హల్లులు : వ

వంచకము
సం. నా. వా. అ. పుం. తత్స. వంచయతీతి వంచకం. వంచించునది, మోసము, నక్క, ఊరముంగిస, సం. విణ. తత్స. మోసము చేయునది.
వంచితుడు
సం. విణ. (అ. ఈ. అ). తత్స. వంచ్యతే స్మ వంచితః. మోసపుచ్చబడినవాడు, మోసకాడు, చెడ్డవాడు.
వంజులము
సం. నా. వా. అ. పుం. తత్స. వన్యతే అర్థ్యత ఇతి వంజుళః. ప్రార్థింపబడునది. దాహాశమనార్థం వన్యత ఇతి వంజులః. దాహశమనార్థమై పొందునది. వన్యతే యాచ్యతే వంజులః. అడగ బడునది, అశోకము, తివాసము ప్రబ్బలి (వృక్ష విశేషము).
వంద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వన్ద్యతే స్తూయతే జౌషధత్యేన వందా. ఔషధమౌట చేత స్తోత్రము చేయబడునది, బదనిక.
వందకము
సం. నా. వా. అ. పుం. తత్స. వైద్యైః వన్ద్యతే స్తూయత ఇతి వన్దకః. వైద్యుల చేత స్తోత్రము చేయబడునది, చిఱుతేకు.
వందారువు
సం. విణ. (ఉ). తత్స. వంద తాచ్ఛీల్యేనేతి వందారుః. మ్రొక్కు స్వభావము కలవాడు, గోత్రనామములు చెప్పి పాదములు సోకి మ్రొక్కువాడు, అభివాదకుడు, విధేయుడు.
వంది
సం. నా. వా. న్. పుం. తత్స. వన్దన్త ఇతి వన్దినః. స్తోత్రము చేయువారు, స్తుతిచేసి జీవించువాడు, బట్టువాడు. వందతే స్తౌతి నృపాదీనితి వందీ, స్త్రోత్రపాఠకుడు.
వంధ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్వగత వైగుణ్యేన ఫలాని బధ్నాతీతి వంధ్యః. తనయందలి వైగుణ్యము చేత ఫలములనడ్డపెట్టునది, గొడ్రాలు, గొడ్డుటావు, ఫలింపనిది.
వంశకము
సం. నా. వా. అ. న. తత్స. వన్యతే యాచ్యతే వంశకం. ప్రార్ధింపబడునది, అగరు, అగలు.
వంశము
సం. నా. వా. అ. న. తత్స. వన్యతే సేవ్యత ఇతి వంశః. అందరి చేత ఆశ్రయింపబడునది. వన్యతే యాచ్యతే వంశః. అడగబడునది. వన్యత ఇతి వంశః. ఆశ్రయింపబడునది, ఒకపురాణలక్షణము, అ. పుం. ఇంటిదూలము, ఒక చెఱకు, కులము, వెదురు, పిల్లనగ్రోవి, వెన్నెముక, వెన్నుగాడి, సమూహము. వమతి ఉద్గిరితి పురుషాన్ వన్యతే ఇతి వా వంశః. మొలక, జాతి.
వంశరోచన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వంశోత్థా రోచనా వంశరోచనా. దీనిచేత జఠరాగ్ని దీపింపబడును, త్వక్థ్వీరి.
వంశానుచరితము
సం. నా. వా. అ. న. తత్స. వ్యాసాది ప్రణీత, మత్స్యపురాణాదులు, ఒక పురాణ లక్షణము.
వకుళము
సం. నా. వా. అ. పుం. తత్స. ఉచ్యతే రోగమత్తీతి వకుళః. రోగమును పోగొట్టునది, పొగడ. వంకతే ఇతి వకులః.
వక్తవ్యము
సం. నా. వా. అ. న. తత్స. వక్తుం యోగ్యో వ్యక్తవ్యః. పలుకతగినవాడు, మాట, మాటాడతగినది, నిందింపతగినది, చెప్పతగినది, నింద్యము.
వక్త్రము
సం. నా. వా. అ. న. తత్స. ఉచ్యతేనేన వక్త్రం. దీనిచేత పలుకబడును, “వక్తీతి వక్తా. మాటలాడువాడు, నోరు, ముఖము, వస్త్రవిశేషము. వక్తి అనేన ఇతి వక్త్రః. మాటకారి.
వక్రము
సం. నా. వా. అ. న. తత్స. వంకతే ఇతి వక్రం. ఏటివంకర, సం. విణ. వంకరైనది, క్రూరమైనది, శని, ముక్కు.
వక్షము
సం. నా. వా. స్. న. తత్స. వక్ష్యతేసురతాదౌవక్షః. సురతాదులయందు కొట్టబడినది, రొమ్ము. ఉచ్యతే అనేనేతి వక్షః. ఒక అంగము, క్రోడము, భుజాంతరము, ఉరము, వత్సము, అంకము, ఉత్సంగము, గణపీఠకము.
వగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహ్ణాతి ప్రతిబధ్నాతి వర్షమితి వగ్రహః. ప్రతిబంధించునట్టి, కఱవు, అవగ్రహము.
వచ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వక్తీతి వచా. పలుకునది, వస, గోరువంక, సం. నా. వా. అ. పుం. తత్స. చిలుక.
వచనము
సం. నా. వా. అ. న. తత్స. ఉచ్యత ఇతి వచనం. పలుకబడునది, మాట, వచస్సు, వాక్యము.
వచస్సు
సం. నా. వా. స్. న. తత్స. ఉచ్యత ఇతి వచః. మాటలాడుట, మాట, వాక్యము.
వజ్రదువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. వజ్ర ఇవస్కంధోస్య వా వజ్రదుః. వజ్రము వంటి కొమ్మలుకలది, ఆకు జెముడు.
వజ్రపుష్పము
సం. నా. వా. అ. న. తత్స. వజ్రమివ విదారకం పుష్పం వజ్రపుష్పం. వజ్రము వలె తీవ్రమైన పుష్పము, నువ్వుపువ్వు.
వజ్రము
సం. నా. వా. అ. న. తత్స. వజ్రతి యాతిన ప్రతిహన్యత ఇతి వజ్రం. అడ్డము లేక పోవునట్టిది. సం. నా. వా. అ. పుం. తత్స. వజ్రతి ప్రతిబంధరాహిత్యేనేతి వజ్రః. అడ్డము లేక పోవునది, రవ, కులిశము, ఒక గ్రహయోగము, కఱ్ఱలనతికించు బంక, సరేసు. వజ్రాయుధము, పిడుగు, కురువేరు, ఒక వ్రతము, రత్నము.
వజ్రి
సం. నా. వా. న్. పుం. తత్స. వజ్రోస్యాస్తీతి వజ్రీ. వజ్రాయుధముకలవాడు, ఇంద్రుడు, జినుడు, ఆకుజెముడు, ఒకలత.
వటకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రహ్మచారి, బాలకుడు.
వటము
సం. నా. వా. అ. పుం. తత్స. వటతి మూలైః స్వస్థానం వేష్టయతి వటః. ఊడల చేత స్వస్థానమును చుట్టుకొని ఉండునది, త్రాడు, దండ, మఱ్ఱి, గవ్వ, ఒక సంకరజాతి.
వటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వట్యతే వేష్ట్యత ఇతి వటీ. చుట్టబడునది, త్రాడు, వటము.
వణిక్కు
సం. నా. వా. జ్. స్త్రీ. తత్స. పణతే వ్యవహరతీతి వణిక్. వర్తకము, సం. నా. వా. అ. పుం. తత్స. ఒక కరణము, వర్తకుడు, బేరమాడువాడు.
వణిజ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వణిజః కర్మవాణిజ్యా. వణిజుల యొక్క కృత్యము, వాణిజ్యము, వ్యాపారము.
వత్సకము
సం. నా. వా. అ. పుం. తత్స. వస్తేత్వచమితి వత్సకః. పట్టను కప్పుకొని ఉండునది, కొడిసె.
వత్సతరము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వితీయ వయస్తమత్వం ప్రాప్తో వత్సోవత్సతరః. మోయుటకు, దున్నుటకు, అనువైన దూడ, దమ్యము.
వత్సనాభము
సం. నా. వా. అ. పుం. తత్స. వత్సస్యేన నాభిరస్య వత్సనాభః. వత్సము యొక్క నాభివలెఉండునది, విషభేదము, బొడ్డు.
వత్సము
సం. నా. వా. అ. న. తత్స. వస్యతే వస్త్రేణ వత్సం. వస్త్రముచే కప్పబడినది. వసతి వసత్యస్మిన్నితి చ సం. నా. వా. అ. పుం. తత్స. వత్సః. ఉండునది, ఱొమ్ము, ఏడాది, ఏడాదిలోనిదూడ, బాలుడు. వదతీతి వత్సః. సంవత్సరము, అంకుడు, శిశువు, బిడ్డ.
వత్సరము
సం. నా. వా. అ. పుం. తత్స. వత్సరః తేద్వే వత్సర ఇత్యుచ్యతే. ఉత్తర దక్షిణాయన కూడినకాలము, సంవత్సరము. సమ్యక్ వసంతి ఋత వోస్మిన్నితి. ఋతువులు దీనియందు వశించును.
వత్సలము
సం. నా. వా. అ. పుం. తత్స. వత్సః స్నేహః సోస్యాస్తీతి వత్సలః. స్నేహముకలవాడు, తృణాగ్ని, ప్రేమకలది.
వత్సాదని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వత్సానాం బాలానాం అదనం వత్సాదనీ. బాలురకు భక్ష్యమైనది, తిప్పతీగ. వత్సైరద్యతే ప్రియత్వాదితి వత్సాదనీ.
వదనము
సం. నా. వా. అ. న. తత్స. వదంత్యనేన వదనం. నోరు, మొగము. వదంత్యనేనేతి వదనం.
వదాన్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వదతీతి వదాన్యః. మంచిమాటలాడువాడు, మిక్కిలి యిచ్చువాడు, మనోజ్ఞముగా మాటలాడువాడు. వదతి సర్వేభ్య ఏవ దాస్యామితి మనోహరవాక్యం ఇతి వదాన్యః. త్యాగి, ప్రియముగా మాట్లాడువాడు.
వదావదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వదతీతి వదా వదః. మాటలాడువాడు, వక్త.
వదుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. వదీతితి వదః. సభయందు భయములేక మాట్లాడువాడు, వక్త.
వధము
సం. నా. వా. అ. పుం. తత్స. హన్యతే వధః. చంపుట, మరణము, దెబ్బ.
వధువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. ఊహ్యతే పరిమళేన వధుః. పరిమళము చేత వహింపబడునది. “ఊహ్యతే భర్త్రేతి వధూః. పురుషుని చేత వహింపబడునది. ఊహ్యతే పుత్రేణేతి వధూః. పుత్రునిచేత వహింపబడునది. ఊహ్యత ఇతి వధూః. వహింపబడునది, ఆడుది, పెండ్లాము, పెండ్లికూతురు, కోడలు, గంట్లకచోరము, పిక్క, ప్రేంకణము, మామెన, స్త్రీ, భార్య, వదినె.
వధ్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వధమర్హతీతి వధ్యః. చంపతగినవాడు.
వనతిక్తక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వనేతిక్తరసావనతిక్తకా. వనమందు చేదైన రసము కలది, అగలుసొంటి, చిఱుబొద్ది.
వనప్రియము
సం. నా. వా. అ. పుం. తత్స. వనం ప్రియమస్య వనప్రియః. వనమే ప్రియముగా కలది, కోయిల, చాఱ.
వనమాలి
సం. నా. వా. న్. పుం. తత్స. ఆపాద పద్మం యా మాలా వనమాలేతి సామతా, అస్యాస్తీతి వనమాలీ. పాదములదాకా వ్రేలెడు పుష్పమాలికకలవాడు, వనమాలకలవాడు, విష్ణువు, కృష్ణుడు.
వనము
సం. నా. వా. అ. న. తత్స. వనతీతి వా వనం. కూడిఉండునది. వన్యతే సేవ్యత ఇతి వనం. జనులచే ఆశ్రయింపబడునది. వన్యతే ఇతి వనం. అడుగబడినది, అడవి, తోపు, జలము, సెలయూట, పరదేశమునందలి ఉనికి, ఇల్లు, సమూహము, సరసీవనము. విపినము, కాననము, గహనము, గుహినము, అడవి, నీరు, అందం.
వనశృంగాటము
సం. నా. వా. అ. పుం. తత్స. వనేశృంగమివ దుఃఖ కరత్వమటతీతి వనశృంగాటః. వనమందు కొమ్మువలె దుఃఖ కరత్వమును పొంది ఉండునది, పల్లేరు (వృక్ష విశేషము).
వనస్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వనస్యపతిః వనస్పతిః. పువ్వులు లేక ఫలములతో కూడిన పనస, మేడి, మామిడి మొదలగునవి పూవకకాచెడుచెట్టు.
వనాయుజము
సం. నా. వా. అ. పుం. తత్స. వనాయుదేశే భవా వనాయుజః. వనాయుదేశమందు పుట్టినవి, గుఱ్ఱము.
వనిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వనతి పురుషమితి వనితా. పురుషుని పొందునది. వన్యత ఇతి వనితా. అడుగబడునది, ఆడుది, మిక్కిలి అనురాగముకలది. నల్లదింటెన, సం. విణ. తత్స. యాచింపబడినది, సేవింపబడినది, ప్రియురాలు, భార్య.
వనీపకుడు
సం. విణ. (అ.ఈ.అ). తత్స. వనతీతి వనీపకః. అడుగువాడు, యాచకుడు.
వనౌకసము
సం. నా. వా. స్. పుం. తత్స. వనయోకః స్థానం అస్య వనౌకాః. వనము నివాసముగాకలది, వానరము, అడవినట్టు. వనమేవ ఓకో గృహం యస్య సః వనౌకసః. కోతి.
వన్య
సం. నా. ఆ. స్త్రీ. తత్స. వనానాం సమూహో వన్యా. వనముల యొక్క సమూహము, వనసమూహము, సం. విణ. తత్స. అడవిఅందుపుట్టినది.
వప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మాంస మనయాస్నిగ్ధం వసతి వపా. దీనిచేత మాంసము మెరుగైఉండును, కడుపులో బొడ్డుకిందనుండెడిఉల్లిపొరవంటికొవ్వు, మెదడు, బెజ్జము, రంధ్రము, కండ కలవాడు,
వపువు
సం. నా. వా. స్. న. తత్స. ఉప్యతే ప్రాక్కర్మభిరితి వపుః. పూర్వ కర్మములచేత పుట్టింపబడునది. శరీరము, చక్కనిరూపము. ఉప్యంతే దేహాంతరభోగసాధనబీజీభూతాని కర్మాణ్యత్రేతి వపుః. శుభాకారము.
వప్రము
సం. నా. వా. అ. పుం. తత్స. ఉప్యతే ప్రాకారోత్ర వప్రః. దీనియందు ప్రాకారము పాతబడును. ఉప్యతే స్మిన్నితి వప్రః. దీనియందు విత్తబడును. సం. నా. వా. అ. న. తత్స. ఉప్యతే సువర్ణయోగ ఇతి వప్రం. బంగారము చేయు యోగమందు పెట్టబడునది. సీసము, కోట, కోట కొఱడు, వరిమడి, తీరము, కొండనెత్తము.
వమధువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ప్రచ్ఛర్దత్వనయా ప్రచ్ఛర్దికా వమధుత్య. దీనిచేత భుజించిన అన్నాదులు వాంతిఅగును. వమ్యత ఇతి వమధుః. ఏనుగు తొండము వలన పుట్టిన తుంపురులు, వమనము.
వమి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. వమత్యనయావమిః. దీనిచేత భుజించిన అన్నాదులు వాంతిఅగును, వమనము, సం. నా. వా. అ. పుం. తత్స. అగ్ని.
వయసు
సం. నా. వా. స్. న. తత్స. వయతే వేతి అజతీతి వా వయః. ప్రాయము, యౌవనము, వయస్సు, పక్షి, ఆహారము, సంవత్సరము, ధనము.
వయస్థ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వయసి యౌవనే తిష్ఠతీతి వయస్థః. యౌవనమందుండువాడు ఉసిరిక, కరక, కారుకొల్లి, చిట్టేలకి, తిప్పతీగ, బూరుగు, సోమెద, సం. విణ. తత్స. ప్రాయపుది.
వయస్సుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వయసాతుల్యో వయస్యః. వయస్సుచేత సమానుడైనవాడు, చెలికాడు, సఖుడు.
వరట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వృణోతీతి వరటా. అంతట వ్యాపించునది, ఆడుహంస, కందురీగ.
వరణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వ్రియతే వేష్ట్యతే నగరమనేన వరణః. దీనిచేత పట్టణము చుట్టబడును. వృణోతీతి వరణః. చుట్టుకొని ఉండునది, కాశికి ఉత్తరపు ఎల్ల అయిన ఒక ఏఱు, వరించుట, వేష్టనము, ప్రహరి, వంతెన, ఉలిమిరి.
వరత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వ్రియతే గజమధ్యమనయేతి వరత్రా. దీనిచేత గజమధ్యము కప్పబడును. వ్రియతే అనయేతి వరత్రా. దీనిచేత చుట్టబడును, టంగువారు, ఏనుగు నడిమి తోలుమోకు.
వరదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వరం వాంఛితం పశుపుత్రాదికం దరాతీతి వరదః. కోరబడిన పశుపుత్రాదులను ఇచ్చువాడు, వరమునిచ్చువాడు, సమర్ధకుడు.
వరము
సం. నా. వా. అ. న. తత్స. వ్రియత ఇతి వరః. వరింపబడునట్టిది. వ్రియతే జనైరితి వరం. జనుల చేత నాశ్రయింపబడునది. వరణం వరం. వరించుట, కుంకుమపువ్వు, ఇంచుక ప్రియమైనది, దేవాతాదులవలన పొందబడు కోరిక, వరించుట, ఒక నిధి, గుగ్గిలము, తోటకూర, వృక్షము, ధూపము, క్షారము, వీర్యము, శ్రేష్ఠము, ఆకారము, చిన్నకోరిక.
వరవర్ణిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వరశ్శేష్ఠో వర్ణో రూపమస్యా ఇతి వర వర్ణినీ. శ్రేష్ఠమైన రూపముకలది. శ్రేష్ఠ వర్ణత్వాత్ వరవర్ణినీ. మంచి వన్నెకలది. ఉష్ణకాలమున సుఖ శీతలమును శీతకాలమున సుఖోష్ణమనైన అంగములుకలిగి భర్తయందు అనురాగము కల ఉత్తమస్త్రీ, పసుపు, గోరోజనము, లక్క, ప్రేంకణము.
వరవసితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వరివస్యతే వరివసితం. శుశ్రూష చేయబడినది, ఉపాసించడినవాడు.
వరాంగకము
సం. నా. వా. అ. న. తత్స. వరం శ్రేష్ఠమంగస్యేతి వరాంగకం. అ. పుం. తత్స. శ్రేష్ఠమైన అంగములు కలది. లవంగపుపట్ట.
వరాంగము
సం. నా. వా. అ. న. తత్స. వరం చ తదంగం వరాంగం. శ్రేష్ఠమైన అంగము, తల, ఆడు, మగలగుఱి, లవంగపుపట్ట, సం. నా. వా. అ. పుం. తత్స. ఏనుగు, యోని, మస్తకము, గుహ్యము.
వరాటకము
సం. నా. వా. అ. పుం. తత్స. వరం శ్రేష్ఠం పద్మమటతి వరాటకః. వృణోతి బీజానితి వరాటకః. విత్తులను కప్పునది, గవ్వ, ఆ. స్త్రీ. తత్స. తామరపూస, మోకు.
వరారోహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వరః శ్రేష్ఠః ఆరోహస్యా ఇతి వరారోహా. పురుషుని చేత ఆరోహింపబడునదికనుక, ఉత్తమస్త్రీ, గొప్పపిఱుదులు కల ఆడుది, అ. పుం. తత్స. మావటివాడు. వర ఆరోహో నితంబో యస్యాః సా వరారోహా.
వరాశి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వరం శ్రేష్ఠం వరణం వా అశ్నుతే వరాశిః. శ్రేష్ఠును పొందునది, లేక వారి చే కోరబడునది, ముదుగుకోక, శ్రేష్ఠమైన కత్తి.
వరాహము
సం. నా. వా. అ. పుం. తత్స. వరం శ్రేష్ఠం సస్యం అహంతీతి వరాహః. శ్రేష్ఠమైన సస్యమును చెఱుచునది, పంది, వరాహ, ముస్తే, కొండ, విష్ణువు. వరాన్ ఆహంతి ఇతి వరాహః.
వరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భువం మూలైర్వృణోతీతి వరీ. వేళ్ల చేత భూమిని కప్పునది, పిల్లపీచర.
వరివస్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వరివసనం వరివస్యా. పరిచర్యసేయుట, సేవ, ఉపాసనము. వరివసః పూజాయాః కరణం ఇతి వరివస్యా.
వరివస్యితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వరివస్యతే స్మ వరివస్యితం. శుశ్రూష చేయబడునది, వరిసితుడు, పూజింపబడువాడు.
వరిష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. శ్రేష్ఠత్వాత్ వరిష్ఠం. లోహములతో శ్రేష్ఠమైనది, మిరియము, రాగి, తీతువు, మిక్కిలి ఉరువైనది, మిక్కిలి వరమైనది. అతిశయైన ఉరుః వరిష్ఠః. మిక్కిలి విరివియైనది, తిత్తిరి పిట్ట, రాగి, విశాలము.
వరీయుడు
సం. విణ. (స్. ఈ. స్). తత్స. శ్రేష్ఠుడు, మిక్కిలి శ్రేష్ఠుడు, మిక్కిలి ప్రాయపువాడు.
వరుణము
సం. నా. వా. అ. పుం. తత్స. వృణోతి వరానముల్లోక ఇతి వరుణః. జనము ఇతనిని వరములడుగుచున్నది. వృణోతి వరుణః వరుణశ్చ. చుట్టుకొనియుండునది, ఉలిమిరి, జలము, దినముయొక్క పదునాల్గవభాగము.
వరుణాత్మజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వరుణస్యాత్మాజా వరుణాత్మజా. వరుణుని కూతురు, వారుణి, కల్లు.
వరూథము
సం. నా. వా. అ. న. తత్స. వియ్రతే రథోనేనేతి వరూథః. రథము దీనిచేత రక్షింపబడును, కవచము, గృహము, చక్రరంధ్రముల జోప్పించెడు నెమ్ములు, పులితోలు లోనగువానిచే నేర్పరచిన రథము మీదికప్పు.
వరూథిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వరూధో రథగుప్తి రస్యామితి వరూధిని. రథగుప్తికలది, సేన, దండు. వరూథం తనుత్రాణాదికమస్యాః అస్తీతి వరూథినీ. సేన, బలం, సైన్యం.
వరేణ్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వరణీయః స్వాతి తైర్భజనీయ ఇతి వరేణ్యః. కోరతగినవాడు, ముఖ్యుడు, ప్రధాముడు, శ్రేష్ఠుడు, వరుడు.
వర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. వృజ్యతే విజాతియైరితి వర్గః. విజాతీయులచేత వర్జింపబడునది, అధ్యాయము, సజాతీయ సమూహము, తెగ, అరిషడ్వర్గము, (కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము).
వర్చస్కము
సం. నా. వా. అ. పుం. తత్స. వృజ్యత ఇతి వర్చస్కం. విడువబడునది, విష్ఠ, ఉచ్చారము.”.
వర్చస్సు
సం. నా. వా. స్. న. తత్స. వర్చతీతి వర్చః. ప్రకాశించునది, తేజము, రూపము, విష్ఠ, చంద్రునికొడుకు.
వర్ణకము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్ణాంతరం కరోతీతి వర్ణకం. వర్ణాంతరమును చేయునది, చందనము, చందనములోనగువానిపూత, తెలుపులోనగు వన్నె, (ఆంధ్రవ్యాకరణమునందు) ప్రత్యయము, పట్టువాడు.
వర్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్ణ్యం తే కపిలారుణ పీత కృష్ణవర్ణైః నీరూప్యంత ఇతి వర్ణాః. పీతనీల వర్ణములచేత స్తోత్రము చేయబడునవి. వర్ణ్యతే చిత్ర వర్ణత్వేనేతి వర్ణః. చిత్రమాట చేత స్తోత్రము చేయబడునది. వర్ణ్యతే వర్ణయతి చ వర్ణః. కొని యాడబడునది, అక్షరము, బంగారు, రూపము, చందనము, లోనగువానిపూత, భేదము, శుక్లాది( ఇది అయిదు, శుక్లము, కృష్ణమ, పీతము, హరితము, రక్తము) బ్రాహ్మణాది క్షత్రియ, వైశ్య, శూద్రులు అని ఇవి నాలుగు) స్తుతి, యశము, గుణము, ఏనుగుమీద పరిచెడుకంబళము, కుంకుమ, కీర్తి, తివాచి, సొంపు, రంగు వేయుట, శోభ, ప్రశ్న.
వర్ణి
సం. నా. వా. న్. పుం. తత్స. వర్ణా ఏషాం సంతీతి వర్ణినః. బ్రాహ్మణాది వర్ణములు కలవారు, బ్రహ్మచారి, చిత్తరువువ్రాయువాడు, వ్రాతకాడు. వర్ణః ప్రశస్తిః అస్యాస్తీతి వర్ణీ. లేఖకుడు.
వర్ణితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వర్ణ్యతే స్మ వర్ణితం. స్తోత్రము చేయబడినదికనుక, స్తుతింపబడునది.
వర్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్తతే స్వేచ్ఛయావర్తకః. స్వేచ్ఛచేత వర్తించునది, వణిగ్యాపారము, వెలిచెపిట్ట, గుఱ్ఱపుగొరిసీ “భువి వర్తత ఇతి వర్తకః. భూమియందు వర్తించునది, గుండ్రనిది.
వర్తనము
సం. నా. వా. అ. న. తత్స. వర్తన్తే అనయేతి వర్తనం. దీనిచేత వర్తింతురు కనుక, వర్తతే తాచ్ఛీల్యేనేతి వర్తనః. వర్తించు స్వభావము కలది, నడవడి, జీవనము, గుర్రము దొర్లుచోటు, వృత్తి, పిండుట, నివసించుట.
వర్తని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వర్తం తే అనయా వర్తనీ. దీనిచేత ప్రవర్తింతురు, త్రోవ, కాలిజాడ, కదులుబిల్ల, కనుఱెప్ప, వృత్తి, బాట.
వర్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వర్త్యతే క్ష్ణిక్రియతే శరీరమనయేతి వర్తిః. దీనిచేత శరీరము నునుపుగా చేయబడును, దీపపువత్తి, దీపము, అత్తరుబిల్ల, పూసెడువాగర, కంటి కాటుక, మందు చేయుట, వరుస, వర్తించువాడు, దీపపు ప్రమిద, వృత్తి.
వర్తిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వర్తతే స్వేచ్ఛయావర్తికః. స్వేచ్ఛచేత వర్తించునది, వీనవల్లంకి.
వర్తిష్ణువు
సం. విణ (ఉ). తత్స. వర్తతే తాచ్ఛీల్యేనేతి వర్తిష్ణుః. వర్తించు స్వభావము కలది, వర్చించువాడు, నివసించువాడు.
వర్తులము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వర్తతే భువి పరివర్తత ఇతి వర్తులం. నేలమీదనే పొఱలునది, వట్రువైనది, గుండ్రనిది.
వర్త్మము
సం. నా. వా. న్. న. తత్స. వర్తంతే అనేనేతి వర్త్మః. దీనిచేత నడచెదరు. వర్తంతే స్మిన్నితి చ వర్త్మం. వర్తింపచేయునది, త్రోవ, కనుఱెప్ప.
వర్దికుడు
సం. నా. వా. ఇ. పుం. తత్స. వర్ధయతి ఛేదయతి కాష్ఠానీతి వర్ధకిః. కొయ్యలు నఱుకువాడు, రథకారుడు, వడ్రంగి.
వర్ధనము
సం. నా. వా. అ. న. తత్స. వర్ధతే తాచ్ఛీల్యేనేతి వర్ధనః. స్వభావముననే వృద్ధిపొందువాడు. వర్ధో వర్ధనం. నఱుకుట, పెరుగుట, నరుకుడు, పెరుగునది.
వర్ధమానకము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్ధ్యతే ఛిద్యతే మహతః కర్మణ ఇతి వర్ధమానకః. గొప్పక్రియవలన పగలునది, మూకుడు.
వర్ధమానము
సం. నా. వా. అ. పుం. తత్స. యత్రక్వాపి వర్ధతే వర్ధమానః. ఎక్కడనైన వృద్ధి పొందునది, ఆముదపు చెట్టు, మూకుడు, రాజ గృహరచనా విశేషము, అభినయహస్తవిశేషము, విష్ణువు, ఆభరణము.
వర్ధిష్ణువు
సం. విణ. (ఉ). తత్స. వర్ధతే తాచ్ఛీల్యేనేతి వర్ధిష్ణుః. స్వభావముననే వృద్ధిపొందువాడు, వృద్ధిపొందువాడు.
వర్ధ్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వర్ధతే దీర్ఘీ భవతీతి వర్ధ్రీ. బిగించగా సాగివచ్చునది, టంగువాఱు, తోలుపట్ట.
వర్భాభువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. వర్షాసు భవతీతి వర్షాభూః. వర్షాకాలమున పుట్టునది, ఆడుకప్ప, గలిజేర, కప్ప, ఎఱ్ఱ, పట్టుపురుగు, పునర్నవి అను ఓషధి.
వర్భాభ్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వర్షాభ్యాః స్త్రీ వర్భాభ్వీ. ఆడుకప్ప, భేకి, పునర్నవము.
వర్మము
సం. నా. వా. న్. న. తత్స. వర్మసంజాత మస్యేతి వర్మా. జోడువీనికి కలదు, కవచము, బొందులము. వృణోతి ఆచ్ఛాదయతి శరీరమితి వర్మ్మ.
వర్మితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వర్మసంజాత మస్యేతి వర్మితః. జోడు దీనికి కలదు, కవచము తొడిగిన వాడు, బొందరీడు, కవచధారి.
వర్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వరణం వరః తత్ర నిపుణావర్యా. వరించుట యందు నేర్పుకలది, తనంతట మగని వరించునట్టి ఆడుది, ముఖ్యురాలు, ప్రధానురాలు, భర్తను వరించు కన్య.
వర్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వర్షతీతి వృష్టిః. తడుపుట్టినది. వృష్యతే సిచ్యతే మేఘైరితి వర్షం. మేఘముల చేత తడుపబడునది. వర్షత్యాప్యాయతీతి చ వర్షః. ఆప్యాయనము చేయునది. వానాకాలము, పేడితనము, వాన, సంవత్సరము, జంబూద్వీపము, భారతాది (ఇవి తొమ్మిది భారతము, రమ్యకము, కింపురుషము, హరి, భద్రాశ్యము, కురువు, హిరణ్మయము, ఇలావృత్తము,కేతు మూలము), మేఘము.
వర్షవరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వర్ష రేతస్సేకం వృణోతీతి వర్షవరః. రేతస్సేకమునాచ్ఛాదించువాడు, అంతః పురపు కావలివాడు, హెగ్గడి, నపుంసకుడు.
వర్షియుడు
సం. విణ. (న్. ఈ. న్). తత్స. అతిశయేన వృద్ధో వర్షీయాన్. మిక్కిలి వృద్ధుడు, మిక్కిలి ఏండ్లు చెల్లినవాడు, వృద్ధుడు.
వర్షోపలము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్షస్య ఉపలః వర్షోపలః. వానయొక్కశిల, వడగల్లు, కరకము.
వర్ష్మము
సం. నా. వా. న్. న. తత్స. వృష్యత ఇతి వర్ష్మ. తడుపబడినది, శరీరము, మిక్కిలి చక్కని రూపము, కొలత, అందమైనది, శుభాకారము.
వలజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వలేన సంచలనేన జాయత ఇతి వలజా. సంచలనము చేత నగునది, చక్కని చూపుకల ఆడుది, భూమి, వరిమడి, పైరు, ధాన్యరాశి, పురద్వారము, యుద్ధము, చేదు, తీపి, ఉప్పు, వగరు కలిసినది, చేనుకుప్ప.
వలభి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వలతి సంవృణోతి కుడ్యమితి వలభీ. గోడను కప్పునది, కొణిగ, చంద్రశాల, మేడగది.
వలయము
సం. నా. వా. అ. పుం. తత్స. వలతే వలయః. చుట్టుకొని ఉండునది, కడియము, కుండలాకారము, కంఠమాల. వలతే ఆవృణోతి హస్తాదికమితి వలయః. పశ్చిమ రాశి యొక్క సగభాగము, మామిడి, కంకణము.
వలయితము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. వలయమాకారస్సంజాతోస్యేతి వలయితం. వలయాకారముకలది, చుట్టబడినది. వలయవత్ కృతమితి వలయితం.
వలాహకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఓహక్ త్యాగే, వబయోర భేదాత్ వలాహకః. బలమును విడువనిది, మేఘము, కృష్ణుని రథములలో ఒకటి, పర్వతము, రాక్షసుడు, డాలుకు చుట్టూగల కట్టు.
వలినుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వళయః అస్యసంతీతి వలినః. తఱులు కలవాడు,వలువలుకలవాడు, సడలినది.
వలిభము
సం. నా. వా. అ. పుం. తత్స. వళయః అస్య సంతీతి వలిభః. తఱులుకలవాడు, ఆడుదాని కోక కుచ్చెళ్లు.
వలీకము
సం. నా. వా. అ. న. తత్స. వలతి సంవృణోతి కుడ్యమితి వలీకం. గోడను కప్పునది, ఇంటిచూరు, నీవ్రము, తాటి, చూరు.
వలీముఖము
సం. నా. వా. అ. న. తత్స. శ్లథం చర్మవళీ సాముఖేస్య వలీముఖః. తఱులు కల ముఖము కలది, మర్కటము, వానరము, తరులమోర, మోము, కోతి, పెరుగుతోడుకొనుట.
వల్కము
సం. నా. వా. అ. న. తత్స. త్వచతి వలతి ఆవృణోతి వృక్షమితి వల్కం. వృక్షమును కప్పుకొనియుండునది, చెట్టుమీద పట్ట, నార, లవంగపుపట్ట, తునియ. వలతే ఇతి వల్కం.
వల్కలము
సం. నా. వా. అ. పుం. తత్స. వలతే సంవృణోతీతి వల్కలః. వృక్షమును కప్పుకొనిఉండునది, చెట్టుమీద పట్ట, నార, లవంగపుపట్ట, తునియ. వలతే ఇతి వల్కం.
వల్గితము
సం. నా. వా. అ. న. తత్స. వలనం వల్గితం. గుఱ్ఱము యొక్క గతి విశేషములు. వేగముగా విడువబడి మీదికి కాళ్లు కదలించుచు పాఱెడి అశ్వధారా విశేషము.
వల్గువు
సం. నా. వా. ఉ. న. తత్స. వలతే ఇతి వల్గు. కొరి వెండ్రుక, మేక పోతు, చక్కనిది, కనురెప్ప, మనోహరము.
వల్మీకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. వాల్మీకో వాల్మికః ప్రాక్తో వాల్మికిరపి వాల్మికి. (భూమిలో నుండి చీమలు మున్నగు వానిచే తోడబడిన మట్టిదిబ్బ) పుట్ట. వలతే ఇతి వల్మీకః.
వల్లకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వల్ల తే ధ్వని విశేషమితి వల్లకీ. స్వర విశేషమును ధరించునది, వీణ, విపంచి. వల్లతే ఇతి వల్లకీ.
వల్లభము
సం. నా. వా. అ. పుం. తత్స. వల్లతి ప్రీణా తీతి వల్లభం. ప్రీతిని కలుగచేయునది. వల్లతీతి వల్లభః. ప్రియమును చేయునది, మేలుజాతి గుఱ్ఱము, ప్రియము. సం. విణ. తత్స. ప్రియుడు, అధ్యక్షుడు.
వల్లరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వల్లతే శాఖాం సంవృణోతీతి వల్లరీ. కొమ్మను కప్పునది, చిగురించిన లేత కొమ్మ, పూచినలేత కొమ్మ పూగుత్తి, తీగ, గుచ్ఛము.
వల్లవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వల్లన్తి భోక్తుః ప్రీతి ముత్పాదయంతీతివల్లవాః. భోజనము చేయువానికి ప్రీతికలుగచేయువారు, గోమహిష్యాదికం వలమానాః. సంవుణ్యంతో వాంతి గచ్ఛంతీతి వల్లవాః. గోమహిష్యాదులను చుట్టుకొనిపోవువాడు, గొల్లవాడు, వంటవాడు, భీముడు. వల్లమానందం వాతీతి వల్లవః.
వల్లి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. వలతే వేష్టతే యష్ట్యాదికమితి వల్లీ. కఱ్ఱమొదలగు వానిని చుట్టుకొని యుండునది, తీగ, లత, వ్రతతి, వాయుసుఖడు, లత, ప్రతతి, చవ్యము, కైవర్తిక.
వల్లూరము
సం. నా. వా. ఆ. స్త్రీ. అ. పుం. అ. న. తత్స. వల్యతే శోషణార్థమితి వల్లూరం. ఎండించుకొఱకు ఆవరింపబడునది, కఱవాడు, పందినంజుడు.
వశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వశనం వశః. ఇచ్చగించుట, ఆడేనుగు, గొడ్డుటావు, ఆవు, కూతురు, పెండ్లాము, ఆడుది, సం. విణ. తత్స. లోకువైనది. వష్టి కామయతే ఇతి వశా. ఒక వృక్షము, ఒక సంకరజాతి, స్వాధీనుడు, అడ్డులేనిది, ప్రజ, కోరిక, పారతంత్ర్యము, ప్రభుత్వము, వంద్య.
వశక్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మణిమంత్రాదుల చేత వశము చేసికొనుట మంత్రతం త్రాదికర్మము.
వశికము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వశ్యతే కామ్యతే భూతాభిరితి వశికం. భూతాదులచే కాంక్షిపబడునది, శూన్యము.
వశిరము
సం. నా. వా. అ. న. తత్స. వస్యతే రోమభిరాచ్ఛాద్యతే వసీరః. రోమములచేత కప్పబడునది. ఇందుప్పు, అ. పుం. తత్స. ఉత్తరేను, గజపిప్పలి.
వశ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మందు మాకుల చేత లోకువైనది, వశమైనవాడు.
వషట్కృతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వషట్ క్రియత ఇతి వషట్కృతం. అగ్నియందు వేయబడినది (హనిస్సు).
వసంతము
సం. నా. వా. అ. పుం. తత్స. వసతి కామోస్మిన్నితి వసంతః. దీనియందు మన్మధుడు వసించును, ఒక ఋతువు, ఒకానొకరాగము. వసంత్యత్ర మదనోత్సవాః ఇతి వసంతః. చైత్రవైశాఖములు.
వసతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వసంత్యస్యామితి వసతిః. దీనియందుందురు, ఇల్లు, ఉనికి, రేయి, బుద్ధాలయము. యామిని, నిశ, రాత్రి, స్థలము, జైనాశ్రమము.
వసనము
సం. నా. వా. అ. న. తత్స. చిల్యతే చేలం చిలవసనే. కట్టుకొనబడునది, ఉనికి, వస్త్రము.
వసుంధర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వసుధారయతీతి వసుంధర. ధనమును ధరించునది, భూమి, వసుధ, నేల. వసూని ధారయతీతి వసుంధరా.
వసుకము
సం. నా. వా. అ. న. తత్స. వనత్యస్మిన్ తేజ ఇతి వసుకః. దీనియందు తేజస్సుఉండును, చవుట ఉప్పు, అ. పుం. తత్స. జిల్లేడు, ఒకపుష్పము.
వసుథ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వసుదధాతీతి వసుధా. ధనమును ధరించునది, భూమి, మహి, మేదిని, నేల. వసూని రత్నాని దధాతి ధారయతీతి వసుధా.
వసుదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వసుభిర్ధనైర్దీవ్యత ఇతి వసుదేవః. ధనముల చేత ప్రకాశించువాడు, కృష్ణునితండ్రి. వసునా ధనేన దీవ్యతీతి వసుదేవః.
వసుమతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వసుధనమస్యామస్తీతి వసుమతి. ధనము దీనియందుకలదు, భూమి, వసుధ, నేల. వసూని ధనరత్నాని సంత్యస్యాః ఇతి వసుమతీ.
వసువు
సం. నా. వా. ఉ. న. తత్స. ఆహత్య వసం తీతి వసవః. కూడుకొనిఉండువారు. వస్తి భూమి మాచ్ఛాదయతీతి వసుః. భూమిని కప్పిఉండునది. ప్రభూణాం గృహేవసుః. ప్రభు గృహముల యందు ఉండునది. వనతీతివసుః. ఉండునుకనుక, బంగారు, రత్నము, ధనము, ఒక పుష్పము, పలుపు, కిరణము, అగ్ని, ఒక రాజు, గణదేవతా విశేషము. (అష్టవసువులు- ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యుఘడు, అనలుడు, ప్రభాసుడు) మధురము, చెట్టు, మందారము, ప్రతివాది, పచ్చపెసలు, నిధి, నీరు, కాడిపలుపు.
వస్తి
సం. నా. వా. ఇ. అ. పుం. స్త్రీ. తత్స. వసతి మూత్రాదికమత్రేతి వస్తిః. మూత్రాదికము దీనియందుండును, బద్దె, పొత్తికడుపు, బట్ట అంచు.
వస్త్యము
సం. నా. వా. అ. న. తత్స. వస్త్యం అవస్త్యం చ. జనులు దీనియందు కూడుదురు. ఇల్లు గృహము, సద్మము.
వస్త్రము
సం. నా. వా. అ. న. తత్స. వస్యతే అనేనాంగమితి వస్త్రం. దీనిచేత అంగము కప్పబడును, వలువ, వసనము, బట్ట.
వస్నము
సం. నా. వా. అ. న. తత్స. వసత్యనేవ పణ్యాదికమితి వస్నః. దీనిచేత పణ్యమైన వస్తువు నిలుచును, వస్త్రము, ధనము, కూలి, వెల, విలువ.
వస్నస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వస్తే ఛాదయతి దేహం వస్నసా. దేహమును కప్పుకొనిఉండునది, సన్నపునరము.
వహము
సం. నా. వా. అ. పుం. తత్స. వహత్యనేన శకటాదికమితి వహః. శకటాదులను దీనిచేత వహించును, ఎద్దుమూపురము, వాహనము. వహతి యుగమనేన ఇతి వహః.
వహ్ని
సం. నా. వా. ఇ. పుం. తత్స. వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః. హవ్యమును దేవతలకు చేర్చువాడు, అగ్ని, చిత్రమూలము. వహతి ధరతి హవ్యం దేవార్థమితి వహ్నిః. అగ్ని.
వహ్నిశిఖము
సం. నా. వా. అ. న. తత్స. వహ్నేః శిఖేన శిఖాకాంతిర్యస్య వహ్నిశిఖం. అగ్ని జ్వాల వంటి కాంతికలది, కుంకుమ పువ్వు, కుసుమపువ్వు.
వహ్నిసంజ్ఞికము
సం. నా. వా. అ. పుం. తత్స. దీపనత్వాద్వహ్నేః సంజ్ఞనామాస్యాస్తీతి వహ్నిసంజ్ఞికః. దీపనమౌట వలన అగ్నియొక్క వేరుగలది, చిత్రమూలము.
వాక్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వాచాం పతి ర్వాక్పతిః. వాక్కులకు కర్తవాగీశుడు, బ్రహ్మ, బృహస్పతి, కవీశ్వరుడు, సం. విణ. తత్స. మిక్కిలి చతురముగా మాటలాడువాడు, వక్త.
వాక్యము
సం. నా. వా. అ. న. తత్స. వక్తుం యోగ్యం వాక్యం. పలుక తగినది, పత పదార్ధములయొక్క పరస్పరము సంబంధము చెడక ఏకార్ధము కలిగి క్రియతోడగాని, తదితరములతోడగాని ముగిసెడి పదసముదాయము, మాట. ఉచ్యతే ఇతి వాక్యము.
వాగీశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వాచామీశో వాగీశః. వాక్కులకుకర్త, బ్రహ్మ, బృహస్పతి, కవీశ్వరుడు. సం. విణ. తత్స. మిక్కిలి చతురముగామాట్లాడువాడు, వక్త.
వాగుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మృగబంధనే అవగురతేవాగురా. మృగబంధనమందుద్యోగించునది, ఉరి, వల, మృగములను, పక్షులను పట్టుసాధనము.
వాగురికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వాగురయా చరతి వాగురికః. వలచేత చరించువాడు, ఉరులు వలలు పన్ని మృగములను, పక్షులకు పట్టెడు వేటగాడు.
వాగ్మి
సం. నా. వా. న్. పుం. తత్స. ప్రశస్తా వాగస్తేతి వాగ్మీ. మంచివాక్కుగలవాడు, చిలుక, బృహస్పతి, విణ, యుక్తి యుక్తముగా మాటలాడువాడు, వాచాలుడు.
వాచ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఉచ్యతే ఇతి వచశ్చ. పలుకబడునది, వాక్కు యొక్క రూపాంతరము, సరస్వతి.
వాచంయముడు
సం. నా. వా. అ. పుం. తత్స. వాచం నియచ్ఛతీతి వాచం యమః. వాక్కును నిలుపువాడు, మౌనవ్రతముకలవాడు, మౌని, ముని.
వాచకము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యక్త్యర్థ మితి వాచకః. అర్థమును చెప్పునది, వాచ్యార్ధమును తెలిపెడు శబ్ధము.
వాచస్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వాచాం పతిః వాచస్పతిః. వాక్కులకు పతి, బృహస్పతి, వేల్పుటొజ్జ.
వాచాటుడు
సం. విణ. (అ. ఆ. ఆ). తత్స. కుత్సితా వాచ స్సంత్యస్యేతి వాచాటః. కుత్సితములైన పెక్కుమాటలాడునుకనుక, వదరుబోతు, పొగరుపోతు, చెడ్డమాటలాడువాడుకనుక.
వాచాలుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కుత్సితా వాచస్సంత్యస్యేతి వాచాలాః. కుత్సితములైన పెక్కుమాటలాడునుకనుక, చెడ్డమాటలు మాట్లాడువాడు.
వాచికము
సం. నా. వా. అ. న. తత్స. వాచిః అస్మిన్ సన్తీతి వాచికం. వాక్కులు దీనియందు కలవు, సమాచారము, వక్కాణము, జాబు, నోటిమాట, ఒక అభినయము.
వాజము
సం. నా. వా. అ. న. తత్స. వజత్యనేన బాణమితి వాజః. దీనిచేత బాణము పోవును, నెయ్యి, నీళ్లు, హనిస్సు, సం. పుం. తత్స. బాణము ఱెక్క, వేగము, ధ్వని, గుఱ్ఱము, అన్నము.
వాజి
సం. నా. వా. న్. పుం. తత్స. పక్షోవాగేగోవా, తద్యోగాత్ వాజీ. ఱెక్కలు గాని వేగముగాని. వాజోవేగస్త ద్యోగా ద్వాజీ. ఱెక్కలుకలిగినది, గుఱ్ఱము, పక్షి, బాణము.
వాజిదంతకము
సం. నా. వా. అ. పుం. తత్స. వాజిదంతాకారకేసర త్వాద్వాజిదంతకః. గుఱ్ఱపు పండ్లవంటి ఆకులు కలది, అడ్డసరము.
వాజ్ముఖము
సం. నా. వా. అ. న. తత్స “వాచః ముఖముపక్రమః వాజ్ముఖమ్. వాక్కు యొక్క ప్రారంభము, ఉపన్యాసము.
వాటీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కూరలోనగువానితోట, ముండ్లకంచె, పరిమళము గలగడ్డి.
వాట్యాలకము
సం. నా. వా. అ. పుం. తత్స. వాటమలతీతి వాట్యాలకః. వృక్షవాటిక నుఅలంకరించునది, ముత్తవపులగము, ఒకలత.
వాణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వయనం వాణిః. నేయుట, పలుకు, పలుకుజెవి, నేత.
వాణిజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వణిగేవ వాణిజః. వణిజుడే వాణిజుడు, వర్తకుడు.
వాణిజ్యము
సం. నా. వా. అ. న. తత్స. వణిజః కర్మ వాణిజ్యం. వణిజుని యొక్క పని, వణిగ్వ్యాపారము.
వాణిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వణతి తాచ్ఛీల్యేనేతి వాణినీ. పలుకునట్టి స్వభావము కలది, ఆటకత్తె, కుంటెనకత్తె, ముగ్ద, విదగ్ద, తెలివిగల, స్త్రీ, త్రాగునాడుది.
వాతకము
సం. నా. వా. అ. పుం. తత్స. వాతం కరోతీతి వాతకః. వాతమును చేయునది, సోమిదము.
వాతకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వాత సంజ్ఞికో రోగోస్యాస్తీతి వాతకీ. వాతరోగము కలవాడు, సోమిదము. వాతో అతిశయితో అస్త్య్స్యేతి వాతకి.
వాతపోధము
సం. నా. వా. అ. పుం. తత్స. వాతరోగం పోథయతీతి వాతపోథ. వాతరోగమును పోగొట్టునది, మోదుగు, కింశుకము.
వాతప్రమీ
సం. నా. వా. ఈ. పుం. తత్స. వాతం ప్రమిమీతే అభిముఖ్యేన ప్రతి పద్యతే వాతప్రమీః. వాతమృగముహయువునకు ఎదురుగా, జింక, గుఱ్ఱము, పోవునది.
వాతమృగము
సం. నా. వా. అ. పుం. తత్స. మృగ్యతేలుబద్ధకైరితి మృగః. వేటకాండ్రచే వెదకబడునది, గాలికెదురునడిచెడియిఱ్ఱివంటి మృగము, జింక.
వాతాయనము
సం. నా. వా. అ. న. తత్స. వాతస్య అయనం మార్గో వాతాయనం. వాయువునకు మార్గము, కిటికీ, గవాక్షము.
వాతాయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. వాతం అయతే వాతాయుః. వాయువునుపొందునది, జింక, వాతమృగము.
వాతూలము
సం. నా. వా. అ. పుం. తత్స. వాతసమూహో వాతాసహశ్చ వాతూలః. వాయుసముహమును, వాయువునోర్వని వాడు, గాలి, సుడిగాలి, గాలిసయించనిది, వెఱ్ఱెత్తినది, గాలిగుంపును, గాలిని ఓర్వనివాడు.
వాత్సకము
సం. నా. వా. అ. న. తత్స. వత్సానాం సముహోవాత్సకం. దూడలగుంపు.
వాద్యము
సం. నా. వా. అ. న. తత్స. తతం వీణాదికం వాద్యమ్. వీణమొదలైన తంత్రీవాద్యములు, వాదము.
వాద్రితము
సం. నా. వా. అ. న. తత్స. వాదయంతి ఏనమితి వాద్యం వాద్రిత్రం. దీనిని పలికింతురు గనుక. తతము, ఆనద్ధము, సుషిరము, ఘనము అనెడు వాద్య చతుష్టయము,ఆతోద్యము, వాద్యద్వని, మద్దెల ధ్వని.
వానప్రస్థము
సం. నా. వా. అ. పుం. తత్స. వనప్రస్థే వనస్థలే భవో వానప్రస్ధః. వనస్థలి యందు పుట్టినది. వనప్రస్థేవనైక దేశే భవోవానప్రస్థః. వనైకదేశమందుండు వాడు, ఒక ఆశ్రమము, ఇప్ప, మోదుగు, మూడవ ఆశ్రమమున ఉన్నవాడు, మధుష్టీల.
వానరము
సం. నా. వా. అ. పుం. తత్స. నర ఇవవానరః. నరునివలెనుండునది, కోతి, మర్కటము, కపి. వా వికల్పితో నరః, యద్వా వానం వనే భవే ఫలాదికం రాతీతి వానరః. ధూపము.
వానసృత్యము
సం. నా. వా. అ. పుం. తత్స. వనస్పతౌ భవః వానస్పత్యః. పుష్పమువలన పుట్టిన ఫలములతో కూడినది, పూచికాచెడి చెట్టు, పుష్పించి, ఫలించు వృక్షము.
వానీరము
సం. నా. వా. అ. పుం. తత్స. దాహశమనార్ధం వన్యత ఇతి వానీరః. దాహశమ నార్ధమై పొందబడునది, ప్రబ్బ, వేతసము. వాయతి శుష్యతి ఇతి వానీరః.
వానేయము
సం. నా. వా. అ. న. తత్స. వనేజలేజాతం వానేయం. జలమందు పుట్టినది, కైవడిముస్తె, పరిపేలవము.
వాపి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వారి పీయతే త్ర వాపీ. దీని యందు జలము పానము చేయబడును, నడబావి, దీర్ఘిక, దిగుడు బావి.
వాప్యము
సం. నా. వా. అ. న. తత్స. వాప్యాం భవ వాప్యం. బావుల యందు పుట్టినది, చెంగల్వకోస్టు.
వామనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వమతి యజ్ఞ సూత్రమితి వామం. యజ్ఞోపవీతమును విడిపించునది. వాయతే వమ్యత ఇతి చ వామః. పొందపడునది, విష్ణువు, పొట్టివాడు, ఒక అవతారము, దక్షిణ దిగ్గజము.
వామలూరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. వామం వామైః ప్రాణి భిర్వాలూయత ఇతి వామలూరః. కుటిలమైన జంతువుల చేతగాని త్రవ్యబడినది, పుట్ట.
వామలోచన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వామేరుచిరే లోచనే అస్యా ఇతి వామలోచనా. మంచికన్నులు కలది, చక్కనికన్నుల కలఆడుది, ఆడుది, స్త్రీ.
వామి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వమతి గర్భం వామీ. గర్భమును వెళ్ళించునది, ఆడుగుఱ్ఱము, ఆడుగాడిద, ఆడు లొట్టియ, ఆడు నక్క.
వాయసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వాయసానా మియం వాయసీ. కాకుల సంబంధమైనది, కాచి, బమ్మమేడి, తీగబచ్చలి.
వాయసోలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వాయసవ దులతి చలతి వాయసోలీ. కాకివలె చలించునది, కారుకొల్లి, కాకోలి.
వాయుదండము
సం. నా. వా. అ. పుం. తత్స. వాయస్యదండోవాయుదండః. నేయుట, సాలెవాడు, నేతసరితట్టెడు పలక.
వాయువు
సం. నా. వా. అ. పుం. తత్స. వాతీతి వాయుః. వీచునది కనుక వాయువు, గాలి, (దీని భేదములు, గోగంధనము, వాసంతము, చామరము, కించులుకము, ఇరింగణము, ఝంఝ, చూషకము, వాత్య) పంచోపవాయువులు-నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము, పంచవాయువులు, ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, గాలి, పంచభూతములలో ఒకటి, శ్వాస, స్పర్శ, అనిలము, మారుతము, పవనము, వాతము, ప్రభంజనము, మృగవాహనము.
వాయుసఖుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వాయోః సఖా వాయుసఖః. వాయువునకు సఖుడు, అగ్ని, గాలినెచ్చెలి, వహ్ని, అనలము.
వాయుసతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వాయసానామరాతిః వాయసారాతిః. కాకులకు శత్రువు, గుడ్లగూబ.
వారణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చెలియలికట్ట. సం. వా. నా. అ. న. తత్స. వారించుట సం. నా. వా. పుం. తత్స. వారయతి పరబలమితి వారణః. ఏనుగు, హస్తి, కరి, గజము.
వారముఖ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వారే వేశ్యాసమూహే ముఖ్యా వారముఖ్యా. వేశ్యాసమూహము నందు ముఖ్యురాలు, యోగ్యతనుబట్టి జనులచేత సత్కరింపబిడిన వేశ్య.
వారవాణము
సం. నా. వా. అ. పుం. తత్స. వారయతీతి వారవాణః. బాణముల నడ్డపెట్టునది, కవచము. వారం వారణీయం వాణం యస్మాత్ వారవాణః. కవచము, కంచుకము.
వారస్త్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వారస్సమూహః తస్యస్త్రీ వారస్త్రీ. అందఱికి స్వాధీనురాలు, వేశ్య. వారస్య జనసమూహస్య స్త్రీ వారస్త్రీ. గణిక, వారముఖ్య.
వారాహి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వరాహైరాత్రాతా వారాహే. అడవి పందులచేత ఆక్రమింపబడునది, ఒకమాతృక ,అడవి ఆడుపంది, పాచితీగ, నేలతాడు, కందమూలము.
వారి
సం. నా. వా. ఇ. న. తత్స. అపవారయతి నిమ్నోన్నతమితివా. నిమ్నోన్నతములను కప్పనది, నీళ్లు, కురువేరు, స్త్రీ, సరస్వతి, కుండ, ఏనుగు . సం. ఈ. తత్స. పట్టెడుచోటు, ఏనుగుపట్టెడు పల్లము. వారయతి తృషామితి వారి. జలము.
వారిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వారిదదాతీతి వారిధిః. ఉదకము నిచ్చునది, వారినిధి, సముద్రము.
వారిపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వారిణి పర్ణయోగాత్ వారిపర్ణీ. జలమందు పర్ణములు కలిగినది, నాచు, పర్ణములు, ఆకులు పాచి.
వారివాహము
సం. నా. వా. అ. పుం. తత్స. వారివహతీతి వారివాహః. జలమును వహించునది, మబ్బు, నీరుతాల్పు.
వారుణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వరుణాజ్జాతా వరుణస్త్యేయ మితి చ వారుణీ. వరుణుని వలన పుట్టినది, పడమటిదిక్కు, సారాయి, శతభిషనక్షత్రము, ఒక దినుసగఱిక. వరుణస్యేయం వారుణీ, పార్వతి, ఒకతీగ, మద్యము.
వార్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వృత్తిః పునర్జీ వమస్యాస్తీతి వార్తః. మరల బ్రతుకుట. వర్తతే చేతి వర్తనం చ వార్తా. దీనిచేత వర్తింతురుగనుక, వృత్తాంతము, వర్తనము, జీవనోపాయము, అర్ధానర్ధ వివేచన విద్య, వార్తాకము, పొల్లు, ఆరోగ్యము, రోగము తీఱినది, జీవనోపాయముకలది. వృత్తిరస్యామస్తీతి వార్తా. జనశృతి, నుండి కోలుకున్నవాడు.
వార్తాకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఆరోగ్యాయవర్తత ఇతి వార్తాకీ. ఆరోగ్యము కొఱకు వర్తించునది, ములక, వంగ.
వార్తావహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వార్తాతాం వహతీతి వార్తావహః. బేరము మొదలయిన జీవనోపాయము, కావడిమోసెడువాడు, వృత్తాంతమును తెలిసికొని పోయిచెప్పువాడు.
వార్ధక్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ముసలితనము, వృద్ధత్యము, ముసలివారుచేయుపని.
వార్ధుషికుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వృద్ధ్యాజీవతీతి వార్ధుషికః. వృద్ధిచేత బ్రతుకు వాడు, వడ్డీకిచ్చి జీవనము చేయువాడు, కుసీదుడు. వృద్ధయర్థ ద్రవ్యం వృద్ధిః తాం ప్రయచ్చఛతీతి వార్ధుషికః. లాభమును అర్జించువాడు, ధాన్యమును వడ్డీకిచ్చువాడు.
వార్మణము
సం. నా. వా. అ. న. తత్స. వర్మణాం సమూహో వార్మణం. బోళ్లయొక్క మొత్తము, వర్మముల సమూహము (వర్మము-కవచము).
వార్షికము
సం. నా. వా. అ. న. తత్స. వర్షాసు భవతీతి వార్షికం. ఋతువునందుపుట్టినది, కలుక్రాంత, వానాకాలమునపుట్టినది, సంవత్సర కాలపరిమితి కలది, వర్షాకాలము.
వాలధి
సం. నా. వా. ఇ. ,పుం. తత్స. వాలాధీయం తేస్తిన్మితి వాలధిః. వాలము దీనియందు ధరించబడును, ఏనుగు, గుఱ్ఱములోనగువానితోక. వాలాః కేశా ధీయంతే అత్ర వాలధిః. కొయ్యపీక్తాను, జుట్టు, తోక.
వాలపాశ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వాల పాశే కేశ పాశే సాద్వివాల పాశ్యా. కేశపాశమందు చక్కగాఉండునది, జడబిళ్ల, పారితద్య.
వాలము
సం. నా. వా. అ. పుం. తత్స. వల్యతే వస్త్రేణ వాలః. వస్త్రముచేత చుట్టబడునది, తోక, తలవెంట్రుక, కత్తి, కేశము, బాలము, కచము, చికురము, శిరసిజము, శిరోరుహము.
వాలహస్తము
సం. నా. వా. అ. పుం. తత్స. వాలసమూహయోగాత్ వాలహస్తః. వాలసముహముకలది, వెండ్రుకలుకలతోక, వెండ్రుకల సమూహము. వాలానాం హస్తః సమూహః వాలహస్తః. బొచ్చుతోక.
వాలుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వలతే వాలుకం. చలించునది, ఇసుక, నూగుదోస, చలువమిరియములు, ఒక విషము.
వాల్కము
సం. విణ. (అ. ఈ. అ). తత్స. వల్కస్య వికారః వాల్కం. అనగానార, దీనిచేత చేయబడినది, నారచీర.
వావదూకుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. వావద్యతే భృశం వదతీతి వావదూకః. లెస్సగా పలుకువాడు, యుక్తిముక్తముగామాటలాడువాడు, వాగ్మి, వాచాలుడు.
వావృత్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వావృత్యతే స్మ వావృత్తః. వరింపబడిన వాడు.
వాశకము
సం. నా. వా. అ. పుం. తత్స. వాసయతీతి వాసికః. కప్పుకొనునది, అడ్డసరము.
వాశిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వాశ్యతే ఇతి వాశితం. పలుకపడునది, ఆడేనుగు, ఆడుది, మృగపక్షిధ్వని, వాసనకట్టబడినది.
వాస గృహము
సం. నా. వా. అ. న. తత్స. వాసస్య శయనస్య యోగ్యం గృహం వాస గృహం. శయనమునకు అనువైన ఇల్లు, పడకిల్లు, భోగ గృహము.
వాసంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వసంతే పుష్పతీతి వాసంతీ. వసంత కాలమందు పుష్పించునది, అడవిమొల్ల, పువ్వుల గురివెంద, బట్టకడిమి. వసంతస్యేయమితి వాసంతీ. మాధవి, పుష్పలతా విశేషము, మల్లి.
వాసయోగము
సం. నా. వా. అ. పుం. తత్స. వాసాయ సురభీకరణాయ యుజ్యంత ఇతి వాసయోగాః. వాసన కొఱకు కూర్చబడునది, గంధపొడి, చూర్ణము.
వాసరము
సం. నా. వా. అ. పుం. న. తత్స. వసంత్యస్మిన్నితి వాసరః. దీనియందు వసింతురు, దినము, దివసము, ప్రొద్దు. వాసయతీతి వాసరః. సర్పవిశేషము, పాము, పగలు.
వాసవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వసూని రత్నాన్యస్య సంతీతి వాసవః. రత్నములు కలవాడు, ఇంద్రుడు, వేల్పుఱేడు. వసురేవ వాసవః, ఇంద్రుడు, మాధవుడు.
వాసిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వాస్యతే గంధద్రవ్యైరితి వాసితం. గంధ ద్రవ్యముల చేత వాసింపబడునది. ఆడేనుగు, ఆడుది, మృగపక్షులధ్వని, వాసనకట్టినది. వాస్యత ఇతి వాసితం. వాసయతీతి వాసితా.
వాసుకి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వసతి పాతాళ ఇతి వాసుకిః. పాతాళమందు ఉండువాడు, సర్పరాజు.
వాసుదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వసుదేవ స్యా పత్యం పుమాన్. వసుదేవుని కుమారుడు, కృష్ణుడు, సుభద్రుడు, సవ్యుడు, లోహితాక్షుడు, గుఱ్ఱము, హరి.
వాసువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. వసతి మాతృసమీపే వాసూః. తల్లి సమీపమున ఉండునది, నాట్యపరిభాషయందుబాలిక.
వాస్తుకము
సం. నా. వా. అ. న. తత్స. వసంతి గుణా అత్రేతి వాస్తుకం. దీనియందు మంచి గుణములుండును, ఒక దినుసుకూరాకు, చక్రవర్తము, చక్రవర్తికూర.
వాస్తువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. వసం త్యస్మిన్నితి వాస్తుః. దీనియందు ఉందురు ఇండ్లుమొదలైనవి ఏర్పడడానికి అనువైన భూమి, నివేశనము, పట్టణము, ఇంటిహద్దు, సురంగము, ఇల్లు. వసంతి ప్రాణినో యత్ర వాస్తుః. గృహము నిర్మించుటకు తగిన భూమి, వాటిక.
వాస్తోష్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వాస్తోః గృహక్షేత్రాదేః పతిరధి దేవతా వాస్తోష్పతిః. గృహక్షేత్రాదులకు అధిదేవత, ఇంద్రుడు, వేల్పుఱేడు.
వాహద్విషము
సం. నా. వా. ష్. పుం. తత్స. వాహస్య హయస్య ద్విషత్ శత్రుః వాహద్విషత్. గుఱ్ఱమునకు శత్రువు, ఎనుబోతు.
వాహనము
సం. నా. వా. అ. పుం. తత్స. వోఢృభిః పరం పరయాహ్యత ఇతి పరం పరావాహనం. గుఱ్ఱములు మొదలగువాని పరంపరచేత వహింపబడునది. పెనుపాము, తూముకాలువు, నీరుచెంచలి.
వాహము
సం. నా. వా. అ. పుం. తత్స. వహతి నరం వాహః. నరుని వహించునది, “వహతి ధాన్యాదికమితివాహః. ధాన్యాదులను వహించునది, గుఱ్ఱము, ఎద్దు, భుజము, వాయువు, ఇరుస. ఉహ్యతే అనేనేతి వాహః. వాయువు, ప్రవాహము, గాడిద, రెండుగోనెలు నాల్గుఖారులు, రెండు ప్రస్థములు.
వాహము
సం. నా. వా. అ. పుం. తత్స. వహతి నరం వాహః. నీరు నివహించునది. వహతి ధాన్యాదిక మితివాహః. ధాన్యాదులను వహించునది, గుఱ్ఱము, ఎద్దు, భుజము, వాయువు, ఇరుస. ఉహ్యతే అనేనేతి వాహః. ఘోటకము, అశ్వము, పరిమాణవిశేషము, వృషము, ప్రవాహము.
వాహసము
సం. నా. వా. అ. పుం. తత్స. వాతీతివాయుః తేనహసతీతి వాహసః. వాయువుచేత సంతోషిం చునది, పెద్దపాము, తూము కాలువ, నీరు చెంచలి. (వృక్ష విశేషము). ఉహ్యతే ఇతి వాహసః. అజగరము, సర్పవిశేషము.
వాహిత్థము
సం. నా. వా. అ. న. తత్స. మదవాహినిస్థానే తిష్ఠతీతి వాహిత్థం. మదస్థానమునందు ఉండునది, ఏనుగు యొక్క వాతకుంభము క్రిందిచోటు.
వాహిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వాహః అస్యాం సంతీతి వాహినీ. అశ్వములుకలది. వహతి, వాహయతీతి చవాహినీ. ప్రవహించునది, నది, సేన, సేనావిశేషము. వాహా వాహనాని ఘోటకాదీని సంత్యస్యామితి వాహిని.
వాహినీపతి
సం. నా. వా. అ. పుం. తత్స. వాహిన్యాః పతిః వాహినీపతిః. వాహిని అనగా దండు; దానికి దొర, సేనాధిపతి, సేనానాయకుడు, సముద్రుడు.
వికంకతము
సం. నా. వా. అ. పుం. తత్స. వికంకతే ప్రసరతీతి వికంకతః. విశేషముగా పోవునది, ములువెలను, పుల్లవెలగ (వృక్ష విశేషము).
వికచము
సం. నా. వా. అ. పుం. తత్స. విగతః కచోబంధన మస్య వికచః. విగతమైన బంధము కలిగినది, కేతుగ్రహము, వికసించినది, వెండ్రుకలు లేనిది.
వికర్తునుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వికృన్తతి తమ ఇతి వికర్తనః. తమస్సును పోగొట్టువాడు, సూర్యుడు. విశేషేణ కర్తనం యస్య సః వికర్తనః. సూర్యుడు, భానుడు, రవి.
వికలము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విచ్ఛేదనము పొందినది.
వికస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వికసతీతి వికసా. వికసించునది, మంజిడి, చంద్రుడు.
వికసితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వికసతి విస్తారం ప్రాప్నోతీతి వికసితః. విస్తారమును పొందునది, వికసించినది.
వికస్వరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వికసతి తాచ్ఛీల్యేనేతి వికస్వరశ్చ. స్వభావముననే వికసించునది, వికసించునది.
వికారము
సం. నా. వా. అ. పుం. తత్స. క్రోధ హర్షాదికృత మనోవికార భావ ఇత్యుచ్యతే. రసములను పుట్టించునది, మనస్సు యొక్కగాని, రూపము యొక్కగాని నూఱుపాటు, తెపువులు, (షోడశ వికారములు, ఏకాదశేంద్రియములు, పంచభూతములును). ప్రకృతే ర్విరుద్ధం కరణం వికారః. ప్రకృతికి విరుద్ధమైన క్రియ, చెడుగు, రోగము, మార్పు.
వికాసి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. వికసతి తాచ్ఛీల్యేనేతి వికాసీ. స్వభావముననే వికసించునది, వికాసము కలది.
వికిరము
సం. నా. వా. అ. న. తత్స. వికిరతి భక్ష్యమితి వికిరః. మేతకు యోగ్యమైన పదార్ధములను జల్లునది, గజకుంభస్థలమద్యము.పక్షి, ఖండము, శ్రాద్ధకాలమందు నిమంత్రితులు భుజించిన పిమ్మట విస్తరకు ముందఱ వేసెడు అన్నము, నూయి. వికిరతి మృత్తికాదీన్ భోజనార్థమితి వికిరః. కూపము, నుయ్యి.
వికీరణము
సం. నా. వా. అ. న. తత్స. పుష్పాణి వికిర తీతి వికీరణః. పువ్వులు చల్లునది, వెదజల్లుట, జిల్లేడు.
వికుర్వాణుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వికురుతే సుఖావేశాదితి వికుర్వాణః. సుఖావేశముచే వికారమును పొందువాడు, సంతోషము పొందిన మనస్సుకలవాడు, సంతుష్టుడు.
వికృతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వికృన్తతి మన ఇతి వికృతం. మనస్సును దుఃఖపెట్టునది. కార్శ్యాదినా పూర్వావ స్థైపేక్షయా విరుద్ధః వికృతః. కార్శ్యాదులచేత పూర్వావస్థకంటె వికృతమైయుండువాడు. వికారమునొందినది, తెవులునొందినది, రోతఅయినది, మాఱినది, ఒక శృంగారచేష్ట, రోగి, అంగవికలుడు.
వికృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. విరుద్ధా క్రియా వికృతిః. విరుద్ధమైన క్రియ కనుక, వికారము, ఒకఛందస్సు, ఒకసంవత్సరము, వికృతము.
విక్రమ
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ క్రమతేనేన విక్రమః. దీనిచేత విశేషముగా ఆక్రమించును, ఒక సంవత్సరము, అధికబలము, ఆక్రమణము, శౌర్యము, చరణము.
విక్రయము
సం. నా. వా. అ. పుం. తత్స. విక్రయణనం విక్రయః. అమ్ముట విపణము, అమ్మకము.
విక్రయికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విక్రయేణ జీవతీతి విక్రయికః. అమ్మకము చేత బ్రతుకు వాడు, అమ్మెడువాడు.
విక్రాంతుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. విక్రామతి స్మ విక్రాన్తః. విక్రమించువాడు, విక్రమించినవాడు, శూరుడు, వీరుడు.
విక్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ద్వేసమే వికృతి విక్రియే . వికారము.
విక్రేత
సం. నా. వా. ఋ. పుం. తత్స. విక్రీణా తీతి విక్రేతా. అమ్మువాడు, విక్రయించువాడు.
విక్రేయము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విక్రేతుం యోగ్యం విక్రేయం. అమ్మతగినది, విక్రయింపతగినది.
విక్లబుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విక్లబతే శక్తోన భవతీతి విక్లబః. భయశోకాదుల చేత చేతులు, కాళ్లు విల విల పోవువాడు, శక్తుడుగానివాడు, కలతపడినవాడు.
విక్షావము
సం. నా. వా. అ. పుం. తత్స. విరుద్ధం క్షవో విక్షావః. విరుద్ధమైన శబ్దము, దగ్గు, తుమ్ము.
విగతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. బొత్తిగా పోయినది, వెలుగులేనిది, తటస్థుడు, పోయినది.
విగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణాత్మనా గృహ్యత ఇతి విగ్రహః. విశేషముగా ఆత్మచేత గ్రహింపబడినది. విరుద్ధం గృహ్ణన్త్యత్ర విగ్రహః. దీనియందు విరుద్ధముగా శత్రువులను పుట్టుదురు. శరీరము, విభాగము, విస్తారము, యుద్ధము, షడ్గుణములలో ఒకటి. వివిధం సుఖదుఃఖాదికం గృహ్ణాతీతి విగ్రహః. శరీరము, విభాగము, విస్తరము, భ్రాంతి.
విగ్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విఖ్యుడు.
విఘసము
సం. నా. వా. అ. పుం. తత్స. విఘస్యతే విఘసః. విశేషముగా భక్షింపబడునది, దేవతాతిధుల భుక్త శేషము, భోజన విశేషము, బ్రాహ్మణోచ్ఛిష్టము.
విఘ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. హననం కార్యస్యేతి విఘ్నః. కార్యము చెడుట, అడ్డి, అంతరాయము. విహన్యతే అనేనేతి విఘ్నః. అంతరాయము, ప్రత్యూహము, ఆటంకము.
విఘ్నరాజు
సం. నా. వా. అ. పుం. తత్స. విఘ్నానాం రాజా విఘ్నారాజః. విఘ్నములకు రాజు, వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, విఘ్ననాశకుడు.
విచక్షణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ చష్టే విచక్షణః. విశేషముగా పలుకువాడు, చదువరి, సం. విణ. తత్స. నేర్పరి. విశేషేణ చష్టే ధర్మాదికముపదిశతి ఇతి విచక్షణః.
విచయనము
సం. నా. వా. అ. న. తత్స. విచితిర్విచ యనం. అన్వేషణ, వెదుకుట.
విచారణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విచార్యతే అనయేతి విచారణా. దీనిచేత సందేహరహితులౌదురు, ప్రమాణము చేత విషయమును పరిశీలించుట, చర్చ.
విచారితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విద్యతే విచార్యతే విచారితః. విచారింపబడినది.
విచికిత్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విచికిత్సతీతి విచికిత్సా. సందేహనిశ్చయములు రెంటియందును నివసించునది, సంశయము, సందియము.
విచ్ఛందకము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశిష్టశ్ఛందోత్రచ్ఛందః . ఉత్తమమైన ఛందముకలది.
విచ్ఛరిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విచర్చయత్యంగ స్రావేణ లింపతి విచ్ఛరికా. అంగమును స్రవించుట చేత పూయునది, గజ్జి, పామ, చర్మరోగము.
విచ్ఛాయము
సం. నా. వా. అ. పుం. తత్స. వీనాం పక్షిణా ఛాయా విచ్ఛాయం. రత్నదోష విశేషము, చాయపోయినది.
విజనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విగతో జనోస్మాదితి విజనః. జనులులేనిది, ఏకాంతము, నిర్జనము, జనాలు లేనటువంటి అవస్థ.
విజయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశేషేణ జయః విజయః. గెలుచుట, జయతిథి, పార్వతి, పార్వతి యొక్క చెలికత్తె, ఒక సంవత్సరము, దినము యొక్క ఆరవభాగము, కత్తి, జయము.
విజిలము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విజతే సద్రవత్వేన చలతి విజిలం. ద్రవముగలదౌట చేత కదలునది, మీగడ కట్టినది, పిచ్చిలము.
విజ్ఞాతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విశేషేణ జ్ఞాయత ఇతి విజ్ఞాతః. విశేషముగా ఎఱుగబడువాడు, ప్రసిద్ధుడు, వివేకి.
విజ్ఞానము
సం. నా. వా. అ. న. తత్స. విరూపం జ్ఞానం విజ్ఞానం. జ్ఞాన అవబోధన, శాస్త్రాదులయందలి జ్ఞానము, విశేషజ్ఞానము, కార్యము.
విటంకము
సం. నా. వా. అ. పుం. తత్స. వీన్ పక్షిణః టంకయతి బధ్నాతీతి విటంకం. పక్షులను బంధించునది, కొణిగయందలి గువ్వ గూడు. విశేషేణ టంక్యతే సౌధాదిషు విటంకః.
విటపము
సం. నా. వా. అ. పుం. తత్స. విటాక్ పాతీతి విటపః. విటులను పాలించునది. వటత వేష్టత ఇతి విటపః. చుట్టుకొనియుండునది, చిగురించినకొమ్మ, కొమ్మ, చిగురు, బోదెలేని చెట్టు, విటరాయుడు. వేటతి శబ్దాయతే ఇతి విటపః. వృక్షము, తరువు, ద్రుమము, పాదపము, పల్లవము.
విటపి
సం. నా. వా. న్. పుం. తత్స. విటపాః అస్యసంతీతి విటపీ. కొమ్మలుకలది, చెట్టు, మఱ్ఱిచెట్టు. విటపః శాఖాదిః అస్తి అస్య ఇతి విటపీ. వటవృక్షము.
విట్ఖదిరము
సం. నా. వా. అ. పుం. తత్స. విడ్గంధీ ఖదిరో విట్ఖదిరః. విష్ఠవంటి కంపుకలది, తుమ్మ, వెలితుమ్మ, నల్లవెలగ.
విట్చరము
సం. నా. వా. అ. పుం. తత్స. విషం విష్ఠాం చరతీతి విట్చరః. ఊరపంది.
విడంగము
సం. నా. వా. అ. పుం. తత్స. విడతి రోగం విడంగః. రోగమును చెఱుచునది, వాయువిళంగము, వంట ఉప్పు, నేర్పరి.
వితండ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్వపక్షపాతముగా వాదించెడువాదము, తలుపునకు వేసెడుతాళము.
వితంసము
సం. నా. వా. అ. పుం. తత్స. వితంస్యత ఇతి వితంసః. చక్కచేయబడునది, మృగములను, పక్షులను పట్టెడు ఉరిత్రాడు, వల, గొలుసు, పంజరము.
వితరణము
సం. నా. వా. అ. న. తత్స. వితరంత్యనేన వితరణం. దీనిచేత నరకమును తరింతురు, విడుపు, దానము, ఈవి, స్పర్శనము.
వితర్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శ్రమం వితర్ధయతీతి వితర్ధిః. బడలికను, అరుగు, చెఱచునది.
వితస్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వితస్యతి హస్తాపేక్షయా ఉపక్షయ తేలితస్తిః. హస్తమును గూర్చి తక్కువైనది, జాన, పన్నెండు అంగుళముల ప్రదేశము.
వితానము
సం. నా. వా. అ. న. తత్స. ఊర్ధ్వదేశే వితన్యతే వితానం. మీది ప్రదేశమందు విస్తరింపబడునది. వితన్యత ఇతి వితానం. విస్తరింపబడునది, వృత్తవిశేషము, మేలుకట్టు, యజ్ఞము, విరివి, సమూహము, అవసరము, మందము, శూన్యము, ఋతువు, ధనుస్సు వంచుట, ఆవలించుట, వైశాల్యము, యాగము, క్షణము.
వితున్నకము
సం. నా. వా. అ. న. తత్స. వితుద్యతే పిత్తశ్లేష్మాదికమనేనేతి వితున్నకః. దీనిచేత పిత్తశ్లేష్మాదులు పీడిపబడును. విశేషేణ పిత్తాది రోగాన్ తుదతీతి వితున్నకం. పిత్తాది రోగములను విశేషముగా పోగొట్టునది. విశేషేణ తుదతి రోగానితి వితున్నకం. విశేషముగా రోగములను చఱుచునది. కొతిమిరి, మయిలుతుత్తుము, నేలఉసిరిక.
వితున్నము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ తుధ్యతే ఛిద్యతే వితున్నం. విశేషముగా కోయబడునది, నీరు చెంచులి, పాచి.
విత్తము
సం. నా. వా. అ. న. తత్స. విద్యతే లభ్యత ఇతి విత్తం. పొందబడినది. విద్యతే జ్ఞాయత ఇతి విత్తః. ఎఱుగబడువాడు. సం. విణ. తత్స. విద్యతే విచార్యతే స్మ విత్తః. విచారింపబడినది, ధనము, తెలియబడినది, పొందబడినది, ప్రసిద్ధినొందినది, విచారింపబడినది.
విదరము
సం. నా. వా. అ. న. తత్స. విదారణం విదరః. వ్రక్కలించుట, చీల్చుట, వ్రచ్చుట, చీల్లబడిన కర్ర, చిత్రింపబడునది.
విదళము
సం. నా. వా. అ. న. తత్స. కందులు మొదలగు వాని పప్పు.
విదారకము
సం. నా. వా. అ. పుం. తత్స. విదార్యం తే విదారకః. త్రవ్వబడునవి, చెలమ, పిల్లనూయి, చీల్చునది.
విదారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విదార్యాః మూలం ఫలం కుసుమం వా విదారీ. విదారయతి భూమిం విదారీ. భూమిని వ్రక్కలించునది. విదార్యతే పచ్యతే విదారీ. పక్వము చేయబడునది, తెల్లనేలగుమ్మడి, ముయ్యాకుపొన్న, వ్యాధివిశేషము.
విదారిగంధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విదార్యా ఇవ గంధోస్యా ఇతి విదారిగంధా. నేలగుమ్మడి వాసన కల ముయ్యాకు పొన్న (వృక్షవిశేషము).
విదిక్కు
సం. వి. శ్. స్త్రీ. తత్స. విశిష్టాదిక్ విదిక్. విశిష్టమైన దిక్కు, రెండు దిక్కులనడుమ, మూల. దిగ్భ్యాం విగతా స్త్రీ విదిక్.
విదితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విద్యతే స్మ విదితం. అంగీకరింపబడినది, తెలియబడినది.
విదురుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వేత్తి తాచ్ఛీల్యేనేతి విదురః. ఎఱుంగ స్వభావము కలవాడు, దృతరాష్ట్రుని తమ్ముడు, తెలియునట్టివాడు, తెలిసినవాడు.
విదులము
సం. నా. వా. అ. పుం. తత్స. విదుల్యతే అంభసా విదులః. జలము చేత త్రవ్య బడినది, ప్రబ్బ, నీరుప్రబ్బ. విశేషేణ దోలయతీతి విదులః.
విద్యుత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. విశేషేణ ద్యోతత ఇతి విద్యుత్. మిక్కిలి ప్రకాశించునది, మెరుపు, సంధ్య, మెరుగులేనిది. విశేషేణ ద్యోతతే ఇతి తచ్ఛీలా వా విద్యుత్. స్థిరము కానిది, ఎర్రపాషాణము.
విద్రధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. విద్రాతి కుత్సాం గచ్ఛతి పుమానిది విద్రధిః. దీనిచేత పురుషుడు కుత్సితత్వమును పొందును, కడుపులోని శరీరము లోపల ఏర్పడు ఒక రోగము, బల్ల.
విద్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రద్రవణం విద్రవః. తొలగిపోవుట, యుద్ధమువలన పాఱిపోవుట, బుద్ధి, నింద, కాఱుట, పలాయనము.
విద్రుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విద్రవతీతి విద్రుతం. కరగినది, కరగబడినది.
విద్రుమము
సం. నా. వా. అ. పుం. తత్స. విశిష్టో ద్రుమో విద్రుమః. విశేషమైనచెట్టు, పగడము, పగడపుచెట్టు, చిగురు.
విద్రుమలత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విద్రుమవద్రక్తత్వాద్విద్రుమలతా. పగడపు తీగ వలె ఎఱ్ఱనైఉండునది, గుర్వగుత్తిక.
విద్వాంసుడు
సం. నా. వా. స్. పుం. తత్స. వేత్తి సర్వం విద్వాన్. సర్వము నెరిగిన వాడు, చదువరి, సం. విణ. తత్స. వేత్తీతి విద్వాన్. ఎఱిగినవాడు (ఎఱుకగలవాడు), పండితుడు, ఆత్మజ్ఞాని, విద్వాంసుడు.
విద్వేషణము
సం. నా. వా. అ. న. తత్స. విశేషో ద్వేషః విద్వేషః. అధికమైన ద్వేషము, విరోదము, షడ్విద్యలలో ఒకటి, శత్రుత్వము.
విధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విధీయతే కర్మ అనయేతి విధా. దీని చేత విధింపబడును. విశేషేణ ధానంపుష్టిరితి విధా. విశేషముగా పుష్టియైనది. విధానర్ధిప్రకారేఘ గజాన్నేవేతనే విధా. సమృద్ధి, ప్రకారము, విధి, వేతనము, గజకబళము, (విధాశబ్దము ప్రకారార్ధమునుందు పుంలింగముగాను నిఘంటువుల యందు చెప్పబడియున్నది), ఉచ్చారణము, ఆజ్ఞా, తిండి, ఏనుగు, జీతం, అభివృద్ధి, పద్ధతి.
విధవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విగతో ధవః పతి ర్యస్యాస్సా విధవా. చనిపోయిన పెనిమిటి కలది, పెనిమిటిలేనిది, ముండమోపి. విగతో విశేషేణ గతో ధవో భర్తా యస్యాః సా విధవా. వితంతువు, విగత, భర్తక.
విధాతృడు
సం. నా. వా. ఋ. పుం. తత్స. విదధాతి సర్వం విధాతా. సర్వము చేయువాడు, బ్రహ్మ, మన్మధుడు.
విధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. విదధాతీతి విధిః. సర్వము చేయువాడు. విధీయ తే అనేనేతి విధిః. దీనిచేత విధింపబడును, బ్రహ్మ, చేయుట, కాలము, భాగ్యము, అలంకారవిశేషము, ఏర్పాటు. (ఇది త్రివిధము, అపూర్వవిధి, నియమవిధి, పరిసంఖ్యావిధి). విదధాతి విశ్వం ఇతి విధిః. నియోగము, విధానము, సమయము, ప్రకారము, కర్మము. విధీయతే అనేన విధిః. విదధాతీతి చ విధిః. చేయుటయును, చేయువాడును విధి.
విధుంతుదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విధుం తుదతీతి విధుంతుదః. విధువనగా చంద్రుడు వానిని వ్యథ పెట్టువాడు, రాహుగ్రహము. విధుం తుదతి పీడయతీతి విధుంతుదః. అంధకారము.
విధుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విధూయతే స్మ విధుతం. సముజ్జితం, విడువబడినది, కదలింపబడినది.
విధురము
సం. నా. వా. అ. న. తత్స. విగతాధూః కార్యభారోత్రేతి విధురం. కార్యభారములేనిది, ఎడబాటు, వైకల్యము, రాక్షసుడు, భార్య మరణించినవాడు, క్లిష్టుడు, వియుక్తుడు. సం. నా. వా. విణ. తత్స. ఎడబాటు పొందినది, వైకల్యము పొందినది.
విధువనము
సం. నా. వా. అ. న. తత్స. విధూతిః విధువనం. విదిలించుట, కదలించుట, విడుచుట.
విధేయుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విధాతుం నియోక్తుం యోగ్యో విధేయః. నియోగింపతగినవాడు, వినయము కలవాడు, వశ్యుడు.
విధ్యాధరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చదువు కోరువాడు, చదువువాడు. విద్యాం మంత్రాదికం ధరతి ఇతి విద్యాధరః. దేవత, భేదము.
వినయము
సం. నా. వా. అ. పుం. తత్స. వినమ్రత, గురుశిక్ష. ఇదం కార్య మిద మకార్యమితి గుహ్వాద్యుపదేశో వినయః. వినయమును అంగీకరించువాడు.
వినాయకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వాన్ వినయతి హిత మనుశాస్తీతి వినాయకః. ప్రాణులకు హితమును బోధించువాడు. వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః. దుష్టులను, విఘ్నములను శిక్షించువాడు. వినయతి శిక్షయతీతి వినాయకః. శిక్షించువాడు, విఘ్నేశ్వరుడు, బుద్ధదేవుడు, గరుత్మంతుడు, గురువు. విశిష్టో నాయకః వినాయకః. హేరంభుడు, లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్నరాజు, విఘ్నేశుడు, గణేశుడు, గణపతి.
వినాశము
సం. నా. వా. అ. పుం. తత్స. విశనం వినాశః. కానరాకుండుట, మిక్కిలి నాశము.
వినీతము
సం. నా. వా. అ. పుం. తత్స. వినీయ న్త ఇతి వినీతాః. లెస్సగా శిక్షింపబడునవి, చక్కగా మోసెడి గుఱ్ఱము, లొంగిన గుఱ్ఱము, ప్రాప్తము, స్థిరము, జితేంద్రియుడు, చెప్పునట్లు వినువాడు.
విన్నము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విద్యతే విచార్యతే స్మ విన్నః. విచారింపబడినది, పొందబడినది, తెలియబడినది, పరిశీలింపబడినది.
విపంచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విపంచయతి స్వరానితి విపంచీ. స్వరములను విస్తరింపచేయునది, వీణ, క్రీడ.
విపణము
సం. నా. వా. అ. పుం. తత్స. విపణనం విపణః. విక్రయము, అమ్మకము.
విపణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విపణిః విపణా. విక్రయింప తెచ్చిన వస్తువులుండెడు వీధి. విపణ్యతే త్రేతి విపణిః. దీనియందు వ్యవహరింపబడును, అంగడి, అంగడివీధి, అంగడియందుండుసరుకు, వర్తకుడు.
విపత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. విపద్యతే విపత్తిః. విపరీతముగా పొందబడునది, విపత్తు, యాతన, ఆపద.
విపథము
సం. నా. వా. అ. పుం. తత్స. విరుద్ధః పంథాః విపథః. విరుద్ధమైనమార్గము, చెడుత్రోవ, దురద్వము, చెడ్డదారి.
విపర్యయము
సం. నా. వా. అ. పుం. తత్స. విపరీతమయనం విపర్యయః. విపరీతముగా పోవుట, వ్యత్యాసము, ఎదురు.
విపర్యాసము
సం. నా. వా. అ. పుం. తత్స. విపరీత మసనం విపర్యాసః. విపరీతముగాద్రొబ్బుట, విపర్యయము.
విపశ్చితుడు
సం. నా. వా. త్. పుం. తత్స. విశేషేణ పశ్యన్ చేత తీతి విపశ్చిత్. విశేషముగా చూచుచు నెఱుంగువాడు, చదువరి, పండితుడు.
విపాదిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విపద్యంతే అనయేతి విపాదికా. దీనిచేత ఆపదను పొందుదురు, పాదస్ఫోటము, పాదము మీది కురుపు.
విపాశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పుత్రశోకాత్పాశైర్బద్ధ్వా ప్రవిష్టం వసిష్ఠం పాశాద్విమోచితవతీ విపాశా. పుత్రశోకము వలన పాశబద్ధుడైతనయందు ప్రవేంశించిన వశిష్ఠుని పాశములవలన విడిపించినది, నదీవిశేషము, విచిడిపోయిన పాశములుకలది.
విపినము
సం. నా. వా. అ. న. తత్స. వేపంతే భయాదత్రేతి విపినం. భయముచేత దీనియందు వడుకుదురు, అడవి, వనము, అరణ్యము. వేపంతే జనా యత్రేతి విపినం. కాననము.
విపుల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశేషేణపోలతి మహద్భవతీతి విపులం. వస్తువులను కప్పిఉండునది, నేల, విరివియైనది, విశాలమైనది.
విప్రకారము
సం. నా. వా. అ. పుం. తత్స. విక్రమణం విక్రమః. విక్రమించుట, తిరస్కారము, అపకారము, దంతనిష్పీడనము వలన కలిగిన ముఖ వికారములోనగునది, ఉపకారము.
విప్రకృతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. నితరాం దుఃఖితః క్రియతే స్మ విప్రకృతః. మిక్కిలి పీడింపబడినవాడు, తిరస్కరింపబడినవాడు, అపకారము చేయబడినవాడు.
విప్రకృష్టకము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విప్రకృష్యతే సమీపా దితి విప్రకృష్టకం. సమీపమునుండి లాగబడినది, దవ్వు, దూరము, దూరమున ఉన్నది.
విప్రతీసారము
సం. నా. వా. అ. న. తత్స. విరుద్ధం ప్రతిసరణం విప్రతీసారః. విరుద్ధమును కూర్చిప్రవర్తించుట, పశ్చాత్తాపము, కోపము, అకృత్యము, ఎడబాటు.
విప్రయోగము
సం. నా. వా. అ. పుం. తత్స. విప్రయు క్తిర్విప్రయోగః. విరుద్ధార్ధమును చెప్పును, స్త్రీ పురుషులఎడబాటు, విప్రలంభము.
విప్రలంభము
సం. నా. వా. అ. పుం. తత్స. విప్రలంభనం విప్రలంభః. విపరీతముగా అర్ధమును పొందుట. విప్రకర్షేణ లంభనం విప్రలంభః. విషప్రయోగము, విసంవాదము, మిక్కిలివంచనము.
విప్రలబ్దము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విప్రలభ్యతే స్మ విప్రలబ్ధః. మోసపుచ్చబడినవాడు, సంకేతస్థలమునందు ప్రియునికానక మోసపోయి వ్యాకులత పొందునట్టినాయిక, వంచించబడినది.
విప్రలాపము
సం. నా. వా. అ. పుం. తత్స. విరుద్ధ ప్రలాపః విప్రలాపః. విరుద్ధమైన ప్రలాపము, పరస్పరవిరుద్ధమైనమాట, అపార్ధమైనమాట, అధి క్షేపము.
విప్రశ్నిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రశ్నోస్యా ఇతి విప్రశ్నికా. శుభాశుభ విషయమై విశేషముగా జనులచేత చేయబడిన ప్రశ్నకలది, సోదెచెప్పునది, వేల్పుసాని.
విప్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. బ్రాహ్మణుడు, పాఱుడు.
విప్రుషము
సం. నా. వా. ష్. స్త్రీ. తత్స. విగతః ప్రుట్ దాహః ఆభ్య ఇతి విప్రుషః. దీనివలన దాహము నివర్తించును, నీటిబొట్టు, నీటి బిందువు.
విప్లవము
సం. నా. వా. అ. పుం. తత్స. విప్లావ్యతే విద్రావ్యతే జనోనేనేతి విప్లవః. దీనిచేత జనుడుపోమొత్తబడును, కొల్లమొదలగుదేశోపద్రవము, ముష్టిప్రహరాది, అపశకునము.
విబుధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విబుధ్యంత ఇతి విబుధాః. విశేషముగా ఎఱిగినవారు, చదువరి, వేలుపు, చంద్రుడు. విశేషేణ బుధ్యతే ఇతి విబుధః.
విబ్రాట్టు
సం. విణ. (జ్). తత్స. తాచ్ఛీల్యేన విభ్రాజతే విభ్రాట్. ప్రకాశించు స్వభావముకలవాడు, భూషణాదులచేత ప్రకాశించువాడు.
విభవ
సం. నా. వా. అ. పుం. తత్స. విభవతి కార్యసిద్ధౌ సమర్థో భవతీతి విభవః. కార్యసిద్ధియందు సమర్ధమైనది, ఒకసంవత్సరము, ధనము, సంపద.
విభాకరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ భాం కరోతీతి విభాకరః. మిక్కిలికాంతిని కలుగచేయువాడు, సూర్యుడు, అగ్ని.
విభావరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ. సూర్యకాంతిని కప్పునది, రేయి, పసుపు, కుంటినకత్తె. విభాది నక్షత్రాదిభిః ఇతి విభావరీ, రాత్రి, విచాతి చంద్రాది భిరితి భావరీ. ప్రకాశించునది.
విభావసుడు
సం. నా. వా. ఉ. పుం. తత్స. విభా ప్రభా వసు ధనం యస్య సః విభావసుః. కాంతిధనముగా కలవాడు. విభాప్రభైవ వసుద్రవ్య మస్య విభావసుః. విభైవ వసుధన మస్యేతి విభావసుః. ప్రభయే ధనముగా కలవాడు, సూర్యుడు, అగ్ని, చంద్రుడు.
విభీతకము
సం. నా. వా. అ. పుం. తత్స. భిభ్యత్యస్మాద్విభీతకః. విశేషముగా దీనివల్ల భయపడుదురు, తాండ్ర, తాడి.
విభూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. విశేషేణ భవతీతి విభూతిః. విశేషముగా కలుగునట్టినది, తిర్యకుండ్రధారులు ధరించెడుభస్మము, ఒక ఐశ్వర్యము.
విభూషణము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ భూష్యతే అనేనేతి విభూషణం. దీనిచేత అలంకరింపబడును, తొడవు, ఆభరణము.
విభ్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ భ్రమః విభ్రమః. విశేషమైన చలనము, భ్రాంతి, వస్త్రభూషణాది ప్రయుక్తమైన కాంతివిశేషము, వచనభూషణ విపర్యస్వరూపమైన స్త్రీలయొక్క శృంగార చేష్టా విశేషము, సందేహము, సంశయము, భ్రాంతి, శంక, సంభ్రమము, విలాసము.
విమనుడు
సం. విణ. (స్). తత్స. విరుద్ధం మనో యస్యేతి విమనాః. విరుద్ధమైన మనస్సుకలవాడు, అంతర్మధనుడు, దుఃఖితుడు, సంభ్రాతుడు.
విమర్ధనము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ మర్ధనం విమర్ధనం. విశేషముగా మర్ధించుట, చందనములోనగువాని పూయుట, కస్తూరిలోనగువానినూఱుట.
విమల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విగతం మలమనయేతి విమలా. దీనిచేత కల్మషము పోవును, సంబరేను, నిర్మలమైనది, ఒబ్బిదమైనది, ఒక రత్నము, పరిశుద్దము.
విమానము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ మాంతి వర్తంతే దేవా అస్మిన్నితి విమానం. అంతరిక్షమందు దేవతలు ఎక్కిసంచరించెడురథము, చక్రవర్తి యొక్క సౌధము, గుఱ్ఱము, నీళ్లమీద జనులు ఎక్కి పోయెడుకలము. విగతం మానం ఉపమా యస్య విమానం, దీనియందు దేవతలు విశేషముగా తిరుగుదురు.
వియద్గంగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వియతిగంగా వియద్గంగా. ఆకాశమందుండెడిగంగ, ఆకాశగంగ, మిన్నేఱు.
వియమము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ యమనం విమయః హింసాదుల వలన నుడుగుట, బాధ.
వియాతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విశేషేణ అభిముఖ్యం యాతీతి వియాతః. విశేషముగా ఎదుటకు పోవువాడు, దిట్టతనము కలవాడు.
వియామము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ యమనం వియామో. విశేషముగామానుట, వియమము యొక్క రూపాంతరము, నిగ్రహము.
విరజస్తమసుడు
సం. నా. వా. స్. పుం. తత్స. రజస్తమోగుణములు లేనివాడు, సాత్త్వికుడు.
విరతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ఉపరమః విరమణం విరతిః. మానుట, విశ్రాంతి, విరామము, ఉడుకువ, ఆపుదల.
విరళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశేషేణరాత్యం తరమితి విరళం. విశేషముగా అవకాశమునుఅంగీకరించునది, నల్లయుప్పి.
విరాట్టు
సం. నా. వా. జ్. పుం. తత్స. విరాజతే విరాట్. విశేషముగా ప్రకాశించువాడు, ఆదిదేవుడు, క్షత్రియుడు, గరుత్మంతుడు.
విరావము
సం. నా. వా. అ. పుం. తత్స. రౌతీత్యారవః ఆరావః సందావః విరావః. మ్రోత, ధ్వని, మృగధ్వని.
విరించి
సం. నా. వా. ఇ. పుం. తత్స. విరచయతి భూతాని విరించిః. భూతములను సృజించువాడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు.
విరూపాక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విరూపాణి రవిచంద్రాగ్ని రూపత్వాత్త్రివిధాని అక్షీణియస్యసః విరూపాక్షః. సూర్యచంద్రాగ్ని రూపములగుటచేత మూడు విధములైలన కన్నులు కలవాడు, శివుడు, బేసికంటి. విరూపే అక్షిణీ యస్య సః విరూపాక్షః. శంకరుడు, మహాదేవుడు, ఉమాపతి.
విరోచనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణరోచతే ప్రకాశత ఇతి విరోచనః. విశేషముగా ప్రకాశించువాడు. విరోచత ఇతి విరోచనః. ప్రకాశించువాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ప్రహ్లదునికొడుకు, ఆదిత్యుడు, భానుడు, రవి, మార్తండుడు, దివాకరుడు, దినకరుడు, ప్రభాకరుడు, విభాకరుడు.
విరోధనము
సం. నా. వా. అ. న. తత్స. పర్యవ పూర్వస్తి ష్ఠతిర్విరోధే విరోధనం. విరోధించుట, పగకొనుట, శత్రువు.
విలంబితము
సం. నా. వా. అ. న. తత్స. విలంబన్తేకరపదాదయోత్రీతి విలంబితః. వేరువేరుగా గతివిశేషములు కలుగుటవలన దీనియందు కరపదాదులు నిలకడగలుగును, నృత్తగీత వాద్యములందు చౌకకాలము, జాగుకలది, వ్రేలునది.
విలంభము
సం. నా. వా. అ. పుం. తత్స. విలమ్భనం విలంభః. ఇచ్చుట, ఈవి. త్యాగము.
విలక్షణము
సం. నా. వా. అ. న. తత్స. ఇతి విగతం లక్షం ప్రకృతార్ధ జ్ఞాన మస్యేతి విలక్షణం. ఆశ్చర్యము చేత ప్రకృతార్థ జ్ఞానము లేని వాడు, కారణము లేని ఉనికి, వేరైనది, విశేషణమైన లక్షణము కలది, ఆశ్చర్యపడిన వాడు.
విలాపము
సం. నా. వా. అ. పుం. తత్స. విలపనం విలాపః. విలాపము, దుఃఖముతోడిమాట, వాచారపము, పరిదేవనము.
విలాసము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ లసనం విలాసః. ప్రియునియొక్క దర్శనము చేతననై కటాక్ష భ్రూవికారాదులు విలాసము, క్రీడ, ప్రియసందర్శనాదుల చేతనగు యానావలోక నాది క్రియావిశేషరూపమైన స్త్రీల యొక్క శృంగారచేష్టా విశేషము, ఒక శృంగార చేష్ట.
విలీనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విలీయత ఇతి విలీనం. వికారమును పొందినది, కరగినది, విద్రుతము, అదృశ్యము.
విలేపనము
సం. నా. వా. అ. న. తత్స. విలిప్యతే గాత్రమనేనేతి విలేపనం. దీనిచేదేహము పూయబడును. విలేపోవిలేపనం. పూయుట, పూతపూసుకొనెడు చందనాదులపూత. విలిప్యంతే అంగాని అనేన ఇతి విలేపనం.
విలేపి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విలింప తిదర్వీమితి విలేపి. గరిటితో కూడియుండునది, కాపుడుగంజి, వెలవ, చిక్కని గంజి.
వివధము
సం. నా. వా. అ. పుం. తత్స. వివిధోవధో వహనదుఃఖమత్రేతి వివధః. దీనియందు వహనదుఃఖముకలదు, కావడి, త్రోవ, బరువు. వివిధో వధో హననం గమనం వా యత్ర వివధః.
వివరము
సం. నా. వా. అ. న. తత్స. విగతః వరః వారణమస్య వివరం. అడ్డము లేనిది, రంధ్రము, దూషణము.
వివర్ణుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విరుద్ధోవర్ణో జాతిర్యశోవాప్యవివర్ణః. విరుద్ధమైన జాతిగాని, కీర్తిగాని కలవాడు, వెల్లబాఱినవాడు,అధముడు, ముఖ్యుడు. వికృతో వర్ణో యస్య సః వివర్ణః. మూర్ఖుడు, మలినుడు, నిమ్నజాతి, మారినది.
వివశుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విరుద్ధం వష్టీతి వివశః. విరుద్ధమైన దానికోరువాడు, మరణకాలము సమీపించుట చేత కలతనొందిన బుద్దికలవాడు, దురదృష్టవంతుడు, పరతంతుడు.
వివాదము
సం. నా. వా. అ. పుం. తత్స. వివిధోవాదోవివాదః. వివిధమైన వాదము, తగవు, ఇది పదునెనిమిది (18) విధములుకలది, అప్పుపుచ్చుకొనుట, సొమ్ముదాచుట, ఒకరిసొమ్మును తాను అమ్ముట, ఉమ్మడిబేరము, ఇచ్చినదానినిమరలించుట, జీతమియని, ఒప్పుకొని మరలబడుట, క్రయవిక్రయములు చేసి తిరగబడుట, స్వామి భృత్యన్యాయము, సీమానిర్ణయము, దండవాక్పారుష్యములు, దొంగతనము, బందిపొటులోనగుసాహసము, స్త్రీసంగ్రహణము, భార్యాభర్త్రృక్రమము, దాయభాగము, ద్యూతము, ప్రాణి ద్యూతము).
వివాహము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ వహనం వివాహః. పరిణయము, పెండ్లి (అష్టవిధ వివాహములు, బ్రహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము), పాణిగ్రహము.
వివిక్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వివిచ్యతే పృథనానీయతే వివిక్తః. వేఱుపఱచబడునది. వివిచ్యతే ఇతి వివిక్తః. లెస్సగా ఏర్పఱచబడునది, ఏకాంతము, విభిన్నము, పవిత్రము, వివేకము కలది, నిర్జవము, పరిశుద్ధము.
వివిధము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విచిత్రా విధాప్రకారోన్యేతి వివిధః. విచిత్రమైన ప్రకారముకలది, అనేక విధములుకలది.
వివేకము
సం. నా. వా. అ. పుం. తత్స. వివేచనం వివేకః. ప్రకృతి పురుషుల నేర్చఱచుట, దేహ ఆత్మాది విభేదజ్ఞానము, విభేదము, విచారము.
విశదము
సం. నా. వా. అ. పుం. తత్స. చిత్తే విశతీతి విశదః. మనస్సునందు ప్రవేశించునది, తెల్లనిది, స్పష్టమైనది.
విశల్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విగతం శల్యమస్యా ఇతి విశల్య. ముండ్లులేనిది. విశల్యం కరోతీతి విశల్యా. నొప్పిని తొలగించునది, తఱిగొఱ్ఱ, తిప్పతీగ, తెల్లతెగడ, దంతిచెట్టు, శల్యము లేనిది.
విశసనము
సం. నా. వా. అ. న. తత్స. విశస్యతే స్మ విశసనం. చంపుట, కత్తి, వధ.
విశాఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వినా పక్షిణా మయూరేణ శాఖతి వ్యాప్నోతీతి విశాఖః. పక్షియైననెమలిచేత తిరుగువాడు, ఒక నక్షత్రము, కాకర, విలుకాడు రెండు కాళ్లనడుమచేసెడుమగ నిలుచుట, నూలువడికెడు కదురు, శాఖలులేనిది, సేవకుడు, కుమారస్వామి.
విశాయము
సం. నా. వా. అ. పుం. తత్స. విశయనం విశాయః. నిద్రించుట, కావలివారు పర్యాయక్రమమునపరుండుట, పర్యాయము.
విశారదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విశిష్టాశారదా అస్యేతి విశారదః. అధికమైన సరస్వతి కలవాడు, విద్వాంసుడు, నేర్పరి, ప్రగల్భము, శ్రేష్టము, ప్రసిద్ధము, పండితుడు, సాహసికుడు.
విశాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశాలఫలత్వాద్విశాలా. పెద్దపాపర, ఉజ్జయిని, విరివియైనది, ఒక వంగ, పెద్దబీర, శాలువ, వెడల్పైనది, పెద్దది.
విశాలత్వక్కు
సం. నా. వా. చ్. పుం. తత్స. విశాలాః త్వచో యస్యసః విశాలత్వచ్. వెడల్పైనపట్టకలది, ఏడాకులరటి, చెట్టు.
విశిఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశక్ ఖనతీతి వా విశిఖః. ప్రవేశించుచు వ్రక్కలించునది, రాజమార్గము, పాఱ, బాణము, చిల్లకోల, శిఖలేనిది. వి శేతే ఇతి విశిఖా.
విశేషకము
సం. నా. వా. అ. పుం. తత్స. విశినష్టి శోభాదినా విశేషకం. ఒప్పిదముతో కూడియుండునది, నొసటిబొట్టు, విశేషింపచేయునది. విశేష ఏవ విశేషకః. పుండ్రము, చుక్కబొట్టు.
విశ్రాణనము
సం. నా. వా. అ. న. తత్స. విశ్రాయతే విశ్రాణనం. ఇచ్చుట, త్యాగము, దానము.
విశ్రావము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ శ్రవణం విశ్రావః. మిక్కిలి వినుట, మిక్కిలి ప్రసిద్ధి, ప్రఖ్యాతి.
విశ్రుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. మిక్కిలి ప్రసిద్ధికెక్కినది, ప్రవహించునది.
విశ్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశ్వేశ్రాద్ధాగ్రేవిశంతీతి విశ్వే. శ్రాద్ధాగ్రమందు ప్రవేశించువారు. విశ్వదోషజిత్త్వాత్ విశ్వం. సమస్తదోషమును చెఱచునది. విశతి సర్వత్ర విశ్వం. అంతట ప్రవేశించునది, భూమి, అతివస, సొంటి, లోకము, సమస్తము, సకలము, సర్వము, సమగ్రము, నిఖిలము, అఖిలము, విశ్వదేవులు, ప్రపంచము.
విశ్వంభరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశ్వం బిభర్తీతి విశ్వంభరః. విశ్వమును భరించువాడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్ని, హరి, భూమి.
విశ్వకద్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. విశ్వాన్ మృగాన్ కందయతీతి విశ్వకద్రుః. సకలమైన మృగములను మొఱపెట్టించునది, వేటకుక్క, ధ్వని, దుర్జనుడు. విశ్వకం సర్వం ద్రవతీతి విశ్వకద్రుః.
విశ్వకర్మ
సం. నా. వా. న్. పుం. తత్స. విశ్వం కర్మాన్యేతి విశ్వకర్మా. సకలమైన క్రియలుకలవాడు, దేవశిల్పి, సూర్యుడు, ఒకానొకముని. విశ్వేషు విశ్వ వా కర్మ యస్య సః విశ్వకర్మా.
విశ్వభేషజము
సం. నా. వా. అ. న. తత్స. విశ్వాఖ్య భేషజత్వాత్ విశ్వభేషజం. విశ్వమనుపేరుగల ఔషధము, సొంటి. విశ్వేషాం భోషజం విశ్వభోషజం. నగరము, విశ్వము.
విశ్వసృజుడు
సం. నా. వా. జ్. పుం. తత్స. విశ్వం సృజతీతి విశ్వసృట్. విశ్వమును సృజించువాడు, బ్రహ్మ, నలువ.
విశ్వస్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విశ్వసితి విగతశ్వసనేవ తిష్ఠతి మృత ప్రాయత్వాదితి విశ్వస్తా. మృతప్రాయమైనది కనుక, విధవ, విశ్వసింపబడినది. విఫలం శ్వసితి స్మ విశ్వస్తా.
విశ్వాసము
సం. నా. వా. అ. పుం. తత్స. విశ్వసన్త్యనేనేతి విశ్వాసః. దీనిచే ఊరడిల్లుదురు, నమ్మకము, ప్రత్యయము, ఆశ్వాసము, ఆశ్రమము.
విష
సం. నా. వా. అ. న. తత్స. దేహం వేవేష్టీతి విషం. దేహమును వ్యాపించునది. వేవేష్ఠీతి విషం. వ్యాపించునది, జలము, గరళము, ఇనుము, నీరు.
విష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శరీరం వేష్టతీతి విష్ణా. శరీరమును వ్యాపించునది, అతివస, ఇనుము, గరళము, నీరు.
విషధరము
సం. నా. వా. అ. పుం. తత్స. విషస్యధరః విషధరః. విషమును ధరించునది, పాము, మబ్బు. విషం ధరతీతి విషధరః. సర్పము.
విషయము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ బధ్నాతీతి విషయః. విశేషముగా ప్రీతిని పుట్టించునది. విషినోతి బధ్నాతీతి విషయః. బంధించునది, గ్రంథాదుల వలన తెలియబడిన అంశము, లౌకికార్ధము, ఇంద్రియార్ధము, గోచరము, దేశము, ఒకముఖ్యగ్రామముతో చేరిన ఉపగ్రామముల సమూహము, పాయకట్టు. విసీయంతే అత్రేతి విషయః. అవ్యక్తము, శుక్రము, జనపదము, దేశము, ఇంద్రియ విషయమయినది, శబ్ద స్పర్శాధికము, విసిన్వన్తి నిబధ్నంతీంద్రియాణీతి విషయః. ఇంద్రియములను బంధించునది.
విషయి
సం. నా. వా. న్. న. తత్స. విషయోస్వాస్తీతి విషయి. విషయము కలిగినది, ఇంద్రియము. సం. నా. వా. అ. పుం. తత్స. (రాజు, మన్మధుడు, విషయాసక్తుడు, ఆరోపింపబడునది), దేశీయుడు.
విషవత్తు
సం. నా. వా. త్. న. తత్స. అహోరాత్రయోర్విషసామ్యమత్ర అస్తీతి విషవత్. రాత్రి పగళ్లు ఎచ్చుతగ్గులు లేక సమానంగానున్నకాలము.
విషవము
సం. నా. వా. అ. న. తత్స. అహోరాత్రయోర్విషసామ్యమత్ర అస్తీతి విషవత్. రాత్రి పగళ్లు ఎచ్చుతగ్గులు లేక సమానంగానున్నకాలము.
విషవైద్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విషవిద్యాం వేత్తీతి విషవైద్యః. విషమును దించువిద్యను తెలిసినవాడు, గారడీడు.
విషాణము
సం. నా. వా. అ. పుం. తత్స. వేష్టేతి విషాణం. శరీరమును వ్యాపించునది, కొమ్ము, ఏనుగుకొమ్ము.
విషాణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అజ శృంగాభ ఫల యోగా అత ఏవవిషాణీ. కొమ్ములవంటి ఫలములు కలది, జుట్టువు, పిన్నపాల, ఎద్దు, ఏనుగు.
విష్కంభము
సం. నా. వా. అ. పుం. తత్స. విష్కభ్నోతి బధ్నాతీతి విష్కంభః. తలుపును అడ్డగించునది, ఒకగ్రహయోగము, గడెమ్రాను, అడ్డంకి, నాటకాంగవిశేషము, యోగులబంధవిశేషము, విరివి. విష్కభ్నాతి రుణద్ధీతి విష్కంభః. వృక్షము, విస్తారము.
విష్కిరము
సం. నా. వా. అ. పుం. తత్స. వికిరతి భక్ష్యమితి వికిరః. మేతకు యోగ్యమైన పదార్ధములను చల్లునది, పక్షి, కవుజు, కోడి, నెమలి. వికిరతీతి విష్కిరః.
విష్ట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వితిష్ఠతి నాభేరధః విష్ఠా. నాభిక్రిందనుండునది, మలము, పురీషము. వివిధ ప్రకారేణ తిష్ఠతి ఉదరే ఇతి విష్టా. ఉచ్చారము, గండపరంగి.
విష్టపము
సం. నా. వా. అ. న. తత్స. విశం త్యస్మిన్నితి విష్టపం. దీనియందు ప్రవేశింతురు, లోకము, భువనము.
విష్టరము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్తీర్యత ఇతి విష్టరః. విస్తరింపబడునది, ఆసనము, దర్భపిడికిలి, మ్రాను, వృక్షము, తరువు, నగము, ద్రుమము.
విష్టరశ్రవుడు
సం. నా. వా. న్. పుం. తత్స. విష్టరం వ్యాపనశీలం శ్రవః కీర్తిర్యస్యసః విష్టరశ్రవః. వ్యాపనశీలమైన కీర్తిగలవాడు, విష్ణువు, వెన్నుడు. విష్టరావివ దర్భముష్టీవ శ్రవసీ కర్ణౌ శ్రవః యశో వా యస్యేతి విష్టరశ్రవాః. అచ్యుతుడు.
విష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వేవేష్టితి విష్టిః. వ్యాపించునది, కూలి, కూలిలేనిపని, పని, పనిచేయువాడు, వెట్టివాడు.
విష్ణుక్రాంతము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విష్ణోరివ క్రాంతి రస్యాః విష్ణుక్రాంతా. విష్టువువంటిశక్తి కలది, ఒకమందు చెట్టు.
విష్ణుపదము
సం. నా. వా. అ. న. తత్స. విష్ణోః పదం విష్ణుపదం. విష్ణువునకు స్థానము, ఆకాశము, పాలసముద్రము, ఆవులమంద.
విష్ణుపది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విష్ణు పదోద్భవా విష్ణుపదీ. విష్ణుపాదమున పుట్టినది, గంగ, ద్వారక, రవిసంక్రమణ విశేషము. విష్ణోః పదం స్థానం యస్యాః సా విష్ణుపదీ.
విష్ణురధము
సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణోః రథః విష్ణురథః. విష్ణువునకు వాహనమైనవాడు, గరుత్మంతుడు, గరుడుడు.
విష్ణువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః. విశ్వమును వ్యాపించుఉండువాడు, వెన్నుడు, ఇతనిసారధి దారకుడు, (తేరు శతానందము, గుఱ్ఱములు సైన్య సుగ్రీవమేఘ పుష్ప వలాహకములు), ఒక ఆదిత్యుడు, నారాయణుడు, కృష్ణుడు, వైకుంఠుడు, దామోదరుడు, హృషీకేశుడు, కేశవుడు, మాధవుడు, దైత్యారి, పుండరీకాక్షుడు, గోవిందుడు, పీతాంబరుడు, అచ్యుతుడు, గరుడధ్వజుడు, విష్వక్సేనుడు, జనార్ధనుడు, ఉపేంద్రుడు, చక్రపాణి, చతుర్భుజుడు, పద్మనాభుడు, వాసుదేవుజు, త్రివిక్రముడు, దేవకీనందనుడు, శ్రీపతి, పురుషోత్తముడు, వనమాలి, విశ్వంభరుడు, పురాణపురుషుడు, గదాగ్రజుడు, జగన్నాథుడు, సనాతనుడు, వామనుడు, ముకుందుడు, విష్ణువు, త్రివిక్రముడు.
విష్పోటము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్ఫుటతి విష్పోటః. వ్రక్కలౌనది, పొక్కు, బొబ్బ, పుండు.
విష్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విషేణ వథ్యోవిష్యః. విషముచేత చంపతగినవాడు.
విష్వక్సేన ప్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విష్వక్సేన ప్రియాత్వాద్విష్వక్కేనప్రియా. విష్ణువునకు ప్రియమైనది, పాచితీగ, లక్ష్మి.
విష్వక్సేనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశ్వక్సమంతతః వ్యాప్తాసేనాయస్యసః. అంతటవ్యాపించిన సేనకలవాడు, విష్ణువు, విష్ణువుసేనాధిపతి, జనార్థనుడు, అచ్యుతుడు.
విసంవాదము
సం. నా. వా. అ. పుం. తత్స. విసం వదనం విసంవాదః. విపరీతముగా పలుకుట, ముందు ఒప్పుకొని వెనుక లేదనివాదించుట.
విసరము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్త్రీయత ఇతి విసరః. విశేషముగా పదార్ధము చేత పొందబడినది, ప్రసరణము, సముహము, శబ్దవిస్తారము.
విసర్జనము
సం. నా. వా. అ. న. తత్స. విసృజ్యతే విసర్జనం. విడుచుట, ఈవి, విడుపు, పుచ్చుట, త్యాగము.
విసర్పణము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ సర్పణం విసర్పణం. విశేషముగా పొందుట, ప్రసరణము, కండూత్యాది ప్రసరణము.
విసారము
సం. నా. వా. అ. పుం. తత్స. విచిత్రం సరతీతి విసారః. విచిత్రముగా చరించునది, చేప. సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ సరతీతి విసారః. మత్స్యము, మీనము, కొయ్య.
విసారి
సం. (న్. ఈ. న్). తత్స. విసరతి తాచ్ఛీల్యేనేతి విసారీ. స్వభావమున నెఱయునది, ప్రసరించునది.
విసృతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విస్రియతే స్మ విసృతం. వ్యాపించునది, విసృతము.
విసృత్వరుడు
సం. విణ. (అ.ఆ.అ).తత్స. విసరతి తాచ్ఛీల్యేనేతి విసృత్వరః. నెఱయు స్వభావముకలది, ప్రసరించునట్టి స్వభావము కలవాడు.
విసృమరుడు
సం. విణ. (అ.ఆ.అ).తత్స. విసరతి తాచ్ఛీల్యేనేతి విసృత్వరః. నెఱయు స్వభావముగలది, ప్రసరించునట్టి స్వభావము గలవాడు.
విస్తరము
సం. నా. వా. అ. పుం. తత్స. వాచాం విస్తరః. శబ్ద విస్తృతి, విరివి, స్నేహము, పీఠము, ప్రణయము, సమూహము, మఱపు.
విస్తారము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్తీర్యతే తరుననేనేతి విస్తారః. వృక్షము దీనిచేత విస్తారముగా కప్పబడును, విరివి, బోదెలేనిచెట్టు. విస్తృతిర్విస్తారః. విశేషముగా కప్పుకొనుట, విగ్రహము, వ్యాసము.
విస్పారము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్ఫురతి అరిహృదయమితి విస్ఫారః. శత్రుహృదయము దీనిచేత చలించును, వింటిమ్రోత, మిక్కిలి అధికమైనది.
విస్మయము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్మాపయతీతి విస్మయః. విశేషముగా నవ్వించునది, ఆశ్చర్యము, గర్వము, స్థాయిభావము, అద్భుతము, చోద్యము, చిత్రము, మూర్చ.
విస్మృతి
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విస్మర్యతే స్మ విస్మృతం. మఱవబడినది, విసృతి నొందినది.
విస్రంభము
సం. నా. వా. అ. పుం. తత్స. విస్రంభనం విస్రంభః. విశ్వసించుట, నమ్మకము, వధము, స్నేహము, ఆట్లాటజగడము, విశ్వాసము, ప్రణయము.
విస్రము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విస్రం స్యత ఇతి విస్రం. పాఱవేయబడునది, అపక్వమైన గంధముకలది, రక్తము, క్రొవ్వు.
విస్రస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విస్రంసతే అధః పతతి శరీరమనయేతి విస్రసా. శరీరము దీనిచేత దిగువబడును, ముసలితనము, జర. విస్రంసతే అనయా విస్రసా.
విస్వంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వత్. కాంతి చేత అన్నింటిని కప్పెడువాడు. వివస్తేజః తదస్యాస్తీతి వివస్యాన్. తేజస్సుకలవాడు, సూర్యుడు (ఇతని పట్టణము వివస్వతి), వేలుపు. విశేషేణ వస్తే ఆచ్ఛాదయతీతి వివస్వాన్, దేవత.
విస్వకేతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. విశ్వవ్యాపీకేతుర్ద్యుతిర్యస్యసః విశ్వకేతుః. విశ్వవ్యాపకమైన తేజస్సుకలవాడు, అనిరుద్ధుడు.
విహంగము
సం. నా. వా. అ. పుం. తత్స. విహాయసాగచ్ఛతీతి విహంగః. ఆకాశమున పోవునది, పక్షి, బాణము, ఎగురునది, సూర్యుడు.
విహంగిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విహజ్గ సదృశత్వాత్ విహంగికా. పక్షివలె అంతటపోవునది, కావడిబ్రద్ధ.
విహగము
సం. నా. వా. అ. పుం. తత్స. విహయసా గచ్ఛతీతి విహగః. ఆకాశమున పోవునది, పక్షి, పులుగు, మేఘము, చంద్రుడు, సూర్యుడు.
విహయసము
సం. నా. వా. స్. పుం. తత్స. విశేషేణ హయతి గచ్ఛతి సర్వమస్మిన్నమితి విహయః. దీనియందు విశేషముగా అన్నియుసంచరించును. వివిధం జిహితే గచ్ఛతీతి విహయాః. వివిధగతుల చేత పోవునది, పక్షి, ఆకాశము.
విహరము
సం. నా. వా. అ. పుం. తత్స. విహరణం విహరః. విహరించుట, వేడుకగాతిరుగుట, త్రిప్పుట, తోట, బౌద్ధాలయము, క్రీడ.
విహసితము
సం. నా. వా. అ. న. తత్స. స్మితాతి హసిత యోర్మధ్యమః విహసితం. చిఱునవ్వునకును, పెద్దనవ్వుకును మధ్యమైన నవ్వు, మృధు ధ్వనిగల నవ్వు, పెద్దగా నవ్వుట.
విహస్తుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విగతౌ వ్యాపార శూన్యోహస్తౌయస్యేతి విహస్తః. వ్యాపారములేని హస్తములుకలవాడు, నెమ్మదిలేని మనస్సుకలవాడు, చదువుకొన్నవాడు. వ్యగ్రౌ హస్తౌ యస్య సః విహస్తః.
విహ్వలుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విరుద్ధం హ్వలతీతి విహ్వలః. విరుద్ధముగా చలించువాడు, భయాదులచేత అవయవముల స్వాధీనత తప్పినవాడు.
వీకాశము
సం. నా. వా. అ. పుం. తత్స. విగతో విశిష్టశ్చకాశః ప్రకాశోస్యేతి వీకాశః. శ్రేష్టమైనట్టి ప్రకాశము కలది, ప్రకాశము, ఏకాంతస్థలము. వికశనమితి వీకాశః. రహస్యము.
వీచి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. వాతీతి వీచిః. చరించునది, అల, అవకాశము, కొంచెము, సుఖము. వయతి జలం తటే వర్ధయతీతి వీచిః. చిన్నతరంగము, అవకాశము, సుఖము, కిరణము, కెరటము, పంక్తి, అణువు. విస్మయం చినోతీతి వా వీచిః. విస్మయమును చేయునది.
వీణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వేతి జాయతే స్వరోస్యామితి వీణా. సర్వము దీనియందు పుట్టును, తంత్రీవాద్యవిశేషము, మెఱుపు. (సరస్వతి వీణ- కచ్ఛపి, నారదునివీణ-మహతి). వేతి దృష్టిమాత్రమపగచ్ఛతీతి వీణా. సంగీత వాయిద్యము.
వీణావాదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వీణా దీన్వాదయతీతి వీణావాదనం. వీణాదులను వాయించువాడు. వీణాం వాదంయతీతి వీణావాదాః.
వీతము
సం. నా. వా. అ. న. తత్స. వేతి యుద్ధాది కర్మణ ఇతి వీతం. వెళ్లునది, అంకుశముపోటు, సత్తువలేని ఏనుగు, గుఱ్ఱము, సం. విణ. తత్స. (పోయినది), గతము, శాంతము, గుఱ్ఱములను, ఏనుగులను పాదములతోగాని, అంకుశముతోగాని తోలి నడుపుట.
వీతి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. వేతి గచ్ఛతీతి వీతిః. వేగముగా పోవునది, చూలుపడుట, జిగి, తిండి, పరుగు, పోక, సం. నా. వా. ఇ. పుం. తత్స. (గుఱ్ఱము).
వీతిహోత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వీతిః అశనం హోత్రం హవిః యస్యః వీతిహోత్రః. వీతి అనగా అశనము, హోత్రమనగా హవిస్సు అవికలవాడు, అగ్ని, సూర్యుడు. వీ గతికాంత్యసనఖాదనేషు ఇతి వీతిహోత్రః.
వీధి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. విథ్యతేత్ర వీధి. దీనియందు యాచింతురు. విథ్యతేన యా వీధి. ఇండ్లవరుస, వరుస, ఇండ్లవరుసలు రెండింటికి నడిమిత్రోవ, నాటక విశేషము, మార్గము, ఒక రూపకము.
వీధ్రము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విశేషేణ ఇన్ధే వీధ్రం. విశేషముగా ప్రకాశించునది, గరగరికైనది, నిర్మలము, విమలము, శుచి, పవిత్రము, పుణ్యము, పావనము, శుభ్రము.
వీర
సం. నా. వా. అ. పుం. న. ఆ. స్త్రీ. తత్స. వీరయంత్య నేన వీరః. విక్రయింతురు. వీరయతీతి వీరః. విక్రమించువాడు కనుక మగడు, కొడుకులును కల ఆడుది. కుంకుమ పువ్వు, రసవిశేషము, శూరుడు, రాహువు, శివుడు, ఇంద్రుడు, కుబేరుడు, కుమారస్వామి.
వీరణము
సం. నా. వా. అ. న. తత్స. వీరయతి విక్రమతి తిక్ష్ణత్యేన వీరణం. మిక్కిలి వేడియూట చేత విక్రమించునది, అవురుగడ్డి. విం పక్షిణమీరయతి వీరణం. వీరభద్రము, వట్టివేరు.
వీరతరము
సం. నా. వా. అ. న. తత్స. వీరయతీతి విక్రమతి తీక్ష్ణత్యేన వీరతరః. మిక్కిలి వేడియౌట చేత విక్రయించునది, అవురుగడ్డి, బాణము.
వీరతరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. వీరోర్జునః తన్నామకత్వాద్వీరతరుః. వీరుడనగా అర్జునుడు, అతని పేరుకలది, ఏఱుమద్ది.
వీరపత్ని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వీరః పతిర్యస్యాస్సా వీర పత్నీ. వీరుడుపతిగా కలది, వీరుడు పెండ్లాడిన పెండ్లాము, వీరుడి భార్య.
వీరపాణము
సం. నా. వా. అ. న. తత్స. వీరాణాం పానం వీరపాణం. వీరుల యొక్కమద్యపానము, యుద్ధము కడపటగాని, మొదటగాని వీరులు చేసెడు గోష్ఠీపానము, యుద్ధ వీరుల త్రాగుడు.
వీరవృక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. వీరాణాముపస్పర్శ యోగ్యోవృక్షః వీరవృక్షః. అత్యుష్ణమైనది, ఏఱుమద్ది, జీడి, బల్లాట వృక్షము.
వీరసువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. వీరం సూతే వీరసూః. వీరుని కన్నది, వీరునికన్నతల్లి.
వీరహుడు
సం. నా. వా. న్. పుం. తత్స. వీరమగ్నిం హతవానా వీరహ. అగ్నిని విడిచినవాడు, ఉత్సర్గేష్టినిచేసి, గార్హపత్యాగ్నినివిడిచినవాడు, విష్ణువు, అగ్నిని విడిచిన బ్రాహ్మణుడు.
వీరాశంసనము
సం. నా. వా. అ. న. తత్స. వీరాః అశంస్యంతే వా అద్రేతి వీరాశంసనం. వీరులు దీనియందు స్తోత్రము చేయబడుదురు, భయంకరమైన యుద్ధ భూమి, యుద్ధములో అపాయ స్థలము.
వీరుధము
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. వివిధం రోహతీతి వా విరుధ్. నానావిధములుగా మొలచునది, ఒకటితోనొకటి పెనగొన్న ద్రాక్షతీగలోనగువానిపొద, చిగురుకొమ్మ, లత.
వీర్యము
సం. నా. వా. అ. న. తత్స. వీరే సాధు వీర్యం. వీరుని యందుండునది. వీరే అక్లిచే సాధు వీర్యం. నపుంసకుడు కానివాని యందుపుట్టునది. వీరయితుం యోగ్యం కర్మన్ వీర్యం. వీరుని యొక్కభావము, కర్మము, పరాక్రమము, రేతస్సు, తేజము, ప్రభావము, శుక్రము, బీజము, ఇంద్రియము, బలము, శక్తి, వీర్యము, ఆహార్యము, ఔదార్యము.
వీవధము
సం. నా. వా. అ. పుం. తత్స. వివిథో వధో వహనదుఃఖ మత్రేతి వివధః. దీనియందు వహనదుఃఖముకలదుకనుక, కావడి, త్రోవ, బరువు. వివిధో వధో హననం గమనం వా అనేన వీవధః. భారము, పర్యాహారము, పన్ను, బాట.
వృకధూపము
సం. నా. వా. అ. పుం. తత్స. వృణోతి విశ్వమితి వృకస్సూర్యః తత్స్రియోధూపః వృకధూపః. విశ్వమును వ్యాపించువాడుకనుక, అనేక పరిమళవస్తువులు కూర్చిచేసిన ధూపము, కృత్తిమ ధూపము, గుగ్గిలము.
వృకము
సం. నా. వా. అ. పుం. తత్స. వృకశ్చ కుక వృక ఆదానే. మాంసాదులను పుచ్చుకొనునది, తోడేలు, ఈహామృగము. వృణోతీతి వృకః. నక్క, శృగాలము.
వృక్క
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వృక్యంతే అద్యంత ఇతి వృకాని భక్ష్యాణి తత్ర సాధురితి వృక్కా. వృకములనగా భక్షింపతగిన వస్తువులు, శ్రౌతాదులయందు ప్రసిద్ధమైన శ్రేష్ఠమాంసము.
వృక్ణము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వృశ్చతే స్మ వృర్ణం. కోయబడినది, విఱిగినది, తునుక.
వృక్షధూపము
సం. నా. వా. అ. పుం. తత్స. వృక్షాజ్జాతో ధూపః వృక్షధూపః. వృక్షము వలన పుట్టినధూపము, దేవదారు బంకతోచేసిన ధూపద్రవ్యము.
వృక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. వృశ్చ్యతే చిధ్యత ఇతి వృక్షః. ఛేదింపబడినది, చెట్టు, తరుపు, పాదపము, కుంజము, వనస్పతి.
వృక్షరుహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వృక్షే రోహతీతి వృక్షరుహ. వృక్షమందు మొలచునది, బదనిక.
వృక్షవాటిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వృక్షాణాం వాటికా వృక్షవాటికా. పరివేష్టించి ఉండునది గనుక, అమాత్యులులోనగు ధనికుల యొక్క గృహములయందలి ఉపవనము.
వృక్షాదనము
సం. నా. వా. అ. పుం. తత్స. వృక్షోద్యతేనేనేతి వృక్షాదనః. వృక్షము దీనిచేత పీడింపబడును, ఉలి, రావి.
వృక్షాదని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వృక్షమత్తి పీడయతీతి వృక్షాదనీ. వృక్షమును పీడించునది, బదనిక, వృక్షరుహ.
వృక్షామ్లము
సం. నా. వా. అ. న. తత్స. చింతపండు, తింత్రిణేకము.
వృజినము
సం. నా. వా. అ. న. తత్స. వర్జ్యతిశిష్టైరితి వృజినం. శిష్టులచే వర్జింపబడునది. వృజ్యతే ఇతి వృజినం. విడువబడినది, పాపము, క్లేశము, వక్రము, దుఃఖము, గిరజాలు.
వృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వ్రియతేన యా వృతిః. దీనిచేత చుట్టిరాబడును, వరించుట, చుట్టువేసిన వెలుగు, చుట్టుట.
వృతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వ్రియతే స్మ వృతః. వరింపబడినవాడు.
వృత్తము
సం. నా. వా. అ. న. తత్స. వృత్తం విద్యత్రేతి వార్తా. లోకము యొక్కనడత దీనియందుకలదు. వృత్తం చ వృతువర్తనే వ్రియతే స్మ వృతః వృతువర్తనే. దీనిచేత వర్తింతురు, పద్యభేదము, నడత, జీవనము, తాబేలు, వరింపబడినది, కడచినది, చచ్చినది, వట్రువయైనది, గట్టియైనది, ఆచారము, చరిత్రము, ప్రవర్తనము, స్వరూపము, వృత్తి, ఛందస్సు.
వృత్తాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. వృత్తః అనువర్తనీయః అంతః సమాప్తిరస్యేతి వృత్తాన్తః. అనువర్తించి వచ్చునట్టి సమాప్తి కలిగినది. వృత్తః అంతోనిశ్చయోయస్య వృత్తాంతః. సిద్ధమైన నిశ్చయముకలది, సమాచారము, కథ, అంతయు, ఏకాంతము, ప్రక్రియ, అధ్యాయము, పూర్తి, సంఘటన, ప్రస్తావము, సంవాదము, వార్త, ప్రవృత్తి, ప్రక్రియ, ప్రస్తావము.
వృత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వర్తతే అనయా వృత్తిః. దీనిచేత వర్తించును, నడవడిక, జీవనోపాయము, (ఇది చతుద్విదకము కృషి పాశుపాల్యము, వాణిజ్యము, సేవ) వివరణ గ్రంధము, అభిధాది, (ఇవి మూడు అభిద, లక్షణ, వ్యంజన) కైశిక్యాది (ఇవి నాలుగు కైశికి ఆరభటి, సాత్వతి ,భారతి), జీవనము, జీవిక, వార్త, ప్రవర్తన.
వృత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. వృణోతీతి వృత్రః. ఆవరించునది, చీకటి, కొండ, పర్వతవిశేషము, మేఘము, ఇంద్రుడు, శబ్దము, అంధకారము, శత్రువు, ఒకరాక్షసుడు.
వృద్ధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గతవయస్కా వృద్ధా. పోయిన యౌవనము కలది, ఎనబది ఏండ్లకు పైబడినముసలిది, ముసలిది.
వృద్ధదారకము
సం. నా. వా. అ. పుం. తత్స. వృద్ధత్వం దారయతీతి వృద్ధదారకః. వృద్ధత్వమును పోకొట్టునది, బొద్ది.
వృద్ధము
సం. నా. వా. అ. న. తత్స. చిరస్థాయిత్వాద్వృర్ధం. అనేక కాలముండునది. వర్ధతే వృద్ధః. వృద్ధి పొందినవాడు. వర్ధత ఇతి వృద్ధః. వృద్ధి పొందువాడు, వృద్ధిపొంనది.
వృద్ధశ్రవుడు
సం. నా. వా. స్. పుం. తత్స. వృద్ధం శ్రవః కీర్తిర్యస్యసః వృద్ధశ్రవాః. ప్రవృద్ధమైన కీర్తికలవాడు, ఇంద్రుడు. వృద్ధాత్ బృహస్పతేః శ్రుణోతీతి వృద్ధశ్రవాః.
వృద్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సిద్ధ్వతారోగ్యమనయేతివృద్ధిః. దీనిచేత వృద్ధి పొందుదురు. స్వోపచయనిమిత్తమైన పరాపచయమేవృద్ధిః, సుఖము, శ్రీ, లక్ష్మి, సంపద, హర్షము, సమూహము, ధనము, అభివృద్ధి, సమృద్ధి, అభ్యుదయము, వడ్డి, (ఇది చతుర్విదము కాయిక, వృద్ధి, కావికావృద్ధి, కారితవృద్ధి చక్రవృద్ధి) గుణకారము, కంతి, ఒక గ్రహయోగము, గంధద్రవ్య విశేషము, ఒక ఓషధి, వరిబీజము, పెంపు.
వృద్ధ్యాజీవుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వృద్ధ్యా జీవతీతి వార్ధుషికః. వృద్ధిచేత బ్రతుకువాడు, వడ్డీకిచ్చి జీవనము చేయువాడు.
వృధా
సం. నా. వా. వ్యర్థము
వృశ్చికము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్రశ్చతి శూకాగ్రేణ వృశ్చికః. మొన చేత కుట్టునది. వ్రశ్చతీతి వృశ్చికః. పీడించునది, తేలు, తేలుకొండి, ఒకరాశి, కందురీగ, గొంగళిపురుగు, తెల్లగలిజేరు, కీటక విశేషము, మదనవృక్షము, ఆకుతేలు.
వృష
సం. నా. వా. ఆ. పుం. తత్స. వర్షత్య భిలషిత మితి వృషః. అభిల షితమును వర్ణించునది. మధు వర్షతీతి వృషః. తేనెను వర్షించునది. అత ఏవ వృషభ సామ్యాద్వషభః. కొమ్మువంటి అవయవములుకలది. వర్షతి రేతస్సించతీతి వృషః. రేతస్సును విడుచునది, ఎలుకజీడి, దురదగొండి, ఎద్దు, ధర్మము, ఎలుక, అడ్డసరము, ఓషధీ విశేషము, వాస్తుస్థాన విశేషము, భద్రము, వృషభము, గోవు, అంతః పురము, పురుషుడు, బృహస్పతి.
వృషణము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్షతి రేత ఇతి వృషణః. రేతస్సును కురియునది, ముష్కము. వర్షతి వంశబీజమితి వృషణః. అండకోశము.
వృషధ్వజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వృషో ధ్వజోయస్యసః వృషధ్వజః. వృషభము ధ్వజముగాకలవాడు, శివుడు, ముక్కంటి.
వృషభము
సం. నా. వా. అ. పుం. తత్స. 1. అత ఏవ వృషభ సామ్యా ద్వషభః. కొమ్మవంటి అవయవములు కలది. 2. వర్షతి రేతస్సించ తీతి వృషభః. రేతస్సును విడుచునది కనుక వృషభము, ఎద్దు, ఒకరాశి, ఓషధివిశేషము, తిరుమల, వేంకటాచలము. సం. విణ. తత్స. ఉత్తరపదమైనచో శ్రేష్ఠము, అక్షము, సౌరభేయము, గోవు, వాడవేయము, శాక్వరము, ఆదిజినము, కర్ణరంధ్రము.
వృషలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వృషం ధర్మంలునన్తీతీ వృషలాః. బ్రహ్మ యొక్కజఘనాంగమందు పుట్టినవారు, శూద్రులు, చంద్రగుప్తుడు, పాపాత్ముడు, ఎద్దు, పిప్పలి (వృక్షవిశేషము), అపశూద్రుడు, వాజి, అధార్మికుడు.
వృషస్యంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వృషః శుక్రలః తమాత్మన ఇచ్ఛతీతి వృషస్యంతీ. వీర్యాధికుడైన వానిని కోరునది, కాముకి.వృషం నరం శుక్రలం వా ఇచ్ఛతి మైథునాయ వృషస్యంతీ.
వృషాకపాయి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వృషాకషేః స్త్రీవృషాకపాయీ. వృషాకపులనగా హరిహరులు, వారి భార్యలు, లక్ష్మి, పార్వతి, శచి, స్వాహ, తిప్పతీగ, పిల్లపీచర.
వృషాకపి
సం. నా. వా. ఇ. పుం. తత్స. ధర్మ శీలాః తాక్పాతీతి వృషాకపిః. ధర్మము చేత చరించువారు, విష్ణువు, శివుడు, అగ్ని. వృషః ధర్మః కపిస్తద్వద్వశ్యో యస్యేతి వృషాకపిః. కృష్ణుడు.
వృష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వర్షతీతి వృష్టిః. తడుపునట్టిది, వర్షము, వాన, ఆవునెయ్యి, పరామృతము.
వృష్ణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వర్షతి రేత ఇతి వృష్టిః. రేతస్సును వర్షించునది, పొట్టెలు, ఒకయాదవుడు, కృష్ణుడు, ఇంద్రుడు, అగ్ని, పాషండుడు, అంశువు, సూర్యకిరణము, మేక.
వేగము
సం. నా. వా. అ. పుం. తత్స. విజతి చలతివేగః. కదలునది, జనము, ప్రవాహము, త్వర, విషవృక్షఫలము, మలమూత్రాది ప్రవృత్తి, త్వరితము, జవము, ప్రవాహము, వేణి.
వేగి
సం. నా. వా. న్. పుం. తత్స. వేగోస్త్రీతి వేగీ. వేగముకలవాడు, గుఱ్ఱము, వడికలది. వేగో అస్యాస్తీతి వేగీ. త్వరితుడు.
వేణి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వేణీ వత్తిష్ఠతీతి వేణీ. జడవలెనుండునది. వేణ తీతి వేణీ. అణగియుండునది, అనేక ప్రవాహముల యొక్క కూడిక, సర్పాకారముగా అల్లినజడ, కాలువ, డావరడంగి, ధార, ప్రవాహము.
వేణుద్ముడు
సం. నా. వా. అ. పుం. తత్స. వేణుం ధమన్తీతి వేణుధ్మాః. పిల్లనగ్రోవి నూదువారు. వేణువు వాయించువారు.
వేతనము
సం. నా. వా. అ. న. తత్స. వీయతే అనేనేతి వేతనం. దీనిచేత పొందబడును, సంబళము, కూలి, భృతి, జీతము, భరణము.
వేతసము
సం. నా. వా. అ. పుం. తత్స. వేతి అంభోనువర్తతే వేతసః. జలమును పొందిఉండునది, ఒకానొక తీగ, ప్రబ్బ, లతావిశేషము, రథము.
వేతస్వంతము
సం. విణ. (త్. ఈ. త్). తత్స. వేతసాస్సుంత్యస్మిన్నితి వేతస్వాత్. బహువేతసం, మిక్కుటమైన ప్రబ్బలుకలది, రెల్లుతోనిండినది.
వేత్రవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వేత్రయోగా ద్వేత్రవతీ. వ్రేపతీగెలుగలది, నదీ విశేషము.
వేదన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సంవేదనం వేదనా. అనుభవించుట, నొప్పి, తెలివి, జ్ఞానము, దుఃఖానుభవము.
వేదము
సం. నా. వా. అ. పుం. తత్స. త్రయానాం వేదానాం సమాహరస్త్రయీతివా. మూడు వేదముల యొక్క ఏకీ భావము, తొలిచదువులు. (వేదములునాలుగు, ఝక్కు, .యజస్సు, సామము, అధర్వము). శృతి, ఆమ్నాయము, ఆగమము, ఛంధము, బ్రహ్మ, నిగమము, ప్రవచనము, స్వాధ్యాయము.
వేది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పూజాదికం విన్దతీతి వేదిః. పూజాదికమును పొందునది, యజ్ఞము, మొదలగువానికై చదరముగా నేర్పరచిన తిన్నెతెన్న, ముద్దుటుంగరము, విద్వాంసుడు, బ్రహ్మ, తెలిసినవాడు, సరస్వతి.
వేదికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పధికైర్విధ్వతే లభ్యతేవా వేదికా. తెరువరులచే పొందబడినది, తిన్నె, డాబా, ఉంగరము, ముద్ర.
వేధితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వేధోస్య సంజాత ఇతి వేధితః బెజ్జము కలిగినది, తొలిపుచ్చబడినది, బాధింపబడినది.
వేపధువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. వేపనం వేపథుః. కంపించుట, కంపము, స్వరకంపము.
వేమము
సం. నా. వా. న్. పుం. తత్స. వయం త్యనేనేతి వేమా. దీనిచేత నేయుదురు, నేతపలక, మగ్గము.
వేల
సం. నా. వా. అ. న. తత్స. వేల్లతే వేల్లం. చులకనై చలించునది, వాయువిడంగము.
వేల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వేలతీతి వేలా. చలించునది, చెలియకట్ట, పొలిమేర, ఉప్పెన, రాజభోగము, అనాయాసమరణము, వ్యాధి, బుధుని భార్య. వేల్యతే అనయేతి వేలా. సముద్రజలవికారము, కాలము, సమయము, క్షణము, వారము, అవసరము, ప్రస్తావము, అంతరము.
వేల్లజము
సం. నా. వా. అ. న. తత్స. వేల్లే సముద్ర వేలాత టే ప్రాయేణ జాయత ఇతి వేల్లజం. సముద్రపు దరిని తఱచుగాపుట్టునది, మిరియము, మరీచము. వేల్లం చలనం జాయతే, జనయతీత్యర్థః ఇతి వేల్లజః.
వేల్లము
వేల్లితము
సం. నా. వా. అ. న. తత్స. వేల్లతి చలతి కుటిలతయేతి వేల్లితం. వంకరౌట చేత కుదురైయుండక కదలునది. వేల్యతేస్మ వేల్లితః. కదలింపబడినది, ప్లుతమనెడి అశ్వధారా విశేషము వంకరైనది, వక్రము, భగ్నము.
వేశంతము
సం. నా. వా. అ. పుం. తత్స. విశంతి మహిషాదయః అత్ర వేశంతః. మహిషాదులు దీనియందు ప్రవేశించును, నీళ్లుగల చిన్నపల్లము, పడియ. విశంత్యత్ర భేకాదయః ఇతి వేశంతః. పల్లవము, అగ్ని, చిన్నకొలను.
వేశ్మము
సం. నా. వా. న్. న. తత్స. విశంత్యత్రేతి వేశ్మ. దీనియందు ప్రవేశింతురు, ఇల్లు, గృహము, గేహము.
వేశ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వేశేభవా వేశ్యా. వేశ్యవాటిక, దానియందుపుట్టినది, భోగముది, వేశ్యలవాడు, స్త్రీ విశేషము, గణిక, పణ్యాంగన.
వేష్టితము
సం. నా. వా. అ. న. తత్స. వేష్ట్యతే స్మ వేష్టితం. చుట్టబడినది, కొట్టమాట, హల్లీసకము, చుట్టుకొనబడినది, ఆవరింపబడినది.
వేహత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. గర్భోప ఘాతం వహతీతి వేహత్. గర్భోపఘాతమును వహించునది, (చూలుపడిన వెనుక ఆబోతుపై కొనుటచే),ఈచుకు పోయిన ఆవు. విశేషేణ హంతి గర్భమితి వేహత్. గర్భఘాతిన అగు ఆవు.
వైకక్షకము
సం. నా. వా. అ. న. తత్స. ఉరసి యజ్ఞోపవీతా కారేణ యత్తిర్యక్ క్షిప్తంతన్మాల్యం వైకక్షక మిత్యుచ్యతే. ఉరస్సునందు జందెము వలె వేసుకొన్న పూదండ. వైకక్షమేవ వైకక్షకం. ఉత్తరీయము.
వైకుంఠము
సం. నా. వా. అ. పుం. తత్స. కస్మింశ్చిన్మన్వంతరే వికుంఠాయాంమాతరి జాతత్వా ద్వైకుంఠః. ఒకానొక మన్వంతరమున వికుంఠయను తల్లియందు అవతరించెకావున వైకుంఠుడు, విష్ణువునుండెడి స్థానము, తెల్లతులసి.
వైజయంతము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రశస్తాః వైజయంత్యః పతాకా అస్మిన్ సంతీతి వైజయంతః. ప్రశస్తములైన టెక్కెములుకలది, ఇంద్రునినగరు, ఇంద్రుని టెక్కెము, కుమారస్వామి, ఇంద్రభవనము, ఇంద్రుని చిహ్నము.
వైజయంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విజయతి శోభాదికంమితి వైజయతి. శోభాదులను గెలుచునది, టెక్కెము, విష్ణుమాలిక, విష్ణుప్రాకారము, తక్కిలి, జెండా.
వైజయంతికుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. వైజయంత్యా చరతీతి వైజయంతికః. టెక్కెము చేత చరించువాడు, టెక్కెము, పట్టువాడు.
వైజ్ఞానికుడు
సం. విణ. (అ. ఈ. అ). తత్స. విజ్ఞానం శిల్పం, తేన చరతీతి వైజ్ఞానికః. నేర్పుచేత సంచరించువాడు, నేర్పరి, నిపుణుడు.
వైణవము
సం. నా. వా. అ. న. తత్స. వేణోరిదం వైణవం. వెదురు బియ్యము, బంగారము, ఒక సంకరజాతి.
వైణవికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వేణో ర్వికారః వైణవం. తద్వాదనం శిల్పమేషామితి వైణవికా. వెదురుతో చేసిన పిల్లనగ్రోవి నూదువాడు.
వైతంసికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మృగ పక్ష్యాదేర్భంధనో పాయోవితం సః. తేన చరతీతి వైతంసికః. మృగపక్ష్యాదులను పట్టుటకు సాధనములైన త్రాళ్లు మొదలగినవి. మృగపక్ష్యాదులను చంపి విక్రయించి జీవించువాడు, మాంసికుడు, పిట్టలవేటగాడు, కసాయివాడు, వితంసము, వానితోడ సంచరించువాడు.
వైతనికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వేతనేన జీవతీతి వైతనికః. కూలిచేత బ్రతువాడు, కూలివాడు, సేవకుడు.
వైతరణి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. విగతం తరణమత్ర వైతరణీ. దీనియందు దాటుటలేదు, నరకమునందుండెడు నిప్పులఏఱు, రాక్షసుల తల్లి.
వైతాళికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వివిధాస్తాళాః ప్రయోజనం యేషాం తే వైతాళికాః. వివిధములైన తాళములు ప్రయోజనముగా కలవాడు, వేకువను రాజులకు మేలుకొలుపులుపాడువాడు, మేలుకొలుపువాడు. వివిధేన మంగళగీతవాద్యాదికృతతాళశబ్దేన చరతీతి వైతాళికః.
వైదేహకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విదేహస్య రాజ్ఞశ్శీష్యః వైదేహకః. బట్టువాడు, వర్తకుడు, స్త్రీ సంరక్షకుడు.
వైదేహి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. విదేహ దేశే భవా వైదేహీ. విదేహ దేశమందు పుట్టినది, సీతాదేవి, వర్తకురాలు, గోరోజనము, పిప్పలి. విదేహస్యాపత్యం స్త్రీ వా వైదేహీ. ఉపకుల్య, మగధ.
వైద్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విద్యామాయుర్వేదమధీతే వేర్తివా వైద్యః. ఆయుర్వేదమును చదివినవాడు కాని, ఎఱిగినవాడు కాని వైద్యుడు. విద్యాం వేదతీతి వైద్యః. రోగమును హరించువాడు, చికిత్సకుడు, విద్వాంసుడు, ఆయుర్వేది, దోషజ్ఞుడు.
వైధనిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విధ్యతే అనయేతి వైధనికా. దీనిచేత రత్నములు మొదలగునవి భేదింపబడును, రత్నము దొలిపుచ్చెడి సూది, ఆస్ఫోటని, పిడిసాన.
వైధాత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విధాతు రపత్యం వైధాత్రః. విధాత కుమారుడు, వైద్యశాస్త్ర కర్తయగు సనత్కమారుడను దేవర్షి.
వైధేయుడు
సం. విణ. (అ. ఈ. అ.). తత్స. విధాతుం యోగ్యో విధేయః. శిక్షింపతగినవాడు, మూర్ఖుడు. విధిం పద్ధతిమేవానుసృత్య వ్యవహరతీతి వైధేయః.
వైనతేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వినతాయా అపత్యం వైనతేయః. వినత కొడుకు, గరుత్మంతుడు, అనూరుడు, అరుణుడు.
వైనీతకము
సం. నా. వా. అ. పుం. తత్స. వినీతానా మిదం వైనీతకం. శిక్షితములైన గుఱ్ఱములు మొదలగునవి వాని సంబంధమైనది, రథశిబికాది పరంపరావాహనము, తేరుమోకు, చాలమంది మోయు పల్లకి.
వైమాత్రేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విగతా విభిన్నా వామాతా, తస్యా అపత్యం వైమాత్రేయః. సవతితల్లి కొడుకు.
వైయాఘ్రము
సం. విణ. (అ. ఈ. అ.). తత్స. వ్యాఘ్ర చర్మణా వృతో రథః వైయాఘ్రః. పులి తోలుచేత కప్పబడిన రథము.
వైరనిర్యాతనము
సం. నా. వా. అ. న. తత్స. వైరస్య నిర్యాతనం వైరనిర్యాతనం. వైరము పోగొట్టుట, పగ తీర్చుకొనుట, వైరశుద్ధి.
వైరము
సం. నా. వా. అ. న. తత్స. వీరస్య కర్మ వైరం. వీరుని యొక్క వ్యాపారము, విరోధము, విద్వేషము, పగ.
వైరశుద్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వైరస్య శుద్ధిః వైరశుద్ధిః. వైరము పోగొట్టుకొనుట, పగతీర్చుకొనుట.
వైరి
సం. నా. వా. న్. పుం. తత్స. వైరమస్యాస్తీతి వైరి. వైరము కలవాడు, అరాతి, శత్రువు, పగవాడు, రిపువు.
వైవధికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వివధేన హరతీతి వైవధికః. కావడి చేత ధాన్యము మొదలైనవానిని కొని పోవువాడు, కావడిమోయువాడు.
వైవస్వతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వివస్వత స్సూర్యస్య అపత్యం వైవస్వతః. సూర్యుని కొడుకు, యముడు, ఒకమనుడు, శనైశ్చరుడు.
వైశాఖము
సం. నా. వా. అ. పుం. తత్స. విశాఖానక్షత్ర యుక్తా పూర్ణిమా సాస్మిన్నితి వైశాఖః. విశాఖా నక్షత్రముతో కూడిన పున్నమ దీనియందు కలదు, ఒకనెల, కవ్వము. విశాఖా ప్రయోజనం అస్యేతి వైశాఖః.
వైశ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశన్త్యాపణాదికమితి ఏవవైశ్యాః. అంగళ్లు మొదలైన వానిని ప్రవేశించువారు, కోమటివాడు, అర్యుడు. విశతికృశ్యాదౌ వైశ్యః. ఆర్యుడు, ద్విజుడు.
వైశ్రవణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ శృణోతీతి విశ్రవాః తస్యాపత్యం వైశ్రవణః. విశేషముగా వినెడువాడు కనుక విశ్రవసు అతని కొడుకు వైశ్రవణుడు, కుబేరుడు, పైడిఱేడు. విశ్రవసో మునేరపత్యం వైశ్రవణః. కుబేరుడు.
వైశ్వానరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విశ్వానరస్య ఋషేరపత్యం వైశ్వానరః. విశ్వానరుడను ఋషికి కొడుకు, అగ్ని, వేడివేలుపు. విశ్వే నరః అస్యేతి వైశ్వానరః. వహ్ని.
వైష్ణవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఒక మాతృక.
వైసారిణము
సం. నా. వా. అ. పుం. తత్స. విసరతీతి విసారి విసార్యేన వైసారిణః. చరించునది కనుక, మత్స్యము, చేప. విశేషేణ సరతీతి విసారీ మత్స్యః, స ఏవ వైసారిణః.
వ్యంజకము
సం. నా. వా. అ. పుం. తత్స. అర్థం వ్యనక్తీతి వ్యంజకః. అర్ధమును వ్యక్తముగాచేయునది, అభినయము, వ్యంగార్ధమును తెలిపెడు శబ్ధము, వికారసూచకము.
వ్యంజనము
సం. నా. వా. అ. న. తత్స. వ్యజ్యతే అనేనేతి వ్యంజనం. దీనిచేత ప్రకటము చేయబడును, కూర, ఆలుమగలగురి, గురుతు, మీసము, హల్లు, పర్యాగ్నికరణాది పశుసంస్కారము, తాటి, యజ్ఞపశువును శుద్ధిచేయుట, నంజుడు, గడ్డము, చిహ్నము, అవయవము. వ్యజ్యతే మ్రక్ష్యతే అన్నాది సంయోజ్యతే అనేనేతి వ్యంజనం. తేమనము, నిష్ఠానము, తేమ, మిష్టాన్నము, రమశ్రువు, అవయవము, దినము, ఉపస్థము.
వ్యక్తము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. వ్యజతేస్మ వ్యక్తః. ప్రకటనమైనవాడు, తెల్లయైనది, తెలియబడినది(అభివ్యక్తము), వేడి, పండితుడు, స్పష్టమైనది.
వ్యక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వ్యజ్యత ఇతి వ్యక్తిః. వ్యక్తమగునది, జాతికి వేఱై జాతికి ఆశ్రయమైన స్వరూపము.
వ్యగ్రుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. విశేషేణ వివిధం చాంగతీతి వ్యగ్రః. మిక్కిలి కాని, వివిధముగా కాని పోవువాడు, వేగిరపడువాడు, ఒకటతగిలిన మనసుకలవాడు, అసక్తుడు, సంభ్రాతుడు.
వ్యజనము
సం. నా. వా. అ. న. తత్స. వ్యజ్యతే శ్రమోపనీయతే అనేనేతి వ్యజనం. దీనిచేత బడలిక పోగొట్టబడును, విసనకఱ్ఱ, తాళవృంతము. వ్యజత్యనేనేతి వ్యజనం.
వ్యడంబకము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యడతి రోగం హంతుం వ్యడంబకః. రోగమును పోగొట్టుట కొఱకు విశేషముగానుద్యోగించునది, ఆముదపు చెట్టు.
వ్యత్యయము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యతిక్రమ్య అయనం వ్యత్యయః. అతిక్రమించుట, వ్యత్యాసము, తడబాటు, ఎదురు. వ్యత్యయనమితి వ్యత్యయః. విపర్యయము.
వ్యథ
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యధనం వ్యథః. వ్యధ పెట్టుట, తొలిపుచ్చుట, వేదన, బాధ, దుఃఖము, పీడ.
వ్యథ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. విథ్యంతే అనయేతి వ్యథా. దీనిచే జనులు బయపడుదురు లేక చలింతురు కనుక వ్యథ, బాధ.
వ్యధ్వము
సం. నా. వా. అ. పుం. తత్స. విరుద్ధః అధ్వావ్యధ్వః. విరుద్ధమైన త్రోవ, చెడ్డత్రోవ, కాపథము.
వ్యయము
సం. నా. వా. అ. న. తత్స. వ్యయనం వ్యయః. వెచ్చించుట, లగ్నమునకు పండ్రెండవ ఇల్లు, ఖర్చు.
వ్యళీకము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ అల్యతే వార్యత ఇతి వ్యళీకం. విశేషముగా వారింపబడునది, అప్రియము, అకార్యము, అచ్చెరపాటు, అసత్యము, బాధ, సిగ్గు, మోసపుచ్చుట, మన్మధావేశముచే చేయబడిన కామినీజనాపరాధము.
వ్యవధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వ్యవధీయతే అనయా వ్యవధా. పదార్ధము దీనిచేత వ్యవహితముకా ధరింపబడును, కప్పు, మఱుగు.
వ్యవసాయము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యవసీయత ఇతి వ్యవసాయః. విశేషముగా నిశ్చయించుట, ప్రయత్నము, కృషి.
వ్యవహారము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యవహరం త్యనేనేతి వ్యవహారః. దీనిచేత వ్యవహరింతురు, తగవు, న్యాయము, వాడుక, జూదము, కత్తి, ఆజ్ఞ, ఆట, శిక్ష.
వ్యవాయము
సం. నా. వా. అ. న. తత్స. వ్యవాయనం వ్యవాయః. స్త్రీని పొందుట, తేజము, మఱుగు, గ్రామ్యధర్మము. విశేషేణ అవాయనం అవరోధనం, వా అధః సంశ్లేషణం ఇతి వ్యవాయః. విఘ్నము, అంతరాయము, మైథునము, సురతము.
వ్యసనము
సం. నా. వా. అ. న. తత్స. వ్యస్యతేశ్రేయో మార్గాత్ప్రచ్యాన్యతే పురుషోనేనేత వ్యసనం. దీని నుండి పురుషుడు శ్రేయో మార్గము నుండి తొలగత్రోయబడును, ఆపద, కామక్రోధముల వలన పుట్టిన దోషము (ఇవి ఏడు- సానము, స్త్రీ, మృగయ, ద్యూతము (ఇవి కామము వలన పుట్టునవి.),( వాక్పారుష్యము, దండపారుష్యము, అర్ధ ధూషణము- ఇవి కోపము వలన పుట్టునవి), ఆసక్తి, పాపము, అపాయము, నిష్పలమైన ప్రయత్నము, దైవము వలనియనిష్ఠఫలము, శక్తి, దురదృష్టము, పాపము, వేట.
వ్యస్తము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. వ్యస్యత ఇతి వ్యస్తః. వివిధముగా నెఱపబడునది, వేఱుపడినది, వ్యాకులత పొందినది, వ్యాపించినది.
వ్యాకులము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. వ్యాకుల్యతే మనోయస్యేతి వ్యాకులః. శోకాదులచేత మందముగా చేయబడిన మనస్సు కలవాడు, కలత నొందినది.
వ్యాకోచము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. వ్యావృత్తః కోశః సంకోచోస్మాదితి వ్యాకోశః. విగతమైన బంధము కలిగినది, వికసించినది.
వ్యాఘ్రనఖము
సం. నా. వా. అ. న. తత్స. వ్యాడాయుధం వ్యాఘ్రనఖం. పులిగోరు వలె ఉండునది, భూషణ విశేషము, పులిగోరు, గంధద్రవ్య విశేషము, నఖక్షతవిశేషము.
వ్యాఘ్రపాదము
సం. నా. వా. ద్. పుం. తత్స. వ్యాఘ్రస్య పాదా ఇవ పాదామూలాన్యస్య వ్యాఘ్రపాత్. పులి అడుగుల వంటి వేళ్లు కలది, ములువెలగ, పుల్లవెలగ.
వ్యాఘ్రపుచ్ఛము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యాఘ్రపుచ్ఛాకార శాఖాయోగా వ్యాఘ్రపుచ్ఛః. పులి తోకల వంటి కొమ్మలు కలది, ఆముదపు చెట్టు.
వ్యాఘ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యాజిఘ్రతీతి వ్యాఘ్రః. చంపునపుడు వాసన చూచునది, పులి, పెద్ద ఆముదపు చెట్టు, ఉత్తరపదమైనచో శ్రేష్ఠము.
వ్యాఘ్రాటము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యాఘ్రవదట తీతి వ్యాఘ్రాటః. పులివలె తిరుగునది, భరధ్వాజ పక్షి, ఏట్రింత.
వ్యాఘ్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వ్యాఘ్రనఖరసమానకంటక త్వాత్ వ్యాఘ్రీ. పులిగోళ్ల వంటి ముండ్లు కలది, వాకుడు.
వ్యాజము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యజ్యతే అనేనేతి వ్యాజః. దీనిచేత ప్రేరేపింపబడును. వ్యజ్యతే క్షిప్యతే అనేనేతి వ్యాజః. దీనిచేత అరిష్టము పోగొట్టబడును, కపటము, చెడ్డతనము, మోసము, నెపము. వ్యజతి యథార్థ వ్యవహారాత్ అపగచ్ఛతి అనేన ఇతి వ్యాజః.
వ్యాధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. కుష్ఠ వ్యాధినామా న్యస్య సంతీతి వ్యాధిః. కుష్ఠవ్యాధి యొక్క పేర్లు కలది, తెవులు, చెంగల్వకోస్టు. వివిధా అధయః మనః పీడా యస్మినా సః వ్యాధిః. వివిధములైన పీడలు దీనియందు కలవు, రోగము. వివిధాః ఆధయో అస్మాత్ ఇతి వ్యాధిః.
వ్యాధిఘాతము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యాధిం హరతీతి వ్యాధిఘాతః. వ్యాధిని చెఱచునది, ఱేల, ఆరగ్యధము.
వ్యాధితుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. వ్యాధిస్సంజాతోస్య వ్యాధితః. వ్యాధి కలవాడు, తెవులుగొంటు.
వ్యాధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విధ్యతి మృగాని తి వ్యాధః. మృగములను చంపువాడు, బోయవాడు, దుష్టుడు, కిరాతకుడు.
వ్యానము
సం. నా. వా. అ. పుం. తత్స. వినయతీతి వ్యానః. శరీరమంతట ఉండునది, వాయువు.
వ్యాపాదము
సం. నా. వా. అ. న. తత్స. వ్యాపాద్యతే అనేనేతి వ్యాపాదః. దీనిచేత విశేషముగా ఆపాదింపబడును, ద్రోహము.
వ్యామము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యామియతే రజ్జ్వాదిక మనేనేతి వ్యామః. త్రాడు మొదలగునవి దీనిచేత కొలవబడును, బార, పొగ.
వ్యాసము
సం. నా. వా. అ. పుం. తత్స. వివిధ మాసనం వ్యాసః. అనేక ప్రకారములుగా ఉండుట, విరివి, ఏదేని ఒక విషయమును విరివిగా వ్రాయుట, పరాశరుని కొడుకు.
వ్యాహరము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యాహ్రియతే ఉచ్యతే ఇతి వ్యాహరః. పలుకబడినది, వచనము, పలుకు, వాక్యము.
వ్యుత్ధానము
సం. నా. వా. అ. న. తత్స. విరుద్ధముత్థానమత్రేతి మ్యత్థానం. దీనియందు విరుద్ధమైన ఉద్యోగము కలదు. అడ్డపాటు, సమాధి నుండి మరలుట, ప్రతికూల ప్రవర్తనము, స్వాతంత్య్రము, స్వతంత్ర చర్య, ఎదురు.
వ్యుష్టము
సం. నా. వా. అ. న. తత్స. వేకువ, సం. విణ. తత్స. వేగినది, ప్రాతఃకాలము.
వ్యుష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. విగతా ఉష్టిః వ్యధా అస్యా ఇతి వ్యుష్టిః. వ్యధ లేనిది, ప్రయోజనము, సమృద్ధి, ఎనిమిది రోజులకు ఒకసారి తినుట.
వ్యూఢము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. విశేషేణ. ఊహ్యత ఇతి వ్యూఢః. విశేషముగా వహింపబడునది, వ్యూహముగా ఉంచబడినది (సేన), దట్టమైనది, విశాలమైనది. విశేషేణ ఉహ్యతే స్మ ఇతి వ్యూఢ.
వ్యూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వయనం వాణిః వ్యూతిశ్చ. నేయుట, నేత.
వ్యూహము
సం. నా. వా. అ. పుం. తత్స. విశేషేణ ఊహ్యత ఇతి వ్యూహః. మిక్కిలి ఊహింపబడునది. వ్యూహ్యతే రచ్యత ఇతి వ్యూహః. రచింపబడునది. విశేషేణోహ్యత ఇతి వ్యూహః. విశేషముగా విచారింపబడునది, మిక్కిలి ఊహ, మొగ్గరము, సమూహము, రచన (వ్యూహభేదములు- దండము, భోగము, మండలము, అసంహతము, చక్రగోమూత్రికాదులు వీని అవాంతరభేదములు.), సమూహము.
వ్యోకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యో అయః కరోతీతి వ్యోకారః. ఇనుము చేయువాడు, కమ్మరవాడు.
వ్యోమకేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వ్యోమ్ని కేశాః యస్యసః వ్యోమకేశః. ఆకాశమున నిండియున్న తలవెండ్రుకలు కలవాడు, శివుడు, వినుసిగ దేవర, శంకరుడు, మహాదేవుడు, ఉమాపతి, రుద్రుడు, నీలకంఠుడు, త్రినేత్రుడు, గంగాధరుడు.
వ్యోమము
సం. నా. వా. న్. న. తత్స. విశ్వం వ్యయతి సంవృణోతీతి వ్యోమ. విశ్వమును వ్యాపించునది, ఆకాశము, జలము, విశేషేణ అవత్యపకాశదానేనే విశేషముగా అవకాశమిచ్చి తివ్యోమ. రక్షించునది.
వ్యోమయానము
సం. నా. వా. అ. న. తత్స. వ్యోమ్నియానం గమనం దేవానాం యేనతద్వ్యోమయానం. దేవతలకు ఆకాశమందు గమనము దేనిచేత కలుగునో అది, విమానము.
వ్యోషము
సం. నా. వా. అ. న. తత్స. విశేషేణ. వోషతి రోగాని తి వ్యోషం. విశేషముగా రోగములను చెఱచునది, త్రికటుకము, శొంఠి, మిరియాలు, పిప్పళుల కలయిక. విశేషేణ ఓషధీతి వ్యోషః.
వ్రజము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్రజ్యతి ఇతి వ్రజః. పొందబడునది. వ్రజంత్యస్మిన్నితి వ్రజః. దీనియందు పోవుదురు, పసువుల మంద, పసుల కొట్టము, సమూహము, త్రోవ, మార్గము. వ్రజంతి సంఖీభూయ యాంత్యత్రేతి వ్రజః. దారి, త్రోవ, మార్గము.
వ్రజ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వ్రజనం వ్రజ్యా. తిరుగుట. కదలిపోవుట, భిక్షలోనగువాని కొఱకు తిరుగుట, ప్రయాణము, ఒకతెగ, యాత్ర, ఇటునటు తిరుగుట. గతి, గమనము, వర్గము.
వ్రణము
సం. నా. వా. అ. పుం. తత్స. వ్రణయతి వ్రణః. దేహమును నొప్పించునది, సం. నా. వా. అ. న. తత్స. గాయము, కుఱుపు (ఇది నూటయెనిమిది భేదములు కలది.), కిణము, పుండు. వ్రణయంతి గాత్రం ఇతి వ్రణః.
వ్రతతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ప్రకృష్ఠాత తిర్విస్తారోస్యాః వ్రతతిః. మిక్కిలి విస్తారము దీనికి కలదు.
వ్రతతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ప్రకృష్ఠాత తిరన్యేతిచ వ్రతతీ. మిక్కిలి విస్తారము, తీగ, విరివి, లత, ప్రకృష్ఠమైన విస్తారము.
వ్రతము
సం. నా. వా. అ. న. తత్స. వ్రత్యతే అన్నాదిక మనేనేతి వ్రతం. అన్నాదులు దీనిచేత విడువబడును, ఉపవాసాది పుణ్య కర్మము, నోము, తపస్సు, ఋతువు, సంవత్సరము, నెల, అగ్ని, ఆహారము.
వ్రశ్చనము
సం. నా. వా. అ. పుం. తత్స. వృశ్చ్యతే అనేన సువర్ణదికమితి వృశ్చనః. దీనిచేత స్వర్గమునఱకబడును, సం. నా. వా. అ. న. తత్స. భేదనము, పత్రపరసు, ఆకుఱాయి, చిన్నకత్తి.
వ్రీడా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వ్రీడయతీతి వ్రీడా. ప్రేరేపించునది, సిగ్గు, లజ్జ, త్రప.
వ్రీహి
సం. నా. వా. ఇ. పుం. తత్స. వృణాతి దేహమితి వ్రీహిః. దేహమును వరించునది. వడ్లు, ఎఱ్ఱవడ్లు, ధాన్యము, పంట. వర్హతి వృద్ధిం గచ్ఛతీతి వ్రీహిః.
వ్రైహేయము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. వ్రీహ్యుధ్భవోచితం క్షేత్రం వ్రైహేయం వడ్లు పండుటకు ఉచితమైన భూమి, పెట్టతగినది (భూమి),ధాన్యము పండుపొలము.