హల్లులు : ష

షండము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రమరేభ్యో రసం సనోతీతి షండః. భ్రమరములకు మకరందము నిచ్చునది, తామరలోనగువాని సమూహము, చిహ్నము, ఎద్దు, అచ్చువిడిచిన నల్ల ఎద్దు, నపుంసకుడు, గుంపు, పంది.
షట్కర్ముడు
సం. నా. వా. న్. పుం. తత్స. షట్ కర్మాణ్యన్యేతి షట్కర్మా. యజనయాజనాధ్యయనాధ్యా పనదాన ప్రతిగ్రహములనెడు షట్కర్మములు కల స్మార్తబ్రాహ్మణుడు. షట్కర్మాణి యజనాదీని యస్య సః షట్కర్మా. ఆరుకర్మలు.
షట్పదము
సం. నా. వా. అ. పుం. తత్స. షట్పదా న్యస్యేతి షట్పదః. ఆఱు కాళ్లు కలది, తుమ్మెద, జమలిముక్కాలి.
షడభిజ్ఞుడు
సం. నా. వా. అ. పుం. తత్స. షట్ అభిజ్ఞాః యస్యసః షడభిజ్ఞః. దివ్యదృష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాసానుస్మృతి, పరచిత్త జ్ఞానము, అప్రత్యక్ష విషయజ్ఞానము, వియద్గమ నాగమనవ్యూహాది లక్షణమైన బుద్ధి అను ఆరు అభిజ్ఞలు కలవాడు, బుద్ధదేవుడు.
షడాననుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అగ్ని పత్నీనాం షణ్ణాం స్తన్యపానార్ధం షట్ ఆననాని యస్యసః షడాననః. అగ్ని భార్యలైన షట్కృత్తికల (ఆరు కృత్తికల) స్తన్యపానము చేయుటకై ఆరుముఖములను ధరించినవాడు, కుమారస్వామి. (ఇట్లు షణ్ముఖుడు)
షడ్గ్రంధ
సం. నా. వా. అ. పుం. తత్స. షడ్గ్రంథయో అస్య షడ్గ్రంథః. ఆఱు కనుపులు కలది షడ్గ్రంథము, గంట్ల కానుగ చెట్టు, గంట్లకచోరము. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. కరంజివృక్షము, పిప్పలిగడ్డి.
షడ్గ్రంధకము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. షట్ గ్రంథయో అస్యా ఇతి షడ్గ్రంధికా. ఆఱుగంట్లు కలది, గంట్ల కచోరము, వస. (వృక్షవిశేషము)
షడ్జము
సం. నా. వా. అ. పుం. తత్స. షట్సుస్ధానేషు జాయత ఇతి షడ్జః. ఒక స్వరము (చూ. స్వరము) సప్తస్వరములలో ఒకపేరు.
షష్టిక్యము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. షష్టికానాం భవనం క్షేత్రం ఇతి షష్టిక్యం. షష్టికలు పండునది. (పొలము.) అరవైదినములకు పండుధాన్యము, ఒక ధాన్యము పండుభూమి.
షాణ్మాతురుడు
సం. నా. వా. అ. పుం. తత్స. షణ్ణాం మాతృణా మపత్యం షాణ్మాతురః. ఆరుగురు తల్లుల కొడుకు, కుమారస్వామి.