హల్లులు : చ

చంచరీకము
సం. నా. వా. అ. పుం. తత్స. చరతీతి చంచరీకః. చరించుచుండునది, భృంగము, తుమ్మెద. చరతి పునః పునరితి చంచరీకః.
చంచల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చంచతీతి చంచలా. కదలునది, మెఱపు, లక్ష్మి.
చంచలము
సం. నా. వా. అ. పుం. తత్స. గాలి, మందపిచ్చుక.
చంచలము
సం. నా. వా. విణ. తత్స. చంచతి చలతీతి చంచలం. కదలునది, చలించునది. చంచం గతిం లాతీతి చంచలం. చలనమ, కంపనము, లోలము, చలాచలము, చపలము.
చంచువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చంచతి వాయునా చంచుః. వాయువు చేత కదలునది, ఆముదపు చెట్టు. చంచతి ప్రాప్నోతి గృహ్ణాతి భక్ష్యమనయా ఇతి చంచుః.
చంచువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. చంచతి చలతి ఆహారగ్రహణే చంచుః. ఆహారగ్రహణమందు కదలునది, పక్షిముక్కు.
చండ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. తీక్ష్ణత్వాత్ చండా. తీవ్రమైనది, నల్ల కచోరము, బలురక్కెస (వృక్ష విశేషము).
చండాతకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చండం గుహ్యస్థానమతతీతి చండాతకం. గుహ్యస్థానమును ఎల్లప్పుడు పొంది ఉండునది, వేశ్యల చల్లడము, (కబ్బా), చిన్నఅంగి.
చండాతము
సం. నా. వా. అ. పుం. తత్స. చండం తీక్ష్ణమతతీతి చండాతః. ఉష్టమైనది కనుక తీవ్రముగా పోవునది, ఎర్రగన్నేరు.
చండాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చండతే కుప్యతి క్రూరకర్మ వత్త్వేనేతి చండాలః. క్రూరకర్ముడవుట చేత కోపగించుకొనువాడు, మాలవాడు. చండతే కుప్యతీతి చండాలః. వర్ణసంకరజాతివిశేషము, ప్లవము, నిషాదుడు, చండాలుడు, కోపగించుకొనువాడు.
చండిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చండతి కుప్యతీతి చండీకా. కోపము కలది, పార్వతి, గట్రాచూలి.
చండుడు
సం. విణ. తత్స. చండతి కుప్యతీతి చండః. మిక్కిల కోపగించుకొనువాడు, ఒకానొక రాక్షసుడు, వాడిమి కలవాడు, యమకింకరుడు, వేడిది, తీవ్రము.
చందన
సం. నా. వా. ఆ. స్తీ. తత్స. చందదుతి సుగంధేన ఆహ్లాదయతీతి చందనా. పరిమళము చేత సంతోషింప చేయునది, మామెన చెట్టు.
చందనము
సం. నా. వా. అ. పుం. అ. న. తత్స. చందయతీతి చందనః. ఆహ్లాదమును చేయునది, గందము, చందనము. చందయతి ఆహ్లాదయతి ఇతి చందనః,చందనం. వృక్షవిశేషము, గంధసారము, మలయజము, శ్రీఖండము, మంగల్యము, మలయోద్భవము, శీతలము, పావనము, హితము, భద్రాశ్రయము, కుంకుమపువ్వు.
చంద్రకము
సం. నా. వా. అ. పుం. తత్స. చంద్ర ఇవ చంద్రకః. చంద్రాకారమై ఉండునది, నెమలిపురికన్ను.
చంద్రబాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చంద్రస్య బాలేవ పుత్రికేవ చంద్రబాలా. కర్పూరమునకు కూతురి వలె ఉండునది, పెద్ద ఏలకి (వృక్షవిశేషము.).
చంద్రభాగము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చంద్రస్య భాగతోన్యస్తా చంద్రభాగా. చంద్రుని యొక్క భాగమున పుట్టినది, ఒకానొక ఏరు.
చంద్రశేఖరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చంద్రః శేఖరః శిరోభూషణం యస్య సః చంద్రశేఖరః. చంద్రుడు శిరోభూషణముగా కలవాడు, శివుడు, నెలతాల్పు.
చంద్రసంజ్ఞము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆహ్లాదకత్వేన చంద్రస్య సంజ్ఞా యస్య సః చంద్రసంజ్ఞః. ఆహ్లాదకరమవుట చేత చంద్రుని యొక్క పేర్లు తనకు పేర్లుగా కలది, కర్పూరము.
చంద్రహాసము
సం. నా. వా. అ. పుం. తత్స. చంద్రవత్ హసతి ప్రకాశతే చంద్రహాసః. చంద్రునివలె ప్రకాశించునది, కత్తి, రావణుని కత్తి.
చంద్రిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చంద్రోస్త్యస్యామితి చంద్రికా. చంద్రయుక్తమైనది, వెన్నెల, కుసుమ పువ్వు. చన్ద్రః ఆశ్రయత్వేన అస్త్యస్యాః. జ్యోత్స్న, కౌముది, చంద్రభాసానది.
చంద్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చందయతీతి చంద్రః. సంతోషింపచేయువాడు, చంద్రుడు. రోగ హరణేన చందయతి ఆహ్లాదయతీతి చంద్రః. రోగ హరణము చోత సంతోష పెట్టునది, కంపిల్లము (వృక్ష విశేషము). చంద్రయతీతి చంద్రః. ఆహ్లాదమును చేయునది, బంగారు, కర్పూరము, నీళ్ళు. చందయతి ఆహ్లాదయతి, చందతి దీప్యతి ఇతి వా చంద్రః. దేవతావిశేషము, హిమాంశువు, ఇందువు, కుముదబాంధవుడు, సుధాంశువు, శుభ్రాంశువు, నిశాపతి, కలానిధి, ద్విజరాజు, శశిధరుడు, నక్షత్రేశుడు, క్షపాకరుడు, దోషాకరుడు, శీతరశ్మి, శ్వేతవాహనుడు, ఒకలత, ఒక కలువ.
చంద్రుముడు
సం. నా. వా. స్. పుం. తత్స. చంద్రేణ కర్పూరేణమీయతే ఉపమీయత ఇతి చంద్రమాః. కర్పూరముతో పోల్చబడువాడు, చంద్రుడు.
చంపకము
సం. నా. వా. అ. పుం. తత్స. చమ్యతే అళిభిరితి చంపకః. తుమ్మెదల చేత ఆస్వాదింపబడునది, సంపెంగ చెట్టు.
చకోరకము
సం. నా. వా. అ. పుం. అ. స్త్రీ. తత్స. చకతి తృప్యతి జ్యోత్స్నయా చకోరకః . వెన్నెల చూచి తృప్తి పొందునది, వెన్నెల పులుగు. చకతే చంద్రకిరణైః తృప్యతీతి చకోరః. పక్షివిశేషము, చకోరపక్షి.
చక్రకారకము
సం. నా. వా. అ. పుం. తత్స. చక్రం ధూపద్రవ్యమేళనం కరోతీతి చక్రకారకం. ధూపద్రవ్య మేళమును చేయునది, నఖమను గంధ ద్రవ్యము, పులిగోరు (వృక్ష విశేషము), ఒక ఆకుకూర.
చక్రపాణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. చక్రం పాణౌ యస్య సః చక్రపాణిః. చక్రము హస్తమునందు కలవాడు, విష్ణువు, చుట్టుకైదువుతాల్పు.
చక్రమర్దకము
సం. నా. వా. అ. పుం. తత్స. “చక్రాణి దద్రుమండలాని మృద్నాతీతి చక్రమర్దకః. దద్రుమండలములను మర్దించునది, తగిరస చెట్టు. చక్రం దద్రురోగవిశేషం ముద్నాతీతి చక్రమర్దకః.
చక్రము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చకతే తర్పయతి ప్రియామితి చక్రః. ప్రియురాలిని ప్రీతి పొందించునది, జక్కవ పిట్ట. కరోతి రథ గమనమితి చక్రం. రధగమనమును చేయునది, బండికల్లు. చకతి హంతి పరబలమితి చక్రం. పరబలమును హింసించునది. కరోతి జయమితి వా చక్రం. జయమును చేయునది, సేన. క్రియత ఇతి చక్రం. చేయబడునది. చకతీతి చక్రం. తృప్తి చేయునది, ఆయుధ విశేషము, గుంపు, దండు, రాష్ట్రము, గ్రామ పువళుకు, కుమ్మరిసారె, నీటిసుడి, చిన్ననాణెము, బొల్లి, సంసారము, వర్తులము, గుండ్రనిది, వంచన, బత్తెము కలవాడు.
చక్రల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చక్రాకారం లాతీతి చక్రలా. చక్రాకారమును పొందిఉండునది, వట్రువముస్త(వృక్ష విశేషము).
చక్రవర్తి
సం. నా. వా. న్. పుం. తత్స. చక్రం రాష్ట్రం స్వామిత్వేన వర్తయతీతి చక్రవర్తీ. స్వామిత్వము చేత భూచక్రమును వర్తింపచేయువాడు, సార్వభౌముడు, రారాజు. చక్రం పద్మాకారశుభచిహ్నం కరే వర్తతే యస్య సః చక్రవర్తీ.
చక్రవర్తిని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చక్రే శాకగణే వర్తత ఇతి చక్రవర్తినీ. శాకసమూహమందు వర్తించునది, సార్వభౌమురాలు, కోరింద చెట్టు, ఒక ఆకుకూర.
చక్రవాకము
సం. నా. వా. అ. పుం. తత్స. చక్రేణ చక్రశబ్దేన ఉచ్యత ఇతి చక్రవాకః. చక్ర శబ్దము చేత చెప్పబడునది, జక్కవ పక్షి, ఒక పక్షి.
చక్రవాళము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చక్రాకారేణ వలతే సంవృణోతీతి చక్రవాళః. చక్రాకారమున భూమిని చుట్టి ఉండునది, చుట్టుకొండ. చక్రన్యేవ వాళః సంవరణమన్యేతి చక్రవాళం. చక్రము వంటి వలయము కలిగినది, మండలము. చక్రాకారేణ వాలతే వర్తతే చక్రవాళం. చక్రాకారముగా ఉండునది, గుంపు. చక్రమివ వాడతే వేష్టయతీతి చక్రవాలం. సమూహము.
చక్రాంగము
సం. నా. వా. అ. పుం. అ. స్త్రీ. తత్స. చక్రవత్ వృత్తమంగమన్యేతి చక్రాంగః. చక్రము వలె వట్రువయైన అంగము కలది, జక్కవ, హంస.
చక్రాంగీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చక్ర మంగమస్య చక్రాంగీ. ఆడుహంస, కటుకరోహిణి.
చక్రి
సం. నా. వా. న్. పుం. తత్స. శిరసి చక్రయోగాచ్చక్రీ. శిరస్సునందు చక్రము కలిగినది, రారాజు, కుమ్మరి. చక్రం మండలాకారతా అస్యాస్తీతివా చక్రీ. మండలాకారమై ఉండునది, విష్ణువు, జక్కవ, పాము. ఫణా అస్త్యస్య ఇతి చక్రీ. గృహస్ధు.
చక్రీవంతము
సం. నా. వా. త్. పుం. తత్స. చక్రం సమూహస్తద్వంతః చక్రీవంతః. గుంపై ఉండునవి, గార్దభము, గాడిద.
చక్షువు
సం. నా. వా. స్. న. తత్స. చష్టే వస్తుస్వరూపం వక్తి చక్షుః. వస్తు స్వరూపమును చెప్పునది, నేత్రము, కన్ను, దర్శనేంద్రియము, లోచనము, నయనము, ఈక్షణము, అక్షి, దర్శనము, విలోచనము, ప్రేక్షణము, దేవదీపము.
చక్షుశ్శ్రవము
సం. నా. వా. స్. పుం. తత్స. చక్షుర్భ్యాం శృణోతీతి చక్షుశ్శ్రవాః. కన్నుల తోటి వినునది, పాము, కనువినికి, బృహస్పతి.
చక్షుష్య
సం. నా. వా. అ. పుం. తత్స. మొగలి, పుండరీకము అను చెట్టు.
చక్షుష్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చక్షుషే హితా చక్షుష్యా. కండ్లకు హితమైనది, అందగత్తెఅగుఆడది, కనుపాల, తుమ్మ.
చటక
సం. నా. వా.ఆ. స్త్రీ. తత్స. చటకస్య స్త్రీ చటకా. ఆడ పిచ్చుక, ఆడ పిచ్చుక పిల్ల, పిప్పలివేరు. చటకస్య చటకాయా వా స్త్రీ అపత్యం చటకా. కోడి, పిచ్చుక.
చటకము
సం. నా. వా. అ. పుం. తత్స. చటతి ధాన్యాదికమితి చటకః. ధాన్యాదులను పొడిచితినునది, పిచ్చుక. చటతి భినత్తి ధాన్యాదికం చంచుపుటేనేతి చటకః.
చటకాశిరము
సం. నా. వా. స్. న. తత్స. చటకాశిరోరూపత్వాత్ చటకాశిర. పిచ్చుక తలవలె ఉండునది, పిప్పలి వేరు.
చణకము
సం. నా. వా. అ. త్రి. తత్స. చణ్యతే దీయత ఇతి చణకః. ఇయ్యబడునది, శనగలు.
చతురంగుళము
సం. నా. వా. అ. పుం. తత్స. చతురంగుళ పర్ణపర్వకత్వాచ్చతురంగుళః. నాలుగు అంగుళములు కలిగిన ఆకులు కల కనుపులు కలది, ఱేల చెట్టు.
చతురాననుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చత్వారి ఆననాని యస్యసః చతురాననః. నాలుగు ముఖములు కలవాడు, బ్రహ్మ , నలువ.
చతురుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. చతతే కాంక్షతే ప్రయోజనమితి చతురః. ప్రయోజనమును కాంక్షించువాడు, నేర్పరి. చత్యతే యాచ్యతే ఇతి చతురః. కార్యక్షముడు, నిరాలస్యుడు, దక్షుడు, పటువు, నిపుణుడు, గజశాల, ఒక అభినయ హస్తవిశేషము, తెలివైనవాడు, చిన్నబొమముడి.
చతుర్భద్రము
సం. నా. వా. అ. న. తత్స. చతుర్ణాం భ్రద్రాణాం సమూహశ్చతుర్భద్రం. శుభ స్వరూపములైన నాలుగింటి కూటమి, బలయక్తములైన ధర్మార్థకామమోక్షములు, నాలుగు పురుషార్ధములు కలవాడు.
చతుర్భుజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చత్వారో భుజా యస్యసః చతుర్భుజః. నాలుగు భుజములు కలవాడు, విష్ణువు, ఉడ్డకేలు వేలుపు.
చతుర్వర్గము
సం. నా. వా. అ. పుం. తత్స. చతుర్ణాం వర్గః చతుర్వర్గః. ధర్మార్థకామమోక్షముల సమూహము.
చతుర్వాయని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చత్వారోహాయనాః ప్రమాణమస్యాః చతుర్వాయణీ. నాలుగేళ్ళు ప్రమాణముగా కలిగినది, నాలుగేండ్ల ఆవు.
చతుష్పథము
సం. నా. వా. అ. న. తత్స. చతుర్ణాం పథాం సమాహారశ్చతుష్పథం. నాలుగు త్రోవలు కూడినది, చదుకము.
చత్వరము
సం. నా. వా. అ. న. తత్స. అత్ర స్థిత్వా యాచకైః చత్యత ఇతి చత్వరం. దీనియందుండి యాచకులు అడుగుదురు, ముంగిలి. చతంతే యాగఫలమత్రేతి చత్వరం. దీని యందు యాగ ఫలమును అడుగుదురు, వ్రతము పూనిన వానికి పండుకొనుటకు చక్కబరిచిన భూమి, అగ్నిహోత్రమును ఉంచుటకై సంస్కరించిన స్థానము, బుద్ధి, వీధి.
చపల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చోపతీతి చపలా. మెల్లగా పోవునది, మెఱుపు. చపలః ఉష్ణోరసః తద్యోగాచ్చపలా. ఉష్టరసము కలిగినది,పిప్పలి, లక్ష్మి, ఱంకుటాలు.
చపలము
సం. నా. వా. అ. న. తత్స చోపత్యనేనేతి చపలం. దీని చేత జనులు చపలమౌను, త్వరితము, తొందర, తెల్లగులాబి, ధూపము, చంచలము.
చపలము
సం. నా. వా. అ. పుం. తత్స. అస్థిరత్వా చ్చపలః. ఒక దిక్కున నిలువనిది, కోతి, చేప, చేలుపరాయి, పాదరసము, కదలునది, నిలకడలేనిది, వడికలది. చోపతి మందం మందం గచ్ఛతీతి చపలః. చంచలము, ధూర్తుడు, వేగముగల, వేగముగా.
చపేటము
సం. నా. వా. అ. పుం. తత్స. చప్యతే పుత్త్రాదిస్సాంత్వ్యతే అనేన చపేటః. దీనిచేత పుత్రాదులు ఊరడింపబడుదురు, చాచివేళ్ళుగల అరచేయి.
చమరము
సం. నా. వా. అ. పుం. తత్స. చమతి తృణం చమరః. తృణములను భక్షించునది, సవరపు మెకము, ఒకమృగము.
చమరికము
సం. నా. వా. అ. పుం. తత్స. చమర సదృశమంజరీత్వాచ్చమరికః. జూలుల వంటి పూలగుత్తులు కలది, కాంచన చెట్టు, కోవిదారము.
చమసము
సం. నా. వా. అ. పుం. తత్స. చతురస్రమైన యజ్ఞపాత్రము, పక్షిపిల్ల, యాగసాధనము.
చమసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సోపు పిండి.
చమువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. చమతి హినస్త్యరీన్ చమూః. శత్రువులను సంహరించునది, సేన, 729 రథములు అన్ని ఏనుగులు 2187 గుఱ్ఱములు 3447 కాలిబంట్లకలసేన.
చమూరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చమ్యతే చమూరుః. భక్షింపబడునది, ఆస్తరణాదులకుపయోగించు చర్మమునకు కారణమైన యిఱ్ఱిజాతి విశేషము, ఒక జింక.
చయము
సం. నా. వా. అ. పుం. తత్స. చీయతే పాషాణాదిభిరతి చయః. పాషాణాదుల చేత కట్టబడునది. చీయతే చయః. కూర్పబడునది, సమూహము, కోటకొఱడు, సంగ్రహము, గుంపు.
చరకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. వైద్యశాస్త్రము, కూర్చిన రెండు వస్త్రములు.
చరణము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చరత్యనేన చరణః. దీని చేత సంచరింతురు, పాదము, వేరు, ఋగ్వేదాది, కులము, తినుట, తిరుగుట, నడవడిక, మంచిశీలము, పద్యపాదము, వేద శాఖాధ్యేత.
చరణాయుధము
సం. నా. వా. అ. పుం. తత్స. చరణా వేవాయుధం యస్యసః చరణాయుధః. కాళ్ళే ఆయుధముగా కలది, కోడి, అజ్జవాలు.
చరమము
సం. విణ. తత్స. చరత్యంతం గచ్ఛతీతి చరమం. కడను పొందునది, కడపటిది, పడమటిది, చివఱిది.
చరము
సం. నా. వా. అ. పుం. తత్స. విణ. తత్స. చరతీతి చరః. చరించువాడు. చరతీతి చరం. నడచునది, కదలునది, తిరుగునది, ఒకానొక జూదము. చరతి స్వపరరాష్ట్రస్య శుభాశుభజ్ఞానాయ భ్రామ్యతీతి చరః. చంచలము.
చరాచరము
సం. విణ. తత్స. భృశం చరతీతి చరాచరం. సంచరించునది, తిరుగునది, తిరుగనిది, స్థావర జంగమములు.
చరిష్ణువు
సం. విణ. ఉ. తత్స. చరతి తాచ్ఛీల్యేనేతి చరిష్ణు. చరించు స్వభావము కలది, తిరుగునది, జంగమము.
చరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చరన్తి దేవా ఇమమితి చరుః. దేవతలు దీనిని భక్షింతురు, హవ్యము, హవ్యము వండెడు కుండ, హవిస్సు, పాత్ర.
చర్చ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చర్చ్యతే అనయేతి చర్చా. దీనిచేత విచారింపబడును. చర్చనం చర్చా. పూయుట, విచారము, చింత, చేతనిడిన కుంకుమ. చర్చ్యతే విచార్యతే వేదవేదాంతాది శాస్త్రైరసౌ ఇతి చర్చా. పార్వతి చేటి, సుగంధలేపనము, జారిణి, చర్చించుట, మైపూత.
చర్చరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చప్పట, ధ్వని.
చర్చిక్యము
సం. నా. వా. అ. న. తత్స. చర్చికాయాం సాధు చర్చిక్యం . పూయుటయందు మంచిది, కుంకుమములోనగువాని పూత, మైపూత.
చర్మకష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చర్మ కషతీతి చర్మకషా. పూయబడినదై దుష్ట చర్మమును చెరచునది, సంబరేని చెట్టు.
చర్మకారము
సం. నా. వా. అ. పుం. తత్స. చర్మ కరోతి వికారతామాపాదయతీతి చర్మకారః. తోళ్ళను పాదరక్షాది వికారమును పొందించువాడు, సంబరేని చెట్టు, ఒక సంకరజాతి.
చర్మప్రసేవిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చర్మరూపా ప్రసేవికా చర్మప్రసేవికా. చర్మరూపమున అగ్నిని ప్రకాశము అగునట్లు చేయునది, కొలిమితిత్తి, భస్త్ర.
చర్మము
సం. నా. వా. న్. న. తత్స. చరతి కటి ప్రదేశమితి చర్మ. కటి ప్రదేశమును పొందునది. చర్మణా బద్ధత్వాత్ చర్మ. తోలు చేత కప్పబడినది, కేడెము, తోలు, ఒక జింక, డాలు.
చర్మి
సం. నా. వా. న్. పుం. తత్స. చర్మాకార పత్రయోగాచ్చర్మీ. చర్మము వంటి ఆకులు కలది, భుజపత్రము (వృక్ష విశేషము). చర్మ ఫలకమస్యాస్తీతి చర్మీ. కేడెము ధరించినవాడు, శివుని పూజారి, భూర్జపత్రము, డాలు కలవాడు.
చర్య
సం. నా. వా. ఆ. పుం. తత్స. చరణం చర్యా. చరించుట, నడచుట, నిలుచుట, కూర్చుండుట, వండుకొనుటలయందు సమాహితుడగుట, ఈర్య, తపస్సు.
చర్వణ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ప్రాణినాం త్వచం చర్వతీతి చర్వణా. ప్రాణులయొక్క చర్మమును తినునది, ఈగ.
చర్వితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. చర్వ్యతే స్మ చర్వితం. భుజింపబడునది, నమలబడినది.
చలదళము
సం. నా. వా. అ. పుం. తత్స. నిత్యం చలతి దళాని యస్యసః చలదళః. ఎల్లప్పుడు కదులుచుండెడి ఆకులు కలది, రావి చెట్టు.
చలనము
సం. నా. వా. అ. న. తత్స. చలతి తాచ్ఛీల్యేనేతి చలనం. స్వభావమునే చలించునది, కదలునది, కదలుట, తిరుగుట, చల్లడము, అడుగు, యంత్రము.
చలము
సం. విణ. తత్స. చలతీతి చలం. కదులునది, వణుకు కలిగినది.
చలాచలము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. చలతీతి చలాచలం. కదలునది, చంచలము.
చలితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. చాల్యతే స్మ చలితః. కదలింపబడినది, ముట్టడి, కదిలినది.
చవిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చర్వ్యతే చవికా. భక్షింపబడునది, చవ్యము (వృక్ష విశేషము), ఒక మిరియము.
చవ్యము
సం. నా. వా. అ. న. తత్స. చర్వ్యతే చవ్యం. భక్షింపబడునది, మందుదినుసు, ఒక మిరియము.
చషకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చషంతి పిబంతి సురామత్రేతి చషకః. దీనియందు పానము చేయుదురు, కల్లుత్రాగెడు గిన్నె, గిన్నె, గిండి, ఒక దినుసు కల్లు, పానపాత్ర.
చషాలము
సం. నా. వా. అ. పుం. తత్స. కటకాకృతిత్వేన చష్యతే చషాలః. వలయాకారముగా చెక్కబడునది, యూపస్తంభాగ్రమున వేయబడు దారుమయమైన కడియము, కఱ్ఱ, చక్రము.
చాంగేరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దంతానాం చాంగం పటుత్వమీరయతీతి చాంగేరీ. దంతముల యొక్క పటుత్వమును పోగొట్టునది, పులిచింతచెట్టు.
చాండాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చండాలన్యేయం చాండాలికా. చండాల సంబంధమైనది, మాలవీణ, కిన్నెర, చండాలవీణ.
చాంపేయము
సం. నా. వా. అ. పుం. తత్స. చంపాఖ్యదేశే భవః చాంపేయః. చంపయను దేశమందు పుట్టినది, సంపెంగ, అకరువు, నాగకేసరము.
చాక్రికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చక్రేణ సమూహేన చరంతీతి చాక్రికాః. సమూహముతో చరించువారు, వేకువను రాజులను నిద్ర మేల్కొలుపువాడు, గాండ్లవాడు, ఒక సంకరజాతి, తెలకలి, నూనె, గంటవాయించువాడు.
చాటకైరము
సం. నా. వా. అ. పుం. తత్స. చటకయోః అపత్యం పుమాన్ చాటకైరః. పిచ్చుకలయొక్కమగపిల్ల, ఏట్రింత.
చాతకము
సం. నా. వా. అ. పుం. తత్స. వర్షోదకం చతతీతి చాతకః. వర్షోదకమును యాచించునది, వానకోయిల, ఒక పక్షి.
చాతుర్వర్ణ్యము
సం. నా. వా. అ. న. తత్స. చత్వారో వర్ణాః చాతుర్వర్ణ్యం. నాలుగు జాతులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములు.
చాపము
సం. నా. వా. అ. పుం. తత్స. చపస్య వేణోర్వృక్షవిశేషస్య వా వికారశ్చాపః. వేణు విశేషము లేదా వృక్ష విశేషము చేత చేయబడునది, ధనుస్సు, విల్లు, ఇల్లు.
చామరము
సం. నా. వా. అ. న. తత్స. చమరమృగ సంబంధి చామరం. చమర మృగ సంబంధమైనది, వింజామరము, కురువేరు.
చామీకరము
సం. నా. వా. అ. న. తత్స. చామికరఖ్యాకరోద్భవత్వాచ్చామీరకం. చామీకరం అను గని యందు పుట్టినది, బంగారం, కనకము, సువర్ణము.
చాముండ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చాముండ నామాసుర సంహారిణీ చాముండా . బ్రాహ్మి మొదలగు శక్తి, చాముండ అను పేరు గల రాక్షసుని సంహరించునది కనుక చాముండీ, ఒక మాతృక, పార్వతీదేవి.
చార
సం. నా. వా. అ. పుం. తత్స. చర్యతే భక్ష్యతే కోపద్వేషాదివశాదితి చారః. అపసర్పము, కారాగారము. చరతి జానాతీ పరబలమితి చారః. పరబలమును ఎరిగినవాడు. మందం చరత్య నేనేతి చారః. దీనిచేత మెల్లగా నడుతురు, నడ, చర, చారుడు, అంగణము.
చారటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చరతి వ్యాప్నోతీతి చారటీ. వ్యాపించునది, మెట్టతామర (వృక్ష విశేషము), ఒక తీగ.
చారణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దిగంతేషు కీర్తిం చారయంతీతి చారణాః. దిగంతములయందు కీర్తిని నెగడ చేయువారు, నానాదేశ సంచారకుడైన నట్టువుడు, దిక్కుల యందు సంచరించు బట్టువారు. చారయతి ప్రచారయతి నృత్యగీతాదివిద్యాం తజ్జన్యకీర్తిం వా ఇతి చారణః. నటుడు, ఒకజాతి కేచరుడు.
చారువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చరతి మనోస్మిన్నితి చారు. దీని యందు మనస్సు సంచరించును, బృహస్పతి, ఒప్పిదమైనది. చరతి దేవేషు గురుత్వేన, చరతి చిత్తే ఇతి వా చారుః. సుందరము, అద్భుత భాషణము.
చార్చిక్యము
సం. నా. వా. అ. న. తత్స. చర్చికాయాం సాధు చార్చిక్యం. పూయుట యందు మంచిది, కుంకుమలోనగు వాని పూత, చేతవిడిన కుంకుమములోనగునది.
చాలని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చాల్యతే అనయా చాలనీ. దీనిచేత ధాన్యాదులు త్రిప్పబడును, జల్లించెడు జల్లెడ.
చాషము
సం. నా. వా. అ. పుం. తత్స. చషతీతి చాషః. భక్షింపబడునది, పాలపిట్ట, కికీదివి. చాషయతి భక్షయతి కర్ణాదికమితి చాషః. నీలకంఠుడు.
చించ
సం. నా. వా. అ. న. తత్స. చికినపు వక్క.
చించ
సం. నా. వా. అ. పుం. తత్స. చుంచెలుక.
చించ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చించిమాయతే ముఖమనయేతి చించా. దీని చేత ముఖము చిమచిమమనును, చింత (వృక్ష విశేషము), పోక.
చింత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చింత్యతే చింతా. చింతించుట, తలపు, నగపు. చింతనమితి చింత. చింతనం, స్మృతి.
చికిత్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చికిత్సంత్యనయా చికిత్సా. దీనిచేత వ్యాధికి ప్రతీకారము చేయుదురు, ప్రతిక్రియ, ఉపచర్య, రోగప్రతీకారము, ఉపచారము, నిగ్రహము, శమము, వైద్యము.
చికిత్సకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చికిత్సతి చికిత్సకః. చికిత్స చేయువాడు, వైద్యుడు, వెజ్జ. చికిత్సతి రోగమపనయతీతి చికిత్సకః.
చికురము
సం. నా. వా. అ. పుం. తత్స. చిన్వన్ వర్ధమానః కుర్యతే ఛిద్యత ఇతి చికురః. వృద్ధి పొందుచు ఖండింపబడునది, వెండ్రుక, కొండ, పక్షి విశేషము, పాము, ముంగిస, వృక్షవిశేషము, కదలునది. చకతి తృప్యతి స్వకర్మణేతి చికురః. తాను చేసిన ప్రయోజనము చేత తృప్తి పొందువాడు, చంచలము, ముంగురులు.
చిక్కసము
సం. నా. వా. అ. న. తత్స. యవలపిండి, వరిపిండి.
చిత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చీయంతే కాష్ఠాని పుంజీక్రియంతేత్ర చితా. కాష్ఠములు దీనియందు ప్రోవులుగా చేయబడును, సోద, ప్రోగు. చీయతే శ్మశానాగ్నిరస్యాం ఇతి చిత. చితి.
చిత
సం. నా. వా. విణ. తత్స. చేర్చబడినది, కప్పబడినది.
చితి
సం. నా. వా.ఇ. స్త్రీ. తత్స. చీయంతే కాష్ఠాని పుంజీక్రియంతేత్ర చితి. కాష్ఠములు దీనియందు ప్రోవులుగా చేయబడును, సొద, ప్రోగు, చితి, జ్ఞానము.
చిత్తము
సం. నా. వా. అ. న. తత్స. చేతయతీతి చిత్తం. తెలియ చేయునది, మనసు, మానసము, మది.
చిత్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చీయంతే కాష్ఠాని పుంజీక్రియంతేత్ర చిత్యా. కాష్ఠములు దీనియందు ప్రోవులుగా చేయబడును, సొద. చీయతే అగ్నిరస్యాం ఇతి చిత్య. చితి.
చిత్ర పర్ణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చిత్రరూపాణి పర్ణాన్యస్యాశ్చిత్ర పర్ణీ . చిత్రములైన ఆకులు కలది, కోలపొన్న చెట్టు, పెద్దమల్లె.
చిత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నానా వర్ణత్వాచ్చిత్రా. నానా వర్ణములైన ఆకులుకలది. చిత్రరూపఫలత్వాచ్ఛిత్రా. నానావర్ణములైన ఫలములు కలది, ఒక నక్షత్రము, మాయ, ఎలుక జీడి, గుమ్మడి, పిన్నపాపర, బుడమ (వృక్ష విశేషము), హేమంత రాత్రి, ఎలుక చెవిచెట్టు, చేదుబీర, ఒకవీణ, చూడు.
చిత్రకము
సం. నా. వా. అ. న. తత్స. చిత్రయతి చిత్రకం. చిత్రమై ఉండునది, బొట్టు, తిలకము.
చిత్రకము
సం. నా. వా. అ. పుం. తత్స. చిత్రవర్ణత్వాచ్చిత్రకః. చిత్రమైన వర్ణము కలది, ఆముదపు చెట్టు. నానారూపత్వాద్వా చిత్రకః. నానారూపమై ఉండునది. చిత్చేతంతీతి చితః జంతవస్తాన్ వ్యాధిత స్త్రాయత ఇతి చిత్రకః. జంతువులను వ్యాధుల నుండి రక్షించునది, చిత్రమూలము, వ్యాఘ్రము, ఒక పాము, మిశ్రమము, చిరుతపులి, గుమ్మడి.
చిత్రకారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చిత్రం కరోతీతి చిత్రకరః. చిత్తరువును వ్రాయువాడు, ముచ్చి.
చిత్రకృత్
సం. నా. వా. త్. పుం. తత్స. లఘుత్వేపిదార్ఢ్య ధైర్ఘ్యాభ్యామాశ్చర్య కారిత్వాచ్చిత్రకృత్. చులకనై ఉండి కూడా దృఢమై దీర్ఘమై ఉండుట చేత ఆశ్చర్యమును చేయునది, తినాసము (వృక్ష విశేషము). చిత్రం నానావర్ణం కరేతి ఇతి చిత్రకృత్. చిత్రకారుడు.
చిత్రతండుల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చిత్రాస్తండులా స్సూక్ష్మబీజాన్యస్యాశ్చిత్రతండులా. నానా విధములై సన్న విత్తులు కలది, వాయువిడంగ చెట్టు.
చిత్రభానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః. అనేక విధకాంతులుకల జిహ్వరూపములైన కిరణములు కలవాడు, అగ్ని, సూర్యుడు.
చిత్రము
సం. నా. వా. అ. న. తత్స. చిత్రయతీతి చిత్రం. ఆశ్చర్యమును చేయునది, ఆశ్చర్యము, చిత్తరువు, నానావర్ణము, బొట్టు.
చిత్రము
సం. విణ. తత్స. చీయంతే వర్ణా అత్రేతి చిత్రం. దీనియందు అన్నివర్ణములు కూర్చబడును, నానావర్ణములుకలది, ఆశ్చర్యకరమైనది, అద్భుతము, ఒక చేప, తిలకము, చిత్తరువు, మిశ్రమము, శుభద్ర, ఒక నక్షత్రము.
చిత్రశిఖండిజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అంగిరా ఏవ చిత్రశిఖండీ తస్మాజ్జాతః చిత్రశిఖండిజః. అంగిరస్సు కొడుకు, బృహస్పతి.
చిత్రశిఖండులు
సం. నా. వా. న్. పుం. తత్స. చిత్రాశ్శిఖండాః చూడావిశేషాః ఏషాంసంతీతి చిత్రశిఖండినః. చిత్రములైన జటావిశేషములు కలవారు, మరీచ్యాది సప్తమహర్షులు.
చిపిటకము
సం. నా. వా. అ. పుం. తత్స. నితరాం భవతీతి చిపిటకః. ఘనమవునట్టిది, అటుకులు, వేపుడు.
చిబుకము
సం. నా. వా. అ. న. తత్స. చీవతి చేవ్యతే వా చిబుకం. కమ్ముకొని ఉండునది, గడ్డము, అధర అధోభాగము.
చిరంటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చిరేణాటతీ పితృగేహాద్భర్తృగేహం చిరంటీ. చాలాకాలమునుకు అత్తింటికి పోవునది, జవరాలు, ఐదువరాలు, మత్తెందువు.
చిరంతనము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. చిరం భవతీతి చిరంతనః. పూర్వమందు పుట్టినది, బహుదినములది, పాతది, ప్రాచీనము.
చిరక్రియుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. చిరం క్రియా అన్యేతి చిరక్రియః. తడవుగా కార్యము చేయువాడు, తామసించి కార్యము చేయువాడు, ఆలోచించి చేయువాడు.
చిరజీవి
సం. నా. వా. న్. పుం. తత్స. చిరం జీవతీతి చిరజీవీ. చాలాకాలము బ్రతుకునది, కాకి, విష్ణువు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః.
చిరము
సం .అవ్య. తత్స. బహుకాలము.
చిరాయువు
సం. నా. వా. స్. న. తత్స. చిరమాయుర్యస్య చిరాయుః. చిరకాలముండునది, బూరుగుచెట్టు, వేల్పు.
చిరిబిల్వము
సం. నా. వా. అ. పుం. తత్స. చిరేణ రోగం బిలతీతి చిరిబిల్వః. చిరకాల రోగమును భేదించినది, కానుగు చెట్టు.
చిలిచిమము
సం. నా. వా. అ. పుం. తత్స. చీయతే లీయతే చిలిచిమః. అణగుచుండునది, తేలు వంటి చేప, తేలుమీను. చిరిం హింసాం చినోతీతి చిలిచిమః. మత్స్యవిశేషము, చేపలగుంపు.
చిల్లము
సం. నా. వా. అ. పుం. తత్స. చిల్లయతి శిథిలీకరోతి పరానితి చిల్లః. ఇతరపక్షులను శిథిలముగా చేయునది, చీపరపెట్ట, తడికన్ను, క్లిన్నమక్షి యస్యసః చిల్లః . తడికంటిది. చిల్లతి హావభావేన ఉడ్డీయతే ఇతి చిల్లః. పక్షివిశేషము, ఆతాయి, శకుని, కడిగిన కన్ను.
చిహ్నము
సం. నా. వా. అ. న. తత్స. చహ్వత ఇతి చిహ్నం. ఎరుగబడునది, గుర్తు, టెక్కెము. చిహ్న్యతే అనేనేతి చిహ్నం. కలంకము, అంకము, లక్షణము, లింగము, పథాకము.
చీనము
సం. నా. వా. అ. పుం. తత్స. చీయతే వ్యాదైః చీనః. బోయలచే పొడవబడునది, ముప్పై అంగుళాల పొడవు కలిగి గువ్వవన్నె కలిగిన జింక, ధాన్య విశేషము, నూలు, వస్త్రవిశేషము, గుర్రపు పల్లమునకు క్రింద వేసెడు మెత్త, ఒకానొకదేశము, ఇనుము, ఒక గోరింట, పెసర, కొర్రలు.
చీరము
సం. నా. వా. అ. న. తత్స. కౌపీనము, నారచీర, వస్త్రవిశేషము, రేఖ, జిలుగువ్రాత, నలభై పూసలు గుచ్చిన సరము, అతుకుల బట్ట.
చీరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. చీ ఇతి శబ్దేన రిణాతి గచ్ఛతీతి చీరీ. చీ అని పలుకుచు పోవునది, ఈలపురుగు, ఒక ఆట.
చీరుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చి ఇతి రౌతీతి చీరుకా. చీయనీ కూయునది, ఈలపురుగు, ఝిల్లి.
చీవరము
సం. నా. వా. అ. న. తత్స. భిక్షుని వస్త్రము, గుడ్డపీలుక.
చుక్రము
సం. నా. వా. అ. న. తత్స. చకతి తర్పయతీతి చుక్రం. తృప్తిని చేయునది, చింతపండు.
చుక్రము
సం. నా. వా. అ. పుం. తత్స. చక్యంతే వ్యథంతే దంతా అనేనేతి చుక్రః. దంతములను దీనిచేత వ్యథపెట్టబడుతాయి, పుల్లప్రబ్బ చెట్టు, పులుసు.
చుక్రిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చకం త్యనేనేతి చుక్రః అమ్లః, తద్యోగాచ్చుక్రికా. పులుపును కలిగినది, పులిచింత (వృక్ష విశేషము), దీనిచేత తృప్తిని పొందుదురు.
చుచుందరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఛ్యతీతి చుచుందరీ. ధాన్యములను ఛేదించునది, చిట్టెలుక, చుంచెలుక.
చుల్లి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. చుల్ల్యతే గ్నిరస్యామతి చుల్లిః. దీని యందు అగ్ని ప్రేరేపింపబడును, పొయ్యి, సొద.
చూచుకము
సం. నా. వా. అ. పుం. న. తత్స. చూచు ఇతి కాయతి బాలేన పీయమానమితి చూచుకం. బాలుని చేత పానము చేయబడు చున్నదై చూచు అని పలుకునది, స్తనాగ్రము, అంచు, సంకరజాతి, మాగదుడు, చనుమొన.
చూడ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చుద్యతే వాయునేతి చూడా. వాయువు చేత కదలింపబడునది, జుట్టు. చుల్యతే ఛాద్యత ఇతి చూడా. కప్పబడునది, నెమలి జుట్టు, చూరు, బాహుపురి. చోలయతి మస్తకాద్యుపరి ఉన్నతా భవతీతి చూడా. మయూరశిఖ, తల, శిఖ.
చూడామణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. చూడాయాం మణిః చూడామణిః. శిరస్సున నుండు రత్నము, గురిగింజ, తలమానికము. చూడా శిరోభూషణం ముకుటకిరీటాదికం తత్ర స్థితో మణిః. పూసల గురువింద, శిరోమణి, అలంకారార్ధము తల యందు ఉంచుకొనెడి రత్నము.
చూడాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చూడాంలాతీతి చూడాలా. వెండ్రుకలను వృద్ధిచేయునది, వట్రువముస్త (వృక్ష విశేషము).
చూతము
సం. నా. వా. అ. పుం. తత్స. చ్యోతతి రసం స్రవతీతి చూతః. రసమును స్రవించునది, మామిడి, ఆమ్రము, బావి.
చూర్ణకుంతలము
సం. నా. వా. అ. పుం. తత్స. చూర్ణాః కుటిలాః కుంతలాః చూర్ణకుంతలాః. కుటిలములైన వెండ్రుకలు, అలకము, నెఱికురులు.
చూర్ణము
సం. నా. వా. అ. న. తత్స. చూర్ణ్యంత ఇతి చూర్ణాని. నూరబడునవి, గందపుపొడి, సున్నం, అంగరాగము.
చూర్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. చూర్ణ్యత ఇతి చూర్ణః. మెదపబడునది, దుమ్ము, పొడి. చూర్ణ్యతే సంపిష్యతే ఇతి చూర్ణః.
చూలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చుల్యతే అంకుశేన ప్రేర్యత ఇతి చూలికా. అంకుశము చేత ప్రేరేపించబడునది, పిల్ల జుట్టు, ఏనుగు చెవి, నాటకాంగము. చోలయతి సన్నిహితచర్మమాంసరాశిం ఉన్నయతీతి చూలికా. వింటి చివర, కుడుము, ఒక యోగాసనము.
చేతన
సం. నా. వా.ఆ. స్త్రీ. తత్స. చేతయంతే నయేతి చేతనా. దీనిచేత జ్ఞానయుక్తులౌదురు, బుద్ధి, తెలివి.
చేతనము
సం. విణ. తత్స. చేతతీతి చేతనః. ఎరుగునది, ప్రాణము కలది, జంతువు.
చేతస్సు
సం. నా. వా. స్. న. తత్స. చేతయతీతి చిత్తం, చేతశ్చ. తెలియచేయునది, మానసము, మనస్సు, మది.
చేలము
సం. నా. వా. అ. న. తత్స. చిల్యతే చేలం. కట్టుకొనబడునది, వస్త్రం, అధముడు, నింద్యము, నెమలిపురికన్ను, తొందరపాటు కలవాడు, ప్రేమార్హము.
చైత్యము
సం. నా. వా. అ. న. తత్స. చీయతే పాషాణాదినా చైత్యం. పాషాణాదులచే కట్టబడునది, కట్టడము, గుడి, యజ్ఞశాల, బౌద్ధాలయము, ఉద్యాన వనమందలి మ్రాను, నేయి, అగ్నిపై ఉంచుట, దేవతాయతనము, స్ధూపము, చితి, ఉన్నత స్ధానము, కొండ, దేవాలయము, సొద, రచ్చ మ్రాను.
చైత్రము
సం. నా. వా. అ. న. తత్స. గుడి, గోరి.
చైత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. చిత్రా నక్షత్రయుక్తా పూర్ణిమా చైత్రీసా స్మిన్నస్తీతి చైత్రః. చిత్రా నక్షత్రముతో కూడి ఉన్న పూర్ణిమ, చైత్రమాసం ఒకానొక నెల, ఒకానొక కొండ. చిత్రానక్షత్రయుక్తా పౌర్ణమాసీ యత్ర సః చైత్రః.
చైత్రరథము
సం. నా. వా. అ. న. తత్స. చిత్రరథో నామ గంధర్వరాజః తేన నిర్మితం చైత్రరథం. చిత్రరథుడు అను గంధర్వరాజుచేత నిర్మింపబడినది, కుబేరునితోట. చిత్రరథేన గంధర్వేణ నివృత్తం చైత్రరథం.
చైత్రికము
సం. నా. వా. అ. పుం. తత్స. చిత్రా నక్షత్రయుక్త పూర్ణిమా చైత్రీసా స్మిన్నస్తీతి చైత్రికః. చిత్రానక్షత్రముతో కూడి ఉన్న పూర్ణిమ, చైత్రమాసము.
చోచము
సం. నా. వా. అ. న. తత్స. టెంకాయ, లవంగపట్ట, భుజించివిడిచిన అన్నము, నార.
చోదము
సం. నా. వా. అ. న. తత్స. అగ్నిం చోదయతీతి చోదం. దీపనాగ్నిని ప్రేరేపించునది, లవంగపుపట్ట.
చోరపుష్పి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. రాత్రావేవ పుష్యతీతి చోరపుష్పీ. రాత్రియందు పూచునది, కట్లతీగ, పద్మపుతీగ, కడిల చెట్టు.
చోరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. చోరయతీతి చోరః. దొంగిలించు వాడు, దొంగ, అన్నము, తస్కరుడు.
చోళము
సం. నా. వా. అ. పుం. తత్స. చుల్యతే అనేన చోళః. దీనిచేత దేహము కప్పబడును, కుప్పసము, రవిక, ఒక దేశము, ఒక చెట్టు, పూరింటి పైకప్పు.
చౌరిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చోరస్య కర్మ చౌరికా. చోరుని యొక్క పని, చౌర్యము, దొంగతనము, జూదరి.
చౌర్యము
సం. నా. వా. అ. న. తత్స. చోరస్య కర్మ చౌర్యం. దొంగ యొక్క పని, దొంగతనము.
చ్యుతము
సం. విణ.(అ. ఆ. అ.). తత్స. చ్యవతే స్మ చ్యుతం. పడినది, జాఱినది, స్రస్తము, యోని, గుదము.