హల్లులు : ర
రంకువు
సం. నా. వా. ఉ. తత్స. రఞ్జయతి రజ్కుః. రాగమును పొందించునది, తెల్లని వెంట్రుకలును, మెత్తనితోలుకలయిఱ్ఱి. రమతే ఇతి రంకుః. మృగవిశేషము.
రంగము
సం. నా. వా. అ. పుం. న. తత్స. రంగతి ద్రవతి రంగం. కరుగునది. సం. నా. వా. అం. న. తగరము, సీసము. సం. నా. వా. అ. పుం. తత్స. యుద్ధభూమి, నాట్యస్థానము, రంగు, శ్రీరంగము, టంకణము, రాగము, ధాతువిశేషము, త్రసువు, ఆపూషము, వంగము, మధురము, హిమము, కురూప్యము, పిచ్చటము, పూతిగంధము.
రంగాజీవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రంగేన ఆజీవతీ రంగాజీవః. తెలుపు దీనిచే వర్ణాంతరమును పొందునది, చిత్తరువును రచించువాడు, చిత్రలేఖకుడు, నటుడు. రంగో హరితాళాదిస్తేన ఆజీవతీతి రంగాజీవః. చిత్రకారుడు.
రంజనము
సం. నా. వా. అ. న. తత్స. రంజయతీతి రంజనం. రక్తిమను చేయునది, ఇంగీలీకము, ఎఱ్ఱగంధము, సం. నా. వా. అ. పుం. రంజించునది.
రంజని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వస్త్రాదికం రంజయతీతి రంజనీ. వస్త్రాదులను నల్లగా చేయునది, నీలిచెట్టు.
రంధ్రము
సం. నా. వా. అ. న. తత్స. రణతి వాయునేతి రంధ్రం. గాలి చేత మ్రోయునది, బెజ్జము, సందు, దూఱు. రంధయతి హినస్త్యనేనేతి రంధ్రం. ఛిద్రము, దూషణము, యోని.
రంభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రమంతే అస్యాంరంభా. దీనియందు రమింతురు, ఒకానొక అప్సరసస్త్రీ, అరటిచెట్టు, వేశ్య, గోధ్వని. అ. నా. వా. పుం. తత్స. రంభతే రాగమూర్ఛనాదికమనేనేతి రంభః. రాగము చేత ఆనందింపచేయునది, వేణువు, బ్రహ్మచారి ధరించు వెదురుకోల, లగుడము, దండము, యష్టి, వానరవిశేషము, మహిషాసురపిత, రక్తబీజము.
రక్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. రక్తవత్పుష్పత యారక్తకః. ఎఱ్ఱని పువ్వులుకలది, పెద్దగోరంట, తోపుచీర, మంకెన, అనురాగము కలవాడు, తిలకవృక్షము.
రక్తపా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రక్తం పిబతీతి రక్తపా. రక్తపానమును చేయునది, రక్తమును తాగునది, జలగ, డాకిని.
రక్తఫల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రక్తం ఫలమస్యా ఇతి రక్తఫలా. ఎఱ్ఱని పండ్లుకలది, దొండ.
రక్తము
సం. నా. వా. అ. న. తత్స. రజ్యత ఇతి రక్తః. రాగమును పొందునది. లోహిత వర్ణ త్వాత్ లోహితం. ఎఱ్ఱని వన్నెకలది. నెత్తురు, కుంకుమ, కుంకుమపువ్వు, రాగి, అ. పుం. ఒక ఓషధి, ఎఱ్ఱచందనము, రజస్సు, అనురక్తుడు. ఎఱుపు, ఎఱ్ఱనిది, అనురాగముకలది, రంగువేయబడినది. రజ్యతే అంగమనేనేతి రక్తం. లోహితము, అస్త్రము, క్షతజము, శోణితము, అంగజము, త్వగ్జము, చర్మజము, వర్ణము.
రక్తసంధ్యకము
సం. నా. వా. అ. న. తత్స. సంధ్యావద్రక్తం రక్త సంధ్యకమ్. సంధ్యవలె రక్త వర్ణమైనది, చెంగలువ.
రక్తసరోరుహము
సం. నా. వా. అ. న. తత్స. రక్తం చ తత్ సరోరుహం చ రక్త సరోరుహం. ఎఱ్ఱనైనతామర, ఎఱ్ఱతామర, కుంకుమపువ్వు.
రక్తాంగము
సం. నా. వా. అ. న. తత్స. రక్తమంగమస్యేతి రక్తాంగః. ఎఱ్ఱనిది, కుంకుమ, పగడము, అ. పుం. కంపిల్లము, అంగారకుడు. నల్లి, ఒక వృక్షము.
రక్తోత్పలము
సం. నా. వా. అ. న. తత్స. రక్తం చతత్ ఉత్పలం చ రక్తోత్పలం. ఎఱ్ఱతామర, కెందమ్మి.
రక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రక్షణము, రక్షణమునకై బిడ్డలు మొదలైన వానికి కట్టెడుమూలికలోనగునది, రక్షణమునకైనొసట పెట్టుకొనుహోమభస్మము, లక్క.
రక్షణము
సం. నా. వా. అ. న. తత్స. రక్షణం రక్షణః. రక్షించుట, కాపు.
రక్షస్సు
సం. నా. వా. స్. న. తత్స. రక్షస్తే ఏ భ్యోరక్షాంసి. వీరినుండి జంతువులు కాపాడబడును. రక్ష ఏవ రాక్షసః. రాక్షసుడు. రక్షత్యస్మాదితి రక్షః.
రక్షితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. రక్ష్యతేస్మ రక్షితం. రక్షింపబడునది.
రక్షివర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. రక్షిణాం వర్గోరక్షివర్గః. రక్షకుల యొక్క సమూహము, అంగరక్షక సమూహము.
రచన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రచ్యతే రచనా. మునుపటి శృంగారమందు యత్నము చేయబడినది. మాల్యాది నిర్మాణము, కేశాలంకారము, అమరిక, కట్టుట, గ్రంథరచన.
రజకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రంజయతి వస్త్రాణి రజకః. కోకలకు వన్నెకలుగచేయువాడు, చాకలివాడు, నిర్ణేజకుడు. రజతి నిర్ణేజనేన శ్వేతిమానమాపాదయతి వస్త్రాదీనామితి రజకః. సంకర జాతి విశేషము, ధావకుడు, ఒకసంకరజాతి.
రజతము
సం. నా. వా. అ. న. తత్స. రజ్యతే తామ్రాదిక మనేనేతి రజతం. తామ్రముమొదలగునవి,దీనచేతరంజింపచేయబడును, వెండి, హారము, ఏనుగుకొమ్ము, తెల్లనిది. రజతి ప్రియం భవతి, రజ్యతే ఇతి వా రజతం. ధవళము, శోణితము, శైలము, రక్తము, సరస్సు, ముత్యాలసరము.
రజని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రంజతి కామినోత్ర రజనీ. దీని యందు కాముకులు రాగయుక్తులగుదురు, రాత్రి, పసుపు, కోరింద, నీలిచెట్టు, వాసనగల మొక్క, సరస్వతి.
రజనీముఖము
సం. నా. వా. అ. న. తత్స. రజన్యాః ముఖం రజనీముఖం. రాత్రి యొక్క ఆరంభము, ప్రదోషము, మునిమాపు.
రజస్వలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రజోస్త్యస్యా ఇతి రజస్వలా. రజస్సుకలిగినది, ముట్టుది, స్త్రీధర్మిణి, ఆత్రేయీ, మలిని, పుష్పవతి, ఋతుమతి, వలి, పుష్పిత, ఉదక్య, విఫలి, నిష్ఫలి, పాం---------------------------శుల.
రజస్సు
సం. నా. వా. స్. న. తత్స. రజ్జయతీతి రజః. దనీచేత రాగయుక్తులౌదురు. రంజ్యతే అనేనేతి రజః. ముట్టునెత్తురు. దీని చేత ఎఱ్ఱగా చేయబడును, ఒకగుణము, దుమ్ము, పుప్పొడి, తగరము, పరాగము, శరత్కాలము, బహిష్టు, వీర్యము.
రజ్జువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. సృజ్యత ఇతి రజ్జు. సృజింపబడునది, త్రాడు, ఆడుదాని జడ. సృజ్యతే రచ్యతే ఇతి రజ్జుః. గుణము, నూట తొంభైరెండు అంగుళములు.
రణము
సం. నా. వా. అ. పుం. తత్స. రణనం రణః. మ్రోయుట, “రణతీతి చరణః. యుద్ధము, మ్రోత, కొడుకు, ధ్వని.
రతము
సం. నా. వా. అ. న. తత్స. రమణం రతం. రమించుట, సురతము, ఆడుగుఱి, ఆసక్తము, సురతము.
రతిపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. రతేః పతిః రతిపతిః. రతీదేవికి భర్త, మన్మధుడు, మరుడు, కామదేవుడు,రతిప్రియుడు.
రత్నగర్భ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రత్నాని గర్భే మధ్యే అస్యాః సా రత్నగర్భా. భూమి, పుడమి, నేల, పృథివి.
రత్నము
సం. నా. వా. అ. న. తత్స. రమతేస్మిన్ మన ఇతి రత్నం. దీనియందు మనస్సు రమించును. రమస్తేస్మిన్నితి రత్నం. దీనియందురమింతురు, మణి (మరకతాద్యశ్యజాతి మౌక్తికాద్యనకిజాతియు) నవరత్నములు మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైఢూర్యము) స్వజాతి యందు శ్రేష్టమైనది. రమయతి హర్షయతీతి రత్నం, శ్రేష్ఠము, నీరమొదలగునవి.
రత్నసానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. రత్నమయాస్సావ వోయస్యసః రత్నసానుః. రత్నమయములైన చరులుకలది, మేరుపర్వతము, బంగారుకొండ. రత్నాని సానౌ ప్రస్థే యస్య సః రత్నసానుః.
రత్నాకరము
సం. నా. వా. అ. పుం. తత్స. రత్నానామాకరః రత్నాకరః. రత్నముల కెల్లగని యైనది, సముద్రము, రతనపుగని. రత్నానామాకారః ఉత్పత్తి స్థానం చ రత్నాకరః.
రత్ని
సం. నా. వా. ఇ. పుం. తత్స. రమస్తే వ్యవహారణీనేనేతి రత్నిః. దీనిచేత వ్యవహారులు క్రీడింతురు, పిడివెలితిమూర. రుచ్యతి ప్రాప్నోతి అనేన ఇతి రత్నిః.
రథకడ్య
సం. నా. వా. ఆ. పుం. తత్స. రథానాం సమూహోరథకడ్యాచ. రథముల యొక్క సమూహము, సారధులగుంపు.
రథకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రథకరోతీతి రథకారః. రథమునుచేయువాని పేరు, తేరుచేయువాడు, వడ్లవాడు. ఒకసంకరజాతి, వేటాడి జీవించువాడు, షరాబు, శిల్పి, ఆగమవేత్త, వడ్రంగి.
రథగుప్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. రథోగుప్యతేనేనేతి రథగుప్తిః. రథము దీనిచేత రక్షింపబడును, చక్రరంధ్రముల చొప్పించెడునెమ్ములు, పులుతోలులోనగు వానిచేత ఏర్పరచిన రథము, మీదికప్పు, వరూధము.
రథద్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. రథాయద్రుః రథద్రుః. రథము కొఱకైన వృక్షము, తినాసము.
రథము
సం. నా. వా. అ. పుం. తత్స. రమం తేస్మిన్ పక్షిణ ఇతి రథః. పక్షులు దీనియందు రమించును. రమస్తేత్ర రథః. దీని యందు క్రీడింతురు. తేరు, (బృహస్పతి రథము, నీతి ఘోషము, అర్జునునిరథము, నందిఘోషము, విష్ణు రథము శతానందము) శరీరము, తినిశము (వృక్ష విశేషము). వేతసము. రమ్యతే అనేనాత్ర రథః. చక్రములు ఉండెడి యుద్ధవాహనము, శతాంగము, స్యందనము,చరణము, వేతసవృక్షము.
రథాంగము
సం. నా. వా. అ. న. తత్స. రథాంగం చక్రం. రథచక్రము, చక్రవాకము. రథస్య అంగం చక్రం యస్య నామ్నీతి రథాంగః. రధము యొక్క భాగము.
రథి
సం. నా. వా. న్. పుం. తత్స. రథాః యేషాం సంతీతి రథినః. రథములుకలవారు. రథోస్యాస్తీతి రథినః. రథమును ఎక్కువాడు, రథమును ఎక్కియుద్ధము చేయువాడు, రథాస్వామి.
రథికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రథోస్యాస్తీతి రథికః. రథముకలవాడు, రథమునెక్కి యుద్ధము చేయువాడు, రథాస్వామి.
రథినుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రథోస్యాస్త్రీతి రథినః. రథమును కలవాడు, రథమును ఎక్కి యుద్ధము చేయువాడు.
రథ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. రథం వహతీతి రథ్యః. రథమును వహించునది, రథసమూహము, రాజమార్గము, మార్గము. రథమును ఈడ్చెడి గుఱ్ఱములోనగునది. (కృష్ణుని రథ్యములు, సైన్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము). రథానాం సమూహః రథ్యా. ఆవర్తని, రథాశ్వము, రథమునకుతగినది.
రథ్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రథాయహితా రథ్యా. రథమునకు యోగ్యమైనది. రథానాం సమూహోరథ్యా. రథముల యొక్క గుంపు, రాజమార్గము, మార్గము, రథాశ్వము, రథమునకు తగినది., అభ్యంతరమార్గము, ప్రతోలి, విశిఖ, ఆవర్తని, రథసమూహము, పంథ.
రదనచ్ఛదము
సం. నా. వా. అ. పుం. తత్స. రదనాః ఛాద్యంతే అనేన రదనచ్ఛదః. దంతములు దీనిచే కప్పబడియుండును, పెదవి, పలుకప్పు.
రదనము
సం. నా. వా. అ. పుం. తత్స. రద్యన్తే భక్ష్యాణ్యేభి రితి రదనాః. దీనిచేత భక్ష్యములు తునకలుగా చేయబడును, పల్లు, దశనము. రద్యతే అనేనేతి రదనః.
రదము
సం. నా. వా. అ. పుం. తత్స. రద్యన్తే భక్ష్యాణ్యేభిరితి రదనాః. దీనిచేత పదార్ధములు, భక్ష్యములు (తినేది) తునకలుగా చేయబడును, పళ్లు, దశనము, దంతాలు.
రదము
సం. నా. వా. అ. పుం. తత్స. రధ్యన్తే భక్ష్యాణ్యేభిదితి రదాశ్చ. వీనిచేత భక్ష్యములు తునకలుగా చేయబడును, పల్లు. రదతీతి రదః.
రభసమ
సం. నా. వా. అ. పుం. తత్స. వేగము, సంతోషము, ఉద్రేకము, ఉద్రిక్తుడు, విషము.
రమణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రమయతి నాయకమితి రమణీ. నాయకుని రమింపచేయునది, క్రీడించునట్టి ఆడుది, ఆడుది. రమతే అస్యామితి రమణీ. సుందరి, స్త్రీ.
రమణీయము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఒప్పిదమైనది.
రయము
సం. నా. వా. అ. పుం. తత్స. రయత్యనేనేతి రయః. దీనిచేత జనము గమనయుక్తమౌను, వేగము, ప్రవాహము.
రల్లకము
సం. నా. వా. అ. పుం. తత్స. రమంతే అస్మిన్నితి రల్లకః. దీనియందు క్రీడింతురు, కంబళి, పచ్చడము.
రవణము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. రౌతి తాచ్ఛీల్యేనేతి రవణః. స్వభావముననే మ్రోయువాడు, కంచుధ్వని, పెద్దపొట్ల, ఒంటి. రౌతీతి రవణః. శబ్దనము, తీక్ష్ణము, భండకము, చంచలము.
రవము
సం. నా. వా. అ. పుం. తత్స. రౌతీతి రవః. మ్రోత, ధ్వని, కంఠధ్వని. రూయతే ఇతి రవః. శబ్దము.
రవి
సం. నా. వా. ఇ. పుం. తత్స. రూయతే స్తూయత ఇతిరవిః. నుతింపబడువాడు, సూర్యుడు, జీవుడు.
రశనా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రసనాబంధోరతికలహేఘ. పదహారుసరములుకలది, పదహారుపేటలుకలఆడుదానిమొలనూలు. రసయతి స్వాదయతీతి రశనా(రసనా).
రశ్మి
సం. నా. వా. ఇ. పుం. తత్స. అశ్నుత ఇతి రశ్నిః. వ్యాపించునది, వెలుగు, పగ్గము, ఱెప్ప. అశ్నుతే వ్యాప్నోతీతి రశ్మిః. కిరణము, ప్రభ, పక్ష్మము, జ్వాల, త్రాడు.
రస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఏసే రసమాత్ర వాచకాః. సామాజికైః రస్యన్తే ఆస్వాద్యన్త ఇతి రసాః. సభాసదుల చేత ఆస్వాదింపబడునది. రస్యతే జౌషధత్వేనేతి రసః. జౌషధమౌట చేత ఆస్వాదింపబడునది. గంధప్రధానో రసోస్య గంధరసః.గంధముకలరసముకలది. రస్యత ఇతి రసః. ఆస్వాదింపబడునది, భూమి, రసాతలము, నాలుక, అందుగు, చిఱుబొద్ది, కొఱ్ఱలు, రసంగి, ధాన్యవిశేషము. మాధుర్యాదిరూపో వివిధో రసో అస్తి అస్యామితి రసా. భూమి, పృథివి, మంగచెట్టు, ఒక ఆకుకూర, పిచ్చి ఉల్లి, బంగారము, ధ్వని, గుగ్గిలము, ఒకసంకరజాతి, గుగ్గిలము, రుచి, శృంగారాదులు, ఒక ద్రవ్యాంజనము, అన్నసారము, మాంసరసము, షడ్రసములు, అరవైమూడు రసములు, అనురాగము, విషము, పాదరసము, వీర్యము.
రసగర్భము
సం. నా. వా. అ. న. తత్స. దార్వీరసోగర్బ ఉత్పత్తి స్ధానమస్యేతి రసగర్భం. మాని పసుపురసమేఉత్పత్తిస్థానముగాకలిగినది. రసాంజనము, ఇంగిలీకము. మైలతుత్తము.
రసజ్ఞ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రసం జానాతీతి రసజ్ఞా. రసను ఎఱుగునది, నాలుక, జిహ్వ, గంగ.
రసన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రస్యతే అనయారసనా. దీనిచేత ఆస్వాదింపబడును, నాలుక, రశన, జిహ్వ, కషాయము, ఆహారము, ద్రవము, జిడ్డు, పండు బంక, బంగారము, వెండి.
రసము
సం. నా. వా. అ. పుం. తత్స. రసాస్సంత్యస్యామితిరస. రసములు దీనియందు కలవు. రస్యత ఇతి రసా. చప్పరింపబడునది, పాదరసము, బోళము, జలము, శృంగారాది, (ఇవి తొమ్మిది –శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము, మతాంతరముల బట్టియీసంఖ్య హెచ్చుతక్కువలగును) కషాయాది (ఇవి ఆఱు కషాయము, మధురము, లవణము, కటువు, తిక్తము, ఆమ్లము) రుచి, పసరు, అనురాగము, వీర్యము, దేహధాతు విశేషము ద్రవము, విషము. రసతీతి రసః. ద్రవము, వీర్యము, గుణము, గంధరసము.
రసవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రసస్సంస్ర్కియమాణోస్యామస్తీతి రసవతి. సంస్కరింపబడు రసములు కలిగినది, వంటయిల్లు, మహానసము. రసో వివిధఖాద్యరసో విద్యతే అస్యామితి రసవతీ. వంట వండు స్థలము.
రసాంజనము
సం. నా. వా. అ. న. తత్స. దార్వ్యాః రసోద్భవమంజనం రసాంజనం. మానిపసుపు రసము వలన పుట్టినది, అంజనవిశేషము, మైలతుత్తము.
రసాతలము
సం. నా. వా. అ. న. తత్స. రసాయాః భూమేః తలమధోభాగః రసాతలం. భూమి యొక్క అధోభాగము, పాతాళము. రసాయాః తలం నిమ్నభాగస్థలోకవిశేషః రసాతలం.
రసాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రసం ఆలాతీతి రసాలః.రసము నిచ్చునది. రస్వతే రసాలః. ఆస్వాదింపబడునది, సిగరి, చక్కెర, నాలుక, గఱిక, తెల్లనేలగుమ్ముడు, చిల్లమడ్డి, బోళము, చెఱకు, మామిడి, జీలకఱ్ఱ, అల్లముమున్నగువానితో కలిసినమజ్జిగ.
రసితము
సం. నా. వా. అ. న. తత్స. రసతి శబ్దాయతే రసితం. మ్రోయుచుండునది, మేఘ గర్జనము, ధ్వని, మొలాము చేయబడినది, ధ్వనించునది.
రసోనకము
సం. నా. వా. అ. పుం. తత్స. షట్సురనేషు ఏకేన ఆమ్లరసేన ఊనః రసోనకః. షడ్రసములలో పులుసనెడి యొక్క రసములేనిది, వెల్లుల్లి.
రహస్యము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రహసి భవం రహస్యం. ఏకాంత స్థలమందు పుట్టినది, ఒక ఏరు, సం. నా. వా. అ. న. తత్స. రహస్యము. సం. విణ. దాచతగినది, వేదాంతము, ఉపనిషత్తు.
రహస్సు
సం. నా. వా. స్. న. తత్స. రమంతేత్రేతి వారహః. దీనియందు రమింతురు, ఏకాంతము, సురతము. రమంతే అస్మిన్నితి రహః. రతి, నిర్జనము, రహస్యము.
రాక్షస
సం. నా. వా. అ. పుం. తత్స. రక్ష ఏవ రాక్షసః. రాక్షసుడు, ఒక సంవత్సరము,బలాత్కరమున కన్యకను అపహరించి తెచ్చి చెసికొనెడు వివాహము, కౌణపుడు, పుణ్యజనుడు, భూతము, రాత్రి పూట చరించువాడు, నీలాంబరుడు, అసురులు.
రాక్షసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రక్ష్యంతే అస్యా ఇతి రాక్షసీ. దీని వలన రక్షింపబడును, రక్కసి, బలురక్కెస, నల్లకచోరము.
రాజకము
సం. నా. వా. అ. న. తత్స. రాజ్ఞాం సమూహోరాజకం. రాజలు యొక్క సమూహము, రాజసమూహము.
రాజన్యకము
సం. నా. వా. అ. న. తత్స. రాజన్యానాం సముహో రాజన్యకం. క్షత్రియుల యొక్క సముహము, రాజన్యులసమూహము.
రాజన్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రాజ్ఞః క్షత్త్రియ స్యాపత్యం పుమాన్ రాజన్యః. రాజుయొక్క అపత్యము, రాచవాడు. రాజ్ఞో అపత్యమితి రాజన్యః. క్షత్రియుడు, అగ్ని.
రాజన్వంతము
సం. విణ. (త్. ఈ. త్) తత్స. శోభనో రాజాన్యాస్తీతి రాజన్వాన్. మంచిరాజుకలది.
రాజబల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బల ప్రదవస్తుఘ రాజేవముఖ్యత్వాద్రాజబలా. బల ప్రదమైన వస్తువుల యందు రాజువలె ముక్యమైనది. గొంతెమ్మగోరు.
రాజబీజి
సం. నా. వా. న్. పుం. తత్స. రాజ్ఞాం బీజమస్యేతి రాజబీజీ. రాజ వీర్యము కలవాడు, రాచకులమునందుపుట్టినవాడు.
రాజరాజు
సం. నా. వా. అ. పుం. తత్స. రాజ్ఞాం యక్షాణాం రాజారాజరాజః. జక్కుల ఱేడు, చక్రవర్తి, కుబేరుడు, ధుర్యోధనుడు, చంద్రుడు. రాజ్ఞామపి రాజా ధనాధిపత్వాత్ రాజరాజః.
రాజవంతము
సం. విణ (త్. ఈ. త్). తత్స. రాజాస్త్యస్వరాజవాత్. మంచి రాజుకలది (దేశము).
రాజవృక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. రాజా చాసౌ వృక్షశ్చ రాజవృక్షః. వృక్షశ్రేష్ఠము, ఱేల, వ్యాఘాత వృక్షము.
రాజసూయము
సం. నా. వా. అ. న. తత్స. యజ్ఞవిశేషము, ఒకరాజు తక్కిన రాజులను జయించి చేసెడి యజ్ఞము. రాజా లతాత్మకః సోమః సూయో అత్ర రాజసూయం.
రాజహంస
సం. నా. వా. అ. పుం. తత్స. హంసేఘ శ్రేష్ఠత్వా ద్రాజహంసః. హంసలలో శ్రేష్ఠమైనది, ఎఱ్ఱనిముక్కు, కాళ్లు,గల హంస, ధూమ్ర వర్ణముకల ముక్కు, కాళ్లు,గలహంస, రాజశ్రేష్ఠుడు. హంసానాం రాజా శ్రేష్ఠత్వాత్ రాజహంసః. కదంబము, రాజుల యందు ఉత్తముడు, రాయంచ.
రాజాదనము
సం. నా. వా. అ. న. తత్స. రాజ్ఞా మదనం మృష్టత్వాత్ రాజాదనం. రాజులకు భక్ష్యమైనది. రాజభి రధ్యతే రాజాదనః. రాజులచేత భక్షింపబడునది, పాల మోదుగు, మోరటి, ప్రియాలచెట్టు.
రాజార్హము
సం. నా. వా. అ. న. తత్స. రాజ్ఞాం అర్హం రాజార్హం. రాజులకు యోగ్యమైనది, అగలు, రాజనకుతగినది.
రాజి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. రాజంతే రాజయః. ప్రకాశించునది, పంక్తి, రేఖ. రాజతే ఇతి రాజిః. పత్రరచన, తాలువు, చారలపాము, పొలము.
రాజిక
సం. నా. వా. అ. స్త్రీ. తత్స. రాజతే కృష్ణవర్ణపుష్పైః రాజికా. నల్లని పువ్వులచేత ప్రకాశించునది, నల్లావలు, వరిమడి, వరుస. రాజతే యా రాజికా. కృష్ణిక, పెద్దావలు.
రాజిలము
సం. నా. వా. అ. పుం. తత్స. రాజిః రేఖా అస్మిన్నస్తీతి రాజిలః. రేఖలు కలిగినది, ఇరుదలపాము.
రాజీవము
సం. నా. వా. అ. న. తత్స. రాజిః పజ్తిరస్త్యస్య రాజీవః. మత్స్యముల వరుస కలిగినది. కేసరరాజయోగాత్ రాజీవం మత్స్యవిశేషము. ఆకరుల పంక్తి కలిగినది, తామర, మృగ విశేషము, రాజును అనుసరించి జీవించునది. రాజీ అస్తస్యేతి రాజీవః. సారసపక్షి, ఒకజింక, తామర.
రాత్రించరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రాత్రౌ చరతీతి రాత్రించరః. రాత్రి అందు సంచరించువాడు భక్షించువాడును కనుక రాత్రించరుడు, తిరుగువాడు, తినువాడు, నిరృతి, రాక్షసుడు, దొంగ.
రాత్రిచరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రాత్రౌ చరతీతి రాత్రించరః. రాత్రియందు సంచరించువాడును, భక్షించువాడును, నిర్భతి, రాక్షసుడు.
రాద్ధాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. సిద్ధోరాద్ధః అంతో నిశ్చయో యస్మిన్ రాద్ధాంతశ్చ. దీనియందు నిశ్చయింపబడును, సిద్ధాంతము, సమయము.
రాధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రాథా విశాఖా, తద్యుక్తా పూర్ణిమాస్త్యస్మిన్నితిరాధః. రాధయనగా విశాఖ, దానితో కూడిన పున్నమికలది, ఒక గొల్లది, కర్ణుని పెంపుడుతల్లి, విశాఖ నక్షత్రము, మెఱపు, విష్ణుక్రాంతము, ఉసిరిక, వైశాఖమాసము.
రామ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రమతే కామశాస్త్రానుసారేణ కళాభిరితి రామా. గీతకళాదులు నేర్పిరమించునది, రమించునట్టి ఆడుది, ఆడుది. కుష్ఠము, వాస్తుకము, పెద్దదుప్పి, ఒప్పిదమైనది, తెల్లనిది, నల్లనిది.
రామఠము
సం. నా. వా. అ. న. తత్స. రమఠ దేశేభవత్వాత్ రామఠం. రమఠమను దేశమందు పుట్టినది, ఇంగువ.
రాముడు
సం. నా. వా. అ. పుం. తత్స. రమయతి మోదయతి రూపసంపదేతిరామః. రూపసంపదచేత సంతోషింపచేయువాడు. రమంతే రామః. బోయలు దీనిచూసిసంతోషింతురు. రమయతీతిరామః. రమింపచేయువాడు, రఘురాముడు, బలరాముడు, పరుశురాముడు, బలదేవుడు, శ్రీరామచంద్రుడు, రాఘవుడు, ఒక మృగము, అందమైనది, తెల్లనిది, నల్లనిది.
రాశి
సం. నా. వా. ఇ. పుం. తత్స. అశ్నుత ఇతి రాశిః. వ్యాపించునది, ప్రోగు, మేషాది (ఇవిపండ్రెండు, మేషము, వృషభము, మిధునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము). రశతే ఇతి రాశిః. ధాన్యము మొదలైనవాటి సమూహము, పుంజము, సమాహారము, నాలుగు ప్రస్థములు.
రాష్ట్రము
సం. నా. వా. అ. న. తత్స. రాజత ఇతి రాష్ట్రం. ప్రకాశించునది. దేశము, ఉపద్రవము, సప్తరాజ్యాంగములలో ఒకటి, నూరుగ్రామముల కంటె ఎక్కువగా ఉండుదేశము, దేశము, ప్రాణి.
రాష్ట్రిక
సం. నా. వా. ఆ. స్త్రీ తత్స. రాష్ట్రేభవా రాష్ట్రికా. దేశమందుపుట్టినది, వాకుడు, ఒకవంగ.
రాష్ట్రియుడు
సం. నా. వా. అ. పుం. తత్స. . నాట్యపరి భాషయందు రాజుపెండ్లాము, తోడపుట్టినవాడు.
రాసభము
సం. నా. వా. అ. పుం. తత్స. రాసంతే ఉచ్చైరితి రాసభాః. బెట్టెగా మొఱ పెట్టునవి, ఖరము, గాడిద. రాసత్ శబ్దాయతే ఇతి రాసభః. గాడిద, గార్ధభము, వ్యాయవ్యమునగల ఇల్లు.
రాస్న
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రస్యత ఇతి రాస్నా. ఆస్వాదింపబడునది, సన్నరాష్టము, కారేలకి, సర్పాక్షి.
రాహువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. రహతి భుక్త్వా త్యజతి సూర్యాచంద్రమసావితి రాహుః. సూర్యచంద్రులను కబళించివిడుచువాడు, గ్రహవిశేషము, తలగాము, ఉపప్లవము, నల్లనిరంగు, అసురుడు, రాక్షసుడు.
రిక్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రిచ్యతే వస్తుభిరితి రిక్తం. వస్తువులచేత విడువబడినది, తిధివిశేషము, అడవి, శూన్యతిథి.
రిక్ధము
సం. నా. వా. అ. న. తత్స. రిచ్యతే విభజ్యత ఇతిరిక్థం. విభజింపబడునది, ధనము, విడిముడి. రింక్తే బహిర్గచ్ఛతి నశ్యతీతి రిక్థం.
రిక్ష్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. రింఖో రింఖణం. చలించుట, ఋక్షము యొక్క రూపాంతరము.
రిపువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. రపత్య పకీర్తిం రిపుః. అపకీర్తిని పలుకువాడు, శత్రువు, పగతుడు. అనిష్టం రపతీతి రిపుః. పగవాడు.
రిష్టము
సం. నా. వా. అ. న. తత్స. రిషతి అశుభాని, శుభాని చేతిరిష్టం. అశుభములను, శుభములను చెఱుచునది, క్షేమము, అశుభము, అభావము, ఖడ్గము, ఫేనిలము, పాపము, అమంగళము, నాశము, అనర్ధము, అదృష్టము.
రిష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. రిష్టతే హింస్యతేనేనేతి రిష్టః. దీనిచేత హింసింపబడును, అశుభము, ఖడ్గము, కత్తి.
రీఢ
సం. నా. వా. ఆ స్త్రీ. తత్స. రిహతి హినస్త్రీతి రీఢా. పీడించునది, తిరస్కారము, తెగడిక రిహ్ నిందాయాం ఇతి రీఢా. అవహేళన, అవమానము.
రీణము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. స్యందతేస్మ స్యన్నం రీయతేస్మరీణం. కాఱినది, ప్రవహించుట.
రీతి పుష్పము
సం. నా. వా. అ. న. తత్స. రీతేర్ధ్మాయమానాయాః పుష్పవర్ణం మలం రీతిపుష్పం. ఇత్తడి కరగి ఊదు చుండగా అందువలన పుట్టిన పుష్పవర్ణ మైన చిట్టెము, కుసుమాంజనము, ఇత్తడి భస్మము.
రీతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. రీయతే స్రవత్యగ్నిసంయోగాదితి రీతిః. అగ్ని సంయోగము వలన కరగునది, తెఱగు, మేర, ఇత్తడి, ఇనుపచిట్టెము, కాఱుట, వైదర్భ్యాది (ఇవి మూడు వెదర్భి, గౌడి, పాంచాలి). కాంస్యము, ప్రచారము, స్వభావము, రూపము, లక్షణము, భావము, ఆత్మ, ప్రకృతి, సహజము, రూపతత్వము, సర్గము, ధర్మము, శీలము, సంసిద్ధి, లోహములమష్టు, స్థితి, ప్రవర్తన, వినుట, వరుస.
రుక్మకారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రుక్మం కరోతీతి రుక్మకారకః. బంగారమును సొమ్ముగా చేయువాడు, అగసాలెవాడు.
రుక్ష్మము
సం. నా. వా. అ. న. తత్స. రోచత ఇతి రుక్మం. ప్రకాశించునది, బంగారు, లోహము. రోచతే శోభతే ఇతి రుక్మం. నాగకేసర వృక్షము, ఉమ్మెత్త చెట్టు, మైలతుత్తము.
రుచక
సం. నా. వా. అ. న. తత్స. రోచతే పర్ణైః రుచకః. ఆకులచే ప్రకాశించునది, దంతము, లవంగపుబట్ట, మాధిఫలపుచెట్టు, ఆముదపుచెప్పు. రోచలే రుచకః. జనులకు ఇష్టమైనది. సం. నా. వా. అ. న. తత్స. రోచతే అన్నమనేనేతి రుచకం. దీనిచేత అన్నమురుచించును. పుల్లదబ్బ, తెల్ల ఉప్పు, సౌవర్చల లవణము సర్జికాక్షారము. రుచ్యతే దీప్యతే జఠరాగ్ని రనేనేతి రుచకం. దీనిచేత జఠరాగ్ని దీపింపబడును, మాల్యము, అశ్వాభరణ విశేషము.
రుచి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. రోచత ఇతి రుచిః ప్రకాశించునది. చింతపండు, నవ్వు, అందము, కోరిక, చవి, ఇచ్ఛ, సూర్యకిరణము, కాంతి. రుచ్యతే ఇతి రుచిః. ఆకలి, కిరణము, శోభ.
రుచిరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. రోచత ఇతి రుచిరం. ప్రకాశించునది, ఒప్పిదమయినది, సుందరము.
రుచ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. రోచత ఇతిరుచ్యం. ప్రకాశింపదగినది, భర్త, భోక్త, రమణుడు, పన్నెండు వందల ఎనిమిది శౌరీలు, సుందరము.
రుజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రుజః ప్రతిక్రియారుక్పత్రిక్రియా. వ్యాధికి ప్రతిక్రియ, రోగము, చెఱుపు, వ్యాధి, ఆకల్యం, భంగము, పీడ, మాంద్యము.
రుతము
సం. నా. వా. అ. న. తత్స. రూయత ఇతి రూతం. పలుకబడునది, రుతి, ధ్వని, పశుధ్వని.
రుదితము
సం. నా. వా. అ. న. తత్స. రోదనం రుదితం. దుఃఖము చేత కన్నీరు జాఱ విడుచుట, రోదనము, ఏడ్పు.
రుద్రాణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రుద్రస్య పత్నీరుద్రాణీ. రుద్రనిభార్య, పార్వతి, దుర్గ, అపర్ణ, భవాని, శివ.
రుద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రుద్రాః రోదయంత్య సురానితిరుద్రాః. దుష్టుల దుఃఖింపచేయువారు. రుదం రోదనం ద్రావయ తీతికా. దుఃఖమును పోగొట్టువాడు, శివుడు, ముక్కంటి (ఏకాదశరుద్రులు, అజుడు, ఏకపాదుడు, అహిర్చుద్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంభకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు). రోదయతీతి రుద్రః. శివుడు, మహాదేవుడు, శంకరుడు, ఉమాపతి, కవివిశేషము.
రుధిరము
సం. నా. వా. అ. న. తత్స. రుధ్యతే త్వచారుధిరం. చర్మముచేత కప్పబడునది. నెత్తురు, చెందిరము, అంగారకుడు. రుణద్ధి రుధ్యతే ఇతి వా రుధిరం. రక్తము, క్షతజము, శోణితము, అసృక్కు, చర్మజము, లోహము, కుజుడు.
రుమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఉప్పళము, సుగ్రీవునిపెండ్లాము, అజ్మీరు దగ్గర సాంబార్ జిల్లాలోని ఉప్పుగని.
రురువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. రౌతి ప్రాయేణ రురుః. తరచుగా కూతలు పెట్టునది. ఒక జింక, నల్లచారలదుప్పి, ఒకరాక్షసుడు.
రుశతి
సం. విణ. (త్. ఈ. త్). తత్స. రుశతి కళ్యాణమితి రుశతీ. శుభమును చెఱచునది, అశుభమైనది (వాక్కు) అశ్లీలము.
రుష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రుష్యతే అనేనేతి రుషః. దీనిచేత హింసింపబడును, కోపము, కినుక.
రుహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛిన్నాపి రోహతీతి రుహ. నఱికినను మరల మొలచునది, గఱిక, మహామంజిష్ఠ.
రూక్షము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. రూక్షయతీతి రూక్షః. పరుసనైయుండును, కఱకైనది, ప్రేమలేనిది, ఇనుము, చెట్టు, పెరుగు, తీవ్రము, గజమద పరిమళము, పరుషభాషణము, నిర్ధయుడు, కఠినుడు.
రూపము
సం. నా. వా. అ. న. తత్స. రోపయతి విమోహయతీతి రూపం. మోహింపచేయునది, ఆకారము, శుక్లపీతాది వర్ణము. సౌందర్యము, అగ్నిగుణము, చక్షురింద్రియగోచరము, నాటకము, రువ్యము, స్వభావము. రూయత కీర్త్యతే, రౌతీతి వా రూపం. పశువు, మృగము, సౌందర్యము, శబ్దము, శ్లోకము, ఆకారము, పదము, పద్యము, పునః పఠనము, రంగు, అండము.
రూపోజీవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రూపమేవ ఆజీవో జీవికా అస్యా ఇతి రూపాజీవా. రూపమే జీవనోపాయముగాకలది, వారస్త్రీ, వేశ్య. రూపేణ సౌందర్యేణ ఆజీవతీతి రూపాజీవా. గణిక, క్షుద్ర.
రూప్యము
సం. నా. వా. అ. న. తత్స. రూపమస్యేతి రూప్యం. ప్రశస్తమైన రూపముకలది, బంగారు వెండిలోనగువానినాణెము. రూపాయ, వెండి, సుందరము. ఆహతం రూపం అస్యాస్తీతి రూప్యం. ధాతువిశేషము, శుభ్రము, మహాశుభ్రము, రజతము, శ్వేతము, అందమైనది.
రూషితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. రూష్యత ఇతి రూషితం. మాగురువడినది, ధూళి మొదలగువానిచే కప్పబడినది, గుంఠితము, దంచబడినది.
రేచకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రేచ యతి రేచనం కరోతీతి రేచకి. విరేచనమును చేయునది, కరక, కరక్కాయ.
రేచని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రేచయతీతి రేచనీ. భిన్నము చేయునది, తెల్లతెగడ, దంతిచెట్టు.
రేచితము
సం. నా. వా. అ. న. తత్స. రేచనం రేచితం. గుఱ్ఱము యొక్క గతి విశేషములు, వంకరలేక వేగముగా పోయెడి అశ్వధారా విశేషము, ఒక్కకనుబొమనుకదల్చుట.
రేణుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రేణు యోగా ద్రేణుకా. ధూళి కలది, గంధద్రవ్యవిశేషము, జమదగ్ని పెండ్లాము, దేశ్యమునందు రేణుకలు అనగా నూగు దోసయని ఒకానొక నిఘంటువు నందు వ్రాయబడినది.
రేణువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. రియతి వాయునేతి రేణుః. వాయువుచేత పోవునది, దుమ్ము, రేణుక. రిణాతీతి రేణుః. ఎనిమిది త్ర సరేణువులు.
రేతస్సు
సం. నా. వా. స్. న. తత్స. రియతి స్రవతి రేతః. స్రవించునది, ఇంద్రియము, పాదరసము. రీయతే క్షరతీతి రేతః. శుక్రము, వీర్యము, బలము, బీజము, ఇంద్రియము, నీరు.
రేఫము
సం. నా. వా. అ. పుం. తత్స. రేఫతి హినస్తివ వర్తన మితి రేఫః. నడకను చెఱుచువాడు, రవర్ణము, అధమము. రిఫ్యతే రిఫతివారేఫః హింసింపబడునది, నింద్యుడు, నీచము.
రేవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రేవతేరేవా. దాటులతో పోవునది, ఒకఏఱు, నీలిచెట్టు. రేవతే ఉత్ప్లుత్య గచ్ఛతీతి రేవా. నర్మదా నది.
రై
సం. నా. వా. ఇ. పుం. తత్స. రాన్త్యేనమితిరాః. దీనిపుచ్చు కుందురు, ధనము, విడిముడి.
రోకము
సం. నా. వా. అ. న. తత్స. రోచతే అనేన వస్త్వాదికమితి రోకం. దీనిచేత వస్త్వాదులు ప్రకాశించును. రోచతే అత్రేతి రోకం. ఛిద్రము, ఓడ, బెజ్జము, కదలిక, వెలుగు, రంధ్రము, కిరణము.
రోగము
సం. నా. వా. అ. పుం. తత్స. రుజ్యంతే సంతప్యన్తే అనయేతి రోగశ్చ. దీనిచేత తపింపచేయబడుదురు, వ్యాధి, తెవులు, కుష్ఠాపదము, భయము, భంగము, క్షయ, మృత్యుభయము, మాంద్యము, రోగము.
రోగహరి
సం. నా. వా. న్. పుం. తత్స. రోగం హరతి తాచ్ఛీల్యేన రోగహరీ. రోగమును హరించు స్వభావముకలవాడు, జామ, బూడిదగుమ్మడి, వైద్యుడు.
రోచన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రోచతే రోచనః. ప్రకాశించునది, గోరోజనము, ఉత్తమస్త్రీ, ఎఱ్ఱకలువ, కొండబూరుగు. తేజస్వి
రోచని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రోచత ఇతి రోచనీ. ప్రకాశించునది, తెల్లతెగడ, కంపిల్లము.
రోచిష్ణువు
సం. విణ. (ఉ). తత్స. రోచతే రోచిష్ణుః. ప్రకాశించు స్వభావముకలవాడు, ప్రకాశించువాడు. సూర్యకిరణము
రోచిస్సు
సం. నా. వా. స్. న. తత్స. రోచత ఇతి రోచిః. ప్రకాశించునది, సూర్యకిరణము, వెలుగు, కిరణము, అంశువు, ప్రభ.
రోదనము
సం. నా. వా. అ. న. తత్స. రుద్యతేనేన రోదనం. దీనిచే దుఃఖింతురు, ఏడ్పు, కన్నీరు.
రోదని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రోదయతీతి రోదనీ. తనను తాకినవానిని దుఃఖి పెట్టునది, తీటకసింద, కచ్చుర, ఒక ఓషధీ.
రోదసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రుదం త్యస్మిన్నితి రోదః. దీనియందు దుఃఖపడుదురు, మన్ను, మిన్ను, భూమ్యాకాశములు.
రోదస్
సం. నా. వా. స్. న. తత్స. మన్ను, మిన్ను. స్వర్గము, భూమి.
రోదస్సు
సం. నా. వా. న్. న. తత్స. రుణద్ధి జలమితి రోధః. జలమును నిలుపునది, తీరము, దరి, గట్టు, భూమి, స్వర్గము, ఒడ్డు.
రోపము
సం. నా. వా. అ. పుం. తత్స. రోపయతి మోహయతీతి రోపః. మోహింపచేయునది, బాణము, రోపనము,
రోమము
సం. నా. వా. న్. న. తత్స. రోహతీతి రోమ. మొలచునది, ముఖము, శిరముతక్క తక్కిన దేహమనందు కల వెండ్రుక, అంగజము, చర్మజము, జంతురోమములు.
రోమహర్షణము
సం. నా. వా. అ. న. తత్స. రోమాణి హృష్యం త్యనేన రోమహర్షణం. దీనిచేత రోమములు ప్రకాశించును, రోమాంచము, తాండ్ర, ఒకసూతుడు.
రోమాంచము
సం. నా. వా. అ. పుం. తత్స. రోమ్ణామంచనం రోమాంచః. రోమములు గగురు పొడుచుట, గగుర్భాటు. రోమ్ణాం అంచః ఉద్గమః ఇతి రోమాంచః.
రోహిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రోహిణీ చ కటురోహిణి. కటువైన రోహిణి, ఒక నక్షత్రము, అంగిటిముల్లు, ఆవు, తొమ్మిదేండ్ల కన్యక, బలరామునితల్లి, కటుక రోహిణి, తెల్లచంద్ర. గొంతుమంట, ఎఱ్ఱావు, కరక్కాయ, పార్వతి, ఒకగొంతు జబ్బు.
రోహితకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఛిన్నోపి ప్రరూఢో రోహతీతి రోహితకశ్చ. నఱకబడినతిరిగిమొలచునది. ములుమోదుగు, కెంపు.
రోహితము
సం. నా. వా. అ. న. తత్స. రోహతీతి రోహితం. పాదుర్భవించునరే. రోహతి ప్రాదుర్భవతి సంథ్యాదావితి రోహితః. సంధ్యాధి కాలములయందు పుట్టునది. ఎర్ఱనైఉండునది ఇంద్రధనస్సు, ఒక ఓషధి, ఒకజింక, యవక్రీత. రోహితత్వాత్ రోహితః. ఎఱ్ఱని వన్నె కలది, కొరడు, కుంకుమపువ్వు, నెత్తురు, ఎఱుపు, ఎఱ్ఱచేప, కేసరిమృగము, ములుమోదుగు. కుంకుమ, రక్తము.
రోహితాశ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. రోహితోమృగః స ఏవ అశ్వోయస్యసః రోహితాశ్వః. రోహితమృగము వాహనముగాకలవాడు, అగ్ని, హరిశ్చంద్రుని కొడుకు. రోహితః అశ్వో యస్య సః రోహితాశ్వః. అగ్ని, వహ్ని.
రౌద్రము
సం. నా. వా. అ. పుం. తత్స. రుద్రో దేవతాస్యరౌద్రం. రుద్రుడే అధి దేవతగా కలిగినది, నవరసములలో ఒకటి ఎండ, దినము, యొక్క మొదటి భాగము, భయంకరము, తీక్ష్ణము, హేమంత ఋతువు, యముడు, భీషణుడు, ఒకరసము, కోపము కలవాడు.
రౌమకము
సం. నా. వా. అ. న. తత్స. రుమాఖ్యాక రేభవం రౌమకం. రుమయను గనియందు పుట్టునది, సంభరి దేశమున రుమయనెడుగని యందు పుట్టిన ఉప్పు.
రౌరవము
సం. నా. వా. అ. పుం. తత్స. మహన్ రౌరః రవః అత్రేతి మహారౌరవః. మిక్కిలి భయంకరమైన ధ్వని కలిగినది, భయంకరము, ఒకనరకము.
రౌహిషము
సం. నా. వా. అ. న. తత్స. రోహతీతి రౌహిషం. మొలచునది. భక్ష్య మస్యేతి రౌహిషః. మొలచునది, కామంచి కొండగొఱ్ఱె, ఒక జింక, ఒకచేప సువాసనగల తృణ విశేషము.
రౌహీణేయము
సం. నా. వా. అ. పుం. తత్స. రోహిణ్యాః అపత్యం రౌహిణేయః. రోహిణీ దేవి కొడుకు. దినము యొక్క తొమ్మిదవభాగము. బలరాముడు, బుధుడు, బలదేవుడు, బలభద్రుడు.