హల్లులు : ల

లంక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. రావణుని పట్టణము, ఒకానొకరాక్షసి, రంకుటాలు, కలాయము.
లంకోయికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లంకాయాముప్యత ఇతి లంకోయికా. లంకయందు విత్తబడునది, పిక్క (వృక్షవిశేషము).
లంబనము
సం. నా. వా. అ. న. తత్స. లంబతే లంబనం. వ్రేలాడుచుండునది, మెడను వ్రేలాడు హారము.
లంబోదరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లంబముదరయస్యసః లంబోదరః. వేలేడు బొజ్జకలవాడు, వినాయకుడు, హేరంబుడు, ఆఖురథుడు, గణపతి, గజవదనుడు, పరశుధరుడు, ఏకదంతుడు, ఏకదంష్ట్రుడు, విఘ్నరాజు, గణేశుడు.
లక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లక్ష్యత ఇతి లక్ష్యం. చూడబడునదికనుక, నూఱువేలు, గుఱి, నెపము, ఒక దబ్బ, లక్ష్యము, ఒకసంఖ్య, వంచన, లక్క.
లక్షణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లక్ష్యతే అనేనేతి లక్ష్మ. పదార్ధము దీని చేత చూడబడును, ఒక శబ్ధ వృత్తి, ఆడ, బెగ్గురు, గుఱి, గుఱుతు, చూపు, వ్యాకరణాదిశాస్త్రము, పేరు, (పురాణమునకు కల పంచలక్షణములు సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాను చరితము). సారసి, హంసి, స్వభావము, ముద్ర, అంగసౌష్టవము, కార్షికమను మానము.
లక్ష్మణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లక్ష్మీరస్యా అస్తీతి లక్షణా. ఒప్పిదముకలది, ఆడుబెగ్గురు, గుఱుతు, పేరు. ఔషధి భేదము, నాగిని, మజ్జిక, చిహ్మము, మంచిది.
లక్ష్మణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లక్ష్మణశ్చ శ్రీరస్యాస్త్రీతి శ్రీలః. లక్ష్మియని, శ్రీయని, సంపదని, ఒప్పిదమును కలవాడు, రామునితమ్ముడు, శ్రీమంతుడు, వృద్ధిపొందువాడు, సుఖి.
లక్ష్మము
సం. నా. వా. న్. న. తత్స. లక్ష్యతే అనేనేతి లక్ష్మ. పదార్ధము దీనిచేత చూడబడును, గుఱుతు, ముఖ్యము. లక్షయత్యనేన, లక్ష్యతే ఇతి వా లక్ష్మ, చిహ్నము, మంచిది.
లక్ష్మి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. లక్ష్యతే సర్వోన యేతి లక్ష్మీః. ఈమెచేత సర్వము చూడబడును. అష్టవర్గయోగే లక్ష్యత ఇతి లక్ష్మీః. అష్టవర్గ యోగమందు కన బడునది. లక్ష్యతే లక్ష్మీః. జనులచే చూడబడునది, రమ, సంపద, వస్త్రభూషాణాదుల వలన కలిగినశోభ, మెట్టతామర, బుద్ధిఅనెడు గంధద్రవ్యము, గొల్లజిడ్డు, ప్రేంకణము. లక్షయతి పశ్యతి ఉద్యోగినమితి లక్ష్మీః. శ్రీ, పద్మ, పద్మాలయ, కమల, హరిప్రియ, ఇందిర, లోకమాత, క్షీరాబ్దితనయ, మా, రమ, భార్గవి, హరివల్లభ, దుర్గ, ఒక విష్ణుశక్తి, విష్ణుభార్య, అభ్యుదయము, మృతజీవనౌషధి, లవంగము,అందము.
లక్ష్మీవంతుడు
సం. విణ (త్. ఈ. త్). తత్స. లక్ష్మీరస్యాస్తీతి లక్ష్మీవాన్. సంపదకలవాడు, ఒప్పిదము కలవాడు, అభివృద్ధి కలవాడు, సుఖి.
లక్ష్యము
సం. నా. వా. అ. న. తత్స. లక్ష్మతే అనేనేతి లక్ష్యం. దీనిచేత ప్రయోజనము కానబడును, “లక్ష్యత ఇతి లక్ష్యం. చూడబడునది,లక్షణచే తెలియతగిన అర్ధము. లక్ష్యతే యదితి లక్ష్యం, గురి.
లగుడము
సం. నా. వా. అ. పుం. తత్స. లగతి సంగం కరోతీతి లగుడః. దండము, పసువులను తోలుకఱ్ఱ.
లగ్నకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లగన్తీతి లగ్నకాః. జూదమందు తగువులుపడువాడు, పూటకాపు, ప్రతిభువు, జామీను.
లగ్నము
సం. నా. వా. అ. న. తత్స. లగతి గ్రహైస్సంబధ్నా తీతి లగ్నం. గ్రహములతో సంబంధిచునది, రాశ్యుదయము, మదపుటేనుగు, తగులుకొన్నది, సిగ్గుపొందినది, మత్త గజము.
లఘలయము
సం. నా. వా. అ. న. తత్స. గురుత్వా భావాల్లఘు, జఠరాగ్నౌ లీయత ఇతిలియం. జఠరాగ్నియందు అణగునది, లఘలయమని ఏక పదమగాచెప్పుదురు. నీటి వట్టివేరు.
లఘవు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. లంఘ్యతే అనేనేతి లఘ. దీనిచేత లంఘింపబడును, లఘత్వాల్లఘః. చులకనిది. లంఘ్యతే, లంఘతి చలఘః. పొందబడునది, పోవునదియుకనుక, పిక్క నల్లగలు, శీఘ్రము, వడిగలది, చులకనిది, చేవలేనిది, ఒప్పిదమైనది. గుగ్గిలము, ఒకతీగ, ఒకవాసన ద్రవ్యము, సారము లేనిది, తేలికైనది, వేగముకలది, దుర్బలము, అంగీకరింపదగినది.
లఘిమ
సం. నా. వా. న్. పుం. తత్స. లఘత్వేన లఘిమా. అష్టైశ్వర్యములు, లఘత్వము, చులుకన, ఒకవిభూతి.
లజ్జితము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లజ్జా సంజాతాస్యేతి లజ్జితః. లజ్జ దీనికికలదు, సిగ్గుపడినది. లజ్జనమితి లజ్జా. మందాక్షము, సిగ్గుపడినవాడు.
లట్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వాద్య విశేషము, పెద్దకాగు.
లత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విరుణద్ధీతి వీరుతా. విశేషముగా చుట్టుకొనియుండునది. లతామూలాత్ అగ్రంగతా. చెట్టు మొదలునుండి కొసవఱకు అల్లిన తీగ. లతారూపత్వాల్లతా. లతారూపమైనది. లాతి ఆదత్తే జనమానాంసి సుగంధిత్వాల్లతా. మంచిపరిమళముతో జనుల మనస్సులను ఆకర్షించునది. లతారూపత్వాల్లతా. తీగ యైయుండునది. దూర ప్రసరాల్లతా. దూరముగా వ్యాపించునది. తీగ, ఎక్కుడు తీగ, గఱిక, పూలగురివెంద, ముత్యాలహారపుపేట, కొమ్మ, పిక్క, ప్రేంకణము, చీమ, సాలెపురుగు, కస్తూరి. లతతి వేష్టయతే యాన్యమితి లతా. వల్లి, మాధవి, ప్రియంగువు, ఒకవంగ.
లతార్కము
సం. నా. వా. అ. పుం. తత్స. లతాభిః శాఖాభిః అర్చ్యత ఇతి లతార్కః. లతారూపము లైన కొమ్మలచేత అర్చింపబడునది, పచ్చినీరుల్లి.
లపనము
సం. నా. వా. అ. న. తత్స. లపంత్యనేన లపనం. దీనిచేత పలుకుదురు, ముఖము, నోరు, మాట.
లపితము
సం. నా. వా. అ. న. తత్స. లప్యత ఇతి లపితం. పలుకబడునది. లప్యతే స్మలపితం. పలుకబడునది, మాటలాడబడినది.
లబ్దము
సం. నా. వా. అ. న. తత్స. లభ్యతే స్మ లబ్దం. ప్రాప్తం భాగహారముచేయగా ఏర్పడుసంఖ్య, పొందబడినది, ప్రాప్తము.
లబ్దవర్ణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లబ్ధః వర్ణః స్తుతిర్యేన లబ్ధవర్ణః. పొందపడినస్తుతి కలవాడు, విద్వాంసుడు, చదువరి. లబ్ద్వా వర్ణం యశాంసి యేన సః లబ్దవర్ణః. పండితుడు.
లభ్యము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. లబ్ధుం యోగ్యం లభ్యం. పొందుటకు యోగ్యమైనది, లభింపతగినది, యుక్తము, న్యాయము, అర్హము.
లలంతిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లలతి విలసతి లలంతికా. విలాసే ఒప్పునది, మెడను వ్రేలాడు హారములోనగునది, హారము.
లలన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లలతి విలసతీతి లలనా. విలాసయుక్తమైనది, విలసన శీలమైన ఆడుది, నాలుక, ఆడుది, స్త్రీ.
లలాటము
సం. నా. వా. అ. న. తత్స. లలం తశ్చలంతః అటం త్యలకా అత్రేతి లలాటః. దీనియందు ముంగురులు చలింపుచు నటించును, నొసలు, నుదురు, అవికము. లలం ఈప్సాం అటతి జ్ఞాపయతీతి లలాటం.
లలాటిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లలాటే భవాలలాటికా. లలాట మందుండునది, పాపటబొట్టు. లలాటే భవో అలంకారః లలాటికా, నొసటి ఆభరణము, నొసటిపయిగల పత్రరచన.
లలామకము
సం. నా. వా. అ. న. తత్స. లలం విలాస మమతి లలామకం. విలాసముపొందిఉండునది, బాసికము. లలాట పర్యంతం ఆగతం లలామకం, లలామం తిలకమివ ఇతి లలామకం. నుదుటిపైపడుహారము.
లలామము
సం. నా. వా. న్. న. తత్స. లలతీతి లలామం. ఒప్పునది, గుఱుతు, ఱెక్కెము, తొడవు, నొసట ఉంచుకొనెడు బొట్టు, గుఱ్ఱము నొసటిచుక్క, తోక, కొమ్ము, ప్రభావము, గుఱ్ఱము, శ్రేష్ఠము (ఉత్తరపదమైనచో), శ్రమ, జెండా, తిలకము, చిహ్నము, లింగధారణము, మంచిది.
లలామము
సం. నా. వా. న్. న. తత్స. లలతీతి లలామం. ఒప్పునది. లక్ష్యతే అనేనేతి లలామం. పదార్థము దీనిచేత చూడబడును, గురుతు, టెక్కెము, తొడవు, నొసలు ఉంచుకొనెడు బొట్టు, గుఱ్ఱమునొసటి చుక్క, తోక, కొమ్ము, ప్రభావము, గుఱ్ఱము, (ఉత్తర పదమైనచో శ్రేష్ఠము).
లలితము
సం. నా. వా. అ. న. తత్స. లలతీతి లలితం. లలవిలాసే సుకుమారాంగ విన్యాస రూపమై ఒప్పునది. సుకుమారత్వము చేతనగు అంగవిన్యాసరూపమైన స్త్రీల యొక్క శృంగార చేష్ఠా విశేషము, ఈప్సితము, మనోజ్ఞము, ఒకశృంగారచేష్ట.
లవంగము
సం. నా. వా. అ. న. తత్స. లూయతే ఛిద్యతే లవంగః కోయుట, కరాపువు.
లవణము
సం. నా. వా. అ. పుం. తత్స. లునాతి వాతం జాడ్యం వా లవణః. వాయువుని గాని జాడ్యమునుకాని పోగొట్టునది, ఉప్పు, త్రిలవణము, (సైంధవము, బిడము, రుచకము), ఉప్పున, ఉప్పుసముద్రము, ఉప్పనిది, లావణ్యము కలది.
లవణాకరము
సం. నా. వా. అ. పుం. తత్స. లవణస్య ఆకరః లవణాకరః.. ఉప్పుసముద్రము, ఉప్పుళము, ఉప్పుగని.
లవణోదము
సం. నా. వా. అ. పుం. తత్స. లవణమివ ఉదకం యస్య సః లవణోదః. లవణము వంటి కలిగినది, ఉప్పుసముద్రము, నీరు.
లవము
సం. నా. వా. అ. పుం. తత్స. లూయతే లవః. తుంచబడునది, లేశము, చేటు, రెండు కాష్ఠల కాలము. లవనః లవః. కోయుట. పైరులోనగువానికోత.
లవిత్రము
సం. నా. వా. అ. న. తత్స. లూనాత్యనేన లవిత్రం. దీని తోకోయుదురు, కొడవలి, దాత్రము. లూయతే అనేనేతి లవిత్రం.
లశునము
సం. నా. వా. అ. న. తత్స. అశ్యతే భుజ్యత ఇతి లశునం. భుజింపబడునది, వెల్లుల్లి, కెంపు నందలి దోష విశేషము, ఉల్లి.
లస్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. లసతి సంశ్లిష్యతి కరే లస్తకః. చేతిలో అణగి ఉండునది, ధనుర్మద్యము, పిడికట్టు.
లాంగలము
సం. నా. వా. అ. న. తత్స. లంగతి భువోంతర్గచ్ఛతీతి లాంగలం. భూమిలో చొచ్చునది, నాగలి, తాడు (వృక్ష విశేషము) ఒక పువ్వు, గృహదామ విశేషము, మగగురి, హలము, గోదారణము, సీరము, ఙాలము, శీరము, లింగము, పుష్పవిశేషము, తాలవృక్షము.
లాంగలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. 1. లాంగలీ గర్భ భేదనా లాంగలీ. నాగేలు వలె గర్భమును భేదించునది. 2. లాంగలా కారపత్త్రత్వాల్లాంగలీ. నాగేటివంటి ఆకులు కలది, తరిగొఱ్ఱ, నీటిపిప్పలి (వృక్షవిశేషము). సం. న. వా. న్. పుం. తత్స. నాగటి జోడు, నారికడము, పాము.
లాంగూలము
సం. నా. వా. అ. న. తత్స. లజ్జతి చలతీతి లాంగూలం. కదలునది, తోక, కేశయుక్తమైన తోక, మగగుఱి, పుచ్ఛము, లూమము, బాలహస్తము, శేఫము, కుశూలము. సం. నా. వా. అ. పుం. తత్స. అభినయహస్త విశేషము.
లాంఛనము
సం. నా. వా. అ. న. తత్స. లాంఛతే లక్ష్యతే అనేనేతి లాంఛనం. పదార్థము దీనిచేత రక్షింపబడును, గుఱుతు, పేరు.
లాక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లక్ష్యతే లాక్షా. కానబడియుండునది. లక్క, జతువు, లత్తుక.
లాక్షాప్రసాదనము
సం. నా. వా. అ. పుం. తత్స. లాక్షాం ప్రసాదయతీతి లాక్షాప్రసాదనః. లక్కనలంకరించునది, ఎఱ్ఱలొద్దుగు.
లాజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లాజ్యంత ఇతి లాజాః. వేచబడునవి, పేలాలు, సం. నా. వా. అ. న. తత్స. వట్టివేరు, సం. నా. వా. అ. పుం. తత్స. లజ్యంతే యే తే లాజాః. నానిన బియ్యము.
లాభము
సం. నా. వా. అ. పుం. తత్స. లభ్యతే అధికత్వేనేతి లాభః. అధికముగా పొందబడునది, క్రయవిక్రయముల వలన వచ్చిన విశేష ధనము, వడ్డి, ప్రాప్తి.
లామజ్జకము
సం. నా. వా. అ. న. తత్స. రక్త దోషం లాతి నాశయతీతి లా, మజ్జాసారోస్యేతి లామజ్జకం. రక్తదోషమును చెఱుచు సారముకలది, నీటివట్టివేరు.
లాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లలతి లాలా విరుద్ధలక్షణయా. విరుద్ధ లక్షణచే నింపైనది, చొంగ, స్యందిని, ఒక ఉసిరిక.
లాలస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లస్యతే లాలసా. మనస్సు యొక్క కూడుటయైనను, క్రీడయైనను లాలసము. సం. నా. వా. అ. పుం. తత్స. లాలసనం లాలసః. మిక్కిలి కోరిక కలిగినది, ఔత్సుక్యము, యాచన. సం. విణ. తత్స. విషయాసక్తురాలు, ఆసక్తి కలవాడు.
లాలాటికుడు
సం. విణ. (అ.ఈ.అ). తత్స. కార్యేష్వలిప్తః దూరేస్థి తస్సక్ ప్రభోర్లలాటం పశ్యతీతి లాలాటికః. కోపప్రసాదము తెలుసుకొనుట కొఱకు ప్రభువుల లాటమును చూచువాడు ప్రభువు యొక్క అభిప్రాయమును తెలిసికొనువాడు, కార్యమునందు నేర్పుచాలనివాడు, తెల్లబోయిన ముఖము వైపు చూచువాడు.
లాసిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లసతి క్రీడతి రంగభూమావితి లాసికా. రంగస్థలమునందు క్రీడించునది, నృత్యము చేయునది, ఆటకత్తె.
లాస్యమము
సం. నా. వా. అ. న. తత్స. లసనం లాస్యం క్రీడించుట, నృత్యము, తార్యత్రికము, నాట్యము.
లింగము
సం. నా. వా. అ. న. తత్స. లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం. దీనిచేత తెలుసు కొనబడును. పానపట్టుము మీది శివమూర్తి, గుఱుతు, మగగుఱి, అనుమానము, ఇరువై ఐదు తత్వములయందు మొదటిదిఅగు ప్రకృతి, బుద్ధి మొదలగువాని కలయిక, దుస్తు, భాగము, చిహ్నము.
లింగవృత్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. లింగం చిహ్నం వృత్తిర్జీవనమస్యేతి లింగవృత్తిః. చిహ్నమే జీవనముగా కలవాడు, తాటదమ్మడు. లింగం బాహ్యలక్షణమేవ వృత్తిర్జీవనోపాయో యస్య సః లింగవృత్తిః. బ్రహ్మచారి.
లికుచము
సం. నా. వా. అ. పుం. తత్స. లక్యతే ఆస్వాద్యత ఇతి లికుచః. ఆస్వాదింపబడునది, గజనిమ్మ (వృక్షవిశేషము).
లిక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చెమటవల్ల తలలో పట్టు ఈళ్లు.
లిఖితము
సం. నా. వా. అ. న. తత్స. లిఖతాక్షర విన్యాసే అనుపాఠమందు లిఖితం. వ్రాత, వ్రాయుట. సం. విణ. తత్స. వ్రాయబడినది.
లిపి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. రేఖారూపమైన అక్షర విన్యాసము, వ్రాయు.
లిపికారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లిపింకరోతీతి లిపికారః. లిపిని చేయువాడు, వ్రాయువాడు, లేఖరి.
లిప్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. లిప్యతే లిషేణ లిప్తః. విషముచే పూయబడినది, విషముపూసినబాణము, సం. విణ. తత్స. పూయబడినది.
లిప్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. లిప్యతే స్మ లిప్తం. భుజింపబడినది, పూయబడినది.
లిప్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లబ్ధుమిచ్ఛా లిప్సా. సంపదను పొంద కోరిక, ఇచ్ఛ, కోరిక.
లిభి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. లిప్యతే అనయా పత్త్రం లిపిః లిభిశ్చ. దీనిచేత పత్రము పూయబడును, లిమి యొక్క రూపాంతరము, రాత.
లీఢము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. తినబడినది.
లీల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లీలనం లీలా. సంశ్లేషము. లీయత ఇతి లీలా. కూడుకొని ఉండునది, క్రీడ, శృంగార చేష్ట, ప్రేమాధిక్యమున వేష భాషణాదుల చేత ప్రియుని అనుకరించునట్టి స్త్రీ శృంగార చేష్టావిశేషము, క్రియ, విధము, లీలా శబ్దము స్త్రీల శృంగార చేష్టలకును క్రియకును పేరు, వినోదము.
లుఠితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. లుఠతి స్మ లుఠితః. పొర్లాడినది, భూమిమీద పొర్లాడినది (గుఱ్ఱము), దొర్లిన గుర్రము.
లుబ్ధకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లుభ్యతి మృగేష్వితి లుబ్ధకః. మృగముల యందుఆసగొనువాడు, బోయవాడు, పిసినివాడు.
లుబ్ధుడు
సం. విణ. పుం. తత్స. లుభ్యతి కాంక్షతీతి లుబ్ధః. ఆశించువాడు, బోయవాడు, ఆశకలవాడు, పిసినివాడు, లోభి. సం. నా. వా. అ. పుం. తత్స.
లులాయము
సం. నా. వా. అ. పుం. తత్స. లోలనం లులస్తమయతీతి లులాయః. లులమనగా చలించుట, దానిని పొందునది, కారెనుపోతు, దున్నపోతు.
లూత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లూయతేలూతః. ఛేదింపబడినది, సాలెపురుగు, చీమ, రోగవిశేషము. లునాతీతి లూతా.
లూనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. లూయతే స్మ లూనం. కోయబడినది, తెగినది.
లూమము
సం. నా. వా. న్. న. తత్స. లూయన్తే రోమాణ్య త్రేతి లూమ. రోమములు దీనియందు కోయబడును, తోక, లాంగూలము.
లేఖ
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రీవాహస్త పాదే ప్రశస్తా లేఖా యేషాం తే లేఖాః. మెడ, చేతులు, కాళ్ళయందు మంచిరేఖలు కలవారు, దేవతలు. (లేఖుడు). ఇచ్చి పుచ్చుకోట పత్రము, జాబు. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లిఖ్యంతే ధాన్యార్ధం పటాదౌ వా లేఖాః. ధాన్యము కొరకు పటాదులయందు వ్రాయబడువారు, గణదేవతలు, ఎడము లేక మిక్కిలి చేరిక అగు వృక్షముల యొక్క వరుస, లిపి. కంఠహస్త పాదముల యందుమంచి రేఖలు కలవారు. ఎడమలేక మిక్కిలి చేరికయగు వృక్షాదులపంక్తి, లిపి, జాబు, ఇచ్చిపుచ్చుకోలు పత్రము, వేలుపు.
లేఖకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లిఖతీతి లేఖకః. వ్రాయువాడు, వ్రాతకాడు, లేఖరి.
లేఖర్షభుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లేఖానాం దేవానామృషభః లేఖర్షభః. దేవతలలో శ్రేష్ఠుడు, వేల్పుఱేడు.
లేపనము
సం. నా. వా. అ. న. తత్స. లింపతి సుధాదినా ప్రాసాదాదికమితి లేపనః. సున్నము మొదలైన దానితో మేడలు మొదలైన దానికి పూత పూయువాడు, అలుకుట, పూత, భోజనము, ఇళ్ళు కట్టువాడు.
లేపము
సం. నా. వా. అ. పుం. తత్స. లిప్యతే ఉపచీయతే దేహోనేనేతి లేపః. దీనిచేత దేహము వృద్ధి పొందును, పూత, భోజనము, సున్నము లోనగునది, ఆహారము, తినుట.
లేలిహనము
సం. నా. వా. అ. పుం. తత్స. పాము, సం. విణ. తత్స. మాటిమాటికి లేహనము చేయునది.
లేశము
సం. నా. వా. అ. పుం. తత్స. లిశ్యత్యల్పీభవతీతి లేశః. కొంచమై ఉండునది, కొంచెపుదనము. సం. విణ. తత్స. కొంచెము. పన్నెండు కళల కాలము.
లోక బాంధవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లోకస్య బాంధవో లోకబాంధవః. లోకమునకు చుట్టము, సూర్యుడు, జగము, చుట్టము.
లోకజిత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. లోకం తపసాజయతీతి లోకజిత్. లోకమును తపస్సుచే జయించినవాడు, బుద్ధదేవుడు, జినుడు.
లోకమాత
సం. నా. వా. ఋ. స్త్రీ. తత్స. లోకానాం మాతా లోకామాతా. ఎల్లలోకములకు తల్లి, లక్ష్మి, జగముతల్లి, గంగ.
లోకము
సం. నా. వా. అ. పుం. తత్స. లోక్యతే స్మరమస్మిన్నితి లోకః. సర్వము దీనియందుకానబడును. లోక్యతే ఆలోక్య ఇతి లోకః. చూడబడునది, జగము, జనము, (లోకములు మూడు స్వర్గము, మర్త్యము, పాతాళము). లోక్యతే ఇతి లోకం. ప్రపంచము, జనులు.
లోకాయతము
సం. నా. వా. అ. న. తత్స. . స్వభావమునకు గర్తృత్వము చెప్పునట్టి మతము.
లోకాలోకము
సం. నా. వా. అ. పుం. తత్స. లోక్యతేన లోక్యత ఇతి చ లోకాలోకః. భూమికి కోటవలె చుట్టువాఱి ఉండు పర్వతము, భూమిని చుట్టుకొని ఉండుకొండ, చక్రవాళము.
లోకేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లోకానాం చతుర్ధశ లోకానామీశః. పదునాలుగు లోకములకు ప్రభువైనవాడు, బ్రహ్మ, నలువ.
లోచనము
సం. నా. వా. అ. న. తత్స. లోచ్యతే అనేనేతి లోచనం. దీనిచేత చూడబడును, నేత్రము, కన్ను.
లోచమస్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. లోచముపనీతం మస్తకమస్య లోచమస్తకః. పొందింపబడిన శిరస్సుకలది, ఓమము, వాదము.
లోధ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. రుణద్ధి అతి సారాదికం లోధ్రః”.అతి సారాదులనుఅడ్డపెట్టునది, లొద్దుగు, హేమంతము.
లోపాముద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లోపా చాసౌ ముద్రా చ లోపాముద్రా. స్త్రీలయొక్క రూపాభిమానమును లోపింపచేయునది, అగస్త్యునిభార్య.
లోప్త్రము
సం. నా. వా. అ. న. తత్స. లుప్యత ఇతి లోప్త్రం. అపహరింపబడునది, దొంగిలించినసొమ్ము, స్తేయధనము, లోతము.
లోమము
సం. నా. వా. న్. న. తత్స. రోహతీతి లోమ. మొలచునది, రోమము యొక్క రూపాంతరము.
లోమశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లోమయోగా ల్లోమశా. వెండ్రుకలవంటి పీచుకలది, రోమశుడుయొక్క రూపాంతరము, శరీరముపై ఎక్కువ రోమములు కలవాడు.
లోమసా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. లోమయోగాల్లోమశా. వెంట్రుకల వంటి పీచు కలది, జటామాంసి (వృక్ష విశేషము). దూలగొండి. వస, వెలమసంది. సం. నా. వా . అ. పుం. గొఱ్ఱె, రోమములు, పూతి మార్జాలము.
లోల
సం. నా. వా. విణ. తత్స. లుడ్యతే వాయ్యాదినేతి లోలం. వాయువు మొదలయిన దాని చేత కదలించబడునది, మిక్కిలి యిచ్చకలది, కదలునది. లోలతీతి లోలః. నాలుక, లక్ష్మి.
లోలుపుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. లోలుప్యతే భృశం ముహ్య తీతి లోలుపః. మిక్కిలి మోహపడువాడు, మిక్కిలి ఇచ్ఛకలవాడు, లోలుడు. గర్హితం లుంపతీతి లోలుపః.
లోలుపుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. లోలుభ్యతే భృశం గృధ్యతీతి లోలుభః. కాంక్షించువాడు, ఇచ్చకలవాడు. భృశం లుభ్యతీతి లోలుభః.
లోష్ణము
సం. నా. వా. అ. న. తత్స. లూయంత ఇతి లోష్ణాని. కొట్టబడునవి, మట్టిగడ్డ, లోహము.
లోహకారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లోహం కరోతీతి లోహకారకః. ఇనుమును చేయువాడు, కమ్మరి.
లోహకారకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లోహం లోహమయం శస్త్రాది కరోతీతి లోహకారః. రాపులుగు. గ్రద్ద.
లోహభిసారము
సం. నా. వా. అ. పుం. తత్స. లోహం శస్త్రమభిసార్యతేస్మిన్నితి లోహభిసారః. దీనియందు రాజులచేత శస్త్రము పొందబడును. ఆయుధములు ధరించిన రాజులకు నివాళి ఇచ్చుట. రాజు జైత్రయాత్రకు పోవునపుడు ఇచ్చు నీరాజనము.
లోహము
సం. నా. వా. అ. పుం. న. తత్స. లునాతీతి లోహః. శస్త్రరూపమై కోయునది, ఇనుము, బంగారులోనగునది, అగలు (పంచలోహములు, బంగారు, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, సత్తు, తగరము, ధీవరము, ఇవి మూడుచేరి అష్టలోహములన బడును) (నవలోహములని ఒక వాడుక కలదు). ఇనుము.
లోహలుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. లోహత స్థాన ప్రయత్న వైకల్యం కరోతీతి లోహలః. ఉచ్ఛారణ యందు వైకల్యము కలవాడు, స్ఫుటముగాని మాటలుకలవాడు, ముద్దగా మాట్లాడువాడు.
లోహితకము
సం. నా. వా. అ. పుం. తత్స. లోహిత వర్ణ త్వాల్లోహితకః. ఎఱ్ఱనైనది, కెంపు, పద్మరాగము.
లోహితచందనము
సం. నా. వా. అ. న. తత్స. లోహిత వర్ణత్వాత్ చందయత్వాహ్లాదయతీతి చందనం. ఆహ్లదము, సంతోషమును చేయునది, కుంకుమపువ్వు.
లోహితము
సం. నా. వా. అ. న. తత్స. సంధ్యాదికాలములయందుపుట్టునది. లోహిత వర్ణత్వాత్ లోహితం. ఎఱ్ఱనివన్నెకలది, రక్త చందనము, పరిమళచందనము, చెందిరము, నెత్తురు, ఎఱుపు, నదవిశేషము, ఎఱ్ఱనిది, రుహ్యతే ఇతి లోహితం, సువర్భలమను లవణ ద్రవణము, ఒక చేప.
లోహితాంగుడు
సం. నా. వా. అ. పుం. తత్స. లోహితమంగం యస్య సః లోహితాంగః. ఎఱ్ఱని శరీర కాంతికలవాడు, అంగారకుడు, కుజుడు.