హల్లులు : శ
శంకరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శం సుఖం కరోతీతి శంకరః. సుఖమును కలుగచేయువాడు, శివుడు. శం కల్యాణం సుఖం వా కరోతీతి శంకరః. మహాదేవుడు, శంభువు.
శంకువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శంకతే అస్మాత్పురుషధియా శంకుః. పురుష బుద్ధిచేత దీని యందు శంకింతురు, మోడు. శంకతే అస్మాల్లోకః శంకుః. దీనిచేత లోకము శంకించును, నీరుపంది. శంకతే 2 స్మాత్ శంకుః. దీని వలన శంకింతురు, వసివేళ్లు, మోడు, సంఖ్యా విశేషము. శంక్యతే లక్ష్యతే అస్మాదితి శంకుః. కీలకము, మత్స్యవిశేషము, ఒక రాక్షసుడు, బాతు, చీల, మురికి, శిస్నము, లక్షపోట్లు, ఆకు ఈనె.
శంఖనఖము
సం. నా. వా. అ. పుం. తత్స. శంఖాః నఖా ఇవ శంఖనఖాః. నఖముల వంటి శంఖములు, క్షుద్రశంఖము, నత్తగుల్ల, చిన్నశంఖము.
శంఖము
సం. నా. వా. అ. పుం. న. తత్స. దుఃఖం శమయతీతి శంఖః. దుఃఖమును శమింపచేయునది. శామ్యత్యశుభమనేనేతి శంఖః. అశుభములు దీనిచేత శమించును. శంఖ సామ్యాచ్ఛంఖః. శంఖ సామ్యము కలది. శమయతి దుఃఖమితి శంఖః. దుఃఖమును శమింపచేయునది, కుటిలము, ఒక నిధి, ఒక సువాసన ద్రవ్యము, ఒక సంఖ్య, కంకణము, అమావాస్య, ఒక పాము.
శంఖిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శంఖాభపుష్ప యోగాత్ శంఖినీ. శంఖము వంటి పువ్వులు కలది, కట్లతీగ, పద్మపుతీగ, స్త్రీ జాతి విశేషము. (చూ. జాతి). పద్మలత.
శంపము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భయంకరత్వా చ్ఛం సుఖం పిబతీతి శంపా. భయమును కలిగించునదిగాన సుఖమును మ్రింగివేయునది, మెరుపు (రూ. సంప). శంఖధ్వని, సౌదామని, ఐరావతి.
శంబము
సం. నా. వా. విణ. తత్స. శం శుభ మస్యాస్తితి శంబః. శుభము కలిగినట్టిది, సుఖముకలది, వజ్రాయుధము.
శంబరము
సం. నా. వా. అ. పుం. తత్స. శం సుఖం వృణోతీతి శంబరః. సుఖమును కప్పునది, చేప, ఎఱ్ఱని చిన్న జింక, ఎఱ్ఱజింక, ఒక రాక్షసుడు, నీరు.
శంబరారి
సం. నా. వా. ఇ. పుం. తత్స. మన్మధుడు, మరుడు.
శంబరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శం సుఖం వృణోతీతి శంబరీ. సుఖమును కప్పునది, ఎలుకజీడి. (వృక్షవిశేషము). (రూ. సంబరి).
శంబలము
సం. నా. వా. అ. పుం. తత్స. దారిబత్తెము (రూ. సంబలము), మాత్సర్యము, తీరము. శంబయత్యనేన శంబలః. తీరము, తటము, చెరువు.
శంబాకృతము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. అనులోమేన విలోమేన చ కృష్టం శంభాకృతం. అడ్డమొక చాలును నిడుపొకచాలును దున్నిన భూమి, రెండుచాళ్లు దున్నినది (నేల).. (రూ.సంబాకృతము). రెండుసార్లు దున్నబడిన భూమి.
శంబూకము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శామ్యతి దుఃఖం శంబూకాః. దుఃఖమును శమింపచేయునది, కప్పచిప్ప, జలజంతువిశేషము, దుశ్చరము, ఒక గుల్ల, నూకలు, తవుడు.
శంభళి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శం శ్రేయః భాలయతి హినస్తి శంభళీ. శ్రేయస్సును చెఱుచునది, కుంటెన కత్తె, కుట్టని. శభ్యం కల్యాణయుక్తం నాయకాదికం లాతి గృహ్ణాతీతి శంభలీ.
శంభువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శం సుఖం భవ త్యస్మాదితి శంభుః. ఇతని వలన సుఖము కలుగును, శివుడు, విష్ణువు, బ్రహ్మ, బుద్ధదేవుడు. శం మంగళం భవత్యస్మాదితి శంభుః. మహాదేవుడు, శంకరుడు, అగ్ని.
శకటము
సం. నా. వా. అ. పుం. న. తత్స. శక్నోతి భారమితి శకటః. భారమును వహించుటకు సమర్ధమైనది, బండి, రెండువేల పలముల పరిమాణము, తినాసము. (వృక్ష విశేషము). శక్నోతి భారం వోఢుమితి శకటః. భారము, ఒక దుంప.
శకలము
సం. నా. వా. అ. న. తత్స. శక్తతే భేత్తుమితి శకలం. భేదింపశక్యమైనది, చెట్టు మీది పట్ట, నార, రాగద్రవ్యము. శక్నోతీతి శకలం, ముక్క, బెరడు.
శకుంతము
సం. నా. వా. అ. పుం. తత్స. శక్నోతి గంతుమితి శకుంతః. పోవుటకొఱకు సమర్ధమయినది, పక్షి, భానపక్షి, ఒకదినుసు పురుగు. శక్నోతి ఉత్పతితుమితి శకుంతః. గాలిపగడ.
శకుంతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గంతుం శక్నోతీతి శకుంతిః. పోవుట కొఱకు సమర్ధమయినది, పక్షి, పులుగు, శకుంతము. శక్నోతి ఉత్పతితుమితి శకుంతిః.
శకునము
సం. నా. వా. అ. న. తత్స. గంతుం శక్నోతీతి శకుంతిః, శకునిః, శకుంతః, శకునశ్చ. పోవుట కొఱకు సమర్ధమయినది, శుభసూచకనిమిత్తము, వలను, పక్షి, శకసునము.
శకుని
సం. నా. వా. ఈ. స్త్రీ. ఇ. పుం. తత్స. గంతుం శక్నోతీతి శకుంతి, శకునిః. నల్ల పిచ్చుక, పక్షి, ఒక కరణము (చూ. కరణము). దుర్యోధనుని మేనమామ. శక్నోతి ఉన్నేతుమాత్మానామితి శకునిః. పక్షి విశేషము, విహగము.
శకులము
సం. నా. వా. అ. పుం. తత్స. శక్నోతిగంతుం శకులః. వేగిరముగా పోవుటకు శక్తమయినది, మత్య్సవిశేషము, బేడిన. శక్నోతి గంతుం వేగేనేతి శకులః.
శకులాక్షకము
సం. నా. వా. అ. పుం. తత్స. మత్స్యనయన తుల్య గ్రంథియోగాచ్ఛకు లాక్షకః. చేప కండ్ల వంటి కనుపులు కలది, తీగ గఱిక. (వృక్ష విశేషము). ఒక వృక్షము.
శకులాదని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శకులానాం అదనం శకులాదనీ. మత్స్యములకు భక్షణమైనది, కటుక రోహిణి. (వృక్షవిశేషము). శకులైర్మత్స్యైరద్యతే శకులాదనీ. మత్స్యముల చేత భక్షింపబడునది, నీరు పిప్పలి. (వృక్షవిశేషము).
శకులార్భకము
సం. నా. వా. అ. పుం. తత్స. శకుల అర్భక ఇవ శకులార్భకః. పిల్ల వంటి మీను శకులార్భకము, కుచ్చుమీను, ఒక చేప.
శకులి
సం. నా. వా. న్. పుం. తత్స. మత్స్యానాం కవచప్రాయా స్ధూల త్వక్ శకులః, తద్యోగాచ్చకులీ. మత్స్యములకు కవచప్రాయమై స్ధూలమైయుండు చర్మము శకులము, అది కలిగినది శకులి, మత్స్యము, చేప. (రూ. శకిలి).
శకృత్కరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శకృత్కరోతీతి శకృత్కరిః. వేడబెట్టునది, ఏడాదిలోన దూడ, వత్సము.
శకృత్తు
సం. నా. వా. త్. న. తత్స. శక్నోతి అనేనకృత్ ఇతి శకృత్. దీనిచేత శక్తుడౌను, విష్ఠ, మలము, పురీషము. శక్నోతి సర్తుమితి శకృత్.
శక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శక్యతే శక్తిః. దీనిచేత శక్తుడౌను, బలిమి. శక్యతే అనయా జేతు మితిశక్తిః. దీనిచేత గెలువ శక్యమౌను, పార్వతి, చిల్లకోల, ఇచ్ఛాది. (ఇవి మూడు:- ఇచ్ఛాశక్తి, ఙ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తికి ద్రవ్యశక్తిఅనియు పేరు). ఉత్సాహాది. (ఇవి మూడు:- ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము). సత్యాది. (ఇవి మూడు:- సత్వము, రజస్సు, తమస్సు). శక్యతే జేతుమనయా ఇతి శక్తిః. శౌర్యము, పరాక్రమము,లక్ష్మి, మూలకారణము, బ్రబుమంత్రోత్సహ శక్తులు.
శక్తిధరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శక్తేర్ధరశ్శక్తిధరః. శక్తి అను ఆయుధమును ధరించినవాడు, కుమారస్వామి.
శక్రధనువు
సం. నా. వా. స్. న. తత్స. శక్రస్య ధనుః శక్రధనుః. శక్రుని ధనస్సు, ఇంద్రాయుధము.
శక్రపాదపము
సం. నా. వా. అ. పుం. తత్స. శక్రస్య ప్రియః పాదపః శక్రపాదపః. ఇంద్రునికి ప్రియమైన వృక్షము, దేవదారువు.(వృక్షవిశేషము).
శక్రపుష్పి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శక్ర ప్రియపుష్పత్వాత్ శక్రపుష్పీ. ఇంద్రునికి ప్రియమైన పుష్పము కలది, వెన్నవెదురుకూర.
శక్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శక్నోతి దుష్టజయ ఇతి శక్రః. దుష్ట జయమునందు శత్రువు. శక్రవృక్షత్వాచ్ఛక్రః. ఇంధ్రసంబంధమైన వృక్షము, ఇంద్రుడు. శక్నోతి దైత్యాన్ నాశయితుమితి శక్రః.
శచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శచతి హంసవద్గచ్ఛతీతి శచీ. హంసవలె నడుచునది, ఇంద్రుని భార్య, పిల్ల పీచర. (వృక్షవిశేషము). ఇంద్రాణి.
శచీపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శచ్యాః పతి శ్శచిపతిః. శచీదేవికి భర్త, ఇంద్రుడు, వేల్పుఱేడు.
శఠుడు
సం. నా. వా. విణ. తత్స. శఠతీతి శఠః. కపటము గలవాడు, కుత్సితుడు, ధూర్తుడు.
శణపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శణన్యేవ పర్ణాన్యస్యా శ్శణపర్ణీ. జనుము ఆకుల వంటి ఆకులు కలది, సోమిదము. (వృక్షవిశేషము).
శణపుష్పిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శణన్యేవ పుష్పాణ్యస్యాః శణపుష్పికా. జనుము వంటి పువ్వులుకలది, కారుజనము. (ఇదే గిలక చెట్టు). (వృక్షవిశేషము).
శణసూత్రము
సం. నా. వా. అ. న. తత్స. శణ ఆదానం తస్యసూత్రం శణసూత్రం. మత్స్యాదులను ఈడ్చెడు సూత్రము, జనపనారతో అల్లిన వల త్రాడు.
శతకోటి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శతం కోటయో ధారా యస్యసః శతకోటిః. నూరంచులు కలది, వజ్రాయుధము.
శతద్రువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. శితం తీక్ష్ణం ద్రుతా శివద్రుః. తీవ్రముగా ప్రవహించునది, నూఱుపాయలై పాఱెడి ఒకానొకనది. (రూపాంతరము. శితద్రువు).
శతధృతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. బ్రహ్మ, ఇంద్రుడు.
శతపత్రకము
సం. నా. వా. అ. పుం. తత్స. బహు పక్షత్వాత్ శతపత్రకః. అనేకములైన ఱెక్కలుకలది, బెగ్గురు, నెమలి, వడ్రంగి పిట్ట, రాచిలుక.
శతపత్రము
సం. నా. వా. అ. న. తత్స. శతం పత్రాణ్యస్య శతపత్రం. నూఱుఱేకులు కలది, తామర. శతం పత్రాణి యస్యేతి శతపత్రం, కంసాలి పిట్ట.
శతపది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శతం పాదా అస్యేతి శతపదీ. నూఱు కాళ్లుకలది, కట్లజెఱ్ఱి, చెవి చొరుపాము, రోకటిబండ.
శతపర్వము
సం. నా. వా. న్. పుం. తత్స. శతం అనేకాని పర్వాణ్యన్యేతి శతపర్వా. అనేకములైన కనుపులు కలది, వెదురు, ఒక దినుసు చెఱకు. (వృక్ష విశేషము). బచ్చలి, గోధుమ, కలువకాడు, దూర్వాగడ్డి, రంధ్రము.
శతపర్విక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శతం పర్వాణ్యస్యామితి శతపర్వికా. నూఱు కనుపులు కలది, గఱిక, వన. (వృక్షవిశేషము).
శతపుష్ప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బహు పుష్పత్వాచ్ఛతపుష్పా. బహుళమైన పువ్వులు కలది, సదాప. (వృక్షవిశేషము).
శతప్రాసము
సం. నా. వా. అ. పుం. తత్స. శతం ప్రాసా ఇవ తీక్ష్ణాని కుట్మలాన్యస్య శతప్రాసః. అనేకములైన ఖడ్గముల వలె తీక్ష్ణములైన మొగ్గలు కలది, గన్నేరు. (వృక్షవిశేషము).
శతమన్యువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శతం మన్యవో యస్య శతమన్యుః. నూఱు క్రతువులు కలవాడు, ఇంద్రుడు.
శతమానము
సం. నా. వా. అ. న. తత్స. వలము, కర్షద్వయము, నూటికొలది. పది వెండిధరణములు.
శతము
సం. నా. వా. అ. న. తత్స. దశ దశ గుణం శతం. నూఱు, వంద.
శతమూలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శతం బహూని మూలాన్యస్యా శ్శతమూలీ. అనేకములైన వేళ్లు కలది, పిల్లపీచేర. (వృక్షవిశేషము). శతావరీ.
శతవీర్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శతం వీర్యాణి ప్రసరణరూపాణ్యస్యా ఇతిశత వీర్యా. నూఱువిధములుగా ప్రాకునది, తెల్ల గఱిక. (వృక్షవిశేషము), తీగగఱికె.
శతవేధి
సం. నా. వా. న్. పుం. తత్స. శతంరోగాన్ విధ్యతీతి శతవేధీ. నూఱురోగములను పోగొట్టునది, పుల్లప్రబ్బ. (వృక్షవిశేషము).
శతహ్రద
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శతధాహ్రా దతే శత హ్రదా. అనేకవిధములుగా అస్ఫుటమై మ్రోయుచుండునది, మెఱుపు, వజ్రాయుధము. శతం హ్రదా అర్వీషి యస్యాః శతహ్రదా. చపల, విద్యుత్తు.
శతాంగము
సం. నా. వా. అ. పుం. తత్స. శతం అఙ్గౌన్యన్యేతి శతాఙ్గః. వంద అవయవములు కలది, యుద్ధమునకు ఉయోగించెడు రథము. శతం అంగాని అవయవా యస్య సః శతాంగః. రథము, శకటము.
శతానందము
సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణురథము. శతం బహులాః ఆనందా యస్య సః శతానందః. బ్రహ్మ, విధాత, విష్ణువు, ఒక ఋషి.
శతావరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శతమూలైర్భువం ఆవృణోతీతి శతావరీ. అనేకములైన వేళ్లచేత భూమిని ఆవరించునది, పిల్లపీచర (వృక్షవిశేషము), శచీదేవి, శతమూలి.
శత్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శత్రురేవ శాత్రవః. కృశముగా చేయువాడు శత్రువు, పగవాడు, దండెత్తి పోవు వాని దేశమునకు ఆవలి దేశపురాజు. (శత్ర్వాదిరాజమండలము – శత్రుమిత్రులు, తన్మిత్రులు, తన్మిత్రమిర్రులు, పార్ష్ణిగ్రాహుడు, ఆక్రందనుడు, ఆసారులిరువురు, మధ్యముడు, ఉదాసీనుడు, పన్నిద్దఱు). రిపువు, ప్రత్యర్థి, ద్వేషి, ప్రతిపక్షమువాడు, విరోధి.
శని
సం. నా. వా. ఇ. పుం. తత్స. శనైర్మందం చరతీతి శనైశ్చరః. మెల్లగా సంచరించువాడు, శనైశ్చరుడు, ఒక గ్రహము.
శనైశ్చరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శనైర్మందం చరతీతి శనైశ్చరః. మెల్లగా సంచరించువాడు, ఒక గ్రహము, శని. కక్షాదీర్ఘత్వాత్ శనైర్మందంమందం చరతీతి శనైశ్చరః.
శపథము
సం. నా. వా. అ. పుం. తత్స. శపతి విశ్వసత్యనేనేతి శపథశ్చ. దీనిచేత జనము విశ్వసించును, ఒట్టు, శపనము, సత్యము, సమయము, శాపము, ప్రత్యయము, ప్రతిజ్ఞ, నింద, తిట్టు.
శపనము
సం. నా. వా. అ. న. తత్స. శపతి విశ్వసత్యనేనేతి శపనం. దీనిచేత జనము విశ్వసించును, ఒట్టు, శపనము.
శఫము
సం. నా. వా. అ. పుం. తత్స. శాయతే భువా శఫం. భూమిచేత అల్పముగా చేయబడునది, గుఱ్ఱములోనగు వానిగొరిసె, చెట్టువేరు, డెక్క.
శఫరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శఫాన్ గతిసాధనావయవాన్ రిణాతి పీడయతీతి శఫరీ. శపములనగా గొరిసెలు, ఎగిసిపడెడు మత్స్యము, నేరేడు, ఒక చేప.
శబరాలయము
సం. నా. వా. అ. పుం. తత్స. తేషామాలయశ్శబరాలయః. భ్రమించువారు శబరులు, బోయపల్లె, పక్కణము. శబరస్య ఆలయః శబరాలయః.
శబరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శవతి గచ్ఛతి వనమితి శబరః. అడవినితిరుగువాడు, ఆకులు కట్టుకొని అడవియందు తిరిగెడు బోయవాడు, శివుడు, ఒక దేశము, ఒక సంకరజాతి.
శబలము
సం. నా. వా. అ. పుం. తత్స. శబతి నానావర్ణానితి శబలః. అనేక వర్ణములనుపొందునది, చిత్రవర్ణము
శబలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శబళ వర్ణత్వాత్ శబళి. నానావర్ణములు కలది, మైలవన్నెఆవు, మచ్చల ఆవు.
శబ్దగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహతే అనేన గ్రహః, శబ్దస్య గ్రహః, శబ్దగ్రహః. శబ్దము దీనిచేత గ్రహింపబడును, చెవి, శ్రోత్రము.
శబ్దనుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శబ్దాయతే తాచ్ఛీల్యేనేతి శబ్దనః. స్వభావముననే మ్రోయువాడు, శబ్దించువాడు, ధ్వని చేయువాడు.
శబ్దము
సం. నా. వా. అ. పుం. తత్స. శప్యతే అనేనేతి శబ్దః. దీనిచే ఆక్రోశింపబడును. శపయత్యవగమయత్యర్ధమితి శబ్దః. అర్ధము ఎఱింగించునది, ధ్వని, వ్యాకరణ శిక్షితమైన మాట, నినాదము, ధ్వని, రవము, నాదము, ఘోష, సంరావము. ఆకాశగుణము, వర్ణము, కీర్తి, పాట, వాక్యము, వినుట.
శమథము
సం. నా. వా. అ. పుం. తత్స. శమనం శమథః. శాంతి, నిశ్చలత.
శమన స్వస
సం. నా. వా. ఋ. స్త్రీ. తత్స. శమనస్య యమస్య స్వసా శమనస్వసా. యముని చెల్లెలు, యమునా నది.
శమనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శమయతి ప్రాణిన ఇతి శమనః. ప్రాణులను నశింపచేయువాడు, కాలుడు, యముడు. శమయతి పాపినాం కర్మ ఆలోచయతీతి శమనః. సమవర్తి, దండధరుడు, మృగభేదము, యజ్ఞ పశువును చంపుట.
శమము
సం. నా. వా. అ. పుం. తత్స. శమ్యతే ఇతి శమః. కామక్రోధాదులు లేక అడంగియుండుట, శాంతి, మోక్షము, సంయమము, శాంతరసస్థాయిభావము, నిశ్చలత.
శమలము
సం. నా. వా. అ. న. తత్స. శ్యామతి శమలం. నశించునది, విష్ఠ, పురీషము. ఉచ్చారము, అవస్కరము, మలము, పాపముమున్నగునవి.
శమి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శామ్యతి సస్యవృద్ధి రస్యాం సత్యాం శమీ. ఇది కలుగగా సస్యవృద్ధి శమించును, జమ్మి (వృక్షవిశేషము). పెసలులోనగువానిపై పొట్టు, లక్ష్మి, సముద్ర, సుభద్ర, శంకరి, జమ్మి, ఎన్ను.
శమితము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శామ్యతే స్మ శమిత. శమింపబడినది, శమించినది, శాంతిపచేయబడినది.
శమీధాన్యము
సం. నా. వా. అ. న. తత్స. శమీ సహితం ధాన్యం శమీధాన్యం. పొట్టు కలిగిన ధాన్యము, మినుములు మొదలైన కాయధాన్యము.
శమీరము
సం. నా. వా. అ. పుం. తత్స. అల్పా శమీ శమీరః. చిన్నదైన జమ్మి, నేలజమ్మి. (వృక్షవిశేషము).
శమ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శమయతి బలీవర్దాదిదౌష్ట్యమితి శమ్యా. బలీవర్దాది దౌష్ట్యమును పోగొట్టునది, తమిరె చీల, యజ్ఞపాత్ర విశేషము. శమ్యతే అనయేతి శమ్యా. కాడి చీల.
శమ్యాకము
సం. నా. వా. అ. పుం. తత్స. శమీం అకత్యనుగచ్ఛతీతి శమ్యాకః. జమ్మిని అనుకరించునది, ఱేల, అరగ్వధము, రేల చెట్టు (వృక్షవిశేషము).
శయనము
సం. నా. వా. అ. న. తత్స. శేతే శయనం. నిద్రించుట, నిద్ర. శయనీయం శయనం. దీనియందు నిద్రింతురు, శయ్య, సురతము, తల్పము, నిద్ర, మైథునము, పడక.
శయనీయము
సం. నా. వా. అ. న. తత్స. శయ్య.
శయము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వకీయ ధనమత్ర శేతే తిష్ఠతీతి శయః. తన ధనము దీనియందుండును, చేయి, శయ్య, పాము. శేతే సర్వమస్మిన్నితి శయః. హస్తము, పాణి, సర్పము, నిద్ర, బల్లి, కలసి పరుండుట.
శయాళువు
సం. నా. వా. విణ. తత్స. శేతే తాచ్ఛీల్యేనేతి శయాళుః. నిద్రపోవు స్యభావము కలవాడు, నిద్రపోతు, నక్క, సోమరి.
శయితుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శేతేస్మ శయితః. నిద్రించువాడు, నిదురపోతు, నక్క, సోమరి.
శయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శేతే అత్యర్థం శయుః. మిక్కిలి నిద్రించునది, పెనుపాము, వాహసము. ఋషివిశేషము, కొండచిలువ.
శయ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శేతే అస్యామితి శయ్యా. దీని యందు నిద్రింతురు, పడక, పదగుంఫనము, విధము, శయనము, తల్పము, పదములకూర్పు.
శరజన్ముడు
సం. నా. వా. న్. పుం. తత్స. శరాఖ్యే తృణే జన్మ యస్య సః శరజన్మా. ఱెల్లునందు జన్మించినవాడు, కుమారస్వామి, ఱెల్లుచూలి. శరే శరవణే జన్మ యస్య సః శరజన్మా. నందనుడు.
శరణము
సం. నా. వా. అ. న. తత్స. శీర్యతే శృణాతి దుఃఖాదికమితి శరణం. నశించునది, శిక్షకము, రక్షణము, గృహము, వధము, నీరుమున్నగునవి.
శరత్తు
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శీర్యతే జగ దనయేతి శరత్. జగత్తు దీనిచేత దుఃఖపెట్టబడును. శర్యతేవ యః ప్రాణినామితి వా శరత్. ప్రాణుల వయస్సు దీనిచేత జీర్ణమగుచున్నది, సంవత్సరము. శృణాతి పంకమితి శరత్. పంకమును పోమొత్తునది, ఒక ఋతువు, వత్సరము, వర్షము.
శరభము
సం. నా. వా. అ. పుం. తత్స. శం సుఖం వృణోతీతి శంబరః. సుఖమును కప్పునది, మీగండ్ల మెకము, ఒంటె, ఒక మృగము.
శరము
సం. నా. వా. అ. న. తత్స. బాణము, ఱెల్లు (వృక్షవిశేషము), జలము, మీది పెరుగు. (అడుగు పరుగు ద్రప్సము, నడిమి పెరుగు ఘనము). శృణాత్యనేనేతి శరః. కాండము, శరద్వాయువు, గుంద్రావృక్షము.
శరవ్యము
సం. నా. వా. అ. న. తత్స. శరైః వీయత ఇతి శరవ్యం. బాణముల చేత కప్పబడునది, గుఱి, లక్ష్యము. శరవే హింస్రాయ బాణశిక్షాయై వా సాధురితి శరవ్యం. నిమిత్తము, లక్ష్యము.
శరారి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శరం నీరం హింసాం వా బుచ్చతి శరారిః. నీటిని గాని హింసను గాని పొందునది, జలపక్షి విశేషము. ఆడేలు. శరం జలం రుచ్ఛతీతి శరారిః.
శరారువు
సం. నా. వా. విణ. (ఉ). తత్స. శృణాతి తాచ్ఛీల్యేనేతి శరారుః. స్వభావముననే చంపెడువాడు, చంపునది, ఘాతుకము, కితవుడు, కిరాతకుడు.
శరావతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శరాఖ్యః తృణవిశేషః అస్యామతి శరావతీ. శరమనగా ఱెల్లు కలిగనది, నది విశేషము.
శరావము
సం. నా. వా. అ. పుం. తత్స. శరం పతదుదకాదిక మవతీతి శరావః. పడునట్టి నీళ్లు మొదలయిన దానిని రక్షించునది, మూకుడు. శరం జలం అవతి రక్షతీతి శరావః. మట్టితో చేసిన పాత్ర.
శరాసనము
సం. నా. వా. అ. న. తత్స. కర్ణస్య శరాసనమ్. కర్ణుని విల్లు, ధనస్సు, చాపము, విల్లు.
శరీరము
సం. నా. వా. అ. న. తత్స. శీర్యత ఇతి శరీరం. నశించునది, దేహము, గాత్రము, మేను. శీర్యతే రోగాదినా యదితి శరీరం. విగ్రహము, కాయము, తనువు, పురము, ఘనము, అంగము, పిండము, పంజరము, ఆత్మ, కరణము, బంధము, వ్యాధిమందిరము.
శరీరి
సం. నా. వా. న్. పుం. తత్స. శరీరిమస్యాస్తీతి శరీరీ. శరీరము కలది, జంతువు, మేతాలుపు.
శర్కర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శృణాతీతి శర్కరా. పీడించునది కనుక శర్కర, మొరము. శీర్యత ఇతి శర్కరా. కరిగిపోవునది, చక్కెర, మొరపనేల, పెంచిక, వ్రయ్య, తెవులువగ, గులకరాయి, ఒక వ్యాధి, తునుక, బెల్లము, గులకరాళ్లుగలదేశము.
శర్కరిలము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శర్కరా అస్మిన్న స్తీతి శర్కరిలః. మొరము దీనియందు కలదు, గులకరాతినేల.
శర్మము
సం. నా. వా. న్. న. తత్స. శృణా త్యశుభమితిశర్మ. అశుభమును చెఱుచునది, సంతోషము, సౌఖ్యము. సం. నా. మ. అ. పుం. తత్స. బ్రాహ్మణుల పట్టపుపేరు. సం. నా. మ. విణ. తత్స. సంతోషము కలది.
శర్వరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శృణాతి వ్యాపారం దినం వా శర్వరీ. వ్యాపారమును గాని దినమును గాని చెఱుచునది, రాత్రి, పసుపు, ఆడుది. శృణాతి చేష్టాం ఇతి శర్వరీ.
శర్వాణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శర్వస్య పత్నీ శర్వాణీ. శర్వుని భార్య, పార్వతి, గట్రాచూలి. శర్వస్య శివస్య భార్యా శర్వాణీ. ఉమ, శివ, భవాని, దుర్గ, సర్వాణి.
శర్వుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రళయే భూతానిశృణాతి హీన స్తీతి శర్వః. ప్రళయ మందు భూతములను హింసించువాడు, శివుడు, ముక్కంటి. శృణాతి సర్వాః ప్రజాః సంహరతి ప్రళయే, సంహారయతి వా ఙక్తానాం పాపాని ఇతి శర్వః. శంకరుడు, మహాదేవుడు, ఉమాపతి, శంభువు, ముక్కంటి, రుద్రుడు.
శలభము
సం. నా. వా. అ. పుం. తత్స. శలత్యాశు గచ్ఛ త్యగ్నిం శలభః. అగ్నిని గూర్చి శీఘ్రముగా పోవునది, పచ్చిక యందు సంచరించెడు ఒక పురుగు, మిడుత, ఏదుపందిముల్లు.
శలము
సం. నా. వా. అ. పుం. న. తత్స. శలతీతి శలం. వేగముగా పోవునది, ఏదుపందిముల్లు, గాడిద, శివపూజకుడు.
శలలము
సం. నా. వా. అ. న. తత్స. శలతీతి శలలం. వేగముగా పోవునది, ఏదుపందిముల్లు.
శలాటువు
సం. నా. వా. ఉ. విణ. పుం. తత్స. శల శ్చాసౌ అటుశ్చ శలాటుః. పుష్టిని పొందునది, పండనిది. (కాయ). ఒక దినుసువేరు.
శల్కము
సం. నా. వా. అ. న. తత్స. శలతి పృథగ్గచ్ఛతీతి శల్కం. వేరుముగా పోవునది, ఖండము, నార, చేపమీది పొలుసు, బెరడు, ముక్క.
శల్యము
సం. నా. వా. అ. న. తత్స. శల త్యంతః శల్యం. శీఘ్రముగా చొచ్చునది, ఎముక, బాణము, శలాక, విషము.
శల్యము
సం. నా. వా. అ. పుం. తత్స. శల్యం కంటకమస్యాస్తీతి శల్యః. ముండ్లు కలది, మంగ చెట్టు. శలతీతి శల్యః. తిరుగునది, ఏదుపంది. సం. నా. వా. అ. న. తత్స. శలతి చలతీతి శల్యం.
శవము
సం. నా. వా. అ. పుం. న. తత్స. శవ త్యస్మాజ్జీవ ఇతిశవం. దీని నుండి జీవము పోవును, పీనుగు.
శశధరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శశస్య ధరః శశధరః. కుందేటిని ధరించినవాడు, చంద్రుడు, శశి.
శశము
సం. నా. వా. అ. పుం. తత్స. శశతి ప్లుతేన గచ్ఛతీతి శశః. దాటుచు పోవునది, కుందేలు, చెవులపిల్లి, పడిసెము, బోళము, లొద్దుగుచెట్టు.
శశాదనము
సం. నా. వా. అ. పుం. తత్స. శశం అత్తీతి శశాదనః. కుందేటిని భక్షించునది, డేగ, శ్యేనము.
శశోర్ణము
సం. నా. వా. అ. న. తత్స. శశస్య ఊర్ణం శశోర్ణం. కుందేటి యొక్క వెండ్రుక, కుందేటి త్రుప్పుటితో నేయబడిన కంబళి, చెవులపిల్లిబొచ్చు.
శష్పము
సం. నా. వా. అ. న. తత్స. శస్యతే హింస్యతే పశుభిరితి శష్పం. పశువుల చేత హింసింపబడునది, లేతకసవు, నల్లగఱిక.
శస్తము
సం. నా. వా. విణ. తత్స. శస్యత ఇతి శస్తం. స్తోత్రము చేయబడునది, శ్రేష్ఠమైనది, ప్రశస్తము, శుభకరమైనది, స్థుతింపబడినది. సం. నా. వా. అ. న. తత్స. శుభము.
శస్త్రమార్జుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శస్త్రాణి మార్ ష్టీతి శస్త్రమార్జః. ఆయుధములను సానపెట్టువాడు, ఆయుధములను కడుగువాడు, కవచదారి.
శస్త్రము
సం. నా. వా. అ. న. తత్స. శస్యతే అనేనేతి శస్త్రం. దీనిచేత హింసింతురు, ఆయుధము, ఇనుము, కత్తి, సూక్తము.
శస్త్రాజీవుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శస్త్రేణ ఆజీవతి శస్త్రాజీవః. శస్త్రముల చేత బ్రతుకువాడు, ఆయుధీయుడు.
శస్త్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శస్యతే అనయా శస్త్రీ. దీనిచేత హింసింపబడును, చురకత్తి, మాదిగకత్తి. సం. నా. వా. విణ. తత్స. శస్త్రమును ధరించువాడు.
శాంఖికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శంఖస్య వికారః శాంఖం, తత్పణ్యమస్య శాంఖికః. శంఖము చేత చేసిన కడియములు మొదలైనవి అమ్మకపు సరుకులుగా కలవాడు, సంకుపూసలులోనగునవి చేసి అమ్మెడువాడు, శంఖమును ఊదువాడు.
శాండిల్యము
సం. నా. వా. అ. పుం. తత్స. శాండిల్యఋషివ ద్విప్రమాన్యత్వాత్ శాండిల్యః.శాండిల్యుడనెడి ఋషివలె బ్రాహ్మణ పూజ్యమైనది, మారేడు (వృక్షవిశేషము). ఒకముని.
శాంతము
సం. నా. వా. విణ. తత్స. శామ్యతే స్మ శమిత, శాంతశ్చ. శమింపబడినది, శాంతిపొదినది, ఒకరసము.
శాంతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శమనం శమధః, శమః, శాంతిశ్చ. కామక్రోధాదిరాహిత్యము, శమము, శాంతము.
శాంబరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శంబరస్యేయం శాంబరీ. శంబరుడను రాక్షసుని సంబంధమైనది, మాయ, రతీదేవి. శంబరస్య దైత్యవిశేషస్య ఇయం కృతిః శాంబరీ. మాయ, ఇంద్రజాలము.
శాకటము
సం. నా. వా. అ. పుం. తత్స. శకటం వహతీతి శాకటః. బండిని లాగునది, బండిఎద్దు, బండిగుఱ్ఱము, రెండు ఋక్షములు, పదిభారములు. శకటేన ఊహ్యతే శాకటః బండిచేమోయతగినది.
శాకము
సం. నా. వా. అ. న. తత్స. శక్యతే భోక్తుమనేనేతి శాకం. దీనిచేత భోజనము చేయుటకు శక్యమగును, కూర. (ఇది ఆకు, పువ్వు, కాయ లోనగు భేదములచే పది విధములు గలది). సం. నా. వా. అ. పుం. తత్స. టేకుచెట్టు, ఒక ద్వీపము, శక్తి.
శాకునికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శకునాన్ పక్షిణో హన్తీతి శాకునికః. పక్షుల చంపువాడు, పక్షుల వేటకాడు, జీవాంతకుడు.
శాక్తీకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శక్తిః ప్రహరణ మస్యేతి శాక్తికః. శక్తిఅను ఆయుధమును కలవాడు, శక్త్యాయుధమును ధరించినవాడు, వేటగాడు.
శాక్యముని
సం. నా. వా. ఇ. పుం. తత్స. శాక్యశ్చాసౌ మునిశ్చ శాక్యమునిః. శాకవనమందుండువాడు, శాక్యబుద్దదేవుడు.
శాక్యసింహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శాక్యశ్చాసౌ శాక్యేషు శాక్యసింహః. శాక్యబుద్దదేవుడు, శాక్యులలో శ్రేష్ఠుడు, శాక్యేఘ సింహః శ్రేష్ఠః శార్య సింహః.
శాఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శాఖతి దిశో వ్యాప్నోతీతి శాఖా. దిక్కులను వ్యాపించునది, చెట్టుకొమ్మ, వేదభాగము, చేయి. శాఖతి గగనం వ్యాప్నోతీతి శాఖా. చెట్టు యొక్క అంగవిశేషము, తీగ.
శాఖానగరము
సం. నా. వా. అ. న. తత్స. మూలనగరస్య తరుస్ధానీయస్య శాఖాసదృశత్వాత్ శాఖానగరం. తరుస్ధానీయ మైన ప్రధాన పట్టణమునకు కొమ్మవలె ఉండునది, ఉపనగరము, పేట. శాఖేవ నగరం శాఖానగరం. ఉపనగరము.
శాఖామృగము
సం. నా. వా. అ. పుం. తత్స. శాఖాచారీ మృగః శాఖామృగః. కొమ్మల యందు చరించు మృగము, కోతి, వానరము, ప్లవగము.
శాఖి
సం. నా. వా. న్. పుం. తత్స. శాఖాః అస్య సంతీతి శాఖీ. కొమ్మలు కలిగినది, వృక్షము, వేదము, తురక. శాఖస్త్యస్తేతి శాఖీ. తరువు, చెట్టు. సం. నా. వా. విణ. తత్స. అంతర్భాగముకలది.
శాఘ్కలికము
సం. నా. వా. అ. న. తత్స. శఘ్కలీనాం సమూహః శాఘ్కలికం. చక్కిలముల సమూహము.
శాటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. యతులులోనగువారి వస్త్రము, దుప్పటి. (రూ.శాటిక. ఆ.స్త్రీ). మెత్తని బట్ట.
శాఠ్యము
సం. నా. వా. అ. న. తత్స. శఠస్యభావః శాఠ్యం. శఠుని యొక్క భావము, శఠత్వము, కపటము.
శాణము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యతి స్వర్ణం తనూకరోతీతి శాణః. బంగారమును అరగదీయునది, సానఱాయి, (రూ.శాణి. ఈ.స్త్రీ). నాలుగు మాషముల ఎత్తు.
శాణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సాన. గోనె.
శాతకుంభము
సం. నా. వా. అ. న. తత్స. శత కుంభాఖ్యే పర్వతే భవం శాతకుంభం. శత కుంభమను పర్వతమున పుట్టినది, బంగారు, ఉమ్మెత్త.(వృక్షవిశేషము).
శాతమ
సం. నా. వా. విణ. తత్స. నిశాయతే స్మశాతం అరుగదీయబడినది, వాడిచేయబడునది, కృశించినది.
శాతము
సం. నా. వా. అ. న. తత్స. శ్యతి దుఃఖమితి శాతం. దుఃఖమును పోగొట్టునది, సుఖము, (రూ.సాతము). సౌఖ్యము.
శాత్రవము
సం. నా. వా. అ. న. తత్స. శత్రురేవ శాత్రవః. కృశముగా చేయువాడు శత్రువు, శత్రుత్వము, శత్రుసమూహము.
శాదము
సం. నా. వా. అ. పుం. తత్స. శీయతే పాదో అనేనేతి శాదః. దీనిచేత అడుగు కృశించును, లేతపచ్చిక, అడుసు. శీయతే పాదో అత్ర శాదః. పాదము దీనియందు కృశించును, అడుసు.
శాద్వలము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శాదో బాలతృణమస్మిన్న స్తీతి శాద్వలః. లేత కసవుకల దేశము, లేత పచ్చిక కలది, కడిమిడి. (దేశము) (రూ.శాడ్వలమ). పచ్చికబీడు.
శాబకము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యతి పిత్రోః దుఃఖమితి శాబకః. తల్లిదండ్రుల దుఃఖమును అల్పముగా చేయునది, శిశువు, పిల్ల, కూన. (మొదటిరూపము శాబము).
శాబరము
సం. నా. వా. అ. పుం. తత్స. శబర సంబంధిత్వాచ్ఛాబరః. సం. నా. వా. విణ. తత్స. శబర సంబంధమైనది, లొద్దుగు (వృక్షవిశేషము). శివకృత తంత్ర విశేషము.
శారద
సం. నా. వా. ఆ. స్త్రీ. పుం. తత్స. శరది పుష్ప్యతీతి శారదః. శరత్కాలమునందుపుంచినది ఏడాకులరటి. (వృక్షవిశేషము), సంవత్సరము. పచ్చపెసర, సరిక్రొత్తది, తామర, నిద్రభంగి. శరధిభవః శారదః శరత్తునందు పుట్టినది. ప్రతిభలేనిది.సరస్వతి, పార్వతి.
శారది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శరది భవా శారదీ. శరత్కాలము నందు పుట్టునది, ఏడాకులరటి, నీరు పిప్పలి. (వృక్షవిశేషము). కచోరము.
శారము
సం. నా. వా. అ. పుం. తత్స. శృణాతీతి శారః. హింసించునది, చిత్రవర్ణము, జూదపుసారె, వాయువు, గాలి.
శారిఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. శారీణాం ఫల శారిఫలం. సారెలుండు పలక, జూదమాడెడు పీట, నెత్తపలక.
శారిబ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శీర్యంతే అనయాదోషా ఇతి శారిబా. దోషములు దీనిచేత సంహరింపబడును, మామెన.
శార్కరము
సం. నా. వా. విణ. తత్స. శృణాతీతి శర్కరా.మొరము గలది. (నేల). సం. నా. వా. అ. పుం. తత్స. పాలనురుగు.
శార్ఞ్గము
సం. నా. వా. అ. న. తత్స. విష్ణువు యొక్క విల్లు, విల్లు. శృంగస్య వికారః శార్ఞ్గం. కాటుక పిట్ట.
శార్ఞ్గి
సం. నా. వా. న్. పుం. తత్స. శృజ్గస్యవికారః శార్జ్గంధనుః తదస్యాస్తీతి శార్జ్గీ. శార్ఞ్గమను ధనస్సు కలవాడు, విష్ణువు, శివుడు, శంభుడు, మహాదేవుడు.
శార్ధూలము
సం. నా. వా. అ. పుం. తత్స. శృణాతీతి శార్దూలః. హింసించునది, పులి, ఏట్రింత, పశుభేదము, పక్షివిశేషము, సింహము.
శార్వరము
సం. నా. వా. అ. న. తత్స. శర్వర్యాం భవం, శృణాతీతి చ శార్వరం. రాత్రియందు పుట్టునది, కటికచీకటి, చీకటి, హింస. సం. నా. వా. విణ. తత్స. చంపునది.
శాలము
సం. నా. వా. అ. పుం. తత్స. శలతి శీఘ్రం గచ్ఛతీతి శాలః. శీఘ్రముగా పోవునది, వేగముగా పోయెడు మత్స్యము. శల్యతే ప్రశస్యతే ఇతి శాలః. చెట్టు, వృక్షము, తరువు, ఒక ఆకుకూర.
శాలము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శాల్యతే శాలా. ఇల్లు, ఇంటియందు కొంతభాగము. మ్రాకు మొదటి కొమ్మవేళ్లు, పెనుకొమ్మ, గృహము, శలన్త్యస్యామితిశాలా. దీనియందుజనులుచేరుదురు.
శాలి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శృణాతీతి శాలిః. మధురము, ధాన్యము.
శాలీకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సాలెవాడు.
శాలీనుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. సలజ్జత్వేన సభాసుస్ధాతు మసమర్ధతయా శాలా మేవ ప్రవేష్టు మర్హతీతి శాలీనః. లజ్జకలవాడౌటచేత సిగ్గుచేత సభలయందు వుండటానికి శక్తిలేనివాడై ఇల్లు చేరువాడు, దిట్టతనము లేనివాడు, అదృష్టుడు. శాలాప్రవేశనం అర్హతీతి శాలీనః. శారదుడు.
శాలూకము
సం. నా. వా. అ. న. తత్స. శలతే శాలూకం. చుట్టుకొని యుండునది, తామర మొదలగువాని దుంప, జాజికాయ. శల్యతే శలతి వా శాలూకః. నీరు.
శాలూరము
సం. నా. వా. అ. పుం. తత్స. శలతి ఉత్ల్పుత్య గచ్ఛతీతి శాలూరః. గంతులు వేయుచు చరించునది, కప్ప. (రూ.సాలూరము). శలతే ప్లవతే గచ్ఛతీతి శాలూరః.
శాలేయము
సం. నా. వా. అ. పుం. తత్స. శాల్యతే శ్లాఘ్యతే శాకాయ భవతీతి శాలేయః. శాకార్ధమని కొనియాడబడినది, సదాప, (వృక్షవిశేషము).
శాలేయము
సం. నా. వా. విణ. తత్స. శాల్యుద్భవోచితం క్షేత్రం శాలేయం. వరి పండునది. (పొలము). శానీనాం క్షేత్రం శాలేయం, శాలి ధాన్యము పండుపొలము.
శాల్మలి
సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. తత్స. కూటా కుత్సితా చాసౌ శాల్మలీ చ కూటశాల్మలీ. కుత్సితమైన బూరుగు, బూరుగు(వృక్షవిశేషము). ఒక ద్వీపము. (చూ.ద్వీపము). (రూ.శల్మలి).
శాశ్వతము
సం. విణ. (అ.ఈ.అ).. తత్స. శశ్వద్వర్తమాన శ్శాశ్వతః. ఎప్పుడు ఉండునది, స్ధిరమైనది, నాశనము లేనిది, నిత్యము.
శాసనము
సం. నా. వా. అ. న. తత్స. శాస్యతే అనేన శాసనం. దీనిచేత శిక్షింపబడును, రాజు తాను దానము చేసిన భూమికై వ్రాసియిచ్చిన కౌలు, ఆజ్ఞ, శిక్షించుట, శాస్త్రము, పన్నులేనిగ్రామము, శాస్త్రము, శిలాశాసనాదులు.
శాస్త
సం. నా. వా. ఋ. పుం. తత్స. దుష్టాన్ శాస్తి శిక్షతీతి శాస్తా. దుష్టులను శిక్షించువాడు, బుద్దదేవుడు.
శాస్త్రము
సం. నా. వా. అ. న. తత్స. శాసనం, శిష్యతే అనేనేతి శాస్త్రం. నియమన గ్రంథము. (ఇవి ఆరు – తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిషము). ఆజ్ఞ, శిక్షించునది, శిక్షణనిచ్చునది.
శాస్త్రవిదుడు
సం. విణ. (ద్). తత్స. శాస్త్రం వేత్తీతి శాస్త్రవిత్. శాస్త్రమును ఎఱిగినవాడు, శాస్త్రము తెలిసినవాడు. శాస్త్రజ్ఞుడు, శాస్త్రి, శాస్త్రములందు ఆరితేరినవాడు.
శింజని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శిఞ్జతి అవ్యక్తం స్వనతీతి శింజినీ. అవ్యక్తముగా మ్రోయునది, వింటినారి, కాలి అందె.
శింజితము
సం. నా. వా. అ. న. తత్స. శింజతీతి శిఞ్జతం. భూషణముల ధ్వనికి పేరు, భూషణముల మోత, నూపురధ్వని, ఆభరణములధ్వని.
శింబ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శినోతి తనూకరోతి స్వగత బీజద్వారేణ కఫం పిత్తం చేతి శింబా. తమలో నుండు గింజల చేత కఫమును పిత్తమును పోగొట్టునది, పెసలులోసగు వానిపై పొట్టు.(రూ.సింబ). ధాన్యపుపొట్టు.
శింశుప
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఇరుగుడు.(వృక్షవిశేషము).
శింశుమారము
సం. నా. వా. అ. పుం. తత్స. శిశూన్ మారయతీతి శింశుమారః. శిశువులను చంపునది, మొసలి, నీరుకోతి.
శిక్యము
సం. నా. వా. అ. న. తత్స. శక్నోతి భారం వోఢు మితి శిక్యం. భారమును వహించుటకు సమర్ధమైనది, కావడియుట్టి, ఉట్టి, చిక్కము.
శిక్యితము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శిక్య మారోపితం శిక్యితం. ఉట్టి యందు పెట్టబడినది గనుక కాచితము, శిక్యితము, ఉట్టియందుంచబడినది. శిక్యే స్థాపితమిత్యర్థే ప్రతిపాదికాదితి శిక్యితం, చిక్కములో ఉంచినది.
శిక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శిక్షేత్యాది శ్రుతేరఙ్గమిత్యుచ్యతే శిక్ష. వేదమునకు అంగమనంబడును, షడంగములలో ఒకటి, (చూ.అంగము). శిక్షించుట, విద్యాభ్యాసము.
శిక్షితుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శిక్షా అస్య సంజాతేతి శిక్షితః. శిక్షకలవాడు, శిక్షింపబడినవాడు, నేర్పరి. చతురుడు, దక్షుడు, కుశలుడు, ప్రవీణుడు, నేర్పబడినవాడు, శిక్షితుడు.
శిఖండకము
సం. నా. వా. అ. పుం. తత్స. శిరసి ఖండత్వేన వర్తమానత్వా చ్ఛిఖండకః. శిరస్సున పిలకగా నుండునది, పిల్లజుట్టు, నెమలిపురి, కోడి.
శిఖండము
సం. నా. వా. అ. పుం. తత్స. శిఖాభి రగ్ర భాగై ర్డీయతే చలతీతి శిఖండః. అగ్రభాగముల చేత కదులుచుండునది, నెమిలిపురి, శిఖండకము, జులపాలు.
శిఖరము
సం. నా. వా. అ. న. తత్స. శిఖేవాగ్ర శిలా అస్యాస్తీతి శిఖరం. శిఖ వంటి కొనఱాయి కలది, కొండకొన, శిలావిశేషము. శిఖా కారతాస్యా స్తీతి శిఖరం. శిఖవంటి ఆకారము దీనికి కలదు, చెట్టుకొన, మంచపుకోడుకొన, కచ్చె, పండిన దానిమ్మ విత్తువంటి కెంపుతునక, అభినయ హస్త విశేషము. శిఖాస్యాస్తీతి శిఖరం. పర్వతము యొక్క పై భాగము, కొండకొమ్ము, వృక్షాగ్రము.
శిఖరి
సం. నా. వా. న్. పుం. తత్స. శిఖరాణ్యస్య సన్తీతి శిఖరీ. శిఖరములు కలది, కొండ. వృక్షమునకును, పర్వతమునకు పేరు, చెట్టు, ఉత్తరేను.(వృక్షవిశేషము). శిఖరో అస్యాస్తీతి శిఖరీ. తరువు, వృక్షము, చెట్టు, కొండ.
శిఖావంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. శిఖాం జ్వాలా అస్య సంతీతి శిఖావత్. జ్వాలలు కలవాడు, అగ్ని, వైశ్వానరుడు, జుట్టుముడికలవాడు.
శిఖావళము
సం. నా. వా. అ. పుం. తత్స. శిఖా చూడా అస్యాస్తీతి శిఖావళః. చుంచుకలది కనుక శిఖావళము, నెమలి, మయూరము. శిఖా విద్యతే అస్య శిఖావళః. కోడి, చెట్టు, కేతు గ్రహము, బాణము, ఎద్దు. సం. నా. వా. విణ. తత్స. శిఖలవాడు.
శిఖిగ్రీవము
సం. నా. వా. అ. న. తత్స. శిఖి గ్రీవాభ త్వాత్ శిఖిగ్రీవం. నెమలి మెడ వంటి వన్నెకలది, మయిలుతుత్తము.
శిఖివాహనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శిఖీమయూరో వాహనం యస్యసః శిఖివాహనః. నెమలి వాహనముగా కలవాడు, కుమారస్వామి.
శిగ్రుజము
సం. నా. వా. అ. న. తత్స. శిగ్రోర్జాయత ఇతి శిగ్రుజం. మునగ వలన పుట్టినది, మునగవిత్తు.
శిగ్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శినోతి శమయతి కఫాదీక్ శిగ్రుః. శ్లేష్మాదుల అల్పముగాను చేయునది గాని శమింపచేయునది గాని శిగ్రువు, మునగచెట్టు.(వృక్షవిశేషము). శినోత్య రుచి మితి శిగ్రుః. అరుచిని చెఱుచునది, కూర, ఒక ఆకుకూర.
శితశూకము
సం. నా. వా. అ. పుం. తత్స. శిత స్తీక్ష్ణ శ్శూకో యస్య సః శితశూకః. వాడియైన ముండ్లు కలిగినది, యవధాన్యము.
శితి
సం. విణ. (ఇ). తత్స. శ్యతి వర్ణాంతరం తనూకరోతీతి శితిః. వర్ణాంతరమును కొంచెముగా చేయునది, తెల్లనిది, నల్లనిది. శీయత ఇతి శీతిః. శోధింపబడునది.
శితికంఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శితిః కృష్ణవర్ణః కంఠో యస్యసః శితికంఠః. నల్లని కంఠము కలవాడు, శివుడు, కఱకంఠుడు.(శితికంఠమ=కూకురుగుడ్డంగి).
శితిసారకము
సం. నా. వా. అ. పుం. తత్స. శితిర్నీలస్సారో అస్య శితిసారకః. నల్లని చేవ కలది, తుమ్మిక.(వృక్షవిశేషము) తుమ్మ.
శిపివిష్టుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శిపో చర్మణి విష్టం దోషవ్యాప్తిరస్యేతి శిపిషు పశుషు విష్టోవ్యాప్త ఇతి చ శిపివిష్టః. చర్మమందు దోషవ్యాప్తి కలవాడుకనుకను, పశువుల యందు వ్యాపించినవాడు కనుకను శిపివిష్టుడు, విష్ణువు, శివుడు, బట్టతలవాడు, కుష్ఠరోగముకలవాడు, శంకరుడు, మహాదేవుడు, శంభువు, ఉమాపతి, చెడుచర్మముకలవాడు, ఈశ్వరుడు.
శిఫ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శినోతి భువం శిఫా. భూమిని కృశముగా చేయునది, తామరదుంప. శినోతి వృక్షమూలమితి శిఫా. చెట్టు మొదలు అల్పముగా చేయునది, ఊడ, పడగొమ్మ, మాంసి(వృక్షవిశేషము), ఏఱు, మూలము, దుంప, కలువదుంప శాఖ, ముందుభాగము, జుట్టుముడి.
శిబిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శివామంగళ ప్రదా. శివైన శిబికా. మంగళ ప్రదమైనది, యాస్యయానము, పల్లకి.
శిబిరము
సం. నా. వా. అ. న. తత్స. శేరతే అత్ర శిబిరం. దీనియందు నిద్రింతురు, దండు విడిసిన చోటు, వేలము, రాజనివేశము.
శిరము
సం. నా. వా. స్. న. తత్స. శ్రయతి స్వాంగం శిరః. స్వాంగమందుండునది, తల, శిఖరము, నేనాగ్రము, ప్రధానము.(రూపాంతరములు శిరస్సు, శిరసు). మస్తకము, ప్రధానము.
శిరస్త్రము
సం. నా. వా. అ. న. తత్స. శిరః త్రాయత ఇతి శిరస్త్రం. శిరస్సును రక్షించునది, శిరస్త్రాణము, బొమిడికము.
శిరస్యము
సం. నా. వా. అ. పుం. తత్స. శిరసి భవః శిరస్యః. శిరస్సు నందు పుట్టినది శిరస్యము, స్నానాదిసంస్కారము చేత గరగరికయైన తలవెంట్రుక.
శిరీషము
సం. నా. వా. అ. పుం. తత్స. శీర్యతే సౌకుమార్యా చ్ఛిరీషః. కోమల మౌటచేత వ్రక్కలౌనది, దిరిసెనము(వృక్షవిశేషము).
శిరోధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శిరో ధీయతే అస్యామితి శిరోధిః. దీనియందు శిరస్సు ధరింపబడును, మెడ, కంధర.
శిరోరుహము
సం. నా. వా. అ. పుం. తత్స. శిరసి రోహతీతి శిరోరుహః. శిరస్సున మొలచునది, తలవెండ్రుక, శిరోజము, కేశము, జుట్టు.
శిల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శినోతి తనూకరోతి ఆయుధ మితిశిలా. ఆయుధమును కృశింపజేయునది, ఱాయి. శాల్యతే శ్లాఘ్యత ఇతి శిలా. ద్వార స్తంభము క్రింద అడ్డముగానున్నత్రొక్కుడు పలక, సెలఏఱు, రాయి, ఎఱ్ఱపాషాణము, స్తంభాగ్రము తిరుగతి క్రింద రాయి, పచ్చాకు.
శిలాజతువు
సం. నా. వా. ఉ. న. తత్స. శిలాయాం జాయత ఇతి శిలాజతు. ఱాతి యందు పుట్టునది, సిలాజిత్తు.
శిలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శిలతి మృదమితి శిలీ. మృత్తును భక్షించునది, ఆడుఎఱ్ఱ, గండూపది. శిలతీతి శిలీ, పోవునది వానపాము, స్తంభాగ్రము.
శిలీముఖము
సం. నా. వా. అ. పుం. తత్స. శిలీ శల్యం ముఖే అస్య శిలీముఖః. ములికి ముఖమందు కలిగినది, బాణము, తుమ్మెద. శిలీవ ముఖం యస్య సః శిలీముఖః. భ్రమరము.
శిలోచ్చయము
సం. నా. వా. అ. పుం. తత్స. శిలానాముచ్చయః శిలోచ్చయః. శిలల యొక్క సమూహము, కొండ, పర్వతము. శిలాయా ఉచ్చయో యత్ర శిలోచ్చయః. గిరి, శైలము.
శిల్పము
సం. నా. వా. అ. న. తత్స. శీల్యతే అభ్యస్యత ఇతిశిల్పం. చిత్తరువు వ్రాయుటలోనగు శిల్పుల పని, నృత్త గీత వాద్యాది చతుష్షష్టి బాహ్యక్రియలు, ఆలింగనాది చతుష్షష్ట్యాభ్యంతర క్రియలు, కళ.
శిల్పి
సం. నా. వా. న్. పుం. తత్స. శిల్పం నిపుణకర్మాస్యాస్తీతి శిల్పీ. నేర్పుకలవాడు, వడ్లంగిలోనగువాడు. (వీరెవురు-వడ్లంగి, సాలె, మంగళి, చాకలి, ముచ్చి). సం. నా. వా. విణ. తత్స. శిల్పకారుడు.
శివ
సం. నా. వా. అ. న. తత్స. శుభము, సుఖము, జలము. సం. విణ. తత్స. శుభకరము. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శకునేన మోదహేతుత్వా చ్ఛివా. శకునముచేత సంతోషపెట్టునది. ఆరోగ్య రూపమంగళ హేతుత్వాత్ శివా. ఆరోగ్యరూపమైన శుభమునకు హేతువైనది. దోషశమనాచ్ఛివా. దోషశమనముచేత శుభస్వరూపమైనది.
శివ
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యామతి పరమానందరూపత్యాన్నిర్వికారోభవతీతి శివః. బ్రహ్మానంద స్వరూపుడును, నిర్వికారుండునుకనుక శమించి యుండువాడు, వేదము, మోక్షము, ఒకగ్రహయోగము, (చూ. యోగము) తియ్యమామిడి చెట్టు, నూగుదోస, గుగ్గిలపుచెట్టు, మేకు, ముల్లంగి, కొయ్యచాల. సం. నా. వా. అ. న. తత్స. అరిష్టం శినోతి తనూక రోతీతి శివం. అరిష్టమును స్వల్పముగా చేయునది. శుభము, సుఖము, జలము, నీరు, ఉసిరిక, జమ్మనది.
శివ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శివం మంగళ మస్యా అస్తీతి శివా. శుభము కలది, పార్వతి, దుర్గ, చండి, భవాని, ఉమ, శర్వాణి, జమ్మిచెట్టు, కరకచెట్టు, నేలఉసిరి, ఉసిరి, (వృక్షవిశేషము), నక్క, తులసి, ఒక గోధుమ (శివశబ్దమునకు నానార్ధములు) ఒక శక్తి.
శివంకరుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శివంకరోతీతి శివంకరశ్చ. శుభమును చేయువాడు, శుభకరుడు.
శివకము
సం. నా. వా. అ. పుం. తత్స. దౌష్ట్యశమనేన శివకరత్వాత్ శివకః. పసువుల దుష్టత్వమును మాన్పుట వలన శుభకరమైనది, పసుల కట్టుగూటము, మేకు, కీలకుడు.
శివతాతి
సం. విణ. (ఇ).. తత్స. శివంకరోతీతి శివతాతిః. శివంకరుడు, శుభమును చేయువాడు.
శివమల్లి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శివేన మల్యత ఇతి శివమల్లీ. శివుని చేత ధరింపబడునది, ఒక పుష్పము, మోదెన.(వృక్షవిశేషము).
శివుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శామ్యతి పరమానంద రూపత్వా న్నిర్వికారో భవతీతి శివః. బ్రహ్మానందస్వరూపుడును, నిర్వికారుండును కనుక శమించి ఉండువాడు, వేదము, శంభువు, ఈశుడు, పశుపతి, శూలి, మహేశ్వరుడు, ఈశ్వరుడు, శంకరుడు, చంద్రశేఖరుడు, భూతేశుడు, ఖండపరశువు, గిరీశుడు, మృత్యుంజయుడు, పినాకి, ప్రమథాధిపుడు, ఉగ్రుడు, కపర్ది, శ్రీకంఠుడు, శితికంఠుడు, కపాలభృత్తు, వామదేవుడు, మహాదేవుడు, విరూపాక్షుడు, త్రిలోచనుడు, కుశానురేత, సర్వక్షుడు, ధూర్జటి, నీలలోహితుడు, హరుడు, స్మరహరుడు, భర్గుడు, త్ర్యంబకుడు, త్రిపురాంతకుడు, గంగాధరుడు, అంధకరిపువు, వృషధ్వజుడు, వ్యోమకేశుడు, భవుడు,భీముడు, స్థాణువు, రుద్రుడు, ఉమాపతి, దిగంబరుడు, కాలంజరుడు, పరిద్విట్టు, మహాకాలుడు, నందివర్ధనుడు, మోక్షము, ఒక గ్రహయోగము, తియ్యమామిడి, నూగుదోస, గుగ్గిలపు చెట్టు, వాలుకము, పుండరీకద్రుమము, పారదుడు, దేవుడు, లింగము, మేకు. సం. నా. వా. అ. న. తత్స. అరిష్టం శినోతి తనూకరోతితి శివం. అరిష్టమును స్వల్పముగా చేయునది, సుఖము, జలము, సముద్రలవణము.
శిశిరము
సం. నా. వా. అ. పుం. న. తత్స. శినోతి పద్మ శోభామితి శిశిరః. పద్మముల కాంతి చెఱుచునది, చల్లని వస్తువులు. శినోత్యంగం శీతేన శిశిరః. శీతము చేత దేహమును అల్పముగా చేయునది, ఒక ఋతువు, కంపనుం. సం. నా. వా. విణ. తత్స. చల్లనిది, మాఘపాల్గుణముల చలి.
శిశివు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శ్యతీతి శిశుః. బిడ్డ, పిల్ల.
శిశుకము
సం. నా. వా. అ. పుం. తత్స. చాపల్యాచ్ఛిశురివ శిశుకః. చాపల్యము వలన శిశువు వంటిది, శిశువు, ఉలుచమీను, మొసలి.
శిశ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్లిష్యతి భగేన శిశ్నః. భగముతో కూడినది, మగగుఱి, మేహనము, ధ్వజము, సాధనము, పురుషాంగము.
శిశ్విదానుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్విందతే కర్మణా శుద్ధోభవతీతి శిశ్విదానః. నడవడిక చే పరిశుద్ధుడైనవాడు, సదాచారుడు, దురాచారుడు. శ్వేతితుమిచ్ఛతీతి శిశ్విదానః. పాపకర్ముడు, దుష్ప్రవర్తించువాడు.
శిష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శాస్యతే అనేన శిష్టిశ్చ. దీనిచేత శిక్షింపబడును, ఆజ్ఞ, ఆనతి, శాసనము.
శిష్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శాసనీయః శిష్యః. శిక్షింపదగినవాడు, విద్య కొఱకు దగ్గఱ చేరి సేవ చేయుచు శిక్షింపబడువాడు.
శీకరము
సం. నా. వా. అ. పుం. తత్స. శీకతే సించతీతి శీకరః. తడుపునది. శీతం కరోతీతి వా శీకరః. శీతమును చేయునది, తుంపర, ఏనుగుతొండము చివరయందు పుట్టెడు మదము, జల్లు, చలి.
శీఘ్రము
సం. నా. వా. అ. న. తత్స. శిః శయనం జిఘ్రతి హరతీతి శీఘ్రం. శయనమును హరించునది, నీటి వట్టివేరు, బండికంటి ఆకు, వడికలది, వాయువు, వేగముగా.
శీత
సం. నా. వా. అ. పుం. తత్స. దాహశమనా చ్ఛీతః. దాహమును శమింపచేయునది, ప్రబ్బలి చెట్టు. విరుద్ధలక్షణయా సం. నా. వా. అ. పుం. తత్స. శ్యాయతే శీతః వ్యాపించునది. సం. నా. వా. విణ. చల్లన, చల్లనైనది, ఆలసమైనది. శీతవీర్యత్వాచ్ఛీతః. ఉష్ణమును చేయునది, విరిగిచెట్టు, చలి, సం. నా. వా. ఆ. స్త్రీ. నాగటిచాలు.
శీతకము
సం. నా. వా. అ. పుం. తత్స. శీతం మందం కరోతీతి శీతకః. మందముగా కార్యమును చేయువాడు, చలికాలము, దేశవిశేషము, సోమరి.
శీతభీరువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. శ్రీతాద్భిభేతి గ్రీష్మజత్వా చ్ఛీతభీరుః. గ్రీష్మ కాలమందు పూచునది కనక చలికి వెఱచునది, మల్లెచెట్టు.
శీతలము
సం. నా. వా. అ. స్త్రీ. పుం. తత్స. శీతం లాతిదదాతీతి శీతలః. శీతము నిచ్చునది, చల్లనిది, వరుణుడు, చంపకము, మంచినీరు, చలి. సం. నా. వా. అ. న. తత్స. పరత్వధాతువేశషము, చందనము. సం. నా. వా. విణ. తత్స. చల్లనిది. వాతంకరోతీతివాతః, అత ఏవ శీలః వాతమును చేయునది కనుకవాతము మరియు శీతలము, సోమెదపు చెట్టు.
శీతశివము
సం. నా. వా. అ. పుం. తత్స. శీతవీర్యత్వాచ్ఛివా భద్రా శీతశివా. చలవ కలదౌటవలన శుభమును చేయునది, ఇందుప్పు, ఱాపువ్వు, జమ్మి, అడవి సదాప.(వృక్షవిశేషము) (ఈ అర్ధమునందిది అ కారాంత స్త్రీ లింగము). సం. నా. వా. అ. న. తత్స. శీతవీర్యేన శివం శీతశివం. చలువచేత శుభస్వరూపమైనది. శీతం శినోతి ఉష్ణవీర్యాత్యాధితి శాత శివం. ఉష్ట వీర్యమవుట వలన శైత్యమును పోగొట్టునది. ఇందుప్పు, రాపువ్యు. సం. నా. వా. పుం. తత్స. అర్ధాడు, జమ్మి, అడవిసదాప (వృక్షవిశేషము) (ఈ అర్ధమునందు ఇది ఆ స్త్రీలింగమగును)
శీధువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శేరతే అనేనేతి శీధుః. పక్వమైన చెఱకురసమున చేసిన కల్లు, ఏనుగు కన్నుల యందు పుట్టెడు మదము.(చూ.మదము).
శీర్షకము
సం. నా. వా. అ. న. తత్స. శీర్షం రక్షతీతి శీర్షకం. శిరస్సును రక్షించునది, శిరస్త్రాణము, కిరీటము, ఆకులను తినువాడు.
శీర్షచ్ఛేద్యుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శీర్షచ్ఛేదమర్హతీతి శీర్షచ్చేద్యః. తలకొట్టతగినవాడు.
శీర్షణ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. శిరసి భవః శీర్షణ్యః. శిరస్సునందు పుట్టినది శీర్షణ్యము, స్నానాదిసంస్కారము చేత గరగరికైన తలవెంట్రుకలు విరబోసుకున్న జుత్తు. సం. నా. వా. అ. న. తత్స. శిరసి హితం శీర్షణ్యం. శిరస్సు నందు హితమైనది.
శీర్షము
సం. నా. వా. అ. న. తత్స. జరయా శీర్యతే శీర్షం. జరచే పీడింపబడునది, తల, శిరము, మూర్ధము. మస్తకము.
శీలము
సం. నా. వా. అ. న. తత్స. శీలతీతి శీలం. లెస్సగా నడుచుట శీలము, మంచి నడత, స్వభావము. చరితము, చారిత్రము, స్వభావము, ప్రవర్తన.
శుంఠి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శుణ్ఠతి శుష్యతీతి శుణ్ఠీ. సమస్త దోషములను చెఱచునది, మహౌషధము, సొంటి, విశ్వము, నగరము.
శుండ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శునంత్యేనాం పానార్ధమితి శుండా. పానముస్యేయుట కొఱకు దీని గూర్చి పోవుదురు, తొండము, కల్లు, కల్లు త్రాగెడియిల్లు, నీరేనుగు, వేశ్య, ఉస్తె. (వృక్షవిశేషము).
శుకనాసము
సం. నా. వా. అ. పుం. తత్స. శుకనాసేవ పుష్పాణ్యస్య శుకనాసః. చిలుకముక్కు వంటి పుష్పములు కలది, అగిసె, దుండిగము.(వృక్షవిశేషము). అగస్త్యవృక్షము.
శుకము
సం. నా. వా. అ. పుం. తత్స. శుకతీతి శుకః. చిలుక, పక్షి, పచ్చాకు, చరించునది, దిరిసెనము, వ్యాసునికొడుకు, రావణునుని మంత్రి. సం. నా. వా. అ. న. తత్స. శుకవర్ణత్యాచ్ఛుకం. చిలుకవన్నెకలది, మాటిచెట్టు.
శుక్తము
సం. విణ. తత్స. దుఃఖపెట్టునది. శుచయతీతి శుక్తం. శుక్త శబ్దము ఆమ్లవిశేషమునకును, నిష్ఠురమైన దానికిని పేరు, పుల్లనిది, పరుషమైనది, పవిత్రమైనది, పులిసినగంజి. సం. నా. వా. అ. న. ? పుల్లకడుగు, మాంసము, తేనె, బెల్లము, మీగడమున్నగు వానిని మూడుదినములు కొత్తకుండలో ధాన్యమధ్యమును ఉంచి తయారుచేసిన పదార్థము. కారము పులుపు కలిసినది, కఠినమైనది.
శుక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శోకంత్యత్రేతి శుక్తిః. ముత్యములను పుట్టించునది, ముత్తెపు చిప్ప, శంఖము, నత్తగుల్ల, పుఱ్ఱె పెంచిక. శుక్త్యాకారత్త్యాచ్ఛుక్తిః. ముత్తెపు చిప్పవలె ఉండునది, ఏనుగుజలగ, గుఱ్ఱపుసుడి, నేత్రరోగము, నఖమను గంధద్రవ్యము. జలజంతు విశేషము, చింత, చింతపండు, రెండుకర్షములు.
శుక్రశిష్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శుక్ర స్య శిష్యా శ్శుక్రశిష్యాః. శుక్రునికి శిష్యులు, అసురుడు, దైత్యుడు, దానవుడు, రాక్షసులు.
శుక్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శుచం రాతీతి వా శుక్రః. శత్రువులకు దుఃఖమును ఇచ్చువాడు, రేతస్సు. రుద్రశుక్రద్వారేణ నిర్యాతత్వాద్వా శుక్రః. రుద్రుని రేతస్సు వలన ఒక యాగాగ్ని, ఒకగ్రహము, జ్యేష్ఠము, బంగారము, చంద్రుడు, అగ్ని పుట్టినవాడు, శుక్రుడు. స్త్రీ సందర్శనాదినా స్త్రీసందర్శనాదీదినా శోకతి స్రవతి శుక్రం. స్త్రీ సందర్శనాదుల చేత జాఱునది, భార్గవుడు, అగ్ని, గ్రహవిశేషము, కవి, పుంసత్వము, రేతస్సు, బీజము, వీర్యము, పౌరుషము, తేజము, ఇంద్రియము, బ్రాహ్మణుడు, ధనము, సం. నా. వా. అ. న. తత్స. తెలుపు, శుద్ధము.
శుక్లము
సం. నా. వా. అ. పుం. తత్స. శోకతి గచ్ఛతి మనః అస్మిన్నితి శుక్లః. మనస్సు దీనియందు ప్రవర్తించును, తెలుపు, (మాసమునందు) పూర్వ పక్షము, విశదము, ఒక పక్షము, వీర్యము, తెలుపు, ఒకసంవత్సరము, వెండి.
శుచి
సం. నా. వా. అ. పుం. తత్స. శోచయతీతి శుచిః. దుఃఖింప చేయువాడు. తాపేన శుగ్విద్యతే అస్మిన్నితి శుచిః. తాపము వలననై దుఃఖము దీనియందు గలదు. శోచతి శుద్యతీతి శుచిః. పరిశుద్ధమైనది. పరిశుద్ధత్వాచ్ఛుచిః జుగుప్సావిరహితమై పరిశుద్ధమైనది. శోచంత్యనేనేతి శుచిః. దీనిచేత వ్యథను పొందుదురు. అగ్ని, ఉపధాశుద్దుడయిన మంత్రి, శృంగార రసము, గ్రీష్మ బుతువు, జ్యేష్ఠమాసము, ఆషాఢమాసము, తెలుపు. సం. నా. వా. విణ. తత్స. తెల్లనిది, పరిశుద్దమైనది, అనుపహతమైనది.
శుద్ధాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. శుద్ధాః పరిశుద్ధాః రక్షకాః అంతే సమిపే అస్యేతి శుద్ధాన్తః. పరిశుద్ధలైన రక్షకులు సమీపమందు కలిగినది, అంతఃపురము, అంతఃపుర స్త్రీ. శుద్ధః రక్షితః అన్తః ప్రాంతో యస్యస ఇతి శుద్ధాంతః. రక్షింపబడిన ప్రాంతములు కలది, రాజు యొక్క ఏకాంత స్ధలము, వెనుకటి తొట్టికట్టు.
శునకము
సం. నా. వా. అ. పుం. తత్స. శునతి ఇతస్తతో గచ్ఛతీతి శునకః. ఇట్టటు దిరుగునది, కుక్క, ఇటు అటు తిరుగునది.
శుని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శునః స్త్రీ శునీ. ఆడకుక్క.
శుభంయువు
సం. విణ. (ఉ).. తత్స. శుభమస్యేతి శుభంయుః. శుభము కలవాడు, శుభముతో కూడుకొన్నవాడు. శుభమస్యాస్తీతి శుభంయుః. శోభనము.
శుభము
సం. నా. వా. అ. న. తత్స. శోభత ఇతి శుభం. శుభము, మంగళము, సౌఖ్యము, మంగళము, అంగీకారము, మంచిది, ఫేనిలవృక్షము.
శుభ్రము
సం. విణ. తత్స. శోభత ఇతి శుభ్రం. ఒప్పునది, తెల్లనిది, ప్రకాశించునది, వెండి, సుందరము.
శుభ్రాంశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శుభ్రాః అంశవో యస్యసః శుభ్రాంశుః. తెల్లని కిరణములు కలవాడు, చంద్రుడు.
శుల్కము
సం. నా. వా. అ. పుం. న. తత్స. శలన్తి సుఖేన గచ్ఛంత్య త్ర శుల్కః. దీనినిచ్చుట చేత సుఖముగా పోవుదురు, సుంకము, ఉంకువ, వేశ్యకిచ్చెడు రోయి, పన్ను, వరుడు వధువు, కిచ్చుకట్నము.
శుల్బము
సం. నా. వా. అ. న. తత్స. శలతి ఆశుగచ్ఛతి ద్రవావస్ధాయామితి శుల్బం. కరిగినప్పుడు జారునది, రాగి. శోచంత్యనేన మృగాదయ ఇతి శుల్బం. మృగాదులు దీనిచేత దుఃఖించును, త్రాడు.
శుశ్రూష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శ్రోతు మిచ్ఛా శుశ్రూషా. విననిచ్ఛ, సేవ, చెప్పుట, ఉపాసనము, పరిచర్య, పెద్దలసేవ, విననిశ్చయించుట.
శుష్మము
సం. నా. వా. అ. న్. న. తత్స. శుష్యంత్యనే నారయ ఇతి శుష్మం. దీనిచేత శత్రువులు శోషింతురు, బలిమి, తేజస్సు, అగ్ని, బలము.
శూకకీటము
సం. నా. వా. అ. పుం. తత్స. శూక యుక్తః కీటః శూకకీటః. ముల్లు గల పురుగు, గొంగళిపురుగు, కందురీగ, నల్లతేలు, మిడుత.
శూకధాన్యము
సం. నా. వా. అ. న. తత్స. శూక సహితం ధాన్యం శూకధాన్యం. ముండ్లు కలిగిన ధాన్యము, యవలులోనగునది.
శూకము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యతి స్వాపగమేన ధాన్యం తనూకరోతీతి శూకః. తాబోయిన వెనుక ధాన్యమును సూక్ష్మముగా చేయునది, తేలుకొండి, వరిముల్లు, కనికరము, దయ, మొగ్గ, ధాన్యపుముల్లు.
శూకశింబి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శూక ప్రధానా శింబిః త్వగస్యా ఇతి శూకశింబిః. ముండ్లు తరచుగా కలది, దూలగొండి, కండూర.(వృక్షవిశేషము). ఒక జొన్న.
శూద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శూద్ర జాతౌ భవాస్త్రీ శుద్రా. శూద్ర జాతియందు పుట్టినది, శూద్ర జాతి స్త్రీ.
శూద్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహా శూద్రస్య భార్యా తజ్జాతీయా వా మహాశూద్రీ. గొల్లవాని భార్య, శూద్రుని భార్య. శూద్రస్యస్త్రీ, శూద్రీ.
శూన్యము
సం. నా. వా. అ. న. తత్స. నిర్జనము, అసంపూర్ణము, రిక్తము. సం. నా. వా. విణ. తత్స. నివారకాభావశునేహితం శూన్యం. అడ్డపెట్టువాడు లేకుండుట వలన శూన్యమునకు హితమైనది, పాడు. ఆ. స్త్రీ. మల్లె చెట్టు.
శూరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శూరయతీతి శూరః. విక్రమించువాడు కనుక శూరుడు, సూర్యుడు, ఒక యాదవుడు. శూరయతీతి విక్రామతీతి శూరః. వీరుడు, ధీరుడు, తెల్లధాన్యము, కోడి, పరాక్రమవంతుడు. సం. నా. వా. విణ. తత్స. యుద్ధమునకు భయపడనివాడు, పౌరుడు.
శూర్పము
సం. నా. వా. అ. న. తత్స. శూర్ఫ్యతే అనేన శూర్పం. దీనిచేత కొలవబడును, చేట, రెండుముంతల కొలది, చేట, రెండుచతుష్కములు. శీర్యతే తుషాది రనేనేతి శూర్పం, దీనిచేత పొట్టు మొదలగునవి చెరగబడును.
శూలం
సం. నా. వా. అ. న. తత్స. శూలయతీతి శూలం. వ్యథ పెట్టునది, ముమ్మొనవాలు, ఇనుప సలాక, రోగవిశేషము, ఒక గ్రహయోగము, నొప్పి, చావు, టెక్కెము.
శూలాకృతము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శూలే నోద్బధ్యతే పచ్యతే శూలాకృతం. ఇనుప సలాక యందు గ్రుచ్చి పక్వము చేసినది.(కఱుకుట్లు). శూలమునకు గ్రుచ్చి కాల్చినమాంసము.
శూలి
సం. నా. వా. న్. పుం. తత్స. శూలమస్యా స్తీతిశూలీ. శూలమనెడి ఆయుధము కలవాడు, శివుడు. మహాదేవుడు, శంకరుడు, ఉమాపతి, ముక్కంటి.
శూల్యము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శూలే నోద్బధ్యతే పచ్యతే శూలాకృతం, శూల్యంచ. ఇనుప సలాక యందు గ్రుచ్చి పక్వము చేసినది. (కఱుకుట్లు). శూలేన సంస్కృతం శూల్యం, శులా కృతము.
శృంఖల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శృణాతి బంధనేన గజమితి శృంఖలా. ఏనుగును పీడించునది, ఏనుగుకాలి సంకెల.
శృంఖలకము
సం. నా. వా. అ. పుం. తత్స. శృంఖలం బంధన మేషా మితి శృంఖలకాః. మ్రాని సంకెలలు బందములుగాకలవి, కాళ్లకు బొండకొయ్య వేసిన ఒంటె పిల్ల.
శృంఖలము
సం. నా. వా. ఆ. స్త్రీ. అ. పుం. తత్స. శృంగైః ప్రధాన మణిభిః ఖలతీతి శృంఖలం. మగవాని మొలనూలు, ఏనుగు కాలి సంకెల, సంకెల, గొలుసు, పటకా.
శృంగబేరము
సం. నా. వా. అ. న. తత్స. శృంగవ ద్బేరం వపు రస్య శృంగబేరం. కొమ్ముల వంటి ఆకృతి కలిగినది, అల్లము, ఆర్ధ్రకము.
శృంగము
సం. నా. వా. అ. న. తత్స. శృణాతి హిన స్త్రీతి శృంగం. పర్వత శిఖరము. శృణాతీతి శృంగం. కొమ్ము, కొండకొమ్ము, బుఱ్ఱటకొమ్ము, గుఱుతు, దొరతనము, ప్రాధాన్యము, దంతము, కూటము, చిహ్నము, శిఖరము, ఆధిక్యము.
శృంగాటకము
సం. నా. వా. అ. న. తత్స. శృంగైరటంత్యస్మిన్నితి శృంగాటకం. చదుకము (చతుష్పథము). కొమ్మలచేత దీనియందు క్రీడింతురు.
శృంగారము
సం. నా. వా. అ. పుం. తత్స. నవరసములలో మొదటిది (చూ.రసము). ఏనుగు అలంకారము, సురతము. శృంగం కామోద్రేకముచ్ఛతీతి శృంగారః. మైథునము, గజాలం కారము, ఒకరసము, కామవికారము, శృంగం ప్రాధాన్యమియర్తీతి శృంగారం.
శృంగారయోని
సం. నా. వా. ఇ. పుం. తత్స. శృంగారే యోనిరుత్పత్తిః యస్య సః శృంగారయోనిః. మన్మథుడు, మదనుడు, కామదేవుడు.
శృంగి
సం. నా. వా. న్. పుం. తత్స. శృంగయు క్తత్వాత్ శృఙ్గీ. కొమ్ములు కలది, అతివస. శృంగాకారావయవత్వాత్ శృంగీ. కొమ్ముల వంటి అవయవములు కలది కనుక శృంగి, ఏనుగు, కొండ, ఓషధి, దున్నపోతు, ఎద్దు, దుష్టాశ్వము, పర్వతమున్నుగునవి, పోకమ్రాను.
శృంగిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శృంగ యోగాత్ శృంగిణీ. కొమ్ములు కలది, ఆవు, గోవు, సౌరభేయి.
శృంగీకనకము
సం. నా. వా. అ. న. తత్స. శృంగ్యాం అలంకారే ఉపాదేయం కనకం శృంగీకనకం. అలంకారమందు గ్రహింపదగిన కనకము, కడియములోనగు భూషణ రూపమైన బంగారు.(రూ.శృంగికనకము). ఆభరణమునకు ఉపయోగించుబంగారము.
శృతము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్రాయతే పచ్యత ఇతి శృతం. పాలు, నెయ్యి, హవిస్సు ఈమూటి యొక్క పాకము పేరు, కాచబడినది.(పాలు, నెయ్యిలోనగునది).
శేఖరుము
సం. నా. వా. అ. పుం. తత్స. శిఖరం శిరో అగ్రం తస్యాయమితి శేఖరః. శిరస్సు మీద నుండునది, సిగదండ, బాసికదండ, శిరోమాల.
శేఫము
సం. నా. వా. అ. పుం. తత్స. రేతసః స్రావేణ శేతే శేఫః. రేతస్సు పడిన మీదట నిద్రించునది, మగగుఱి. సం. నా. వా. స్. న. తత్స. శేతే రేతః పాతానంతరమితి శేఫః. శిశ్నము.
శేఫాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శేరత ఇతి శేఫాః నిద్రాణాః అళయో అత్రేతి శేఫాలకా. నిద్రించుచున్న తుమ్మెదలు కలది, నల్లవావిరి.(వృక్షవిశేషము). కొండగోగు.
శేముషి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శేత ఇతి శేః, తం ముష్ణాతీతి శేమూషీ. బుద్ధి, మతి, మనీష, ప్రజ్ఞ, ప్రతిభ, బుద్ధి, మేధ.
శేలువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శినోతి రోగాన్ శేలుః. రోగములను అల్పముగాచేయునది, శ్లేష్మాతకము, విరిగి చెట్టు.
శేవధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శేవం స్ధాప్య ధనం ధీయతే అస్మిన్నితి శేవధిః. శేవమనగా స్ధాప్యధనము దీని యందు ఉంచబడును, నిధి.(రూ.సేవధి).
శేషుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శేతే హరిరస్మిన్నితి శేషః. హరి యితని మీద శయనించును. కల్పాంతే అపి శిష్యత ఇతివా శేషః. కల్పాంతము నందును మిగిలియుండువాడు, సహస్ర ఫణములు కల సర్పరాజు, బలరాముడు, ఆదిశేఘుడు, నాగరాజు, పరతంత్రుడు, తూర్పారబట్టినధాన్యము, మిగిలినది.
శైక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శిక్షా మధీయతే శైక్షాః. శిక్షా గ్రంధము అధ్యయనము చేయువారు. శిక్షా యోగ్యా వాశైక్షాః. శిక్షింప యోగ్యమైనవారు, క్రొత్తగా చదువనారంభించిన శిష్యుడు.
శైఖరికము
సం. నా. వా. అ. పుం. తత్స. శిఖరే భవతీతి శైఖరికః. పర్వత శిఖరమందు పుట్టునది, ఉత్తరేను.(వృక్షవిశేషము). ఒక చెట్టు.
శైలము
సం. నా. వా. అ. పుం. తత్స. శిలా అత్ర సంతీతి శైలః. శిలలు దీనియందు కలవు, కొండ, సం. నా. వా. అ. న. తత్స. రసాంజనము, ఱావువ్వు.
శైలాలి
సం. నా. వా. న్. పుం. తత్స. శిలాలినా ప్రోక్తం నటసూత్ర మధీయత ఇతి శైలాలినః. శిలాలి చేత చెప్పబడిన నటసూత్రము అధ్యయనము చేయువారు, నట్టువుడు, శైలూషుడు, నటుడు.
శైలూషము
సం. నా. వా. అ. పుం. తత్స. శైలుషవన్నట ఇవ నానారూప పరివర్తనాత్ శైలూషః. శైలూషుడనగా నటుడు, మారేడు, బిల్వము.(వృక్షవిశేషము). శిలూషస్య ఋషేర్గో త్రాపత్యాని శైలూషాః. శిలూషుడను ఋషి యొక్క సంతతి యందు పుట్టినవారు, ఆటకాడు, నట్టువుడు.
శైలేయము
సం. నా. వా. అ. న. తత్స. శిలాయాం భవం శైలేయం. శిల యందు పుట్టినది, ఇందుప్పు, మురయనెడు గంధద్రవ్యము, ఱా పువ్వు.(వృక్షవిశేషము). సాంబ్రాణి. సం. నా. వా. అ. పుం. తేటి. సం. నా. వా. విణ. తత్స. రాతితో సమానమైనది.
శైవలము
సం. నా. వా. అ. న. తత్స. జలే శేతేశై వాలం శైవలం. జలమందుండునది, నీటిపాచి, (రూ.శేవలము), పద్మకాష్ఠము.(వృక్షవిశేషము). పాచి.
శైవలిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శైలవ మస్యా అస్తీతి శైవలినీ. నాచుకలిగినది, ఏఱు, నది, తటిని, ధుని.
శైవాలము
సం. నా. వా. అ. న. తత్స. జలే శేతేశై వాలం నాచు. జలమందుండునది, నీటిపాచి.(శైవలము యొక్క రూపాంతరము).
శైశవము
సం. నా. వా. అ. న. తత్స. శిశోర్భావశ్శిశుత్వం, శైశవం. శిశుత్వము, బాల్యము.
శోకము
సం. నా. వా. అ. పుం. తత్స. శోచనం శోకః. శోకము, పుత్రమరణాది దుఃఖము చేత తపించుట, వగపు, పీడ, దుఃఖము, ఒక స్థాయి భావము.
శోచిష్కేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శోచీంషి జ్వాలాః కేశాః యస్య సః శోచష్కేశః. శోచిస్సు లనగా జ్వాలలు, అవి కేశములుగా కలవాడు, అగ్ని, జ్వలనుడు.
శోచిస్సు
సం. నా. వా. స్. న. తత్స. శోచయతీతి శోచిః. కాంతి, సూర్యకిరణము, వెలుగు, ప్రభ, కిరణము, కపిలవర్ణము, శుభ్రత.
శోణకము
సం. నా. వా. అ. పుం. తత్స. శోణతీతి శోణకః. ఎఱ్ఱనైనది, దుండిగము, శుకనాసము.(వృక్షవిశేషము). సాలగంధము.
శోణము
సం. నా. వా. అ. పుం. తత్స. శోణతీతి శోణః. ఎఱుపు, ఎఱ్ఱని గుఱ్ఱము, నదవిశేషము, నిప్పు, దుండిగము.(వృక్షవిశేషము). నదివిశేషము, అగ్ని, పెద్దవాక, వర్ణమును చేయునది, ప్రవహించునది.
శోణరత్నము
సం. నా. వా. అ. న. తత్స. శోణవర్ణం రత్నం శోణరత్నం. ఎఱ్ఱని రత్నము, కెంపు, పద్మరాగము.
శోణితము
సం. నా. వా. అ. న. తత్స. శోణివర్ణ త్వాత్ శోణితం. ఎఱ్ఱని వన్నెకలది, రక్తము, రుధిరము, నెత్తురు, లోహితము, మొగలివాసన, ఆవాసనకలది, కుంకుమ.
శోధఘ్ని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శోధం హన్తీతి శోధఘ్నీ. శోధను కొట్టివేయునది, గలజేరు.(వృక్షవిశేషము).
శోధని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శుద్ధ్యతే అనయేతి శోధనీ. దీనిచేత శోధింపబడును, చీపురుకట్ట, సమ్మార్జని. చీపురు.
శోధము
సం. నా. వా. అ. పుం. తత్స. శవతీతి శోథః. వాపురోగము, శోఫ, బొల్లి, స్వయతి వర్ధతే శోధః. వృద్ధిపొందినది.
శోధితము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శోధ్యత ఇతి శోధితం. శోధింపబడినది. శోధ్యతే స్మ శోధితం. శోధింపబడిన వస్తువు.
శోఫము
సం. నా. వా. అ. పుం. తత్స. శవతి వ్యాప్నోతీతి శోఫః. వ్యాపించునది, వాపురోగము, శోధము, బొల్లి.
శోభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శోభయతీతి శోభా. ప్రకాశింప చేయునది, వస్త్రభుషణాది ప్రయుక్తమైన కాంతి, కాంతి, ఇచ్ఛ. శోభంతే అనయా ఇతి శోభా. రమ, లక్ష్మి, ఛాయ.
శోభనము
సం. నా. వా. విణ. తత్స. శోభత ఇతి శోభనం. ఒప్పునది, ఒక గ్రహయోగము(చూ.యోగము). సుందరము, తగరము, ఆకర్షకము.
శోభాంజనము
సం. నా. వా. అ. పుం. తత్స. శోభా మన క్తీతి శోభాంజనః. కాంతిని పొందినది. మునగ, శిగ్రువు.(వృక్షవిశేషము).
శోషము
సం. నా. వా. అ. పుం. తత్స. శుషన్తే అనేనేతి శోషః. దీనిచేత శోషింతురు, శోఫరోగము, క్షయరోగము, శోషిల్లుట.
శౌండి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రోగాపనోదనేశ క్తత్వాత్ శౌండీ. రోగములపోగొట్టుట యందు సమర్ధమైనది, పిప్పలి చెట్టు.
శౌండికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శుండాపాన స్థానం తాత్థ్స్యాత్ సురాపిశుండా, సా పణ్యమన్యేతి శౌండికః. కల్లమ్మువాడు. (చూ). కబ్బిలివాడు. శుండా పణ్యమస్య శౌండికః. జాతివిశేషము, ధ్వజము, ఒక సంకరజాతి, గౌండ్లవాడు.
శౌండుడు
సం. విణ. (అ.ఈ.అ).. తత్స. శుండాపానాగారం, సురావా తత్ర స్ధితః ఆసక్తో వా శౌండః. మద్యపాన గృహమందునికి కలవాడు గాని మద్యమందాసక్తి కలవాడు గానిశౌండుడు. కల్లు త్రాగుటలోనగు వాని చేత మత్తిల్లినవాడు, జాతి విశేషము, కోడి, త్రాగుబోతు, మేఘపంక్తి.
శౌకము
సం. నా. వా. అ. న. తత్స. శుకానాం సమూహః శౌకం. చిలుకల యొక్క సమూహం, శుక సమూహము, చిలుక గుంపు.
శౌక్లికేయము
సం. నా. వా. అ. పుం. తత్స. శుక్ల దేశేభవః శౌక్లికేయః. శుక్ల దేశమందు పుట్టినది, విషభేదము.
శౌధ్ధోదని
సం. నా. వా. ఇ. పుం. తత్స. శుద్ధం న్యాయ పరిశుద్ధం ఓదనం భుఙ్త్కె శుద్ధోదనః, తస్యాపత్యం శౌద్ధోదనిః. న్యాయ పరిశుద్దమైన అన్నమును భుజించువాని కొడుకు, శాక్యబుద్ధ దేవుడు. శుద్ధోదనస్యాపత్యం పుమానితి శౌద్ధోదనిః. సిద్ధార్థుడు.
శౌరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శూర ఇతి వసుదేవస్య పితా తస్య గోత్రాపత్యం శౌరిః. విష్ణువు, కృష్ణుడు, వెన్నుడు, వసుదేవుడు.
శౌర్యము
సం. నా. వా. అ. న. తత్స. శూరస్య భావః శౌర్యం. శూరుని యొక్క భావము, శూరత్వము.(చూ.శూరుడు), ప్రౌఢిమము, పరాక్రమము.
శౌల్బికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శుల్బం తామ్ర నిర్మాణం శిల్ప మస్యేతి శౌల్బికః. శుల్బమనగా రాగి చేయుట, రాగి పనివాడు.
శౌష్కలుడు
సం. విణ. (అ.ఈ.అ).. తత్స. తా మశ్నాతీతి శౌష్కలః. చక్కిలము వలె కఠినగుణము కలదౌటవలన మాంసము శష్కులి యనబడును, దానిని భక్షించువాడు, ఎండినమాంసము తినువాడు. శుష్కలీమత్తీతి శౌష్కలః. మాంసాహారుడు.
శ్చ్యోతము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్చ్యోతనం శ్చ్యోతః. కాఱుట, జలాదిధార, పోయుట.
శ్మశానము
సం. నా. వా. అ. న. తత్స. శవానాం శయనం శ్మశానం. శవములకు శయనము, ఒలికిమిట్ట, పితృవనము.
శ్మశ్రువు
సం. నా. వా. ఉ. న. తత్స. శ్మ న్ శబ్దో ముఖరాచీ శ్మని ముఖే శ్రియత ఇతి శ్మశ్రు. ముఖమునాశ్రయించునది, గడ్డము, మీసమును. శ్మ ముఖం శ్రయతి ఆశ్రయతీతి శ్మశ్రు.
శ్యామ
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యాయతే మన ఇతి శ్యామః. మనస్సును పొందునది, నలుపురంగు. శ్యాయత ఇతి శ్యామః. ఆకుపసుపు, మబ్బు, కోయిల, బొద్దికూర, ప్రయాగమందలి మఱ్ఱి.(వృక్షవిశేషము). ప్రియంగు మిరియము, నలుపు, చిత్రవర్ణము.
శ్యామ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కృష్ణవర్ణ త్వాత్ శ్యామా. నల్లనిది, నల్లతెగడ చెట్టు. శ్యామ వర్ణత్వాత్ శ్యామా. నల్లనిది, ప్రేంకణము చెట్టు, మామెన చెట్టు, యమున, నల్ల పిచ్చుక, రేయి, యౌవన మధ్యస్ధురాలు, నీలి చెట్టు, బావంజి చెట్టు, ఆడపిచ్చుక, ఒక తీగ.
శ్యామలము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యామ వర్ణో అస్యా స్తీతి శ్యామలః. శ్యామ వర్ణము కలిగినది, నలుపు, రావిచెట్టు.
శ్యామాకము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యామవర్ణ మకతి ప్రాప్నోతీతి శ్యామాకః. శ్యామవర్ణమును పొందునది, చామలు, తృణధాన్య విశేషము. శ్యామం వర్ణం అకతీతి శ్యామకః.
శ్యావము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యాయతే గచ్ఛతీతి శ్యావః. వర్ణాంతరమును పొందునది, నలుపు పసుపు కూడినవన్నె, కోతి వన్నె, బూడిదరంగు, ఆరంగుకలది.
శ్యేతము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యాయతి గచ్ఛతి జనమనాంసీతి శ్యేతః. జనుల మనస్సును పొందునది, తెలుపు.
శ్యేనము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యాయతే శ్యేనః. తీవ్రముగా పోవునది, డేగ, తెలుపు, పక్షివిశేషము, గ్రాహకుడు, భయంకరుడు.
శ్యోనాకము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్యాయతే శ్యోనాకః. వ్యాపించునది, దుండిగము.(వృక్షవిశేషము).(రూ.శోనకము)
శ్రద్ధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శ్రద్ధధతే అనయేతి శ్రద్ధా. దీనిచేత విశ్వసింతురు, అక్కఱ, ఆసక్తి, స్పృహ, దోహదము.
శ్రద్ధాళువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. పాయసాపూషాదిషు శ్రద్ధా ఇచ్ఛా అస్యా ఇతి శ్రద్ధాళుః. పాయసము పిండివంటల యందు ఆశ తలిగినది, వేవిళ్లు కల ఆడుది, గర్భీణీవాంఛ.
శ్రద్ధాళువు
సం. నా. వా. విణ. తత్స. శ్రద్ధధతే తాచ్ఛీల్యేన శ్రద్ధాళుః. విశ్వసించు స్వభావము కలవాడు, శ్రద్ధ కలది, దైవ విశ్వాసము, కోరిక.
శ్రయణము
సం. నా. వా. అ. న. తత్స. శయణం శ్రయణం. ఆశ్రయించుట.
శ్రవణము
సం. నా. వా. అ. న. తత్స. శృణోత్యనేన శ్రోత్రం ఒక నక్షత్రము. దీనిచేత విందురు, చెవి, వినికిడి. శ్రూయతే అనేనేతి శ్రవణః శృతిః శ్రవణశ్చ.
శ్రవము
సం. నా. వా. అ. పుం. స్. న. తత్స. శ్రవణం శ్రవశ్చ. దీనిచేత విందురు, చెవి, శ్రోత్రము, ధనము, యశస్సు.
శ్రవిష్ఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శూయతే శుభ కర్మణీతి శ్రవిష్ఠా. శుభ కర్మము నందు మంచిదని వినబడునది, ధనిష్ఠా నక్షత్రము.
శ్రాణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శ్రాయత ఇతి శ్రాణా. కాంచబడునది, కాపుడు గంజి, కాచ, అన్నపుగంజి.
శ్రాణము
సం. నా. వా. విణ. తత్స. శ్రాయత ఇతి శ్రాణా. కాంచబడినది, పక్వమైనది.
శ్రాద్ధదేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రాద్ధస్య దేవః శ్రాద్ధదేవః. పితృకర్మమునకు దేవుడు, యముడు.
శ్రాద్ధము
సం. నా. వా. అ. న. తత్స. శద్ధ్రయా దీయతే శ్రాద్ధం. శ్రద్ధ చేత ఇయ్యబడునది, కాలపాత్ర నియమముల చేత చేసెడు శాస్త్రదిత పితృకర్మము.(దీని విశేషములు- ఆగ్నేయము, సాక్ష్యము, సంప్రేషణము, మాసికము). నమ్మతగినవాడు.
శ్రాయము
సం. నా. వా. అ. పుం. తత్స. శయణం శ్రాయః. ఆశ్రయించుట, శరణము.
శ్రావణము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రవణ నక్షత్రయుక్తా పూర్ణిమా అస్మిన్నితి శ్రావణః. శ్రవణ నక్షత్రముతో కూడిన పున్నమ దీనియందు కలదు, ఒక మాసము.
శ్రావణికము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రవణ నక్షత్రయుక్తాపూర్ణిమా అస్మిన్నితి శ్రావణః, శ్రావణికశ్చ. శ్రవణనక్షత్రముతో కూడిన పున్నమ దీనియందు కలదు, శ్రావణమాసము.
శ్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శ్రయతి హరిమితి శ్రీ. విష్ణువు ఆశ్రయించునది, లక్ష్మి. శ్రియతే జనైరితి శ్రీః. జనులచే ఆశ్రయింపబడునది, సంపద, ఐశ్వర్యము, త్రివర్గము, వృద్ధి, శోభ, అలంకరణము, కీర్తి, బుద్ధి, సరస్వతి, విషము, ఉపకరణము, మారేడు. హరిం శ్రయతీతి శ్రీః. హరిప్రియ, ఇందిర, లోకమాత, అభివృద్ధి, లంగము, అందము, అభ్యుదయము.
శ్రీకంఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శితిః కృష్ణవర్ణః కంఠే యస్యసః శితికంఠః. నల్లని కంఠము కలవాడు, శివుడు, కఱకంఠుడు. శ్రీః శోభా కంఠే యస్య సః శ్రీకంఠః. ఉమాపతి, శంభువు, శంకరుడు, త్రినేత్రుడు.
శ్రీఘనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రియా యోగ విభూత్యాఘనః పూర్ణః పెరుగు శ్రీఘనః యోగసంపదచేత అధికుడు, బుద్ధదేవుడు.
శ్రీదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రియం దదాతీతి శ్రీదః. సంపద నిచ్చువాడు, కుబేరుడు, పైడిఱేడు.
శ్రీపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శ్రియః లక్ష్యాః పతిః శ్రీపతిః లక్ష్మీదేవికి భర్త, విష్ణువు, రాజు, అచ్యుతుడు, గోవిందుడు, జనార్దనుడు.
శ్రీపర్ణము
సం. నా. వా. అ. న. తత్స. శ్రీ శ్శోభా పర్ణేష్వస్య శ్రీపర్ణం. ఒప్పిదము ఆకులఅందు కలది, నెల్లి చెట్టు. శ్రీయుక్తాని పర్ణాన్యన్యేతి శ్రీపర్ణం. ఒప్పిదముకల పర్ణములు కలిగినది, తామర.(వృక్షవిశేషము). ఒక గుమ్మడి, కరకచెట్టు, అగ్నిమంథవృక్షము.
శ్రీపర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గుమ్ముడు, టేకు.(వృక్షవిశేషము).
శ్రీపర్ణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శ్రీః పర్ణేష్వస్యాః శ్రీపర్ణికా. ఆకుల యందు ఒప్పిదము కలది, గుమ్ముడు, కుముదిక.(వృక్షవిశేషము)
శ్రీపుత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. మన్మథుడు, సిరిచూలి.
శ్రీఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రీ ప్రదం శ్రీ ప్రియం వా ఫలమస్యేతి శ్రీఫలః. లక్ష్మీ ప్రదము గాని, లక్ష్మీ ప్రియముగాని అయిన ఫలము కలది, మారేడు, మాలూరము.(వృక్షవిశేషము).. శ్రీయుక్తం ఫలమస్య శ్రీఫలః. బిల్వ వృక్షము.
శ్రీఫలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రమ్యఫలత్వాచ్ఛ్రీ ఫలీ. మంచి పండ్లు కలది, నీలి, ఉసిరిక.(వృక్షవిశేషము). చిక్కుడు.
శ్రీమంతము
సం. నా. వా. త్. పుం. తత్స. శ్రీః శోభా అస్యాస్తీతి శ్రీమాన్. తిలకపు చెట్టు, బొట్టుగు.(వృక్షవిశేషము). కేతువు, చిలుక, గుగ్గిలము, కమిడి చెట్టు తిలకవృక్షము, ఎద్దు.
శ్రీమంతుడు
సం. నా. వా. విణ. తత్స. శ్రీరస్యా స్తీతి శ్రీలః, శ్రీమాంశ్చ. సంపదకలవాడు, ఒప్పిదము కలవాడు.
శ్రీలుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్రీరస్యా స్తీతి శ్రీలః. శ్రియం లాత్యాచత్తే వా శ్రీలః. సంపదకలవాడు, ఒప్పిదముకలవాడు.
శ్రీవత్సము
సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణువు యొక్క ఱొమ్మునందలి మచ్చ, సురంగభేదము. శ్రీయుక్తం వత్సం వక్షో యస్య సః శ్రీవత్సః. శ్రీకృష్ణుడు, జనార్ధనుడు.
శ్రీవత్సలాంఛనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రీవత్సోనామ వక్షః స్ధలే మహాపురుషలక్షణో రోమావర్తవిశేషః సఏవ లాఞ్చనం యస్యసః. శ్రీవత్సలాంఛనః వక్షః స్ధలమందు మహాపురుషలక్షణ మైన శ్రీవత్సమనెడు మచ్చ గుఱుతుగా కలవాడు, విష్ణువు.
శ్రీవాసము
సం. నా. వా. అ. పుం. తత్స. సౌభాగ్యహేతుత్వేన శ్రియః వాసః శ్రీవాసః. సౌభాగ్యకారణ మగుటచేత లక్ష్మికి స్ధానమైనది, దేవదారుబంక తో చేసిన ధూపద్రవ్యము, వృక్షధూపము(చూ), తామర.(వృక్షవిశేషము).
శ్రీవేష్టము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రియా వేష్ట్యతే శ్రీవేష్టః. శ్రీ మహాలక్ష్మి చేత చుట్టబడునది, (చూ)వృక్షధూపము, గుగ్గిలము.
శ్రీసంజ్ఞము
సం. నా. వా. అ. న. తత్స. శ్రియ స్సంజ్ఞా అస్య శ్రీసంజ్ఞ. శ్రీమహాలక్ష్మి పేర్లు, లవంగము, దేవకుసుమము.
శ్రీహస్తిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శోభాన్వితహస్తికర్ణాభపత్త్రయోగాత్ శ్రీహస్తినీ. ఒప్పిదము కల ఏనుగు చెవి వంటి ఆకారము కల ఆకులు కలది, గురుగు, భూరండి.(వృక్షవిశేషము).
శ్రుతము
సం. నా. వా. అ. న. తత్స. శ్రూయత ఇతి శ్రుతం. వినికి, శాస్త్రము.
శ్రుతము
సం. నా. వా. విణ. తత్స. శ్రూయత ఇతి శ్రుతం. వినబడినది, జ్ఞానము, విన్నది.
శ్రుతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శ్రూయతే ధర్మాధర్మాదికమనయేతి శ్రుతిః. దీనిచేత ధర్మాధర్మాదులు వినబడును, వేదము. శృణోత్యనేన శ్రోత్రం శ్రుతిః. దీనిచేత విందురు, చెవి. శ్రూయతే, శృణో త్యనయా-శ్రవణం చ శ్రుతిః. దీనిచేత విందురు, వినికి, నుతి, నుద్ది, వేదము, స్వాధ్యాయము, ఛందము, ఆగమము.
శ్రేణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శ్రియతి ఇతి శ్రేణిః. ఆశ్రయింపబడునది, వరుస, సమానులైన శిల్పుల వరుస, బొక్కెన. ఒక జాతికి చెందిన జనులు. సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శ్రియతే స్వాశోభయేతి శ్రేణీ. ఒప్పిదముచే ఆశ్రయింపబడునది, వరుస.
శ్రేయము
సం. నా. వా. విణ. తత్స. అతిశయేన ప్రశస్తః శ్రేయాన్. మిక్కిలి కొనియాడతగినవాడు, శ్రేష్ఠమయినది.(మొదటి రూపము శ్రేయస్సు).
శ్రేయము
సం. నా. వా. స్. న. తత్స. అతిశయేన ప్రశస్య త ఇతి శ్రేయః. మిక్కిలి ప్రశంసింపబడునది, పుణ్యము. ప్రశస్తతరం శ్రేయః. మిక్కిలి శ్రేష్ఠమైనది, మోక్షము, శుభము, ధర్మము. ఇదమనయోరతిశయేన ప్రశస్యమితి శ్రేయః. ధర్మము, మంచి కార్యము, సౌఖ్యము, మేలు.
శ్రేయసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శ్రేయస్క రోతీతి శ్రేయసీ. శ్రేయస్సును చేయునది, కరక చెట్టు. శ్రేయస్కర త్వాత్ శ్రేయసీ. శ్రేయస్సును కలిగించునది, అరుగు సొంటి, గజపిప్పలి, చిఱుబొద్ది.(వృక్షవిశేషము).
శ్రేష్ఠుడు
సం. నా. వా. విణ. తత్స. అతిశయేన ప్రశస్తః శ్రేయాన్, శ్రేష్ఠశ్చ. మిక్కిలి కొనియాడతగినవాడు. ఉత్తముడు, ప్రముఖుడు, గొప్పవాడు, పెద్దవాడు, రాగి, మేలిమి పొందినవాడు.
శ్రోణి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. శ్రోణతి సంగచ్ఛతే శ్రోణిః. సంహతమైయుండునది, పిఱుదు, మొల.
శ్రోణిఫలకము
సం. నా. వా. అ. న. తత్స. ఫలకాకృతిః శ్రోణిః శ్రోణిఫలకం. పలకవలె నుండెడు శ్రోణి, మొల, కటము.
శ్రోణుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్రోణతి సంహతో భవతి శ్రోణః. కరచరణాదుల చేత ముద్దయయియుండువాడు, పిచ్చుక కుంటు.
శ్రోత్రము
సం. నా. వా. అ. న. తత్స. శృణోత్యనేన శ్రోత్రం. దీనిచేత విందురు, చెవి, కర్ణము, శ్రవణము.
శ్రోత్రియుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్రుతిం అధీతే శ్రోత్రియః. వేదాధ్యయనము చేసినవాడు, వేదము చదివిన బ్రాహ్మణుడు, ఛాందసుడు. ఛందో అధీతే ఇతి శ్రోత్రియః.
శ్లక్ష్ణుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్లిష్యతే సర్వైరితి శ్లక్ష్ణః. అందరిచేత ఆలింగనము చేయబడువాడు, ప్రియముగా పలుకువాడు.(రూ.శక్లుడు). అల్పుడు. శ్లిష్యతి మహద్వస్తుషు శ్లక్ష్ణం. దొడ్డ వస్తువుల యందు తగిలియుండునది, సన్నపు నూలిపోగు. మనోహరము, అల్పము, మధురమైన మాట.
శ్లేష
సం. నా. వా. అ. పుం. తత్స. శ్లేషణం శ్లేషః. కదియుట, కలయిక, ఒక అర్ధాలంకారము, (చూ.అలంకారము), కావ్యగుణములలో నొకటి.(చూ.గుణము).
శ్లేష్మణుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్లేష్మాస్యా స్తీతి శ్లేష్మలః, శ్లేష్మణశ్చ. శ్లేష్మము కలవాడు, శ్లేష్మలుడు, కఫరోగి.
శ్లేష్మము
సం. నా. వా. న్. పుం. తత్స. శ్లిష్యతి హృదయాదౌ శ్లేష్మా. హృదయము మొదలైనదానిని పొందునది, కఫము, తెమడ.
శ్లేష్మలుడు
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. శ్లేష్మాస్యా స్తీతి శ్లేష్మలః. శ్లేష్మము కలవాడు, శ్లేష్మరోగము కలవాడు, శ్లేష్మణుడు, కఫరోగముకలవాడు.
శ్లేష్మాతకము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్లేష్మాణమాతయతీతి శ్లేష్మాతకః. శ్లేష్మమును ఎల్లప్పుడు పోగొట్టునది, విరిగి, శేలువు.(వృక్షవిశేషము)
శ్లోకము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్లోక్యత ఇతి శ్లోకః. కూర్చబడినది, సంస్కృత పద్యము, కీర్తి, అభిఖ్య, యశము.
శ్వదంష్ట్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శున ఇవ దంష్ట్రా కంటకాత్మా అస్యాఇతి శ్వదంష్ట్రా. శునకము యొక్క పండ్ల వంటి ముండ్లు కలది, పల్లేరు, గోక్షురకము.(వృక్షవిశేషము), ఒక తీగ, ఒకయంత్రము.
శ్వపచుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్వానం పచతీతి శ్వపచః. కుక్కను వండుకొనువాడు, మాల, చండాలుడు. ఒక సంకరజాతి, పులిందుడు.
శ్వభ్రము
సం. నా. వా. అ. న. తత్స. శోభనమభ్ర మాకాశ మస్మిన్నితి శ్వభ్రం. బయలు దీనియందు లెస్సగాకలదు, రంధ్రము, బెజ్జము. శ్వభ్ర్యతే యదితి శ్వభ్రం. అగాధము, ఛిద్రము, అంతరము.
శ్వయధువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. శ్వయతి వర్ధతే శ్వయధుః. వృద్ధిపొందునది, వాపురోగము, శోఫ, బొల్లి.
శ్వవృత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. శునో వర్తనమివదై న్యాదినా అపకృష్టత్వాత్ శ్వ వృత్తిః. శునక వర్తనము వలె దైన్యాదుల చేత తక్కువైనది, సేవ, కొలువు.
శ్వశురుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శం సుఖం అశ్నుతే జామాతరం స్నుషాం చ లబ్ద్వా శ్వశురః. మగని తండ్రికిని, ఆలితండ్రికిని పేరు, ఆలుమగల తండ్రి, మామ. శ్వశ్రూశ్చ శ్వశురశ్చ. అత్తమామలు.
శ్వశుర్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శ్వశుర స్యాపత్యం శ్వశుర్యః. మగనితోడబుట్టువు, ఆలితోడపుట్టువు, మామకొడుకు.
శ్వశ్రువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. శ్వశురస్య పత్నీ శ్వశ్రూః. మామ పెండ్లాము, ఆలమగల తల్లి, అత్త.
శ్వశ్రూశ్వశురుడు
సం. నా. వా. అ. పుం. తత్స.
శ్వశ్రేయసము
సం. నా. వా. అ. న. తత్స. శ్వః ఆగామి శ్రేయో అత్రశ్వ శ్శ్రేయసం. రాగల శ్రేయస్సు దీని యందు కలదు, శుభము, సుఖము, మోక్షము, శివము, మంగళము, భద్రము.
శ్వసనము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్వ సంత్య నేన ప్రాణిన ఇతి శ్వసనః. ఇతని చేత ప్రాణులు బ్రతుకుదురు, వాయువు. శ్వసంత్యనేకరోగ హరత్వాత్ శ్వసనః. రోగహరము గనుక దీనిచేత బ్రతుకుదురు, మంగచెట్టు, గాలి, పవనము, అనలము, అగ్ని.
శ్వసనము
సం. నా. వా. అ. పుం. తత్స. శ్వసంత్యనేక రోగహరత్వాత్ శ్వసనః రోగహరము కనుక దీనిచే బ్రతుకుతురు, శ్వసంత్యనేన ప్రాణిన ఇతి శ్వసనః. ఇతనిచే ప్రాణులు బ్రతుకుతురు, వాయువు, మంగవృక్షము.
శ్వస్
సం. నా. వా. అ. పుం. తత్స.
శ్వావిధము
సం. నా. వా. ధ్. పుం. తత్స. శ్వానం విధ్యతీతి శ్వావిత్. శునకమును వ్యధ పెట్టునది, ఏదుపంది, శల్యము.
శ్విత్రము
సం. నా. వా. అ. న. తత్స. శ్వేతతే త్వ గనేనేతి శ్విత్రం. దీనిచేత చర్మము తెలుపౌను, తెల్లపులుము, కుష్ఠము, బొల్లి.
శ్వేత
సం. నా. వా. అ. పుం. తత్స. శ్వేతతే శ్వేతః. వర్ణమును చేయునది, తెలుపువన్నె, తెలుపు, తెల్లపులుము, ఒక ద్వీపము, కైలాస పర్వతము, వెండి, సీసము. సం. నా. వా. విణ. తత్స. శ్వేత వర్ణత్వాత్ శ్వేతం. తెల్లని వన్నె కలది, సం. నా. వా. న. తత్స. శ్వేతతే ఇతి శ్వేతం. తెల్లనిది, శంఖము, తెల్లమబ్బు, దినము యొక్క రెండవభాగము.(చూ.దినము). పెరుగు, వెండి
శ్వేతగరుత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. శ్వేతాః గరుతః పక్షా అస్యేతి శ్వేతగరుత్. తెల్లని ఱెక్కలుకలది, హంస, తెలిపిట్ట.
శ్వేతమరిచము
సం. నా. వా. అ. న. తత్స. శ్వేతమరిచగుమ యోగాత్ శ్వేతమరిచం. తెల్లని మిరియాలు, మునగవిత్తు.
శ్వేతరక్తము
సం. నా. వా. అ. పుం. తత్స. లేత ఎరుపు.
శ్వేతసురసము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శ్వేతః శోభనో రసో యస్యాస్సా శ్యేతసురసా. తెల్లనైన మంచి రసముకలది, తెల్లవావిలి.(వృక్షవిశేషము).