విజయనిఘంటు చంద్రిక (VNC)
విజయనిఘంటు చంద్రిక – పరిచయం
(తెలుగు వైద్యుత మహా నిఘంటువు)
ఇది వైద్యుత నిఘంటువు (electronic dictionary) కావడం చేత దీనిలో కొన్ని గవేషణ ప్రమాణాలు ఏర్పరచబడ్డాయి. దాని ప్రకారం ...
1. ఏదైనా ఒక పదాన్ని ఎంచుకుంటే దాని అర్థం తో పాటు –
- ఆ పదం 1. తత్సమమా? 2. తద్భవమా? 3. దేశ్యమా? 4. అన్యదేశ్యమా? 5. మాండలికమా? 6. గ్రామ్యమా? అనే వివరాలు వస్తాయి.
- అలాగే ఆ పదము 1. నామవాచకము 2. సర్వ నామము 3.క్రియా పదము 4. విశేషణము 5. క్రియా విశేషణము లలో ఏ భాషా భాగమో తెలుస్తుంది.
- పదమునకు చెందిన విశేషాలు : ఆ పదము యొక్క ప్రసిద్ధిని బట్టి దానికి ఉన్న అన్ని అర్థములు, పర్యాయపదములు, తెలుగు సాహిత్యంలో లభించినంతవరకు ఉదాహరణలు, వాటితో ఉన్న జాతీయములు వంటివి అన్నీ పొందుపరచడం జరిగింది.
- అలాగే ఈ నిఘంటువులో జ్ఞానవర్గ, విజ్ఞానవర్గ, కళావర్గ, సాహిత్యపదవర్గ, వ్యవహారవర్గ, క్రియావర్గ, అవ్యయవర్గ, విదేశభాషావర్గ, వ్యోమవర్గ, ఆధునికపదవర్గ, జంతువర్గ, పక్షివర్గ, సామాన్యవర్గ, వనౌషదివర్గ అని 14 వర్గల ద్వారా పదములను వెతుక వచ్చు.
ఈ నిఘంటువుకు ఆధారగ్రంథములు -
అ) అమరకోశం, ఆ) శబ్దరత్నాకరము, ఇ) సూర్య రాయాంధ్ర నిఘంటువు, ఈ) వైజయంతీ కోశము , ఉ) హలాయుధకోశము ఊ) వాచస్పత్యము
సాధారణ దేశ్యములు
సాధారణ దేశ్యములు లో 2427 పదములు ఉన్నాయి.
గుంటూరు మాండలికములు
గుంటూరు మాండలికములు లో 1752 పదములు ఉన్నాయి.
నెల్లూరు మాండలికములు
నెల్లూరు మాండలికములు లో 1341 పదములు ఉన్నాయి.
తెలంగాణా మాండలికములు
తెలంగాణా మాండలికములు లో 638 పదములు ఉన్నాయి.
వర్గములలో ప్రసిద్ధ నిఘంటువులు
ఇతర నిఘంటువులు
ఇ-నిఘంటువులు
తెలుగు & సంస్కృత నిఘంటువులు
- అన్ని
- తెలుగు
- సంస్కృతం
విజయనిఘంటు చంద్రిక
ఈ తెలుగు వైద్యుత మహా నిఘంటువు పరియోజన యొక్క విశిష్ఠత....
వర్గలు, ద్వారా పదములను వెతుక వచ్చు.
నిఘంటువు, ప్రధానంగా స్వీకరించబడినవి.
ఈ నిఘంటువులో పొందుపరిచిన పదాలు.
కేవలం అచ్చులతో, హల్లులతో మొదలైన పదాలు.
ఒక ముఖ్య గమనిక
ఈ నిఘంటు పరియోజన 2015 లో ప్రారంభమై 11 మాసాలలో తగు రూపురేఖలను సంతరించుకున్నది. దీన్ని వైద్యుత నిఘంటువు గా రూపొందించడంలో ఆనాటికి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అప్పటికి చాలా వాడుకలో ఉన్న ఫాంట్స్ ను ఉపయోగించి ఈ నిఘంటువును సిద్ధపరిచాము. అయితే ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని పొందుతూ మారుతున్న కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ పది సంవత్సరాలలో ఆనాటి ప్రణాళిక, ఆ ఫాంట్స్, ఆ రచన అవన్నీ... నేటి యాంత్రిక వ్యవస్థ స్వీకరించడానికి యోగ్యం కాని రీతిలో మార్పు చెందాయి. వాటినన్నింటినీ ఎంతో ఓర్పు తో, నేర్పుతో నేటి సాంకేతికతకు సరిపడే విధంగా వృద్ధి పరిచింది డా. సుజని.
ఇంచుమించుగా మార్పులన్నీ సరిచెయ్యడం జరిగాయి. ఇంకా దోషాలు సంభవించితే అది సాంకేతిక సంవాదం లేకనే అని గ్రహించగలరని ప్రార్థన.
అలాగే ఎక్కడైనా ఎవరికైనా సరిదిద్దవలసిన అంశాలు కనబడితే... ఈ క్రింది ఈ మెయిల్ ద్వారా ఆ అంశాలను పంపితే వెబ్సైట్ అడ్మిన్ లు వాటిని సరిచేసే ఏర్పాటు చేస్తారు
సంప్రదించండి
మా చిరునామా
Location:
Visakhapatnam/Vizag, Andhra Pradesh, India