హల్లులు : ఝ
ఝరము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్ఘీర్యతే కాలేన స్వల్పోభవతీతి ఝరః” . కాలక్రమము చేత స్వల్పమైపోవునది, సెలఏఱు, నిర్ఘరము, ప్రవాహము.
ఝర్ఘరము
సం. నా. వా. అ. పుం. తత్స. ఝర్ఘతే భాషత ఇతి ఝర్ఘరః. ధ్వని చేయునది, కయిముడియను వాద్య విశేషము, మణిదోషవిశేషము, నదీ విశేషము, కలియుగము, ఒక వాద్యము. ఝర్ఘేతి శబ్దం రౌతీతి ఝర్ఘరః. ఝర్ఘ అను ధ్వనిని పలుకునది.
ఝషము
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఝషతి హీనస్తి బాల మత్స్యానితి ఝషః. పిల్లచేపలను చంపితినునది, బీఱ, చేప, మొసలి, అడవి. ఝష్యతే వధ్యతే భక్షణాయ, ఝష్యతే గృహ్యతే ఇతి వా ఝషః. గవేధువు.
ఝాటలము
సం. నా. వా. అ. పుం. తత్స. ఝాటం సంఘాతం లాతి ఆదత్త ఇతి ఝాటలః. గుంపును కూర్చునది, మొక్కపుచెట్టు, గోరింట.
ఝాబుకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఝమ్యతే ఝాబుకః. భక్షింపబడునది, సన్నపు ఆకులపక్కె, గోరింట.
ఝింటి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ఝమితి శబ్దం కరోతీతి ఝంటీ. ఝమ్మను శబ్దమును చేయునది, నల్లగోరింట, తెల్లగోరంట, ముల్లగోరంట.
ఝిల్లిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఝిల్లాఖ్య వాద్య విశేషవత్ కాయతీతి ఝిల్లికా. పలుకునది, ఈల పురుగు, ఎండజిగి, తుడిచెడుగుడ్డ, ఈలపురుగు గుడ్డ, ఒక ఆట, కనుబొమ్మ.