హల్లులు : హ

హండి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వెడల్పునోరుగల పెద్ద అమృతపాత్ర. వ్రాడుకయందు వెడల్పునోరుకల లోహపాత్రముగా ఉన్నది మరియు ఇది దీర్ఘాంతముగానే వాడుకలో కనబడుచున్నది.
హంత
సం. విణ. (ఋ. ఈ. ఋ). తత్స. హింసించువాడు, దయ, సంబోధనము.
హంస
సం. నా. వా. అ. పుం. తత్స. హంతి గచ్ఛతీతి హంసః చరించునది. హంతి తమ ఇతి హంసః. తమస్సును పోగొట్టువాడు. యోగివిశేషము, పరమాత్మ, తెల్లగుఱ్ఱము,మంత్రవిశేషము, శరీర వాయువిశేషము, మాత్సర్యము, (ఉత్తరపదమైనచో) శ్రేష్ఠము. (రాజహంస.) (రూ. హంసము.). హంతి సుందరం గచ్ఛతీతి హంసః. రవి, సూర్యుడు, భానుడు00, ఆదిత్యుడు, శివుడు, విష్ణువు, రాజు ఆత్మ, తెల్లఎద్దు, సన్న్యాసి, వెండి, అంచ.
హంసకము
సం. నా. వా. అ. పుం. తత్స. హంస వత్కాయతీతి హంసకః. హంస వలె పలుకునది, కాలిఅందె. హంస ఇవ కాయతి, మధురధ్వనిత్వాదితి హంసకః. రాజహంస, పాదాభరణము.
హట్టము
సం. నా. వా. అ. పుం. తత్స. అంగడివీధి.
హట్టవిలాసిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హట్టవీధ్యాం విలసతీతి హట్టవిలాసినీ. హట్టమనెడు పట్టణపు వీధియందుఒప్పునది, నఖమనెడు గంధ ద్రవ్యము, శంఖనఖము.
హఠము
సం. నా. వా. అ. పుం. తత్స. హఠంత్యత్రే తిహఠః. దీని యందు దౌష్ట్యము చేయుదురు, పట్టు, బలాత్కారము, యోగవిశేషము. హఠయోగము, ప్రసభము, ప్రక్కనుండి శత్రువును ముట్టడించుట.
హతుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. నిశ్చేష్టత్వేన హతసదృశతయా హతః. నిశ్చేష్టుడౌట వలన చచ్చినవాని వలె ఉండువాడు, కొట్టబడినవాడు, మనసు చెడినవాడు, పిరికివాడు, నిందితుడు.
హనువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. హంత్యామయం హనుః. రోగమును పోగొట్టునది, నఖమనెడు గంధ ద్రవ్యము, చావు, ఆయుధము, వ్యాధి. హంతి కఠినద్రవ్యాదికమితి హనుః. ఒక సంకరజాతి.
హనువు
సం. నా. వా. పుం. స్త్రీ. తత్స. హంతి భక్ష్యం హనుః. భక్షమును నమలునది, చెక్కిలి మీది భాగము, దౌడ.
హన్నుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. గూయతే హద్యతే ఉత్సృజ్యతే స్మ గూనం, హన్నం. విడువబడినది, విష్ఠించినవాడు, ఖాళీచేయబడినది.
హయనము
సం. నా. వా. అ. పుం. న. తత్స. జహాతిఋతూక్ క్రమేణ హాయనః. వరుసగా ఋతువులను విడుచునది, సంవత్సరము. భవాన్ జిహీత ఇతి హాయనః. అవస్ధలను పొందునది, కిరణము. జహాతి త్యజతి, జిహితే ప్రాప్నోతి వా భావానితి హాయనః. ధాన్య విశేషము.
హయపుచ్ఛి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హయపుచ్ఛాకారత్వాత్ హయపుచ్ఛీ. గుఱ్ఱపు తోకవంటి ఆకారము కలది, కారుమినుము (వృక్షవిశేషము).
హయమారకము
సం. నా. వా. అ. పుం. తత్స. కశాసాదృశ్య శాఖత్వాద్ధయ మారకః. కశవంటి కొమ్మల చేత గుఱ్ఱములను పీడించునది, గన్నేరు.(వృక్షవిశేషము). హయం మారయతీతి హయమారః. వృక్షవిశేషము.
హయము
సం. నా. వా. అ. పుం. తత్స. హంతి గచ్ఛతీతి హయః. శీఘ్రముగా పోవునది. అశ్వము, గుర్రము, తురగము.
హరణము
సం. నా. వా. అ. న. తత్స. హ్రియతే స్త్రియా స్వాతంత్ర్యేణేతి హరణం. స్త్రీ చేత స్వాతంత్ర్యమున హరింపబడునది, హరించుట,(చూ.) అరణము, భాగహారము, సంపంగి, చేష్ట, చేయుట, ఆడుట, ఆత్మరక్షణము, తీసికొనుట, కాగిచల్లారిననీరు, ప్రయాణము ధానుఘ్కనిభంగిమము, బాహువు.
హరి
సం. నా. వా. ఇ. పుం. తత్స. తమో హరతీతి హరిః. చీకటిని పోగొట్టువాడు, సూర్యుడు. హరతి గజాదికం హరిః. గజాదులను హరించునది, సింహము. హరతీతి హరిః. హరించును కనుక హరి, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు, యముడు, గుఱ్ఱము, కోతి, పాము, గాలి, కిరణము, కప్ప, చిలుక. హరతి పాపానితి హరిః. దేవతలకు అధిపతి, సూర్యుడు, సం. విణ. తత్స. పచ్చనిది, బంగారువర్ణముకలది. సం. నా. వా. ఇ. న. తత్స. ఒక వర్షము.
హరిచందనము
సం. నా. వా. అ. న. తత్స. హరి మింద్రం చందయతి ఆహ్లాదయతీతి హరిచందనం. ఇంద్రుని సంతోషింప చేయునట్టిది, ఒక కల్పవృక్షము. (చూ. కల్పవృక్షము). హరి వర్ణం చందనం హరిచందనం. కపిలవర్ణము కల చందనము, పసుపు వన్నెకల చందనము. హరేరింద్రియస్య ప్రియం చందనం హరిచందనం. దివిజము, ఒక దేవవృక్షము, చందిరము, వెన్నెల, ఒకకల్పవృక్షము.
హరిణము
సం. నా. వా. అ. పుం. తత్స. హ్రియతే హరిణః హరింపబడునది. సం. విణ. తత్స. హరతి మన ఇతి హరిణః. మనస్సును హరించునది, తెలుపు, జింక, పశువిశేషము.
హరిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హరతి మన ఇతి హరిణీ. మనస్సును హరించునది, ఆడుజింక, ఒక అప్సర స్త్రీ, బంగారు ప్రతిమ, వృత్తవిశేషము, అడవిమొల్ల. సం. విణ. తత్స. ఆకుపచ్చవర్ణము కలది, (వృక్ష విశేషము) తరుణి.
హరితకము
సం. నా. వా. అ. న. తత్స. హరిత వర్ణత్వాద్ధరితకం. పచ్చనైయుండునది, కూర, శాకము.
హరితాళము
సం. నా. వా. అ. న. తత్స. హరిదళము.
హరిత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. హరతి మన ఇతి హరితః. మనస్సును హరించునది, ఆకుపచ్చ వర్ణము.
హరిత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. హర్యతే అభిరప్రతీతి రితి హరితః. దీనిచే అజ్ఞానము హరింపబడును,దిక్కు, ఆశా, దిశ, అశ్వవిశేషము, తృణము, ఆకుపసుపురంగు. సం. నా. వా. స్త్రీ. తత్స. దిక్కు, దిశ. సం. విణ. తత్స. ఆకుపచ్చనిది. సం. నా. వా. న. పుం. గరిక.
హరిదశ్వుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హరితః హరిద్వర్ణా అశ్వాః యస్య హరిదశ్వః. పచ్చని కాంతి కల గుఱ్ఱములు కలవాడు, సూర్యుడు. హరితాః అశ్వాః యస్య సః హరిదశ్వః.
హరిద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హరిద్వర్ణం ద్రాతీతి హరిద్రా. పచ్చని వన్నె కలది, పసుపు, నిశాహ్వ.
హరిద్రాభము
సం. నా. వా. అ. పుం. తత్స. హరిద్రాయా ఇవ ఆభా అస్య హరిద్రాభః. పసుపు వర్ణము. సం. విణ. తత్స. పసుపు వర్ణముకలది.
హరిద్రువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. హరిశ్యా సౌద్రుశ్చ హరిద్రుః. పచ్చని వన్నెకల చెట్టు, మ్రాని పసుపు.
హరిన్మణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. హరిద్వర్ణో మణిః హరిన్మణిః. పచ్చనిమణి, పచ్చ, మరకతము.
హరిప్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హరేః ప్రియా హరిప్రియా. హరికి ప్రియురాలు, లక్ష్మి, భూమి, తులసి, ఏకాదశి, శ్రీ, కమల, మద్యము.
హరిమంథకము
సం. నా. వా. అ. పుం. తత్స. హరిభిర్మథ్యత ఇతి హరిమన్ధకః. గుఱ్ఱములచే తినబడునది, సెనగలు, పచ్చపెసలు.
హరివాలుకము
సం. నా. వా. అ. న. తత్స. హరి కపిలవర్ణం వాలుకం హరివాలుకం. కపిలవర్ణమైన వాలుకము, నూగు దోస, కూతురు బుడమ. (వృక్షవిశేషము), తోక మిరియము.
హరిహయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హరయో హరితవర్ణాం హయాః యస్యసః హరిహయః. పచ్చని గుఱ్ఱములు కలవాడు, ఇంద్రుడు. హరిః హయో యస్య సః హరిహయః.
హరీతకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రోగం హన్తీతి హరీతకీ. రోగమును హరించునది, కరక చెట్టు. హరిం పతివర్ణఫలమితా ప్రప్తా ఇతి హరితా, తతః సంజ్ఞాయాం హరీతకీ. వృక్షవిశేషము, కన్య.
హరేణువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. హ్రియత ఇతి హరేణుః. దీని చేత హరింపబడును, లంకలు.
హరేణువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. హరితి రోగాన్ హరేణూ. రోగములను హరించునది, రేణుక అను గంధ ద్రవ్యము, ఒక సుగంధద్రవ్యము.
హర్మ్యము
సం. నా. వా. అ. న. తత్స. మనో హరతీతి హర్మ్యం. మనస్సును హరించునది, మిద్దెటిల్లు. హరతి జనమనాంసీతి హర్మ్యం, మేడ, మిద్దెల్లు.
హర్యక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. హరిణీ కపిలవర్ణే అక్షిణీ అస్య హర్యక్షః. కపిలవర్ణము లైన కన్నులు కలది, సింహము, పచ్చకన్నుల మెకము. హరి పింగళం అక్షి యస్య సః హర్యక్షః. హరి, కుబేరుడు.
హర్షమాణుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. సంతోషమునొందిన మనమకలవాడు, ఆనందముకలవాడు.
హర్షము
సం. నా. వా. అ. పుం. తత్స. హర్షణం హర్షః. సంతోషము, హరుసము, ఆహ్లాదము, ప్రీతి, ప్రమోదము, ఆమోదము, సంపద, ఆనందము, సౌఖ్యము.
హలము
సం. నా. వా. అ. న. తత్స. హలతి విలిఖితి భువమితి హలం. భూమిని గీఱునది, నాగలి.(బలరాముని హలము సంవర్తకము), లాంగలము.
హలాయుధుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హలం లాంగలం ఆయుధం యస్యసః హలాయుధః. నాగలి ఆయుధముగా కలవాడు, బలరాముడు, మడకదున్నువాడు, బలదేవుడు.
హలాహలము
సం. నా. వా. అ. పుం. తత్స. హలతి జఠరం విలిఖతి నలిఖతి చ హలాహలః. కడుపులో ఒకపర్యాయము చీల్చుచున్నట్టును, ఒక పర్యాయము లేనట్టు ఉండునది, హాలహలమను విషము, బల్లి, నలికీచు. హలమివ ఆ సమంతాత్ సర్వాంగేషు హలతి కర్షతీతి హలాహలః.
హలినము
సం. నా. వా. న్. పుం. తత్స. హలమస్యాస్తీతి హలీ. నాగలి ఆయుధముగా కలవాడు, బలరాముడు, మడకదున్నువాడు.
హలిప్రియ
సం. నా. వా. అ. పుం. తత్స. హలినః బలభద్రస్య ప్రియః సురాధివాసాత్ హలిప్రియః. మద్యస్ధానమౌట చేత బలభద్రునికి ప్రియమైనది, కడపచెట్టు, (వృక్ష విశేషము).
హలిప్రియ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హలినం ప్రియా హలిప్రియా. బలభద్రునకి ప్రియమైనది, కల్లు.
హల్యము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హలానాం సమూహో హల్యా. నాగళ్ల సమూహము.
హల్యము
సం. నా. వా. విణ. తత్స. హలేన కృష్టం హల్యం. నాగటి చే దున్నబడినది, ఒకతూరి దున్నినది.(పొలము) దున్నిన భూమి.
హల్లకము
సం. నా. వా. అ. న. తత్స. హ్లాదయతీతి హల్లకం. సంతోషమును చేయునది, చెంగలువ.
హవము
సం. నా. వా. అ. పుం. తత్స. హ్వానం హవః. పిలుపు. హూయంతే అస్మిన్నా జ్యాదీని చ హవః. ఆజ్ఞ, పిలుపు, యజ్ఞము, అగ్ని, ఆహ్వానము, యాగము.
హవిస్సు
సం. నా. వా. స్. న. తత్స. హూయత ఇత హవిః హవిస్సు. అగ్నిహోత్రము నందు వేల్చుటకు ఇవురబెట్టిన అన్నము, నెయ్యి. (రూ.హని.), జలము, విష్ణువు, శివుడు, హోమద్రవ్యము, నీరు.
హవ్యము
సం. నా. వా. అ. న. తత్స. దేవతలు దీనిని భక్షింతురు, దేవతలకు ఈయదగిన అన్నము.
హవ్యవాహనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హవ్యం వహతీతి హవ్యవాహనః. హవిస్సును వహించువాడు, అగ్నిహోత్రుడు. (రూ.హవ్యవహుడు.), అగ్ని, అనలము, హుతాశుడు, దైవాగ్ని, ఒక అగ్ని.
హసంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అంగారైర్హ సతీవాస్తే హసంతీ. కుంపటి, మల్లె (వృక్షవిశేషము), శాకినీ భేదము. హసతీతి హసంతీ.
హసని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అంగారైర్హసతీవాస్తే హసనీ. నిప్పులచే నవ్వుదానివలె నుండునది, కుంపటి.(హసంతి యొక్క రూపాంతరము.)
హసము
సం. నా. వా. అ. పుం. తత్స. హాసయతి జనానితి హసః. జనులను నవ్వించునది, హాస్యము, హాస్యరసము, నవ్వు.
హస్త
సం. నా. వా. అ. పుం. తత్స. శ్లిష్యతే హస్తః కూడు కొనియుండునది. హన్యతే అంశుకాదిరనేన హస్తః. దీనిచేత వస్త్రాదులు కొలవబడును, మూర, చేయి, తొండము, (కేశపర్యాయములకు వెనుక వచ్చినప్పుడు) వానిసమూహము.(కేశహస్తము మొ.) హసతి వికసతీతి హస్తః. ఇరువైనాలుగు అంగుళములు.
హస్త
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఒక నక్షత్రము.(చూ.నక్షత్రము). ఇరువైనాలుగు అంగుళములు, చేయి.
హస్తవారణము
సం. నా. వా. అ. న. తత్స. హన్తేన వారణం హస్తవారణం. చేత అడ్డగించుట, చేతితో అడ్డగించుట, చంపవచ్చిన వానిని అడ్డగించుట, చేతితో దెబ్బకాటుకొనుట.
హస్తి
సం. నా. వా. న్. పుం. తత్స. హస్తో అస్యా స్తీతి హస్తీ. తొండము కలది, ఏనుగు, గజము, దంతావళము, ఉత్తరశ్రేణి ఇల్లు.
హస్తినఖము
సం. నా. వా. అ. పుం. తత్స. హస్తినఖ ఇవ తిష్ఠతీతి హస్తినఖః. ఏనుగు గోరువలె ఉండునది, గని అవని వాకిట వాటముగా ఏర్పఱచిన మట్టిదిబ్బ. హస్తినో నఖ ఇవ హస్తినఖః.
హాటకము
సం. నా. వా. అ. న. తత్స. హటతి దీప్యత ఇతిహాటకం. ప్రకాశించునది, బంగారు, ఉమ్మెత్త, (వృక్షవిశేషము), బల్లెము.
హారము
సం. నా. వా. అ. పుం. తత్స. హ్రియతే చిత్తమనేన హారః. దీనిచేత మనస్సు హరింపబడును, నూటయెనిమిది పేటల ముత్యాల పేరు, యుద్ధము. సం. విణ. తత్స. హరసంబంధమైనది.
హారి
సం. నా. వా. విణ. తత్స. మనోజ్ఞమైనది. సం. విణ. న్. ఈ. న్. తత్స. హరించువాడు, హరముకలవాడు. సం. నా. వా. ఇ. స్త్రీ. అధిక జనసమూహము.
హారీతము
సం. నా. వా. అ. పుం. తత్స. హరిత వర్ణ యోగాత్ హారీతః. పచ్చని వన్నెకలది, పచ్చపిట్ట, కపటము. హారి మనోహరం ఇతం గమనం యస్య సః హారీతః. పావురము, మిని విశేషము.
హార్దము
సం. నా. వా. అ. న. తత్స. హృదయే భవం హార్ధం. హృదయమందు పుట్టినది, స్నేహము, ప్రేమ.
హాలా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హీయతే లజ్జా అనయేతి హాలా. దీనిచేత సిగ్గు విడువబడును, సారాయి, మద్యము. సం. నా. వా. అ. పుం. నాగేలు.
హాలికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హలేన ఖనతి, హలం వహతి, హల స్యాయంవా హాలికః. నాగలి.(హలికుడు యొక్క రూపాంతరము.)
హావము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రూనేత్రాదివికారముల చేత కొంచెము తెలియతగిన మనోవికారము, స్త్రీ శృంగారచేష్టలు, ఒక శృంగారచేష్ట.
హాసము
సం. నా. వా. అ. పుం. తత్స. హాసయతి జనానితి హసః. హాస్యము, (ఇది స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, అపహసితము, అతిహసితము అని ఆరువిధములు కలది.), హాస్యరసము. ఉత్ప్రాస్యతే ఉతిక్షప్యతే అనేనేత్యుత్ప్రాసః. ఇతరులకు రోషమును కలిగించు నవ్వు, ఒక స్థాయీ భావము.
హాస్తికము
సం. నా. వా. అ. న. తత్స. హస్తినాం సమూహో హాస్తికం. ఏనుగుమూక, హస్తి సమూహము, ఏనుగులగుంపు.
హాస్యము
సం. నా. వా. అ. న. తత్స. హాసయతి జనానతి హస్యం. నవ్వు, ఒకరసము.(చూ.రసము), ఒక స్థాయీ భావము.
హింగునిర్యాసము
సం. నా. వా. అ. పుం. తత్స. హింగునో నిర్యాస ఇవ నిర్యాసో అస్య హింగు నిర్యాసః. ఇంగువ వంటి ఆకారముకల బంకకలది, వేపచెట్టు, ఇంగువరసము, ఇంగువపాలు.
హింగుళము
సం. నా. వా. అ. పుం. న. తత్స. హింగులం తద్వర్ణం లాతీతి హింగులః. రాగద్రవ్య విశేషము, ఇంగిలీకము, రక్తము, కోతితల, రసము, ఒకరసాయనము.
హింగుళి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హినోతి వరతే హింగుళీ. వృద్ధిని పొందునది, ములక చెట్టు.
హింగువు
సం. నా. వా. ఉ. న. తత్స. హినోతిగంధేన గృహాంతరం గచ్ఛతీతి హింగు. పరిమళము చేత గృహాంతరమును పొందునది, ఇంగువ. హినోతి ప్రహిణోతి గంధం ఇతి హింగు.
హింతాలము
సం. నా. వా. అ. పుం. తత్స. హినోతి వర్ధతే తలతి ప్రతిష్ఠతీతి హింతాలః. ప్రతిష్ఠకలది, గిఱకతాడు.(వృక్షవిశేషము). ఈత చెట్టు.
హింస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హింసనమితి హింసా. చంపుట, దొంగతనము, బాధించుట, వధ.
హింస్ర
సం. విణ. తత్స. హినస్తి తాచ్ఛీల్యేనేతి హింస్రః. చంపు స్వభావం కలవాడు, చంపునది. హినస్తీతి హింస్రః. సం. నా. వా. ఆ. స్త్రీ. నల్ల ఇప్పి. వృక్ష విశేషము.
హిక్క
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఎక్కిలి, పైడి కంటియను పక్షి, గుడ్లగూబ.
హిజ్జలము
సం. నా. వా. అ. పుం. తత్స. హితం జలమస్య హిజ్జలః. హితమైన జలము కలది, ఎఱ్ఱగన్నేరు చెట్టు.
హిమము
సం. నా. వా. అ. న. తత్స. హంతి తాపమితి హిమం. తాపమును పోగొట్టునది, మంచు, చందనము. ఆకాశబాష్పము, నీహారము, తుషారము, తుహినము. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పాలకూర.
హిమము
సం. నా. వా. విణ. తత్స. హినోతి వర్ధత ఇతి హిమః. చల్లనిది, సైత్యము.
హిమవంతము
సం. నా. వా. త్. పుం. తత్స. హిమమస్యాస్తీతి హిమవత్. మంచుకలిగినది. హిమవత్పర్వతము, మంచుకొండ, హిమలయము.
హిమవాలుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హిమా చ సా వాలుకా చ హిమవాలుకా. మంచువలె చల్లనై ఇసుకవంటి ఆకారము కలది, కర్పూరము.
హిమాంశువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. హిమాః శీతాః అంశవో యస్యసః హిమాంశుః. చల్లని కిరణములు కలవాడు, చంద్రుడు, చలివెలుగు.
హిమాని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మహ ద్ధిమం హిమానీ. అధికమైన మంచు, హిమ సమూహము, మంచుగడ్డ.
హిమాలయము
సం. నా. వా. అ. పుం. తత్స. మంచుకొండ.
హిమావతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హిమం శీతలత్వ మస్యా ఇతి హిమావతీ. మంచు వంటి చలి కలది, రెడ్డివారినాన బ్రాలు.(వృక్షవిశేషము.)
హిరణ్యగర్భుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హిరణ్యమయో గర్భో యస్యసః హిరణ్యగర్భః. హిరణ్యమయమైన గర్భము కలవాడు, బ్రహ్మ. హిరణ్యం హేమమయాండం గర్భం ఉత్పత్తిస్థానమస్య ఇతి హిరణ్యగర్భః.
హిరణ్యము
సం. నా. వా. అ. న. తత్స. హయ్యతి గచ్ఛతీతి హిరణ్యం. ధనము, బంగారము, మాడ, గవ్వ,రేతస్సు. హర్యతి దీప్యతే ఇతి హిరణ్యం, వెండిబంగారునాణెములు.
హిరణ్యరేతసుడు
సం. నా. వా. స్. పుం. తత్స. హిరణ్యం రేతో యస్యసః హిరణ్యరేతాః. హిరణ్యమే రేతస్సుగా కలవాడు, అగ్ని, సూర్యుడు.(రూ. హిరణ్యరేతుడు.)
హిరణ్యవాహము
సం. నా. వా. అ. పుం. తత్స. హిరణ్యం వహతీతి హిరణ్యవాహః. హిరణ్యమును వహించునది, శోణనదము.
హిలమోచిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హేలయా రోగాన్ మోచయతీతి హిలమోచికా. అనాయాసముగా రోగములను పోగొట్టునది, చిలుక కూర.
హీనము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. హీయ తేస్మ హీనం. విడువబడినది. హీయత ఇత హీనః. తక్కువైనది, దూఱతగినది, నాగకేసరము, నీచము, త్వక్తము, నింద్యము.
హుతభుక్కుడు
సం. నా. వా. జ్. పుం. తత్స. హుతం భుజ్త్కే హుతభుక్. హుతమును భుజించువాడు, అగ్నిహోత్రుడు.
హూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. హూయతే అనయేతి హూతిః. దీనిచేత పిలుతురు కనుక హూతి, ఆహ్వానము, పిలువబడినది. (ఆహూతము అనియు). వ్వాణం హూతిః పిలిచుట.
హూహువు
సం. నా. వా. ఊ. పుం. తత్స. హూ ఇతి హ్వయతీతి హూహూః. ఒకానొక దేవగాయకుడు.
హృదయంగమము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. హృదయం గచ్ఛతీతి హృదయంగమం. మనస్సును పొందునది, మనసుకు ఇంపైనది.(మాట.)
హృదయము
సం. నా. వా. అ. న. తత్స. హృయతే విషయైరితి హృదయం. మనస్సు. హ్రియత ఇతి హృదయం హృచ్చ. గుండెకాయ, ఱొమ్ము. చిత్తము, సివీంతము.
హృదయాళువు
సం. నా. వా. విణ. (ఉ). తత్స. ప్రకృష్టం హృదయ మస్య హృదయాళుః. శ్రేష్ఠమైన హృదమయు కలవాడు, మంచి మనసు కలవాడు, సహృదయుడు.
హృది
సం. నా. వా. ద్. న. తత్స. హృదయతే విషయైరితి హృదయం. మనస్సు. హ్రియత ఇతి హృదయం హరింపబడునది. గుండెకాయ, ఱొమ్ము, మనస్సు.
హృద్యము
సం. నా. వా. విణ. తత్స. హృదయస్య ప్రియం హృద్యం. హృదయమునకు ప్రియమైనది, మనసుకు ఇంపైనది, మనసుకు హితమైనది, మనసు నందు పుట్టినది. సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. బుద్ధి అనెడి ఔషదము, వెలగ, పెరుగు, మద్యము, ప్రియము, మనోహరము, చిత్రము, అంగీకారము, మనోనిర్ణితము.
హృషికేశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హృషీ కాణా మింద్రియాణా మిశః హృషీకేశః. ఇంద్రియములకు ఈశ్వరుడు, విష్ణువు, వెన్నుడు.
హృషీకము
సం. నా. వా. అ. న. తత్స. హృష్యంత్య నేనేతి హృషీకం. దీనిచేత సంతోషిస్తురు ఇంద్రియము.
హృష్టుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. హృష్యతే స్మ హృష్టః. సంతోషించినవాడు, సంతుష్టుడు, ఆశ్చర్య పడినవాడు, చకితుడు.
హేతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. హన్యతే అనయేతి చహేతిః. దీనిచేత హింసింపబడును, అగ్నిశిఖ, మంట, సూర్యకిరణము, ఆయుధము. హినేతి ఇతి హేతిః.
హేతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. హినోతి గచ్ఛతి పరిణత్యా కార్యరూప తామితి హేతుః. పరిపాకము చేత కార్యరూపమును పొందునది. కారణము, కతము. హినోతి వ్యాప్నోతి కార్యమితి హేతుః. ఘనమూలము, వర్గమూలము, వ్యాపారము, జన్మ.
హేమంతము
సం. నా. వా. అ. పుం. తత్స. హిమేన హంతీతి హేమంతః. చలిచేత జనులను హింసించునది, మంచుకాలము.(చూ.ఋతువు). హేమంత ఋతువు.
హేమదుగ్ధకము
సం. నా. వా. అ. పుం. తత్స. హేమ వర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః. బంగారు వంటి పాలు కలది, మేడి.(వృక్షవిశేషము), అత్తి చెట్టు.
హేమపుష్పకము
సం. నా. వా. అ. పుం. తత్స. హేమవర్ణం పుష్పమస్యేతి హేమపుష్పకః. బంగారు వన్నె కల పువ్వులు కలది, సంపెంగ, లొద్దుగు.(వృక్షవిశేషము). అశోక చెట్టు.
హేమపుష్పిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హేమ వర్ణాని పుష్పాణి యస్యా స్స్యా హేమపుష్పికా. బంగారుఛాయ పువ్వులు కలది, పచ్చపూ మొల్ల.(వృక్షవిశేషము). పచ్చమల్లె.
హేమము
సం. నా. వా. అ. న్. న. తత్స. హినోతి వర్ధత ఇతి హేమ. లోహంతరమును కూడి వృద్ధి పొందునది. బంగారు, ఉమ్మెత్త. (వృక్షవిశేషము), జీతము.
హేమాద్రి
సం. నా. వా. ఇ. పుం. తత్స. హేమమయో అద్రిర్హేమాద్రిః. బంగారు కొండ, సుమేరు పర్వతము, ఒక రాజు.
హేరంబుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హేరుద్ర సమీపే రంబతే తిష్ఠతీతి హేరంబః. రుద్రుని వద్దనుండువాడు, వినాయకుడు, పిళ్ళారి, శౌర్యముచే గర్వించినవాడు. హే రణే శివసమీపే వా రంబేతి హేరంబః. దున్న, బొబ్బకలవాడు.
హేల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హేలనం హేలా. భూనేత్రాది వికారముల చేత చక్కగా తెలియతగిన మనోవికారము, నదీవిశేషము, తిరస్కారము, ఒక శృంగారచేష్ట.
హేష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హేషణం హేషా. గుఱ్ఱము యొక్క సకిలింత, సకిలింపు.
హైమవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హిమవతః అపత్యం స్త్రీ హైమవతీ. హిమవంతుని కూతురు, పార్వతి, ఆకాశగంగ. హిమవద్గిరౌ ప్రచురా హైమవతీ, హిమవత్పర్వతమందు ప్రచురమైనది, కరకచెట్టు. ప్రాయో హిమవతి భవతీతి హైమవతీ, తరచుగా హిమవత్పర్వత మందు పుట్టునది, హిమవద్గిరౌ ప్రచురత్వాత్ హైమవతీ. హిమవత్పర్వత మందు ప్రచురమైనది, రెడ్డివారినాన బ్రాలు. (వృక్షవిశేషము.) తెల్లవస, గంగ, గౌరి, ఒక మొక్క.
హైయంగవీనము
సం. నా. వా. అ. న. తత్స. హ్యోగోదో హోద్భవం ఘృతం హయ్యంగవీనం. తొలినాడు చిలికి ఎత్తిన ఆవువెన్న, తొలివాడు చిలికి ఎత్తిన ఆవువెన్న కాచిన నెయ్యి, సద్యోఘృతము.
హోత
సం. నా. వా. ఋ. పుం. తత్స. జుహోతి ఇతి హోతా. హోమము చేయువాడు, ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు, యాగము న ఋత్విక్కు.
హోమము
సం. నా. వా. అ. పుం. తత్స. వైశ్వదేవము, దేవయజ్ఞము.
హోర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. అహోరాత్రము, రాశ్యర్ధము, లగ్నభేదము, శాస్త్రవిశేషము, రేఖాభేదము, రాశిలోనగు భాగము.
హ్రదము
సం. నా. వా. అ. పుం. తత్స. హ్రదతే కల్లోలైర్హ్రదః. కల్లోలములచే అవ్యక్తముగా మ్రోయునది, ఏటినడుమ లోతు చోటు, లోతుగల నిడుపాటి నీటిపల్లము, పోట్టేలు, మడుగు.
హ్రసిష్ఠము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. అతిశయేన హ్రస్వః హ్రసిష్ఠః. మిక్కిలి పొట్టియైనది, మిక్కిలి హ్రస్వమైనది.
హ్రస్వగవేధుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హ్రన్వే గవి జలే ఏధత ఇతి హ్రస్వగవేధుకా. కొంచెము నీళ్లలో వృద్ధి పొందునది, బీఱచెట్టు, చిఱుగోధుము.
హ్రస్వము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. హ్రస్యతే హ్రస్వః. కుఱుచ, పొట్టి, యముడు, చిన్నది, మరుగుగుజ్జు.
హ్రస్వాంగము
సం. నా. వా. అ. పుం. తత్స. హ్రస్వావయవత్వాత్ హ్రస్వాంగః. హ్రస్వములైన అవయవములు కలది, జీవకమను గంధ ద్రవ్యము.
హ్రాదిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హ్రాదతే శబ్దాయత ఇతి హ్రాదినీ, మ్రోయుచుండునట్టిది. వజ్రాయుధము. హ్రాదో అస్యా అస్తీతి హ్రాదినీ. అవ్యక్త శబ్దము కలిగినది, మెఱుపు. హ్రదః అవ్యక్త శబ్దః అస్యామ స్తీతి హ్రాదినీ. అవ్యక్త శబ్దము కలిగినది, ఏఱు. (రూ.హ్రదిని.). హ్రాదో అస్యా ఇతి హ్రాదినీ. అవ్యక్త శబ్దము కలది, అందుగు చెట్టు, నది, వజ్రము.
హ్రీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. హ్రేతీతి హ్రీః. సిగ్గుపడుట, లజ్జ, వ్రీడ, త్రప.
హ్రీణము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జి హ్రీతి స్మ హ్రీణః. సిగ్గునొందినది.
హ్రీతము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జి హ్రీతి స్మ హ్రీణః, హ్రీతః. సిగ్గునొందినది.
హ్రీబేరము
సం. నా. వా. అ. న. తత్స. నిగూఢత్వేన హ్రీ యుక్తమివ బేరమస్యేతి హ్రీబేరం. గూఢమైయుండునది కనుక సిగ్గుతో కూడిన శరీరము కలదాని వలె ఉండునది, కురువేరు.
హ్రేష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హేషణం హేషా. గుఱ్ఱము సకిలించుట. (హేష యొక్క రూపాంతరము.)