హల్లులు : ఛ
ఛందము
సం. నా. వా. అ. పుం. తత్స. ఛందయతి ఆహ్లాదయతీతి ఛందః. సంతోషము పెట్టునది, అభిప్రాయము, వశము, ఇష్టము.
ఛందస్సు
సం. నా. వా. స్. న. తత్స. ఛందయతీతి ఛందః. ఆహ్లాదమును చేయునది, పద్యలక్షణము చెప్పుడు శాస్త్రము, వేదము, యధేచ్ఛమైన నడవడిక, ఇచ్ఛ, వేదము, ఒక వేదాంగము, కోరిక, శ్లోకము.
ఛగటాండి
సం. నా. వా. అ. పుం. తత్స.
ఛగల
సం. నా. వా. అ. పుం. తత్స.
ఛత్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛాదయతి భువనం ఛత్రా. భూమిని కప్పి ఉండునది, అడవి సదాప (వృక్షవిశేషము). ఛత్త్రా కారత్వాచ్ఛత్త్రా. గొడుగు వలె ఉండునది, పుట్టగొడుగు. ఛాదయతి పిత్తాది దోషానభి భవతీతి ఛత్రా. పిత్తాది దోషములను చెరచునది, గుడ్డికామంచి, కొత్తిమిరి (వృక్ష విశేషము.), తుమ్మ, కుక్కగొడుగు.
ఛత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. భాద్యతే పురుషోనేనేతి ఛత్రం. దీని చేత పురుషుడు కప్పబడును, గొడుగు. ఛాదయత్యనేనాతపాదికమితి ఛత్రం.
ఛత్రాకి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఛత్రాభాని పర్ణాన్యకతీతి ఛత్రాకీ. గొడుగుల వంటి ఆకులు కలది, సర్పాక్షి చెట్టు.
ఛదనము
సం. నా. వా. అ. న. తత్స. భాద్యతే వృక్షః అనేనేతి ఛదనం. దీని చేత వృక్షము కప్పబడును, ఆకు, ఈక, రెక్క, కప్పు.
ఛదము
సం. నా. వా. అ. పుం. తత్స. భాద్యతే వృక్షోనేనేతి ఛదః. దీని చేత వృక్షము కప్పబడును, ఆకు. భాద్యతే అనేన అంగమితి భదః. దీని చేత అంగము, ఈక, రెక్క, గండివనం, చీకటి మ్రాను, కప్పు, ఆకు.
ఛది
సం. నా. వా. స్. న. తత్స. భాద్యతే అనేనేతి భదిః. దీనిచేత ఇల్లు కప్పబడును, ఇంటి కప్పు, పటలము, చర్మము, ధర్భాస్తరణము.
ఛద్మము
సం. నా. వా. న్. న. తత్స. భాద్యతే స్వరూపమనేనేతి ఛద్మ. దీని చేత స్వరూపము కప్పబడును. ఛద్యతే ఆవ్రియతే స్వరూపమనేనేతి ఛద్మ. ఇల్లు, వ్యాజము.
ఛన్నము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ఛాద్యతే గోప్యతే ఛన్నః. గుప్తము చేయబడునది, ఏకాంతము. ఛాద్యతే స్మ ఛన్నః. కప్పబడినది, గుడూచి.
ఛలము
సం. నా. వా. అ. న. తత్స. ఛ్యతి కార్యమితి ఛలం. కార్యమును చెరుచునది, నెపము, వెనుదీయుట, మోసము.
ఛవి
సం. నా. వా.ఇ. స్త్రీ. తత్స. ఛ్యతి నాశయత్యంధకారమితి ఛవిః. అంధకారమును పోగొట్టునది, కిరణము. ఛ్యతి తమ ఇతి భవిః. కాంతి, శోభ.
ఛాందసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఛందోధీతే ఛాందసః. వేదాధ్యయనము చేసినవాడు, శ్రోత్రియుడు.
ఛాగము
సం. నా. వా. అ. పుం. తత్స. భ్యతి రోగానితి ఛాగః. రోగములను చెరుచునది, మేకపోతు, అజము. ఛాయతే ఛిద్యతే దేవబలయే ఇతి ఛాగః. పశువిశేషము, నారింజ.
ఛాగి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఛ్యతి రోగానితి ఛాగీ. రోగములను చెరుచునది, మేక, అజము.
ఛాతము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ఛాయతే స్మ స్మ ఛాతం. కోయబడినది, నరకబడినది, ఛిన్నము, ముక్క.
ఛాత్రడు
సం. నా. వా. అ. పుం. తత్స. గురోరసచ్చరిత్రం ఛాదయతీతి ఛాత్రః. గురువు యొక్క అసచ్చరిత్రమును కప్పువాడు, శిష్యుడు, చట్టు. ఛత్రం గురోర్దోషాణామావరణం తచ్ఛీలమస్యేతి ఛాత్రః. చారుడు, ఒకతేనె.
ఛాదితము
సం. విణ. (అ. ఆ. అ.) తత్స. ఛాద్యతే స్మ భాదితః. కప్పబడినది, ఛిన్నము.
ఛాయా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛ్యతి తాపాదికమితి ఛాయా. తాపమును మొదలయిన దానిని పోమొత్తునది, నీడ, కాంతి, శోభ, వర్ణము, ప్రతిబింబము, సూర్యుని భార్య, రక్షణము, లంచము, వరుస, ఇంచుక.
ఛాయాపుత్రుడు
సం. నా. వా. అ. పుం. తత్స. శని, చాయపట్టి.
ఛిద్రము
సం. నా. వా. అ. న. తత్స. ఛిద్యత ఇతి ఛిద్రం. ఛేదింపబడునది, బెజ్జము, తప్పు, చవిటి భూమి, రంధ్రము.
ఛిద్రితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. ఛిద్రమస్య సంజాతమితి ఛిద్రితః. బెజ్జము కలిగినది, గ్రుచ్చబడినది.
ఛిన్న
సం. నా. వా. విణ. తత్స. ఛిద్యతే స్మ ఛిన్నం. కోయబడునది, ఛేదింపబడినది, మీగడ, మొక్క సం. నా. వా. ఆ. స్త్రీ. తిప్పతీగ.
ఛిన్నరుహ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛిన్నాపి రోహతీతి ఛిన్నరుహా. నరకబడి మరల మొలచునది, తిప్పతీగ.
ఛురిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఛురతీతి ఛురికా. ఛేదించునది, చురకత్తి, శస్త్రి.
ఛేకము
సం. నా. వా. అ. పుం. తత్స. పెంపుడు జంతువు, శ్రద్ధాళువు, సమర్ధుడు.
ఛేదనము
సం. నా. వా. అ. న. తత్స. ఛేదః ఛేదనం. నరుకుట, ఛేదించుట, ఛేదము.