్షత్రము. స్నేహము.
మైత్ర్యము
సం. నా. వా. అ. న. తత్స. మిత్ర భావము, మిత్ర కర్మము. ఒక సంకరజాతి.
మైథునము
సం. నా. వా. అ. న. తత్స. మిథున స్యేదం మైథునం. మిథున సంబంధమైనది. మిథునస్యకర్మ మైథునం. మిథునము యొక్క క్రియ, గ్రామ్య ధర్మము, కూడిక, పొందు.
మైరేయము
సం. నా. వా. అ. న. తత్స. మిరాయాం దేశే భవం మైరేయం. మిరయను దేశమందుపుట్టినది, చెఱుకురసమునచేసినకల్లు, మద్యము.
మోక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆత్మానం పాశేభ్యః మోచయతీతి మోక్షః. జీవుని పాశముల వలన విడిపించునది. మోక్షతి సహతే పశ్వాది సంమర్ధమితి మోక్షః. పశ్వాది సంమర్ధమును సహించునది, కైవల్యము, విడుపు, మొక్కము, ముక్తి, మరణము, మేరుపు.
మోఘ
సం. నా. వా. అ. న. తత్స. ముహ్య త్యత్ర పురుషో భ్రాన్తివశాదితి మోఘం. దీనియందు పురుషుడు భ్రమించును, కలిగొట్టు, వ్యర్ధము.
మోఘ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కలిగొట్టు వృక్ష విశేషము.
మోచ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రసం ముంచతీతి మోచా. రసమును విడుచునది. ముఞ్చతి త్వచం మోచ. పట్టలను విడుచునది, అరటి, బూరుగు, అ. పుం. తత్స. (మునగ). పాటల వృక్షము, చెట్టుపాలు.
మోచక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ముంచ త్యుగ్ర గంధం మోచకః. ఉగ్ర గంధమును విడుచునది, ముచ్చె. (అరటి) అ. పుం. తత్స. మునగ, విణ. తత్స. విడుచునది, విసుగునది.
మోదకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుడుము, లడ్డు, సంతుష్టుడు.
మోరట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మురతి వేష్టతీతి మోరటా. చుట్టుకొనునది, చాగ (వృక్ష విశేషము).
మోరటము
సం. నా. వా. అ. న. తత్స. మురతి భువం వేష్టయతీతి మోరటం. భూమిని చుట్టిఉండునది, ఊడుగుబువ్వు, చెఱుకువేరు, ఈనిన మూడుదినములకు పైబడ్డపాలు, మజ్జిగ, లేగటి పాలు, దూర్వగడ్డి.
మోషకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ముష్ణాతీతి మోషకః. దొంగిలించువాడు, దొంగ, తస్కరుడు.
మోహము
సం. నా. వా. అ. పుం. తత్స. మోహనం మోహః. సొమ్మసిల్లుట, అజ్ఞానము, మూర్ఛ, వలపు.
మౌకలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మూకలస్య యమస్యాయం మౌకళిః. మూకలు డనగా యముడు, అతని సంబంధమైనది, కాకి, వాయసము.
మౌక్తికము
సం. నా. వా. అ. న. తత్స. ముచ్యతే శుక్తిసంపుటాదితి ముక్తాము క్తైమ మౌక్తికం. ముత్యపు చిప్పల వలన విడువబడునది మౌక్తికము, ముత్యము, ముత్తెములు, (ఏనుగు కుంభస్థలము, మేఘము, పందికోఱ, శంఖము), మత్స్య శిరము, పాముపడగ, చెఱకు, బొంగు వెదురు దీని యందు పుట్టును. ముత్యపు చిప్పయందు పుట్టినవే తరచుగా వాడబడును.
మౌద్గీనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ముద్గానాం భవనోచితం క్షేత్రం మౌద్గీనం. పెసలు పండుపొలము, చిక్కుళ్లు పండు పొలము.
మౌనము
సం. నా. వా. అ. న. తత్స. మునేర్భావో మౌనం. ముని యొక్క భావము, మౌనము, మాటలాడకుండుట.
మౌరజికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మద్దెలకాడు, మార్దంగికుడు.
మౌర్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మూర్వా వృక్షవిశేషః తద్వికారోమౌర్వీ. మూర్వా అనగా చాగ, దానిచేత చేయబడినది, అల్లెత్రాడు, వస, వింటినారి.
మౌళి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మల్యత ఇతి మౌళిః. ధరింపబడునది, నేల. ఇ. పుం. తత్స. సిగ, కొప్పు, కిరీటము, అశోకము, శిరోభూషణము, ముడిచిన జుట్టు.
మౌహూర్తికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ముహూర్తం కాలం వేత్తీతి మౌహూర్తికో మౌహూర్తశ్చ. ముహూర్తము నెఱిగినవాడు, జోస్యుడు, జోతిష్యుడు.
మ్లిష్టము
సం. విణ. (అ. ఆ.అ) తత్స. మ్లేచ్ఛ్యత ఇతి మ్లిష్టం. స్పష్టముగా పలుకబడనిది, స్పష్టముకానిది (మాట), వాడినది. అస్పష్ట భాషణము.
మ్లేచ్ఛ దేశము
సం. నా. వా. అ. పుం. తత్స. మ్లేచ్ఛానాం దేశః మ్లేచ దేశః. తురకల దేశము, భారతవర్షమునకు తుదనుండెడు, కామరూపాది, ప్రత్యంతదేశము.
మ్లేచ్ఛ ముఖము
సం. నా. వా. అ. న. తత్స. మ్లేచ్ఛదేశే ముఖ్యత్వాత్ మ్లేచ్ఛముఖం. మ్లేచ్ఛదేశమందు ముఖ్యమైనది, రాగి, తామ్రము.