హల్లులు : య

యకృత్తు
సం. నా. వా. త్. న. తత్స. క్లోమ్నోద్వితీయమాత్మానం కరోతీతి యకృత్. కడుపులో కుడిదిక్కుననల్లనైఉండుమాంస విశేషం, కారిజము.
యక్షకర్ధమము
సం. నా. వా. అ. పుం. తత్స. యక్షప్రియత్వాదార్ద్రత్వేన కర్దమ తుల్యత్వాచ్చ యక్షకర్ధమః. యక్ష ప్రియమై ఆర్ద్రత్వము చేత పంకతుల్యమైఉండునది, కర్పూరము, అగరు, చందనము, కస్తూరి, తక్కోలము, కుంకుమ పువ్వు వీనితో చేయబడిన కలపము, ఒక సుగంధలేపనము.
యక్షధూపము
సం. నా. వా. అ. పుం. తత్స. యక్షప్రియో ధూపః యక్షధూపః. యక్షులకు ప్రియమైన ధూపము, సజ్జరసము, గుగ్గిలము.
యక్షరాట్టు
సం. నా. వా. జ్. పుం. తత్స. యక్షేషు రాజతే యక్షరాట్. యక్షులకు ప్రభువై ప్రకాశించువాడు, జక్కులఱేడు, కుబేరుడు.
యక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. యక్ష్యంతే పూజ్యంతే యక్షాః. పూజింపబడువారు. యక్షేషు రాజతే యక్షరాట్. యక్షులకు ప్రభువై ప్రకాశించువాడు. దేవ యోని విశేషము, కుబేరుడు, ఒక క్షుద్రదేవత, కుక్క మున్నగువారు.
యక్ష్మము
సం. నా. వా. అ. న్. పుం. తత్స. యక్ష్యతే రోగేషు యక్ష్మా. రోగములయందు రాజవుటవలన పూజింపబడినది, క్షయరోగము, ఒకరోగము.
యజమానుడు
సం. నా. వా. అ. పుం. తత్స. యజతే యష్ట యజమానశ్చ యాగము చేయువాడు, యజ్ఞకర్త, గృహస్థుడు. యజతీతి యజమానః. సోమయాజి.
యజస్సు
సం. నా. వా. స్. న. తత్స. ఇజ్యంతే అనేనేతి యజుః. దీనిచే దేవతలు పూజింపబడుదురు, ఒక వేదము, యజుర్వేదము.
యజ్ఞ సూత్రము
సం. నా. వా. అ. న. తత్స. ఉపవీయతే వామస్కంధో అనేనేతి ఉపవీతం యజ్ఞ సూత్రంశ్చః. ఎడమభుజము దీనిచేత కప్పబడును. కుడిచేయి తొడగబడుచుండగా ఎడమ భుజము మీదనుండు జన్నిదము, యజ్ఞోపవీతము.
యజ్ఞము
సం. నా. వా. అ. పుం. తత్స. యజతే యజ్ఞః. పూజించుట, యాగము, వేలిమి (పంచమహా యజ్ఞములు, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము).ఇజ్యతే హవిర్దీయతే అత్ర ఇతి యజ్ఞః. హోమము, హవనము, యాగము, అగ్ని, ఆత్మ, విష్ణువు.
యజ్ఞాంగము
సం. నా. వా. అ. పుం. తత్స. యూపాది రూపేణ యజ్ఞస్యాంగముపకరణమితి యజ్ఞాంగః. యూపాది రూపము చేత యజ్ఞమునకు అంగమైఉండునది, మేడి, జింక.
యజ్ఞియము
సం. నా. వా. అ. పుం. తత్స. యజ్ఞార్హం యజ్ఞియం. యజ్ఞమునకు అర్హమైన వస్తువుపేరు, ముంజదర్ప, ద్వాపరయుగము. విణ. తత్స. యజ్ఞకర్మమునకు తగినది, యజ్ఞమునకు హితమైనది.
యజ్వ
సం. నా. వా. న్. పుం. తత్స. యజతేస్మ యజ్వా. యాగము చేసినవాడు, విద్యుక్తముగా యజ్ఞము చేసినవాడు, సోమయాజి.
యతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. యచ్ఛంతి ఇంద్రియేభ్య ఇతి యతయః పద్య విశ్రమస్థానము, నియతి. ఇ. పుం. తత్స. తాళప్రాణ కళావిశేషము, సన్న్యాసి, (వైష్ణవయతికి బ్రహ్మసూత్రము, త్రిదండము, చర్మవస్త్రము, శిక్యము, బ్రుసి, కౌపీనము, కటి వేష్టనమును కలవు), చర, సహనము. ఇంద్రియముల వలన చాలించినవారు.
యథాజాతుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. జాత ఇవ వివేకశూన్యత్వాధితి యథాజాతః. వివేకశూన్యుడౌటు వలన పుట్టిన నాటి వలె ఎల్లప్పుడు నుండువాడు, ఎఱుకలేనివాడు, మూర్ఖుడు.
యథార్ధము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. యథార్థముక్తవాన్నాన్యత్ గురు వ్యక్తి యథార్ధః. సత్యము, ఉచితముగా.
యదృచ్ఛ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్వయమృచ్ఛా ఇచ్ఛా యదృచ్ఛా. తనయిచ్ఛగనుక, ఇచ్చచొప్పు, అకస్మాత్తుగా.
యధార్హ వర్ణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. యథార్హో యోగ్యో వర్ణః ప్రకారోస్యాస్తీతి యథార్హవర్ణః. వేగువాడు, చారుడు.
యమము
సం. నా. వా. అ. పుం. తత్స. యమనాత్ యమాః యమయతీతియమః. దండిచువాడు. యమయతి నియమయతి జీవానాం ఫలాఫలమితి యమః. సం. నా. వా. అ. న. తత్స. యమ్యతే చిత్తమనేషయమః. దీనిచేత మనస్సు నిలుపబడును, యమళము, హింసాదులవలన నుడుగుట, శరీరమునే సాధనముగా కలిగిన ఒక యోగాంగము, (ఇది దశవిధము, సత్యము, దయ, క్షమ, దృతి, మితాహారము, ఆర్జనము, బ్రహ్మచర్యము, అస్తేయము, అహింస, శౌర్యము). యముడు, చెడ్డలక్షణములకలగుఱ్ఱము, జత, అశ్వగతి భేదము, నిగ్రహము, జోడు.
యమున
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యమేన సహజాతాయమునా. యమునతో కూడ పుట్టినది, ఒకానొకనది, పార్వతి.
యమునాభ్రాత
సం. నా. వా. ఋ. పుం. తత్స. యమునానద్యాః భ్రాతాయమునాభ్రాతా. యమునానదికి తోడపుట్టినవాడు, యముడు, జమునసైదోడు.
యమువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. విసృష్ణోదేశే దేశే యాతీతి యముః. విడువబడినదియై ప్రతీదేశమునకు పోవునది, గుఱ్ఱము. అశ్వమేథయాగ ధీక్షితునిచే విడువబడిన గుఱ్ఱము.
యవకము
సం. నా. వా. అ. పుం. తత్స. యౌతి తుషేణేతియవః. పొట్టుతోకూడు కొనియుండునది, అలసందెలు, కారుమినుములు. ఒకధాన్యము, ఐదువందలడెబ్బై ఆరుత్రసరేణువులు.
యవక్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. యవకానాం భవనో చితం క్షేత్రం యవక్యం. యవకలు శాలి విశేషములు అవిపండుటకుఉచితమైన పొలము, యవలు పండునది, యవభేదము.
యవక్షారము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్జికాదికృతః క్షార స్సర్జికాక్షారః. సర్జక వృక్షముల చేత చేయబడినది, యవలు వలన కల్గిన ఉప్పు, నత్రము.
యవనిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యువం త్యత్ర జనా ఇతి యవనికా. జనులు దీనియందు కూడుదురు, తెర, తెరచీర.
యవఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. యవసదృశాని ఫలాన్యస్యేతి యవఫలః. యవలవంటి బియ్యముకలది, కొడిసె, వెదురు.
యవసము
సం. నా. వా. అ. పుం. తత్స. యౌతీతి యవసః. కూడియుండునది, తృణము, గడ్డి, బీడుగడ్డి.
యవాగువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. యూయతే తండు లాదినేతి యవాగూః. బియ్యము మొదలైన దానితో కూర్చబడునది, జావ, అన్నపు గంజి.
యవాగ్రజము
సం. నా. వా. అ. పుం. తత్స. యవాగ్రైర్జన్యత ఇతి యవాగ్రజః. యవాగ్రముల చేత పుట్టింపబడునది, యవక్షారము, యవతృణము నుండి తయారైన ద్రవము.
యవీయసుడు
సం. నా. వా. న్. పుం. తత్స. అతిశయేన యువా యవీయాక్. మిక్కిలి చిన్నవాడు, తమ్ముడు. సం. విణ. తత్స. చిన్నవాడు, యువ.
యవ్యము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. యవానాం భవనోచితం క్షేత్రం యవ్యం. యవలు పండుటకు అనుకూలమైన స్థలము, యవలు పండునది (పొలము), యవక్యము, యవోచితము, మాసము.
యశః పటహము
సం. నా. వా. అ. పుం. తత్స. యశోర్ధః పటహః యశః పటహః. కీర్తి కొరకైన పటహము కనుక యశః పటహము, ఢక్ అనెడి శబ్దమును పలుకునది, వాద్యవిశేషము, ఢంకా.
యశస్సు
సం. నా. వా. స్. న. తత్స. యాతి దేశాంతరమితి వా యశః. దేశాంతరమును పొందునది, కీర్తి. అశ్నుతే వ్యాప్నోతీతి యశః. అశ్నుతే దిశ ఇతి యశః. దిక్కులను వ్యాపించునది.
యష్ట
సం. నా. వా. ఋ. పుం. తత్స. యజతే యష్టా. యాగముచేయువాడు, యజ్ఞకర్త, యజమాని.
యష్టి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. యజతే సంగచ్ఛతే ఇత యష్టిః. హారముపేట, ఆయుధ విశేషము, అతిమధురము, చేతికఱ్ఱ, టెక్కెపుకామ, కఱ్ఱ, ఒక కత్తి, యష్టిమధుకము.
యష్టిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నూరు పేటలహారము.
యష్టిమధుకము
సం. నా. వా. అ. న. తత్స. యష్టి రూపం మధుకం యష్టిమధుకం. కోల వంటిమథుకము, అతిమధురము. యష్టాయాం మధు మాధుర్యమస్య ఇతి యష్టిమధుః.
యాగము
సం. నా. వా. అ. పుం. తత్స. యజనం యాగః. పూజించుట, యజ్ఞము, వేలిమి. ఇజ్యతే ఇతి యాగః.
యాచకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. యాచత ఇతి యాచకః. అడుగువాడు, అడిగెడువాడు. యాచతే ఇతి యాచకః. భిక్షుకుడు, భిక్షగాడు.
యాచనకుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. యాచ్యతే అనేనేతి తత్కాయతీతి యాచనకః. అడుగువాడు, యాచకుడు, భిక్షగాడు. యాచత ఇతి యాచనకః. ఇమ్మని అడుగువాడు.
యాచనా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యాచనం యాచన. అడుగుట, యాచనము, అర్థించుట, భిక్ష, అభిశస్త.
యాచితకము
సం. నా. వా. అ. న. తత్స. యాచ్ఞయా ప్రాప్తం యాచితకం. అడిగి తెచ్చుకొనిన వస్తువు, ఎరువు, భిక్షమెత్తుకొనుట.
యాచ్ఞ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యాచనం యాచ్ఞా. భిక్ష, అడుగుట, యాచన.
యాజకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఋతౌ వసంతాదౌ యాజయన్తి ఋత్విజః యాజకాశ్చ. వసంతాది ఋతువులయందు యాగము చేయించువారు, యాజ్ఞికుడు, ఋత్విక్కు.
యాత యామము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. యాతో యామః కాలోస్యేతి యాతయామం. సారాంశము లేనిది, జీర్ణించినది, విడువబడినది, అనుభవించి విడువబడినది. జాము క్రింద వండబడినది, ఎంగిలి.
యాత
సం. నా. వా. ఋ. స్త్రీ. తత్స. య తన్తే గృహకృత్యే యాతా. గృహకృత్యమందు కలసి యత్నము చేయునది, తోడికోడలు. సం. విణ. తత్స. పోవువాడు. యతతే అన్యోన్యభేదాయేతి యాతా.
యాతన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యాత యతీతి వాయాతనా. ఉపద్రవించుటకై ప్రయత్నము చేయించునది, తీవ్రవేదన, కాఱియ, కారణ, అతివ్యథను అనుభవించునది.
యాతుధానుడు
సం. నా. వా. అ. పుం. తత్స. యాతునామధీయతే అస్మిన్నితి యాతుధానః. యాతువనెడి నామము ధరించినవాడు, నిర్చృతి, రాక్షసుడు. యాతూని రక్షాంసి దధాతి పుష్ణాతీతి యాతుధానః.
యాతువు
సం. నా. వా. ఉ. న. తత్స. యాత యతి వ్యథయతీతి యాతు. వ్యథపెట్టెడి వాడు, రాక్షసుడు, అధ్వగుడు, యముడు, వాయువు, పోవువాడు. సర్వేషామంతం యాతీతి యాతు.
యాత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యాంత్యస్యామితి యాత్రా. దీనియందు కదలిపోవుదురు, పుణ్యక్షేత్రములను గూర్చిపోవుట, కాలముపుచ్చుట, జాతర, పోవుట. ప్రయాణము, ప్రస్థానము, గమనము, యానము, ప్రాణనము, యాపనము, జీవనము.
యాదః పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. యాదసాం జలజంతూనాం పతిః యాదః పతిః. యాదస్సులనగా జలజంతువులు, వానికిపతి, సముద్రుడు, వరుణుడు.
యాదసాంపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. యాదసాం జలజంతూనాం పతిః యాదసాంపతిః. సముద్రుడు, వరుణుడు.
యాదస్సు
సం. నా. వా. స్. న. తత్స. యాన్తీతి యాదాంసి. చరించునవి, క్రూరజలజంతువు. యాంతి వేగేనేతి యాదః. జలజంతు విశేషము.
యానపాత్రము
సం. నా. వా. అ. న. తత్స. యానాయా పాత్రం యాన పాత్రం. గమనమునకు యోగ్యమైన పాత్రము, జనులెక్కి పోయెడి ఓడ, జోగు.
యానము
సం. నా. వా. అ. న. తత్స. యాత్యనేన యానం. దీనిచేత నరుడు పోవును, పోవుట, (తనకువృద్ధి కలిగి నప్పుడైనను పరునికి క్షయము కలిగినప్పుడైనను) దండెత్తిపోవుట), షడ్గుణములలో ఒకటి, ఇది పంచవిధము. 1. సంధాయయానకము పరుని తనకు వశపరచుకొని దుర్గాదులను గ్రహింపవలయునని కదలిపోవుట. 2. ప్రసంగ యాము. ఒక దిక్కునకు కదలిపోయి పొసగుడుపడినచో మరియొక్క దిక్కునకు కదలిపోవుట) 3. విగృహ్యయానము-శత్రువును సంహరింపవలయుననియేకదలిపోవుట. 4. సంభూయయానము- శత్రువును గెలువ శక్యముకానిచో సరిరాజులను కూర్చు కొని కదలిపోవుట. 5. ఉపేక్ష్యయానము- నేనేశత్రువులను సంహరింపగలనను తలపుతో దేశకాలాదులను పరికింపక కదలిపోవుట, గజాది వాహనము, సంధ్యాదులగు ఆరుగుణములలో ఒకటి, వాహనము, ప్రయాణము.
యాప్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. యాపనీ యో యాప్యః. ద్రొబ్బతగినవాడు, యాపనము చేయదగినది, నికృష్టమైనది, నింద్యము, పంపతగినది.
యాప్యయానము
సం. నా. వా. అ. న. తత్స. యాప్యైరధమైర్యాయత ఇతి యాప్యయానం. యాప్యులనగా అధములు, వారిచేత వహింపబడునది, పల్లకి. యాప్య అధమం యానం వాహనం ఇతి యాప్యయానం, సిబిక.
యామము
సం. నా. వా. అ. పుం. తత్స. యాతీతి యామః. స్థాయిగానిది. చాలించుట, జాము, శరీరమునే సాధనముగా కలిగిన ఒక యోగాంగము, సంయమము. యాతి యాయ్యతే వా యామః. ప్రహరము, గమనము, దేవగణభేదము, నిగ్రహము.
యామిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. యామా అస్యాం సంతీతి యామినీ. యామములు కలిగినది, రాత్రి, పసుపు, తమస్విని, యామిక.
యామునము
సం. నా. వా. అ. న. తత్స. యమునాయాం భవం యామునం. యమున యందు పుట్టినది, నీలాంజనము, ఒక రత్నము.
యాయజూకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పౌనః పున్యేన యజతే యాయజూకః, పలుమాఱు యాగము చేయువాడు. పునః పునః యజతి యాయజూకః. యజ్ఞము చేయు స్వభావము కలవాడు, సోమయాజి.
యావకము
సం. నా. వా. అ. పుం. తత్స. యౌతీతి యావకః. కలిసియుండునది, యవకము యొక్క రూపాంతరము, యవభేదము.
యావనము
సం. నా. వా. అ. పుం. తత్స. యవనదేశే భవః యావనః. తురుష్క దేశమందు పుట్టినది, చిల్లమడ్డి, యవనసంబంధమైనది.
యావము
సం. నా. వా. అ. పుం. తత్స. యౌతి వస్త్రాదినాయావః. వస్త్రాదులతో కూడునది, లత్తుక, లక్క.
యాష్టీకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. యష్టిః ప్రహరణ మస్యేతి యాష్టీకః. యష్టి అనగాలగుడము అది ఆయుధముగాకలవాడు, దుడ్డు గఱ్ఱ ఆయుధముగా కలవాడు.
యాసము
సం. నా. వా. అ. పుం. తత్స. యాతి ప్రసూతి యౌతి చయాసః. వ్యాపించునది, తీటకసింద, ఒక చెట్టు.
యుక్తము
సం. నా. వా. అ. న. తత్స. న్యాయేన యుజ్యతే యుక్తం. న్యాయముతో కూడినది, కూడుకొన్నది, లెక్కకలియకూడినది, తగినది. యుజ్యతే స్మ యుక్తం. న్యాయం, బార, న్యాయంతో కూడుకొన్నది, ఉచితము, కలిసినది.
యుక్తరసము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రసేన యుక్తాయుక్తరసా. రసముతో కూడినది, సన్నరాష్టము.
యుగంధరము
సం. నా. వా. అ. పుం. తత్స. యుగంధరతీతి యుగంధరః. యుగమనగాకాడి దానిని ధరించునది, కూబరము, బండిలోనగువానినొగ, ఒక దేశము, రథస్తంభము.
యుగపత్రకము
సం. నా. వా. అ. పుం. తత్స. యుగం యుగళం పత్రమస్య యుగపత్రకః. జోడుగా నుండునట్టి ఆకులు కలది, ఎఱ్ఱకాంచనము, కాంచనము, ఒక్కసారి.
యుగపార్శ్వము
సం. నా. వా. అ. పుం. తత్స. యుగపార్శ్వే గచ్ఛతీతి యుగపార్శ్వగః. కాడియొక్క పార్శ్వమునందు పోవునది, మరపుటకు, కాడి మోసెడి ఎద్దుల దాపునకు కట్టెడి ఎద్దు.
యుగము
సం. నా. వా. అ. న. తత్స. యుజ్యత ఇతి యుగః. కూర్పబడునది, కృతాది (ఇవి నాలుగు కృత, త్రేతా ద్వాపర, కలి) జత, బార, బుద్ధియను గంధద్రవ్యము, బండిలోనగువానికాడి, తొంభై ఆరు అంగుళములు, జోడు, నాలుగు యుగములు.
యుగళము
సం. నా. వా. అ. న. తత్స. యుజ్యతే యుగళం. పరస్పరము కూడుకొనియుండునది, జత, యుగ్మము. యుజ్యతే పరస్పరం సంగచ్ఛతే ఇతి యుగళం, జోడు.
యుగ్మము
సం. నా. వా. అ. న. తత్స. యుజ్యతే యుగ్మం. పరస్పరము కూడుకొని యుండునది, జత,యుగళము, మేళనము, గజాది వాహనము, కాడి మోసెడి, ఎద్దు, రెండు, సరిసంఖ్య.
యుగ్యము
సం. నా. వా. అ. న. తత్స. యుగం వహతీతి యుగ్యం. కాడిని వహించునది, గజాది వాహనము, కాడిమోసెడిఎద్దు. యుగాయ హితమితి యుగ్యం. వాహనము, యానము, శివ ధనస్సు.
యుద్ధము
సం. నా. వా. అ. న. తత్స. యుధ్ధ్యత ఇతి యుద్ధం. పోరుట, సమరము, కయ్యము, (ఇది త్రివిధము-ప్రకాశ యుద్ధము, కూట యుద్ధము, పార్ష్ణియుద్ధము), యోధనము, జన్యము, ప్రధనము, ప్రవిధారణము, రణము, కలహము, విగ్రహము, సమాఘాతము, సంయుగము, సంయత్తు, సమితి, దారణము, తీక్ష్ణము, విదారము, పోరు.
యువ
సం. నా. వా. న్. పుం. తత్స. యౌతి స్త్రీ భిః యువా. స్త్రీలతో కూడువాడు, ఒక సంవత్సరము, ప్రాయపువాడు. (పదహాఱేండ్లు మొదలు ముప్పది ఏండ్ల వఱకు కల వయస్సువాడు), సహజమైన బలముకలవాడు, శ్రేష్ఠుడు, యువకుడు.
యువతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పుంసాయౌతీతి యువతిః. పురుషునితో కూడునది, ప్రాయముగల ఆడుది, మునగ, తరుణి, ఆడుది, జవ్వని.
యువరాజు
సం. నా. వా. అ. న. తత్స. యువా చాసౌ రాజా చ యువరాజః. పిన్నఱేడు, చిన్నరాజు, కర్ణుడు.
యూథము
సం. నా. వా. అ. న. తత్స. యౌతి మిశ్రీభవతీతి యూథం. కూడికొని ఉండునది, ఒకే జాతి పక్షుల గుంపు, పశు పక్షి సమూహము, సజాతీయ సమూహము.
యూధనాధము
సం. నా. వా. అ. పుం. తత్స. యూథస్యనాథోయూథనాథః. యూధమనగా సమూహము, దానికి నాధుడు, పరికాడు, గుంపు, ఏనుగు.
యూధపము
సం. నా. వా. అ. పుం. తత్స. యూథం పాతీతి యూథపః. సమూహమును పాలించునది, పరికాడు, ఏనుగు.
యూధిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యూధో జాల మస్యా ఇతి యూధికా. గుంపు కలిగియుండునది, అడవి మొల్ల, పెద్దగోరంట. యూథం పుష్పవృన్దమస్యా అస్తీతి యూధికా. గణిక, శిఖండిని, పుష్పవిశేషము, మల్లె.
యూపము
సం. నా. వా. అ. పుం. తత్స. యూపార్హత్వాద్యూపః. ధూపమునకు అర్హమైనది. యజ్ఞమునందు పశుబంధనార్దమునాటిన పాలకొయ్య, పైపట్టలేని కొయ్య, గంగరావి, యజ్ఞ పశుస్తంభము.
యూషము
సం. నా. వా. అ. పుం. తత్స. పప్పు కట్టు.
యోక్త్రము
సం. నా. వా. అ. న. తత్స. యుజ్యతే అనేన యోక్త్రం. దీనిచేత కట్టబడును, పశువుల మెడపలుపు, కాడి పలుపు.
యోగము
సం. నా. వా. అ. పుం. తత్స. యుజ్యత ఇతి యోగః. కూర్చబడునది, అపూర్వ వస్తుప్రాప్తి, ధ్యానము, (ఇది అష్టవిధము) విష్కం బాది (ఇది ఇరువదిఏడు, విష్కంభము, ప్రీతి, ఆయుష్మత్తు, సౌభాగ్యము, శోభనము, అతిగండము, సుకర్మము, ధృతి, శూలము, గండము, వృద్ధి, ధ్రువము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, వరీయస్సు, పరిఘశివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుభ్రము, బ్రహ్మము, ఐంద్రము, వైధ్రుతి). ఉపాయము, కూడిక, కూర్పు, కవచము, ప్రయత్నము, ద్రవ్యము, వ్యాకరణాది సూత్రము, ఔషధము, మూలిక చేత చేసెడి యుచ్చటనాది క్రియ, జ్ఞానము, కృతజ్ఞుడు, పొందుట.
యోగేష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. సువర్ణ కరణ యోగే ఇష్టం భవతీతి యోగేష్టం. బంగారముచేయు యోగమునందు ఇష్టమైనది, సీసము.
యోగ్యము
సం. నా. వా. అ. న. తత్స. జౌషధ యోగే సాధు యోగ్యం. ఔషధ యోగముల యందు మంచిది, బుద్ధియనెడు గంధద్రవ్యము తగినది, ఉపాయముకలది, నేర్పుకలది, శక్తికలది, పుష్యమి, వాహనము, పాలు, యంత్రము, రొట్టె, రథము, చందనము, భూమి, అభ్యాసము, ఉచితము, శుభము.
యోజనవల్లి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ధీర్ఘవల్లీ త్వాద్యోజన వల్లీ. నిడుపైన తీగ కలది, మంజిష్ఠ, దోస.
యోత్రము
సం. నా. వా. అ. న. తత్స. యూయతే అనేన యోత్రం. దీనిచేత కట్టబడును, యోక్త్రము యొక్క రూపాంతరము, కాడి పలుపు.
యోధ
సం. నా. వా. అ. పుం. తత్స. యుధ్ధ్యంత ఇతి యోధాః. యుద్ధము చేయువారుకనుక యోధులు, యోక్త్రము యొక్క రూపాంతరము.
యోని
సం. నా. వా. ఇ. పుం. తత్స. యౌతి శిశ్నేన యోనిః. శిశ్నముతో కూడుకొనినది, యోతి సంయోజయతీతి యోనిః. భగము, వరాంగము, స్మరమందిరము, రతిగృహము, అధరము, ఉపస్థము, అప్రదేశము, ప్రకృతి, పుష్పి, అపథము, స్మరాగారము, రత్యంగము, సంసారమార్గము, గుహ్యము.
యోష
సం. నా. వ. ఆ. స్త్రీ. తత్స. యౌతి పుంసాయోషిత్. పురుషునితో కూడు కొనునది, ఆడుది, ఇంతి, వనిత.
యోషిత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. యౌతి పుంసాయోషిత్. పురుషునితో కూడు కొనునది, ఇంతి, వనిత. యోషతి పుమాంసం, యుష్యతే పుభిరితి వా యోషిత్. ఆడుది, స్త్రీ.
యౌతకము
సం. నా. వా. అ. న. తత్స. యుతయో స్సంగత యోః స్త్రీ పుంస యోరిదం యౌతుకం. వివాహమందు కూడుకొనియున్న వధూవరుల సంబంధమైనది, ఆరణము, కట్నము.
యౌతవము
సం. నా. వా. అ. న. తత్స. పునాతి ధాన్యాది మానం శోధయతీతి పోతుః తస్యేదం యౌతవం. దీని చేత కొలువబడును, త్రాసు, మూర, తూములోనగుమానము, యువతి సమూహము.
యౌవతము
సం. నా. వా. అ. న. తత్స. యువతీనాం సమూహః యౌవతం. యువతుల యొక్క సమూహము.
యౌవనము
సం. నా. వా. అ. న. తత్స. యూనో భావః యౌవనం. పిన్నవయస్సువాని యొక్క భావము, మంచిప్రాయము (పదాహారేండ్లు మొదలు యాభై ఏండ్ల వరకు కలది), యువతి సమూహము.