హల్లులు : గ
గంగ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హరిచరణాత్ గాం భూమింగతా గంగా. హరి పాదము వలన భూమిని పొందినది, ఒకానొక ఏఱు, (పంచ గంగలు-కావేరి, తుంగభద్ర, కృష్టవేణి, గౌతమి, భాగీరథి, ఆకాశ గంగ-మందాకిని, పాతాళ గంగ-భోగవతి). గమయతి ప్రాపయతి జ్ఞాపయతి వా భగవత్పదం యా శక్తిః గంగా. నదీవిశేషము, భాగీరథి, హైమవతీ, సుధ, దేవతానది, జాహ్నవి, సితసింధు, భీష్మజనని, ఒక నది.
గంగాధరుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గంగాయాః ధరః గంగాధరః. గంగను ధరించిన వాడు, శివుడు, ముక్కంటి.
గంజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గంజంతి శబ్దాయంతే స్వామితి గంజా. దీని యందు కూతలు పెట్టుదురు, కల్లు అమ్మెడి ఇల్లు, గని, నిధి.
గండకము
సం. నా. వా. అ. న. తత్స. ప్రశస్తో గండోస్యాస్తీతి గండకః. శ్రేష్ఠమైన గండస్థలము కలది, ఖడ్గమృగము, జోస్యము, భేదము, విఘ్నము, సంఖ్యావిశేషము, ఒక జల చరము, అశ్వము, కంఠాభరణము, పిల్ల చీమలు.
గండము
సం. నా. వా. అ. పుం. తత్స. గండతీతి గండః. కూడుకొని ఉండునది, ఏనుగు చెక్కిలి, చెక్కిలి, ఒక గ్రహ యోగము, ఖడ్గమృగము, గుండ్రాయి, గుర్తు, గుఱ్ఱపు సొమ్ము, పుండు, పొక్కు, నీటిమీద బుగ్గ, గండ స్థలము, కురుపు, నాలుగు కారీలు, గర్వము.
గండశైలము
సం. నా. వా. అ. న. తత్స. గండా ఇవ శైలాః గండశైలాః. కపోలముల వలె వెడల్పులై నునుపులైన శైలములు, కొండనుండి జారిపడిన పెద్దరాయి, కోయిల, నొసలు, బండరాయి.
గండాలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గండైః గ్రంధిభిరల్యతే భూష్యత ఇతి గండాలీ. బుడుపులచేత అలంకరింపబడినది, తీఁగగఱిక.
గండీరము
సం. నా. వా. అ. పుం. న. తత్స. గండీన్ గ్రంథీన్ ఈరయతీతి గండీరః. పుండ్లను పోగొట్టునది, ఏఱువంగ (వృక్ష విశేషము). తురుజ కూర, చిఱ్ఱికూర, ఏనుగు పిప్పలి.
గండూపదము
సం. నా. వా. అ. పుం. తత్స. గండవః శరీరగ్రంధయః త ఏవ పాదాః అస్య గండూపదః. శరీరమునున్న బుడుపులు పాదములుగా కలది, కించులికము, ఎఱ్ఱ, వానపాము.
గండూపది
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గండూపదస్య స్త్రీ గండూపదీ. గండూపదము యొక్క స్త్రీ, శిలి, ఆడఎఱ్ఱ.
గండూషము
సం. నా. వా. అ. పుం. తత్స. పుక్కిలింత, పుడిసిలి, తొండము చివర, దోసిలి, ఏనుగు, తొండములోని భాగము.
గండోలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గండం కపోలం ఉలతి ఆవృణోతీతి గండోలీ. చెక్కిలి మీద ముసురునది, ఎఱ్ఱతుమ్మెద, కణుదురీగ.
గంత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గచ్ఛతీతి గంత్రీ. పోవునది, గాడీబండి, ఎద్దుబండి, అడకత్తెర.
గంధ సారము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధేన సారః గంధసారః. పరిమళము చేత ఉత్కృష్టమైనది, చందనము, గంధము.
గంధకము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధోస్యాస్తీతి గంధకః. వాసన కలిగినది, అంగడి మందు దినుసు, కంపు కలిగినది.
గంధకుటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గంధస్య కుటీ గృహం గంధకుటీ. గంధమునకు ఉనికిపట్టు, మురయనెడు గంధద్రవ్యము, సువాసన కల మొక్క.
గంధనము
సం. నా. వా. అ. న. తత్స. గంధ్యతే అనేనేతి గంధనం. దీనిచేత పీడింపబడును, ఎఱిగించుట, నలుగిడుట, నొప్పించుట, వెలిగించుట. ఉత్సాహము, సూచన, హింస, ఆవిర్భావము, ప్రోత్సాహము.
గంధనాకులి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గంధేన నకులానామిష్టా గంధనాకులీ. గంధముచేత ముంగిసలకు సంతోషము చేయునది, సర్పాక్షి (వృక్ష విశేషము), విడంగము.
గంధఫలి
సం. నా. వా. ఈ.స్త్రీ. తత్స.గంధ ఏవ ఫలమస్యా ఇతి గంధఫలీ. గంధమే ఫలముగా కలది, సంపెంగ మొగ్గ, ప్రేంకణము (వృక్ష విశేషము).
గంధమాదనము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధేన మాదయతీతి హర్షయతీతి గంధమాదనం. పుష్పగంధము చేత సంతోషింపచేయునది, ఒకానొక కొండ, ఒకానొక కోతి, మగతుమ్మెద, మదపు టేనుగు.
గంధము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధ్యతే హింస్యతే అభిలష్యతే వా అనేనేతి గంధః. దీనిచేత పీడింపబడును, లేక అభిలషింపబడును, వాసన, గంధకము, గర్వము, లేశము, సంబంధము, శరీరపు కంపు, అణువు.
గంధమూలి
సం. నా. వా. ఈ.స్త్రీ. తత్స.గంధయుక్తం మూలమస్యా ఇతి గంధమూలీ. గంధయుక్తమైన వేళ్ళు కలది, గంట్లకచోరము (వృక్ష విశేషము).
గంధమూషి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గంధవతీ మూషీ గంధ మూషీ. వాసన కల ఎలుక, చుంచు, చుచుందరి.
గంధరసము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధ ప్రధానో రసోస్య గంధరసః. గంధము కల రసము కలది, బోళము, గోపము, పడిసము.
గంధర్వము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధ్యతే కశాదినా పీడ్యత ఇతి గంధర్వః. కశాదుల చేత పీడింపబడునది, గుఱ్ఱము, మృగవిశేషము, అంతరపిశాచము, మగకోయిల. “గంధయతి అర్థయతీతి గంధర్వః. పీడించునది. సౌరభం గంధం అర్వంతి గంధర్వాః. సువాసనను పొందువారు, దేవతా భేదములు. గంధమర్వతీతి గంధర్వః. గంధమును పొందును గనుక గంధర్వము. అ. పుం. తత్స. గంధం సంగీతవాద్యాదిజనితప్రమోదం అవంతి ప్రాప్నోతీతి గంధర్వః. స్వర్గగాయకులు. కస్తూరి మృగము, ప్రేతాత్మ, గాయకుడు.
గంధర్వహస్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. గంధర్వస్య మృగవిశేషస్య భూతవిశేషస్యవా హస్త ఇవ పత్రమస్య గంధర్వహస్తకః. మృగ విశేషము భూతవిశేషము చేతి వలెనుండు ఆకులు కలది, ఆముదపు చెట్టు.
గంధవహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గంధం వహతీతి గంధవహా. గంధమును వహించునది, ముక్కు, నాసిక.
గంధవహుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గంధస్య వహో గంధవహః. గంధమును వహించువాడు, వాయువు, గాలి, కస్తూరి మృగము, ముక్కు.
గంధవాహుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గంధం వహతీతి గంధవాహః. గంధమును వహించువాడు, వాయువు, గాలి.
గంధాశ్మము
సం. నా. వా. న్. పుం. తత్స. గంధ ప్రధానోశ్మా గంధాశ్మా. కంపు కలిగిన రాయి, గంధకము.
గంధిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గంధో స్యా అస్తీతి గంధినీ. గంధము కలది, మురయనెడి గంధద్రవ్యము. (వృక్ష విశేషము), ఒక సువాసన గల మొక్క.
గంధోత్తమా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స.గంధేనోత్తమా గంధోత్తమా. పరిమళముచేత ఉత్తమమైనది, మద్యము, కల్లు.
గంభారి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సారవత్త్వాత్ గమనే భారోస్యా అస్తీతి గంభారీ. సారముగలది కనుక కమనమందు భారము కలది, గుమ్మడి చెట్టు, నల్లజీర కర్ర.
గంభీరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గమనే భియం రాతీతి గంభీరం. చొచ్చునప్పుడు మిక్కిలి భయమునిచ్చునది, లోతైనది, నీరు.
గగనము
సం. నా. వా. అ. న. తత్స. గచ్ఛంత్యనేన దేవా ఇతి గగనం. దీని మార్గము వలన దేవతలు పోవుదురు, ఆకాశం. గం గానం శబ్దాత్మకం గుణం గచ్ఛతీతి గగనం.
వై. విణ. దుర్లభము.
గజత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గజానాం సమూహో గజతా. ఏనుగుల గుంపు, గజ సమూహము.
గజభక్ష్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గజైర్భక్ష్యత ఇతి గజభక్ష్యా. గజముల చేత భక్షింపబడునది, అందుగు (వృక్ష విశేషము).
గజము
సం. నా. వా. అ. పుం. తత్స. గజతి మాద్యతీతి గజః. మదించునది, మూడడుగుల కొలఁది, వాస్తుస్థాన విశేషము. గజతి మదేన మత్తో భవతీతి గజః, ఏనుగు, (గజ జాతులు మూడు- భద్రము, మందము, మృగము).
గజరిపువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. గజానాం రిపుః గజరిపుః. ఏనుగులకు శత్రువు, సింహము, ఏనుగుకొంగ.
గజాననుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గజస్యేవ ఆననం యస్య సః గజాననః. ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు, వినాయకుడు, ఏనుగు మోము, స్వామి.
గడులుఁడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గడుర్మాంస గ్రంధిరన్వేతి గడులః. వీపున కాని, ఱొమ్మున కాని ఘనమైన కణితికలవాడు, మఱుగుజ్జు, కుబ్జుడు. గడుః స్థూలమాంసపిండవిశేషః అస్యాస్తీతి గడులః. గూనివాడు.
గణకుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గణయతి కాలం గణకః. కాలమును లెక్కపెట్టువాడు, జోస్యుడు, కరణమువాడు. గణయతి శుభాశుభగ్రహభోగజనితఫల నిరూపయతీతి గణకః. దైవజ్ఞుడు, జ్ఞాని, కార్తాంతికుడు.
గణనీయము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గణయితుం శక్యం గణనీయం. లెక్కపెట్ట శక్యమయినది, ఎంచతగినది.
గణము
సం. నా. వా. అ. పుం. తత్స. గణ్యత ఇతి గణః. లెక్క పెబడునది, సమూహము, సేనావిశేషము, ప్రమధుల సమూహము, (ఇరువది ఏడు రధములు, అన్ని ఏనుగులు, ఎనుబది యొక్క గుఱ్ఱములు, నూటముప్పది యేవురు కాల్వురును కలది). సంఖ్య, ప్రమధ గణము.
గణరాత్రము
సం. నా. వా. అ. న. తత్స. రాత్రీణాం గణః గణరాత్రం. రాత్రులయొక్క సముదాయము, అనేక రాత్రల సమూహము. గణానాం బహ్వీనాం రాత్రీణాం సమాహారః గణరాత్రః. చాలా రాత్రులు.
గణరూపము
సం. నా. వా. అ. పుం. తత్స. గణరూపాణి బహురూపాణ్యస్య గణరూపః. కాలక్రమమున అనేక రూపములు కలది, జిల్లేడు చెట్టు.
గణహాసకము
సం. నా. వా. అ. పుం. తత్స. గణం హాసయతీతి గణహాసకః. సమూహమును సంతోష పెట్టునది, నల్లకచోరము, బలురక్కెస (వృక్ష విశేషాలు)
గణాధిపుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గణానాం ప్రమథాదీ నామధిపో గణాధిపః. ప్రమధాతి గణములకు నాయకుడు, వినాయకుడు, శివుడు, గణపతి.
గణిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గణికావచ్చిత్త కర్షణాద్గణికా. వేశ్యవలె మనస్సును హరించునది, వేశ్య, ఆడేనుగు, అడవి మొల్ల, నెల్లి (వృక్ష విశేషము). విలుగణోస్యా అస్త్రీతి గణికా. విట సమూహము కలది, లంజె. గణః లంపటగణః ఉపపతిత్వేనాస్త్యస్యాః ఇతి గణికా. హస్తిని, రాజు గారి ప్రియురాలు.
గణికారిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గణికావన్మోహనతా మియర్తీతి గణికారికా. వేశ్యవలె మోహమును పొందించునది, నెల్లి. (వృక్ష విశేషము), ముంజె.
గణితము
సం. నా. వా. అ. న. తత్స. గణ్యతే స్మ గణితం. లెక్క పెట్టబడినది, గణిత శాస్త్రము, అంకవిద్య, విణ. తత్స. ఎంచబడినది.
గద
సం. నా. వా. అ. పుం. తత్స. గదంత్యనేనేతి గదః. దీని చేత మొఱపెట్టుదురు, తెవులు. గద్యతే రజ్యతే అనేన, గదయతి వా గదః. రోగము.
గదాగ్రజుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గదస్య వసుదేవపుత్రభేదస్య అగ్రజః గదాగ్రజః. గదుని అన్న, విష్ణువు, కృష్ణుడు.
గద్యము
సం. నా. వా. అ. న. తత్స. చెప్పఁతగినది, వచనము, చంపువు.
గభస్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. తం బభస్తి దీపయతీతి గభస్తిః. వస్తువులను చూపునది, సూర్యకిరణము, సూర్యుడు. గమ్యతే జ్ఞాయతే ఇతి గః విషయః గభస్తిః. కిరణము
గభీరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గమనే భియం రాతీతి గభీరం. చొచ్చునపుడు మిక్కిలి భయమునిచ్చునది, లోతైనది. గచ్ఛతి జలమత్ర గభీరం. అగాధము, ప్రచండము.
గమనము
సం. నా. వా. అ. న. తత్స. గమ్యతే గమనం. కలదలిపోవుట, పోక, ప్రయాణము, త్రోవ, తలఁపు, గతి.
గమము
సం. నా. వా. అ. పుం. తత్స. గమ్యతే గమనం, గమశ్చ. కదలిపోవుట, పోక, ప్రయాణము, త్రోవ.
గమ్యము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గంతుం యోగ్యం గమ్యం. పొందదగినది.
గరడడు
సం. నా. వా. అ. పుం. తత్స. గరుద్భిః డయత ఇతి గరుడః. రెక్కలచేత ఎగిరెడువాడు, గరుత్మంతురుడు, గరుఢి. గరుద్భ్యాం పక్షాభ్యాం ఇయతే ఉడ్డీయతే ఇతి గరుడః. పక్షివిశేషము, వైనతేయుడు, ఖగేశ్వరుడు, నాగాంతకుడు, విష్ణురథుడు, మహావీరుడు, పక్షిసింహుడు, ఉరగాశనుడు, శాల్మలి, తార్క్ష్యనాయకుడు, సుపర్ణుడు, భుజగాంతకుడు, తరస్వి.
గరళము
సం. నా. వా. అ. న. తత్స. గిరతి జీవం గరళం. ప్రాణమును మ్రింగునది, విషము, కసపుప్రోగు, కొలఁది. గిరతి గ్రసతి నాశయతీతి గరళం. పన్నగ విషము, గోరింట.
గరాగరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గరం మూషిక విషమాగిరతీతి గరాగరీ. ఎలికె విషమును హరించునది, డావరడంగి (వృక్ష విశేషము), దేవతాళము.
గరిమ
సం. నా. వా. న్. పుం. తత్స. గురుత్వేన గరిమ. గొప్పతనము.
గరిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. అతిశయేన గురుర్గరిష్ఠః. మిక్కిలి భారమైనది, మిక్కిలి గురువు.
గరుడధ్వజుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గరుడః ధ్వజః యస్యసః గరుడధ్వజః. గరుత్మంతుడే ధ్వజముగా కలవాడు, విష్ణువు, వెన్నుఁడు.
గరుడాగ్రజుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గరుడస్య అగ్రజః గరుడాగ్రజః. గరుడునికి అన్న, అనూరుడు, సూర్యసారథి.
గరుత్తు
సం. నా. వా. న్. పుం. తత్స. గిరతి గగనమనేనేతి గరుత్. దీనిచేత పక్షి ఆకాశమును గ్రసించును, పక్షము, ఱెక్క. గృణాతి శబ్దాయతే వాయువేగవశాదితి గరుత్.
గరుత్మంతము
సం. నా. వా. త్. పుం. తత్స. గరుతః పక్షాస్సంత్యన్యేతి గరుత్మాన్. రెక్కలు కలిగినది, పక్షి .
గర్గరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గిరతి దధీతి గర్గరీ. తనలో పెరుగును అణచుకొనునది, పెరుగు చిలికెడు కుండ, తరికడవ. గర్గం శబ్దం రాతీతి గర్గరీ. చల్ల చేయుపాత్ర, గుడిసె.
గర్జితము
సం. నా. వా. అ. న. తత్స. గర్జతీతి గర్జితం. గర్జించునది, ఉఱుము, ధ్వని.
గర్జితము
సం. నా. వా. అ. పుం. తత్స. గర్జనమస్య సంజాతమితి గర్జితః. గర్జించునది, మదపుటేనుగు, ఉల్లి.
గర్తము
సం. నా. వా. అ. పుం. తత్స. గిరతి సర్పాదికమితి గర్తః. సర్పాదులను తనయందు అణగించునది, పల్లము, త్రిగర్త దేశ విశేషము, పిరుదులమీది గుంతలు. గిరతి గ్రసతి స్వస్మిన్ పతితం జీవజాతాదికమితి గర్తః. భూమియందుండు రంధ్రము, ధ్వని.
గర్దభము
సం. నా. వా. అ. పుం. తత్స. గర్దంత్యుచ్చైరితి గర్దభాః. బెట్టిగా మొఱపెట్టునవి, గాడిదలు, గంధవిశేషము. గర్దతి గర్దయతి వా గర్దభః. పశువిశేషము, తెల్లకలువ.
గర్దభాండము
సం. నా. వా. అ. పుం. తత్స. గర్దభ ఇవ అండం మూలమస్య గరభాండః. గర్దభము వంటి మొదలు కలిగినది, కులజువ్వి (వృక్ష విశేషము), కల్లోలి.
గర్ధనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గృధ్యతి కాంక్షతి తాచ్ఛీల్యేనేతి గర్ధనః. స్వభావమున కాంక్షించువాడు, ఇచ్చకలది, గృధ్నువు, పేరాశ.
గర్భకము
సం. నా. వా. అ. న. తత్స. గర్భేక్రియత ఇతి గర్భకః. వెంట్రుకలలోపల చేయపడిన పూదండ. గర్భే కేశగర్భే కేశమధ్యే ఇతి యావత్, కాయతే ప్రకాశతే శోభతే ఇత్యర్థః గర్భకః. రెండు రాత్రులు, మాలిక.
గర్భము
సం. నా. వా. అ. పుం. తత్స. మాతృభూక్తాన్నరసం గిరతీతి గర్భః. తల్లి భుజించిన అన్నపానాదులను మ్రింగునది, కడుపు, కడుపులోని పిండము, బిడ్డ, ఒక నాటక సంధి. గీర్యతే జీవసంచితకర్మఫలదాత్రా ఈశ్వరేణ ప్రకృతిబలాద్ జఠరగహ్వరే స్థాప్యతే పురుషశుక్రయోగేణాసౌ ఇతి గర్భః. గరితీతి గర్భః. తోడు కొనుట, శిశువు, నట్టిల్లు, ఆహారము, అగ్ని, సూర్యుడు, పనసపండుపైతోలు, గర్భకోశము, (గర్భసంస్కారములు మూడు, ఆధానికము, పుంసవనము, సీమంతోన్నయనము).
గర్భాగారము
సం. నా. వా. అ. న. తత్స. నిర్వాతత్వాత్ గర్భ ఇవ అగారం గర్భాగారం. గర్భము వలె గాలి లేక ఉండునది, లోపలిగది, ఓవరి, నట్టిల్లు.
గర్భాశయము
సం. నా. వా. అ.పుం. తత్స. గర్భః ఆశేతేత్ర గర్భాశయః. గర్భము దీనియందుండును, గర్బమును చుట్టుకొని ఉండెడు సంచి, మావి, గర్భ కోశము.
గర్భిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గర్భోస్యా ఇతి గర్భిణీ. గర్భము కలది, చూలాలు, అంతర్వత్ని.
గర్ముత్తు
సం. నా. వా. త్. న. తత్స. గిర్యతే అన్య ధాన్యం జనైరితి గర్ముత్. జనులచేత దీని ధాన్యము భక్షింపబడును, తృణసస్య విశేషము గంటె, ధాన్య భేదము, బంగారము, పక్షి, సూర్యుడు.
గర్వము
సం. నా. వా. అ. పుం. తత్స. గర్వత్యనేనేతి గర్వః. దీనిచేత గర్వింతురు, అహంకారము, మదము.
గర్హణము
సం. నా. వా. అ. న. తత్స. గర్వకుత్సాయాం గర్హిణం. గర్వించుట, నింద, దూఱు.
గర్హ్యావాది
సం. విణ. (న్.ఈ.న్). తత్స. గర్హ్యం వదతీతి గర్హ్యవాదీ. నిందార్హముగా పలుకువాడు, కద్వదుఁడు.
గర్హ్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గర్వితుం యోగ్యో గర్హ్యః. నిందింపతగినవాడు, అధముడు.
గళంతిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గళత్యంభోస్యా ఇతి గళంతికా. దీనివలన నీళ్ళు కారును, గిండిచెంబు, జారి చెంబు.
గళకంబళము
సం. నా. వా. అ. పుం. తత్స. గళే కంబళవత్తిష్ఠతీతి గళకంబళః. మెడను కంబళి వలె ఉండునది, గంగడోలు.
గళము
సం. నా. వా. అ. పుం. తత్స. గళత్యనేన గళః. కుత్తుక, దీనిచేత మ్రింగుదురు, సజ్జరసము. గలతి భక్షయత్యనేన గళః. కంఠము.
గళితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గళతి స్మ గళితం. జారిపడినది, తినబడినది.
గళ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గళానాం సమూహో గళ్యా. ఱెల్లు కసవుల యొక్క సమూహము, పోటగళముల సమూహము, కంఠముల సమూహము.
గవయము
సం. నా. వా. అ. పుం. తత్స “గామయతే సదృశత్వాత్ గవయః. గోవును పోలునది, గురుపోతు, కుందేలు, ఒక మృగము.
గవలము
సం. నా. వా. అ. పుం. న. తత్స. గాః అలతి వారయతీతి గవలః. ఆవులను అడ్డగించునది, ఎనుపకొమ్ము, నల్లఎనుఁబోతు, అడవి దున్న.
గవాక్షము
సం. నా. వా. అ. పుం. న. తత్స. గవాం కిరణానాం అక్షో వ్యాపారోత్రేతి గవాక్షః. కిరణముల వ్యాపారము దీనియందు కలదు, కిటికీ, కోతి.
గవాక్షి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వృషభాక్షితుల్య పుష్పత్వాత్ గవాక్షీ. ఎద్దు కండ్ల వంటి పువ్వులు కలది, పిన్నపాపర, బుడమ, విష్ణు క్రాంతి భేదము, చేదుబీర, మల్లె.
గవీనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గావః అశితా అస్మిన్నితి గవీనం. అంతకముందు ఆవులు మేసినది, ఉండినది.
గవేధుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గవి అంభసి ఏధత ఇతి గవేధుకా. నీళ్ళలో వృద్ధిపొందునది, అడవి గోధుమలు, వట్టివడ్లు.
గవేధువు
సం. నా. వా. ఉ. పుం. స్త్రీ. తత్స. గవి అంభసి ఏధత ఇతి గవేధుః. నీళ్ళలో వృద్ధిపొందునది, అడవి గోధుమలు, వట్టివడ్లు.
గవేషణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గవేషణా గవేష మార్గణే. వెదుకుట, అమంత్రణార్థము వెతుకుట, శ్రాద్ధాదులయందు బ్రాహ్మణుని వెతుకుట.
గవేషితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గవేష్యతే స్మ గవేషితం. వెతకబడినది, అన్వేషితము.
గవ్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఆవులమంద.
గవ్య
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గోరిదం గవ్యం. గోసంబంధమైనది, ఆవు పాలులోనగునది, ఆవునకు హితవైనది. (పంచగవ్యములు-పాలు, పెరుగు, నెయ్యి, పంచితము, పేడ), పాలు.
గవ్యూంతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. గవోః క్రోశయోః యూతిః మిశ్రణం గవ్వుతిః. రెండు క్రోశముల కూటమి.
గహనము
సం. నా. వా. అ. న. తత్స. గాహ్యత ఇతి గహనం. దుష్టమృగములచే కలచబడినది, అడవి, గుహ, దుఃఖము. గాహ్యతే దుర్గమ్యతే అస్మిన్నితి గహనం.
గహనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గాహతే మతిరత్రేతి గహనం. దీని యందు బుద్ధి అణగును, ఎఱుగరానిది, చొరరానిది.
గహ్వరము
సం. నా. వా. అ. న. తత్స. గతిం హ్వరతీతి గహ్వరం. శైలగమనమును కుటిలముగా చేయునది, అడవి, గుహ, నెపము. గాహ్యతే విలోడ్యతే ఆత్మానేన ఇతి గహ్వరం. వనము, రోదనము. అ. పు. తత్స. పొదరిల్లు, వంచన, నీరు.
గహ్వరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. భూమి, నేల.
గాంగేయము
సం. నా. వా. అ. న. తత్స. గంగాయాం అగ్నినాన్యస్తస్యమాహేశ్వర వీర్యస్య హిరణ్యత్వేన భూతత్వాత్ గాంగేయం. గంగయందు ఈశ్వరుని వీర్యమును అగ్నిహోత్రుడు విడువగా సువర్ణ రూపమాయెను కనుక గాంగేయము, బంగారము, పసిడి, సువర్ణము, కుమారస్వామి, భీష్ముడు, నాచు.
గాంగేయము
సం. నా. వా. అ. పుం. తత్స. గంగాయాం భవం గాంగేయం. గంగయందు పుట్టినది, ఒకానొక చేప. గంగాయా అపత్యం పుమాన్ గాంగేయః. కుమారస్వామి, భీష్ముడు, నాచు.
గాంగేఱుకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గాంగమీరయతి పవిత్రత్వాద్గాంగేరుకీ. పవిత్రమౌట చేత గంగా సంబంధమైన జలములను తిరస్కరించునది, బీరచెట్టు, చిన్నగోధుమ.
గాండివము
సం. నా. వా. అ. పుం. న. తత్స. (రూ. గాండీవము) “గాండీకృతం అశ్లక్ష్ణీకృతం పర్వస్థానమన్యేతి గాండీవః. గాండివశ్చ. నునుపుగా చేయబడని కణుపులు కలది, అర్జునుడి విల్లు, విల్లు.
గాంధారము
సం. నా. వా. అ. పుం. తత్స. గాం వాచం ధరతీతి గాంధారః. వాక్కులను ధరించునది, ఒక స్వరము, సింధూరము, ఒకానొక దేశము, గంధర్వుడు, సంగీతము, జంత్రముతో కూడిన గానము.
గాఢము
సం. క్రి. విణ. అ. న. తత్స. గాహతే గాఢం. కలియ బెట్టునది, పెల్లు, అధికము, తీవ్రము, ఎక్కువ.
గాణిక్యము
సం. నా. వా. అ.న. తత్స. గణికానాం సమూహో గాణిక్యం. వేశ్యల యొక్క సమూహము, గణికల సమూహము.
గాణేయము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గణయితుం శక్యం గాణేయం. లెక్క పెట్టు శక్యమయినది, గణనీయము.
గాత్రము
సం. నా. వా. అ. న. తత్స. గాతే గచ్ఛతీతి గాత్రం. పోవునది, శరీరము, అవయవము, ఏనుగు యొక్క ముందటి పిక్కలు, ఏనుగు ముందరి భాగము.
గానము
సం. నా. వా. అ. న. తత్స. గీయత ఇతి గీతం, గానం చ. పాడఁబడునది, గీతము, పాట.
గాయత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గాయంతం వైద్యం త్రాయత ఇతి గాయత్రి. వైద్యులను రక్షించునది, మంత్ర విశేషము, ఒక చందస్సు.
గారుత్మతము
సం. నా. వా. అ. న. తత్స. గరుత్మతో జాతం గారుత్మతం. గరుత్మంతుని వలన పుట్టినది, పచ్చ, మరకతము.
గార్భిణము
సం. నా. వా. అ. న. తత్స. గర్భిణీనాం సమూహః గార్భిణం. చూలాండ్ర యొక్క గుంపు, గర్భిణుల సమూహము, సీమంత సంస్కరము.
గార్హపత్యము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహపతినా ఇతి రాగ్నిభ్యాం పూర్వం సంస్కృతోగ్నిః గార్హపత్యః. యజమాని చేత ఇతర అగ్నుల కంటె ముందు సంస్కరింపబడిన అగ్ని, ఒక శ్రౌతాగ్ని.
గాలవము
సం. నా. వా. అ. పుం. తత్స. గాలవతి స్రావయత్యక్షిరోగానితి గాలవః. నేత్రరోగములను పోగొట్టునది, లొద్దుగు (వృక్ష విశేషము), ఒకా నొకముని, మరువకము.
గిరి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. కాలేన గీర్యత ఇతి గిరిః. కాలముచేత చెఱుపబడినది, కొండ, అచ్చనగాయలు, నేత్రరోగవిశేషము, విణ. పూజ్యము. గిరతి ధారయతి పృథ్వీం, గ్రియతే స్తూయతే గురుత్వాద్వా ఇతి గిరిః. పర్వతము, సాంబ్రాణి, బాలికలబంతిఆట.
గిరిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గిరతి ధాన్యాదికం గిరికా. ధాన్యాదులను మ్రింగునది, చిట్టెలుక, జలగ, అ. పుం. తత్స. బొంగరము, వసురాజు, భార్య, పార్వతి, విధవ, అడవిమల్లె.
గిరికర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గిరేః కర్ణసాదృశ్యాత్ గిరికర్ణీ. పర్వతమును చెవివలె ఉండునది, దింటెన (వృక్ష విశేషము), విష్ణు క్రాంతి.
గిరిజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గిరౌర్జాతా గిరిజా. పర్వతమువలన పుట్టినది, పార్వతి, మాదిఫలము (వృక్షవిశేషము)
గిరిజ
సం. విణ. (అ.ఆ.అ) అ. న. తత్స. గిరౌ భవం గిరిజం. పర్వతమందు పుట్టినది, లోహము, సిలాజిత్తు, అభ్రకము, గిరేర్హిమాలయపర్వతాత్ జాతా గిరిజా. పార్వతి, గంగ, పార్వతి, మాదిఫలము (వృక్షవిశేషము).
గిరిమల్లిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గిరౌ మల్లికావత్తిష్ఠతీతి గిరిమల్లికా. పర్వతమందు మల్లిక వలె ఉండునది, కొండమల్లె (వృక్ష విశేషము), అంకుడు.
గిరీశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గిరేః కైలాసస్యేశః గిరీశః. కైలాసమునకు ఈశ్వరుడు, శివుడు, హిమవంతుడు, బృహస్పతి.
గిరీశుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గిరౌ శేతే గిరిశః. కైలాసమందు శయనించువాడు, శివుడు, కొండఅల్లుడు. గిరిరాశ్రయత్వేన వసతిత్వేనాస్త్యస్య ఇతి గిరిశః.
గీతము
సం. నా. వా. అ. న. తత్స. గీయత ఇతి గీతం. పాడబడునది, పాట, పలుకబడినది.
గీర్ణి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. గిరణం గీర్ణిః. మ్రింగుట, స్తుత్యము.
గీర్వాణము, గీర్వాణుఁడు
సం. నా. వా. అ.పుం. తత్స “గిరం వేదశాస్త్రాదిరూపాం వణంతి వ్యాకుర్వంతీతి గీర్వాణాః. వేదశాస్త్రాదిరూపమైన వాక్కును వివేచించి చెప్పువారు, దేవుడు, వేల్పు, దేవభాష, దేవత.
గీష్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గిరాం పతిః గీష్పతిః. వాక్కులకు పతి, బృహస్పతి.
గుంజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శుష్కదశాయాం గుంజతీతి గుంజా. ఎండినపుడు ఇంచుక మ్రోయునది, గురిజ (వృక్ష విశేషము), అవ్యక్త మధురధ్వని, ఉప్పళము, తప్పెట, గురువింద, మూడుయవలు, ఘటవాద్యము.
గుంఠితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గుంఠ్యతె ధూళ్యాదినేతి గుంఠితం. ధూళి మొదలైన వాని చేత కప్పబడినది.
గుంద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుణాన్ ద్రాతీతి గుంద్రా. గుణములను బాధించునది, నాగముస్త (వృక్ష విశేషము). గుద్యతే క్రీడ్యతే అనయా గుంద్రా. దీనిచేత క్రీడింతురు, ప్రేంకణపు చెట్టు, ప్రియంగువు, ఒక చెట్టు, ఒక గోధుమ.
గుంద్రము
సం. నా. వా. అ. పుం. తత్స. గూయత ఇతి గుంద్రః. వాయువశమున మ్రోయునది, కాకిచెఱకు (వృక్ష విశేషము), ముంజె గడ్డి.
గుగ్గులువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. గుడతి వాతరోగాద్గుగ్గులుః. వాత రోగములనుండి రక్షించునది, గుగ్గిలపు చెట్టు. గుజ్యతే అనేనేతి గుగ్గులుః. వృక్షవిశేషము, బంక.
గుచ్ఛకము
సం. నా. వా. అ. పుం. తత్స. గూయతే సాధురితి గుచ్ఛకః. మంచిదని పలుకబడినది, పూగుత్తి, నెమలిపురి, పొద, ముప్పైరెండు మణులు గుచ్చిన హారము, ముత్యాల హారము.
గుడ పుష్పము
సం. నా. వా. అ. పుం. తత్స. గుడవత్ స్వాదూని పుష్పాని యస్య సః గుడ పుష్పః. బెల్లము వంటి పువ్వులు కలది, ఇప్ప (వృక్ష విశేషము).
గుడ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుడతి ప్లీహాది రోగేభ్యోగుడా. ప్లీహాది రోగముల వలన రక్షించునది, గుళిగ, జముడు, ద్రాక్ష (వృక్ష విశేషము).
గుడ
సం. నా. వా. అ. పుం. తత్స. గుడతీతి గుడః. రక్షించునది, బెల్లము, గోలి, ఏనుగు కవచము, ద్రాక్ష ఫలము, అన్నపుపిడచ, బాలికల బంతి ఆట, గూను, యోని మధ్యమ, బెల్లం ఉండ, స్నూహీలత, సీసపుగుండు.
గుడఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. గుడవన్మధురాణి ఫలాని యస్య గుడఫలః. బెల్లము వలం మధురమైన ఫలములు కలది, గొనుగు (వృక్ష విశేషము).
గుడూచి
సం. నా. వా. వా. ఈ. స్త్రీ. తత్స. గుడతి రక్షతి గుడూచీ. జ్వరితులను రక్షించునది, తిప్పతీఁగ. లతా విశేషము.
గుణము
సం. నా. వా. అ. పుం. తత్స. గుణ్యతే అభ్యస్యత ఇతి గుణః. అభ్యసింపబడునది. గుణయంతి పాకం పునరానర్తయంతీతి గుణాః. పాకమైన దానిని తిరగపోసి వండు వారు.గుణ్యతే అభ్యస్యతే బంధనాయేతి గుణః. బంధనము కొరకు అభ్యసింపబడునది. గుణ్యత ఇతి గుణః. అభ్యసింపబడునది. 1.ఐశ్వర్యాది (ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ,జ్ఞానము, వైరాగ్యము, ఇవి భగవంతుని షడ్గుణములు), 2. త్యాగశౌర్యాది, 3.త్రాడు, 4. వడము, 5. అల్లెత్రాడు, 6. మడుగు, 7. శబ్దాది (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి ఐదు భూత గుణములు), 8. శుక్లాది, 9. సంధ్యాది (ఇవి ఆరు- సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధము, ఆశ్రయము), 10. సత్త్వాది (ఇవి మూడు సత్త్వము, రజస్సు, తమస్సు-వీనికి శక్తులనియు నామాంతరము కలదు), 11. ఇంద్రియము 12. అప్రధానం, 13. అలవాటు. (శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔధార్యము, కాంతి, ఓజస్సు, సమాధి అని పది), త్రిగుణములు, వంటవాడు, గుణము, అప్రధానము, హెచ్చవేయుట, వింటినారి, దారము.
గుణవృక్షకము
సం. నా. వా. అ. పుం. తత్స. గుణేన రజ్జ్వా బద్ధో వృక్షః గుణవృక్షకః. తాడుచేత కట్టబడిన వృక్షము, ఓడకంబము. గుణానాం తరణీస్థరజ్జూనాం వృక్ష ఇవ గుణవృక్షః. కూపకము పడవ కొయ్య.
గుణితము
సం. నా. వా. అ. న. తత్స. గుణ్యతే స్మ గుణితం. గుణింపబడినది, హల్లులతో అచ్చులను హల్లులను చేర్చిచెప్పుట, శాసింపబడినది.
గుత్సము
సం. నా. వా. అ. పుం. తత్స. గుధ్యతి పరివేష్ఠయతి భువమితి గుత్సః. భూమిని కప్పి ఉండునది, వరి, పూగుత్తి, ముప్పైరెండు మణులు గుచ్చిన హారము, గండివనము (వృక్ష విశేషము).
గుదము
సం. నా. వా. అ. న. తత్స. గువతి పురీషముత్సృజతీతి గుదం. మలమును విడుచునది, పాయువు, మూడి. గోదతే ఖేలతి చలతీత్యర్థః గుదం. ఉపానము, గుహ్యము, చూతము.
గుప్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గుప్యతే స్మ గుప్తం. దాచబడినది. “గోపాయతే స్మ గుప్తం. రక్షింపబడినది, కావబడినది. దాచబడినది.
గుప్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. గోప్యతే గోపనం చ గుప్తిః. రక్షించుట, కాపాడుట, దాచుట, చెఱసాల, పాతఱ, సొరంగము.
గురణము
సం. నా. వా. అ. న. తత్స. గూర్తిః గురణం. ఉద్యోగము, యత్నము.
గురువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. సర్వార్థాన్ గృణాతీతి గురుః. సర్వార్థములను వచించువాడు, బృహస్పతి. గృణాతి ఉపదిశతి గ్రాయత్యాదికం గురుః. గాయత్రాదులను ఉపదేశించువాడు, ఉపాధ్యాయుడు, కులము-పెద్ద, తండ్రి, తండ్రి తోడబుట్టినవాడు, తాత, అన్న, మామ, మేనమామ, రాజు, కాపాడువాడు, పురోహితుడు, గొప్పవాడు, ప్రసిద్ధుడు, (విణ. తత్స. అలఘవు, గొప్పది, భరింపకూడనిది). బరువైనది, తల్లి.
గుర్విణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గురు గర్ఛశరీరమస్త్యస్యామితి గుర్విణీ. బరువైన గర్భశరీరము కలది, గర్భిణి, చూలాలు. గర్వతి కుక్షౌ సంతానం ప్రాప్నోతీతి గుర్విణీ.
గుల్ఫము
సం. నా. వా. అ. పుం. తత్స. అభిఘాతాద్గుల్యతే రక్ష్యత ఇతి గుల్ఫః. అభిఘాతముల వలన రక్షింపబడునది, చీలమండ.
గుల్మము
సం. నా. వా. అ. పుం. తత్స. గుడతి చోరాదిభిర్భీతాన్ గుల్మః. చోరాదుల చేత భయపడువారిని రక్షించునది. గుడ్యతే ప్రకోపాదినా రక్ష్యత ఇతి గుల్మః. కోపాదులచేత రక్షింపబడునది. గుడతి రక్షతీతి గుల్మః. రక్షించునది, బోదెలేని చెట్టు, వ్యాధి విశేషము, సేనా విశేషము, (తొమ్మిది రథాలు, అన్ని ఏనుగులు, ఇరువది ఏడు గుఱ్ఱములు, నలువదేవూరు కాల్వురు గలది), పొద, ప్లీహము, మూడు సేనా ముఖములు, సైన్య రక్షణము, పురాభిముఖమైన రాజమార్గము.
గుల్మిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గుల్మో లతా సమూహోస్యా అస్తీతి గుల్మినీ. లతాసమూహము కలిగినది, ఉలపము, పొదరు.
గువాకము
సం. నా. వా. అ. పుం. తత్స. గువతి మలం నిస్సారయతీతి గువాకః. మలనిస్సరణమును చేయునది, పోఁక చెట్టు.
గుహస్థూణము
సం. నా. వా. అ. న. తత్స. ఇంటి నడిమి, కంబము, నిట్రాడు.
గుహా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుహత్యంధకారమితి గుహా. అంధకారమును ఆక్రమించునది. “గుహతి రసం గుహో. రసమును కప్పి ఉండునది, కొండయందు తొలవబడిన గొప్ప బిలము, పల్లము, నక్కతోక పొన్న (వృక్షవిశేషము), గుహ, పెద్దమల్లె.
గుహుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గుహతి పరాయుధేభ్య ఆత్మసైన్యం గోపాయతీతి గుహః. తన సైన్యమును రక్షించుకొనువాడు, కుమారస్వామి, కందుడు. గుహతి రక్షతి దేవసేనాం గుహః. కార్తికేయుడు.
గుహ్యకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. నిధీన్గూహంతీతి గుహ్యకాః. నిధులను కాచువారు, దేవయోని విశేషము. గూహతి నిధిం ధనవిశేషం రక్షతీతి గుహ్యకః. ఒక దేవజాతి కుబేరుడు.
గుహ్యకేశ్వరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గుహ్యకా నిధిగోపకాః తేషామీశ్వరః గుహ్యకేశ్వరః. నిధి రక్షకులకు ప్రభువు, కుబేరుడు.
గుహ్యము
సం. నా. వా. అ.న. తత్స. గుహనీయం గుహ్యం. దాచదగినది, ఏకాంతము, స్త్రీ పురుషుల గురి, తాబేలు, నెపము. గుహాం గోపనం అర్హతీతి గుహ్యం. రహస్యము, గోప్యము, విజనము, ఉపాంశువు, గూఢము. విణ. తత్స. దాచబడినది, మర్మావయవము.
గూఢ పురుషుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గూఢశ్చాసౌ పురుషశ్చ గూఢ పురుషః. గూఢమైన పురుషుడు, చారుడు, వేగువాడు.
గూఢపాత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. గూఢాః పాదాః యస్యసః గూఢపాత్. కానరాని పాదములు కలది, పాము, సర్పము. గూఢం పీదయతీతి గూఢపాత్.
గూఢము
సం. నా. వా. అ. న. తత్స. గూయతే ఉత్సృజ్యత ఇతి గూఢం. విడువబడునది, రహస్యం, స్త్రీ పురుషుల గుఱి, దాచబడినది, యోని, యంత్రము.
గృంజనము
సం. నా. వా. అ. పుం. తత్స. గృంజ్యతే శబ్ద్యతే గృంజనః. కుత్సితమని తలంపబడునది, వెల్లుల్లి, విషము తిన్న పశువు యొక్క మాంసము, ఎఱ్ఱమునగ, చిన్న ఉల్లి, పచ్చ ఉల్లి.
గృధ్నువు
సం. విణ. ఉ. తత్స. గృధ్యతి కాంక్షతి తాచ్ఛీల్యేనేతి గృధ్నుః. స్వభావమున కాంక్షించువాడు, ఇచ్చకలవాడు, గర్ధనుడు. గృధ్యతి కామయతే లిప్సతి వా ధనమితి శేషః గృధ్నుః. ఆశ కలవాడు.
గృధ్రము
సం. నా. వా. అ.పుం. తత్స “గృధ్నోతి మాంసమితి గృఁధః. మాంసమును కాంక్షించునది, గ్రద్ద. విణ. తత్స. పిసినివాడు.
గృధ్రుసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కిరుడెస (వృక్ష విశేషము).
గృహగోధిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గృహే గోధికేవ తిష్ఠతీతి గృహగోధికా. గృహమందు ఉడుమువలె ఉండునది, బల్లి, ముసలి.
గృహపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గృహస్య పతిః గృహపతిః. గృహమునకు ప్రభువు, గృహస్ధుఁడు, మంత్రి, విడువక ఇచ్చువాడు.
గృహము
సం. నా. వా. అ. న. తత్స. గృహ్ణాతి పురుషేణార్జితం ధనమితి గృహం. పురుషుడిచే సంపాదించబడిన ధనమును గ్రహించునది, ఇల్లు, పెండ్లాము. గృహ్ణాతి ధాన్యాదికం జీవనార్థం ఇతి గృహం. సదనము, భవనము, నికేతనము, మందిరము, నివాసము, వసతి, ఆవాసము, అధివాసము.
గృహావగ్రహణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గృహమవగృహ్యతే పరిచ్ఛిద్యతే అనయా గృహావగ్రహణీ. దేహళీ, గడప, గుమ్మము.
గృహి
సం. నా. వా. న్. పుం. తత్స. గృహం భార్యా సాస్యాస్తీతి గృహీ. భార్యను కలవాడు, గృహస్ధుడు.
గృహ్యకము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహ్యంత ఇతి గృహ్యకాః. పట్టువడునవి, పెంపుడు మృగములోనగునది, దీమము, బస చేయువాడు.
గృహ్యకము
సం. విణ. తత్స. గృహ్యతే స్వీక్రియతే వ్యాపారేషు స్వామినేతి గృహ్యకః. పరాధీనుడు.
గేందుకము
సం. నా. వా. అ. పుం. తత్స. గే గగనే ఇందురివ గేందుకః. ఆకాశములో చంద్రుని వలె ఉండునది, బాలురు, ఆడు కొనెడి చెండు, కందుకము.
గేహము
సం. నా. వా. అ. పుం. న. తత్స. గృహ్ణాతి పురుషేణార్జితం ధనమితి గేహం. గృహము, ఇల్లు. గో గంధర్వో గణేశశ్చ గేహం.
గైరికము
సం. నా. వా. అ. న. తత్స. గిరౌ భవం గైరికం. పర్వతమందు పుట్టినది, పర్వత ధాతు విశేషము, బంగారు, పచ్చసుద్ధ.
గైరేయము
సం. నా. వా. అ. న. తత్స. గిరౌ భవం గైరేయం. పర్వతమందు పుట్టినది, సిలాజిత్తు, కారుకోక, ఎఱ్ఱసుద్ద.
గోండుడు
సం. నా. వా. అ. పుం. తత్స. పామర జాతి వాడు, ఉరుకు బొడ్డువాడు.
గోకంటకము
సం. నా. వా. అ. పుం. తత్స. గవాం కంటకో బాధకో గోకంటకః. గోవులకు బాధకమైన ముండ్లు కలది, పల్లేరు చెట్టు, గోవులగొరిసె, గోచారువు.
గోకర్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. గోరివ కర్ణావస్యేతి గోకర్ణః. ఆవుల చెవుల వంటి చెవులు కలది, కడితి మృగము, కంచరగాడిద. గోకర్ణాకృతి రత్రాస్తీతి గోకర్ణః. ఆవు చెవులవంటి ఆకారం కలది, జుత్త, పాము, ప్రమథగణవిశేషము, ఒక మృగము, ప్రాదేశ మాత్రము.
గోకర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గోకర్ణాభ పత్రత్వాత్ గోకర్ణీ. ఆవుచెవుల వంటి ఆకులు కలది, చాగ చెట్టు.
గోకులము
సం. నా. వా. అ. న. తత్స. గవాం కులం సంఘాతః గోకులం. ఆవుల యొక్క మంద, ఆలమంద.
గోక్షురకము
సం. నా. వా. అ. పుం. తత్స. గవి భువి క్షుర ఇవ దుఃఖహేతుత్వాత్ గోక్షురకః. భూమియందు కత్తివలె దుఃఖహేతువైనది, పల్లేరు చెట్టు, గోచారువు.
గోచరము
సం. నా. వా. అ. పుం. తత్స. గావః ఇంద్రియాణి చరంతేష్వితి గోచరాః. ఇంద్రియములు వీనియందు చరించును, ఇంద్రియార్ధము, విషయము.
గోజిహ్వము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గోజిహ్వాభ పత్రత్వాద్గోజిహ్వా. ఆవునాలుక వంటి ఆకులు కలది, ఎద్దునాలుక, చెట్టు, బెండ, ఒక గోధుమ.
గోతుంబము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గోభిస్తుంబ్యత ఇతి గోతుంబా. గోవులచేత భక్షింపబడునది, పిన్నపాపర, పుచ్చ, బుడమ. (వృక్ష విశేషాలు), చేదు బీర.
గోత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గోత్రాః పర్వతాస్సంత్యస్వామితి గోత్రాః. పర్వతములు దీనియందు కలవు, నేల. గవాం సమూహః గోత్రా. ఆవుల మంద. గాః పశూన్ సర్వాన్ జీవానిత్యర్థః, త్రాయతే ఇతి గోత్రా.
గోత్రభిదుడు
సం. నా. వా. ద్. పుం. తత్స. గోత్రాన్ పర్వతాన్ భినఁత్తీతి గోత్రభిత్. పర్వతములను భేదించినవాడు, ఇంద్రుడు.
గోత్రము
సం. నా. వా. అ. న. తత్స. గూయతే శబ్ద్యతే గార్గ్వో వసిష్ఠ ఇతి గోత్రం. గార్గ్యుడు వసిష్ఠుడు అని పలుకబడునది, వంశము, పేరు, గొడుగు, అడవి, బలిమి, వరిమడి. గూయతే అనేన గా స్త్రాయతే గోసమూహశ్చేతి గోత్రం. దీని చేత పిలువబడును. గవతే శబ్దాయతి పూర్వపురుషాన్ యదితి గోత్రం. కాననము, క్షేత్రము, విత్తము, మేఘము.
గోత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. గాం భువం త్రాయత ఇతి గోత్రః. భూమిని రక్షించునది, కొండ, కుటుంబము, ఆలమంద, భూమి.
గోదారణము
సం. నా. వా. అ.న. తత్స. గాం భువం దారయతీతి గోదారణం. భూమిని వ్రక్కలించునది, హలము, నాగలి. గౌర్భూమిర్దార్యతే అనేనేతి గోదారణం, చిత్రిక బల్ల.
గోదావరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గాం జలం స్వర్గం వా దదాతీతి గోదాః, తాసు వరీ శ్రేష్ఠా గోదావరీ. నది విశేషము.
గోధ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుధ్వతి పరివేష్టతి ప్రకోష్ఠమితి గోధా. ముంజేతిని చుట్టుకొని ఉండునది, అ. న. తత్స. వింటినారి దెబ్బ తాకకుండా చేతికి కట్టుకొను తోలు, ఉడుము.
గోధనము
సం. నా. వా. అ. న. తత్స. గవాం కులం సంఘాతః గోధనం. ఆవుల మంద, గోకులము, ఆలమంద, గొల్లవాడు.
గోధాపది
సం. నా. వా. ఈ .స్త్రీ. తత్స. గోధా ఇవ పదోస్యా ఇతి గోధాపదీ. ఉడుము కాళ్ళ వంటి అడుగులు కలది, చెప్పు తట్ట చెట్టు.
గోధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గావౌ నేత్రే ధీయేతే అస్మిన్నితి గోధిః. నేత్రములు దీనియందు ధరింపబడును, నొసలు, అలికము, నుదురు.
గోధిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుధతీతి గోధికా. చుట్టుకొని ఉండునది, ఉడుము, నీరుడుము.
గోధూమము
సం. నా. వా. అ. పుం. తత్స. గుధ్యత పరివేష్ట్యత ఇతి గోధూమః. విసరబడునది, గోధుమలు, నారదము, (వృక్ష విశేషము).
గోనర్దము
సం. నా. వా. అ. పుం. తత్స. గాః నర్దయతి రుచి కరత్వేన గోనర్దం. రుచికరమౌట చేత గోవులను ఱంకె వేయించునది, కవయడి ముస్తె, బెగ్గురు పక్షి, చూడు, గోదర్భ.
గోనసము
సం. నా. వా. అ.పుం. తత్స “గోరివ నాసా యస్యసః గోనసః. గోవు నాసిక వంటి నాసిక కలది, కొండ చిలువ, పాము.
గోప
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రామాధికారి, గొల్లవాడు.
గోపతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గవాం పతి వద్గర్భాధాన కారిత్వాద్గోపతిః. ఆవులకు పతివలె గర్భాధానము చేయునది, ఆఁబోతు, ఇంద్రుడు, రాజు, శివుడు, సూర్యుడు.
గోపానసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గోపాచాసా నాసాచ గోపానసీ. ఇంటికి కప్పైన నాసికవలె ఉండునది, చూరుపట్టె, గొప్పులు. గోపాయతి రక్షతి గృహమితి గోపానసీ.
గోపాయితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గోపాయతే స్మ గోపాయితం. రక్షింపబడినది, కావబడినది, దాచబడినది.
గోపాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గాః పాలయతీతి గోపాలః. ఆవులను రక్షించువాడు, గొల్లవాడు, రాజు.
గోపి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అతిసారరోగిణం గోపయతీతి గోపీ. అతిసార రోగము కలవానిని రక్షించునది, గొల్లది, మామెన.
గోపురము
సం. నా. వా. అ. న. తత్స. గోప్యతే శూరైరితి గోపురం. శూరులచే రక్షింప బడునది, వాకిలి. గౌర్జలం పురం సంస్థానమన్యేతి గోపురం. నీరు ఉనికి పట్టుగా కలది, కైవడి ముస్తె చెట్టు. గోప్యత ఇతి గోపురం. రక్షింపబడునది, గవను. గోపాయతి నగరం రక్షతీతి గోపురం, తృణ విశేషము.
గోప్యకుడు
సం.విణ. తత్స. గోపనీయో గోప్యకః. రక్షింపదగిన వాడు, కావదగినవాడు. అ. న. పుం. తత్స. ఊడిగపువాడు, దాసపుత్రుడు.
గోమంతుడు
సం. నా. వా. త్. పుం. తత్స. గావస్సన్త్యస్య గోమాన్. ఆవులు కలవాడు. గోవులకొడయాడు, గోస్వామి.
గోమయము
సం. నా. వా. అ. పుం. న. తత్స. గోః విట్ పురీషం గోమయం. ఆవు పేడ.
గోమాయువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. గాః మినోతి క్షీపతీతి గోమాయుః. గోవులనుపోతోలునదినక్క, జంబుకము. గాం వికృతాం వాచం మినోతీతిప్గో ఇతి గోమాయుః. గంధర్వ విశేషము.
గోమి
సం. నా. వా. న్. పుం. తత్స. గావ స్సన్త్యస్య గోమి. ఆవులు కలవాడు, గోవుల కొడయడు, నక్క. విణ. తత్స. గోవులు కలవాడు.
గోరసము
సం. నా. వా. అ. పుం. తత్స. గోః రసః గోరసః. ఆవు సంబంధమైన రసము, మజ్జిగ, కాల శేయము, పెరుగు.
గోర్ధము
సం. నా. వా. అ. న. తత్స. గూర్యతే గురతేవా గోర్ధం. యత్నించునది, తలమెదడు, మస్తిష్కము, బుద్ది.
గోల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గాం నేపాళ భూమిం లాతి జన్మభూమి త్వేనేతి గోళా. నేపాళ భూమిని జన్మ భూమిగా స్వీకరించునది, మణిశిల, కాఁగు, గోదావరి, పడిసము, గంజి, ఎఱ్ఱపాషాణము.
గోలీఢము
సం. నా. వా. అ. పుం. తత్స. గోభిః లిహ్యతే ఆస్వాద్యత ఇతి గోలీఢః. గోవులచేత ఆస్వాదింపబడునది, మొక్కపు చెట్టు.
గోలోమి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గోరివలో మాన్యస్య ఇతి గోలోమీ. ఆవు రోమము వంటి రోమములు కలది, వస చెట్టు, తెల్లగరిక, చెట్టు, మరులుజడ చెట్టు, నేలగొలిమిడి చెట్టు, తృణ విశేషము.
గోళకము
సం. నా. వా. అ. పుం. తత్స. గుల్యతే అప్రకాశత్వేనేతి గోళకః. అప్రకాశముగా రక్షింపబడువాడు, కాఁగు, గోలీ, విధవాపుత్రుడు, పెద్దపూజ, దుప్పటి, పండు పైతోలు.
గోవందిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గవి భూమౌ వంద్యతే స్తూయత ఇతి గోవందినీ. భూమియందు స్తోత్రము చేయబడునది, ప్రేంకణపు చెట్టు, ప్రియంగువు.
గోవిందుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విందతి ఇతి గోవిందః. భూమిగాని, గోవును గాని, స్వర్గమును గాని, వేదమునుగాని పొందెడువాడు, కుష్ణుడు. గాః విందతీతి గోవిందః. ఆవులు పొందినవాడు గోవులకొడయడు, బృహస్పతి, విష్ణువు, గోస్వామి.
గోవిట్టు
సం. నా. వా. ష్. స్త్రీ. తత్స. గోః విట్ పురిషం గోవిట్. ఆవుపేడ, గోమయము.
గోవు
సం. నా. వా. ఓ. పుం. తత్స. గచ్ఛతి సుచిరమితి గౌః. తిన్నగా నడుచునది, ఎద్దు, కిరణము, స్వర్గము, చంద్రుడు, వజ్రాయుధము.
గోవు
సం. నా. వా. ఓ. స్త్రీ. తత్స. గచ్ఛతి స్యస్థానమితి గోః. ఉనికి పట్టునకు పోవునది, ఆవు, కన్ను, దిక్కు, బాణము, భూమి, వాక్కు, నీళ్ళు. “గచ్ఛతి గమ్యత ఇతి వా గౌః. పోవునది, పొందబడునది.
గోశీర్షము
సం. నా. వా. అ. న. తత్స. గోశీర్షాకారే మలయశృంగే భవం గోశీర్షం. గోవు శిరస్సువంటి మలయశృంగమందు పుట్టినది, పసుపు వన్నెకల చందనము, హరిచందనము, పచ్చచందనం.
గోష్ఠము
సం. నా. వా. అ. న. తత్స. గావస్తిష్ఠంత్యత్ర గోష్ఠం. దీనియందు గోవులుండును, గోవులమంద ఉండు చోటు, గోశాల.
గోష్ఠి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గావో నానా విధా వాచస్తిష్ఠన్త్యత్రేతి గోష్ఠీ. నానా విధములైన వాక్కులు దీనియందు ఉండును, సభ, సల్లాపము.
గోష్పదము
సం. నా. వా. అ. న. తత్స. గావః పద్యంతేత్ర గోష్పదం. గోవులు దీనియందు సంచరించును, గోవుల యొక్క అడుగు కొలది, గోవు గొరిసె యిడిన గుంట, గోవులు తిరిగెడు చోటు, ఆవు గిట్ట.
గోసంఖ్యుడు
సం. నా. వా. అ. పుం. తత్స. గాస్సంచష్టే గోసంఖ్యః. ఆవులను విచారించు వాడు, గొల్లవాడు.
గోస్తనము
సం. నా. వా. అ. పుం. తత్స. గోస్తనవత్ నాభేరధోవ ర్తమానత్వాత్ గోస్తనః. గోస్తనమువలె నాభియొక్క అధోభాగమందుండునది, 40 పూసల సరము, ఒక ముత్యాల హారము.
గోస్తని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గోస్తనాభవంఫల త్వాద్గోస్తనీ. ఆవు చన్నుల మటి పండ్లు కలది, ద్రాక్ష చెట్టు.
గౌతమి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. నదీ విశేషము, పార్వతి.
గౌతముడు
సం. నా. వా. అ. పుం. తత్స. గౌతమ వంశమందు పుట్టినవాడు, శాక్యముని, ఒకానొకముని, జినుడు, శాక్య సింహుడు శతానందుడు, క్రొవ్వు. గౌతమా వంశావతీర్ణత్వాదుద్ధోపి గౌతమః.
గౌధారము
సం. నా. వా. అ. పుం. తత్స. గోధాయా అపత్యం గౌధారః. ఉడుము యొక్క పిల్ల.
గౌధేయము
సం. నా. వా. అ. పుం. తత్స. గోధాయాం అపత్యం గౌధేయం. ఉడుము యొక్క పిల్ల.
గౌధేరము
సం. నా. వా. అ. పుం. తత్స. గోధాయా అపత్యం గౌధేరం. ఉడుము యొక్క పిల్ల.
గౌరము
సం. విణ. తత్స. గురుతే మనోస్మిన్నితి గౌరః. మనస్సు దీనియందు ఉద్యమించును, తెల్లనిది, స్వచ్ఛమయినది, పసుపు పచ్చనిది, ఎర్రనిది. అ. పుం. తత్స. గవతే అవ్యక్తం శబ్దయతీతి గౌరః. ధనము, వట్టివేరు.
గౌరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గౌరవర్ణత్వాద్గౌరీ. గౌరవర్ణము కలది, పార్వతి. గురతే విహహాయ ఉద్యతతే గౌరీ. వివాహమునకు ఉద్యోగించునది, సమర్తాడని కన్యక.
గౌష్ఠీనము
సం. నా. వా. అ. న. తత్స. భూత పూర్వం గోష్ఠం గౌష్ఠీనం. పూర్వపుడైన గోష్ఠము, అంతకుముందు గోవులున్నచోటు, ఆవుల కొట్టము.
గ్రంథి
సం. నా. వా. ఇ. పుం. తత్స. గంథ్యతే సంధిరూపేణ బద్ద్యత ఇతి గ్రంధిః. గ్రంధి రూపమున బంధింపబడునది, కంతి, గనుపు, ముడి, గండివనము.
గ్రంథిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గ్రంథి ప్రకృతిత్వాత్ గ్రంథికం. ముడివలె ఉండునది, కల్లుతీగ. అ. న. తత్స. పిప్పలివేరు, గండివనము, అ. పు. తత్స. గుగ్గిలపు చెట్టు, వెలుతురు.
గ్రంథిపర్ణము
సం. నా. వా. అ. న. తత్స. బుడుపుల యందు ఆకులు కలది, పచ్చాకు, మాచిపత్రి, గండివనం. గ్రంథిషు పర్ణాన్యస్య గ్రంథిపర్ణం.
గ్రంధితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గ్రంధ్యతే స్మ గ్రంథితం. కూర్పబడునది, గ్రథితము.
గ్రంధిలము
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రంధయస్సంత్యస్య గ్రంధిలః. బుడుపులు కలది, ములువెలగ, వెణుతురు. (వృక్ష విశేషము). విణ. తత్స. గనుపులు కలది, మోదుగు.
గ్రథితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గ్రథ్యతే స్మ గ్రథితం. కూర్పబడునది, గ్రువ్వబడినది.
గ్రస్తము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గ్రస్యంతే పీడ్యంతే వర్ణాః పదానివా అత్రేతి గ్రస్తం. దీనిచేత వర్ణములు గాని పదములుగాని మింగబడును, తినబడినది, మ్రింగబడినది, మాట. గ్రస్యతే గ్లస్యతే స్మ గ్రస్తం. భుజింపబడినది.
గ్రహపతి
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రహాణాం పతిః గ్రహపతిః. గ్రహములకు ప్రభువు, సూర్యడు.
గ్రహము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహ్యేతే సూర్యా చంద్ర మాసవనేన గ్రహః. గ్రహణం గ్రహః. గృహ్ణాతీతి గ్రహణం, గృహ్యత ఇతి చ గ్రహః. సూర్యాది, గ్రహించుట, అనుగ్రహము, చెఱ, రాహువు, సూర్యచంద్రులను పట్టుట, పూత నాది, ఊర్ధ్వాకారమైన యజ్ఞపాత్ర విశేషము, యుద్ధ ప్రయత్నము, రాహువు. గృహ్ణాతి గతవిశేషానితి గ్రహః. గృహ్ణాతి గతివిశేషానితి ర్రహః. ఇరువది ఏడు నక్షత్రములలో 12 వభాగం, బహుమాన స్వీకృతి, ఖైది, దయ్యము, గ్రహించుట, అవివేకము.
గ్రహీత
సం. విణ. (ఋ.ఈ.ఋ). తత్స. గృహ్ణాతితా చ్ఛీల్యేనేతి గృహీతా. పుచ్చుకొను స్వభావము కలవాడు, గ్రహించువాడు.
గ్రామణి
సం. నా. వా. ఈ. పుం. తత్స. గ్రామం స్వవశం నయతీతి గ్రామణీః. గ్రామమును తనవశము చేసుకొను వాడు, మంగలి. గ్రామం సంవసథం తత్రత్యాన్ జనాన్ నయతీతి గ్రామణీ. భోగిక. విణ. తత్స. ముఖ్యుడు, గ్రామాధిపతి, శ్రేష్ఠుడు, నాయకుడు, యజమానుడు.
గ్రామత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గ్రామాణాం సమూహో గ్రామతా. గ్రామముల యొక్క సమూహము.
గ్రామతక్షుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రామాధీనస్తక్షా గ్రామతక్షః. గ్రామమునకు అధీనుడైనవాడు, వడ్రంగి, వెట్టి.
గ్రామము
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రస్యతే భుజ్యత ఇతి గ్రామః. ప్రాణులచేత భుజింపబడునది, ఊరు, షడ్జాదిస్వరము, సమూహం, సంగీతములోని గ్రామము.
గ్రామీణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గ్రామే భవాః గ్రామీణః. నీలిచెట్టు, వేశ్య. విణ. తత్స. గ్రామమందు పుట్టినది, ఊరిది.
గ్రామ్యధర్మము
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రామ్యాణాం పామరాణాం ధర్మో గ్రామ్యధర్మః. గ్రామ్యజనుల ధర్మము, సురతము. గ్రామస్య ఇతరాదేర్ధర్మ్మః గ్రామ్యధర్మః. మైధునము.
గ్రామ్యము
సం. నా. వా. అ. న. తత్స. అర్థ దోషములలో ఒకటి, శబ్ద దోషములలో ఒకటి, రతిబంధవిశేషము.
గ్రామ్యము
సం. విణ. తత్స. గ్రామేభవం గ్రామ్యం. గ్రామమందు పుట్టినది, అసభ్యమైన మాట, పామరము, కోడి మున్నగునవి, గ్రామీణుడు.
గ్రావము
సం. నా. వా. న్. పుం. తత్స. కాలేన గీర్యత ఇతి గ్రావా. కాలము చేత చెరుపబడినది. ఆతపాదిభిస్తప్తస్సన్ జలం గిరతీతి గ్రావా. ఎండకు క్రాగినదై జలమును గ్రహించునది. గృహ్యత ఇతి గ్రావా. గ్రహింపబడునది, కొండ, రాయి, సోమలతను నూరు రాయి.
గ్రాసము
సం. నా. వా. అ. పుం. తత్స. గ్రస్యత ఇతి గ్రాసః. భక్షింపబడునది, కబళము.
గ్రాహము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహ్ణత్యేవ సముంచతి ప్రాణిన ఇతి గ్రాహః. ప్రాణులను పట్టి విడువనిది, గ్రహించుట, చెఱ, ఒకానొక నీరు పాము, మొసలి, అవివేకము.
గ్రాహి
సం. నా. వా. న్. పుం. తత్స. విష్టంభ కారిత్వాద్గ్రాహీ. మలబంధమును చేయునది, వెలఁగ (వృక్ష విశేషము).
గ్రీవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గిరం త్యనయా న్నాదికమితి గ్రీవా. దీనిచేత అన్నాదులను మింగుదురు, మెడ, మెడనరము.
గ్రీష్మము
సం. నా. వా. అ. పుం. తత్స. గిరతి జలమితి గ్రీష్మః. జలమును గ్రసించునది, వేడిమి, వేసంగి. గ్రసతే రసానితి గ్రీష్మః. ఋతువిశేషము, ఉష్ణము, తపము, వేసవి.
గ్రైవేయకము
సం. నా. వా. అ. న. తత్స. గ్రీవాయాం భవోలంకారో గ్రైవేయకం. మెడయందు ఉండెడి అలంకారము, హారము, మెడను పెట్టెడు సొమ్ము.
గ్లహము
సం. నా. వా. అ. పుం. తత్స. గృహ్యత ఇతి గ్లహః. పుచ్చుకొనబడినది, జూదమునందలి పందెము, పాచిక.
గ్లానుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. గ్రాయతి స్మ గ్లానః. గ్లానిని పొందిన వాడు, తెవులుగొంటు, శ్రాంతుడు.
గ్లాస్నువు
సం. విణ. ఉ. తత్స. గ్లాయతి స్మ గ్లాస్నుః. గ్లానిని పొందినవాడు, తెవులు గొంటు, శ్రాంతుడు.
గ్లౌ
సం. నా. వా. ఔ. పుం. తత్స. ప్రతి మాసం గ్లాయతి క్షయతీతి గ్లౌ. ప్రతిమాసమును క్షయించువాడు, చంద్రుడు, చందమామ.