హల్లులు : జ
జంగమము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. భృశం గచ్ఛతీతి జంగమం. మిక్కిలి తిరుగునది, చరిష్ణువు, చరము.
జంఘ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జాయత ఇతి జంఘా. వట్టికాలి వెనుకటిభాగము, పిక్క. జంఘన్యతే కుటిలం గచ్ఛతీతి జంఘా. హరిణము, పుట్టునది, కాలిపిక్క.
జంఘాకరికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జంఘే జీవన కర్యౌయస్యసః జంఘారికః. జీవనము చేయించు నట్టి పిక్కలు కలవాడు, దూరముగా సమాచారము తీసికొని పోయి వచ్చిచెప్పి జీవించువాడు, పరుగెత్తువాడు.
జంఘాలుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. మిక్కిలి తొందరగా నడచువాడు, వేగముగా పోవువాడు.
జంతుఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. జంతుయుక్తం ఫలమస్యేతి జంతుఫలః . జంతువులతో కూడిన ఫలములు కలది, మేడి, ఒక గోధుమ.
జంతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. జాయత ఇతి జంతుః. పుట్టునది, ప్రాణము కలది, చేతనము, ప్రాణి.
జంపతులు
సం. నా. వా. ఇ. పుం. తత్స. ఆలుమగలు, దంపతులు, భార్యాభర్తలు.
జంబాలము
సం. నా. వా. అ. పుం. తత్స. జమతి గ్రసతే గతిం వస్తువా జంబాలః. గతినిగాని, వస్తువును కాని కబళించునది, అడుసు, పాచి, బురద, ఒక చెట్టు.
జంబూకము
సం. నా. వా. అ. పుం. తత్స. జమతి మాం సమత్తీతి జంబుకః. మాంసమును తినునది, నక్క, ఫేరవము, వరుణుడు. శృగాలము.
జంభభేది
సం. నా. వా. న్. పుం. తత్స. జంభాఖ్య మసురం భిన్నత్తీతి జంభభేదీ. జంభాసురునిభేదించినవాడు, ఇంద్రుడు, వేల్పుఱేడు.
జంభము
సం. నా. వా. అ. పుం. తత్స. జంభయతి మోహయతీతి జంభః. మోహింప చేయునది, నిమ్మ, పల్లు, తిండి, ఒకానొకరాక్షసుడు, కోరపన్ను.
జంభలము
సం. నా. వా. అ. పుం. తత్స. జంభయతి మోహయతీతి జంభలః. మోహింప చేయునది, నిమ్మ, జినదేవుడు.
జంభీరము
సం. నా. వా. అ. పుం. తత్స. జమ్యతే భక్షత ఇతి జంభీరః. భక్షింపబడునది. జమ్యతే ఆస్వాద్యత ఇతి జంభీరః. ఆస్వాదింపబడునది, నిమ్మ, మరువము. జమ్యతే భక్ష్యతే ఇతి జంబీరః. ఒక తులసి.
జంభువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. జంబ్వాః ఫలం జంబూః. నేరేడు పళ్లు, నేరేడు చెట్టు, నేఱటేరు.
జగచ్ఛక్షువు
సం. నా. వా. స్. పుం. తత్స. జగతశ్చక్షురివ జగచ్ఛక్షుః. జగత్తునకు నేత్రము వంటి వాడు, సూర్యుడు, జగము ,కన్ను. జగతాం భువనానాం క్షురివ ప్రకాశకత్వాత్ జగచ్ఛక్షుః.
జగతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. గమ్యతే జనైరితి జగతీ . జనులచేత పొందబడినది, లోకము, జనము, భూమి, ఒక ఛందస్సు, ప్రపంచము, గ్రామని వేశనము.
జగత్తు
సం. నా. వా. త్. న. తత్స. గమ్యతే జనైరితి జగత్. జనులచేత పొందబడునది. గచ్ఛతీతి జగత్. పోవునది, జగము, విశ్వము, జగతి, లోకము, భువనము, విష్టపము, సంసారము. సం. నా. వా. త్. పుం. తత్స. గాలి, వాయువు. సం. విణ. తత్స. చంచలము, తిరుగునది. ప్రళయకాలే గచ్ఛతీతి జగత్. ప్రళయకాలమందు లయమై పోవునది.
జగత్ర్పాణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జగతాం ప్రాణః జగత్ప్రాణః. జగత్తునకు ప్రాణమైనవాడు, వాయువు, గాలి. జగతాం విశ్వస్థజీవానాం ప్రాణో జీవనం జగత్ప్రాణః.
జగలము
సం. నా. వా. అ. పుం. తత్స. భృశంగళ త్యస్మాత్ సురేతి జగలః. మిక్కిలి దీనివలన మద్యము కాఱును, మంగ, మద్యపిష్ఠము, మోసకాడు, ఒక మద్యము, జూదరి.
జగ్ధము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. అద్యతేస్మ అన్నం, జగ్ధంచ అధభక్షణే. భుజింపబడిన అన్నాదికము, తినబడినది, భక్షితము.
జగ్ధి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. అదనం జగ్ధిః. భక్షించుట, భోజనము, కుడుపు, తిండి.
జఘనము
సం. నా. వా. అ. న. తత్స. హన్యతే పురుషేణ తాడ్యత ఇతి జఘనం. పురుషుని చేత పీడింపబడునది, స్త్రీల మొలముందరిచోటు, మడికట్టు, మొల, కటిముందు భాగము, పిరుదులు.
జఘనేఫల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జఘనే స్కందే ఫలాన్యస్యేతి జఘనేఫలా. జఘనమనగా కొమ్మ, కొమ్మలయందు ఫలములు కలది. బమ్మమేడి, కుక్కమేడి, ఒక చెట్టు.
జఘన్యము
సం. నా. వా. అ. న. తత్స. జఘనే అంత్యభాగే భవం జఘన్యం. కడపటపుట్టినది, మగగుఱి, తోక, గోరిసె, ఎర్రచందనము, చివరిది, నింద, నీచము.
జఘన్యము
సం. నా. వా. విణ. తత్స. వెనుకటి, దూఱితగినది.
జఘన్యుజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జఘన్యేపశ్చాత్కాలే జాతః జఘన్యజః. తన కంటె వెనుకటి కాలమందు పుట్టినవాడు, శూద్రుడు.
జఘన్యుజుడు
సం. నా. వా. విణ. తత్స. తమ్ముడు, చిన్నవాడు.
జట
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జటతి సమూహే భవతీతిజటా. సమూహముగా ఉండినది. జటతి సంఘీభవతీతి జటా. కూడుకొని ఉండునది. జటతీతి జటా. గుంపై ఉండునది, జడ, ఊడ, మాంసి. జటతి పరస్పరం సంలగ్నా భవతీతి జటా. శిఖ, శట, హస్తము, కురువేరు, జాతమాషి, సమూహము.
జటిన్
సం. నా. వా. న్. పుం. తత్స. జటా స్సంతస్యజటీ . ఊడలుకలది, జువ్వి, జడలుకలసన్న్యాసి, అత్తి చెట్టు.
జటిల
సం. నా. వా. అ. పుం. తత్స. సింహము, జడలు కలవాడు.
జటిల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జటాస్సంత్యస్యా ఇతి జటిలా. జడలు వంటి అవయవములు కలది, మాంసి, పిప్పలి, కురువేరు, వస.
జటిల
సం. నా. వా. విణ. తత్స. జడలు కలది.
జటులము
సం. నా. వా. అ. పుం. తత్స. జడంతి రోమాణ్యత్రజడులః. దీని యందు రోమములు జడీభూతములైయుండును, పుట్టుమచ్చ, తిలకము, చంచలము.
జఠరము
సం. నా. వా. అ. పుం. తత్స. జన్యతే గర్భోస్మిన్నితి జఠరం. దీనియందు గర్భము పుట్టింపబడును. జీర్యతే నేనేతి జఠరం. దీనిచేత మృదు వస్తువులు అరుగును. జాయతే స్మిన్నితి జఠరః. దీని యందు పుట్టును కనుక జఠరము, కడుపు. జాయతే గర్భో మలం వా అస్మిన్నితి జఠరః. ఉదరము.
జఠరము
సం. నా. వా. విణ. తత్స. ముదిసినది, కఠినమైనది.
జడ
సం. నా. వా. అ. న. తత్స. నీళ్లు.
జడ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జలత్యపవారయతీతి జడః. ధైర్యమును నివారించునది. జలతి జడీభవతీతి జడః. స్తబ్ధుడైయుండువాడు, దురదగొండి, శైత్యము, శీతము, మూర్ఖుడు, అవివేకి.
జడ
సం. నా. వా. విణ. తత్స. చల్లనిది, తెలివిలేనిది, మూగది.
జతుక
సం. నా. వా. అ. న. తత్స. లక్క, ఇంగువ.
జతుక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. వృక్షవిశేషాజ్జాయత ఇతి జతుకం. వృక్ష విశేషము వలన పుట్టునది, చివుక పిట్ట.
జతుకృత్తు
సం. నా. వా. త్. స్త్రీ. తత్స. జతు కరోతీతి జతుకృత్. లక్కను చేయునది, కోరింద చెట్టు.
జతూక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జతుకరోతీతి జతూకా. లక్కను చేయునది, కోరింద, చివుకపిట్ట.
జత్రువు
సం. నా. వా. ఉ. న. తత్స. జాయతే బాహురస్మాత్ జత్రు. దీని నుండి బాహువులు పుట్టును, మూపుల యెక్క సంధిఎముకలు, కొంకులు, భుజశిరస్సంధి.
జనంగముడు
సం. నా. వా. అ. పుం. తత్స. జనాద్గచ్ఛతీతి జనంగమః. జనులనుండి తొలగిపోవువాడు, మాలవాడు. జనేభ్యో గచ్ఛతీతి జనంగమః. చండాలుడు.
జనకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జనయతీతి జనకః. పుట్టించువాడు, తండ్రి, ఒకానొకరాజు.
జనత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జనానాం సమూహో జనతా. జనుల యొక్క సమూహము, జనసమూహము, జనులగుంపు.
జననము
సం. నా. వా. అ. న. తత్స. జననం జన్మచ. జనించుటయే జననము, పుట్టుక, వంశము. జన్యతే ఉత్తరోత్తరమనేనేతి జననం. ఉత్తరోత్తరము దీనివలన పుట్టుదురు, జన్మ.
జననీ
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జనయతి లాక్షాం వా జననీ. లక్కను పుట్టించునది. జనయతి శైత్యాధికం జననీ. శైత్యాధులను పుట్టించునది. జనయతీతి జననీ. కొడుకులను కనునది, దయ, తల్లి, కోరింద.
జనపదము
సం. నా. వా. అ. పుం. తత్స. జనపదసాహ చర్యా న్నీవృచ్ఛబ్ధః జనపదః. జనులు పొందుదురు, దేశము, గ్రామము, గ్రామసమూహము, జనము.
జనయిత్రి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జనయతీతి జనయిత్రీ. కొడుకులను కనునది, తల్లి, జనని.
జనశ్రుతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జనేభ్యః శ్రుతిః జనశ్రుతిః. జనులచేత వినబడునది. జనైః శ్రూయత ఇతి జనశ్రుతిః. జనులు చెప్పుకొనెడు వృత్తాంతము, నానుడి, ప్రవాదము.
జనార్ధనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. సముద్రమధ్య వర్తినో జననామ్నోసురా నర్దిత వానితిజనార్దనః. సముద్రమధ్యనుండెడు జనులనెడుఅసురులను పీడించినవాడు, హరి, వెన్నుడు, విష్ణువు.
జనాశ్రయము
సం. నా. వా. అ. పుం. తత్స. జనానామాశ్రయః జనాశ్రయః. జనులకు ఆశ్రయము, జనులు చేరియుండు నట్టిచోటు, మండపము, సత్రశాల.
జని
సం. నా. వా. ఇ. పుం. తత్స. పుట్టుక.
జని
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జననం జనీ. జననము, ఆడుది, పెండ్లాము. జాయతే సంతతిర్యస్యామితి జనీ. వధు, పుత్రవధు, సీమంతిని, స్త్రీ, జన్మ, వధూవరులు.
జని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కోడలు, కోరింద.
జనువు
సం. నా. ఉ. న. స్. తత్స. జననం-జనుః. జన్మ, పుట్టుక, జననము.
జన్మి
సం. నా. వా. న్. పుం. తత్స. జన్మ అస్యాస్తీతి జన్మీ. జన్మము కలిగినది, జంతువు, మేతాలుపు.
జన్య
సం. నా. వా. అ. న. తత్స. యుద్ధము, అంగడి, దూఱు.
జన్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జనీం వధూం వరం నయంతీతి జన్యః. వరుని, కన్యను కూర్చువారు జన్యులు. జనయోగాజ్జన్యం. జనుల కూటము. జననీయః జాయతే, జనయతీతి చజన్యః. పుట్టింపతగినదియు, పుట్టునదియ, పుట్టించునదియు జన్యము, తల్లి చెలికత్తె, తోడి పెండ్లికూతురు, సుఖము, తండ్రి, నింద్యము, వరుని మిత్రులు, వధువు తండ్రి, భృత్యులు.
జన్యువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. జాయత ఇతి జన్యుశ్చ. పుట్టునది, జంతువు, అగ్ని, బ్రహ్మ, ప్రాణి.
జప
సం. నా. వా. అ. పుం. తత్స. జపనం జపః. జపించుట, దాసనము, మంత్రావృత్తి, వేదాధ్యయనము. జపంతి తంత్రికా అనయేతి జపా.
జపా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జలమధ్యే జపతీవ తిష్ఠతీతి జపా. నీళ్లమధ్య జపము చేయుదానివలెఉండునది, జపించుట, దాసనము, ఒక పుష్పము.
జయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జయశ్చజిజయే. గెలుచుట, పార్వతి, పార్వతి యొక్క చెలికత్తె, తిథివిశేషము, కరక, తక్కిలి, నెల్లి.
జయంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జయతి రోగాన్ జయంతి. రోగములను జయించునది, ఇంద్రుని కూతురు, పార్వతి, టెక్కెము, తక్కిలి, తిరునక్షత్రము, ఒక తాటి.
జయంతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జయతి శత్రూనితిజయంతః. శత్రువులను జయించువాడు, ఇంద్రునికొడుకు, భీముడు, శివుడు, చంద్రుడు.
జయము
సం. నా. వా. అ. పుం. తత్స. ఒక సంవత్సరము, గెలుపు, ఇంద్రుడు, జయంతుడు, జయము, పెసలు, ఒక చెట్టు.
జయా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జయతి రోగాన్ జయా. రోగములను జయించునది, పార్వతి, పార్వతి యొక్క చెలికత్తె, తిధి విశేషము, కరక, టక్కిలి, నెల్లి, (వృక్ష విశేషము). జమ్మి, వస, నల్లజీలకఱ్ఱ, సం. నా. వా. అ. పుం. తత్స. ఒక సంవత్సరము, గెలుపు.
జయ్యము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జేతుం శక్యతే జయ్యః. సులభముగా ఓడింపతగినవానిపేరు, గెలువశక్యమైనది, జయింపశక్యము.
జర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జీర్యంత్యనయా అజ్గౌనీతి జరా. దీని వలన అంగములు వయోహాని పొందును, చాలముదిమి, ముసలితనము, ముదిమి.
జరద్గవము
సం. నా. వా. అ. పుం. తత్స. జరంశ్చాసౌ గౌశ్చజరద్గవః. ముసలిఎద్దు, జీర్ణవృషము.
జరాయువు
సం. నా. వా. ఉ. న్. పుం. తత్స. గర్భనిష్క్రమణానన్తరం జరాం జీర్ణతామేతి జరాయుః. గర్భము వెళ్లిన పిమ్మట జీర్ణత్వమును పొందునది, మావి, జటాయువు, గర్భకోశము, తామర.
జలధరము
సం. నా. వా. అ. పుం. తత్స. జలస్యధరః జలధరః. జలమును ధరించునది, మేఘము, నీటితాల్పు.
జలనిధి
సం. నా. వా. ఇ. పుం. తత్స. జలాని నితరాం ధీయం తేస్మిన్నితి జలనిధిః. జలములు దీనియందు మిక్కిలి ధరింపబడును, సముద్రము, కడలి.
జలనిర్గమము
సం. నా. వా. అ. పుం. తత్స. జలాని నిర్గచ్ఛం త్యేభ్య ఇతి జలనిర్గమాః. జలము దీని వలన బయలు దేరుచున్నది, నీళ్ళు వెలికిపోవుటకుఏర్పఱచిన తూములోనగునది, భ్రమము.
జలనీలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జలే నీలీవభాతీతి జలనీలీ. జలమందు నీలివలెనుండునది, శైవాలము, పాచి.
జలము
సం. నా. వా. అ. న. తత్స. జలతి జడీభవతీతి జలం. జఢీభవించునది, నీళ్లు, కురువేరు, ఎఱ్ఱతామర, జడము. జలతి జీవయతి లోకాన్, జలతి ఆచ్ఛాదయతి భూమ్యాదీనితి వా ఇతి జలం. వారి, సలిలము, కమలము, పయస్, కీలాలము, అమృతము, జీవనము, భువనము, వనము, ఉదకము, పుష్కరము, సర్వతోముఖము, తోయము, క్షీరము, అంబు, మేఘపుష్పము, ఆపము, జడుడు.
జలముచము
సం. నా. చ్. పుం. తత్స. జలం ముంచతీతి జలముక్. ఉదకమును (నీరు) విడుచునది, మేఘము, మబ్బు.
జలశుక్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జలమాత్రాశ్శుక్తయః జలశుక్తయః. జలసామాన్యమునందుఎల్ల పుట్టునవి, కప్పి చిప్ప, శంబూకము.
జలాశయము
సం. నా. వా. అ. న. తత్స. జలమాశేతేత్ర జలాశయః. జలము దీనియందుండును. జలేశేత ఇతి జలాశయం. జలమందుండునది, నీటివట్టివేరు, నీటిటెంకి, వట్టివేరు, సరస్సు.
జలూకము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జలమోకః స్థానం యస్యాస్సా జలూకా. జలమేస్థానముగా కలిగినది, జలగ, అంతర తామర.
జలోచ్ఛ్వాసము
సం. నా. వా. అ. పుం. తత్స. జలస్య ఉచ్ఛ్వాసా ఇవ జలో చ్ఛ్వాసాః. జలములకు నిట్టూర్పువంటివి, అలుగు, పరీవాహము, కట్టపై నుండి నీరు పొర్లుట.
జలౌకసము
సం. నా. వా. ఆ. స్. స్త్రీ. తత్స. జలం మోకః స్థానం యశ్యసా జలౌకశ్చ. జలమేస్థానముగా కలిగినది, జలగ, జలజంతువు.
జల్పాకుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జల్పతి కుత్సితం వదతీతి జల్పాకః. కుత్సితముగా పలుకువాడు, ఉపయుక్తముకాని పెక్కుమాటలాడువాడు, ప్రేలరి, వాచానుడు.
జల్పితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జల్ప్యతే స్మ జల్పితం. భాషితము, ఉపయుక్తముకాక మిక్కిలి చెప్పబడినది.
జవ
సం. నా. వా. ఆ. స్త్రీ. జవత్యనేనేతి జవః. జనము దీనిచేత పరుగిడును. ప్రకృష్టః జవోయస్యసః జవనః. ప్రకృష్టమైన గమనవేగము కలవాడు, దాసనము, వడి, వడికలది, వేగము, జంఘాలుడు.
జవనము
సం. నా. వా. అ. న. తత్స. ప్రకృష్టః జవోయస్యసః ప్రజనీనాంతః జవనః. ప్రకృష్టమైన గమన వేగము కలవాడు. జవో జవనం జాతిశ్చ. వేగము కలిగినది కనుక. జవతి వేగేన జవనః. అధికమైన వేగము గల అశ్వము, వడిగల గుఱ్ఱము, వడికలది, వేగము, జంఘాలుడు.
జవనిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యువంత్యత్ర జనా ఇతి యవనికా. జనులు దీనియందు కూడుదురు, తెరచీర, కాండపటము. జవనం వేగేన ప్రతిరోధనమస్త్యస్యాః ఇతి జవనికా.
జహ్నుతనయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జహ్నోస్తనయా జాహ్నవీ. జహ్నుమహాముని యొక్క చెవియందు పుట్టినది, గంగ, మిన్నేఱు.
జాంగలికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జాంగలం విద్యాం వేత్తీతి జాంగలికః. విషమునుదించు మంత్రమును ఎరిగినవాడు, విషవైద్యుడు, గారడీవాడు.
జాంఘికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జంఘాభ్యాం జీవతీతి జాంఘికః. పిక్కల చేత బ్రతుకువాడు, దూరముగా సమాచారమును తీసుకొని పోయి వచ్చి చెప్పిబ్రతువాడు, పరుగెత్తువాడు.
జాంబవము
సం. నా. వా. అ. న. తత్స. జంబ్వాః ఫలం జంబూః. నేరేడుపండు, బంగారు.
జాంబునదము
సం. నా. వా. అ. న. తత్స. జంబూ ఫలరసోత్పన్నన దీభవత్వా జ్జాంబూనదం. మేరు సమీపమునందు ఉన్ననేరేడు పండ్లరసముచేత పారిన నదియందు పుట్టినది, బంగారు, ఉమ్మెత్త. జంబూనద్యాం భవమితి జాంబూనదం. స్వర్ణము, ధుస్తూరము.
జాగర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జాగరణం జాగరా. నిద్రలేక యుండుట, జాగారము, కవచము, నిద్రలేచుట.
జాగరిత
సం. విణ. (ఋ. ఈ. ఋ). తత్స. జాగర్తి తాచ్ఛీల్యేనేతి జాగరితా. స్వభావముననే మేల్కొని ఉండువాడు.
జాగరూకుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జాగర్తి తాచ్ఛీల్యేనేతి జాగరూకః. స్వభావముననేమేల్కొని యుండువాడు, మేల్కొని ఉండువాడు.
జాగార్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జాగరణం జాగర్యా. మేలుకొనియుండుట, నిద్రలేకుండుట.
జాతము
సం. నా. వా. అ. న. తత్స. జాయతి ఇతి జాతః. ప్రాదుర్భవించునది, సమూహము, సామాన్యము, పుట్టుక, పుట్టినది.
జాతరూపము
సం. నా. వా. అ. న. తత్స. జాతం ప్రశస్తం రూపం యస్య జాతరూపం. ప్రశస్తమైన రూపము కలది, బంగారు, ఉమ్మెత్త, పుట్టిన రూపము.
జాతవేదుడు
సం. నా. వా. స్. పుం. తత్స. జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః. ఇతనివలన వేదములు పుట్టునవి, అగ్ని, నిప్పు. విద్యతే లభ్యతే ఇతి జాతవేదాః. జాతం వేదో ధనం యస్మాత్ జాతవేదాః.
జాతాపత్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జాతమ దత్య మస్యాః జాతాపత్యా. పుట్టిన బిడ్డ కలది, బాలెంతరాలు.
జాతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జాతేః పృథగ్భూతా ఆశ్రయ రూపావ్యక్తిః జాతిః. జాతికి ఆశ్రయమైనది. జాయతే అనయా సుంఖంజాతిః. సుఖము దీనిచేత పుట్టును. జాయతే భిన్నే ష్వభిన్నాభిధాన ప్రత్యయా వనయేతి జనం చ జాతిః. భిన్నములయిన వస్తువుల యందు అభిన్నములైన నామ జ్ఞానులు దీనిచేత పుట్టును, కులము, పుట్టుక, సామాన్యము, ఒక అర్ధాలంకారము, పద్యభేదము, ప్రొయ్యి, జాజికాయ, జాజి, ఉసిరిక, కంపిల్లము, (పురుషజాతులు నాలుగు- భద్రుడు, దత్తుడు, కూచిమారుడు, పాంచాలుడు, స్త్రీజాతులు నాలుగు - పద్మిని,హస్తిని, సంఖిని, చిత్రిణి, పదునెమిదిజాతులు- బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యావహరిక, గోరక్షక, శిల్పక, పంచాణ, కుంభకార, తంతుకవాయ, క్షౌరక, రజక, వస్త్రచ్ఛేదక, చర్మకార, తిలఘాత, లుబ్ధక, చండాల, మాతంగజాతులు.), జన్మ, ఒక ఛందస్సు, కుటుంబము.
జాతికోశము
సం. నా. వా. అ. న. తత్స. జాత్యాః లతా విశేషస్య కోశం జాతికోశం. జాతీలత యొక్కఫలము, జాజికాయ.
జాతోక్షము
సం. నా. వా. అ. పుం. తత్స. జాతశ్చాసా వృక్షా చ జాతోక్షః. పుట్టిన ఎద్దు, కాలుపట్టిన ఎద్దు, కోడె.
జానువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. జాయతే జంఘోరు సంధిభాగ ఇతిజాను. తొడపిక్కల సందున పుట్టునది, మోకాలు. జాయతే ఇత జాను.
జాబాలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అజాః పాలయతీతి జాబాల. మేకలను మేపువాడు, కురుపవాడు. జవం ఆలయతి, క, జవాలః అజః తస్యాం అథవా జబాలాయా అపత్యం పుమాని తి జాబాలః. గొల్ల.
జామాత
సం. నా. వా. ఋ. పుం. తత్స. జాయాం మిమాతే జామాతా. పెండ్లామును వివాహార్ధమైకొలుచువాడు, అల్లుడు, పెనిమిటి, ప్రొద్దు తిరుగుడుచెట్టు. జాయాం మాతి మిమేతి మినోతి వా ఇతి జామాతా. తెల్లనువ్వులు.
జామి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జమతీతి జామిః. సొమ్ము తినునది, కులకాంత, తోడపుట్టినది, జామ, సోమరి, సోదరి, పూజ్యురాలు.
జాయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జాయతేస్యాం పతిః పుత్రరూపేణేతి జాయా. ఈమెయందు పతి పుత్రరూపమున జనించును, అగ్ని సాక్షిగా పెండ్లాడిన పెళ్లాము, భార్య.
జాయాజీవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జాయాయా జీవన్తీతి జాయాజీవః. పెండ్లాము చేత జీవించువాడు, నట్టువుడు. జాయా ఆజీవః జీవనోపాయో యస్య ఇతి, జాయయా జీవతీతి వా జాయాజీవః. బకపక్షి, వేశ్యాపతి, నటుడు.
జాయువు
సం. నా. వా. ఉ. స్త్రీ. తత్స. జయతి రోగాన్ జాయుః. రోగములను గెలుచునది, ఔషదము, మందు.
జారుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జరయతి పరస్త్రియమితి జారః. పరస్త్రీని శిధిలముగా చేయువాడు, ఱంకుమగడు, ఉపపతి. జీర్యతి స్త్రియాః సతీత్వమనేనేతి జారః. జారయతి నాశయతీతి జారః. ఎఱ్ఱకలువ, విటుడు.
జాలకము
సం. నా. వా. అ. న. తత్స. జలతీతి జాలకం. పసరు మొగ్గలకును, కసురుకాయలకునుపేరు, మొగ్గ, మొగ్గలసమూహము, కసుకాయ, వల, పక్షిగూడు, కపటము, మునగకాయ, పురుగు, నువ్వులు, గుంపు.
జాలకము
సం. నా. వా. అ. పుం. తత్స. కిటికి.
జాలము
సం. నా. వా. అ. న. తత్స. జాలవద్గవాక్షవత్తిష్ఠతీతి జాలం. గవాక్షము వలెనుండునది, కిటికి, వల, సమూహము, మొగ్గ, కపటము. జలతీతి జాలం. జాల శబ్దము సమూహమునకు, వలకును, గవాక్షికిని, పసరు మొగ్గలకును అనిపేరు, ఒక ద్వీపము, పురుగు, ఒక సంకరజాతి, వికసించిన పువ్వు, మోసము, గుంపు.
జాలము
సం. నా. వా. అ. పుం. తత్స. మాయ, కడప.
జాలి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. పుష్పే జాల సదృశత్వాజ్జాలీ. పువ్వులుకలది, పొట్ల, పటోలిక, బీర.
జాలిక
సం. నా. వా. అ. పుం. తత్స. సాలెపురుగు, గొఱ్ఱె.
జాలిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జాలేన చరతి జాలికః. వలచేత చరించువాడు, వలవంటి నేతగలవస్త్రము, ఇనుపకవచము, విధవ.
జాలిక సం. నా. వా. అ. న. తత్స. ఊరివళుకు.
జాల్ముడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. గుణదోషములను విచారింపక చేయువాడు, ఏ పనిని చక్కగా యోచింపక చేయువాడు, క్రూరుడు, పామరుడు, మూర్ఖుడు.
జింగి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జింగతి ప్రసతీ జింగీ. వ్యాపించునది, మంజిష్ఠ (వృక్ష విశేషము). పెద్దపొట్ల.
జిఘత్సువు
సం. విణ. తత్స. అత్తుమిచ్చుః జిఘత్సుః. భక్షింపనిచ్ఛయించువాడు, ఆకలిగొన్నవాడు, క్షుదితుడు.
జిఘాంస
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. చంపనిచ్చ, శత్రువు.
జిత్వరుడు
సం. విణ. (అ. ఆ. అ). తత్స. జయతి తాచ్ఛీల్యేన జిత్వరః. స్వభావముననేగెలుచువాడు, జయశీలుడు.
జిష్ణువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. జయశీలో జిష్ణుః. జయించు శీలము కలవాడు. జయతి తాచ్ఛీల్యేన జిష్ణుః. స్వభావముననే గెలుచువాడు, ఇంద్రుడు, అర్జునుడు, జయశీలుడు.
జిహ్మము
సం. నా. వా. అ. న. తత్స. జిహాత్యార్జనమితి జిహ్మం. చక్కదనమును విడుచునది, తగరవృక్షము.
జిహ్మము సం. నా. వా. విణ. తత్స. వంకరైనది, చొరవలేనది, పాము, పాపము, మంద.
జిహ్వా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. హ్వయతి రసవద్వస్తు జిహ్వా. రసయుక్తమైన వస్తువుల నిశ్చయించునది, నాలుక (జిహ్వాయందలి ముఱికి పులుకము), జిహ్వావృక్షము పేరు. జయతి రసమనయేతి జిహ్వా. రసజ్ఞానేంద్రియము, రసన, లలన, మాట, జ్వాల.
జీనుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జినాతి వయసో హీయతేజీనః. వయస్సు వల్ల బాసినవాడు, ముసలివాడు.
జీమూతము
సం. నా. వా. అ. పుం. తత్స. జీవన ముదకం మూయతే బద్ధ్యతేత్రజీమూతః. ఉదకము దీనియందు బంధింపబడును. జీమూతవ దాహ్లాదకత్వాజ్జీమూతః. మేఘమువలె ఆహ్లాదకరమైనది. జీవనం ముఞ్చతీతి జీమూతః. జీవనమును (నీళ్లు) ఇచ్చును, మబ్బు, కొండ, డావరడంగి. జీవనం జలం మూత్రయతి స్రావయతీతి జీమూతః.
జీరకము
సం. నా. వా. అ. పుం. తత్స. జీర్యతే అన్నమనేన జీరకః. దీనిచేత అన్నము జీర్ణమౌను కనుక జీలకఱ్ఱ.
జీరణము
సం. నా. వా. అ. పుం. తత్స. జీర్యతే అన్నమనేన జీరణశ్చ. దీని చేత అన్నము జీర్ణమౌను, జీలకఱ్ఱ.
జీర్ణము
సం. నా. వా. అ. పుం. తత్స. జీర్యతే జీర్ణః. జీలకఱ్ఱ, వయోహాని కలవాడు, శిథిలము, వజ్రము.
జీర్ణము సం. నా. వా. విణ. తత్స. అరిగినది, చినిగినది, పాతది.
జీవ
సం. నా. వా. అ. పుం. న. తత్స. జీవయతి దేవానితీ జీవః. దేవతలను బ్రతికించువాడు, వీణ మొదలగువాని తంతి చక్కగా మ్రోగుటకుగాను దానిక్రిందనుంచెడు కంబళిపీచులోనగునది, పాలకూర, వింటినారి, వస, భూమి, భూషణధ్వని, ప్రాణము, తత్త్వము, స్వరూపము, పరమాత్మ, విలంబిత నృత్యము, బ్రతుకుతెరువు, వేగిస. జీవనమితి జీవః. జీవాత్మ, జీవించుట, ప్రాణి, ఆత్మ, జీవితం.
జీవంజీవము
సం. నా. వా. అ. పుం. తత్స. జీవేన సహచరేణ క్రీడన్ జీవతి జీవం జీరః. సహచరము, దానితో కూడ క్రీడించు బ్రతుకునది, వెన్నెలపురుగు, వన్నెపులుగు, వృక్ష విశేషము. జీవం జీవయతి విషదోషం నాశయతి ఇతి జీవంజీవః. చకోరపక్షి, ఒకపక్షి.
జీవంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జీవం త్యనయా జీవంతీ. దీనిచేత బ్రతుకుదురు, జమ్మి, తిప్పతీగ, పాలకూర, బదనిక, పులిచింత, గుడూచి, ఒకశెనగ, జీవని.
జీవకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుష్ఠ రోగిణం జీవయతీతి జీవకః” . కుష్ణురోగులను బ్రతికించునది. జీవయతీతి జీవకః. బ్రతికించునది, వేగిస. జీవయతి ఆరోగ్యం కరోతీతి జీవకః. జైనుడు, శృంగము, దీర్ఘాయువు, మధురము, మంగల్యము, జైనభిక్షకుడు, ప్రాణి, బౌద్ధ భిక్షువు, ఋణధాత, శ్రేష్ఠము.
జీవన
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జీవంత్యనేనేతి జీవనం. దీని చేత బ్రతుకుదురు. జీవన్త్యనేన జీవనం. దీనిచేత బ్రతుకుదురు, పాలకూర, బ్రతుకు, బ్రతుకు తెరువు, నీళ్ళు, జీవనము, అన్నము.
జీవని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జీవంత్యనయా జీవనీ . ప్రాణధారణే, పాలకూర, ఒక విష్ణుశక్తి, జీవంతి.
జీవనీయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జీవంత్యనయా జీవనీయా. దీనిచేత బ్రతుకుదురు, పాలకూర, సం. నా. వా. అ. న. తత్స. నీళ్లు, కాకిదొండ.
జీవనౌషధము
సం. నా. వా. అ. న. తత్స. జీవయతీతి జీవనౌషధము. దీనిచేత బ్రతుకుదురు, బ్రతుకుచేసెడుమందు, జీవగఱ్ఱ.
జీవా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జీవంత్యనయా జీవా. దీనిచేత బ్రతుకుదురు, జీవితము, శిజ్జితము, భూమి, పాలకూర, వింటినారి, వస, భూషణధ్వని. సం. నా. వా. అ. పుం. న. ప్రాణము, తత్త్వము, స్వరూపము, పరమాత్మ, విలంబిత నృత్యము, సం. నా. వా. పుం. తత్స. బ్రతుకుతెరువు, వేగిస (వృక్ష విశేషము).
జీవాంతుకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జీవానాం పక్షిణామంతకో జీవాంతకః. పక్షిరూపములైన జీవములకు అంతకుడు, పిట్టవేటకాడు, ఒకానొక రాక్షసుడు, కసాయివాడు.
జీవాతువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. జీవన్త్యనేన జీవాతుః. దీనిచేత బ్రతుకుదురు, జీవగఱ్ఱ, బ్రతుకు, వంటకము, జీవనౌషధము.
జీవిక
సం. నా. వా. ఆ.స్త్రీ. తత్స. అజీవన్తి ప్రాణినోనేనేతి జీవికా. దీనిచేత బ్రతుకుదురు, బ్రతుకు తెరువు.
జీవితకాలము
సం. నా. వా. అ. పుం. తత్స. జీవితస్యకాలః జీవితకాలః. బ్రతికియుండుకాలము, ఆయువు, ఆయుస్సు.
జుంగము
సం. నా. వా. అ. పుం. తత్స. జుంగతి వర్జయతి రోగాన్ జుంగః. రోగజనిత దోషములను వర్జించునది, బొద్దికూర, వృద్ధదారకము.
జుగుప్స
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. గుపగోపనకుత్సనయోః రోయుటజుగుప్స. నిందించుట, రోత, దూఱు, దయ, నింద, ఏవగింపు.
జుహువు
సం. నా. వా. ఊ. స్త్రీ. తత్స. హూయతే అనయా జుహూః. దీని చేత వేల్వబడును, స్రుగ్భేదము, స్త్రీ, ఒక హోమసాధనము.
జూతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జవోజవనం జూతిశ్చ. వేగము కలిగినది, వేగము, జవనము.
జూర్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జ్వరణం జూర్తిశ్చ. వ్యధపడుట, జ్వరము, వేడి.
జృంభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జృంభంతే అనేనేతి జృంభః. దీనిచేత దేహము సంకోచ వికాసాదులను పొందును, ఆవులింత, ఒళ్ళువిఱుచుకొనుట, వికాసము, ఒడలు విరుచుకొనుట.
జృంభణము
సం. నా. వా. అ. న. తత్స. జృంభంతే అనేనేతి జృంభణం. ఆవులింత, ఒళ్లవిఱుచుకొనుట, అతిశయము, వికాసము, ఒడలు విరుచుకొనుట.
జేత
సం. విణ. (ఋ. ఈ. ఋ). తత్స. జయతీతి జేతా. గెలుచువాడు. జయతితాచ్ఛీల్యేన జేతా జయించువాడు, జయశీలుడు, విష్ణువు, జైత్రము.
జేయుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జేతుం యోగ్యోజేయః. గెలువతగినవాడు, జయింపతగినవాడు.
జేవనము
సం. నా. వా. అ. న. తత్స. భుక్తిః భోజనం భుజ పాలనానాభ్య వ్యవహారయోః అదనజేమనం. దీని చేత దేహము వృద్ధిపొందును, భోజనము, కుడుపు, తిండి.
జైత్రుడు
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జయతీతి జైత్రః. గెలుచువాడు, జయించువాడు.
జైవాతృకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఓషధీః జీవయ తీతి జైవాతృకః. పైరులను బ్రతికించువాడు. జీవతి చిరకాల మితి జైవాతృకః. అనేక కాలము బ్రతుకువాడు. జీవతీతి జైవాతృకః. బ్రతుకువాడు, చంద్రుడు, పంటకాపు, వైద్యుడు, దీర్ఘాయువు కలవాడు, కర్షకుడు.
జోంగకము
సం. నా. వా. అ. న. తత్స. జోంగకాఖ్యగిరిభవం జోంగకం. జోంగకమనెడు పర్వతమందు పుట్టినది అగురుచందనము, అగురు వృక్షము.
జ్ఞపితము
సం. విణ. (అ. ఆ. అ.). తత్స. జ్ఞాప్యతే స్మజ్ఞప్తః. ఎఱిగింపబడినది, తెలియబడినది.
జ్ఞప్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జ్ఞాయతే అనయేతి జ్ఞప్తిః. దీని చేత సర్వము ఎఱుగబడును, తెలివి, తలపు, బుద్ధి.
జ్ఞాతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. అంతరంగ తనయా జ్ఞాయత ఇతి జ్ఞాతిః. తనవాడని ఎఱుగ బడువాడు, దాయాదుడు, తండ్రి. జానాతి ఛిద్రం కులస్థితిం చ ఇతి జ్ఞాతిః. సపిండాది, సగోత్రుడు, బంధువు, స్వజనుడు, అంశకుడు, దాయాదుడు, సమానోదకుడు.
జ్ఞాతేయము
సం. నా. వా. అ. న. తత్స. జ్ఞాతేర్భావో జ్ఞాతేయః” . జ్ఞాతి యొక్క భావము, జ్ఞాతిత్వము.
జ్ఞానము
సం. నా. వా. అ. న. తత్స. జ్ఞాయతే అనేనేతి జ్ఞానం. దీని చేత ఎఱుగ బడును, మోక్ష విషయమైనబుద్ది, తెలివి, ఒక శివగుణము, జ్ఞానము.
జ్ఞాని
సం. నా. వా. న్. పుం. తత్స. జ్ఞానమస్యాస్తీతి జ్ఞానిః. కాల జ్ఞానము కలవాడు, జోస్యుడు, కోడి, జ్ఞానము కలవాడు, దైవజ్ఞుడు, జ్యోతిషికుడు.
జ్యా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జినాతి కాలే శిథిలీ భవతీతి జ్యా. కాలక్రమమున నశించునది, వింటినారి, నేల, తల్లి, భూమి.
జ్యాని
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. జ్యానం జ్యానిః. ముదియుట, ముదిమి, హాని, ఏఱు, వైకల్యము, వార్ధక్యము.
జ్యాయుడు
సం. విణ. (స్. ఈ. స్). తత్స. అతిశయేన వృద్ధోజాయస్. మిక్కిలి వృద్ధుడు, మిక్కిలి శ్రేష్ఠుడు, అగ్రజుడు, అత్యుత్తముడు.
జ్యేష్ఠా
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జ్యేష్ఠా నక్షత్రయుక్తా పూర్ణిమా స్మిన్నితి జ్యేష్ఠః. జ్యేష్ఠా నక్షత్రముతో కూడిన పున్నమ దీనియందుకలదు, ఒక నక్షత్రము, నాయుకుడు, మిక్కిలి ప్రేమించిన నాయిక, అశ్విన్యాది సప్తవింశతి నక్షత్రాలలో 18 నక్షత్రము, హంస, పంచలోహము, తగరము, కురువేరు, పాలు, అన్న, పెద్దవాడు, వృద్ధుడు, అత్యుత్తమము.
జ్యోతిరింగణము
సం. నా. వా. అ. పుం. తత్స. జ్యోతిషా ప్రకాశేన ఉపలక్ష్మితస్సకారిజ్గతి గచ్ఛతీతి జ్యోతిరిణ్గణం. ప్రకాశముచేత పోవునది, మిణుగురుపురుగు, ఖద్యోతము.
జ్యోతిషికుడు
సం. నా. వా. అ. పుం. తత్స. జ్యోతీంషి నక్షత్రాణ్యధికృత్య కృతో గ్రంథోజ్యోతిషః దద్వేత్తితి జ్యోతిషికః. జ్యోతిస్సులనగానక్షత్రములు, వానినధికరించి చేయబడిన గ్రంధము, దానినిఎఱిగినవాడు. జ్యోతిషం జ్యోతిశశాస్త్రమధీతే వేద వా ఇతి జ్యోతిషికః.
జ్యోతిష్
సం. వి. స్. న. తత్స. వెలుగు, నక్షత్రము, కన్ను, దృష్టి, ప్రకాశము. సం. నా. వా. అ. పుం. తత్స. అగ్ని, సూర్యుడు.
జ్యోతిష్మతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జ్యోతిః ఉష్ణమస్యా అస్తీతి జ్యోతిష్మతీ. ఉష్ణము కలది, జ్యోతిర్లత, ఒక శెనగ, ఒక గోధుమ.
జ్యోత్స్న
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జ్యోతిరస్యామస్తీతి జ్యోత్స్నా. ప్రకాశము కలిగినది, వెన్నెల, వెన్నెలరేయి, చంద్రజ్యోతి, చంద్రిక, చంద్రకాంత, కామవల్లభ.
జ్యోత్స్ని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. జ్యోత్స్నా చంద్రికా తద్యోగా జ్జ్యౌత్స్నీ. వెన్నెల, వెన్నెలరేయి, పొట్ల.
జ్వరము
సం. నా. వా. అ. పుం. తత్స. జ్వరయతీతి జ్వరః. పీడించునది. జ్వరణం జ్వరః. వ్యధపడుట, జూర్తి, వేడి.
జ్వలనము
సం. నా. వా. అ. న. తత్స. జ్వలతీతి జ్వలనః. జ్వలించువాడు, మంట, అర్చి, అగ్ని.
జ్వాల
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. జ్వలతీతి జాలః. జ్వలించునది, మంట, అర్చి.