హల్లులు : ఖ
ఖ
ఖనతి వ్యథయతీతిఖః. వ్యథ పెట్టునది,ఒకఅక్షరము.
ఖంజ
సం. విణ. తత్స. ఖంజతి గతి వైకల్యం ప్రాప్నోతి ఖంజః. నడకలేమిని పొందినవాడు. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛందో విశేషము, కుంటిది.
ఖంజనము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖంజతీతి ఖంజనః. భాద్ర పదమాసము మొదలు 6 నెలలు కనిపించక తిరుగునది, మండపిచుక, కాటుక పిట్ట, పక్షివిశేషము, తండకము, నీలకంఠము.
ఖంజరీటము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖం ఆకాశం అఞ్జసా ఏటతి ఖంజరీటః. ఆకాశమున తొందరగా పోవునది, కాటుకపిట్ట, మండపిచుక. ఖంజ ఇవ రుచ్ఛతీతి ఖంజరీటః. ఖంజనపక్షి.
ఖండ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖండ్యత ఇతి ఖండం. త్రుంచబడునది, గర్భాదానాది విధి ప్రతిపాదక గ్రంధము. శౌతల దప్పు వట్టుదున్ ఖండలముష్టి వీడ్వగనినమ్యదు. ఆము. ఆ. ఉప్పు, చెరకు పానకము, భాగము, తునుక, చెరకు గడ.
ఖండపరశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ఖణ్డయతి శత్రూన్ ఇతి, తాదృశః పరశురస్య ఖణ్డపరశుః. శివుడు.
ఖండికము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖండ్యతే నరై రద్యత ఇతి ఖండికః. జనుల చేత భక్షింపబడునది, ధాన్యవిశేషము, ఒక శెనగ.
ఖగము
సం. నా. వా. అ. న. తత్స. ఖేగచ్ఛతీతి ఖగః. ఆకాశమందు పోవునది. ఖేగచ్ఛతీతిఖగః పక్షి, బాణము, గ్రహము. ఖే ఆకాశే గచ్ఛతీతి ఖగః. సూర్యుడు.
ఖగేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఖగానా మీశ్వరః ఖగేశ్వరః. పక్షుల కేశ్వరుడు, గరుత్మంతుడు.
ఖజాక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖజతి మథ్నాతి శాకాదికమితి ఖజాకా. శాకాదికమును మధించునది, గరిటె.
ఖట్వా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖట్యతే కాంక్ష్యతే ఖట్వా. కాంక్షింపబడునది, పర్వంకము, మంచము.
ఖడ్గము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖడ్గోనందకః నందయతి దేవానితి నందకః. దేవతలను సంతోషపెట్టునది, విష్ణుని ఖడ్గముపేరు. ఖండయతి తీక్ష్ణత్వాత్ ఖడ్గః. ఖండించునట్టు కొమ్ముకలది. ఖండయతీతి ఖడ్గః. ఖండించునది, కత్తి, ఖడ్గమృగము ,కొమ్ము, గంధకము.
ఖడ్గి
సం. నా. వా. న్. పుం. తత్స. ఖండయతి తీక్ష్ణత్వాత్ ఖడ్గీ. ఖండించునట్టి కొమ్ముకలది, ఖడ్గ మృగము, ఒక జల జంతువు, సం. విణ. కత్తికలవాడు. ఖడ్గస్తదాకార శృంగమస్యాస్తీతి ఖడ్గీ. వనజంతువిశేషము, గంధకము, ఖడ్గము, ఖడ్గమృగము, వజ్రము వంటి చర్మము కలది, ఏకచరము.
ఖదిర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖదిర ఇవ సూక్ష్మపత్రత్వా త్ఖదిరా. ఖదిరమువలె సూక్ష్మ పత్రము కలది. మునుగు తామర.
ఖదిరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఖదతి స్థిరీ భవతీతి ఖదిరః. స్థిరమైఉండునది, చండ్ర, నిద్రభంగి, ఇంద్రుడు.
ఖద్యోతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఖేద్యోతత ఇతి ఖద్యోతః. ఆకాశమందు ప్రకాశించునది, సూర్యుడు. ఖం ద్యోతయతీతి, ఖే ఆకాశే ద్యోతతే వా ఇతి ఖద్యోతః. మిణుగురు పురుగు.
ఖని
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ఖన్యతే రత్నాదిక మత్రేతి ఖనిః. రత్నములు మొదలైనవి దీనియందు త్రవ్వబడును. రత్నములు పుట్టెడు చోటు, గని.
ఖనిత్రము
సం. నా. వా. అ. న. తత్స. ఖన్యతేనేన ఖనిత్రం. దీనిచేత్రవ్వబడును, గడ్డపాఱ, గుద్దలి, గునపము.
ఖపురము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖాని ఇంద్రియాణి వృణోతి వ్యాప్నోతీతిఖపురః. ఇంద్రియములను వ్యాపించునది, పోకజబర,పోకమ్రాను, మ్రానిబంక, నాగముస్తె, పోకపొత్తి, పోక చెక్క.
ఖర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖమింద్రియం రాత్యభి భవతీతి ఖరం. ఇంద్రియక్షోభమును కలిగించునది. ఖంముఖాంతర్వర్తి మహదాకాశ మేషామస్త్రీతిఖరాః. గాడిదల వ్రేళ్ళు డావరడంగి చెట్టు, ఒక సంవత్సరము, ఎండుపోక, వాడిమి, వేడిమి, ఎండు పోక చెక్క, శారవృక్షము, గాడిదె, గట్టిది, కారం, పులుపు, చేదు, ఉప్పు కలిసినది, తెల్ల కలువ.
ఖరణసుడు
సం. విణ. (స్. అ.ఆ.అ). తత్స. ఖరణా స్స్యాత్ఖరణసః. వాడిముక్కు కలవానివేళ్ళు, వాడియైన ముక్కుకలవాడు, గద్దముక్కుకలవాడు, సూది ముక్కుకలవాడు.
ఖరపుష్పా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తీక్ష్ణ పుష్పత్వాత్ఖరపుష్పా. తీక్షణమైన పువ్వులుకలది, వాయింట.
ఖరమంజరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఖరాస్త్రీక్ష్ణామంజర్యోస్యా ఇతి ఖరమంజరీ” తీక్షణము లైన పూగుత్తులుకలది, ఉత్తరేణి వేళ్ళు, ఉత్తరేను.
ఖరాశ్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖరత్వముష్ణత్వ మశ్నుత ఇతి ఖరాశ్వా. ఉష్ణత్వమును పొందునది, ఓమము.
ఖరీకము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఖార్యావాపః ఖారీకః. పుట్టెడు విత్తనాలు విత్తుపొలము. పుట్టెడు విత్తులు విత్తదగినది. (పొలము). భారీ విత్తులు పట్టు భూమి.
ఖర్జువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. ఖర్జయతి వ్యథయతి ఖర్జూః. వ్యథపెట్టునది, తీట, ఒకానొకపురుగు, చిట్టీదు, దురద.
ఖర్జూరము
సం. నా. వా. ఆ. న. తత్స. ఖర్జయతి రక్తపిత్తమితి ఖర్జూరః. రక్తపిత్తాదులను పోగొట్టునది, వెండి, తేలు, పేరీదు, ధాన్య విశేషము. ఖర్జతే పీడ్యత ఇతి ఖర్జూరం. అగ్ని సంతాపాదుల చేత పీడింపబడునది. గంధక పాషాణము, మండ్రకప్ప.
ఖర్జూరీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఖర్జయతి రోగం ఖర్జూరీ. రోగమును పోగొట్టునది. సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. చిట్టీదు (వృక్ష విశేషము).
ఖర్వము
సం. నా. వా. ఆ. న. తత్స. ఖర్వతి వికలాం గాపేక్షయా శ్రేష్ఠత్వేన దృప్యతి ఖర్వః. వికలాంగుని కంటె శ్రేష్ఠుడుఔట చేత గర్వించువాడు. ఖర్వత్యవయవదార్థ్యేనేతి ఖర్వః. అవయవ దార్ధ్యము చేత గర్వించునది. సంఖ్యా విశేషము, అధమము, పొట్టి.
ఖలపూవు
సం. విణ. (ఊ. ఊ. ఉ). తత్స. ఖలం పునాతి ఖలస్థ ధాన్యం నిశ్శేషం గహ్ణాతీతి ఖలపూః. కళ్లమును చక్క చేయువాడు.
ఖలము
సం. నా. వా. అ. న. తత్స. ఖలతి ధర్మాదితి ఖలః. ధర్మము వలన చలించువాడు, చోటు, నేల, పాపము, కళ్ళము, అధమము, క్రూరము, పెరుగు, మోసగాడు, నీచుడు, జారిణి, భూమి.
ఖలిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఖలానాం సమూహః ఖలినీ. కళ్లముల సమూహము, ముర అనెడు గంధద్రవ్యము (వృక్షవిశేషము).
ఖలీనము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖేముఖవివరేలీనోవా ఖలీనః. ముఖవివరమందు లీనమై ఉండును, గుఱ్ఱము కళ్లెము. ఖలతి చలతీతి ఖలీనః. కదలునది. ఖే అశ్వముద్రఛిద్రే లీనః ఖలీనః. కవిక.
ఖల్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖలానాం సమూహః ఖల్యా. కళ్లములగుంపు, సమూహము.
ఖాతము
సం. నా. వా. అ. న. తత్స. పుష్కరిణి, కోనేఱు.
ఖాదితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఖాద్యతేస్మ ఖాదితం. భుజింపబడునది, భక్షించుట, తినబడినది.
ఖారీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఖం మహదాకాశ మస్యా ఇతి ఖారీ. లోపల మిక్కిలి బయలు కలది, పుట్టి, ఇద్దుము, రెండువాహములు, ఒక మానము, 4 గోనెలు.
ఖిలము
సం.విణ.(అ.ఆ.అ) .తత్స. హలేన నలిఖితమి తిఖలం. నాగటి చేత దున్నబడనిది. దున్ననిది (నేల), చెడినది (దున్నని నేలయను అర్ధమునందు నపుంసకమని కొందఱు). వేదభాగము, బంజరు భూమి.
ఖురణసుడు
సం. విణ. స్. (అ.ఆ.అ). తత్స. ఖరణాస్స్యాత్ఖరణసః. పొట్టివాని వేళ్ళు, బుఱ్ఱముక్కువాడు, చప్పిముక్కు కలవాడు.
ఖురము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖురతి భూతాని హంతీతిఖురః. భూతములను సంహరించునది. ఖురతి భువం ఖురః. భూమిని ఛేదించునది, గొరిజ, నఖమనెడు గంధద్రవ్యము. గిట్ట, శంఖ నఖము.
ఖేటము
సం. నా. వా. అ. పుం. తత్స. ఖట్యతే సర్వైరితి ఖేటః. అందరిచేతను వెఱపింపబడువాడు, పంటకాపులుడెడు పల్లె. వర్తకులుండెడు పేట, డాలువాఱు, కఫము, అధమము. ఖిట్యతే భయముత్పద్యతే అస్మాదనేన వా ఇతి ఖేడః. చిన్న నగరము, నింద్యము, పల్లె, నీచము.
ఖేయము
సం. నా. వా. అ. న. తత్స. అగడ్త.
ఖేలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఖేలనం ఖేలా. విహరించుట, క్రీడ, ఆట.
ఖోడుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఖోడతి హత గతిర్భవతి ఖోడః. కొట్టువడినగమనము గలవాడు, కుంటికాలివాని వేళ్ళు, కుంటివాడు, శని.
ఖ్యాతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఖ్యాయత ఇతి ఖ్యాతః. అందరిచేత కొనియాడబడువాడు, వాసికెక్కినది.
ఖ్యాతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ఖ్యానం ఖ్యాతిః. ప్రసిద్ధి, వాసి, కీర్తి, బుద్ధి.