హల్లులు : ఘ

ఘంట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. పశుభక్షణార్ధం హన్యతే ఘంటా. పశుభక్షణార్ధమై నరకబడునది, కాలపరిమాణ విశేషము, రాగ విశేషము, వాద్యవిశేషము, మొక్కపు చెట్టు, బీర, పిడికిలి.
ఘంటాపథము
సం. నా. వా. అ. పుం. తత్స. ఘంటోప లక్షితానాం గజానాం పంథాః ఘంటాపథః” . ఘంటలతో కూడిన ఏనుగులకు మార్గము, పదిబారలు వెడల్పు కల రాజమార్గము, బాట.
ఘంటారవ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఘంటాయాః రవోస్యా ఇతి ఘంటారవా. ఎండినపుడు ఘంటవంటి శబ్దము కలది, గిలగిచ్చ, శనపుష్పికా.
ఘట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఏనుగుల సమూహము, సమూహము, ఘటనము, కలుపుట, గజాలంకారము, గుంపు, ఘటన.
ఘటము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ఘటతే జలాహరణాయేతి ఘటః. జలాహరణము కొరకు ఘటించునది, కుండ, ఏనుగు కుంభస్థలము, శిఖరము, పాడునుయ్యి, ఊపిరిలోనికితీసి నిలుపుట, ఎళనీరు కాయ. ఘటతే మృదాదీ సంఘాతైః జలాదిగ్రహణాయ ఇత ఘటః. కుంభరాశి, రెండు నేహికములు.
ఘటీయంత్రము
సం. నా. వా. అ. న. తత్స. ఘటీభిః కృతం యంత్రం ఘటీయంత్రం. కడవలచేత చేయబడిన యంత్రము, ఏతము, నీళ్ళు చేదెడు రాట్నము. ఘటీనాం యంత్రం. ఉద్ఘాటనము.
ఘట్టము
సం. నా. వా. అ. పుం. తత్స. తీరము, సుంకము మొదలయినవి తీయుచోటు, వనగిరిప్రాయదేశము, రేవు.
ఘనము
సం. నా. వా. అ. పుం. తత్స. హంతి తాపమితి ఘనః. తాపమును పోగొట్టునది, తుంగముస్తె (వృక్ష విశేషము) దిటవు, మబ్బు, విరివి, సమ్మెట. హన్యత ఇతి ఘనః. కొట్టబడునది. సం. నా. వా. అ.న. తత్స హన్యత ఇతి ఘనమ్. కొట్టబడునది, కంచు తాళము, నడిమిపెరుగు. హన్యతే భిద్యతే అనేనేతి ఘనం. దీనిచేత భేదింపబడును, ఒక నృత్తగీత వాద్యము. అ. పుం. తత్స. హన్యతే అనేనేతి ఘన. దీని చేత హింసింపబడును, ఇనుపగుదియ. ఘనతి దీప్యతే ఇతి ఘనః. దార్ఢ్యము, విస్తారము. విణ. తత్స. దట్టమైనది, దిటవు కలది, మేఘము, తగరము, 32 కబలములు, యాగపు సుత్తి, గంట, వాద్యము, సంగీతంలోని మధ్యకాలము, ముఖము, కఫపువాసన, ముతుక, సమూహము, గట్టిది.
ఘనరసము
సం. నా. వా. అ. పుం. తత్స. ఘనస్య రసం ఘనరసం. మేఘము యొక్క రసము, నీళ్ళు, కర్పూరము, గుళిగ, చెట్టుబంక, మజ్జిగ, చాఁగ, ఉదకము. విణ. తత్స. దట్టమైనది.
ఘనసారము
సం. నా. వా. అ. పుం. తత్స. శీతలత్వేన ఘనతుల్యసారత్వాద్ఘనసారః. శీతలమవుట చేత ఘనము వంటి సారము కలది, కర్పూరము.
ఘనాఘనము
సం. నా. వా. అ. పుం. తత్స. హంతీతి ఘనాఘనః. చంపునది, పోవునది, కురియునట్టి మేఘము, హింసించునట్టి మదుపుటేనుగు, తొలుమొగులు, అడవి ఏనుగు, ఇంద్రుడు.
ఘర్మము
సం. నా. వా. అ. పుం. తత్స. జిఘర్తీతి ఘర్మః. కారునది, చెమట, ఎండ, ఏనుగు హృదయమునందలిమదము, వేడిమి, వేసంగికాలము.
ఘస్మరుఁడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఘసతి తాచ్ఛీల్యేన ఘస్మరః. భక్షించు స్వభావము కలవాడు, తిండిపోతు.
ఘస్రము
సం. నా. వా. అ. పుం. తత్స. ఘసత్యంధకారమితి ఘస్రః. అంధకారమును తినివేయునది, దినము. ఘసతి భక్షయతి అంధకారం ఇతి ఘస్రః. పగలు. విణ. తత్స. నొప్పించునది.
ఘాంటికుఁడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఘంటయా సమూహేన చరంతీతి ఘాంటికాః. సమూహముతో చరించువారు, వేకువను రాజుల నిద్ర మేల్కొలి పెడువాడు, బోధకరుఁడు, ఒక సంకరజాతి, గంటవాయించువాడు.
ఘాట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. శరీరమస్తకయోస్సంధింఘటతే ఘాటా. శరీరమస్తకముల యొక్క సంధిని ఘటించునది, పెడతల, పెడతలయందలి ముచ్చిలిగుంట. ఘాటా విద్యతే అస్మిన్ ఇతి ఘాటః, తతః టాప్ ఘాటా, మెడవెనుక.
ఘాతము
సం. నా. వా. అ. పుం. తత్స. హన్యతే ఘాతః. దెబ్బ, బాణము, వధ, చంపుట.
ఘాతుకుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. హంతితాచ్ఛీల్యేనేతి ఘాతుకః. స్వభావముననే చంపెడువాడు. హంతీతి ఘాతుకః. హింసించువాడు, చంపువాడు, నొప్పించువాడు, క్రూరుడు.
ఘాసము
సం. నా. వా. అ. పుం. తత్స. ఘస్యతే పశుభిరితి ఘాసః. పశువులచే తినబడునది,లేతపచ్చిక, గడ్డి.
ఘుటిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఘోటతే పరివర్తతే ఘుటికా. చుట్టువాఱి ఉండునది, కాలిగుత్తి, చీలమండ, ఏనుగు వెనుక కాలిలోని మేకు.
ఘుణము
సం. నా. వా. అ. పుం. తత్స. మ్రాను తొలుచు పురుగు. కర్రపురుగు, కులజ పరిమళము.
ఘూకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఘూ ఇతి రవం కరోతీతి ఘూకః. ఘూ అని కూయునది, గుడ్లగూబ.
ఘూర్ణితము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఘూర్ణతే ఇతస్తతో డోలాయత ఇతి ఘూర్ణితః. ఇటు అటు ఊగెడువాడు, తిరుగుడుపడినది, కూరుకుపాటుపడినది, తిరుగుట.
ఘృణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఘృణంతి సించంత్యనయేతి ఘృణా. దీనిచేత మనస్సునుద్రవయుక్తముగా చేయుదురు. జిఘర్తిక్షరతీ మనోనయేతి ఘృణా. దీని చేత మనస్సు కరుగును, కనికరము, రోత, దయ, నింద.
ఘృణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. జిఘర్త్యస్మాజ్జలమితి ఘృణిః. దీనివలన జలము జారును, కిరణము, వెలుగు. జఘర్తి దీప్యతే ఇతి ఘృణిః. జలము, పగలు, కెరటము, కీర్తి.
ఘృతము
సం. నా. వా. అ. న. తత్స. జిఘర్తీతి ఘృతం. కరుగునది, నెయ్యి, నీరు. జఘర్తి క్షరతీతి ఘృతం. ఆజ్యము, హవిస్సు, పవిత్రము, నవనీతకము, అమృతము, ఆయువు.
ఘృష్టి
సం. నా. వా. ఇ. పుం. తత్స. జిఘర్త్యస్మాజ్జలమితి ఘృష్టిః. దీని వలన జలము జారును, కిరణము,పంది.
ఘృష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. వరాహైః ఘృష్యత ఇతి ఘృష్టిః. వరాహముల చేతనొ రయబడునది, పాఁచితీగ, పోటి, రాయిడి. కులాదీన్ ఘృర్షతీతి ఘృష్టిః. ఉన్నత ప్రదేశాల నారయునది, అడవి పంది.
ఘోంట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఘుణంతి భ్రమం త్యనయా జనా ఇతి ఘోంటా. దీనిచేత జనులు భ్రమింతురు, పోక చెట్టు. “ఘుణతి వృత్తతయా భ్రమతీతి ఘోంటా” . వట్రువై తిరుగునది, రేగుచెట్టు.
ఘోటకము
సం. నా. వా. అ. పుం. తత్స. భూమౌ ఘుటతి పరివర్తత ఇతి ఘోటకః. భూమియందు పొర్లాడునది, తురగము, గుర్రము. ఘోటతే గత్వా ప్రత్యాగచ్ఛతీతి ఘోటకః. పశువిశేషము, తురంగము, వాహనశ్రేష్ఠుడు, శ్రీభ్రాత, లక్ష్మీపుత్రుడు.
ఘోణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఘుణతి భ్రమతి గంధగ్రహణాయ ఘోణా. భ్రమించునది, ముక్కు నాసిక. ఘోణతే గృహ్ణాతి వస్తుగంధం ఇతి ఘోణా. ఆబోతు, ఒక ఈగ.
ఘోణి
సం. నా. వా. న్. పుం. తత్స. స్థూలా ఘోణా స్యాస్తీతి ఘోణి. పెద్ద మోర కలది, అడవి పంది, పంది.
ఘోరము
సం. విణ. తత్స. ఘురతీతి ఘోరం. వెఱపించునది, భయంకరము. అ. పు. తత్స. నక్క, తోడేలు, కుంకుమ.
ఘోష
సం. నా. వా. అ. పుం. తత్స. ఘోషంతి గావోత్ర ఘోషః. దీని యందు గోవులు ఘోషించును, గొల్లపల్లె, ఆవులమంద, ఉరుము, కంచు, చేతిబీర (వృక్ష విశేషము), ధ్వని. ఘోషంతి శబ్దాయంతే గావో యస్మిన్ ఇతి ఘోషః.
ఘోషకము
సం. నా. వా. అ. పుం. తత్స. శుష్కదశాయాం ఘోషయతీతి ఘోషకః. ఎండినపుడు ఘోషించునది, చేతీ బీర (వృక్ష విశేషము)
ఘోషణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఘుష్యత ఇతి ఘోషణా. పలుకబడునది, చాటించుట.
ఘ్రాణతర్పణము
సం. నా. విణ. (అ.ఆ.అ). తత్స. ఘ్రాణం నాసికా తృప్యత్యనేన ఘ్రాణ తర్పణః. నాసిక దీనిచేత తృప్తిపొందును, మంచి వాసన కలది.
ఘ్రాణము
సం. నా. వా. అ. న. తత్స. జిఘ్రతి అనేన ఘ్రాణం. దీనిచేత వాసన గ్రహింతురు, ముక్కు, నాసిక.
ఘ్రాతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. ఘ్రాయతే స్మ ఘ్రాతం. మూర్కొనబడినది.
ఘ్రోణము
సం. విణ. తత్స. ఘ్రాయతే స్మ ఘ్రాణం. మూర్కోనబడినది. అగ్రాణించు, ముక్కు, వాసనచూడబడినది.