హల్లులు : స

సంకటము
సం. నా. వా. అ. న. తత్స. సంకుచతీతి సంకటం. సంకోచమైయుండునది, ఇఱుకు, సం. విణ. తత్స. చిక్కు, ఇఱుకయినది.
సంకరము
సం. నా. వా. అ. పుం. తత్స. సంకీర్యతే అవకీర్యత ఇతి సంకరః. పాఱ చల్లబడునది, భేదము తెలియని కూడిక, పొరకతో చిమ్మి చేర్చిన కసవుకుప్ప, పాలు, నీళును కలిసిన విధమైన అర్థాలంకారము యొక్క పరస్పర సంబంధము, దుమ్ము.
సంకర్షణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శత్రూన్ ప్రళయే జనాన్వాసంకర్షతీతి సంకర్షణః. శత్రువులను లేక ప్రళయమందు సర్వజనులుగాని సంహరించువాడు. బలరాముడు. సమ్యక్ కర్షతీతి సంకర్షః. రాముడు.
సంకలితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంకల్యతే సంక్షేప్యగణ్యతేస్మ సంకలితః. సంక్షేమముగా లెక్కపెట్టబడినది, కూర్చబడినది (సంఖ్య) భూమియందుపాతినది.
సంకల్పము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్కల్ప్యతే అనేనేతి సంకల్పః. దీనిచేత లెస్సగా కల్పింపబడును, మనోవ్యాపారము, ఎన్నిక, నిశ్చయము.
సంకాశము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమ్యక్కాశత ఇతి సంకాశః. లెస్సగా ప్రకాశించునది, సమానమైనది, సమీపమైనది. సమ్యక్ కాశతే ప్రకాశతే ఇతి సంకాశః. సదృశము.
సంకీర్ణము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. విజాతీయ మాతా పితృకత్వాత్ ఉభయ వర్ణాంభ్యాం సంకీర్యన్త ఇతి సంకీర్ణాః. విజాతీయులైన తల్లిదండ్రులు కలిగినవై రెండుజాతులతో కలయునవి. సంకీర్యతే నైరంత ర్యేణేతి సంకీర్ణం. ఒకటినొకటి ఎడము లేకుండునట్లు కలపబడునది. సమ్యక్కీర్ణోవ్యాప్తః సంకీర్ణః. లెస్సగా నెఱసినది, ఒకటితోనొకటి కలసినది, వ్యాపించినది, సంకరజాతి, కలగూరగంప.
సంకులము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంకులన్తి జడీభవంత్యనేనేతి సంకులం. దీనిచేత జడులవుదురు. సంకోలతి నిరంతరీభవతీతి సంకులం. ఎడలేక ఎల్లప్పుడు కలిసికొనిఉండునది, పూర్వోత్తర విరుద్ధమైనది (మాట) వ్యాపించినది, వ్యాప్తము, పూర్ణము, అనియతము, సంకీర్ణము.
సంకేతము
సం. నా. వా. అ. పుం. తత్స. సంకిత్యతే అత్రేతి సంకేతః. పేరు, ఏర్పాటు, ఒడబాటు, వ్యుతృత్తి, ఆకారము, విశేషము, చిహ్నము.
సంకోచపిశునము
సం. నా. వా. అ. న. తత్స. ఆత్మనః సంకోచం పిశతి సూచయతి సంకోచపిశునం తనయొక్క అణకవును చూపించునది, కుంకుమపువ్వు.
సంకోచము
సం. నా. వా. అ. న. తత్స. ఆత్మనది సంకోచం విశతి సూచయతి సంకోచం తనయొక్క అణకువను చూపించునది, కుంకుమపువ్వు, ముకుళీభావము, సంక్షేపము, మత్స్యవిశేషము.
సంక్రందనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సంక్రందయతి రిపూనితి సంక్రందనః. శత్రువుల మొఱపెట్టించువాడు, ఇంద్రుడు.
సంక్రమణము
సం. నా. వా. అ. పుం. తత్స. సంక్రామంతి చంచరంత్యనేన సంక్రమః. దీనిచేత సంచరింతురు, సూర్యుడు ఒకరాశినుండి మరియొక్కరాశిని ప్రవేశించుట, చక్కగానడచుట.
సంక్షేపణము
సం. నా. వా. అ. న. తత్స. సంక్షేపః సంక్షేపణం. విస్తీర్ణమైన దానిని కొంచెముగా చేయుట, సంక్షేపింపబడినది, సంగ్రహము.
సంఖ్య
సం. నా. వా. అ. న. తత్స. సంఖ్యాయతే వీరోత్రేతి సంఖ్యం. వీరుడు దీనియందు లెస్సగా కొనియాడబడును, యుద్ధము, సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సంఖ్యాయతే అనయేతి సంఖ్యా. దీని చేత లెస్సగా చెప్పబడును. (సంఖ్యా భేదములు-ఏకము, దశము, శతము, సహస్రము, దశసహస్రము, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి, శతకోటి, అర్బుదము, న్యర్బుదము, ఖర్వము, మహాఖర్వము, పద్మము, మహాద్ముము, క్షోణి, మహాక్షోణి, శంఖము, మహాశంఖము, క్షితి, మహాక్షితి, క్షోభము, మహాక్షోభము, నిధి, మహానిధి, పర్వతము, అత్యంతము, పరార్ధము, అనంతము, సాగరము, అవ్యయము, అచింత్యము, అమేయము, భూరి, మహాభూరి), విచారణ, దేహవిలక్షణమైన ఆత్మజ్ఞానము.
సంఖ్యాతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. సంఖ్యాయతేస్మ సంఖ్యాతం. పెట్టబడినది, గణితము.
సంఖ్యావంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. ప్రశస్తాసంఖ్యా విచారణాస్యాస్తీతి సంఖ్యావా. మంచివిచారము కలవాడు, చదువరి, సం. విణ. తత్స. (లెక్కపెట్టబడినవాడు), పండితుడు, బుద్ధిమంతుడు, విశారదుడు, కవి.
సంఖ్యేయము
సం. విణ. (అ.ఈ.అ). తత్స ?. లెక్క పెట్టతగినది, గణనీయము.
సంగతము
సం. నా. వా. అ. న. తత్స. సంగచ్ఛతే మన ఇతి సంగతం. మనస్సును లెస్సగా పొందునది, స్నేహము, చేరిక, సం. విణ. తత్స. పగటిలో రెండవజాము, ఒక వ్రతము, మర్యాద, యుక్తము, యుక్తియుక్తము, ప్రీతి, మైత్రి.
సంగమము
సం. నా. వా. అ. పుం. తత్స. మిళనం సంగతీతి సంగమః. కూడుట, కలయిక, సంయోగము, ఒక వ్రతము.
సంగము
సం. నా. వా. అ. పుం. తత్స. సంగతి సంగమః. కూడుట, చేరిక, సంసర్గము, ఒకవ్రతము.
సంగరము
సం. నా. వా. అ. పుం. తత్స. సంగరణం, సమ్యగ్గిర తీతిచ సంగరః. ప్రతిజ్ఞచేయుట, మిక్కిలి పీడించుట. యుద్ధము, ప్రతిజ్ఞ, అంగీకారము, ఆపద, విషము. సంగృణంతి శబ్దాయంతే వీరా యత్ర సంగరః. యుద్ధం, ప్రతిజ్ఞ, అంగీకారము. సం. నా. వా. అ. న. తత్స. జమ్మిపండు, పనిచేయువాడు, దురదృష్టము, శపథము, శమీఫలము.
సంగీర్ణము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంగీర్యతేస్మసంగీర్ణం. అంగీకరింపబడినది, ఇయ్యకొనబడినది, ప్రతి జ్ఞాతము.
సంగ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. సంక్షేపేణ గృహ్యతేర్ధోనేనేతి సంగ్రహః. దీనిచేత అర్ధము సంక్షేపముగా గ్రహింపబడును, సమ్యగ్గ్రహణము, సంక్షేపము, సంక్షిప్తగ్రంథము, స్వీకారము, ఉపయోగించుకొనుట, జౌన్నత్యము.
సంగ్రామము
సం. నా. వా. అ. పుం. తత్స. సంగ్రామయంతే పరస్పరమితి సంగ్రామః. పరస్పరము పోరుదురు, కలహము, పోరు, యుద్ధము, సమరము, రణము.
సంగ్రాహము
సం. నా. వా. అ. పుం. తత్స. సంగృహ్యతే అనేనేతి సంగ్రాహః. దీనిచేత నరిగపట్టబడును. సం గృహ్యంతే సంక్షిప్యంతే అంగుళయోత్రీతి సంగ్రాహః. దీనియందు వ్రేళ్లు సంక్షేపింపబడును, అరిగపిడి, పిడికిటబట్టుట, పిడికిలి.
సంఘము
సం. నా. వా. అ. పుం. తత్స. సంహన్యతే పరస్పర సజాతీయవిజాతీయైరితి సంఘః. సమూహము, గుమి, ప్రాణిసమూహము, పక్షిసంఘము.
సంఘాతము
సం. నా. వా. అ. పుం. తత్స. సంఘన్యత ఇతి సంఘాతః. సమూహము, గట్టిదెబ్బ, నరకవిశేషము, ఎముక, నరకభేదము, హననము, నివిడసంయోగము.
సంచయము
సం. నా. వా. అ. పుం. తత్స. సంచీయతే సంచయః. కూర్చబడునది, ప్రోగు, కూడబెట్టుట, సమూహము, నికరము.
సంచారికా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సంచారయితి ప్రాపయతి పుమాంసం స్త్రీయమితి సంచారికా. పురుషుని స్త్రీని గూర్చునది, కుంటెనకత్తె, జత, మూర్కొనుట. సంచారయతి నాయకయోర్వార్తామితి సంచారికా. యుగళము, ఘ్రాణము, ఒకదాసి.
సంజవనము
సం. నా. వా. అ. న. తత్స. సంజవన్తే మిథస్సంగచ్ఛన్తేస్మిన్నితి సంజవనం. దీనియందు లెస్సగా పొందుదురు, నాలిగిండ్లభవంతి. సంజవంతి సంమిలంత్యత్రేతి సంజవనం. సంయమనము, నిలయము.
సంజ్ఞ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమ్యక్ జ్ఞానం జ్ఞాయతే అనయేతి చ సంజ్ఞా. లెస్సగా ఎఱుగుటయు, చేయిలోనగు వానితోడిసైగ, పేరు, తెలివి పరిభాష, గాయత్రి, సూర్యుని భార్య, ఆహ్వానము, నామధేయము, బుద్ధి, జ్ఞానము.
సంజ్ఞపనము
సం. నా. వా. అ. న. తత్స. సంజ్ఞాయతే సంజ్ఞపనం. చంపుట, విన్నవించుట, హింస.
సంజ్ఞువు
సం. విణ. (ఉ). తత్స. సంహతే జానునీ యస్యసః సంజ్ఞుః కలిసిన మోకాళ్లుకలవాడు, ముట్టికాళ్లవాడు, దొడ్డికాళ్లవాడు.
సంజ్వరము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ జ్వరయతీతి సంజ్వరః. మిక్కిలి పీడించునది, కాక, వేడిమి, మంట.
సండీనము
సం. నా. వా. అ. న. తత్స. సంహతం డయనం సండీనమ్. కలసిపాఱుట, చెట్టుమొదలైనవానిమీదకి ఎగురుట, బాగుగా ఎగురునది.
సంతతము
సం. విణ. (అ) న. తత్స. సంతన్యతేనేనేతి సంతతం. విస్తరింప చేయబడుచున్నది, ఎల్లప్పుడు, సం. నా. వా. విణ. తత్స. ఎడతెగనిది, సతతము, శాశ్వతము.
సంతతి
సం. నా. వా. ఇ. త్రి. తత్స. సంతన్యతే అనయాసంతతిః. దీనిచేత విస్తరించబడును, కులము, సంతానము, పుత్రపౌత్రపారంపర్యము, వరుస, విరివి, పుత్రుడు, తనయుడు, వంశము, కుమారుడు.
సంతప్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంతప్యతేస్మ సంతాప్తః. తపింపచేయబడినది, మిక్కిలి తాపమునొందినది.
సంతమసము
సం. నా. వా. అ. న. తత్స. సంతత మవిచ్ఛిన్నంతమః సంతమసం. అంతటా వ్యాపించిన చీకటి. విష్వక్సర్వతః వ్యాప్తంతమః సంతమసం పెనుచీకటి.
సంతానము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్త నోతి వాంఛిత మితి సంతానః. లెస్సగా అభీష్టము నిచ్చునట్టిది. సంతన్యతే సంతానః. విస్తరింపబడునది, బిడ్డ, పుత్రపౌత్ర పారం పర్యము, కులము, ఒక కల్పవృక్షము, సప్తసంతానములు (తటాకము, నిధి, అగ్రహరము, దేవాలయము, వనము, ప్రబంధము, పుత్రుడు). సంతనోతి విస్తారయతి పత్రపుష్పాదీనితి సంతానః. వంశము, విస్తారము.
సంతాపము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్తాపయతీతి సంతాపః. మిక్కిలి తపింపచేయునది, కాక, వేడిమి, తాపము, వ్యాధి.
సంతాపితము
సం. విణ. (అ.ఆ.అ).. తత్స. సంతప్యతే స్మ సంతాపితః. తపింపచేయబడినది, మిక్కిలి తాపము నొందినది, బాధపడువాడు.
సందానము
సం. నా. వా. అ. న. తత్స. సందీయతే బధ్యంతే అనేనేతి సందానం. దీనిచేత కట్టబడును, పశువులను కట్టెడు త్రాడు.
సందానితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సందానంబంధనమస్య సంజాతమితి సందానితం. బంధనముకలది, కట్టబడినది, కూర్చబడినది.
సందావము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రద్రవణం సంద్రావః సందావః. పాఱిపోవుట, యుద్ధమువలన పాఱిపోవుట, పలాయనము.
సందితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సందీయతే బధ్యత ఇతి సంధితం. బంధిపబడినదిగనుక, సందానితము.
సందేశహరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సందేశ హరతీతి సందేశహరః. అనగానోటిమాట, సమాచారమును కొనుచుపోవువాడు, దూత.
సందేహము
సం. నా. వా. అ. పుం. తత్స. సందిహతి సమ్యగ్భధ్నాతీతి సందేహః. రెండర్ధముల యందు సంబంధించిఉండునది, సంశయము, ఒక అర్థాలంకారము, శంక.
సందోహము
సం. నా. వా. అ. పుం. తత్స. సందుహ్యతే ప్రపూర్యత ఇతి సందోహః. మిక్కిలి పూరింపబడునది, సమూహము, గుమి, సముదాయము.
సంద్రావము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రద్రవణం సంద్రావః పారిపోవుట, యుద్ధమువలన పారుట, అపక్రమము, పలాయనము.
సంధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సంధీయతే క్షేత్రద్వయ ప్రాంతావనయేతి సంథా. దీనిచేత క్షేత్రద్వయప్రాంతములు చేర్చబడును, ప్రతిజ్ఞ, మేర, సంధ్య, స్థితి, సంధానము.
సంధానము
సం. నా. వా. అ. న. తత్స. మద్యస్య సంథాసంధానం. మద్యము యొక్క కూర్చుట, కూర్చుట, బాణము వింటినారియందుకూర్చుట, కల్లుతేట, కల్లుసేయుట. సంధీయతే యదితి సంధానం.
సంధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సంధానం సంధిః. కదియుట, కూడిక, శత్రువుతోడిపొందు, (ఇది కోశప్రధానహేతుకము, దండప్రధానహేతుకము, భూమి ప్రధానహేతమము అనిత్రివిధము) (ముఖాది ముఖము, ప్రతిముఖము, గర్భము, విమర్శము, నిష్ఠ అనియివి నాటకమునందలి పంచసంధులు) సందు, సొరంగము, ఆడుగుఱి, ఒకజాడ్యము, ఐక్యము, ఒకటిగా చేయుట, సంఘటనము, సాధనము, పడ్గుణములగు సంధ్యాదులలో ఒకటి, కలయిక, నాటకములో నిముఖాధికము, రంధ్రము, గుదము.
సంధిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గర్భస్సంధీయతే స్యామితి సంధినీ. గర్భము దీనియందు ధరింపబడును, వెదావు, అకాలమున బిదుకని చ్చెడియావు, పొర్లుచున్న ఆవు.
సంధ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమ్యక్ ధ్యాయంత్య స్యామితి సంధ్యా. దీనియందు లెస్సగా ధ్యానము చేయుదురు, పొద్దు పొడుచుటకు ముందు ఐదు గడియల వఱకును, ప్రొద్దుగ్రుంకినవెనుక మూడుగడియల వఱకునుకలకాలము, సంథి, ప్రతిజ్ఞ, మేర నదీవిశేషము, పుష్పవిశేషము, చింత, కాలవిశేషము, సాయంకాలము.
సంపత్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సంపద్యతే జనైరితి సంపత్. జనులచేత పొందపడునది, సంపద సంవృద్ధి, శ్రీ, లక్ష్మి, విభవోత్కర్షము, బుద్ధి, సంపత్తు, భూతి.
సంపత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. సంపద్యతే జనైరిత్ సంపత్. జనులచేత పొందపడునది, ఐశ్వర్యము, గుణోత్కర్షము, హరభేదము.
సంపాకము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ పాకోత్రసంపాకః. మంచిపాకము కలది, రేల, ఆరగ్వధము (వృక్ష విశేషము).
సంపుటము
సం. నా. వా. అ. పుం. తత్స. సంపుట్యతే, సంశ్లిష్యతే పిథానేనేతి సంపుటకః. మూతతో కూడియుండునది, భరణి, ముకుళనము, పెట్టె, ఆధారవిశేషము, సముద్గకము, కురువకపుష్పము, పేట, రతిబంధవిశేషము.
సంపుల్లము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంబాధ్యంతే జనా అత్రేతి సంబాధః. దీనియందు మిక్కిలి జనులు బాధింపబడుదురు, ఇఱుకు, ఆడుగుఱి, చక్కగా విరిసినది.
సంప్రదాయము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ సంరహస్యం ప్రదీయత ఇతి సంప్రదాయః. లెస్సగా శిష్యులకు ఉపదేశింపబడునది, గురుపారం పర్యము. సంప్రదీయతే అనేన పారంపర్యోపదేశః ఇతి సంప్రదాయః.
సంప్రధారణము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సంప్రధార్యతే ఇదమేవ శ్రేయ ఇతి నిశ్చీయతే అనయేతి సంప్రధారణా. ఇదియేశ్రీయస్కరమని దీనిచేత నిశ్చయింపబడును, సమర్ధించుట, సం. నా. వా. అ. న. తత్స. వ్యవహరమునందు నిశ్చయమును పుట్టించునట్టి లిఖతసాక్ష్యాదులు.
సంప్రహారము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ ప్రహరస్త్యస్మిన్నతి సంప్రహరః. దీనియందు శత్రువులను లెస్సగా ప్రహరింతురు, యుద్ధము, గమనము. సమ్యక్ ప్రకారేణ ప్రహ్రియతే అత్రేతి సంప్రహారః. సంగ్రామము, రణము.
సంభేదము
సం. నా. వా. అ. పుం. తత్స. సంభిద్యన్తే సంగచ్ఛన్తేనద్యోద్ర పరస్పరమితి సంభేదః. నదులు దీనియందు పరస్పరము సంగతములౌను, నదీసంగమము వికసించుట, కూడిక, రెండు నదులు కలసి ప్రవహించుట, సంయోగము.
సంభ్రమము
సం. నా. వా. అ. పుం. తత్స. సంభ్రమణం సంభ్రమః. తిరుగుట, వేగిరపాటు, భయము, ఆదరము, దర్పము, మదము, గర్వము, అహంకారము, ఆవేశము, సూత్రము, తొందరపాటు, ఆదరము, భయము.
సంమూర్ఛనము
సం. నా. వా. అ. న. తత్స. సమత్తాన్ముర్చనం వ్యాప్తిః సమూర్చనం. అంతట వ్యాపించుట, మిక్కిలి మూర్చనొందుట.
సంయతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంయమ్యతే స్మసంయతః. కట్టబడువాడు.
సంయత్తు
సం. నా. వా. త్. పుం, స్త్రీ. తత్స. సంయమ్యతే అత్రేతి సంయత్. యుద్ధము, రణము.
సంయమము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగ్యమనం సంయమః. లెస్సగా అన్నిటిని మానియుండుట. హింసాదులవలన విరమించుట, వ్రతాదులకంగమై తొలిదినము చేయబడిన ఆచారము, సంయమనము, నియమము, ధ్యాన, ధారణ, సమాధులు, సహనము.
సంయామము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగ్యమనం సంయామః. పర్యాయములని కొందరు, సంయమముయొక్క రూపాంతరము, సహనము.
సంయుగము
సం. నా. వా. అ. పుం. తత్స. సంగతాయుగా అత్రేతి సంయుగః. పరస్పరము కూడిన రథములయొక్క నొగలుకలది, యుద్ధము, పోరు, సమరము, సంగ్రామము, రణము, పోరు.
సంయోజితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంయుజ్యతే స్మ సంయోజితః. కూర్చబడినది, మఱియొకదానితో కూర్చబడినది.
సంరావము
సం. నా. వా. అ. పుం. తత్స. రౌతీత్యారవః సంరావః. మ్రోత, ధ్వని, మృగధ్వని.
సంలాపము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగాలాపః సంలాపః. మంచిభాషణము, ప్రీతి తోడి పరస్పర సంభాషణము, ఒకరితో ఒకరు పరస్పరము మాట్లాడుకొనుట.
సంవత్సరము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ వసంతి ఋతవోస్మిన్ని తిసంవత్సరః. ఋతువులు దీనియందు వశించును, ఏడాది (ఇవి అఱువది ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ,భావ, యువ, ధాతు, ఈశ్వర, బహుదాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వాధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళింబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్తు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద ,రాక్షస, నళ, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుంధుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ).
సంవననము
సం. నా. వా. అ. న. తత్స. సమ్యగ్వవనం వ్యాపారః సంవనది మంచివ్యాపారము, వశక్రియ, వశీకరణము, సంవదనము, లొంగుట.
సంవర్తము
సం. నా. వా. అ. పుం. తత్స. సంవర్తతే ఉపరమతే జగ దస్మిన్నితి సంవర్తః. దీనియందు జగత్తు ఉపరతమౌను, ప్రళయము, మేఘ విశేషము, తాండ్ర, (వృక్ష విశేషము) ఒకానొకముని, సంహారము, మహాప్రళయము, మేఘము, తాడి, సెనగ.
సంవర్తిక
సం. నా. వా. వా. ఆ. స్త్రీ. తత్స. సంవర్తయతి వేష్టయతీతి సంవర్తికా. తామరదుద్దును చుట్టియుండునది, క్రొత్తతామరపూఱేకు, లేతకలువ ఆకు.
సంవసథము
సం. నా. వా. అ. పుం. తత్స. మర్దో మర్దనం సంవసంత్యత్ర సంవసథః. దీనియందు లెస్సగానుందురు, ఊరు, గ్రామము, వార్త.
సంవాహనము
సం. నా. వా. అ. న. తత్స. సంవాహస్సంవాహనం. పిసుకుట, ఒళ్లుపిసుకుట, చక్కగామోసికొనిపోవుట.
సంవిత్తు
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. సం విద్యతే అనయేతి సంవిత్. దీనిచే లెస్సగా తెలియబడును. సంవిదంత్యనయా చేతి సంవిత్. జ్ఞానము, సంకేతము, ప్రతిజ్ఞ, అంగీకారము, ఆచారము, యుద్ధము, సంభాషణము, నామధేయము, సంతోషపెట్టుట, పేరు, కర్మకారుడు, విజ్ఞానము.
సంవీతము
సం. నా. వా. అ. న. తత్స. సంవియతే స్మ సంవీతం. వలయాకారము కలది, హారమువలె వేసికొన్న జందెము. సం. నా. వా. విణ. తత్స. చుట్టుకొనబడినది, ఆవరింపబడినది.
సంవేగము
సం. నా. వా. అ. పుం. తత్స. సం విజ్యతే అనేనేతి సంవేగః. దీనిచే చలింపబడును, వేగిరపాటు, సంభ్రమము, పొగరు, మదము, దర్పము, గర్వము, అహంకారము, ఆవేశము.
సంవేదము
సం. నా. వా. అ. పుం. తత్స. సంవేదనం సంవేదః. అనుభవించుట, సుఖదుఃఖాదులను తెలిసికొనుట, వాదిప్రతివాదము, పరస్పరప్రాగల్భ్యము.
సంవేశము
సం. నా. వా. అ. పుం. తత్స. సంవిశం తీంద్రియాణ్యత్రేతి సంవేశః. ఇంద్రియములు దీనియందు ప్రవేశించును, పీఠము, నిద్ర, వేగిరపాటు, కలసిపడుకొనుట.
సంవ్యానము
సం. నా. వా. అ. న. తత్స. సంవీయతే అనేనేతి సంవ్యానం. దీనిచేత కప్పబడును, ఉత్తరీయము, వస్త్రము.
సంశప్తకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సంశపతి పలాయనాదితి సంశప్తకాః. జయింపక తిరిగిరానని ఒట్టు పట్టుపెట్టుకొని యుద్ధము చేయువాడు, పంతము పట్టిన యోధుడు.
సంశయము
సం. నా. వా. అ. పుం. తత్స. సంలయము. ఉభయ కోటౌ సంశేత ఇతి సంశయః. ఉభయ కోటియందు ఉండునది. సందేహము, శంక, భ్రాంతి.
సంశ్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. సంశ్రవణం సంశ్రవః. కానిమ్ననుట, అంగీకారము, ప్రతిజ్ఞ.
సంశ్రుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. శ్రుతం సంశ్రూయతే స్మ సంశ్రుతం. అంగీకరింపబడినది.
సంశ్లేషము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ శ్లేషణం సంశ్లేషః. లెస్సగాకూడుట, కౌగిలింత, ఆలింగనము, మేళనము, కలయిక.
సంసత్తు
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. సీదన్త్యస్యాం సంసత్. దీనియందుఉందురు, కొలువుకూటము, సభ, పరిషత్తు, సమాజము.
సంసరణము
సం. నా. వా. అ. న. తత్స. సం హతాస్సరంత్యత్ర సంసరణం. అనేకులు దీనియందు కూడి సంచరింతురు. సంసరం త్యస్మిన్నితి చ సంసరణం. ఎడతెగకఉండునది, సంసారము, బాట, పట్టణమునుండి వెడలుట, గవను, ఇఱుకు లేక దండునడచుట, యుద్ధప్రారంభము, రాజుబాట, సంసారము.
సంసిద్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సమ్యక్ సిద్ధిః సంసిద్ధిః. పదార్ధమును లెస్సగా పొందునది, స్వభావము, చక్కనిసిద్ధి, మత్తురాలు, సాధనము, ప్రకృతి, జయము.
సంస్కృతము
సం. నా. వా. అ. న. తత్స. సమ్యక్రియత ఇతి సంస్కృతం. లెస్సగా చేయబడినది, దేవభాష, సం. విణ. తత్స. అలంకరింపబడినది, వ్యాకరణ శిక్షితమైనది, పక్వము, చేయబడినది, శ్రేష్ఠమైనది, శుభలక్షణముకలది, కృత్రిమము, శుద్ధము చేయబడినది.
సంస్తకము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంసజ్యత ఇతి సంసక్తః. కదియునది, కదిసినది, చేరినది.
సంస్తరము
సం. నా. వా. అ. పుం. తత్స. సంస్తీర్యతే వస్త్రాదికమత్రేతి, సంస్తీర్యంతే దర్భా అత్రేతి చసంస్తరః దీనియందు వస్త్రాదులు, ధర్భలులఱచబడును, చిగుళ్లులోనగు వానిచేత నేర్పఱచబడినపడక, యజ్ఞము, క్రతువు, పత్రశయ్య, రాయి, త్యాగము.
సంస్తవము
సం. నా. వా. అ. పుం. తత్స. సంస్తవనం సంస్తవః. పరిచయము, చక్కనిస్తుతి.
సంస్తావము
సం. నా. వా. అ. పుం. తత్స. సంస్తువం త్యుద్గా త్రాదయ ఇంద్రాదీనత్రేతి సంస్తావః. దీనియందు ఉద్గాత మొదలగునవి. ఇంద్రాదులను స్త్రోత్రము చేయుదురు, యజ్ఞములయందు బ్రాహ్మణులు వేద ఋక్కులు చెప్పెడుచోటు, యాగమున సామగానము చేయుచోటు.
సంస్త్యాయము
సం. నా. వా. అ. పుం. తత్స. సంస్త్యయనం, సంస్త్యాయంత్యస్మిన్నితి చ సంస్త్యాయః. కూడుట, ఇల్లు, సన్నివేశము, విరివి, సమూహము, గృహము, సజ్జనులగుంపు, సంస్థానము, గుంపు.
సంస్థ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సంతిష్ఠతే అనయాసంస్థా. దీనిచేత లోకము లెస్సయైయుండును, ఉనికి, మేర, నాశము, సామ్యము, స్థితి, సాదృశ్యము, అగ్నిష్టోమాదులగు సప్తయాగములు, యుక్తమార్గముననడుచుట, ఏర్పాటు చారుడు, సమాప్తి, ఆకారము, మృత్యువు.
సంస్థానము
సం. నా. వా. అ. న. తత్స. సమ్యక్ తిష్ఠం త్యస్మిన్నితి సంస్థానం. లెస్సగా దీనియందుడుదురు, సన్నివేశము, చతుష్పథము, మృత్యువు, ఆకృతి, ఏర్పరచుట, సమాప్తి, స్థానము, అడ్డుదారి.
సంస్థితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంతిష్ఠతే స్మ సంస్థితః. సంపూర్ణమౌటచే మరణార్థకము, చచ్చినది, చక్కగా ఉండినది, మృతుడు.
సంస్పర్శ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమీచీనః స్పర్శోస్యా అస్తీతి సంస్పర్శా. చల్లనైన స్పర్శముకలది, సం. నా. వా. అ. పుం. తత్స. కోరింద, చక్కని స్పర్శము.
సంస్పోటము
సం. నా. వా. అ. పుం. తత్స. సంస్ఫుటంతి మస్తకాదీన్యత్రేతి సంస్ఫోటః. ఇందుశిరస్సులు మొదలయినవి, వ్రక్కలౌను, యుద్ధము, పోరు, రణము, సంగ్రామము.
సంహతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంహన్యతే సంశ్లిష్యత ఇతి సంహతః. చక్కగా అతకబడినది, చక్కగా చేరినది, దృఢసంయోగము కలది.
సంహతలము
సం. నా. వా. అ. పుం. తత్స. సంహతం సంఘట్టం లాతీతి సంహతలః. సంఘట్టమును పొందునది, మ్రొక్కుటకు వేళ్లుచాచికూర్చిన చేదోయి, అరచేతులను జోడించుట.
సంహతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సంహన్యత ఇతి సంహతిః. పొందబడినది, సమూహము.
సంహననము
సం. నా. వా. అ. న. తత్స. సంహన్యన్తేసంబద్ధ్యన్తే అజ్గాన్యత్రేతి సంహననం. అవయవములు దీనియందు కూడియుండును, శరీరము, మేను, దేహము.
సంహూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సంభూయ హూతిస్సంహూతిః. అనేకులు చేరి పిలుచుట, చేతులు తట్టుట.
సకలము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. కలాభిర్భాగైస్సహవర్తత ఇతి సకలం. భాగములలో కూడుకొన్నది, సర్వము, కలతో కూడినది. కలయా సహ వర్తమానం ఇతి సకలం. సముదాయము, సర్వము, అశేషము, సమస్తము, నిఖిలము, సమగ్రము, అఖిలము, అఖండము, అనంతము.
సకృత్రజము
సం. నా. వా. అ. పుం. తత్స. సకృత్ప్రజా అస్యేతి సకృత్ప్రజః. ఒక్కసారి పిల్లను కనునది, కాకి, వాయసము. సకృత్ ఏకవారమేకా ప్రజా యస్య సః సకృత్ప్రజః. సింహము, అరిష్టము.
సక్తుఫల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సక్తువత్స్వాదూని ఫలాన్య సక్తుఫలా. సక్తువు వలెస్వాద్యువైన ఫలములుకలది, జమ్మి.
సక్థి
సం. నా. వా. ఇ. న. తత్స. సజతే సంగచ్ఛతీతి సక్థి. కూడుకొనియుండునది, తొడ, ఊరువు, ఏనుగు కాలిలో ఒక భాగము, పిక్క.
సఖి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గుణాదినా సమానా ఖ్యాతిరస్యా ఇతి సఖీ. గుణాదులచేత సమానమైన ఖ్యాతి కలది, చెలికత్తె, సం. నా. వా. న్. పుం. తత్స. స్నేహితుడు, సహాయుడు, సహచరి.
సఖీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గుణాదినాసమానాఖ్యాతి రస్యా ఇతి సఖీ. గుణాదులచేత సమానమైన ఖ్యాతికలది, చెలికత్తి, సహచరి, ఆలి, వయస్య, సధ్రీచి.
సఖ్యము
సం. నా. వా. అ. న. తత్స. సఖ్యుః భావః సఖ్యం. సఖుని యొక్క భావము, స్నేహము, చెలిమి. సఖ్యుర్భావః కర్మ వా ఇతి సఖ్యం. మైత్రి, ప్రీతి.
సగర్భ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమానే గర్భేభవ సగర్భ్యః. ఒక గర్భమున పుట్టినవాడు, ఒక తల్లికడుపున పుట్టిన తోబుట్టువు, సోదరుడు.
సగోత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమానం గ్రోతం యేషాంతే సగోత్రః. సమానమైన గోత్రముకలవారు, జ్ఞాతి, దాయ, దూరపుబంధువు.
సగ్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సమానాస్సగ్ధి. సమానమైన భోజనము, భంక్తికుడు, సహభోజనము.
సచివుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సచతి సమవైతీతి సచివః. కూడుకొనియుండువాడు, మంత్రి, స్నేహితుడు, సహయుడు, (శృంగారనాయకునకు సచివులు నలుగురు, పీఠమర్ధుడు, విటుడు, చేటుడు, విదూషకుడు), అమాత్యుడు.
సజ్జ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సజ్జతే స్మ సజ్జః. జోడును పొందినవాడు, కవచము, అలంకరణము.
సజ్జనా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సజ్జ్యతే అనయాసజ్జనా. దీనిచేత నెఱుగబడును, ఆయితము సేయుటకై ఏనుగుమెడను కట్టెడు నిడుత్రాడు. బెత్తముల వారు సందడిలేక తొలగించుట, శిభిర రక్షణము కొఱకు జుట్టు బెట్టిన వెలుగులోనది, రేవు, సం. నా. వా. అ. న. తత్స. గజాలంకారము.
సజ్జనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సంశ్చాసౌజనశ్చ సజ్జనః. మంచిజనుడు, మంచికులమునందుపుట్టినవాడు, కులీనుడు, ఆర్యుడు, సాధువు, రక్షకుడు.
సటా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సటతీతి సటా. సన్యాసుల జడ, జూలు, ఒకసంకరజాతి, వ్రతియొక్కజడ, సటము.
సతతము
సం. నా. వా. అ. న. తత్స. సంతన్యతే నేనేతి సతతం. దీనిచేత విస్తరింపచేయబడుచున్నది, ఎల్లప్పుడు, సం. విణ. తత్స. ఎడతెగనిది, నిత్యము.
సతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దర్శనాదేవ పాపం స్యతీతి సతీ. దర్శన మాత్రముననే పాపమును పోగొట్టునది, పతివ్రత, పార్వతి, సువాసనకల ఒక మన్ను, ఉత్తమురాలు.
సతీనకము
సం. నా. వా. అ. పుం. తత్స. సీదంత్యనేన వాత ప్రకృతయ ఇతి సతీనకః. జనులచేత భక్షింపబడునది, ధాన్యవిశేషము, లంకలు, పటానీ.
సతీర్ధ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పావన హేతుత్వాత్తీర్ధమివ తీర్ధం గురుః సమానే తీర్థే భవావర్తమానాః సతీర్థ్యాః. పావనహేతువైనవాడు, కూడచదువువాడు, సహపాఠి, ఒకే గురువుకలవాడు.
సత్తముడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. అతిశయేన సతాసత్తమః. చాలామంచివాడు, అందరికంటెమంచివాడు, అందరికంటె పూజ్యుడు, శ్రేష్ఠుడు.
సత్త్రము
సం. నా. వా. అ. న. తత్స. సీదం త్యస్మిన్నితి సత్రం. దీనియందు పాపములు మొదలుగునవి నశించును, అన్నదానగృహము యజ్ఞవిశేషము, ఎడతెగనయీవి, అడవి, కపటము, సం. విణ. తత్స. వస్త్రము, ఒకయాగము, శాశ్వతధానము, మంచివారినికాపాడునది.
సత్త్రి
సం. నా. వా. న్. పుం. తత్స. సత్త్రం సదాదానమస్యాస్త్రీతి సత్త్రీ. సదాదానము కలిగినవాడు, ఎడతెగకదానము చేయువాడు.
సత్త్వము
సం. నా. వా. అ. న. తత్స. సతోభావః సత్త్వం. యదార్ధముగా ఎఱుగబడునది, సత్త, దేహబలము, ఒక గుణము, స్వభావము, మనస్సు, ప్రయత్నము, ప్రాణము, పృధివ్యాదిద్రవ్యము పిశాచాది, బుద్ధి, ప్రాణి, బలము, పరాక్రమము, బుద్ద్యవస్థ, ఆస్తి, స్థితి, జీవితము, చైతన్యము, సం. నా. వా. పుం. తత్స. (జంతువు) ఆత్మ, చిత్తము.
సత్పథము
సం. నా. వా. అ. పుం. తత్స. సంశ్చాసౌసంథాశ్చ సత్పథః. మంచిత్రోవ, నక్షత్రమార్గము, సన్మార్గము.
సత్యము
సం. నా. వా. అ. న. విణ. తత్స. సత్సుసాధుఘ భవం సత్యం. మంచి పురుషుల అందుపుట్టినది. సతీసత్పురుషేసాధు సత్యం. నిజము, ఒట్టు, కృతయుగము, శివుని గుణము, ఒక యోగనియమము, యధార్ధము, శాపము, ఒకలోకము.
సత్యాకృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సత్యస్య కరణం సత్యాకృతిః. సత్యమునేయుట, సత్యాంకారము, వినిమయము.
సత్యానృతము
సం. నా. వా. అ. న. తత్స. కిఞ్చత్సత్యం కిఞ్చ దసత్యం చేతి సత్యానృతం. కొంతసత్యము, కొంత అసత్యము కనుక, వర్తకము, వాణిజ్యము.
సత్యాపనము
సం. నా. వా. అ. న. తత్స. సత్యస్యకరణం సత్యాపనం. సత్యాంకారము, వినిమయము.
సత్వరము
సం. నా. వా. అ. న. తత్స. త్వరయాసహ వర్తత ఇతి సత్వరం. త్వరతోకూడినది, త్వరితము, వేగముగా ,వేగముకలది.
సదనము
సం. నా. వా. అ. న. తత్స. సీదం త్యత్రసదనం. దీనియందుందురు, గృహము, జలము, నిలయము.
సదస్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సదసిసాధవః సదస్యాః సభయందుమంచివారు, యజ్ఞవిధి పరీక్షాదికారి, సభికుడు, ఉపద్రష్ట, సభ్యుడు.
సదస్సు
సం. నా. వా. న్. స్త్రీ. తత్స. సీదస్య్తస్యాంసదః. దీనియందుందురు, సభ, రాజసభ. సమాజము, సభ.
సదాగతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సదాగతిః గమనం యస్యసః సదాగతిః. సర్వదాసంచరించువాడు, వాయువు, మోక్షము, సూర్యుడు, సర్వేశ్వరుడు. సదా సర్వదా గతిర్యస్య సః సదాగతిః. ప్రభంజనము, అనిలము, వాయువు, పవనము, సమీరము.
సదాతనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విష్ణువు, సం. విణ. తత్స. శాశ్వతుడు, శాశ్వతము.
సదానీర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సదానీరమస్యామితి సదానీరా. ఎల్లప్పుడూ జలము దీనియందుకలదు, కరతోయ.
సదృక్షము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమాన ఇతి దృశ్యతే సదృక్షః. సరిసమానమైనది, సమము, సమానము.
సదృశము
సం. విణ. (అ.ఈ.అ). తత్స. సమాన ఇతి దృశ్యతే సదృశః. సమానము, తగినది. సమాన ఇవ దృశ్యతే అసౌ ఇతి సదృశః. సమానము.
సదేశము
సం. నా. వా. అ. న. తత్స. సమానో దేశోస్యేతి సదేశః. సమానమైన దేశము కలిగినది, సం. విణ. తత్స. సమీపమైనది, సమీపస్థము.
సద్మము
సం. నా. వా. న్. న. తత్స. సీదంతి తిష్ఠంత్యత్ర సద్మ. దీనియందుందురు, గృహము, జలము. సీదంత్యత్రేతి సద్మ. గృహము, భవనము, ఆలయము, ఇల్లు.
సద్ర్యంచుడు
సం. విణ. (చ్. ఈ. చ్). తత్స. సమాన ఇతి దృశ్యతే సదృకంచః. సమానమని చూపబడునది, కూడ వెళ్లువాడు, అనుచరుడు.
సనత్కుమారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సనత్ సనాతనో బ్రహ్మతస్యకుమారః సనత్కమారః. బ్రహ్మకుమారుడు, వైద్యశాస్త్రకర్తయగు దేవర్షి, ఒకముని.
సనాతనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సదాభవః సదాతనః సనాతనశ్చ. ఎప్పుడును కలిగిఉండునది,బ్రహ్మ, విష్ణువు, శివుడు, సం. విణ. తత్స. శాశ్వతుడు.
సనాభి
సం. నా. వా. ఇ. విణ. పుం. తత్స. సమానో నాభిర్గోత్రమస్యేతి సనాభిః. జ్ఞాతి, సమానుడు, ఆత్మీయుడు, స్వజనుడు, బంధువు, ఆత్మ, బాంధవుడు, ఒకే గోత్రముకు చెందినవాడు, తుల్యము, స్నేహయుక్తము.
సని
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సన్యతేస్మిన్నితి సనిః. దీనిచేత ఇయ్యబడును, అథ్యేషణ, యాచన, ప్రార్థన.
సనీడము
సం. నా. వా. అ. న. తత్స. సమానం నీడమస్యేతి సనీడః. సమానమైన ఉనికి పట్టుకలిగినది, సమీపము సం. నా. వా. విణ. తత్స. నీడముతోకూడినది. నీడస్య వాసస్థానస్య సమీపమితి సనీడః. నికటము.
సన్నకద్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సన్నకః ద్రుస్స్కంధోస్య సన్నకద్రుః. పలుచనైన కొమ్మలు కలది, మోరటి, చెట్టు.
సన్నద్ధుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సన్నహ్యతే స్మ సన్నద్ధః. జోడుచేత బంధింపబడినవాడు, కవచము తొడిగినవాడు, ప్రయత్న పడినవాడు, యుద్ధసన్నద్ధుడు.
సన్నయము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ నీయత ఇతి సన్నయః. లెస్సగా కొని పోబడినది, వెనుకనున్నదండు, సమవాయము, సమూహము, గుంపు, వెనకునున్నసైన్యము.
సన్నికర్షణము
సం. నా. వా. అ. న. తత్స. సం నికర్షస్సన్ని కర్షణం. దగ్గరౌట, సమీపించుట, సమీపము, సన్నిధానము, ఆసన్నము, సన్నిధి.
సన్నికృష్ణము
సం. నా. వా. అ. న. తత్స. సంని కృష్యత ఇతి సంనికృష్టః. మిగులనొరయబడునది, సమీపము, సం. నా. వా. విణ. తత్స. సమీపంచినది, దగ్గరది.
సన్నిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సంనిధానం సన్నిధిః. దగ్గరౌట, సమీపము, చేరువ, సమీపము, నికటము, కానవచ్చుట, సామీప్యము.
సన్నివేశము
సం. నా. వా. అ. పుం. తత్స. సమంతాన్నివిశంత్యత్ర సన్నివేశః. అంతట సంచారార్ధమై దీనియందు ప్రవేశింతురు. పట్టణములోనగువాని చుట్టువారినబయట, గృహద్యపరభాగము. సంనివిశంతే అత్రేతి సన్నివేశః. సంస్థానము.
సపత్నుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమాన పతిత్వాద్వాస పత్నః. సమానపతీత్వముకలవాడు, పగవాడు, శత్రువు. సహ పతతి ఏకార్థే ఇతి సపత్నః. విరోధి.
సపర్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పూజ, సమస్య.
సపిండుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమానః ఏకః పిండః పిండప్రధానమేషామితి సపిండాః. సమానమైన పిండ ప్రధానముకలవారు, ఏడుతరములలోపలిజ్ఞాతి. సమానః పిండో మూలపురుషో నివాపో వా యస్య సః సపిండః. ఆత్మీయుడు, దాయాదులు.
సపీతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సమానాపీతిః పానం సపీతిః. కూడి పానము చేయుట, పదిమందిచేఱి ఒకటిగా త్రాగుట సహపానము, కలసిత్రాగుట.
సప్తకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సపతి సమవైతి కట్యామితి సప్తకీ. మొలయందు కూడియుండునది, ఏడుపేటలు గల ఆడుదాని మొలనూలు. సప్తభిః స్వరైరివ కాయతి శబ్దాయతే ఇతి సప్తకీ, స్త్రీనడుము.
సప్తతంతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సప్త భిశ్చం దోభిస్తన్యత ఇతి సప్తతంతుః. ఏడుఛందస్సులచేత విస్తరింపబడునది, యజ్ఞము, జన్నము. సప్తభిర్భూరాదిభిర్మహావ్యాహ్రతిభిరగ్నిజిహ్వాభిర్వా తన్యతే ఇతి సప్తతంతుః. యాగము, క్రతువు.
సప్తపర్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. ప్రతి పర్వ సప్త పర్ణాని యస్య సః సప్త పర్ణః. కనుపు కనుపున ఏడేసి ఆకులుకలది, ఏడాకులరటి, ఏడాకులపొన్న.
సప్తల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సపతి స్వావయవేఘ సమేతా సప్తలా. దట్టమై కూడుకొనియుండునది, విరజాజి, కలిగొట్టు, గురిజ, సంబరేను. సప్త పత్రాణి మనోబుద్ధీంద్రియాణి వా లాతీతి సప్తలా. నవమల్లిక, దొంతరమల్లె.
సప్తార్చి
సం. నా. వా. స్. పుం. తత్స. సప్త అర్చీంషీకాళీ, కరాళీ, మనోజవా, ధూమవర్ణా స్ఫులింగినీ, విశ్వపదాదినామ్న్యాః జిహ్వరూపాః జ్విలాయస్యసః సప్తార్చిః. జిహ్వరూపములైన కాళి, కరాళి మొదలగునవి. ఏడుజ్వాలలుకలవాడు అగ్ని, క్రూరదృష్టికలవాడు. వహ్ని, అనలము.
సప్తాశ్వడు
సం. నా. వా. అ. పుం. తత్స. సప్త అశ్యాః యస్యసః సప్సాశ్యః. ఏడుగుఱ్ఱములుకలవాడు, సూర్యుడు.
సప్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సపతి సేవాధి ధర్మేణ సప్తిః. సేవాది ధర్మములతో కూడినది, గుఱ్ఱము, అశ్వము, హయము, దంఘర్వము, తురగము.
సబ్రహ్మచారి
సం. నా. వా. న్. పుం. తత్స. ఏకం సమానం బ్రహ్మవ్రతం చరం తీతి స బ్రహ్మచారిణః. సమానమయిన వేదాధ్యయనవ్రతము ఆచరించువారు. వేదాధ్యయనమునందు సహపాఠి, సహపాఠి, సహాధ్యాయి.
సభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమ్యగ్భాతీతి సభా లెస్సగా ఒప్పునది. సహభాన్తి అత్రేతి సభా. కూడుకొని దీనియందు ప్రకాశింతురు. సహభాంత్యస్వామితి సభా. కొలువుకూటము, గృహము, సమూహము, జూదము. సహ భాంతి శోభంతే యత్రేతి సభా. సమితి, పరిషత్తు, ఆట, సమాజము, ఇల్లు, సభ్యుడు.
సభర్తృకః
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. భర్త్రా సహితా సభర్తృకా. బ్రతికియుండు పెనిమిటి కలది, మగనాలు, పతిపత్ని.
సభసదుడు
సం. నా. వా. ద్. పుం. తత్స. సభాయాం సీదస్తీతి సభాసదః. సభయందుండువారు, సభయందుండు ధర్మజ్ఞుడు, సభ్యుడు.
సభాజనము
సం. నా. వా. అ. న. తత్స. సభాజః సభాజనం. సంతోషపెట్టుట, చుట్టములలోనగువారిని ఆలింగనాదులచేత సంతోషపఱచుట, యాత్రాదులయందు బంధువులులోనగువారి యనుజ్ఞవడయుట, మైత్రి, సఖ్యత, మర్యాద.
సభాస్తారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సభాం స్తృణన్తి ఆచ్ఛాదయన్తీతి సభాస్తారః. సభయందుండువారు, సభ్యుడు.
సభికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సభాఏషామస్తీతి సభికాః. సభకలవారు, జూదమాడించువాడు, న్యాయవాది. సభా ద్యూతసభా ఆశ్రయత్వేనాస్త్యస్యేతి సభికః.
సభ్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సభాయాం సాధుః సభ్యః. సభయందుమంచివాడు. సభాయాం సాధవః సభ్యాః. సభయందుండువాడు, మంచివాడు.
సమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమయంతి జనానితి సమాః సంవత్సరము, నాలుగు అంగుళములు, పది బారువులు, పదిసమకములు, అంతయు సమానము, మంచి, అంతా, సమానమని చూపబడునది. సమతి న్యూనత్వంన ప్రాప్నోతీతిసమం. విరుద్ధలక్షణ చేత వైక్లబ్యము లేనిదనుట సం. నా. వా. విణ. తత్స. సమ్యతే స్థూయత ఇతి సమః. కొనియాడబడునది, సమానము, సమస్తము, సాధువు.
సమంగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమంతాదజ్గతీతి సమంగా. అంతటావ్యాపించునది, మంజిటి, ముడుగు, తామర. (వృక్ష విశేషము), ఒక ఆట. సంకుచితాని పత్రరూపాణ్యంగాన్యస్యా ఇతి సమంగా సంకుచితములైన పత్రములుకలది.
సమంజసము
సం. నా. వా. అ. న. తత్స. సంగత మంజః సమంజసం. సత్యము దీనియందు కూడి ఉండును, న్యాయము, యోగ్యత, సం. విణ. తత్స. న్యాయముతోకూడినది.
సమంతదుగ్ధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమంతాద్దుగ్ధం క్షీర మస్యా ఇతి సమంతదుగ్ధా. అంతటపాలు కలది, జెముడు (వృక్ష విశేషము).
సమంతభద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమంతతః పుణ్య సంభారాత్ జ్ఞానసంభారాచ్చ భధ్రః శ్రేష్ఠుః ఇతి సమంత భద్రః. బుద్ధదేవుడు.
సమగ్రము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంగత మగ్రేణేతి సమగ్రం. అగ్రముతో కూడుకొన్నది, సమస్తము. సమం సమకాలమేవ గృహ్ణాతీతి సమగ్రః. సకలము, సర్వము, విశ్వము, సంపూర్ణము.
సమజము
సం. నా. వా. అ. న. తత్స అడవి, సంఘము. సం. నా. వా. అ. పుం. తత్స. సమజంత్యత్ర సమజః. దీనియందు పశువులు కలుసుకొనును, పశుసమూహము.
సమజ్ఞా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమ్యక్ జ్ఞాయతే పురుషోనయేతి సమజ్ఞా. దీనిచేత పురుషుడు లెస్సగా ఎఱుగబడును, యశము, కీర్తి.
సమజ్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమజన్తి మిళన్త్యత్ర సమజ్యా. దీనియందు లెస్సగా కూడుదురు, సభ, కీర్తి.
సమధికము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమ్యగధిక స్సమధికః. మిక్కిలి అధికమైనది. ఇది. ఇతి సమ్ అను ఉపసర్గతోకూడినరూపము. ఇట్లు ఉపసర్గముతో కూడిన పదములు కొన్నిమాత్రము వ్రాయబడునుగాని, అని వ్రాయబడవు. వ్రాయబడనిని కొన్ని దిగువ వ్రాయబడుచున్నవి. అవి. సమారూఢము, సమాలోకించు, సమావృతము, సమాశ్రయము, సమాశ్రితము, సమాసాదనము, సమాసాదితము, సమాసాద్యము, సముచితము, సముత్థితము, సముత్పన్నము, సముత్సకము, సముదితము, సముద్గమము, సముద్గీర్ణము, సముద్ధతము, సముద్ధరణము, సముడృతము, సముద్భవించు, సముద్భూతము, సముద్వృత్తము, సమున్నతము ఇత్యాదులు, అతిశయము.
సమయము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగయతే సమయః. లెస్సగా ఎఱుగబడినది. సమ్యక్ ఈయతే అనేనేతి సమయః. ఎఱుగబడునుకనుక, ఆచారము, కాలము, సిద్ధాంతము, బుద్ధి, సంకేతము, ప్రతిజ్ఞ, ఆజ్ఞ, ఆన, రాద్ధాంతము, శపథము, పని చేయువాడు, చిహ్నము, సచ్చరితలు, సిద్దాంన్తంతరము.
సమరము
సం. నా. వా. అ. పుం. తత్స. మరేణ సహవర్తత ఇతి సమరః. మరణముతో కూడినది, యుద్ధము, పోరు. సమ్యగ్ అరణం ప్రాపణమితి సమరః. సంగ్రామము, రణము, వట్టివేరు, వాత్యాల వృక్షము.
సమర్ధకుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమ్యగర్ధయతి వర్ధయస్యభీష్ట దాననేతి సమర్ధః. అభీష్టము నిచ్చి వర్ధిల్లచేయువాడు, వరమునిచ్చువాడు, గట్టివాడు, నేర్పరి.
సమర్ధనము
సం. నా. వా. అ. న. తత్స. సంప్రధార్యతే ఇదమేవ శ్రేయ ఇతి నిశ్చీయతే అనయేతి సమవర్ధనం. యుక్తాయుక్తముల యందునిదియుక్తమనిసమర్ధించుట. పట్టినది తగినట్టు నెఱవేర్చుట, సమర్ధించుట.
సమర్ధము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమర్ధయతే సమర్థః సమర్థించువాడు, అన్వయయోగ్యమైన యుద్ధముకలది, సితమయినది, అంగీకారము, సమర్ధుడు, కలసినవాడు.
సమర్యాదము
సం. నా. వా. విణ. తత్స. సమానా మర్యాదాస్యేతి సమర్యాదః. సమానమైన మర్యాద కలది, సం. నా. వా. అ. న. తత్స. సమీపము, మర్యాదతో కూడినది.
సమవర్తి
సం. నా. వా. న్. పుం. తత్స. సమం వర్తితుం శీలమస్యేతి సమవర్తీ. అందరియందు పక్షపాతము లేక సమముగా వర్తించు స్వభావముకలవాడు, యముడు, సం. నా. వా. విణ. తత్స. అంతటసమముగా వర్తించువాడు. హరి.
సమవాయము
సం. నా. వా. అ. పుం. తత్స. సమవయంతి ప్రాప్నుదంత్యత్రేతి సమవాయః. దీనిని పొందుదురు, సమూహము, కూడిన సంబంధము, గుంపు.
సమష్టిల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమ్య గష్టిలా బీజాని యస్యాః సమష్ఠిలా. మంచి విత్తులుకలది, ఏఱువంగ, తురుజ, (వృక్ష విశేషము)
సమసనము
సం. నా. వా. అ. న. తత్స. సంక్షేపః సమాసః సమసనం సంక్షేపించుట, సంక్షేపము.
సమస్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమస్యతే ఏకీక్రియత ఇతి సమస్తం. ఒకటిగా కూర్చబడునది, సర్వము, అంతయు, సంపూర్ణము, నిఖిలము, అఖిలము, విశ్వము.
సమస్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమస్యతే సంక్షిప్యతే అనయేతి సమస్యా. దీనిచేత సంక్షేపింపబడును, కైపదము, పూరించుటకు ఇచ్చిన శ్లోకపాదము.
సమా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమయంతి జనానితి సమాః. జనులను విహ్వలత్వమును పొందించునవి. సహమాంతి వర్తంతే ఋతవో అత్ర సమాః. సంవత్సరము, వత్సరము, హాయనము, అబ్దికము, శరత్తు, వర్షము. సం. విణ. తత్స. సమానము, సమస్తము, సాధువు, నాలుగు అంగుళములు, పదిబారువులు, పదిసమకములు, అంతము, మంచి.
సమాంసమీన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమాయాం సమాయాం విజాయత తీతి సమాంసమీనా. ఏటేటను ఈనునది. ఆవు.
సమాకర్షి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. సమ్యగా కర్షతి చిత్తమితి సమాకర్షీ. లెస్సగా మనస్సును ఆకర్షించునది, దూరము వ్యాపించునట్టిది (పరిమళము).
సమాఘాతము
సం. నా. వా. అ. పుం. తత్స. సమాఘ్నన్త్యత్రేతి సమాఘాతః. దీనియందు హింసింతురు, యుద్ధము, పోరు, సమరము, రణము.
సమాజము
సం. నా. వా. అ. పుం. తత్స. సమజంత్యత్ర సమాజః. దీనియందు కూడుదురు. పశువులకంటె ఇతరమైన మనుష్యాది సమూహము, ఏనుగు, సంఘము.
సమాధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సమ్యగా ధీయతే అనేనేతి సమాధిః. లెస్సగా పోషించబడును, మనోలయము, (ఇది యోగాష్టాంగములలో ఒకటి) ఒక అర్ధాలంకారము, కావ్యగుణములలో ఒకటి, సమర్ధనము, నియమము, అర్థోత్కర్షహేతు జనాదరము. సమాధీయతే అస్మిన్ మనో జనైరితి సమాధిః. సమాధానము, నియమము, ఒక యోగాంగము, ఒక ఆట, ధ్యాన నిష్ఠ, కొనుగోరు దారులపోటి, శపథము, నిర్ణయము.
సమానము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగనం త్యనేన సమానః. దీనిచేత లెస్సగా బ్రతుకుదురు. సదృశం మానమస్యేతి సమానః. సమానమైన కొలతలు కలది. సహమానేన వర్తత ఇతి సమానః. పూజతోడను, కొలది తోడను కూడినది. నాభి అందలివాయువు. సం. నా. వా. విణ. తత్స. తుల్యము, ఒకటి, సాధువు, సదృశము, ఒక వాయువు, ఒకటి మంచిది.
సమానోదర్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమానే ఉదరేశయితః సమానోదర్యః ఒక గర్భమందున్నవాడు, ఒక తల్లికడుపున పుట్టిన తోబుట్టువు, సహోదరుడు, సోదరుడు.
సమాలంభము
సం. నా. వా. అ. పుం. తత్స. సమాలంభనం సమాలంభః. నలుగు పెట్టుట, చందనములోనగువాని పూత, సువాసన ద్రవ్యములు పూయుట.
సమావృత్తుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గురుకులాద్గృహం ప్రతి సమావర్తతే స్మసమావృత్తః. గురుగృహమునుండి తన గృహమునుగూర్చి మరల వచ్చువాడు, వేద అధ్యయనం అనంతరం ఇక గృహస్థుడవు కమ్మని గురువుచే అనుజ్ఞపొందినవాడు.
సమాసార్థా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సమస్యః అర్థోస్యాం సమాసార్థా. సంక్షేపింపబడిన అర్ధము దీనియందుకలదు, సమస్య.
సమాహరము
సం. నా. వా. అ. పుం. తత్స. సమాహరణం సమాహరః. చెదరిన వస్తువులనొక దిక్కున కూర్చుట, సంక్షేపము, సమూహము, సంక్షిప్తసంజ్ఞకూడుట.
సమాహితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమాధీయతే స్మ సమాహితం. అంగీకరింపబడినది, చక్కగా ఉంచబడినవాడు, సమాధియందున్నవాడు, నిర్ధోష వర్ణములు కలగీతి, కఠోరము.
సమాహృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సమాహ్రియతే అర్ధోనయేతి సమాహృతిః. సంగ్రహించివ్రాసిన అనేక గ్రంధములసారాంశము, సంక్షేపము, సంక్షిప్తగ్రంథము.
సమాహ్వయము
సం. నా. వా. అ. పుం. తత్స. సమాహూయంతే స్పర్ధయాజనా అత్రేతి సమాహ్వయః. స్పర్థచేత జనులు దీనియందు పిలువబడుదురు, నామధేయము, ప్రాణిద్యూతము, యుద్ధము, సంగ్రామము, సంజ్ఞ, కోడి పందెము మున్నగును పేరు.
సమితి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సంయన్తి మిళన్త్య స్యామితి సమితిః. దీనియందు లెస్సగా పొందియుందురు. సమియన్తే సంగచ్ఛంతేత్రేతి సమితిః. ఇందు పరస్పరము కదియుదురు. సంభూయ ఇంయతి గచ్ఛం త్యత్రేతి సమితిః. సమూహము, యుద్ధము, సంగమము, సభాస్థలము, సభ, సమావేశము.
సమిత్తు
సం. నా. వా. ధ్. స్త్రీ. తత్స. సం యతన్తే అత్రేతి సంయత్, ప్రయత్నము, యుద్ధము, పోరు. సమియన్తే సంగచ్ఛంతేత్రేతి సమిత్తుః. పరస్పరము కదులుదురు, సమిధ, ఇంధనము, ఏధము, ఇధ్మము, సమింధనము.
సమిధ
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. సమిధ్యతే అగ్నిరనయేతి సమిధః. దీనిచేత అగ్ని మిక్కిలి ప్రకాశించును, చిదుగు, వంటచెఱకు, యుద్ధము.
సమీకము
సం. నా. వా. అ. న. తత్స. సమీయంతే సంగచ్ఛంతే స్మిన్నితి సమీకం. పరస్పరము దీనియందు కదియుదురు, యుద్ధము, పోరు, రణము, సంగ్రామము, చల్లదనము, జత, సముద్రము.
సమీపము
సం. నా. వా. విణ. తత్స. సంగతా ఆపోస్మిన్నితి సమీపః. సంగతమైన జలమునుకలది, చేరువైనది. సం. నా. వా. అ. న. తత్స. చేరువ, దగ్గర.
సమీరణము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ ఈరితుంగంతు శీలమస్యసమీరణః. లెస్సగా సంచరించు స్వభావము కలవాడు. సమీరయత్వామోదం సమీరణః. పరిమళము నంతట ప్రేరేపించునది, (చక్కగా పోవుట, పాఱవేయుట) మరువము, (వృక్ష విశేషము) వాయువు, బాటసారి, అనిలము, గాలి, తులసి. సం. నా. వా. న. పుం. తత్స.
సమీరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యక్ ఈరతి గచ్ఛతీతి సమీరః. లెస్సగాసంచరించువాడు, వాయువు, అనిలుడు, గాలి, పవనము.
సముచ్ఛయము
సం. నా. వా. అ. పుం. తత్స. సముచ్ఛయనం సముచ్ఛయః. చెదరిన వస్తువులను ఒకటిగా ప్రోగుచేయుట, ఒక అర్థాలంకారము, ఆరోహము, సమావేశము.
సముచ్ఛ్రయము
సం. నా. వా. అ. పుం. తత్స. సముల్లంఘ్య శ్రయణం, ఊర్ధ్వ శ్రయణం చ సముచ్ఛ్రయః. ఉల్లంఘించి ఆశ్రయించుటయు, మిక్కిలి పొడుగు, విరోధము, ఊర్ధ్వముగా ఆశ్రయించుటయు, ఏవగింపు, ఎత్తు.
సముజ్జితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సముజ్ఘ్యతే స్మసముజ్జితం. విడువబడినది.
సముత్పింజము
సం. నా. వా. అ. పుం. తత్స. సముత్పింజతే భృశం సముత్పింజః. మిక్కిలి పీడింప పడునది, మిక్కిలి కలత పారిన సేన లోనగునది, పింజలము, భ్రాంతుడు.
సముదయము
సం. నా. వా. అ. పుం. తత్స. సముద్యంత్యత్ర సముదయః. లెస్సగా దీనియందు పొందుదురు, చక్కని ఉదయము, సమూహము, యుద్ధము, సంగ్రామము, రణము, గుంపు.
సముదాయము
సం. నా. వా. అ. పుం. తత్స. సముదయంత్యత్ర సముదాయః, లెస్సగా దీనియందు కనిపింతురు. సముదాయన్తే మిళన్త్యత్రేతి సముదాయః. దీనియందు కదియుదురు, సమూహము, యుద్ధము, గుంపు.
సముద్గకము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగుద్గచ్ఛ తీతి సముద్గకవిః. లెస్సగా ఉన్నతత్వమును పొందునది, భరణి, సంపుటము, పెట్టె.
సముద్దతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సముద్ధన్యతే సర్వైస్తాడ్యత ఇతి సముద్ధతః. అందరిచేత కొట్టబడువాడు, గురువుచే శిక్షింపబడనివాడు, పొగరుబోతు.
సముద్రము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యగునక్తి చంద్రోదయాదితీ సముద్రః. చంద్రోదయము వలన మిక్కిలి క్లేదమును పొందునది, సాగరము, కడలి, (సప్తసముద్రములు- లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, సర్పిస్సముద్రము, దధిసముద్రము, క్షీరసముద్రము, జలసముద్రము). చంద్రోదయాద్ ఆపః సమ్యగుదంతి క్లిద్యంతి అత్రేతి సముద్రః. సాగరము, రత్నాకరము, వారిధి, పయోధి, సంద్రము, ఒక సంఖ్య.
సముద్రాంత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దీర్ఘమూలతయా అనంతా, సముద్రాన్తాచ. నిడుపులైన వ్రేళ్లుకలది, తీటకసింద, పిక్క, పత్తిచెట్టు, (వృక్ష విశేషము). దూర ప్రసరాస్సముద్రాంతా. దవ్వుగా పోవునది, యవాసవృక్షము.
సముద్రియము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సముద్రే భవం సముద్రియం. సముద్రమునందు పుట్టినది, సముద్రముది.
సమున్నద్దుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. సమున్నహ్యత ఇతి సమున్నద్ధః. గర్వించువాడు, చదువకుండా తనని చదువుకున్నవాడుగా ఎంచుకొనువాడు, పండితమణ్యుడు.
సమున్నద్దుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమున్నహ్యత ఇతి సమున్నద్ధః. గర్వించువాడు, చదువని తన్నుచదువరిగా నెంచుకొను వాడు, పుట్టినవాడు, ప్రభువు, పండితమ్మన్యుడు, గర్వి.
సమున్నము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. తిమష్టిమ ఆర్ధ్రీభావే సమ్యక్ ఉనక్తేతి సమున్నం. తడిసినది, ఆర్ధ్రము.
సమూరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చమ్యతే చమూరుః. భక్షింపబడునది, తెల్లనిజూలును లావుమెడయును, మెఱుగెర్కెన నున్ననివెండ్రు కలును కలిగి గోధుమ వర్ణముగానైనను, కృష్ణవర్ణముగా నైనను ఉండెడు మృగ విశేషము. (ధీని తోలును జనులు ఉపయోగపఱచుకొందురు), ఒక జింక.
సమూహము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్య గుహ్యతే ఏకత్రేతి సమూహః ఒకదిక్కున అన్నియు లెస్సగా ఊహింపబడును, గుంపు, గుమి, సందోహము, అనేకము, వ్యూహము, మండలము, ప్రకరము.
సమూహ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. సమూహ్యతే సమూహ్యః. సమముగా ఊహింపతగినది, యాగాన్ని అందుపయోగింపదగినవేరు, ఉపచాయ్యము.
సమృద్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సమర్ధనం సమృద్ధిః ఎక్కువౌట, మిక్కిలి సంపద, నింపు, మృత సంజీవని.
సమృద్ధుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సమ్యక్ బుద్ధిర్యస్యేతి సముద్ధః. మంచిసంపదకలవాడు, మిక్కిలి సంపదకలవాడు, నింపుకలవాడు, ధనవంతుడు, ఈశ్వరుడు, అభ్యున్నతి పొందినవాడు.
సమ్మదము
సం. నా. వా. అ. పుం. తత్స. సమ్యజ్మదః సమ్మదః. మంచి సంతోషము, సంతసము.
సమ్మార్జని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సమృజ్యతే అనయేతి సమ్మార్జనీ. దీనిచేత లెస్సగా స్థలము శుద్ధిచేయబడును, చీపురుకట్ట, శోదని. సమృజ్యతే సంశుద్ధ్యతే అనయేతి సమ్మార్జనీ. ఊహని, సమూహని, బహుకరి, వర్ధని.
సమ్మూర్ఛనము
సం. నా. వా. అ. న. తత్స. సమన్మూర్ఛనం వ్యాప్తిః సంమూర్చనం. అంతటవ్యాపించుట, మిక్కిలి మూర్చనొందుట.
సమ్మృష్ణము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంమృజ్యత ఇతి సంమృష్టం. శోధింపబడినది.
సమ్రాట్టు
సం. నా. వా. జ్. పుం. తత్స. ప్రేత్యదే వేఘ ఇహచ అతి విలక్షణతయా రాజసుమధ్యే సమ్యక్ రాజత ఇతి సమ్రాట్. స్వర్గస్థుడై దేవతలయందు, భూమ్మీద రాజుల అందును లెస్సగా ప్రకాశించువాడు, తన ఆజ్ఞచే రాజులను శిక్షించి రాజసూయ యాగముచేసిన మండలేశ్వరుడు, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, సూర్యుడు, మండలాధిపతి, చక్రవర్తి, సార్వభౌముడు.
సరకము
సం. నా. వా. అ. పుం. తత్స. సరతి మద్యమత్రేతి సరకః. దీనియందు మద్యము పొందియుండును, కల్లు, కల్లుత్రాగుట. సం. నా. వా. అ. న. తత్స. సరోవరము, ఆకాశము, పానపాత్రము, రత్నము, మద్యము.
సరఘ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సరం తీతిసరాః స్వవిషయం ప్రాప్తాః తానహంతీతి సరఘా. తనను గూర్చి వచ్చిన వారిని హింసించునది, మధుమక్షిక, తేనెటీగ.సరం మధు విశేషం హంతీతి సరఘా.
సరటము
సం. నా. వా. అ. పుం. తత్స. సరతీతి సరటః. చరించునది, తొండ, కృకలాసము.
సరణి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సరంత్యనే నసృతిః సరదిణిః. సంచరింతురు, త్రోవ, వరుస, పంక్తి, కాలువ.
సరమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సరతిశ్వశ్యం ప్రతీతి సరమా. మగకుక్కను కూర్చిపోవునది, ఆడుకుక్క, విభీషణునిపెండ్లాము, వేలుపుకుక్క, శునకము.
సరళద్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. సరళ వృక్షస్యద్రవోనిర్యాసః సరళద్రవః. సరళ వృక్షము యొక్క బంక, వృక్ష ధూపము, గుగ్గిలము.
సరళము
సం. నా. వా. అ. పుం. తత్స. సరతి విస్తారం ప్రాప్నోతీతి సరళః. విస్తారమును పొందునది. సరతి పరేచ్ఛామను సరతీతి సరళః. పరహృదయమును అనుసరించువాడు, గకారాది వర్గతృతీయవర్ణము, ఒకానొక చెట్టు, (సరళ వృక్షము), పీతద్రువు, మనోజ్ఞము, స్నిగ్ధము, మరీచపత్రము. సం. విణ. తత్స. ఔదార్యముకలది, వంకరకానిది, అవక్రము, ఋజువు, దక్షిణము, ఉదారము.
సరళా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సరతీతి సరళా. వెళ్లునది, తెల్లతెగడ (వృక్ష విశేషము).
సరసీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సరతి ప్రవహ తీతిసరసి. ప్రవహించునది, సరస్సు, కొలను, గుంట, సరోవరము, చెఱువు.
సరసీరుహము
సం. నా. వా. అ. న. తత్స. సరస్యాం రోహతీతి సరసీరుహం కొలనుయందుమొలచునది, పద్మము, కమలము, తామర.
సరస్వంతము
సం. నా. వా. త్. పుం. తత్స. సరోనీరే తటాకే చేతిరుద్రః తద్యోగాత్సరసాత్. సరస్సనగా ఉదకము కలిగినది, సముద్రము, ఒకానొకపదము. సరోస్యాస్తీతి సరస్వాన్. సరస్సు కలిగినది. సరో నీరమస్త్యస్యేతి సరస్వాన్. రత్నాకరము, ఉదధి, నదము, సముద్రము, ఒకా నొకపదము.
సరస్వతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతిః. బ్రహ్మలోకమందు బ్రహ్మసరస్సునాశ్రయించి నదిరూపముగా ప్రవహించునది. సరాంసి అస్యాం సన్తీతి సరస్వతీ. సరస్సులు దీనియందుగలవు, పలుకుజెవి, పలుకు, నది, నదీవిశేషము, ఆవు, స్త్రీలలో శ్రేష్ఠురాలు, మనువుపెండ్లాము, బ్రహ్మభార్య, భూమి, మత్య్సాక్షితీగ, మాట, గంగ.
సరస్సు
సం. నా. వా. స్. న. తత్స. సరతి ప్రవహతీతి సరః. ప్రవహించునది, కొలను, జలము, చెరువు, నీరు మొదలుగునవి, సరోవరము, తటాకము, నీరము.
సరిత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. సరతీతి సరిత్. ప్రవహించునది. కృష్ణ, వేణి, గోదావరి, సరయువు మొదలగునవి. సరిస్తులనబడును, నది, తటిని, ధుని, ఏఱు, సూత్రము.
సరిత్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సరితాంపతిః సరిత్పతిః. నదులకు ప్రభువు, సముద్రుడు, ఏటిఱేడు, సాగరుడు.
సరీసృపము
సం. నా. వా. అ. పుం. తత్స. కుటిలం సర్పతీతి సరీసృపః. కుటిలముగా పోవునది, పాము, సర్పము.
సర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. సృజ్యత ఇతి సర్గః. సృజింపబడునది, అధ్యయము, విసర్జనము, నిశ్చయము, ఉత్సాహము, మోహము, స్వభావము, సృష్టి, (ఇదినవవిధము, మహత్సర్గము, అహంకారసర్గము, భూతసర్గము, ఇంద్రియసర్గము, దేవసర్గము (ఇది అష్టవిధము) తమస్సర్గము (ఇవి ఆరుప్రాకృతములు) వనస్పత్యాది సర్గము (ఇతి షడ్విదము) తిర్యక్సద్గము (ఇది అష్టా వింశధము) మనుష్యసర్గము (ఇవి మూడు వైకృతములు) కుమారసర్గం బనిఒకటి కలదు, అది తదంతర్భూతంబ, భిన్నంబుగా గైకొన్నయెడ దశవిభసర్గంబు, పురాణ లక్షణములలో ఒకటి, కావ్యభాగము, స్వభావము, సృష్టి, ప్రయత్నము, నిశ్చయము.
సర్జకము
సం. నా. వా. అ. పుం. తత్స. సృజతి నిర్యాసం సర్జకః. బంకనుపుట్టించునది, జీవకమను గంధద్రవ్యము, వేగిస, పాలు తోడుకొనుట, (వృక్ష విశేషము).
సర్జము
సం. నా. వా. అ. పుం. తత్స. సృజతి నిర్యాసం సర్జః. బంకను పుట్టించునది, మద్ధి. (వృక్ష విశేషము).
సర్జరసము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్జ వృక్ష స్యరసః సర్జరసః. సర్జరస చెట్టు యొక్కరసము, యక్ష ధూపము, వాద్య భాండ విశేషము.
సర్జికాక్షారము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్జికాడికృతః క్షార సర్జికాక్షారః. సర్జక వృక్షములచేత చేయబడినది, సజ్జాకారము.
సర్పము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్పతీతి సర్పః. చరించునది, పాము, అహి, భుజంగము, సీసము, నాగకేసరము.
సర్పరాజు
సం. నా. వా. అ. పుం. తత్స. సర్పాణాం రాజా సర్పరాజః. సర్పములకు రాజు, వాసుకి.
సర్పి
సం. నా. వా. స్. న. తత్స. సర్పతీతి సర్పిః. వ్యాపించునది, నేయి, జలము, ఉదకము, పానీయము.
సర్వంసహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సర్వం సహత ఇతి సర్వంసహ. సర్వమును సహించునది, భూమి, పుడమి.
సర్వజ్ఞుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వం జానా తీ సర్వజ్ఞః. సమస్తము ఎఱింగినవాడు, బుద్ధదేవుడు, శివుడు. సం. నా. వా. విణ. తత్స. సమస్తను ఎఱిగినవాడు, విష్ణువు, బుద్ధదేవుడు, శంకరుడు, శంభువు, ఉమాపతి.
సర్వతోభద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సర్వతోభద్రమస్య సర్వతోభద్రః. అంతటశుభము కలిగినది. సర్వతోభద్ర మస్యసర్వతోభద్రః, ఆరోగ్యమును పొందించునది, గుమ్ముడు, శబ్దాలంకార విశేషము, నాలుగుదిక్కుల వారిండ్లుకలరాజ గృహము, వేము. (వృక్ష విశేషము).
సర్వతోముఖము
సం. నా. వా. అ. న. తత్స. సర్వతః ముఖాన్యస్య సర్వతోముఖం. ప్రవహించునపుడు అంతటముఖములుకలది, ఆకాశము, జలము. సం. నా. వా. అ. పుం. తత్స. ఆత్మ, బ్రహ్మ, శివుడు.
సర్వధురీణము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వధురాం వహతీతి సర్వధురీణః. సర్వమైన భారమును వహించునది, అన్నిబరువులనుమోసెడు ఎద్దు.
సర్వమంగళ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సర్వాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా. సమస్తమైన శుభములు కలది, పార్వతి, గట్రాచాలి.
సర్వము
సం. నా. వా. న్. (అ). తత్స. శ్రియతే సజాతీయై రితి సర్వం. సజాతీయ వస్తువులచేతపొందబడునది, ఒక సంఖ్య, అంతయు, సమస్తము.
సర్వరసము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వోరసో గంధోత్ర సర్వరసః. రసమనగా పరిమళము. సర్జర సముయొక్క రూపాంతరము.
సర్వల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సర్వాక్ లా తీతి సర్వలా. సర్వశత్రువులను గ్రహించునది, చిల్లకోల, తోమరము, కాకి.
సర్వలింగి
సం. నా. వా. న్. పుం. తత్స. సర్వేషా మాశ్రమాణాం లింగాని భజంత ఇతి సర్వలింగినః. సర్వాశ్రమ చిహ్నములు కలవారు, వేదబాహ్యుడు, పాషండుడు.
సర్వవేదుడు
సం. నా. వా. స్. పుం. తత్స. సర్వస్వం వేదయతి లంభయతి ఋత్విజ ఇతి సర్వవేదాః. సర్వస్వమును ఋత్విజుల పొందించువాడు, సమస్తధనమును ధక్షిణగానిచ్చి విశ్వజిదాది యజ్ఞమునుచేసినవాడు. సర్వం ధనం వేదయతి నివేదయతి ఋత్విగ్భ్య ఇతి సర్వవేదాః.
సర్వానుభూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మధురతిక్తాదీనాం సర్వరసానామనుభూతిరత్రేతి సర్వానుభూతిః. చేదుమొదలైన సర్వ రసముల యొక్క అనుభవము దీనియందుకలదు, తెల్లతెగడ, (వృక్ష విశేషము).
సర్వాన్నీనుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సర్వాన్నం భక్షయతీతి సర్వాన్నీనః. సర్వమైనవారి అన్నమును భుజించువాడు, అన్నివిధములైన అన్నమును భుజించువాడు, సర్వ భక్షకుడు.
సర్వాభిసారము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వేణ సైన్యేన అభిసరణం సర్వాభిసారః. సర్వమైన సైన్యముతో కూడపోవుట, యుద్ధమునకు సమస్తబలము ఆయిత్తపడుట. సర్వేషామభిసారో యత్రేతి సర్వాభిసారః.
సర్వార్ధసిద్ధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వార్ధేషు సిద్ధో నిష్పన్నః. సర్వార్ధ సిద్ధః. అన్నిపనులయందు, కృతార్ధుడైనవాడు, శాక్యబుద్ధదేవుడు.
సర్వౌఘము
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వేషా మోఘః సర్వౌఘః. సర్వమైన చతురంగ బలములయొక్క సమూహము, సర్వాభిసారము, సర్వసన్నాహనము, తేనె.
సర్షపము
సం. నా. వా. అ. పుం. తత్స. సరతిదేహం వ్యాప్నోతీతి సర్షపః. దేహమును వ్యాపించునది, ఆవాలు, సత్యవిశేషము, సిద్ధార్థుడు.
సలిలము
సం. నా. వా. అ. న. తత్స. సలతీతి సలిలం. పోవునది, ఉదకము, జలము, నీరు. సలతి గచ్ఛతీతి సలిలం. పానీయము.
సల్లకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సత్కృత్య లక్యతే ఆస్వాద్యతే గజైరితి సల్లకీ. ఏనుగులచేత లెస్సగా ఆస్వాదింపబడునది, అందుగు. సత్కృత్య లక్యతే ఖాద్యతే రాజభిరితి సల్లకీ. ఏనుగులకు ప్రియమైనది, వృక్షవిశేషము, ఒక లత.
సవనము
సం. నా. వా. అ. న. తత్స. సున్వన్త్యస్యాం సోమలతామితి సుత్యా అభిషవః సవనం. దీనియందు సోమలతను పిండుదురు, యజ్ఞము, స్నానము, సోమపానము.
సవము
సం. నా. వా. అ. పుం. తత్స. సూయతే సోమోస్మిన్నితి సవః. దీనియందు సోమము తడపబడును, యజ్ఞము, కల్లుతేట.
సవయస్కుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమానం వయో యస్యసః సవయాః. సరియైన వయస్సుకలవాడు, స్నేహితుడు. అ. నా. వా. విణ. తత్స. సమానమైన వయస్సుకలవాడు.
సవిత
సం. నా. వా. ఋ. పుం. తత్స. సువతి సుప్తం ప్రేరయతీతి సవితా. సుప్తుని ప్రేరేపించువాడు, సూర్యుడు, తండ్రి, సారధి, శివుడు. సూతే లోకాదీనితి సవితా. ప్రపంచాన్ని మేల్కొలుపువాడు.
సవిధము
సం. నా. వా. విణ. తత్స. సమానావిధా ప్రకారోస్యేతి సవిధః. సమానమైన ప్రకారముకలది, సమీపము.
సవీష్ణువు
సం. విణ. (ఉ). తత్స. సహతే తాచ్ఛీల్యేనేతి సహిష్ణుః. ఓర్చువాడు, సహనుడు, శాంతుడు, తృప్తుడు.
సవేశము
సం. నా. వా. అ. న. తత్స. సమానోవేశః ప్రవేశోస్యేతి సవేశః. సమానమైన ప్రవేశముకలది, సమీపమైనది. వేశేన సహ వర్తమానమితి సవేశం. నికటము, సమీపము.
సవ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సూయతే యజ్ఞసూత్రమత్రేతి సవ్యం. యజ్ఞోప వీతము దీనియందు తడబడును, ఎడమ, కుడి, ప్రతికూలము, దక్షిణము, ప్రేతాగ్ని.
సవ్వేష్టుడు
సం. నా. వా. న్. పుం. తత్స. అశ్వాన్ ప్రేరయితుం కదాచిత్సవ్వే. కదా చిద్దక్షిణేచ తిష్ఠతీతి సవ్యేష్ఠః. గుఱ్ఱములను తోలునపుడు కొంతసేపు ఎడమదిక్కునను, కొంతసేపు కుడిదిక్కుననుండువాడు, సారథి.
సస్యము
సం. నా. వా. అ. న. తత్స. సస్తి వృక్షమధిశేషే సస్యం. వృక్షమందు శయనించునది, పైరు, వృక్షాదిఫలము, ధాన్యము, పండు, చేను.
సస్యసంవరము
సం. నా. వా. అ. పుం. తత్స. సస్యం ఫలం సంవృణోతీతి సస్యసంవరః. సస్యమనగా ఫలము, దానిని కప్పుకొనిఉండునది, మద్ధి, చెట్టు.
సహ
సం. నా. వా. స్. న. పుం. తత్స. సంహతే హిమ మత్ర ప్రాణిన ఇతి సహః. దీనియందు ప్రాణులు మంచును సహింతురు. సహతేనేన శత్రుమితి సహః. దీనిచేత శత్రువు ఓర్చును, సంహతే అనేన అస్మిన్నితి చ సహః. దీనియందు ఓర్తురు, వెలుగు, వేగము, ఓర్పు, మార్గ శీర్షమాసము, హేమంత ఋతువు, బలిమి, కూడ, జ్యోతి.
సహకారము
సం. నా. వా. అ. పుం. తత్స. సహకారయతి మేళ యతి స్త్రిపుంసావితి సహకారః. స్త్రీపురుషులను కలుపునది, తియ్యమామిడిచెట్టు. సహ యుగపత్ కారయతి విక్షేపయతి సౌగంధ్యమితి సహకారః.
సహచరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భ్రమరీభిస్సహ భ్రమరాశ్చరంత్యస్వామితి సహచరీ. ఆడుతుమ్మెదలతో కూడి తుమ్మెదలు దీనియందు చరించును, స్నేహితురాలు, భార్య, పత్ని, జాయ. సం. నా. వా. అ. పుం. తత్స. పచ్చపువ్వులముల్లగోరింట. సం. నా. వా. విణ. తత్స. కూడతిరుగునది.
సహజ
సం. నా. వా. ఆ. పుం. తత్స. సహజాయత ఇతి సహజః. కూడపుట్టినవాడు, సోదరుడు. సం. నా. వా. ఆ. స్త్రీ. తోడపుట్టినది, స్వభావము.
సహధర్మిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పత్యాభర్త్రాసహధర్మః దానయజ్ఞాది రస్యా ఇతి సహధర్మణీ. పతితోకూడ దానయజ్ఞాది రస్యా ఇతి సహధర్మిణీ. పతితోకూడదాన యజ్ఞాది ధర్మములు కలిగినది, అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము, భార్య.
సహనము
సం. నా. వా. అ. న. తత్స. సహతే తా చ్ఛీల్యేనేతి సహనశ్చః. స్వభావమున ఓర్చువాడు, ఓర్పు, తృప్తి. సం. విణ. తత్స. ఓర్పునది.
సహము
సం. నా. వా. అ. పుం. న. తత్స. బలిమి, ఓర్పు. సం. నా. వా. స్. న. తత్స. వెలుగు, వేగము. సం. నా. వా. స్. పుం. తత్స. మార్గశీర్షమాసము, హేమంత ఋతువు, చేమంతి, పిన్నగోరంట, పిల్లపెసర.
సహయత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సహయానాం సహయతా. తోడు వచ్చినవారల సమూహము, మిత్రులగుంపు.
సహసా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చేమంతి, పిన్న గోరింట, పిల్లపెసర, భూమి.
సహస్యము
సం. నా. వా. అ. పుం. తత్స. సహః బల మస్త్యస్మీన్నితి సహస్యః. సహమనగాబలము అది దీనియందుకలదు. సహతేనేన శత్రుమితి సహః. దీనిచేత శత్రువునోర్చును. సహంతే అనేన, అస్మిన్నితి చ సహః. పుష్యమాసము. సహసి బలే సాధుః ఇతి సహస్యః. పుష్పము.
సహస్రదంష్ట్రము
సం. నా. వా. అ. పుం. తత్స. సహస్రం దంష్ట్రాః అస్యసహస్రదంష్ట్రః. వేయికోఱలు కలిగినది, చేప, పాఠీనము, ఒక చేప.
సహస్రపత్రము
సం. నా. వా. అ. న. తత్స. సహస్రం ప్రత్రాణ్యస్య సహస్రపత్రం. వేయి ఱేకులుకలది, తామర, కమలము.
సహస్రము
సం. నా. వా. అ. న. తత్స. శతం దశగుణం సహస్రం. పదినూరులు, వేయి.
సహస్రవీర్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. మహప్రభావత్వాత్సహస్రవీర్యా. మంచిశక్తి కలది, గఱిక. (వృక్ష విశేషము), దూర్వాగడ్డి.
సహస్రవేధి
సం. నా. వా. న్. న. తత్స. సహస్రం రోగాన్ విధ్యతీతి సహస్రవేధీ. వేయిరోగములను పోగొట్టునది, ఇంగువ, సం. నా. వా. న. పుం. తత్స. (వృక్ష విశేషము) పుల్ల పబ్బ. సం. విణ. తత్స. వేవిటి నివేధించునది.
సహస్రాంశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సహస్రమంశవోయస్య సహస్రాంశుః. వేయికిరణములు కలవాడు, సూర్యుడు, వేవెలుగు.
సహస్రాక్షుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సహస్రమక్షీణి యస్యసః సహస్రాక్షః. వేయికన్నులు కలవాడు, ఇంద్రుడు, వేగంటి.
సహాయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సహ అయతే సహయః. కూడవచ్చువాడు, తోడైనవాడు, స్నేహితుడు, సేవకుడు, మిత్రుడు.
సాంతాపనము
సం. నా. వా. అ. న. తత్స. సంతపనే భవం సాంతపనం. సంతాపము వలన అయినది, మూడు దినములు పగళ్ళును, మూడు రోజుల అయాచిత పదార్థమును భుజించిన పిమ్మట మూడు దినములు ఇట్లు ఉపవాసము ఉండెడు వ్రతము, పంచ గవ్యమును శుశోధకమును పుచ్చుకొని. రాత్రి ఉపవాసము ఉండుట.
సాంత్వము
సం. నా. వా. అ. న. తత్స. విణ. మిక్కిలి మధురమైనది (వాక్కు) సాంత్వయంత్యనేన సాంత్వం. దీనిచేత ఊరడింతురు. సాంత్వయతీతి సాత్వం. సామోపాయము, ధాక్షిణ్యము, మధురము, హృద్యము, దయ, ఓదార్పు.
సాందృష్టికము
సం. నా. వా. అ. న. తత్స. సందృష్టం ప్రత్యక్ష ప్రయోజన మస్యసాందృష్టికం. ప్రత్యక్ష ప్రయోజనము కలది, అప్పుడు కలిగెడు లాభము.
సాంద్రము
సం. నా. వా. అ. న. తత్స. సహ అంద్యతే బధ్యత ఇతిసాంద్రం. అడవి, దట్టము, దట్టమైన సం. విణ. తత్స. మెత్తనైనది.
సాంయాత్రికుడు
సం. నా. వా. ఆ. పుం. తత్స. ద్వీపాంతరగమనము, ఓడవర్తకుడు. సాంయాత్రా ద్వీపాంతరగమనం, సా ప్రయోజనమస్యేతి సాంయాత్రిక, ఉషస్సు, వాహనము.
సాంయుగీనుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సంయుగేసాధుః సాంయుగీనః. యుద్ధమునందు నేర్పరియైనవాడు, యుద్ధకుశలుడు.
సాంవత్సరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సంవత్సరం కాలం వేత్తీతి సాంవత్సరః. కాలమునెఱిగినవాడు, జోష్యుడు. సంవత్సరం తజ్జ్ఞానోపయోగి శాస్త్రం వేత్తి అధీతే వా ఇతి సాంవత్సరః. గణకుడు, దైవజ్ఞుడు, చంద్రమానము, నల్లధాన్యము.
సాంశయికుడు
సం. విణ. (అ.ఈ.అ). తత్స. సంశయమాపన్నస్సాంశయికః. సందేహమును పొందువాడు, సంశయము పొందినమనసుకలవాడు.
సాక్షాత్కారము
సం. నా. వా. అ. పుం. తత్స. సాక్షాద్ధలష్టోసి సాక్షాత్. ప్రత్యక్షమందు. సాక్షాత్కరించుట, వలె.
సాగరము
సం. నా. వా. అ. పుం. తత్స. సగరపుత్రైః ఖాతస్సాగరః. సగరపుత్రులచే తవ్వబడినది, సముద్రము, ఏనుగుచెవి యందలిమదము. సాగరస్య రాజ్ఞో అయమితి సాగరః. సముద్రము, రత్నాకరము.
సాతల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సాతం సుఖం లాతీతి సాతలా. సుఖమునిచ్చునది, సంబరేను, చెట్టు.
సాతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సాయస్సాతిః. ముగియుట. సనం సానం చసాతిః. ఇచ్చుటయు, అవసానము, దానము, దుకూలము, స్వాతంత్ర్యము, తుది.
సాత్త్వికము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తంభ ప్రళయరోమాంచాస్స్వేదో వైవర్ణ్యవేపథూ అశ్రువైస్వర్యమిత్యష్టోసాత్త్వికాః. స్తంభ ప్రళయములు మొదలగునవి ఎనిమిది సాత్త్వికములు, రోమాంచాదికము, ధారాదత్తము కానిదానము, ఒక అభినయము. సం. విణ. తత్స. సత్త్వగుణమువలన కలిగినది.
సాది
సం. నా. వా. న్. పుం. తత్స. సీదతి నిషేదతి, సాదయతి తురగమితి చ సాదీ. గుఱ్ఱపురౌతు, మావటీడు, సారథి. గుర్రమును ఎక్కువాడు, అశ్వికుడు.
సాధనము
సం. నా. వా. అ. న. తత్స. సాధ్యతే అనేనేతి సాధనం. సాధింపబడును, సాధించుట, ఉపకరణము, ఉపాయము, ధనము, వధము, మృతసంస్కారము, గమనము, అనుగమనము, ఋణదానము, నివర్తనము, సైన్యము, మగగుఱి, ద్రవ్యము, సైన్యము, కారకము, ప్రమాణము, సిద్ధి, ఉపాయము, శిశ్నము, మరలుట, శవాలంకారము, అనుసరించుట, దానిమిప్పించుట, వెళ్లుట, సేనాంగము.
సాధారణ
సం. నా. వా. అ. పుం. తత్స. సమాన మాధారణం మానమస్యేతి సాధారణః. ఒకసంవత్సరము, సామాన్యము, సమానము, సం. విణ. తత్స. సమాన మాధారణ మాధారోయస్యేతి సాధారణం సమానమైన ఆధారముకలది, సామాన్యము.
సాధితుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ప్రతివాదిన సాక్షిలేఖ్యాది భిస్సాధ్యతే స్మసాధితః. ప్రతివాదిచేత సాక్షిలేఖ్యాదులవలన సాధింపబడినవాడు. దండుగపుచ్చుకొనబడినవాడు, సాధింపబడినవాడు.
సాధిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన బాఢః సాధిష్ఠః మిక్కిలి పదిలమైనది, మిక్కిలి మంచిది.
సాధీయశుడు
సం. విణ. (స్. ఈ. స్). తత్స. అతిశయేన సాధుః బాఢశ్ససాధీయాన. మిక్కిలి మంచివాడు, మిక్కిలి దిటవుకలవాడు.
సాధువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సాధ్నోతి పరకార్యం సాధుః. పరునికార్యమును సాధించువాడు, సాధ్నోతి శుభమితి సాధు. శుభమును సాధించునది. సాధ్నోతీతి సాధుః. సం. విణ. తత్స. ఋద్ధదేవుడు, మునీశ్వరుడు, సాధించువాడు, చక్కనివాడు, వడ్డికిచ్చిబ్రతువాడు, సజ్జనుడు, మంచివాడు, ముని, సుందరము, వ్యాపారి, సౌమ్యుడు, అర్హుడు.
సాధ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. సాధ్యాః సాధ్యంతే ఆరాధ్యంత ఇతి సాధ్యాః. ఆరాధింపబడువారు, ఒకగ్రహయోగము, సం. విణ. తత్స. సాధింపతగినది, దేవ విశేషుడు.
సాధ్వసము
సం. నా. వా. అ. న. తత్స. సాధూనస్య తీతి సాధ్వం. సాధువులను బాధించునది, భయము, భీతి, వెఱపు.
సాధ్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సాధుగుణ యోగాత్సాధ్వీ. మంచిగుణములు కలది, పతివ్రత, క్రొత్తది, సతి.
సానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సనోతి సుఖందదాతీతి సానుః. సుఖమునిచ్చునది, కొండనెత్తము, కొన, అడవి, సుడిగాలి, త్రోవ. సన్యతే సేవ్యతే మునిప్రభృతిభిరతీతి సానుః. వనము, మార్గము, చరియ, యాగము.
సాన్నయ్యము
సం. నా. వా. అ. న. తత్స. సన్నీయతే సాంనాయ్యం. లెస్సగా అగ్నియందు పొందింపబడునది, హవిస్సు, దధిపయోరూపమైనహవిస్సు.
సాప్తపదీనము
సం. నా. వా. అ. న. తత్స. సప్తభిః పదైః ప్రాప్యతే సాప్తపదీనం. ఏడడుగులచేత (ఏడుమాట) పొందబడునది, స్నేహము, చెలిమి. సప్తభిః పదైః సుబంతతింఙ్తైః చరణన్యా సైర్వా అవాప్యతే ఇతి సాప్తపదీనం. మైత్రి, సఖ్యత, పెరుగు తోడిపాలు.
సామజము
సం. నా. వా. అ. పుం. తత్స. ఏనుగు. సం. విణ. తత్స. సామవేదమువలనపుట్టినది.
సామము
సం. నా. వా. న్. న. తత్స. స్యతి పాపమితిసామ. పాపమును నశింపచేయునది. స్యతి వైరం సామ. వైరమును చెఱుచునది, ఒక వేదము, మంచిమాట, అనుకూలప్రవర్తనరూపమైన ఒక ఉపాయము (ఇది పంచవిధములు, పరస్పరోపకారము, కనిపింపచేయుట, మంచితనముచేయుట, గుణములను కొనియాడుట చుట్టఱికమును తెలుపుట, నేనునీవాడుననిమంచిమాట లాడుట) ఉపాయము. స్యతి ఛినత్తి దుఃఖం గేయత్వాదితి సామ. వేదములు నాలుగింటిలో మూడవది (సామవేదము), హిత భాషణము, ఓదార్చుట.
సామాజికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమాజం సముహం సమవయంతీతి సామాజికాః. సముహమును పొందియుండువారు, సభయందుండువాడు.
సామాన్య
సం. నా. వా. అ. న. తత్స. సమానానం భావః సామాన్యం. సమానములైన పదార్ధములయొక్క భావము. సదృశం మానమస్యేతి సమాన్యం. సమానమే సామాన్యము. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సర్వసాధారణనాయిక, ఒక అర్ధాలంకారము, సామ్యము, సాధారణము.
సామిధేని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సమిధామియమాదానీ సామిధేనీ. సమిధులను పెట్టించునది, ధాయ్య, సమిధ.
సాముద్రము
సం. నా. వా. అ. న. తత్స. భాగ్యసూచకదేహలక్షణము, సముద్రమున పుట్టినది, ఒకసంకరజాతి.
సాయకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్యతి ప్రతి పక్షం నాశయతీతి సాయకః. శత్రువును నశింపచేయునది, బాణము, కత్తి. స్యతి ఛినత్తీతి సాయకః.
సాయము
సం. నా. వా. అ. పుం. తత్స. స్యతి దినం సాయః. దినము అంతముపొందించునది, సహయము, సాయంకాలము. బాణము.
సారంగము
సం. నా. వా. అ. పుం. తత్స. సంహత్య అరం గచ్ఛతీతి సారంగః. తనజాతి పక్షులతో కూడి త్వరగా పోవునది. సజాతీయైస్సహ అరం అత్యర్ధం గచ్ఛతీతి సారంగః ఇఱ్ఱి, ఏనుగు, తుమ్మెద, వానకోయిల. సం. విణ. తత్స. చిత్రవర్ణముకలది, పక్షిభేదము, చాతకము.
సారణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సార్యంతే వాత సంకుచితా న్యంగా న్యనయేతి సారణీ. వాతము చేముడుచు కొన్న అంగములు దీనిచేత చాచబడును, కాలువ, గొంతెమ్మగోరు, షడ్జస్వరములు పలికెడితంతి, చిన్ననది, పద్యకావ్యము.
సారథి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సారయత్యశ్వానితి సారథిః. గుఱ్ఱములను నడిపించువాడు, తేరుగడపువాడు, నియంత, సూతుడు.
సారము
సం. నా. వా. అ. పుం. తత్స. కాలాంతరం అభిసర తీతి సారః. కాలాంతరమును పొంది ఉండునది. సరతిస్థిరీభవతీతి సారః. స్థిరమై ఉండునది, బలిమి, చేవ, మూగ, నిగ్గు, (ధనము, న్యాయము), మజ్జ, బలము, స్థామము, సామర్థ్యము, శుక్రము, వార్యము, స్థిరాంశము, వజ్రాక్షరము, వాయువు, రోగము, పాశకము. సం. విణ. తత్స. వరము, శ్రేష్ఠము.
సారమేయము
సం. నా. వా. అ. పుం. తత్స. సరమాశునీ తస్య అపత్యం సారమేయః. సరమ అనగా ఆడుకుక్కు దానికి పుట్టినది, కుక్క, శునకము. సరమాయా అపత్యం పుమానితి సారమేయః.
సారవము
సం. విణ. (అ.ఈ.అ). తత్స. సరయ్వాం భవస్సారవః. సరయూనదియందు పుట్టినది.
సారసనము
సం. నా. వా. అ. న. తత్స. సారం సనోతి సారసనం. ఉత్కర్షము నిచ్చునది. సారం బలం సనోతీతి సారసనం. బలమునిచ్చునది, మూడుపేటలుకల ఆడుదాని మొలనూలు, కవచము తొడిగిన నడికట్టు. సారం సనోతి దదాతీతి సారసనం, పటకా.
సారసము
సం. నా. వా. అ. న. తత్స. సరసీ భవం సారసం. సరస్సున పుట్టినది, తామర. సం. నా. వా. అ. పుం. తత్స. బెగ్గురుపక్షి, చంద్రుడు.
సార్థము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సరతీతి సార్ధః. పోవునది, తడిసినది, చెమ్మకలిగినది, ఆర్థమము.
సార్ధము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. ఆర్ధ్రమార్ధ్రత్వం తేన సహవర్తత ఇతి సార్ద్రం. తడితోకూడి ఊండునది, చెమ్మ, తడిసినది, ఆర్ద్రము. ఆర్ధేన సహ వర్తమానమితి సార్ధః.
సార్ధవాహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సార్ధం వణిక్స ఘాతం వహతి దేశాంతరం ప్రాపయతీతి సార్థవాహః. బేరులమూకను దేశాంతరమును చేర్చువాడు, వర్తకుడు. సం. విణ. తత్స. ముఖ్యుడు.
సార్వభౌముడు
సం. నా. వా. అ. పుం. తత్స. సర్వభూమ్యాం విదితః సార్వభౌమః. సమస్తభూమి యందు ఎఱుగబడినది. సర్వభూమే రీశ్వరః సార్వభౌమః. సమస్త భూమికి ఈశ్వరుడు, సమస్తభూమిని ఏలురాజు, చక్రవర్తి, ఉత్తరదిగ్గజము.
సాలపర్ణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సాలస్యేవ పర్ణాన్యస్యాస్సాలపర్ణీ. మద్ధి ఆకులవంటి ఆకులుకలది. ముయ్యాకుపొన్న. (వృక్ష విశేషము).
సాలము
సం. నా. వా. అ. పుం. తత్స. 1. సలతి నగరమితి వా సాలః. పట్టణమును క్రమ్ముకొని ఉండునది. 2. స్యతి పర్యంతంక రోతీతి సాలః పట్టణమునకు కడను చేయునది. సల్యతే గమ్యతే జనైరితి సాలః. జనులచేత పొందబడునది. స్యతికుష్ఠరోగమితి సాలః. కుష్ఠరోగమును చెఱచునది, వృక్షము, ప్రాకారము, మద్ది, (వృక్ష విశేషము). శల్యతే ఇతి సాలః. వంశము, ఒక చేప.
సాలావృకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్యంతి వర్కంతే చసాలావృకాః. హింసించి పుచ్చుకొనునవి. కుక్క, కోతి, తోడెలు, నక్క.
సాహసము
సం. నా. వా. అ. న. తత్స. సహో బలం తత్రభవం సాహసం. సహస్సనగా బలము. అందుపుట్టినది, తెగువ, దండోపాయము.
సాహస్రము
సం. నా. వా. అ. న. తత్స. సహస్రం బలమస్తీతి సాహస్రాః. వేయింటి లెక్కకల బలము కలవారు. సహస్రానాం సమూహస్సాహస్రం. సహస్రముల యొక్క సమూహము.
సిందువారము
సం. నా. వా. అ. పుం. తత్స. సిందుంస్యన్దనం త్వగాదివా వృణోతీతి సిందువారః. వావిలి చెట్టు, సింధువారము.
సిందూకము
సం. నా. వా. అ. పుం. తత్స. రసంస్యన్దతే సిన్దుకః. రసమును స్రవించునది, వావిలి, సిందువారము (వృక్ష విశేషము).
సింధువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. స్యంధత ఇతి సింధుః. ప్రవహించునది. స్యందతే సింధుః. సముద్రము, ఏనుగు, పడమరగా పారు ఏరు, ఒక దేశము, జెముడు, నది, సింధునది.
సింధూరము
సం. నా. వా. అ. న. పుం. తత్స. స్యందతే ప్రస్రవతి సూక్ష్మ త్వాదితి సింధూరం. సూక్ష్మము అవుట చేత జారునది, చందిరము, సిందువారము.
సింధూరము
సం. నా. వా. అ. పుం. తత్స. ఏనుగు, గజము.
సింహనాదము
సం. నా. వా. అ. పుం. తత్స. సింహనాంనాద ఇవనాదః సింహనాధః. సింహముల యొక్క నాదమువంటి నాదము, ఏనుగులు మొదలైనవి. భయపడుటకై వీరులు చేసెడు ధ్వని, బొబ్బ, మహాదేవుడు, శివుడు, శంభుడు, శంకరుడు.
సింహపుచ్చి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సింహపుచ్ఛాకృతి మంజరీత్వాత్ సింహపుచ్చీ. సింహపుతోకవంటి కొమ్మలుకలది, నక్కతోక, పోన్న, పెద్ద మల్లె, మాషపర్ణి. (వృక్ష విశేషము).
సింహము
సం. నా. వా. అ. పుం. తత్స. హినస్తిహస్త్యాదికమితి సింహః. ఏనుగులు మొదలైన మృగములను హింసించునది. సింహము. సించతి తేజః పశుషు ఇతి సింహః. మృగరాజు, జంతువిశేషము, సింగము, ఒకరాశి, శ్రేష్టము, వేంకటాచలము.
సింహసంహననుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సింహస్య సంహననమివ సంహసనం వపుర్యస్యేతి సింహసంహనవః. సింహము యొక్క శరీరమువలె శ్రేష్ఠమైన శరీరము కలవాడు, సర్వాంగసుందరుడు, అందగాడు.
సింహసనము
సం. నా. వా. అ. న. తత్స. సింహకృతి యుక్తమాసనం సింహసనం. సంహాకృతితో కూడిన ఆసనము, సింహముఖము ఏర్పరచిన స్వర్ణమయమైన ఉన్నత పీఠము. సింహఖచితమాసనం సింహాసనం. ఒక యోగాసనము, గద్దె.
సింహస్యము
సం. నా. వా. అ. పుం. తత్స. సింహస్యాకారపుష్పత్వాత్సింహస్యః. సింహమునోరువంటి పువ్వులుకలది, అడ్డసరము, (వృక్ష విశేషము).
సింహి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. 1. హినస్తికంటికైః సింహేః ముండ్లచేత పీడించునది, అడ్డసరము, ములక, వంగ. 2. హినస్తిరోగాన్ సింహీ రోగములను హింసించునది.
సింహుండము
సం. నా. వా. అ. పుం. తత్స. సింహతుణ్డాభ శాఖత్వాతింహుండః. సింహముఖముతో సమానమైన కొమ్మలుకలది, జెముడు (వృక్ష విశేషము).
సికత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సిచ్యంత ఇతి సికతాః. తడుపబడినది, ఇసుకనేల, మొరపనేల, ఒకవ్యాధి, ఇసుక.
సిక్థకము
సం. నా. వా. అ. న. తత్స. సంచత్యగ్ని సంయోగాదితి సిక్థకం. అగ్ని సంయోగమువలన కరగునది, మైనము. సం. నా. వా. అ. పుం. మెతుకు.
సిత
సం. విణ. తత్స. సినోతి మన ఇతి సితః. మనస్సును బంధించునది, తెలుపు, కట్టబడినది, ముగిసినది. సం. నా. వా. అ. న. తత్స. సీయత ఇతి సితం. బంధింపబడునది. తెల్లపులుము, అవస్యతి పరవస్యతి స్మసితః. ముగిసినది, సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చక్కెర.
సితచ్ఛత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సితచ్ఛత్రాభాని పుష్పాణ్యస్యా ఇతి సితచ్ఛత్రా. తెల్లగొడుగువంటి పువ్వులు కలది, సదాప (వృక్ష విశేషము).
సితా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ధవళ వర్ణ త్వాత్ సితా. తెల్లని రంగుకలది, పంచదార సం. నా. వా. అ. న. తత్స. తెల్లపులుము. అ. నా. వా. పుం. తెలుపు. సం. విణ. తత్స. తెల్లనిది, కట్టబడినది, ముగిసినది.
సితాభ్రము
సం. నా. వా. అ. పుం. తత్స. సితాభ్రస దృశత్వా త్సి తాభ్రః. తెల్లని మేఘమువలెనుండునది, కర్పూరము, ఘనసారము.
సిద్ధము
సం. నా. వా. అ. పుం. తత్స. అణిమాది సిద్ధిర్వేషా మస్తీతి సిద్ధాః. అణిమాది సిద్ధి కలవారు. సం. విణ. తత్స. సిద్ధ్యతి స్మ స్మిద్ధం. అయినది, ఒక గ్రహయోగము, దేవయోని విశేషము, నిత్యము, నిష్పన్నము, పక్వము, తయారైనది, ఆయిత్తమైనది.
సిద్ధాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. సిద్ధోరార్ధః అంతో నిశ్చయోయస్మినాసిద్ధాంతః దీనియందు నిశ్చయముందును, స్ధిరమైన పక్షము, నవవిధజ్యోతిష గ్రంధములు. సిద్ధః వాదిప్రతివాదిభ్యాం నిర్ణీతః అంతః అర్థః యస్య సః సిద్ధాంతః. సమయము, రాద్ధాంతము, నిశ్చితార్ధము. సం. విణ. తత్స. సిద్ధ్యతి స్మస్మిద్ధం. అయినది ఆయిత్తమైనది, ఈడేటినది, ఎడతిగనది, వండబడినది.
సిద్ధార్ధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సిద్ధః అర్ధః ప్రయోజనం యస్య సిద్ధార్ధః. రక్షాకరమౌటచేత సిద్ధమైన ప్రయోజనములుకలది, శాక్యబుద్ధదేవుడు, తెల్లావలు.
సిద్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సిద్ధ్యత్యారోగ్య మనయేతి సిద్ధిః. ఆరోగ్యము దీనిచేత సిద్ధించును, ఈడేఱుట, బుద్ధియను గంధద్రవ్యము, ఒక గ్రహయోగము, మృత సంజీవని.
సిద్మల
సం. విణ. తత్స. సిధ్మమస్యాస్తీతి సిధ్మలః. సిబ్బెముకలవాడు, సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఉప్పుచేప.
సిధ్మము
సం. నా. వా. న్. న. తత్స. సిధ్యతి భేష జేన ఆశుగచ్ఛతీతి సిధ్మ. చికిత్సచే పోవునది, సిబ్బెము, సం. విణ. తత్స. సిబ్బెముకలది.
సిధ్మల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఉప్పుచేప, సిబ్బెము కలవాడు.
సిధ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. సిధ్యం త్యస్మిన్నర్ధా ఇతి సిద్ధ్యః. దీనియందు ప్రయోజనములు సిద్ధించును, పుష్య నక్షత్రము.
సినీవాలీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. లక్ష్మీ అస్యామితి సినీ చంద్రకళాసాచాలా అస్యామితి సినివాలీ. అనగా లక్ష్మీ. లక్ష్మికలదిఉండును కనుక సినివాలీ, చంద్రకళ కానవచ్చెడి అమావాస్య, పార్వతి. సినీ శుక్లా బాలా చంద్రకళా అస్యామితి సినీవాలీ.
సిర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సినోతికాయం బధ్నాతి సిరా. శరీరమును బంధించునది, నాడి, ఈనె, నరము.
సిల్హము
సం. నా. వా. అ. పుం. తత్స. సిల్యతే ఉచ్ఛీయతే సిల్హః ఉచ్ఛయనం, దూపద్రవ్య విశేషము, చిల్లమడ్డి.
సీతా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్యతి భువమితి సీతా. భూమిని నశింపచేయునది, శ్రీరాముని భార్య, నాగటిచాలు, గంగ.
సీత్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సీతాలాంగల పద్ధతిః యతా సమ్మితం సీత్యం. సీత అనగానాగేటిచాలు దానితో దున్నినది, ఒకసారి దున్నినది. సీతయా నిర్వృత్తమితి సీత్యం. ధాన్యము, సస్యము, దున్నిన భూమి.
సీమంతము
సం. నా. వా. అ. పుం. తత్స. పాపట, సీమంతోన్నయనము.
సీమంతిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సీమంతం కేశవీథి అస్యా ఇతి సీమన్తినీ. అనగా పాపట కలిగినది, ఆడుది, ఇంతి, వనిత. సీమంతో అస్యా అస్తీతి సీమంతినీ. సుందరి, స్త్రీ, అబల.
సీరపాణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సీరం లాం గలం పాణౌయస్యసః సీరపాణిః. నాగలి హస్తమందు కలవాడు, బలరాముడు, నాగటిజోడు.
సీరము
సం. నా. వా. అ. పుం. తత్స. సీయతే యుగేన సహబద్ధ్యత ఇతి సీరః. కాడితో కూడ కట్టబడునది, నాగలి, హలము. సినోతి సీయతే ఇతి వా సీరః.
సీవనము
సం. నా. వా. అ. న. తత్స. సీవ్యత ఇతి సీవనం. కోకలు మొదలుగునవి. కుట్టుట, కుట్టుట.
సీసకము
సం. నా. వా. అ. న. తత్స. సినోతి బథ్నాతి పారదమితి సీసకం పాదరసమును బంధించునది, సీసము, ధాతువిశేషము, జడము.
సుందరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుష్ఠు అద్రి యతే సుందరీ. లెస్సగా ఆదరింపబడునది, చక్కని ఆడుది, స్త్రీ, అంగన, అబల, నారిభేదము, రూపసౌందర్యము కలిగిన ఆడది, త్రిపురసుందరి.
సుందరుడు
సం. విణ. (అ. ఆ. ఈ. అ). తత్స. సుతరాం అద్రియత ఇతి సుందరం. మిక్కిలి సంతోష పెట్టునది, చక్కని వాడు, అందమైనది. సుష్ఠు ఉనత్తి ఆద్రీకరోతి చిత్తమితి సుందరః. మనోహరము, రుచిరము, సుషమము, సాధు, శోభనము, కాంతము, మనోరమము, రుచ్యము, మనోజ్ఞము, మంజులము, మనోహారి, సౌమ్యము, భద్రకము, రమణీయము, బంధురము, పేసలము, వామము, అభిరామము, నందితము, సుమనము, స్వరూపము, అభిరూపము, దివ్యము.
సుకన్దకము
సం. నా. వా. అ. పుం. తత్స. శోభనః కందోస్యసుకందకః. మంచిగడలుకలది, నీరుల్లి, నుట్టుకాకర. (వృక్ష విశేషము).
సుకర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుఖం కరోతీతి సుకరా. సుఖమును చేయునది, సాధువైన ఆవు. సం. విణ. తత్స. సలభము, మంచిగుఱ్ఱము.
సుకలుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. శోభనా కలాత్యాగ భోగ యోరస్యేతి సుకలః. త్యాగభోగముల యందు మంచివిద్యకలవాడు. ధాతయుభోక్తయునైనవాడు.
సుకుమారము
సం. విణ. తత్స. సుష్ఠు కుమార యంత్యనేనేతి సుకుమారం. దీనిచేత లెస్సగా క్రీడింతురు. సం. నా. వా. పుం. తత్స. పుండ్రేక్షువు, కోమలము.
సుకృతము
సం. నా. వా. అ. న. తత్స. శోభనం కృతం కర్మాస్యవా సుకృతం. శుభమైన కర్మకలది, పుణ్యము, శుభము. సం. విణ. తత్స. చక్కగాచేయబడినది, ధర్మము, శ్రేయస్సు, మంచిపని, ఉదారుడు.
సుకృతి
సం. విణ. (న్. ఈ. న్). తత్స. సుకృత మస్యాస్తీతీ సుకృతీ. సుకృతము గలవాడు, పుణ్యవంతుడు, భాగ్యవంతుడు.
సుఖ
సం. నా. వా. ఆ. న. విణ. తత్స. సుష్ఠు ఖనత్య శుభమితి సుఖం. అశుభమును పోకొట్టునది, వరుణుని పట్టణము, సౌఖ్యము, స్వర్గము, ఆనందము, నీరు, శోభనానిఖాని ఇంద్రియాణ్యస్మిన్నితివా సుఖం, ఇంద్రియములను ఆప్యాయనము చేయునది.
సుఖవర్చకము
సం. నా. వా. అ. పుం. తత్స. సుఖేన దీపనాగ్నిం వర్చయతీతి సుఖవర్చకః. సులభముగా దీపనాగ్నిని ప్రజ్వలింపచేయునది, సజ్జాకారము, క్షౌరము.
సుగంధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. శోభనః గన్ధః అస్యేతి సుగన్ధిః. మంచి గంధము కలిగినది, నూగుదోస. సం. విణ. తత్స. శోభనోగన్దో అస్యేతి సుగన్ధిః. ఇంపైనవాసనకలది, దంతరమల్లి, నవమాలిక.
సుగతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శోభనం గతం జ్ఞానమస్య సుగతః. మంచి జ్ఞానము కలవాడు, బుద్ధదేవుడు.
సుచరిత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శోభనం చరిత్ర మస్యా ఇతి సుచరిత్రా. శుభకరమైన చరిత్రకలది, పతివ్రత, క్రొత్తది, కొత్తిమిరి.
సుచేలకము
సం. నా. వా. అ. పుం. తత్స. శోభనశ్చాసౌ చేలకశ్చసు చేలకః. మంచివలువ, సన్నకోక, వలీపము. సం. విణ. తత్స. మంచివస్త్రముకలది.
సుత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సౌత్యేనం మాతా సుతః. తల్లి వీనిని ప్రసవించును. సౌతీతి సుతః. ఐశ్వర్యమును పొందినవాడు, పుట్టినవాడును, కూతురు, కొడుకు, గుహ్యకులు, కుమారుడు, సోమరసము.
సుతశ్రేణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుతానాం పర్ణాదీనాం శ్రేణి రస్యా ఇతి సుతశ్రేణీ. సుతులనగా ఆకులు మొదలగునవి. వానియొక్క పంక్తి (పంక్తి-వరుస)కలది, ఎలుక చెవి మూషగపర్ణి.
సుత్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సున్వన్త్యస్యా సోమలతా మితిసుత్యా. దీనియందు సోమలతను పిండుదురు, సోమపానము, స్నానము.
సుత్యుడు
సం. నా. వా. న్. పుం. తత్స. సునోతి సోమమితి సుత్వా. సోమలతను కొట్టి పిడిచినవాడు, యజ్ఞమునందు సోమలతను కొట్టిపిలిచినవాడు.
సుత్రాముడు
సం. నా. వా. న్. పుం. తత్స. సుష్ఠుత్రాయత ఇతి సుత్రామ. లోకములను చక్కగా రక్షించువాడు, ఇంద్రుడు.
సుదర్శనము
సం. నా. వా. అ. పుం. తత్స. భక్తై స్సుఖేన దృశ్యత ఇతి సుదర్శనః. భక్తులచేత సుఖముగా చూడబడునట్టిది, గ్రద్ధ, అమరావతి పట్టణము, సం. నా. వా. అ. న. తత్స. విష్ణుచక్రము, మేరుపర్వతమునందలినేరేడు, (వృక్ష విశేషము).
సుదాయము
సం. నా. వా. అ. పుం. తత్స. సుష్ఠు దీయత ఇతి సుదాయః. లెస్సగా ఇయ్యబడినది, పెండ్లియందు అల్లునికి ఆడుబిడ్డకు ఇచ్చెడు అరణము.
సుదూరము
సం. విణ. (అ.ఈ.అ). తత్స. సుతరాందూరం సుదూరం. మిక్కిలి దూరమైనది, ఎడదవ్వు.
సుధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుఖేన ధీయతే పీయత ఇతి సుధా. సుఖముగా పానము చేయబడినది, అమృతము, పాలు, సున్నము, చాగ, జెముడు, ఇటిక. సుష్ఠుదీయత ఇతి సుధా. గంగ, తోయము, విద్యుత్తు, మూర్వా, స్నుహిమొక్కలు, ముత్యము. (వృక్ష విశేషము).
సుధర్మ
సం. నా. వా. ఆ. స్త్రీ. న్. పుం. తత్స. శోభనో ధర్మోస్యామితి సుధర్మా. మంచి ధర్మముకలది.
సుధాంశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సుధారూపా అంశవోయస్యసః సుధాంశుః అమృత రూపములైన కిరణములు కలవాడు, చంద్రుడు.
సుధి
సం. నా. వా. ఈ. పుం. తత్స. శోభనం ధ్యాయతీతి సుధీః. లెస్సగా విచారించువాడు, విద్వాంసుడు, చదువరి, పండితుడు.
సునిషణ్ణకము
సం. నా. వా. అ. న. తత్స. సుష్ఠు నిషేదంతి గుణా అత్రేతి సునిషణ్ణకం. లెస్సగుణములు దీనియందుకలవు, నీరుచెంచలి, ఆకుకూర. (వృక్ష విశేషము).
సుపథము
సం. నా. వా. న్. పుం. తత్స. సుశోభనః పంథాః సుపంథాః. ఒప్పెడు తెరువు, సత్సధము, మంచిత్రోవ, మంచిబాట, మంచిమార్గము, మంచిదారి.
సుపర్ణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శోభనాని పర్ణాని పక్షాయస్యసః సుపర్ణః. మంచి ఱెక్కలుకలవాడు, గరుత్మంతుడు, గరుడుడు. సుష్ఠుం పర్ణం పక్షో యస్య సః సుపర్ణః. ఆకాశమునకు రాజు, కృతమాల వృక్షము.
సుప్రతీకము
సం. నా. వా. అ. పుం. తత్స. శోభనాః ప్రతీకా అవయవ యస్యసః సుప్రతీకః. సం. విణ. తత్స. మంచి అవయవములు కలిగినది, ఈనాన్యదిక్కునందలి ఏనుగు, కామదేవుడు, శివుడు, సాధువు, ఈశాన్యదిగ్గజము.
సుప్రలాపము
సం. నా. వా. అ. పుం. తత్స. సుష్ఠు ప్రలపనం సుప్రలాపః. లెస్సగా పలుకుట, మంచిమాట.
సుభిక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శోభనా భిక్షా ప్రార్థనాస్యామితి సుభిక్షా. మంచి ప్రార్థన దీనియందుకలదు, ఆరెపువ్వు. సం. విణ. సులభభిక్షముకలది, అత్తి చెట్టు.
సుమనము
సం. నా. వా. అ. పుం. తత్స. శోభనం మన్యతే సుమనః. మంచిదిగా తలపబడునది, గోధుమలు.
సుమనస్సు
సం. నా. వా. న్. స్త్రీ. తత్స. సుష్ఠు మన్వత ఇతి సుమనసః. లెస్సగా ఎఱిగినవారుకనుక పువ్వు, జాజి, విధ్యాంసుడు. సం. నా. వా. పుం. తత్స. వేలుపు విద్వాంసుడు. సుప్రీతః మనః ఆస్వితి సుమనసః. మనస్సు లెస్సగా యుండును. సుష్ఠుమన్యతే సుమనాసః. శోభనం మనో యస్య సః సుమనాః. దేవతలు, పండితులు, దేవుడు, ప్రాజ్ఞుడు, పూవుమల్లె.
సుమనోరజము
సం. నా. వా. న్. న. తత్స. సుమనసాం రజః సుమనోరజః. పుష్పముల యొక్కధూళి, పుప్పొడి.
సుమము
సం. నా. వా. అ. న. తత్స. కుస్యతి భ్రమరాదినాశ్లిష్యతీతిసుమం. భ్రమరములతో కూడిఉండునది. కుసుమము, పువ్వు, పుష్పము.
సుమేరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సుష్ఠుమి నోతీతి సుమేరుః. మేరుపర్వతము. సుష్ఠు మినోతి క్షిపతి జ్యోతీంషి ఇతి సుమేరుః. పర్వత విశేషము.
సుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సురం తీతి సురాః ఐశ్వర్య యుక్తులుకనుకసురలు, మద్యము, మద్యపానము చేసెడుగిన్నె, దేవత. అ. నా. వా. పుం. తత్స. వేలుపులు.
సుర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుష్ఠురా త్యేనామితి సురా. దీనిని పుచ్చుకుందురు, మద్యము, మద్యపానము చేసేడుగిన్నె, మధ్వాసవము, ప్రసన్న, మదిర, కాదంబరి, స్వాదురసము, మంచి వాసన కలిగినది, కల్యము, కశ్యము, మైరేయము, కాపిశాయనము, మాధ్వీకము, ఆసవము, వారుణి, మధువు.
సురంగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సొరంగము, సం. నా. వా. అ. పుం. తత్స. ఒకదినుసు పూచెట్టు. సు బహు రజ్యతే అస్యాం రజసా ఇతి సురంగా. సంధి.
సురజ్యేష్ఠుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సురాణాం జ్యేష్ఠః సురజ్యేష్ఠః దేవతలలో పెద్దవాడు, బ్రహ్మ, వేలుపు, పెద్ద, పితామహుడు.
సురతుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సూర్య ఇవ తపతి ప్రసిద్ధ్యా ప్రకాశత ఇతి సురతః. సూర్యునివలె ప్రసిద్ధిచేత ఒప్పువాడు, దయకలవాడు.
సురదీర్ఘిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా. సురల యొక్క నడబావి, ఆకాశగంగ, వేల్పుటేరు, మందాకిని.
సురద్విషుడు
సం. నా. వా. ష్. పుం. తత్స. సురాన్ ద్విషంతేతి సురద్విషః. దేవతలను ద్వేషించువారు, అసురులు, వేల్పుఱేడు.
సురభి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సుష్ఠురంభంతే ఉపక్రమంతే శుభకార్యం కర్తుమితి సురభిః. జనులు దీనియందు శుభకార్యము చేయనారంబింతురు. సుష్ఠు రభతే జనానన్ద మితి సురభిః. లెస్సగా జనానం దమును కలుగ చేయునది. (కామధేనువు, ఆవు, అందుగు, మురఅనెడు గంధద్రవ్యము. సం. నా. వా. అ. న. తత్స. బంగారు, వాసనలుకల కలువ. సం. నా. వా. అ. పుం. తత్స. వసంత ఋతువు, చైత్రమాసము, సంపెంగ, జాజికాయ, మనోజ్ఞమైనది, మంచివాసనకలది. సుష్ఠు రభతే రంభతే వా సురభిః. పృథివి, గోమాత. సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ఘ్రాణ తర్పణ గంధత్వాత్సురభిః. ఘ్రాణమునకు ఇష్టమైన గంధముకలది.
సురభి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ఘ్రాణ తర్పణ సంధత్వాత్సురభిః. వాసనకు ఇష్టమైన గంధము కలది. సుష్ఠు రభతే రంభతే వా ఇతి సురభిః. ఆవు, గోవు, మాహేయి, బహుళ, అర్జుని, రోహిణి, తులసి, వనమాలిక, పృథివి, గోమాత.
సురర్షి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సురాశ్చతే ఋషయశ్చ సరర్షయః. దేవతలైనబుషులు నారదాది ఋషి.
సురలోకము
సం. నా. వా. అ. పుం. తత్స. సురాణాం లోకః సురలోకః. సురలోకము, స్వర్గము, వేల్పుబ్రోలు.
సురవర్త్మము
సం. నా. వా. న్. న. తత్స. సురాణాం వర్త్మసురవర్త్మః. సురల యొక్కమార్గము, ఆకాశము, వేల్పుదెరువు.
సురస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శోభనో రస్యోస్యా ఇతి సురసా. మంచిరసముకలది. సం. విణ. తత్స. తియ్యనిది, నాగమాత, సర్పాక్షి. సం. నా. వా. అ. న. తత్స. నల్లగగ్గెర, తియ్యనిది, పెద్దనేరేడు, ఒక చెట్టు, (వృక్ష విశేషము).
సురాచార్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సురాణాం ఆచార్యః సురాచార్యః. దేవతకు ఆచార్యుడు, బృహస్పతి, వేల్పుటొజ్జ.
సురామండము
సం. నా. వా. అ. న. తత్స. సురాయామండః సురామండః. సురయొక్కతేట, కల్లుతేట, కల్లుమీగడ.
సురాలయము
సం. నా. వా. అ. పుం. తత్స. సురాణా మాలయస్సురాలయః. సురలకు స్థానము, మేరుపర్వతము.
సురాష్ట్రజము
సం. నా. వా. అ. పుం. తత్స. సురాష్ట్రదేశేభవం సురాష్ట్రజం. సురాష్ట్రదేశమందు పుట్టునది, తొగరిమన్ను, అడతొగరితీగె.
సురూపుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ప్రాప్తం రూపం యస్య ప్రాప్తరూపః. శోభనం రూపం యస్య సురూపః. మంచి రూపము కలవాడు, చక్కనివాడు, విద్వాంసుడు.
సువర్ణకము
సం. నా. వా. అ. పుం. తత్స. సువర్ణాకారాణి పుష్పాణి యస్యసః సువర్ణకః. బంగారు వన్నెకల పువ్వులు కలది, ఱేల, కృతమాలము.
సువర్ణము
సం. నా. వా. అ. న. విణ. తత్స. సువర్ణా మత్రాస్తీతి సువర్ణః. సువర్ణము దీనియందు కలదు. శోభనో వర్ణో యస్యతత్ సువర్ణం. మంచి వర్ణముకలది, బంగారు, మాడ, ధనము, ఒకపువ్వు. నల్ల అగలు. శోభనో వర్ణో యస్య సువర్ణం. ధాతువిశేషము, స్వర్ణము, కనకము, హేమము, కల్యాణము, మనోహరము, భాస్కరము, అగ్ని.
సువల్లి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. శోభనా వల్ల్యః అస్యాః సువల్లీ. మంచితీగెలు కలది, కారుగచ్చ.
సువహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుష్ఠువ హత్యామోదం సువహ. లెస్సగా పరిమళమును వహించునది. సుష్ఠుగంధం వహతీతి సువహ. పరిమళమును వహించునది. సుష్ఠువహత్యారోగ్యం సువహ. లెస్సగా ఆరోగ్యమును వహించునది. సుష్ఠురసం వహతీతి సువహ. మంచిరసమును వహించునది, అందుగు, కారేలకి, చెప్పుతట్ట, నల్లవావిలి. సర్పాక్షి, సం. విణ. తత్స. వృక్ష విశేషము, ఒక చెట్టు, సుఖముగా మోవదగినది.
సువాసిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుష్ఠువశతీతి సువాసినీ స్వేషు వస్తుంశీల మస్యా ఇతి సువాసినీ. తనపుట్టినింటివారితోనుండు స్వభావము కలది. లెస్సగా వశించు ఉండునది, పేరంటాలు. సుఖేన వసతీతి సువాసినీ. పుణ్యస్త్రీ.
సువ్రత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుష్ఠుం వ్రతం శీలమస్యా ఇతి సువ్రతా. మంచిస్వభావముకలది, సులభముగా పిదుకదగిన ఆవు.
సుషమ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుష్ఠు సమం సర్వమస్యాస్సుషమా. దీనికి సర్వము లెస్సగా సమమైయుండును. మిక్కిలి శోభ, సం. విణ. తత్స. మనోజ్ఞమైనది, సరిసమానమైనది. సు శోభనం సమం సర్వం యస్యాః సుషమా, సుందరము.
సుషవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుష్ఠు సుయతే ఫలాని సుషవీ. లెస్సగా కాయలుకాచునది. సుష్ఠుసువతి ప్రేరయతీతి సుషవీ. లెస్సగా మందాగ్నిని పోగొట్టునది. కాకర, (వృక్ష విశేషము) జీలకఱ్ఱ, నల్లజీలకఱ్ఱ.
సుషి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సుష్ఠుస్యతి ప్రమాదపతితానితి సుషిః. ప్రమాదము వలన పడినవారిని హింసించునది. బెజ్జము, రంధ్రము.
సుషిమము
సం. విణ. తత్స. సుష్ఠుసీమామర్యాదాయస్య సుషీమః చక్కనిహద్దుకలది. చల్లనిది. <సుషిమము>
సుషిర
సం. విణ. తత్స. సుష్ఠుష్యతి గతిమితి సుషిరం. మిక్కిలి గతిని చెఱచునది, గువ్వగుత్తిక, బెజ్జము కలది, పిల్లన గ్రోవి లోనగు వాద్యము, కిక్కిస. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుర్వగుత్తిక వృక్ష విశేషము. సం. నా. వా. అ. న. బెజ్జము. సం. నా. వా. పుం. తత్స. కిక్కిస వృక్ష విశేషము.
సుషేణము
సం. నా. వా. అ. పుం. తత్స. సుషేణాఖ్య కపిముఖా కృతి త్వాత్సుషేణః. సుషేణుండును కపిముఖము వలెనుండునది, కలివి, చెట్టు, (వృక్షవిశేషము).
సుషేణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుష్ఠుసినోతి క్రిమీన్ సుషేణికా. పురుగులను మిక్కిలి నిలుపునది, నల్లతెగడ, (వృక్ష విశేషము).
సుహృదుడు
సం. నా. వా. ద్. పుం. తత్స. శోభనం హృదయమస్యేతి సుహృద్. మంచి హృదయముకలవాడు, చెలికాడు.
సూకరము
సం. నా. వా. అ. పుం. తత్స. బహూన్యప్త్యాని సూతే సూకరః. అనేకములైన పిల్లలను ఈనునది, పంది,వరాహము.
సూక్ష్మము
సం. నా. వా. అ. న. తత్స. సూచ్యత ఇతి సూక్ష్మం. లెస్సగా కానబడకుండుటచేత సూచించబడునది. అధ్యాత్మము, కపటము, సూచింపబడినది. సం. నా. వా. పుం. అణువు. సం. నా. వా. విణ. తత్స. సన్నము.
సూచకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సూచయతీతి సూచకః. సూచించువాడు, సూది, నక్క, కుక్క, కాకి, పిల్లి.
సూచి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సీవ్యతే అనయా ఇతి సూచీ. అభినయహస్త విశేషము, దృష్టి, సూది, ఇసుకమేట, అడ్డుగడియ, పుల్కసుడు, ఒకసంకరజాతి.
సూతము
సం. నా. వా. అ. పుం. తత్స. సుపత్యశ్వానితి సూతః. గుఱ్ఱములను తోలువాడు. సూతే హేమాదిక మితి సూతః. బంగారు మొదలగునవి దానిని కలిగించునది. సువత్యశ్వాన్ ప్రేరయతీతి సూతః. గుఱ్ఱములను తోలువాడు, పాదరసము, సారథి, నియంత, దేవపూజకుడు, ఒక సంకరజాతి.
సూత్థానుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సుష్ఠు ఉత్థాన ముద్యోగోయస్య సూత్థానః. మంచి ఉద్యోగము కలవాడు, నేర్పరి, తెలివిగల వాడు.
సూత్రము
సం. నా. వా. అ. న. తత్స. సీవ్యం త్యే భిరితి సూత్రాణి. దీనిచేత నేయుదురు, నూలిపోగు, శాస్త్రాది సూచనా గ్రంధము జన్నిదము, ఏర్పాటు. సూత్ర్యతే అనేనేతి సూత్రం. తంతువు, దారము, ప్రస్తావన.
సూదుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. సూదయంతి తండులానితి సూదాః. తండులమును పక్వము చేయువారు, వంటవాడు. సూదయతి రసానితి సూదః. సూదయతిక్షుదాతికమితి సూదః. ఆకలి మొదలైనదాని పోగొట్టును.
సూన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సువతి ప్రేరయతి శ్లేష్మాదికమితి, సూయన్తేప్రాణిన అత్రేతి చసూనా. శ్లేష్మాదులను వెల్లించునది, కూతురు, కొండనాలుక, వధస్థానము ఇవి ఐదు కండ్రణి (రోలు), వేషణి (సన్నెకల్లు), చుల్లి (పొయ్యి), ఉధకుంభి (నీళ్ళు కడవ), మార్జని (పొరక). సం. నా. వా. అ. న. తత్స. ప్రసవము, పుష్పము. సం. నా. వా. విణ. తత్స. శూన్యము.
సూనుడు
సం. నా. వా. ఉ. పుం. తత్స. మాతా ఏనం సూయతే సూనుః. తల్లి దీనిని కనును, కొడుకు, తమ్ముడు, సూర్యుడు, (స్త్రీలింగమైనచో కూతురు), సంతతి, పుత్రులు, తనుజులు, సుతులు, తనయులు.
సూనృతము
సం. నా. వా. అ. న. విణ. తత్స. సుష్ఠునృత్యన్త్యనేనేతి సూనృతం. దీనిచేత లెస్సగా ఆడుదురు, శుభము, ప్రియమును, సత్యమైనది (మాట).
సూపకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సూపం వ్యఙ్జనం కుర్వన్తీతి సూపకారాః. కూరలు చేయువారు, వంటవాడు.
సూరణము
సం. నా. వా. అ. పుం. తత్స. సూర్యత ఇతి సూరణః. భక్షింపబడునది, కందగడ్డ.
సూరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సువతి ప్రేరయతి సత్కర్మణీతి సూరిః. సత్కర్మము నందు ప్రేరేపించువాడు, సూర్యుడు, పండితుడు. సూతే సద్వాక్యానీతి సూరిః. ప్రజ్ఞాశీలి.
సూరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సరత, చరతీతి సూరః. సంచరించువాడు, సూర్యుడు, పండితుడు.
సూర్మి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సుష్ఠు శోభన మూర్వతి అమంగళత్వాదితి సూర్మిః. అమంగళమౌట వలన శుభమును చెఱుచునది, లోహపు ప్రతిమ, లోహ విగ్రహము.
సూర్యతనయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సూర్యస్య తనయాసూర్యతనయా. సూర్యునికూతురు, యమునానది, కాళింది.
సూర్యసూతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సూర్యస్యసూతః సూర్యసూతః. సూర్యుని సారధి, అనూరుడు.
సూర్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సువతి ప్రేరయతి వ్యాపార్వేషితి సూర్యః. వ్యాపారములయందు ప్రేరేపించువాడు, వెలుగు ఱేడు. సరతి ఆకాశే ఇతి సూర్యః. దివాకరుడు, ప్రభాకరుడు, ఆదిత్యుడు, గ్రహవిశేషము, అరుణుడు.
సృక్వి
సం. నా. వా. ఇ. న. తత్స. సృజతో లాలాం సృక్విణీ.చొల్లునుపుట్టించునవి, పెదవులు, సెలవి.
సృగము
సం. నా. వా. అ. పుం. తత్స. సృజ్యతే శత్రూన్ ప్రతి సృగః. శత్రువులను కూర్చి విడువబడునది, సాగు, భిండివాలము, పెద్దబాణము.
సృగాలము
సం. నా. వా. అ. పుం. తత్స. అసృక్ అలతీతి సృగాలః. మాంసమును తినునది, నక్క, జంబుకము, శ్యోనకము.
సృణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సరత్యనయాసృణిః. ఏనుగు దీనిచేత పోవును, అంకుశము.
సృణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సురతి స్రవతి సృణికా. జాఱునది, చొంగ.
సృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సరంత్యనేన సృతిః. దీనిచేత సంచరింతురు, త్రోవ, పోక, నౌరి.
సృమరము
సం. నా. వా. అ. పుం. తత్స. వనేసర్వత్ర సరతీతి సృమరః. వనమునందంతట తిరుగునది, పెద్దచమరమృగము, చమరీమృగము.
సృష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సృజ్యతే స్మ సృష్టిః. సృజింపబడునది, స్వభావము, ప్రకృతి స్వభావము, సృజించుట.
సేచనము
సం. నా. వా. అ. న. తత్స. సిచ్యతే అనేన నౌకాబలమితి సే చనం. ఓడలో నీళ్లు దీనిచేత చల్లబడును, చల్లుట, తడుపుట ఓడలోకి వచ్చిన నీళ్లువెలికి పాఱ జల్లెడునీరు పోయుపాత్ర, బొక్కెన.
సేతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సిన్వంతి బధ్నంతి మృత్పాషాణాది భిరేన మితిసేతుః. మృత్పాషాణాదుల చేత దీని కట్టుదురు, నీటికట్ట, ఉలిమిరి. వ్యాధించినో తీతి సేతుః. వ్యాధినడ్డగించునది. సినోతి బధ్నాతి జలమితి సేతుః. వరుణుడు, విళంగము, ఆనకట్ట.
సేన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఇనేన ప్రభుణా సహవర్తత ఇతి సేనా. రాజుతో కూడినది, దండు, సైన్యము. సినోతి శత్రూనితి సేనా. చతురంగ బలము, వాహిని, బలము.
సేనాంగము
సం. నా. వా. అ. న. తత్స. సేనాయా అంగం సేనాంగం. సేనకు అంగము, రథ గజతురగపదాతి చతుష్టయము.
సేనాని
సం. నా. వా. ఈ. పుం. తత్స. దేవసేనాం నయతి ప్రాపయతి సేనానీః. దేవసేనను నడిపించువాడు. సేనాం నయతీతిసేనానీః. సేనను నడిపించువాడు, కుమారస్వామి, సేనాధిపతి, గుహుడు, సుబ్రహ్మణ్యుడు.
సేనాముఖము
సం. నా. వా. అ. న. తత్స. సేనాయా ముఖం సేనాముఖం. సేనయొక్కముఖము, సేనయొక్క అగ్రభాగము, మూడురథములు, మూడేనుగులు, తొమ్మిది గుఱ్ఱములు, పదునేవురు కాల్యురునుకలసేన, మూడు పత్తులతో కూడినసేన.
సేవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సేవనం సేవా. సేవించుట, శుశ్రూషు, కొలువు, పరిచర్య, ఉపాసన, భక్తి, ఆరాధన, ఉపచారము, సేవనము.
సేవకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సేవతే సేవకః. సేవించువాడు, కొలుచువాడు, అనుచరుడు, పరిచారకుడు, గోనెసంచి, పూజ.
సేవనము
సం. నా. వా. అ. న. తత్స. సేవ్యత ఇతి సేవనం. కుట్టుట, కొలువు, సేవ.
సేవ్యము
సం. నా. వా. అ. న. తత్స. సేవ్యతే పిత్తాది శమనార్ధమితి సేవ్యమ్. రోగహరణార్ధమై సేవింపబడునది, వట్టివేరు, నీటివట్టివేరు. సం. విణ. తత్స. సేవింపతగినది, ఎర్రచందనము, ఉప్పు, పెరుగు, మద్యము, నీరు, మొదలుగునవి.
సైంహికేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సింహికాయా అపత్యం పుమానితి సైంహికేయః. రాహుగ్రహము, చీకటి, తమస్సు.
సైకతము
సం. నా. వా. అ. న. తత్స. సికతాః అస్యసంతీతి సైకతం. సికతమనగా ఇసుక అదికలిగినది, ఇసుకదిబ్బ, ఇసుకనేల, ద్వీపము.
సైతవాహిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సితవాహిన్యేన సైతవాహిని. తెల్లని జలమును వహించునది, పెద్దదయగలది.
సైన్యము
సం. నా. వా. అ. న. తత్స. సేనాయం సమవేతాః సైన్యః. సం. నా. వా. అ. పుం. తత్స. సేనైవ సైన్యం. సేనయే సైన్యము, కృష్ణుని తేరిగుఱ్ఱములలో నొకటి. సం. విణ. తత్స. సేనతో కూడినది, వాహిని, బలము, సేన, యోధుడు.
సైన్యము
సం. నా. వా. అ. న. తత్స. స్తేనస్య కర్మస్తైన్యం. దొంగతనము, చౌర్యము.
సైరంధ్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్వైరం స్వచ్ఛందం వర్తనం దధాతిసైరంధ్రీ. స్వేచ్ఛా విహారమును ధరించునది, గట్టువాలు, అంతఃపురపుకావలి కత్తె, సంకరజాతి స్త్రీ, గౌరముగా పరగృహమున జీవించువిదుషి.
సైరికము
సం. నా. వా. అ. పుం. తత్స. సీరేణ ఖనతి, సీరం వహతి, సీరస్యాయంవాసైరికః. హలమనినను, సేమరనేనాగేలు, దున్నెడి ఎద్దు, సీరసంబంధమైనది.
సైరిభము
సం. నా. వా. అ. పుం. తత్స. పశుభిః భాంతీతి సీరిభాః కర్షకాః తేషామయం సైరిభః. నాగేలు కలవి కనుక, కారెనుపోతు, స్వర్గము, ఎనుబోతు.
సైరేయకము
సం. నా. వా. అ. పుం. తత్స. సైరేదేశేభవః సైరేయకః. సైరదేశమందు పుట్టినది, తెల్లగోరంట, ములుగోరంట.
సోఢ
సం. విణ. (ఋ. ఈ. ఋ). తత్స. సహ్యతే స్మ సోఢం. ఓర్వబడినది, ఓర్చువాడు, ఓపువాడు, సహించినవాడు, బాధపడినవాడు.
సోదర్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సమానే ఉదరే శయితః సోదర్యశ్చః. ఒక గర్భమున పుట్టినవాడు, తోడపుట్టినవాడు, సహోదరుడు, సోదరుడు.
సోపప్లవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఉపప్లవేన ఆకులతయా సహవర్త ఇతి సోపప్లవః. ఉపప్లవముతో కూడినవాడు, రాహువు చేపట్టబడినవాడు, (చంద్రుడు, లేక సూర్యుడు).
సోపానము
సం. నా. వా. అ. న. తత్స. సహ ఉపానమంత్యస్మిన్నితి సోపానం. దీనియందు ఎక్కునపుడు, దిగునపుడు ఇంచుకంత వంగుదురు, మెట్టు, ఆరోహణము. ఉపానముపరి గమనం తేన సహ విద్యమానమితి సోపానం. ఆరోహణము.
సోమపీథి
సం. నా. వా. న్. పుం. తత్స. సోమపీథ స్సోమపానముస్యాస్తీతి సోమ పీథీ సోమ పానము కలవాడు. సోమం పీతమనేనేతి సోమపీతి. దీనిచేత సోమపానము చేయబడును, యజ్ఞమునందు సోమపానము చేయువాడు.
సోమపుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సోమం పిబతీతి సోమపాః. సోమమును విధిచేత పానము చేసినవాడు, యజ్ఞము నందు సోమపానముచేయువాడు.
సోమము
సం. నా. వా. అ. పుం. తత్స. సూతే అమృతమితి సోమః. అమృతమును పుట్టించువాడు, తిప్పతీగ, జలము, కర్పూరము, దినముయొక్క పదకొండవ భాగము, గుమ్మడి, సోమయాగము, ఆకాశము, చంద్రుడు, ఇంద్రుడు, కుముదబాంధవుడు, వానరము, కుబేరుడు, యముడు, వాయువు, వసుభేదము, దివ్యౌషధము.
సోమరాజి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సోమేన ఆహ్లదేన రాజతే సోమరాజీ. సంతోషము చేత ప్రకాశించునది, కారుగచ్చ, ఒకతీగ (వృక్ష విశేషము).
సోమవల్కము
సం. నా. వా. అ. పుం. తత్స. సోమవత్ చంద్ర వత్సితం వల్కం వల్కలమస్య సోమవల్కః. చంద్రునివలె తెల్లనైన పట్టగలది. సోమవర్దవళం వల్కమస్యేతి సోమవల్కః. చంద్రునివలె తెల్లనైన పట్టకలది, వెలిచంద్ర, తేకు, (వృక్ష విశేషము).
సోమవల్లరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సోమవచ్ఛీత వీర్యత్వాత్సోమవల్లరీ. చంద్రునివలె చల్లనైయుండునది, పొన్నగంటికూర, సోమెదకూర.
సోమవల్లి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సోమస్య అంశభూతా వల్లీ సోమవల్లీ. సోమమునకు అవయవముయిన తీగె, తిప్పతీగ.
సోమోద్భవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సోమ వంశజేన పురూరవసా భువం ప్రత్యవతారితా సోమోద్భవా. సోమవంశమున పుట్టిన పురూరవుడను రాజుచేత భూమికి తేబడినది. నర్మదానది.
సౌగంధికము
సం. నా. వా. అ. న. తత్స. సుగంధం ప్రయోజనమస్య సౌగంధికం. సుగంధము ప్రయోజనముగా కలిగినది. శోభనః గంధః ప్రయోజనమస్యేతి సౌగంధికః. మంచిపరిమళము ప్రయోజనముగా కలిగినది. శోభనో గంధోస్యసుగంధిః రేవసౌగంధికః. సం. నా. వా. అ. పుం. తత్స. రోగములను చెఱుచుటకు మంచిదైన కంపు కలది. చెంగలువ, కామంచి, మాణిక్య విశేషము (ఇది ఆంధ్రమునదు పుట్టినది అశోకపుచిగులు దాళుగలది, మద్యమజాతి రత్నము) గంధకము, సుగంధవస్తువుల వ్యాపారము చేయువాడు, వాసనగలగడ్డి, తెల్లకలువ.
సౌచికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సూచీకర్మ శిల్పమస్యేతి సౌచికః. సూదిపని శిల్పముగా కలవాడు, కుట్రపువాడు. సూచ్యా జీవతీతి సౌచికః.
సౌదామని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుదామ్నా ఐరావతేన సహవర్త ఇతి సౌదామిని. సుదామ మనగా ఐరావతము, దానితో కూడియుండునది, మెఱపు, ఒకదినుసు మెఱపు, ఒక అప్పరస స్త్రీ. సుదామా మేఘః పర్వతో వా తేన ఏకదిక్ ఇతి సౌదామనీ. విద్యుత్తు.
సౌధము
సం. నా. వా. అ. పుం. తత్స. సుధాయోగాత్ సౌధః. సుధఅనగా సున్నము, అదికలది, రాజగృహము, నగరు, వెండి, మేడ.
సౌభాగినేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సుభగాయా అపత్యం సౌభాగినేయః. భాగ్యవంతురాలి కొడుకు.
సౌమ్య
సం. నా. వా. అ. పుం. తత్స. సోమస్యా పత్యం సోమ్యః. చంద్రుని కొడుకు. సోమోదేవతాస్యేతి సౌమ్యం. సోముడు దేవతగా కలది. ఒక సంవత్సరము, బుధగ్రహము.
సౌరభేయము
సం. నా. వా. అ. పుం. తత్స. సురభేరపత్యం సౌరభేయః. ఆవునకుపుట్టినది, ఎద్దు, బలివర్దము.
సౌరభేయి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సురభేర్గోత్రాపత్యం స్త్రీసౌరభేయీ. సురభి అనగా కామధేనువు, దానివంశమునందు పుట్టినది, ఆవు, గోవు.
సౌరాష్ట్రికము
సం. నా. వా. అ. పుం. తత్స. సురాష్ట్రదేశేభవః సౌరాష్ట్రికః. సౌరాష్ట్రదేశమున పుట్టునది, విషభేదము, ఒక విషము. సం. విణ. తత్స. సౌరాష్ట్ర దేశ సంబంధమైనది.
సౌరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. సూరస్యా పత్యం సౌరిః. సూర్యుని కొడుకు, శనైశ్చరుడు, యముడు, శని.
సౌవర్చలము
సం. నా. వా. అ. న. తత్స. సౌవర్చలా కరోద్భవత్వాత్ సౌవర్చలం. సౌవర్చలమనుగని యుందుపుట్టినది, ఒకదినుసు, ఉప్పు. సువర్చలే దేశే భవం సౌవర్చలం. నల్లటి ఉప్పు, తెల్ల ఉప్పు.
సౌవిదల్లుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సువిదల్లాః స్త్రియః తాః పాలయన్తీతి సౌవిదల్లాః. సువిదల్ల అనగా స్త్రీలు వారినికాచుకొనియుండు వారు సౌవిదల్లులు, అంతః పురపు కావలివాడు, కంచుకి.
సౌవిదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సుష్ఠు విదన్తీతి సువిదః ప్రగల్భాః స్త్రియః తాః రక్షన్తీతి సౌవిదాః. లెస్సగాఎఱుంగువారు కనుక, అంతః పురపు కావలివాడు. సుష్ఠు వేత్తీతి సౌవిదః. కంచుకి.
సౌహిత్యము
సం. నా. వా. అ. న. తత్స. సుహితస్సుతృ ప్తస్తస్య భావః సౌహిత్యం. సుహితుడునగా తృప్తుడు, వానియొక్క భావము, తృప్తి, తనివి, ఆప్తత.
స్కందశాఖ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్కంధాన్నిర్గతా శాఖా స్కందశాఖా. స్కంధమనగా మ్రాకుమొదలు, దానినుండి పుట్టినకొమ్మ, మ్రానిమొదటికొమ్మ, చెట్టు యొక్క ముఖ్యమైన కొమ్మ.
స్కందుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్కంద్యతే అధిరుహ్యత ఇతి స్కంధః ఎక్కబడునది. కం శిరో దధాతీతి స్కంధః శిరస్సునుధరించునది. స్కంధత ఇతి స్కంధః. పొందబడునది, మూపు, చెట్టుబోదె, యుద్ధము, సముహము, శరీరము, దశార్ణదేశపురాజు (స్కందత్రయము, ఆదానము, నిదానమ, చికిత్స, ఇవివైద్యశాస్త్రమునందలివి). స్కంధపంచకము, రూప, వేదనా, విజ్ఞాన, సంజ్ఞా, సంస్కారములు (ఇవి బౌద్ధ శాస్త్రోక్తములు). స్కందతే ఉత్ప్లుత్య గచ్ఛతి, స్కందతి శోషయతి దైత్యాన్ వా ఇతి స్కందః. కార్తికేయుడు, గుహుడు, కుమారస్వామి, బ్రహ్మ, నది ఒడ్డు.
స్కన్నము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్కందతి స్మ స్కన్నం. జాఱినది, పడినది.
స్ఖలనము
సం. నా. వా. అ. న. తత్స. స్ఖలితం స్ఖలనం. చలించుట, జాఱుపాటు, తొట్రు.
స్ఖలితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్ఖలనం స్ఖలితం. మర్యాద నుండి చలించుట, జాఱినది, తొట్రుపడినది.
స్తంబకరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. స్తంబం కరోతీతి స్తంబకరిః. స్తంబము అనగాగంట దానిని చేయునది, ధాన్యము, వ్రీహి.
స్తంబగ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తమ్బోహన్యతే అనేన స్తంబఘ్నః. దీనిచేత కసువు గంటలు కోయబడును, వరిపైరు మొదలువాని కోసెడు కొడవలి వంటిది.
స్తంబము
సం. నా. వా. అ. న. తత్స. తిష్ఠతీతి స్తమ్బః. స్థిరమైఉండునది, వరిలోనగువానిపంట, బోదెలేని చిన్న చెట్టు, పొద, చెట్టు విరివి, గడ్డిదుబ్బు, ధాన్యపు వెన్ను.
స్తంబేరమము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తంబేతృణ గుల్మేరమత ఇతి స్తంబేరమః. పొదలందు క్రీడించునది, ఏనుగు, గజము, ద్విపము, కరి, అనేకపము, కుంజరము, కుంభి, వారణము, ఇభము, రది, సింధురము, సమోద్భవము, హస్తి.
స్తంభము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తభ్నాతి గృహం చేష్టితం చేతిస్తంభః. గృహమును, వ్యాపారము అడ్డగించునది, కంబము (గృహమద్యస్తంభము, కహారము) మానుపాటు, పట్టుదల, ఆలానము, జడీభావము, జడత్వము, జాడ్యము.
స్తనంధయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్తనౌ ధయతీతి స్తనంధయీ. చన్నుకుడుచునది, పాలుత్రాగెడు మగబిడ్డ, చంటిపాప, శిశువు.
స్తనము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తనతి బాల అభ్యామితిస్తనౌ. వీనికొఱకు బాలుడు మొఱపెట్టును, కుచము, చను. స్తన్యతే శబ్ద్యతే కాముకైః, స్తనయతి కథయతి వక్షః శోభామితి వా స్తనః. అవయవవిశేషము, వక్షోజము, చన్నుమొన,చన్నులు.
స్తనయిత్నువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. స్తనయతీతి స్తనయిత్నుః. మ్రోయునది, మబ్బు, ఉఱుము, మేఘము, పయోధరము.
స్తనితము
సం. నా. వా. అ. న. తత్స. స్తనతీతి స్తనితం. మ్రోయుచుండునది, ఉఱుము, గర్జితము.
స్తబకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తూయతే స్తబకః. స్తోత్రము చేయబడునది, పూగుత్తి, గుచ్ఛకము.
స్తబ్ధరోమము
సం. నా. వా. న్. పుం. తత్స. స్తబ్ధాని రోమాణ్యస్యాస్తీతి స్తబ్ధరోమా. బిరుసయిన వెండ్రుకలుకలది, పంది, వరాహము.
స్తవము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తూయతే అనేనేతి స్తవః. దీనిచేత స్తోత్రము చేయబడును, స్తోత్రము, పొగడిక, ప్రశంస, స్తుతి.
స్తిమితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్తిమ్యతీతి స్తిమితం. తడిసినది, కదలనిది, నిశ్చలము.
స్తుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అభిష్టూయతే స్మ స్తుతం. స్తోత్రము చేయబడినదికనుకస్తుతము, స్తుతింపబడినవాడు.
స్తుతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. స్తూయతే అనేనేతి స్తుతిశ్చః. స్తోత్రము, పొగడిక, ప్రశంస, వర్ణన, వేదమంత్రము.
స్తుతిపాఠకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్తోత్రము చేయువారు, బట్టువాడు.
స్తూపము
సం. నా. వా. అ. పుం. తత్స. మట్టిమొదలగు వానిదిబ్బ, గాలి, యుద్ధము, వత్తు.
స్తూలలక్షుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అర్ధిభ్యోదాతుం స్థూలం బహుళం లక్షయతీతి స్థూల లక్షః. మిక్కిలి ఈవికాడు, మిక్కిలి వెచ్చకాడు, అర్దులకిచ్చుకొఱకు దొడ్డ పదార్ధమును వెదకువాడు. స్థూలం ప్రచురం లక్షయతి దానార్థమితి స్థూలలక్షః. త్యాగి.
స్తేనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్తేనయతి స్తేనః మ్రుచ్చిలించువాడు, దొంగ, చోరుడు, తస్కరుడు.
స్తేమము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తేమనం స్తేమః. తడియుట, సముందనము, తేమ.
స్తేయము
సం. నా. వా. అ. న. తత్స. స్తేనస్య కర్మస్తేయం. దొంగ, చోరుడు, చౌర్యము, దొంగతనము.
స్తోకకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తోకం అల్పం కాయతీతి స్తోకకః. మెల్లగా కూయునది, చాతక పక్షి, వానకోయిల.
స్తోకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తూయత ఇతి స్తోకః. కొనియాడు బడునది, వానకొయిల. సం. నా. వా. అ. న. తత్స. నీటిబొట్టు, నీటిచుక్క. సం. విణ. తత్స. అల్పము, కొంచెము.
స్తోత్రము
సం. నా. వా. అ. న. తత్స. స్తూయతే అనేనేతి స్తోత్రం. దీనిచేత స్తోత్రము చేయబడును, స్తుతి, పొగడిక, స్తోత్రము, వేద మంత్రము.
స్తోమము
సం. నా. వా. అ. పుం. తత్స. స్తూయత ఇతి స్తోమః. స్తోత్రము చేయబడునది, సమూహము, యజ్ఞము, యాగము, స్తోత్రము, ఒకమానము.
స్త్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్త్యాయతి సంఘాతో భవత్యస్యాం గర్భ ఇతి స్త్రీ. దీనియందు గర్భము కూర్పబడును, ఆడుది, (స్త్రీజాతులు నాలుగు పద్మిని, చిత్రిణి, హస్తిని, శంఖిని), వనిత, అబల, రమ, చెదపురుగు, ప్రియంగులత.
స్త్రీధర్మిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రజోరూపః స్త్రీధర్మోస్యా అస్తీతి స్త్రీధర్మిణీ. రజోరూపమైన స్త్రీ ధర్మము కలిగినది, ఋతుమతి, ముట్టుది.
స్థండిలము
సం. నా. వా. అ. న. తత్స. తిష్ఠన్త్యగ్నయోస్మిన్నితి స్థండిలం. అగ్నులు దీనియందుండును, వ్రతము పూనినవాడు పండకొనుటకు దర్భాదులచే సంస్కరింపబడినభూమి, అగ్నిహోత్రమునుంచుటకై సంస్కరించినస్థానము. తిష్ఠత్యస్మిన్నితి స్థండిలం.
స్థపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. బృహస్పతి మేధేన సమాపకాంగేన యాగం స్థాపయతి స్థపతిః. సమాకమైన బృహసృతీష్టి చేత యజ్ఞమును స్థాపించువాడు, శిల్పివిశేషము, అంతః పురపుకావలివాడు, తిష్ఠంత్యస్మిన్నితి స్థపతిః. కుబేరుడు, ఆయోగవుడు, కంచుకి, యజమానుడు, వడ్రంగి. సం. విణ. తత్స. శ్రేష్ఠుడు.
స్థలము
సం. నా. వా. అ. న. తత్స. స్థలతీతి స్థలం. స్థానమైయుండునది, మెట్టనేల. స్థల్యతే స్థీయతే అత్ర స్థలం. సమతలము.
స్థలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్థలతీతి స్థలీ. జలసూన్యమై తనం తటనే చదరమైయుండెడునేల, మెట్టనేల, స్థలము.
స్థవిరుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. బహుకాలం తిష్టతీతి స్థవిరః. బహుకాలముగా ఉండెడువాడు, ముసలివాడు, వృద్ధుడు.
స్థవిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన స్థూలః స్థవిష్ఠః. మిక్కిలి బలిసినది, మిక్కిలి స్థూలము.
స్థాండిలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్థండిలే శేతే స్థాండిలశ్చః. స్థండిలమనగా తృణాదులచేత కప్పబడినభూమి, దానియందు పరుండువాడు, స్థండిల భూమి యందు శయనించెడు వ్రతి, స్థండిలశాయి.
స్థాణువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. ప్రళయేపి తిష్ఠతీతి స్థాణుః. ప్రళయమందు ఉండువాడు. వాయునా నిహతోపి తిష్ఠతీతి స్థాణుః. వాయువుచే కొట్టబడియు నిలచియుండునది. తిష్ఠతీతి స్థాణుః. స్థిరమై ఉండునది, మేకు, శివుడు, కొమ్మలులేనిచెట్టు, మ్రోడు, స్థిరమయినది. శంకరుడు, శంభువు, రుద్రుడు, దుక్క, మొరడు. సం. విణ. తత్స. స్థిరమయినది.
స్థానము
సం. నా. వా. అ. న. తత్స. తిష్ఠం త్యస్మిన్ స్థితి శ్చస్థానం. దీనియందుందురు కనుక చోటు, ఉనికి, శత్రువుతో సమముగానుండుట (అనగా కృష్యాద్యష్ట వర్గము నందు శత్రవుతో సమముగానుండుట) వర్గము, విలుకాని యుద్ధమప్పటికి నిలుపు ఇది పంచవిధములు ప్రత్యాలీఢము, ఆలీఢము, సమపదము విశాఖము, మండలము) పోలిక, గ-హము, అయనము, నికటము.
స్థానీయము
సం. నా. వా. అ. న. తత్స. అకుతో భయత్వాత్ స్థానాయ వాసాయ హితం స్థానీయం. ఎక్కడ భయములేనిది అవుటవలన ఉండుటకు యోగ్యమైనది, పట్టణము, ప్రోలు. స్థానాయ హితమితి స్థానీయం. పురము, నగరము, పట్టణము, పెద్ద గ్రామము.
స్థాపత్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్త్రీణాం వ్యవస్థాం స్థాపయంతీతి స్థాపత్యాః. స్త్రీలవ్యవస్థను నిలుపువారు, అంతఃపురపు కావలివాడు, హెగ్గడి. స్థపతిరేవ స్థాపత్యః. కంచుకి.
స్థాపని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జనాన్ స్థాపయతీతి స్థాపనీ. జనులను నిలుపునది, చిఱుబొద్ది (వృక్ష విశేషము), అగ్నిధి వృక్షము.
స్థామము
సం. నా. వా. న్. న. తత్స. తిష్ఠ త్యరిమధ్యే అనేనేతిస్థామ. దీనిచేత శత్రుమధ్యమందునిలుచును, శరీరబలము, సామర్థ్యము, ప్రాణము, బలము, ప్రతీపము, పౌరుషము, విక్రమము.
స్థాయుకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రామే స్థాతుం శీలమస్యేతి స్థాయుకః. గ్రామమందుండునట్టి స్వభావము కలవాడు, ఒకగ్రామమునకు అధికారి, గ్రామాధ్యక్షుడు, స్థిరము.
స్థాలము
సం. నా. వా. అ. న. తత్స. తిష్ఠత్యస్మిన్ అన్నాదికమితి స్థాలం. భోజన పాత్రము, కంచము, శివుడు, కంచుగిన్నె.
స్థాలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. తిష్ఠన్తి పదార్ధా అస్మిన్నితి స్థాలీ. పదార్ధములు దీనియందుండును, వంటకుండ, గిన్నె, కలిగొట్టు, కంచము, లోవి. (వృక్ష విశేషం).
స్థావరము
సం. నా. వా. అ. పుం. విణ. తత్స. తిష్ఠతి తాచ్ఛీల్యేనేతి స్థావరః. స్వభావముననే కదలకుండునది, కొండ, కదలనిది, నిశ్చలము. అ. నా. వా. అ. న. తత్స. వింటినారి.
స్థావిరము
సం. నా. వా. అ. న. తత్స. స్థవిరస్య భావః స్థావిరం. వృద్ధుని యొక్కభావము, వృద్ధత్వము, ముదిమి, వార్ధక్యము.
స్థాసకము
సం. నా. వా. అ. పుం. తత్స. శరీరాదౌ తిష్ఠతీతి స్థాసకః. శరీరాదుల యందుఉండునది, కుంకుమలోనగువానిపూత నీరులోనగువానియందలి బుగ్గ. ఊర్ధ్వము.
స్థాస్నువు
సం. విణ. (ఉ). తత్స. తిష్ఠతి చిరకాలం తాచ్ఛీల్యేనేతి స్థాస్నుః. అనేక కాలము స్వభావమున ఉండునది, బహుకాలము ఉండునది, స్థిరము, కదల్పలేనిది.
స్థితి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. తిష్ఠం త్యస్మామితి స్థితిః. ఆలనం సంస్థానం స్థితిః. దీనియందు స్థిరులైయుందురు, ఉనికి, కూర్చుండుట, నిలకడ, మేర, స్థానము, వ్యవస్థ, ధర్మ నిర్వహణము, అవస్థ, ఏర్పాటు, స్థలము, గౌరవము.
స్థిర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తిష్ఠతి సదాస్థిరా. ఎల్లప్పుడు ఉండునది, నేల, ముయ్యాకుపొన్న, (వృక్ష విశేషము). తిష్ఠతీతి స్థిరామైనది. సం. నా. వా. అ. పుం. కొండ, చెట్టు, మోక్షము, శని. సం. విణ. తత్స. నిలకడైనది.
స్థిరాయువు
సం. నా. వా. స్. పుం. తత్స. స్థిరమాయుర్యస్య చిరజీవి త్వాత్ స్థిరాయుః. అనేక కాలము ఉండునది, బూరుగు. (వృక్ష విశేషము).
స్థూణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తిష్ఠతి చిరకాలమితి స్థూణా. చాలాకాలముఉండునది. చిరం తిష్ఠతీతి స్థూణా. చాలాకాలముండునది, స్తంభము, ఇనుప ప్రతిమ, లోహ విగ్రహము.
స్థౌణేయము
సం. నా. వా. అ. పుం. తత్స. స్థూణస్యేవ రూపం స్థౌణేయం. స్తంభాకారమైఉండునది, గండివనము, మాచి, పచ్చాకు (వృక్ష విశేషము).
స్ధూలము
సం. నా. వా. అ. న. విణ. తత్స. స్థూలయతీతి స్థూలం. వర్ధిల్లునది, గుడారము, బలిసినది, బుద్ధిలేనిది, పెరుగు, పెద్దది, మూర్ఖుడు, బలిసినవాడు, వృద్ధిపొందునది.
స్ధూలోచ్ఛయము
సం. నా. వా. అ. పుం. తత్స. స్థూలస్య ప్రధానభాగస్య ఉచ్చయస్సంగ్రహోస్యేతి స్థూలోచ్ఛయః. ప్రధానభాగము యొక్క సంగ్రహము కలిగినది. పెద్దఱాయి, బొటిమ, ఏనుగు నడితరపునడ, అసాకల్యము. స్థూలానాముచ్చయో యత్ర స్థూలోచ్చయః. గజముల మధ్యమగమనము, అసంపూర్తి.
స్ధౌరి
సం. నా. వా. న్. పుం. తత్స. స్థూలస్య పృష్ఠ భాగస్యేదం స్థౌరం బలం, తదస్యాస్తీతిస్థౌరీ. అధికమైన వీపుసత్తువకలది, బరువుమోసెడు గుఱ్ఱము.
స్నవము
సం. నా. వా. అ. పుం. తత్స. స్నవనం స్నవః. కురియుట, స్రవణము, కాఱుట, చెమర్చునది.
స్నాతకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. వ్రతార్ధం స్నాతీతి స్నాతకః. వ్రతము కొఱకు స్నానము చేయువాడు, స్నానశీలవ్రతుడు, గృహస్థు.
స్నానము
సం. నా. వా. అ. న. తత్స. స్నాత్యనేన స్నానం. దీనిచేత శుచియౌను, మునక, నలుగుపిండి, మజ్జనము, అభిషేకము, స్నానీయము, స్నానము.
స్నాయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. స్నాతి సదా ఆర్ధ్రీ భవతి స్నాయుః. ఎప్పుడును ఆర్ధ్రమై ఉండునది, సన్నపునరము, వాయునాళము, కండరము.
స్నిగ్ధము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్నిహ్యతీతి స్నిగ్ధః. స్నేహించువాడు, స్నేహముకలది, చిక్కన కలది, సఖుడు, మిత్రుడు, గుగ్గిలము, ప్రియమైన.
స్నుతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్నౌతి స్మ స్నుతం. కాఱినది, రీణము, ప్రవహించునది.
స్నుష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గృహ వ్యాపారాయజలం స్నౌతీతి స్నుషా. గృహవ్యాపారము కొఱకు నీళ్ళుచల్లునది, కోడలు. స్నౌతి మనో యస్యామితి స్నుషా.
స్నుహి
సం. నా. వా. ఇ. ఈ. స్త్రీ. తత్స. స్నుహ్యతి క్షీరం స్నుహీ. పాలను వెళ్ళించునది, జెముడు. (వృక్ష విశేషము).
స్నేహము
సం. నా. వా. అ. పుం. తత్స. స్నిహ్యత ఇతి స్నేహః. స్నేహము, చెలిమి, చమురు, సఖ్యత, మైత్రి, ప్రేమ, నూనె, మైనము, మార్దవము, ద్రవము, నీరు.
స్పర్శనము
సం. నా. వా. అ. పుం. తత్స. స్పృశతీతి స్పర్శనః. స్పృశించువాడు. స్పృశ్యతేనేన స్పర్శనం. దానమందు వస్తువు స్పృశింపబడునుకనుక. స్పృశత్యుపతాపయతీతి స్పర్శః. తపింపచేయునది కనుక, తాకుడు, ఈవి వాయువు, గాలి, పవనము, మరుతము.
స్పర్శము
సం. నా. వా. అ. పుం. తత్స. స్పశ్యత ఇతి స్పర్శః. స్పృశింపబడునది, తాకుడు, ఈవి, వాయువు, ‘క’ మొదలు ‘మ’ వరకును గల అక్షరములు, తాకుట, బాధ ఇచ్చుట, వ్యాధి, తాకునది. స్పృశత్యుపతాపయతీతి స్పర్శః. తపింప చేయునది.
స్పశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్పశతి బాధతే పరానితి స్పశః. పరులను బాధించువాడు, వేగులవాడు, పులితోడను ఏనుగుతోడను పోట్లాడెడువాడు, చారుడు, యుద్ధము.
స్పష్టము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. స్పశత్యజ్ఞానం బాధత ఇతి స్పష్టం. అజ్ఞానమును పొగొట్టునది, వెల్లడియైనది, వివరింపబడినది.
స్పూర్జథువు
స్పృక్క
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్పృశతి గంధేన స్పృక్కా. పరిమళము చేత స్పృశించునది, పిక్క, ఒక చెట్టు.
స్పృశి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్పృశతీతి స్పృశీ. స్పృశించునది, వాకుడు.
స్పృష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. స్పర్శనం స్పృష్టిః. ముట్టుట, తాకుడు.
స్పృహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్పృహాణం స్పృహా ఇచ్ఛయించుట, ఇచ్ఛ, కోరిక.
స్ప్రష్టృ
సం. నా. వా. ఋ. పుం. తత్స. స్పృశత్యుపతాపయతీతి స్ప్రష్టృ. తపింప చేయురోగాదులపేర్లు, తపింపచేయురోగము.
స్ఫట
సం. నా. వా. ఆ. స్త్రీ. పుం. తత్స. స్ఫుటతీతి స్ఫటా. విస్తీర్ణమైనది, పాముయొక్కపడగ.
స్ఫాతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. స్ఫీతం స్ఫాతిః. పెరుగుట, వృద్ధి, అభివృద్ధి.
స్ఫిక్కు
సం. నా. వా. చ్. జ్. స్త్రీ. తత్స. స్ఫాయేతే స్ఫిచౌ. వృద్ధి పొందునది, పిరుదులు ఉన్నయువతి. స్ఫాయీ వృద్ధౌ ఇతి స్ఫిక్.
స్ఫీతము
సం. విణ. (అ. ఆ. అ). తత్స. స్ఫాయత ఇతి స్ఫీతం. విస్తారమైనది, అధికమైనది శైత్యము.
స్ఫుటనము
సం. నా. వా. అ. న. తత్స. స్ఫోటః స్ఫుటనం. భేదించుట, వ్రక్కలించుట, బ్రద్దలగుట.
స్ఫుటము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్ఫుటతి వికసతీతి స్ఫుటః. వికసించునది. స్ఫుటతి ప్రకాశత ఇతిస్ఫుటం. ప్రకాశించునది, స్పష్టమయినది, వికసించినది, ప్రకటము, వ్యాపించినది.
స్ఫురణము
సం. నా. వా. అ. న. తత్స. స్ఫూర్తిః స్ఫురణా. అదురుట, తోచుట.
స్ఫులింగము
సం. నా. వా. అ. పుం. తత్స. స్ఫూకారేణ లింగతి గచ్ఛతీతి స్ఫులింగః. అగ్నియొక్కలేశము, అగ్నికణము, మిణుగుఱు.
స్ఫూర్జకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్ఫూర్జతి దహ్యమానః శబ్దం కరోతీతి స్ఫూర్జకః. దావాగ్ని చేత దహింపబడినదై ఉఱుమువంటి శబ్దము చేయునది, తుమ్మిక, (వృక్ష విశేషము).
స్ఫూర్జథువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. స్ఫూర్జతీతి స్ఫూర్జథు. మిక్కిలి మ్రోయునది, వజ్రధ్వని, పిడుగు.
స్ఫేష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన స్ఫీతః స్ఫేష్ఠః. మిక్కిలి అధికమైనది.
స్మరహరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్మరం మన్మథం హరతీతి స్మరహరః. మన్మథుని సంహరించినవాడు, శివుడు, ముక్కంటి.
స్మరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్మరయ త్యుత్కణ్ఠయతీతిస్మరః. కాముకులను, కామినులను తొందరపెట్టువాడు, మన్మథుడు, మదనుడు, కామదేవుడు, మరుడు.
స్మితము
సం. నా. వా. అ. న. తత్స. స్మీయతేస్మితం. ఇంచుకంత నవ్వుట, అధరము నందుమాత్రము ప్రకాశించెడు చిఱునవ్వు, వికసించినది.
స్మృతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. మహర్షిభిః వేదార్థస్మరణ పూర్వకం రచితత్వాత్ స్మృతిః. మహర్షులచేత వేదార్ధపర్యాలోచనపూర్వకముగా నిర్మింపబడినది. స్మరణం స్మృతిః. స్మరించుట, తలపు, ధర్మశాస్త్రము, బుద్ధి, ఒక అర్ధాలంకారము, మన్వాదికము.
స్యందనము
సం. నా. వా. అ. పుం. తత్స. స్యందనోపయోగ్య త్వాత్ స్యందనః. స్యందతే చలతీతి స్యందనః.రధమునకు ఉపయోగించునది, రథము. సం. నా. వా. అ. న. తత్స. కాఱుట, జలము.
స్యందిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్యందతీతి స్యందినీ. చొంగ, లాల, నోటి ఊట.
స్యదము
సం. నా. వా. అ. పుం. తత్స. స్యందతే అనేనేతిస్యదః. దీనిచేత గమనయుక్తమౌను, వేగము, వడి, రవము, ప్రసరము.
స్యన్నము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్యందతే స్మ స్యన్నం. కాఱినది, స్రుతము, ప్రవహించునది.
స్యాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్యామయన్తి వితర్కయన్తి పరిహాసవచన మితి స్యాలః. పరిహాసముచేయువాడు, భార్యతోడపుట్టినవాడు, బావమఱిది.
స్యూతము
సం. నా. వా. అ. పుం. తత్స. సివ్యతే వేణుదళైరితి స్యూతః. వెదురుబద్దలచేత అల్లబడునది, పల్లిక, దాగర. సీవ్యతే స్మ స్యూతం. కుట్టబడినది, సంచి, అల్లబడినది. సం. విణ. తత్స. ఊయతే.
స్యూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సీవ్యత ఇతి స్యూతిశః. కుట్టుట, సంతతి.
స్రంసి
సం. నా. వా. న్. న. పుం. తత్స. స్రంసయతి ఫలాదికమితి స్రంసీ. ఫలాదులను ఇచ్చునది, పోక, గొనుగు, గోగు. సం. విణ. తత్స. క్రిందపడునది.
స్రజము
సం. నా. వా. జ్. స్త్రీ. తత్స. సృజ్యతేస్రజ్. విడువబడునది, పూలదండహరము. సృజతి శోభామితి స్రక్. మాల, మాలిక.
స్రవ
సం. నా. వా. అ. పుం. తత్స. స్రవణం స్రవః. కురియుట, కాఱుట, చెవి, ఊట.
స్రవంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్రవతీతి స్రవంతీ. పర్వతము వలన స్రవించునది, నది, తరంగిణి, ఏఱు.
స్రవా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్రవతి రసం స్రవారసమును స్రవించునది, చాగచెట్టు.
స్రష్టృ
సం. నా. వా. ఋ. పుం. తత్స. సృజతీతి స్రష్టృ. సృజించువాడు, బ్రహ్మ, ధాత, నలువ.
స్రస్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్రంసతే స్మ స్రస్తం. జాఱిపడినది, చ్యుతము.
స్రుక్కు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. స్రవతి స్మ స్రుతం. కారుట, ప్రవహించునది.
స్రువావృక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. స్రువా స్రుక్, తదర్థం వృక్షః సువావృక్షః. స్రువముల కొఱకైన వృక్షము, ములువెలగ. (వృక్ష విశేషము).
స్రోతస్విని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్రోతః అస్యా అస్తీతి స్రోతస్వినీ. తనంతట ప్రవహించునది, నది, నిమ్నగ, ఏఱు.
స్రోతస్సు
సం. నా. వా. స్. న. తత్స. స్వతః సరతేతి స్రోతః. తనంతట పోవునది ప్రవాహము, ఏఱు. స్రువతీతి స్రోతః. స్రవించునది, ఇంద్రియము, చెవి, కాలువ, నీరు.
స్రోతోంజనము
సం. నా. వా. అ. న. తత్స. యమునా స్రోతసి జాతమంజనం స్రోతోంజనం. యమునా ప్రవాహమునందు పుట్టినది, నీలాంజనము, సౌవీరాంజనము.
స్వచ్ఛందము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్వకీయ ఏవ చ్ఛం దోభిప్రాయోయస్యేతి స్వచ్ఛందః. స్వకీయమైన అభిప్రాయముకలవాడు, స్వతంత్రము. స్వస్య ఛందో అభిప్రాయో యత్ర ఇతి స్వచ్ఛందః. స్వాధీనము.
స్వజనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్వసంబంధీ జనః స్వజనః. తనసంబంధమైనజనుడు, సగోత్రుడు, జ్ఞాతి, ఆప్తుడు, బంధువు, ఒకపాము (కొండచిలువ), ఔరసపుత్రుడు.
స్వతంత్రము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్వం ఆత్మాతంత్రం ప్రధానం యస్య స్వతంత్రః. తానే ప్రధానముగా కలవాడు, సొంతము, స్వతంత్రుడు.
స్వధితి
సం. నా. వా. ఇ. పుం. తత్స. స్వం స్వకీయం ధియతి బిభర్తీతి స్వధితిః. స్వకీయమైనవారిని పోషించునది, గండ్రగొడ్డలి, పరశువు, గొడ్డలి, ఱంపము.
స్వనము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వనతీతి స్వనః. మ్రోత, శబ్దము, ధ్వని, చెడ్డధ్వని.
స్వనితము
సం. నా. వా. అ. న. విణ. తత్స. స్వనతీతి స్వనితం. మ్రోయునది, ఉఱుము, మ్రోసినది.
స్వప్నక్కు
సం. విణ. (జ్) తత్స. స్వపితి తాచ్ఛీల్యేనేతి స్వప్నక్. నిద్ర పోవు స్వభావముకలవాడు, నిద్రపోతు, సోమరి.
స్వప్నము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వపితం స్వప్నః. శయనించుట స్వప్నము, కల, నిదుర, చూపు.
స్వభావము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వస్య భావః స్వభావః. తనయొక్క భావము, స్వధర్మము, సంసిద్ధి, స్వకీయము, ప్రకృతి.
స్వభువు
సం. నా. వా. ఊ. పుం. తత్స. స్వే నాత్మనా జాయత ఇతి స్వభూః. తనంతతానే పుట్టినవాడు, విష్ణువు, శివుడు.
స్వయంభువు
సం. నా. వా. ఊ. పుం. తత్స. స్వయం భవతీతి స్వయంభూః. తనంతటనే పుట్టినవాడు, బ్రహ్మ, విష్ణు, శివుడు, మన్మధుడు.
స్వయంవరము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్వయం వృణుతే పతి మితి స్వయంవరా. తానే మగనిని కోరుకొనునది, తనంతట మగని వరించునట్టి ఆడుది, స్వయముగా వరున్ని ఎన్నుకొను కన్య.
స్వరము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వర్యతే ఉచ్ఛార్యంత ఇతి స్వరాః. ఉచ్ఛరింపబడునవి, అకారాది, ఉదాత్తాది. (ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము) షడ్జాది (స,రి,గ,మ,ప,ద,ని) ముక్కుగాలి, కంఠధ్వని. స్వరతి శబ్దాయతే ఇతి స్వరః. నాదము, ధ్వని, సప్తస్వరములు, గాత్రధ్వని, వాద్యధ్వని, జంతుధ్వని.
స్వరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. స్వరతి శబ్దాయతే ఉపతాపయతి పరానితి వాస్వరుః. మ్రోయునట్టిది, వజ్రాయుధము, యూపస్తంభము యొక్క తునుక, బాణము, యజ్ఞము, సం. విణ. తత్స. స్వతంత్రము, పిడుగు.
స్వరూపము
సం. నా. వా. అ. న. తత్స. స్వస్య రూపం స్వరూపం. తనయొక్కరూపము, స్వభావము, నిజరూపము, యథార్ధ స్వరూపము.
స్వర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. సుష్ఠు అర్జ్యతే స్మిన్నితి స్వర్గః. ఇచ్చట లెస్సగా సుఖము అనుభవింపబడును, దేవలోకము, వ్రేల్పుబ్రోలు. స్వరితి గీయతే ఇతి స్వర్గః. దేవతాలయము.
స్వర్ణకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. స్వర్ణం కరోతీతి స్వర్ణకారః. బంగారం చేయువాడు, అగసాలెవాడు, కంసాలి.
స్వర్ణక్షీరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్వర్ణ వర్ణం క్షీరమస్యా ఇతి స్వర్ణక్షీరీ. బంగారువన్నె పాలుకలది, రెడ్డివారినానబ్రాలు, (వృక్ష విశేషము).
స్వర్ణది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. స్వర్గమందు ఉండెడునది, ఆకాశగంగ, వేల్పుటేఱు, మందాకిని.
స్వర్ణము
సం. నా. వా. అ. న. తత్స. సుష్ఠుఋణోతి దీప్యత ఇతి స్వర్ణం. లెస్సగా ప్రకాశించునది, బంగారు, సుష్ఠు అరణో వర్ణో యస్యేతి స్వర్ణం. సువర్ణము, కొబ్బరి. సం. నా. వా. అ. పుం. తత్స. ఎర్రటెంకాయ చెట్టు.
స్వర్భానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. స్వః స్వర్గే భాతీతి స్వర్భానుః. స్వర్గమునందు ప్రకాశించువాడు, రాహువు. స్వరాకాశే భాతీతి స్వర్భానుః. తమస్సు, చీకటి.
స్వసృ
సం. నా. వా. ఋ. స్త్రీ. తత్స. సుష్ఠు అస్యతి సోద రాయాసమితి స్వసా. సోదరుని ఆయాసమును పోగొట్టునది, తోడపుట్టినది.
స్వస్తికము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వస్తిక్షేమం కరోతీతి స్వస్తికః. శుభమును చేయునది, తూర్పువాకిలిగల రాజగృహము, చదుకము, భుజబంధ విశేషము, మంగళవస్తువు, ముగ్ధ స్త్రీహస్తవిన్యాసవిశేషము, అభినయహస్తవిశేషము, (వ్రేళ్లుచాపబడిన చేతులను మణికట్టు యందు గూర్చి వెలిముఖముగా ఎడమ ప్రక్కపట్టినది), పాము యొక్క పడగమీద వండయిన మొనలుగల అర్థచంద్రాకారపునల్లనిరేఖ, వర్ధమానము, ఒక పక్షి, ఒక ఆకుకూర, ఒక ఆసనము, ఒక భవనము, ఒక శిరోభూషణము.
స్వస్త్రీయము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వసుః అపత్యం పుమాన్ స్వ స్రీయః. తోడపుట్టినదానికొడుకు, మేనల్లుడు. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తోడ పుట్టినదాని కూతురు, మేనకోడలు.
స్వాంతము
సం. నా. వా. అ. న. తత్స. స్వనతీతి స్వాన్తం. పలుకునది, మనస్సు, గుహ, చిత్తము, మనస్సు, హృదయము.
స్వాతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. సంజ్ఞాదేవి. సం. నా. వా. ఇ. పుం. స్త్రీ. ఈ. స్త్రీ. తత్స. నక్షత్రవిశేషము.
స్వాదుకంటకము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వాదుఫలత్వా త్కంటకవత్త్వాచ్చ స్వాదుకంటకః. తియ్యనైన ఫలములును, ముండ్లును కలది, పల్లేరు, ములువెలగ. మృదుకంటత్వాత్స్వాదుకంటకః. మృదువైన ముండ్లుకలది, వికంకత వృక్షము, రేగు, (వృక్ష విశేషము).
స్వాదురస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్వాదుః రసః అస్యా ఇతి స్వాదురసా. స్వాదువైనరసముకలది, కారుగొలిమిడి, ద్రాక్ష, (వృక్ష విశేషము).
స్వాదువు
సం. విణ. (ఉ) . తత్స. స్వదత ఇతి స్వాదు. రుచించునది, ఇంపయినది, గరగరికైనది, తియ్యనిది, మాధుర్యము, మధురము, రుచ్యము, నీరు మొదలైనది.
స్వాద్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్వాదుత్వా త్స్వాద్వీ. రుచియైనది, ద్రాక్ష, (వృక్ష విశేషము).
స్వాధ్యాయము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వవేదాధ్యయనం స్వాధ్యాయః. తమవేదమును అధ్యయనము చేయుట, వేదాధ్యయనము, వేదము, శృతి, ఛందస్సు, ఆగమము, జపము, వేదము.
స్వానము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వనతీతి స్వానశ్చ. మ్రోత, స్వనము, ధ్వని, శబ్దము, నాదము, స్వరము, ఒక గంధర్వజాతి.
స్వాపతేయము
సం. నా. వా. అ. న. తత్స. స్వపతౌ స్వస్వామిని సాధు స్వాపతేయం. తనస్వామియందు మంచిది, ధనము, విడిముడి. స్వపతేరాగతం స్వాపతేయం. ద్రవ్యము.
స్వాపము
సం. నా. వా. అ. పుం. తత్స. స్వపితం స్వాపః. శయనించుట, నిద్ర, అజ్ఞానము, తిమ్మిరి, పరుండుట.
స్వామి
సం. నా. వా. న్. పుం. తత్స. స్వం విద్యతే అస్యేతి స్వామీ. ధనముకలవాడు. స్వ మైశ్వర్య మస్యాస్తీతి స్వామీ. సొమ్ముకలవాడు, ఒడయడు, కుమారస్వామి, షణ్ముఖుడు, సేనాధిపతి, విష్ణుగుప్తుడు, ఒక రాజ్యాంగము, నాటకములలో రాజ పుత్రుడు, యజమానుడు, సుబ్రహ్మణ్యుడు. సం. విణ. తత్స. అధికారి.
స్వారాట్టు
సం. నా. వా. జ్. పుం. తత్స. స్వః స్వర్గే రాజత ఇతి స్వరాట్. స్వర్గము నందు ప్రకాశించువాడు, స్వర్గలోకాధిపతి, ఇంద్రుడు.
స్వాహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. సుష్ఠు ఆహూయంతే దేవాః అనయేతి స్వాహా. లెస్సగా దీనిచేత దేవతలు పిలువబడుదురు, అగ్నిభార్య.
స్వేదజము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్వేదాత్ భౌమోష్మణో జాతా స్వేదజాః ఉక్కవలన పుట్టినవి, చెమటవలన పుట్టినది, (పురుగులోనగునది). పేలు మున్నగునవి.
స్వేదని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్వేదతే అగ్ని తాపేనేతి స్వేదనీ. అగ్నితాపముచే చెమ్మగిల్లునది, పెనము, కందువు, ఇనుపసిబ్బి.
స్వేదము
సం. నా. వా. అ. పుం. తత్స. స్విద్యతే అనేనాఙ్గమితి స్వేదః. దీనిచే నొడలు చెమర్చును, చెమట, చెమటపోయుట.
స్వైరిణీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. స్వైరగమనమస్యా అస్తీతి స్వైరిణీ. యథేచ్ఛ గమనము కలది, ఱంకుటాలు, జారిణి. స్వేనవ ఈరితుం శీలమస్యాః ఇతి స్వైరిణీ. వ్యభిచారి.
స్వైరిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. స్వైరిణః స్వతంత్రస్య భావః స్వైరితా. స్వతంత్రుని యొక్క భావము, యథేచ్ఛత.
స్వైరుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. స్వేన స్వాతంత్రేణ ఈర్తే గచ్ఛతీతి స్వైరః. స్వేచ్ఛగా తిరుగువాడు, స్వతంత్రుడు. స్వేచ్ఛకల, మెల్లని, సోమరి.
స్వైరుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. స్వేన ఈరితుం శీలమస్యేతి స్వైరీ. తనయిచ్ఛకొలది తిరుగువాడు, స్వతంత్రుడు. స్వేన స్వాతంత్ర్యేణ ఈర్తే ఇతి స్వైరః. మందము. స్వేన ఈర్తే గచ్ఛతీతి స్వైరః. స్వేచ్ఛచేత చరించువాడు, సోమరి.